82 ఏళ్ల మహిళకు అప్పర్‌ బెర్తా? IRCTC క్లారిటీ ఇది! | 82 Years Woman Allotted Upper Berth Indian Railways Reacts | Sakshi
Sakshi News home page

82 ఏళ్ల మహిళకు అప్పర్‌ బెర్తా? IRCTC క్లారిటీ ఇది!

Mar 2 2026 1:00 PM | Updated on Mar 2 2026 2:27 PM

82 Years Woman Allotted Upper Berth Indian Railways Reacts

సీనియర్‌ సిటిజెన్‌ అని ప్రత్యేకంగ పేర్కొన్నప్పటికీ, రైల్వే రిజర్వేషన్‌ సమయంలో చాలా మందికి లోయర్‌ బర్త్‌లు ఎలాట్‌ కావు. పైగా అప్పర్‌  బర్త్‌లు కేటాయించడం  ఒక్కోసారి  చాలా కోపం తెప్పిస్తుంది. అలా కాసేపు రైల్వేస్‌ని తిట్టుకుని ఊరుకోకుండా  ఒక వ్యక్తి దీనిపై ఫిర్యాదు చేయడం నెట్టింట చర్చకు దారి తీసింది. 82ఏళ్ల మహిళకు అప్పర్ బెర్త్ కేటాయించారని వ్యక్తి ఫిర్యాదుపై భారతీయ రైల్వేస్‌ ఎలా స్పందించింది. సీనియర్‌ సిటిజన్లకు లోయర్‌  బెర్త్‌ రావాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం ఈ కథనంలో..

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్‌ (IRCTC) వెబ్‌సైట్‌ ద్వారా రైల్వే టికెట్‌ బుక్‌ చేసుకుంటే 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్బిణులు ట్రైన్లలో లోయర్‌ బెర్త్‌లు పొందే అవకాశముంది. కానీ తాజాగా 82 ఏళ్ల వృద్దురాలికి ట్రైన్‌లో పైబెర్త్ కేటాయించడంపై   సోషల్‌ మీడియా ద్వారా రైల్వేశాఖను ప్రశ్నించాడు. “82 ఏళ్ల మహిళ కోసం ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేశాను. చాలా సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ అప్పర్ బెర్త్ కేటాయించారు. ఇప్పుడు అదే లోయర్ బెర్త్‌లను ప్రీమియం తత్కాల్ కేటగిరిలో అధిక ధరలకు అమ్ముకున్నారు” అంటూ ఐఆర్‌సీటీసీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. దీనిపై ఐఆర్‌సీటీసీ స్పందించింది క్లారిటీ ఇచ్చింది.

ఐఆర్‌సీటీసీ ఏమందీ అంటే..
ఈ వైరల్ పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ, కార్పొరేషన్ సీనియర్ సిటిజన్లు 45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణీకులకు లోయర్ బెర్త్ కేటాయింపుకు సంబంధించి నియమాలను స్పష్టం చేసింది.

"సర్, భారత రైల్వేల కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్‌లో, సీనియర్ సిటిజన్లు మరియు 45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణీకులకు, వేరే మార్గం లేకపోయినా, స్వయంచాలకంగా లోయర్ బెర్త్ కేటాయించే నిబంధన ఉంది. అయితే, ఇది బుకింగ్ సమయంలో అటువంటి లోయర్ బెర్త్‌ల లభ్యతకు లోబడి ఉంటుంది. ఇంటర్నెట్ ద్వారా రిజర్వ్ చేయబడిన టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో, లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే బుకింగ్‌ను ఎంచుకునే నిబంధన ఉందని కూడా  ఉంది.  ఈ సందర్భంలో లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే టికెట్ బుక్  అవుతుంది. అంతేకాకుండా, ఇండియన్ రైల్వేలలో, రిజర్వ్ చేయబడిన వసతిని ఫస్ట్‌ కమ్‌ఫస్ట్‌ సర్వ్‌  కింద బుక్‌ అవుతుంది. ఎంపిక చేసుకున్న బెర్త్ లభ్యతకు లోబడి కేటాయించబడుతుంది" అని IRCTC  వివరణ ఇచ్చింది. 

లోయర్‌ బెర్త్‌ కావాలంటే  ఈ చిట్కా పాటించాలట

 

ఇలాంటి వివాదంలో  గతంలో  ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE)  ఇచ్చిన వివరణ ఇచ్చారు. ఇది చాలామంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న గందరగోళాన్ని తొలగించడంలో సహాయపడింది. "మీరు సీనియర్ సిటిజన్ కోటాలో లోయర్ బెర్త్ పొందాలనుకుంటే, ఒకే టికెట్‌లో ఇద్దరు ప్రయాణీకులను మాత్రమే బుక్ చేసుకోవాలి.  అలా కాకుండా ఒకే టికెట్‌లో ఇద్దరు కంటే ఎక్కువ మందిని చేర్చినట్లయితే, కోటా ప్రయోజనాలు రద్దు అవుతాయని టీటీ వివరించారు.

 

ఇదీ చదవండి : తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?

భారతీయ రైల్వేస్‌లో సీనియర్ సిటిజన్ కోటా ఆటోమేటిక్ లోయర్ బెర్త్ కేటాయింపు లభ్యతను బట్టి 60 ఏళ్లు, అంతకు పైబడిన పురుషులకు, 45 ఏళ్లకంటే ఎక్కువ వయస్సున్న మహిళలకు లోయర్ బెర్త్‌లు కేటాయించ బడతాయి. టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణీకులు వయస్సు రుజువును అందించాల్సిన అవసరం లేదు. అయితే, వారు ప్రయాణ సమయంలో వారి వయస్సును చూపించే చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి . టికెట్ తనిఖీ సిబ్బంది అడిగినప్పుడు దానిని చూపించాలి.

ఇదీ చదవండి: విజయ్‌కు మరో ఎదురుదెబ్బ, జ్యోతిష్కుడి సంచలన అంచనాలు
 

Advertisement
 
Advertisement
Advertisement