రాయచూరు రూరల్: విద్యార్థులకు క్రమశిక్షణ అత్యవసరమని గ్రీన్ రాయచూరు కార్యదర్శి రాజేంద్ర పేర్కొన్నారు. రాయచూరు తాలూకా దిన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాయచూరు మహర్షి వాల్మీకి విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఎన్‌ఎస్‌ఎస్ ముగింపు శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల్లో సంస్కృతి, సంస్కారం, ఆచార, విచార, సంప్రదాయాలపై అవగాహన కలిగి ఉండేందుకు క్రమశిక్షణ దోహదపడుతుందన్నారు. విద్యార్థులు తమ ప్రతిభతో కళలను పోషించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సుభాస్ చంద్ర, వీరేష్, చిదానందప్ప, హన్మంతు నాయక్, శరణప్ప, అనిత, అమరేష్, సతీష్, రంగస్వామి, రంగనాథ్, మహేష్, సునందలున్నారు.


