2016 డిసెంబరులో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సంచలనమైంది. రూ.500 , రూ.1,000 నోట్లు రాత్రికి రాత్రే రద్దు చేయడంతో దేశ ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు కొంత సయమాన్ని కూడా ఇచ్చింది. అయితే ఆ సమయంలో పెద్ద నోట్లను మార్చుకునేందుకు ప్రజలు క్యూలైన్లలో అష్టకష్టాలు పడ్డారు. ఈ సందర్భంగా అనేక విషాద ఘటనలు కూడా నమోదైనాయి. అంతేకాదు ఇంట్లో అల్మారాలు, లాకర్లు లేదా మరచిపోయిన పెట్టెల్లో దాచిపెట్టి మర్చిపోయిన పాత కరెన్సీ నోట్ల కట్టలకు సంబంధించి అనేక హృదయ విదారక కథనాలను కూడా చదివాం. కానీ ఇన్నేళ్ల తరువాత కూడా అలాంటి కథ ఒకటి నెట్టింటవైరల్ గా మారింది.
పెద్ద నోట్ల రద్దైన దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఒక మహిళ తన భర్త నుండి దాచిన రూ.500 , రూ.1,000 నోట్లను గుర్తించింది. దీనికి సంబంధించి ఆమె కుమార్తె రికార్డ్ చేసిన వీడియో ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను (@ayushidixit) అనే వినియోగదారు షేర్ చేశారు. దీని ప్రకారం పాతనోట్లను గుర్తించిన తరువాత తీవ్ర ఆందోళనకు లోనైంది. కంటతడి పెడుతోంది నాన్నకు తెలియకుండా వీటిని దాచింది. ఇపుడు వీటిని బ్యాంకులు అంగీకరిస్తాయా లేదా అంటే తన ఫాలోయర్స్‌ను ఉద్దేశించి ప్రశ్నిస్తుండటాన్ని ఈ క్లిప్‌లో చూడవచ్చు.
ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త
నెటిజన్లు ఏమన్నారంటే
వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. అయ్యో.. ఆంటీ తొమ్మిదేళ్ల తరువాత గుర్తొచ్చిందా ఆంటీ అని కొందరు అంటే, దీనిపై మీ డాడీ రియాక్షన్ కూడా రికార్డ్ చేయ్యి, ఆయన ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని కొందరు చమత్కరించారు. ఆర్బీఐతో మాట్లాడండి.. ఏమైనా ప్రమోజనం ఉంటుందేమోఅని మరికొందరు సలహా ఇచ్చారు.
ఇదీ చదవండి: లాస్ట్ మినిట్‌లో సెలవు రద్దు, జెన్ జెడ్ స్పందన వైరల్


