silver
-
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
-
బంగారానికి ఇక దుబాయే దిక్కు!
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా దుబాయ్ నుంచి పసిడి, వెండి దిగుమతులు పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ సంస్థ (జీటీఆర్ఐ) తెలిపింది. 2022లో 120 టన్నులతో మొదలైన కోటా 2027లో 200 టన్నులకు పెరగనుంది. ఇది భారత్ పసిడి దిగుమతుల్లో నాలుగో వంతుకు సమానం. కొత్త ఎంఎఫ్ఎన్ టారిఫ్ 15 శాతంగా ఉండగా, దుబాయ్ నుంచి దిగుమతులకి 14 శాతానికి పరిమితమవుతుందని జీటీఆర్ఐ పేర్కొంది. ఒక్క శాతం వ్యత్యాసం ప్రయోజనం పొందేందుకు దుబాయ్ మార్గం ద్వారా వ్యాపారులు పసిడిని మరింతగా దిగుమతి చేసుకునే అవకాశం ఉందని వివరించింది. సుంకాలు ఇలా .. 2012కి ముందు విలువతో సంబంధం లేకుండా 10 గ్రాములకు రూ. 300 చొప్పున సుంకం ఉండేది. 2012 జనవరిలో బంగారం విలువలో 2 శాతం కస్టమ్స్ సుంకం విధించారు. అదే ఏడాది మార్చిలో బడ్జెట్లో 4 శాతానికి పెంచారు. 2013లో రుపాయి మారకం, విదేశీ మారకం నిల్వలు పడిపోయిన కారణాలతో పసిడిపై దిగుమతి సుంకాలు మూడు సార్లు పెరిగాయి. మొదట 4 నుంచి 6 శాతానికి, తర్వాత 8 శాతానికి, ఆ పైన 10 శాతానికి పెరిగాయి. 2014–18 మధ్యకాలంలో 10 శాతమే అమల్లో ఉండగా, 2019లో దాన్ని 12.5 శాతానికి పెంచారు. 2021 బడ్జెట్లో 10.75 శాతానికి తగ్గించి, మళ్లీ 2022లో 15 శాతానికి పెంచారు. 2024లో దేశీయంగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 6 శాతానికి తగ్గించారు. ప్రత్యామ్నాయాల్లేవా..?2014లో మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ సర్కారు కొలువైన తర్వాత భౌతిక రూపంలో పసిడి దిగుమతులు తగ్గించేందుకు కొన్ని ప్రయత్నాలు చేసింది అవేంటంటే..ప్రభుత్వ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ఇళ్లలో ఉన్న నిరుపయోగ బంగారాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నది ఈ పథకం లక్ష్యం. భౌతిక రూపంలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే, ఆ విలువపై 2.25–2.5 శాతం రాబడిని ఆఫర్ చేశారు. భౌతిక బంగారంపై భారతీయులకు ఉన్న మక్కువ వల్ల ఆశించిన స్పందన రాలేదు. దీంతో 2025లో ఈ పథకాన్ని నిలిపివేశారు. సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2015లో సార్వభౌమ బంగారం బాండ్లకు శ్రీకారం చుట్టింది. 8 ఏళ్ల కాలవ్యవధి. బాండ్ కొనుగోలు ధరపై ఏటా 2.5 శాతం వడ్డీ ఎనిమిదేళ్ల పాటు రాబడిగా అందుతుంది. దీంతో ఈ పథకం విజయవంతమైంది. 8 ఏళ్ల కాలవ్యవధి తర్వాత నుంచి బాండ్లు క్రమంగా మెచ్యూరిటీకి రావడం.. ఈ కాలంలో పసిడి ధరలు గణనీయంగా పెరిగిపోవడంతో ప్రభుత్వంపై చెల్లింపుల భారం భారీగా పెగిపోయింది. పెట్టుబడిపై 150–200 శాతం అధికంగా చెల్లించాల్సి వచి్చంది. దీంతో 2025 నుంచి అనధికారికంగా ఈ పథకానికీ ప్రభుత్వం గుడ్‌బై చెప్పింది. ఈటీఎఫ్‌లు బంగారం, వెండి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు), డిజిటల్ గోల్డ్ తదితర డిజిటల్ సాధనాల్లోనూ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ, కొనుగోలు విలువకు సరిపడా భౌతిక లోహాలను ఫండ్స్ సంస్థలు సమకూర్చుకుని ఖజానాల్లో భద్రపరచాల్సి ఉంటుంది. కనుక ఒక రకంగా భౌతికంగా ఆ మేరకు కొనుగోలు చేయాల్సిందే. కానీ, ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు దేశీయంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న బంగారాన్ని బ్యాకెండ్‌గా వినియోగించుకుంటే విదేశాల నుంచి అదనంగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బంగారం, వెండి డిజిటల్ రూపంలో ఉంటే కావాల్సినప్పడు విక్రయించి, కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. దీంతో చలామణి పెరుగుతుంది. పసిడిపై సుంకాల విధింపు దేశీయంగా గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లకి సానుకూలంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
గోల్డ్ స్మగ్లింగ్ ఇంకా పెరుగుతుందేమో!!
సాక్షి, బిజినెస్ డెస్క్: పసిడి, వెండిపై సుంకాల మోతతో ఆభరణాల మార్కెట్ గందరగోళంలో పడింది. దిగుమతులు తగ్గి విదేశీ మారకం నిల్వలను నిలబెట్టుకునేందుకు, తద్వారా రూపాయి విలువ పడిపోకుండా చూసుకునేందుకు ఇది దోహదపడనుంది. అలాగే, కొత్త కొనుగోళ్ల కోసం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పాత వాటిని కొత్త వాటికి మార్చుకునేలా ప్రోత్సహించడం ద్వారా రీసైక్లింగ్‌కి ఊతమివ్వనుంది.అయితే, అదే సమయంలో స్మగ్లింగ్ రిస్కులు పెరుగుతాయని, ఆభరణాల వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. పసిడి, వెండి దిగుమతులపై సుంకాల మోత పలు సమస్యలకు దారి తీస్తుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దీనితో వజ్రాభరణాల పరిశ్రమ మరింత గడ్డుకాలం ఎదుర్కొనాల్సి వస్తుందని ఎగుమతిదార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్ రిస్కులు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు.పరిశ్రమకు వెన్నెముకలాంటి లఘు, చిన్న, మధ్యతరహా తయారీదార్లు ఇప్పటికే నిధుల కొరత ఎదుర్కొంటూ ఉండగా, తాజా పరిణామం అశనిపాతంలా మారుతుందన్నారు. దిగుమతి సుంకాలను పెంచడం వల్ల సాధారణంగానే ధరలు పెరుగుతాయని, కాకపోతే కొనుగోళ్లను తగ్గించడానికి ఉపయోగపడకపోవచ్చని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పసిడి రేట్లు రెట్టింపైనప్పటికీ దిగుమతులు అదే నిష్పత్తిలో తగ్గకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ నేపథ్యంలో సుంకాల పెంపులాంటి చర్యల వల్ల స్మగ్లింగ్‌కి ఊతం లభిస్తుందని, ఎగుమతి వ్యయాలు పెరిగిపోతాయని ఎగుమతిదార్లు తెలిపారు.‘పొదుపు చర్యలు, బులియన్ దిగుమతులపై సుంకాల పెంపు వల్ల వ్యాపారం మరింత కష్టతరం అవుతుంది. గ్రే మార్కెట్, స్మగ్లింగ్ పెరిగి, ఎకానమీలో సమాంతర వ్యవస్థ ఏర్పాటుకు దారి తీసే ముప్పు ఉందని పరిశ్రమ ఆందోళన చెందుతోంది’ అని అఖిల భారత రత్నాభరణాల మండలి (జీజేసీ) చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు. కస్టమ్స్ సుంకం, జీఎస్టీ, వ్యవసాయ సెస్సులన్నీ కలగలిసిన దిగుమతి సుంకాల పెంపుతో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 27,000 మేర భారం అవుతుందని చెప్పారు. సుంకాలను పెంచడం వల్ల బంగారం రేట్లు మరింత పెరగడం తప్ప దిగుమతులకు అడ్డుకట్ట పడటం చాలా అరుదని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కిరీట్ భన్సాలీ వ్యాఖ్యానించారు. రీసైక్లింగ్‌కి దన్ను.. పసిడి దిగుమతి సుంకాల పెంపుతో స్వల్పకాలికంగా ఆభరణాల విక్రయ పరిమాణం తగ్గుతుందని జ్యుయలర్లు తెలిపారు. అయితే, డిమాండ్ స్థిరంగానే ఉండొచ్చని వివరించారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, భారీ క్రూడాయిల్ ధరలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే వరకు పెంచిన సుంకాలు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉందని సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ, సీఈవో సువంకర్ సేన్ చెప్పారు. పరిమాణంపరంగా 10–15% ప్రభావం పడినప్పటికీ, విలువపరంగా లావాదేవీలు అధిక స్థాయిలోనే ఉంటాయన్నారు.వినియోగదారులు తేలికపాటి ఆభరణాలను కొనేందుకు మొగ్గు చూపొచ్చన్నారు. మరో వైపు, సంస్కృతి, పెట్టుబడులపరంగా బంగారానికి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో పెళ్లిళ్లు, పండుగల సందర్భంగా కొత్తగా కొనుగోలు చేసే వారి కారణంగా పసిడికి డిమాండ్ కొనసాగుతుందని తెలిపారు. సుంకాల పెంపు వల్ల గోల్డ్ రీసైక్లింగ్ పెరుగుతుందన్నారు. ప్రధాని పిలుపుతో ‘నేషన్ ఫస్ట్ గోల్డ్4 ఇండియా’ కార్యక్రమాన్నిఆవిష్క రించినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఎండీ కల్యాణరామన్ తెలిపారు. -
బంగారం బ్లాస్ట్.. ఒక్కరోజే 13 వేలకు పైగా..
-
కేంద్రం బిగ్ షాక్.. సుంకాలు డబుల్.. భారీగా పెరగనున్న ధరలు
-
బంగారం, వెండిపై కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ: బంగారం, వెండి విషయంలో కేంద్రం షాకిచ్చింది. దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ (మే 13) అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల బంగారం, వెండి, ఫ్లాటినం.. ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరగనున్నాయి. భారత్ ప్రపంచంలో చైనా తర్వాత రెండవ అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా ఉంది. ప్రస్తుతం దిగుమతి సుంకం 6 శాతంగా ఉంది. అయితే తాజా నిర్ణయంతో దాన్ని 16 శాతానికి పెంచింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వివాహాలు, పండుగల కోసం ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం బంగారం ధర రూ. 1,53,990 ఉంది. కిలో వెండి ధర రూ.3 లక్షలుగా ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.రెవెన్యూ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బంగారం, వెండి, ప్లాటినంతో పాటు ఆభరణాల తయారీలో ఉపయోగించే హుక్స్, క్లాప్స్, క్లాంప్స్, పిన్లు, స్క్రూ బ్యాక్స్ వంటి వాటిపైనా సుంకాలు పెరిగాయి. బంగారం, వెండి ఫైండింగ్స్‌పై 5% కస్టమ్స్ సుంకం, ప్లాటినం ఫైండింగ్స్‌పై 5.4% సుంకం విధించారు. అదే సమయంలో, రీసైక్లింగ్, విలువైన లోహాల రికవరీకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఉపయోగించిన ఉత్ప్రేరకాలు, బూడిదతో కూడిన విలువైన లోహాల దిగుమతులపై సుంకాన్ని 4.35%కి తగ్గించారు. అయితే ఇందుకు నిర్దిష్ట నిబంధనలు, అనుమతులు తప్పనిసరిగా పాటించాలి.2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ బంగారం దిగుమతులు 24% పెరిగి రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 9 శాతంగా ఉంది. ఇక బంగారం సరఫరాలో స్విట్జర్లాండ్ 40% వాటాతో మొదటి స్థానంలో ఉండగా, యూఏఈ 16%, దక్షిణాఫ్రికా దాదాపు 10% వాటాతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. -
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెప్పే రాబర్ట్ కియోసాకి.. తాజాగా 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోందని.. భవిష్యత్తును చూడగలిగే వారికి ఇది శుభవార్త అని పేర్కొన్నారు. ఇంతకీ కియోసాకి ఇలా ఎందుకు అన్నారు?, దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? అనే విషయాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.ఉత్తమ పెట్టుబడిదారులు భవిష్యత్తును చూడగలరు. ఉదాహరణకు.. నేను 1965లో వెండి ధర చాలా తక్కువ ఉండేది. ఆ సమయంలోనే వెండిని పోగు చేయడం ప్రారంభించాను. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. ఆ నాటి నుంచి పోగు చేసిన సిల్వర్ ఇప్పుడు నా అత్యుత్తమ పెట్టుబడులలో ఒకటిగా నిలిచిందని కియోసాకి తన ఎక్స్ ఖాతాలో షేర్ పేర్కొన్నారు.కియోసాకి ట్వీట్లో రెండు ప్రశ్నలను కూడా సంధించారు. ఇందులో ఒకటి 'భవిష్యత్తులో ఏమి జరగబోతోందని మీరు భావిస్తున్నారు?'. మరొకటి, భవిష్యత్తులో లాభం పొందడానికి మీరు దేనిలో పెట్టుబడి పెట్టగలరు?'. ఈ ప్రశ్నలకు నెటిజన్లు తమదైన రీతిలో జవాబులు ఇస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగ జీవితం.. చివరికి అప్పులు: కియోసాకి వివరణపెట్టుబడుల విషయంలో జాగ్రత్త అని చెబుతూనే.. 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది. భవిష్యత్తును చూడగలిగే వారికి ఇది శుభవార్త. అంధులకు ఇది దుర్వార్త. అని కియోసాకి తన ట్వీట్ ముగించారు.వెండి ధరలు ఇలా..నిజానికి వెండి ధరలు కొన్నాళ్లుగా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. 2025 జనవరి రూ.90 వేల వద్ద ఉన్న కేజీ సిల్వర్ ధర, 2026 ప్రారంభంలో రూ.2.34 లక్షలకు చేరింది. ఆ తరువాత రూ.3.85 లక్షలకు చేరి కొనుగోలుదారులకు షాకిచ్చింది. కాగా ఇప్పుడు వెండి ధర రూ.2.85 లక్షల వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే.. వెండి ధరలలో ఎలాంటి పరిణామాలు జరిగాయో స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ ధరలు పెరుగుతాయి అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. -
బంగారం, వెండి ధరలు: వారం రోజుల్లో ఊహించని మార్పు!
బంగారం వెండి ధరలు ఎప్పుడెలా ఉంటాయో ఊహకందకుండాపోయింది. ఈ రోజు తగ్గితే.. రేపు పెరిగిపోతున్న పరిస్థితులు వారం రోజుల్లో కళ్లకు కట్టినట్లు కనిపించాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో (మే 3 నుంచి మే 9 వరకు) పసిడి ధరలు ఎలా మారాయి. ప్రస్తుతం ఏ మార్క్ దగ్గర ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ నగర్లో మే 3న (ఆదివారం) 1,50,930 రూపాయల వద్ద ఉన్న తులం గోల్డ్ రేటు నేటికి (శనివారం) 1,52,350 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.1420 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల ధర ఈ సమయంలోనే 1,38,350 రూపాయల దగ్గర నుంచి రూ.1,39,650 వద్దకు (రూ.1300 పెరిగింది) చేరింది.ఇక చెన్నై నగరంలో వారం రోజుల్లో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. మే 3న రూ.152730 వద్ద ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేటు..154370 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,40,000 రూపాయల దగ్గర నుంచి 141500 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర వారం రోజుల్లో ఎంతలా పెరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.దేశ రాజధాని నగరం ఢిల్లీలో 1,51,230 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 1,52,500 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,38,500 నుంచి రూ.1,39,800 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా అమాంతం పెరిగాయి. మే 3న రూ.2.70 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఈ రోజు రూ.2.80 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వెండి రేటు వారం రోజుల్లో రూ.10 వేలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. -
బంగారం కొనాలనుకునేవారికి ఛాన్స్.. ఒక్కసారిగా పడిపోయిన ధరలు
-
మళ్లీ ఎంఎంటీసీ.. రూ.10కే డిజిటల్ గోల్డ్, సిల్వర్!
డిజిటల్ రూపంలో బంగారం, వెండిని నేరుగా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఎంఎంటీసీ–పీఏఎంపీ ప్లాట్‌ఫామ్ తిరిగి ప్రారంభమైంది. ఎంఎంటీసీపీఏఎంపీ వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్ నుంచి, అలాగే గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే యాప్స్ నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.ఈ సంస్థ డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌ను మొదటిసారి 2017లో, డిజిటల్ వెండి కొనుగోళ్లకు 2023లో అవకాశం కల్పించింది. మరింత మెరుగైన అనుభవానికి వీలుగా వెబ్‌సైట్‌ను నవీకరించేందుకు 2024 చివర్లో ఈ సేవలను నిలిపివేసింది. ఈ కాలంలో థర్డ్ పార్టీ (ఫోన్‌పే తదితర) యాప్స్ ద్వారా కొనుగోళ్లకు అవకాశం కల్పించింది. నవీకరించిన వెబ్‌సైట్‌ను తాజాగా ప్రారంభించినట్టు సంస్థ ప్రకటించింది.కనీసం రూ.10 నుంచి డిజిటల్ గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ప్రతీ కొనుగోలు విలువకు సరిపడా భౌతిక బంగారం, వెండిని బీమా రక్షణతో కూడిన ఖజానాల్లో ఎంఎంటీసీ–పీఏఎంపీ భద్రపరుస్తుంది. బంగారం, వెండిపై పెట్టుబడులకు ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్న నేపథ్యంలో ఎంఎంటీసీ తిరిగి ఈ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడం గమనార్హం. -
గంటల వ్యవధిలో మారిపోయిన బంగారం ధరలు!
మే 2026 ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. ఈ రోజు 24 గంటల వ్యవధిలోనే గోల్డ్ ధరలు మరోమారు ఎగబాకాయికి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలలో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.ఈ రోజు (శుక్రవారం) ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 1,39,750 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,40,250 వద్దకు చేరాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,52,460 నుంచి 1,53,000 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 24 గంటలు గడవకముందే పసిడి ధరల్లో ఎంత మార్పు జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,53,150 వద్దకు, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,40,400 వద్దకు చేరింది. అయితే చెన్నైలో మాత్రం ధరలు కేవలం తులం మీద 10 రూపాయలు మాత్రమే తగ్గింది. దీంతో ఇక్కడ బంగారం ధరల్లో చెప్పుకోదగ్గ మార్పు కనిపించలేదు.ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే? -
బంగారం ధరల పతనం.. గోల్డ్ కొనేందుకు సరైన సమయం!
పసిడి ప్రియులకు శుభవార్త, ఎందుకంటే గోల్డ్ రేటు గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూనే ఉంది. ఈ రోజు (మంగళవారం) కూడా పసిడి ధరలు ఇదే బాటలో అడుగులు వేసాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో గోల్డ్ లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రూ.1200 తగ్గిన గోల్డ్: కొత్త ధరలు ఇవే..
ఈ రోజు (సోమవారం) ఉదయం దేశంలోని ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు, సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప, మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,38,350 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, సాయంత్రానికి రూ.1,200 తగ్గి, రూ.1,37,150 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో ధరల తారుమారు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 24 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర 1,50,930 రూపాయల నుంచి 1,49,620 రూపాయల (రూ.1310 తగ్గింది) వద్దకు వచ్చింది.దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల 1200 రూపాయలు తగ్గడంతో తులం గోల్డ్ రేటు 1,37,300 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల ధర రూ.1460 తగ్గి 149770 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఒక రోజు కూడా పూర్తికాక ముందే.. ధరల్లో ఎంత మార్పు వచ్చిందో గమనించవచ్చు.చెన్నైలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,000 (తులం), 24 క్యారెట్ల ధర రూ.1,52,730 (10 గ్రామ్స్) వద్దనే ఉన్నాయి. కాగా వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. కాబట్టి సిల్వర్ రేటు రూ.2.70 లక్షల వద్ద ఉంది.ఇదీ చదవండి: 'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా! -
రూ.10 వేలు పెరిగిన వెండి ధర!
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరల్లో కూడా ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో భారీగా పెరిగిన సిల్వర్ రేటు.. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈ రోజు మరోమారు వెండి ధరలు పెరిగాయి.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు వెండి రేటు రూ.10,000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ ధర రూ.2.70 లక్షలకు చేరింది. ఈ ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. అయితే ఢిల్లీలో మాత్రం వెండి రేటు రూ.5000 తగ్గింది. కాబట్టి.. ఇక్కడ సిల్వర్ రేటు రూ.2.50 లక్షలకు చేరింది.వెండి ధరలు పెరగడానికి కారణాలుమార్కెట్ డిమాండ్, సరఫరా: డిమాండ్ ఎక్కువగా ఉండి, సరఫరా తక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. వెండిని ఆభరణాలుగా మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాల్లో కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఇది కూడా రేటు పెరగడానికి కారణమైంది.పెట్టుబడులు: స్టాక్ మార్కెట్లలో రిస్క్ వద్దనుకుని, ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి వెండి మంచి ఎంపిక. కాబట్టి పెట్టుబడిదారులు వెండిపై పెట్టుబడులు పెంచినప్పుడు కూడా ధరలు పెరుగుతాయి.అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు: యుద్ధాలు, దేశాల మధ్య వాణిజ్య సమస్యలు వెండి, ఇతర విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమయంలో లోహాల విలువ పెరుగుతుంది.వెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడతాయి.ఇదీ చదవండి: పెట్రోల్ ధరల పెంపు?: క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం -
లైవ్ ధరలకు బంగారం.. ‘ధన్ గోల్డ్ వాల్ట్’ లాంచ్
పసిడి, వెండి కొనుగోళ్లకు సంబంధించి గోల్డ్ వాల్ట్ పేరిట ప్రత్యేక సాధనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం ధన్ వెల్లడించింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల్లో ట్రేడ్ చేయడంతో పాటు అవే లైవ్ ధరల ప్రకారం భౌతిక రూపంలో పసిడి, వెండిని కొనుగోలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఈ లావాదేవీల సెటిల్మెంట్, భౌతిక డెలివరీ ప్రక్రియను ఎంసీఎక్స్సీసీఎల్ పర్యవేక్షిస్తుంది. వినియోగదారులు తాము కొనుగోలు చేసిన లోహాలను అత్యంత సురక్షితమైన ఇనిస్టిట్యూషనల్ గ్రేడ్ వాల్ట్‌లలో కూడా భద్రపర్చుకోవచ్చు. ఈ ప్రక్రియలో ఎలాంటి హిడెన్ చార్జీలు, అదనపు రుసుములు ఉండవని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రవీణ్ జాదవ్ తెలిపారు. ఈ తరహా సాధనాల్లో ఇదే మొదటిదని పేర్కొన్నారు.డిజిటల్ బంగారం కొనుగోలు పద్ధతుల్లో ఈ ‘ధన్ గోల్డ్ వాల్ట్’ ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది. సాధారణంగా డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్స్ థర్డ్ పార్టీ వెండర్లపై ఆధారపడతాయి, కానీ ధన్ నేరుగా ఎంసీఎక్స్ లైవ్ ధరలను అనుసంధానించడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. వినియోగదారులు కేవలం 1 గ్రాము బంగారం లేదా వెండి నుండి తమ పెట్టుబడులను ప్రారంభించవచ్చు.భవిష్యత్తులో ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేసిన బంగారాన్ని నేరుగా నగల రూపంలోకి మార్చుకునేందుకు లేదా అవసరమైనప్పుడు విక్రయించి నగదును తక్షణమే తమ బ్యాంక్ ఖాతాల్లోకి పొందేందుకు వీలుగా మరిన్ని ఫీచర్లను జోడించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులు మార్కెట్ ఒడుదొడుకులను గమనిస్తూ తక్కువ ధర ఉన్నప్పుడు తక్షణమే ఆర్డర్ పెట్టుకునే సౌలభ్యం ఉండటం దీని ప్రత్యేకత. -
పసిడి ధరల పతనం.. ఊహకందని రీతిలో ఇలా!
భారతదేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు.. ఈ రోజు భారీ పతనాన్ని చవి చూసింది. దీంతో ఒక్కసారిగా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉంది?, సిల్వర్ ధరల్లో ఏమైనా మార్పు కనిపించిందా? అనే విషయాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.2780 తగ్గి 1,50,930 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 2550 రూపాయలు తగ్గి రూ.1,38,350 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో గోల్డ్ రేటు వరుసగా రూ.1420, రూ.1300 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 153820 రూపాయల వద్ద, 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.141000 వద్ద నిలిచాయి. ఈ ధరలు నిన్నటి (మంగళవారం)తో పోలిస్తే చాలా తక్కువ.ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు పతనమయ్యాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,51,080 (రూ.2780 తగ్గింది) వద్ద ఉంది. 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,38,500 (రూ.2550 తగ్గింది) వద్ద ఉంది.వెండి ధరలు ఇలాబంగారం మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ రేటు రూ.2.65 లక్షలు (రూ.5000 తగ్గింది) వద్ద, ఢిల్లీలో రూ.2.60 లక్షల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: అమ్మానాన్నలతో గడపాలని.. OpenAIకి రాజీనామా! -
వచ్చేది పెను సంక్షోభమే: కియోసాకి అలర్ట్
ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు చిరపరిచితమైన పేరు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki). 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad)పుస్తకంతో ఆర్థిక పాఠాలు నేర్పిన ఆయన, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026-27 మధ్య కాలంలో ప్రపంచం ఒక భారీ ఆర్థిక సంక్షోభాన్ని, బహుశా ఒక గొప్ప ఆర్థిక మాంద్యాన్ని (Great Depression) ఎదుర్కోబోతోందని ఆయన హెచ్చరించారు.సంక్షోభంలో చిక్కుకుంటారా.. లాభపడతారా?తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కియోసాకి స్పందిస్తూ.. రాబోయే ఈ భారీ క్రాష్‌లో ప్రజలు రెండు రకాలుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. ఒక వర్గం వారు ఆర్థికంగా చితికిపోతే, మరో వర్గం వారు అదృష్టవంతులుగా మారి భారీగా లాభపడతారని ఆయన విశ్లేషించారు.సంక్షోభాల్లోనే ధనవంతుడినయ్యాను..గతంలో జరిగిన ఆర్థిక పతనాలను గుర్తు చేసుకుంటూ.. "1987, 2000, 2008, 2015, 2019, 2022 సంవత్సరాల్లో వచ్చిన సంక్షోభాల్లో నేను పేదవాడిని కాలేదు, ఇంకా ధనవంతుడిని అయ్యాను. రాబోయే 2026-27 క్రాష్‌లో కూడా నేను మరింత సంపదను పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాను" అని కియోసాకి ధీమా వ్యక్తం చేశారు.ఆస్తులు చౌకగా దొరికే సమయం ఇదే!ఆర్థిక మాంద్యం సమయంలో సామాన్యులు భయపడి ఆస్తులు అమ్ముకుంటే, తెలివైన వారు పెట్టుబడులు పెడతారని కియోసాకి సూచించారు. "మార్కెట్ పతనం (Crash) అయినప్పుడు, గొప్ప ఆస్తులన్నీ తక్కువ ధరకే 'సేల్'లో లభిస్తాయి. ఆ సమయంలో వాటిని కొనుగోలు చేయడం ద్వారానే ధనవంతులు కావచ్చు" అని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని వాడుకొని అందరూ ఆర్థికంగా ఎదగాలని, ఎవరూ నష్టపోకూడదని ఆయన ఆకాంక్షించారు.అయితే కియోసాకి అంచనాలు భారతీయ ఇన్వెస్టర్లకు ఒక హెచ్చరిక వంటివి. ఒకవైపు ప్రపంచ మార్కెట్ల ప్రభావం భారతదేశంపై పడే అవకాశం ఉండగా, మరోవైపు బంగారం (Gold), వెండి (Silver) లేదా రియల్ ఎస్టేట్ (Real Estate) వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఇది గొప్ప అవకాశంగా మారవచ్చు. కానీ, తగిన ఆర్థిక ప్రణాళిక లేకుండా మార్కెట్లోకి వెళ్లడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లోకి దూసుకొస్తున్న ‘జెన్-జీ’IN THIS COMING CRASh possibly a Grest Drpression…. Will you be “FU’CD UP or LU’CD UP.”So far….in the crashes of 1987, 2000, 2008, 2015, 2019, 2022 I got richer not poorer.And again in coming giant crash of 2026-27….I plan on growing richer not poorer.I wish the same for…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 28, 2026 -
బంగారం, వెండి ధరల్లో మార్పు: ఏడు రోజుల్లో ఇలా..
భారతదేశంలో గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో (ఏప్రిల్ 19 నుంచి 25 వరకు) పసిడి ధరలు ఎంత తగ్గాయి?, ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 19 (ఆదివారం) 1,55,780 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు శనివారం (ఏప్రిల్ 25) నాటికి 1,54,040 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఏడు రోజుల్లో 1,42,800 రూపాయల నుంచి రూ.1,41,200 వద్దకు చేరింది.దేశ రాజధాని నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం ధర వారం రోజుల్లో 1,55,930 రూపాయల దగ్గర నుంచి రూ.1,54,190 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,42,950 రూపాయల నుంచి 1,41,350 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో బంగారం ధరలు తగ్గాయి. గత ఆదివారం (ఏప్రిల్ 19) రోజు రూ.1,56,660 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం పసిడి.. ఏప్రిల్ 25 నాటికి 1,54,910 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 143600 రూపాయల వద్ద నుంచి 142000 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ధరలు ఎంతలా తగ్గాయో స్పష్టంగా తెలుస్తుంది.వెండి ధరలు ఇలా..బంగారం బాటలోనే.. వెండి కూడా అడుగులు వేసింది. ఏప్రిల్ 19న రూ.2.80 లక్షల వద్ద ఉన్న సిల్వర్ ఏప్రిల్ 25 (శనివారం) నాటికి రూ.2.70 లక్షల వద్దకు చేరింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా? -
పసిడి ప్రియులకు గుడ్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
-
'2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు 2026లో సురక్షితమైన ఆస్తుల గురించి వివరించారు.కియోసాకి ప్రకారం.. అమెరికా డాలర్ వంటి ప్రభుత్వ డబ్బు “నిజమైన సంపద కాదు”, ఎందుకంటే ప్రభుత్వం అవసరమైతే ఎక్కువ డబ్బు ముద్రించగలదు. ఇలా డబ్బు ముద్రించడం వల్ల దాని విలువ తగ్గిపోతుందని ఆయన అంటున్నారు. అందుకే ఆయన దీనిని “ఫేక్ మనీ” అని అంటారు.ప్రస్తుతం అమెరికా జాతీయ రుణం చాలా ఎక్కువగా ఉందని, రోజుకి బిలియన్ల డాలర్ల రుణం పెరుగుతుందని.. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రమాదంలో పడవచ్చని కియోసాకి అభిప్రాయం.కియోసాకి చెప్పిన సురక్షితమైన ఆస్తులుబంగారం (Gold)వెండి (Silver)చమురు (Oil)ఆహారం (Food)బిట్‌కాయిన్ (Bitcoin)ఈథీరియం (Ethereum)కియోసాకి అభిప్రాయం ప్రకారం.. పరిమితంగా ఉండే వనరులు విలువైనవి. ఎందుకంటే వాటిని అంత సులభంగా తయారు చేయలేము. కాబట్టి వీటి విలువ క్రమంగా పెరుగుతుందని విశ్వసిస్తారు.బంగారం, వెండిబంగారం ధర ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరిగింది. ప్రపంచంలో ఆర్ధిక అనిశ్చితి పెరిగినప్పుడు వీటి విలువ పెరుగుతుంది. కాబట్టి దీనిపై పెట్టె పెట్టుబడులు ప్రజలను ధనవంతులను చేస్తుంది. లేదా కష్టకాలంలో ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి విముక్తి కల్పిస్తుంది.క్రిప్టో కరెన్సీకియోసాకి బిట్‌కాయిన్, ఈథీరియంను భవిష్యత్తు డిజిటల్ ఆస్తులుగా చూస్తున్నారు. ఇవి కూడా ప్రభుత్వ నియంత్రణలో లేవు కాబట్టి సంప్రదాయ డబ్బుకు ప్రత్యామ్నాయంగా ఉంటాయని ఆయన భావిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో పెట్టుబడి పెట్టడం అంటే కొంత రిస్క్ కూడా ఎదుర్కోవాలి ఉంటుంది.చమురు, ఆహారంచమురు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మౌలిక అవసరం. యుద్ధాలు లేదా సరఫరా సమస్యలు దెబ్బతింటే ధరలు పెరుగుతాయి. అదే విధంగా ఆహార ధరలు కూడా ఇంధన ధరలపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఇవి కూడా 'అవసరమైన ఆస్తులు' అని కియోసాకి అభిప్రాయం.కియోసాకి చెప్పిన ఈ మాటలతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు విమర్శించారు. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి అంచనా నిజం కాలేదు కాబట్టి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఆర్ధిక నిపుణులు ఒకే రకమైన పెట్టుబడులపై పూర్తిగా ఆధారపడకూడదని సూచిస్తారు.ఇదీ చదవండి: ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు! -
అక్షయ తృతీయ ముందు మహిళలకు గుడ్ న్యూస్...
-
వెండి రేటు జోరు: కేజీ రూ.2.65 లక్షలు!
భారతదేశంలో బంగారం ధరల మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా వేడెక్కుతున్నాయి. లేటెస్ట్ సిల్వర్ రేటు.. గత ఆదివారం రోజుతో పోలిస్తే చాలా ఎక్కువ. అయితే ఈ కథనంలో ఏడు రోజుల్లో వెండి ధరల ప్రవాహం ఎలా సాగింది. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయి. రేట్లు పెరగడానికి కారణం ఏమిటనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.వెండి ధరలుఏప్రిల్ 5న.. అంటే గత ఆదివారం రోజు 2.55 లక్షల రూపాయల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు శనివారం నాటికి రూ.2.65 లక్షలకు చేరింది. ఈ రోజు (ఆదివారం) వెండి రేటు స్థిరంగా రూ.2.65 లక్షల వద్దనే నిలిచింది. హైదరాబాద్, విజయవాడ మొదలైన నగరాల్లో ఈ ధరలు ఉన్నాయి. ఢిల్లీలో మాత్రం వెండి రేటు వారం రోజుల్లో రూ.2.50 లక్షల నుంచి రూ.2.60 లక్షలకు చేరింది.వెండి రేటు పెరగడానికి కారణాలుపారిశ్రామిక వినియోగం: వెండిని ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ పరికరాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రంగాల్లో డిమాండ్ పెరిగితే వెండి ధర కూడా పెరుగుతుంది.పెట్టుబడిదారుల డిమాండ్: ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు, ప్రజలు సురక్షిత పెట్టుబడిగా వెండిని కొనుగోలు చేస్తారు. ఇది ధరను అమాంతం పెంచుతుంది.బంగారం ధరల ప్రభావం: బంగారం ధరలు కూడా వెండి రేటును ప్రభావితం చేస్తాయి. పసిడి ధరలు పెరిగితే, కొంతమంది వెండిలో పెట్టుబడి పెడతారు. అందువల్ల వెండి ధర కూడా పెరుగుతుంది.డాలర్ విలువ మార్పులు: అమెరికన్ డాలర్ బలహీనమైతే, వెండి వంటి లోహాల ధరలు సాధారణంగా పెరుగుతాయి.సరఫరా లోపం: ఖనిజ ఉత్పత్తి తగ్గినా లేదా మైనింగ్‌లో సమస్యలు వచ్చినా, వెండి సరఫరా తగ్గి ధర పెరుగుతుంది.ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, వెండి వంటి విలువైన లోహాలను నిజమైన ఆస్తులుగా భావిస్తారు. కాబట్టి చాలామంది సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. తద్వారా రేటు పెరుగుతుంది.ప్రభుత్వ విధానాలు, దిగుమతులు: పన్నులు, దిగుమతి సుంకాలు పెరిగితే దేశీయంగా వెండి ధరలు పెరగవచ్చు.ఇదీ చదవండి: IRCTC కొత్త రూల్.. ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు! -
బంగారం ధరల్లో భారీ మార్పు: అంతలోనే ఇంతలా..
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ వారాంతంలో కొంత పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పు జరిగింది. ఈ కథనంలో వారం రోజుల్లో బంగారం ధరలు పెరిగాయా?, తగ్గాయా?, అనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 5 (ఆదివారం) 1,50,930 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,52,840 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు పెరుగుతూ.. తగ్గుతూ, మొత్తం మీద 1910 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,38,350 రూపాయల నుంచి 1,40,100 రూపాయల (రూ.1750 పెరిగింది) వద్దకు చేరింది.చెన్నైలో గోల్డ్ రేటు వారం రోజుల్లో పెరుగుదల దిశగానే అడుగులు వేసింది. ఏప్రిల్ 5న 1,52,180 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,53,820 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,39,500 రూపాయల నుంచి 1,41,000 రూపాయల (రూ.1500 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా ధరల పెరుగుదల కనిపించింది. ఏప్రిల్ 5న దేశ రాజధాని నగరంలో 1,51,080 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,52,990 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,38,500 రూపాయల నుంచి 1,40,250 రూపాయల (రూ.1750 పెరిగింది) వద్దకు చేరింది. -
బంగారం ధరల్లో మార్పు.. అమాంతం తగ్గిన రేటు!
శుక్రవారం ఉదయం.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు సాయంత్రానికే ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేటులో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈ కథనంలో లేటెస్ట్ పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,40,250 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి 1,39,650 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే రేటు రూ.600 తగ్గినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ.1,53,000 నుంచి రూ.152350 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పు జరిగింది. దేశ రాజధానిలో 24 క్యారెట్ల తులం బంగారం 1,53,150 రూపాయల నుంచి రూ.1,52,500 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,40,400 రూపాయల నుంచి 1,39,800 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల తులం రేటు 1,41,250 రూపాయల వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,54,090 రూపాయల వద్ద ఉంది. అంటే ఈ రోజు ఉదయం ధరలకు, సాయంత్రం ధరలకు ఎలాంటి తేడా లేదు.వెండి ధరలువెండి ధరలు ఈ రోజు పెరుగుదల దిశగా పయనించాయి. దీంతో కేజీ సిల్వర్ ధర హైదరాబాద్‌లో 2.65 లక్షలు. కాగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.60 లక్షలు వద్ద ఉంది. -
గంటల వ్యవధిలో.. మారిపోయిన గోల్డ్, సిల్వర్ రేటు!
బంగారం ధరలు ఈ మధ్య కాలంలో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మారిపోతున్నాయి. ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఉదయం ఉన్న రేటు, సాయంత్రానికి మారిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్ రేట్లలో చాలా మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయం ఈ కథనంలో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఈ రోజు (ఏప్రిల్ 6) ఉదయం రూ.1,36,700 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి 1,38,100 రూపాయల వద్దకు చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,49,130 నుంచి రూ.1,50,660 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర గంటల వ్యవధిలో ఎంతలా మారిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో బంగారం ఉదయం అమాంతం తగ్గి.. సాయంత్రానికి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,50,660 రూపాయల దగ్గర నుంచి 1,52,620 రూపాయల వద్దకు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,100 నుంచి రూ.1,39,900 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150810 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1,38,250 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు జరిగాయి. ఉదయం ధరలు స్థిరంగా ఉండటం చేత రూ.2.55 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. సాయంత్రానికి రూ.5000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.2.60 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వెండి రేటు మళ్లీ దూసుకెళ్తుందా అనే అనుమానం కలుగుతోంది. -
వెండి ధరలు కొత్త మార్క్.. కేవలం వారం రోజుల్లో!
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా, వారం రోజుల్లో గణనీయమైన మార్పు కనిపించింది. దీంతో సిల్వర్ రేట్లలో కొంత మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా వెండి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.గత ఆదివారం అంటే.. మార్చి 29న కేజీ సిల్వర్ రేటు హైదరాబాద్, విజయవాడలలో రూ.2.50 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. శనివారం (ఏప్రిల్ 4) నాటికి రూ.2.55 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో ధర పెరుగుతూ.. తగ్గుతూ కొత్త మార్కుకు చేరిందన్నమాట. ఈ ధరలు గత నెలతో పోలిస్తే చాలా తక్కువ అని తెలుస్తుంది. ఇదే ధరలు బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా ఉన్నాయి.ఢిల్లీలో మాత్రం వారం రోజుల్లో సిల్వర్ రేటు రూ.2.45 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు చేరింది. నిజానికి దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే రాజధాని నగరంలో కొంత తక్కువగానే ఉంటుంది.వెండి ధరలు పెరగడానికి కారణాలుడిమాండ్ పెరగడం: వెండి నగలు (జ్యువెలరీ), ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పరిశ్రమలలో వినియోగం పెరిగితే వెండి డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతాయి.సరఫరా తగ్గడం: గనుల్లో ఉత్పత్తి తగ్గడం లేదా సరఫరాలో అంతరాయం కలిగితే మార్కెట్లో వెండి కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి.ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ప్రజలు తమ డబ్బును భద్ర పెట్టుబడులలో పెట్టాలని చూస్తారు. అప్పుడు వెండి వంటి విలువైన లోహాలపై డిమాండ్ పెరుగుతుంది.కరెన్సీ విలువ తగ్గడం: ముఖ్యంగా డాలర్ విలువ పడిపోతే, వెండి ధరలు పెరుగుతాయి.పెట్టుబడిదారుల ఆసక్తి: స్టాక్ మార్కెట్ అనిశ్చితంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు వెండి వంటి ఆస్తులలో పెట్టుబడి పెడతారు.జియోపాలిటికల్ పరిస్థితులు: యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు వంటి పరిస్థితుల్లో ప్రజలు సురక్షిత పెట్టుబడులను ఆశ్రయిస్తారు. కాబట్టి వెండి ధరలు పెరుగుతాయి.ప్రభుత్వ విధానాలు: దిగుమతి సుంకాలు, పన్నులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు కూడా వెండి ధరలను ప్రభావితం చేస్తాయి. -
గోల్డ్ రేటు: వారం రోజుల్లో ఎంత పెరిగిందంటే?
వారం రోజులుగా బంగారం ధరల హెచ్చు తగ్గులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే వారాంతంలో గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు జరిగాయి, ధరలు ఎక్కడకు చేరాయి అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 29న 1,48,090 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈ రోజుకి (శనివారం) 1,50,930 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 2840 రూపాయల పెరుగుదలను నమోదు చేసింది. 22 క్యారెట్ల తులం రేటు 1,35,750 రూపాయల దగ్గర నుంచి 1,38,350 రూపాయల (రూ.2600 పెరిగింది) వద్ద నిలిచింది.చెన్నైలో స్వచ్ఛమైన తులం బంగారం (24 క్యారెట్స్) ధర 1,49,020 రూపాయల దగ్గర నుంచి రూ.1,52,180 వద్ద (రూ.3160 పెరిగింది) నిలిచింది. 22 క్యారెట్ల రేటు ఏడు రోజుల్లో 1,36,600 రూపాయల దగ్గర నుంచి రూ.1,39,500 (రూ.2900 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు వారం రోజుల్లో అమాంతం పెరిగాయి. మార్చి 29న 1,48,220 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు.. ఏప్రిల్ 4 నాటికి 1,51,080 రూపాయలు (రూ.2860 పెరిగింది) పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 135900 రూపాయల నుంచి 138500 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే బంగారం ధరలు వారం రోజుల్లో భారీగా పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
బంగారం vs వెండి: పెట్టుబడికి ఏది బెస్ట్?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరిగినప్పుడు, పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాలు వంటి సందర్భాల్లో బంగారం ధరలు పెరగడం అనేది సర్వ సాధారణం. అయితే.. ఈ సంవత్సరం (ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం) పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, బంగారం ధరలు పెరగకపోవడం పెట్టుబడిదారులను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.యుద్ధం సమయంలో బంగారం ధరలు పెరగకపోవడం వల్ల.. పెట్టుబడిదారులలో ఒక అనుమానం మొదలైంది. బంగారం కంటే వెండి మంచి పెట్టుబడిగా మారుతుందా?. దీనికి కారణం సిల్వర్ రేటు అమాంతం పెరగడమే.గోల్డ్-సిల్వర్ రేషియోఇక పెట్టుబడిదారుల ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. ముందుగా గోల్డ్-సిల్వర్ రేషియో గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రేషియో ఒక యూనిట్ బంగారం ధరకు సమానంగా ఉండే వెండి పరిమాణాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ రేషియో 60 కంటే ఎక్కువగా ఉండటం వల్ల, వెండి.. బంగారంతో పోలిస్తే చవకగా ఉందని అర్థమవుతోంది.నిజానికి వెండి అనేది కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు. దీనిని పరిశ్రమల్లో కూడా కూడా విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి, ఇతర తయారీ రంగాలలో వెండికి మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా.. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడు వెండి ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంతమంది నిపుణులు వెండిపై పెట్టుబడి చాలా ఉత్తమం అని అంటున్నారు.వెండిపై పెట్టుబడి - జాగ్రత్త!ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. వెండిలో పెట్టుబడి పెట్టడం పూర్తిగా సేఫ్ అని చెప్పలేము. ఎందుకంటే ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఇటీవల వెండి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ.. ఒక్కసారిగా భారీగా పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది పెట్టుబడిదారులకు పెద్ద నష్టాలను కలిగించే అవకాశం ఉంది. అందువల్ల, వెండిపై పెట్టుబడి పెట్టే విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి.బంగారం విలువను కోల్పోదు!ఇక బంగారం విషయానికి వస్తే.. ఇది చాన్నాళ్లుగా, ఇప్పటికీ ఒక విశ్వసనీయమైన, సురక్షిత పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక అస్థిరత, కరెన్సీ విలువ తగ్గడం వంటి పరిస్థితుల్లో బంగారం స్థిరత్వాన్ని అందిస్తుంది. కాబట్టి బంగారం ఎప్పుడూ.. దాని విలువను కోల్పోదు.సమతుల్యత ఉత్తమం!పెట్టుబడిదారులు ఎప్పుడూ కూడా.. ఒక లోహాన్ని పూర్తిగా వదిలి మరొకదానిలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదు. బంగారం స్థిరత్వాన్ని అందిస్తే, వెండి వృద్ధి అవకాశాలను అందిస్తుంది. కాబట్టి.. పెట్టుబడిదారులు తమ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి బంగారం, వెండి మధ్య సమతుల్యతను పాటిస్తూ పెట్టుబడి పెట్టడం ఉత్తమం.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం ఆఫీసుకు పోతే..: టెకీకి ఎదురైన అనుభవం! -
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు.. ఒక్కరోజులోనే ఇలా..
నాలుగైదు రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఈ రోజు ఉదయం ఓ మోస్తరుగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి భారీగా తగ్గింది. ఇది పసిడి ప్రియులకు ఒకింత ఆనందాన్ని కలిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం రూ.1,38,800 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి రూ.1,36,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,51,420 రూపాయల నుంచి 148970 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు ఎంతలా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర 149120 రూపాయల వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద ఉంది. ఉదయం ఈ ధరలు వరుసగా రూ.151570, రూ. 138950 వద్ద ఉన్నాయి.చెన్నైలో కూడా సాయంత్రానికి బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఈ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,50,000 వద్ద ఉంది. 22 క్యారెట్ల రేటు 137500 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ రేటు రూ.10000 తగ్గడంతో సిల్వర్ రూ.2.55 లక్షల వద్దకు చేరింది. ఈ రేటు ఢిల్లీలో 2.50 లక్షల రూపాయల వద్ద ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే దేశ రాజధాని నగరంలో వెండి రేటు కొంత తక్కువే.ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు! -
బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు
దేశంలో బంగారం, వెండిపై పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్ 1 నుండి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. సెబీ (SEBI) తీసుకున్న కొత్త నిర్ణయాలు, పన్ను విధానాల్లో మార్పులు మీ లాభాలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఆ మార్పులేంటో ఓసారి పరిశీలిద్దాం.అంతర్జాతీయ ధరలకు స్వస్తి! ఇప్పటి వరకు గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల (ETF) ధరలను అంతర్జాతీయ ప్రమాణాల (LBMA) ఆధారంగా నిర్ణయించేవారు. కానీ ఏప్రిల్ 1 నుండి సెబీ (SEBI) కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ఇకపై వీటి ధరలు భారతీయ ఎక్స్ఛేంజీల 'దేశీయ స్పాట్ ధర' (Domestic Spot Price) ఆధారంగానే నిర్ణయిస్తారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, కరెన్సీ మార్పిడి రేట్ల ప్రభావం మన పెట్టుబడులపై తక్కువగా ఉంటుంది. పెట్టుబడిదారులు భారత మార్కెట్ వాస్తవ ధరకే లావాదేవీలు జరపవచ్చు.గోల్డ్ బాండ్స్‌పై పన్ను పోటుఫిజికల్ గోల్డ్ కంటే సురక్షితమైనదిగా భావించే సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB)విషయంలో ప్రభుత్వం పన్ను నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పటి వరకు సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను మినహాయింపులు ఉండటంతో వీటిని ఉత్తమ పెట్టుబడిగా భావించేవారు. అయితే, కొత్త నిబంధనల ప్రకారం వీటిపై కూడా 'మూలధన లాభాల పన్ను' వర్తిస్తుంది.అయితే బాండ్లను జారీ చేసిన సమయంలో నేరుగా కొనుగోలు చేసి, మెచ్యూరిటీ వరకు ఉంచుకునే వారికి పన్ను మినహాయింపు కొనసాగుతుంది. అదే సెకండరీ మార్కెట్ (స్టాక్ మార్కెట్) ద్వారా బాండ్లను కొనుగోలు చేసిన వారు మాత్రం ఇకపై స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మూలధన లాభాల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.డిజిటల్ గోల్డ్‌పై ప్రభుత్వ నిఘాడిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టే ప్రయోజనాలను పూర్తిగా పన్ను వలయం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే డిజిటల్ పెట్టుబడులపై కూడా పారదర్శకమైన పన్ను విధానాన్ని తీసుకురావడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. -
బంగారం ధరలు.. ఊహకందని మార్పులు!
ఇటీవల కాలంలో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే ఊహకందని విధంగా మారిపోతున్నాయి. ఉదయం ఒక రేటు ఉంటే.. సాయంత్రానికి మరో రేటు ఉంది. ఈ రోజు కూడా ఇదే బాటలు గోల్డ్ రేటు అడుగులు వేసింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 136850 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 137050 రూపాయల వద్దకు చేరింది. అంటే ఉదయం నుంచి సాయంత్రానికి ధర రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల ధర రూ. 149290 నుంచి 149510 రూపాయల వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల ధర 10 గ్రాముల బంగారం ధర 149660 రూపాయల వద్దకు చేరగా.. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 137200 రూపాయాల వద్దకు చేరింది. ఈ రేట్లు ఉదయానికి, సాయంత్రానికి చాలా తేడా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.అయితే.. చెన్నై నగరంలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద, 24 క్యారెట్ల తులం పసిడి ధర 149130 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుకేజీ వెండి ధర రూ.250000 వద్ద ఉంది. ఈ రోజు (మంగళవారం) కేజీ సిల్వర్ రేటు రూ.5000 తగ్గడంతో రూ.2.5 లక్షల వద్ద నిలిచింది. అయితే ఢిల్లీలో వెండి రేటు రూ.5000 పెరిగింది. దీంతో అక్కడ కేజీ సిల్వర్ ధర రూ.2.5 లక్షల వద్ద ఉంది. -
గంటల వ్యవధిలో.. ఊహకందని గోల్డ్ రేటు!
సోమవారం ఉదయం తగ్గిన బంగారం ధరలు.. సాయంత్రానికి పెరుగుదల దిశగా అడుగులు వేసింది. వెండి రేటు కూడా గరిష్టంగా రూ.5000 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాలలో ఉదయం రూ.1,35,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ.1,35,900 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే గంటల వ్యవధిలో రూ.900 పెరిగినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల తులం రేటు 1,47,280 రూపాయల దగ్గర నుంచి 1,48,260 రూపాయల (రూ.980 పెరిగింది) వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో కూడా గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,48,370 రూపాయల నుంచి 1,50,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి రేటు 1,36,050 రూపాయల వద్ద ఉంది.ఢిల్లీలో ఉదయం 1,35,150 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి 1,36,050 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 147430 రూపాయల దగ్గర నుంచి రూ.148410 వద్దకు చేరింది. ఇదంతా కేవలం గంటల వ్యవధిలో జరిగిన మార్పు.వెండి ధరఈ రోజు (సోమవారం) ఉదయం రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా ఉన్న వెండి రేటు.. సాయంత్రానికి రూ.5000 పెరిగింది. దీంతో కేజీ రేటు రూ.2.55 లక్షల వద్దకు చేరింది. అయితే ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.45 లక్షల వద్ద ఉంది. -
యుద్ధం ఆగదు.. వాళ్లంతా నష్టపోక తప్పదు: కియోసాకి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రోబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన హెచ్చరికలు చేశారు. తాజా ‘ఎక్స్’ పోస్ట్‌లో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు అడ్డగోలుగా ముద్రిస్తున్న డబ్బును 'ఫేక్ మనీ'గా అభివర్ణించిన ఆయన (Robert Kiyosaki), రాబోయే రోజుల్లో సంప్రదాయ పెట్టుబడులు నష్టపోక తప్పదని హెచ్చరించారు.డాలర్ విలువ పతనం - పెరుగుతున్న అప్పులుప్రభుత్వాలు తమ ఇష్టానుసారం కరెన్సీని ముద్రిస్తుండటం వల్ల దేశాల జాతీయ అప్పులు (National Debt) విపరీతంగా పెరుగుతున్నాయని కియోసాకి పేర్కొన్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుందని, డాలర్లను పొదుపు చేసేవారు కాలక్రమేణా తమ సంపదను కోల్పోతారని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా అమెరికా బాండ్లు సురక్షితమైనవనేది ఒక "పెద్ద అబద్ధం" అని ఆయన కుండబద్దలు కొట్టారు.చమురు సెగ.. అంతం లేని యుద్ధంప్రస్తుతం ఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఉద్రిక్తతలను ఆయన ఒక 'పవిత్ర యుద్ధం'గా అభివర్ణించారు. ఈ వివాదాలు త్వరలో ముగిసేవి కావని, దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని, అది మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.పాత పద్ధతులకు కాలం చెల్లింది!సాధారణంగా ప్రజలు నమ్మే "చక్కగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, 401k లేదా మ్యూచువల్ ఫండ్లలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయి" అనే సూత్రం ఇప్పుడు పనికిరాదని కియోసాకి కొట్టిపారేశారు. ఈ పద్ధతిని అనుసరించేవారే భవిష్యత్తులో ఎక్కువగా నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. చివరికి ఎంబీఏ (MBA) వంటి ఉన్నత డిగ్రీలు కూడా ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ముందు పనికిరావని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.2026కు సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్లు ఇవే..ఏవైతే ముద్రించడానికి వీలుపడవో అవే నిజమైన ఆస్తులని కియోసాకి నమ్ముతారు. ఆయన ప్రకారం 2026లో పెట్టుబడిదారులను కాపాడేవి బంగారం, వెండి (Real Gold & Silver), చమురు (Oil), ఆహార ధాన్యాలు (Food), క్రిప్టో కరెన్సీ (Bitcoin & Ethereum) మాత్రమే."మీ మెదడులో మీరు నింపుకునే ఆర్థిక విద్య (Financial Education) మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. దేనిని నమ్మాలో మీరే ఆలోచించుకోండి" అంటూ ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు. INVESTOR SECRET: “lf you want to be a rich investor you have to see the future.”Seeing the future today is EASY for two reasons.1: The National Debt will only go up because governments will only keep printing fake money. That means inflation will keep going up which…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 30, 2026 -
వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా!
బంగారం ధరలు ఈ నెల ప్రారంభం నుంచి బాగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. గత రెండు రోజులుగా పెరుగుతున్నాయి. గత ఆదివారం (మార్చి 22) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు రూ.1,48,090 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారంలో ఎంతలా మారిపోయాయి అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో ఈ వారం.. గోల్డ్ రేట్లు ఇలా పెరిగాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 22న (ఆదివారం) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు (శనివారం) రూ.1,48,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,800 రూపాయల నుంచి 135750 రూపాయల వద్దకు చేరింది. వారం రోజుల్లో పసిడి ధర గణనీయంగా పెరిగినట్లు పరిస్థితులు చెబుతున్నాయి.చెన్నైలో గత ఆదివారం (మార్చి 22) 1,45,850 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. ఈ రోజుకు (మార్చి 28) రూ. 1,49,020 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,36,200 రూపాయల దగ్గర నుంచి 1,36,600 రూపాయల వద్దకు చేరింది.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. మార్చి 22న 1,46,120 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు ఈ రోజుకి (శనివారం) 1,48,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,950 రూపాయల దగ్గర నుంచి రూ. 1,35,900 వద్దకు చేరింది.వెండి ధరలువెండి విషయానికి వస్తే.. కేజీ వెండి రేటు గత ఆదివారం ఎలా ఉందో (రూ.2.5 లక్షలు), శనివారం నాటికి (రూ.2.5 లక్షలు) అదే మార్క్ దగ్గర ఉంది. అయితే వారం మధ్యలో ధరల్లో మార్పులు సంభవించినప్పటికీ.. చివరికి రూ.2.5 లక్షల వద్దనే నిలిచింది.ఇదీ చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్‌లో సగం సెలవులే! -
వెండి మళ్లీ వెనక్కి
న్యూఢిల్లీ: వెండి, బంగారం మరోసారి అమ్మకాల ఒత్తిడికి కుదేలయ్యాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.11,250 నష్టపోయి రూ.2.3 లక్షలకు దిగొచ్చింది. బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,900 తగ్గి రూ.1,47,800 స్థాయికి చేరింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని గురువారం బులియన్ మార్కెట్లు పనిచేయలేదు. చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండడం, అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 37 డాలర్లు లాభపడి 4,416 డాలర్ల స్థాయి వద్ద, వెండి ఔన్స్‌కు స్వల్ప లాభంతో 68.12 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి. ‘‘చమురు ధరలు బలహీనపడడంతో బంగారం ధర 4,420 డాలర్ల వరకు వెళ్లింది. కానీ, తర్వాత చమురు ధరల పెరుగుదలతో దిగొచ్చింది’’అని మిరే అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్‌సింగ్ తెలిపారు. యూఎస్ ద్రవ్యోల్బణం డేటా సమీప కాలంలో బులియన్ ధరలను ప్రభావితం చేయొచ్చన్నారు. -
కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన సూచనలు ఇచ్చే కియోసాకి.. తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో 2026 క్రాష్?, అని పేర్కొంటూనే.. 1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారని వెల్లడించారు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే క్షమాపణలు అంటూ మరో ట్వీట్ చేశారు. కియోసాకి ఎందుకిలా చేశారు?, దీనికి గల కారణం ఏమిటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మొదటి ట్వీట్''1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారు. 1950లో ఎడ్గార్ కేస్ కూడా 2026లో ఒక భారీ పతనం సంభవిస్తుందని అంచనా వేశారు. మీరేమనుకుంటున్నారు?.. 2026లో ఒక భారీ పతనం సంభవిస్తే, మీరు ధనవంతులు అవుతారా లేక పేదవారు అవుతారా?, నేను ధనవంతుడిని కావాలని అనుకుంటున్నాను'' అని కియోసాకి ట్వీట్ చేశారు.2026 CRASH?FUTURISTS:Nostradamus in 1500 said disaster would hit the world in 2026.Edgar Cayce in 1950 also predicted a massive crash occurring in 2026.What do you think?You may want to tune into YouTube videos for more details on these two famous futurist predictions.…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026రెండో ట్వీట్క్షమించండి అని పేర్కొంటూ.. మొదటి పోస్ట్‌లో, 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రారంభమవుతుందని భవిష్యత్ శాస్త్రవేత్తలైన నోస్ట్రాడమస్ (1500) మరియు ఎడ్గార్ కేసీ (1940) చేసిన అంచనాను నేను వెల్లడించాను. ఆ తరువాత ఒక స్నేహితుడు నన్ను సంప్రదించాడు.. 2026 సంక్షోభ సమయంలో నేను ధనవంతుడిని అవుతానని చెప్పినందుకు అతను నాపై కోపంగా ఉన్నాడని పేర్కొన్నారు.అతని సమస్య ఏమిటంటే.. మీలో చాలామంది అనుసరించినట్లుగా అతను నా పోస్ట్‌ను ఎప్పుడూ అనుసరించలేదు. అంతే కాకుండా.. ఒక సంక్షోభంలో ధనవంతులు కావాలని మీరు, నేను ప్రణాళిక వేసుకున్న విషయం అతనికి తెలియదు.నన్ను అనుసరించే అందరికీ.. నేను S&P 500, యూఎస్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు వంటి స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టనని, లేదా నగదును పొదుపు చేయనని ఇప్పటికే తెలుసు. ప్రభుత్వం, బ్యాంకులు లేదా వాల్ స్ట్రీట్ ముద్రించే దేనిలోనూ నేను పెట్టుబడి పెట్టను. అంతే కాకుండా.. నన్ను అనుసరించే వారికి నేను KISS (కీప్ ఇట్ సూపర్ సింపుల్) సూత్రాన్ని పాటిస్తానని కూడా తెలుసు.MY APOLOGIES:In my previous X I quoted futurists Nostradamus’ 1500 and Edgar Caycees 1940 prediction that a global economic crisi would begin in 2026. A friend contacted me. He was upset with me because I stated I was going to richer during the 2026 crisis.His problem was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026నేను పశువులను పెంచి అమ్ముతాను, టెక్సాస్, నార్త్‌లోని నా చమురు బావుల నుంచి చమురును అమ్ముతాను, అప్పుతో కొనుగోలు చేసిన 1500 అద్దె యూనిట్లను నెలవారీగా అద్దెకు ఇస్తాను, నేను అసలైన బంగారం, వెండి, బిట్‌కాయిన్, మరియు ఎథేరియంలను పొదుపు చేస్తాను. మీలో చాలా మందిలాగే, నా దగ్గర కూడా మొదట్లో డబ్బు లేదు. కానీ చిన్న చిన్న ఆస్తులను కొని సంవత్సరాల తరబడి ఉంచుకున్నాను, వాటిని ఎప్పుడూ అమ్మలేదు. మీలో చాలా మందికి నేను నా మొదటి 6 బిట్కాయిన్లను $600కి కొన్నానని తెలుసు, నా దగ్గర ఉన్న డబ్బంతా అదే, మరియు నేను కొన్ని రోజుల పాటు ఏమీ తినలేదు.ఇక చివరగా.. నోస్ట్రాడమస్, ఎడ్గార్ కేస్ చెప్పినట్లు 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందా?, రాదా అని నాకు తెలియదు. కానీ ఒకవేళ అది నిజమైతే.. నా మాట విన్న మీరు, నేను ధనవంతులమవుతామని నాకు గట్టి నమ్మకం ఉంది. అదే సమయంలో లక్షలాది మంది పేదలుగా మిగిలిపోతారు.ఇదీ చదవండి: గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!భవిష్యత్తును చూడగలిగే పెట్టుబడిదారులే ధనవంతులవుతారు. నాకు నిజమైనవి (విలువైన లోహాలు) ఇష్టం. నకిలీవి (కరెన్సీ) అంటే ద్వేషం. నువ్వేం చేయబోతున్నావు?. ఆలోచించి.. ఏమీ చేయని లక్షలాది మందిలా ఉండకు. అలోచించి నిర్ణయం తీసుకో అని కియోసాకి ట్వీట్ చేశారు. -
గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!
2026 ప్రారంభంలో భారీగా పెరిగిన వెండి, క్రమంగా తగ్గుతూ.. పెరుగుతూ ముందుకు సాగింది. మూడు నెలల కాలంలో ఏకంగా 44 శాతం తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇలాంటి సమయంలో వెండి కొనాలా?, ఇంకొంత కాలం వేచి చూడాలా? అని చాలామందికి అనుమానం కలిగింది. ఈ కథనంలో మీ అనుమానాలకు సమాధానం చూసేద్దాం.జనవరి 2026లో రూ.4.20 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. నేటికి (మార్చి 26) రూ.2.60 లక్షల వద్దకు చేరింది. అంటే మూడు నెలలు ఇంకా గడవక ముందే సిల్వర్ రేటు రూ.1.60 లక్షలు తగ్గింది. సాధారణంగా.. ధరలు 20 శాతం కంటే తగ్గితే లేదా నష్టపోతే దాన్ని బేర్ మార్కెట్ అంటారు. ఇప్పుడు వెండి పరిస్థితి ఇక్కడే ఉందని నిపుణులు చెబుతున్నారు.వెండి ధరలు తగ్గడానికి కారణం?సిల్వర్ ధరలు ఇంతలా తగ్గిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డాలర్ విలువ బలపడటం అనే చెప్పాలి. ఇది కాకుండా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల సరఫరా అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉండవచ్చని అంచనాలు కూడా వెండి ధరలు తగ్గడానికి కారణమవుతున్నాయి.నిపుణుల అభిప్రాయంక్రమంగా తగ్గిన వెండి ధరలు మెల్లగా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న ధరలతో పోలిస్తే.. ఇప్పుడున్న ధరలు చాలా తక్కువ. కాబట్టి వెండి కొనుగోలు చేయడానికి ఇది మంచి తరుణం అని కొందరు చెబుతున్నారు. ధరలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇంకొంతకాలం వేచి ఉండటం మంచిదని మరికొందరు చెబుతున్నారు.పెట్టుబడిదారులకు సూచనలుబంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం. అది ఆభరణాలుగా కొనుగోలు చేస్తారా?, బిస్కెట్స్, కడ్డీల రూపంలో కొనుగోలు చేస్తారా అనేది పూర్తిగా మీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి అనేది మీ సొంత నిర్ణయం. అవసరమైన నమ్మకమైన నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: రూ.3 లక్షలకి ఆర్డర్ పెడితే.. వాషింగ్ పౌడర్ వచ్చింది! -
సిల్వర్ హిట్.. బంగారం ధగధగలు
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా అమ్మకాల ఒత్తిడికి లోనైన పసిడి, వెండి బుధవారం దేశీ మార్కెట్లో మంచి ర్యాలీని చూశాయి. వెండి కిలోకి ఏకంగా రూ.11,250 ర్యాలీ చేసి రూ.2.41 లక్షలకు చేరుకుంది. బంగారం వరుసగా రెండో రోజూ కొనుగోళ్లతో మెరిసింది. 10 గ్రాములకు రూ.4,900 పెరిగి రూ.1,49,700 స్థాయిని అందుకుంది.భౌగోళిక రాజకీయ సెంటిమెంట్ కాస్త మెరుగుపడడం ఫలితంగా చమురు ధరలు దిగిరావడం బంగారం, వెండి ధరలు కోలుకునేందుకు దోహదపడినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 2 శాతం పెరిగి 4,556 డాలర్లకు, స్పాట్ వెండి ఔన్స్‌కు 2 శాతం లాభపడి 72.67 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. -
ఇక ఆరంభం.. తారుమారైన గోల్డ్ రేటు!
వారం రోజులుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో పసిడి ధరల పరుగు మళ్లీ మొదలైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?, ఉదయం ధరలకు.. సాయంత్రం ధరలకు మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో.. ఈ రోజు (మార్చి 24) ఉదయం 1,40,350 రూపాయల వద్ద ఉన్న తులం బంగారం ధర.. సాయంత్రానికి 1,42,910 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర 1,28,650 రూపాయల నుంచి 1,31,000 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. తులం 24 క్యారెట్ల రేటు రూ.1,40,500 నుంచి రూ.143060 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 128800 రూపాయల నుంచి రూ.131150 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు గంటల వ్యవధిలో ఎంతలా మారిందో స్[స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.చెన్నై విషయానికి వస్తే.. ఈ నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.970 తగ్గి.. 144560 రూపాయలు వద్ద, 22 క్యారెట్ల రేటు 900 రూపాయలు తగ్గి, రూ.132500 వద్దకు చేరింది. మొత్తం మీద పడిపోతున్నాయన్న బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి.వెండి ధరలు ఇలాబంగారం బాటలోనే వెండి అన్నట్లు.. ఉదయం కేజీపైన రూ.10000 తగ్గి రూ.2.40 లక్షల వద్ద ఉన్న సిల్వర్.. సాయంత్రానికి రూ.2.50 లక్షలకు చేరుకుంది. అంటే వెండి కూడా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. -
బంగారం ధరలు ఎందుకింతగా పడిపోతున్నాయ్!
సాధారణంగా యుద్దాలు జరిగినప్పుడు బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అమాంతం పెరుగుతాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియ కూడా ఇదే. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి తలకిందులైపోయిందని కోబేస్సీ లెటర్ చేసిన ట్వీట్ ద్వారా వెల్లడైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ప్రస్తుతం బంగారం, వెండి వంటి విలువైన లోహాల మార్కెట్ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఓ వైపు ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ రెండు లోహాల మార్కెట్ విలువలో సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల మేర తగ్గుదల చోటుచేసుకోవడం విశేషం.యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు.. బంగారం ధరలు పెరగాలి. అయితే.. ఇప్పుడు గోల్డ్ రేటు తగ్గడానికి కారణం బాండ్ మార్కెట్లో వచ్చిన మార్పులు. అమెరికా 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. బంగారం వంటి వడ్డీ ఇవ్వని ఆస్తులతో పోలిస్తే, బాండ్లు ఇప్పుడు ఆదాయం అందించే సురక్షిత మార్గంగా మారాయి. అందువల్ల చాలా మంది పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను తీసుకుని బాండ్లలో పెట్టడం ప్రారంభించారు.Something very strange is happening in precious metals right now:In just 3 hours, gold and silver just erased a combined -$2 TRILLION in market cap.Meanwhile, oil prices have erased their gains on the day and US stock market futures are nearly green.Since the Iran War… pic.twitter.com/zP43wSr9wE— The Kobeissi Letter (@KobeissiLetter) March 23, 2026ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. అమెరికన్ డాలర్ బలపడటం. యుద్ధ పరిస్థితుల్లో డాలర్ కూడా సురక్షిత ఆస్తిగా పరిగణించబడుతుంది. డాలర్ విలువ పెరిగితే, బంగారం ధరలు సాధారణంగా తగ్గుతాయి. ఇదే సమయంలో మార్కెట్లో లీవరేజ్ అధికంగా ఉండటం పరిస్థితిని మరింత తీవ్రమైంది చేసింది. ప్రస్తుతం లోహాల మార్కెట్లలో ఏదో జరుగుతోందని.. కోబేస్సీ లెటర్ వెల్లడించింది.గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు వేగంగా పెరగడంతో, చాలా మంది ట్రేడర్లు అధిక రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టారు. ధరలు ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైనప్పుడు, స్టాప్ లాస్ ఆర్డర్లు అమల్లోకి వచ్చాయి, మార్జిన్ కాల్స్ వచ్చాయి, పెట్టుబడిదారులు తమ పొజిషన్లను బలవంతంగా విక్రయించాల్సి వచ్చింది. దీనివల్ల ధరలు మరింత వేగంగా క్షీణించాయి.భారతదేశంలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఇతర లోహాలు కూడా ఇదే దిశగా కదిలాయి. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లు ఎప్పుడూ సాంప్రదాయ సిద్ధాంతాల ప్రకారం ప్రవర్తించవు. పరిస్థితులు మారినప్పుడు సురక్షితమైనవిగా భావించే ఆస్తులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు, డాలర్ బలం, లిక్విడిటీ వంటి అంశాలు మార్కెట్ దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది. -
తగ్గుతున్న బంగారం ధరలు: మళ్లీ పెరుగుతాయా?
ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బంగారం ధరలు గత కొంత కాలంగా తగ్గుతూ.. ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. ఈ విలువైన లోహాల ధరలు పడిపోతూనే ఉంటాయా? లేక మళ్లీ పెరుగుతాయా? అనే సందేహం చాలామందిలో కలిగింది. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.ఈ రోజు (మార్చి 20) బంగారం ధర 0.6% పెరగగా, వెండి ధర 1.7% ఎందుకు తగ్గింది. ఇటీవలి తగ్గుదలల తర్వాత, సాంకేతిక కొనుగోళ్లు మార్కెట్‌కు మద్దతు ఇవ్వడంతో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బలమైన అమెరికన్ డాలర్ ఒత్తిడి, వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి వస్తున్న సంకేతాల కారణంగా, గోల్డ్ వరుసగా మూడవ వారం కూడా పతనం దిశగా పయనించింది. అదే సమయంలో, మార్కెట్లో బలహీనమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ వెండి ధరలు తగ్గాయి.భౌగోళిక రాజకీయ పరిణామాలు, చమురు ధరల కదలికలు, భారతదేశం.. చైనాలలో భౌతిక డిమాండ్‌లో మార్పులతో సహా ప్రపంచ కారకాలు బంగారం, వెండి ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవలి తగ్గుదలల తర్వాత వ్యాపారులు కొనుగోళ్లు జరపడం, ధరలు సాంకేతిక మద్దతు జోన్లను నిలబెట్టుకోవడంతో బంగారం ధరలు పెరిగాయి. అయితే, భౌతిక డిమాండ్ తగ్గడం మరియు కొనసాగుతున్న అమ్మకాల కార్యకలాపాల కారణంగా వెండి ధరలు పడిపోయాయి.ఆసియా ట్రేడింగ్ సమయంలో స్పాట్ గోల్డ్ 0.6% పెరిగి ఔన్సుకు 4,675.23 డాలర్లకు చేరుకుంది. గత సెషన్లో దాదాపు రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన ఈ లోహం కోలుకుంది. వెండి 1.7% తగ్గి ఔన్సుకు 71.66 డాలర్లకు చేరింది. ఇతర లోహాలు మిశ్రమ కదలికలను కనబరిచాయి. ప్లాటినం 0.2% పెరిగి 1,974.45 డాలర్లకు చేరగా, పల్లాడియం 1% పెరిగి 1,461.36 డాలర్లకు చేరింది.బంగారం ధరల పెరుగుదల ఎప్పుడుబంగారం వంటి విలువైన లోహాల విలువ ఎలాంటి సమయంలో అయినా భారీగా క్షిణించే అవకాశం ఉండదు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవచ్చు, ఆర్ధిక మాంద్యం రావచ్చు. అలంటి సమయంలో కూడా మీకు బంగారం, వెండి వంటివి చాలా ఉపయోగపడతాయని రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు చెబుతున్నారు. -
ఆ బుడగ పేలిందా!! 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తుచేసుకోండి..
అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అలజడి నడుస్తున్న నేపథ్యంలో, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన హెచ్చరిక జారీ చేశారు. త్వరలోనే చరిత్రలోనే అతిపెద్ద ఆస్తుల బుడగ (బబుల్ బస్ట్) పగిలిపోతుందని, దాని తర్వాత బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఈథేరియం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఆయన పేర్కొన్నారు.కియోసాకి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన తాజా సందేశంలో, "బబుల్ పగిలే 'పిన్' ఏదైనా ఈవెంట్ త్వరలోనే జరగనుంది. అది ఏ సంఘటన అయినా.. ఇప్పుడే బిట్‌కాయిన్, బంగారం, వెండి, ఈథేరియం ఎక్కువగా సేకరించాలి" అని సూచించారు. క్రాష్ తర్వాత ఒక సంవత్సరంలో బంగారం ఒక ఔన్స్‌కు 35,000 డాలర్లు, వెండి 200 డాలర్లు, బిట్‌కాయిన్ ఒక్కో కాయిన్ 750,000 డాలర్లు, ఈథేరియం 95,000 డాలర్లకు చేరుతాయని ఆయన ధీమాగా అంచనా వేశారు."మీ లాభం అమ్మేటప్పుడు కాదు.. కొనేటప్పుడే వస్తుంది" అనే తన 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు కొనుగోలు చేసి భవిష్యత్తులో ధనవంతులు కావాలని, లేకపోతే చాలామంది పేదలవుతారని హెచ్చరించారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ ధర సుమారు 74,000–75,000 డాలర్ల మధ్య ఉండగా, ఈథేరియం 2,300–2,400 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది. -
కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పెట్టుబడికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా మరో ట్వీట్ చేసారు. చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' ఉందని హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' (ఒక ఆస్తి విలువ.. అసలు విలువ కంటే చాలా ఎక్కువగా పెరగడం) జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది నాకు తెలియదు, అని కియోసాకి పేర్కొన్నారు. ''అది జరుగుతుందా లేదా అన్నది ప్రశ్న కాదు. అది ఎప్పుడు జరుగుతుంది అన్నదే ప్రశ్న'' అని అన్నారు.బబుల్ బస్ట్ సంఘటన జరిగినప్పుడు.. ఒక ఏడాది తరువాత గోల్డ్ ధర ఔన్సుకు 35,000 డాలర్లకు చేరుకుంటుందని నేను అంచనా వేస్తున్నాను. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బిట్‌కాయిన్ ధర 7,50,000 డాలర్లకు, ఇథీరియం ధర 95,000 డాలర్లకు చేరుకుంటుంటుందని కియోసాకి వెల్లడించారు.ఆర్ధిక సంక్షోభం వచ్చినప్పుడు మార్కెట్లు కుప్పకూలిపోతాయి. అలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా పెట్టిన పెట్టుబడులు (గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్, ఇథీరియం) మిమ్మల్ని కాపాడతాయి. కాబట్టి అలోచించి ఇన్వెస్ట్ చేయండి. ధనవంతులు కావడానికి ఇదే సరైన సమయమా? అంటూ కియోసాకి ట్వీట్ ముగించారు.BIGGEST BUBBLE BUSTI do not know what pin, what event will pop the biggest bubbles in histor. What ever the event, the pin is near.It’s not IF. It’s WHEN.When the bubbles go bust I predict gold will hit $35,000 an ounce one year after the gold bubble goes pop..I predict…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 16, 2026 -
బంగారం ధరల రివర్స్!.. వారం రోజుల్లో..
బంగారం ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. గడచిన వారం రోజుల్లో గోల్డ్, సిల్వర్ రేటు గణనీయంగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో, పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేట్లలో జరిగిన మార్పు గురించి, నేటి ధరల గురించి తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 9(సోమవారం)న 1,61,680 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, ఈ రోజుకి (మార్చి 15) 1,59,660 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు రూ. 2020 తగ్గిందన్న మాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. వారం రోజుల్లో 1,48,200 రూపాయల దగ్గర నుంచి రూ. 1,46,350 వద్దకు (రూ.1850 తగ్గింది) చేరింది.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు వారం రోజుల్లో గణనీయంగా తగ్గింది. మార్చి 9న.. అంటే సోమవారం రోజు 1,61,830 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. నేటికి (మార్చి 15) రూ.1,59,810 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే ఏడు రోజుల్లో రూ.2020 తగ్గింది. 22 క్యారెట్ల పసిడి రేటు 1,48,350 రూపాయల నుంచి రూ.1850 తగ్గి 1,46,500 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర వారం రోజుల్లో 1,63,090 రూపాయల దగ్గర నుంచి 1,61,020 రూపాయల దగ్గరకు చేరింది. వారం రోజుల్లో రూ. 2070 తగ్గిందన్నమాట. తులం 22 క్యారెట్ల బంగారం రేటు 1,49,500 రూపాయల నుంచి రూ. 1,47,600 వద్దకు (రూ.1900 తగ్గింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా బాగా తగ్గాయి. మార్చి 9న రూ.2.90 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు నేటికి (మార్చి 15) రూ.2.80 లక్షలకు చేరింది. వారం మధ్యలో రేట్ల పెరుగుదల, తగ్గుదల ఉన్నప్పటికీ.. మొత్తం మీద కేజీ రేటు 10,000 రూపాయలు తగ్గిందని తెలుస్తోంది. -
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!
దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మార్చి 14) పసిడి ధర గరిష్టంగా రూ.1030 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం బాటలోనే నేను కూడా అన్నట్టు.. వెండి అడుగులు వేసింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ.5000 తగ్గింది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ ధరలను గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. -
సిల్వర్ హిట్.. క్రూడ్ ర్యాలీకి బ్రేక్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక–రాజకీయ పరిణామాలతో మంగళవారం వెండి పరుగులు తీయగా, ముడి చమురు ధరలు కుదేలయ్యాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి రేటు కేజీకి రూ. 10,975 పెరిగి రూ. 2,79,275కి ఎగసింది. తద్వారా మూడు సెషన్ల నష్టాలకు బ్రేక్ పడింది. 99.9% స్వచ్ఛత బంగారం కూడా రూ. 400 పెరిగి రూ. 1,64,300కి చేరింది.ఇన్వెస్టర్లను కునుకు లేకుండా చేస్తున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలకు త్వరలోనే పరిష్కారం ఉండబోతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా ప్రకటించడం భౌగోళిక–రాజకీయ మార్పులకు దారి తీయడంతో పసిడి, వెండి రేట్లు పెరిగాయని లెమన్ మార్కెట్స్ డెస్క్ రీసెర్చ్ అనలిస్ట్ గౌరవ్ గర్గ్ తెలిపారు.అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో వెండి ఔన్సుకి (31.1 గ్రాములు) 1.38 డాలర్లు పెరిగి 88.33 డాలర్లకు చేరగా, పసిడి 1 శాతం పెరిగి 5,172.86 వద్ద ట్రేడయ్యింది. మరోవైపు, న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో సిల్వర్ మే నెల కాంట్రాక్టు 5.07 డాలర్లు (సుమారు 6 శాతం) పెరిగి 89.59 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. వెండి 90 డాలర్ల దగ్గర ఉన్న నేపథ్యంలో 95 డాలర్ల (దేశీయంగా రూ. 2.85 లక్షలు) వైపుగా వెళ్లే అవకాశం ఉందని ఆగ్మంట్ హెడ్ (రీసెర్చ్) రెనిషా చెయినాని తెలిపారు. దిగొచ్చిన చమురు..: మూడు రోజులుగా ర్యాలీ చేస్తున్న ముడిచమురు ధరలకు ట్రంప్ భరోసాతో బ్రేక్ పడింది. ఎంసీఎక్స్‌లో మార్చి డెలివరీ క్రూడ్ కాంట్రాక్టు బ్యారెల్‌కి రూ. 1,483 (సుమారు 17 శాతం) క్షీణించి రూ. 7,366 వద్ద ట్రేడయ్యింది. అదే విధంగా ఏప్రిల్ కాంట్రాక్టు కూడా రూ. 1,245 (15 శాతం) తగ్గి రూ. 7,300 వద్ద ట్రేడయ్యింది. అటు అంతర్జాతీయంగా నైమెక్స్ క్రూడ్ ఏప్రిల్ డెలివరీ 18 శాతం క్షీణించి 88 డాలర్లకు, బ్రెంట్ క్రూడ్ మే కాంట్రాక్ట్ 16 శాతం తగ్గి 84 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక
ఒకవైపు ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం, మరోవైపు భారీగా పతనమవుతున్న మార్కెట్లు. ఇలాంటి సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం వస్తుందని ఇందులో హెచ్చరించారు.చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం గురించి నేను రిచ్ డాడ్స్ ప్రాఫసీ (2013)లో హెచ్చరించాను. అది రాబోతోంది. 2008లో ప్రపంచం ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీనిని గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని పిలుస్తారు. ఆ సమయంలో చాలా బ్యాంకులు & ఆర్థిక సంస్థలు కూలిపోయాయి. ముఖ్యంగా అమెరికాలోని పెద్ద పెట్టుబడి బ్యాంక్ అయిన లెమాన్ బ్రదర్స్ దివాళా తీసింది. భవిష్యత్తులో ఇంకా పెద్ద సంక్షోభం వచ్చే అవకాశం ఉందని కియోసాకి పేర్కొన్నారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం.. 2026లో మరో పెద్ద ఆర్థిక సంక్షోభం సంభవించే అవకాశం ఉంది. ఈ పతనం ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆస్తి నిర్వహణ సంస్థలలో ఒకటైన 'బ్లాక్ రాక్'తో సంబంధం ఉన్న.. ప్రైవేట్ క్రెడిట్ వ్యవస్థ కారణంగా రావచ్చని ఆయన భావిస్తున్నారు.REPEATING A WARNINGIn Rich Dad’s Prophecy (2013) I warned the biggest stock market crash in history….was STILL coming.In 2026, I hope I am wrong…. Yet I am afraid that crash is now arriving.Why did I make that prediction?Because the cause of the 2008 crash, the GFC,…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 10, 2026ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు భారీ అప్పుల్లో ఉన్నాయని, ఆ అప్పులను తిరిగి చెల్లించడం చాలా కష్టం అవుతుందని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన వృద్ధుల సేవింగ్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం.. డబ్బును కాపాడుకోవాలంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం, ఆయిల్ వెల్స్ వంటి సహజ వనరులలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం అని చెబుతున్నారు.నాకు వెండి అంటే చాలా ఇష్టమని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఎందుకంటే తక్కువ డబ్బుతో కూడా వెండిని కొనుగోలు చేయవచ్చని ఆయన అభిప్రాయం. కాబట్టి మీరు కూడా కేవలం 10 డాలర్లతో వెండి నాణేలు లేదా చిన్న ముక్కలు కొనుగోలు చేయండి. అవసరమైతే ఒక రోజు తినడం ఆపేసి.. వెండిపై పెట్టుబడి పెట్టండి. తప్పకుండా మీరు ధనవంతులు అవుతారని, జాగ్రత్త వహించండి, అని కియోసాకి తన ట్వీట్ పూర్తి చేశారు. -
పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం, వెండి!
భారతదేశంలో బంగారం, వెండి ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. తులం గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1960 తగ్గింది. కేజీ వెండి రేటు రూ.5000 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో స్వల్ప మార్పులు ఏర్పడ్డాయి. ఈ కథనంలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఏ నగరంలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. -
గోల్డ్ మార్కెట్ లో భారీ ట్విస్ట్.. ఒక్కరోజులోనే అమాంతం పెరిగిన బంగారం ధరలు..
-
పతనమైన వెండి.. రూ.35 వేలు తగ్గిన రేటు!
భారతదేశంలో బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో కేజీ సిల్వర్ రేటు వారం రోజుల్లో సుమారు రూ. 35వేలు తగ్గింది. ఈ కథనంలో లేటెస్ట్ సిల్వర్ ధరల గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.మార్చి 1న రూ.3.25 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు మార్చి 7 నాటికి రూ.2.90 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.35వేలు తగ్గిందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే రేట్లు కొనసాగుతున్నప్పటికీ.. ప్రస్తుతం దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.85 లక్షల దగ్గర ఉంది. దీన్నిబట్టి చూస్తే దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగా ఉందని తెలుస్తోంది.ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్నవేళ బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయనుకుంటే.. మెల్లగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ తగ్గుదల కేవలం తాత్కాలికం మాత్రమే. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు తప్పకుండా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
యుద్ధ ప్రభావం ఉన్నా గోల్డ్, సిల్వర్ రేట్ పడిపోవడానికి కారణం ఏమిటి..?
-
పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
మార్చి 2నుంచి భారతదేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు, సాయంత్రానికి ఇంకొంత తగ్గుముఖం పెట్టింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనయ్యాయి. ఈ కథనంలో తాజా ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,49,900 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,49,300 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,63,530 రూపాయల నుంచి రూ. 1,62,880 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,50,050 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 1,49,450 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,63,680 రూపాయల వద్ద నుంచి రూ. 1,63,030 వద్దకు చేరింది.ఇక చెన్నైలో మాత్రం.. గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 151200 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 164950 వద్దనే ఉన్నాయి.ఇదీ చదవండి: ఇంటర్ చదివి.. రూ.300 కోట్ల బిజినెస్! -
రూ.3 లక్షలు దాటేసిన వెండి: కారణాలు ఇవే!
బంగారం ధరలు అమాంతం పెరుగుతూ.. పసిడి ప్రియులకు షాకిస్తున్న వేళ, వెండి రేటు కూడా కొండెక్కుతోంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ రేటు ఎలా ఉంది?, వెండి ధర పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటనేది ఇక్కడ, ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి ధర రూ. 3.15 లక్షలకు చేరుకుంది. ముంబై, బెంగళూరు, చెన్నైలలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.దేశంలోనిఇతర ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. సాధారణంగా ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా కేజీ సిల్వర్ ధర రూ. 3.15 లక్షలకు చేరుకుంది.వెండి ధరలు పెరగడానికి కారణాలు➤ప్రస్తుతం సిల్వర్ ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం.➤యుద్ధం కారణంగా.. పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి లోహాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.➤యుద్ధం కాకుండా.. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ యాక్ససరీస్ వంటి రంగాల్లో వెండికి భారీ డిమాండ్ ఉంది.➤డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో.. దానికి తగిన విధంగా సరఫరా ఉండాలి. సరఫరా తగ్గితే.. ధరలు తప్పకుండా పెరుగుదల దిశగా పరుగులు పెడతాయి.రాజకీయ, భౌగోళిక కారణాల వల్ల భారీగా పెరుగుతున్న వెండి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే సామాన్యులకు వెండి దూరమైపోతుంది. -
భగ్గుమన్న బంగారం.. కియోసాకి ‘బ్లాస్ట్ ఆఫ్’ ట్వీట్
ప్రసిద్ధ ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి సాంప్రదాయ కరెన్సీలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బంగారం, వెండి, బిట్‌కాయిన్‌పై ఆశావాద వ్యాఖ్యలు చేశారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత అయిన కియోసాకి తన తాజా సోషల్ మీడియా పోస్టులో బంగారం ఒకే రోజులో 128 డాలర్లు పెరిగిందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో వెండి (Silver), బిట్‌కాయిన్ (Bitcoin) త్వరలో భారీగా ఎగిసిపడతాయని (బ్లాస్ట్ ఆఫ్) అభిప్రాయపడ్డారు.బంగారం ధరలుబంగారం ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరగడం మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇలాంటి పెరుగుదలలు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీ రేట్ల మార్పులు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత వంటి కారణాలతో చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మళ్లడం సాధారణం.వెండి, బిట్‌కాయిన్‌పై..కియోసాకి ప్రకారం వెండి కూడా బంగారం తరహాలోనే వేగంగా పెరిగే అవకాశం ఉంది. వెండి పారిశ్రామిక వినియోగం, విలువ నిల్వ అనే రెండు కోణాల్లో ప్రాధాన్యం కలిగి ఉండటంతో, మార్కెట్ చలనం సమయంలో ఎక్కువ ఒడిదుడుకులు చూపుతుంది. అలాగే బిట్‌కాయిన్‌ను డిజిటల్ గోల్డ్‌గా పేర్కొంటూ, కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థలపై అనిశ్చితి పెరిగితే క్రిప్టోకరెన్సీలకు మద్దతు పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.GOLD booms $128 in one day.Better news is silver and Bitcoin to blast off.Hang on.— Robert Kiyosaki (@theRealKiyosaki) March 2, 2026 -
వార్ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
-
ఊహకందని స్థాయికి చేరిన బంగారం ధర!
బంగారం తగ్గుతుందని సంబరపడేలోపే.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైపోయింది. దీంతో పసిడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. గత ఆదివారం (ఫిబ్రవరి 22) రూ. 1,59,280 వద్ద ఉన్న గోల్డ్ రేటు (ఫిబ్రవరి 28) శనివారం నాటికి రూ. 1,68,710 వద్దకు చేరింది. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేటు ఏ నగరంలో ఎలా ఉందనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. వారం రోజుల్లో రూ. 1,59,280 నుంచి రూ. 1,68,710 వద్దకు (రూ.9430 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి రేటు రూ. 1,46,000 నుంచి రూ. 1,54,650 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 8650 రూపాయలు పెరిగిందన్నమాట. ఈ రోజు (మార్చి 1) ధరలు తెలుగు రాష్ట్రాల్లో గరిష్టంగా రూ. 1,73,080 వద్దకు చేరాయి.చెన్నైలో గోల్డ్ రేటు వారం రోజుల్లో భారీగా పెరిగింది. ఫిబ్రవరి 22న రూ.1,60,150 వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 9490 పెరిగి.. ఫిబ్రవరి 28 నాటికి 1,69,640 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఇది 10 గ్రాములు 1,46,800 రూపాయల నుంచి రూ. 1,55,500 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల్లో 8700 రూపాయలు పెరిగిందన్నమాట.ఫిబ్రవరి 22న 1,59,430 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర ఫిబ్రవరి 28నాటికి రూ. 9430 పెరిగి.. 1,68,860 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,46,150 రూపాయల దగ్గర నుంచి రూ. 1,54,800 వద్దకు చేరింది. వారం రోజుల్లో రూ. 8650 పెరిగింది. -
యుద్ధం ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేటు!
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేయడం మొదలుపెట్టేశాయి. దీంతో పెట్టుబడిదారుల్లో భయం పెరిగిపోయింది. ఈ తరుణంలో అందరూ సురక్షితంగా భావించే బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు.. దేశంలోని ఏ నగరంలో ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 7140 పెరిగి రూ. 1,68,170 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 6550 పెరిగి రూ. 1,54,650 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఉన్నాయి.చెన్నైలో కూడా ధరలు పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,69,640 (రూ. 7090 పెరిగింది). 22 క్యారెట్ల రేటు రూ. 1,55,500 (రూ. 6500 పెరిగింది) వద్ద ఉంది.ఢిల్లీ విషయానికి వస్తే.. దేశ రాజధాని నగరంలో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 7140 పెరిగి, రూ. 1,68,860 వద్ద నిలిచింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 6550 పెరిగి రూ. 1,54,800 వద్ద నిలిచింది.వెండి ధరలుబంగారం బాటలోనే వెండి అన్నట్లు.. వెండి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్, విజయవాడ మొదలైన నగరాల్లో కేజీ సిల్వర్ రేటు రూ. 3.20 లక్షలు చేరింది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 2.95 లక్షల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: అమెరికాను విడిచిపెడుతున్న లక్షలాది మంది ప్రజలు! -
భారీగా తగ్గిన వెండి.... దూసుకుపోతున్న బంగారం.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?
-
వారం రోజుల్లో పసిడి జంప్.. ఎంతలా పెరిగిందంటే?
బంగారం, వెండి ధరలు కొంత కాలంగా పెరుగుతూ, తగ్గుతూ ముందుకు సాగుతున్నాయి. ఈ వారం (ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 21) రోజుల్లో గోల్డ్ రేటులో గణనీయమైన మార్పు ఏర్పడింది. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరలు ఎంతలా మారాయనే విషయాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఫిబ్రవరి 15న 1,57,750 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు శనివారం నాటికి (ఫిబ్రవరి 21) 1,59,280 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 1530 రూపాయలు పెరిగిందన్న మాట. 22 క్యారెట్ల గోల్డ్ రేటు వారం రోజుల్లో 1,44,600 నుంచి 1,46,000 వద్దకు (రూ.1400 పెరిగింది) చేరింది.ఢిల్లీలో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు వారం రోజుల్లో 1,57,900 రూపాయల నుంచి రూ. 1,59,430 వద్దకు (రూ.1530 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల ధర 1,44,750 రూపాయల నుంచి రూ. 1,46,150 వద్దకు (1400 రూపాయలు పెరిగింది) చేరింది.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,58,840 రూపాయల నుంచి 1,60,150 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,45,600 రూపాయల నుంచి రూ. 1,46,800 వద్దకు (రూ. 1200 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా మారాయి. గత ఆదివారం (ఫిబ్రవరి 15) రూ. 2.80 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఈ రోజుకు (శనివారం) పెరుగుతూ.. తగ్గుతూ.. రూ. 2.90 లక్షలకు చేరింది.ఇదీ చదవండి: బంగారం రూ.2 లక్షలకు? -
సాయంత్రానికి పెరిగిన రేటు.. బంగారం ధరలు ఇలా..
శుక్రవారం ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి మారిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు మారిపోయాయి. ఈ కథనంలో ప్రస్తుత పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,43,150 వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ. 1,44,250 వద్ద నిలిచింది. 1,56,170 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,57,370 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఇదే ధరలు ఉన్నాయి.ఢిల్లీలో 1,43,330 వద్ద ఉన్న తులం 22 క్యారెట్ల ధర 1,44,400 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,56,320 రూపాయల వద్ద నుంచి రూ. 1,57,520 వద్దకు చేరింది. అయితే చెన్నైలో.. బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల రేటు రూ.1,44,200 వద్ద, 24 క్యారెట్ల రేటు 157310 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలువెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2.70 లక్షల వద్ద ఉంది. నిన్న (గురువారం) రూ.10 వేలు పెరిగిన రేటు.. ఈ రోజు (శుక్రవారం) స్థిరంగా ఉంది.ఇదీ చదవండి: బంగారం రూ.2 లక్షలకు? -
బంగారం రూ.2 లక్షలకు?
ఇప్పుడిప్పుడే బంగారం ధరలు తగ్గుతున్నాయని పసిడి ప్రియులు సంబరపడుతున్నారు. ఈ తరుణంలో గోల్డ్ రేటు మళ్లీ రూ. 2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను, ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై కొనసాగుతున్న అనిశ్చితి వంటివి కారణాలు అని వెల్లడించారు.అమెరికా - ఇరాన్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా యుద్ధ వాతావరణం లేదా రాజకీయ అస్థిరతలు ఏర్పడినప్పుడు.. పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ పెట్టుబడులవైపు చూస్తారు. ఇలాంటి సమయంలో.. బంగారం, వెండి వంటి సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడులు పెడతారు. ఇదే జరిగితే.. గోల్డ్, సిల్వర్ రేట్లు అమాంతం పెరుగుతాయి.ఇక మరో అంశం.. వడ్డీ రేట్లు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందా? లేదా?.. అనేది చాలాకాలంగా పెట్టుబడిదారుల్లో నిలిచిపోయిన ఒక ప్రశ్న. వడ్డీ రేట్లు తగ్గితే.. బంగారం వంటి ఆస్తులు మరింత ఆకర్షణీయంగా మారుతాయి. ఎందుకంటే వడ్డీ వచ్చే పెట్టుబడులపై లాభం తగ్గినప్పుడు, పెట్టుబడిదారులు బంగారం వంటి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతారు.రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగితే.. ధరలు ఎగిసే అవకాశం ఉంది. అదే విధంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు ప్రకటిస్తే కూడా బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు.. మార్కెట్లో పెద్ద మార్పులు కనిపించకపోవచ్చు.ప్రస్తుతం తగ్గిన ధరలు!2026 జనవరిలో రూ. 1.80 లక్షలకు చేరిన తులం బంగారం.. ప్రస్తుతం రూ. 1.50 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఇంత తక్కువ వ్యవధిలో రేటు ఎంత తగ్గిందో చూడవచ్చు. వెండి రేటు కూడా దాదాపు భారీగా తగ్గి కేజీ రేటు రూ. 2.70 లక్షలకు చేరింది. -
గోల్డ్ లవర్స్ బీభత్సమైన గుడ్ న్యూస్.. లక్ష దిగువకు బంగారం ధరలు..!
-
'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!
స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో.. ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంటూనే.. భారీ క్రాష్ మొదలైందని అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2013లో ప్రచురించిన రిచ్ డాడ్స్ ప్రాఫసీలో.. భవిష్యత్తులో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్ జరుగుతుందని హెచ్చరించాను. నేను చెప్పినట్లే.. ఆ పెద్ద ఆర్థిక సంక్షోభం సమీపంలో ఉంది. మార్కెట్ క్రాష్ అనేది కొందరికి ప్రమాదం అయినా.. స్టాక్స్ కొనుగోలు చేయాలని వేచి చూసేవారికి గొప్ప అవకాశం.ఈ సందర్భంగా కియోసాకి.. గోల్డ్, సిల్వర్ గురించి చెబుతూనే బిట్‌కాయిన్, ఎథెరియం గురించి కూడా పేర్కొన్నారు. బిట్‌కాయిన్ విలువ తగ్గిపోతున్నప్పుడు, నేను మరింత కొనుగోలు చేస్తానని అన్నారు. నా దృష్టిలో ఇవే (బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం) నిజమైన ఆస్తులని పేర్కొన్నారు.I Am Warning You: In Rich Dad’s Prophecy published 2013 I warned of the biggest stock market crash in history still coming.That giant crash is now imminent.The good news is those of you who followed my rich dad’s warning and prepared….the coming crash will make you richer…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 17, 2026ఆర్థిక సంక్షోభాలు ఎప్పుడూ నష్టాలనే కాకుండా.. అవకాశాలను అందిస్తుంది. భయపడే వారు నష్టపోవచ్చు, కానీ ఆర్థిక జ్ఞానం కలిగి, దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు పెట్టే వారు మాత్రం.. తప్పకుండా ధనవంతులు అవుతారు. ఎప్పుడైతే మార్కెట్ నష్టాలను చవి చూస్తుందో.. చాలామంది తమ స్టాక్ అమ్మేయడానికి సిద్ధపడతారు. అలాంటి సమయంలో వాటిని కొనుగోలు చేసేవారు సంపన్నులవుతారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడి అనేది ఒక వ్యక్తి ఆర్థిక దృష్టికోణం మాత్రమే. ఇందులో లాభనష్టాలు సహజమే. కాబట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. అవసరమైతే ఆర్ధిక పరిస్థితిని విశ్లేషించడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: డేంజర్లో ఉద్యోగాలు!.. 2026లో ఇదే జరుగుతుందా? -
ఆర్థిక భవిష్యత్తు: బంగారం కొనాలా.. వద్దా?
కొన్ని రోజులకు ముందు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. రేట్లు పెరుగుతున్నప్పుడు.. ఏ ధరకైనా కొనేయాలని ఎగబడిన కొంతమంది జనం.. ఇప్పుడు తగ్గుతున్నాయి కదా అని వేచి చూస్తున్నారు. ఇంకా తగ్గే అవకాశం ఉందేమో అని ఆలోచిస్తున్నారని ప్రముఖ ఇన్వెస్టర్, మార్కెట్ మాస్ట్రోలో డైరెక్టర్ 'అంకిత్ యాదవ్' తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.ధరలు పెరిగినప్పుడు ఉత్సాహం చూపించారని, రేటు తగ్గుతున్నప్పుడు ప్రజలు మౌనం పాటిస్తున్నారని అన్నారు. ఇది మార్కెట్లో సహజమైన అంశం. అయితే ఇది పూర్తి స్థాయి క్రాష్ అని నిర్దారించలేము. ఇదొక స్లోడౌన్ దశ మాత్రమే.వెండి ధర భవిష్యత్తులో 100 డాలర్లు లేదా 120 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. దీనికి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రధాన కారణమవుతాయి.ప్రపంచం మొత్తం.. ప్రస్తుతం భారీ రుణభారంతో ఉంది. ముఖ్యంగా అమెరికా అప్పులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫెడరల్ రిజర్వ్‌కు (Fed) అందుబాటులో ఉన్న ఎంపికలు చాలా తక్కువ. ఇలాంటి సమయంలో వారు ఎక్కువ లిక్విడిటీ అందించడం, అంటే మరింత డబ్బు ముద్రించడానికి సిద్దపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే డాలర్ విలువ బలహీనపడే అవకాశం ఉంటుంది.డాలర్ విలువ ఎప్పుడైతే పడిపోతుందో.. బంగారం, వెండి ధరలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి ఇప్పటికే బంగారం లేదా వెండి కలిగి ఉన్నవాళ్లు దాన్ని నిల్వ చేసుకోండి. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే కొత్తగా గోల్డ్, సిల్వర్ కొనాలనుకుంటే.. తప్పకుండా ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. ప్రస్తుతం ధరలు చౌకగా లేవు. ఎప్పుడైనా ఎక్కువ ధర వద్ద పెట్టుబడి పెట్టడం వల్ల మూలధన నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి త్వరగా ధనవంతులు కావాలని తొందరపడకూడదు. కొంత ఓపిగ్గా ఎదురు చూడండి అని.. అంకిత్ యాదవ్ వివరించారు.🚨 Big update: Gold & Silver 🩶💛✅Globally, gold and silver are slowly coming out of the high‑volatility phase. The craze to buy silver at any price is clearly cooling off – one small slowdown or mini‑crash and people’s attention has already shifted.While prices were rising…— Ankit Yadav (@ankit_investing) February 14, 2026 -
కాపర్ మరో సిల్వర్ కానుందా?.. సంక్షోభం ఆసన్నమైందా?
దేశీయంగా, అంతర్జాతీయంగా రాగి మార్కెట్‌పై ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. 2025లో వెండి ధరలు 150 శాతం వరకు ఎగసిన నేపథ్యంలో, రాగి కూడా అదే బాట పట్టే అవకాశముందా అన్న ప్రశ్న ఇన్వెస్టర్లలో చర్చనీయాంశంగా మారింది.ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు2026 ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం, రాగి ఉత్పత్తిలో స్థిరత్వం కనిపించడం లేదు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తాత్కాలిక దేశీయ రాగి ఉత్పత్తి 3.33 మిలియన్ టన్నులు. 2023–24లో ఇది 3.78 మిలియన్ టన్నులకు పెరిగింది. అయితే 2024–25లో మళ్లీ 3.56 మిలియన్ టన్నులకు పడిపోయింది.రాగి సాంద్రత (కాన్సన్ట్రేట్) ఉత్పత్తిలో కూడా ఇదే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. 2022–23లో 1,12,745 టన్నులు ఉండగా 2023–24లో 1,25,230 టన్నులకు పెరిగింది. కానీ, 2024–25లో 1,05,012 టన్నులకు క్షీణించింది.తగ్గుతున్న ధాతు గ్రేడ్లురాగి గనుల్లో సగటు ధాతు గ్రేడ్లు క్రమంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం అనేక గనులు 0.4–0.6 శాతం మాత్రమే దిగుబడితో పనిచేస్తున్నాయి. అంటే ఒక టన్ను రాగి కోసం వందల టన్నుల రాతిని తవ్వి ప్రాసెస్ చేయాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి.ఆర్థిక సర్వే ఉదాహరణగా 1 గిగావాట్ విండ్ టర్బైన్ ప్రాజెక్ట్‌ను పేర్కొంది. దీనికి సుమారు 2,866 టన్నుల రాగి అవసరం. 0.6 శాతం దిగుబడి వద్ద దాదాపు 4.7 లక్షల టన్నుల రాగి ధాతువును ప్రాసెస్ చేయాల్సి ఉంటుందని అంచనా. వ్యర్థ రాయి కలుపుకుంటే మొత్తం తరలింపు 10 లక్షల నుంచి 20 లక్షల టన్నుల వరకు ఉండొచ్చని నివేదిక చెబుతోంది.పెరుగుతున్న డిమాండ్రాగి వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. వైర్లు, మోటార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, డేటా సెంటర్ల శీతలీకరణ వ్యవస్థలు ఇలా.. ప్రతి రంగంలో రాగి కీలక పాత్ర పోషిస్తోంది.ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల విస్తరణతో రాగిపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది. పవర్ కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్‌గేర్, జీపీయూలు, సర్వర్లను నడిపే పవర్ డెలివరీ వ్యవస్థలకు విస్తృతంగా రాగి అవసరమవుతోంది.ధరల దిశ2025లో కీలక లోహాల్లో రాగి ధరలు గణనీయంగా పుంజుకున్నాయి. మెటల్ ధరల సూచీలో ఇది సంవత్సరానికి 32 శాతం పెరుగుదల నమోదు చేసింది. సరఫరా పరిమితులు, పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రాబోయే కాలంలో ధరలపై మరింత ఒత్తిడి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భవిష్యత్తు ఎలా?వెండి లాగా 150 శాతం పెరుగుతుందా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోయినా, రాగి మార్కెట్లో బుల్లిష్ సంకేతాలు కనిపిస్తున్నాయి. శక్తి పరివర్తన, విద్యుతీకరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ.. ఈ మూడు ధోరణులు కొనసాగితే రాగి ధరలు మధ్యకాలంలో మరింత ఎగిసే అవకాశాన్ని నిపుణులు కొట్టిపారేయడం లేదు.మొత్తంగా, రాగి ఇక సాధారణ పారిశ్రామిక లోహం మాత్రమే కాదు.. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు కీలక మౌలిక వనరుగా మారుతోంది. సరఫరా-డిమాండ్ అసమతౌల్యం కొనసాగితే మార్కెట్లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది!. -
బంగారం ధరల తారుమారు.. వారం రోజుల్లో ఇలా..
బంగారం ధరలు వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ నేడు (శనివారం) స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో.. గోల్డ్ రేటు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది?, సిల్వర్ రేటు ఎలా ఉంది అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో.. ఫిబ్రవరి 8న రూ. 1,56,600 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేటికి 1,57,750 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ. 1150 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,43,550 రూపాయల దగ్గర నుంచి రూ. 1,44,600 వద్దకు (1050 రూపాయలు పెరిగింది) చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు వారం రోజుల్లో 1,56,750 రూపాయల దగ్గర నుంచి రూ. 1,57,900 వద్దకు (1150 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,43,700 నుంచి 1,44,750 రూపాయలకు (1050 రూపాయలు పెరిగింది) చేరింది.చెన్నైలో ధరల విషయానికి వస్తే.. ఇక్కడ ఫిబ్రవరి 8న 1,57,310 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. ఈ రోజుకి (శనివారం) 1,58,840 రూపాయల (రూ. 1530 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 10 గ్రాముల రేటు 1,44,200 రూపాయల దగ్గర నుంచి రూ. 1,45,600 (1400 రూపాయలు పెరిగింది) వద్దకు చేరింది.సిల్వర్ ధరలుగత ఆదివారం (ఫిబ్రవరి 8) కేజీ సిల్వర్ రేటు రూ. 2.85 లక్షల దగ్గర ఉండేది. ఆ ధర ఇప్పుడు రూ. 2.80 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో కేజీ మీద రూ. 5000 తగ్గిందన్నమాట. సిల్వర్ ధరలు ఒక్కో నగరం ఒక్కో విధంగా ఉంటుంది. అయితే ఢిల్లీలో.. రేటు కొంత తక్కువగా ఉంటుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..? -
ఒక్కరోజే రూ. 20వేలు డౌన్.. తగ్గుతున్న వెండి రేటు!
బంగారం, వెండి ధరలు ఊహకందని విధంగా మారిపోతున్నాయి. గత వారంలో రూ. 3.20 లక్షలకు చేరింది సిల్వర్ రేటు.. ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ఈ రోజు (శుక్రవారం) ధర రూ. 20,000 తగ్గింది. దీంతో కేజీ రేటు రూ. 2.80 లక్షలకు చేరింది.ఫిబ్రవరి 9న రూ.3 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఆ తరువాత మూడు రోజులు స్థిరంగా ఉండి.. నేడు (ఫిబ్రవరి 13) రూ. 20వేలు తగ్గింది. రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతుందా?, పెరుగుతుందా? అనే ఆందోళన చాలామంది పెట్టుబడిదారుల్లో మొదలైంది. గ్లోబల్ మార్కెట్లో కూడా వెండి రేటు 9 శాతం తగ్గి 76.53 డాలర్ల వద్దకు చేరింది.ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. గ్లోబల్ మార్కెట్లో వస్తున్నా పరిణామాలే అని తెలుస్తోంది. ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ కూడా దీనిపై ప్రభావం చూపింది. అయితే.. భవిష్యత్తులో సిల్వర్ రేటు పెరుగుతుందని కియోసాకి వంటి నిపుణులు చెబుతున్నారు.2025 నాటి వెండి రేటుకు.. 2026 వెండి రేటుకు చాలా తేడా ఉంది. ఏడాది కాలంలో ధర రూ. 153 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరం జనవరి రూ. 90వేలు వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఈ ఏడాది జనవరి రూ.3 లక్షలు దాటేసింది. దీన్నిబట్టి చూస్తే.. వెండి రేటు ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.వెండి ధరలు పెరగడానికి కారణాలువెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు. -
మూడు పతకాలూ మనవే
న్యూఢిల్లీ: స్వదేశంలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్లో గురువారం సీనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. వ్యక్తిగతవిభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు టీమ్ ఈవెంట్లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ 362 పాయింట్లతో ప్రపంచ రికార్డు స్కోరును సాధించాడు. స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. భారత్‌కే చెందిన నీరజ్ కుమార్ 361.8 పాయింట్లతో రజతం కైవసం చేసుకోగా... అఖిల్ షెరాన్ 343.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఐశ్వర్య ప్రతాప్, నీరజ్, అఖిల్‌లతో కూడిన భారత బృందం 1769 పాయింట్లతో టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్లు అడ్రియన్ కర్మాకర్ 353.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని... మానవేంద్ర సింగ్ షెఖావత్ 338.6 పాయింట్లతో కాంస్య పతకాన్ని నెగ్గారు. అడ్రియన్ కర్మాకర్, మానవేంద్ర సింగ్, ప్రిన్స్‌లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1741 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించింది. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు భారత షూటర్లు 38 స్వర్ణాలు, 16 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి 70 పతకాలు సాధించారు. -
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఇవాళ రేట్లు ఎంతంటే..?
-
ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!
ప్రఖ్యాత ఆర్థిక రచయిత, వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి తన పేరుతో సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఏఐ ఆధారిత నకిలీ (డీప్‌ఫేక్) వీడియోల గురించి హెచ్చరించారు. ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత అయిన కియోసాకి, తాను గతంలో “రియల్ ఎస్టేట్ గైస్ సెమినార్ అట్ సీ” టీ-షర్ట్ ధరించిన విషయం నిజమేనని తెలిపారు. అయితే యూట్యూబ్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న, అదే టీ-షర్ట్ ధరించి ఉన్నట్లు చూపిస్తున్న కొన్ని వీడియోలు ఏఐ ద్వారా సృష్టించిన నకిలీవని స్పష్టం చేశారు. ఆ వీడియోల్లో ఉన్న సందేశాలు కూడా అసత్యమని ఆయన పేర్కొన్నారు.“టీ-షర్ట్ నిజమే, సెమినార్ కూడా నిజమే. కానీ వీడియోలు, సందేశాలు ఏఐతో సృష్టించిన నకిలీలు” అని కియోసాకి (Robert Kiyosaki) సోషల్ మీడియాలో వెల్లడించారు. డీప్‌ఫేక్ సాంకేతికత కృత్రిమ మేధస్సు (AI)ను ఉపయోగించి నిజమైన వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా కనిపించే నకిలీ వీడియోలను రూపొందిస్తుంది. ఇటీవలి కాలంలో ఈ సాంకేతికతను ఉపయోగించి ప్రముఖుల పేరుతో మోసపూరిత పెట్టుబడి ప్రకటనలు రూపొందించే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ తరహా నకిలీ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కియోసాకి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకంటే సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు.అదేవిధంగా, ఈ సందర్భాన్ని ఉపయోగించి ఆయన తన ఆర్థిక దృక్పథాన్ని మరోసారి ప్రస్తావించారు. ప్రభుత్వ ఫియాట్ కరెన్సీని “నకిలీ డబ్బు”గా పేర్కొంటూ, బంగారం, వెండి, రియల్ ఎస్టేట్, బిట్‌కాయిన్, ఈథిరియం వంటి “నిజమైన ఆస్తుల్లో” పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, నిజమైన సమాచారాన్ని నకిలీ కంటెంట్ నుండి వేరు చేయడం సాధారణ ప్రజలకు కష్టతరమవుతోంది. అందువల్ల పెట్టుబడులకు సంబంధించిన వీడియోలు లేదా ప్రకటనలను అధికారిక వనరుల ద్వారా ధ్రువీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.FYI: if you see YouTube videos with me wearing a Real Estate Guys Seminar at Sea T-shirt on….the T - shirt is real and so is the seminar.The problem is the videos are AI Fakes. So are the messages.Why someone waste their time doing fake AI videos is beyond me.To those…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 11, 2026 -
‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు!
బంగారం షాపులో నగదు చెల్లించి నచ్చిన నగను కొనుక్కుంటాం. అద్దాల షోరూమ్‌లో విద్యుత్ కాంతుల మధ్య తళతళలాడే ఆ బంగారు ఆభరణాలను చూసి మురిసిపోతాం. కానీ, ఆ మెరుపు వెనుక.. వందల మంది కార్మికుల చెమట చుక్కలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఆ హొయల వెనుక.. వేల అడుగుల లోతులో పేలే బాంబుల మోత, ఊపిరాడని గనుల్లో ఉక్కపోత ఉందని చాలా మందికి తెలియదు కదా.. ఒక చిన్న ఉంగరం మన వేలికి చేరడానికి ముందు అది ఒక కఠినమైన శిల. ఆ శిల నుంచి స్వచ్ఛమైన పసిడిని ఒడిసి పట్టుకోవడానికి ప్రకృతితో చేసే యుద్ధమే ఈ ‘బంగారు ప్రయాణం’. బంగారాన్ని గనుల్లో నుంచి ఎలా వెలికితీస్తారో.. ఆభరణాల రూపంలోకి ఎలా మారుస్తారో తెలుసుకుందాం.అన్వేషణ, మైనింగ్బంగారం ఎక్కడ ఉందో గుర్తించడం మొదటి దశ. దీన్ని ప్రోస్పెక్టింగ్ అంటారు. భూగర్భంలో బంగారం నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించిన తర్వాత మైనింగ్ ప్రారంభమవుతుంది. బంగారం భూమిపై పొరల్లోనే ఉన్నప్పుడు పెద్ద గుంతలు తవ్వి వెలికితీస్తారు. దీన్ని ఓపెన్ పిట్ మైనింగ్ అంటారు. బంగారం చాలా లోతులో ఉన్నప్పుడు సొరంగాలు తవ్వి, పేలుళ్ల సాయంతో ముడి ఖనిజాన్ని బయటకు తీస్తారు. దీన్ని అండర్‌గ్రౌండ్ మైనింగ్ అంటారు.ముడి ఖనిజాన్ని పొడి చేయడంగనుల నుంచి సేకరించిన పెద్ద రాళ్లను క్రషర్స్ యంత్రాల్లో వేసి చిన్న ముక్కలుగా మారుస్తారు. ఆ తర్వాత వాటిని చిన్న స్పటికాల పరిమాణంలోకి, ఆపై మెత్తటి పౌడర్‌లాగా పిండి చేస్తారు. ఈ పొడిలోనే అతి సూక్ష్మమైన బంగారు రేణువులు దాగి ఉంటాయి.బంగారం వేరు చేయడంపొడి చేసిన మట్టి నుంచి బంగారాన్ని వేరు చేయడానికి ప్రధానంగా కొన్ని పద్ధతులను ఉపయోగిస్తారు.సైనైడ్ లీచింగ్: ఈ పౌడర్‌కు సోడియం సైనైడ్ ద్రావణాన్ని కలుపుతారు. ఇది బంగారాన్ని ద్రవ రూపంలోకి మారుస్తుంది. ఆ తర్వాత జింక్ పౌడర్ లేదా యాక్టివేటెడ్ కార్బన్ ఉపయోగించి బంగారాన్ని తిరిగి ఘన రూపంలోకి మారుస్తారు.గ్రావిటీ సెపరేషన్: బంగారం బరువు ఎక్కువగా ఉండటం వల్ల నీటి ప్రవాహం ద్వారా తేలికపాటి మట్టిని కొట్టుకుపోయేలా చేసి బంగారు రేణువులను కిందకు చేరేలా చేస్తారు.స్మెల్టింగ్పైన తెలిపిన ప్రక్రియలో వచ్చిన బంగారాన్ని (దీన్ని డోర్ అని పిలుస్తారు) దాదాపు 1064 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కరిగిస్తారు. ఈ దశలో బంగారం నుంచి ఇతర లోహాలు వేరవుతాయి. ఇక్కడ వచ్చే పసిడి 100% స్వచ్ఛంగా ఉండదు. ఇందులో వెండి లేదా రాగి కలిసి ఉంటాయి. వీటిని బార్స్ రూపంలోకి మారుస్తారు.శుద్ధీకరణ(రిఫైనింగ్)చివరి దశలో బంగారాన్ని పూర్తిస్థాయిలో శుద్ధి చేయడానికి మిల్లర్ ప్రక్రియ లేదా వోల్విల్ ప్రక్రియ వాడతారు. ఈ ప్రక్రియల్లో క్లోరిన్ గ్యాస్‌ను ఉపయోగించి ఇతర మలినాలను తొలగిస్తారు. దీని ద్వారా 99.9% (24 క్యారెట్) స్వచ్ఛమైన బంగారం లభిస్తుంది.ఆభరణాల తయారీచివరిగా ఈ స్వచ్ఛమైన బంగారానికి కొంత మోతాదులో రాగి లేదా వెండిని కలిపి (సాధారణంగా 22 క్యారెట్లు) నచ్చిన ఆభరణాలుగా మలుస్తారు.ఒక గ్రాము బంగారాన్ని పొందడానికి దాదాపు ఒక టన్ను ముడి ఖనిజాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అందుకే బంగారం అంత విలువైనది!ఇదీ చదవండి: భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే.. -
రూట్ మార్చిన బంగారం, వెండి.. ఇవాళ ఎంత పెరిగిందంటే
-
రాధికాగుప్తాను ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలు ఇవే..
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత, అనిశ్చితి నేపథ్యంలో ఏ ఫండ్‌ను ఎంచుకోవాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అనే గందరగోళం పెట్టుబడిదారుల్లో పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా పెట్టుబడిదారులకు దిశానిర్దేశం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కొన్ని సూచనలు చేశారు.ఇటీవలి కాలంలో ‘నా దగ్గర రూ.30,000 ఉన్నాయి. వెండి కొనాలా? ఏ ఫండ్ తీసుకోవాలి?’ వంటి ప్రశ్నలు తనను ఎక్కువగా అడుగుతున్నారని ఆమె పేర్కొన్నారు. తక్షణ పరిష్కారాల కోసం వెతకడం కంటే సరైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవడానికి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు.ప్రాథమిక అవగాహన ముఖ్యంచాలామంది ఫైనాన్స్ గురించి కనీస అవగాహన లేకుండానే నేరుగా ఫండ్స్ కొనుగోలు చేయాలని ఆరాటపడుతుంటారు. దీన్ని ఆమె ‘శ్వాస తీసుకోవడం నేర్చుకోకముందే డైవింగ్ చేయడం’తో పోల్చారు. పెట్టుబడి పెట్టడానికి ముందు ఆర్థిక అంశాలపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలని, దీనికోసం తన పుస్తకం ‘మ్యాంగో మిలియనీర్’ ఎంతో దోహదపడుతుందని సూచించారు.ఆర్థిక స్థితిగతులపై స్పష్టతపెట్టుబడి పెట్టే ముందు ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక వాస్తవాలను డాక్యుమెంట్ చేసుకోవాలి.మీ నెలవారీ ఆదాయం, ఖర్చులు ఎంత?ప్రస్తుత పెట్టుబడులు, అప్పులు ఏమిటి?మీ ఆర్థిక లక్ష్యాలు, వాటి కాలపరిమితి ఎంత?స్వల్పకాలికంగా నష్టాలు వస్తే భరించే శక్తి ఉందా?ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటేనే బలమైన పునాది ఏర్పడుతుందని గుప్తా అభిప్రాయపడ్డారు.నిపుణుల సలహా తీసుకోవడంమ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు లేదా క్వాలిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల సహాయం తీసుకోవాలని ఆమె కోరారు. పైన పేర్కొన్న ఆర్థిక స్పష్టతతో నిపుణులను కలిసినప్పుడు వారు మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన ప్రణాళికను రూపొందించగలరు. మీకు నమ్మకం కలిగే వరకు ఒకటి కంటే ఎక్కువ మంది నిపుణులతో మాట్లాడటంలో తప్పు లేదని ఆమె అన్నారు."I have 30,000 to invest, should I buy silver? What fund do I buy?"I am seeing a lot more friends, family, and folks in general reach out for advice on their portfolio in the last few months. It is probably because volatility is so high across asset classes, returns over the…— Radhika Gupta (@iRadhikaGupta) February 9, 2026తొందరపాటు నిర్ణయాలు వద్దుపెట్టుబడి ప్రయాణం ప్రారంభంలోనే డైరెక్ట్ స్టాక్స్, వెండి, లేదా సంక్లిష్టమైన పీఎంఎస్(ధనవంతులైన పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక పర్సనలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్) ఉత్పత్తుల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. మార్కెట్‌పై అవగాహన పెరిగే వరకు వీటి కోసం వేచి చూడటం ఉత్తమమని అభిప్రాయపడ్డారు.తప్పుల నుంచి నేర్చుకోండి‘ఇప్పుడే మొదలుపెట్టే వారు వెంటనే పని ప్రారంభించండి. తప్పులు చేసిన వారు కాసేపు విశ్రాంతి తీసుకోండి’ అని ఆమె సరళంగా వివరించారు. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఎంతోమంది మేధావులు తప్పులు చేశారని గుర్తు చేస్తూ పెట్టుబడి ప్రయాణంలో తప్పులు సహజమని పేర్కొన్నారు. మార్కెట్ దిద్దుబాట్లు అనేవి బోర్డు పరీక్షల వంటివని, అవి మనకు క్రమశిక్షణ, సహనం నేర్పుతాయని ఆమె విశ్లేషించారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
బంగారమే బిగ్ బాస్
న్యూఢిల్లీ: గోల్డ్, వెండి ఈటీఎఫ్‌లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో రూ.24,040 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రాగా, వెండి ఈటీఎఫ్‌లు రూ.9,463కోట్లను ఆకర్షించాయి. గత డిసెంబర్లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన రూ.11,647 కోట్లతో పోల్చితే రెట్టింపునకు పైగా పెరిగాయి. అంతేకాదు ఒక నెలలో ఈక్విటీ ఫండ్స్‌కు మించి బంగారం ఈటీఎఫ్‌లు పెట్టుబడులను ఆకర్షించడం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి సన్నగిల్లుతూ.. బంగారం, వెండిపైకి మనసు మళ్లుతోంది. జనవరిలో ఈక్విటీ ఫండ్స్ నికరంగా రూ.24,028 కోట్లను ఆకర్షించాయి. డిసెంబర్లో వచ్చిన పెట్టుబడులు రూ.28,054 కోట్లతో పోల్చి చూస్తే 14 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక తగ్గడం వరుసగా ఇది రెండో నెల. గతేడాది నవంబర్‌లో ఈక్విటీ ఫండ్స్ రూ.29,911 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. దీంతో పోల్చితే డిసెంబర్లో 6 శాతం తగ్గాయి. ఇక గతేడాది అక్టోబర్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.24,690 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద ఈక్విటీ పెట్టుడుల రాక మూడు నెలల కనిష్టానికి చేరింది. కమోడిటీల వైపు అడుగులు.. గత కొన్ని నెలలుగా ఈక్విటీ మార్కెట్లు ఎలాంటి రాబడులు ఇవ్వకపోగా.. బంగారం, వెండి మంచి ర్యాలీ చేస్తున్నాయని.. దీంతో కొంత మేర పెట్టుబడులు కమోడిటీల్లోకి మళ్లినట్టు వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వప్నిల్ అగర్వాల్ తెలిపారు. ఇక నుంచి ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడుల రాక క్రమంగా మెరుగుపడొచ్చని అభిప్రాయపడ్డారు. స్టాక్స్ విలువలు ఆకర్షణీయంగా ఉండడం, స్థిరీకరణ ముగియడంతో ఈ ఏడాది ఈక్విటీలు బలమైన పనితీరు చూపించొచ్చని, దీంతో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు. ⇒ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్/ పన్ను ఆదా ఫండ్స్) పథకాల నుంచి రూ.594 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ⇒ మరోవైపు డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి నికరంగా రూ.74,827 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్లో ఇదే విభాగం రూ.1.32 లక్షల కోట్లను కోల్పోవడం గమనార్హం. ⇒ హైబ్రిడ్ ఫండ్స్‌లోకి (ఈక్విటీ, డెట్ కలసిన) రూ.17,356 కోట్లు.. మల్టీ అసెట్ ఫండ్స్‌లోకి (ఈక్విటీ, డెట్, బంగారం, వెండి కలసిన) రూ.10,485 కోట్లు చొప్పున వచ్చాయి. ⇒ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని అన్ని రకాల పెట్టుబడుల విలువ (ఏయూఎం) జనవరి చివరికి రూ.81.01 లక్షల కోట్లకు పెరిగింది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి జనవరిలోనూ రికార్డు స్థాయిలో రూ.31,000 పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్, వెండికి డిమాండ్.. గోల్డ్ ఈటీఎఫ్‌లోకి రూ.24,040 కోట్లు రావడంతో.. ఫండ్స్ నిర్వహణలోని మొత్తం గోల్డ్ ఈటీఎఫ్ ఆస్తుల విలువ రూ.1.84 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.61,000 కోట్లు రావడం గమనార్హం. మరోవైపు వెండి ఈటీఎఫ్‌ల్లోకి డిసెంబర్లో రూ.9,463 కోట్లు రావడంతో.. వెండి ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తుల విలువ రూ. 1.16 లక్షల కోట్లకు పెరిగింది. డిసెంబర్లో వచ్చిన 3,962 కోట్లతో పోల్చి చూస్తే ఒక్క నెలలోనే 139 శాతం పెరిగాయి. -
తడబడిన వెండి ఎగసిన పసిడి
న్యూఢిల్లీ: అమ్మకాల ఒత్తిడికి వెండి నష్టపోగా.. కొనుగోళ్ల మద్దతుతో పసిడి ధరలు పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం వెండి కిలోకి రూ.7,500 నష్టపోయి రూ.2,64,500 లక్షలకు (పన్నులు కలుపుకుని) పరిమితమైంది. బంగారం 10 గ్రాములకు రూ.2,200 పెరిగి రూ.1,60,700 వద్ద (పన్నులు సహా) స్థిరపడింది. జ్యుయలర్లు, ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన కొనుగోళ్లు వరుసగా రెండో రోజు పసిడి ధరలు పెరగడానికి కారణమని ట్రేడర్లు తెలిపారు. బంగారం, వెండి ధరలు ఒక శ్రేణి పరిధిలో చలించొచ్చని.. ఈ మార్కెట్లు సమీప కాలానికి స్థిరీకరణ దశలోకి ప్రవేశించినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్‌కు ఒక డాలర్‌కు పైగా నష్టపోయి రూ.82.16 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయింది. బంగారం స్వల్ప నష్టంతో ఔన్స్ 5,052 డాలర్ల స్థాయిలో కదలాడింది. అమెరికాలో రిటైల్ విక్రయాలు, నిరుద్యోగ డేటా కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. -
మళ్లీ పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇలా..
భారతదేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. ఈ రోజు (మంగళవారం) ఉదయం స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,57,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,44,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి వరుసగా రూ. 1,58,780 (రూ. 870 పెరిగింది) & రూ. 1,45,550 (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతుంది.చెన్నైలో అయితే గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,060 రూపాయల వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,800 రూపాయల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఉదయం స్థిరంగా ఉన్న బంగారం ధర సాయంత్రానికి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 158930 రూపాయల (రూ. 870 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,700 రూపాయల (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచింది.వెండి ధరలుఉదయం కేజీ వెండి రేటు రూ. 2.90 లక్షల వద్ద ఉండేది. అయితే సాయంత్రానికి ఆ రేటు రూ. 3లక్షలకు చేరింది. అంటే కేజీ ధర గంటల వ్యవధిలో రూ. 10వేలు పెరిగిందన్నమాట. -
బంగారానికి బదులుందా? బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఏది?
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల విషయమై తన అభిప్రాయాలను మరోసారి స్పష్టం చేశారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్.. మూడింటినీ కలిపి పెట్టుబడులు పెట్టడం మంచిదేనని చెప్పిన ఆయన, ఒక్క ఆస్తినే ఎంచుకోవాల్సి వస్తే మాత్రం తాను బిట్‌కాయిన్‌కే ప్రాధాన్యం ఇస్తానన్నారు.ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో, బిట్‌కాయిన్‌కు ఉన్న పరిమిత సరఫరానే దాని అతిపెద్ద బలమని కియోసాకి వివరించారు. బంగారం ధర పెరిగినప్పుడు మరిన్ని గనులు తవ్వడం ద్వారా సరఫరా పెరిగే అవకాశం ఉందని, తాను స్వయంగా గోల్డ్ మైనర్ కావడంతో ఇది తనకు తెలుసని అన్నారు.“బంగారం ధర పెరిగితే మరిన్ని గనులు తవ్వుతారు. అంటే సరఫరా పెరుగుతుంది. కానీ బిట్‌కాయిన్ విషయంలో అలా కాదు. దాని డిజైన్ ప్రకారం గరిష్టంగా 21 మిలియన్ బిట్కాయిన్లే ఉంటాయి” అని కియోసాకి (Robert Kiyosaki) తెలిపారు. బిట్‌కాయిన్ ప్రోటోకాల్ ప్రకారం 21 మిలియన్లకు మించి ఒక్క బిట్‌కాయిన్ కూడా సృష్టించలేమని, ఆ స్థాయికి మెల్లగా చేరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విధమైన నిర్మాణాత్మక కొరత బిట్‌కాయిన్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుందని అన్నారు.ఇది చదివారా? కియోసాకీకి కోపమొచ్చింది!“21 మిలియన్ల తర్వాత కొత్త బిట్కాయిన్లు రావు. ఇది అద్భుతమైన డిజైన్. అందుకే దీర్ఘకాలంలో బిట్‌కాయిన్ ధర పెరుగుతుందని నేను నమ్ముతున్నాను” అని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను బిట్‌కాయిన్‌ను ప్రారంభ దశలోనే కొనుగోలు చేశానని, అదే సమయంలో గోల్డ్ మైనింగ్, చమురు తవ్వకాలు వంటి సంప్రదాయ పెట్టుబడులను కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు.ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల నుంచి రక్షణనిచ్చే “హార్డ్ అసెట్స్”కే తాను మద్దతు ఇస్తానని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. అయితే నిపుణులు మాత్రం, కేవలం కొరత మాత్రమే ధరలు పెరగడానికి హామీ ఇవ్వదని, డిమాండ్, నియంత్రణలు, మార్కెట్ ఊగిసలాటలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు.అయినప్పటికీ, బిట్‌కాయిన్‌ను బంగారానికి ప్రత్యామ్నాయంగా చూసే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని కియోసాకి వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.I am often asked:Which is a better investment?Gold or Bitcoin.Obviously I would say both for diversification of assets and add silver.Yet if I had to choose only one asset I would choose Butcoin.Why?Because gold is in theory infinite. When the price of gold rises…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 9, 2026 -
రిస్క్ లేకుంటే రాబడి లేదు!
క్యాలెండర్ మారి నెల దాటిపోయింది. ఫిబ్రవరి కూడా గడిచిపోతోంది. ఈక్విటీలు స్థిరంగా లేవు. ఇండెక్స్‌లు ఆల్‌టైమ్ గరిష్ఠాలకు దగ్గర్లో కనిపిస్తున్నా.. 80–90 శాతం షేర్లు కనిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఇక ఎఫ్డీలను చూస్తే వడ్డీలు తగ్గి రాబడుల్లేవు. సురక్షితమని బంగారం, వెండి వంటి లోహాలవైపు వెళితే... వాటి ఎగుడుదిగుళ్లకి ఊపిరాడని పరిస్థితి. మొత్తంగా ఇప్పటివరకూ 2026 చెబుతున్నదొక్కటే. రిస్క్ తీసుకోకుంటే రాబడుల్లేవు. అలాగని రిస్క్ తీసుకున్నా నిద్ర లేదు. మరేం చేద్దాం? ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితమైన దారేది? కనీసం ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనిచ్చే సాధనాలేంటి? వీటి విశ్లేషణే ఈ వారం ‘వెల్త్ ప్లస్’ స్టోరీ...కొందరిది రిస్క్‌కు దూరంగా ఉండే ధోరణి. కొందరిదైతే దూకుడుగా రిస్క్ గురించి ఆలోచించకుండా ముందుకెళ్లే ధోరణి. వాస్తవానికి ఇలాంటి ఏకపక్ష విధానాలు ఎప్పుడో తప్ప కలిసిరావు. ఈ సంవత్సరం ఇలాంటి విధానాలు అస్సలు కలిసొచ్చేలా లేవు. కాబట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తమ పెట్టుబడుల సామర్థ్యం, కాల వ్యవధి, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ సాధనాల మధ్య కేటాయింపులు సమతుల్యం చేసుకోవాలి. ‘బ్యాలన్స్’గా నడుచుకోవడం తప్పనిసరి. ఎందుకంటే గతేడాది కూడా (2025–26లో) సంప్రదాయ ఎఫ్డీలు ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడులను ఇవ్వలేకపోయాయి. ఈక్విటీ మార్కెట్లలో ఆటుపోట్లూ పెరిగాయి. జీడీపీలో ఆర్థిక పొదుపులు 47 ఏళ్ల కనిష్టానికి చేరాయి. జీవన వ్యయాలేమో పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలకిది పెద్ద సవాలే. కాబట్టి ఏం చేయాలంటే...వేటి ప్రాధాన్యం వాటిదే..మనం ఆహారంలో భాగంగా బియ్యం/గోధుమలకే పరిమితం కాలేం. కూరగాయలు, పండ్లు, పప్పులు, గుడ్లు, మాంసం ఇలా అన్నింటినీ తీసుకుంటాం. ఎందుకంటే ఒక్కోదానిలో ఉండే పోషకాలు వేరు. సమతుల్య ఆహారం మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుంది. పెట్టుబడులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. తమ నికర ఆర్జన ఎంత? అందులో ఖర్చులు ఎంత? మిగిలేది ఎంత? భవిష్యత్ లక్ష్యాలు ఏవి? వాటికి ఎంత మొత్తం సమకూరాలి? ఇందుకోసం ఎంత రాబడి అవసరం? ఈ అంశాల ఆధారంగా ఎఫ్డీలు/డెట్ ఫండ్స్–ఈక్విటీలు–పసిడి/వెండి ఇలా వివిధ సాధనాలకు కేటాయింపులు చేసుకోవాలి. దీన్నే అసెట్ అలోకేషన్ అని కూడా అంటుంటారు. ఏదో ఒక సాధనం కాకుండా, స్వల్పకాల అవసరాల కోసం డెట్, మధ్య కాల అవసరాలకు డెట్–ఈక్విటీ, దీర్ఘకాల అవసరాలకు ఈక్విటీ, బంగారం సాధనాలకు కేటాయింపులు ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల వైవిధ్యం ఉంటుంది. ఒక విభాగంలో ప్రతికూలతలు ఉన్న సమయంలో మరో విభాగంలోని పెట్టుబడులు మంచి పనితీరుతో ప్రయోజనం పొందొచ్చు. వేటికి ఎంత..? సంపాదనలో 35 శాతం అయినా (మూడింట ఒక వంతు) ఆదా చేయాలి. ఆదా చేసిన మొత్తంలో 30–35 శాతాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా చిన్న మొత్తాల పొదుపు పథకాలు, లేదా లిక్విడ్, మనీ మార్కెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.కనీసం 50–60 శాతాన్ని ఈక్విటీల్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవాలి. బంగారం, వెండిలో 10–15 శాతం మించకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ, బంగారం, వెండిపై పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) మంచి సాధనం. రక్షణ–రాబడులుఎఫ్డీలు, డెట్ ఫండ్స్‌తో సంపద సృష్టి సాధ్యం కాదు. కానీ, పెట్టుబడికి రక్షణ ఉంటుంది. స్వల్పకాలంలో పెట్టుబడి కాపాడుకోవడమే ముఖ్యం.ఈక్విటీలతో సంపద సృష్టి సాధ్యం. అది దీర్ఘకాలంలో, క్రమశిక్షణతో నడుచుకున్నప్పుడే.కమోడిటీలు మిగిలిన పెట్టుబడులకు హెడ్జింగ్‌గా పనిచేస్తాయి. అదే సమయంలో మెరుగైన రాబడికీ మార్గం చూపుతాయి. ప్రీమియం లోహాలు..బంగారం, వెండి ర్యాలీ ఏ స్థాయిలో ఉంటుందో గత కొన్నేళ్ల అనుభవాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో అయితే పసిడి, వెండి ధరలు రెట్టింపయ్యాయి. దీన్ని చూసి ఇన్వెస్టర్లు పసిడి, వెండిలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. కాకపోతే ఈ ఏడాది ఊగిసలాట మామూలుగా లేదు. తాజాగా వెండి గరిష్ఠానికి చేరటం... భారీగా పతనమవటం అంతా నెలలో జరిగిపోయింది. మిగిలిన పెట్టుబడి సాధనాల నుంచి వైదొలిగి మొత్తం వీటిలోనే కుమ్మరించిన వారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నది వీటికీ వర్తిస్తుంది. బంగారం, పసిడి ఏటా స్థిరంగా రాబడినిస్తాయన్న భరోసా లేదు. ఇవి ఒక సైకిల్ ప్రకారం చలిస్తుంటాయి. కొన్నేళ్ల పాటు అతి తక్కువ రాబడి, స్థిరీకరణ తర్వాత కొద్ది కాలంలోనే ఎక్కువ ర్యాలీ చేయడం వీటి స్వభావం. కనుక ఏటా స్థిరంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే మెరుగైన విధానం.స్టాక్స్‌లో మాదిరి వీటిపై డివిడెండ్, బోనస్‌లు వంటివేవీ ఉండవు.బంగారం కంటే వెండిలో ఆటుపోట్లు ఎంతో ఎక్కువ. ఆర్థిక వ్యవస్థలు గొప్పగా పనిచేస్తున్న కాలంలో ఇవి దీర్ఘకాలం పాటు ర్యాలీకి దూరంగా ఉంటాయి. ఇన్వెస్టర్ల హెడ్జింగ్ కోసం, సెంట్రల్ బ్యాంకుల మారకం నిల్వల స్థిరత్వానికి పసిడికి డిమాండ్ ఎక్కువ. పారిశ్రామిక వినియోగం, ఇన్వెస్టర్ల పెట్టుబడిగానూ వెండికి డిమాండ్ పెరుగుతోంది.కానీ, ఇప్పటి వరకు చరిత్ర చూస్తే 1950 నుంచి ఇప్పటి వరకు పసిడి, వెండిపై రాబడి 10–11 శాతం (వార్షికంగా) చొప్పున ఉంది.పసిడి, వెండిపై పెట్టుబడులకు చార్జీలు, లిక్విడిటీ పరంగా ఈటీఎఫ్‌లు లేదా మ్యూచువల్ ఫండ్స్ పథకాలే మెరుగైనవి. ఫిక్స్డ్ డిపాజిట్లు భద్రమే కానీ..ఎఫ్డీలపై 6.5–7 శాతం రాబడి పేపర్‌పై కనిపించేంత వరకే. మన దగ్గర ద్రవ్యోల్బణం సగటున 5–6 శాతం మధ్య ఉంటోంది. అంటే ఎఫ్డీ ఇచ్చిన రాబడిని ద్రవ్యోల్బణమే తినేస్తున్నట్లు లెక్క. ఇక ఇన్వెస్టర్‌కు మిగిలేది ఏముంటుంది? కొన్ని సందర్భాల్లో ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటిపోతోందన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉంటే ఎఫ్డీఐపై వచ్చే 6–7 శాతం రాబడిపై కూడా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు అసలు రాబడి రాకపోగా... పన్ను అనంతరం స్వల్పంగా నష్టపోవాల్సి వస్తుంది. దీనివల్ల కాలానుగుణంగా ఆ డిపాజిట్‌కు ఉన్న విలువ తగ్గిపోతుందని గమనించాలి. ఫిక్స్డ్ డిపాజిట్ అన్నది ఎంతో సులభమైన పెట్టుబడి సాధనం. కాల వ్యవధి తీరే నాటికి ఎంత వస్తుందన్నది ముందుగానే తెలిసిపోతుంది. పైగా ఇంటి సమీపంలోని బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకుని, కావాల్సినప్పుడు అదే రోజు వెనక్కి తీసుకోగల సౌలభ్యం ఉంటుంది. ఎఫ్డీలో పెట్టుబడికి భద్రత ఎక్కువ. ఒక డిపాజిటర్‌కు ఒక బ్యాంక్ పరిధిలో రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది కనుక నిశ్చింత ఎక్కువ. కానీ, భద్రత కోసమని, సౌకర్యం ఉందని చెప్పి నికరంగా రూపాయి కూడా రాబడి లేని (ఎఫ్డీ రేటు నుంచి ద్రవ్యోల్బణం తీసేయగా) సాధనంలో ఉన్నదంతా పెట్టేస్తే ముఖ్యమైన లక్ష్యాలను సాధించడమెలా అన్నది ఆలోచించాలి. పైగా ఆర్బీఐ ఇటీవలి కాలంలో 1.25 శాతం మేర రెపో రేటును తగ్గించేసింది. భవిష్యత్తులోనూ తగ్గించొచ్చు. అలాంటప్పుడు ఎఫ్‌డీఐలపై రాబడి మరింత తగ్గిపోతుందని అర్థం చేసుకోవాలి. కాలానుగుణంగా మన పెట్టుబడి విలువ కూడా పెరగాలి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా విద్య, వైద్యం, గృహ అద్దె, నిత్యాసవరాల ధరలు కూడా పెరుగుతుంటాయి. ఈ స్థాయిలో లేదంటే ఇంతకుమించి పెట్టుబడిని వృద్ధి చేసుకోవాల్సిందే. ఇక్కడే ఈక్విటీల పాత్ర కీలకం అవుతుంది. ఈక్విటీలు మెరుగే కానీ..ఈక్విటీలు ఇతర సంప్రదాయ సాధనాలకు మించి రాబడులను ఇస్తాయన్నది చారిత్రక వాస్తవం. కానీ, అది దీర్ఘకాలంలోనే సాధ్యం. పదేళ్లకు మించిన కాలంలో ఈక్విటీ ఫండ్స్‌లో రాబడి 12– 15 శాతం మధ్య ఉంది. స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో అయితే ఈ రాబడి 30 శాతం వరకు ఉంది. స్వల్పకాలానికి ఈక్విటీల పనితీరు ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ఆర్థిక వృద్ధి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితులు, కరెన్సీ విలువలు, దేశాల రుణ భారాలు, వడ్డీ రేట్లు, వాతావరణ మార్పులు ఇలా ఎన్నో అంశాల ఆధారంగా ఈక్విటీలు కదులుతూ ఉంటాయి. ఇలాంటి ప్రతికూలతలను జీర్ణం చేసుకుంటూ మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన పనితీరు చూపిస్తుంటాయి.క్రమశిక్షణ, అనుభవం కలిగిన ఇన్వెస్టర్లు సైతం ఈక్విటీల పతనాలను చూసి ఆందోళన చెందుతుంటారు. ప్రతి ర్యాలీ తర్వాత దిద్దుబాటు కచ్చితంగా ఉంటుందన్నది వాస్తవం.దీంతో ఈక్విటీ పెట్టుబడులపై నిశ్చింత, ప్రశాంతత అన్నది అన్ని సందర్భాల్లో ఉండదు. ముఖ్యంగా మధ్యతరగతి ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తక్షణ రాబడుల కోసం ఫ్యూచర్స్, ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో), ఇంట్రాడే ట్రేడింగ్ వైపు అడుగులు వేస్తుంటారు. సరైన పరిశోధన, ఆయా సాధనాల పనితీరు, రిస్క్‌లు ఇవన్నీ తెలుసుకోకపోవడం ఫలితంగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఎఫ్‌డీల మాదిరి (రూ.5లక్షలు) ఈక్విటీ పెట్టుబడులకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. స్వల్పకాలంలో పెట్టుబడి విలువ కూడా తగ్గిపోవచ్చన్నది గుర్తు పెట్టుకోవాలి. ఒక్కోసారి మెరుగైన రాబడుల కోసం మార్కెట్ సైకిల్ మారే వరకూ వేచి చూడాల్సి రావచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులతో కంపెనీలు జారీ చేసే డివిడెండ్ సైతం తిరిగి పెట్టుబడిగా మారుతుంది. దీర్ఘకాలంలో కాంపౌండింగ్‌తో రాబడి మరింత ఇతోధికం అవుతుంది. లిక్విడిటీ ఎక్కువ. సులభంగా క్రయ, విక్రయాలు చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేందుకు ఈక్విటీ పెట్టుబడులు బలంగా పనిచేస్తాయి. దీంతో కొనుగోలు శక్తి తగ్గదు.ఇదీ చదవండి: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం -
2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగా
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన జ్యోతిష్కురాలు.. బాబా వంగా పేరు మరోసారి వార్తల్లో నిలిచారు. బాల్కన్ ప్రాంతపు నోస్ట్రడామస్ అని పిలువబడే ఈమె.. అనేక దేశాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రపంచ పరిణామాలపై చెప్పిన మాటలు నిజమయ్యాయని ప్రజలు నమ్మడం వల్ల ఆమె పేరు ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందింది.ప్రపంచంలోని చాలా దేశాలు.. కరెన్సీ హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం వంటివి ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో బాబా వంగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి చెప్పిన మాటలు చర్చకు దారితీసాయి. కాగితపు కరెన్సీ దాని విలువను కోల్పోతుంది. దీనివల్ల ప్రపంచంలో తీవ్రమైన నగదు కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీంతో ప్రజల్లో భయం, ఆందోళనను మొదలైపోయాయి.కరెన్సీకి ఎప్పుడైతే విలువ తగ్గిపోతుందో.. అలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి, రాగి వంటి లోహాలే భద్రమైన ఆస్తులుగా మిగులుతాయని, వాటి విలువ ఈ ఏడాది మరింత పెరుగుతుందని బాబా వంగా వెల్లడించారు.2026 ప్రారంభమైన తరువాత బంగారం ధరలు అమాంతం పెరిగి తులం రేటు రూ.1.80 లక్షలకు చేరుకుంది. వెండి ధర రూ. 4 లక్షలకు చేరింది. గోల్డ్, సిల్వర్ రేట్లు ఇంతలా పెరగడం చరిత్రలో ఎప్పుడూ కనిపించలేదని ఆర్ధిక నిపుణులు సైతం వెల్లడించారు. ఇప్పుడు పరిస్థితులు కొంత సాధారణ స్థితికి వచ్చేసాయి. దీంతో రేట్లు కూడా వరుసగా తగ్గుముఖం పట్టాయి.బాబా వంగా చెప్పిన మాటలు కేవలం అంచనా మాత్రమే. ఇవన్నీ తప్పకుండా జరుగుతాయని చెప్పలేము. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కరెన్సీ విలువ తగ్గిపోతుందని భావించి, ముందుగానే బంగారం, వెండి వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం సరైంది కాదు. అయితే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా ఓసారి ఆలోచించాలి. ఎందుకంటే.. అన్ని వేళలా లాభాలే రావు, నష్టాలను కూడా కొన్ని సార్లు భరించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆలోచించాల్సిందే! -
కియోసాకీకి కోపమొచ్చింది!
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకీ, తాను బిట్‌కాయిన్‌ను 6,000 డాలర్లకి కొనుగోలు చేశానన్న వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు స్పందించారు. బిట్‌కాయిన్ కొనుగోలు చేసిన తేదీపై అనవసరంగా దృష్టి పెట్టడం ఇన్వెస్టర్ల అసలు లక్ష్యాన్ని తప్పుదారి పట్టిస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో వరుస ట్వీట్లు చేశారు.తనను “అబద్ధం చెబుతున్నాడు” అంటూ ఆరోపించిన వ్యక్తి, బిట్‌కాయిన్‌ను ఏ తేదీన కొనుగోలు చేశానన్న అంశాన్ని ప్రశ్నిస్తున్నాడని కియోసాకీ పేర్కొన్నారు. అయితే తాను గుర్తుంచుకునేది కొనుగోలు చేసిన ధర (strike price) మాత్రమేనని, తేదీ తనకు ప్రాధాన్యం కాదని చెప్పారు.“నేను ఏ తేదీన బిట్‌కాయిన్ కొన్నానో అతడికి ఎందుకు అంత ఆసక్తి?” అని ప్రశ్నించిన కియోసాకీ, ఆ విమర్శల వెనుక వ్యక్తిగత అజెండా ఉండవచ్చని ఆరోపించారు.బిట్‌కాయిన్ ధర మళ్లీ 6,000 డాలర్లకి పడితే మరోసారి కొనుగోలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో తేదీ ఏమిటన్నది తనకు ఎలాంటి ప్రాధాన్యం లేదన్నారు. ప్రస్తుతం తాను మరింత బంగారం కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నానని కూడా వెల్లడించారు.తన విమర్శకులను ఉద్దేశించి, వారు ఎన్ని బిట్కాయిన్లు, బంగారం, వెండి లేదా ఈథీరియం కలిగి ఉన్నారో చెప్పాలని సవాలు విసిరారు. అలాగే అద్దె ఇళ్లు, చమురు బావులు వంటి వాస్తవ ఆస్తులపై కూడా ప్రశ్నించారు. “నేను ఈ ఆస్తులు ఎప్పుడు కొనుగోలు చేశానో నాకు గుర్తులేదు. కానీ వాటిని కొనుగోలు చేశానన్నది మాత్రం ఆనందంగా ఉంది” అని కియోసాకీ అన్నారు.అలాగే 2026 సంవత్సరానికి చెందిన 60 అమెరికన్ సిల్వర్ ఈగిల్స్ నాణేలు, 20 మిశ్రమ తేదీల గోల్డ్ ఈగిల్స్ కొనుగోలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వెండి మార్కెట్లో ఉన్న కల్లోలం కారణంగా 2026 సిల్వర్ ఈగిల్స్ భవిష్యత్తులో కలెక్టర్ కాయిన్లుగా మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.చివరగా, తనను అనుసరించే ఇన్వెస్టర్లకు కియోసాకీ ఒక సూచన చేశారు. “ఆస్తి విలువ, సంఖ్య కంటే కొనుగోలు చేసిన తేదీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. దీర్ఘకాలిక సంపద ఆస్తుల సేకరణతోనే వస్తుంది, తేదీలతో కాదు.” అని ముగించారు.To the person who said I was lying that I bought Bitcoin at $6000…. I know my strike price not the date he falsely accuses me of the date I bought Bitcoin on.Why would he care what date I bought it on?Does he have a personal agenda for calling me a liar?If Bitcoin hits…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 7, 2026 -
బంగారం, వెండి ధరల్లో ఇంతమార్పా!
బంగారం, వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. మార్కెట్లో సంచనలం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా గోల్డ్ రేటు ఏ స్థాయిలో తగ్గిందో.. అదే స్థాయిలో పెరిగింది కూడా. ఈ కథనంలో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు అంటే.. ఆదివారం నుంచి శనివారం వరకు ధరలు ఎలా మారాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఆదివారం (ఫిబ్రవరి 1) రూ. 1,60,580 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర శనివారం (ఫిబ్రవరి 7) నాటికి రూ. 1,56,600 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 3980 రూపాయలు తగ్గిందన్నమాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. రూ. 1,47,200 నుంచి రూ. 1,43,550 వద్దకు (రూ.3650 తగ్గింది) చేరింది.చెన్నైలో రూ.1,62,550 వద్ద (ఫిబ్రవరి 1) ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు శనివారం నాటికి (ఫిబ్రవరి 7) రూ. 1,57,310 వద్దకు (రూ. 5,240 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,000 నుంచి రూ. 1,44,200 వద్దకు (రూ. 4,800 తగ్గింది) చేరింది.ఇదీ చదవండి: బంగారం పింక్ పేపర్లోనే ఎందుకిస్తారో తెలుసా?.. సీక్రెట్ ఇదే!ఢిల్లీ విషయానికి వస్తే.. దేశ రాజధాని నగరంలో వారం రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు 1,60,730 రూపాయల నుంచి రూ. 1,56,750 వద్దకు (రూ. 3980 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల రేటు కూడా రూ. 1,47,350 రూపాయల నుంచి రూ. 1,43,700 వద్దకు (రూ. 3650 తగ్గింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరల్లో కూడా భారీ మార్పు కనిపించింది. ఫిబ్రవరి 1న రూ. 3.20 లక్షల వద్ద కేజీ సిల్వర్ రేటు.. నేటికి (శనివారం) రూ. 2.85 లక్షలకు చేరింది. అంటే ఏడు రోజుల్లో కేజీ ధర రూ. 35వేలు తగ్గిందన్న మాట. -
మీ దగ్గరున్న వెండి స్వచ్ఛమైనదా, కాదా?: తెలుసుకోండిలా..
వెండి ధరలు గణనీయంగా పెరిగి.. కేజీ రేటు రూ.3 లక్షలకు చేరింది. ఇలాంటి సమయంలో కొంతమంది వ్యాపారస్తులు నకిలీ వెండి లేదా ఇతర మిశ్రమాలు ఎక్కువగా కలిసి ఉండే సిల్వర్ విక్రయించే అవకాశం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మీరు కొన్నది నిజమైనదా.. కాదా? తెలుసుకోవడం కష్టం అనుకోవచ్చు. కానీ.. కొన్ని చిట్కాల ద్వారా ఇంట్లోనే వెండిని టెస్ట్ చేసుకోవచ్చని బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. మ్యాగ్నెట్ టెస్ట్: నిజమైన వెండిని మ్యాగ్నెట్‌ను ఆకర్శించదు. ఒకవేలా మ్యాగ్నెట్ వెండిని లేదా వెండి వస్తువును ఆకర్శించిందంటే.. అది నిజమైన వెండి కాదు. అయితే ఈ పరీక్షతోనే దానిని ప్యూర్ సిల్వర్ అని నిర్దారించలేము. మరిన్ని టెస్టులు చేయాల్సి ఉంది. ఇది ఒక బేసిక్ టెస్ట్ మాత్రమే.ఐస్ టెస్ట్: ఇది నిజమైన వెండిని గుర్తించడానికి చేసే మరో టెస్ట్. సిల్వర్ అనేది మంచి ఉష్ణ వాహకం (హీట్ కండక్టర్). ఐస్ మీద వెండిని ఉంచినప్పుడు.. అది వెంటనే కరిగితే అలాంటి వెండి నిజమైనదని, ఒకవేలా ఐస్ నెమ్మదిగా కరిగితే అందులో ఇతర మిశ్రమాలు కలిసి ఉన్నయనడానికి సూచన.స్మెల్ టెస్ట్ (వాసన ద్వారా టెస్ట్): నిజమైన వెండికి ప్రత్యేకమైన వాసన ఉండదు. సిల్వర్ వస్తువును తేలికగా రుద్ది మీ ముక్కు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు.. ఏదైనా వాసన వస్తే.. అందులో ఇతర మిశ్రమాలు ఉన్నట్లు. రాగి లేదా ఇతర లోహాలను కలిపినప్పుడే వెండికి ఒక స్మెల్ వస్తుంది. దీని ద్వారా కూడా నిజమైన వెండిని గుర్తించవచ్చు.క్లాత్ టెస్ట్: వెండిని శుభ్రమైన తెల్లటి వస్త్రంతో సున్నితంగా రుద్దండి. ఆక్సీకరణ కారణంగా నిజమైన వెండి మందమైన నలుపు లేదా బూడిద రంగు గుర్తులను ఏర్పరుస్తుంది. ఎటువంటి గుర్తు కనిపించకపోతే.. అలాంటిది మిశ్రమం కలిసి ఉండొచ్చు అని అర్థం చేసుకోవాలి.వాటర్ టెస్ట్: సాధారణంగా వెండి కొంత బరువుగా ఉంటుంది. కాబట్టి దీనిని నీటిలో వేయగానే వేగంగా కిందికి వెళ్తుంది. ఒకవేలా వేగంగా కిందికి వెళ్లకపోతే.. అది నకిలీదని గుర్తించాలి. వెండిలో కొన్ని లోహాలు కలిసి ఉన్నప్పుడే.. అది నెమ్మదిగా నీటి అడుగు భాగానికి చేరుకుంటుంది.సౌండ్ టెస్ట్: వెండిని ఇతర మెటల్ వస్తువుతో తాకినప్పుడు.. ఎక్కువ శబ్దం చేస్తుంది. నకిలీ వెండి అయితే.. సున్నితమైన శబ్దం చేస్తుంది.వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో కొనుగోలుదారులు.. సిల్వర్ కొనే ఆతృతలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోకపోవచ్చు. ఇలాంటి సమయంలోనే.. విక్రయదారులు వారిని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన వెండిని.. వివిధ రకాలుగా టెస్ట్ చేసి, అది నిజమైనదా.. కాదా? అని తెలుసుకోవచ్చు.వెండికి హాల్ మార్క్భారతదేశంలో బంగారు ఆభరణాలు మాత్రమే కాకుండా.. వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో కొంతమంది నకిలీ లేదా కల్తీ వెండి ఆభరణాలను విక్రయించే అవకాశం ఉంటుంది. ఈ మోసాల నుంచి వినియోగదారులను కాపాడటానికి వెండి ఆభరణాలకు కూడా హాల్ మార్క్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళన.. మైఖేల్ బరీ హెచ్చరిక!బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెండి ఆభరణాలకు 900, 800, 835, 925, 970, 990 వంటి స్వచ్ఛత స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హాల్‌మార్క్ సంఖ్యతో హాల్‌మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హాల్‌మార్కింగ్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు.హాల్‌మార్కింగ్ అంటే: బంగారు, వెండి వంటి విలువైన లోహాలతో చేసిన వస్తువుల స్వచ్ఛతను, నాణ్యతను ధృవీకరించే ప్రక్రియ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. హాల్‌మార్క్ చేసిన వస్తువులు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేస్తుంది. తద్వారా నాణ్యమైన ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. -
బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి..
“రిచ్ డాడ్ పూర్ డాడ్” రచయిత రాబర్ట్ కియోసాకి, ధరలు కొత్త మార్కెట్ దిగువ స్థాయికి చేరుకునే వరకు బిట్‌కాయిన్ (BTC), బంగారం, వెండిని మరింతగా కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లకు అసలైన ప్రమాదం ధరల ఊగిసలాట కంటే, పెరుగుతున్న అమెరికా రుణ భారం అని ఆయన అభిప్రాయపడ్డారు.‘ఎక్స్’(ట్విట్టర్)లో చేసిన పోస్ట్‌లో, అమెరికా ఆర్థిక పరిస్థితిని పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న “అత్యంత పెద్ద సమస్య”గా కియోసాకి అభివర్ణించారు. అమెరికా జాతీయ రుణం సుమారు 38 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి పథకాలతో సంబంధం ఉన్న భవిష్యత్ బాధ్యతలను కలిపితే మొత్తం భారం 250 ట్రిలియన్ డాలర్ల వరకు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. “ఫెడ్, అసమర్థ నాయకులు, నకిలీ డాలర్లతో ప్రజలను దోచుకునే క్రిమినల్ బ్యాంకర్లే అసలైన సమస్య” అని కియోసాకి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడే కొనేది లేదువెండి ధర 60 డాలర్లు, బిట్‌కాయిన్ 6,000 డాలర్లు, బంగారం 300 డాలర్లు వద్ద ఉన్నప్పటి నుంచి తాను కొనుగోలు చేయడం ఆపేశానని కియోసాకి తెలిపారు. “నేను కొన్ని బిట్కాయిన్లు, కొంత బంగారం విక్రయించాను. కానీ నాకు అమ్మడం నచ్చదు ఎందుకంటే మూలధన లాభాల పన్ను చెల్లించడం నాకు ఇష్టం లేదు” అని చెప్పారు. కొత్తగా పెట్టుబడి పెట్టే ముందు, ఈ రెండు ఆస్తుల్లోనూ కొత్త దిగువ స్థాయిల కోసం “ఓపికగా వేచి చూస్తున్నాను” అని అన్నారు.గురువారం సెషన్లో బిట్‌కాయిన్ ధర 60,100 డాలర్ల వరకు పడిపోయి, రాత్రికి 65,600 డాలర్లకు చేరింది. అయినప్పటికీ, గత 24 గంటల్లో ఇది ఇంకా 6.6% తగ్గుదలలోనే ఉంది. స్టాక్ట్విట్స్ ప్రకారం.. బిట్‌కాయిన్‌పై రిటైల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఏడాది కనిష్టానికి చేరి ‘అత్యంత బేరిష్’ జోన్లోకి వెళ్లింది. చర్చల స్థాయి మాత్రం ‘అత్యధికం’గా ఉంది.బంగారం, వెండి మార్కెట్ పరిస్థితిగురువారం రాత్రి బంగారం ఔన్స్‌కు సుమారు 4,400 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ, గత రోజుతో పోలిస్తే 1.95% లాభపడింది. అయితే, స్పైడర్ గోల్డ్ షేర్స్ ఈటీఎఫ్ (GLD) రెగ్యులర్ ట్రేడింగ్‌లో 2.66% పడిపోయిన తర్వాత, ఆఫ్టర్ అవర్స్‌లో మరో 0.92% తగ్గింది. స్టాక్‌ట్విట్స్‌లో పసిడిపై సెంటిమెంట్ ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి తగ్గింది.ఇదీ చదవండి: క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండిఇక వెండి ధరలు గురువారం రాత్రి 4.4% పెరిగి 73.8 డాలర్లకు చేరుకున్నాయి. రెగ్యులర్ సెషన్లో 15.77% పతనం తర్వాత, ఐషేర్స్ సిల్వర్ ట్రస్ట్ (SLV) ఆఫ్టర్ అవర్స్‌లో మరో 4.63% తగ్గింది. వెండి చుట్టూ రిటైల్ సెంటిమెంట్ కూడా ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి దిగింది. చర్చల తీవ్రత ‘చాలా ఎక్కువ’ నుంచి ‘ఎక్కువ’కు తగ్గింది.సమయం, సహనం కీలకంధరలు తక్కువ స్థాయికి చేరేవరకు వేచి ఉండాలని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. వెండి ధర 74 డాలర్లకి, బంగారం 4,000 డాలర్లకు పడితే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తన పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం తగినంత ఎథీరియం ఉందని, భవిష్యత్తులో ఆ వాటాను పెంచుకోవడాన్ని పరిశీలిస్తానని తెలిపారు.“లాభం మీరు కొనుగోలు చేసినప్పుడు వస్తుంది… అమ్మినప్పుడు కాదు,” అని రిచ్ డాడ్ నుంచి నేర్చుకున్న ముఖ్యమైన పాఠాన్ని ఆయన గుర్తు చేశారు. తాను మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించినప్పుడు బహిరంగంగా ప్రకటిస్తానని, ధరల ర్యాలీలను వెంబడించవద్దని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. చివరగా, ఆయన తరచూ చెప్పే “పందులు లావవుతాయి… కానీ అత్యాశ పందులు మాంసంగా మారుతాయి” అన్న మాటను మరోసారి గుర్తుచేశారు.AS I POSTED on X earlier. I stopped buying silver at $60.I stopped buying Bitcoin at $6000.I stopped buying gold at $300.I have sold some Bitcoin and some gold. I hate selling because I hate paying capital gain taxes.Today…. I wait patiently for new bottoms for gold…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 6, 2026 -
బిట్‌కాయిన్ పతనం.. మైఖేల్ బరీ హెచ్చరిక!
బంగారం, వెండి ధరలు మాత్రమే కాకుండా.. బిట్‌కాయిన్ ధర కూడా అమాంతం పడిపోతోంది. ఇది ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళనను కలిగిస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ హెజ్ ఫండ్ మేనేజర్ 'మైఖేల్ బరీ' కీలక వ్యాఖ్యలు చేశారు.బిట్‌కాయిన్ పతనం కేవలం క్రిప్టో మార్కెట్‌కే పరిమితం కాదు. ఇది బంగారం, వెండి వంటి సంప్రదాయ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని.. మైఖేల్ బరీ హెచ్చరించారు. బిట్‌కాయిన్‌లో పెద్ద నష్టాలు వస్తే, పెట్టుబడిదారులు నగదు కోసం ఇతర ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.బిట్‌కాయిన్ ఇప్పుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది. స్పాట్ బిట్‌కాయిన్ ETFలు, అలాగే కొన్ని పెద్ద కంపెనీలు తమ ట్రెజరీలో బిట్‌కాయిన్‌ను నిల్వ చేసుకోవడం వల్ల, క్రిప్టో మార్కెట్లో జరిగే మార్పులు మిగతా మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. ETFల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్తే.. ఆ ఫండ్స్ తమ వద్ద ఉన్న బిట్‌కాయిన్‌ను అమ్మాల్సి వస్తుంది. దీని వల్ల ధరలు మరింత పడిపోతాయని మైఖేల్ బరీ పేర్కొన్నారు.బిట్‌కాయిన్ మరింత పడిపోతే, మైక్రోస్ట్రాటజీ వంటి బిట్‌కాయిన్‌పై భారీగా ఆధారపడిన సంస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని బరీ హెచ్చరించారు. ముఖ్యంగా బిట్‌కాయిన్ ధర 50,000 డాలర్ల వరకు పడితే.. కొంతమంది దివాలా తీయవచ్చని, అలాగే టోకనైజ్డ్ మెటల్స్ (డిజిటల్ గోల్డ్, సిల్వర్) మార్కెట్లో కొనుగోలుదారులు తగ్గిపోతారని చెప్పారు. ఇది ఆయన చెప్పినట్లుగా ఒక 'డెత్ స్పైరల్'.. అంటే ఒక సమస్య మరో సమస్యకు దారితీసే ప్రమాదకరమైన పరిస్థితి.బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. బిట్‌కాయిన్ ద్రవ్యోల్బణానికి రక్షణగా పనిచేస్తుందనే వాదనను బరీ ఖండించారు. అంతే కాకుండా.. బిట్‌కాయిన్.. S&P 500 స్టాక్ సూచీ మధ్య పెరుగుతున్న సంబంధం కూడా ఆందోళన కలిగించే అంశంగా ఆయన పేర్కొన్నారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బరీ చెప్పిందే జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే.. గతంలో కూడా క్రిప్టో మార్కెట్ భారీ పతనాల తర్వాత వేగంగా కోలుకున్న సందర్భాలు ఉన్నాయి. కాగా బంగారం, వెండి ధరలు సాధారణంగా.. వడ్డీ రేట్లు, డాలర్ బలం, నియంత్రణ మార్పులు వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయి. కేవలం క్రిప్టో అమ్మకాల వల్ల బంగారం ధరల్లో భారీ మార్పులు సంభవించే అవకాశం లేదు.ఇదీ చదవండి: ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే! -
మళ్లీ పుంజుకున్న గోల్డ్, సిల్వర్: కొత్త ధరలు ఇలా..
జనవరి 30 నుంచి భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేటు మళ్లీ పెరుగుదల దిశగా పయనించింది. ఈ రోజు (మంగళవారం) ఉదయం రూ. 151750 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి మారిపోయింది. దీంతో పసిడి కొనుగోలుదారుల్లో మరోమారు ఒకింత ఆందోళన మొదలైంది. అయితే ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి రూ.1,53,930 (రూ.760 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,41,100 వద్ద (రూ. 700 పెరిగింది) ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఉన్నాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు వరుసగా రూ.740 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ.700 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,54,080 రూపాయల దగ్గర, 22 క్యారెట్స్ తులం పసిడి ధర రూ.1,41,250 వద్ద నిలిచాయి.చెన్నైలో గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయానికి వస్తే.. ఇక్కడ బంగారం ధర దేశంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 3,490 రూపాయలు పెరిగి రూ.1,55,670 వద్ద నిలిచింది. 22 క్యారెట్స్ తులం రేటు 3200 రూపాయలు పెరిగి రూ.1,42,700 వద్దకు చేరింది.సిల్వర్ రేటుమంగళవారం ఉదయం రూ.20 వేలు తగ్గిన సిల్వర్ రేటు.. సాయంత్రానికి అంతే పెరిగింది (రూ.20,000 పెరిగింది). దీంతో రూ. 2.80 లక్షల దగ్గర ఉన్న కేజీ వెండి రేటు రూ. 3 లక్షలకు చేరింది.ఇదీ చదవండి: జియో, ఎయిర్టెల్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే! -
పీక్‌లో వెండి ధరలు… ఒక్కసారిగా కుప్పకూలుతాయా?
వెండి ధర సగానికి పడిపోతుందా? 1980 నాటి సీన్ మళ్లీ రిపీట్ అవుతుందా ? ఇప్పుడైతే వెండి ధరలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా పీక్ స్టేజ్ లోనే ఉంది — MCXలో వెండి ధర ప్రస్తుతం సుమారు ₹3,00,000/కిలోగా ట్రేడవుతోంది. ఇలాంటి పరిస్థితిలో చాలా మంది మనసుల్లో వస్తున్న ప్రశ్న ఏమిటంటే.. 1980ల నాటి ‘వెండి పతనం’ మళ్ళీ జరుగుతుందా? ఒకప్పుడు జరిగినట్లు రాత్రికి రాత్రే ధరలు సగానికి పైగా పడిపోతాయా. 1980 లో జరిగిన వెండి పతనం ఇప్పుడు మళ్ళీ జరుగుతుందా? అనే భయం నెలకొంది. ఆ రోజు వెండి ధర ఒకే రోజులో 50 డాలర్ల నుండి 10.80 డాలర్లకి పడిపోయింది. అసలు 1980 లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. 1979-1980లో అమెరికన్ బిలియనీర్ సోదరులు ..వీళ్లను హంట్ బ్రదర్స్ అని పిలుస్తారు. వీళ్లు వెండిపై భారీ పందెం వేశారు. ఇద్దరు సోదరులు భౌతిక వెండి, ఫ్యూచర్లలో చాలా పెద్ద స్థానాన్ని నిర్మించుకున్నారు. దీంతో ప్రపంచ సరఫరాలో 50-60 శాతాన్ని నియంత్రణ లోకి తీసుకున్నారు. వీళ్లు ప్రపంచంలోనే 50 శాతం వెండి సరఫరాను నియంత్రించారు. అప్పట్లోనే వెండి ధర ఔన్సుకు 50 డాలర్లకు చేరుకున్నాయి. అయితే అప్పట్లో అమెరికన్ ప్రభుత్వం కఠినమైన నిబంధనలు నియమించింది.దీని ఫలితంగా 1980 మార్చి 27న ‘సిల్వర్ థర్స్డే’ అని పిలుస్తారు. ఇది చరిత్రలో వెండి పతనాన్ని సూచిస్తుంది.ఇక ఈ సంఘటన తర్వాత హంట్ బ్రదర్స్ దివాలా తీశారు. వెండి ధరలు చాలా సంవత్సరాలు 5-10 డాలర్ల మధ్య ఉన్నాయి. ఇక చూస్తే ఈ సంవత్సరం కూడా వెండి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కిలో వెండి రూ.3.75 లక్షలకు చేరుకుంది. అటువంటి పరిస్థితిలో వెండిలో ఇంత వేగంగా పెరుగుదల దాని పతనానికి కారణం అవుతుందని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం 1980లో జరిగినట్లు ఏ ఒక్క కంపెనీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించడం లేదు. 1980 నాటి వెండి మార్కెట్ కు నేటి వెండి మార్కెట్ చాలా భిన్నంగా ఉంది. అతిపెద్ద తేడా ఏమిటంటే ఇప్పుడు వెండి పెట్టుబడికి డిమాండ్ లేదు. సౌర ఫలకాలు, ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, వైద్య పరికరాలు సహా అన్ని రంగాలలో వెండి వినియోగం బాగా పెరుగుతోంది. ప్రపంచదేశాలు వెండిని భవిష్యత్తు అవసరాలకోసం పోగుచేసుకుంటున్నారు. దీంతో సామాన్యులకు వెండి దూరమవుతుంది. అయితే 1980 లో జరిగినట్లు రాత్రికి రాత్రే వెండి ధరలు ఢమాల్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు..ప్రపంచ ఆర్థిక అస్థిరత పెరిగితే, వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఎక్కువగా ఉంటే, డాలర్ బలపడితే లేదా పెద్ద పెట్టుబడిదారులు కలిసి లాభాల బుకింగ్ ప్రారంభించినట్లయితే, అటువంటి పరిస్థితిలో వెండి ధరలు ఒక్కసారిగా తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!
యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టిన తరువాత.. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ ప్రభావం ఈ రోజు (ఫిబ్రవరి 2) కూడా కొనసాగింది. దీంతో రేట్లు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. సోమవారం పసిడి ధర గరిష్టంగా 10370 రూపాయలు తగ్గింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయి వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
కుప్పకూలిన బంగారం, వెండి!.. కియోసాకి ట్వీట్
ధనికులు, పేదల మధ్య ప్రధాన తేడా డబ్బు కాదు, ఆలోచనా విధానమే అంటున్నారు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి'. దీనికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వాల్‌మార్ట్ వంటి వాటిలో సేల్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలావరకు పేదవాళ్లే తండోపతండాలుగా వెళ్లి.. అవసరం ఉన్నా, లేకున్నా వస్తువులు కోనేస్తుంటారు. తక్కువ ధర అని తెలియగానే.. ఇప్పుడు పోతే ఇలాంటి అవకాశం మళ్లీ రాదనే భావనతో ఖర్చు చేస్తారు. ఇది తక్షణం మాత్రమే సంతృప్తిని ఇస్తుంది.. కానీ దీర్ఘకాల లాభం ఉండదు.అయితే.. మార్కెట్లో క్రాష్ వచ్చినప్పుడు (షేర్స్, బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు తగ్గినప్పుడు) పేదవాళ్లు భయంతో తమ పెట్టుబడులను అమ్ముకుంటారు. ఇంకా పడిపోతే.. నష్టం వస్తుందనే భయమే దీనికి కారణం. ఇలాంటి సమయంలోనే ధనవంతులు కొనుగోలు చేయడానికి సిద్ధపడతారు.ధరలు పడిపోయినప్పుడు, భవిష్యత్తులో విలువ పెరిగే ఆస్తులను తక్కువ ధరకు ధనవంతులు కొనుగోలు చేస్తారు. మార్కెట్ క్రాష్ వచ్చినా వారు భయపడరు. పైగా డబ్బును పోగు చేసి లేదా ఉన్న డబ్బుతోనే.. తెలివిగా పెట్టుబడులు పెడతారు. ఇటీవల బంగారం, వెండి, బిట్‌కాయిన్ మార్కెట్లు పడిపోవడం కూడా ఇలాంటిదే. కొందరికి ఇది నష్టం లాగా కనిపించినా, మరికొందరికి ఇది గొప్ప అవకాశం.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో ఊహకందని మార్పు!ధనికులు నష్టాల్లో లాభాన్ని చూస్తారు.. పేదలు భయాన్ని చూస్తారు. మార్కెట్ పైకి వెళ్లినప్పుడు కొనడం కాదు, కింద పడినప్పుడు ధైర్యంగా నిర్ణయం తీసుకోవడమే ఆర్థిక విజ్ఞానం. డబ్బు కన్నా ముందు మన ఆలోచనలు మారితేనే, మన భవిష్యత్తు మారుతుందంటున్నారు కియోసాకి.బంగారం, వెండి & బిట్‌కాయిన్ మార్కెట్ ఇప్పుడే కుప్పకూలింది. అంటే అమ్మకానికి వచ్చింది. నేను వీటిని (గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్) కొనడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు ఏమి చేయబోతున్నారు? అంటూ కియోసాకి ట్వీట్ పూర్తి చేశారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు చెబుతారు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.DIfFERENCE BETWEEN Rich People and Poor People:When Walmart has a SALE poor people rush in and buy, buy, buy.Yet when the Financial Asset Market has a sale….a.k.a…..CRASH…the poor sell and run….while the rich rush in….and buy, buy, buy.The gold, silver, and Bitcoin…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 1, 2026 -
బంగారం, వెండి ధరల్లో ఊహకందని మార్పు!
భారతదేశంలో బంగారం ధరలు వారం ప్రారంభంలో భారీగా పెరిగి.. వారాంతంలో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి?, ఎంత తగ్గాయి?, ఎంత పెరిగాయనే.. విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.జనవరి 25న 1,60,260 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. జనవరి 31న 1,60,580 రూపాయల వద్దకు చేరింది. వారాంతంలో గోల్డ్ రేటు భారీ తగ్గినప్పటికీ.. సోమవారం నుంచి శనివారం వరకు రూ. 3,200 పెరిగినట్లు తెలుస్తోంది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 1,46,900 రూపాయల నుంచి 1,47,200 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు రూ. 3,000 పెరిగింది.చెన్నైలో సోమవారం (జనవరి 25) రూ. 1,59,490 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. శనివారం నాటికి రూ. 1,62,550 రూపాయల వద్దకు (3060 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,47,500 నుంచి రూ. 1,49,000లకు (రూ.1500 పెరిగింది) చేరింది.ఇదీ చదవండి: పేలిన గోల్డ్ బబుల్.. లీ మాటలు నిజమవుతున్నాయా?ఢిల్లీలో వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత పెరిగాయనే విషయానికి వస్తే.. జనవరి 25న 1,60,410 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం.. జనవరి 31 నాటికి 1,60,730 రూపాయల వద్దకు (3200 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల రేటు 1,47,050 రూపాయల నుంచి 1,47,350 రూపాయల వద్దకు (రూ.3000 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే వెండి ధరల్లో కూడా భారీ మార్పులు జరిగాయి. జనవరి 25న రూ.3.65 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. జనవరి 31 నాటికి రూ. 3.20 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఈ లెక్కన కేజీ ధర 45000 రూపాయలు తగ్గిందన్న మాట. -
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?
-
గంటల వ్యవధిలో.. పతనమైన బంగారం, వెండి!
గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 9000కంటే ఎక్కువ తగ్గింది. ఇదే బాటలో వెండి కూడా అడుగులు వేసింది. దీంతో ఉదయం ధరలకు.. తాజా ధరలకు చాలా మార్పు కనిపించింది.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,200 వద్ద ఉండగా, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,55,100 రూపాయల వద్ద ఉంది.ఢిల్లీ, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 169350 & రూ. 158500 వద్ద నిలిచాయి. 22 క్యారెట్ల తులం పసిడి విషయానికి వస్తే.. రూ. 155250 & రూ. 158500 వద్ద ఉన్నాయి.వెండి ధరలు రూ. 4.25 లక్షల నుంచి.. రూ. 4.05 లక్షల వద్దకు పడిపోయాయి. అంటే గంటల వ్యవధిలో కేజీ సిల్వర్ రేటు 25వేల రూపాయలు తగ్గిందన్నమాట.బంగారం ధరలపై విలియం లీ స్పందనబంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీన్ని చూసి చాలామంది గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. రేట్ల పెరుగుదల విషయంలో ప్రజలు గాబరాపడాల్సిన అవసరం లేదు. పెరిగిన ధరలకు కారణం.. ప్రపంచ రాజకీయ, సామాజిక పరిస్థితులే అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' పేర్కొన్నారు.పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉంది. అంటే గోల్డ్ రేటు ఏ సమయంలో అయినా భారీగా తగ్గిపోతుందని అన్నారు. కాబట్టి ధరలు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో బంగారం దొరకదేమో అని ఎగబడి బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.ఇదీ చదవండి: రూ.4000 విలువైన ప్రీమియం.. ఏడాదిపాటు ఉచితం! -
ఊహకందని రేటు.. రికార్డు స్థాయికి చేరిన వెండి!
బంగారం ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్న వారికి.. వెండి కూడా షాకిస్తోంది. ఏకంగా కేజీ సిల్వర్ రేటు రూ. నాలుగు లక్షలు దాటేసింది. భారతదేశంలో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఈ ఒక్క రోజే (జనవరి 29) కేజీ వెండి రేటు రూ. 25వేలు పెరిగింది. దీంతో సిల్వర్ ధర రూ. 4.25 లక్షలకు (కేజీ) చేరింది. మొత్తం మీద బంగారం వెండి ధరలు జీవితకాల గరిష్టాలను చేరుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో కూడా బంగారం, వెండి రేట్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఔన్సు వెండి రేటు తొలిసారి 5,600 డాలర్లు దాటేసింది.ధరలు పెరగడానికి కారణంబంగారం వెండి ధరలు పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య, బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే. స్టాక్ మార్కెట్ వంటి వాటిలో నష్టాలు వస్తాయనే భయంతో.. చాలామంది బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు. ఇది ధరలు పెరగడానికి కారణమైంది.ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనావెండి ధరలు పెరగడానికి కారణం పారిశ్రామిక డిమాండ్ పెరగడం మాత్రమే కాకుండా.. బలహీనమైన యూఎస్ డాలర్ సిల్వర్ రేటును అమాంతం పెంచేసిందని విశ్లేషకులు తెలిపారు. ఆర్థిక అనిశ్చితులు & పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా గోల్డ్, సిల్వర్ రేటు పెరగడానికి దొఅహదపడ్డాయని చెబుతున్నారు. -
సిల్వర్ సునామీ.. బంగారం దూకుడు..
-
కియోసాకి వెండినంతా అమ్మేసుకున్నాడా?
ప్రసిద్ద ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకికి బంగారం, వెండిపై పెట్టుబడులంటే ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. అయితే తాను వెండిని మొత్తం అమ్మి బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టానన్న వార్తలు వచ్చాయని, వాటిని ఖండించారు. అవి పూర్తిగా అసత్య ప్రచారాలు అని ఆయన స్పష్టం చేశారు.దీని గురించి రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా ‘ఎక్స్’లో ఒక పోస్టు చేశారు. వాంకూవర్‌లో జరిగిన ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఈ రూమర్ల గురించి తెలుసుకున్నానని కియోసాకి తెలిపారు. తన పెట్టుబడి వ్యూహంలో వెండికి ఇప్పటికీ ముఖ్యమైన స్థానం ఉందని, తాను ఒక్క గ్రాము వెండికూడా అమ్మలేదని చెప్పారు.అయితే, తన కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి కొంత బిట్‌కాయిన్, తరువాత కొంత బంగారం అమ్మినట్లు ఆయన అంగీకరించారు. ఆ నిర్ణయం పెద్ద తప్పు అని, ఇప్పుడు వెనక్కి చూసుకుంటే వాటిని అమ్మకపోయి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ‘దేవుడి దయ వల్ల వెండి మాత్రం అమ్మలేదు’ అన్నారు.కియోసాకి తన పెట్టుబడి తత్వాన్ని మరోసారి వివరించారు. అప్పు ఉపయోగించి పాజిటివ్ క్యాష్ ఫ్లో వచ్చే రియల్ ఎస్టేట్ కొనుగోలు చేసి, ఆ ఆదాయంతో బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఈథీరియం వంటి ఆస్తులను కొనుగోలు చేస్తానని చెప్పారు.అమెరికన్ డాలర్ వంటి ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని పునరుద్ఘాటించిన కియోసాకి, “నకిలీ డాలర్లను అమ్మి నిజమైన ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం” అని పెట్టుబడిదారులకు సూచించారు.ద్రవ్యోల్బణం, ప్రభుత్వ అప్పులు, ఆర్థిక అస్థిరతలపై కియోసాకి గతంలోనూ పలు హెచ్చరికలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో విలువైన లోహాలు, క్రిప్టోకరెన్సీలు రక్షణాత్మక పెట్టుబడులుగా ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయం.FYI SILVER Fact:I was at VRIC Vancouver Resource Investor Conference. Great event for anyone serious about their financial education on gold and silver.At VRIC I was informed there is a rumor I sold all my silver to buy more Bitcoin.This is not true. The facts are:I…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 27, 2026 -
ఇకపై సిల్వర్ రీసైక్లింగ్
ఎంఎంటీసీ–పీఏఎంపీ వెండి రీసైక్లింగ్ (పునర్వినియోగానికి అనుకూలంగా మార్చే) వ్యాపారంలోకి అడుగుపెట్టే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్ సరఫరాపరంగా తీవ్ర కొరతకు దారితీసే పరిస్థితులు ఉన్నందున వచ్చే మూడు నెలల్లో తన స్టోర్లలో ప్రయోగాత్మకంగా వెండి రీసైక్లింగ్‌ను మొదలుపెట్టనున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో సమిత్ గుహ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిమాండ్ పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయంగా సరఫరా పెరిగే పరిస్థితుల్లేవని, ఈ క్రమంలో రీసైక్లింగ్ వ్యాపారం అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఇదే డిమాండ్ ఇక ముందూ కొనసాగితే అప్పుడు శుద్ధి చేసిన వెండి కీలకపాత్ర పోషిస్తుందన్నారు. భారతీయుల వద్ద 25,000 టన్నుల బంగారం, ఇంతకు పది రెట్లు వెండి ఉన్నందున రీసైక్లింగ్‌ను ప్రభుత్వం ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ఎంఎంటీసీ–పీఏఎంపీ బంగారం రీసైక్లింగ్‌కు 20 స్టోర్లను నిర్వహిస్తోందని, వీటిని వెండి రీసైక్లింగ్‌కు వీలుగా కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందన్నారు.వచ్చే ఐదేళ్లలో స్టోర్ల సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్టు తెలిపారు. రీసైక్లింగ్‌కు అదనంగా.. దక్షిణ, తూర్పు భారత్‌లో మింటింగ్ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నట్టు సమిత్ గుహ చెప్పారు. మింటింగ్ సామర్థ్యాన్ని 2.4 మిలియన్ కాయిన్ల నుంచి 3.6 మిలియన్ల కాయిన్లకు పెంచుకోనున్నట్టు ప్రకటించారు. తన పోర్టల్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ప్లాట్‌ఫామ్‌లపై బంగారం, వెండి కాయిన్ల విక్రయాలను పెంచుకోనున్నట్టు తెలిపారు.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా? -
సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..
అంచనాలకు అందకుండా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉదయం రూ. 5400 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2840 వద్దకు వచ్చింది. అంటే దాదాపు సగం తగ్గిందన్నమాట. ఇది పసిడి ప్రియులకు కొంత ఊరటను ఇచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లో.. తాజా గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 4950 రూపాయలు పెరిగి.. రూ.1,46,400 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. సాయంత్రానికి 2350 రూపాయలు తగ్గి.. రూ. 1,44,050 వద్దకు చేరింది. అదే విధంగా 5400 రూపాయలు పెరిగి రూ. 1,59,710 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి 2560 రూపాయలు తగ్గి రూ. 1,57,150 వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. ఉదయం ధరలకు, సాయంత్రం ధరలకు ఎంత వ్యత్యసం ఉందో చూడవచ్చు.చెన్నైలో కూడా 1,46,500 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ. 1,45,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే.. 1,59,820 నుంచి 1,58,730 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,46,550 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర.. సాయంత్రానికి 1,45,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,59,860 నుంచి రూ. 1,57,150 వద్దకు చేరింది.వెండి ధరలువెండి ధరలు ఉదయం ఎలా ఉన్నాయో.. సాయంత్రానికి అలాగే ఉన్నాయి. అయితే కేజీ సిల్వర్ రేటు రూ. 3.60 లక్షలకు చేరింది. గురువారం (జనవరి 22) రూ. 3.40 లక్షల వద్ద ఉన్న వెండి.. ఈ రోజు (శుక్రవారం) రూ. 20వేలు పెరిగింది. దీంతో రేటు రూ. 3.60 లక్షల వద్దకు చేరింది. -
బంగారం, వెండి తగ్గొచ్చు పెరగొచ్చు.. కానీ..
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తుల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అన్న విషయాన్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. తాత్కాలిక మార్కెట్ ఊగిసలాటలకంటే దీర్ఘకాలిక ఆర్థిక వాస్తవాలే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈమేరకు సోషల్ మీడియాలో రాబర్ట్ కియోసాకి తాజాగా ఒక పోస్ట్ చేశారు. అమెరికా జాతీయ రుణం నిరంతరం పెరుగుతుండటం, డాలర్ కొనుగోలు శక్తి తగ్గుతుండటమే తన పెట్టుబడి దృక్పథానికి ప్రధాన కారణమని కియోసాకి తెలిపారు.“బంగారం, వెండి లేదా బిట్‌కాయిన్ ధరలు పెరుగుతాయా పడిపోతాయా అని నేను పట్టించుకోను, ఎందుకంటే అమెరికా జాతీయ రుణం పెరుగుతూనే ఉంది, అదే సమయంలో డాలర్ విలువ క్రమంగా తగ్గుతోంది” అంటూ తన ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చారు.కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వ ద్రవ్య విధానాలపై కియోసాకి చాలాకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజా వ్యాఖ్యల్లో, ఫెడరల్ రిజర్వ్, యూఎస్ ట్రెజరీ, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను “అధిక విద్య కలిగిన కానీ అర్హత లేని పీహెచ్‌డీలు” నియంత్రిస్తున్నారని విమర్శించారు.ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్‌కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని కియోసాకి తెలిపారు. పరిమిత సరఫరా ఉన్న ఈ ఆస్తులు ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదలకు రక్షణగా నిలుస్తాయని ఆయన నమ్మకం.Q: Do I care when the price of gold silver or Bitcoin go up or down?A: No. I do not care.Q: Why Not?A: Because I know the national debt of the US keeps going up and the purchasing power of the US dollar keeps going down.Q: Why worry about the price of gold, silver,…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 23, 2026 -
అప్పుడు ఇనుము.. ఇప్పుడు వెండి..
ప్రఖ్యాత ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి విలువైన లోహాలపై మరోసారి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈసారి ఆయన బంగారంతో పోలిస్తే వెండికే భవిష్యత్తులో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు.సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్టులో.. వేల సంవత్సరాలుగా బంగారం, వెండి రెండూ డబ్బుగా ఉపయోగంలో ఉన్నాయని గుర్తు చేసిన కియోసాకి, నేటి టెక్నాలజీ యుగంలో వెండి ఒక “స్ట్రక్చరల్ మెటల్”గా మారిందని అన్నారు. పారిశ్రామిక విప్లవ కాలంలో ఇనుము ఎంత కీలకమో, ఈ టెక్ యుగంలో వెండి అంతే కీలకమని పోలుస్తూ రాసుకొచ్చారు.“వెండి ఇక కేవలం డబ్బు మాత్రమే కాదు. ప్రపంచ ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత అవసరమైన లోహంగా మారుతోంది” అని కియోసాకి (Robert Kiyosaki) పేర్కొన్నారు.ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి రంగాల్లో వెండి వినియోగం వేగంగా పెరుగుతోంది. పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగం విస్తరిస్తుండటంతో వెండికి డిమాండ్ మరింత పెరుగుతుందనేది ఆయన అభిప్రాయం.ధరల విషయానికి వస్తే, 1990లో వెండి ధర ఔన్స్‌కు సుమారు 5 డాలర్లు ఉండేదని, 2026 నాటికి అది సుమారు 92 డాలర్లకి చేరిందని కియోసాకి చెప్పారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, 2026లోనే వెండి ఔన్స్‌కు 200 డాలర్ల వరకు చేరవచ్చని ఆయన అంచనా వేశారు.WHY SILVER is SUPERIORGold and silver have been money for thousands of years.But…in today’s Technology Age….silver is elevated into an economic structural metal…. much like iron was the structural metal of the Industrial Age.In 1990…silver was approximately $ 5.00 an…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 22, 2026 -
రాహు - కేతువులనూ మింగేస్తున్నారు!
సూర్య, చంద్రులను గ్రహణం రోజున రాహువు లేదా కేతువు కొంత సమయం పాటు మింగేస్తారనేది పురాణ ప్రశస్తి. అంతటి రాహు కేతువులనూ శ్రీకాళహస్తిలో టీడీపీ కూటమి శ్రేణులు మింగేస్తున్నారు. వెండి ధరలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో నాగ పడగల రూపంలో ఆలయానికి దక్కాల్సిన వెండిని పక్కదారి పట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు కనిపించడం లేదు. పాలకమండలికి చెప్పినా వినిపించుకోవడం లేదు.సాక్షి టాస్క్ ఫోర్స్: శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు–కేతు పూజలకు ఉపయోగించే వెండి నాగ పడగలను టీడీపీ కూటమి నేతలు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కొంతకాలంగా వెండి ధరలు పెరిగిపోతుండటంతో ఆలయంలో రూ.500 పూజా టికెట్లు కొని.. తద్వారా వచ్చే నాగ పడగలను బయట మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో నిత్యం రాహు–కేతు పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పూజలు చేయించుకునే భక్తుల కోసం ఆలయంలోనే రూ.500, రూ.750, రూ.2,500, రూ.5,000 డినామినేషన్లలో టికెట్లు విక్రయిస్తారు. రూ.500, రూ.750 టికెట్లు తీసుకునే భక్తులకు టెంకాయ, నల్లగుడ్డ, ఎర్రగుడ్డ, మినుములు, ఉద్దులు, పసుపు, కుంకుమ, తమలపాకు, వక్కతోపాటు 5 గ్రాముల బరువు గల రెండు (రాహు–కేతు) వెండి నాగపడగల్ని కూడా ఆలయ కౌంటర్లో భక్తులకు అందజేస్తారు. రూ.2,500, రూ.5 వేల టికెట్లు కొన్నవారికి పూజా సామగ్రితోపాటు ఒక్కొక్క టికెట్‌పై 10 గ్రాముల బరువైన రెండు వెండి నాగపడగల్ని ఇస్తారు. భక్తుల ముసుగులో రూ.500 టికెట్లు కొనుగోలు చేస్తున్న టీడీపీ కూటమి నేతలు ఆలయ కౌంటర్లలో ఇచ్చే నాగపడగల్ని జ్యూవెలరీ వ్యాపారులకు, పూజాసామగ్రిని ఆలయం బయట ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరి ఆగడాల కారణంగా ఆలయానికి దక్కాల్సిన వెండి పక్కదారి పడుతుండగా.. కూటమి శ్రేణుల జేబులు నిండుతున్నాయి. ఇలా కొట్టేస్తున్నారు: కొన్ని రోజులుగా వెండి ధర పరుగులు పెడుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.3.18 లక్షలు పలుకుతోంది. గ్రాము రూ.300 దాటింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కూటమి శ్రేణులు రూ.500 రాహు–కేతు పూజల టికెట్ కొనుగోలు చేసి, దానితోపాటు కౌంటర్లో ఇచ్చే రెండు నాగపడగల (ఒక్కొక్కటి రెండున్నర గ్రాములు) 5 గ్రాముల వెండిని బయట విక్రయించడం ప్రారంభించారు. ప్రస్తుతం గ్రాము వెండికి రూ.300 చొప్పున 5 గ్రాముల్ని జ్యూవెలరీ వ్యాపారులకు విక్రయించి రూ.1,500 పొందుతున్నారు. అంటే రూ.500 టికెట్‌పై ఇచ్చే నాగపడగలకు రూ.1,500 చొప్పున విక్రయిస్తున్నారు. అంటే ప్రతి టికెట్‌పై వచ్చే నాగపడగలకు రూ.1,000 చొప్పున ఆదాయం పొందుతున్నారు. రోజుకు ఒక్కొక్క నాయకుడు కనీసం 10 నుంచి 20 వరకు టికెట్లు కొనుగోలు చేసి తద్వారా వచ్చే నాగపడగల్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇలా ఒక్కొక్క నాయకుడు రోజుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. దీంతోపాటు టికెట్లపై ఇచ్చే పూజా సామగ్రిని తక్కువ ధరకు ఆలయం వెలుపల వ్యాపారులకు విక్రయించి అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా నాగపడగల ద్వారానే టీడీపీ కూటమి శ్రేణులు రోజుకు రూ.6–7 లక్షల వరకు వెనకేసుకుంటున్నారు. సుమారు మూడు నెలలుగా ఈ దందా సాగుతోంది.తరిగిపోతున్న వెండి కొండలుశ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు–కేతు పూజలు చేసుకుంటే సకల దోషాలు, పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి సుమారు 2 వేల కిలోల వెండి ఉంది. ప్రస్తుతం దీని విలువ సుమారు రూ.60 కోట్లు. ఈ వెండితోనే క్షేత్రంలోని మింట్‌లో వెండి పడగలు తయారు చేస్తారు. భక్తులు పూజలో ఉంచిన వెండి పడగల్ని పూజ ముగిసిన అనంతరం ఆలయ హుండిలోనే వేసేస్తారు. అలా వచ్చిన వెండి పడగల్ని ఏరోజుకారోజు సేకరించి 6 నెలలకు ఒకసారి హైదరాబాద్ తరలించి అక్కడ కరిగిస్తారు. తరుగు పోగా మిగిలిన వెండిని కడ్డీల రూపంలోకి మారుస్తారు. తిరిగి ఆ వెండి కడ్డీలను ఆలయంలోని మింట్‌కు తీసుకొచ్చి నాగపడగల్ని తయారు చేసి టికెట్ తీసుకున్న భక్తులకు కౌంటర్ల ద్వారా ఇస్తారు. భక్తులు పూజలో వినియోగించిన అనంతరం హుండీలో వేయడం ద్వారా తిరిగి ఆలయానికే వస్తుంది. కాగా.. కూటమి నేతలు భక్తుల ముసుగులో టికెట్లు తీసుకుని.. వాటిపై ఇచ్చే నాగపడగల్ని ప్రస్తుత మార్కెట్ ధరకు వ్యాపారులకు విక్రయిస్తుండటంతో ఆలయానికి చెందిన వెండి క్వింటాళ్ల కొద్దీ బయటకు పోతోంది. ఇప్పుడు వెండి ధర రోజురోజుకూ పెరిగిపోతుండటంతో కూటమి నేతలు దీనిపై దృష్టి సారించారు. ఆలయానికి రావాల్సిన వెండిని కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారు.టికెట్ కౌంటర్లను మార్చడంతోగతంలో ఆలయ ఆవరణలోని టికెట్ కౌంటర్ల వద్ద రాహు–కేతు పూజల టికెట్లు విక్రయించేవారు. వీటిపై అక్కడి సిబ్బంది, సెక్యూరిటీ నిఘా ఉండేది. కానీ.. ఇటీవల ఆలయ రెండో గేటు, సన్నిధి వీధి వద్ద ఓ టికెట్ల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ సుమారు 10 కౌంటర్లు ఉన్నాయి. టీడీపీ నేతలకి ఇదే ప్రధాన కేంద్రమైంది. కౌంటర్లలో టికెట్ మాత్రమే ఇచ్చి వెండి పడగలు, పూజా సామగ్రి పూజా మండపాల్లోనే ఇచ్చి, వాటిని మండపాల్లోనే హుండీలో వేయిస్తే తప్ప ఈ చోరీని అరికట్టడం కష్టమని చెబుతున్నారు. దళారుల దోపిడీ అధికారులకు తెలిసిందా?!శ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు పూజల కోసం కొందరు దళారులు పూజా సామగ్రి తీసుకుని.. పూజలు నిర్వహించకనే వెండి నాగ పడగలను బయట మార్కెట్లో విక్రయిస్తున్నారన్న సమాచారం అధికారుల దృష్టికి వచ్చినట్టుంది. ఈ క్రమంలో బుధవారం రాహుకేతు పూజా టికెట్లను కౌంటర్లో విక్రయించి, వెండి నాగపడగలను మాత్రం రాహు కేతు పూజా మండపాల్లోనే భక్తులకు అందజేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఒక్కరికి ఒక పూజా టికెట్ మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. దీంతో బుధవారం రూ.500 టికెట్ల రాహు కేతు పూజలు అతి తక్కువగా జరిగాయి. వెయ్యి లోపే రాహు కేతు పూజలు జరిగినట్లుగా ఆలయ అధికారులు ప్రకటించారు. గడచిన రెండు నెలల్లో రూ.500 టికెట్ల రాహు కేతు పూజలు అతి తక్కువగా నిర్వహించింది బుధవారమే. మరోవైపు, బుధవారం మొదటిసారి రాహు కేతు పూజా టికెట్లను కౌంటర్లో విక్రయించి, పూజా సామాగ్రిని మండపాల్లో అందజేశారు. -
పసిడి పరుగులు.. వెండి వెలుగులు
-
స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేటు!
స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసిన తరువాత.. బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి. మంగళవారం ఉదయం ఉన్న ధరలకు, సాయంత్రం ధరలకు పొంతన లేకుండా.. ఊహించని స్థాయికి చేరిపోయాయి. దీంతో గోల్డ్ రేటు రూ.1.50 లక్షలు క్రాస్ చేయగా.. సిల్వర్ 3.4 లక్షల వద్దకు చేరింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు మొదలైన ప్రాంతాల్లో ఉదయం రూ. 1,35,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,37,300 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 147280 రూపాయల దగ్గర నుంచి రూ. 1,49,780 వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,39,000 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 1,51,640 వద్ద నిలిచాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,37,450 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 1,49,910 వద్ద నిలిచాయి.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి రేటు కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేటు రూ. 22000 పెరిగింది. దీంతో 1000 గ్రాముల ధర 3.40 లక్షలకు చేరింది. ఈ ధరలు ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. -
సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి!
బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1.50 లక్షలకు చేరువలో ఉండగా.. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ. 3 లక్షలు దాటేసింది.పెట్టుబడిదారుల డిమాండ్, భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల కేజీ వెండి రూ.3 లక్షల రికార్డును అధిగమించాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ఔన్సు ధర ఏకంగా 94.35 డాలర్లు పెరిగింది. ఇటీవలి సెషన్లలో బంగారం కంటే వెండికి డిమాండ్ పెరుగుతోందని.. దీనికి డాలర్ విలువ తగ్గడం కూడా సహాయపడిందని నిపుణులు చెబుతున్నారు.ఈ రోజు (జనవరి 19) హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో కేజీ వెండి రేటు 8000 రూపాయలు పెరిగి, రూ. 3.18 లక్షలకు చేరింది. ముంబైలో కేజీ సిల్వర్ రేటు రూ. 10వేలు పెరిగినప్పటికీ రూ. 3.05 లక్షల వద్ద నిలిచింది. ఢిల్లీలో కూడా ఇదే రేటు వద్ద కొనసాగుతోంది.ఇదీ చదవండి: ఊహించనంతగా పెరుగుతున్న బంగారం.. కారణమెవరు?వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే?వెండిని కేవలం ఆభరణాలు, కాయిన్స్ రూపంలో మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో.. ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుదలవైపు పరుగులు పెడతాయి. -
రైల్వేలో పెద్ద స్కామ్: వెండి పతకాలను అమ్ముదామని వెళ్తే.. షాక్!
భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మక సంస్థగా గుర్తింపు పొందిన 'ఇండియన్ రైల్వే'లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక భారీ స్కామ్ కలకలం రేపుతోంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు.. కృతజ్ఞతా సూచకంగా అందించాల్సిన వెండి నాణేలు/పతకాలు రాగితో తయారైనవిగా తేలడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఈ ఘటనతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు మోసపోయినట్లు తెలుస్తోంది.రైల్వే సేవల్లో దశాబ్దాలపాటు అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో వెండి పతకాలు అందించడం ఒక సంప్రదాయం. ఇది వారి సేవలకు గుర్తింపుగా భావించబడుతుంది. అయితే ఈ పతకాలు నిజంగా వెండివేనా అనే అనుమానం మొదలై, కొందరు టెస్ట్ చేయించగా.. ఇందులో కేవలం 0.23 శాతం మాత్రమే వెండి ఉందని, మిగిలినది రాగి అని తెలిసింది.ఈ మోసం 2023 - 2025 మధ్య పదవీ విరమణ చేసిన వెస్ట్ సెంట్రల్ రైల్వేలోని భోపాల్ డివిజన్లోని వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. రైల్వేస్ 2023 జనవరి 23న ఇండోర్‌కు చెందిన ఒక కంపెనీకి 3,640 నాణేలకు ఆర్డర్ ఇచ్చింది. అందులో 3,631 నాణేలను భోపాల్‌లోని జనరల్ స్టోర్స్ డిపోకు సరఫరా చేశారు.ఒక్కో నాణెం కోసం రూ. 2200 నుంచి రూ. 2500 ఖర్చు అయినట్లు అంచనా. అయితే వెండి స్థానంలో రాగి ఉపయోగించడం వల్ల మొత్తం కుంభకోణం రూ. 90 లక్షలకు పైగా ఉందని తెలుస్తోంది. రైల్వేలు ఆ కంపెనీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, సరఫరాదారుని బ్లాక్‌లిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించాయి.ఇండియన్ రైల్వేస్ ఈ నాణేలను గతంలో ప్రభుత్వ టంకశాలలో ముద్రించేది. అప్పుడు వీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉండేది. ఇప్పుడు వీటిని వేరే కంపెనీ తయారు చేయడం వల్ల.. ప్రతి రిటైర్డ్ ఉద్యోగి తమ గౌరవ సూచికంగా పొందే పతకం/నాణెం కూడా నకిలీదేనా అని ఆందోళన చెందుతున్నారు.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి -
'వెండి దొరకడం కష్టం': కియోసాకి
సిల్వర్ ధర పెరుగుతుందని చెప్పే రాబర్ట్ కియోసాకి మాటలు నిజమయ్యాయి. వెండి రేటు రోజురోజుకు పరుగుతూ.. చూస్తుండగానే రూ. మూడు లక్షలు దాటేసింది. ఇలాంటి సమయంలో ఆయన తన ఎక్స్ ఖాతాలో చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.''టెస్లా కంపెనీకి వెండి (Silver) దొరకడం కష్టం అవుతోంది. సిల్వర్ రేటు ఔన్స్‌కు 91 డాలర్ల నుంచి 107 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది'' అని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.TESLA cannot get silver.This Monday silver will gap upfrom $91 an ounce to $107 an ounce.Yay— Robert Kiyosaki (@theRealKiyosaki) January 15, 2026ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సిల్వర్ రేటు గణనీయంగా పెరగడం వల్ల, రాబర్ట్ కియోసాకి.. టెస్లా కంపెనీకి సిల్వర్ దొరకడం కష్టం అవుతోందని అన్నారు. కాగా ఈ రోజు భారతదేశంలో కేజీ వెండి రేటు రూ. 3.06 లక్షల వద్ద ఉంది.వెండి ధరలు పెరగడానికి కారణాలువెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.ఇదీ చదవండి: నాలుగు గంటల్లో రూ.20వేల కోట్ల బుకింగ్స్! -
Gold: తగ్గిన బంగారం ధరలు
-
రికార్డు మీద రికార్డు.. రెండు రోజుల్లో రూ.21000 జంప్
గత వారాంతాన వెండి కేజీ రూ. 2,50,000 వద్ద స్థిరపడగా.. సోమవారం రూ. 15,000 జంప్‌చేసి రూ. 2,65,000ను తాకిన విషయం విదితమే. తాజాగా మరో రూ. 6,000 బలపడటంతో రెండు రోజుల్లో 21,000 దూసుకెళ్లింది. 2026లో ఇప్పటివరకూ రూ. 32,000(13.4 శాతం) లాభపడింది. 2025 డిసెంబర్ 31న కేజీ వెండి రూ. 2,39,000 వద్ద ముగిసింది. అన్ని పన్నులు కలుపుకుని 99.9 స్వచ్చత పసిడి 10 గ్రాములు సోమవారం రూ. 2,900 ఎగసి రూ. 1,44,600కు చేరగా.. తాజాగా మరో రూ. 400 లాభపడి రూ. 1,45,000ను తాకింది. మరోపక్క గ్లోబల్ మార్కెట్లలోనూ పసిడి ఔన్స్(31.1 గ్రాములు) సోమవారం 4,630 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి ఔన్స్ 86.26 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట రికార్డ్ సాధించింది. మంగళవారం సైతం న్యూయార్క్ కామెక్స్ ఫ్యూచర్స్‌లో తొలుత బంగారం(ఫిబ్రవరి కాంట్రాక్ట్) 4,632 డాలర్లకు, వెండి(మార్చి) 88.56 డాలర్లకు చేరడం గమనార్హం! -
వారెవ్వా ఏమి జోరు..
న్యూఢిల్లీ: రోజుకో రికార్డు నెల కొల్పుతున్న వెండి, బంగారం మరోసారి దూకుడు ప్రదర్శించాయి. కేజీ వెండి ధర రూ. 6,000 జంప్‌చేసి రూ. 2,71,000ను తాకింది. ఈ బాటలో స్థానిక(ఢిల్లీ) మార్కెట్లో బంగారం 10 గ్రాములు రూ. 400 పెరిగి రూ. 1,45,000కు చేరింది. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వివరాల ప్రకారం వెండి అన్ని పన్నులు కలుపుకుని, పూర్తి స్వచ్చత కలిగిన బంగారం ధరలివి. వెరసి మరోసారి పసిడి, వెండి చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక అస్థిరతలు ధరలపై ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు మరోసారి తెలియజేశాయి.అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు తలెత్తినప్పుడు పెట్టుబడులకోసం ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనాలవైపు చూసే సంగతి తెలిసిందే. సాధారణ ప్రజలతోపాటు.. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్‌లు, అసెట్ మేనేజర్స్ పసిడిలో ఇన్వెస్ట్ చేస్తుంటే.. వెండికి సోలార్, ఈవీ, ఎల్రక్టానిక్స్ తదితర ఇండ్రస్టియల్ డి మాండ్ సైతం జత కలుస్తోంది. 2 రోజుల్లో రూ. 21,000 గత వారాంతాన వెండి కేజీ రూ. 2,50,000 వద్ద స్థిరపడగా.. సోమవారం రూ. 15,000 జంప్‌చేసి రూ. 2,65,000ను తాకిన విషయం విదితమే. తాజాగా మరో రూ. 6,000 బలపడటంతో రెండు రోజుల్లో 21,000 దూసుకెళ్లింది. 2026లో ఇప్పటివరకూ రూ. 32,000(13.4 శాతం) లాభపడింది. 2025 డిసెంబర్ 31న కేజీ వెండి రూ. 2,39,000 వద్ద ముగిసింది.అన్ని పన్నులు కలుపుకుని 99.9 స్వచ్చత పసిడి 10 గ్రాములు సోమవారం రూ. 2,900 ఎగసి రూ. 1,44,600కు చేరగా.. తాజాగా మరో రూ. 400 లాభపడి రూ. 1,45,000ను తాకింది. మరోపక్క గ్లోబల్ మార్కెట్లలోనూ పసిడి ఔన్స్(31.1 గ్రాములు) సోమవారం 4,630 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి ఔన్స్ 86.26 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట రికార్డ్ సాధించింది. మంగళవారం సైతం న్యూయార్క్ కామెక్స్ ఫ్యూచర్స్‌లో తొలుత బంగారం(ఫిబ్రవరి కాంట్రాక్ట్) 4,632 డాలర్లకు, వెండి(మార్చి) 88.56 డాలర్లకు చేరడం గమనార్హం! -
2026లో ఊహించని స్థాయికి బంగారం, వెండి!
బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం వల్ల సామాన్యులు వీటిని కొనుగోలు చేయడానికి వెనుకడుకు వేస్తున్నారు. అయితే ధైర్యం చేసి కొనుగోలు చేసినవారికి మాత్రం మంచి లాభపడ్డారు. 2025లో అమాంతం పెరిగిన గోల్డ్, సిల్వర్ రేటు 2026లో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తాయా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అయింది.నిజానికి 2026 ప్రారంభమై 10 రోజులు పూర్తి కావొచ్చింది. ఈ మధ్యలోనే 10 గ్రాముల గోల్డ్ రేటు భారతదేశంలో రూ.5000 పెరిగింది. దీంతో పసిడి ధర రూ. 1.40 లక్షలు దాటేసింది. ఇదిలాగే కొనసాగితే.. రాబోయే జూన్ నాటికి గోల్డ్ రేటు రూ.2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు బంగారం ధరలు భారీ మొత్తంలో పెరగడం బహుశా ఇదే మొదటి సారి అని కూడా చెబుతున్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు గోల్డ్ రేటు 140 శాతం పెరిగింది.వెండి ధరల విషయానికి వస్తే.. 2025 ప్రారంభంలో దాదాపు రూ. 90వేలు వద్ద ఉన్న సిల్వర్ రేటు.. 2026లో రూ.2.75 లక్షల వద్దకు చేరింది. ఇది త్వరలోనే మూడు లక్షల రూపాయలకు చేరే అవకాశం ఉందని కొందరి అంచనా.బంగారం రేటు పెరగడానికి కారణాలు!భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్. కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది. దీంతో చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపారు. అమెరికా డాలర్ విలువ కొంత తగ్గడం, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల.. మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం అయింది.మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా.. బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావొచ్చు.. కానీ బంగారం మాత్రం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుందనే కారణంగానే ఇన్వెస్టర్లు ఇటువైపు తిరుగుతున్నారు. ఇది కూడా బంగారం ధర పెరగడానికి కారణం అవుతోంది.భారతదేశంలో గోల్డ్ రేటు పెరగడానికి మరో కారణం ఏమిటంటే పండుగ సీజన్స్. పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని చాలామంది సెంటిమెంట్‌గా భావిస్తారు. దీంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం ధరలకు ఆజ్యం పోసినట్లే అయింది.వెండి ధరలు పెరగడానికి కారణాలువెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు. -
బంగారాన్ని వెండి మించిపోతుందా? వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఏం చెప్పారు?
-
మారిన గోల్డ్ రేట్లు.. లేటెస్ట్ ధరలు ఇలా..
బుధవారం ఉదయం.. పెరిగిన బంగారం ధరలు, 24 గంటలు పూర్తి కాకూండానే తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లలో గంటల వ్యవధిలోనే గణనీయమైన మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో రూ. 127850 వద్ద ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికే 500 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ. 126750 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 550 తగ్గడంతో రూ. 138270 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.చెన్నై నగరంలో కూడా గోల్డ్ రేటు వరుసగా రూ. 300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 330 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) తగ్గింది. కొత్త ధరలు రూ. 1,28,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,39,640 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్). అయితే ఢిల్లీలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి అలాగే ఉంది.వెండి ధరలు కూడా తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో రూ. 2.83 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. సాయంత్రానికి 2.77 లక్షల రూపాయల వద్దకు చేరింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. సంక్రాంతి నాటికి వెండి రేటు రూ. 3 లక్షలకు చేరుతుందని కొందరు పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: మార్చి 2026 నుంచి ఏటీఎమ్‌లో రూ.500 నోట్లు రావా.. నిజమెంత? -
బంగారం బాటలో మరో మెటల్.. ఫుల్ డిమాండ్!
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో.. ఇతర లోహాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ప్లాటినం ధరలు కూడా దూసుకెళ్తున్నాయి, ఇదే వరుసలో రాగి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు లిథియం కూడా ఇదే వరుసలోకి చేరింది.బంగారం అనేది కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా.. మన దేశంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇండియాలో గోల్డ్‌ను సెంటిమెంట్‌గా భావించేవారి ఎక్కువగా ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. దీనిని కొందరు ఆస్తిగా కూడా పరిగణిస్తారు. ఈ కారణాల వల్లనే ఇందులో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉంది.లిథియంకు డిమాండ్ఇప్పుడు బంగారం, వెండి మాదిరిగానే.. లిథియంకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీనిని బ్యాటరీల తయారీలో, ఎలక్టిక్ వెహికల్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, కెమెరాలు, ల్యాప్‌టాప్‌లలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా.. ఇంధన, క్లిన్ ఎనర్జీ వంటి రంగాల్లో కూడా దీని వినియోగం చాలా ఎక్కువైంది. కాబట్టి చాలామంది ఇందులో కూడా పెట్టుబడులు పెడుతున్నారు.సాధారణ లేదా పాత బ్యాటరీలతో పోలిస్తే.. లిథియం అయాన్ బ్యాటరీలు చాలా మన్నికైనవి. ఛార్జింగ్ కూడా వేగంగా ఉంటుంది. కాబట్టి దీనిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలు ఎక్కువగా వినియోగిస్తారు. రాబోయే రోజుల్లో ఈవీల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లిథియం డిమాండ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలుప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలు కలిగిన దేశాల జాబొత్యలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో చిలీ, అర్జెంటీనా, బొలీవియా, చైనా ఉన్నాయి. ఈ దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో లిథియం నిల్వలు కొంత తక్కువే. అయితే మనదేశంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్ మొదలైనవి ఉన్నాయి. కాబట్టి.. భవిష్యత్తులో లిథియంను ఇండియా దిగుమతి చేసుకుపోవాల్సిన అవసరం వచ్చే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ! -
వెండి, బంగారం కంటే ఖరీదైన కూరగాయ..! KG ఎంతంటే..?
-
న్యూ ఇయర్లో మొదటిసారి తగ్గిన గోల్డ్ రేటు: కొత్త ధరలు ఇలా..
వరుసగా రెండు రోజులు ధరలు తగ్గిన తరువాత.. బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోచు చేశాయి. వెండి రేటు కూడా అదే బాటలో పయనించింది. దీంతో గోల్డ్, సిల్వర్ ధరలు నూతన సంవత్సరంలో మొదటిసారి తగ్గాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు: రెండో రోజూ..
జనవరి 1న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు (జనవరి 2) అమాంతం దూసుకెళ్లాయి. నేడు గోల్డ్ రేటు గరిష్టంగా 1140 రూపాయలు పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. వెండి రేటు కూడా అదే బాటలో అడుగులు వేస్తూ రూ. 4000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 2.60 లక్షలకు చేరింది.ఈ కథనంలో బంగారం, వెండి ధరలు హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వెండి మెరుపులు
న్యూఢిల్లీ: దేశీయంగా వెండి ధరలు మంగళవారం సరికొత్త రికార్డు స్థాయిని తాకాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో సిల్వర్ రేటు రూ. 1,000 పెరిగి రూ. 2.41 లక్షలకు చేరింది. అయితే బంగారం ధర వరుసగా రెండో రోజున క్షీణించింది. 99.9%స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 2,800 తగ్గి రూ. 1,39,000కు పరిమితమైంది. ఎంసీఎక్స్ లో మార్చి వెండి కాంట్రాక్టు రూ. 9,590 పెరిగి రూ. 2,34,019 పలికింది. అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో సిల్వర్ రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 3.72 డాలర్లు పెరిగి 75.85 డాలర్లకు చేరింది. బంగారం సైతం ఔన్సుకి 69.61 డాలర్లు పెరిగి 4,401.59 డాలర్లు పలికింది. -
మెటల్స్.. క్రాష్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటం, ఎగుమతులపై చైనా ఆంక్షలు తదితర అంశాల కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పసిడి, వెండి, రాగి తదితర కమోడిటీల ధరలు సోమవారం కుదేలయ్యాయి. వరుసగా నాలుగు సెషన్ల పాటు కొనసాగిన వెండి ర్యాలీకి బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, గరిష్ట స్థాయిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్) ఫ్యూచర్స్ మార్కెట్లో మార్చి కాంట్రాక్టు ఒక దశలో సుమారు 6 శాతం క్షీణించి రూ. 2,26,275 (కిలోకి) వద్ద ట్రేడయ్యింది. సోమవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన సిల్వర్, ఇంట్రాడేలో జీవితకాల గరిష్టం రూ. 2,54,174ని తాకినప్పటికీ రూ. 2,25,500కి కూడా క్షీణించింది. ఇంట్రాడే గరిష్టం నుంచి దాదాపు రూ. 28,674 మేర పతనమైంది. గత వారంలో సిల్వర్ ఏకంగా రూ. 31,348 (15.04 శాతం) ఎగిసిన సంగతి తెలిసిందే. పసిడి 3%, రాగి 13 శాతం డౌన్ .. అటు పసిడిలో కూడా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫిబ్రవరి కాంట్రాక్టు పది గ్రాముల బంగారం ధర ఒక దశలో రూ. 4,946 మేర (3.54 శాతం) క్షీణించి రూ. 1,34,927కి తగ్గింది. ఇంట్రాడేలో రూ. 1,40,444 గరిష్ట స్థాయిని చూసింది. అంతక్రితం సెషన్లోనే (శుక్రవారం) పుత్తడి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 1,40,465ని తాకిన సంగతి తెలిసిందే. ఇక, రాగి విషయానికొస్తే, జనవరి కాంట్రాక్టు 13 శాతం క్షీణించి రూ. 1,211.05 (కిలోకి) పడిపోయింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 1,392.95ని తాకింది. రికార్డ్ స్థాయి ర్యాలీ అనంతరం ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వెండి, పసిడి రేట్లు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. భారీగా కొనుగోళ్ల వల్ల ఈ రెండూ ప్రస్తుతం ఓవర్‌బాట్ స్థితిలో ఉండటమనేది అప్రమత్తత వహించాల్సిన అవసరాన్ని సూచిస్తోందన్నారు. తదుపరి ర్యాలీకి ముందు కొంత కరెక్షన్ మంచిదని చెప్పారు. అటు అంతర్జాతీయంగా కామెక్స్‌లో 2026 మార్చి నెల వెండి కాంట్రాక్టు ఔన్సుకి (31.1 గ్రాములు) 8 శాతం పైగా నష్టపోయి ఒక దశలో 70.56 డాలర్లకు తగ్గింది. ఇంట్రాడేలో 82.61 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. అటు పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు అయిదు శాతం పైగా క్షీణించి ఒక దశలో 4,323.20 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇంట్రాడేలో నమోదైన 4,580.70 డాలర్ల స్థాయితో పోలిస్తే 257.5 డాలర్ల మేర పతనమైంది. తర్వాత కొంత కోలుకుని 4,344.50 వద్ద ట్రేడయ్యింది. ఫ్యూచర్స్ రేట్ల ప్రభావం మంగళవారం దేశీయంగా స్పాట్ మార్కెట్లో కనిపిస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కారణాలు ఇవి.. వడ్డీ రేట్ల కోతలు, అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా కమోడిటీల్లో ర్యాలీ మొదలైందని, ప్రస్తుతం పరిస్థితులు కాస్త చక్కబడుతున్న దాఖలాలు కనిపిస్తుండటంతో లాభాల స్వీకరణ జరుగుతోందని భావించవచ్చని జేఎం ఫైనాన్షియల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ తెలిపారు. అలాగే ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఉద్దేశించిన శాంతి చర్చలు తుది దశకు చేరాయన్న సంకేతాలు కూడా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుతాయనే ఆశాభావం కలిగిస్తున్నాయని యూబీఎస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు, సీఎంఈ, కామెక్స్లాంటి ప్రధాన డెరివేటివ్స్ ఎక్సే్చంజీలను నిర్వహించే సీఎంఈ గ్రూప్.. వెండి డెరివేటివ్స్ కాంట్రాక్టులపై మార్జిన్లను 20,000 డాలర్ల నుంచి 25,000 డాలర్లకు పెంచేయడం వల్ల ట్రేడర్లు అమ్మకాలకు దిగి ఉంటారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. స్పాట్లో వెండి అప్.. ఫ్యూచర్స్ మార్కెట్లో పతనమైనప్పటికీ.. సోమవారం స్పాట్ మార్కెట్లో వెండి రేటు మరో కొత్త రికార్డును తాకింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ట్రేడర్లు కొనుగోళ్లు కొనసాగించడంతో, న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలోకి రూ.3,650 పెరిగి రూ. 2,40,000 స్థాయిని తాకింది. మరో వైపు 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి రేటు పది గ్రాములకు రూ.500 క్షీణించి రూ. 1,41,800 వద్ద క్లోజయ్యింది. -
రూ. 21వేలు తగ్గిన సిల్వర్ ధర!
భారతదేశంలో భారీగా పెరుగుతున్న వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. MCX సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ సోమవారం 8 శాతం లేదా కిలోకు రూ. 21,000 తగ్గింది. నాన్-స్టాప్ ర్యాలీ తర్వాత కేజీ సిల్వర్ రేటు రూ. 254,174 నుంచి రూ. 233,120కు చేరింది. సోమవారం ఉదయం రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద ఉన్న వెండి రేటు.. కొన్ని గంటల్లోనే భారీ పతనాన్ని చవిచూసింది.రాజకీయ, భౌగోళిక కారణాల వల్ల వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లో 50 డాలర్ల దిగువన ట్రేడవుతూ.. ఔన్సుకు 80 డాలర్ల మార్కును దాటేసింది. గరిష్ఠాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కారణంగా భారీగా దిగి వచ్చింది.వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలురష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా.. డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. అంతే కాకుండా శాంతి ఒప్పందానికి అటు పుతిన్ కూడా సుముఖత చూపిస్తున్నారని ట్రంప్ పేర్కొనడంతో, యుద్ధం ముగిసే అవకాశం ఉంది. ఇది వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.సుమారు రూ. 90వేలు వద్ద ఉన్న కేజీ వెండి ధరలు.. ఏడాది పూర్తి కాకముందే 181 శాతం పెరిగింది. ధర అమాంతం పెరుగుతున్న సమయంలో కొందరు వెండిని కొనడానికి ఆలోచించారు. ఇది కూడా సిల్వర్ రేటు తగ్గడానికి ఒక కారణం.వెండి ధరలు ఇంకా తగ్గుతాయా?వెండికి ప్రస్తుతం కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో సిల్వర్ రేటు తప్పకుండా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగమే చేయని కంపెనీ నుంచి లేఆఫ్ మెయిల్: షాకయిన మహిళ -
కొత్త మార్క్‌కు సిల్వర్!: కియోసాకి ట్వీట్
వెండి ధరలు అమాంతం పెరుగుతున్న వేళ.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే సిల్వర్ 80 డాలర్లను దాటుతుందని చెప్పే ఈయన.. తాజాగా కొత్త మార్క్ చేరుతుందని పేర్కొన్నారు.బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని కియోసాకి గతంలో కూడా చాలాసార్లు పేర్కొన్నారు. ఇప్పుడు సిల్వర్ 200 డాలర్లకు చేరుతుందని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలు చూస్తుంటే.. కియోసాకి మాటలు నిజమవుతాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.SILVER BREAKS $ 80.00$200 NEXt ?— Robert Kiyosaki (@theRealKiyosaki) December 28, 2025భారతదేశంలో వెండి రేటుహైదరాబాద్, విజయవాడలలో కేజీ వెండి రేటు రూ. 2.81 లక్షల వద్ద ఉంది. ఢిల్లీ, ముంబైలలో సిల్వర్ రేటు కొంత తక్కువగా ఉన్నప్పటికీ (కేజీ రూ.2.58 లక్షలు).. కొన్ని రోజులుగా ధరలు మాత్రం ఊహకందని రీతిలో పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు మాత్రం గరిష్టంగా రూ. 4000 తగ్గినట్లు తెలుస్తోంది.వెండి రేటు పెరుగుదలపై మస్క్ ట్వీట్వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్‌లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.🚨🇨🇳 CHINA'S SILVER EXPORT RESTRICTIONS COULD SHAKE GLOBAL INDUSTRYStarting January 1, 2026, China will require government licenses for all silver exports. The timing couldn't be worse.Silver prices have nearly doubled since May, surging from around $38 to over $74 per… https://t.co/foCggFkNpm pic.twitter.com/arZuhvKJhX— Mario Nawfal (@MarioNawfal) December 27, 2025 -
భారీగా పెరిగిన వెండి ధరలపై.. మస్క్ ట్వీట్
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే కేజీ సిల్వర్ రేటు భారతదేశంలో రూ.2.74 లక్షలకు చేరింది. ఈ ధరలు వచ్చే సంక్రాంతి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు.చైనా కొత్త ఎగుమతి నియమాల గడువు దగ్గర పడుతున్న కొద్దీ వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్‌లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.🚨🇨🇳 CHINA'S SILVER EXPORT RESTRICTIONS COULD SHAKE GLOBAL INDUSTRYStarting January 1, 2026, China will require government licenses for all silver exports. The timing couldn't be worse.Silver prices have nearly doubled since May, surging from around $38 to over $74 per… https://t.co/foCggFkNpm pic.twitter.com/arZuhvKJhX— Mario Nawfal (@MarioNawfal) December 27, 2025చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.ఇదీ చదవండి: ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!వెండిని ఆభరణాలుగా కంటే.. అనేక పరిశ్రమలలో (సౌర ఫలకాలు, ఈవీలు, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, 5జీ మౌలిక సదుపాయాలు) పారిశ్రామిక ప్రక్రియలకు ఉపయోగిస్తారు. వెండి అనేది.. భూమిపై అత్యంత ఉత్తమ విద్యుత్ వాహక లోహం. కాబట్టి దీనిని అనేక అనువర్తనాల్లో ఉపయోగిస్తారు. ఇవన్నీ చూస్తుంటే.. సిల్వర్ ధరలు ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. -
ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!
2025 ప్రారంభంలో రూ. 90500 వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఇప్పుడు భారీగా పెరిగింది. ధరలు పెరుగుదల క్రమంలో జులై 26న 1,18,120 రూపాయల వద్ద నిలిచింది. ఆ తరువాత నెలలో (ఆగష్టు 26) రూ.1,23,126 వద్దను చేరింది. ఇలాగే కొనసాగుతూ.. డిసెంబర్ 26 నాటికి కేజీ వెండి రూ. 2,36,350 వద్ద నిలిచింది.జులై 26 ధరలతో పోలిస్తే.. డిసెంబర్ 26నాటి ధరలు రెట్టింపు. అంటే ఆరు నెలల కాలంలో వెండి రేటు డబుల్ అయింది. ఈ రోజు మాత్రమే సిల్వర్ రేటు రూ. 20వేలు పెరిగి.. ఒక్కసారిగా షాకిచ్చింది.ఈ రోజు (డిసెంబర్ 27) వెండి రేటు రూ. 20000 పెరగడంతో.. కేజీ సిల్వర్ ధర రూ. 2.74 లక్షలకు చేరింది. ఢిల్లీలో మాత్రం కేజీ రేటు రూ. 11వేలు పెరిగి.. రూ. 2.51 లక్షల వద్ద ఉంది.వెండి రేటు పెరగడానికి ప్రధాన కారణాలువెండిని కేవలం.. ఆభరణాల రూపంలో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది.ఇదీ చదవండి: బంగారం, వెండితోపాటు భారీగా పెరుగుతోన్న మరో మెటల్ -
సిల్వర్ సునామీ.. మళ్లీ వచ్చేశాడు కియోసాకి
వెండి ధర మళ్లీ రికార్డ్ యిలో ఎగిసింది. భారత్‌లో అయితే కేజీకి ఏకంగా రూ. 20 వేలు పెరిగి రూ.2.74 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా ఔన్స్‌కు 80 డాలర్లకు చేరువైంది. ఇక బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని వాదించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి.. వెండి ముచ్చట అంటే ఆగుతాడా.. మళ్లీ వచ్చేశాడు. తాజాగా సిల్వర్ గురించి మరో ముచ్చట పంచుకున్నారు.‘వెండి 80 డాలర్లను (ఔన్సుకు) దాటనుంది. తెలివిగా వెండిని పొదుపు చేస్తున్న వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ ఓపికే మీకు సంపాదన తెచ్చిపెట్టింది. ఇప్పుడు మనం సంపన్నులయ్యాం. బంగారాన్ని వెండి అధిగమించింది’ అంటూ రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.అంతకు ముందు ఈ వైట్ మెటల్‌పై ఇంకా పెట్టుబడులు పెట్టొచ్చా.. ఇప్పటికే ఆలస్యమైందా? అన్న సందేహానికి కియోసాకి ఆసక్తికర సమాధానమిచ్చారు. ఇప్పుడున్న వెండి ధరే ఆల్‌టైమ్ హై అని అనుకోవద్దని, ఇప్పుడిది ప్రారంభమేనని, అసలు ర్యాలీ ముందుందని పేర్కొన్నారు.SILVER To Break $80.Happy New Year ….smart silver stackers.Your patience has paid off.Now we get richer.Happy 2026Silver is hotter than gold.— Robert Kiyosaki (@theRealKiyosaki) December 27, 2025 -
వెండి ఇంకా కొనచ్చా.. ఇప్పటికే లేటైందా?
వెండి ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. రోజుకో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఈ క్రమంలో రజతం రేటు భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని, లేదు సర్దుబాటు ఉంటుందని ఇలా.. మార్కెట్ విశ్లేషకులు తలో అంచనా చెబుతున్నారు. ఇక బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని వాదించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధర గురించి సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ చేస్తున్నారు.వెండి ఔన్సుకు 70 డాలర్లను దాటిపోయిన నేపథ్యంలో ఈ వైట్ మెటల్‌పై ఇంకా పెట్టుబడులు పెట్టొచ్చా.. ఇప్పటికే ఆలస్యమైందా? అన్న సందేహానికి రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) సమాధానమిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. ఇప్పుడున్న వెండి ధరే ఆల్‌టైమ్ హై అని అనుకుంటే పొరపడినట్టేనని రాసుకొచ్చారు. ఇప్పుడిది ప్రారంభమేనని, అసలు ర్యాలీ ముందుందని పేర్కొన్నారు.వెండి ధర 2026లో అనూహ్యంగా 200 డాలర్లను (ఔన్స్‌కు) దాటిపోతుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఇది అతి శయోక్తి కాదని, సాధ్యకావడానికి చాలా కారణాలే ఉన్నాయని స్పష్టం చేశారు. కావాలంటే యూట్యూబ్ మొత్తం వెతికి సాధ్యసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చన్నారు.ఒక్క డాలరు కన్నా తక్కువున్నప్పుడే..1965లో వెండి ధర ఔన్సుకు ఒక డాలర్ కంటే తక్కువున్నప్పటి నుంచే తాను వెండి కొనడం ప్రారంభించానన్న రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు 70 డాలర్లు దాటిపోయినా సిల్వర్ కొనుగోలును ఆపనన్నారు. ధనవంతులు కావడానికి ఉత్తమ మార్గం ఎవరికి వారు సొంతంగా పరిశీలించుకోవడమేనన్నారు.‘చిన్నగా ప్రారంభించండి.... సంపద ఇక మీ బుర్రలో.. మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ క్రమంలో పొరపాట్లు చేసినప్పటికీ, ఊరికే మాటలు చెప్పేవారి కంటే మీరు ధనవంతులు అవుతారు ’ అంటూ తనను అనుసరించేవారికి హితవు పలికారు సిల్వర్ మ్యాస్ట్రో..Silver is over $70 USD an ounce.Q: IS IT TOO LATE TO BUY SILVER?A: It depends.If you think silver is at an all time high then you’re too late.I believe silver is just getting started and I believe $70- $200 silver could be an outside reality in 2026.There are many…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 25, 2025 -
బంగారం, వెండిలా.. దూసుకెళ్తున్న మరో మెటల్ రేటు!
సాధారణంగా విలువైన లోహాలు అంటే చాలామందికి బంగారం, వెండి గుర్తుకొస్తాయి. దీంతో వీటికి డిమాండ్ ఎక్కువై.. రేటు కూడా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో రాగి ధరలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ రేటు 12000 డాలర్లు దాటేసింది.2025లో బంగారం, వెండి ధరలు వరుసగా 70 శాతం, 140 శాతం పెరిగాయి. ఇదే సమయంలో రాగి రేటు ఏకంగా 35 శాతం పెరిగిపోయింది. 2009 తరువాత కాపర్ రేటు ఇంతలా పెరగడం బహుశా ఇదే మొదటిసారి. దీంతో నిపుణులు దీనిని కొత్త బంగారం లేదా కొత్త వెండి అని పిలుస్తున్నారు.రాగి ధరలు భారీగా పెరగడానికి కారణాలుమార్కెట్లో రాగి ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం..భౌగోళిక, రాజకీయ కారణాలు.రాగిని ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో, డేటా సెంటర్లలో, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో వినియోగించడంఅమెరికా విధించిన సుంకాలు కూడా రాగి ధర పెరగడానికి ఓ కారణం అనే చెప్పాలి. సుంకాల కారణంగా.. రాగి రేటు భవిష్యత్తులో పెరుగుతుందేమో అని చాలామంది దీనిని నిల్వ చేసుకుంటున్నారు. దీంతో సరఫరా తగ్గిపోయి.. డిమాండ్ పెరుగుతోంది. డిమాండుకు తగిన సరఫరా లేకపోవడం వల్ల.. ధర పెరిగింది.రాగి ఉత్పత్తి తగ్గడం కూడా సరఫరా తగ్గడానికి కారణమైంది. -
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
ప్రపంచవ్యాప్తంగా వెండి ధర భగ్గుమంటోంది. ప్రతిరోజూ కొత్త రికార్డు స్థాయికి దూసుకెళ్తోంది. ఔన్స్‌కు 72 డాలర్ల మార్కును దాటింది. దాదాపు 140% లాభాలతో, వెండి అనేక ఇతర అసెట్లను గణనీయంగా అధిగమించింది. ఈ నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఫియట్ కరెన్సీ, హార్డ్ అసెట్స్‌పై వ్యాఖ్యానానికి ప్రసిద్ధి చెందిన రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు.పారిశ్రామిక డిమాండ్, స్థూల ఆర్థిక ఆందోళనల మధ్య సురక్షిత-స్వర్గధామ ఆస్తిగా భావిస్తూ పెట్టుబడులు పెంచుతుండటంతో వెండి ధరలు తారస్థాయికి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో తనదైన శైలిలో స్పందించారు.‘వెండి 70 డాలర్లు దాటింది.బంగారం, వెండి పొదుపు చేసేవారికి గొప్ప వార్త.ఫేక్ మనీ (డాలర్లు) దాచుకునే వాళ్లకు బ్యాడ్ న్యూస్’ అంటూ పోస్టును ప్రారంభించిన కియోసాకి అధిక ద్రవ్యోల్బణం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, డాలర్ విలువను కోల్పోతూనే ఉన్నందున 2026 నాటికి వెండి ఔన్స్ కు 200 డాలర్లకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు.‘నష్టపోకండి.. వెండి ధర 2026 నాటికి 200 డాలర్లకు చేరుకుంటున్న క్రమంలో ఆ ఫేక్ డాలర్ (డబ్బు విలువ ఉండదనేది ఆయన అభిప్రాయం) కొనుగోలు శక్తి మరింత క్షీణిస్తుంది’ అంటూ ముగించారు. రాబర్ట్ కియోసాకి అంచనా కాస్త అతిశయోక్తిలా అనిపించినా వెండి ధర అత్యంత వేగంగా పెరుగుతోందనే విషయం మాత్రం వాస్తవం. SILVER over $70.GREAT NEWS for gold and silver stackers.BAD NEWS for FAKE MONEY savers.I am concerned $70 silver may signal hyper-inflation in 5 years as the fake $ keeps losing value. Don’t be a loser. Fake $ will continue to lose purchasing power as silver goes to…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 23, 2025 -
వెండికి ‘బంగారు’ కాలం
ఈ ఏడాది వెండి ధరలు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అసాధారణ మైలురాయిని చేరాయి. పెట్టుబడి సాధనంగా, పారిశ్రామిక అవసరాల పరంగా ఈ లోహం సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒకవైపు విశ్లేషకులు ధరల దిద్దుబాటు(Correction)పై హెచ్చరిస్తున్నప్పటికీ, వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ మాత్రం వెండి భవిష్యత్తుపై అత్యంత ధీమాతో ఉన్నారు.గతంలో వెండి ఎప్పుడూ బంగారం ధరల గమనాన్నే అనుసరిస్తూ ఉండేది. కానీ 2025లో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనిల్ అగర్వాల్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నట్లుగా.. ధరలు తాత్కాలికంగా హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ వెండి మెరుపు కొనసాగుతుంది. వెండి కథ ఇప్పుడే ప్రారంభమైందని అగర్వాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ ఏడాదిలో వెండి ధర ఏకంగా 125 శాతం పెరిగింది. బంగారం కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, దాని వృద్ధి 63 శాతం మాత్రమే. అంటే బంగారం కంటే వెండి రెట్టింపు రాబడిని అందించింది. వెండి అటు విలువైన ఆభరణంగానూ, ఇటు కీలకమైన పారిశ్రామిక లోహంగానూ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డిజిటల్ యుగంలో వెండి పాత్ర ఎంతో కీలకంగా మారింది.సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండికి ప్రత్యామ్నాయం లేదు. డేటా సెంటర్ల విస్తరణ, ఎలక్ట్రికల్ వాహనాల విద్యుదీకరణలో దీని డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అత్యాధునిక రక్షణ పరికరాల్లో వెండి కీలక అంశంగా ఉంది. భారతదేశంలో వెండి ఉత్పత్తిదారుగా ఉన్న హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ద్వారా ఈ పెరుగుతున్న పారిశ్రామిక అవసరాన్ని తాము ప్రత్యక్షంగా చూస్తున్నామని అగర్వాల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!? -
భారీగా పెరిగిన బంగారం ధర: కొత్త రేట్లు ఇలా..
బంగారం ధరల హీట్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. 2025 జనవరిలో రూ. 79వేలు వద్ద ఉన్న గోల్డ్ రేటు.. ఇప్పుడు రూ. 1.38 లక్షలకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే ఏడాదిలో రూ. 59వేలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. అంతే కాకుండా గత రెండు రోజులుగా పసిడి ధరలు గరిష్టంగా రూ. 4370 పెరిగింది.హైదరాబాద్, విజయవాడలలో గోల్డ్ రేటు రెండు రోజుల్లో (డిసెంబర్ 22, 23) రూ. 4370 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,180 నుంచి రూ. 1,38,550 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,23,000 దగ్గర నుంచి రూ. 1,27,000 వద్దకు (రూ. 4000 పెరిగింది) చేరింది.ఢిల్లీ నగరంలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. డిసెంబర్ 22, 23 తేదీల్లో రూ. 4370 పెరిగింది. దీంతో ఇక్కడ 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,38,700కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల రేటు రూ. 4000 పెరగడంతో రూ. 1,27,150 వద్దకు చేరింది.చెన్నైలో పసిడి ధరలు పెరగడంతో.. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,39,310 వద్దకు (రూ. 4030 పెరిగింది), 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,27,700 వద్దకు (రూ. 3700 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా రెండు రోజుల్లో (సోమ, మంగళవారాలు) రూ. 8000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2.34 లక్షలకు చేరింది. -
కియోసాకి ఆర్ధిక సూత్రాలు: ధనికులయ్యే మార్గాలు!
ప్రపంచ ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై సూచనలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. తన ఎక్స్ ఖాతాలో యాక్టివ్‌గా ఉంటూ.. ధనవంతులు అవ్వడం ఎలా?, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను పేర్కొంటూ ఉంటారు. ఇందులో భాగంగానే.. ఈ మధ్య కాలంలో కొన్ని ఆర్ధిక పాఠాలను వెల్లడించారు.👉కియోసాకి మొదటి సూచన చమురు, సహజ వాయువు వంటి ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం. కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి, ప్రపంచ ఇంధన డిమాండ్‌ను గణనీయంగా పెంచుతుందని, సాంప్రదాయ ఇంధన ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారన్న ఆయన తాను ఇంధన రంగంలోనే పెట్టుబడుతున్నట్లు వెల్లడించారు.👉ఓడిపోయినవారు ఎప్పుడూ పాత ఆలోచనలు పట్టుకుంటారు. విజేతలా ఆలోచించడం ప్రారంభించండి. డబ్బును పట్టుకోవడం మానేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా మారండి. 1996లో ప్రచురించబడిన రిచ్ డాడ్ పూర్ డాడ్లో.. నేను “పొదుపు చేసేవారు ఓడిపోతారు” అని హెచ్చరించాను.👉ఆర్థిక సంక్షోభానికి చిక్కకుండా ఉండాలంటే ‘నెట్ వర్క్ మార్కెటింగ్’లో చేరాలని సూచించారు. ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి నెట్ వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక పతనానికి సిద్ధం కావాలని అన్నారు.👉ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ధనవంతులు ఎలా జీవిస్తారో అలాగే మీరూ జీవించండి. మాంద్యం ప్రభావం నుంచి బయటపడటానికి తక్షణమే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆయన సూచించారు. సొంత కారు ఉన్నవారు వెంటనే ఉబర్ (Uber) వంటి సేవల్లో చేరి అదనపు ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు.👉ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో, అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే పాటించాను.👉ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్‌ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.👉ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం కొనండి.👉మాటలను నియంత్రించుకోవాలి. ''మీరు మాట్లాడే మాటలే మీరు'' అవుతారని కియోసాకి అన్నారు. రిచ్ డాడ్ (ధనిక తండ్రి).. తన కొడుకు నుంచి చేతకాదు, చేయలేను.. అనే మాటలను ఒప్పుకోరు. ఎందుకంటే మాటలే మనల్ని నియంత్రిస్తాయని అంటారు. పూర్ డాడ్ (పేద తండ్రి).. పదేపదే నేను చేయలేను అని చెప్పేవారు. ఆయన ఆ మాటలకే కట్టుబడిపోయారు. దీంతో ఆయన ఎంత డబ్బు సంపాదించినా జీవితాంతం పేదవాడిగానే ఉండిపోయారని కియోసాకి పేర్కొన్నారు. -
రూ. 16వేలు పెరిగిన వెండి రేటు: వారంలోనే ఇంతలా
బంగారం ధరలు మాదిరిగా కాకుండా.. వెండి ధరలు ఊహకందని రీతిలో పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లో (డిసెంబర్ 14 నుంచి 20 వరకు) సిల్వర్ రేటు ఏకంగా రూ. 16,000 పెరిగింది. దీన్ని బట్టి చూస్తే వెండి రేటు ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.2025 డిసెంబర్ 14న రూ. 2,10,000 వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. 20వ తేదీ (శనివారం) నాటికి రూ. 2,26,000లకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే.. ఒక గ్రామ్ సిల్వర్ రేటు 226 రూపాయలకు చేరిందన్న మాట. వారం రోజుల్లో రెండు రోజులు మాత్రమే తగ్గిన రేట్లు, మిగిలిన నాలుగు రోజులు పెరుగుదల దిశగానే వెళ్లాయి.వెండి రేటు పెరగడానికి ప్రధాన కారణాలువెండిని కేవలం.. ఆభరణాల రూపంలో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది. -
మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్
ఎనిమిది ఆర్ధిక పాఠాలు చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు తాజాగా లెసన్ 9 అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు మరింత ధనవంతులు కావడం ఎలా?, అనే విషయం గురించి వెల్లడించారు.ఫెడ్ (FED) భవిష్యత్తు కోసం తమ ప్రణాళికలను ప్రపంచానికి తెలియజేసింది. వడ్డీ రేట్లను తగ్గించింది. భవిష్యత్తులో భారీగా డబ్బు ముద్రణ జరుగుతుందని, దీనిని కియోసాకి ఫేక్ మనీ ప్రింటింగ్ అని అభివర్ణించారు. ఈ ఘటనను లారీ లెపార్డ్ తన గొప్ప పుస్తకంలో "ది బిగ్ ప్రింట్" అని పిలిచారు.ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం కొనండి.ఇదీ చదవండి: పాత రూ.500, రూ.1000 నోట్లు ఉంటే నేరమా.. జరిమానా ఎంత?గత వారం ఫెడ్ రేట్ల తగ్గింపును ప్రకటించిన వెంటనే నేను మరింత వెండిని కొన్నాను. వెండి ధర భారీగా పెరగనుంది. బహుశా 2026లో ఔన్సు రేటు 200 డాలర్లకు చేరవచ్చు. ఈ ధర 2024లో 20 డాలర్ల వద్ద మాత్రమే ఉంది. దీన్ని బట్టి చూస్తే సిల్వర్ రేటు ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.LESSON # 9: How to get richer as the world economy crashes.The FED just let the world know their plans for the future.The FED lowered interest rates…signaling QE (quantitative easing) or turning on the fake money printing press….What Larry Lepard calls “The Big Print” the…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 17, 2025 -
Gold Price: తగ్గేదేలే అంటున్న బంగారం మరో వైపు వెండికి రెక్కలు
-
బంగారం డబుల్: గంటల్లో తారుమారైన ధరలు!
కొన్నాళ్లుగా బంగారం, వెండి ధరలు బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్నాయి. ఈ రోజు కూడా అదేబాటలో పయనించాయి. అయితే సాయంత్రానికి మరోమారు రేటు పెరగడంతో పసిడి ప్రియులు అవాక్కవుతున్నారు. ఉదయం 980 పెరిగిన పసిడి ధర.. సాయంత్రానికి దాదాపు డబుల్ అయింది. దీంతో రేటు ఊహకందని విధంగా పెరిగిపోయింది. అనూహ్యంగా వెండి కూడా 5000 పెరిగింది. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.1,23,500 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,24,100 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 400 పెరిగిందన్న మాట. (ఉదయం 750 రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు, ఇప్పడు మరో 400 రూపాయలు పెరిగి.. మొత్తం రూ. 1350 పెరిగింది).24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1470 పెరగడంతో 10 గ్రాముల ధర రూ. 1,35,380 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 820 రూపాయలు పెరిగింది. సాయంత్రానికి మరో 650 రూపాయలు పెరగడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1470 పెరిగింది).ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ. 1460 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ. 1,35,530 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1350 పెరిగి.. 124250 రూపాయల వద్దకు చేరింది.ఇదీ చదవండి: రూ.2.40 లక్షలకు వెండి.. కొత్త ఏడాదిలో కష్టమే!ఇక చెన్నైలో విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1580 పెరగడంతో రూ. 1,36,530 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,450 పెరిగి.. 1,25,150 రూపాయల వద్దకు చేరింది.వెండి రేటు ఇలాబంగారం ధరలు పెరిగినా.. దాదాపు ఎప్పుడూ స్థిరంగా ఉండే వెండి రేటు ఈ రోజు రెండోసారి పెరిగింది. ఉదయం కేజీ రేటు 3000 పెరిగింది. ఇప్పుడు ఆ ధర రూ. 5000లకు చేరింది. అంటే ఉదయం నుంచి.. సాయంత్రానికే మరో 2000 రూపాయలు పెరిగింది. దీంతో సిల్వర్ ధర రూ. 2,15,000లకు చేరింది. -
రూ.2.40 లక్షలకు వెండి.. కొత్త ఏడాదిలో కష్టమే!
బంగారం ధర రూ. 1.30 లక్షలు (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) దాటితే.. కేజీ వెండి రేటు రూ. 2.13 లక్షలకు చేరింది. సిల్వర్ రేటు మరింత పెరిగి 2026కు సుమారు రూ. 2.40 లక్షలకు చేరుకుంటుందని స్టాక్ బ్రోకర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ కంపెనీ 'యాక్సిస్ సెక్యూరిటీస్' వెల్లడించింది.యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకారం.. వెండి రేటు మునుపెన్నడూ లేనంతగా పెరుగుతూనే ఉంది. 2025 ప్రారంభంలో రూ. 80వేలు వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఇప్పుడు గణనీయంగా పెరిగి, రెండు లక్షల రూపాయలు దాటేసింది. దీనికి కారణం మార్కెట్లో వెండికి పెరుగుతున్న డిమాండ్ అని స్పష్టమవుతుంది.ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం పెరగడం, దీంతో డిమాండ్ ఎక్కువ కావడం వల్ల కూడా సిల్వర్ రేటు ఊహకందని విధంగా పెరిగింది. సోలార్ ఫోటోవోల్టాయిక్ రంగంలో మాత్రమే వెండి వినియోగం నాలుగేళ్లలో రెండింతలు పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా వెండికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఈ రోజు వెండి ధరలుడిసెంబర్ 14న రూ. 2.10 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. ఈ రోజు రూ. 2.13 లక్షలకు చేరింది. అంటే ఈ ఒక్క రోజులోనే సిల్వర్ టు రూ. 3000 పెరిగిందన్నమాట. హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరులో సిల్వర్ రేటు ఒకేలా ఉన్నా.. ఢిల్లీలో మాత్రం కొంత తక్కువగా ఉంది. ఇక్కడ కేజీ వెండి రేటు రూ. 2,00,900. దీన్నిబట్టి చూస్తే.. దేశంలో ఢిల్లీలోనే సిల్వర్ రేటు కొంత తక్కువని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం.. -
పీక్‌లో గోల్డ్, సిల్వర్: డీలా పడిన ప్లాటినం!
భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఊహకందని రీతిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు క్రాస్ చేయగా.. కేజీ వెండి రూ. 2 లక్షలు దాటేసింది. ఈ రెండు కాకుండా ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం వంటి విలువైన లోహాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ చాలామందికి తెలిసిన లోహాలు గోల్డ్, సిల్వర్, ప్లాటినం మాత్రమే. పెట్టుబడిదారులకు పల్లాడియం గురించి తెలుసుంటుంది.ఇతర లోహాల సంగతి పక్కన పెడితే.. బంగారం వెండి ధరలు మాత్రమే ఎందుకు పెరుగుతున్నాయి. ప్లాటినం ధరలు ఎందుకు చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటి?.. ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలను ఇక్కడ క్షుణ్ణంగా పెరిశీలిద్దాం..బంగారం ధరలు పెరగడానికి కారణాలుద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ విలువ & యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాల కారణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారులు బంగారంపైన ఇన్వెస్ట్ చేయడం, డిమాండుకు తగ్గ.. బంగారం సరఫరా లేకపోవడం కూడా ధరలు పెరగడానికి కారణాలు అవుతున్నాయి.స్టాక్ మార్కెట్లలో పెట్టే పెట్టుబడులలో.. లాభనష్టాలు ఉంటాయి. కానీ బంగారం పెట్టే పెట్టుబడి భద్రంగా ఉంటుందని భావిస్తారు. ఈ కారణంగానే పెట్టుబడిదారులు.. మార్కెట్స్ కుప్పకూలినప్పుడు గోల్డ్ మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.వెండి ధరలు పెరగడానికి కారణాలుఈ ఏడాది వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం ఒక కారణం అయితే.. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీలలో వెండి వినియోగం పెరిగిపోవడం కూడా మరో కారణం. నీటి శుద్ధి, వైద్య రంగం, పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలలో కూడా వెండి వినియోగం విరివిగా ఉంది. ఎలక్ట్రానిక్స్, కండక్టర్లు, సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలలో కూడా వెండిని ఉపయోగిస్తారు.ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. వెండిని పారిశ్రామిక రంగంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల.. సిల్వర్ రేటు రెండు లక్షల రూపాయలు దాటేసింది.ప్లాటినం ధరలు ఎందుకు తక్కువ?➤బంగారం, వెండితో పోలిస్తే.. ప్లాటినం ధరలు చాలా తక్కువ. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.➤బంగారం, వెండి ఆభరణాలకు ఉన్నంత డిమాండ్.. ప్లాటినం ఆభరణాలు లేదు.➤ప్లాటినంపై పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువ➤ఇండస్ట్రీల్ వినియోగం ఎక్కువగా ఉంది.➤ప్లాటినం ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికా, రష్యాలలో మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.➤డిమాండ్ తక్కువగా ఉండటం వల్లనే.. ప్లాటినం ధరలు తక్కువగా ఉన్నాయి.ఇతర లోహాలుబంగారం, వెండి మాదిరిగానే.. ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం కూడా విలువైన లోహాలు. అయితే వీటికున్న డిమాండ్ భారతదేశంలో చాలా తక్కువ. ఈ కారణంగానే వీటి ధరలు కూడా అలాగే ఉన్నాయి. బహుశా భవిష్యత్తులో వీటి ధరలు పెరుగుతాయా? అనేది తెలియాల్సి ఉంది. -
అతిపెద్ద ఆర్థిక పతనం వస్తోంది.. ఇది ఎనిమిదో పాఠం
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ “చరిత్రలోనే అత్యంత తీవ్రమైన పతనం” దిశగా సాగుతోందని సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లు చేస్తూ వస్తున్నారు. ఆర్థికంగా ప్రపంచం పతనమైనా అందులో చిక్కుకోకుండా ధనవంతులు ఎలా కావాలో పాఠాలు చెబుతున్నారు. అందులోభాగంగా ఎనిమిదో పాఠాన్ని తాజాగా ‘ఎక్స్’లో పంచుకున్నారు.చరిత్ర చూడండి..ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్‌ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.ఈ పరిణామాలు ప్రపంచాన్ని “రుణ ఆర్థిక వ్యవస్థగా” మార్చాయని, దీని ఫలితంగా అమెరికా జపాన్ వంటి దేశాలు భారీ రుణభారంతో సతమతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇంటి అద్దెలు పెరగడంతో ఉద్యోగాలు ఉన్నవారు కూడా రోడ్డునపడుతున్నారన్నారు.కియోసాకి తన వ్యక్తిగత పెట్టుబడి అనుభవాలను కూడా పంచుకున్నారు. 1970లలో బంగారం కొనడం ఎలా ప్రారంభించారో, ఇప్పటికీ బంగారం వెండి విదేశాల్లో నిల్వ చేస్తానని చెప్పారు. దశాబ్దాల క్రితం కొన్న బంగారు నాణెం విలువ ఇప్పుడు భారీగా పెరిగిందని, ఇది ఆర్థిక అస్థిరత సమయంలో విలువ నిలుపుకొనే ఆస్తులు ఎంత ముఖ్యమో నిరూపిస్తుందని అన్నారు.ఫెడ్ ఏర్పాటే ప్రస్తుత సంక్షోభానికి మూలంప్రస్తుత సంక్షోభానికి మూలం 1913లో ఏర్పడిన ఫెడరల్ రిజర్వ్‌నేనని ఆయన ఆరోపించారు. ఆధునిక ఫియట్ కరెన్సీలు విలువ కోల్పోవడానికి ఈ సంస్థ విధానాలు ప్రధాన కారణమని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి లను “దేవుని సొమ్ము”గా.. బిట్‌కాయిన్, ఈథీరియంను “ప్రజల డబ్బు”గా కియోసాకి అభివర్ణించారు.ద్రవ్యోల్బణం, రుణ సంక్షోభం, నివాస సమస్యలు పెరుగుతున్న సమయంలో కూడా, సిద్ధపడి పెట్టుబడులు మారుస్తున్న వారు లాభపడతారని కియోసాకి పునరుద్ఘాటించారు. “వాళ్లే విజేతలు” అని, “ఫెడరల్ రిజర్వ్ లేదా ప్రభుత్వం రక్షిస్తుంది” అనే నమ్మకంతో ఉన్నవారు నష్టపోతారని హెచ్చరించారు.స్కూళ్లలో ఆర్థిక విద్యను ఎందుకు బోధించడంలేదనే ప్రశ్నను ఆయన మళ్లీ లేవనెత్తారు. ఎవరికివారే స్వయంగా ఆర్థిక జ్ఞానం పెంచుకోవాలని, రాబోయే అనిశ్చిత కాలానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.కియోసాకి గత కొన్నేళ్లుగా ఇదే తరహా హెచ్చరికలు చేస్తూ, బంగారం, వెండి, క్రిప్టోకరెన్సీలు వంటి ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఆర్థిక నిపుణులు ఆయన అంచనాలను కొట్టిపడేస్తున్నప్పటికీ, రుణభారం, ద్రవ్యోల్బణంపై ఆందోళన ఉన్న పలువురికి ఆయన సందేశం ఇంకా ఆందోళన కలిగిస్తోంది. LESSON # 8: How you can get richer as the world economy collapses.CRASHES do not happen over night.CRASHES take decades to occur.For Example:Silver crashed in 1965: when the US government turned silver coins into fake coins…. Violating Greshams Law which stated when…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 10, 2025 -
17 లక్షల వెండి ఐటమ్లకు హాల్‌మార్కింగ్
వెండి ఆభరణాల నాణ్యతను ప్రామాణికంగా ధృవీకరించే దిశగా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలో 17.35 లక్షల ఐటమ్‌లను హాల్‌మార్కింగ్ (హెచ్‌యూఐడీ) చేసినట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.ఈ ప్రక్రియలో భాగంగా భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ప్రామాణిక మార్కుకి అదనంగా ప్రతి ఉత్పత్తిపై విశిష్టమైన ఆరు అంకెల కోడ్‌ను, సిల్వర్ అనే పదం, స్వచ్ఛత గ్రేడ్ వివరాలను ముద్రిస్తారని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.సదరు ఉత్పత్తి ప్రమాణాలను ధృవీకరించిన అసేయర్–హాల్‌మార్కింగ్ సెంటర్‌ని కూడా ట్రాక్ చేసేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి. బీఐఎస్ కేర్ మొబైల్ యాప్‌లో హెచ్‌యూఐడీని ఎంటర్ చేసి హాల్‌మార్క్ గల వెండి ఆభరణాల ప్రామాణికతను వినియోగదారులు తక్షణం తెలుసుకోవచ్చు. -
వెండి మెరుపులు.. కారణాలు ఏమై ఉండొచ్చు?
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో పేదవాడి బంగారంగా పిలిచే వెండి ధరలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్దికాలంగా వెండి ధరలు ఎగబాకుతున్నాయి. ఈ అసాధారణ పెరుగుదలకు కారణం ఏమిటనే ప్రశ్నలొస్తున్నాయి. డిమాండ్‌కు సరిపడా వెండి సరఫరా కావడంలేదనే కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచ ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో జరుగుతున్న విప్లవాత్మక మార్పులు వెండిపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకుందాం.ధరల పెరుగుదలకు కారణంవెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడమేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 2022, 2023 సంవత్సరాల్లో వెండి సరఫరా కంటే డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు వరల్డ్ సిల్వర్ సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కొరత రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.డిమాండ్ ఎందుకు పెరిగింది?బంగారం, వెండి రెండూ విద్యుత్ వాహకత, తుప్పు నిరోధకత, సులభంగా సాగే, రేకులుగా మలిచే గుణం వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగా వీటి వినియోగం కేవలం పెట్టుబడులు లేదా ఆభరణాల తయారీకే పరిమితం కాకుండా అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో విస్తరిస్తోంది.ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీబంగారం అత్యుత్తమ విద్యుత్ వాహకాల్లో ఒకటి. తుప్పు పట్టదు కాబట్టి దీన్ని మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, జీపీఎస్ యూనిట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వాడుతున్నారు. ముఖ్యంగా కనెక్టర్లు, స్విచ్‌లు, రిలేలు, సర్క్యూట్ బోర్డులలోని కీలకమైన భాగాలలో దీర్ఘకాలిక విద్యుత్ కనెక్షన్ల కోసం బంగారాన్ని ఉపయోగిస్తున్నారు.ఏరోస్పేస్, అంతరిక్ష పరిశోధనఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, రాకెట్‌ల్లోని కీలకమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను రక్షించడానికి, విద్యుత్ ప్రసారం కోసం బంగారాన్ని వాడుతున్నారు. అంతరిక్షంలోని అత్యంత కఠినమైన వాతావరణంలో కూడా ఇది అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి బంగారాన్ని పూతగా కూడా ఉపయోగిస్తారు.వైద్య పరికరాలుబంగారం జీవసంబంధితంగా స్థిరంగా ఉంటుంది (శరీరంలో సులభంగా చర్యలకు గురికాదు). తుప్పు పట్టదు. నాన్-అలెర్జిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగా దంతవైద్యంలో క్రౌన్స్, బ్రిడ్జెస్ వంటి వాటికి ఉపయోగిస్తారు. గుండెకు సంబంధించిన కొన్ని శస్త్రచికిత్సా పరికరాలు, అతిపెద్ద వైద్య ఇమేజింగ్ పరికరాల్లో బంగారాన్ని వాడుతున్నారు.నానోటెక్నాలజీబంగారు నానోపార్టికల్స్‌కు వైద్య రంగంలో మెరుగైన సామర్థ్యం ఉంది. వీటిని క్యాన్సర్ చికిత్స, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ (మందులను లక్షిత ప్రాంతానికి చేర్చడం), జీవసంబంధిత సెన్సార్ల (Biosensors) తయారీలో పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారు.గ్లాస్, కిటికీలుకొన్ని భవనాల అద్దాలు, కిటికీలపై సన్నని బంగారు పూతను ఉపయోగిస్తున్నారు. ఈ పూత వేడిని నిరోధించి, లోపల ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. తద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలుప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో సౌరశక్తి (Solar Energy) రంగంలో వెండి వినియోగం కీలక పాత్ర పోషిస్తోంది. ఫోటోవోల్టాయిక్ సెల్స్‌లో విద్యుత్తును సేకరించి సరఫరా చేయడానికి వెండి పేస్ట్లను (Silver Paste) వాడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే కొన్ని రకాల బ్యాటరీల్లో కూడా వెండిని వాడుతున్నారు.ఎలక్ట్రానిక్స్, కండక్టర్లువెండి అత్యుత్తమ విద్యుత్ వాహకతను కలిగి ఉండటం వల్ల అధిక పనితీరు గల ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో సర్క్యూట్ బోర్డులు, స్విచ్‌లు, ఫ్యూజులు, కనెక్టర్లలో దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా అధిక విశ్వసనీయత అవసరమయ్యే పరికరాలలో దీని వినియోగం తప్పనిసరి అవుతోంది.పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలువెండిని రసాయన పరిశ్రమల్లో ఉత్ప్రేరకాలుగా (Catalysts) వాడుతున్నారు. ఉదాహరణకు, ఫార్మాల్డిహైడ్ ఉత్పత్తిలో (ఇది అనేక ప్లాస్టిక్‌ల తయారీలో ముఖ్యమైనది) ఇది ప్రముఖంగా ఉపయోగపడుతుంది.నీటి శుద్ధి, వైద్య రంగంవెండికి బలమైన యాంటీమైక్రోబియల్ (సూక్ష్మజీవులను నాశనం చేసే) లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగా దీన్ని నీటి శుద్ధి పద్ధతుల్లో, కొన్ని వైద్య ఉపకరణాలు, కట్టులు (Bandages) తయారీలో వాడుతున్నారు. ఆసుపత్రి పరికరాలపై క్రిమిసంహారక పూతగా కూడా వెండిని ఉపయోగిస్తున్నారు.ఫొటోగ్రఫీసాంప్రదాయ ఫిల్మ్ ఫొటోగ్రఫీలో ఫిల్మ్, పేపర్‌పై కాంతిని గుర్తించడానికి వెండి హాలైడ్లను విస్తృతంగా వాడుతున్నారు. డిజిటల్ ఫొటోగ్రఫీ రాకతో ఈ వినియోగం తగ్గినప్పటికీ ప్రత్యేక ఫొటోగ్రఫీ రంగాలలో ఇంకా ఉపయోగిస్తున్నారు.సరఫరా ఎందుకు లేదు?వెండి అనేది ఒక ఉప ఉత్పత్తి (By-product) లోహం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వెండిలో సుమారు 70% కంటే ఎక్కువ భాగం ప్రధానంగా రాగి, సీసం, జింక్, బంగారం వంటి ఇతర లోహాల మైనింగ్ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా లభిస్తుంది.ప్రధాన లోహాల మైనింగ్‌పై పెట్టుబడులు తగ్గడం లేదా ఆలస్యం కావడం వల్ల ఉప ఉత్పత్తిగా లభించే వెండి పరిమాణం కూడా తగ్గిపోతుంది.వెండిని ప్రధానంగా ఉత్పత్తి చేసే గనుల్లో కూడా సంవత్సరాలు గడిచే కొద్దీ భూమిలో ఉన్న వెండి శాతం (గ్రేడ్) తగ్గిపోతోంది. అంటే ఒకే పరిమాణంలో వెండిని పొందడానికి ఎక్కువ ఖర్చుతో అధిక మట్టిని తవ్వాల్సి వస్తుంది.ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెండిని తిరిగి తీయడం (రీసైక్లింగ్) ఖర్చుతో కూడుకుంది. దీని వల్ల మొత్తం సరఫరాపై ఇది పెద్దగా ప్రభావం చూపడం లేదు.వెండి కేవలం సంప్రదాయ ఆభరణాల లోహం కాకుండా ఆధునిక సాంకేతికతకు, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్‌కు కీలకమైన పారిశ్రామిక ముడిసరుకుగా మారింది. సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి భవిష్యత్తు సాంకేతికతలపై పెరుగుతున్న పెట్టుబడుల కారణంగా దీనికి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. అదే సమయంలో మైనింగ్ నుంచి లభించే సరఫరా పరిమితంగా ఉండటం వల్ల డిమాండ్ - సరఫరా మధ్య అంతరం మరింత అధికమవుతోంది. ఈ అసమతుల్యతే వెండి ధరలను పెంచేందుకు దోహదం చేస్తుంది.ఇదీ చదవండి: దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్రభుత్వ పథకాలు -
'ప్రపంచం పేదరికంలో ఉన్నా.. మీరు ధనవంతులు కావచ్చు'
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా ఒక ట్వీట్ చేసారు. ఇందులో ''ప్రపంచం పేదరికంలో ఉన్నప్పుడు మీరు ధనవంతులు కావచ్చు'' అని వెల్లడించారు.''జపాన్ క్యారీ ట్రేడ్ ముగిసింది. బబుల్ మార్కెట్లు తగ్గబోతున్నాయి. నా మంత్రానికి కట్టుబడి.. బంగారం, వెండి, బిట్‌కాయిన్ & ఎథెరియం కొనండి. గ్లోబల్ మార్కెట్స్ కుప్పకూలిపోతున్నప్పుడు ఎలా ధనవంతులు కావాలో నేను రాబోయే ట్వీట్లలో వెల్లడిస్తాను. అవును: ప్రపంచం పేదరికంలో ఉన్నప్పుడు మీరు ధనవంతులు కావచ్చు. జాగ్రత్త వహించండి.'' అని రాబర్ట్ కియోసాకి తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఇదీ చదవండి: కియోసాకి ఆర్ధిక సూత్రాలు: ధనవంతులయ్యే మార్గాలుకియోసాకి ప్రకారం.. తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని ప్రపంచ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే.. జపాన్ క్యారీ ట్రేడ్ ఇప్పుడు పనిచేయడం తగ్గిపోతోంది. దీని ప్రభావంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడుతుందని, బంగారం, వెండి వంటివాటితో పెట్టుబడి పెట్టండి. స్టాక్ మార్కెట్లలో అల్లకల్లోలం ఏర్పడినా.. ప్రపంచం పేదరికంలో ఉన్నా.., మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు.Japan “Carry Trade” ended.Watch out below. Bubble Markets about to deflate.Standing by my mantra…buy gold, silver, Bitcoin, and Ethereum.More recommendations on how to get rich while world collapses will follow in future Tweets.Yes: you can get richer while world gets…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 29, 2025 -
వెండికి హాల్‌మార్కింగ్.. వజ్రాభరణాలపై ఫ్రేమ్‌వర్క్
బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. విలువైన లోహాల స్వచ్ఛతను ధ్రువీకరించేలా దాని పరిధిని విస్తరించాలని చూస్తోంది. అందులో భాగంగా వెండి ఆభరణాలకు కూడా హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాకుండా సహజ, ల్యాబ్ గ్రోన్ డైమండ్ల మధ్య వ్యత్యాసాన్ని వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయడానికి, ఈ విభాగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ప్రభుత్వం తీసుకురానుంది.వెండికి హాల్మార్కింగ్జూన్ 2021 నుంచి బంగారు ఆభరణాలకు తప్పనిసరి అయిన హాల్‌మార్కింగ్ వెండి ఆభరణాల కోసం సెప్టెంబర్ 1, 2025 నుంచి స్వచ్ఛందంగా ప్రవేశపెట్టబడింది. అయితే దీన్ని రానున్న రోజుల్లో తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ఇటీవల సీఐఐ నిర్వహించిన రత్నాలు, ఆభరణాల సదస్సులో వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే మాట్లాడుతూ.. బంగారు హాల్‌మార్కింగ్‌కు పరిశ్రమ, వినియోగదారుల నుంచి లభించిన సానుకూల స్పందన ప్రభుత్వాన్ని ప్రోత్సహించిందని తెలిపారు. ‘వెండి హాల్‌మార్కింగ్‌ను స్వచ్ఛందంగా చేయడం ద్వారా దాని ఫలితం, ప్రజల స్పందన ఎలా ఉందో పరిశీలిస్తున్నాం. వెండి ఆభరణాలను సైతం ధరించే మన దేశంలోని వినియోగదారులు తాము కొనుగోలు చేస్తున్న ఉత్పత్తుల విశ్వసనీయతను నిర్ధారించడం చాలా ముఖ్యం’ అని ఖరే అన్నారు. వెండి హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయడానికి ముందు పరిశ్రమ ప్రతిస్పందనకు తగినంత సమయం ఇస్తున్నామని వివరించారు.తప్పనిసరి హాల్‌మార్కింగ్(బంగారానికి) ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 57.17 కోట్ల బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 8.44 కోట్ల వస్తువులకు హాల్‌మార్క్ వేసినట్లు పేర్కొన్నారు.బీఐఎస్ పరిధిలో..బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆధ్వర్యంలో ఈ హాల్‌మార్కింగ్ ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం 2 లక్షల మందికి పైగా ఆభరణాల వ్యాపారులు, 65 లైసెన్స్ పొందిన రిఫైనర్లు బీఐఎస్‌లో నమోదు చేసుకున్నారు. అస్సేయింగ్ హాల్‌మార్కింగ్ సెంటర్ల (AHL) విస్తరణను కూడా ప్రభుత్వ పరిశీలిస్తుంది. దేశవ్యాప్తంగా 1,603 బీఐఎస్ గుర్తింపు పొందిన ఏహెచ్ఎల్లు, 109 ఆఫ్ సైట్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే ఈ కేంద్రాల్లో దేన్నీ ప్రభుత్వం నిర్వహించకపోవడం గమనార్హం.ల్యాబ్ గ్రోన్ డైమండ్లపై పారదర్శకతసాంకేతికత అభివృద్ధి చెందడంతో ల్యాబ్ గ్రోన్ డైమండ్లు వాణిజ్యపరంగా లాభదాయకంగా మారాయి. అయితే, సహజ వజ్రాల కంటే అవి చౌకగా ఉన్నందున వినియోగదారులు మోసపోకుండా ఉండటానికి పారదర్శకతను నిర్ధారించేలా ఫ్రేమ్‌వర్క్ అవసరమని ఖరే నొక్కి చెప్పారు. పరిశ్రమపై భారం పడకుండా పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(GJEPC), ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తోందని తెలిపారు.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి? -
సిల్వర్ ఈటీఎఫ్‌ల మెరుపులు
’’అలుపెరుగకుండా పరుగుతీస్తున్న బంగారం బాటలోనే వెండిలో కూడా పెట్టుబడులు చేపట్టేందుకు మూడేళ్ల క్రితం దేశీయంగా ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ప్రొడక్టు (ఈటీపీ)లకు తెరతీశారు. వీటిలో ఈటీఎఫ్‌లు ప్రధాన భాగం. దీంతో 2022లో వెండి ఈటీఎఫ్‌లు ఊపిరిపోసుకున్నాయి. తొలి దశలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అంతగా ఆసక్తి చూపకపోయినప్పటికీ ఏడాదిన్నర కాలంగా ఇవి జోరందుకున్నాయి. దీంతో 2007లోనే ప్రారంభమైన పసిడి ఈటీఎఫ్‌లను వెనక్కి నెడుతూ వెండి ఈటీఎఫ్‌లు భారీస్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహా లు బంగారం, వెండిలో పెట్టుబడులకు వీలుగా రూపొందించిన ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు)కు ఆదరణ పెరుగుతోంది. ప్రపంచ దేశాలలో బంగారం వినియోగంలో భారత్, చైనాలు టాప్ ర్యాంకులో నిలుస్తుంటే.. వస్తురూపేణా (ఫిజికల్) వెండి కొనుగోళ్లకు సైతం భారత్ రెండో ర్యాంకులో నిలుస్తోంది. దేశీయంగా ఇటీవల ఈటీఎఫ్‌ల ప్రవేశంతో ప్రధానంగా వెండిలో పెట్టుబడులు అధికమయ్యాయి.పసిడి ధరల ర్యాలీతో పోలిస్తే కొద్ది నెలలుగా వెండి వెనుకబాటు దీనికి కారణమైనట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇటీవల కొద్ది నెలలుగా సౌర విద్యుదుత్పత్తితోపాటు.. ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రిక్ వాహన తయారీ, వినియోగానికి పెరుగుతున్న డిమాండ్ వెండి ధరలకు జోష్నివ్వనున్న అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశాయి. ఫలితంగా ఇటీవల వెండిలో ఫిజికల్ కొనుగోళ్లు, ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడులు ప్రవహిస్తున్నట్లు వివరించాయి. 200 శాతం జూమ్ 2022తో పోలిస్తే సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు వార్షిక ప్రాతిపదికన 200 శాతం దూసుకెళ్లాయి. న్యూయార్క్ సిల్వర్ ఇన్స్టిట్యూట్ వివరాల ప్రకారం ఈ కాలంలో దేశీ ఇన్వెస్టర్ల హోల్డింగ్స్ 18 రెట్లు ఎగశాయి. ఈ బాటలో గత 18 నెలల్లో పెట్టుబడులు భారీగా జంప్‌చేశాయి. తాజాగా వెండి హోల్డింగ్స్ 5.8 కోట్ల ఔ న్స్‌లు (1,800 టన్నులు)ను దాటాయి. 2024 చివరితో పోలిస్తే ఇది 51 శాతం అధికం! పెట్టుబడుల దూకుడు మూడేళ్ల క్రితం(2022 తొలి త్రైమాసికం) వెండి ఈటీఎఫ్‌లు ప్రవేశపెట్టినప్పుడు హోల్డింగ్స్ 2.1 మిలియన్ ఔన్స్‌లు (65 టన్నులు) మాత్రమే. తదుపరి పెట్టుబడులు ఊపందుకోవడంతో 2024 చివరి క్వార్టర్‌కల్లా 3.8 కోట్ల ఔన్స్‌ల (1,183 టన్నులు)కు చేరాయి. ఇది వార్షికంగా 200 శాతం వృద్ధికాగా.. ఒక్క 2024లోనే 2.51 కోట్ల ఔన్స్‌ల (782 టన్నులు) పెట్టుబడులు జత కలిశాయి. ఆపై వెండి ఈటీఎఫ్‌లు మరింత జోరందుకున్నాయి. పసిడి వెనుకడుగు వెండి ఈటీఎఫ్‌లతో పోలిస్తే ఇన్వెస్టర్లు పసిడి ఈటీఎఫ్‌లలో పెట్టుబడులకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇందుకు బంగారం కాయిన్లు, ఆభరణాల(ఫిజికల్) కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రభావం చూపుతోంది. ఫలితంగా 2007లో ప్రారంభమైన గోల్డ్ ఈటీఎఫ్‌ల హోల్డింగ్స్ 2 మిలియన్ ఔన్స్‌ల(64 టన్నులు)కు చేరినట్లు తెలియజేశాయి. 2024లో గోల్డ్ ఈటీఎఫ్‌లలో కేవలం 0.5 మిలియన్ ఔన్స్‌లు(15 ట న్నులు) జమయ్యాయి. అయితే 2024కల్లా గత నాలుగేళ్ల కాలంలో ఇవి 27.4 టన్నుల నుంచి 54.5 టన్నులకు పుంజుకున్నాయి. 2025లో కొనుగోళ్లు మరింత పెరిగాయి. కాగా.. ఈ ఏడాది(2025)లో ఇప్పటివరకూ వెండి ధరలు 75 శాతం దూసుకెళ్లగా.. పసిడి 55 శాతం బలపడిన విషయం విదితమే.పసిడి రూ. 3,500 జూమ్⇒ ఢిల్లీలో రూ. 1,28,900కి గోల్డ్ ⇒ వెండి కూడా రూ. 5,800 అప్ న్యూఢిల్లీ: పసిడి ధరలు మరోసారి పరు గు తీశాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో మంగళవారం 99.9% స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ. 3,500 పెరి గి రూ. 1,28,900కి చేరింది. వెండి ధర కూడా కిలోకి రూ. 5,800 పెరిగి రూ. 1,60,800కి చేరింది. మరోవైపు, ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో డిసెంబర్ డెలివరీ పసిడి కాంట్రాక్టు ధర రూ. 1,458 ఎగిసి ఒక దశలో రూ. 1,25,312 వద్ద ట్రేడయ్యింది. వెండి కూడా రూ. 2,583 మేర ఎగిసి రూ. 1,57,065 వద్ద ట్రేడయ్యింది. న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి డిసెంబర్ కాంట్రాక్టు ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 47.8 డాలర్లు పెరిగి 4,142 డాలర్ల స్థాయిని తాకింది. సిల్వర్ ఫ్యూచర్స్ రేటు 1.94 శాతం పెరిగి 51.30 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
ఇంతలా పెరిగితే కొనేదెలా?: లేటెస్ట్ గోల్డ్ రేట్స్ ఇలా..
నవంబర్ నెల ముగుస్తున్న తరుణంలో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఈ రోజు (మంగళవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 2190 పెరిగింది. దీంతో దేశంలో ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
కిరీటం గెలుపొందితే సరిపోదు..ఆ బాధ్యతలు కూడా చేపట్టాలి!
నవంబర్21, 2025న మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది ఫాతిమా బాష్. ఆ కిరీటం తోపాటు పూర్వీకులు(ఇంతకుమునుపు ఆ కీరిటం గెలుపొందినవారు) నెరవేర్చిన బాధ్యతలను సైతం స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌తో నీలిరంగు దుస్తులతో ఆ కిరీటం తోపాటు వెండి రంగు రిబ్బన్ కూడా ధరించి. ఇంతకీ ఇది దేనికి సంకేతం, దాని ప్రాముఖ్యత ఏంటంటూ అంత తెగ వెతికేస్తున్నారు. మరి అదెంటో తెలుసుకుందామా..!.సెలబ్రిటీలు, సామాజిక కార్యకర్తలు ధరించే ముడివేసిన రిబ్బన్ దేనికోసం నిలబడుతున్నారనేది తెలుపుతుంది. ఎరుపు రంగు ఎయిడ్స్, గుండెజబ్బుల అవగాహనను సూచిస్తుంది. అదే గులాబీ రంగు రిబ్బన్ రొమ్ము కేన్సర్‌ని సూచిస్తుంది. ఇక పసుపు ఆత్మహత్య నివారణను సూచిస్తుంది. అలా ఇలా కాకుండా సిల్వర్ కలర్ ధరించిన ఫాతిమా దేనికోసం కృషి చేసింది, ఏ అంశంపై అవగాహన కల్పిస్తుంది అంటే..వెండి రిబ్బన్ ప్రాముఖ్యత..మిస్ యూనివర్స్ ఫాతిమా బాష్ ధరించిన వెండి రిబ్బన్ స్కిజోఫ్రెనియా, పార్కిన్సన్స్, డైస్లెక్సియాతో సహా మెదడు వ్యాధులు, రుగ్మతలు, వెకల్యాలకు మద్దతును సూచిస్తుంది. ఆరోగ్య సమస్యల చుట్టూ ఉన్న కళంకాన్ని తొలగించి, పరిశోధన, మద్దతు కోసం తన ఫాలోవర్లుకు అవగాహన కల్పించేలా ప్రభావితం చేసేందుకు ఆ రిబ్బన్ని ధరించారామె. అదే ఎందుకంటే..ఫాతిమా బాస్ పాఠశాలలో ఉన్నప్పుడు డిస్లెక్సియా ADHDతో ఇబ్బంది పడినందున ఆమె ముడి వేసిన వెండి రిబ్బన్‌ను ధరించి కనిపించింది.ఇక ఆమెక చదవు అంటే మహా ఇష్టం. ఆ అభిరుచితోనే జస్ట్ 16 ఏళ్లకే యూఎస్ వెళ్లింది. ఆమె తన కెరీర్‌ని పూర్తిగా ఫ్యాషన్‌కే అంకితం చేసింది. అలాగే కేన్సర్‌తో పోరాడుతున్న పిల్లలకు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా కూడా పనిచేస్తుంది. వీక్ ఆఫ్ సమయాల్లో వార్షిక టోయ్ డ్రైవ్‌ని నిర్వహిస్తుందట View this post on Instagram A post shared by Fatima Bosch (@fatimaboschfdz) (చదవండి: పిల్లలు నాకే పుట్టారా?.. డీఎన్ఏ టెస్టుల కలకలం) -
‘క్రాష్ మొదలైంది.. బంగారం, వెండి కొనుగోలుకిదే సమయం’
పెట్టుబడులు, ఆర్థిక విషయాలపై ఎప్పకప్పుడు వ్యాఖ్యానించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా మరో హెచ్చరికను జారీ చేశారు. "చరిత్రలో అతిపెద్ద క్రాష్" ప్రారంభమైందంటూ సోషల్ ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.2013లో తాను ప్రచురించిన పుస్తకం రిచ్ డాడ్స్ ప్రొఫెసీని ప్రస్తావిస్తూ దశాబ్దం క్రితం తాను అంచనా వేసిన ప్రపంచ మాంద్యం ఇప్పుడు బయటపడుతోందని, ఇది ఒక్క అమెరికాను మాత్రమే కాకుండా యూరప్, ఆసియాను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వేగవంతమైన పురోగతి ఉద్యోగాలను ఊడ్చేస్తుందని, ఇది జరిగితే వాణిజ్య, నివాస రియల్ ఎస్టేట్ రెండింటిలోనూ భారీ పతనం తప్పదని రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) నమ్ముతున్నారు.బంగారం, వెండి.. కొనాల్సిందిప్పుడే.. తన దీర్ఘకాల పెట్టుబడి అభిప్రాయాలను పునరుద్ఘాటిస్తూ, కియోసాకి బంగారం (Gold), వెండి, బిట్ కాయిన్, ఎథేరియం హోల్డింగ్స్ ను పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తన ఫాలోవర్లకు సూచించారు. ముఖ్యంగా ఈ పరిస్థితిలో వెండి కొనడం ఉత్తమం, సురక్షితమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక ఔన్స్‌కు 50 డాలర్ల వద్ద ఉన్న వెండి (Silver Price) త్వరలో 70 డాలర్లకి పెరుగుతుందని, 2026 నాటికి అయితే 200 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.ఇది చదివారా? బిట్‌కాయిన్ క్రాష్: కియోసాకి షాకింగ్ ప్రకటనధనవంతులవుతారు!"శుభవార్త ఏమిటంటే, లక్షలాది మంది తమ సంపదను పోగుట్టుకుంటున్నా... మీరు సిద్ధంగా ఉంటే... ఈ క్రాష్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది"అని కియోసాకి రాసుకొచ్చారు. ఈ క్రాష్ నుంచి సంపన్నులు అయ్యేందుకు మరిన్ని మార్గాలను రానున్న ట్వీట్లలో వివరిస్తానన్నారు.BIGGEST CRASH IN HISTORY STARTINGIn 2013 I published RICH DADs PROPHECY predicting the biggest crash in history was coming.Unfortunately that crash has arrived.It’s not just the US. Europe and Asia are crashing.AI will wipe out jobs and when jobs crash office and…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 23, 2025 -
లక్షకు రెండు లక్షలు!: బంగారంలాంటి లాభాలు
ఒక మనిషి ఆర్థికంగా ఎదగాలంటే.. తప్పకుండా పొదుపు చేయాలి. ఈ పొదుపును సరైన మార్గంలో పెట్టుబడిగా పెడితే.. ఊహకందని లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇన్వెస్ట్ చేయడానికి స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్, రియల్ ఎస్టేట్ వంటి చాలామార్గాలు ఉన్నాయి.ఐదేళ్ల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే.. ఇప్పుడు ఎంత ఆదాయం వచ్చేది అనే విషయాన్ని వెల్త్ మోజో.. తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.ఐదేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి, ఈరోజు దాని విలువ సుమారుగా..నిఫ్టీ 50: రూ. 1.8 లక్షలునిఫ్టీ నెక్స్ట్ 50: రూ. 2.2 లక్షలుమిడ్క్యాప్ ఇండెక్స్: రూ. 2.7 లక్షలుస్మాల్ క్యాప్ ఇండెక్స్: రూ. 3.1 లక్షలుబంగారం: రూ. 1.9 లక్షలువెండి: రూ. 2.0 లక్షలుఫిక్స్‌డ్ డిపాజిట్: రూ. 1.35 లక్షలురియల్ ఎస్టేట్: రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.25 లక్షలుబిట్కాయిన్: రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలుదీన్నిబట్టి చూస్తే ఐదు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తికి.. ఇప్పుడు సుమారు రూ. 2 లక్షలు వస్తుందన్నమాట. అంటే లక్ష రూపాయలకు, మరో లక్ష లాభం. కాగా బంగారం వెండి ధరలు కూడా ఐదేళ్లలో ఊహకందని రీతిలో పెరిగాయి.ఇదీ చదవండి: నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్..If you had invested ₹1,00,000 five years ago, here’s what it would roughly be worth today:📊 Nifty 50: ~₹1.8L🚀 Nifty Next 50: ~₹2.2L📈 Midcap Index: ~₹2.7L🔥 Smallcap Index: ~₹3.1L🪙 Gold: ~₹1.9L🥈 Silver: ~₹2.0L🏦 Fixed Deposit: ~₹1.35L🏢 REITs/InvITs:…— Wealthmojo™ (@wealthmojo1) November 18, 2025 -
అంతలోనే ఇంత తేడానా.. మారిపోయిన బంగారం, వెండి ధరలు!
బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూ.. పసిడి ప్రియుల మదిలో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ రోజు (నవంబర్ 13) ఉదయమే గరిష్టంగా రూ. 2290 పెరిగిన 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 3110కు చేరింది. అంటే ఉదయం నుంచి సాయంత్రానికే.. బంగారం రేటు రూ. 820 పెరిగింది. వెండి ధర కూడా కేజీపై మరో రూ. 1000పెరగడంతో.. రూ. 1.83 లక్షలకు చేరింది.రూ.10 వేలు పెరిగిన వెండిగురువారం ఉదయం వెండి రేటు రూ. 9000 పెరిగింది. సాయంత్రానికి మరో 1000 రూపాయలు పెరగడంతో.. మొత్తం రూ. 10,000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు ఈ రోజు రూ. 1,83,000 వద్దకు చేరింది. గత వారంలో స్థిరంగా ఉన్న వెండి రేటు మళ్లీ పెరుగుదల దిశగా.. పరుగులు పెడుతోంది. ఈ ధరలు ఇలాగే కొనసాగితే.. కేజీ వెండి ధర రూ. 2 లక్షలకు చేరుకోవడానికి మరెన్నో రోజులు పట్టదని స్పష్టమవుతోంది.బంగారం ధరలు ఇలాఇక బంగారం ధరల విషయానికి వస్తే.. అసలే విపరీతంగా పెరుగుతున్న పసిడి ధర ఇప్పుడు రోజుకు రెండు సార్లు పెరగడంతో.. కొనుగోలుదారులలో ఆందోళన కలుగుతోంది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ప్రస్తుతం.. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 2850 పెరిగి రూ. 1,17,900 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 3110 పెరిగి రూ. 1,24,620 వద్దకు చేరింది.చెన్నైలో కూడా గోల్డ్ రేటు సాయంత్రానికే తారాస్థాయికి చేరింది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3260 పెరిగి రూ. 1,29,820 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర రూ. 3000 పెరిగి రూ. 1,19,000 వద్దకు చేరింది.ఇదీ చదవండి: వెండి ధర అక్కడికి!.. కియోసాకి ట్వీట్చివరగా దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 2850 పెరిగి రూ. 118050 వద్దకు చేరగా.. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 3110 పెరిగి.. రూ. 128770కు చేరింది. మొత్తం మీద దేశ వ్యాప్తంగా బంగారం ధరలు సాయంత్రానికే తారుమారయ్యాయి.నిపుణులు ఏం చెబుతున్నారంటే?బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని చాలామంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. బంగారం సురక్షితమైన ఆస్తి కాబట్టి ఎక్కువమంది పెట్టుబడి పెట్టడం లేదా కొనుగోలు చేయడంతో పసిడికి డిమాండ్ పెరిగిపోయింది. వెండిని ఆభరణాల కోసం మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగాల్లో కూడా విరివిగా ఉపయోగించడం వల్ల దీని ధర కూడా అమాంతం పెరిగిపోయింది. సిల్వర్ రేటు పెరుగుతుంది.. ధర పెరగకముందే కోనేయండి అంటూ రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సైతం చెబుతున్నారు. -
‘పేదల బంగారం’పైనా లోన్లు.. ఎప్పటి నుంచంటే..
ఆర్థికంగా అత్యవసరం తలెత్తినప్పుడు బంగారం ఉంటే అక్కరకువస్తుంది. బ్యాంకులు, ఇతర సంస్థల్లో తాకట్టు పెట్టి లోన్ పొందవచ్చు. ఈ కారణంతోనే చాలామంది మధ్య తరగతి వాళ్లు కూడా తమ స్తోమతకు మించి బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే మరి పేద, సామాన్య ప్రజల దగ్గర బంగారు ఆభరణాలు, వస్తువులు ఉండవు. ఏదో కొద్దో గొప్పో వెండి ఆభరణాలు, వస్తువులు ఉంటే ఉంటాయి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాటిపై లోన్లు ఎవరూ ఇవ్వరు కదా.. అని ఇన్నాళ్లు బాధపడిఉంటారు. ఇకపై ఆ బాధ అక్కర్లేదు. పేదల బంగారంగా భావించే వెండిపైనా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇవ్వనున్నాయి.వెండిపై రుణాలకు సంబంధించి వాణిజ్య బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు రుణ మార్గదర్శకాలను ఆర్బీఐ సవరించింది. ఇందులో భాగంగా 2026 ఏప్రిల్ 1 నుండి వెండి ఆభరణాలు, వస్తువులు లేదా నాణేలను తాకట్టు పెట్టి రుణాలను పొందవచ్చు. పేదలు, సామాన్యులకు రుణ లభ్యతను మెరుగుపరచడానికి ఆర్బీఐ ఈ మార్పులు చేస్తోంది. అయితే ప్రాథమిక వెండి అంటే ఆభరణాలు, వినియోగ వస్తువులు కాకుండా వాణిజ్యానికి ఉపయోగించే వెండి బార్లపై మాత్రం ఈ రుణ సదుపాయం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది.అయితే బంగారంపై ఇచ్చినట్లుగా దాటి రేటు ఆధారంగా అధిక మొత్తంలో రుణాలు వెండిపై ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని ఆర్బీఐ చెబుతోంది. వెండికి ఉన్న అధిక అస్థిరత, తక్కువ లిక్విడిటీ కారణంగా లోన్-టు-వాల్యూ నిష్పత్తులు, వడ్డీ రేట్లకు సంబంధించి వెండిపై రుణాలు బంగారు రుణాలతో పోల్చితే భిన్నంగా ఉండవచ్చు. అందువల్ల బ్యాంకులు, రుణ సంస్థలు వెండి-ఆధారిత రుణాలపై తక్కువ క్రెడిట్ పరిమితులను, కొంచెం ఎక్కువ వడ్డీ రేట్లను నిర్ణయించవచ్చు. తాకట్టు పెట్టిన వెండి స్వచ్ఛత, నిల్వ, బీమా ఖర్చులు, తిరిగి చెల్లింపు షెడ్యూల్, జప్తు నిబంధనలతో సహా కారకాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలని రుణగ్రహీతలకు ఆర్బీఐ సూచించింది. -
వెండి ధర అక్కడికి!.. కియోసాకి ట్వీట్
మార్కెట్లో కేవలం బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబర్ నెలలో రూ. 2 లక్షలు దాటేసిన వెండి రేటు.. గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. ఈ రోజు (నవంబర్ 10) ఒకేసారి 4000 రూపాయలు పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 1.69 లక్షలకు చేరింది. ఈ తరుణంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు.రాబర్ట్ కియోసాకి వెండి ధరలు పెరుగుతాయనే.. నేపథ్యంలో ట్వీట్ చేశారు. సిల్వర్ 50 డాలర్లు దాటేసింది. నెక్స్ట్ స్టాప్ 70 డాలర్లు అని వెల్లడించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు.. కియోసాకి చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించారు.SILVER over $50.Next stop $70?— Robert Kiyosaki (@theRealKiyosaki) November 10, 2025భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచ మార్కెట్లో వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా.. వెండిని కేవలం ఆభరణాలు, అలంకార సామాగ్రిగా మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ ఇప్పుడు కీలకంగా మారింది.ఇదీ చదవండి: విజయ్ మాల్యా సామ్రాజ్యం: దివాలా తీసిందిలా..వెండిని పారిశ్రామిక రంగాల్లో కూడా వినియోగిస్తున్న కారణంగా.. సిల్వర్ డిమాండ్ అమాంతం పెరుగుతుంది. దీనివల్ల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది లక్ష రూపాయల కంటే తక్కువ ధర ఉన్న వెండి.. నేడు రూ. 1.69 లక్షలకు చేరిందంటే.. దీనికి ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా..
పండుగ సీజన్, డాలర్ విలువ తగ్గడం, స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం వంటి కారణాల వల్ల ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం గోల్డ్ రేటు స్వల్ప తగ్గుదలను నమోదు చేస్తోంది. వెండి కూడా అదే బాటలో నడుస్తోంది. డిసెంబర్ నెలలో పసిడి ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ప్రపంచ ఆర్థిక పరిణామాలు బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లోని కమోడిటీ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు మానవ్ మోదీ అన్నారు. అమెరికా ఫెడ్ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తరువాత.. బంగారం 4000 డాలర్ల మార్కు దగ్గర కదలాడాయి. డిసెంబర్లో కూడా ఫెడ్ రేటు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి బంగారం ధర తగ్గే సూచనలు ఉన్నాయని ఆయన అన్నారు.చైనాలో, బంగారు రిటైలర్లకు వ్యాట్ ఆఫ్‌సెట్‌లను తొలగించడం, మినహాయింపులను 13 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడం వలన ప్రధాన బ్యాంకులు కొత్త రిటైల్ ఖాతాలను స్తంభింపజేయడానికి దారితీశాయి. ఇది ప్రపంచంలోని అగ్ర బంగారు మార్కెట్లో డిమాండ్‌ను తగ్గించే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో అమెరికా తన కీలకమైన ఖనిజాల జాబితాలో యురేనియం, రాగి, వెండిని కూడా చేర్చింది. కాబట్టి గోల్డ్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది.నేటి బంగారం, వెండి ధరలు ఇలా..నవంబర్ 10న మన దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,23,220 వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,12,950 వద్ద ఉన్నాయి. మొత్తం మీద ఈ నెల (నవంబర్) ప్రారంభం నుంచి గోల్డ్ రేటు తగ్గుతూ.. పెరుగుతూ ఉందని స్పష్టమవుతోంది.వెండి ధరల విషయానికి వస్తే.. ఈ రోజు (సోమవారం) సిల్వర్ రేటు రూ. 2000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 1.67 లక్షలకు చేరింది. అంటే ఒక గ్రామ్ వెండి రేటు 167 రూపాయల దగ్గర ఉంది. గత నెలలో రూ. 2 లక్షలు దాటేసిన సిల్వర్ ధర.. ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతూ ఉంది.ఇదీ చదవండి: బంగారం: ఇప్పుడు కొనాలా.. ఇంకొన్ని రోజులు వేచి చూడాలా? -
బంగారం ‘కొండంత’ లక్ష్యంతో కొంటున్నా: కియోసాకి
ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. రాబోయే మార్కెట్ క్రాష్ గురించి మరోసారి అలారం మోగించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం వంటి హార్డ్ ఆస్తులపై తన బుల్లిష్ దృక్పథాన్ని మరింత రెట్టింపు చేశారు.తాజాగా ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ పెట్టారు. యూఎస్ రుణం, ద్రవ్య విధానం, ఫెడరల్ రిజర్వ్‌పై తన అభిప్రాయాలను పంచుకుంటూ ట్రెజరీ ముద్రించినది "నకిలీ డబ్బు" అని అభివర్ణించారు. తాను బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథీరియం ఆస్తులను ఎందుకు అమ్మడం లేదు.. ఇంకా కొంటున్నాడో వివరించారు.కియోసాకి అంచనాలో భవిష్యత్తులో బంగారం ఔన్సుకు 27,000 డాలర్లకు చేరుకుంటుంది. బిట్ కాయిన్ 2026 నాటికి 250,000 డాలర్లకు పెరుగుతుంది. వెండి 100 డాలర్లకు చేరుతుంది. ఇక ఎథేరియం 60,000 డాలర్లను తాకుతుంది. యు.ఎస్. ప్రభుత్వం రుణ భారాన్ని విస్తరించడం కొనసాగిస్తున్నందున ఈ ఆస్తులు సాంప్రదాయ పొదుపును అధిగమిస్తాయని రాసుకొచ్చారు.తాను గ్రేషమ్, మెట్కాఫ్ల డబ్బు నియమాలను అనుసరిస్తానని చెప్పొకొచ్చారు. "దురదృష్టవశాత్తు, యు.ఎస్. ట్రెజరీ, ఫెడ్ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. తమ బిల్లులు చెల్లించడానికి నకిలీ డబ్బును ముద్రిస్తున్నాయి. ఫెడ్, ట్రెజరీ చేస్తున్నది మనం చేస్తే జైలులో ఉంటాం " అన్నారు.‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేడు అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద అప్పులున్న దేశంగా నిలుస్తోంది. అందుకే "పొదుపు చేసేవారు నష్టపోతారు" అని నేను చాలాకాలంగా హెచ్చరిస్తున్నా’ అన్నారు. అందుకే బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథీరియంలను అవి క్రాష్ అయినప్పుడు కూడా కొంటున్నానని వివరించారు.CRASH COMING: Why I am buying not selling.My target price for Gold is $27k. I got this price from friend Jim Rickards….and I own two goldmines.I began buying gold in 1971….the year Nixon took gold from the US Dollar.Nixon violated Greshams Law, which states “When fake…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 9, 2025 -
భవిష్యత్తు బంగారు లోహం!
ఏడాది కాలంగా బంగారం, వెండి ధరలు అసాధారణ రీతిలో దూసుకుపోతున్నాయి. ధరల ర్యాలీతో సంతోషిస్తున్న పెట్టుబడిదారులు ఇప్పుడు కీలక దశలో ఉన్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో బంగారం, వెండి పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా.. లేదా అనే అనుమానం వ్యక్తం కావడమే ఇందుకు కారణం. ఈ తరుణంలో కామొడిటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కాపర్(రాగి) ఆకర్షణీయంగా కనిపిస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు. పారిశ్రామిక డిమాండ్, సరఫరా కొరత కారణంగా కాపర్ ధరలు సైతం కొంతకాలంగా పెరుగుతున్నాయి. దాంతో కాపర్ ‘భవిష్యత్తు బంగారం’(లాభాల పరంగా)గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాపర్ ధరలు గడచిన ఏడాది కాలంలో దాదాపు 25 శాతం పెరిగాయని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుతం కేజీ కాపర్ ధర సుమారు రూ.750గా ఉంది. ఇది 2026లో రూ.1500-రూ.1800 వరకు పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.అసలు బంగారం, వెండి ధరలు ఎందుకు పెరిగాయి?బంగారం, వెండి ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరగడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ అంశాలు దోహదపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ప్రజలు తమ డబ్బు విలువను కాపాడుకోవడానికి సురక్షితమైన పెట్టుబడి మార్గాల కోసం చూస్తారు. చరిత్రలో బంగారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పనిచేసే సాధనంగా ఉంది. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు అధికమయ్యాయి.అనేక దేశాల కేంద్ర బ్యాంకులు భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అస్థిరత నేపథ్యంలో తమ నిల్వలను పెంచుకోవడానికి భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేశాయి.సాధారణంగా యూఎస్ డాలర్ విలువ తగ్గినప్పుడు డాలర్ ఆధారిత బంగారం ఇతర కరెన్సీలు ఉన్న కొనుగోలుదారులకు చౌకగా మారుతుంది. తద్వారా డిమాండ్ పెరుగుతుంది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ దేశాల్లో సంక్షోభం వంటి సంఘటనలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. దీనితో పెట్టుబడిదారులు భద్రంగా ఉండే బంగారం వైపు మళ్లారు.ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వంటి పరిశ్రమల నుంచి వెండికి పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుంది.కాపర్ (రాగి) ధరల పెరుగుదలకు కారణాలు..ఒకప్పుడు కేవలం పారిశ్రామిక లోహంగా మాత్రమే పరిగణించబడిన కాపర్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మెటల్‌గా మారుతుంది. కొన్ని నివేదికల ప్రకారం కాపర్ లోహం గత రెండు దశాబ్దాల్లో దాదాపు 700 శాతం పెరిగింది. ఇది పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా గనుల్లో ఉత్పత్తి సమస్యలు, స్థానిక ఆందోళనలు, కొత్త గనుల అభివృద్ధిలో జాప్యం కారణంగా కాపర్ సరఫరా గణనీయంగా తగ్గింది. దీనికి తోడు పెరిగిన డిమాండ్ ధరలను మరింత పెంచింది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుండడం, భారీ స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, భవన నిర్మాణ రంగం నుంచి కాపర్‌కు డిమాండ్ బలపడుతోంది.భవిష్యత్తు అంచనామార్కెట్ నిపుణులు, మైనింగ్ దిగ్గజాలు రాగిని ‘తదుపరి బంగారం’గా పేర్కొంటున్నారు. కాపర్ ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఎలక్ట్రిక్ వాహనాలు: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో రాగి కీలక పాత్ర పోషిస్తుంది. ఒక సంప్రదాయ కారు కంటే ఒక ఎలక్ట్రిక్ కారుకు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ కాపర్ అవసరం అవుతుంది. ఈవీల అమ్మకాలు పెరిగే కొద్దీ కాపర్ డిమాండ్ అపారంగా పెరుగుతుంది.క్లీన్ ఎనర్జీ: పునరుత్పాదక ఇంధన వనరుల్లో ముఖ్యంగా సోలార్, పవన విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణకు కాపర్ అవసరం అనివార్యం. కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థల్లో రాగి కీలకమైన లోహం.డిజిటలైజేషన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు, 5G టెక్నాలజీ, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో కాపర్‌కు డిమాండ్ పెరుగుతోంది.కాపర్ వినియోగించే పరిశ్రమలుపరిశ్రమవినియోగంవిద్యుత్, ఎలక్ట్రానిక్స్వైర్లు, కేబుల్స్, మోటార్లు, జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (PCBs)నిర్మాణ రంగం హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు, పైపులు, రూఫింగ్రవాణాఎలక్ట్రిక్ వాహనాలు (EVs), రైల్వేలు, విమానయాన రంగంపునరుత్పాదక శక్తిసోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు, బ్యాటరీలుపారిశ్రామిక యంత్రాలుఉష్ణ మాపకాలు(Heat Exchangers), పంపులుగమనిక: పెట్టుబడికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తప్పనిసరని గమనించాలి.ఇదీ చదవండి: అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే.. -
ధరలు పెరుగుతాయ్.. వెండికి ఫుల్ డిమాండ్!
భారతదేశంలో బంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగి, అక్టోబర్ నెలలో రూ. 2 లక్షలకు (కేజీ) చేరుకుంది. అయితే నేడు (నవంబర్ 4) సిల్వర్ రేటు రూ. 1.65 లక్షల వద్ద ఉంది. అంటే ఏ స్థాయిలో వెండి రేటు తగ్గిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కానీ.. వెండి ధరలు భవిష్యత్తులో భారీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.భారీగా పెరిగిన వెండి ధరలు, కొనుగోలుదారులను కొంత కలవరపెట్టినా.. ఇటీవల కొంత తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎఎమ్‌సిలో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ప్రిన్సిపల్ 'చింతన్ హరియా' మాట్లాడుతూ.. వెండిని ఆభరణంగా మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో కూడా ఉపయోగిస్తారు. కాబట్టి వెండి వినియోగం పెరుగుతుంది. తద్వారా రేటు పెరుగుతుందని అన్నారు. వెండికి డిమాండ్ పెరుగుతూ ఉండటం వల్ల.. గత మూడేళ్ళలో సిల్వర్ రేటు 30శాతం పెరిగిందని పేర్కొన్నారు.వెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.ఈరోజు సిల్వర్ ధరలుఈరోజు (మంగళవారం) వెండి రేటు రూ. 3000 తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నగరాల్లో కేజీ సిల్వర్ రేటు రూ. 1.65 లక్షల వద్ద ఉంది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి ధర రూ. 1.51 లక్షల వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే.. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో సిల్వర్ రేటు కొంత తక్కువ అని తెలుస్తోంది.ఇదీ చదవండి: అంబానీ ఇంట్లో కనిపించని ఏసీ: యాంటిలియాలో ఎందుకిలా?


