బెంగళూరు(బనశంకరి): బెంగళూరులో డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు విదేశీయులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.29 కోట్ల విలువ చేసే 10.36 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్, 8 కేజీల హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చామరాజపేటేలోని పోస్టాఫీస్‌లో డ్రగ్స్ పార్శిల్స్ వచ్చినట్లు తెలిసి పోలీసులు సోదాలు చేయగా 8 కిలోల హైడ్రో గంజాయి లభించింది. మరోఘటన.. బెంగళూరు విమానాశ్రయంలో ఓ ప్రయాణికుని నుంచి కోట్ల రూపాయల విలువైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


