కొమ్మల్లో దాగింది కొంటె చిలకమ్మ! | Expensive African Grey Parrot Causes a Stir in Srinagar Colony | Sakshi
Sakshi News home page

కొమ్మల్లో దాగింది కొంటె చిలకమ్మ!

Mar 4 2026 7:23 AM | Updated on Mar 4 2026 7:23 AM

Expensive African Grey Parrot Causes a Stir in Srinagar Colony

ఇంట్లోంచి పారిపోయి.. చెట్లపై వాలిపోయి..

ముప్పుతిప్పలు పెట్టిన అరుదైన ఆఫ్రికన్‌ గ్రే ప్యారట్‌   

3 గంటలు శ్రమించి పట్టుకున్న 4 ప్రభుత్వ శాఖల సిబ్బంది

హైదరాబాద్‌: అది ఖరీదైన, అరుదైన ఆఫ్రికన్‌ గ్రే చిలక. శ్రీనగర్‌ కాలనీలోని ఓ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఆదివారం రాత్రి ఇంట్లోంచి తుర్రుమంది. దీంతో ఆ కుటుంబమంతా విలవిలలాడింది. బ్యాటరీ లైటుతో రాత్రంతా గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో  ఓ చెట్టు కొమ్మ సందుల్లో కనిపించింది. కిందికి తీసుకొచ్చేందుకు యతి్నంచినా ఫలితం లేకుండాపోయింది. 

పోలీసులు ఫైర్‌ ఇంజిన్‌కు, హైడ్రాకు సమాచారం ఇచ్చారు. ఫైర్‌ ఇంజిన్‌ అక్కడకు చేరుకుని నిచ్చెన పైకి లేపేందుకు యత్నిస్తుండగా శబ్దానికి ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి ఎగిరిపోయింది. దీంతో జీహెచ్‌ఎంసీ వీధి దీపాల విభాగానికి సమాచారమిచ్చారు. వారు బకెట్‌ క్రేన్‌లో కుటుంబ యజమానిని కూర్చోబెట్టి అలికిడి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెట్ల కొమ్మల్లోని చిలకను 3 గంటల పాటు పోలీసులు, హైడ్రా సిబ్బంది, ఫైర్‌ సిబ్బంది, జీహెచ్‌ఎంసీ వీధి దీపాల విభాగం సిబ్బంది ప్రయతి్నంచి విజయం సాధించారు. ఆఫ్రికన్‌ గ్రే చిలకను పట్టుకోవడానికి నాలుగు ప్రభుత్వ శాఖల సిబ్బంది శ్రమించడం కొసమెరుపు.    

Advertisement
 
Advertisement
Advertisement