breaking news
Pink Flowers
-
పింక్ ప్యారడైజ్‌గా బెంగళూరు, వైరల్ వీడియోలు : హీరో ఈయనే
బెంగళూరు నగరంలో వసంతం ముందుగానే వస్తుంది. ప్రతీ వసంతంలో 'పింక్ ప్యారడైజ్'లా అద్భుతమైన అందతో అలరారుతుంది. అచ్చం జపాన్‌లోని 'చెర్రీ బ్లాసమ్స్' లాగే బెంగళూరులోని ఈ పూలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఆకాశం నుండి చూస్తే గులాబీ దుప్పటి కప్పుకున్నట్టుగా కనిపించే ఈ అద్భుత దృశ్యం వెనుక ఒక గొప్ప వ్యక్తి కృషి ఉంది. పింక్ పూలతో స్వాగతం పలుకుతున్న బెంగళూరు వీధులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బెంగళూరు 'పింక్ ప్యారడైజ్' వెనుక ఉన్న హీరో గురించి తెలుసుకుందాం.గార్డెన్ సిటీ బెంగళూరు ఇపుడు పింక్ ప్యారడైజ్‌లా దర్శనమివ్వడానికి కారణం సేతురాం గోపాల్‌రావు నేగిన్హాల్ అనే అటవీ అధికారి. ఆయన కేవలం అటవీ శాఖ అధికారిగా మాత్రమే కాకుండా, ఒక దార్శనికుడిగా పనిచేశారు. కర్ణాటక కేడర్‌కు చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ సేతురామ్ గోపాలరావు నెగినహాల్ (S.G. Neginhal). 1980వ దశకంలో బెంగళూరు నగరం వేగంగా విస్తరిస్తున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి గుండూ రావు నగరాన్ని పచ్చదనంతో నింపే బాధ్యతను నెగినహాల్కు అప్పగించారు. అంతే అప్పటివరకు అడవుల పెంపకానికే పరిమితమైన అటవీశాఖ, మొదటిసారిగా నగర వీధుల్లో మొక్కలు నాటడం ప్రారంభించింది అటవీశాఖ. నెగినహాల్ కేవలం చెట్లను నాటడమే కాదు, ఏ వీధిలో ఏ చెట్టు ఉండాలో చాలా శాస్త్రీయంగా నిర్ణయించారు. 1982-1987 వీధివీధిన స్థానికులను అడిగి మరీ సుమారు 15 లక్షల మొక్కల్ని నాటించారు. మొక్కల్ని నాటడంతోనే చేతులు దులుపేసుకోలేదు ఆయన. నాటిన మొక్కల్ని పశువులు, ప్రజల నుండి కాపాడటం మొదలు, వాటిని సంరక్షణ లాంటి అనేక సవాళ్లను శ్రద్ధగా నిర్వహంచారు. View this post on Instagram A post shared by Sharath Kumar (@sharuzlife) నెగినహాల్ అద్భుతమైన ప్రణాళికబెంగళూరు వీధుల్లో ఒకేసారి ఒకే రంగు పూలు పూసేలా ఆయన ప్లాన్ చేశారు. వసంత కాలం వస్తే ఒక వీధి అంతా పసుపు రంగులో (Tabebuia Argentea), మరో వీధి అంతా గులాబీ రంగులో (Tabebuia Rosea) కనిపిస్తుంది.టాబెబుయా రోసియా (Tabebuia Rosea): ఇప్పుడు మనం చూస్తున్న ఈ గులాబీ రంగు పూల చెట్లు నిజానికి విదేశీ జాతికి చెందినవి. ఇవి బెంగళూరు వాతావరణానికి బాగా సరిపోతాయని ఆయన గుర్తించి వేల సంఖ్యలో నాటించారు. (గర్ల్ ఫ్రెండ్ ద్వారానే ఎల్ మెంచో కథ ఖతం)2024లో నెగినహాల్ ఈ భౌతిక ప్రపంచానికి దూరమైనా ఆయన నాటిన లక్షలాది చెట్లు ప్రతి ఏటా వసంత కాలంలో విరగబూస్తూ ఆయన ఉనికిని గుర్తు చేస్తుండటం విశేషం. ముఖ్యంగా కబ్బన్ పార్క్, లాల్బాగ్, మల్లేశ్వరం, జయనగర్ తదితర వీధుల్లో పూలు పూసినప్పుడు నేలంతా గులాబీ రంగు పూల రేకులతో నిండి పోయి అద్భుతంగా కనింపించే దృశ్యాన్ని చూసి తరించాల్సిందే. ఆయన దార్శనికత మరింతమందికి ఆదర్శం కావాలని ఆశిద్దాం. ఇదీ చదవండి: టీనేజ్ డ్రైవర్ : విషాదాంతమైన గోవా టూర్, వీడియో వైరల్ -
ఇంటికి - ఒంటికి
గులాబి పువ్వై... గులాబి పూలను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. చాలామందికి వాటిని తల్లో పెట్టుకోవడం కన్నా.. వాటిని చూస్తూ ఉండటమే ఇష్టం.. అందుకే ఇంట్లో ప్లవర్ వాజుల్లో వాటిని పెట్టుకుంటారు. కానీ ఒరిజినల్ పూలు ఒక్కరోజుకు మించి తాజాగా ఉండవు. కాబట్టి ప్లాస్టిక్ లేదా పేపర్ గులాబీలతో అడ్జస్ట్ కాక తప్పదు. అలాంటి పేపర్ గులాబీలను ఇకపై షాపుల్లోంచి కొనుక్కురాకుండా ఇంట్లోనే తయారు చేసుకుందాం.. ఇందులో ఇంకో సౌలభ్యం కూడా ఉంది. బయట దొరికే ఒరిజినల్ గులాబీలో లేని రంగులనూ మీ పేపర్ గులాబీల్లో చూసుకోవచ్చు. వీటి తయారీని చూద్దాం. కావలసినవి: రంగురంగుల పేపర్లు, పెన్, కత్తెర, గ్లూ, స్టిక్స్ తయారీ: ముందుగా మీకు నచ్చిన రంగుకాగితంపై ఫొటోలో కనిపిస్తున్న విధంగా సర్కిల్స్ గీసుకోవాలి. ఎన్ని సైజుల్లో కావాలంటే అన్ని సర్కిల్స్ గీసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని కత్తెర సాయంతో స్ప్రింగ్స్‌లా కట్ చేసుకోవాలి. ఎన్ని గులాబీలు కావాలనుకుంటే అన్ని కాగితాలను ఒకదానిపై ఒకటి లేయర్స్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు విడిగా ఒక్కో స్ప్రింగ్ పేపర్‌ను తీసుకొని రోల్ చేసుకుంటూ పోవాలి. అది గులాబి షేప్‌లోకి రాగానే.. వాటి కింది భాగంలో ఓ స్టిక్ పెట్టి, గ్లూతో అతికించాలి. తర్వాత ఈ గులాబీలను ప్లవర్వాజుల్లో పెట్టి అలంకరించుకోవచ్చు. అంతేకాదు.. ఈ గులాబీలతో విండ్చైమ్స్ను అందంగా తయారుచేసుకోవచ్చు. అలాగే ఫొటోల్లో కనిపిస్తున్న విధంగా వీటితో ఇంటిని ఎలాగైనా అలంకరించొచ్చు. జీన్స్‌కు జోడీ... అలంకరణ విషయంలో యువత ఒకప్పటిలా లేదు.. ఎలాంటి డ్రెస్‌కి ఎలాంటి జ్యుయెలరీ వేసుకోవాలనే విషయంలో క్లారిటీతో ఉంది. అంతే కదా.. చుడీదార్లకు సెట్ అయ్యే జ్యుయెలరీ జీన్స్ మీదకు అసలు సూట్ అవదు. అలాగే జీన్స్ తరహానే వేరు. ఒక్కసారి పక్కనున్న ఫొటోలను చూడండి.. జీన్స్ మీదకు ఎలాంటి నెక్లేస్, బ్రేస్లెట్, స్కార్ఫ్‌లు సెట్ అవుతాయో మీకే అర్థమవుతుంది. ఫ్యాషనబుల్‌గా కనిపిస్తున్న వీటికి పైసా ఖర్చు చేయాల్సిన పని లేదు. ఇంట్లోనే.. అదీ పాతబడిన టీ-షర్ట్స్‌తో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.. కావలసినవి: పాత టీ-షర్ట్స్, కత్తెర, బ్రేస్లెట్ హుక్స్, ఓల్డ్ బ్యాంగిల్స్ తయారీ: టీ-షర్ట్‌ను ఫొటోలో కనిపిస్తున్న విధంగా కత్తెరతో అడ్డంగా సన్నగా కట్ చేసుకోవాలి. అలా అండర్ ఆర్మ్ వరకు కట్ చేసుకొని, ముక్కలను ఒక బంచ్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బంచ్లోని రింగ్స్‌ను తీసుకొని జ్యుయెలరీ స్కార్ఫ్‌గా మార్చుకోవచ్చు. అలా వివిధ రంగుల రింగ్స్‌ను ఎంచుకొని మెడలో వేసుకుంటే ఆ అందమే వేరు. అలాగే బ్రేస్లెట్ల కోసం మూడు సన్నని ముక్కలను తీసుకొని.. జడలా అల్లి చివర్లో ఒక హుక్ పెడితే సరి. అలాగే ఓల్డ్ బ్యాంగిల్స్‌కు ఈ టీ-షర్ట్ ముక్కలను చుడితే.. ఆ గాజులు భలేగా ఉంటాయి. అంతేకాదు, కావాలంటే వీటికి పూసలను చేర్చుకోవచ్చు. ఇకపై రంగు రంగుల పాత టీ షర్ట్స్‌ను భద్రంగా దాచుకుంటారు కదూ...


