అడవే సేద్యానికి ఆధారం | Sagubadi: Forests are an important renewable resource check here | Sakshi
Sakshi News home page

అడవే సేద్యానికి ఆధారం

Nov 28 2025 9:57 AM | Updated on Nov 28 2025 10:34 AM

Sagubadi: Forests are an important renewable resource check here

అడవుల నరికివేతతో ఏటా 28 వేల మరణాలు : స్థానికంగా అడవులు నీడ, బాష్పీభవన ప్రేరణ ద్వారా చల్లని సూక్ష్మ వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఉష్ణ ఒత్తిడిని తగ్గిస్తాయని నివేదిక వివరించింది. అదే సమయంలో అటవులను నిర్మూలిస్తే ఆ కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇది వ్యవసాయం పైన మాత్రమే కాకుండా మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, 2001–2020 మధ్య, ఉష్ణమండలంలో అడవుల నరికివేత వల్ల ఏటా సుమారు 28,000 అదనపు ఉష్ణ సంబంధిత మరణాలకు దారితీసిందని ఎఫ్‌ఏవో అంచనా. అటవీ విస్తీర్ణం తగ్గితే పర్యావరణ సమస్యలు రావటంతో ΄ాటు ప్రజారోగ్యానికి ముప్పు ఎలా వస్తోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 

అడవులు, చెట్లు వ్యవసాయానికి ముఖ్యమైన అనేక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. పరాగ సంపర్కం, తెగుళ్ల జీవ నియంత్రణ, పోషక చక్రం పరిరక్షణ, రక్షక కవచం, వాతావరణ నియంత్రణ వంటి ప్రయోజనాలు చేకూరతాయి. ఇవి పంట దిగుబడిని పెంచుతాయి. పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతాయని ఎఫ్‌ఏవో పేర్కొంది. అందువల్ల అడవులు, చెట్లను వ్యవసాయ పొలాలతో ఆశ్రయ కేంద్రాలు, నదీ తీర బఫర్‌ జోన్లు, అటవీ ప్రాంతాలుగా అనుసంధానించి అభివృద్ధి చేసే విధానాలనుపాలకులు రూపొందించటం చాలా ముఖ్యం. ఈ వ్యూహాలు వ్యవసాయంలో కృత్రిమ ఎరువులు తదితర ఉత్పాదకాల వినియోగంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. పంట  పొలాలకు ప్రతికూల వాతావరణ పరిస్థితులను దీటుగా తట్టుకునే శక్తినిస్తాయి. వైవిధ్యమైన,  పోషక–సాంద్రత కలిగిన ఆహార పదార్థాల ఉత్పత్తికి దోహదం చేస్తాయని నివేదిక పేర్కొంది.

‘అడవి–వ్యవసాయం మధ్య పోటీ లేద’ని ఆహార వ్యవసాయ సంస్థ (యూఎన్‌–ఎఫ్‌ఏవో) తెలిపింది. బ్రెజిల్‌లో ఇటీవల ముగిసిన వాతావరణ మార్పుపై అంతర్జాతీయ శిఖరాగ్ర వార్షిక సమావేశం (కాప్‌ 30) సందర్భంగా ఒక కీలకమైన నివేదికను ఎఫ్‌ఏవో వెలువరించింది. ‘అడవులు, చెట్లు వ్యవసాయం కోసం వాతావరణ, పర్యావరణ సేవల ప్రయోజనాలు 2025’ పేరిట ఈ నివేదికను ఎఫ్‌ఏవో విడుదల చేసింది. చెట్లు, అడవుల వల్ల వ్యవసాయానికి ఒనగూరే ప్రయోజనాలను లెక్కగట్టే పద్ధతులను ఈ నివేదిక వెల్లడించింది. ఆహార భద్రత అడవులపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయ పొలాల్లో ఉత్పాదకతను పెంచడానికి అడవుల పరిరక్షణ, పునరుద్ధరణ కీలకమైన చర్యలుగా ఉపయోగపడతాయని నివేదిక వెల్లడించింది. 

ప్రపంచ అడవులు భూగోళంపైన వ్యవసాయ–ఆహార పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసే ముఖ్యమైన సేవలను అందిస్తాయి. అయితే, ఈ సేవల విలువను చాలా సార్లు తక్కువగా అంచనా వేస్తుండటం విచారకరం. అందుకే ఈ రెండు రంగాలను సమన్వయంతో అభివృద్ధి చేసేలా తగిన విధానాలు రూపొందించాలి, పెట్టుబడులను  ప్రోత్సహించాలని నివేదిక పిలుపునిచ్చింది. వ్యవసాయ విస్తరణ కోసం భూమి అవసరమైనప్పుడల్లా అడవులు, చెట్లు వ్యవసాయంతో  పోటీ ఏర్పడుతుంది. కానీ, అడవులను సంరక్షించడం, పునరుద్ధరించడం వాస్తవానికి వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించటానికి దోహదం చేసే చాలా ముఖ్యమైన పని’ అని ఎఫ్‌ఏవో ఫారెస్ట్రీ డైరెక్టర్‌ డా. జిమిన్‌ వు అన్నారు.

అడవులు, చెట్ల వల్లే 50% వర్షపాతం 
ఎఫ్‌ఏవో, స్టాక్‌హోమ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్, కన్జర్వేషన్‌ ఇంటర్నేషనల్, ది నేచర్‌ కన్జర్వెన్సీ సంయుక్తంగా ప్రచురించిన నివేదిక ఇది. అడవుల నరికివేత వల్ల వాతావరణంపై, వ్యవసాయంపై తక్షణం పడే ప్రభావాలను, కొలవగల ప్రభావాలను ఈ నివేదిక నొక్కి చెబుతుంది. అడవులను పరిరక్షిస్తే కలిగే ప్రయోజనాలు.. పర్యావరణ వ్యవస్థలు ఉష్ణోగ్రతలను తగ్గించడంతోపాటు వర్షపాతాన్ని నిలబెట్టుకుంటాయి. నీటి చక్రాన్ని నియంత్రిస్తాయి. పంట ఉత్పాదకతపై నేరుగా ప్రభావం చూపుతాయి. స్థానిక వాతావరణ  పరిస్థితులను స్థిరీకరిస్తాయి. గ్రామీణ ప్రజల ఆరోగ్యం, భద్రత, జీవనోపాధిని మెరుగుపరుస్తాయి.

155 దేశాల్లోని వ్యవసాయ భూములు ఇతర దేశాల్లోని అడవులు అందించే పర్యావరణ సేవలపై ఆధారపడి వార్షిక వర్షపాతంలో 40%  పొందుతున్నాయి. ఇది ముఖ్యంగా ఆఫ్రికాకు వర్తిస్తుంది. ఒక సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 శాతం వర్ష΄ాతం అడవులు, చెట్లు వాతావరణంలోకి వదిలే నీటి తేమ ద్వారా లభిస్తుంది. కాంగో వర్షారణ్యం దాని తేమలో 40 శాతానికి పైగా స్థానికంగా రీసైకిల్‌ చేస్తుంది. ఆఫ్రికాలో మారుమూల వ్యవసాయ ప్రాంతాలకు కూడా 10 శాతానికి పైగా వర్షపాతాన్ని అందిస్తుందని ఈ నివేదిక వెల్లడించింది.  


సగం అడవులను పునరుద్ధరిస్తే 1 డిగ్రీ వేడి తగ్గుతుంది
ప్రపంచంలో కోల్పోయిన ఉష్ణమండల అడవుల్లో సగాన్ని పునరుద్ధరిస్తే నేలపై ఉష్ణోగ్రతలు 1 డిగ్రీల సెల్సియస్‌ మేరకు తగ్గుతాయి. వ్యవసాయం, నీటి భద్రత సాధన కోసం అడవులు చెట్ల నీటి చక్రాల పునరుద్ధరణకు, వాతావరణ నియంత్రణ విధులను పునరుద్ధరణకు ఇది సహాయపడుతుంది. అయితే, ఈ లక్ష్యాల సాధన కోసం అడవుల పునరుద్ధరణకు దృఢచిత్తంతో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక ్ర΄ోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని నివేదిక వివరించింది. ఆహార భద్రత, ప్రజారోగ్యం, వాతావరణ ప్రతికూలతలను తట్టుకోవటం కోసం సుస్థిరమైన అటవీ నిర్వహణ బాధ్యతను బహుళ రంగాలకు ప్రయోజనం చేకూర్చే వ్యూహంగా గుర్తించాలని ఎఫ్‌ఏవో నివేదిక పేర్కొంది.

రైతులు, స్థానిక ఆదివాసీ సమాజాలను భాగస్వాముల్ని చెయ్యాలి. అటవీ పునరుజ్జీవన, పరిరక్షణ పథకాల రూపుకల్పనలో, పర్యవేక్షణ కార్యకలాపాలను మెరుగుపరచడంలో వారిని పాల్గొనేలా చేయడం ద్వారా వారికి సాధికారత కల్పించాలి. అటవీ సంరక్షణ, పునరుద్ధరణ, సుస్థిరమైన పద్ధతుల్లో అడవిని ఉపయోగించుకోవటంపై పెట్టే పెట్టుబడులన్నీ వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం కోసం, గ్రామీణ జీవనోపాధులు పెంపొందించటం కోసం, ప్రపంచ ఆహార భద్రత, నీటి భద్రత కల్పించటం కోసం పెట్టే మంచి పెట్టుబడులేనని అర్థం చేసుకోవాలి. అడవిని వ్యవసాయంతో సమన్వయీకరించి ్ర΄ోత్సహించడం ద్వారా ప్రజలు మరింత ఉత్పాదక, సుస్థిరమైన, సమానతతో కూడిన భవిష్యత్తు కోసం పని చేయటం సాధ్యపడుతుందని నివేదిక చివరలో ఎఫ్‌ఏవో స్పష్టం చేసింది.

అడవి... వ్యవసాయానికి శత్రువని సాధారణంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే, అది నిజం కాదు. నిజానికి అడవుల వల్ల వ్యవసాయానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అడవి, చెట్లు అందించే పర్యావరణ సేవలు వ్యవసాయాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడే శక్తిస్తాయి. వర్షపాతం తగినంత పొందటానికి అడవులు అత్యవసరం. పంట భూముల్లో భూసారాన్ని పెంచుకునేందుకు అడవులు దోహదపడతాయి. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఉండే అడవులు ఆ అడవులున్న దేశాలకే కాదు వందలాది ఇతర దేశాలకు కూడా పర్యావరణ సేవలు అందిస్తున్నాయని గుర్తించండి. అడవి ఏ దేశ భూభాగంలో ఉన్నప్పటికీ అంతర్జాతీయ సంపదేనని గమనంలో పెట్టుకోండి. ఈ వ్యవసాయ  ‍ ప్రాణాధార అడవుల్లో నరికివేసిన విస్తీర్ణంలో సగానికి సగంలోనైనా తిరిగి చెట్లను పెంచితే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయానికి భూతాపోన్నతిని తట్టుకొని నిలబడే వనరులను సమకూర్చుతుందని పాలకులు గుర్తెరగాలి.అందుకు అనుగుణంగా విధానాలను రూపొందించి అమల్లోకి తేవాలి. స్థానిక ప్రజలను, రైతులను ఈ అడవుల పునరుజ్జీవన కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేస్తే లక్ష్యం సాధించటం సులభమవుతుంది. అడవిని రక్షించుకుంటే వ్యవసాయం చల్లగా పది కాలాలు బతుకుతుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (యూఎన్‌–ఎఫ్‌ఏవో) ఇటీవల వెలువరించిన ఓ కీలక నివేదికలో ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసింది. 

ఉష్ణమండదేశాల్లో అడవి ఏ దేశంలో ఉన్నప్పటికీ విదేశాల్లో సేద్యానికి మేలు  

‘‘155 దేశాల్లోని వ్యవసాయ భూముల్లో కురిసే వార్షిక వర్షపాతంలో 40% ఇతర దేశాల్లోని అడవులందించే పర్యావరణ సేవలే 
ఆధారం’’

‘‘వ్యవసాయ విస్తరణ కోసం భూమి అవసరమైనప్పుడల్లా అడవులు, చెట్లు వ్యవసాయంతో ΄ోటీ ఏర్పడుతుంది. కానీ, అడవులను సంరక్షించడం, పునరుద్ధరించడం వాస్తవానికి వ్యవసాయ ఉత్పాదకతను పెం΄÷ందించటానికి దోహదం చేసే చాలా ముఖ్యమైన పని!’’– డా. జిమిన్‌ వు, ఫారెస్ట్రీ డైరెక్టర్, యూఎన్‌–ఎఫ్‌ఏవో   

– నిర్వహణ: 
పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement