గల్ఫ్‌ దేశాల్లో ఉన్న భారతీయులకు గుడ్‌న్యూస్‌.. | Indian airlines plan to operate 58 flights to Middle East On 4th March | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ దేశాల్లో ఉన్న భారతీయులకు గుడ్‌న్యూస్‌.. 58 విమానాలు..

Mar 4 2026 7:54 AM | Updated on Mar 4 2026 8:35 AM

Indian airlines plan to operate 58 flights to Middle East On 4th March

ఢిల్లీ: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. భీకర యుద్ధం నేపథ్యంలో గల్ప్‌ దేశాల్లో చిక్కుకున్న భారతీయులు.. స్వదేశం చేరుకుంటున్నారు. అబుదాబి విమానాశ్రయంలో చిక్కుకున్న వంద మందిని ఎతిహాద్ ఎయిర్ వేస్ విమానం కొచ్చి విమానాశ్రయానికి చేర్చింది. మరోవైపు.. నేడు గల్ఫ్‌ దేశాలకు 58 విమానాలు నడపనున్న విమానయాన సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి.

వివరాల మేరకు.. నేడు గల్ప్‌ దేశాలకు ఇండిగో 30, ఎయిరిండియా 23 విమానాలు నడపనున్నట్లు విమానయానశాఖ వెల్లడించింది. అలాగే, గల్ఫ్‌లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం అదనపు విమానాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు.. విమాన టికెట్ ధరలు పెరగకుండా నిరంతరం కేంద్రం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది. ఇదిలా ఉండగా.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల కొచ్చి నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాల్సిన 31 విమానాలు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఇండిగో, ఆకాశ ఎయిర్ లైన్స్ సంస్థలు పలు విమాన సర్వీసులను రద్దు చేశాయి.

ఇక, ​యుద్ధం కారణంగా ఇప్పటివరకు భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 1,221 విమానాలు,  విదేశీ విమానయాన సంస్థల నుంచి 388 విమానాలు రద్దు అయినట్టు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.a అలాగే, ‍ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. గల్ప్‌ దేశాల నుంచి భారత్‌ చేరుకు​న్న ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ వాతావరణంలో తాము భయానక పరిస్థితులను వెల్లడిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement