బీహెచ్‌ఈఎల్‌లో వాటాల విక్రయానికి భారీ స్పందన | Govt Launched An Offer Sor Sale For BHEL Shares, It Sees Strong Response, Day 1 OFS Subscribed Over Twice | Sakshi
Sakshi News home page

బీహెచ్‌ఈఎల్‌లో వాటాల విక్రయానికి భారీ స్పందన

Feb 12 2026 8:23 AM | Updated on Feb 12 2026 10:19 AM

govt launched an Offer for Sale for BHEL shares

ప్రభుత్వ రంగ బీహెచ్‌ఈఎల్‌లో కేంద్ర ప్రభుత్వ వాటాల విక్రయానికి భారీ స్పందన లభించింది. తొలిరోజైన బుధవారం నాడు ఓఎఫ్‌ఎస్‌ (ఆఫర్‌ ఫర్‌ సేల్‌)కి 2.3 రెట్లు సబ్ర్‌స్కయిబ్‌ అయ్యింది. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 5,650 కోట్ల విలువ చేసే బిడ్లను దాఖలు చేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లకు 9.40 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా రూ. 256.07 రేటుపై 22.07 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు గురువారం బిడ్‌ చేయొచ్చు. ఓఎఫ్‌ఎస్‌కి మంచి స్పందన లభిస్తున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి అరుణిష్‌ చావ్లా తెలిపారు.

బీహెచ్‌ఈఎల్‌లో వాటాల విక్రయానికి సంబంధించి బేస్‌ ఇష్యూ పరిమాణం 10.44 కోట్లు (3 శాతం) కాగా, గ్రీన్‌షూ ఆప్షన్‌ కింద మరో 6.96 కోట్ల షేర్లను (2 శాతం) కేంద్రం విక్రయిస్తోంది. ఒక్కో షేరుకి రూ. 254 ధర చొప్పున బీహెచ్‌ఈ ఎల్‌లో  17.41 కోట్ల షేర్లను (5 శాతం వాటా) విక్రయించడం ద్వారా రూ. 4,422 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. కంపెనీలో ప్రభుత్వానికి 63.17 శాతం వాటా ఉంది.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట

Advertisement
 
Advertisement
Advertisement