శబరిమలకు భక్తుల రద్దీ పెరిగింది. పెద్దఎత్తున స్వాములు ఇరుముడితో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అటవీ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకం నిషేదమని ఆదేశాలు జారీ చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల ప్రకారం అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ పారవేయడం తీవ్ర నేరమని కనుక స్వాములెవ్వరూ ప్లాస్టిక్ వస్తువులతో సన్నిధానానికి రాకూడదని ఆదేశాలు జారీ చేసింది.
అటవీ శాఖ ఆదేశాల నేపథ్యంలో అక్కడి అలువా నది వద్ద స్వాముల వద్ద నున్న ప్లాస్టిక్ కవర్లు తీసుకొని వాటి స్థానంలో పేపర్ బ్యాగులు స్వాములకు ఇస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువుల వాడకంతో అటవీ ప్రాంతంతో పాటు పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉందని కనుక స్వాములెవరూ ప్లాస్టిక్ వస్తువులు స్వామివారి సన్నిధానానికి తీసుకురాకూడదని అధికారులు సూచించారు. ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


