సాక్షి, యాదాద్రి భువనగిరి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో జాతీయ రహదారి-65పై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతికి ఇప్పటికే లక్షలాదిగా పట్నంవాసులు ఏపీకి తరలి వెళ్లారు. ఇవాళ రాత్రి వరకు కూడా వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. లక్షలాదిగా వాహనాలు ఏపీ వైపు వెళ్లడంతో టోల్ ప్లాజా నిర్వాహకులకు సైతం భారీగా ఆదాయం వస్తోంది. మరోవైపు.. ఆదాయం వస్తున్నా పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజా నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని వాహనదారులు మండిపడుతున్నారు.


