సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పెట్టుబడికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా మరో ట్వీట్ చేసారు. చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' ఉందని హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' (ఒక ఆస్తి విలువ.. అసలు విలువ కంటే చాలా ఎక్కువగా పెరగడం) జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది నాకు తెలియదు, అని కియోసాకి పేర్కొన్నారు. ''అది జరుగుతుందా లేదా అన్నది ప్రశ్న కాదు. అది ఎప్పుడు జరుగుతుంది అన్నదే ప్రశ్న'' అని అన్నారు.
బబుల్ బస్ట్ సంఘటన జరిగినప్పుడు.. ఒక ఏడాది తరువాత గోల్డ్ ధర ఔన్సుకు 35,000 డాలర్లకు చేరుకుంటుందని నేను అంచనా వేస్తున్నాను. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బిట్‌కాయిన్ ధర 7,50,000 డాలర్లకు, ఇథీరియం ధర 95,000 డాలర్లకు చేరుకుంటుంటుందని కియోసాకి వెల్లడించారు.
ఆర్ధిక సంక్షోభం వచ్చినప్పుడు మార్కెట్లు కుప్పకూలిపోతాయి. అలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా పెట్టిన పెట్టుబడులు (గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్, ఇథీరియం) మిమ్మల్ని కాపాడతాయి. కాబట్టి అలోచించి ఇన్వెస్ట్ చేయండి. ధనవంతులు కావడానికి ఇదే సరైన సమయమా? అంటూ కియోసాకి ట్వీట్ ముగించారు.
BIGGEST BUBBLE BUST
I do not know what pin, what event will pop the biggest bubbles in histor. What ever the event, the pin is near.
It’s not IF. It’s WHEN.
When the bubbles go bust I predict gold will hit $35,000 an ounce one year after the gold bubble goes pop..
I predict…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 16, 2026


