బెంగళూరు నగరంలో వసంతం ముందుగానే వస్తుంది. ప్రతీ వసంతంలో 'పింక్ ప్యారడైజ్'లా అద్భుతమైన అందతో అలరారుతుంది. అచ్చం జపాన్‌లోని 'చెర్రీ బ్లాసమ్స్' లాగే బెంగళూరులోని ఈ పూలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఆకాశం నుండి చూస్తే గులాబీ దుప్పటి కప్పుకున్నట్టుగా కనిపించే ఈ అద్భుత దృశ్యం వెనుక ఒక గొప్ప వ్యక్తి కృషి ఉంది. పింక్ పూలతో స్వాగతం పలుకుతున్న బెంగళూరు వీధులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బెంగళూరు 'పింక్ ప్యారడైజ్' వెనుక ఉన్న హీరో గురించి తెలుసుకుందాం.
గార్డెన్ సిటీ బెంగళూరు ఇపుడు పింక్ ప్యారడైజ్‌లా దర్శనమివ్వడానికి కారణం సేతురాం గోపాల్‌రావు నేగిన్హాల్ అనే అటవీ అధికారి. ఆయన కేవలం అటవీ శాఖ అధికారిగా మాత్రమే కాకుండా, ఒక దార్శనికుడిగా పనిచేశారు. కర్ణాటక కేడర్‌కు చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ సేతురామ్ గోపాలరావు నెగినహాల్ (S.G. Neginhal). 1980వ దశకంలో బెంగళూరు నగరం వేగంగా విస్తరిస్తున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి గుండూ రావు నగరాన్ని పచ్చదనంతో నింపే బాధ్యతను నెగినహాల్‌కు అప్పగించారు. అంతే అప్పటివరకు అడవుల పెంపకానికే పరిమితమైన అటవీశాఖ, మొదటిసారిగా నగర వీధుల్లో మొక్కలు నాటడం ప్రారంభించింది అటవీశాఖ. నెగినహాల్ కేవలం చెట్లను నాటడమే కాదు, ఏ వీధిలో ఏ చెట్టు ఉండాలో చాలా శాస్త్రీయంగా నిర్ణయించారు. 1982-1987 వీధివీధిన స్థానికులను అడిగి మరీ సుమారు 15 లక్షల మొక్కల్ని నాటించారు. మొక్కల్ని నాటడంతోనే చేతులు దులుపేసుకోలేదు ఆయన. నాటిన మొక్కల్ని పశువులు, ప్రజల నుండి కాపాడటం మొదలు, వాటిని సంరక్షణ లాంటి అనేక సవాళ్లను శ్రద్ధగా నిర్వహంచారు.
నెగినహాల్ అద్భుతమైన ప్రణాళిక
బెంగళూరు వీధుల్లో ఒకేసారి ఒకే రంగు పూలు పూసేలా ఆయన ప్లాన్ చేశారు. వసంత కాలం వస్తే ఒక వీధి అంతా పసుపు రంగులో (Tabebuia Argentea), మరో వీధి అంతా గులాబీ రంగులో (Tabebuia Rosea) కనిపిస్తుంది.

టాబెబుయా రోసియా (Tabebuia Rosea): ఇప్పుడు మనం చూస్తున్న ఈ గులాబీ రంగు పూల చెట్లు నిజానికి విదేశీ జాతికి చెందినవి. ఇవి బెంగళూరు వాతావరణానికి బాగా సరిపోతాయని ఆయన గుర్తించి వేల సంఖ్యలో నాటించారు. (గర్ల్ ఫ్రెండ్ ద్వారానే ఎల్ మెంచో కథ ఖతం)

2024లో నెగినహాల్ ఈ భౌతిక ప్రపంచానికి దూరమైనా ఆయన నాటిన లక్షలాది చెట్లు ప్రతి ఏటా వసంత కాలంలో విరగబూస్తూ ఆయన ఉనికిని గుర్తు చేస్తుండటం విశేషం. ముఖ్యంగా కబ్బన్ పార్క్, లాల్‌బాగ్, మల్లేశ్వరం, జయనగర్ తదితర వీధుల్లో పూలు పూసినప్పుడు నేలంతా గులాబీ రంగు పూల రేకులతో నిండి పోయి అద్భుతంగా కనింపించే దృశ్యాన్ని చూసి తరించాల్సిందే. ఆయన దార్శనికత మరింతమందికి ఆదర్శం కావాలని ఆశిద్దాం.
ఇదీ చదవండి: టీనేజ్ డ్రైవర్ : విషాదాంతమైన గోవా టూర్, వీడియో వైరల్


