భవిష్యత్తులో పవర్‌ఫుల్‌ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ ఇదే.. | Nvidia CEO Jensen Huang said about most powerful programming language | Sakshi
Sakshi News home page

భవిష్యత్తులో పవర్‌ఫుల్‌ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ ఇదే..

Feb 12 2026 11:12 AM | Updated on Feb 12 2026 11:19 AM

Nvidia CEO Jensen Huang said about most powerful programming language

సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ భవిష్యత్తు ప్రోగ్రామింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్తులో అత్యంత శక్తివంతమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సీ++ లేదా పైథాన్ వంటివి కాదని, అది మన ‘సహజ భాష’(ఇంగ్లీష్) అని ఆయన పేర్కొన్నారు.

సాంప్రదాయకంగా కంప్యూటర్లతో సంభాషించాలంటే క్లిష్టమైన సింటాక్స్ కలిగిన కోడింగ్ భాషలు అవసరం. అయితే జనరేటివ్ ఏఐ రాకతో ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. హువాంగ్ అభిప్రాయం ప్రకారం.. వినియోగదారులు క్లిష్టమైన కోడ్ రాయడానికి బదులు తమకు కావాల్సిన అంశాన్ని సాధారణ ఇంగ్లీషులో వివరిస్తే చాలు. ఏఐ వ్యవస్థలు ఆ ఆదేశాలను అర్థం చేసుకుని డిజిటల్ ఉత్పత్తులను సృష్టిస్తాయి. గతంలో కోడ్‌లోని లోపాలను మాన్యువల్‌గా టెస్టింగ్‌లో వెతకాల్సి ఉండేది. ఇప్పుడు వినియోగదారులు ఏఐ సిస్టమ్‌లతో సంభాషిస్తూ అవుట్‌పుట్‌ను సరిచేయమని ఆదేశిస్తే సరిపోతుంది. ఈ లూప్‌ సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని మరింత సులభతరం చేస్తోంది.

అధికారిక కోడింగ్ పరిజ్ఞానం లేని వారు కూడా తమ వ్యాపార ప్రక్రియలను ఆటోమేట్ చేసుకోవడానికి, డేటాను విశ్లేషించడానికి, కొత్త ప్రోటోటైప్‌లను రూపొందించడానికి ఈ మార్పు దోహదపడుతుందని చెబుతున్నారు.

డెవలపర్లు, పరిశ్రమపై ప్రభావం

జెన్సెన్ హువాంగ్ వ్యాఖ్యల తర్వాత, ఇకపై ప్రోగ్రామింగ్ భాషలు అదృశ్యమవుతాయా? అనే సందేహం కలగడం సహజం. కానీ వాస్తవానికి సీ++, పైథాన్ వంటి కంప్యూటర్‌ భాషలు ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే డెవలపర్లు ఇకపై కేవలం సింటాక్స్ రాయడంపై కాకుండా సమస్యను స్పష్టంగా నిర్వచించడం, ఏఐని సమర్థవంతంగా మార్గనిర్దేశం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తార్కిక, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరింత కీలకం కానున్నాయి.

ఇదీ చదవండి: బీహెచ్‌ఈఎల్‌లో వాటాల విక్రయానికి భారీ స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement