బంగారం ధరల హీట్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. 2025 జనవరిలో రూ. 79వేలు వద్ద ఉన్న గోల్డ్ రేటు.. ఇప్పుడు రూ. 1.38 లక్షలకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే ఏడాదిలో రూ. 59వేలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. అంతే కాకుండా గత రెండు రోజులుగా పసిడి ధరలు గరిష్టంగా రూ. 4370 పెరిగింది.
హైదరాబాద్, విజయవాడలలో గోల్డ్ రేటు రెండు రోజుల్లో (డిసెంబర్ 22, 23) రూ. 4370 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,180 నుంచి రూ. 1,38,550 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,23,000 దగ్గర నుంచి రూ. 1,27,000 వద్దకు (రూ. 4000 పెరిగింది) చేరింది.
ఢిల్లీ నగరంలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. డిసెంబర్ 22, 23 తేదీల్లో రూ. 4370 పెరిగింది. దీంతో ఇక్కడ 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,38,700కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల రేటు రూ. 4000 పెరగడంతో రూ. 1,27,150 వద్దకు చేరింది.
చెన్నైలో పసిడి ధరలు పెరగడంతో.. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,39,310 వద్దకు (రూ. 4030 పెరిగింది), 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,27,700 వద్దకు (రూ. 3700 పెరిగింది) చేరింది.
వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా రెండు రోజుల్లో (సోమ, మంగళవారాలు) రూ. 8000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2.34 లక్షలకు చేరింది.


