breaking news
OTT
-
ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. వాటిలో ఎక్కువగా థ్రిల్లర్, హారర్, యాక్షన్ జానర్సే ఉంటాయి. కొన్నిసార్లు మాత్రం సున్నితమైన కథతో సాగిపోయే ఫీల్ గుడ్ మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. అలాంటి ఓ చిత్రమే 'చిన్న చిన్న ఆశై'. ఒకప్పటి హీరోయిన్ మధుబాల ఇందులో ప్రధాన పాత్ర చేసింది. మలయాళ సీనియర్ నటుడు ఇంద్రాన్స్ మరో ప్రధాన పాత్రధారి. వర్ష వాసుదేవ్ దర్శకురాలు. హాట్‌స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?తంజావూర్కి చెందిన లీల(మధుబాల) ఓ బృందంతో కలిసి వారణాసి యాత్రకు వస్తుంది. ఉదయం తిరగడానికి బయలుదేరిన కొద్దిసేపటికే టీమ్ నుంచి తప్పిపోతుంది. ఈమె పర్స్, మొబైల్ ఎవరో దొంగిలిస్తారు. దీంతో ఏం చేయాలో తెలీక గంగానది ఒడ్డున కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఈమెకు మాధవన్ మాస్టర్ (ఇంద్రాన్స్) పరిచయమవుతారు. తిరిగి తన బృందం దగ్గరకు చేరేందుకు లీలకు సాయం చేస్తానని అంటాడు. తర్వాత ఏమైంది? రోజంతా కలిసి తిరిగిన లీల-మాధవన్ మాస్టర్ మధ్య ఎలాంటి బంధం ఏర్పడింది? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?కొన్ని సినిమాల్లో కథ ఉండదు. 'చిన్న చిన్న ఆశై' అలాంటి మూవీనే. అనుకోకుండా కలిసిన ఇద్దరు అపరిచిత వ్యక్తులు, రోజంతా కలిసి మాట్లాడుకుంటూ కాశీ అంతా తిరుగుతారు. ఇదే స్టోరీ. ఏంటి ఇంతేనా? ఇద్దరు మనుషులు మాట్లాడుకోవడం ఒక సినిమానా? అసలు దీన్ని ఎవరు చూస్తారు? ఎందుకు చూడాలి? అని మీకు చాలా సందేహాలు రావొచ్చు. కానీ రెండు గంటలు టైమ్ మీది కాదనుకుని చూస్తే ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.డిష్యుం డిష్యుం అంటూ యాక్షన్ సినిమాలు, టెన్షన్‌తో పోయే థ్రిల్లర్ చిత్రాలే కాదు మనసుకు హాయిగా అనిపించే మూవీస్ కూడా అప్పుడప్పుడు చూడాలి. ఇది అలాంటిదే. అలా అని ఇదేదో గొప్ప అద్భుతమైన చిత్రం మాత్రం కాదు. కాకపోతే చూసిన తర్వాత మీ మనసులో కచ్చితంగా నిలిచిపోతుంది. మూవీ, ఇందులోని పాత్రల గురించి ఆలోచించేలా చేస్తుంది.వైవాహిక జీవితంలో గొడ్డు చాకిరీ చేసి అలసిపోయిన లీల.. భర్త చనిపోయిన ఏడాదిన్నరకు కాశీ యాత్రకు వస్తుంది. వచ్చిందనే మాటే గానీ తన బృందంతో కలవదు. నోరు విప్పి ఏం మాట్లాడదు. ప్రతిదానికి భయపడుతూ ఉంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి మాధవన్ మాస్టర్ రావడంతో ఏం జరిగింది? ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? ఈమె మనసులోని 'చిన్న చిన్న ఆశలు' ఆయన వల్ల ఎలా నెరవేరాయి? ఈ క్రమంలో మాస్టర్‌పై ఆమె పెంచుకున్నది ఇష్టమా? ప్రేమా? ఆప్యాయతా? అనేది మూవీ చూసి మీరు తెలుసుకోవాలి.జీవితం సమస్యలతో సతమతమైనప్పుడు.. విధి ఒంటరిని చేసినప్పుడు ఏ మనసయినా ప్రశాంతతని కోరుకుంటుంది. స్వచ్ఛమైన మరో మనసు తోడుని కాంక్షిస్తుంది. అలాంటి తోడు అనుకోకుండా కనిపిస్తే ప్రతి చిన్న సంఘటన ఓ అందమైన జ్ఞాపకంలా నిలిచిపోతుంది. ఇలాంటి పరిస్థితులున్న ఇద్దరి మనుషుల కథే ఇది.సినిమాలో చాలా లోతైన భావన ఉంటుంది కానీ దాన్ని చూపించే విధానం సాగదీతలా అనిపిస్తుంది. ఇది మీకు ఓకే అనుకుంటే మూవీ నచ్చేస్తుంది. లీల పాత్రలో మధుబాల, మాధవన్ మాస్టర్‌గా ఇంద్రాన్స్ జీవించేశారు. సినిమా అంతా అలా అలా సాగిపోతూ హాయిగా ఉంటుంది క్లైమాక్స్ మాత్రం మనసుని బరువెక్కిస్తుంది. మూవీ అయిపోయినా సరే కచ్చితంగా ఆ ట్రాన్స్‌లో ఉండిపోతారు.పేరుకే తెలుగు డబ్బింగ్ అన్నారు గానీ లీల పాత్రకు తమిళ నేపథ్యం పెట్టారు. దీంతో ఈమె చాలావరకు తమిళంలోనే డైలాగ్స్ చెబుతూ ఉంటుంది. ఇవి అర్థం కావాలంటే సబ్ టైటిల్స్ పెట్టుకుని చూడాల్సి ఉంటుంది. ఇది పర్లేదనుకుంటే 'చిన్న చిన్న ఆశై' చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలేం లేవు. కుటుంబంతోనూ కలిసి వీక్షించొచ్చు. అలానే మూవీ అంతా చూసిన తర్వాత కచ్చితంగా కొంతమందికైనా కాశీ వెళ్లి, ఆ ఘాట్స్ అన్ని తిరిగి రావాలని అనిపిస్తుంది!- చందు డొంకాన -
ఓటీటీలోకి లేటెస్ట్ ఎమోషనల్ లవ్ సినిమా
ప్రేమకథలకు భాషతో సంబంధం లేదు. తెరపై భావం పలికితే చాలు ఏ భాషా ప్రేక్షకులకైనా సరే నచ్చేస్తుంది. అలా రీసెంట్ టైంలో దేశవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకుని మెప్పించిన సినిమా 'మై వావస్ ఆవుంగా'. గత నెలలో థియేటర్లలో రిలీజై ఇప్పటికీ అలరిస్తున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, జబ్ ఉయ్ మెట్ లాంటి ప్రేమకథా సినిమాలతో సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'. నసీరుద్దీన్ షా, దిల్జీత్ దోసాంజే, వేదాంగ్ రైనా, శార్వరి వాఘ్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. జూన్ 11న పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలో రిలీజై ఇప్పటికీ ప్రదర్శితమవుతూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.దేశ విభజన జరిగిన టైంలో విడిపోయిన ఇద్దరు ప్రేమికుల కథని ఈ సినిమాలో చూపించారు. ఏళ్లు గడిచిపోయిన తర్వాత సదరు ప్రేమికుడు కాస్త వృద్ధుడు అవుతాడు. ఇతడి ఆశయాన్ని నెరవేర్చేందుకు మనవడు సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్తాడు. తర్వాత ఏమైంది? చివరకు ఏమైంది అనేదే మిగతా స్టోరీ. తాత పాత్రలో నసీరుద్దీన్ షా చేయగా.. ఇతడి యుక్త వయసు పాత్రని వేదాంగ్ రైనా, ప్రియురాలి పాత్రని శార్వరి పోషించారు. మనవడి పాత్రలో దిల్జీత్ దోసాంజే కనిపించారు. ఈ మూవీ ఆగస్టు 07 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ తేదీనే ఫైనల్! -
ఓటీటీకి లేటేస్ట్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన స్పోర్ట్స్ కామెడీ చిత్రం గట్ట కుస్తీ-2. ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో విడుదలైంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సినీ ప్రియులను మెప్పించింది. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, యోగి బాబు, కరుణాస్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ నెల 31 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గతంలో వచ్చిన మట్టి కుస్తీకి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో కేవలం తమిళంలోనే విడుదల చేశారు. అయితే ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. Biggest Blockbuster of the season 🔥 #GattaKusthi2 (Tamil)Streaming from July 31 on Netflix in Tamil, Telugu, Kannada, Malayalam Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/EIPUelKlU8— OTT Trackers (@OTT_Trackers) July 28, 2026 -
ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ హారర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా విదేశీ భాషలకు చెందిన హారర్, థ్రిల్లర్ మూవీస్ కూడా అందుబాటులోకి వస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ కొరియన్ హారర్ చిత్రం దాదాపు రెండేళ్ల తర్వాత తెలుగులోనూ స్ట్రీమింగ్కి వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ 'మైఖేల్'.. అధికారిక ప్రకటన)2024లో రిలీజైన కొరియన్ హారర్ సినిమా 'ఘోస్ట్ ట్రైన్'. ఇప్పుడు ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. దాదాపు గంటన్నర నిడివితో ఉండే ఈ మూవీలో సోషల్ మీడియా, మనుషుల్ని ఎలా తయారు చేస్తుంది? లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలు ఎలా రిస్క్‌లో పెడుతున్నారు? అనే అంశాన్ని ఇందులో చూపించారు.'ఘోస్ట్ ట్రైన్' విషయానికొస్తే.. హారర్, సూపర్ నేచురల్ స్టోరీలపై ఓ యూట్యూబర్ వీడియోలు చేస్తూ ఉంటుంది. కానీ పెద్దగా వ్యూస్ రావు. ఓసారి భయంకరమైన కొన్ని రూమర్స్ వినిపించే స్టేషన్‌కి వెళ్తుంది. ఆ స్టేషన్ మాస్టర్ ఈమెకు నాలుగు స్టోరీలు చెబుతాడు? ఇంతకీ అవేంటి? చివరకు ఈమెకు ఏమైంది? అనేది మిగతా స్టోరీ.ఇక ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే రావు బహదూర్, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, దీవాన, లవ్ ఓ లవ్ లాంటివి స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అలానే అబ్జెషన్ మై లార్డ్, ఆజాదీ 501, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి డబ్బింగ్ మూవీస్ కూడా ఈ వీకెండే అందుబాటులోకి రానున్నాయి.(ఇదీ చదవండి: రామ్ చరణ్‌కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?) -
ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ 'మైఖేల్'.. అధికారిక ప్రకటన
పాప్ సాంగ్స్ అనగానే చాలామంది మైఖేల్ జాక్సన్ గుర్తొస్తాడు. 90ల్లో తనదైన గొంతుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. 2009లో చనిపోయాడు. ఇకపోతే ఈయన జీవితం ఆధారంగా బయోపిక్ తీశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో రిలీజై అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న వాళ్ల కోసమా అన్నట్లు అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: అఫిషియల్ : నెలలోలోపే ఓటీటీలోకి ‘రావు బహదూర్’)ప్రపంచ ప్రఖ్యాత పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవిత కథతో తీసిన సినిమాకు 'మైఖేల్ అని పేరు పెట్టారు. ఇందులో ఇతడి మేనల్లుడు జాఫర్ జాక్సన్.. టైటిల్ రోల్ చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 24న బిగ్ స్క్రీన్స్‌పై రిలీజైంది. కొందరికి నచ్చితే మరికొందరికి నచ్చలేదు. ఏదైతేనేం దాదాపు రూ.10 వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మన దేశంలో అయితే రూ.54 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ మార్క్‌ని దాటిన తొలి హాలీవుడ్ బయోపిక్గానూ రికార్డు సృష్టించింది.ఇకపోతే గత నెల 9నే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ, బుక్ మై షో లాంటి ఓటీటీల్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా.. ఆగస్టు 29 నుంచి హాట్‌స్టార్‌లో ఉచితంగానే స్ట్రీమింగ్ కానుంది. కాకపోతే ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే రిలీజ్ కానుందని ప్రకటించారు.'మైఖేల్' విషయానికొస్తే.. అమెరికాలోని ఇండియానా గ్యారీలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన మైఖేల్ జాక్సన్ (జాఫర్ జాక్సన్) తన తల్లి ప్రోత్సాహంతో, సోదరులతో కలిసి 'జాక్సన్ 5' బ్యాండ్‌తో తన ప్రతిభని చాటుకుంటాడు. అయితే తన తండ్రి జోసెఫ్ జాక్సన్ (కోల్మన్ డొమింగో) కఠినమైన ప్రవర్తన మైకేల్‌ని మానసిక వేదనకు గురిచేస్తుంది. ఆ భయం నీడలోనే ఒంటరిగా కెరీర్ ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడు? తన బాల్యాన్ని వెతుక్కుంటూ అతడు నిర్మించుకున్న 'నెవర్ ల్యాండ్' వెనుక ఉన్న ఎమోషన్ ఏంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
అఫిషియల్ : నెల లోపే ఓటీటీలోకి ‘రావు బహదూర్’
సత్యదేవ్ కలల ప్రాజెక్టు, ఎంతో కష్టపడి నటించిన చిత్రం ‘రావు బహదూర్’. వెంకట్ మాహా దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జులై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. సత్యదేవ్ నటనపై ప్రతిఒక్కరు ప్రశంసలు కురిపించారు కానీ.. కథ, కథనంపై మాత్రం పెదవి విరిచారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో ఈచిత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. థియేటర్స్‌లో రిలీజై నెల కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జులై 31 నుంచి ప్రముఖ ఓటటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ బాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది.కథేంటంటే...1991 నేపథ్యంలో ఈ కథనం సాగుతుది. భువన వంశానికి చెందిన రామప్పరావు బహదూర్ అలియాస్ రాముడు(సత్యదేవ్) లివర్ క్యాన్సర్ బారిన పడతాడు. నాలుగు నెలలకు మించి బతకడని ఓ డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు గానీ ఏడాది దాటిపోయినా సరే రామప్ప అలానే ఉంటాడు. పైపెచ్చు రోజూ తాగుతూ బతికేస్తుంటాడు. నిద్రలో నుంచి లేచి అప్పుడప్పుడు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఇలా జరగడానికి కారణం ఎప్పుడో చనిపోయిన రామప్ప చిన్న కొడుకు కుసుమప్ప. వీడు తనకు పుట్టలేదని రామప్ప 'అనుమానం'. ఇదే విషయాన్ని చెబుతూ తన స్నేహితుడు, డాక్టర్ ఆచారి(వికాస్ ముప్పల) బుర్ర తినేస్తూ ఉంటాడు. మరి రావు బహదూర్ అనుమానం నిజమేనా? కుసుమప్ప ఎందుకు ఎలా చనిపోయాడు? ఈ కథలో రామప్ప భార్య రేణుక (దీపా థామస్) సంగతేంటి? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.Samajika nibandhanalatho mee burrani kadagadaniki Rao Bahadur osthunnadu! 😎👑 pic.twitter.com/A97zYKYU8i— Netflix India South (@Netflix_INSouth) July 28, 2026 -
ఓటీటీకి వచ్చేసిన మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీల్లో మలయాళ సినిమాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటోంది. ఈ చిత్రాలకు ఇతర భాషల్లో ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. మలయాళంలో హిట్ మూవీస్ తెలుగులోనూ ఆదరణ దక్కించుకుంటున్నాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేసింది.ఈ ఏడాది మలయాళంలో రిలీజై హిట్‌గా నిలిచిన చిన్న చిన్న ఆసై ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి వర్ష వాసుదేవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఇంద్రన్స్, మధు బాల, అపర్ణ బాలమురళి, జాఫర్ సాదిక్, విష్ణు అగస్త్య కీలక పాత్రల్లో నటించారు. -
ఓటీటీలో క్రేజీ క్రైమ్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
ఓటీటీల్లోకి వచ్చే సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో కొన్ని కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా అలానే రెస్పాన్స్ అందుకుంటాయి. అలా నాలుగేళ్ల క్రితం వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కి సంబంధించి కొత్త సీజన్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి లవ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)2022లో ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో 'వదంది' అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయిన దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ మర్డర్ నేపథ్యంగా దాన్ని తెరకెక్కించారు. ఆ సీజన్ అక్కడితో ముగిసిపోయింది. అయితే ఈ సిరీస్‌లో రెండో సీజన్‌ని కొత్త స్టోరీ, కొత్త పాత్రలతో తెరకెక్కించారు. ఆగస్టు 07 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.'వదంది : ది మిస్టరీ ఆఫ్ మణి' పేరిట తీసిన ఈ సిరీస్‌లో శశి కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఆండ్రూ లూయిస్ ఈ సీజన్‌కు దర్శకుడు కాగా స్టార్ డైరెక్టర్స్ పుష్కర్-గాయత్రి క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో ప్రధాన పాత్రధారి అయిన ఎస్సై చేసిన తప్పు వల్ల ఓ అమాయకుడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తన తప్పు తెలుసుకున్న ఎస్సై.. సదరు వ్యక్తిని జైలు నుంచి ఎలా విడిపించాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
నేరుగా ఓటీటీలోకి లవ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. అంటే చాలావరకు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ కొన్ని మాత్రం నేరుగా స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ తేదీని ప్రకటించారు. తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్గా చేసిన చిత్రమిది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి ఎప్పుడు రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా 'కాన్ సిటీ' తెలుగు రివ్యూ)తమిళ నటుడు ఎలన్.. హీరోగా పరిచయమవుతూ దర్శకుడిగా మారి తీసిన సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం', తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్. గతేడాది ఈ మూవీ గురించి న్యూస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని వచ్చే నెల 21న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.'ప్యార్ ప్రేమ కళ్యాణం' విషయానికొస్తే.. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లకుండా తన ఇంట్లోనే ఉండాలని ఓ అమ్మాయి(శాన్వి మేఘన) నిర్ణయించుకుంటుంది. దీంతో ఆమె భర్త (ఎలన్) ఇల్లరికం రావాల్సి వస్తుంది. ఈ కారణంగా ఇరు కుటుంబాల్లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు తమ జీవితాన్ని తాము ఎలా మలుచుకోవాలనే విషయాన్ని ఈ జంట ఎలా తెలుసుకుంటుంది? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, యోగి బాబు, ఎం.ఎస్. భాస్కర్, గీతా కైలాసం తదితరులు కీలక పాత్రలు చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)Indha maari oru save the date ah neenga paathrukave maateenga 🤭🤣 pic.twitter.com/XLS3oR38Nd— Netflix India South (@Netflix_INSouth) July 27, 2026 -
ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి మహేశ్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న 'శ్రీనివాస మంగాపురం' రాబోతుంది. దీనితో పాటు కర్మాఖ్య, రోమియో జూలియట్ అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, సిగ్మా, 418 లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా ఈ వీకెండే బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)మరోవైపు ఓటీటీల్లో ఏకంగా 21 వరకు సినిమాలు, సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్టులో యూట్యూబర్ నాగదుర్గ 'లవ్ ఓ లవ్', తమిళ హిట్ 'చిన్ని చిన్ని ఆశై', బాలన్ ది బాయ్, దీవాన ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు అబ్జెక్షన్ మై లార్డ్, ఆజాదీ 501, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి డబ్బింగ్ సిరీస్‌లు చూడాలనే కుతుహలాన్ని రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 27 నుంచి ఆగస్టు 02 వరకు)నెట్ఫ్లిక్స్రాత్ (బ్రెజిలియన్ సిరీస్) - జూలై 29ఫైనల్ ప్రాజెక్ట్ (మెక్సికన్ సిరీస్) - జూలై 29ద ఇదో కాలేజీ మర్డర్స్: కాలేజ్ నైట్మేర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29ద బాంబింగ్ ఆఫ్ పాన్ ఏఎమ్ 103 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 30గట్టకుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 31 (రూమర్ డేట్)అమెజాన్ ప్రైమ్సూపర్ గర్ల్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూలై 28ద డెవిల్స్ మౌత్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 29లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 31బ్యాట్మన్: కేప్ట్ క్రూసేడర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31హాట్స్టార్కూలిన్ ఫ్రమ్ అకౌంట్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 27చిన్ని చిన్ని ఆశై (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 28ద డెవిల్ వేర్స్ ప్రదా 2 (ఇంగ్లీష్ సినిమా) - జూలై 29హార్ట్ బీట్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 30భోజ్‌పురి బవాల్ (హిందీ రియాలిటీ సిరీస్) - ఆగస్టు 02ఆహాఆజాదీ 501 (తెలుగు సిరీస్) - జూలై 29దీవానా (తెలుగు సినిమా) - జూలై 31జీ5బాలన్ ద బాయ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 31అబ్జెక్షన్ మై లార్డ్ (తెలుగు సిరీస్) - జూలై 31హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ సినిమా) - జూలై 31వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 31 (రూమర్ డేట్)సోనీ లివ్ద లెజెండ్ ఆఫ్ కర్ణ (హిందీ సిరీస్) - జూలై 31(ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా 'కాన్ సిటీ' తెలుగు రివ్యూ) -
ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
ఖైదీ, మాస్టర్, విక్రమ్, ఓజీ తదితర సినిమాల్లో విలన్‌గా నటించి ఆకట్టుకున్న తమిళ నటుడు అర్జున్ దాస్.. హీరోగానూ అప్పుడప్పుడు మూవీస్ చేస్తుంటాడు. అలా చేసిన చిత్రమే 'కాన్ సిటీ'. చెప్పాలంటే గత నెలలో తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ ఎందుకనో అది జరగలేదు. ఇప్పుడు నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోకి తెలుగు డబ్బింగ్ వెర్షన్ తీసుకొచ్చేశారు. క్రైమ్ కామెడీగా తీసిన ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)కథేంటి?శరవణన్ (అర్జున్ దాస్) ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాడు. పేరుకే ప్రభుత్వ ఉద్యోగి గానీ చేతినిండా అప్పులే. ఐశ్వర్య(సాక్షి వైద్య)తో ప్రేమలో ఉంటాడు గానీ అప్పుల కారణంగా అది బ్రేకప్ అయిపోతుంది. మరోవైపు ప్రెగ్నెన్సీతో ఉన్న మిత్ర(అన్నా బెన్) కూడా ఓ సంస్థ చేతిలో మోసపోతుంది. అదే టైపులో తన కూడా ఇతరులని మోసం చేయడం మొదలుపెడుతుంది. ఇంకోవైపు జానకి(వడిఉక్కరుసు), తన కొడుకు(యోగిబాబు)తో కలిసి ట్రస్ట్ పేరిట జనాల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తుంటుంది. వీళ్లందరి మోసాలు ఎలా బయటపడ్డాయి? డబ్బు గురించి వీళ్లంతా చివరకు ఏం తెలుసుకున్నారు? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రపంచంలో అందరికీ కావాల్సింది ఏదైనా ఉందంటే అది డబ్బు మాత్రమే. అవసరాలు ఊరికే ఉండవుగా! బతకడం కోసం 'డబ్బు' మనతోనే ఎలాంటి మోసాన్ని అయినా చేయిస్తుంది. కష్టపడి సంపాదించుకున్నది మాత్రమే ఎప్పటికైనా నిలుస్తుంది మోసం చేసి సంపాదించుకున్నది ఎలా వచ్చిందో అలానే వెళ్లిపోతుంది అనే సత్యాన్ని చూపిస్తూ తీసిన సినిమా ఇది.అప్పులు.. అవస్థలు.. అవసరం.. ఈజీ మనీ కోసం ప్రధాన పాత్రలన్నీ మోసాలు చేసే సీన్లతో ఫస్టాప్ బాగానే ఉంటుంది. శరవణన్ పాత్ర ఆఫీస్‌లో పనిచేయడం, చిన్నపాటి టెక్నిక్ వాడి అక్కడ డిపాజిట్ చేయాల్సిన డబ్బులు కొట్టేయడం లాంటి సీన్లు చూస్తుంటే 'లక్కీ భాస్కర్' సినిమా గుర్తొస్తుంది. కానీ మోసాలు చేసినందుకు బాధపడుతూ ఇక మారిపోవాలనుకున్నప్పుడు ఇదే బ్యాచ్‌కి గతంలో కంటే పెద్ద నేరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారనే అంశాలతో సెకండాఫ్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి చూస్తున్నప్పుడు 'బ్లఫ్ మాస్టర్' మూవీ గుర్తొస్తుంది.ఫస్టాప్ సహజంగా అనిపిస్తుంది గానీ సెకండాఫ్‌లో మాత్రం ప్రధాన పాత్రలు చేసే పనులన్నీ లాజిక్స్ దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయి. కాకపోతే కథ, స్క్రీన్ ప్లే లాంటి వాటి వల్ల ఉన్నంతలో చూడాలనిపించేలా అనిపించడం మూవీకి ప్లస్ పాయింట్. మరీ గొప్ప మూవీ అయితే కాదు గానీ చూస్తున్నంతసేపు టైమ్ పాస్ అయిపోతుంది. గతంలో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినప్పుడు.. బిల్లింగ్ మెషీన్ నుంచి డబ్బులు వస్తున్నట్లు చూపించి ఆసక్తి రేపారు. కానీ అసలు ఈ సీన్ సినిమాలో పెట్టకుండా భలే మోసం చేశారు. స్టోరీ మార్చి తీశారా? లేదంటే పబ్లిసిటీ కోసమే ఈ టీజర్ వదిలారా అనేది అర్థం కాని ప్రశ్న.ఎవరెలా చేశారు?శరవణన్‌గా చేసిన అర్జున్ దాస్, మిత్రగా చేసిన అన్నాబెన్, మిగతా పాత్రల్లో నటించిన వడి ఉక్కరుసు, యోగిబాబు, వీటీవీ గణేష్ తదితరులు తమ స్టైల్ ఆఫ్ యాక్టింగ్‌కి భిన్నమైన పాత్రల్లో ఇందులో కనిపించారు. అలానే ఆకట్టుకున్నారు. కానీ స్టోరీ పరంగా యావరేజ్‌గా అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది గానీ మ్యూజిక్ అయితే గుర్తుంచుకునేంతలా లేదు. అసభ్యకర సీన్స్ లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా 'పరిమిళ అండ్ కో' తెలుగు రివ్యూ) -
ఓటీటీలోకి గుండెల్ని పిండేసే లవ్‌స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన తాజా చిత్రం ‘దీవాన’. ఈ చిత్రంలోన బ్యూటిఫుల్ హీరోయిన్ స్మేహ మణిమేఘలై తెలుగు తెరకు పరిచయం అయింది. శ్రీకాంత్ సంఘిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీని అర్హ మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవీ కార్యంపూడి నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 20న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్స్‌ని అందుకుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు గుండెల్ని పిండేస్తాయి. అంతగా ఆకట్టుకున్న ఈ ప్రేమ కథ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.ఈ జులై 31వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 'మిస్ అయితే మస్త్ ఫీల్ అయితవ్' అంటూ మేకర్స్ ఈ రోజు ‘దీవాన’ ఓటీటీ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగానే ఎర్లీ యాక్సెస్ లో ఈ సినిమాను చూడొచ్చు. తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమా వ్యూయర్స్ కు అందుబాటులో ఉండనుంది.‘దీవాన’ కథేంటంటే.. డిగ్రీ పూర్తి చేసిన మున్నా (హర్షిత్ రెడ్డిద) ఇంట్లో ఖాళీగా ఉంటాడు. ఫ్రెండ్స్‌తో కలిసి తిరగడం, తాగడం తప్పా ఇంటి బాధ్యతల్ని పట్టించుకోడు. తండ్రి శేఖర్(నరేష్) పడే కష్టం గురించి మున్నా ఏ మాత్రం ఆలోచించడు. అసలు తల్లిదండ్రులు, ఇంటి బాధ్యత అన్నదే మున్నాకి పట్టదు. ఎప్పుడూ గాలి తిరుగుడు తిరుగుతూ ఉంటాడు. అలాంటి మున్నా ఓ సారి ఓ అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇక ఆ అమ్మాయి మీ సేవా కేంద్రంలో పని చేస్తుంటుందని, ఆమె పేరు అమూల్య (స్మేహా మణిమేఘలై) అని తెలుసుకుంటాడు. ఇక ప్రతీ రోజూ మీ సేవాలో ఏదో ఒక పని అడ్డం పెట్టుకుని అమూల్య వద్దకు వెళ్లడం చేస్తుంటాడు మున్నా. అయితే కొన్ని రోజులకు మున్నా చేష్టలకు అమూల్య విసిగిపోతుంది. నేను నెలకి రూ. 20 వేలు సంపాదిస్తున్నా.. నువ్వు మాత్రం రూ. 20 కూడా సంపాదించలేవు.. ముందు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని కనపడు.. ఆ తరువాత చూద్దాం అని మున్నాతో అమూల్య చెబుతుంది. దీంతో మున్నా ఓ గాడిన పడతాడు. అమూల్య చెప్పినట్టుగా జాబ్ సంపాదించుకునే క్రమంలో ప్రయత్నాలు మొదలు పెడతాడు. అసలు అమూల్య అలాంటి ఓ కండీషన్ ఎందుకు పెట్టింది? మరి మున్నా చివరకు తన ప్రయత్నంలో సఫలం అవుతాడా? వీరి ప్రేమ కథకు అడ్డుగా నిలిచే ఆ కారణాలు ఏంటి? చివరకు మున్నా ప్రేమ గెలుస్తుందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలోకి తెలుగు టెక్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
గుర్తుందా? సరిగ్గా పదేళ్ల క్రితం 'ఫ్రీడమ్ 251' పేరుతో ఓ స్కామ్ జరిగింది. అంటే రూ.251 చెల్లిస్తే స్మార్ట్ ఫోన్ ఇస్తామని నమ్మబలికించారు. తర్వాత ఇదో పెద్ద మోసమని తేలింది. ఇప్పుడీ కాన్సెప్ట్ ఆధారంగా తెలుగులో తీసిన టెక్ థ్రిల్లర్ సిరీస్ 'ఆజాదీ 501'. తాజాగా దీని ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చెప్పేశారు.(ఇదీ చదవండి: 3 వారాలలోనే ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా)వచ్చే బుధవారం(జూలై 29) నుంచి ఆహా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తేజ, హర్షవర్ధన్, శశాంక్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. ట్రైలర్ బట్టి చూస్తే రూ.20 వేల సంపాదించే ఓ మధ్య తరగతి కుర్రాడు, ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకుంటాడు. కానీ ఎవరి నుంచి ప్రోత్సాహం ఉండదు. అలాంటి కుర్రాడికి రూ.501 ఫోన్ ఇవ్వాలనే ఆలోచన ఎందుకొచ్చింది? తర్వాత ఏమైంది? ఇందులో స్కామ్ ఏంటి? అనేది స్టోరీలా అనిపిస్తుంది.ట్రైలర్ అయితే పర్లేదనిపించేలా ఉంది. నటీనటులు కూడా మొత్తం తెలుగువాళ్లే. మరి ఇది ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి? ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. వీటిలో నాగబంధం, పురుషః లాంటి తెలుగు చిత్రాలతో పాటు కాన్ సిటీ, పల్లిచట్టంబి లాంటి డబ్బింగ్ మూవీస్.. ఆదర్శ బాలవిద్యాలయ లాంటి సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లో రిలీజయ్యే వాటిలో మలయాళ థ్రిల్లర్ సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అయితే లెక్కకు మించి తీస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అలానే ఒకటి ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ చిత్రమేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: 3 వారాలలోనే ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా)గతంలో 'ఎల వీజ పూంచిర' అనే సినిమాకు రచయితగా పనిచేసిన నిజమైన పోలీస్ అధికారి షాజీ మారడ్.. ఈ 'ఉయిర్' సినిమాకు స్టోరీ, డైలాగ్స్ అందించారు. పోలీస్ శాఖలో నిజమైన విచారణ విధానాలు ఎలా ఉంటాయో రియలస్టిక్‌గా చూపించారు. రోషన్ మ్యాథ్యూ హీరో కాగా బైజు సంతోష్, అతుల్య చంద్ర, శ్రుతి మేనన్, సయామి ఖేర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.గత నెల 26న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ చిత్రం వచ్చే నెల 4వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.'ఉయిర్' విషయానికొస్తే.. అజీబ్(రోషన్ మ్యాథ్యూ) ప్రొబెషనరీ ఎస్సైగా ఓ స్టేషన్లో చేరతాడు. కొన్నాళ్లకే పాడుబడిన బావిలో ఓ మహిళ మృతదేహం కనిపిస్తుంది. సాధారణంగా చనిపోయిందని అనుకుని విచారణ ప్రారంభిస్తారు. అయితే ఇది హత్య మాత్రమే కాదని, దీని వెనక పెద్ద క్రైమ్ నెట్వర్క్ ఉందని అజీబ్ గుర్తిస్తాడు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఎందుకు హత్య చేశారు? చివరకు హంతకుడు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా) -
ఓటీటీలోకి ‘వంద దేవుళ్లు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వంద దేవుళ్లు’. బిచ్చగాడు ఫేం శశి దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య జూన్ 19న రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మంచి వసూళ్లతో పాటు ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశం బాగుందనే ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. విజయ్ ఆంటోని బర్త్‌డే సందర్భంగా ఈరోజు(జులై 24) ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను పంచుకుంది. ఆగస్టులో తమ ప్లాట్ఫామ్లో ఓటీటీ ప్రీమియర్ కానుందని జీ5 తెలుగు ప్రకటించింది.అధికారిక స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.వంద దేవళ్లు కథేంటంటే..పాతికేళ్ల వయసులోనే వాసవి(శ్వాసిక) భర్తను కోల్పోతుంది. దీంతో ఇద్దరు పిల్లలకు అన్నీ తానై పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కదు. మరోవైపు మగ దిక్కులేని ఆడదనే అలుసుతో వంకర బుద్ది ఉన్న మగాళ్లంతా ఆమె గురించి మరోలా మాట్లాడతారు. అర్థరాత్రి ఇంట్లో లైట్ వెలిగినా అనుమానిస్తారు. ఇవన్నీ భరిస్తూ ఇద్దరు కొడుకులు భాస్కర్(అజయ్ దిషాన్), వివేక్ (శక్తి)లను పెంచి పెద్ద చేస్తుంది. భాస్కర్ బీటెక్ చేస్తున్న సమయంలోనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తుంది వాసవి. ఈ విషయాన్ని స్కూల్ మాస్టర్ ద్వారా కొడుకులను చెప్పిస్తుంది. అమ్మ మళ్లీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని ఇద్దరు కొడుకులు స్వాగతించారా లేదా? 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోతుందనే విషయం తెలిసిన తర్వాత బంధువులు, సమాజం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాసవి జీవితంలోకి ఏడు కొండలు(విజయ్ ఆంటోనీ) వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చివరకు వాసవి మళ్లీ పెళ్లి చేసుకుందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ నాగదుర్గ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఈమె గతంలో 'కలివనం' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. గతేడాది ఇది థియేటర్లలో ఆపై ఓటీటీలోకి వచ్చింది గానీ జనాలకు దీని గురించి అస్సలు తెలీదు. అయితే ఈమె రీసెంట్గా తమిళంలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ధనుష్ మేనల్లుడు మూవీలో చేసింది. ఇప్పుడీ చిత్ర ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: 'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)నాగదుర్గ తమిళంలో చేసిన తొలి సినిమా 'లవ్ ఓ లవ్'. పవిష్ హీరో. ఈ నెల 10న తమిళంతో పాటు తెలుగులనూ రిలీజైంది గానీ జనాలు అస్సలు పట్టించుకోలేదు.. దీంతో డిజాస్టర్ అయింది. ఇప్పుడీ చిత్రం ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు.'లవ్ ఓ లవ్' విషయానికొస్తే.. రఘు(పవిష్), అవంతిక(నాగదుర్గ)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అయితే ప్రేమలో పడిన తర్వాత సినిమాలు, షికార్లు, షాపింగ్ పేరుతో రఘు డబ్బులన్నీ అవంతిక అవగొట్టేస్తుంది. చివరుు క్రెడిట్ కార్డులు, అప్పులు తీసుకునేలా చేస్తుంది. కానీ కొన్నాళ్ల తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన రఘు.. అవంతిక తనకు లవ్, రఘు వద్దని ఓ బ్రేకప్ లెటర్ మీద సంతకం పెట్టాలని లేదంటే ప్రేమలో తనకు చేసినవన్నీ ఓ నాలుగు నెలలు తన స్థానంలో ఉండి తను చేసినవన్నీ చేయాలని అడుగుతాడు. దీంతో అవంతిక రఘుని చూసుకుంటానని చెబుతుంది. తర్వాత ఏమైంది? ఈ క్రమంలో అవంతిక ఎదుర్కున్న ఇబ్బందులేంటి? చివరకు వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.ఇక ఈ వారం ఓటీటీల్లో రిలీజైన సినిమాల విషయానికొస్తే నాగబంధం, పురుషః లాంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, పల్లిచట్టంబి తదితర డబ్బింగ్ చిత్రాలు.. ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి డబ్బింగ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలొచ్చాయి. వాటిలో నాగబంధం లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీతో పాటు కాన్ సిటీ, పల్లిచట్టంబి లాంటి డబ్బింగ్ చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. మరోవైపు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి డబ్బింగ్ సిరీస్‌లు వచ్చాయి. వీటికి తోడుగా ఓ తెలుగు కామెడీ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా)కమెడియన్స్ సప్తగిరి, రాజ్ కసిరాజుతో పాటు పవన్ కల్యాణ్ అనే కొత్త కుర్రాడు హీరోగా నటించిన కామెడీ మూవీ 'పురుషః'. ఈ ఏడాది మే 22న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరిగా ఉన్నప్పటికీ జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం సడన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'పురుషః' విషయానికొస్తే..చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులైన గోవింద్ (పవన్ కల్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (కసిరెడ్డి రాజన్ కుమార్), కిస్ (వెన్నెల కిశోర్) ప్రతి విషయాన్ని పంచుకుంటూ ఉంటారు. పెద్దయ్యాక వీళ్లకు పెళ్లిళ్లు అవుతాయి. గోవింద్.. కమల (రాయంచ)ని ప్రేమించి పెళ్లి చేసుకోగా, సత్తిబాబుకు లక్ష్మి (హాసిని)తో, శ్రీనుకు గీత (విషిక)తో వివాహమవుతుంది. అయితే వీరి వైవాహిక జీవితం సవ్యంగా సాగదు. నిత్యం గొడవలతో విసిగిపోయిన భార్యలే.. తమకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతారు.విడాకుల కోసం భర్తలు కూడా కోర్టు చుట్టూ తిరుగుతుంటారు కానీ భార్యలు మాత్రం రారు. దీంతో కేసు వాయిదాల మీద వాయిదా పడుతుంటుంది. వీరి బాధను అర్థం చేసుకున్న జడ్జి (వీటీవీ గణేష్) అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఇంతకీ గోవింద్, కమల ప్రేమ కథ ఎలా మొదలైంది? ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు. సత్తిబాబు, శ్రీనులపై వారి భార్యలకు ఎందుకు అంత అనుమానం? వీరి కాపురం కూల్చడంలో స్నేహితుడు 'కిస్' పాత్ర ఏంటి? చివరికి ఈ భార్యాభర్తల కథ ఎలాంటి ముగిసిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ) -
మూడు వారాల్లోనే ఓటీటీకి నాగబంధం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విరాట్ కర్ణ, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ నాగబంధం. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. అనంత పద్మనాభ స్వామి బ్యాక్‌డ్రాప్‌లో సోషియో ఫాంటసీ కథగా వచ్చిన ఈ సినిమా గ్రాఫిక్స్ పరంగా అభిమానుల్ని ఆకట్టుకుంది. అయితే కంటెంట్ పరంగా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకరపోయింది. ఈ సినిమాలో ఫైట్స్‌తో పాటు కొన్ని సన్నివేశాలు అనవసర నిడివిని పెంచాయనే కామెంట్స్ కూడా వినిపించాయి.అయితే జూలై 3న రిలీజైన ఈ మూవీ అప్పుడే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రం జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. అసలు కథేంటంటే..ఈ సినిమా కథంతా 1756-1962 నేపథ్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ సాగుతుంది. ఇండియన్ ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్(జగపతి బాబు) తన 30 ఏళ్ల కెరీర్లో ఎన్నో రహస్యాలను ఛేదించినా.. నాగబంధం రహస్యాన్ని మాత్రం కనిపెట్టలేకపోతాడు. దీనిపై తన శిష్యులు టెస్లా, అలీ(రిషబ్ సాహ్నీ) పరిశోధన చేస్తూ హిమాలయాలకు వెళ్తారు . అక్కడ ఎన్నో ఏళ్లుగా బంధించబడి ఉన్న బైరాగి(గరుడ రామ్) తన మంత్ర శక్తితో అలీ గతాన్ని గుర్తు చేసి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ప్రపంచాన్ని జయించాలంటే నాగ బంధాన్ని విడిపించాలని అందుకోసం బ్రహ్మ కమలం తీసుకురావాలని ఆలీని ఆదేశిస్తాడు. అలీ తన అనుచరులతో బ్రహ్మకమలం వెతుకుతూ.. అడ్డుకున్న వాళ్లను, దానికి సంబంధించిన వివరాలు తెలిసి చెప్పని వాళ్లను క్రూరంగా చంపుతుంటాడు. చివరకు ఆ బ్రహ్మకమలం శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉన్న స్వామివారి నాభిలో ఉండే పద్మంలో ఉందని తెలిసి.. ఓ ప్లాన్ ప్రకారం ఆలయం నుంచి బయటకు తీసుకురాగా.. ఓ కారణంగా అది భైరవకోన సమీపంలోని సముద్రంలో పడిపోతుంది. దాన్ని తీసుకొచ్చింది అలీ మనుషులు తులసీవనం గ్రామానికి వెళ్తారు. అక్కడ డబ్బు ఆశ చూపి రుద్ర(విరాట్ కర్ణ) సహాయంతో పడవలో భైరవకోనకు బయలుదేరుతారు. మరి ఆ స్వర్ణ కమలం అలీ మనుషులకు దొరికిందా లేదా? రుద్ర వాళ్లకు సహాయం చేశాడా లేదా? ఆ బ్రహ్మకమలానికి రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? అతను ప్రాణంగా ప్రేమించే చెల్లి మాసస(సోనియా సింగ్) చావుకు కారణం ఎవరు? పార్వతి(నభా నటేష్) ఎవరు? రుద్రతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? 1956లో ఏం జరిగింది? ముస్లిం రాజుతో కలిసి భైరాగి పన్నిన కుట్ర ఏంటి? అసలు నాగబంధం నేపథ్యం ఏంటి?చివరకు బైరాగి నాగబంధాన్ని విడిపించాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీల్లో ఫ్రైడే సందడి.. ఒక్క రోజే 17 చిత్రాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి ఉండనే ఉంటుంది. ఈ రోజు నుంచే థియేటర్లలో విజయ్ జన నాయగన్ సందడి చేస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ దాదాపు ఏడు నెలల గ్యాప్ తర్వాత రిలీజైంది. అంతేకాకుండా ఈ వారంలో టాలీవుడ్ నుంచి కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' రిలీజ్ కానుంది. దీంతో పాటు కాజల్ 'ద ఇండియా స్టోరీ' సహా హే చికితా, చంద్రప్పన్, కాగితం పడవలు లాంటి చిన్న చిత్రాలు బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.ఇక ఈ ఫ్రైడే ఓటీటీల రిలీజ్ విషయానికొస్తే పల్లిచట్టంబి, కాన్ సిటీ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి సిరీస్‌లు సందడి చేయనున్నాయి. వీటితో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ ద ట్రూతర్స్ (స్పానిష్ మూవీ) - జూలై 24 72 అవర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24 లాస్ క్రెయంటస్ (స్పానిష్ మూవీ) - జూలై 24 ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24 కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 24జియో హాట్‌స్టార్ స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24 ది డెవిల్ వియర్స్ ప్రద-2(హాలీవుడ్ సినిమా)- జూలై 24 స్టార్ ట్రెక్ స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్(హాలీవుడ్ సిరీస్)- జూలై 24 బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25అమెజాన్ ప్రైమ్ ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 24 ఈగో రామన్(తమిళ మూవీ)- జూలై 24జీ5 అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ సిరీస్) - జూలై 24 ప్రేమ్ షాట్స్ (బెంగాలీ సిరీస్) - జూలై 24సోనీ లివ్ పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24లయన్స్ గేట్ ప్లే ప్రొటెక్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 24ఆపిల్ ప్లస్ టీవీ ద డింక్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24సన్ నెక్స్ట్ సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ మూవీ) - జూలై 24మనోరమ మ్యాక్స్ట్రిపుల్ డెక్కర్(మలయాళ సినిమా)- జూలై 24 -
ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా
80.90ల్లో పిల్లల్ని ఎంతగానో అలరించిన చాలా యానిమేటెడ్ పాత్రల్ని రీసెంట్ టైంలో లైవ్ యాక్షన్ సినిమాలుగా తీస్తున్నారు. హౌ టూ ట్రెయిన్ యువర్ డ్రాగన్, డోరా, మోగ్లీ లాంటివి ఇలానే వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. ఇదే దారిలో వచ్చిన మరో మూవీ 'హీ మ్యాన్ మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్'. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడిది ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: రూ.251 ఫోన్ స్కామ్ గుర్తుందా? ఈ కాన్సెప్ట్‌తో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ తెలుగు సిరీస్)ట్రావిస్ నైట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ కథతో తెరకెక్కించారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరో పాత్రకు తెలుగులో హీరో నిఖిల్ డబ్బింగ్ చెప్పాడు. డంకన్‌కు రావు రమేశ్, విలన్ పాత్రకు ఆదిత్య మీనన్ గాత్రమందించారు.'హీ మ్యాన్ మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్' విషయానికొస్తే.. విశ్వాన్ని శాసించాలనే కోరికలున్న స్కెలిటార్ అనే రాక్షసుడు.. అద్భుత శక్తులున్న ఓ ఆయుధం కోసం ఎటర్నియా గ్రహంపై దాడి చేస్తాడు. దీంతో ఆ సామ్రాజ్యం చెల్లాచెదురవుతుంది. రాజు, రాణి.. ఆ ఆయుధాన్ని పిల్లాడిగా ఉన్న తన కొడుకు ఆడమ్‌కి ఇచ్చి భూమిపైకి పంపేస్తారు. కానీ ఆ ఆయుధం పిల్లాడి దగ్గర నుంచి మిస్ అవుతుంది. భూమిపై పెరిగి పెద్దవాడైన ఆడమ్.. ఎలాగైనా సరే తన గ్రహానికి వెళ్లాలని అనుకుంటూ ఉంటాడు. ఓ సందర్భంగా తన దగ్గర నుంచి మిస్ అయిన ఆయుధం ఆచూకీ లభిస్తుంది. కానీ దాన్ని పొందే క్రమంలో ఇతడిపై ఓ వింత జంతువు దాడి చేస్తుంది.ఈ జంతువు నుంచి తప్పించుకున్న ఆడమ్.. తన చిన్నప్పటి ఫ్రెండ్, సేనాధిపతి కూతురు తీలా సాయంతో తిరిగి తన గ్రహానికి చేరుకుంటాడు. కానీ అప్పటికే ఆ గ్రహం మొత్తం నాశనమైపోయింటుంది. తన తల్లిదండ్రులతో పాటు మరికొందరు.. స్కెలిటార్ దగ్గర బందీగా ఉంటారు. వీళ్లని రక్షించేందుకు ఆడమ్ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలోనే ఆడమ్ తన శక్తిని తిరిగి ఎలా పొందగలిగాడు. హీ-మ్యాన్ ఎలా అయ్యాడు? చివరకు శత్రువులని మట్టుబెట్టాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా) -
రూ.251 ఫోన్ స్కామ్ గుర్తుందా? ఈ కాన్సెప్ట్‌తో తెలుగు సిరీస్
సరిగ్గా పదేళ్ల క్రితం 'ఫ్రీడమ్ 251' పేరుతో ఓ స్కామ్ జరిగింది గుర్తుందా? రూ.251కే స్మార్ట్ ఫోన్ ఇస్తామని చెప్పి నోయిడాకు చెందిన కంపెనీ ప్రకటించుకుంది. జనాలు కూడా దీని కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. డబ్బులు కూడా కట్టారు కానీ తర్వాత ఇదో పెద్ద స్కామ్ అని తేలింది. ఇప్పుడీ కాన్సెప్ట్‌తో తెలుగులో ఓ వెబ్ సిరీస్ రానుందని ప్రకటించారు. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ ఠాకుర్ థ్రిల్లర్ సినిమా)'ఆజాదీ 501' పేరుతో తీసిన ఈ సిరీస్.. ఆహా ఓటీటీలో ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంటే వచ్చే బుధవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ సిరీస్‌కి శివతేజ దర్శకుడు. పోస్టర్, ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే ఇందులో పేరున్న నటీనటులు అయితే ఎవరూ నటించలేదు. మరి ఇది ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి?ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలేం రావట్లేదు. ఉన్నంతలో పల్లిచట్టంబి, కాన్ సిటీ అనే డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటికి తోడుగా ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి డబ్బింగ్ సిరీస్‌లు ఈ వీకెండ్ అందుబాటులోకి రాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా) -
ఆపరేషన్ సఫేద్ సాగర్.. ఆమె మాటలకు సిద్ధార్థ్ ఎమోషనల్
కార్గిల్ యుద్ధ నేపథ్యంలోనే వస్తోన్న సరికొత్త వెబ్ సిరీస్ ఆపరేషన్ సఫేద్ సాగర్. 1999లో జరిగిన కార్గిల్ వార్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్‌కు ఓని సేన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు. యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న సిరీస్ కావడంతో వైమానికి విన్యాసాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ రిలీజ్ వేడుక ముంబయిలో నిర్వహించారు.ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ ఎమోషనలయ్యారు. దివంగత స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా భార్య అల్కా అహుజా ట్రైలర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్కా అహుజాను వేదికపైకి ఆహ్వానించారు. అదే సమయంలో ప్రేక్షకులంతా ఆమెకు గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు. తన భర్త కథను తెరపైకి తీసుకువచ్చినందుకు నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాటలు స్పష్టంగా సిద్ధార్థ్‌ను కదిలించాయి.. దీంతో ఆయన వేదికపై కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.ఈ సిరీస్‌పై నమ్మకం ఉంచినందుకు సిద్ధార్థ్ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. నిజ జీవిత యుద్ధ వీరుడి పాత్రను పోషించడానికి తాను మొదట్లో సంకోచించానని సిద్ధార్థ్ తెలిపారు. ప్రస్తుతం మన మధ్య లేని వారి పాత్రను.. ముఖ్యంగా ఒక అమరవీరుడి పాత్రను పోషించినప్పుడు మనపై చాలా పెద్ద బాధ్యత ఉంటుందని అన్నారు. హీరోలు ఎప్పుడూ హీరోల్లా కనిపించరు. వారు తమ చర్యల వల్లే హీరోలవుతారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ అంగీకరించే ముందు తాను ఈ సిరీస్ నిర్మాతలతో చాలాసార్లు చర్చించానని వెల్లడించారు. ఆయన భార్య అల్కా అహుజా అనుమతించారా?' అదే నాకు అత్యంత ముఖ్యమని మేకర్స్‌తో చెప్పానని గుర్తు చేసుకున్నారు. కాగా.. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రస్తుత, పదవీ విరమణ పొందిన భారత వైమానిక దళ అధికారులు కూడా హాజరయ్యారు.అజయ్ అహుజా ఎవరంటే..స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన ఒక భారత వైమానిక దళ అధికారి. కూలిపోయిన విమానంలో తోటి పైలట్‌ను గుర్తించే మిషన్‌లో ఉండగా ఆయన విమానం కూల్చివేశారు. అహుజాకు ఆయన ధైర్యసాహసాలకు, సేవకు గాను మరణానంతరం వీరచక్ర పురస్కారం లభించింది. ఆయనను ఆపరేషన్ సఫేద్ సాగర్‌లోని కీలక వ్యక్తులలో ఒకరిగా గుర్తుంచుకుంటారు. ఈ సిరీస్ కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం పోషించిన పాత్ర ఆధారంగా రూపొందించారు. ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో అభయ్ వర్మ, దియా మీర్జా, ప్రాజక్త కోలి, ఆదిల్ హుస్సేన్, మిహిర్ అహుజా, తారుక్ రైనా కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా
సాధారణంగా ఓ వయసొచ్చిన తర్వాత దర్శకులు దాదాపుగా సినిమాలు చేయడం తగ్గించేస్తుంటారు. కానీ రీసెంట్ టైంలో టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, 94 ఏళ్ల వయసులోనూ 'సింగ్ గీతం' అనే చిత్రం తీసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈయనలానే హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా 79 ఏళ్ల వయసులోనూ ఇంకా చలాకీగా మూవీస్ చేస్తున్నారు. ఈయన తీసిన లేటెస్ట్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)జురాసిక్ పార్క్, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్, మ్యూనిచ్, ద టెర్మినల్, ఇండియానా జోన్స్ తదితర సినిమాలతో అద్భుతమైన గుర్తింపు సాధించిన స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'డిస్క్లోజర్ డే'. గత నెల 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఓ మేరకు ఆకట్టుకుంది. ఏలియన్స్ కాన్పెప్ట్‌తో తీసిన ఈ చిత్రం ఇప్పుడు విదేశాల్లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో ఇంగ్లీష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.డిస్క్లోజర్ డే విషయానికొస్తే.. ఓ సైబర్ సెక్యూరిటీ విజిల్ బ్లోయర్ డేనియల్ (జోష్ ఓ కానర్), వాతావరణ శాస్త్రవేత్త మార్గెట్(ఎమిలీ బ్లంట్).. అమెరికా ప్రభుత్వం దాచిపెట్టిన గ్రహాంతరవాసుల రహస్య ఆధారాలని బయటపెట్టాలనుకుంటారు. ఈ క్రమంలోనే ఏజెన్సీ చీఫ్ నోవా (కోలిన్ ఫెర్త్) నుంచి వీళ్లిద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. గ్రహాంతరవాసులు నిజంగానే భూమిపైకి వస్తే మానవాళి ఎలా స్పందిస్తుందనేది ఇందులో చూపించే ప్రయత్నం చేశారు.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా) -
నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా
ప్రతి భాషలోనూ ప్రతి ఏడాది వందలకొద్ది సినిమాలని తీస్తుంటారు. అయితే వీటిలో నుంచి థియేటర్లలోకి కొన్ని వస్తుంటాయి. మరికొన్ని మాత్రం ల్యాబ్‌ల్లోనే మగ్గుతుంటాయి. చిన్న నటీనటులు చేసిన మూవీస్ విషయంలో ఇలా జరిగితే ఏదోలే అనుకోవచ్చు. కొన్నిసార్లు స్టార్స్ చేసిన చిత్రాలకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటిదే మృణాల్ ఠాకుర్ విషయంలో జరిగింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)మృణాల్ ఠాకుర్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'పూజా మేరీ జాన్'. హ్యుమా ఖురేషీ కీలక పాత్ర చేసింది. అప్పుడెప్పుడో 2022లోనే మూవీ సిద్ధం చేసినప్పటికీ థియేటర్లలో రిలీజ్ మాత్రం అవ్వలేదు. తొలుత దీని హక్కుల్ని హాట్‌స్టార్ దక్కించుకుంది. కానీ జియో సంస్థతో విలీనం కావడం లాంటివి జరగడంతో ఈ ప్రాజెక్ట్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.మళ్లీ ఇన్నాళ్లకు 'పూజా మేరీ జాన్' సినిమా సంగతి బయటకొచ్చింది. దీని డిజిటల్ హక్కుల్ని జీ5 ఓటీటీ సంస్థ దక్కించుకుంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. చూస్తుంటే దీనిని నేరుగా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చే అవకాశముంది. కానీ తేదీ అయితే ప్రకటించలేదు. నవజ్యోత్ గులాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాని థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కించారు.'పూజా మేరీ జాన్' విషయానికొస్తే.. పూజా అనే సాధారణ అమ్మాయి జీవితంలోకి ఒక అపరిచిత వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. అతను పూజాను పిచ్చిగా ప్రేమిస్తూ, ఆమె ప్రతి కదలికను గమనిస్తూ ఉంటాడు. పూజాని ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, ఇంటర్నెట్ ద్వారా తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేస్తుంటాడు. ఈ డిజిటల్ వేధింపుల వల్ల పూజ జీవితం ఎలా నరకంగా మారింది? ఆ అజ్ఞాత వ్యక్తి నుండి తనని తాను కాపాడుకోవడానికి ఏం చేసిందనేది? స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: జీ5 ఓటీటీలోకి ఏకంగా 60 సినిమాలు.. తెలుగు నుంచి తొమ్మిది) -
ఓటీటీకి ఆపరేషన్ సఫేద్ సాగర్.. ట్రైలర్ అదుర్స్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటాయి. తాజాగా మరో ఆసక్తికర కథనంతో వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1999 కార్గిల్ యుద్ధం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆపరేషన్ సఫేద్ సాగర్ సిరీస్ తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు.కార్గిల్ యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న ఆపరేషన్ సఫేద్ సాగర్ ట్రైలర్లో యుద్ధ సన్నివేశాలు, వైమానిక దాడులు ఆకట్టుకునేలా ఉన్నాయి. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ పేరే సఫేద్ సాగర్. పాకిస్తాన్‌పై వైమానిక దాడులతో మంచు కొండలపై భారత్ విరుచుకుపడినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 1999 మే 26న ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో ది గోల్డెన్ యారోస్ కీలక పాత్ర పోషించింది.కాగా.. ఈ సిరీస్‌లో సిద్దార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా కనిపించనున్నారు. -
ఓటీటీకి లేటేస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అర్జున్‌దాస్, అన్నాబెన్ జంటగా నటించిన చిత్రం కాన్ సిటీ. కమెడియన్ యోగిబాబు, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో కనిపించారు. హరీష్ దురైరాజ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. ఈ ఏడాది జూన్ 26న తెలుగు, తమిళంలో రిలీజైంది. మనీ కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు.. దాదాపు అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రమే "కాన్ సిటీ". ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నటించిన చిట్టచివరి సినిమా 'జన నాయగన్' ఈ గురువారం థియేటర్లలోకి రానుంది. తెలుగులో అయితే కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' రిలీజ్ కానుంది. దీనితో పాటు కాజల్ 'ద ఇండియా స్టోరీ' సహా హే చికితా, చంద్రప్పన్, కాగితం పడవలు లాంటి చిన్న చిత్రాలు బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి ఏకంగా 60 సినిమాలు.. తెలుగు నుంచి తొమ్మిది)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈ వీకెండ్ చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ అయితే లేవు. ఉన్నంతలో పల్లిచట్టంబి, కాన్ సిటీ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి సిరీస్‌లు కాస్తోకూస్తో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఇంకేమైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్ లాంటివి ఉంటాయేమో చూడాలి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 20 నుంచి 26 వరకు)నెట్ఫ్లిక్స్ఏ టాక్సిక్ లవ్ స్టోరీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 22ఎలైట్ ఫోర్స్ (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 22రాన్సమ్ కెన్యన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23ద డెట్ కలెక్టర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 23ద ట్రూతర్స్ (స్పానిష్ మూవీ) - జూలై 2472 అవర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24లాస్ క్రెయంటస్ (స్పానిష్ మూవీ) - జూలై 24ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 24 (రూమర్ డేట్)హాట్స్టార్స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25అమెజాన్ ప్రైమ్ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 24జీ5అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ సిరీస్) - జూలై 24ప్రేమ్ షాట్స్ (బెంగాలీ సిరీస్) - జూలై 24సోనీ లివ్పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24లయన్స్ గేట్ ప్లేప్రొటెక్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 24ఆపిల్ ప్లస్ టీవీద డింక్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24సన్ నెక్స్ట్సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ మూవీ) - జూలై 24(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్) -
ఒకే ఓటీటీలోకి ఏకంగా 60 సినిమాలు.. తెలుగు నుంచి తొమ్మిది
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లే విషయంలో ప్రేక్షకుల ఆసక్తి రోజురోజుకీ తగ్గిపోతుంది. మరోవైపు ఓటీటీ సంస్థలు తమ దానిలో స్ట్రీమింగ్ ప్రాజెక్టుల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాయి. ఇదివరకే నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ మూవీస్ లిస్ట్ ప్రకటించగా.. ఇప్పుడు జీ5 కూడా తమ దానిలో ఏకంగా 60 వరకు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయని వెల్లడించింది.(ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్‌కి ఏమైంది? ఇలా మారిపోయాడేంటి?)తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఇవన్నీ రాబోయే రోజుల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. తెలుగు వరకు అయితే ఈ ఓటీటీలోకి నాగచైతన్య 'వృషకర్మ', బాలకృష్ణ 111వ సినిమా, అనిల్ రావిపూడి-వెంకటేశ్ కొత్త మూవీ, నివేదా థామస్ 'శ్రీమతి', భూతం భయ్యం తదితర మూవీస్.. అలానే శ్రీకాంత్ 'అబ్జెక్షన్ మై లార్డ్', అనంతకాలం సిరీస్‌లు.. జగపతిబాబు 'జయమ్ము నిశ్చయమ్మురా 2' టాక్ షో ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే అన్ని భాషలు కలిపి 21 సినిమాలు 27 సిరీస్‌లు... చెరో ఆరు యానిమేషన్, ఏఐ మూవీస్ జాబితాలో ఉన్నాయి.జీ5 ఓటీటీలోకి వచ్చే సినిమాలు,సిరీస్లుఘమాశాన్ - హిందీ సినిమాబంధర్ - హిందీ మూవీకాంబ్లీ - హిందీ సిరీస్ద స్కామ్ లీక్డ్ - హిందీ సిరీస్బకైటీ 2 - హిందీ సిరీస్దలింబ్ - హిందీ మూవీరంగబాజ్ 4 - హిందీ సిరీస్లాల్ బజార్ 2 - హిందీ సిరీస్రావడి - తమిళ సినిమాతుంబచ్చి మంజుల - మరాఠీ మూవీకాఫీ కింగ్ - హిందీ సిరీస్హాయ్ - తమిళ సినిమాసుమో దీదీ - హిందీ మూవీకేరళ అండర్ గ్రౌండ్ - మలయాళ సిరీస్ఇక్ రూప్ - హిందీ మూవీశ్రీమతి - తెలుగు సినిమాఅబ్జెక్షన్ మై లార్డ్ - తెలుగు సిరీస్కూసే మునుస్వామి వీరప్పన్ 2 - తమిళ సిరీస్జాన్వర్ 2 - హిందీ సిరీస్హేయ్ కాయ్ నవీన్ 2 - హిందీ సిరీస్పూజా మేరీ జాన్ - హిందీ సినిమాహై జవానీ తో ఇష్క్ హోనా హై - హిందీ మూవీజీనా ఇసీ కా నామ్ హై 2.0 - హిందీ సిరీస్భారత భాగ్య విధాత - హిందీ సినిమాసర్వగుణ్ సంపన్న్ - హిందీ మూవీప్రియో బొందు - బెంగాలీ సిరీస్తడయమ్ 2 - తమిళ సిరీస్మలబార్ కప్ - మలయాళ సిరీస్కుడ్ల కప్ - తమిళ సిరీస్అగ ఆయ్ ఆహో ఆయ్ - హిందీ సిరీస్జయమ్ము నిశ్చయమ్మురా 2 - తెలుగు రియాలిటీ షోవెంకటేశ్ - అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ - తెలుగు సినిమాథీ కురల్ - తమిళ సిరీస్స్వేట్కళి 2 - హిందీ సిరీస్భూతం భయ్యం - తెలుగు సినిమాఏ క్వీన్ - తమిళ సిరీస్వృషకర్మ - తెలుగు మూవీడీమోంటే కాలనీ 3 - తమిళ సినిమాఎన్బీకే 11 - తెలుగు మూవీజీ హారర్ షో - హిందీ సిరీస్ద డెవిల్ - కన్నడ సినిమాబిట్ కాయిన్ స్కామ్ - హిందీ సిరీస్ఆపరేషన్ బంగారా - హిందీ సిరీస్బాలన్ ద బాయ్ - మలయాళ సినిమాకరావళి - కన్నడ మూవీఅయ్యన మానే 2 - కన్నడ సిరీస్టీన్ టిగాడా - హిందీ సిరీస్అనంతకాలం - తెలుగు సిరీస్ఏఐ సినిమాలుశివశక్తి కీ అనంత్ కహానీపరమ్ సుందరి చంద్రకాంత కీ అమర్ ప్రేమకథ నర్మద మానస సుందరిగరుడ్ ఏక్ యోధ కీ కథతిరుపతి బాలాజీవిక్రమ్ బేతాళ్యానిమేషన్అయ్యప్పన్బార్బరిక్రామ్ ఆంజనేయ్ యుద్ధ్శివలోక్ కీ కుండక్క మండక్కబందబుద్ధి బుడబక్ 2.0టేల్స్ ఆఫ్ కృష్ణ(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్) -
ఓటీటీలోకి తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి బోలెడన్ని సినిమాలొచ్చాయి. వాటిలో మా ఇంటి బంగారం, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, ఏక్ దిన్, గేదెల రాజు, చాంద్ మేరా దిల్, ది డెవిల్ తదితర తెలుగు, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. వీటి సంగతి కాసేపు పక్కనబెడితే ఇప్పుడో తెలుగు సిరీస్ గురించి అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ కామెడీ సినిమా 'పరిమళ అండ్ కో' తెలుగు రివ్యూ)తెలుగు సీనియర్ నటుడు శ్రీకాంత్, అనన్య శర్మ ప్రధాన పాత్రలు చేస్తున్న కోర్ట్ రూమ్ డ్రామా/థ్రిల్లర్ 'అబ్జెక్షన్ మై లార్డ్'. జీ5 ఓటీటీలో ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలో రిలీజ్ చేయబోయే టీజర్ లేదా ట్రైలర్‌తో స్టోరీ ఏంటనేది తెలిసే అవకాశముంది.ఇక రీసెంట్ టైంలో తెలుగు దర్శకులు కూడా ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు తీస్తూ ఆకట్టుకుంటున్నారు. సందీప్ కిషన్ ప్రధాన పాత్ర చేసిన 'సూపర్ సుబ్బు'.. రీసెంట్ టైంలో అలా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ క్రమంలోనే మరిన్ని తెలుగు సిరీస్‌లు రెడీ అవుతున్నాయి.(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్) -
ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
చిన్న సినిమాలో థియేటర్స్‌లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచన మలయాళ చిత్రం ‘బాలన్-ది బాయ్’. ‘మంజుమ్మల్ బాయ్స్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రం ఇది. రోమాంచం.. ఆవేశం లాంటి వైవిధ్యమైన కామెడీ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు జీతు మాధవన్ ఈ చిత్రానికి కథను అందించాడు.ఫర్జానా పాలత్గింగల్, ఆది శేషన్, ముహమ్మద్ జినన్, డాలీ జూన్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటించారు. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమా జూన్ 19న థియేటర్స్‌లో రిలీజ్ హిట్ టాక్ సంపాదించింది. రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. జులై 31 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. బాలన్-ది బాయ్ కథేంటే..ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి, తన కొడుకు(ఆది శేషన్)తో బయటకు వచ్చిన ఓ మహిళ(ఫర్జానా పాలత్గింగల్) చుట్టూ ఈ కథ తిరుగుంది. బయటకు వచ్చిన ఆ మహిళ..పేర్లను మార్చుకుంటూ కొడుకుతో కలిసి పలు చోట్ల పని చేస్తుంది. అంతా సవ్యంగా జరుగుతుందన్న సమయంలో ఆ మహిళ మరో హత్య చేయాల్సి వస్తుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారు. రోవైపు స్కూల్‌కి వెళ్లిన కొడుకు అమ్మ రాక కోసం ఒక చోట ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పిపోయిన బాలుడు అనుకొని పోలీసులు అతన్ని స్టేషన్‌కి తీసుకెళ్తాడు. అయితే తల్లి ఇచ్చిన ట్రైనింగ్ కారణంగా ఆ బాలుడు తన అడ్రస్ని పోలీసులకు చెప్పడు. అంతేకాదు చాలా చాకచక్యంగా స్టేషన్ నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఎక్కడికి వెళ్లాడు? తల్లిని కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయా లేదా? తల్లి కొడుకుల కథలోకి టొవినో థామస్ ఎలా వచ్చాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళ సినిమాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటోంది. ఈ చిత్రాలకు ఇతర భాషల్లో ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. మలయాళంలో హిట్ మూవీస్ తెలుగులోనూ ఆదరణ దక్కించుకుంటున్నాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది.ఈ ఏడాది మలయాళంలో రిలీజైన చిన్న చిన్న ఆసై ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు చేశారు. ఈనెల 28 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి వర్ష వాసుదేవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఇంద్రన్స్, మధు, అపర్ణ బాలమురళి, జాఫర్ సాదిక్, విష్ణు అగస్త్య కీలక పాత్రల్లో నటించారు. Every little wish has a story worth telling.Chinna Chinna Aasai streams from July 28 in Malayalam, Tamil, Telugu, Kannada, and Hindi, exclusively on JioHotstar.@Aparnabala2#ChinnaChinnaAasai #JioHotstar #MalayalamCinema pic.twitter.com/ZLvfrvCZIl— JioHotstar Malayalam (@JioHotstarMal) July 17, 2026 -
సన్నీడియోల్ ‘ఇక్కా’ మూవీ రివ్యూ
ఉన్నావాడికైనా, లేనివాడికైనా , ఎవ్వరికైనాసరే ఉండేది స్వార్ధం. ఈ సమాజంలో జరుగుతున్న వందశాతం నేరాలు స్వార్ధంతో చేసేవే. అటువంటి నేరాలకు కొమ్ము కాస్తూ అన్యాయంగా న్యాయాన్ని తమ స్వార్ధానికి వాడుకుంటున్న వారికి సరైన పద్ధతిలో బుద్ధి చెప్పిన ఆటే ఈ ఇక్కా. తెలుగులో ఇక్కా అంటే పేకాటలో వచ్చే ఆసు ముక్క అని అర్ధం. పేకాటలో ఆసు ముక్కకు ఎంత యుక్తి శక్తి ఉందో అంతకంటే వందలరెట్లు తెలివిగలవాడు ఈ సినిమా హీరో. ఈ సినిమాలో వచ్చే పాత్రలు, చేసే పనులన్నీ చూసే ప్రేక్షకుడికి వినోదంతో పాటు కాస్త విజ్ఞానాన్ని కూడా అందిస్తుదనడంలో సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే ఇక్కా సినిమా ప్రేక్షకులకు కనువిందుతో పాటు కనువిప్పు కూడా కలిగిస్తుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం.సోమా మిట్టల్ అనే యువతి ప్రముఖ వ్యాపారవేత్త శౌర్యమాన్ గౌర్ కారు నుండి విసిరివేయబడి దారుణ హత్యకు గురవుతుంది. అక్కడ నుండే ఈ సినిమా మొదలవుతుంది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు శౌర్యమాన్ గౌర్ ను అరెస్ట్ చేస్తారు. శౌర్యమాన్ తండ్రి పెద్ద రాజకీయనాయకుడు కావడం వల్ల నగరంలోని ప్రముఖ లాయర్ అయిన అర్జున్ మెహరాను ఈ కేసు తీసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తారు. కాని న్యాయానికి కట్టుబడ్డ అర్జున్ మెహరా ముందు ఈ కేసును తీసుకోనని ససేమిరా తిరస్కరిస్తాడు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల కేసును అర్జున్ మెహరా శౌర్యమాన్ తరపున వాదించడానికి ఒప్పుకుంటాడు. తన జీవిత కాలంలో న్యాయనికి కట్టుబడ్డ అర్జున్ మెహరా మొట్టమొదటిసారిగా అన్యాయం తరపున వకాల్తా పుచ్చుకోవడం మొత్తం కోర్టు సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. అన్యాయం వైపు నిలబడ్డ అర్జున్ మెహరా న్యాయం కోసం తన ఆసు ముక్కని ఎలా ఆడతాడో ఇక్కా సినిమాలోనే చూడాలి. ఈ సినిమా ఓ మండి డ్రమెటిక్ థ్రిల్లర్.అల్తియా కౌశల్ అందించిన ఇక్కా కథను ప్రముఖ దర్శకుడు సిద్ధార్ధ మల్హోత్రా తెరకెక్కించారు. ప్రముఖ నటులు సన్నీడియోల్, అక్షయ్ ఖన్నా తో పాటు దియా మర్జా వంటి వర్ధమాన తారలు ఈ ఇక్కా సినిమాలో తమ పాత్రలకు పక్కా న్యాయం చేశారు.విశేషంగా సినిమా ఆఖర్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను మంచి థ్రిల్లింగ్ కు గురిచేస్తాయి. ఈ ఇక్కా సినిమా మాతృక హిందీ అయినా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోను లభ్యమవుతోంది. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. ప్లే జాయ్ ఫుల్లీ విత్ యువర్ ఇక్కా.-హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీల్లోకి ఈ వారం చాలానే సినిమాలు వచ్చాయి. సమంత 'మా ఇంటి బంగారం', సాయిపల్లవి 'ఏక్ దిన్', వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు', దర్శన్ 'ద డెవిల్'తో పాటు చాలా డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటితో పాటు తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఒకేసారి రెండింటిలో అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ)సింగర్ రఘు కుంచె, వికాస్ ముప్పల ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'గేదెల రాజు కాకినాడ తాలూకా'. ఈ ఏడాది ఏప్రిల్ 24న థియేటర్లలో రిలీజైంది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదో మూవీ ఉందని కూడా జనాలకు తెలీదు. ఇప్పుడీ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.'గేదెల రాజు' విషయానికొస్తే.. కాకినాడ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ 'గేదెల రాజు', తన పలుకుబడితో రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తాడు. కార్పొరేషన్ ఎన్నికల టైంలో ఇతడిని ఎవరో హత్య చేస్తారు. ఈ సంఘటన తర్వాత రాజుతో శత్రుత్వం ఉన్నవాళ్లు, స్నేహితులు, అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యక్తులు అనుమానితులుగా మారతారు. ఇంతకీ గేదెల రాజుని చంపింది ఎవరు? దాని వెనుకున్న కారణాలేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సాయిపల్లవి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి వచ్చేసిన సాయిపల్లవి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయిపల్లవి పేరు చెప్పగానే ఫిదా, ప్రేమమ్, అమరన్ లాంటి సినిమాలు, అందులో ఆమె చేసిన అద్భుతమైన యాక్టింగ్ గుర్తొస్తుంది. ఇప్పటివరకు దక్షిణాదిలోని పలు భాషల్లో నటించిన ఈమె.. ఈ ఏడాది హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ హీరోగా చేసిన మూవీతో పరిచయమైంది. రెండున్నర నెలల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ చూడొచ్చు.(ఇదీ చదవండి: సోనమ్ వాంగ్చుక్కు '3 ఇడియట్స్'తో సంబంధం లేదు: ఆమిర్ ఖాన్)సాయిపల్లవి, జునైద్ ఖాన్ జంటగా నటించిన సినిమా 'ఏక్ దిన్'. థాయ్ భాషకు చెందిన 'వన్ డే'కి ఇది అఫీషియల్ రీమేక్. పెద్దగా బజ్ లేకుండానే ఈ ఏడాది మే 01న థియేటర్లలో రిలీజైంది. సాయిపల్లవి తప్పితే ఇందులో చెప్పుకోదగ్గ మరో ప్లస్ పాయింట్ లేదు. ఆమిర్ కొడుకు జునైద్ యాక్టింగ్ అయితే మరీ దారుణంగా ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో ఈ మూవీని జనాలు మర్చిపోయారు. తెలుగు డబ్బింగ్ రిలీజ్ చేసినప్పటికీ ఇదొచ్చిన సంగతి కూడా ఎవరికీ తెలియనంతలా వచ్చి వెళ్లిపోయింది.ఇకపోతే రెండు రోజుల క్రితం ఈ సినిమాని విదేశాల్లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మన దేశంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉచితంగానే అందుబాటులోకి తెచ్చారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది.'ఏక్ దిన్' విషయానికొస్తే.. ఐటీ ప్రొఫెషనల్ అయిన దినేశ్ (జునైద్ ఖాన్) తనతో పనిచేసే మీరా(సాయిపల్లవి)ని రహస్యంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈ విషయం ఆమెతో చెప్పే ధైర్యముండదు. ఆఫీస్ పనిమీద జపాన్ వెళ్లినప్పుడు కనీసం ఒక్కరోజైనా ఆమెతో గడపాలని కోరుకుంటాడు. కట్ చేస్తే మీరాకు 'ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా' అనే అరుదైన వ్యాధి వస్తుంది. అంటే ఒకరోజుపాటు ఆమె తన జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. మరి ఆ రోజు ఏం జరిగింది? దినేశ్ తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పగలిగాడా లేదా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ) -
ఓటీటీలో సరికొత్త యానిమేషన్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు వినూత్నమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్ ఓటీటీ ప్రియుల ముందుకు రానుంది. తాజాగా సరికొత్త యానిమేటెడ్ సిరీస్ ‘శివలోక్ కె కుండక్క మండక్క’ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ పిల్లల పుస్తకం ‘ ది వెరీ ఎక్స్ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్ జూలై 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.మన అందరికీ తెలిసిన పౌరాణిక ప్రపంచాన్ని ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా స్క్రీన్‌పై సరికొత్తగా అందించనున్నారు. కథ విషయానికి వస్తే.. కుండక్క, మండక్క అనే ఇద్దరు అల్లరి అసుర జంట చుట్టూ తిరుగుతుంది. వాళ్ల అల్లరి పనులు ధైర్యం, స్నేహం, తమను తాము తెలుసుకునే ఒక అద్భుతమైన అడ్వెంచర్‌లోకి తీసుకెళ్తాయి. రామాయణం, మహాభారతం వంటి తెలిసిన కథలకే పరిమితం కాకుండా, ఈ సిరీస్ భారతీయ పౌరాణిక సంపదలోని కొత్త పాత్రలు, ఇంకా అన్వేషించని లోకాలు, మాయాజాలంతో నిండిన అడ్వెంచర్లను పిల్లలకు, కుటుంబాలకు పరిచయం చేయనుంది.వినోదం, యాక్షన్, ఆకర్షణీయమైన యానిమేషన్ కలయికతో రూపొందించిన ఈ సిరీస్ నేటి పిల్లల కోసం పౌరాణిక కథలను సరికొత్తగా ఆవిష్కరించనుంది. హీరో అనే పదం ఓ వ్యక్తి తను తీసుకునే నిర్ణయాలతో నిర్ణయించబడుతాడనే అభిప్రాయాన్ని అందంగా అందరికీ తెలియజేస్తుంది. ఇదొక పెద్ద యూనివర్స్‌కు ఆరంభం మాత్రమే. ‘శివలోక్ కె కుండక్క మండక్క’ భవిష్యత్తులో కొత్త పాత్రలు, కొత్త అడ్వెంచర్లు, మరిన్ని కథలతో విస్తరించనుంది. పిల్లలు భారతీయ పౌరాణిక కథలను వినోదాత్మకంగా, కొత్త కోణంలో ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ కతలో ఇద్దరు అల్లరి అసుర పాత్రలను పెట్టడం ద్వారా, అల్లరి పిల్లలకు విలువలు లేదా క్రమశిక్షణ ఉండవనే అభిప్రాయాన్ని ప్రశ్నిస్తుంది. కుండక్క, మండక్క చేసే సాహసాల ద్వారా ఆసక్తి, అల్లరి కూడా దయ, ధైర్యం, అనుభూతితో కలిసి ఉంటుందని మనకు అవగతమవుతుంది. ఈ సిరీస్ సిరీస్ హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానుంది.రైటర్ ఆనంద్ నీలకంఠన్ మాట్లాడుతూ..'నా పుస్తకం ‘ ది వెరీ, ఎక్స్ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్’ ను ‘శివలోక్ కె కుండక్క మండక్క’ రూపంలో కిడ్స్ జెడ్ జీవం పోసి కొత్త తరం పిల్లలకు పరిచయం చేయడం చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. భారతీయ పౌరాణిక సంపదలో నాటుకుపోయిన కథలను పిల్లలకు ఆకట్టుకునే విధంగా మళ్లీ ఆవిష్కరించడం..వాటిని జీ5 వంటి పెద్ద స్థాయి ప్లాట్‌ఫామ్స్ రూపొందించటం అనందంగా ఉంది. నేను ఈ పాత్రలను సృష్టించినప్పుడు ఎంత ఆనందించానో, కుండక్క, మండక్కల అడ్వెంచర్లను స్క్రీన్‌పై చూస్తూ చిన్నారులు కూడా అంతే ఆనందిస్తారని ఆశిస్తున్నా. ఈ అల్లరి పాత్రలు వారి ప్రపంచం యానిమేషన్ రూపంలో కొత్త జీవం పొందడం నిజంగా ఆనందించదగ్గ విషయం' అని అన్నారు -
ఓటీటీకి మా ఇంటి బంగారం.. ఒక్క రోజే 14 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉండనే ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఐశ్వర్య రాజేశ్ 'ఓ సుకుమారి', మాధవన్ 'జీడీఎన్', వదలా, రాజా ది రాజా, ఆపరేషన్ అరుణారెడ్డి, మహేంద్రగిరి వారాహి లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ' థియేటర్లలో సందడి చేయనుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ వారంలో సమంత మా ఇంటి బంగారం స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా వడ్డే నవీన్ మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఓటీటీలోకి రానుంది. వీటితో పాటు కన్నడ మూవీ ది డెవిల్ ఆసక్తిని పెంచుతోంది. దీంతో పాటు ఈ శుక్రవారం పలు హిందీ, బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ సిరీస్) - జూలై 17 ద ఈస్ట్ ప్యాలెస్ (కొరియన్ సిరీస్) - జూలై 17 డిజైర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17 23000 లైవ్స్ (జర్మన్ మూవీ) - జూలై 17 హార్ట్ స్టాపప్ ఫరెవర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17 25 ఇయర్క్ ఆఫ్ యూ(జపనీస్ సినిమా)- జూలై 17 స్పూకీ ఇన్ లవ్ (కొరియన్ సిరీస్) - జూలై 18అమెజాన్ ప్రైమ్..ది బే (హాలీవుడ్ మూవీ)- జూలై 17ఆహాఓవెల్స్(తమిళ సినిమా)- జూలై 17జియో హాట్‌స్టార్.. మా ఇంటి బంగారం (తెలుగు మూవీ) - జూలై 17 టెస్ట్ సబ్జెక్ట్ వీ (హిందీ డాక్యుమెంటరీ) - జూలై 18జీ5 ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు (తెలుగు సినిమా) - జూలై 17 ది డెవిల్(కన్నడ సినిమా)- జూలై 17శివలోక్ కె కుండక్క మండక్క(యానిమేషన్ సిరీస్)- జూలై 17లయన్స్ గేట్ ప్లే..డెజర్ట్ వారియర్(హాలీవుడ్ మూవీ)- జూలై 17టెక్సాస్ చైన్ సా(హాలీవుడ్ మూవీ)- జూలై 17 -
ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామా.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు వస్తూనే ఉంటాయి. రీసెంట్ టైంలో అలా ప్రీతమ్ అండ్ పెడ్రో, సూపర్ సుబ్బు తదితర సిరీస్‌లు సినీ ప్రేమికుల్ని ఆకట్టుకున్నాయి. వీటిలానే ఎంటర్టైన్ చేసేందుకు ఓ రొమాంటిక్ డ్రామా సిరీస్ రెడీ అయింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చెప్పేశారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)విక్రాంత్ మస్సే, వేదిక పింటో, మహిమా మక్వానా ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'ముసాఫిర్ కేఫ్'. దివ్య ప్రకాశ్ దూబే అనే రచయిత్రి రాసిన 'ముసాఫిర్ కేఫ్' నవల ఆధారంగా ఈ రొమాంటిక్ డ్రామాని తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 24 నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి రావొచ్చు.'ముసాఫిర్ కేఫ్' ట్రైలర్ బట్టి చూస్తే.. చందర్(విక్రాంత్ మస్తే) కుర్రతనంలో ఉన్నప్పుడు సుధ(వేదిక పింటో)ని ప్రేమిస్తాడు. రిలేషన్లోకి వెళ్తాడు. కానీ కొన్ని కారణాలతో వాళ్లు విడిపోతారు. కొన్నేళ్లు గడిచిపోయిన తర్వాత చందర్.. ప్రీతి(మహిమా మక్వానా)తో ప్రేమలో పడతాడు. తర్వాత ఏమైంది? ప్రీతికి సుధ గురించి తెలిసినప్పుడు చందర్ ఎలా రియాక్ట్ అయ్యాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే సమంత మా ఇంటి బంగారం, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు తదితర తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటికి తోడుగా మరికొన్ని సిరీస్‌లు, డబ్బింగ్ మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి సంగతి పక్కనబెడితే ఓ మలయాళ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా 'పరిమళ అండ్ కో'.. తెలుగు రివ్యూ)లేటెస్ట్ సెన్సేషన్ కాయదు లోహర్.. మలయాళంలో చేసిన తొలి మూవీ 'పల్లిచట్టంబి'. టొవినో థామస్ హీరో. 1957లో కేరళలో జరిగిన భూసంస్కరణ బిల్లు నేపథ్యంగా తీసిన చిత్రమిది. తెలుగులోనూ ఏప్రిల్ 15న థియేటర్లలో రిలీజైంది. కానీ ఎక్కడా ఆకట్టుకోలేక ఫ్లాప్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని మూడు నెలల తర్వాత అంటే వచ్చే శుక్రవారం (జూలై 24) నుంచి సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.'పల్లిచట్టంబి' విషయానికొస్తే.. 1957లో కేరళంళో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. తర్వాత ఏడాది భూసంస్కరణల బిల్లు అమల్లోకి తీసుకొస్తుంది. దీంతో ఊళ్లలోని భూస్వాములు, వలసదారుల నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. మరోవైపు తమ చర్చిల్ని కాపాడుకునేందుకు వాటి మత పెద్దలు ప్రత్యేక రక్షక దళాల్ని తయారు చేసుకోవడం ప్రారంభిస్తారు. అలా కణియార్లోని కున్నంపురం చర్చి భూముల రక్షణ కోసం పోతన్ క్రిస్టోఫర్ (టొవినో థామస్)ని 'చట్టంబి'గా(చర్చి రక్షకుడు లేదా రౌడీ) నియమిస్తారు.నిజానికి పోతన్ ఓ హిందూ కుర్రాడు. అసలు పేరు కృష్ణ పిళ్లై. కానీ మారుపేరుతో ఆ చర్చిలోకి అడుగు పెట్టి, వాళ్లకి అండగా నిలుస్తాడు. కమ్యూనిస్ట్ భావజాలమున్న రెబెక్కా (కయాదు లోహర్)తో అనుకోకుండా ప్రేమలోనూ పడతాడు. తర్వాత ఏమైంది? అసలు కృష్ణ పిళ్లై గతమంటి? చర్చి భూముల రక్షణ కోసం ఎందుకు నిలబడ్డాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్) -
జైలులోనే స్టార్ హీరో.. ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి సినిమా
అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న కన్నడ స్టార్ హీరో దర్శన్.. ఎప్పుడు బయటకొస్తాడనేది తెలియదు. మరోవైపు ఈ హడావుడి జరుగుతున్న టైంలోనే ఇతడు హీరోగా నటించిన ఓ మూవీ రిలీజైంది. కానీ యావరేజ్‌గా నిలిచింది. ఇప్పుడీ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుందంటే?(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. ఫొటోలు వైరల్)దర్శన్, రచనా రాయ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'ద డెవిల్'. గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైంది. ఆ టైంలోనే దర్శన్ జైలులో ఉండటంతో అభిమానులు ఈ మూవీకి వెళ్లారు. అయితే నెలనెలన్నరకే ఓటీటీలోకి వచ్చేస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ నెలలు గడిచిపోతున్న స్ట్రీమింగ్ డేట్ ప్రకటించలేదు. అలాంటిది ఇప్పుడు దాదాపు ఏడు నెలల తర్వాత ఈ శుక్రవారం(జూలై 17) నుంచి జీ5 ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా వీడియో రిలీజ్ చేశారు. అయితే కన్నడలో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది.'ద డెవిల్' విషయానికొస్తే.. రాజశేఖర్ అనే ముఖ్యమంత్రి ఓ నేరం కారణంగా జైలుపాలవుతాడు. అతడి కొడుకు ధనుష్, లండన్‌లో ఉంటాడు. అతడిని తీసుకురమ్మని రాజశేఖర్, ఓ ఐఏఎస్‌కి బాధ్యత అప్పగిస్తాడు. కానీ ధనుష్ రానంటాడు. దీంతో ఒకే పోలికలతో ఉన్న కృష్ణ అనే వ్యక్తిని.. ధనుష్‌లా మారుస్తారు. కట్ చేస్తే డెవిల్ తిరిగొస్తాడు. తర్వాత ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)ನಿಯಮಗಳನ್ನ ಬರೆದವನಲ್ಲ ಮುರಿದವನು - 'ದಿ ಡೆವಿಲ್'.ಜುಲೈ 17ರಿಂದ ಕನ್ನಡ Zee 5ನಲ್ಲಿ.#darshanthoogudeepasrinivas #dboss #thedevil #kannadazee5 #thedevilonzee5 pic.twitter.com/cAA1MDSS5L— ZEE5 Kannada (@ZEE5Kannada) July 11, 2026 -
ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మిగతా భాషల్లో ప్రేక్షకులని అలరించిన చిత్రాలు, డబ్బింగ్‌ల రూపంలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా గత వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ 'పరిమిళ అండ్ కో'. జీ5 ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)కథేంటి?మిడిల్ క్లాస్‌కి చెందిన పరిమిళ(జయరాం).. తన భార్య స్వరాజ్యం(ఊర్వశి), కూతుళ్లు పరాశక్తి, మధుమితతో కలిసి ఓ అద్దె ఇంట్లో బతికేస్తుంటాడు. ప్రశాంతంగా ఉన్న వీళ్ల జీవితంలోకి వర్గీస్ (శాండీ మాస్టర్) అనే లోకల్ రౌడీ ఎంట్రీ ఇస్తాడు. పరిమళ చిన్న కూతురు మధుమిత వెంటపడుతూ పెళ్లి చేసుకుంటానని ఇబ్బందిపెడుతుంటాడు. ఈ టార్చర్ భరించలేక అతడిని చంపేస్తే బాగుంటుందని కుటుంబమంతా ఓ రోజు అనుకుంటారు. సీన్ కట్ చేస్తే తర్వాత రోజు తెల్లారేసరికి వర్గీస్ హత్యకు గురవుతాడు. ఇంతకీ ఇతడిని చంపిందెవరు? పరిమళ కుటుంబానికి ఈ హత్యకు సంబంధముందా? లేదా? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'దృశ్యం' వచ్చిన తర్వాత ఈ తరహా కాన్సెప్ట్‌లతో చాలా సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా అలాంటి ఓ మూవీనే. కాకపోతే అది సీరియస్, దీన్ని మాత్రం కామెడీగా తీశారు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కుంటే ఏమవుతుంది? అనే సింపుల్ కాన్సెప్ట్ ఈ చిత్రంలోనూ చూపించారు. ఇక ఎలా ఉందంటే ఓటీటీలో చూస్తున్నప్పుడు అయితే ఓకే ఓకే అనిపించింది.మొదలైన అరగంట పాటు సినిమా చకచకా వెళ్తుంది. తర్వాత హత్య ఎవరు చేశారు? అనే దగ్గర పరిమిళ కుటుంబంలోని ఒక్కొక్కరిపై అనుమానం వచ్చేలా సీన్స్ వస్తుంటాయి. వీళ్లతో పాటు పరిమళ తమ్ముడు, బావమరిదిపై కూడా అనుమానం వస్తుంది. ఒకానొక దశలో ఎవరో చంపారనేది పరిమిళ కుటుంబానికి తెలిసిపోతుంది. కానీ పోలీసులకు మాత్రం అంతుచిక్కదు. మరోవైపు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న ఏడుకొండలు అనే సీఐ.. నిందితుడిని కనిపెట్టకుండా ఆలస్యం చేస్తుంటాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడనే దానికి చివరలో వివరణ ఇస్తారు.సినిమాలో కామెడీ.. పార్ట్స్ పార్ట్స్‌గానే వర్కౌట్ అయింది. హత్య ఎవరు చేశారనే విషయంలో చాలామందిపై అనుమానం వచ్చేలా సీన్స్ చూపిస్తారు కానీ చివరలో అసలు వర్గీస్‌ని ఎవరు? ఎందుకు చంపారనేది ఊహించని ట్విస్టు రూపంలో బయటపెడతారు. అయితే అది మూవీలో ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది తప్పితే సహజంగా అనిపించదు. సెకండాఫ్‌లో స్టోరీ అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపించడం ఓ మైనస్.నటన విషయానికొస్తే.. పరిమళ, స్వరాజ్యం అనే భార్యభర్తలుగా చేసిన జయరాం, ఊర్వశి తమ అనుభవం చూపించి నవ్వించారు. వీళ్ల కూతుళ్లుగా చేసిన సంజన, అనంతిక కూడా బాగానే చేశారు. పోలీస్ అధికారిగా మిస్కిన్, వర్గీస్ అనే రౌడీగా శాండీ మాస్టర్.. పరిమిళ పెద్ద కూతురి ప్రియుడిగా తెలుగు హీరో సంతోశ్ శోభన్ ఆకట్టుకున్నారు. మిగిలిన వాళ్లు ఓకే.టెక్నికల్ అంశాలకొస్తే మ్యూజిక్ గుర్తుంచుకునేంత గొప్పగా ఏం లేదు. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. దర్శకుడు పాండిరాజ్ ఓ పాయింట్ అనుకున్నారు కానీ దాన్ని తీసే క్రమంలో సాగదీసి వదిలారు. పేరుకే రెండున్న గంటల మూవీ గానీ మూడు గంటల నిడివిలా అనిపిస్తుంది. మీకు బాగా ఖాళీ ఉండి ఏదో టైమ్ పాస్ చేద్దామనుకుంటే ఈ చిత్రం చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలేం లేవు. కుటుంబంతోనూ వీక్షించొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: అనాథకి అద్భుత దీపం దొరికితే.. ఫహాద్ ఫాజిల్ హీరోగా తెలుగు సినిమా) -
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'లెనిన్'.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది. మరోవైపు ఈ వారం బిగ్ స్క్రీన్స్‌పైకి ఐశ్వర్యా రాజేశ్ 'ఓ సుకుమారి', మాధవన్ 'జీడీఎన్', వదలా, రాజా ది రాజా, ఆపరేషన్ అరుణారెడ్డి, మహేంద్రగిరి వారాహి తదితర తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ' ఇదే వీకెండ్ రాబోతుంది.(ఇదీ చదవండి: నేనేం చేస్తున్నానో నాకు తెలుసు: నాగ్ అశ్విన్)ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. సమంత 'మా ఇంటి బంగారం', వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ' ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు సెకండ్ లవ్, రెడీ ఆర్ నాట్ 2 తదితర రియాలటీ షో, డబ్బింగ్ చిత్రాలు కూడా ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 13 నుంచి 19 వరకు)హాట్స్టార్సెకండ్ లవ్ (తమిళ రియాలటీ సిరీస్) - జూలై 13పవిత్రం (మలయాళ సిరీస్) - జూలై 13వుథరింగ్ హైట్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 13రెడీ ఆర్ నాట్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 16మా ఇంటి బంగారం (తెలుగు మూవీ) - జూలై 17టెస్ట్ సబ్జెక్ట్ వీ (హిందీ డాక్యుమెంటరీ) - జూలై 18నెట్ఫ్లిక్స్ద హాక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 15మీ బిఫోర్ మీ (ఇండోనేసియన్ మూవీ) - జూలై 16ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ సిరీస్) - జూలై 17ద ఈస్ట్ ప్యాలెస్ (కొరియన్ సిరీస్) - జూలై 17డిజైర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 1723000 లైవ్స్ (జర్మన్ మూవీ) - జూలై 17హార్ట్ స్టాపప్ ఫరెవర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17స్పూకీ ఇన్ లవ్ (కొరియన్ సిరీస్) - జూలై 18అమెజాన్ ప్రైమ్మర్డర్ 101 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 13బ్యాక్ రూమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 14 (రెంట్)రైడ్ ఆర్ డై (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 15జీ5ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు (తెలుగు సినిమా) - జూలై 17ఎమ్ఎక్స్ ప్లేయర్రక్తాంచల్ సీజన్ 3 (హిందీ సిరీస్) - జూలై 16ఆపిల్ టీవీ ప్లస్లక్కీ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 15(ఇదీ చదవండి: ఇప్పుడు వాళ్ల కళ్లు చల్లబడ్డాయి.. జానకి మరణంపై సుశీల) -
మా ఇంటి బంగారం వచ్చేస్తోంది.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
సమంత లీడ్ రోల్లో వచ్చిన లేడీ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మా ఇంటి బంగారం. జూన్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం మౌత్ టాక్‌తో మూడు వారంలోనూ వసూళ్లపరంగా రాణిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఘనత సాధించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ చేశారు. జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూలై 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ విషయాన్ని జియో హాట్‌స్టార్ ప్రకటించింది. థియేటర్లలో వందకోట్లు కొల్లగొట్టిన మా ఇంటి బంగారం ఓటీటీలోనూ దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. July 17th Okokkodni kodathamu chudu... Prematho abbaaa ❤️🔥#MaaIntiBangaaram streaming from July 17th on JioHotstar! 💫 #MaaIntiBangaaramOnJioHotstar@Samanthaprabhu2 @TralalaPictures #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads… pic.twitter.com/0pgDLow1n4— JioHotstar Telugu (@JioHotstarTel_) July 12, 2026 -
ఓటీటీలో తెలుగు హారర్ సినిమా.. మూడింటిలో స్ట్రీమింగ్
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా రూపొందిన 'త్రికాల' సినిమా థియేటర్లలో మంచి స్పందన అందుకుని ఇప్పుడు ఓటీటీల్లోనూ ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సన్‌నెక్ట్స్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతూ టాప్ రేటింగ్‌తో ట్రెండ్ అవుతోంది. ఐఎండీబీలోనూ 9.1 రేటింగ్ అందుకుని హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మిలిటరీ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్పై ప్రకటన)శ్రద్ధా దాస్, మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో.. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. కేవలం డైలాగులకే పరిమితం కాకుండా కర్మ సిద్ధాంతం, గో సంరక్షణ అవసరాన్ని, పునర్జన్మల వైవిధ్యాన్ని విజువల్‌గా ఆవిష్కరించారు. పౌరాణికతను ఆధునిక ప్రపంచంతో మేళవిస్తూ మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ అంశాలను సమన్వయం చేసి చూపించారు.(ఇదీ చదవండి: అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది) -
ఓటీటీలోకి మిలిటరీ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్పై ప్రకటన
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మూవీస్‌ని తలపించే కథలని సిరీస్‌లుగా తీస్తుంటారు. అలా రాబోతున్నదే 'ఆపరేషన్ సఫేద్ సాగర్'. 1999 కార్గిల్ యుద్ధం బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. కొన్నిరోజుల క్రితం ఓ టీజర్ రిలీజ్ చేయగా ఇప్పుడు మరొకటి వదిలారు. అలానే స్ట్రీమింగ్ తేదీ గురించి అధికారిక ప్రకటన కూడా చేశారు.(ఇదీ చదవండి: 'జన నాయగణ్' అప్డేట్ ఇచ్చిన సీఎం విజయ్)హీరో సిద్దార్థ్‌తో పాటు జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్.. వచ్చే నెల 7వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో చూస్తే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. చూడాలనే కుతుహలాన్ని కలిగిస్తున్నాయి. ఇందులో సిద్ధార్థ్.. ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా నటించాడు.ఆపరేషన్ సఫేద్ సాగర్ అనేది 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత వైమానిక దళం చేపట్టిన చారిత్రక వైమానిక దాడికి పెట్టిన పేరు. 1999 మే 26న ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో 'ది గోల్డెన్ యారోస్' కీలక పాత్ర పోషించింది. శత్రువులు దాక్కున్న మంచు కొండలపై భారత బలగాలు జరిపిన ఈ సాహసోపేతమైన పోరాటం ఆధారంగా ఈ పేట్రియాటిక్ మిలిటరీ వార్ డ్రామా తీయడం విశేషం.(ఇదీ చదవండి: ఉదయం అమ్మాయిలా, రాత్రి మగాడిలా.. ఓటీటీలోకి వచ్చేసిన ఫాంటసీ కామెడీ సినిమా) -
ప్రభాస్ ఫౌజీ.. భారీ ధరకు ఓటీటీ డీల్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ ఫౌజీ. ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ టాక్ వైరల్‌గా మారింది. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం బిగ్ డీల్ కుదిరినట్లు టాక్ వినిపిస్తోంది.భారీ ధరకు డిజిటల్ రైట్స్..ఈ మూవీని ఓటీటీ డీల్ భారీ ధరకు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం ఏకంగా రూ.180 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. సౌతిండియా స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ ఈ మొత్తాన్ని చెల్లించనుందని సమాచారం. అంతేకాకుండా హిందీ హక్కులను ఏఏ ఫిల్మ్స్ రూ. 60 కోట్లకు థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకుంది.అయితే హిందీకి సంబంధించిన ఓటీటీ డీల్ ఇంకా కుదరలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం సౌత్ ఇండియా భాషలకే డీల్ ఓకే చేశారని టాక్. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన ఫాంటసీ కామెడీ సినిమా.. తెలుగులోనూ
ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా పెద్ది, సింగ్ గీతం, పరిమళ అండ్ కో, బల్టీ తదితర చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటితో పాటు ఓ తమిళ ఫాంటసీ కామెడీ మూవీ కూడా తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఖుష్బూ నిర్మించిన ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' ట్విటర్ రివ్యూ)సంతోష్, రేష్మ, వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'డబుల్ ఆక్యుపెన్సీ'. అశ్విన్ కందసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 12న తమిళంలో రిలీజైంది. ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.'డబుల్ ఆక్యుపెన్సీ' విషయానికొస్తే.. రజనీ అనే అమ్మాయికి వింత జబ్బు ఉంటుంది. పగలు అమ్మాయిలా ఉండే ఈమె రాత్రయితే అబ్బాయిలా మారిపోతుంది. ఉదయం ఓ బయోటెక్ కంపెనీలో ఉద్యోగం చేసే ఈమె.. రాత్రి ఓ బార్లో పనిచేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఈమె జీవితంలోకి ఉదయం ఓ అబ్బాయి, రాత్రి ఓ అమ్మాయి వస్తారు. మరి ఈ జండర్ స్వాప్ ప్రేమకథ చివరకు ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ) -
ఓటీటీల్లో వీకెండ్ ఎంటర్టైన్మెంట్.. ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలో అఖిల్ అక్కినేని సందడి చేయనున్నారు. ఆయన హీరోగా వస్తోన్న లెనిన్ మూవీ జూలై 10న బాక్సాఫీస్ బరిలో నిలవనుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ యాక్షన్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లెనిన్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నటించిన తమిళ మూవీ హృదయం మురళి థియేటర్లలో అలరించనుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే కొత్త సినిమాలు స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. ఇప్పటికే పెద్ది నెట్‌ఫ్లిక్స్‌లో అలరిస్తుండగా.. పతి పత్ని ఔర్ వో దో , ఇక్కా లాంటి బాలీవుడ్ మూవీస్ సందడి చేయనున్నాయి. వీటితో పాటు డోస్ లాంచి మలయాళ థ్రిల్లర్ సినిమా ఓటీటీకి రానుంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్పెద్ది(తెలుగు సినిమా)- జూలై 09సింగ్ గీతం(తెలుగు సినిమా)- జూలై 09లిటిల్ హౌస్ ఆన్ ది ప్రైయరీ(హాలీవుడ్)- జూలై 09 గుర్తుకొస్తున్నాయి(తెలుగు వెబ్ సిరీస్)- జూలై 10 పతి పత్ని ఔర్ వో దో (హిందీ మూవీ) - జూలై 10 ఇక్కా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 10 షిప్ రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 10 ద అపార్ట్మెంట్ జాబ్ (కొరియన్ సిరీస్) - జూలై 11 సుసాన అండ్ ఎల్విరా: నో ప్లాన్ బి (కొలంబియన్ మూవీ) - జూలై 12జియో హాట్‌స్టార్ ద ఫైవ్ స్టార్ వీకెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 10 ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్(మలయాళ సినిమా)- జూలై 10సోనీ లివ్ బల్టీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 10అమెజాన్ ప్రైమ్ డోస్(మలయాళ సినిమా)- జూలై 10 ద వెస్టీస్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 12జీ5 ఫ్రేమ్ (మరాఠీ సినిమా) - జూలై 10 పరిమిళ అండ్ కో (తమిళ మూవీ) - జూలై 10లయన్స్ గేట్ ప్లే ద సెంటినల్స్ (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 10 -
ఓటీటీలోకి వచ్చేసిన 'పెద్ది'.. ఆ సీన్లు మార్చేశారు
రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో చూసి మళ్లీ ఇప్పుడు ఓటీటీలో చూసిన వాళ్లు చాలానే తేడాలు గమనిస్తున్నారు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ డార్క్ కామెడీ సినిమా 'మాలీవుడ్ టైమ్స్' తెలుగు రివ్యూ)'పెద్ది' సినిమా తెలుగులో తప్పితే మరెక్కడ అస్సలు ఆడలేదు. హిందీ, నార్త్ అమెరికా ఇలా అన్నిచోట్ల దారుణంగా ఫ్లాప్ అయింది. అయితే తెలుగులో కలెక్షన్స్ వచ్చినప్పటికీ జాన్వీ కపూర్ సన్నివేశాలపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఈమె శరీరాన్ని గ్లామరస్‌గా చూపించడానికి తప్పితే మరో ఉద్దేశంతో తీసుకోలేదని ట్రోల్ చేశారు. ఓ సీన్లో అనుమతి లేకుండా జాన్వీని హీరో ముద్దు పెట్టే సీన్‌పైనా విమర్శలు వచ్చాయి.హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర ఓ సన్నివేశంలో భాగంగా మార్కెట్లో మాట్లాడుతుంటే.. అక్కడికి వచ్చిన పెద్ది పాత్ర ఆమెని వర్ణిస్తూ 'కాటుకే అక్కర్లేని ఆ కళ్లు, ముక్కుపుడకే అక్కర్లేని ఆ ముక్కు, అసలు అలంకరణే అక్కర్లేని అరుదైన చికిరి రా ఇది' అని అంటాడు. ఈ టైంలో జాన్వీ రొమ్ము, నడుము భాగాన్ని చూపించారు. దీంతో ట్రోలర్స్ దర్శకుడు, కెమెరామ్యాన్‌ని గట్టిగానే తలంటారు. థియేటర్లలో ఇలా చూపించారు గానీ ఓటీటీలో మాత్రం కేవలం జాన్వీ ముఖాన్ని చూపించి సరిపెట్టారు. లేదంటే మరోసారి దారుణమైన ట్రోలింగ్కి గురయ్యేవారు.నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ.. 3 గంటల 5 నిమిషాల నిడివితో అందుబాటులోకి వచ్చింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతిబాబు, శివరాజ్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించగా బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలోకి తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసినవి కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తుంటాయి.ఇప్పుడు అలానే ఓ తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి.. ఫొటోలు వైరల్)మాస్టర్ మహేంద్రన్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'త్రికాల:స్క్రిప్ట్ ఆఫ్ గాడ్'. ఈ ఏడాది మే 28న థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టార్స్ లేకపోవడం వల్ల దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం గురువారం(జూలై 09) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాటిక్ యూనివర్స్‌గా రూపొందుతున్న దానిలో తొలి భాగం ఇది.'త్రికాల' విషయానికొస్తే.. ఓ రాజ వంశీకుల కుటుంబానికి తరతరాలుగా శాపం ఉంటుంది. దీని కారణంగా చీకటిలో తప్ప సూర్యుడు వెలుగు చూడలేని వైతరణ్(అజయ్) పుడతాడు. చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో సవతి తల్లి (ఆమని) ఇతడిని పెంచుతుంది. ఇతడి జీవితంలో అనుహ్య సంఘటనలు జరుగుతాయి. సైకలాజికల్ బైపోలార్ డిజార్డర్ సమస్యతో బాధపడుతున్న వైతరణ్కి వైద్యం చేయడం కోసం సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధాదాస్) రంగంలోకి దిగుతుంది.ఈ క్రమంలో వైతరణ్ జీవితానికి సంబంధించి ఆమెకు ఎలాంటి విషయాలు తెలిశాయి? శంకరంపల్లి ఊరిలో కాటేరమ్మ తల్లి పేరుతో చోటు చేసుకున్న సంఘటనలు ఎలాంటివి? వైతరణ్ కుటుంబాన్ని వెంటాడుతున్న శాపం వెనుక కథేంటి? శివ (మాస్టర్ మహేంద్రన్), నిధి (సాహితి అవంచ) జంటకు వైతరణ్కీ మధ్య సంబంధం ఏమిటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ డార్క్ కామెడీ సినిమా 'మాలీవుడ్ టైమ్స్' తెలుగు రివ్యూ)(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఓటీటీలో సైకలాజికల్ డార్క్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీల్లో రిలీజయ్యే మలయాళ డబ్బింగ్ సినిమాలకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు తగ్గట్లే డిఫరెంట్ థ్రిల్లర్, కామెడీ చిత్రాలు ఎప్పటికప్పుడు స్ట్రీమింగ్‌లోకి వస్తుంటాయి. అలా రీసెంట్గా హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చిన సైకలాజికల్ డార్క్ కామెడీ మూవీ 'మాలీవుడ్ టైమ్స్'. 'ప్రేమలు' ఫేమ్ నస్లేన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూశాక ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)కథేంటి?వినీత్ మాధవన్ (నస్లేన్).. చిన్నప్పటి నుంచి హారర్ పుస్తకాలు చదువుతూ ఎప్పటికైనా గొప్ప హారర్ ఫిలిం మేకర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. కాలేజీలో ఉన్నప్పుడు ఓ హారర్ షార్ట్ ఫిల్మ్ తీసి ఇంట్లో వాళ్లకు చూపించి భయపెడతాడు. తర్వాత ఓ షార్ట్ ఫిల్మ్ పోటీలో పాల్గొని అందులో సెకండ్ ప్రైజ్ సొంతం చేసుకుంటాడు. అలా కొన్నాళ్లకు ఇండస్ట్రీలోకి వస్తాడు. మరి తన పంతం, ఇగో వల్ల ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? చివరకు తను అనుకున్నట్లు గొప్ప దర్శకుడు అయ్యాడా లేదా? ఈ క్రమంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తెలుగులో చాలా ఏళ్ల క్రితం 'నేనింతే', 'కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు' అని టాలీవుడ్ గురించి తీసిన సినిమాలు వచ్చాయి. ఇవి రెండూ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిలయ్యాయి. ఇందులో 'నేనింతే' కొందరికి నచ్చొచ్చేమో గానీ ఇవి అందరికీ నచ్చే మూవీస్ అయితే కావు. ఎందుకంటే ఇండస్ట్రీలోని కష్టాల్ని, బాధల్ని ఇందులో చూపించారు. సగటు ప్రేక్షకుడికి ఇవేం అక్కర్లేదు! తెరపై ఓ సినిమాతో ఎంటర్టైన్ చేశారా లేదా అనేది మాత్రం చూస్తాడు. కానీ సినిమా తీయడం వెనుకున్న కష్టాలు కూడా చూపిద్దామనుకుంటే చూసే ఓపిక అందరికీ ఉండకపోవచ్చు. 'మాలీవుడ్ టైమ్స్' విషయంలోనూ ఇదే జరిగింది.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఓ కుర్రాడు.. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కష్టనష్టాల్ని చవిచూశాడు అనేది సింపుల్‌గా స్టోరీ లైన్. 2 గంటల 47 నిమిషాల నిడివితో సహనానికి విపరీతమైన పరీక్ష పెట్టారు. మూవీ మొదలైన తర్వాత తొలి 20 నిమిషాలు చూస్తే ఏదో కొత్తగా ఉండబోతుందే అనిపిస్తుంది కానీ తర్వాత ఉండే సాగదీత వల్ల ఓ దశలో చిరాకొచ్చేస్తుంది.చాలా సినిమాల్లో కష్టపడితే సక్సెస్ సులభంగా వస్తుందన్నట్లు చూపిస్తారు. కానీ నిజ జీవితంలో ప్రతిభ ఒక్కటే పనికిరాదు. ఇండస్ట్రీలో ఉండే రాజకీయాలు, బడ్జెట్ పరిమితులు, నిర్మాతల ఈగోలు.. ఇవన్నీ దాటుకుని ఒక మూవీ తీయడం అంటే సాధారణమైన విషయం కాదు. ఇలా సినీ పరిశ్రమలోని సమస్యలను డార్క్ కామెడీ యాంగిల్లో చూపించే ప్రయత్నం చేశారు. కానీ అది అక్కడక్కడ మాత్రమే వర్కౌట్ అయింది.సినిమా పిచ్చిలో పడిన ఓ కుర్రాడు తనకున్న జాలి, మానవత్వం లాంటివి గాలికి వదిలేసి ఓ రకమైన సైకోలా ఎలా మారాడనేది రియలిస్టిక్‌గా చూపించారు. కాకపోతే అది కొంతవరకు పర్లేదనిపించింది. సినిమా ఇండస్ట్రీ గురించి కాస్తోకూస్తో తెలిసి, ఈ రంగంలో ఇప్పటికే పనిచేస్తున్న వాళ్లకు ఇది నచ్చొచ్చేమో గానీ సగటు ప్రేక్షకుడికి నచ్చుతుందా అంటే డౌటే. నిడివి కూడా పెద్ద సమస్య. ఓ 20 నిమిషాలు తగ్గిస్తే బాగుండేది. ఈ మూవీ తీసిన దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్.. తనకెదురైన ఇండస్ట్రీ కష్టాల్ని చూపించడం కోసం ఏమైనా ఈ చిత్రాన్ని తీశాడా అని సందేహం కూడా కలుగుతుంది.అన్ని మైనస్లేనా ప్లస్సులేం లేవా అంటే ఉన్నాయి. వినీత్‌కి సినిమాపై ఆసక్తి కలగడానికి కారణమైన థియేటర్లో డీటీఎస్ అనుభవానికి చాలామంది 90స్ కిడ్స్ రిలేట్ అవ్వొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కొందరు నిర్మాతలు కావాలనే ఎందుకు ఫ్లాప్ సినిమాలు తీస్తారు? కథనే కాకుండా స్టైల్‌ని కూడా కొందరు దర్శకులు.. మిగతా వాళ్ల నుంచి ఎలా కాపీ కొడతారు? లాంటి సీన్స్ బాగున్నాయి.నటీనటుల విషయానికొస్తే నస్లేన్ బాగా చేశాడు. ఇతర పాత్రల్లో సంగీత్ ప్రతాప్, షరాఫుద్దీన్, వినీత్ శ్రీనివాసన్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సెట్ వర్క్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ కష్టాలు చూద్దామనే ఆసక్తి ఉండి, చాలా టైమ్ ఉంటే దీన్ని చూడండి. లేదంటే లైట్ తీసుకోండి. అసభ్యకర సీన్స్ ఏం లేవు కాబట్టి కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: పలు దేశాల్లో నిషేధం.. సిటిజన్ విజిలాంట్ సినిమా తెలుగు రివ్యూ) -
ఓటీటీకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఏకంగా 5 ఓటీటీల్లోకి..!
ఓటీటీలు వచ్చాక సినిమాలు తెగ చూసేస్తున్నారు. కొత్త కంటెంట్ దొరికితే చాలు భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. ఓటీటీల్లో ముఖ్యంగా మలయాళ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటోంది. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఇటీవలే రిలీజైన మలయాళ మిస్టరీ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ డోస్. ఈ చిత్రానికి అభిలాష్ ఆర్ నాయర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సిజు విల్సన్, జగదీష్, అశ్విన్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్. జూలై 10 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్‌తో పాటు సింప్లీ సౌత్, ఆహా తమిళం, మనోరమ మ్యాక్స్, లయన్స్ గేట్ ప్లే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.#Dose (Malayalam) streaming from July 10 on PrimeVideo, SimplySouth, AhaTamil, ManoramaMax,LionsGatePlay 🍿!!#OTT_Trackers pic.twitter.com/0fKM8KFcYY— OTT Trackers (@OTT_Trackers) July 7, 2026 -
ఓటీటీలో పెద్ది.. ఆ విషయంలో నో క్లారిటీ..!
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 9 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ప్రేక్షకులు పెద్ది ఓటీటీ వర్షన్‌పై క్లారీటీ కోరుకుంటున్నారు. ఈ మూవీలోని జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రపై విమర్శలు రావడంతో కొన్ని సీన్స్ తొలగించారు. ఆ తర్వాత మరిన్ని యాడ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేశారు.ఇదే విషయంపై ఓటీటీ ప్రియులు క్లారిటీ కోరుతున్నారు. ఓటీటీలో జాన్వీ కపూర్ పాత సీన్స్‌తోనే పెద్దిని స్ట్రీమింగ్ చేస్తారా అనే సందేహం ఆడియన్స్‌లో నెలకొంది. లేదంటే కొత్త సీన్స్ యాడ్ చేసిన పెద్దిని స్ట్రీమింగ్కు తీసుకొస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు మేకర్స్ కూడా ఎలాంటి అనౌన్స్ చేయలేదు. ఈ విషయంలో సినీ ప్రియులకు పెద్ది ఓటీటీ వర్షన్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.కాగా.. గతంలో రామ్ చరణ్ నటించిన గత సినిమా గేమ్ ఛేంజర్ కూడా ఇలాంటి పరిస్థితే చూసింది. థియేటర్స్ లో మొదట వచ్చినా వర్షన్ తర్వాత కొన్ని సీన్స్ తీసేసి నానా హైరానా సాంగ్ పెట్టి తగ్గించేశారు. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చాక ఆ సీన్స్ ఏవీ కూడా అందులో లేవు. అలాగే పెద్ది సినిమాకి కూడా ఇలానే జరుగుతుందా? అని ప్రేక్షకులు భావిస్తున్నారు. -
48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్’ వివాదం ఏంటి?
ఒక సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అవ్వాలంటే సెన్సార్ బోర్డ్ అనుమతి ఉండాలి. సరైన సమయానికి సెన్సార్ పూర్తికాక రిలీజ్ వాయిదా వేసుకున్న సినిమాలెన్నో ఉన్నాయి. అయితే ఓటీటీలో అలాంటి అడ్డంకులేమి ఉండవు. డైరెక్టర్‌గా రిలీజ్ చేసుకోవచ్చు. అభ్యంతరాలు రావడం.. నిషేదానికి గురికావడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు బాలీవుడ్ చిత్రం ‘సట్లజ్’కి వచ్చింది.బాలీవుడ్ నటుడు దిల్జీత్ దొసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా జులై 3న డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ జీ5(ZEE5)లో రిలీజ్ అయింది. ఆ తర్వాత జూలై 5న దాని స్ట్రీమింగ్‌ను నిలిపివేసింది. జూలై 6, సోమవారం నాడు, ఈ చిత్రాన్ని తిరిగి ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడానికి తాము శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఆ ప్లాట్‌ఫామ్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కానీ అది జగలేదు.భారతదేశంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కోసం ఎందుకు అందుబాటులో లేదనే కారణాన్ని వెల్లడించకుండా, జీ5 ఇలా పేర్కొంది. ‘ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, తదుపరి ప్రకటన వచ్చేవరకు ‘సట్లజ్’ భారతదేశంలో అందుబాటులో ఉండదు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని మా ప్రేక్షకుల ముందుకు తిరిగి తీసుకురావడానికి, సరైన ప్రక్రియ ద్వారా సాధ్యమైన అన్ని మార్గాలను అన్వేషించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని ఒక ప్రకటన జారీ చేసింది.నిషేదం ఎందుకు?పంజాబ్‌కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ 'జస్వంత్ సింగ్ ఖల్రా' జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే ఈ సట్లజ్. ఇందిరా గాంధీ హత్య, సిక్కు వ్యతిరేక ఆందోళనల తర్వాత 1980-90ల్లో పంజాబ్‌లో వేలాది మంది అదృశ్యమయ్యారని... వారిని పోలీసులు వివిధ కారణాలతో అదుపులోకి తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అనుమానం వస్తే చాలు పిట్టల్లా కాల్చిచంపేశారు. ఈ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక కార్యక్తర జస్వంత్ సింగ్ ఖల్రా.1995 వరకు ఆయన చాలా యాక్టివ్‌గా పోరాటాలు చేశాడు. ఎన్నో నిజాలను బయటకు తీసి అప్పటి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించాడు. అయితే 1995 సెప్టెంబర్‌లో ఆయనను కిడ్నాప్ చేసి హత్య చేశారు. మృతదేహం దొరక్కుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. శవం లేకపోవడంతో కేసు ముందుకు కదల్లేదు. అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి మేరకు సిబిఐ సంస్థ రంగంలోకి దిగాక అసలు దోషులు పట్టుకొకొని.. 2007లో వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశారు. ఈ విషయాలనే సట్లజ్ సినిమాలో చూపించాడు దర్శకుడు హనీ ట్రెహాన్. ఈ చిత్రం దేశ భద్రత, సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం ఐటీ రూల్స్ 2021 (IT Rules 2021) మరియు ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కింద ఉన్న అధికారాలను ఉపయోగించి జీ5 సంస్థను ఈ సినిమాను తొలగించాల్సిందిగా ఆదేశించింది. అయితే జీ5 సంస్థ మాత్రం ఈ విషయాలేవి చెప్పకుండా.. ‘ప్రస్తుత పరిణామాల దృష్ట్యా’ అని ప్రస్తావిస్తూ చట్టపరమైన ప్రక్రియను అనుసరించి సినిమాను తిరిగి ఇండియాలో స్ట్రీమింగ్ చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని వెల్లడించింది.సెన్సార్ బోర్ట్ అభ్యంతరం..ఈ సినిమా నిజానికి 2022లోనే పూర్తయింది. మొదట దీనికి 'ఘల్లుఘరా' (మారణకాండ) అని, ఆ తర్వాత 'పంజాబ్ 95' అని పేర్లు పెట్టారు. థియేటర్ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డు (CBFC) వద్దకు వెళ్లినప్పుడు.. బోర్డు ఇందులో 127 సీన్లను కట్ చేయాలని సూచించింది. అయితే ఆ కట్స్‌కు ఒప్పుకోని చిత్రబృందం, ఓటీటీలకు సెన్సార్ బోర్డు పరిధి ఉండదు కాబట్టి, ఎలాంటి కట్స్ లేకుండా నేరుగా 'సట్లజ్' అనే కొత్త పేరుతో జీ5 లో విడుదల చేసింది. ఇది ప్రభుత్వం దృష్టికి రావడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ సినిమా కంటెంట్‌ను పూర్తిగా పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. భారతదేశంలో దీని స్ట్రీమింగ్ నిలిచిపోయినప్పటికీ, మిగిలిన దేశాల్లో అందుబాటులో ఉంది. -
పలు దేశాల్లో నిషేధించిన వివాదాస్పద సినిమా.. తెలుగు రివ్యూ
వివాదాస్పద అంశాల్ని చూపించారనే కారణాలతో కొన్నిసార్లు కొన్ని సినిమాల్ని ప్రభుత్వాలే నిషేధిస్తుంటాయి. రీసెంట్గా మన దేశంలో 'సత్లుజ్'కి అలాంటి పరిస్థితే ఎదురైంది. గత మూడేళ్లుగా సెన్సార్ బోర్డ్ దగ్గర ఇబ్బందులు పడ్డ ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. కానీ రెండు రోజుల్లోనే దాని నుంచి కూడా తీసేశారు. ఇంతకు మించి ఇబ్బందులు ఎదుర్కొంది 'సిటిజన్ విజిలాంట్' అనే ఇంగ్లీష్ మూవీ. యూరప్‌లోని జర్మనీ, యూకే, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో దీనిని అస్సలు విడుదల కానివ్వలేదు. మరి అంతలా ఇందులో కాంటవర్సీ ఏముంది? దీనిని ఎక్కడ చూడొచ్చు?(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూశాక ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)కథేంటి?క్రొయేషియాలో స్థిరపడిన అమెరికన్ బిలినీయర్ శాండర్స్ (ఆర్మీ హామర్).. తన దేశంలో అక్రమ వలసదారుల కారణంగా జరుగుతున్న హింస, అత్యాచారాలు, హత్యలు లాంటి దారుణాలు చూసి చలించిపోతాడు. న్యాయవ్యవస్థ, పోలీసులు.. సదరు నేరస్తులని ఎలాంటి శిక్ష విధించకుండా విడిచిపెట్టేయడం లాంటివి చూస్తాడు. దీంతో కోపమొచ్చి విజిలెంట్‌గా మారి సదరు నేరస్తులని, వాళ్లని రక్షిస్తున్న నాయకుల్ని చంపడం మొదలుపెడతాడు. మరి చివరకు ఏమైంది? శాండర్స్ అనుకున్నది సాధించాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతిదేశం 'అక్రమ వలసలు' అనే అతిపెద్ద సమస్యని ఎదుర్కొంటోంది. అయితే చాలా దేశాలు ఇలాంటి వాళ్లని గుర్తించి తిరిగి వారి సొంత ప్రాంతాలకు పంపించేస్తుండగా యూరోప్‌లో మాత్రం వీళ్లని చూసిచూడనట్లు వదిలేస్తున్నారు! పైపెచ్చు సకల సౌకర్యాలు ఇస్తున్నారు. దీంతో వాళ్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఆశ్రయిమిచ్చిన దేశంలోని ఆడపిల్లల్ని, మహిళల్ని లైంగికంగా వేధిస్తూ అశాంతి కలిగిస్తున్నారు. అలాంటి వాళ్లని నిర్ధాక్షిణ్యంగా చంపుకొంటూ, గాయపరుస్తూ వెళ్లే ఓ కడుపు మండిన వ్యక్తి కథే ఈ సినిమా.అంతర్జాతీయ వార్తలు చదివే వాళ్లకు యూరోపియన్ దేశాల్లో పాక్ గ్రూమింగ్ గ్యాంగ్ చేసే అరాచకాల గురించి తెలిసే ఉంటుంది. ఆయా దేశాల్లోని టీనేజీ అమ్మాయిలని కిడ్నాప్ చేసి లేదంటే వల వేసి అత్యాచారాలకు తెగబడటం లాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కానీ వీళ్లపై అక్కడి న్యాయస్థానాలు గానీ పోలీసులు గానీ సరైన చర్యలు తీసుకోవడం లేదు. చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని ఈ మూవీలోనూ పచ్చిగా చూపించారు. వలసదారుల నేరాలను అరికట్టడంలో తాము విఫలమవుతున్నామని చూపిస్తే ప్రభుత్వం, న్యాయస్థానాలు ఊరుకుంటాయా? అస్సలు ఊరుకోవు. మూవీని మొత్తానికే నిషేధించారు.నిషేధం అయితే విధించారు కానీ మిగిలిన దేశాలకు చెందిన వాళ్లు చూడకుండా యూరోపియన్ ప్రభుత్వం, న్యాయస్థానాలు ఆపలేకపోయాయి. ప్రస్తుతం అమెరికాలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె విధానంలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు ట్విటర్లో ఈ సినిమా మొత్తాన్ని వివిధ హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసేశారు. మన దేశంలోనూ అందుబాటులో ఉంది.యూరోపియన్ దేశాల్లో భద్రత అనేది గాల్లో దీపంలా ఎలా తయారైంది? ఆయా దేశాలకు చెందిన వేలాది మంది అమ్మాయిలు.. పాక్, ఆఫ్రికా నుంచి అక్రమంగా వలస వెళ్లిన యువకుల కారణంగా ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారనేది ఇందులో రా గా చూపించారు. ఇక క్లైమాక్స్‌లో హీరో.. ఓ ఫ్యామిలీతో పాటు కొందరు కుర్రాళ్లని చంపే సీన్ అయితే ఒళ్లు జలదరించేలా చేస్తుంది. సదరు అత్యాచారాలు చేసే యువకుల మనసులని వాళ్ల కుటుంబాలే ఎలా కలుషితం చేస్తున్నాయనేది కూడా ఇందులో క్లియర్ గా చూపించారు. కేవలం గంటన్నర నిడివితో ఉండే ఈ సినిమా ప్రారంభంలో కాస్త సాగదీతగా అనిపిస్తుంది కానీ కాస్త ఓపికతో చూస్తే యూరోపియన్ దేశాల అసలు స్వరూపం బయటపడుతుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ) -
ఓటీటీలోకి 'సూపర్ గర్ల్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సూపర్ హీరో కాన్సెప్ట్ అనగానే చాలామందికి హాలీవుడ్ సినిమాలే గుర్తొస్తాయి. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, హల్క్, అవెంజర్ తదితర స్టోరీలతో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. అలా ఈ తరహా కథతో వచ్చిన లేటెస్ట్ మూవీ 'సూపర్ గర్ల్'. ఇప్పుడీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంపై అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఇంతకీ ఇది ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)మిల్లీ ఆల్కాక్ లీడ్ రోల్ చేసిన సినిమా 'సూపర్ గర్ల్'. డీసీ సంస్థ నిర్మించింది. గత నెల 26న థియేటర్లలోకి వచ్చింది. అయితే 100 మిలియన్ డాలర్లకు పైగా నష్టాలు చవిచూసింది. టాక్ కూడా యావరేజ్ వచ్చింది. విజువల్స్, నటి ఫెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ స్టోరీలో పెద్ద పస లేకపోవడం, ఎమోషన్స్ వర్కౌట్ కాకపోవడంతో జనాలకు పెద్దగా నచ్చలేదు. ఇప్పుడీ చిత్రాన్ని ఈనెల 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.'సూపర్ గర్ల్' విషయానికొస్తే.. క్రిప్టన్ గ్రహం నాశనమైన తర్వాత భూమికి చేరిన కరా జోర్ ఎల్ (సూపర్ గర్ల్)కి చెందిన స్పేస్ డాగ్ క్రిప్టో.. విలన్ (క్రిమ్) చేతిలో విషప్రయోగానికి గురవుతుంది. దీంతో అతడిని కాపాడుకోవడానికి సూపర్ గర్ల్.. అంతరిక్ష ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? చివరకు క్రిప్టోని కాపాడిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. తెలుగు ప్రేక్షకుల కోసమా అన్నట్లు డబ్బింగ్‌ల రూపంలోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. రీసెంట్ టైంలో అలా 'సూపర్ సుబ్బు' సిరీస్ మన ఆడియెన్స్‌ని ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తోంది. దీనితో పాటు హాట్‌స్టార్‌లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన 'ప్రీతమ్ అండ్ పెడ్రో' అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్ కూడా మెప్పిస్తోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే?)కథేంటి?ప్రీతమ్(వీర్ హిరానీ) గోవాలో తాతతో కలిసి జీవిస్తుంటాడు. వాక్యూమ్ క్లీనర్స్ సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తుంటాడు. తన తాతకు ఎంతో ఇష్టమైన టేప్ రికార్డర్ ఎవరో దొంగిలించారని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఓ రోజు ప్రీతమ్ కంప్లైంట్ చేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో అదే స్టేషన్‌కి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అధికారి పెడ్రో(అర్షద్ వార్సి)కి ఓ ఏటీఎం దొంగతనం విషయంలో ఇతడు సాయం చేస్తాడు. మరోవైపు కేంద్ర మంత్రి కొడుకు కిడ్నాప్ కేసు పెడ్రో దగ్గరకు వస్తుంది. దీని విషయంలో తనకు కాస్త సాయం చేయాలని, అప్పుడే టేప్ రికార్డర్ వెతికి పెడతానని ప్రీతమ్‌కి పెడ్రో కండీషన్ పెడతాడు. ఇంతకీ మంత్రి కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు? ప్రీతమ్ గతేమేంటి? గతంలో పెడ్రో కొడుకు చనిపోవడానికి కారణం ఎవరు? ఈ కథలో హ్యాకర్ మార్టిన్(విక్రాంత్ మస్సే) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సినిమా అయినా సిరీస్ అయినా చూస్తున్నంతసేపు ఎంటర్టైన్ లేదా థ్రిల్ చేసిందా? అనేది కీలకం. అలాంటి వాటికే ఓటీటీలో మంచి రెస్పాన్స్ ఉంటుంది. 'ప్రీతమ్ అండ్ పెడ్రో' అలా పూర్తిస్థాయిలో ఆకట్టుకుంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దీనికి స్టోరీ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. సిరీస్ చూస్తున్నప్పుడు ఈయన గతంలో తీసిన మూవీస్ స్టైల్ అడుగడుగునా కనిపిస్తుంది. క్రైమ్ అనే పాయింట్‌కి క్రేజీ కామెడీ మిక్స్ చేయడం సరిగ్గా కుదిరింది.ఓ ఏటీఎం దొంగతనంతో మొదలైన ఈ సిరీస్‌లో తొలి రెండు ఎపిసోడ్ల కాస్త నిదానంగా సాగినట్లు అనిపిస్తాయి కానీ మిగిలిన నాలుగు ఎపిసోడ్లు మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఓ కిడ్నాప్ కేసు కారణంగా ఇద్దరు హ్యాకర్లు ఒకరితో ఒకరు తలపడి, ఎత్తుకు పైఎత్తులు వేయడం కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత ఫోన్ ఉపయోగించాలంటేనే కచ్చితంగా భయమేస్తుంది. ఎందుకంటే మన ఫోన్‌ని కూడా ఎవరైనా హ్యాక్ చేసి మనకు సంబంధించనవన్నీ గమనిస్తున్నారా అనే సందేహం కలుగుతుంది.ఇదే సిరీస్‌లో ఇప్పటితరం పిల్లలు ఎంత దారుణంగా తయారయ్యారు? బ్లూ వేల్ అనే గేమ్ కారణంగా ఎలా ప్రాణాలు తీసుకుంటున్నారు? ఈ విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అనే అంశాల్ని ఏదో మెసేజ్ ఇచ్చినట్లు కాకుండా బాగా చూపించారు. అలానే ప్రీతమ్, మార్టిన్ మధ్య సాగే హ్యాకింగ్ సీన్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. మనం కూడా హ్యాకింగ్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది అనిపించేలా ఈ సిరీస్ చేస్తుంది.నటీనటుల విషయానికొస్తే ప్రీతమ్‌గా చేసిన వీర్ హిరానీకి నటుడిగా ఇదే అరంగేట్రం. అక్కడక్కడ అనుభవ లేమి కనిపిస్తుంది గానీ ఓవరాల్‌గా బాగా నటించాడు. పెడ్రో అనే పోలీస్ అధికారిగా అర్షద్ వార్సి మెప్పించాడు. హ్యాకర్ మార్టిన్గా విక్రాంత్ మస్సే సీన్స్ తక్కువే గానీ ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు కూడా తమ వరకు న్యాయం చేశారు. ఇక చివరలో రెండో సీజన్ కూడా ఉంటుందనే హింట్ ఇచ్చారు. ఇప్పుడొచ్చిన దానిలో కిడ్నాప్ కామెడీ చూపించారు. రెండో సీజన్లో రూ.100 కోట్ల బ్యాంక్ దొంగతనం కేసుని పరిష్కరించేది చూపించబోతున్నారు.చివరి ఎపిసోడ్లో వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ దత్ అతిథి పాత్రలు తెగ నవ్విస్తాయి. ఆరు ఎపిసోడ్లు, క్రేజీ ట్విస్టులతో దాదాపు మూడున్నర గంటల నిడివి ఉన్న ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేశారు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. ఈ వీకెండ్ ఏదైనా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చూద్దామనుకుంటే ఇది మంచి ఆప్షన్.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ) -
ఓటీటీలోకి వచ్చేసిన సింగర్ సునీత కొడుకు సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే దాదాపుగా వీకెండ్లోనే రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ సింగర్ సునీత కొడుకు హీరోగా చేసిన ఓ మూవీ తాజాగా సోమవారం ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)టాలీవుడ్లో ఎన్నో ఏళ్లుగా అద్భుతమైన పాటలు పాడుతున్న సింగర్ సునీత.. పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పింది. ఈమె కొడుకు ఆకాశ్..'సర్కౌర్ నౌకరి' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత 'కొత్త మలుపు' అనే మూవీ కూడా చేశారు. గత నెల 12న థియేటర్లలో రిలీజైంది. ఇదొచ్చిన సంగతి కూడా జనాలకు తెలియదు. ఇప్పుడు అలానే సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'కొత్త మలుపు' విషయానికొస్తే.. బాధ్యతలు లేని హైదరాబాదీ కుర్రాడు కమల్ (ఆకాశ్).. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ బతికేస్తుంటాడు. ఓసారి ఫ్యామిలీలో జరిగే ఓ పెళ్లి కోసం కోనసీమ జిల్లాలోని ఓ పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా)ని చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. ఓరాత్రి అవమానకర పరిస్థితుల్లో చిక్కుకున్న కమల్ని గుర్తు తెలియని యువతి కాపాడుతుంది. ఆమెను వెతికి పట్టుకునేందుకు వరలక్ష్మితో కలిసి అన్వేషణ ప్రారంభిస్తాడు. అలా మొదలైన వీళ్లిద్దరి ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది?ఈక్రమంలో కమల్‌కి కనిపించిన ఓ ఫొటో వల్ల వీళ్ల మధ్య ఎలాంటి అనుమానాలు, అపార్థాలు తలెత్తాయి? తాను వెతుకున్న అమ్మాయికి తను మనసు పారేసుకున్న వరలక్ష్మికీ ఏమైనా సంబంధం ఉందా? లేదా? ఆఖరికి ఈ ప్రేమకథ గెలిచిందా? అనేది మిగతా స్టోరీ. ఇద్దరి మధ్య ప్రేమలో ఓ అనుమానం మొదలైతే.. అదెంతటి ప్రమాదకర పరిస్థితులకు కారణమవుతుందో ఇందులో చూపించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' రిలీజ్ కానుంది. దాదాపు మూడేళ్ల తర్వాత అఖిల్ బాక్సాఫీస్ బరిలో ఉన్నాడు. అంచనాలైతే పర్లేదనిపించేలా ఉన్నాయి. దీనితోపాటు వసుదేవసుతం, చంద్రప్పన్ అనే తెలుగు చిత్రాలు కూడా లిస్టులో ఉన్నాయి. అలానే పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఐ నోబడీ', 'హృదయం మురళి', నాగదుర్గ 'లవ్ ఓ లవ్', ధమాల్ 4 అనే డబ్బింగ్, హిందీ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)ఓటీటీ రిలీజుల విషయానికొస్తే.. ఈ వారమే 'పెద్ది' రానుంది. దీనితో పాటు మ్యూజికల్ మూవీ 'సింగ్ గీతం' కూడా స్ట్రీమింగ్ కానుంది. బల్టీ, పరిమళ అండ్ కో చిత్రాలు కూడా ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు సిరీస్‌లు, సినిమాలు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 06 నుంచి 12వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్సింగ్ గీతం (తెలుగు మూవీ) - జూలై 08ఐ యామ్ నాట్ అఫ్రైడ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 08సల్సేడో, లెదర్ అండ్ బోగాలో (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 08నథింగ్ టూ లూజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 08పెద్ది (తెలుగు సినిమా) - జూలై 09లిటిల్ హౌస్ ఆన్ ద ప్రయిరే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 09పతి పత్ని ఔర్ వో దో (హిందీ మూవీ) - జూలై 10ఇక్కా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 10షిప్ రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 10ద అపార్ట్మెంట్ జాబ్ (కొరియన్ సిరీస్) - జూలై 11సుసాన అండ్ ఎల్విరా: నో ప్లాన్ బి (కొలంబియన్ మూవీ) - జూలై 12హాట్స్టార్ద ఫైవ్ స్టార్ వీకెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 10సోనీ లివ్బల్టీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 10అమెజాన్ ప్రైమ్ద వెస్టీస్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 12జీ5ఫ్రేమ్ (మరాఠీ సినిమా) - జూలై 10పరిమిళ అండ్ కో (తమిళ మూవీ) - జూలై 10లయన్స్ గేట్ ప్లేద సెంటినల్స్ (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 10ఆపిల్ టీవీ ప్లస్ట్రైయింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 08(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా) -
ఓటీటీలోకి 'సింగ్ గీతం' సినిమా.. అధికారిక ప్రకటన
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే అప్పుడప్పుడు కాస్త డిఫరెంట్ మూవీస్ కూడా రిలీజ్ అవుతుంటాయి. అలాంటి వాటిలో 'సింగ్ గీతం' ఒకటి. 94 ఏళ్ల వయసులోనూ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తీశారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించిన ఓటీటీ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఇది ఎందులోకి ఎప్పుడు రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)అయానే, అహల్య, షాలినీ అని కొత్త నటీనటులు ప్రధాన పాత్రలు చేసిన మూవీ 'సింగ్ గీతం'. సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు కాగా కల్కి, మహానటి మూవీస్ తీసిన నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో డైలాగ్స్ తక్కువగా ఉంటాయి. పాటలే ఎక్కువగా ఉంటాయి. అత్యాశ అనే కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు. గత నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజైంది. పర్లేదనిపించింది. ఇప్పుడు ఈ బుధవారం(జూలై 08) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా అప్డేట్ ఇచ్చారు.'సింగ్ గీతం' విషయానికొస్తే.. జైలు నుంచి బయటకొచ్చిన ప్రతాప్, తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములు కుబేరపురం అనే ఊరిలో ఉన్నాయని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. అయితే అవి సాధారణ భూములు కాదని వాటిలో బంగారు గనులున్నయాని తెలుస్తుంది. అయితే ఇదే ఊరిలో ఉన్న ఏకైక చెట్టుని తల్లిలా చూసుకుంటుంది గౌరి(అహల్య). బంగారం తవ్వేందుకు ఈ చెట్టుని కొట్టేసిన తర్వాత ఊరంతటికి శాపం తగులుతుంది. దీంతో అందరి నోటి నుంచి మాటలకు బదులు పాటలు వస్తుంటాయి. మరి ఈ శాపం నుంచి విముక్తి ఎలా పొందారు? మనుషుల్లోని అత్యాశ వల్ల ఎన్ని ఇబ్బందులొచ్చాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా) -
నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా
ప్రతివారం ఓటీటీల్లోకి పదుల సంఖ్యలో సినిమాలు వస్తూనే ఉంటాయి. వీటిలో దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ, ఇతర భాషలకు చెందిన మూవీస్ కూడా ఉంటూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం స్టార్స్ నటించినవి కూడా నేరుగా ఓటీటీలో రిలీజైపోతుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ వివాదాస్పద చిత్రం పెద్దగా హడావుడి లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ)పంజాబ్‌కి చెందిన మానవ హక్కుల నేత జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా 'పంజాబ్ 95' పేరుతో దర్శకుడు హనీ టెహ్రాన్ ఓ సినిమా తీశారు. ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. పంజాబ్‌లో 25,000 మందిని అన్యాయంగా పోలీసులు చంపిన సంగతి.. తన పరిశోధన ద్వారా వెలుగులోకి తెచ్చిన జస్వంత్ సింగ్.. 1995లో హత్యకు గురయ్యారు. ఈయన్ని పోలీసులే చంపారనే ఆరోపణలు ఉన్నాయి.ఈ సినిమాని మూడేళ్ల క్రితమే తీసినప్పటికీ సెన్సార్ బోర్డ్.. తీవ్ర అభ్యంతరాలు చెప్పింది. ఏకంగా 127 కట్స్ సూచించింది. మూవీ టీమ్ కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా ఫలితం లేకపోవడంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయలేదు. దీంతో 'సత్లుజ్'గా టైటిల్ మార్చి నేరుగా జీ5 ఓటీటీలోకి రెండు రోజుల క్రితమే స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. నార్త్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ దక్షిణాది ఆడియెన్స్‌కి నచ్చుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా) -
ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా
ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుని పలు సినిమాలు చేసిన వడ్డే నవీన్.. తర్వాత కాలంలో సరైన చిత్రాలు చేయక పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. దాదాపు దశాబ్దం తర్వాత హీరో కమ్ నిర్మాతగా ఓ మూవీ చేశాడు. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఆ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఇంతకీ ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ)వడ్డే నవీన్ రీఎంట్రీలో చేసిన సినిమా 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు'. రాశీ సింగ్ హీరోయిన్. గత నెల 19న థియేటర్లలోకి వచ్చింది. అయితే విడుదలకు ముందు హడావుడి చేశారు గానీ స్టోరీ మరీ పాతది కావడం, ట్రీట్మెంట్ కూడా సీరియల్ తరహాలో ఉండటంతో తొలి ఆటకే నెగిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 17వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' విషయానికొస్తే.. త్రిమూర్తులు ఓ సాధారణ కానిస్టేబుల్. నిజాయితీ వల్ల పదేళ్లలో 55సార్లు బదిలీ అవుతాడు. అలా 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' అనే పేరు సంపాదిస్తాడు. అరకులో గతంలో తన తండ్రి పనిచేసిన స్టేషన్‌కి బదిలీపై వెళ్తాడు. అక్కడ ఓ గిరిజన అమ్మాయికి సంబంధించిన అత్యాచార కేసు ఫైల్ త్రిమూర్తులుకి కనిపిస్తుంది. 20 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటనకు ప్రస్తుత ముఖ్యమంత్రి కొడుకు, హోంమంత్రి సంతోష్ (వివేక్ రఘువంశీ) కారణమని తెలుసుకుంటాడు. మరి బాధిత యువతికి త్రిమూర్తులు న్యాయం చేశాడా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: అఫిషియల్.. ఓటీటీలోకి ‘పెద్ది’.. ఆ రోజే స్ట్రీమింగ్) -
అఫిషియల్.. ఓటీటీలోకి ‘పెద్ది’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!
రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 4న థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. జులై 9 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్.. సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడిస్తూ వివరాలను పంచుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ‘పెద్ది’ కథేంటంటే.. 1990 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో కొండ కింద ఓ ఊరు ఉంటుంది. అక్కడ 450 కుటుంబాలు, 1800 మంది జనాభా ఉన్నా.. ఆ ఊరికి గుర్తింపే ఉండదు. ఆ ఊర్లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే గుర్తింపుతో పాటు కాలి నడక ప్రయాణం తప్పుతుందని, అదే ఊరికి చెందిన అప్పల సూరి(జగపతిబాబు) 30 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మరోవైపు ఆ ఊరికి చెందిన యువకుడు పెద్ది(పెద్ది) కూలీ పని చేస్తూ.. డబ్బుల కోసం క్రికెట్ ఆడుతుంటాడు. ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టడం ఆయన స్పెషాలిటీ. క్రికెట్లో విజయనగరం యువత మొత్తానికి ఫేవరేట్ అయిన పెద్ది..ఓ కారణంగా ఆ ఆటను వదిలేసి ప్రాణాలను పణంగా పెట్టి కుస్తీ నేర్చుకుంటాడు. గౌర్నాయుడు(శివరాజ్‌కుమార్) శిక్షణలో కుస్తీ పోటీల్లో నేషనల్ వరకు వెళ్తాడు. మరి నేషనల్ పోటీల్లో పెద్ది గెలిచాడా లేదా? తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆటను ఎందుకు వదుకోవాల్సి వచ్చింది? కుస్తీ, క్రికెట్‌తో పాటు మరో ఆట కూడా ఎందుకు ఆడాల్సి వచ్చింది? ఆ ఆట ఏంటి? అసలు పెద్ది లక్ష్యం ఏంటి? అది నెరవేరిందా లేదా? ఈ కథలో అచ్చీయమ్మ( జాన్వీ కపూర్), రామ్ బుజ్జి( దివ్యేందు శర్మ) పాత్రలు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ
ఓటీటీలు చూసే చాలామందికి సినిమాలతో పాటు సిరీస్‌లు కూడా అలవాటే. కాకపోతే హారర్ లేదా థ్రిల్లర్ జానర్లో ఎక్కువగా చూస్తుంటారు. అయితే సెక్స్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఆధారంగా చాలా తక్కువ చిత్రాలు వచ్చాయి. అలాంటి సున్నితమైన అంశాన్ని ఆధారంగా చేసుకుని తీసిన తెలుగు సిరీస్ 'సూపర్ సుబ్బు'. సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. నెట్‌ఫ్లిక్‌లో తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతి ఏంటి? ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)కథేంటి?సుబ్రమణ్యం అలియాస్ సుబ్బు(సందీప్ కిషన్).. సికింద్రాబాద్‌లోని గవర్నమెంటు స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్‌గా కాంట్రాక్ పద్ధతిలో పనిచేస్తుంటాడు. ఇతడి నాన్న కుక్కుటేశ్వరరావు(మురళి శర్మ).. హెడ్ మాస్టర్‌గా చేసి రిటైర్ అవుతాడు. అయితే తండ్రి దృష్టిలో సుబ్బు ఓ పనికిరాని వెధవ. కొన్ని కారణాల వల్ల సుబ్బు.. ఆదిలాబాద్‌లోని మాకిపూర్ అనే పల్లెటూరికి సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా వెళ్లాల్సి వస్తుంది. ఈ విషయం ఇంట్లో వాళ్లకి, పెళ్లి చేసుకోబోయే దివ్య(మానస చౌదరి)కి తెలియకుండా దాచిపెడతాడు. అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే తెలియని పల్లెటూరి జనానికి.. సుబ్బు ఇవన్నీ చెప్పగలిగడా? సుబ్బు ఇంట్లో వాళ్ళకు ఇదంతా ఎప్పుడు తెలిసింది? సుబ్బుని ప్రేమించిన స్వాతి(మిథిలా పాల్కర్)ఎవరు? చివరకు ఏమైంది అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?హస్త ప్రయోగం, కండోమ్, యోని, ఫ్యామిలీ ప్లానింగ్, వేసక్టమీ, శానిటరీ ప్యాడ్, పునరుత్పత్తి వ్యవస్థ, ఎయిడ్స్ గురించి, ఆడపిల్లలు-మగపిల్లలు పుట్టడం, నెలసరి.. ఈ పదాలు వినగానే అవేదో బూతు అన్నట్టు ఇప్పటికీ చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం. బయటకు ఇదంతా మాట్లాడుకూడదు అనే అనుకుంటారు. కానీ ఇప్పుడిప్పుడే నగరాల్లో వీటన్నింటిపై అందరికీ అవగాహన పెరుగుతోంది. కానీ పల్లెటూళ్లలో మాత్రం ఇప్పటికీ వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం పెద్దగా చేయరు. అలాంటి సెన్సిటివ్ అంశం గురించి చెబుతూ తీసిన సిరీస్ ఇది.సెక్స్ ఎడ్యుకేషన్ అన్నాం కదా అని ఇందులో మొత్తం అవే ఉంటాయి అని మాత్రం అనుకోవద్దు. తొలి రెండు ఎపిసోడ్స్‌లోనే ఇవన్నీ చూపించారు. మిగతా అంతా ఆ పల్లెటూరిలో సుబ్బు ఎలాంటి కష్టాలు పడ్డాడు? అక్కడి మగవాళ్ళు ఇతడిని ఎలా ఇబ్బంది పెట్టారు అని సాగుతుంది. కానీ సిరీస్ ఆద్యంతం ఫుల్ కామెడీగా తీశారు. కాన్సెప్ట్‌కి తగ్గట్టే కంప్యూటర్, పెన్ డ్రైవ్ లాంటి పదాలతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొన్నిచోట్ల వినిపిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో బూతు లేకుండానూ చెప్పే ప్రయత్నం చేశారు.ఓ సీన్లో మగపిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? అని ఊరి ఆడవాళ్లు.. సుబ్బు పాత్రని అడుగుతారు. వారికి 'ఎక్స్' క్రోమోజోములు, 'వై' క్రోమోజోములు అని సిటీలో చెప్పినట్టుగా చెబితే అర్థం కాదు. అలాంటి విషయాన్ని రెండు పూల కుండీలను తీసుకుని ఇందులో ఉన్నది ఒకటే మట్టి కానీ ఒక దాంట్లో ఒక పూల చెట్టు ఇంకో దాంట్లో ఇంకో పూల చెట్టు ఉంది ఎందుకు? అని అడుగుతాడు. ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం మొలకెత్తుతుంది అని మహిళలంతా చెబుతారు. మరి మట్టిని తిడితే ఏం లాభం ఉంటుంది అని అందరికీ అర్థమయ్యేలా సుబ్బు చెబుతాడు.మొత్తం ఏడు ఎపిసోడ్స్‌గా తీసిన ఈ సిరీస్‌లో కాన్సెప్ట్ వినగానే అసభ్యంగా అనిపిస్తుంది గానీ ఎక్కడ ఆ ఛాయలు లేకుండా చాలా జాగ్రత్తగా తీశారు. పల్లెటూరు, అందులో ఉండే మనుషులు.. సెక్స్ అనే దాని పట్ల వాళ్ళకు ఉండే అవగాహన.. మగ పిల్లాడు కోసం పిల్లల్ని కంటూనే ఉండటం, కండోమ్ వాడటం అంటే ఏదో మహాపాపం అన్నట్టు ఫీల్ అయిపోవడం. ఆడవాళ్లకి కూడా దీనిపై కనీస అవగాహన లేకపోవడం లాంటి ఆసక్తికర విషయాలని కామెడీగా చూపించడం బాగుంది. బాగా ప్రెజంట్ చేశారు కూడా. కాకపోతే సుబ్బు పాత్రకు తప్పితే మిగతా ఎవరికీ కనెక్ట్ అవ్వం. ఎందుకో ఆయా పాత్రలతో ఎందుకో ఎమోషన్ ఫీల్ కాలేకపోతాం. ఇక చివరి ఎపిసోడ్స్‌లో కథ కాస్త నెమ్మదించడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం చిన్న మైనస్.ఓ సీన్ లో సుబ్బు.. అనుకోకుండా ఆ ఊరిలో వుండే రజినీ అనే వేశ్య ఇంటి వెళ్తాడు. ఆమెతో తన పరిస్థితి అంతా చెబుతాడు. ఆ టైమ్‌లో ఆమె.. 'నేను చేసే పని బూతు అంటారు కానీ అందులో నేను పని వెతుక్కుంటున్నా.. మీరేమో మీరు చేస్తున్న పనిలో బూతుని చూస్తున్నారు' అనే చెప్పే డైలాగ్ కానీ.. ఓసారి ఊరిలో ఆడవాళ్ళకి క్లాస్ చెప్తూ.. 'అందరికీ జన్మస్థానమైన ప్రదేశం శుభ్రంగా ఉంచుకోవడానికి సిగ్గు ఎందుకు అమ్మా' అని శానిటరీ ప్యాడ్స్ ఉపయోగం గురించి చెప్పే డైలాగ్ గానీ సీన్‌కి తగ్గట్లు అనిపిస్తాయి.సుబ్బు జీవితంలోకి మొదట వచ్చే దివ్య క్యారెక్టర్లో స్వార్ధం ఉంటే.. తర్వాత వచ్చే అమ్మాయి క్యారెక్టర్లో ట్విస్టులు బాగుంటాయి. స్వాతి క్యారెక్టర్ అయితే సబ్బుతో ప్రేమలో పడి, కలిసి ఒక్కటయ్యేవరకు వెళ్తుంది. ఈమె పాత్రలో క్యూట్‌నెస్, ఇన్నోసెన్స్, డేరింగ్ లాంటివి కనిపిస్తాయి. అయితే సుబ్బుని జీవితాంతం ప్రతి దానికి భయపెడుతూ, ఒక నిస్సహాయుడుగా చేసేస్తాడు అతడి తండ్రి. చివరకు దాన్ని ఎలా అధిగమించాడనేది ఇందులో ఉంటుంది. ఈ సీన్స్ చాలామంది కుర్రాళ్లకి కనెక్ట్ అవుతాయి.ఎవరెలా చేశారు?యాక్టింగ్ విషయానికి వస్తే సుబ్బుగా సందీప్ కిషన్ అదరగొట్టేశాడు. ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు. చాలా సహజంగా అనిపిస్తుంది. మురళీ శర్మ చేసిన కుక్కుటేశ్వరరావు పాత్ర ఇరిటేషన్ తెప్పిస్తుంది. దివ్య చేసిన మానస చౌదరి ఓకే. స్వాతిగా చేసిన మిథిలా పాల్కర్ మాత్రం చాలా నచ్చేస్తుంది. సంపూర్ణేష్ బాబు ఉన్నాడు. ఉన్నంతలో కామెడీ సీన్స్‌తో ఆకట్టుకున్నాడు. హీరో పక్కనే ఉండే గెటప్ శ్రీను పాత్ర కూడా పర్లేదు. బ్రహ్మానందం రెండు మూడు సీన్స్‌లో కనిపించారు. వేశ్యగా దివ్య పిళ్ళై కనిపించేది కాసేపు అయినా ఇంపాక్ట్ చూపిస్తుంది.రైటర్-డైరెక్టర్ మల్లిక్ రామ్.. సెక్స్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ తీసుకున్నప్పటికీ దాన్ని లైట్ హార్టెడ్ కామెడీగా చూపించి చెప్పడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీకి తగ్గట్టు ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. ఓటీటీలో ఏదైనా కామెడీగా చూద్దామనుకుంటే ఈ సిరీస్ ట్రై చేయండి. అసభ్యకర సీన్స్ ఏం లేవు గాని అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వినిపిస్తాయి. ఇదంతా 18 ప్లస్ కంటెంట్ కాబట్టి ఒంటరిగానే చూడండి.-చందు డొంకాన (ఇదీ చదవండి: ‘ఇసకపట్నం’ వెబ్‌సిరీస్ రివ్యూ) -
మంచు విష్ణు సాహసం.. కన్నప్ప స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన మూవీ 'కన్నప్ప'. గతేడాది జూన్ 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ నటించారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.అయితే ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. గతంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్ 4న ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి స్ట్రీమింగ్కు రాలేదు. అమెజాన్ ప్రైమ్‌లో కేవలం హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే సౌత్ భాషల్లో ఇప్పటి వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు.తాజాగా మంచు విష్ణు కన్నప్ప మూవీపై షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని నేరుగా సొంత యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. జూలై 03 నుంచి అవా ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది చూసిన సినీ ప్రియులు మంచు విష్ణు డేరింగ్ డెసిషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కన్నప్ప కథేంటంటే..'కన్నప్ప' విషయానికొస్తే.. గూడెంలో పుట్టి పెరిగిన తిన్నడు(విష్ణు).. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన వల్ల నాస్తికుడిగా మారిపోతాడు. చుట్టుపక్కలా గూడేల్లో ఏ ఆపద వచ్చిన ముందుంటాడు. అలాంటి కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి బహిష్కరణకు గురవుతాడు. ప్రేయసి నెమలి(ప్రీతి ముకుందన్) కూడా ఇతడి వెంట నడుస్తుంది. అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు.. గొప్ప శివ భక్తుడిగా ఎలా మారాడు? ఇంతకీ రుద్ర ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. The divine journey arrives on YouTube! 🙏#Kannappa Full Movie premieres on the AVAA YouTube Channel starting July 3.Don't miss the chance to experience this epic with the entire Family during the YouTube Premiere.#KannappaMovie #NowStreaming #YouTubePremiere #NowOnYoutube… pic.twitter.com/3caOSVSIVo— AVAA Entertainment (@avaaentofficial) July 2, 2026 -
ఓటీటీకి రూ.6 వేల కోట్ల మూవీ.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉండనే ఉంటుంది. ఈ ప్రైడే తెలుగులో నాగబంధం, రావు బహదూర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ చిత్రాలపై ఆడియన్స్‌లో బజ్ నెలకొంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైపోయాయి. ఈ శుక్రవారం హ్యాంగ్ మ్యాన్ తెలుగు మూవీతో పాటు మాలీవుడ్ టైమ్స్, కరక్కం లాంటి మలయాళ సినిమాలు కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. వీటితో పాటు బాక్సాఫీస్ వద్ద రూ.6 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ప్రాజెక్ట్ హెయిల్ మెరీ అనే హాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్‌లు, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు జూలై 3న ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్డెమోన్స్ ఆఫ్ ది షాడో రియల్(జపనీస్ మూవీ)- జూలై 04స్పార్క్స్ ఆఫ్ టొమారో (జపనీస్ సిరీస్) - జూలై 05అమెజాన్ ప్రైమ్ప్రాజెక్ట్ హెయిల్ మెరీ(హాలీవుడ్ మూవీ)- జూలై 03మ్యాన్ ఆఫ్ వార్(హాలీవుడ్ మూవీ)- జూలై 03ప్రొటెక్టర్(హాలీవుడ్ మూవీ)- జూలై 03జియో హాట్‌స్టార్ మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 03 ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 03జీ5 మర్మదేశం (తెలుగు సిరీస్) - జూలై 03 ముతస్సీ (మలయాళ సిరీస్) - జూలై 03 వీరభద్రుని రహస్యం(వీక్లీ సిరీస్)- జూలై 03సన్ నెక్స్ట్ హ్యాంగ్ మ్యాన్ (తెలుగు సినిమా) - జూలై 03ఆహా టాప్ తెలుగు ఇన్ఫ్లూయెన్సర్ (రియాలిటీ షో) - జూలై 03ఆపిల్ టీవీ ప్లస్ సిలో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 03సోనిలివ్కరక్కం(మలయాళ సినిమా)- జూలై 03 హెచ్‌బీవో మ్యాక్స్లీ క్రోనిన్స్ ది మమ్మీ(హాలీవుడ్)- జూలై 03లయన్స్ గేట్ ప్లే..హాఫ్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- జూలై 03 -
యూట్యూబ్‌లో ఫ్రీగా లెటెస్ట్ హారర్ కామెడీ చిత్రం
సాధారణంగా సినిమాలు తొలుత థియేటర్స్‌లో రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత ఓటీటీలోకి వస్తాయి. పెద్ద సినిమాలు అయితే నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తే..చిన్న సినిమాలు రెండు, మూడు వారాల్లో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ ఓ తెలుగు సినిమా మాత్రం థియేటర్స్‌లో ఉండగానే ఫ్రీగా యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అదే ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఈ హారర్ కామెడీ చిత్రం జూన్ 26న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఒకవైపు థియేటర్స్‌లో ఆడుతుండగానే యూట్యూబ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్ టైమ్స్ యూట్యూబ్ చానల్లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. ‘మా సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న సపోర్ట్, లవ్ మాటల్లో చెప్పలేనిది. మా కోసం ఇంతగా నిలబడిన ప్రేక్షకుల కోసం సినిమాను ఉచితంగా ఇవ్వలేనా ఏంటి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిన వారు లేదా మళ్లీ చూడాలనుకునే వారు ఇప్పుడు యూట్యూబ్‌లో ఫ్రీగా చూసి ఎంజాయ్ చేయవచ్చు’ అని తెలిపారు. -
‘ఇసకపట్నం’ వెబ్‌సిరీస్ రివ్యూ
టైటిల్: ఇసకపట్నం (7 ఎపిసోడ్స్)నటీనటులు: ఐశ్వర్య రాజేశ్, సముద్రఖని, రాజీవ్ కనకాల, సునీల్, నరేష్ అగస్త్య, సుధాకర్ కోమాకుల, బెనర్జీ, రాజా చెంబోలు, జ్వాలా కోటి తదితరులుదర్శకత్వం: గ్యారీ బీహెచ్నిర్మాతలు: రాహుల్ తమడ, సందీప్ రెడ్డి బొర్రసంగీతం: ప్రవీణ్ లక్కరాజుసినిమాటోగ్రఫి: వంశీ పచ్చిపులుసుఓటీటీ స్ట్రీమింగ్ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియోకథేంటంటే.. ఈ సిరీస్ కథ 1980-90 నేపథ్యంలో సాగుతుంది. ఇసకపట్నంలో నిజాయితీపరుడైన నాయకుడు చిన్నారావు(రాజీవ్ కనకాల. మత్సకారుల సమస్యలు పరిష్కరిస్తూ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. నాయుడు(సముద్రఖని) బతుకుదెరువు కోసం భార్య, కూతురుతో కలిసి ఇసకపట్నం వెళతాడు. చిన్నారావు దగ్గర కూలీగా చేరి..ఊహించని విధంగా గంగమ్మ జాతరలో ఆయననే హత్య చేస్తాడు. ఆ తర్వాత పోర్ట్ ఏరియాను తన గుప్పిట్లోకి తెచ్చుకొని డాన్‌గా ఎదుగుతాడు. తండ్రి చేసే రౌడీయిజం, అక్రమాలు నచ్చని భారతి(ఐశ్వర్య రాజేశ్).. ఒక ఎన్జీవో సంస్థకు విరాళాలు ఇస్తూ ప్రజా సేవా చేస్తూ ఉంటుంది. భారతీని ఓ యువకుడు (సుదాకర్ కోమాకుల) ప్రేమిస్తుంటాడు. తనను ప్రేమించే వ్యక్తిని కాకుండా ధనవంతుడు ప్రతాప్ వర్మను వివాహం చేసుకొంటుంది. కానీ ప్రతాప్ వర్మ పస్ట్ నైట్ రోజే చనిపోతాడు. ప్రతాప్ వర్మ చావుకు కారణం ఎవరు? ఇసకపట్నంలో నాయుడు చేస్తున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసు అధికారి వర్మ(సునీల్) వేసిన ప్లాన్ ఏంటి? నాయుడికి కుడిభుజంగా మెలిగే కోటయ్య (బెనర్జీ) దారుణ హత్యకు గురికావడానికి గల కారణాలేంటి? ఇసకపట్నం ప్రాంతంలో జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటనకు కారణం ఎవరు? భారతీ పన్నిన వ్యూహాలు ఫలించాయా లేదా? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.(Isakapatnam Web Series Review Telugu)ఎలా ఉందంటే.. స్మగ్లింగ్ మాఫియా, వలస కార్మికులపై సాగే ఆధిపత్య సంఘర్షణలు, ఆదిపత్య పోరు నేపథ్యంలో తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. ఇసకపట్నం సిరీస్ నేపథ్యం కూడా ఇదే. దర్శకుడు గ్యారీ బీహెచ్ ఎంచుకున్న కథ పాతదే అయినా..కథనం మాత్రం కొత్తగా ఉంది. మొత్తం 7 ఎపిసోడ్స్‌తో సాగే ఈ సిరీస్‌లో మొదటి మూడు ఎపిసోడ్స్ కాస్త నెమ్మదిగా సాగుతాయి. పాత్రల పరిచయానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. అయితే ఒక్కో పాత్ర పరిచయం అవుతున్నకొద్ది కథపై ఆసక్తి పెరుగుతుంది.1980 నాటి పరిస్థితులను చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆనాటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కళ్లకు కట్టినట్లు చూపించాడు. నాయుడు డాన్‌గా ఎదిగిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అప్పటి నుంచే అసలు కథ ప్రారంభం అవుతుంది. తండ్రీకూతుళ్ల మధ్య సైద్ధాంతిక వైరుధ్యాలు తలెత్తడం..మరోవైపు నాయుడు సామ్రాజ్యానికి కూల్చేందుకు సొంత మనుషులే కుట్ర చేయడం.. పోలీసు అధికారి వర్మ కూడా మరో ఎత్తుగడతో రావడంతో తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. గ్యాస్ లీకేజీ ప్రమాదంతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. సిరీస్ ప్రారంభం కాస్త నెమ్మదిగా సాగడం.. నాలుగో ఎపిసోడ్ నుంచి మాత్రం ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే కొన్ని బలమైన పాత్రలకు పెద్దగా పరిచయంలేని నటీనటులను ఎంపిక చేసుకోవడంతో ఆయా సీన్లు అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు మాత్రం అదిరిపోతాయి.ఎవరెలా చేశారంటే.. మాఫియా డాన్ నాయుడి పాత్రలో సముద్రఖని ఒదిగిపోయాడు. తెరపై క్రూరత్వంగా కనిపిస్తాడు. ఈ సిరీస్‌లో ఐశ్వర్య రాజేష్‌కు మంచి పాత్ర లభించింది. విలన్ కూతురు అయినప్పటికీ సామాన్యులకు మంచి చేసే పాత్ర ఆమెది. భారతీ పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. . పోలీస్ అధికారిగా సునీల్, ప్రేమికుడిగా సుధాకర్ కోమాకుల, ఆటో డ్రైవర్‌గా నరేష్ అగస్త్యతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సిరీస్ బాగుంది. ప్రవీణ్ లక్కరాజు అందించిన నేపథ్య సంగీతం సిరీస్ స్థాయిని పెంచేసింది. డైలాగులు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
ఓటీటీలోకి రూ.6000 కోట్ల కలెక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్‌ని ‘దురంధర్ 2’ షేక్ చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా మాత్రం హాలీవుడ్ మూవీ ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ రఫ్పాడించింది. అంతరిక్ష నేపథ్యంగా సాగే ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ చిత్రానికి ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకుంది.తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ రిలీజైన ఈ చిత్రం.. నగరాల్లో మంచి రెస్పాన్స్ అందుకొని ప్రపంచ వ్యాప్తంగా రూ.6000 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. జులై 3 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే రెంటల్ పద్దతిలో యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది.ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కథేంటంటే.. రేల్యాండ్ గ్రేస్(ర్యాన్ గాస్లింగ్) అనే ఓ వ్యోమగామి గతాన్ని మర్చిపోతాడు. ఊహించని విధంగా అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. అలాంటి ఇతడు తన తెలివితేటలు ఉపయోగించి, ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడు? అనేది మిగతా స్టోరీ. ఇలాంటి కంటెంట్‌తో గతంలోనూ చాలా సినిమాలు వచ్చాయి కానీ..విజువల్స్ అద్భుతంగా ఉండడంతో సరికొత్త సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. అంతరిక్ష నేపథ్య సినిమాలు ఇష్టపడేవాళ్లకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది. -
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలు వచ్చాక కంటెంట్‌కు కొదువ లేకుండా పోయింది. ప్రతివారంలో సరికొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాల ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. సూపర్ హిట్ అయిన సిరీస్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ల మీద సీజన్స్ అలా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఇటీవలే తెలుగులో సేవ్ ది టైగర్స్ సీజన్-3 అభిమానుల ముందుకొచ్చింది. ఈ కామెడీ సిరీస్ ఓటీటీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.తాజాగా మరో సక్సెస్ఫుల్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రెండు సీజన్స్ సక్సెస్ఫుల్ కావడంతో పార్ట్-3 ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. కోలీవుడ్‌లో అభిమానుల ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ హార్ట్ బీట్. ఓ ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కథాంశంగా తెరకెక్కించారు. ఈ హార్ట్‌బీట్ ఓటీటీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలా ఇప్పటికే రెండు సీజన్స్ రాగా.. ఆడియన్స్ ఆదరణ దక్కించుకున్నాయి.అదే ఊపుతో హార్ట్ బీట్ సీజన్-3 కూడా తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. జూలై 30 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ సిరీస్‌కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌లో దీపా బాలు, అనుమోన్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు.One world became two. But the heartbeat remains one. ❤️Hotstar Specials #HeartBeatSeason3 streaming from July 30 only on #JioHotstar #HBS3 #HBS3OnJHS #HeartBeatS3OnJioHotstar #HeartBeat3OnJioHotstar #HeartBeat3StreamingFromJuly30 #HeartBeatS3FirstLook #JioHotstarTamil… pic.twitter.com/RQFWVdi5uP— JioHotstar Tamil (@JioHotstartam) July 1, 2026 -
ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. రిలీజైన 8 నెలలకు..!
షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్, ప్రేమమ్ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన యాక్షన్ మూవీ బాల్టీ . తమిళ, మలయాళం భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశఆరు. ఉన్ని శివలింగం దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం.. గతేడాది అక్టోబర్ 10న టాలీవుడ్లో రిలీజైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.ఈ మూవీ విడుదలైన దాదాపు ఎనిమిది నెలలు పూర్తయినా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. ఈ సినిమా కోసం మలయాళ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు మేకర్స్. జూలై 10 నుంచి సోని లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. థియేటర్లలో విడుదలైన 8 నెలల తర్వాత ఓటీటీ ప్రియులను అలరించనుంది బాల్టీ. ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రాన్ని కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో రాజకీయాలు, గ్యాంగ్ స్టర్ కథతో కలిపి వైవిధ్యంగా రూపొందించారు. -
నేరుగా ఓటీటీలోకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం థియేటర్లలో కాకుండా నేరుగా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటిలో చాలా తక్కువ వాటిలో మాత్రమే ఆకట్టుకునే కథాకథనాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ సినిమా ఎప్పుడు రాబోతుందంటే?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హారర్ కామెడీ సినిమా.. తెలుగులోనూ)బ్రహ్మాజీ మాత్రమే ఈ 'హ్యాంగ్ మ్యాన్' మూవీలో తెలిసిన ముఖం కాగా.. వియన్, బన్నీ అభిరామ్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఇప్పటికి పూర్తి చేసి డైరెక్ట్ సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు. ఈ శుక్రవారం నుంచే తెలుగులో స్ట్రీమింగ్ కాబోతుంది. ఉరి తీసే తలారి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.'హ్యంగ్ మ్యాన్' విషయానికొస్తే.. వారసత్వంగా వచ్చే తలారి పని చేస్తుండే ఓ వ్యక్తి (బ్రహ్మాజీ), ఉరిశిక్షలని అమలు పరుస్తూ ఉంటాడు. ఇతడి జీవితంలో ఉరిశిక్ష అనేది ఎలాంటి మానసిక సంఘర్షణకు కారణమైంది? చివరకు ఏం జరిగింది? అనేది స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ చూడటానికి ఆసక్తికరంగానే ఉంది కానీ మూవీ ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఓటీటీలోకి మలయాళ హారర్ కామెడీ సినిమా.. తెలుగులోనూ
ఈ వారం ఓటీటీల్లోకి పలు సినిమాలు రాబోతున్నాయి. వాటిలో మాలీవుడ్ టైమ్స్, అబ్సెషన్ చిత్రాలతో పాటు ఇసకపట్నం, సూపర్ సుబ్బు, మర్మదేశం, ముతస్సీ తదితర సిరీస్‌లు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మలయాళ హారర్ కామెడీ మూవీ ఒకటి స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత)శ్రీనాథ్ బసి, ఫెమినా జార్జ్, సిద్ధార్థ్ భరతన్ ప్రధాన పాత్రలు చేసిన మలయాళ మ్యూజికల్ హారర్ కామెడీ సినిమా 'కరక్కం'. గత నెల 28న థియేటర్లలోకి వచ్చింది. ఓ మాదిరిగి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు దీన్ని ఈ శుక్రవారం(జూలై 03) నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.'కరక్కం' విషయానికొస్తే.. న్యూఇయర్ వేడుకల్లో భాగంగా ఇద్దరు స్నేహితులు ధనుష్(శ్రీనాథ్ భాసి), ఖాజా ఫుల్లుగా తాగి చర్చి స్మశానవాటికలో ఉన్న ఐదు శిలువలను పెకిలించి పారేస్తారు. ఆ తర్వాత వారిని ఐదు దెయ్యాలు వెంటాడటం మొదలుపెడతాయి. ఆ దెయ్యాల నుంచి వాళ్లు ఎలా తప్పించుకున్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్') -
‘ఐ విల్ ఫైండ్ యూ’ రివ్యూ : సూపర్ థ్రిల్లింగ్ సిరీస్
ప్రేమానుబంధమనేది మమతానురాగాలతో పెనువేసుకున్న ఓ చిక్కుబంధం. అందులోనూ రక్తసంబంధం అనేది మరింత జటిలమైనది. తామ రక్తసంబంధం ఏ సమయంలోనైనా సరే దూరమైతే ఆ బాధ వర్ణణాతీతం. మళ్ళీ దూరమైన వారితో కలిస్తేనే తమ జీవితానికి అర్ధం అని అనుకునేవారెందరో. ఆ నేపధ్యంతోనే హాలివుడ్ రచయిత హర్లాన్ కోబన్ రాసిన కథే ఐ విల్ ఫైండ్ యూ. ఇప్పుడీ కథను నెట్ ఫ్లిక్స్ 8 ఎపిసోడ్‌ల్ సిరీస్ రూపంలో తీసుకువచ్చింది. కొడుకు హత్యారోపణను ఎదుర్కుంటున్న ఓ తండ్రి చనిపోయిన తన కొడుకును వెతుకుతూ సాగించిన పోరాటమే ఈ ఐ విల్ ఫైండ్ యూ సిరీస్. డేవిడ్ బరోస్ తన కొడుకు మాథ్యూ బరోస్ ను చంపిన కేసులో కౌంటీ జైలులో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. మాధ్యూ బరోస్ తల్లి ఛెరిల్ చెల్లెలైన రేచెల్ మిల్స్ తన బావ డేవిడ్ బరోస్ ను చూడడానికి జైలుకు వస్తుంది. ఆ సమయంలోనే రేచేల్ మాథ్యూ చనిపోలేదని ఓ ఫోటో డేవిడ్ కు చూపుతుంది. తన కొడుకు బ్రతికే ఉన్నాడన్న విషయం తెలుసుకున్న డేవిడ్, రేచెల్ సహాయంతో జైలు నుండి తప్పించుకుని మాథ్యూని వెతుకుతూ ఉంటాడు. ఈ ప్రయత్నంలోనే రేచెల్ బాయ్ ఫ్రెండ్ అయిన ఆడమ్ ఇంట్లో డేవిడ్, రేచెల్ తలదాచుకుంటారు. ఇక అక్కడి నుండి కథ అనూహ్యమైన మలుపులతో ఊహ కందని ట్విస్టులతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. చనిపోయిన కొడుకు మాథ్యూ కేసులో నిందితుడైన డేవిడ్ మాథ్యూని రేచెల్ తో కనుక్కోగలడా లేదా అన్నది ఈ థ్రిల్లింగ్ సిరీస్ లోనే చూడాలి. 8 ఎపిసోడ్ల ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్ ఆద్యంతం చూస్తున్న ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తూ థ్రిల్లింగ్ గా సాగుతుంది. ఎవరూ ఊహించని సస్పెన్స్ తో సాగే ఈ సిరీస్ థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడే వాళ్ళకి సరైన ఛాయిస్. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలోకి లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్'.. అధికారిక ప్రకటన
రీసెంట్ టైంలో ప్రపంచం మొత్తం ఏదైనా సినిమా గురించి మాట్లాడుకున్నారంటే అది 'అబ్సెషన్' గురించే. కర్రీ బార్కర్ అనే ఓ యూట్యూబర్ దర్శకుడిగా మారి ఈ మూవీ తీశాడు. బడ్జెట్ కూడా రూ.7 కోట్లే. కానీ ఇప్పటివరకు రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదిరిపోయే రికార్డ్ సృష్టించింది. ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)గత నెల ప్రారంభంలో అమెరికాలో రిలీజ్ కాగా.. రెండు మూడు వారాల తర్వాత మన దేశంలోని థియేటర్లలో విడుదలైంది. భారతీయ ప్రేక్షకుల్ని భయపెడుతూ ఆకట్టుకుంది. మంచి వసూళ్లు అందుకుంది. ఇప్పుడీ చిత్రం రేపటి(జూన్ 30) నుంచి ఆపిల్ టీవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి ఇంగ్లీష్ వెర్షన్ మాత్రమే రానుండగా.. త్వరలో తెలుగు, తమిళ, హిందీ డబ్బింగ్ కూడా జోడించనున్నారు.ఆపిల్ టీవీ ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లోనూ అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ మూవీలో మైకేల్ జాన్స్టన్, ఇండే నవరెట్టే హీరోహీరోయిన్లుగా నటించారు. అతిప్రేమ అనేది ఇద్దరు ప్రేమికుల జీవితాల్ని ఎలా నాశనం చేసిందనే పాయింట్‌తో 'అబ్సెషన్' తీశారు. అయితే కొందరు ప్రేక్షకులకు ఈ మూవీ నచ్చలేదు కూడా.'అబ్సెషన్' విషయానికొస్తే.. బేర్ (మైకేల్ జాన్స్టన్) కాలేజీ కుర్రాడు. ఓ మ్యూజిక్ షాపులో పనిచేస్తుంటాడు. ఇతడికి ముగ్గురు ఫ్రెండ్స్. వాళ్లలో ఒకరైన నిక్కీని(ఇండే నవరెట్టే) ఇతడు ప్రేమిస్తుంటాడు. కానీ ఆమెకు ఆ విషయం చెప్పేందుకు చాలా భయపడిపోతుంటాడు. ఓ రోజు 'వన్ విష్' పేరుతో ఉన్న చిన్న వస్తువుని కొంటాడు. దాన్ని విరగ్గొట్టి నిక్కీ తనని చాలా ప్రేమించేయాలని బలంగా కోరుకుంటాడు. ఊహించని విధంగా ఆ కోరిక నిజమైపోతుంది. నిక్కీ, బేర్‌ని ప్రేమించడం మొదలుపెడుతుంది. అప్పటివరకు అంతా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ) -
'పెద్ది' ఓటీటీ.. కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. కొన్ని థియేటర్లలో మాత్రమే ఆడుతోంది. మరోవైపు ఈ మూవీ ఇదే వీకెండ్లో ఓటీటీలోకి రానుందనే టాక్ నడిచింది. రీసెంట్ టైంలో తెలుగు చిత్రాలకు ఫాలో అయినట్లు దీనికి కూడా నాలుగు వారాల విండోనే అనుసరించారా అని అనుకుంటున్న టైంలో మరో సంగతి బయటకొచ్చింది. అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా 'పెద్ది' స్ట్రీమింగ్ కానుందట. ఇంతకీ ఏ తేదీ నుంచి రానుంది?(ఇదీ చదవండి: బెల్లంకొండ రికార్డ్.. మరే తెలుగు హీరోకి సాధ్యం కాదు)రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో తీసిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ 'పెద్ది'. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. చరణ్ యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ జాన్వీతో పాటు పలు లాజిక్ లేని సీన్ల కారణంగా బోలెడన్ని విమర్శలు ఈ చిత్రంపై వచ్చాయి. అయితేనేం రూ.400 కోట్లకుపైనే కలెక్షన్స్ సాధించింది. ఇకపోతే ఈ సినిమా.. థియేటర్లలో రిలీజైన 42 రోజుల తర్వాత అంటే జూలై 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి స్ట్రీమింగ్ కానుందట.దక్షిణాది భాషల వరకు జూలై 16 నుంచి ఓటీటీలో రిలీజ్ కానుండదా.. హిందీ మాత్రం జూలై 30 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఇది దాదాపు కన్ఫర్మ్. కాకపోతే అధికారిక ప్రకటన వస్తే పూర్తి క్లారిటీ వస్తుంది.ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి అబ్సెషన్, మాలీవుడ్ టైమ్స్ అనే డబ్బింగ్ చిత్రాలతో పాటు సూపర్ సుబ్బు, ఇసకపట్నం తదితర తెలుగు సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఓవరాల్‌గా 15కి పైగా మూవీస్, వెబ్ సిరీస్‌లు ఈ వీకెండ్ పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి నాగబంధం, రావు బహదూర్ అనే తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఇవి రెండు కూడా కంటెంట్ పరంగా కాస్త డిఫరెంట్‌గా ఉండబోతున్నాయనే ఆసక్తి కలిగిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఆలియా భట్ ప్రధాన పాత్ర చేసిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' కూడా ఇదే వారాంతం రిలీజ్ కానుంది. మరి దీని తెలుగు వెర్షన్ విడుదల చేస్తారా అనేది క్లారిటీ లేదు.(ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్)మరోవైపు ఓటీటీల్లో మాత్రం 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో చూడదగ్గవి చాలానే ఉన్నాయండోయ్. సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బ', ఐశ్వర్య రాజేశ్ 'ఇసకపట్నం' లాంటి తెలుగు సిరీస్‌లతో పాటు లేటెస్ట్ వరల్డ్ వైడ్ సెన్సేషన్ 'అబ్సెషన్' మూవీ ఇదే వారం రానుంది. మాలీవుడ్ టైమ్స్ లాంటి డబ్బింగ్ చిత్రం కూడా స్ట్రీమింగ్ కానుంది. రామ్ చరణ్ 'పెద్ది' కూడా ఈ వారం డిజిటల్ రిలీజ్ అంటున్నారు. కాకపోతే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూన్ 29 నుంచి జూలై 05 వరకు)నెట్ఫ్లిక్స్సూపర్ సుబ్బు (తెలుగు సిరీస్) - జూలై 02పెద్ది (తెలుగు సినిమా) - జూలై 02 (రూమర్ డేట్)ఎనోలా హోమ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 02హ్యుమన్ వెపర్ (జపనీస్ సిరీస్) - జూలై 02స్పార్క్స్ ఆఫ్ టొమారో (జపనీస్ సిరీస్) - జూలై 05అమెజాన్ ప్రైమ్అబ్సెషన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 30 (రెంట్)ఎల్లే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 01ఇసకపట్నం (తెలుగు సిరీస్) - జూలై 02హాట్స్టార్మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 03ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 03జీ5మర్మదేశం (తెలుగు సిరీస్) - జూలై 03ముతస్సీ (మలయాళ సిరీస్) - జూలై 03సన్ నెక్స్ట్హ్యాంగ్ మ్యాన్ (తెలుగు సినిమా) - జూలై 03ఆహాటాప్ తెలుగు ఇన్ఫ్లూయెన్సర్ (రియాలిటీ షో) - జూలై 03sఆపిల్ టీవీ ప్లస్సిలో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 03(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే? తెలుగు రివ్యూ) -
'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్
తెలుగు సినిమా దశాదిశా మార్చిన సినిమా 'బాహుబలి'. దీని గురించి కొత్తగా ఏం చెబుతాం. రెండు భాగాల్ని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు వందలసార్లు చూశారు. టీవీ, మొబైల్లో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. అయితే మూవీస్ వచ్చి దాదాపు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 'బాహుబలి ద టార్చ్ బేరర్' పేరిట ఓ డాక్యుమెంటరీ తీశారు. మూడురోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. తెర వెనక సంగతుల్ని మూవీ టీమ్ అంతా పంచుకున్నారు. ఇంతకీ ఈ డాక్యుమెంటరీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)డాక్యుమెంటరీ అనగానే హా ఏముంది, కూర్చుని మాట్లాడుతుంటారు.. ఏం చూస్తాంలే అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. 'బాహుబలి ద టార్చ్ బేరర్' గురించి ప్రకటన వచ్చినప్పుడు చాలామంది ఇలానే అనుకున్నారు. కానీ ఈ డాక్యుమెంటరీని చూస్తుంటే సినిమాకు ఏం తక్కువ కాదని అనిపించింది. ఎందుకంటే 123 నిమిషాల నిడివితో నాలుగు ఎపిసోడ్లుగా దీన్ని ప్రెజెంట్ చేశారు. ద డ్రీమ్, బిల్డింగ్ ద డ్రీమ్, బియాండ్ డ్రీమ్స్, ద టార్చ్ బేరర్ పేరిట ఎపిసోడ్స్ ఉన్నాయి.అసలు 'బాహుబలి' చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎలా రూపుదిద్దుకుంది? ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ప్రధాన పాత్రధారులైన ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్.. ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు? కొంత బడ్జెట్ అనుకున్నది కాస్త రోజురోజుకి ఎలా పెరిగిపోయింది? ఒక భాగం అనుకున్నది కాస్త రెండు భాగాల సినిమాగా ఎలా మారింది? అప్పట్లో వందల కోట్ల బడ్జెట్ పెట్టడం అనేది ఎంత కష్టమైంది? అనే విషయాల్ని నిర్మాతలు చెబుతూ, అప్పటి ఫుటేజీ చూపించడం క్రేజీగా అనిపించింది.మరీ ముఖ్యంగా రెండో ఎపిసోడ్ చివరలో 'బాహుబలి'కి తెలుగులో ఫ్లాప్ టాక్ రావడంతో రాజమౌళి, మూవీ టీమ్ అంతా ఎంతలా భయపడ్డారు? మానసికంగా ఎలాంటి దారుణమైన పరిస్థితిని అనుభవించారు. రమ రాజమౌళి అయితే సినిమా నష్టాల్ని కవర్ చేసేందుకు తనకు మణికొండలో ఉన్న స్థలాన్ని అమ్మేద్దామని డిసైడ్ కావడం లాంటి కామెంట్స్ ఆసక్తికరంగా అనిపించాయి. ఈ డాక్యుమెంటరీలో నటీనటుల కష్టం దగ్గర నుంచి రాజమౌళి విజన్ వరకు, దాన్ని ప్రతి ఒక్కరూ రియాలిటీలో తీసుకొచ్చేందుకు ఎంతలా కష్టపడ్డారు అనేది డీటైల్డ్‌గా చూపించారు.సాధారణంగా సినిమాల్లో ఉన్నట్లే ఈ డాక్యుమెంటరీలోనూ హై మూమెంట్స్ ఉన్నాయండోయ్. 'బాహుబలి' ప్రభావం ప్రపంచంలోని లక్షల జనాభా ఉండే చిన్న చిన్న దేశాల వరకు ఎలా పాకింది అనేది కూడా చెప్పారు. ఓసారి బ్యాంకాక్‌లో డాక్టర్ అపాయింట్మెంట్ కోసం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వెళ్తే.. గంటసేపు వెయిట్ చేయమని చెప్పారని, తాను ఇలా 'బాహుబలి' ఫ్రెండ్ అని చెప్పగానే సదరు డాక్టర్ వెంటనే పూరీకి ట్రీట్మెంట్ ఇచ్చేశాడని ప్రభాస్ చెప్పడం.. ఈ సినిమాలో కుమార వర్మ పాత్ర, జపాన్‌లో తనకు అద్భుతమైన ఫ్యాన్ బేస్ సంపాదించి పెట్టడం గురించి నటుడు సుబ్బరాజు చెప్పడం, అలానే జపాన్‌లోని ఓ మహిళా అభిమాని చనిపోతే ఆమె భర్త వచ్చి తనన కలవడం గురించి సుబ్బరాజు చెప్పినప్పుడు ఎమోషనల్ అనిపించింది.'బాహుబలి' రెండో భాగం కోసం ఎదురుచూడటం, ఇదొచ్చేలోపు చనిపోతానేమో భయపడ్డానని తన వదినతో ఓ క్యాన్సర్ పేషెంట్ చెప్పడం లాంటి సంగతుల్ని రాజమౌళి పంచుకున్నారు. ఇక చివరలో 'మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం? సాహో అని ప్రపంచము! తానూ నమ్మిన నమ్మకమే తన ఆయుధమై పోరాడుతుంటే, తలొంచదా విధి సైతం! జై మహిష్మతి!' అని రాజమౌళి చెప్పి ముగించడం క్రేజీగా అనిపించాయి. 'బాహుబలి'కి మూడో భాగం కూడా ఉంటుందని ప్రభాస్-రానా-అనుష్క హింట్ ఇవ్వడంతో ఈ డాక్యుమెంటరీని ముగించారు.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే?) -
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్.. 'ఇసకపట్నం' కొత్త ట్రైలర్
సముద్రఖని, ఐశ్వర్య రాజేశ్, సునీల్ ప్రధాన పాత్రల్లో చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'ఇసకపట్నం'. వచ్చే నెల 02న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. కొన్నిరోజుల క్రితం ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో ట్రైలర్‌ని విడుదల చేశారు. కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంగా అధికారం, రాజకీయాలు, గ్యాంగ్ వార్స్, కుటుంబ విభేదాలు తదితర అంశాలతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. తండ్రి-కూతురు మధ్య జరిగే పోరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.(ఇదీ చదవండి: వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం' ఇదే)పట్టణంలో రాజకీయాలు, నేరాలు, వ్యాపారాలపై పూర్తి ఆధిపత్యం చెలాయించే నాయుడికి, తన సొంత కూతురే పెద్ద సవాలుగా మారుతుంది. తన జీవితాన్ని తన నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్లాలనుకునే భారతి, తండ్రికి ఎదురు నిలబడటమే స్టోరీ. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 7 ఎపిసోడ్లతో తీశారు. జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కు పైగా దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: స్టార్ హీరోతో 'సేవ్ ది టైగర్స్' సీజన్ 4) -
స్టార్ హీరోతో 'సేవ్ ది టైగర్స్' సీజన్ 4
తెలుగులో సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్' నుంచి ఇప్పటివరకు మూడు సీజన్స్ వచ్చాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. దీంతో మేకర్స్ ఇప్పుడీ నాలుగో సీజన్‌ను రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 19న మూడో సీజన్.. హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తొలి రెండు సీజన్స్ లానే సీజన్ 3 కూడా బ్లాక్‌బస్టర్ అయ్యేసరికి షో రన్నర్ మహి వి.రాఘవ్ చాలా సంతోషంగా ఉన్నారు. పెళ్లి తర్వాత మూడు జంటల మధ్య ఉండే చిన్న చిన్న గిల్లికజ్జాలను కామెడీగా తెరకెక్కించిన తీరు ఆడియెన్స్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. మరీ ముఖ్యంగా సీజన్ 3లో చూపించిన కాస్మిక్ ట్విస్ట్ సిరీస్‌కు ఓ కొత్త కోణాన్ని తీసుకొచ్చింది.సేవ్ ది టైగర్స్ మూడు సీజన్స్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ రావటంతో మేకర్స్ ఇప్పుడు నాలుగో సీజన్‌ను రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే సీజన్ 4లో ఓ స్టార్ హీరోను నటింపచేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిన్నపాటి గిల్లికజ్జాలు, ఈగో సమస్యలతో ఉండే ఈ మూడు జంటల మధ్య స్టార్ హీరో పాత్ర ఎక్కడ, ఎలా ఉండబోతుందోననే ఆసక్తి కలుగుతోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అవతార్ 3, బ్లాస్ట్, లింగం, దూరదర్శిని, రాజా శివాజీ తదితర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అయితే వీటితో పాటు మరో తెలుగు మూవీ కూడా పెద్దగా హడావుడి లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: అలాంటి సమాజంలో మనం ఉన్నాం.. సింగర్ సునీత క్లారిటీ)ఆర్కే మాస్టర్, లక్కీ, బాబా భాస్కర్ ప్రధాన పాత్రలు చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'మహాబలి 1980స్'కి బొమ్మ సాయికుమార్ దర్శకుడు. గతేడాది మే 10న థియేటర్లలో రిలీజైంది. కానీ పూర్ ప్రొడక్షన్ వాల్యూస్, పేరున్న నటీనటులు లేకపోవడంతో ఇదొచ్చిన సంగతి కూడా జనాలకు తెలిసిరాలేదు. ఇప్పుడు ఏడాది తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఓ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఈ మూవీ తీశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే?) -
ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే?
ఓటీటీల్లోకి ఈ వారం బ్లాస్ట్, రాజా శివాజీ, అవతార్ 3 లాంటి సినిమాలు వచ్చేశాయి. వీటితో పాటు 'ద షీప్ డిటెక్టివ్స్' అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ కూడా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉన్న ఈ సినిమాని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌కు కాస్త కామెడీ జోడించి తీశారు. ఇంతకీ ఇదెలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: జైలులో హీరో దర్శన్.. కారు యాక్సిడెంట్ వివాదంలో కొడుకు)కథేంటి?జార్జ్(హ్యూ జాక్మన్) ఓ గొర్రెల కాపరి. డెన్బ్రూక్ అనే చిన్న పల్లెటూరిలో జీవిస్తుంటాడు. అయితే రాత్రి పడుకోవడానికి ముందు గొర్రెలకు తన దగ్గరుండే డిటెక్టివ్ నవలలు చదివి వినిపిస్తుంటాడు. అయితే ఆ గొర్రెలకు ఈ కథలన్నీ అర్థమవుతున్నాయనే సంగతి జార్జ్‌కి తెలియదు. ఇదిలా ఉండగా ఓ రోజు రాత్రి జార్జ్‌ని ఎవరో చంపేస్తారు. ఈ కేసుని ఓ పోలీస్ దర్యాప్తు చేస్తుంటాడు. మరోవైపు గొర్రెలన్నీ డిటెక్టివ్‌గా మారి తన కాపరిని ఎవరో చంపారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి. చివరకు హంతకుడు దొరికాడా? లేదా? అసలు జార్జ్‌ని ఎవరు ఎందుకు చంపారనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇప్పటివరకు మీరెన్ని మర్డర్ మిస్టర్ థ్రిల్లర్స్ చూసే ఉంటారు. వాటన్నింటిలోనూ పోలీసులు లేదా ప్రైవేట్ డిటెక్టివ్స్, చుట్టూ పక్కన ఉండే వాళ్లలో ఎవరో ఒకరు పరిష్కరించడం లాంటివి చూసుంటారు. కానీ ఇందులో మాత్రం గొర్రెలు.. ఓ హత్య కేసుని పరిష్కరించేందుకు చాలా సహాయపడతాయి. వినడానికి విచిత్రంగా ఉంది కదా! కానీ పెద్దగా హడావుడి లేకుండా సరదాగా మూవీ తీసేశారు.మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అనగానే ఏదేదో ట్విస్టులు ఊహించేసుకుంటాం కదా. ఇందులో హత్య చేసింది ఎవరు? అనే ట్విస్ట్ ఉంటుంది గానీ దానికంటే గొర్రెలు, మనుషుల్లా మాట్లాడుకోవడం.. తమ కాపరి ఇప్పటివరకు చదివి వినిపించిన డిటెక్టివ్ పుస్తకాల్లోని స్టోరీల ఆధారంగా ఈ కేసుని ఛేదించేందుకు ప్రయత్నం చేయడం లాంటివి ఫన్నీగా ఉంటాయి. గ్రాఫిక్స్ కూడా చాలా సహజంగా ఉంది.అలానే అప్పటివరకు ఊరి చివర గడ్డి తిని బతికే గొర్రెలు.. మనుషులు ఉండే ప్రపంచంలోకి వచ్చి గందరగోళానికి గురవడం లాంటివి కూడా ఫన్నీగా చూపించారు. జార్జ్‌తో పాటు అదే ఊరిలోని మరో గొర్రెల కాపరి, కసాయి వాడు, ఓ హోటల్ యజమాని, పోలీసోడు, ఓ న్యూస్ రిపోర్టర్, జార్జ్ కూతురు.. ఇలా చాలా పాత్రలపై అనుమానం వచ్చేలా దర్శకుడు స్టోరీని నడిపించాడు. కానీ క్లైమాక్స్‌లో హంతకుడు/హంతకురాలు ఎవరనేది పెద్దగా హడావుడి లేకుండా చూపించి సినిమా ముగించాడు.సినిమాలోని నటించిన నటీనటులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలైతే కాదు. కానీ ఆయా పాత్రలకు సెట్ అయిపోయారు. తెలుగు డబ్బింగ్, గొర్రెల గ్రాఫిక్స్ లాంటివి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కూడా రిచ్‌గా ఉన్నాయి. అసభ్యకర సీన్స్ ఏం లేవు. కుదిరితే పిల్లలకు కూడా చూపించండి. వాళ్లు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. దాదాపు 100 నిమిషాలుండే ఈ మూవీ ఇలా మొదలుపెడితే అలా అయిపోతుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ డార్క్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి మలయాళ డార్క్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మలయాళం నుంచి వచ్చే డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో క్రేజ్ ఉండనే ఉంది. ఇప్పుడు అలాంటి వాళ్ల కోసమా అన్నట్లు ఓ సైకలాజికల్ డార్క్ కామెడీ మూవీ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: మీ దుస్తులు మీ ఇష్టం.. వాడి కళ్లు వాడి ఇష్టం: సింగర్ సునీత)'ప్రేమలు' సినిమాతో తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకున్న నస్లేన్ లేటెస్ట్ మూవీ 'మాలీవుడ్ టైమ్స్'. సినిమా ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. గతంలో 'ఉన్ని ముకుందన్ అసోసియేట్స్' అనే డార్క్ కామెడీ మూవీ తీసిన అభినవ్ సుందర్ నాయక్.. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ నెల 5న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడీ మూవీ వచ్చే నెల 3వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.మాలీవుడ్ టైమ్స్ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి హారర్ నవల్స్ చదివి, హారర్ సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ, మనోజ్ నైట్ శ్యామలన్,స్పీల్బర్గ్ లాంటి దర్శకులని మించిపోవాలని ఓ కుర్రాడు ఆశపడుతుంటాడు. అలాంటివాడు.. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి, అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాడు? తన కథని, తన ఆలోచనల్ని వేరొకడు తెరపై ముందే ప్రెజెంట్ చేసేసినప్పుడు తన మూవీని చావుతో కనెక్ట్ చేసి హిట్ చేద్దామనుకున్నప్పుడు దర్శకుడిగా తన ప్రతిభ మాత్రమే తెరపై కనపడాలనుకుని కోరుకునే కుర్రాడు ఎలా ఫీలయ్యాడు? ఏం చేశాడనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: నన్ను ‘బిగ్‌బాస్’లోకి తీసుకోండి.. ఎస్సై విజ్ఞప్తి, వీడియో వైరల్)A love-hate letter to Malayalam cinema. Mollywood Times streaming from July 3, only on JioHotstar. Watch in Malayalam, Tamil. Telugu, Kannada and Hindi.@naslen__ @abhinavsnayak #MollywoodTimes #JioHotstar #JioHotstarMalayalam #Drama #Comedy #MalayalamMovie pic.twitter.com/8dNZEhtgSO— JioHotstar Malayalam (@JioHotstarMal) June 26, 2026 -
సైలెంట్‌గా ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ రాజా శివాజీ. ఈ చిత్రంలో రితేశ్ దేశ్‌ముఖ్ హీరోగా నటించడమే కాదు.. ఆయనే దర్శకత్వం వహించారు. ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మరాఠీలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ఘనత సాధించింది. ఈ మూవీ మరాఠీ సినీ పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది.తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా మరాఠీతో పాటు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కించారు. స్వరాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ సాగించిన పోరాటాన్ని ఇందులో చూపించారు. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రంలో జెనీలియా, విద్యా బాలన్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. Vidroh karne aa rahein hai Raje ⚔️ pic.twitter.com/1tnxMXNzGU— Netflix India (@NetflixIndia) June 26, 2026 -
సడన్‌గా ఓటీటీలో లేటేస్ట్ తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సువిక్షిత్, గీతికా రతన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం దూరదర్శని. కలిపింది ఇద్దరినీ అనే ఉపశీర్షిక. ఈ మూవీని కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ నిర్మించారు. ఈ చిత్రాన్ని యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ ఏడాది మే 15న థియేటర్లలో విడుదలైన సినిమా పెద్దగా ఆకట్టుకోలేకోపోయింది. తాజాగా ఈ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.ఈ మూవీ కథేంటంటే..హరి(సువిక్షిత్ బొజ్జ) వెనుకబడిన కులానికి చెందిన యువకుడు. అదే గ్రామానికి చెందిన గొప్పింటి అమ్మాయి వాణి(గీతికా రతన్) అంటే అతని చాలా ఇష్టం. వాణి కూడా హరిని ప్రేమిస్తుంది. వీరిద్దరి ప్రేమకి పేకబాబు(భాస్కర్) ఇల్లు అడ్డా అవుతుంది. ప్రతి రోజ రాత్రి టీవీ చూసేందుకు పేకబాబు ఇంటికి వెళ్లేవారు. హరి,వాణిల మధ్య ప్రేమాయణం కొనసాగుతుందనే విషయం పేకబాబుకి తెలుస్తుంది. వాణిపై మనసుపడ్డ పేకబాబు..ఎలాగైన ఆమె నుంచి హరిని దూరం చేయాలనుకుంటాడు. అందుకోసం వాణి అన్నయ్య పరశురామ్(విజయ్ కృష్ణారెడ్డి)ని పావుగా వాడుతాడు. అతనికి లేనిపోనివి చెప్పి.. ఊర్లో కులాల చిచ్చు పెడతాడు. కొన్నాళ్ల తర్వాత వాణి, హరి ప్రేమించుకుంటున్నారనే విషయం పరశురామ్‌కి తెలుస్తుంది. తన చెల్లి తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిదనే విషయం తెలిసిన తర్వాత పరశురామ్ ఏం చేశాడు? పేక రాజు చేసిన కుట్రకి ఊర్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రేమను దక్కించుకునేందుకు హరి, వాణిలు తీసుకున్న నిర్ణయం ఏంటి? చివరకు వీరి ప్రేమ కథ విషాదంగా ముగిసిందా లేదా సుఖాంతం అయిందా ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీకి వచ్చేసిన డిటెక్టివ్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలు వచ్చాక వినోదం మరింత సులభతరం అయిపోయింది. ఏ భాషలో రిలీజైన సరే కంటెంట్ బాగుంటే చాలు డబ్బింగ్ వర్షన్లోనూ తెగ చూసేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రియులు సినిమాలను ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారంలో కొత్త సినిమాలు ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ హాలీవుడ్ మిస్టరీ కామెడీ మూవీ సడన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ స్టార్ హ్యూ జాక్మాన్ ప్రధాన పాత్రలో వచ్చిన మిస్టరీ కామెడీ చిత్రం ‘ది షీప్ డిటెక్టివ్స్’. మే 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమా జూన్ 24 నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ రచయిత లియోనీ స్వాన్ రాసిన త్రీ బ్యాగ్స్ ఫుల్ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి కైల్ బాల్డా దర్శకత్వం వహించారు.ఈ మూవీ కథేంటంటే..డెన్బ్రూక్ అనే చిన్న పట్టణంలో గొర్రెల కాపరిగా పనిచేసే హ్యూ జాక్మాన్ అనుకోని పరిస్థితుల్లో హత్యకు గురవుతాడు. అయితే, ఆ హత్య వెనుక ఉన్న అసలు కారణం ఏంటనే కోణంలో కథ ఉండనుంది. దీని కోసం ఆయన మందలోని గొర్రెలే రంగంలోకి దిగడం ఈ చిత్రంలో హైలెట్. గొర్రెలు తమ యజమాని మరణానికి కారణమైన వారిని ఎలా వెతికి పట్టుకున్నాయనేదే ది షీప్ డిటెక్టివ్స్ స్టోరీ. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని ఓటీటీలో చూసేయండి. -
'మగ పిల్లాడి కోసం చిట్కా చెప్పండి సార్'.. సూపర్ సుబ్బు ట్రైలర్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఆపీసర్గా ఓ పల్లెటూరికి వెళ్లిన సందీప్ కిషన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కోణంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అక్షర జ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలకు లైంగిక విద్యపై ఎలా అవగాహన కల్పించాడనే కథగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సిరీస్ ట్రైలర్లో కామెడీ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.ఈ టాలీవుడ్ క్రేజీ వెబ్ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ వెబ్ సిరీస్‌లో మురళీశర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్‌బాబు కీలక పాత్రలు పోషించారు. -
మరో ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తిరువీర్, రాశి, పాయల్ రాధాకృష్ణ కీలక పాత్రల్లో నటించిన చిత్రం పాపం ప్రతాప్. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేసింది. నేటి నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.పాపం ప్రతాప్ కథేంటంటే..ఈ సినిమా కథ 1994-98 మధ్య కాలంలో సాగుతుంది. ప్రతాప్ (తిరువీర్)కి బుజ్జమ్మ(పాయల్ రాధాకృష్ణ) అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. వయసుతో పాటు ఆమెపై ప్రేమ కూడా పెరుగుతుంది. ఓ రోజు బుజ్జమ్మనే ‘పెళ్లి చేసుకుందామా’ అని అడగడంతో..ప్రతాప్ వెంటనే ముహూర్తం పెట్టిస్తాడు. నాన్న రంగయ్య(అజయ్ ఘోష్)కి ఇష్టం లేకపోయినా.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాడు. మొదటి మూడు రాత్రులు గడవగానే బుజ్జమ్మ పంచాయితీ పెడుతుంది. ప్రతాప్‌కి సమస్య ఉందని.. అతనితో సంసారం చేయలేనని ఊరిపెద్దలకు చెబుతుంది. ప్రతాప్‌కి ఉన్న సమస్య ఏంటని అడిగితే మాత్రం బయటకు చెప్పదు. అంతేకాదు తనలోని సమస్యేమిటో తనే తెలుసుకుని సరిదిద్దుకుంటేనే కాపురానికి వస్తానని చెప్పి..పుట్టింటికి వెళ్లిపోతుంది. అసలు ప్రతాప్‌కి ఉన్న సమస్య ఏంటి? ఆ సమస్యను కనుక్కునేందుకు ప్రతాప్ చేసిన ప్రయత్నాలు ఏంటి? సమస్య తెలుసుకున్నాక..దాన్ని సరిదిద్దుకున్నాడా లేదా? చివరకు బుజ్జమ్మ, ప్రతాప్ ఒక్కటయ్యారా లేదా ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. -
ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలా అవతార్ 3, బ్లాస్ట్ తదితర చిత్రాలు రాబోతున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. ఇప్పుడు అలానే ఓ తమిళ రొమాంటిక్ డ్రామా మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది.. రోజూ భయంతో: రష్మిక)'బ్రేక్ ఫాస్ట్' తమిళ రొమాంటిక్ డ్రామా సినిమా. రానవ్, రోస్మిన్, కృతిక్ మోహన్, అమిత రంగనాథ్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. భార్యాభర్తల మధ్య వచ్చే ఈగోలు, మనస్పర్థలు జీవితాలని ఎలా నాశనం చేస్తాయనే విషయాన్ని ఇందులో చూపించారు.'బ్రేక్ ఫాస్ట్' విషయానికొస్తే.. లక్ష్మి, ఆమె భర్త (కృతిక్ మోహన్) పెళ్లయిన కొన్ని నెలలకే మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు. న్యాయస్థానం వీళ్లని కౌన్సిలర్ (కస్తూరి) దగ్గరకు పంపిస్తుంది. అక్కడ కూడా వీరిద్దరూ విపరీతంగా గొడవ పడుతుంటారు. ఇది చూసిన కౌన్సిలర్.. వీరి కళ్ళు తెరిపించడం కోసం గతంలో ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ల స్టోరీ చెబుతుంది. అందులో శంతను (రానవ్) అనే యువకుడు జానవి(రోస్మిన్)ని ప్రేమిస్తాడు. ఈ క్రమంలోనే జానవి తన తండ్రి (సంపత్ రాజ్) కంపెనీలో ప్రియుడిని చేర్చుతుంది.తన ప్రేమ ఇష్టం లేని తండ్రిని జానవి జైలుకి పంపిస్తుంది. శంతనుని పెళ్లి చేసుకుంటుంది. మొదట్లో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య కొద్దిరోజులకే గొడవలు, శారీరక హింస వస్తాయి. ఒక బాబు పుట్టినప్పటికీ రిలేషన్ మరింత దారుణంగా తయారవుతుంది. ఇంతకీ కౌన్సిలర్ చెప్పిన ఆ పాత జంట కథకు, ప్రస్తుతం విడాకులకు సిద్ధమైన లక్ష్మి దంపతులకు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'పెద్ది' సక్సెస్ ఈవెంట్.. జాన్వీతో పాటు వాళ్లెక్కడ?) -
ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్
సూర్య హీరోగా చేసిన 'వీరభద్రుడు' గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. పదిరోజుల క్రితం ఓటీటీలోకి కూడా వచ్చింది. ఇప్పుడు అదే వీరభద్రుడి బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఓ తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ప్రోమో వీడియోని కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)బంగారం గురించి ఆశ ఎక్కువైనప్పుడు.. మహిళ మీద మోజు పెరిగినప్పుడు.. కీర్తి కావాలనే ఆశ పెరిగినప్పుడు కలి పురుషుడు వస్తాడు అని చెబుతూ ఉన్న ప్రోమో అయితే బాగానే ఉంది. దీన్ని ఈ శుక్రవారం(జూన్ 19) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. మొత్తం 60 ఎపిసోడ్ల సిరీస్‌గా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతివారం ఒకటి రెండు ఎపిసోడ్స్ అందుబాటులోకి వస్తాయి.తెలుగులో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆని, రఘుకుంచె తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. మరి థ్రిల్లర్ సిరీస్ కాబట్టి కచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. లేదంటే ప్రేక్షకులు లైట్ తీసుకునే అవకాశముంది. ఇలా 60 అంతకంటే ఎక్కువ ఎపిసోడ్ల తరహాలోనే హాట్‌స్టార్‌లో పలు సిరీస్‌లు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. 'ప్రేమలు' భామ హీరోయిన్) -
ఓటీటీలో సేవ్ ది టైగర్స్-3 రికార్డ్.. టాలీవుడ్ డైరెక్టర్ సరికొత్త ట్రెండ్
టాలీవుడ్ క్రేజీ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. ఇప్పటికే రెండు సీజన్స్ సినీ ప్రియులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేశాయి. మహి వీ రాఘవ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సిరీస్‌లు కడుప్పుబ్బా ఆడియన్స్‌ను నవ్విస్తున్నాయి. సేవ్ ది టైగర్స్ 3’ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ సిరీస్ భారీ స్థాయిలో వ్యూయర్షిప్ను సాధించింది. ప్రస్తుతం ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.ఇలా వరుస విజయాలతో మహి వి రాఘవ్ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి రుజువు చేసుకున్నారు. సేవ్ ది టైగర్స్ మొదటి రెండు సీజన్లతో పాటు ‘సైతాన్’ వంటి థ్రిల్లర్ ప్రాజెక్టులతో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నారు. తాజా సిరీస్‌తో తన హిట్ రికార్డ్‌ను కొనసాగిస్తున్నారు. ఓ కథను కమర్షియల్‌గా, ఆకట్టుకునేలా రూపొందించటం అంత ఈజీ కాదు. కానీ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో మహి సక్సెస్ అయ్యారు. దీంతో ఆయన లాంగ్-ఫార్మ్ స్టోరీ టెల్లింగ్ దర్శకుడిగా మరోసారి నిరూపించుకున్నారు.‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’లాంటి సినిమాలు చేసిన మహి వి రాఘవ్‌కు ఒక ఫ్రాంచైజీని ఎలా నడిపించాలో బాగా తెలుసు. అదే సమయంలో అసలు ఎంటర్టైన్మెంట్ను ఏమాత్రం తగ్గించకుండా రూపొందించగల సత్తా ఆయన సొంతం. ముఖ్యంగా, అమెరికన్, కొరియన్ టీవీ లాంటి బలమైన సంప్రదాయం లేని ఈ ఫార్మాట్లో కొత్తదనం తీసుకురావడానికి మహి ప్రయత్నిస్తున్నారు. ఇండియాలో టెలివిజన్ సిరీస్‌లకు మన ప్రేక్షకులు ఇంకా అలవాటు పడలేదు. అందుకే మన దగ్గర ఓటీటీ కల్చర్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదని ఆయన ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. -
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. 'ప్రేమలు' భామ హీరోయిన్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. అలా ఈ వారం కూడా అవతార్ 3, బ్లాస్ట్, లింగం లాంటి మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు మరో హారర్ థ్రిల్లర్ సిరీస్ కూడా వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. 'ప్రేమలు' మూవీలో సహాయ నటిగా చేసిన అఖిల ఇందులో లోడ్ రోల్ చేయడం విశేషం. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎప్పుడు ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: హీరోల వల్ల కానిది సమంత చేసి చూపించింది)మలయాళంలో తీసిన లేటెస్ట్ సిరీస్ 'ముతశ్శి'. కేపీఏసీ లీల, అఖిల భార్గవన్, రాజేశ్ శర్మ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. దీన్ని ఈ శుక్రవారం(జూన్ 26) నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు వెర్షన్ గురించి ప్రస్తుతానికైతే సమాచారం లేదు గానీ డబ్బింగ్ చేసే అవకాశమైతే ఉంది.'ముతశ్శి' విషయానికొస్తే.. కేరళ-కర్ణాటక సరిహద్దుల్లో ఉండే ఊరిలో రాజన్ దంపతులు నివసిస్తుంటారు. వీళ్లకు శ్రీ కుట్టన్ అనే కొడుకు కూడా ఉంటాడు. చాన్నాళ్ల తర్వాత పూర్వీకుల ఇంటికి వెళ్లాలని వీళ్లు నిర్ణయించుకుంటారు. కానీ అక్కడికెళ్లిన తర్వాత వింత సంఘటనలు జరుగుతాయి. కుట్టన్.. దెయ్యం పట్టిలా వాడిలా ప్రవర్తిస్తాడు. దీనికి రాజన్ తల్లి గతంలో చేసిన క్షుద్రపూజలే కారణమని తెలుస్తుంది. మరి కుట్టన్‌ని దెయ్యం బారి నుంచి తల్లిదండ్రులు ఎలా రక్షించుకున్నారనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి హనుమాన్ త్రీడీ, పెళ్లైంది కానీ నో కహానీ లాంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, సూపర్ గర్ల్ లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిపై పెద్దగా బజ్ అయితే లేదు. మరోవైపు ఓటీటీల్లో 21 వరకు మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: సగం రెమ్యునరేషన్‌కే సినిమా చేసిన స్టార్ కమెడియన్)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. అవతార్ 3, బ్లాస్ట్ సినిమాలతో పాటు లింగం అనే డబ్బింగ్ సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. వీటితో పాటు బాహుబలి ద టార్చ్ బేరర్, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ లాంటి సిరీస్‌లు కూడా చూడొచ్చనిపించేలా చేస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూన్ 22 నుంచి 28 వరకు)నెట్ఫ్లిక్స్అనదర్ లైఫ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 24ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డంటే (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 24బ్లాస్ట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 25క్రిస్మ్ & మార్టినా (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26లిటిల్ బ్రదర్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26బాహుబలి ద టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ) - జూన్ 26లాక్ అప్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూన్ 27హాట్స్టార్ద ఏజెన్సీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 22అవతార్ 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 24లింగం (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 26అమెజాన్ ప్రైమ్హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 22గ్రామ చికిత్సాలయ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 23అలియన్స్ (హిందీ సిరీస్) - జూన్ 26జీ5ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ సిరీస్) - జూన్ 26మమ్మటియాన్ స్టార్స్ (తమిళ సిరీస్) - జూన్ 26ముతస్సీ (మలయాళ సిరీస్) - జూన్ 26సోనీ లివ్ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ సిరీస్) - జూన్ 26లయన్స్ గేట్ ప్లేబ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26ద యెతి (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26మనోరమ మ్యాక్స్కప్ (మలయాళ సినిమా) - జూన్ 25(ఇదీ చదవండి: వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షన్ను) -
ఓటీటీలోకి మరో 'బాహుబలి'.. ఇంకెన్ని దాచారు?
దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్‌తో పాటు టాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమా 'బాహుబలి'. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం రెండు పార్ట్ రిలీజైంది. దాంతో ఈ ఫ్రాంచైజీ సంగతి అక్కడితో అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ దీని నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఇప్పుడు మరో 'బాహుబలి'ని నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సర్ప్రైజ్ ఇచ్చారు.(ఇదీ చదవండి: సమంత సినిమాలు ఎప్పుడూ చూడలేదు: రాజ్ సోదరి)రెండు భాగాలుగా 'బాహుబలి'ని రిలీజ్ చేశారు. మూడో పార్ట్ వస్తుందని అంటున్నారు గానీ దీనిపై ఎవరికీ నమ్మకం లేదు. మరోవైపు ఈ రెండు పార్ట్స్ కలిపి ఎపిక్ పేరిట గతేడాది థియేటర్లలో రిలీజ్ చేశారు. దీనికి కూడా బాగానే రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు 'బాహుబలి' పేరుతోనే యానిమేటెడ్ సిరీస్ నిర్మాణంలో ఉంది. దీని ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఇప్పుడు 'బాహుబలి: ద టార్చ్ బేరర్' పేరిట ఓ డాక్యుమెంటరీ సిరీస్ రిలీజ్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ శుక్రవారం(జూన్ 26) నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.అయితే ఇదంతా చూస్తున్న పలువురు నెటిజన్లు.. 'బాహుబలి' నుంచి ఇంకెన్ని దాచి ఉంచున్నారు అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలు తీసిన తర్వాత రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ చేశాడు. ఆస్కార్ సాధించాడు. ప్రస్తుతం మహేశ్ బాబుతో 'వారణాసి' చేస్తున్నాడు. దీని నుంచి అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఎదురుచూస్తుంటే 'బాహుబలి' నుంచి సర్ప్రైజులు రావడం చిత్రంగా ఉంది.ఇప్పుడు రాబోయే 'బాహుబలి ద టార్చ్ బేరర్'లో ఇప్పటిదాకా చూడని మేకింగ్ ఫుటేజ్ తో పాటు ఈ ప్యాన్ ఇండియా మూవీకి చెందిన అరుదైన విశేషాలు అందులో చూపించబోతున్నారు. నిడివి తదితర వివరాలు వెల్లడించలేదు.(ఇదీ చదవండి: 'ఓజీ 2' అప్డేట్.. ఆ డైరెక్టర్ని పవన్ పక్కనబెట్టేశారా?) -
ఓటీటీలోకి తమిళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా అద్భుతాలు చేస్తుంటాయి. అలా గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఓ తమిళ యాక్షన్ మూవీ సొంత భాషతో పాటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడది ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ‘బాలన్- ది బాయ్’ మూవీ రివ్యూ)యాక్షన్ హీరో అర్జున్, అభిరామి, ప్రీతిముకుందన్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'బ్లాస్ట్'. తెలుగులో 'బ్లాస్ట్ జోన్' పేరుతో రిలీజ్ చేశారు. ఓ మాదిరి అంచనాలతోనే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. తమిళ, తెలుగులో హిట్ అనిపించుకుంది. ఇప్పుడీ చిత్రం వచ్చే గురువారం(జూన్ 25) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'బ్లాస్ట్' విషయానికొస్తే.. నీల(ప్రీతి ముకుందన్) మిడిల్ క్లాస్ అమ్మాయి. తల్లిదండ్రులు(అర్జున్, అభిరామి)తో కలిసి ఉంటుంది. వీళ్లంతా కరాటే మాస్టర్లే. నీల తండ్రి ఓవైపు మెడికల్ షాప్ నడుపుతూనే మరోవైపు పిల్లలకు ఫ్రీగా కరాటే నేర్పిస్తుంటాడు. నీల ఓ రోజు షాపులో ఉండగా కృపాకర్ గ్యాంగ్‌కి చెందిన ఓ రౌడీ వచ్చి ఈమెని బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే నీల చేతిలో చావుదెబ్బలు తిని జైలుపాలవుతాడు. దీంతో కృపాకర్ గ్యాంగ్‌తో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తారు. తర్వాత ఏమైంది? అసలు కృపాకర్ గ్యాంగ్.. నీల కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు?) -
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
మలయాళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాసిల్ జోసెఫ్, టొవినో థామస్, రియా షిబు ప్రధాన పాత్రలు చేసిన మూవీ 'అతిరథి'. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. గత నెలలో థియేటర్లలో రిలీజై ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ)కథేంటి?ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన తుంటరి కుర్రాడు శామ్ కుట్టి (బాసిల్ జోసెఫ్). ఇదే కాలేజీలో రెండేళ్ల క్రితం జరిగిన ఓ విషాదం వల్ల ఆగిపోయిన 'ఆరోహన్' అనే ఫెస్ట్ జరిపించాలని ఇతడు ప్రయత్నిస్తుంటాడు. ఇది కచ్చితంగా చేయాలనుకోవడం వెనక ఓ కారణముంటుంది. తొలి ఏడాది నుంచి అనుకుంటే శామ్ తన ఫైనల్ ఇయర్ వచ్చేసరికి అందరినీ ఒప్పించి ఫెస్ట్ నిర్వహించేందుకు రెడీ అవుతాడు. కానీ తోట కుట్టన్(టొవినో థామస్) అనే మాజీ రౌడీ రూపంలో అనుకోని అవాంతరం ఎదురవుతుంది. ఇంతకీ శామ్, కుట్టన్ మధ్య గొడవేంటి? స్వాతితో శామ్ ప్రేమకథ ఎంతవరకు వచ్చింది? చివరకు ఫెస్ట్ జరిగిందా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?అతిరథి గురించి సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఇంజినీరింగ్ కాలేజీలో ఆగిపోయిన ఓ ఫెస్ట్‌ని చేయడంలో హీరో సక్సెస్ అయ్యాడా లేదా అనేది స్టోరీ. ఏంటి కథ ఇంతేనా? అసలు ఇందులో చెప్పడానికి, చూపించడానికి ఏముందా అనే సందేహం మీకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ మూవీ టీమ్ బాగానే మేనేజ్ చేశారు. పెద్దగా పాయింట్ లేని స్టోరీని కూడా రెండున్నర గంటల మూవీగా తీశారు. కాకపోతే యావరేజ్ దగ్గరే ఆగిపోయారు.ఓ ఫెస్ట్‌లో ముగ్గురు స్టూడెంట్స్ చనిపోవడంతో సినిమా ప్రారంభమవుతుంది. ఈ విషాదం కారణంగా ప్రతి ఏడాది జరిగే ఫెస్ట్‌ని పూర్తిగా ఆపేస్తారు. అదే కాలేజీలో కొన్నేళ్ల తర్వాత ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతాడు శామ్ కుట్టి. అల్లరి చేస్తూ, తుంటరి పనులతో ఎంటర్టైన్ చేసే ఇతడు.. ఈ ఫెస్ట్ కోసం అంతలా ఎందుకు పట్టుబట్టాడు? చివరకు చేయగలిగాడా లేదా అనేది కన్విన్సింగ్‌గానే చూపించారు. అయితే ఇంటర్వెల్ వరకు పెద్దగా స్టోరీ ఏం ఉండదు. సీన్స్ వస్తుంటాయి గానీ బోరింగ్‌గానే ఉంటుంది. ఇంటర్వెల్‌కి ముందు ఎప్పుడైతే కుట్టన్ పాత్ర ఎంట్రీ ఇస్తుందో అప్పటి నుంచి మూవీలో కాస్త జోష్ వస్తుంది.సెకండాఫ్ అంతా కాలేజీ స్టూడెంట్ శామ్, రౌడీ షీటర్ నుంచి సింగర్‌గా మారాలనే ప్రయత్నాల్లో ఉన్న కుట్టన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ స్టైల్ ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఫైట్స్ అన్నాం కదా అని ఏదో పెద్దగా ఊహించుకోకండి. చాలా సరదాగా, ఫన్నీగా సాగిపోతుంది. అదే టైంలో సహజంగానూ ఉంటుంది. చాలా మలయాళ చిత్రాల్లో ఉన్నట్లే ఇందులోనూ సాగదీత ఉంటుంది. కాకపోతే చివరకొచ్చేసరికి కాస్తంత ఎమోషనల్ చేసి ముగిస్తారు. కాలేజీలో సాగే స్టోరీ కావడంతో పెద్దగా ట్విస్టులు లాంటివి ఏం ఉండవు. సరదాగా సాగిపోతుంది అంతే. ఈ తరహా మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రయత్నించొచ్చు.ఎవరెలా చేశారు?శామ్ కుట్టి పాత్రలో బాసిల్ జోసెఫ్ అదరగొట్టేశాడు. స్వతహాగా దర్శకుడు, నటుడు అయిన ఇతడు.. కాలేజీ కుర్రాడిగానూ ఇందులో సెట్ అయిపోయాడు. కుట్టన్ అనే మాజీ రౌడీగా, సింగర్ అవ్వాలనుకునేవాడిగా టొవినో థామస్ పాత్ర కూడా కాస్తంత ఎంటర్టైనింగ్గానే ఉంది. వీళ్లిద్దరి తర్వాత కిడ్నాప్ అయి ఇబ్బందులు పడే వినీత్ శ్రీనివాసన్ పాత్ర బాగుంది. 'సర్వం మాయ' ఫేమ్ రియా షిబు ఇందులో స్వాతి అనే అమ్మాయిగా చేసింది గానీ ఈమెకు అస్సలు స్కోప్ దొరకలేదు. మిగతా యాక్టర్స్ ఓకే ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే.. స్టోరీ పెద్దగా ఏం లేదు కానీ టైమ్ పాస్ చేయించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. డైరెక్టర్ పర్లేదనిపించాడు. ఫస్టాప్‌లో కామెడీ సీన్స్ లాంటివి కొన్ని పెట్టుంటే బాగుండేది అనిపించింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. అభ్యంతరక సీన్స్ ఏం లేవు. ఓవరాల్‌గా అయితే టైమ్ పాస్ కామెడీ మూవీ చూద్దామనుకుంటే 'అతిరథి' ట్రై చేయొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు) -
సడన్‌గా ఓటీటీకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ శుక్రవారం ఓటీటీల్లో దృశ్యం-3తో పాటు దురంధర్-2 కూడా మరో ఓటీటీకి వచ్చేసింది. అంతేకాకుండా తెలుగు కామెడీ సిరీస్ సేవ్ ది టైగర్స్-3,రవిబాబు రేజర్ మూవీ కూడా ఓటీటీలో సందడి చేస్తోంది. అంతేకాకుండా పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ ఒక్క రోజే స్ట్రీమింగ్కు వచ్చేశాయి.తాజాగా మరో మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. అనుపమ పరమేశ్వరన్, రెజీనా, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మరీచిక సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ ఏడాది మే 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ రోజు నుంచి ఓటీటీ ప్రియులను అలరిస్తోంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసింది. ఈ సినిమాకు సతీశ్ కసెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ మూవీని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక నిర్మించారు. #Mareechika (Telugu)Now streaming on PrimeVideo in Telugu & Tamil 🍿!!#OTT_Trackers pic.twitter.com/zjxsplI2Kp— OTT Trackers (@OTT_Trackers) June 19, 2026 -
ఓటీటీకి దురంధర్-2.. ఆడియన్స్‌కు బిగ్ సర్ప్రైజ్
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ స్పై థ్రిల్లర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మొదట జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కొచ్చిన ఈ సినిమా.. నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోనూ అందుబాటులోకి వచ్చేసింది.అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ప్రియులకు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటి వరకు మ్యూటెడ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అన్మ్యూటెడ్ వర్షన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉంది. నేటి నుంచి ఇండియన్స్ ఆడియన్స్‌కు కూడా అన్ మ్యూటెడ్ వర్షన్ చూసే అవకాశం దక్కింది. ప్రస్తుతం దురంధర్-2 హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో సంజయ్ దత్, మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. -
ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. 'పెద్ది' జోష్ తగ్గిపోయింది. అందుకు తగ్గట్లే సమంత 'మా ఇంటి బంగారం', వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు', దీవానా లాంటి తెలుగు సినిమాలతో పాటు బాలన్, వంద దేవుళ్లు, కాక్టెయిల్ 2 లాంటి డబ్బింగ్, హిందీ చిత్రాలు కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీల్లో శుక్రవారం ఒక్కరోజే 16కి పైగా మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: 'వారణాసి' విలన్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే దృశ్యం 3 అందుబాటులోకి రాగా, అతిరథి, రేజర్, ధురంధర్ 2, ఎమ్4ఎమ్ చిత్రాలతో పాటు సేవ్ ద టైగర్స్ సీజన్ 3 ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఏమైనా సడన్ సర్ప్రైజులు ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (జూన్ 19)హాట్స్టార్సేవ్ ద టైగర్స్ 3 - తెలుగు డబ్బింగ్ సిరీస్అతిరథి - తెలుగు డబ్బింగ్ మూవీతుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 - హిందీ సిరీస్ఆహారేజర్ - తెలుగు సినిమాథ్యాంక్యూ సుబ్బారావ్ - తెలుగు మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)ధైర్యే సాహసే అమృత - తెలుగు చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది)అమెజాన్ ప్రైమ్మనితన్ దైవమగళం - తమిళ మూవీగిన్నీ వెడ్స్ సన్నీ 2 - హిందీ చిత్రందృశ్యం 3 - తెలుగు డబ్బింగ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)నెట్ఫ్లిక్స్ధురంధర్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమావాయిస్ మెయిల్స్ ఫర్ ఇస్‌బెల్లే - ఇంగ్లీష్ మూవీహస్బెండ్స్ ఇన్ యాక్షన్ - కొరియన్ సినిమాఒయాసిస్ - ఇంగ్లీష్ సిరీస్ఐ విల్ ఫైండ్ యూ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)సన్ నెక్స్ట్ఆషాన్ - మలయాళ మూవీలయన్స్ గేట్ ప్లేఎమ్4ఎమ్ - తెలుగు సినిమాఆలియా బసు గాయబ్ హై - హిందీ మూవీమ్యాచ్ పాయింట్ - ఇంగ్లీష్ సినిమాఆపిల్ టీవీ ప్లస్షుగర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్మనోరమ మ్యాక్స్గు - మలయాళ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్అబ్ హోగా హిసాబ్ - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)(ఇదీ చదవండి: 'పుష్ప' కాన్సెప్ట్‌తో ధనుష్ సినిమా.. టీజర్ రిలీజ్) -
'సేవ్ ది టైగర్స్ 3' రివ్యూ.. ఈసారి కూడా నవ్వులే
'యాత్ర' సినిమాలు తీసిన మహి వి రాఘవ్ నుంచి వచ్చిన 'సేవ్ ది టైగర్స్' సిరీస్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇదివరకే రెండు సీజన్లు రిలీజ్ కాగా అవి బ్లాక్‌బస్టర్ అయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సీజన్ తీసుకొచ్చేశారు. ఈ శుక్రవారం(జూన్ 19) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సీజన్ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?రాహుల్ (అభినవ్ గోమఠం) తనకు ఇష్టం లేకపోయినా బెంగళూరు వెళ్లి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు. ఇది పోవడంతో మళ్లీ హైదరాబాద్‌కి వస్తాడు. జాబ్ పోయిన సంగతి తన భార్య మాధురి(పావని గంగిరెడ్డి)కి చెప్పకుండా దాచేస్తాడు. గంటా రవి (ప్రియదర్శి) ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులన్నీ వృథాగా ఖర్చు పెట్టి ఇంట్లో తిట్లు తింటూ ఉంటాడు. భార్య హైమా (సుజాత) పోరు భరించలేక గేటెడ్ కమ్యూనిటీలోకి వస్తారు. రేఖ (దేవియాని శర్మ) తన భర్త విక్రమ్ (చైతన్య కృష్ణ) నుంచి విడాకులు కావాలని కోర్టుకి వెళ్తుంది. కోర్టులో విక్రమ్.. తన భార్య రేఖ నుంచి భరణం కోరుతుంటాడు. ఇలా ఈ ముగ్గురూ కుటుంబ సమస్యలతో సతమతం అవుతుంటారు.ఈ పెళ్లిళ్ల కాన్సెప్ట్ పెట్టింది ఎవరు? పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటారని చెప్పింది ఎవరు? స్వర్గంలో పెళ్లిళ్లు నిర్ణయించబడతాయని చెప్పింది ఎవరు? అని ఫ్రస్ట్రేషన్లో నానా బూతులు తిడుతుంటారు. ఇవన్నీ స్వర్గంలో ఉన్న ఇంద్రుడు (వెన్నెల కిషోర్) వింటాడు. ఈ ముగ్గురి బాధ ఏంటో కనుక్కోండి.. వారి సమస్యకు పరిష్కారం చూపించండని గుప్తా (గుండు సుదర్శన్)కి ఇంద్రుడు ఆదేశాలు ఇస్తాడు. దీంతో ఆ గుప్తా ఈ మొదటి లోకంలో ఉన్న గంటా రవి, విక్రమ్, రాహుల్‌లను.. రెండో లోకంలో ఉన్న గంటా రవి, విక్రమ్, రాహుల్‌ని మార్చేస్తాడు. రెండో లోకంలోకి వెళ్లిన ఈ త్రయం ఏం చేసింది? మొదటి లోకం వచ్చిన ఆ ముగ్గురు ఏం చేశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?గతంలో వచ్చిన రెండు సీజన్లు సహజంగా ఉంటాయి. మూడో సీజన్‌కి వచ్చేసరికి కల్పితం ఎక్కువైంది. రెండు లోకాలు అనే కాన్సెప్ట్ పెట్టి మరింత ఆసక్తి పెంచారు. ఈ లోకంలో లేని మనశ్శాంతి, ప్రశాంతత వేరే లోకంలో ఉంటాయని ఈ త్రయం వెళ్లడం.. అక్కడికి వెళ్లిన మొదట్లో అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. అయితే మెల్లమెల్లగా అక్కడి సమస్యలు వారికి అర్థం అవుతాయి. అసలు ఈ మార్పిడి కాన్సెప్ట్‌కి ఆ ముగ్గురు ఎందుకు ఒప్పుకున్నారో.. ఈ ముగ్గురికి తెలుస్తుంది. మొదటి మూడు ఎపిసోడ్లు ఒక ఫేజ్‌లో నడుస్తాయి.ఇక్కడ ఉండే గంటా రవికి వేరే లోకంలో ఉండే గంటా రవికి చాలా తేడాలు ఉంటాయి. రూపాలు ఒకేలా ఉన్నా గుణాల్లో మాత్రం చాలా వ్యత్యాసం చూపించారు. ప్రజల కోసం పాటు పడాలనే ఆలోచన గంటా రవికి ఉంటే.. ప్రజల్ని దోచుకోవాలనే దుర్బుద్ది రెండో ప్రపంచంలోని గంటా రవికి ఉంటుంది. అలా ప్రతీ పాత్రకు పాజిటివ్, నెగెటివ్ చూపించారు. అవన్నీ మనలోనే ఉన్నాయని, నెగెటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీని మాత్రమే తీసుకోవాలనే సందేశాన్ని అంతర్లీనంగా ఇచ్చారు.మహిళా సాధికారత గురించి చెప్పే సీన్లు, భార్య అంటే భర్తకు బానిస కాదు అని వివరించే సీన్లు చాలా బాగున్నాయి. ఎంతగా నవ్విస్తారో.. అంతగా ఆలోచింపజేస్తారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి అన్యోన్యత ఉండాలనే దాన్ని కూడా అభినవ్-పావని, చైతన్య-దేవియాని శర్మ పాత్రలతో చూపించారు. కొన్ని చోట్ల డైలాగ్స్ మితిమీరినట్లు అనిపిస్తాయి కానీ ఓటీటీ కాబట్టి సమస్యలా అనిపించదు. ఒకటి రెండు చోట్ల తప్పితే మిగతా సిరీస్ అంతా ఫ్యామిలీ కలిసి చూసేలా ఉంటుంది. ఓటీటీ కంటెంట్ అయినా కూడా ఎక్కడా అసభ్యతకు, అశ్లీలతకు తావివ్వకుండా తీశారు.ఎవరెలా చేశారు?భర్తలుగా అభినవ్, చైతన్య కృష్ణ, ప్రియదర్శిలు ఈసారి కూడా ఆకట్టుకున్నారు. ప్రతి ఒక్కరికీ రెండు రకాలుగా యాక్టింగ్ చేసే అవకాశం దొరికింది. దానికి న్యాయం చేశారు. భార్యలుగా సుజాత, దేవయాని శర్మ, పావని అద్బుతంగా నటించారు. మిగిలిన పాత్రధారులు కూడా నవ్వించారు. ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. క్రియేటర్ మహి.వి రాఘవ్ మరోసారి అదరగొట్టేశారు. ప్రదీప్ అద్వైతంతో కలిసి మళ్లీ హిట్ కొట్టారు. శ్రీరామ్ ఎరగం దర్శకత్వం కూడా బాగుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. -
మరో ఓటీటీకి దురంధర్-2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2. గతేడాది డిసెంబర్లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే వచ్చిన ఈ సినిమా సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఏకంగా రూ.1790 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జూన్ 5న స్ట్రీమింగ్కు వచ్చేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రీమింగ్కు వచ్చిన మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల మందికిపైగా వీక్షించారని ఓటీటీ సంస్థ ప్రకటించింది.అయితే తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలోనూ సందడి చేయనుంది. ప్రస్తుతం ఓవర్సీస్ ఆడియన్స్‌కు మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. మే 14వ తేదీ నుంచే ఓవర్సీస్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఇండియాలోని ప్రేక్షకులకు సైతం నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ నెల 19 నుంచి ఇండియన్ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని వీడియోను రిలీజ్ చేసింది. అంటే ఈ శుక్రవారం నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా దురంధర్-2 సందడి చేయనుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేశ్ బేడీ, గౌరవ్ గేరా, డానిష్ పాండోర్ కీలక పాత్రలు పోషించారు. 19 June, on Netflix in Hindi, Tamil, Telugu, Kannada and Malayalam.— Netflix India (@NetflixIndia) June 17, 2026 -
ఓటీటీకి వచ్చేసిన దృశ్యం-3.. తెలుగు వర్షన్లో బిగ్ ట్విస్ట్..!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటేస్ట్ మూవీ దృశ్యం-3. ఈ సూపర్ హిట్ సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రం మే 21 థియేటర్లలో రిలీజైంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళ ఇండస్ట్రీలోనే రెండో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ఘనత సాధించింది.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది. జూన్ 18 అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మొదట ఈ సినిమా తెలుగు వర్షన్ అందుబాటులో ఉండడం లేదంటూ వార్తలొచ్చాయి. కానీ అలా ఏం జరగలేదు. ఈ విషయంలో అభిమానులకు ఓటీటీ సంస్థ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మలయాళంతో పాటు తమిళం, కన్నడ, తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయినవాళ్లు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.దృశ్యం-3 కథేంటంటే..దృశ్యం 2 ముగింపు సీన్‌తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు జార్జ్‌కుట్టి(మోహన్‌లాల్) వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. కోర్టు ఆదేశాలతో జార్జ్ ఫ్యామిలీపై ఎలాంటి కేసు నమోదు కాకుండా బయటపడతారు. తన జీవితంలో చోటు చేసుకున్న ఈ ఘటననే కాస్త మార్పులు చేసి ఓ సినిమాను నిర్మిస్తాడు జార్జ్. అది రిలీజై..బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుంది. అదే సమయంలో మానసిన సమస్యలను నుంచి బయటపడిన పెద్ద కూతురు అంజుకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. భార్య రాణి(మీనా) కూడా కూతురికి త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందని సలహా ఇస్తుంది. అయితే చాలా సంబంధాలు వచ్చినప్పటికీ.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంజు గురించి నెగెటివ్‌గా చెప్పడంతో అవన్నీ తప్పిపోతాయి.కొన్నాళ్ల తర్వాత తన కూతురికి వచ్చిన పెళ్లి సంబంధాలను ఇద్దరు చెడగొడుతున్నారనే విషయం తెలుస్తుంది? అసలు ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నారు? కొడుకు(వరుణ్)ని పోగోట్టుకున్న బాధ నుంచి బయటపడేందుకు అమెరికా వెళ్లిన గీతా ప్రభాకర్, ప్రభాకర్ మళ్లీ జార్జ్ లైఫ్‌లోకి ఎందుకు వచ్చారు? సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్ సహదేవన్ చేసిన కుట్ర ఏంటి? వరుణ్ హత్య కేసు నుంచి కూతురిని తప్పించేందుకు ఈ సారి జార్జ్ వేసిన ప్లాన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. #Drishyam3 (2026) | MalayalamStreaming now on Prime Video… 👀🔥🎧 Available in Malayalam, Tamil, Telugu & KannadaNote: Earlier, it was said that the Telugu audio release was under an interim stay.But surprisingly, the Telugu version is now available on Prime Video too! https://t.co/MCl1meVMjB pic.twitter.com/QZYokpVWXd— KUDALINGAM MUTHU (@KUDALINGAM49671) June 17, 2026 -
రమ్యకృష్ణ సెకండ్ లవ్.. ఇలా షాకిచ్చిందేంటి?
ఓటీటీలు వచ్చాక ఇబ్బడిముబ్బడిగా సినిమాలు, సిరీస్‌లు క్యూ కడుతున్నాయి. ఆడియన్స్ అభిరుచికి తగినట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తున్నాయి. అయితే ఓటీటీల్లో నేరుగా విడుదలయ్యే సినిమాల్లో కేవలం చిన్న హీరోల చిత్రాలే ఎక్కువగా ఉంటాయి. ఇక వెబ్ సిరీస్‌ల విషయానికొస్తే పెద్దగా స్టార్స్ కనిపించరు. కొంత పేరున్న నటీనటులే ఉన్నప్పటికీ అగ్రతారలెవరు ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసిన సందర్భాలు చాలా తక్కువే.కానీ ఇప్పుడంతా సీన్ మారిపోయింది. ఒకప్పటి స్టార్స్ సైతం ఓటీటీల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ సైతం ఓటీటీల్లోకి అరంగేట్రం చేస్తోంది. దీంతో రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ సెకండ్ లవ్. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. సెకండ్ లవ్ అంటే ప్రేమ, వ్యామోహం అనే కాన్సెప్ట్‌తోనే ఈ సిరీస్ ఉండనుందని టైటిల్ వింటేనే అర్థమవుతోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఏదేమైనా రమ్యకృష్ణ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడంతో టాలీవుడ్ అభిమానులు షాకవుతున్నారు. -
ఓటీటీలో 'దృశ్యం 3'.. తెలుగు వెర్షన్ నో రిలీజ్
మలయాళ థ్రిల్లర్స్ అనగానే చాలామంది తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది 'దృశ్యం' ఫ్రాంచైజీనే. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ థ్రిల్లర్ చిత్రాలకు జీతూ జోసెఫ్ దర్శకుడు. ఇదివరకే రెండు భాగాలు రిలీజై సూపర్ హిట్ అయ్యాయి. గతనెలలో మూడో భాగం థియేటర్లలోకి తీసుకురాగా ఇది ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం రూ.200 కోట్లకు పైనే వచ్చాయి. ఇకపోతే రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇంతలోనే మద్రాస్ హైకోర్టు.. మూవీ టీమ్‌కి షాకిచ్చింది.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. దృశ్యం 3 సినిమా తెలుగు హక్కులు తమవే అని గత నెలలో మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తమ పిటిషన్లో చిత్ర నిర్మాతలు ఎం.జే.ఆంటోని (ఆశీర్వాద్ సినిమాస్), దర్శకుడు జీతూ జోసెఫ్, పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్ తదితరులు తమ అనుమతి లేకుండా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం, డబ్బింగ్ చేయడం, విడుదల చేయడం, పంపిణీ చేయడం లేదా ఇతర వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం ద్వారా తమ కాపీరైట్ హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది.ఈ కేసును గత నెలలోనే విచారించిన మద్రాస్ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం జరిగిన విచారణలో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంటూ, కేసు తుది తీర్పు వెలువడే వరకు 'దృశ్యం 3' తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ని ఓటీటీలో విడుదల చేయకూడదని బుధవారం (జూన్ 17) మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. అంటే ఓటీటీలో మిగతా భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది కానీ తెలుగు మాత్రం అందుబాటులోకి రాదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా రేజర్, కేనతా కానం, దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3 లాంటి తెలుగు స్ట్రెయిట్-డబ్బింగ్ మూవీస్, సిరీస్‌లు రాబోతున్నాయి. ఇవలా ఉండగానే ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ అదేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)కొత్త బంగారులోకం, హ్యాపీడేస్ సినిమాలతో అప్పట్లో గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్.. మధ్యలో చాన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైపోయాడు. బిగ్‌బాస్ షో తర్వాత మళ్లీ కాస్తంత పాపులారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే అడపాదడపా మూవీస్ చేస్తున్నాడు. అలా చేసిన చిత్రమే 'కానిస్టేబుల్'. గతేడాది అక్టోబరు 10న థియేటర్లలోకి వచ్చింది. తాజాగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.'కానిస్టేబుల్' విషయానికొస్తే.. శంకరపల్లి అనే ఊరిలో కాశీ (వరుణ్ సందేశ్) కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. అయితే ఈ ఊరిలో చాలామంది హత్యకు గురవుతూ ఉంటారు. కాశీ మేనకోడలిని కూడా చంపేస్తారు. అసలు ఈ మర్డర్స్ చేస్తుందెవరు? సీరియల్ కిల్లర్‌ని కాశీ పట్టుకున్నాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా) -
మహేశ్ 'వారణాసి'.. ఇలా అయిందేంటి?
మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో తీస్తున్న సినిమా 'వారణాసి'. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే చెప్పేశారు. అందుకు తగ్గట్లే షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ మూవీకి అనుకోని అవాంతరాలు ఎదురైనట్లు కనిపిస్తున్నాయి. ఓ ముఖ్యమైన విషయం ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయిందని సోషల్ మీడియాలో గట్టిగానే టాక్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్)ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న చిన్నాపెద్దా.. ఏ సినిమాలకు అయినా ముందుగా ఓటీటీ డీల్ క్లోజ్ అయితేనే నిర్మాతలు కాస్త రిలాక్స్ అవుతున్నారు. స్టార్ హీరోలు చేసే మూవీస్‌కి ఈ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి చాలా మారిపోయింది. కరోనా టైంలో ఇష్టమొచ్చినట్లు సినిమాలు కొన్న ఓటీటీ సంస్థలు.. ఇప్పుడు మాత్రం ఆచితూచి కొంటున్నాయి.ఓటీటీ డీల్ జరగన కారణంగానే చిరంజీవి 'విశ్వంభర' రిలీజ్‌పై ఇప్పటకీ సస్పెన్స్ తెగట్లేదు. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ 'వారణాసి' కూడా వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీకి రూ.1000 కోట్లకు పైనే బడ్జెట్ పెడుతున్నారని, అందుకు తగ్గట్లే ఓటీటీ డీల్ నుంచి రూ.400-500 కోట్ల వరకు ఆశిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇంత మొత్తం పెట్టి మూవీ కొనేందుకు ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపించట్లేదట.(ఇదీ చదవండి: విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం)దీంతో ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. మరీ ఇంత మొత్తం కాకపోయినా 'వారణాసి'ని కొనే ఓటీటీ ఏదనేది చూడాలి. మార్కెట్లో ఉన్న వాటి బట్టి చూస్తే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ సంస్థలు మాత్రమే పోటీలో ఉంటాయి. మరి వీళ్లలో ఎవరు డిజిటల్ హక్కుల్ని దక్కించుకుంటారనేది చూడాలి?గ్లోబల్ అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో తీస్తున్న 'వారణాసి'లో త్రేతా యుగాన్ని కూడా చూపించబోతున్నారు. ఇందులో భాగంగానే మహేశ్ కాసేపు రాముడిగా కనిపిస్తాడు. ఈ విషయాన్ని రాజమౌళి గతేడాది బయటపెట్టారు. ఇకపోతే ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్.(ఇదీ చదవండి: పెళ్లయిపోయింది.. రష్మిక, సమంతకు అదే పెండింగ్) -
ఓటీటీకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. థియేటర్లలో సందడి చేసిన నెల రోజుల్లోపే ఓటీటీల్లో దర్శనమిచ్చాయి. మరికొన్ని సినిమాలు ఏకంగా వారాల్లోపే స్ట్రీమింగ్ కూడా అవుతున్నాయి. తాజాగా మరో లేటేస్ట్ తెలుగు సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో వస్తోన్న థాంక్యూ సుబ్బారావు స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది.ఈ విషయాన్ని ఆహా సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. జూన్ 18 నుంచి థాంక్యూ సుబ్బారావు స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. ఈ సినిమాకు చెందు ముద్దు దర్శకత్వం వహించారు. కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ కుర్ర నిర్మించగా.. ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు.ఈ మూవీ కథేంటంటే..ట్రైన్ జర్నీలో పరిచయం లేని ఓ అమ్మాయి చుట్టూ తిరిగే క్రైమ్ కథాంశంగా రూపొందించారు. సస్పెన్స్, లవ్, కామెడీ, యాక్షన్ అంశాలతో సినిమాను తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌తో ఈ మూవీ కథేంటో ముందే పరిచయం చేశారు. ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించారు. A story filled with emotions, relationships, and unforgettable moments is ready to reach your screens!#ThankYouSubbarao starts streaming on @ahavideoIN from June 18th.https://t.co/JvRngv6wYhDon't miss this heartwarming entertainer!#ThankYouSubbaraoOnAha@KurraP68246… pic.twitter.com/ODQe1g7LcD— SR PROMOTIONS (@SRPROMOTIONS29) June 15, 2026 -
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఐశ్వర్యా రాజేశ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో మూవీస్, ఓటీటీ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఈమె లీడ్ రోల్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్కి రెడీ అయింది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి కథేంటో చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన)ఐశ్వర్యా రాజేశ్, సముద్రఖని, సునీల్, నరేశ్ అగస్త్య తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'ఇసకపట్నం'. 1990ల్లో ఓ తీరప్రాంత గ్రామంలో జరిగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. వచ్చే నెల 02వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. గ్యారీ బీహెచ్ ఈ సిరీస్‌కి దర్శకుడు.ట్రైలర్ బట్టి చూస్తే.. ఇసకపట్నం అనే ఊరిలో నాయుడు(సముద్రఖని) అనే పెద్దమనిషి పోర్ట్‌లో వ్యాపారాన్ని, ఊరిలో జనాల్ని తన అదుపులో ఉంచుకుని ఆజమాయిషీ చెలాయిస్తుంటాడు. ఊహించని విధంగా ఇతడి కూతురు (ఐశ్వర్యా రాజేశ్) ఇతడికి ఎదురు తిరుగుతుంది. ఈమెకు ఊరిలో కొందరు తోడవుతాడు. తర్వాత ఏం జరిగింది? కుర్చీ, అధికారం కోసం జరిగే ఈ కొట్లాట ఎక్కడకు దారితీసింది అనేది మిగతా స్టోరీ.ట్రైలర్ చూస్తే రెగ్యులర్ రొటీన్ టెంప్లేట్ స్టోరీలానే అనిపించింది. ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాల్లో ఈ తరహా అంశాల్ని చూసేశారు. మరి వీళ్లు ఏం కొత్తగా చూపిస్తారనేది ఇక్కడ ప్రశ్న. కొత్తగా చూపిస్తే వర్కౌట్ అవుతుంది లేదంటే జస్ట్ ఒక సిరీస్ అవుతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి టెక్నో థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్) -
ఓటీటీలోకి టెక్నో థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా టెక్నో థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఓ స్టోరీతో వెబ్ సిరీస్ సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దీనికి కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈయన కొడుకు వీర్ హిరానీ ఇందులో లీడ్ రోల్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)'ప్రీతమ్ అండ్ పెడ్రో' పేరుతో తీసిన ఈ సిరీస్ వచ్చే నెల 3వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వీర్ హిరానీ లీడ్ రోల్ చేయగా.. అర్షద్ వార్షీ, విక్రాంత్ మస్సే, బొమన్ ఇరానీ లాంటి స్టార్స్ కీలక పాత్రలు చేశారు. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.ట్రైలర్ బట్టి చూస్తే.. టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని పెడ్రో(అర్షద్ వార్సీ) అనే పోలీస్ అధికారి.. ఓ కేసు కారణంగా మంత్రి దెబ్బకు సైబర్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. మరోవైపు ప్రీతమ్ అనే కుర్రాడు టెక్నాలజీలో జీనియస్. 15 నిమిషాల్లోనే సెల్‌టవర్‌ని హ్యాక్ చేయగలడు. కానీ నిజ జీవితంలో వ్యాక్యూమ్ క్లీనర్స్ అమ్ముతుంటాడు. అయితే పెడ్రో ట్రాన్స్ఫర్కి కారణమైన మంత్రి కొడుకు కిడ్నాప్ అవుతాడు. రూ.23 లక్షలు డిమాండ్ చేస్తారు. ఇదంతా చేసింది పేరు మోసిన మరో హ్యాకర్ అని పెడ్రో, ప్రీతమ్ తెలుసుకుంటారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన) -
ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన
తెలుగులో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు గుర్తుండే ఉంటాడు. చాన్నాళ్లుగా తెరపై పెద్దగా కనిపించని ఇతడు.. ట్రెండ్‌కి తగ్గట్లే ఓ యాక్షన్ మూవీ చేశాడు. దర్శకత్వంతో పాటు హీరోగానూ ఇతడే నటించాడు. కాకపోతే థియేటర్లలో రిలీజైన తొలి ఆట నుంచి దారుణమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్)సహాయ నటుడిగా అద్భుతమైన పాత్రలు చేసిన రవిబాబు.. 'అల్లరి' మూవీతో దర్శకుడిగా మారాడు. అవును, అనసూయ, అమరావతి లాంటి డిఫరెంట్ ప్రయోగాలు చేశాడు. అప్పట్లో ఇవి ఉన్నంతలో బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ ట్రెండ్‌కి తగ్గట్లు కంటెంట్ మార్చుకోలేక మూవీస్ చేయడం తగ్గించుకుంటూ వచ్చేశాడు. 'రేజర్' పేరుతో తీసిన యాక్షన్ చిత్రాన్ని గత నెల 8న థియేటర్లలో రిలీజ్ చేశాడు. దీని ప్రమోషన్లలో సినిమాల గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. వాటిని అందరూ బాగానే చూశారు గానీ మూవీని ఒక్కడూ పట్టించుకోలేదు.ఇప్పుడీ చిత్రం ఈ శుక్రవారం(జూన్ 19) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఆడియెన్స్ దీన్ని థియేటర్లలో పట్టించుకోలేదు. మరి ఓటీటీలోనైనా పట్టించుకుంటారేమో చూడాలి? ఇకపోతే ఈ వారం దీనితోపాటు దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3, కెనాతా కానమ్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి.'రేజర్' విషయానికొస్తే.. రాష్ట్ర హోంమంత్రి (కనకరాజు) తన కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రిని హత్య చేస్తాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విష్ణు (తనీష్) చేతికి చిక్కుతుంది. దీంతో హోంమంత్రి ముఠా విష్ణును, అతని భార్యని చంపేస్తారు. ప్రాణాలతో బయటపడిన విష్ణు కూతురు తేజును.. పెట్ గ్రూమింగ్ చేసే రుద్ర ప్రతాప్ (రవిబాబు) కాపాడతాడు. తర్వాత హోంమంత్రి గ్యాంగ్ నుంచి ఆ చిన్నారిని రవిబాబు ఎలా కాపాడాడనేది మిగిలిన కథ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీకి టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ఓ వీడియోను రిలీజ్ చేస్తూ డేట్ ప్రకటించారు. ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ఈ తెలుగు వెబ్ సిరీస్ జూలై 2 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా వీడియో రిలీజ్ చేస్తూ అఫీషియల్‌గా వెల్లడించింది. తన జాబ్ పర్మినెంట్ కావడం కోసం ఓ గ్రామానికెళ్లిన హీరో.. అక్కడ ఎదురైన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడన్న కథాంశంతో ఈ సిరీస్ రూపొందించారు. ఈ వెబ్ సిరీస్‌లో మురళీశర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్‌బాబు కీలక పాత్రలు పోషించారు. Chemistry raani vadu oka ooriki chemistry nerpisthe ela untundhi? 🤭😁 pic.twitter.com/ZCX4U6ZWJD— Netflix India South (@Netflix_INSouth) June 15, 2026 -
ఓటీటీల్లో ఏకంగా 14 సినిమాలు.. ఆ మూవీపైనే అందరి కళ్లు..!
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. పెద్ది థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరి కొన్ని చిన్న సినిమాలు సైతం రిలీజయ్యాయి. వాటిపై పెద్దగా బజ్ లేకపోవడంతో థియేటర్ల వద్ద హడావుడి కనిపించడం లేదు. ఈ వారంలో థియేటర్లలో దీవానా, మా ఇంటి బంగారం లాంటి చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో సమంత మా ఇంటి బంగారంపై కాస్తా బజ్ నెలకొంది. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపే చూస్తున్నారు.ఈ వారంలో ఓటీటీ ప్రియులను అలరించేందుకు సినిమాలు రెడీ అయిపోయాయి. దృశ్యం-3, కెనతా కానోమ్, ఎం4ఎం లాంటి సినిమాలు ఆసక్తిగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మోహన్ లాల్ దృశ్యం-3 కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీటితో పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారంలో ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్మై అమెరికాస్ స్వీట్‌హార్ట్స్ (వెబ్‌సిరీస్:సీజన్3) జూన్ 16డ్రింకింగ్ బడ్డీస్ -(హాలీవుడ్ మూవీ) జూన్ 15ఐ విల్ ఫైండ్ యూ(హాలీవుడ్ సిరీస్)- జూన్ 18వాయిస్‌మెయిల్స్ ఫర్ ఇసబెల్లె(హాలీవుడ్ సినిమా)- జూన్ 19తుక్రా కె మేరా ప్యార్ సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 19హస్బెండ్స్ ఇన్ యాక్షన్(కొరియన్ మూవీ)- జూన్ 19జియో హాట్స్టార్కెనతా కానోమ్(తమిళ సినిమా)- జూన్ 16 సేవ్ ది టైగర్స్ 3 (తెలుగు వెబ్‌సిరీస్) జూన్ 19అమెజాన్ ప్రైమ్యువర్ ఫాల్ట్(హాలీవుడ్ మూవీ)- జూన్ 17దృశ్యం-3-(మలయాళ మూవీ)- జూన్ 18ది ఎజెన్సీ- సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 21లయన్స్ గేట్ ప్లే..అలియా బసు గాయబ్ హై(బాలీవుడ్ మూవీ)- జూన్ 19ఎం4ఎం(మోటివ్ ఫర్ మర్డర్)-(తెలుగు సినిమా)- జూన్ 19సోని లివ్..అతిరథి(మలయాళ సినిమా)- జూన్ 19 -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా అలా వీరభద్రుడు, దృఢం, భూత్ బంగ్లా, రమణి కల్యాణం తదితర చిత్రాలతో పాటు రాఖ్, ష్ సీజన్ 3 లాంటి డబ్బింగ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. మరోవైపు ఓ తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కూడా పెద్దగా హడావుడి లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!)2022 అక్టోబరు 28న థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'ఐటెంటిటి'. అమరేష్ రాజు, భాగ్యలక్ష్మి, కుషి ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తీసినప్పటికీ పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఇదొకటి వచ్చిందనే సంగతి కూడా జనాలకు తెలిసిరాలేదు. ఇప్పుడీ మూవీ దాదాపు నాలుగేళ్ల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.'ఐడెంటిటి' విషయానికొస్తే.. రిషిదేవ్ ఓ ఎన్సీబీ అధికారి. ఓ ప్రమాదంలో తన జ్ఞాపకశక్తి కోల్పోతాడు. అదే టైంలో హరన్ అనే వ్యక్తి డ్రగ్ రాకెట్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తిస్తారు. అయితే హరన్ ఎవరో కాదు గతం మర్చిపోయిన రిషిదేవ్ అనే సంగతి తెలుస్తుంది. తర్వాత ఏమైంది అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘దృఢం’ రివ్యూ.. ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం!) -
ఓటీటీకి కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. డైరెక్ట్‌గా స్ట్రీమింగ్
ఓటీటీకి వచ్చేందుకు మరో సినిమా రెడీ అయిపోయింది. సన్నీ డియోల్, అక్షయే ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ఇక్కా. ఈ చిత్రాన్ని సస్పెన్స్ కోర్ట్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. జూలై 10 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ సందడి చేయనుంది.దాదాపు 29 ఏళ్ల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు సన్నీ డియోల్, అక్షయే ఖన్నా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ సస్పెన్స్ అండ్ ఎమోషనల్ కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దియా మీర్జా, తిలోత్తమా శోమే, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. #Bollywood doesn't make enough courtroom thrillers.#Ikka already has my attention. The poster feels tense, the tagline is intriguing, and #SunnyDeol looks completely locked in. 🔥⚖️Also, you can never count out #AkshayeKhanna in a film like this when it comes to intense,… pic.twitter.com/9SuJeH0vWN— Siddharth R Kannan (@sidkannan) June 13, 2026 -
‘29’ మూవీ రివ్యూ : సాదా సీదా కథే.. చూస్తుంటే కన్నార్పనీయదు
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. వాటిలో తమిళ చిత్రం ‘29’ ఒకటి. నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. అప్పుడెప్పుడో ఓ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది... థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని అంటారు. తన ఐడెంటీటీ గురించి చెప్పే ప్రయత్నంలో చెప్పిన డైలాగ్ అది. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఓ గుర్తింపు ఉంటుంది. నిజానికి కొంతమంది స్వతహాగా ఆ గుర్తింపు సంపాదించుకుంటారు. మరికొందరు సంపాదించే పోరాటంలో ఉంటారు. ఆ దరిమిలా తీసిన కథే ఈ ‘29’ సినిమా. తాను రాసుకున్న కథను తానే వెండితెర మీదకు తీసుకువచ్చిన రత్నకుమార్ నిజంగా అభినందనీయుడే. ఇదో సాదా సీదా కథ. కానీ చూసే ప్రేక్షకుడిని మాత్రం కన్నార్పనీయదు. అంతలా ఏముందో ఈ కథలో ఓసారి చూద్దాం. సత్య 29 ఏళ్ళ కాలేజ్ యువకుడు. ఏ లక్ష్యమూ లేక నిరంతరం తన గుర్తింపు కోసం ఆరాటపడే పోరాట వీరుడు. ఆ ప్రయత్నంలోనే సత్యకు కథానాయిక విజ్జి పరిచయమవుతుంది. సత్యలా కాదు విజ్జి... ఐఏఎస్‌కి ప్రిపేర్ అవుతుంటుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. అసలే తనకు గుర్తింపు లేదనే బాధలో ఉన్న సత్యకు ఉన్నట్టుండి బాయ్ ఫ్రెండ్ అనే గుర్తింపు వచ్చిన ఆనందం ఎంతో సేపు నిలవదు. ఓ దశలో విజ్జి తన ప్రేమ తన లక్ష్యానికి అడ్డుగా ఉందని భావించి సత్యను ఇక కలవొద్దని చెబుతుంది. అనుకోకుండా తన జీవితంలో అడుగుపెట్టిన విజ్జి తనే ఇప్పుడు కలవొద్దని చెప్పడంతో సత్య కుమిలిపోతాడు. మరి... సత్యను కలవొద్దన్న విజ్జి ఐఏఎస్ పాసవుతుందా? సత్యకు తనకు కావలసిన గుర్తింపుతోపాటు విజ్జి దక్కుతుందా? అన్న విషయం మాత్రం ‘29’ సినిమాలోనే చూడాలి. పేరుకు ఇది తమిళ మాతృక అయినా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమ్ అవుతోంది. ఓ మంచి ఫీల్ ఉన్న ఎమోషనల్ డ్రామా ఈ సినిమా. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
‘దృఢం’ రివ్యూ.. ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం!
టైటిల్ : దృఢంనటీనటులు: షేన్ నిగమ్, శోభి తిలకన్, కొట్టాయం రమేశ్, నందన్ ఉన్ని తదితరులుదర్శకత్వం : మార్టిన్ జోసెఫ్ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక: జియో హాట్స్టార్తమిళ, మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌కి ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది.థియేటర్స్‌లో సరిగా ఆడలేకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి విజయాన్ని సాధించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఆ చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే ప్రతివారం ఓటీటీలో ఇలాంటి చిత్రాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ వారం కూడా ఓ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘దృఢం’. జియో హాట్‌స్టార్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కుజినీలం పోలీస్‌స్టేషన్ పరిధిలో పెద్దగా క్రైమ్ అనేదే జరగదు. పోలీసులంతా ఊరివాళ్లతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. అలాంటి ప్రశాంతమైన స్టేషన్‌కి ఎస్సైగా వస్తాడు విజయ్(షేన్ నిగమ్). శిక్షణ పూర్తయిన తర్వాత ఎస్సైగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ప్రాంతం ప్రశాంతంగా ఉంటుందని తెలిసి ఎంతో సంతోషంగా ఉంటాడు. స్టేషన్‌లోని పోలీసులందరితో సరదాగా ఉంటూ తన డ్యూటీ తాను చేస్తుంటాడు. అయితే ఆయన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే ఊరిలో గుర్తు తెలియని యువకుడి శవం బయటపడుతుంది. కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగానే.. అదే ప్రాంతంలో ఉన్న ఫైనాన్స్ కంపెనీలో దోపిడీ జరుగుతుంది. భారీ బంగారంతో పాటు రూ. 50 లక్షల నగదు కూడా దోచేస్తారు.దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తుండగానే స్థానికంగా ఉన్న డ్యామ్‌లో మరో శవం బయటపడుతుంది. ప్రశాంతమైన ప్రాంతంలో ఇలా ఒక్కసారిగా వరుస హత్యలు, దోపిడీ జరుగుతుండడంతో ఉన్నతాధికారుల నుంచి విజయ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. వారంలో ఈ కేసులను ఛేదించాలని,లేదంటే ఆ బాధ్యతలను మరో అధికారికి అప్పగిస్తామని హెచ్చరిస్తారు. మరి ఈ కేసుని విజయ్ ఛేదించాడా? అసలు ఆ శవాలు ఎవరివి? ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేసిందెవరు? విచారణ క్రమంలో విజయ్‌కి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు హంతకులను ఎలా పట్టుకున్నాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..సాధారణంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కథలు అన్ని దాదాపు ఒకేలా ఉంటాయి. క్రైమ్ జరగడం.. అది పోలీసులకు అది సవాలుగా మారడం..ఇన్వెస్టిగేషన్లో ట్విస్టులు బయటకు రావడం..ఇలా అన్ని కథలు ఇదే ఫార్మాట్లో సాగుతాయి. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ ఎంత ఉత్కంఠంగా సాగింది? అదేదానిపైనే సినిమా ఫలితం ఆధారణ పడుతుంది. ‘అరే..ఇదేం ట్విస్టురా..అస్సలు ఊహించలేదు’ అని ప్రేక్షకుడు నోటితో అనిపిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే. ‘దృఢం’ సినిమా చూస్తే చివరిలో కచ్చితంగా మన నోట అలాంటి మాట వస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ని అస్సలు ఊహించలేరు. చివరిలో కొత్త క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చూశామనే ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది.సినిమా ప్రారంభ సన్నివేశాలు రొటీన్‌గానే ఉంటాయి. శిక్షణ పూర్తి చేసుకొని ఎస్సైగా కుజినీలం పోలీస్‌స్టేషన్‌కు రావడం..తోటి పోలీసులతో సరదగా కలిసి ఉండడం.. చిన్న చిన్న క్రైమ్ కేసులు వస్తే సాల్వ్ చేయడం.. దాదాపు అరగంట వరకు ఇలా సింపుల్‌గానే కథనం సాగుతుంది. ఎప్పుడైనే మొదటి శవం బయటపడుతుందో అప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. ఒకవైపు గుర్తు తెలియని శవం ఎవరిదని విచారణ చేస్తుండగానే.. ఫైనాన్స్ కంపెనీతో దోపిడీ ఘటన బయటపడడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా వరుసగా క్రైమ్ జరగడంతో ఎస్సై విజయ్ ఈ కేసులను ఎలా ఛేదిస్తాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అసలు హత్యలు ఎవరు చేశారనేది ప్రేక్షకుడు కూడా అంచనా వేయలేడు. ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే ట్విస్టులు అయితే అదిరిపోతాయి. హంతకులు ఎవరనేది తెలిసిన తర్వాత షాకవ్వడం ఖాయం. ప్రేక్షకుడు ఆ షాక్‌లో ఉండగానే మరో ట్విస్ట్ రివీల్ చేసి సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు, యాక్షన్ సన్నివేశాలు థ్రిల్లింగ్‌కు గురి చేస్తాయి. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా, రొటీన్‌గా సాగినా.. సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే..షేన్ నిగమ్ తప్ప మిగిలిన నటీనటులెవరు తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగానూ ఈ సినిమా బాగానే ఉంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్వాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లోని సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం దృశ్యం 3, మే 21న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. మలయాళంలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 236 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయినప్పటికీ నెల రోజులలోపే ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 18 నుంచి ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన వెల్లడించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రసారం కానుంది.దృశ్యం 3 కథేంటంటే..?దృశ్యం 2 ముగింపు సీన్‌తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు జార్జ్‌కుట్టి(మోహన్‌లాల్) వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. కోర్టు ఆదేశాలతో జార్జ్ ఫ్యామిలీపై ఎలాంటి కేసు నమోదు కాకుండా బయటపడతారు. తన జీవితంలో చోటు చేసుకున్న ఈ ఘటననే కాస్త మార్పులు చేసి ఓ సినిమాను నిర్మిస్తాడు జార్జ్. అది రిలీజై..బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుంది. అదే సమయంలో మానసిన సమస్యలను నుంచి బయటపడిన పెద్ద కూతురు అంజుకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. భార్య రాణి(మీనా) కూడా కూతురికి త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందని సలహా ఇస్తుంది. అయితే చాలా సంబంధాలు వచ్చినప్పటికీ.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంజు గురించి నెగెటివ్‌గా చెప్పడంతో అవన్నీ తప్పిపోతాయి.కొన్నాళ్ల తర్వాత తన కూతురికి వచ్చిన పెళ్లి సంబంధాలను ఇద్దరు చెడగొడుతున్నారనే విషయం తెలుస్తుంది? అసలు ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నారు? కొడుకు(వరుణ్)ని పోగోట్టుకున్న బాధ నుంచి బయటపడేందుకు అమెరికా వెళ్లిన గీతా ప్రభాకర్, ప్రభాకర్ మళ్లీ జార్జ్ లైఫ్‌లోకి ఎందుకు వచ్చారు? సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్ సహదేవన్ చేసిన కుట్ర ఏంటి? వరుణ్ హత్య కేసు నుంచి కూతురిని తప్పించేందుకు ఈ సారి జార్జ్ వేసిన ప్లాన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీకి టాలీవుడ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచికి తగినట్లుగా కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉన్నాయి. శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాల సందడి ఉంటుంది. తెలుగు నేరుగా ఓటీటీ చిత్రాలు రాకపోయినప్పటికీ.. వెబ్ సిరీస్‌లు మాత్రం వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటేస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇసాకపట్నం. టైటిల్ వింటేనే విశాఖ నేపథ్యంలోనే కథ ఉండనుందని అర్థమవుతోంది. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్‌కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డిబొర్రా నిర్మించారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు. ఈ సిరీస్‌లో ఏడు ఎపిసోడ్స్ ఉంటాయని తెలిపారు. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్‌కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ, రాజాచెంబోలు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్ వర్షన్ అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా ఇంగ్లీష్ సహా 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో 240కి పైగా దేశాల్లోని ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. -
ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. ఒక్క రోజే 21 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో కూడా థియేటర్లలో పెద్ది హవా కొనసాగుతోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి షురూ అవుతుంది. ఈ నెల 12న ఫ్రైడే రోజున చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. సింగ్ గీతం, భారత భాగ్య విధాత, పోలీస్ కంప్లైంట్, కొత్త మలుపు లాంటి సినిమా బాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.ఇక ఈ శుక్రవారం ఓటీటీల విషయానికొస్తే సూర్య కరుప్పు(తెలుగులో వీరభద్రుడు)పై ఆసక్తి నెలకొంది. భూత్ బంగ్లా లాంటి బాలీవుడ్ మూవీపై కూడా ఆడియన్స్‌లో క్రేజ్ ఉంది. వీటితో రమణి కల్యాణం అనే తెలుగు సినిమా సైతం ఓటీటీలో సందడి చేయనుంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ నుంచి సినిమాలతో పాటు పలు ఆసక్తికర వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ భూత్ బంగ్లా (హిందీ సినిమా) - జూన్ 12ఐ యామ్ ఫ్రాంకెల్డా (స్పానిష్ మూవీ) - జూన్ 12ది పాలిగమిస్ట్(వెబ్ సిరీస్)- జూన్ 12అవుట్ లాస్ట్ ది జంగిల్-(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12ది రెస్ట్ ఈజ్ ఫుట్‌బాల్- సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12అమెజాన్ ప్రైమ్ రాఖ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 12 కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 12 విజిల్(హాలీవుడ్ మూవీ)- జూన్ 12 డాగ్51(ఫ్రెంచ్ సినిమా)- జూన్ 12 ఓవర్ యువర్ డెడ్ బాడీ(హాలీవుడ్ మూవీ)- జూన్ 12 ఎవరీ ఇయర్ ఆఫ్టర్(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12జియో హాట్‌స్టార్ ద్రిదమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 12 అలైస్ అండ్ స్టీవ్- సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12 బిలో డెక్ మెడిటెరియన్-సీజన్ 11(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12ఆహా ష్ సీజన్ 3 (తెలుగు సిరీస్) - జూన్ 12జీ5మై హూ నా (హిందీ రియాలిటీ షో) - జూన్ 12తార్ఖతా (బెంగాలీ సిరీస్) - జూన్ 12లయన్స్ గేట్ ప్లే షెల్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12 విక్కీ క్రిస్టీ బార్సిలోనా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 12సన్ నెక్ట్స్రమణి కల్యాణం(తెలుగు సినిమా)- జూన్ 12హెబీవో మ్యాక్స్దె విల్ కిల్ యూ(హాలీవుడ్ మూవీ)- జూన్ 12 -
ఓటీటీలో దురంధర్-2.. మూడు రోజుల్లోనే రికార్డ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఏకంగా రూ.1790 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 రికార్డ్‌ను సైతం అధిగమించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జూన్ 5న స్ట్రీమింగ్కు వచ్చేసిన దురంధర్-2 వ్యూస్ పరంగా అదరగొడుతోంది. స్ట్రీమింగ్కు వచ్చిన మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల మందికిపైగా వీక్షించారు. కేవలం వీకెండ్లోనే 5 కోట్ల మందిపైగా వీక్షించినట్లు ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ మూవీ ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేశ్ బేడీ, గౌరవ్ గేరా, డానిష్ పాండోర్ కీలక పాత్రలు పోషించారు. -
థియేటర్లలో పెద్ది.. ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ప్రస్తుతం పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల మార్క్‌కు దగ్గరకు చేరుకుంది. ఈ వారం కూడా పెద్ది హవానే కొనసాగుతోంది. ఈ ఫ్రైడే రోజు చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. సింగ్ గీతం, భారత భాగ్య విధాత, పోలీస్ కంప్లైంట్, కొత్త మలుపు లాంటి సినిమా బాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి.ఇక ఈ వారం ఓటీటీల విషయానికొస్తే సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఓటీటీకి వచ్చేస్తోంది. దీంతో పాటు బాలీవుడ్ మూవీ భూత్ బంగ్లా స్ట్రీమింగ్కు రానుంది. వీటితో పాటు తెలుగులో ష్ అనే తెలుగు వెబ్ సిరీస్ ఆసక్తి పెంచుతోంది. అంతేకాకుండా పలు టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (జూన్ 8 నుంచి 14 వరకు)నెట్ఫ్లిక్స్కలర్స్ ఆఫ్ ఈవిల్ - బ్లాక్ (మూవీ) - జూన్ 10మై ఫ్యామిలీ సీజన్2 (వెబ్‌సిరీస్) - జూన్ 10స్వీట్ మగ్నోలియాస్ -సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 11ది ఈవిల్ లాయర్ (వెబ్‌సిరీస్) - జూన్ 11భూత్ బంగ్లా (హిందీ సినిమా) - జూన్ 12ఐ యామ్ ఫ్రాంకెల్డా (స్పానిష్ మూవీ) - జూన్ 12అమెజాన్ ప్రైమ్ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10ద రెస్ట్ ఈజ్ ఫుట్‌బాల్ (డాక్యుమెంటరీ మూవీ) - జూన్ 10రాఖ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 12కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 12జియో హాట్స్టార్ద్రిదమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 12ఆహాష్ సీజన్ 3 (తెలుగు సిరీస్) - జూన్ 12జీ5మై హూ నా (హిందీ రియాలిటీ షో) - జూన్ 12తార్ఖతా (బెంగాలీ సిరీస్) - జూన్ 12లయన్స్ గేట్ ప్లేషెల్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12విక్కీ క్రిస్టీ బార్సిలోనా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 12ఆపిల్ టీవీ ప్లస్క్రిమినల్ రికార్డ్ (వెబ్‌సిరీస్) - జూన్ 10 -
ఓటీటీకి సూర్య హిట్ సినిమా.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్..!
సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్గా త్రిష కనిపించింది. ఆర్థిక సమస్యలతో ఒక రోజు ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూన్ 12 నుంచో ఓటీటీ ప్రియులను అలరించనుంది. రిలీజైన నెల రోజుల్లోపే స్టార్ హీరో మూవీ ఓటీటీకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.కరుప్పు కథేంటంటే..మీను అనే అమ్మాయి ప్రాణాంతక వ్యాధి బారిన పడుతుంది. చికిత్స కోసం లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. దీంతో తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను అమ్మాలని చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తారు. నాంపల్లిలో రైలు దిగి..సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా..దొంగలు వచ్చి ఆ నగలను ఎత్తుకెళ్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మరుసటి రోజు దొంగలను పట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు. వాటిని తీసుకోవాలంటే కోర్టు అనుమతి అవసరం అని చెప్పడంతో మీను, ఆమె తండ్రి కోర్టుకు వెళ్తారు.ఈ కేసునే టేకాప్ చేసిన లాయర్ బేబీ కృష్ణ(ఆర్.జే బాలాజీ)..వాళ్లకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. దోచుకోవడం మొదలుపెడతాడు. కావాలనే కేసును నెలల తరబడి సాగదీస్తాడు. మీను తండ్రికి ఓపిక నశించి.. చేసేదేం లేక కోర్టు ఎదుటే ఉన్న వీరభద్రుడు స్వామిని (సూర్య)ను వేడుకుంటాడు. న్యాయం కోసం ఆ దేవుడే కిందకి దిగొస్తాడు. మనిషిగా భూమికి మీదకు వచ్చిన వీరభద్రుడు స్వామి.. మీనుకి న్యాయం చేశాడా? అవినీతి కంపులో మునిగిపోయి బేబీ కృష్ణకు, ఇతర లాయర్లకు ఆయన ఎలాంటి బుద్ది చెప్పాడు? అనేదే ఈ సినిమా కథ. god mode ON 🔥 #KaruppuOnPrime, June 12@Suriya_offl @RJ_Balaji @SaiAbhyankkar @dop_gkvishnu @trishtrashers @prabhu_sr #Indrans @natty_nataraj #Swasika @SshivadaOffcl #SupreethReddy #AnaghaMayaRavi #VikramMor @kalaivananoffl #ArunVenjaramoodu @PraveenRaja_Off @ZeeTamil… pic.twitter.com/VeKFZ4qViA— prime video IN (@PrimeVideoIN) June 8, 2026 -
ఓటీటీకి టాలీవుడ్ ఎమోషనల్ డ్రామా..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సూర్య వశిష్ట, దీప్షిక హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఎమోషనల్ డ్రామా రమణి కల్యాణం. ఈ ఎమోషనల్ డ్రామాకు విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు. మే 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. చిత్రాన్ని కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మించారు.ఈ సినిమా ఓటీటీ సందడి చేసేందుకు వచ్చేస్తోంది. సన్ నెక్ట్స్ వేదికగా ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈనెల 12 నుంచే సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు.ఈ సినిమా కథేంటంటే.. సంజన(దీప్షిక) చిన్నప్పుడే ఓ యాక్సిడెంట్ లో కళ్ళు పోగొట్టుకున్నా తన పనులు తాను చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూ ఓ పబ్ లో సింగర్ గా పనిచేస్తూ ఉంటుంది. నలుగురు పిల్లలు, ఓ బామ్మ.. వాళ్లే సంజన ప్రపంచం. సంజన పనిచేసే పబ్ ఓనర్ కిషోర్(శ్రీనివాసరెడ్డి) ఫ్రెండ్ రాజ్(సూర్య వసిష్ఠ) నడవలేడు. పక్షవాతం వల్ల వీల్ చైర్ కే అంకితం. అనుకోకుండా ఈ ఇద్దరూ ఓ గొడవతో పబ్ లో కలిసి స్నేహితులుగా మారి అనంతరం ప్రేమలో పడతారు. ఎప్పుడూ అతని గతం, గోల్ గుర్తుచేసుకుంటూ బాధపడే రాజ్ సంజన ప్రేమతో పూర్తిగా మారిపోయి సంతోషంగా ఉంటాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలోనే కిషోర్ కి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? మరి సంజన - రాజ్ ల పెళ్లి జరిగిందా? అసలు రాజ్ ఎందుకు వీల్ చైర్ కే పరిమితమయ్యాడు? రాజ్ గతమేంటి? సంజన గతం ఏంటి? సంజనతో ఉండే నలుగురు పిల్లలు ఎవరు? కిషోర్‌కి రాజ్ గురించి ఏం తెలిసింది అన్నదే ఈ సినిమా కథ.When the perfect match is the one who heals your soul.Stream Ramani Kalyanam on Sun NXT from 12 June!#RamaniKalyanam #TeluguMovies #TFI #SunNXT [Feel Good Movies, Telugu Movies, New Telugu Movies, Deepshika, Surya Vashistta, Romance Movies, Emotional Drama, Poetic Movies,… pic.twitter.com/LL5Wa17mDS— SUN NXT (@sunnxt) June 7, 2026 -
ఓటీటీలోకి మలయాళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకు తెలుగునాట చాలా క్రేజ్ ఉంటుంది. ఆ భాషలో తీసిన వివిధ జానర్ల మూవీస్‌ని తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. అందుకు తగ్గట్లే డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా గత నెలలో రిలీజై హిట్టయిన కామెడీ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగానూ ప్రకటించారు.(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)మలయాళంలో హీరో, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్ లేటెస్ట్ యూత్‌ఫుల్ కామెడీ మూవీ 'అతిరథి'. ఇందులోనే టొవిన్ థామస్ మరో హీరోగా నటించాడు. 'సర్వం మాయ' ఫేమ్ రియా షిబు హీరోయిన్గా చేసింది. గత నెల 14న థియేటర్లలో రిలీజై ఆకట్టుకుంది. రూ.65 కోట్ల మేర కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడీ మూవీ ఈ నెల 19వ తేదీ నుంచి సోనీ లివ్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుందని పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చారు.'అతిరథి' విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చదివే సామ్ కుట్టి(బాసిల్ జోసెఫ్) తన కాలేజీలో ఆగిపోయిన అరోహన్ ఫెస్ట్‌ని తిరిగి ప్రారంభించాలని అనుకుంటాడు. కానీ ఇదే కాలేజీలో ఉంటే మరో గ్రూప్ దీన్ని వ్యతిరేకిస్తుంది. మరి చివరకు ఏమైంది? సామ్ కుట్టి తను అనుకున్నది సాధించాడా లేదా? శ్రీకుట్టి(టొవినో థామస్), స్వాతి (రియా షిబు) ఎవరు? అనేది మిగతా స్టోరీ. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కామెడీ సినిమా చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.(ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్.. ఈసారి ఇంకాస్త
ఓటీటీలకు సెన్సార్ ఉండదు. కాబట్టి బూతు, రొమాంటిక్ జానర్ సినిమాలు, సిరీస్‌లు అప్పుడప్పుడు రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు అలానే బోల్డ్ రొమాంటిక్ కాన్సెప్ట్‌తో తీసిన తెలుగు సిరీస్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగానూ ప్రకటించారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: 'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?)2024లో 'ష్' పేరుతో తమిళంలో ఓ సిరీస్ తీశారు. సోనియా అగర్వాల్, ఇనయా, ఐశ్వర్య దత్తా తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. దీని గతేడాది తెలుగులోనూ డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తర్వాత కొన్నిరోజులకే రెండో సీజన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో కొత్త పాత్రలు కొత్త కాన్సెప్ట్ చూపించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మూడో సీజన్ కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈసారి మరింత బోల్డ్ కంటెంట్ ఉండబోతుందన్నట్లు హింట్ ఇచ్చారు.జూన్ 12 నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి 'ష్ సీజన్ 3' ఆహా ఓటీటీలో తెలుగు, తమిళంలో అందుబాటులోకి రానుంది. ఈ సీజన్లో ఒకప్పటి హీరోయిన్ పూనమ్ బజ్వా, బిగ్‌బాస్ ఫేమ్ దివి, కిరణ్ రాథోడ్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. వీళ్లంతా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలు, వీడియోలతో ఇప్పటికే ఫేమస్. (ఇదీ చదవండి: మొన్న 'దేవర'.. ఇప్పుడు 'పెద్ది'.. జాన్వీ కపూర్ అదే తంతు)Every character has a story. Meet the cast of #SshhhSeason3 🎭Stay tuned @ahatamil 🌟#ahatamil #SshhhSeason3 pic.twitter.com/IuurnJ8KUf— aha Tamil (@ahatamil) June 4, 2026 -
ఈ వీకెండ్ పండగే.. థియేటర్లలో పెద్ది.. ఓటీటీలో దురంధర్-2..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వీకెండ్ మొత్తం రామ్ చరణ్ పెద్ది హవా ఉండనుంది. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు నుంచే పాజిటివ్ వస్తోంది. సూపర్ హిట్ ఖాయమంటూ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారాంతం మూడు రోజులు పెద్దికి కలిసి రానుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే దురంధర్-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచే ప్రీమియర్ షోతో దురంధర్ ఓటీటీలో సందడి చేయనుంది. దీంతో పాటు అగ్లీ స్టోరీ, కేడీ ది డెవిల్ లాంటి సినిమాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. ఈ ఫ్రైడే పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సైతం స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ 29 (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూన్ 05 మెక్సికో 86 (స్పానిష్ సినిమా) - జూన్ 05 ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 05 టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ సిరీస్) - జూన్ 05 ద మార్క్డ్ ఉమన్ (స్పానిష్ సినిమా) - జూన్ 05స్కార్లెట్ (హాలీవుడ్ మూవీ)- జూన్ 06 యూఎస్ఏ 94 (పోర్చుగీస్ చిత్రం) - జూన్ 07జియో హాట్‌స్టార్ ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05అమెజాన్ ప్రైమ్ ద పిరమిడ్ స్కీమ్ (హిందీ సిరీస్) - జూన్ 05 పీటర్(కన్నడ సినిమా)- జూన్ 05జీ5 పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 05 కేడీ ద డెవిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05 బ్రౌన్ (హిందీ సిరీస్) - జూన్ 05సోనీ లివ్ గుల్లాక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 05సన్ నెక్స్ట్ ద రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05ఆహాఅగ్లీ స్టోరీ(తెలుగు సినిమా)- జూన్ 5ఆపిల్ టీవీకేప్ ఫియర్(హాలీవుడ్ సినిమా)- జూన్ 05 -
ఓటీటీలో దురంధర్-2 ప్రీమియర్ షో.. స్ట్రీమింగ్ టైమ్ ఇదే...!
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న దురంధర్-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓవర్సీస్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా విదేశాల్లోని ప్రేక్షకులను అలరిస్తోంది. మే 14వ తేదీ నుంచే ఓవర్సీస్లో అందుబాటులోకి వచ్చేసింది.దీంతో ఇండియా ఫ్యాన్స్ సైతం దురంధర్-2 ఓటీటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దురంధర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచే జియో హాట్‌స్టార్ వేదికగా ప్రీమియర్ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో స్ట్రీమింగ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. దురంధర్-2 కథేంటంటే?రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్‌పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. థియేటర్లలో పెద్దగా హిట్ కాకపోయినా ఓటీటీల్లో అదరగొట్టేస్తుంటాయి. తాజాగా మరో మలయాళ పోలీస్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దృశ్యం చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పణలో మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమా 'ధృడం'. ఈ మూవీ జూన్ 12 నుంచే ఓటీటీలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మే 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో యంగ్ హీరో షేన్ నిగమ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఓటీటీలో మలయాళం, తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి.ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎస్సై విజయ్ (షేన్ నిగమ్) కొత్తగా ఓ ఊరికి పోస్టింగ్ మీద వస్తాడు. చేరిన రెండో రోజే ఓ హత్య, మూడోరోజు ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం, తర్వాత ఓ బ్లాక్మెయిల్ కేసు, తర్వాత మరికొన్ని హత్యలు.. ఇలా వరస కేసులు వస్తూనే ఉంటాయి. వీటని పరిష్కరించడం కోసం విజయ్ ఏం చేశాడు? అసలు ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? కొత్తగా జాయిన్ అయిన విజయ్.. వీటిని ఎలా హ్యాండిల్ చేశాడు? ఇవన్నీ చేసిన తర్వాత విజయ్ కనుక్కొన్న అసలు రహస్యం ఏంటి? అనేది మిగతా స్టోరీ. -
ఓటీటీకి డకాయిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా కేవలం మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా హిందీ వర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. డకాయిట్ హిందీ వర్షన్ జూన్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్‌లో హిందీ వర్షన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.డకాయిట్ కథేంటంటే..తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ.pyaar mein badla ya pyaar se badla 💔#DacoitOnPrime, In Hindi, June 5@AdiviSesh @mrunal0801 @anuragkashyap72 #SupriyaYarlagadda @Deonidas #ZaynMarieKhan @bhaskarla_sai @atul_kulkarni #BheemsCeciroleo @abburiravi @AnnapurnaStdios @AsianSuniel #SSCreations @sonymusicindia pic.twitter.com/zNvGM3KtJ0— prime video IN (@PrimeVideoIN) June 3, 2026 -
Madhuvidhu: ఈ పెళ్ళి కుదరదు.. ఆ హనిమూన్ అవ్వదు... ఎలా?
పెళ్ళి అనేది కొన్ని కుటుంబాలతో పాటు తరాలను కలుపుతుంది. అందుకే అంటారు మన పెద్ద వాళ్ళు అటు ఏడు తరాలు ఇటు తరాలు చూసి సంబంధం కలుపుకోమని. అలా అనే ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో పెళ్ళి సాంప్రదాయాలను పద్ధతిగా పాటిస్తుంటారు. పద్ధతిగానే కాదు కొంతమంది మూర్ఖంగా కూడా పాటిస్తుంటారు. ఆ అంశంతోనే రూపుదిద్దుకున్న ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా మధవిధు.జై విష్ణు, బిబిన్ మోహన్ అందించిన కథకు విష్ణు ఆనంద్ తెర కెక్కించిన విధానం నభూతో నభవిష్యతి అని చెప్పాలి. మధువిదు సినిమా మొత్తం సరదా సరదాగా సాగిపోతుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం.ఆంజిల్ ముట్టిల్ కుటుంబంలో పెద్దవాడైన అమృతరాజ్ ఓ కేప్ నడుపుతూ ఉంటాడు. వయసు పైబడినా ఇంకా అమృతరాజ్ కు పెళ్ళవదు. అందుకే అమృతరాజ్ తన పెళ్ళి కోసం తెగ ఆరాటపడుతూ ఉంటాడు. అమృతరాజ్ ఇంట్లో తమ్ముడితో సహా తన తండ్రి, తాతతోపాటు బాబాయ్ ఉంటారు. అమృతరాజ్ తల్లి చిన్నపుడే చనిపోతుంది. ఒక్క ఆడ దిక్కులేని ఈ కుటుంబానికి ఊళ్ళో వాళ్ళు అనే మాటల వల్ల పెళ్ళి సంబంధాలు చెడిపోతూ ఉంటాయి. ఆంజిల్ ముట్టిల్ కుటుంబానికి తరతరాల నుండి ఏదో ఆడశాపం ఉందని వినికిడి. దీంతో బాగా దిగాలు పడిన అమృతరాజ్ ఎట్టకేలకు స్నేహ అనే అమ్మాయిని ఇష్టపడి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్ళి సంబంధం మాట్లాడడానికి అందరితో కలిసి స్నేహ వాళ్లింటికి వెళతారు. పేరుకు అమృతరాజ్ పెళ్ళి చూపులైనా అమృతరాజ్ తండ్రి స్నేహ అత్తను గుర్తుపట్టి, ఇష్టపడి తరువాత ఎవరికీ చెప్పకుండా లేచిపోయి పెళ్ళి చేసుకుంటాడు. ఇక అక్కడి నుండి అమృతరాజ్ వెళ్ళి కథ మళ్ళీ మొదటికొస్తుంది. దీంతో మళ్ళీ అమృతరాజ్ నానా తంటాలు పడుతూ స్నేహ వాళ్ళ నాన్నను పెళ్ళి కోసం ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో స్నేహ చెల్లెలు సోఫీ పెళ్ళి ఖాయమవుతుంది. కాని రేపు పెళ్ళి అనగా అబ్బాయి తనకు ఇష్టం లేదని సోఫీ అమృతరాజ్ కి మాత్రం తెలియచేస్తుంది. మరి సోఫీ పెళ్ళి ఆపించి తన పెళ్ళి జరిగేలా అమృతరాజ్ చేయగలడా లేదా అన్నది మాత్రం మధువిధు సినిమాలోనే చూడాలి. అవడడానికి ఇది మళయాళ సినిమా అయినా సోనీలివ్ ఓటిటి వేదికగా తెలుగులోనూ లభ్యమవుతోంది. సినిమా ఆద్యంతం నవ్వులతో సరదాగా సాగిపోతుంది. మస్ట వాచ్ ఫర్ ది వీకెండ్.– హరికృష్ణ ఇంటూరు -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా
తెలుగులో కమర్షియల్ సినిమాలు ఎక్కువగా వస్తాయి. తమిళ, మలయాళంలో మాత్రం కంటెంట్ ఓరియెంటెడ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండే చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. అలా రెండు నెలల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఓ మూవీ.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్.. 'మధువిధు' తెలుగు రివ్యూ)తెలుగులోనూ అల వైకుంఠపురములో, క్రాక్ తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని లీడ్ రోల్ చేసిన తమిళ మూవీ 'కార్మేని సెల్వం'. గౌతమ్ మేనన్ మరో కీలక పాత్ర చేశారు. ఏప్రిల్ 3న థియేటర్లలో తెలుగులోనూ రిలీజైన ఈ చిత్రం.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలంటే ఇష్టముంటే దీనిపై లుక్ వేయొచ్చు.'కార్మేని సెల్వం' విషయానికొస్తే.. సెల్వం(సముద్రఖని).. సంపత్(గౌతమ్ మేనన్) దగ్గర కారు డ్రైవరుగా పనిచేస్తుంటాడు. సెల్వం భార్య శాంతి (లక్ష్మి) ఇడ్లీ బండి నడుపుతూ ఉంటుంది. చాలా డబ్బు సంపాదించి సొంతిల్లు కట్టుకోవాలన్నది సెల్వం దంపతుల కల. దీనికోసం రోజూ కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. ఓ సందర్భంలో బంధువులే వీళ్లని తీవ్రంగా అవమానిస్తారు. తర్వాత అనుకోని సంఘటనలు జరుగుతాయి. దీంతో సెల్వం.. తన యజమాని సంపత్‌ని మోసం చేస్తాడు. తర్వాత అంతకుమించి అప్పులు కూడా చేస్తాడు. వాటిని తీర్చే క్రమంలో సెల్వం కుటుంబం ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.మరోవైపు ఓటీటీలో ఈ వారం ధురంధర్ 2, పేట్రియాట్, కేడీ, 29, మా బెహన్, ద రైజ్ ఆఫ్ అశోక.. లాంటి తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా -
ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా ధురంధర్, పేట్రియాట్, కేడీ, కార్మేని సెల్వం, 29, మా బెహన్, ద రైజ్ ఆఫ్ అశోక లాంటి తెలుగు డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. తాజాగా మరో తెలుగు చిత్రం ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా ఏంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: 'బ్లాస్ట్' సినిమా ఊహించని సక్సెస్.. అలానే కలెక్షన్స్ కూడా)జో శర్మ అనే ఇండో-అమెరికన్ నటి ప్రధాన పాత్ర పోషించిన తెలుగు సినిమా 'ఎమ్4ఎమ్'. మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ మే 8న థియేటర్లలో రిలీజైంది. కానీ పేరున్న నటీనటులు లేకపోవడం, కథాకథనాలు ఏమంత గొప్పగా లేకపోవడంతో జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం ఈ నెల 19 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్‌లోకి కూడా రావొచ్చు.'ఎమ్4ఎమ్' విషయానికొస్తే.. హైదరాబాద్‌లో స్టార్ హీరో రంజిత్ (కృష్ణతేజ) హత్యకు గురవుతాడు. ఓ సీరియల్ కిల్లర్ ఇతడిని చంపేసి, పెయింటింగ్ ఆకారంలో న్యూడ్‌గా పెడతాడు. ఈ కేసుని ఏసీపీ కృష్ణ(సంబీత్ ఆచార్య) దర్యాప్తు చేస్తుంటాడు. ఇతడి భార్య రాధ (జో శర్మ) ఓ న్యూస్ ఛానెల్లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తుంటుంది. భార్యభర్తలిద్దరూ కలిసి ఈ కేసులో విచారణ చేస్తుంటారు. కిల్లర్ మాత్రం వీళ్లకు దొరక్కుండా వరస హత్యలు చేస్తుంటాడు. ఎక్కడెక్కడ చంపబోతున్నానని చెప్పి ముందే పోలీసులకు వాయిస్ మెసేజ్ పంపి సవాలు విసురుతాడు. ఇంతకీ ఈ సీరియల్ కిల్లర్ ఎవరు? హత్యల వెనకున్న కారణమేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలో స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలకు కొదవే లేకుండా పోయింది. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇలా ఏ భాష అయినా సరే తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లో క్లిక్ అవుతున్నాయి. కంటెంట్ పరంగా మలయాళ చిత్రాలకు దీటుగా కోలీవుడ్ కూడా సిద్ధమవుతోంది. తాజాగా ఓ తమిళ సిరీస్ ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయిపోయింది.కతిర్, గెలాక్సీ స్టార్ విమల్, దివ్య భారతి, పూర్ణిమ రవి ప్రధాన పాత్రల్లో వస్తోన్న స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్ లింగం. ఈ సిరీస్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వస్తోంది. జియో హాట్‌స్టార్ వేదికగా జూన్ 26 నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ సిరీస్‌కు ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కబడ్డీ నేపథ్యంలో సాగనుంది. పోస్టర్స్, టీజర్ చూస్తుంటే గ్యాంగ్‌స్టర్ కథగా ఉండనుందని అర్థమవుతోంది. వెట్రిమారన్, మారి సెల్వరాజ్ సినిమాల్లో లాగా.. ఇందులో కతిర్ పాత్ర ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తోంది. -
ధనుశ్ లేటేస్ట్ మూవీ.. ఏకంగా నంబర్‌వన్‌గా ట్రెండింగ్..!
ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన తాజా మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది.బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. స్ట్రీమింగ్కు వచ్చిన తొలివారంలోనే దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్‌వన్ ప్లేస్‌లో కొనసాగుతోంది. దీంతో మేకర్స్‌తో పాటు ధనుశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కర అసలు కథేంటంటే..ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. కరస్వామి అలియాస్ కర(ధనుష్) ఒక దొంగ. తన తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) దగ్గర డబ్బు దొంగిలించి.. ఇంట్లో నుంచి పారిపోతాడు. చివరిగా ఒక దొంగతనం చేసి మానేయాలనుకొని స్నేహితుడితో కలిసి ఓ ఇంట్లోకి వెళ్తాడు. డబ్బులు తీసుకెళ్తున్న సమయంలో ఇంట్లోవాళ్లు పట్టుకొని..పోలీసులకు అప్పగిస్తారు. ఈ కేసు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న డీఎస్పీ భరతన్(సూరజ్ వెంజర్మూడు) చేతికి వెళ్లగా.. కర అతన్ని కొట్టి స్టేషన్ నుంచి పారిపోతాడు. ఇకపై దొంగతనాలు చేయనని చెప్పి ప్రియురాలు మల్లి(మమిత బైజు) పెళ్లి చేసుకొని ఓ హోటల్లో పని చేస్తారు. కొన్నాళ్ల తర్వాత సొంతంగా హోటల్ పెట్టుకోవాలనుకుంటారు.లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే.. షూరిటీ అడుగుతారు. పొలం కాగితాలు పెట్టి లోన్ తీసుకుందామని ఊరికి వెళ్లగా.. తండ్రి అప్పటికే వాటిని బ్యాంకుల్లో పెట్టి అప్పు తీసుకుంటాడు. అప్పు కట్టకపోతే పొలాన్ని జప్తి చేస్తామని బ్యాంకు నోటీసులు పంపడం.. కొడుకు డబ్బుల కోసమే తన దగ్గరకు వచ్చాడనే బాధతో కోదండం చనిపోతాడు. తండ్రి చివరి కోరిక మేరకు పార్థివదేహానికి పొలంలోనే పూడ్చేందుకు వెళ్లగా..బ్యాంకు అధికారులు అడ్డుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి చివరి కోరిక నెరవేర్చడం కోసం కర ఏం చేశాడు? బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాలకు అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఎస్పీ భరతన్ తిరిగి కరను పట్టుకున్నాడా లేదా? ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు మేనేజర్(జయరాం) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
తమిళ స్టార్ కమెడియన్లలో యోగిబాబు ఒకడు. సహాయ పాత్రలతో పాటు అప్పుడప్పుడు హీరోగానూ పలు సినిమాలు చేస్తుంటాడు. అలా చేసిన 'మండేలా'ని ఇప్పటికే చాలామంది చూసి ఉంటారు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన మరో మూవీ ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)యోగిబాబు హీరోగా నటించిన తమిళ కామెడీ డ్రామా మూవీ 'కేనాథ కానం'. ఈ పేరుకు తెలుగులో 'బావి కనబడట్లేదు' అని అర్థం. తమిళనాడులోని చాలా పల్లెటూళ్లలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. తాగేందుకు సరైన నీటి సదుపాయం ఉండదు. అదే అంశాన్ని తీసుకుని ఈ మూవీ తీశారు. కాకపోతే సీరియస్ సమస్యని ఫన్నీగా చూపిస్తూ ఆలోచన రేకెత్తించారు. మార్చి 13న థియేటర్లలో రిలీజై హిట్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఈనెల 15వ తేదీ నుంచి హాట్స్టార్లోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.'కేనాథ కానం' విషయానికొస్తే.. కొడంగిపట్టి అనే ఊరిలో చాలా తక్కువ ఇళ్లు ఉంటాయి. కానీ ప్రతి ఇంటికి తాగునీటి సమస్య ఉంటుంది. దీన్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఎంత వేడుకున్నా సరే ఏం చేయదు. ఈ ఊరిలో నీరు ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం ప్రజలు.. ఓ తాతని అడిగి ఆ ఊరి శిల్పి అయిన మణివాసగం(యోగిబాబు) ఇంటి దగ్గర ఉందని తెలుసుకుంటారు. దీంతో ఇతడు తన స్థలాన్ని దానం చేస్తాడు. ఊరంతా కలిసి అక్కడ నీటి కోసం తవ్వడం మొదలుపెడతారు. కానీ అక్కడ నీరు పడకపోగా డైనోసర్ ఎముకలు కనబడతాయి. దానికోసం కేంద్రం నుంచి ప్రభుత్వ అధికారులు ఈ ఊరికి ఎందుకొచ్చారు? చివరకు నీటి సమస్య తీరిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. థియేటర్లలో ఓ మాదిరిగా ఆడిన మూవీస్ కూడా మన దగ్గర బాగానే ఆదరణ తెచ్చుకుంటాయి. అలా ఇప్పుడు ఓ మలయాళ పోలీస్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'దృశ్యం' చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పణలో మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమా 'ద్రిదమ్'. గత నెల 8న థియేటర్లలో రిలీజైంది. కానీ ఓ మాదిరి స్పందన మాత్రమే సొంతం చేసుకుంది. యంగ్ హీరో షేన్ నిగమ్ లీడ్ రోల్ చేశాడు. ఇప్పుడీ చిత్రం వచ్చే శుక్రవారం(జూన్ 12) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి వస్తుంది.'ద్రిదమ్' విషయానికొస్తే.. ఎస్సై విజయ్ (షేన్ నిగమ్) కొత్తగా ఓ ఊరికి పోస్టింగ్ మీద వస్తాడు. చేరిన రెండో రోజే ఓ హత్య, మూడోరోజు ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం, తర్వాత ఓ బ్లాక్మెయిల్ కేసు, తర్వాత మరికొన్ని హత్యలు.. ఇలా వరస కేసులు వస్తూనే ఉంటాయి. వీటని పరిష్కరించడం కోసం విజయ్ ఏం చేశాడు? అసలు ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? కొత్తగా జాయిన్ అయిన విజయ్.. వీటిని ఎలా హ్యాండిల్ చేశాడు? ఇవన్నీ చేసిన తర్వాత విజయ్ కనుక్కొన్న అసలు రహస్యం ఏంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ 'మధువిధు' తెలుగు రివ్యూ) -
ఓటీటీలో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్.. తెలుగు రివ్యూ
తెలుగులో ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూసే సినిమాలు ఈ మధ్య కాలంలో బాగా తగ్గిపోయాయి. ఆ లోటుని పరభాషా చిత్రాలు ఇప్పుడు భర్తీ చేస్తున్నాయి. అలాంటి ఓ మూవీనే 'మధువిధు'. మలయాళంలో రిలీజై డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. రీసెంట్గా సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉంది? చూడొచ్చా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్)కథేంటి?కొచ్చాంబళం అనే ఊరిలో ఒక కుటుంబం ఉంటుంది. అందులో ఐదుగురు మగాళ్లే ఉంటారు. ఆడవాళ్లు లేని కుటుంబం అని, నాగదోషం ఉందని.. కోడలిగా వచ్చేందుకు ఏ అమ్మాయి ఇష్టపడదు. దీంతో ఇదే ఇంట్లో ఉండే అమృత్ రాజ్(షరాఫుద్దీన్)కి 28 సార్లు పెళ్లి సంబంధాలు చెడిపోతాయి. చివరకు స్నేహ (కల్యాణి పణిక్కర్) ఇతడి జీవితంలోకి వస్తుంది. తర్వాత ఏం జరిగింది? అమృత్ రాజ్ పెళ్లయిందా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'మధువిధు' అంటే మలయాళంలో హనీమూన్ అని అర్థం. ఆడది లేక బోసిపోయిన ఇంట్లో ఉండే హీరో.. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, ఒంటరిగా కాకుండా భార్యతో కలిసి నిద్రపోవాలని అనుకుంటూ ఉంటాడు. అందుకు తగ్గట్లే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటాడు. 28 సంబంధాలు చూస్తాడు కానీ అందరూ రిజెక్ట్ చేసేస్తారు. అలాంటి ఇతడి జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి రావడంతో ఊహించని మలుపులు ఎదురవుతాయి. ఇంతకీ అవేంటి? చివరకు కథ సుఖాంతం అయిందా లేదా అనేది అసలు కథ.టాలీవుడ్లో ఇప్పుడు డిష్యుం డిష్యుం సినిమాలే ఎక్కువైపోయాయి. ఫ్యామిలీలో ఉండే బంధాలు, భావోద్వేగాలు చూపించే చిత్రాలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. అలాంటి వాటిని చక్కగా చూపించిన మూవీ ఇది. ఇది పాత కాన్సెప్టే కానీ ట్రీట్మెంట్ ఫ్రెష్‌గా ఉంది. ఒక ఊరిలో మగాళ్ల మాత్రమే ఉండే కుటుంబం, అదే ఊరిలో ఆడవాళ్లు మాత్రమే ఉండే మరో కుటుంబానికి ఎలాంటి కనెక్షన్ ఏర్పడింది. 'పెళ్లి' అనేది ఈ రెండు ఇళ్లల్లో ఎలాంటి సమస్యలు సృష్టిస్తుందని చూపించిన విధానం బాగుంది.నాగదోషం ఉందని హీరో ఉంటున్న ఇంటికి ఎవరూ పిల్లనివ్వరు. అలాంటి పరిస్థితుల్లో హీరోతో పాటు ఇతడి తండ్రి, బాబాయ్ ఎలా ప్రేమలో పడ్డారు? చివరకు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారు? అనేది కామెడీగా చూపించారు. పెళ్లీడు వచ్చిన కొడుకు ఇంట్లోనే ఉండగానే తండ్రి పెళ్లి చేసుకోవడం, అప్పటికే కూతురు కూడా ఉన్న కొత్త భార్యని ప్రెగ్నెంట్ చేయడం అనేది వినడానికి చాలా బోల్డ్‌గా అనిపిస్తుంది కానీ ఇందులో అదే కాన్సెప్ట్‌ని ఫన్నీగా డీల్ చేశారు. అది బాగా వర్కౌట్ అయింది కూడా.అలకలు, బుజ్జగింపులు, వేడుకలు, వేదన.. ఇలా అన్ని అంశాలని కలుపుకొని ఈ సినిమాని చూపించిన విధానం మెప్పించింది. మరీ ముఖ్యంగా పట్టె మంచం గురించి వచ్చే సీన్స్ అయితే మంచిగా నవ్విస్తాయి. తరచూ ఒకే దగ్గర కేబుల్ వైర్ తెగిపోవడం లాంటి సీన్స్ కూడా నవ్వు తెప్పిస్తాయి. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ ఎక్కడా రాసినట్లు కాకుండా మన పక్కనే జరిగినట్లు అనిపిస్తుంది. అదే ఆ ట్రాక్ బలం.ఈ సినిమాలో సిట్యుయేషనల్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. హీరో జీవితం ఓ ట్రాజెడీలా ఉంటుంది కానీ దాన్ని ఎక్కడా మెలోడ్రామా చేయకుండా ఫన్నీగా చూపించిన విధానం అందరికీ కనెక్ట్ అవుతుంది. పెళ్లి అనేది ఒక పంజరం లాంటిదని చాలామంది భావిస్తుంటారు. కానీ పెళ్లి అనేది ఓ అందమైన బంధం అనే మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. సమస్యలు అన్ని ఇళ్లలో ఉంటాయి. అర్ధం చేసుకుని, మాట్లాడుకుని మమకారాలు పెంచుకుని కలిసుండాలని చెబుతుంది. బోర్ కొట్టకుండా సింపుల్ కంటెంట్‌తో సరదాగా సాగిపోతుంది.హీరోహీరోయిన్లుగా చేసిన షరాఫుద్దీన్, కల్యాణి పణికర్‌తో పాటు మిగతా అందరూ యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు ఒక్కటి ఉండవు గానీ మూవీ పూర్తయ్యేసరికి చాలా పాత్రలతో ప్రేమలో పడిపోతాం. అంతలా నచ్చేస్తాయి. సెకండాఫ్‌లో సాగదీత, ఫోర్డ్స్‌గా అనిపించే కొన్ని సీన్స్ తప్పితే ఓవరాల్‌గా మూవీ బాగుంది. డైరెక్టర్ విష్ణు ఆనంద్, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ గానీ తమ పనికి పూర్తి న్యాయం చేశారు. కుటుంబం అంతా కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
థ్రిల్లర్స్ అనగానే చాలామందికి ఓటీటీలే గుర్తొస్తాయి. ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలన్నీ థియేటర్లలో రిలీజ్ అవుతాయి. క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని రకరకాల మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు అలానే 'పాతాళ్ లోక్' మేకర్స్ నుంచి మరో థ్రిల్లర్ సిరీస్ రెడీ అయింది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత జాక్‌పాట్ కొట్టిన రష్మిక!)'రాఖ్' పేరుతో తీసిన ఈ సిరీస్‌లో అలీ ఫజల్, సోనాలి బింద్రే, రాకేశ్ బేడీ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. వచ్చే శుక్రవారం(జూన్ 12) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఇది స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే ఆర్మీ అధికారికి చెందిన కొడుకు, కూతురు కనిపించకుండా పోతారు. వీళ్లని ఎవరో హత్య చేసేస్తారు. తర్వాత ఇదే క్రమంలోనే ఢిల్లీలో వరస హత్యలు జరుగుతాయి. ఇంతకీ వీటిని చేస్తుంది ఎవరు? పోలీసులు హంతకుల్ని పట్టుకున్నారా? లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది.ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే ఇందులో తల్లి పాత్ర చేసింది. 'ధురంధర్' ఫేమ్ రాకేశ్ బేడీ కూడా కీలక పాత్ర చేశారు. మరి ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి రామ్ చరణ్ 'పెద్ది' రాబోతుంది. గురువారం రిలీజ్ కానుండగా.. ముందురోజు రాత్రి ప్రీమియర్ల పడనున్నాయి. మృణాల్, పూజా హెగ్డే నటించిన హిందీ మూవీ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' ఈ వీకెండే రానుంది. వీటి సంగతి పక్కనబెడితే ఓటీటీల్లో మాత్రం బోలెడన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్ఫుల్ ఫస్ట్ లుక్)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'ధురంధర్ 2' స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంది. దీనితో పాటు పేట్రియాట్, కేడీ, 29, మా బెహన్, ద రైజ్ ఆఫ్ అశోక తదితర తెలుగు డబ్బింగ్ మూవీస్ చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా మేడిన్ ఇండియా, ద పిరమిడ్ స్కీమ్, బ్రౌన్ లాంటి సిరీసులు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీకి ఏ మూవీ రానుందంటే?ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే సినిమాల జాబితా (జూన్ 01 నుంచి 07 వరకు)హాట్స్టార్ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 04అమెజాన్ ప్రైమ్మేడిన్ ఇండియా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 03క్లార్క్సన్ ఫార్మ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 03ద లెజెండ్ ఆఫ్ వోక్స్ మెషీనా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 03ద పిరమిడ్ స్కీమ్ (హిందీ సిరీస్) - జూన్ 05నెట్ఫ్లిక్స్మా బెహన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 04ద మర్డర్ ఆఫ్ రేచల్ నికల్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 0429 (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూన్ 05మెక్సికో 86 (స్పానిష్ సినిమా) - జూన్ 05ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 05టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ సిరీస్) - జూన్ 05ద మార్క్డ్ ఉమన్ (స్పానిష్ సినిమా) - జూన్ 05యూఎస్ఏ 94 (పోర్చుగీస్ చిత్రం) - జూన్ 07జీ5పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 05కేడీ ద డెవిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05బ్రౌన్ (హిందీ సిరీస్) - జూన్ 05సోనీ లివ్గులక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 05సన్ నెక్స్ట్ద రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05ఆపిల్ టీవీ ప్లస్కేప్ ఫియర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 04(ఇదీ చదవండి: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్) -
ఓటీటీకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలు వచ్చాక ఏ సినిమా అయినా సరే తెగ చూసేస్తున్నారు. కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఏ భాషలో తెరకెక్కించినప్పటికీ డబ్బింగ్ చేసి ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో కథ నచ్చితే చాలు ఎలాంటి మూవీకైనా ఆదరణ దక్కుతోంది. దీంతో డబ్బింగ్ చేసినా చిత్రాలే ఎక్కువగా ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ తమిళ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. విధు, ప్రీతి అస్రాని జంటగా నటించిన 29 చిత్రం మే 8న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా స్టార్స్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేశారు.జూన్ 5 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా 29 స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్‌గా రివీల్ చేసింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ సినిమాకు రత్న కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మహేంద్రన్ , అవినాష్, షెనాజ్ ఫాతిమా, ప్రేమ్ కుమార్ కీలక పాత్రల్లో మెప్పించారు. -
మూడోసారి సేవ్ ది టైగర్స్.. ట్రైలర్‌తోనే నవ్వులే నవ్వులు..!
మగాళ్ల బాధలను కామెడీ కోణంలో ప్రేక్షకులకు రుచి చూపించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. ఇప్పటికే రిలీజైన రెండు సీజన్స్ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇందులో పెళ్లి చేసుకున్న ప్రతి మగాడి పరిస్థితిని కళ్లకు అద్దం కట్టినట్లు చూపించారు. దీంతో ఈ కామెడీ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. రెండు సీజన్స్ సినీ ప్రియులను మస్తు ఎంటర్టైన్ చేశాయి.ఇప్పుడు మూడో సీజన్ కూడా సరికొత్తగా మీ ముందుకొస్తోంది. తాజాగా ఈ సేవ్ ది టైగర్స్-3 ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే నవ్వుల వర్షం కురుస్తోంది. ఎవడ్రా చెప్పింది ‘పెళ్లంటే పండు వెన్నెల.. పెళ్లామంటే నిండు పున్నమి అనే అభినవ్ గోమఠం డైలాగ్ తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ కామెడీ వెబ్ సిరీస్ జూన్‌లోనే జియోహాట్‌స్టార్‌లో సందడి చేయనుంది.అభినవ్ గోమఠం. ప్రియదర్శి, చైతన్యకృష్ణ పండించిన కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్ ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనుంది. ఈ వెబ్ సిరీస్ జూన్ 19 నుంచే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్‌లో జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి, హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్, గుండు సుదర్శన్, మిర్చి కిరణ్, అభయ్ బేతిగంటి, ముక్కు అవినాష్ కీలక పాత్రల్లో నటించారు. మరి ఇంకెందుకు ఆలస్యం సీజన్-3 ట్రైలర్ చూసేయండి. -
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేస్తుంటాయి. వీటిలో ఆడియన్స్ ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ లాంటి మూవీస్‌ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగానే ప్రతివారం బోలెడ్ చిత్రాలు, సిరీస్‌లు రానే వస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.అలీ ఫజల్, సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ కీలక పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'రాఖ్'. ఈ వెబ్ సిరీస్‌కు ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇందులో ఫజల్ పోలీస్ యూనిఫాంలో కనిపించగా.. అతనిముందు ఓ శవం ఉన్న కొత్త పోస్టర్‌ను ఈ సిరీస్‌పై ఆసక్తిని మరింత పెంచేసింది. పాతిపెట్టిన నిజాలు ఎప్పుడూ తిరిగి బయటపడతాయి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.'రాఖ్' అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సిరీస్. ఇద్దరు టీనేజర్లు అదృశ్యం కావడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ సంఘటన ఒక అన్యోన్యమైన కుటుంబాన్ని తీవ్రంగా, మానసిక వేదనకు గురిచేస్తుంది. అంతేకాకుండా మొత్తం నగరాన్ని ఆందోళనకు గురవుతుంది. ఈ కేసును చేధనే లక్ష్యంగా దర్యాప్తు కోణంలో ఈ సిరీస్ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు ఆయుష్ త్రివేది డైలాగ్స్ అందించగా.. ఎండెమోల్ షైన్ ఇండియా బ్యానర్‌పై దీపక్ ధర్, రిషి నేగి, మృణాలిని జైన్, శ్యామ్ రాఠీ నిర్మించారు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
మరో ఓటీటీకి మార్క్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ స్టార్ హీరో 'కిచ్చా' సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మార్క్'. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ మూవీ విడుదలైంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్ తదితరులు నటించారు. దర్శకుడు విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 23 నుంచే కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది.తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రైమ్‌లో ఈ మూవీ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ చిత్రకంలో కిచ్చా సుదీప్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ కథ చాలా బలహీనంగా ఉండటం.. ఆపై ఊహించదగిన ట్విస్టులతో బాక్సాఫీస్ వద్ద కాస్తా నిరాశపరిచింది. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారిని మాత్రం మ్యాక్స్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకుంది. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ప్రముఖ నటుడు అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా.. కన్నడలో కాస్త గుర్తింపు ఉన్న హీరోనే. కానీ సరైన సక్సెస్ మాత్రం రావట్లేదు. ఇతడు హీరోగా నటించిన ఓ సినిమా అష్టకష్టాలు పడి కొన్నిరోజుల క్రితమే థియేటర్లలోకి వచ్చింది. తర్వాత తెలుగులోనూ రిలీజైంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్)ధ్రువ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'కేడీ ద డెవిల్'. అప్పుడెప్పుడో నాలుగేళ్ల క్రితమే మొదలైనప్పటికీ నెల క్రితం అంటే ఏప్రిల్ 30న కన్నడ వరకు రిలీజైంది. ఈ నెల 15న తెలుగు వెర్షన్ థియేటర్లలోకి వచ్చింది. కొన్నాళ్ల ముందు బూతు పాటతో వివాదంలోనూ ఇరుక్కుందీ మూవీ. బిగ్ స్క్రీన్‌పై ఏ మాత్రం మెప్పించలేకపోయింది. వచ్చే శుక్రవారం(జూన్ 05) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ఇప్పుడు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.'కేడీ ద డెవిల్' విషయానికొస్తే.. అది 1980ల కాలం. ధర్మ(రమేశ్ అరవింద్) ఓ ఉపాధ్యాయుడు. కానీ ఇతడు తమ్ముడు కాళి(ధ్రువ సర్జా) మాత్రం వీధిలో కిరోసిన్ అమ్ముతూ బతుకుతుంటాడు. కుస్తీలో తిరుగులేని యోధుడైన దేవా(సంజయ్ దత్) అంటే కాళికి ప్రాణం. 25 ఏళ్లుగా ముఠాని నడుపుతున్న దేవా.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. మరోవైపు ధర్మ స్నేహితుడు అణ్ణయ్యప్ప ఇదే ఎన్నికల బరిలో నిలుస్తాడు. దీంతో దేవా గ్యాంగ్.. కాళి, అతడి కుటుంబాన్ని చంపేయాలని చూస్తుంది. అప్పటివరకు ఆరాధించిన దేవాపై కాళి ఎలా తిరగబడ్డాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఈ వారం చాలానే సినిమాలు వచ్చాయి. ధనుష్ 'కర', శరవణన్ 'లీడర్', సత్య 'జెట్ లీ', డ్రింకర్ సాయి, సచిన్ బయోపిక్ తెలుగు వెర్షన్‌తో పాటు హాలీవుడ్ హారర్ మూవీ 'ద మమ్మీ' అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు వీటికి తోడుగా ఇదే నెలలో రిలీజైన తెలుగు మూవీ కూడా సైలెంట్‌గా స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హరర్ సినిమా.. తెలుగులోనూ)'మేమ్ ఫేమస్' సినిమాతో హీరో, దర్శకుడిగా ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్.. చాన్నాళ్లు గ్యాప్ తీసుకుని చేసిన మూవీ 'గోదారి గట్టుపైన'. నిధి ప్రదీప్ హీరోయిన్ కాగా 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్ తీసిన సుభాష్ చంద్ర.. ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. జగపతిబాబు, లైలా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈనెల 08న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక ఫ్లాప్ అయింది. ఇప్పుడిది ఎలాంటి హడావుడి లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'గోదారి గట్టుపైన' విషయానికొస్తే.. రాజు (సుమంత్ ప్రభాస్) ఆటో డ్రైవర్. పదో తరగతి మధ్యలోనే ఆపేసి కుటుంబం, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా బతికేస్తుంటాడు. తన చెల్లితో ఇంజినీరింగ్ చదువుతున్న మాయ(నిధి ప్రదీప్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా రాజుని ప్రేమిస్తుంది. మరోవైపు తన కూతురు మాయ అంటే శ్యాంబాబు(జగపతిబాబు)కి ప్రాణం. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే ఈయన తన కూతురుకి తనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడితోనే పెళ్లి జరిపిస్తానని చెబుతుంటాడు. మరి ఇంజినీరింగ్ చదువుతున్న కూతురు ఓ ఆటోడ్రైవర్ని ప్రేమించిందని తెలిశాక శ్యాంబాబు ఏం చేశాడు? కూతురు ప్రేమని అంగీకరించాడా లేదా? చివరకు ఏమైందేనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి వచ్చేసిన హరర్ సినిమా.. తెలుగులోనూ
ప్రతి వీకెండ్ రాగానే ఓటీటీల్లోకి కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని సినీ ప్రేమికులు చూస్తూ ఉంటారు. వాళ్ల కోసమా అన్నట్లు ఎప్పటికప్పుడు కొత్త మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే ధనుష్ 'కర', శరవణన్ 'లీడర్', సత్య 'జెట్ లీ', డ్రింకర్ సాయి, సచిన్ బయోపిక్ తెలుగు వెర్షన్ తదితర చిత్రాలు వచ్చేశాయి. ఇప్పుడ వీటికో తోడుగా ఓ హారర్ మూవీ కూడా తెలుగులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: 'పెద్ది' టికెట్ ధరలు ఎంతెంత పెంచారంటే?)90స్లో పుట్టి పెరిగిన వాళ్లలో చాలామంది హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే 'మమ్మీ' ఫ్రాంచైజీ చిత్రాలు వీళ్లకు అలరించిన వాటిలో కచ్చితంగా ఉంటాయి. ఇప్పటివరకు పలు భాగాలుగా రిలీజయ్యాయి కానీ అవన్నీ అడ్వెంచర్ కామెడీ తరహాలో ఉండేవి. ఈ ఏడాది మాత్రం ఇదే ఫ్రాంచైజీ నుంచి హారర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో మూవీ వచ్చింది.లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన 'ద మమ్మీ' సినిమా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని ఆకట్టుకుని పర్లేదనిపించింది. రెండు వారాల క్రితం విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రెంట్ విధానంలో స్ట్రీమింగ్‌లోకి రాగా ఇప్పుడు ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీలోకి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. హిందీ, తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.'ద మమ్మీ 2026' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం చాలా హ్యాపీగా ఫీలవుతుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు ఆ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడతాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయపెట్టేలా ఉన్నాయని చూసినవాళ్లు చెప్పారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 16 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి త్రికాల, బ్లాస్ట్ జోన్, కాటలాన్ లాంటి చిన్న, డబ్బింగ్ చిత్రాలే రిలీజయ్యాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం కాస్త చెప్పుకోదగ్గ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇప్పటికే ధనుష్ 'కర', సత్య 'జెట్ లీ', 'డ్రింకర్ సాయి' తదితర సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేయగా ఇవి కాకుండా మరో 16కి పైగా మూవీస్, వెబ్ సిరీసులు శుక్రవారం ఒక్కరోజే రాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? ఏది ఎందులోకి రానుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: 'పెద్ది' కూడా రిలీజ్ అవుతోంది.. 'విశ్వంభర' ఎక్కడ?)ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (మే 29)అమెజాన్ ప్రైమ్లీడర్ - తెలుగు డబ్బింగ్ మూవీసుఖమానో సుఖమమ్ - మలయాళ సినిమాద లాస్ట్ వికింగ్ - డానిష్ మూవీహాట్స్టార్కజిన్స్ అండ్ కల్యాణమ్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్లార్డ్ కర్జోన్ కీ హవేలీ - హిందీ సినిమా (మే 30)జాలీ ఎల్ఎల్బీ 3 - హిందీ మూవీజెట్ లీ - తెలుగు చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది)ఆహాసచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ - తెలుగు సినిమానెట్ఫ్లిక్స్బ్రెజిల్స్ 70: ద థర్డ్ స్టార్ - పోర్చుగీస్ సిరీస్కలబాసస్ కాన్ఫిడెంటల్ - ఇంగ్లీష్ సిరీస్రఫా - స్పానిష్ సిరీస్కర - తెలుగు డబ్బింగ్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)సన్ నెక్స్ట్ఫేసెస్ - తెలుగు డబ్బింగ్ సినిమాజీ5ద అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ - బెంగాలీ సిరీస్డ్రింకర్ సాయి - తెలుగు మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)ఆపిల్ టీవీ ప్లస్ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ - ఇంగ్లీష్ సినిమాస్టార్ సిటీ - ఇంగ్లీష్ సిరీస్లయన్స్ గేట్ ప్లేద రేస్ - రొమేనియన్ మూవీహెచ్బీఓ మ్యాక్స్ద మూమెంట్ - ఇంగ్లీష్ సినిమా(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ) -
ఓటీటీలోకి సచిన్ బయోపిక్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఐపీఎల్ చివరకొచ్చేసింది. ఫ్లే ఆఫ్ మ్యాచుల్లో ఎవరు గెలుస్తారు? ఫైనల్స్‌కి ఎవరొస్తారనే టెన్షన్ క్రికెట్ అభిమానుల్లో గట్టిగా ఉంది. ఇప్పుడు సదరు క్రికెట్ ప్రేమికుల కోసమా అన్నట్లు దిగ్గజ సచిన్ టెండూల్కర్ బయోపిక్‌ని ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైపోయారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)సచిన్ టెండూల్కర్ జీవితం, క్రికెట్ జర్నీ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ 'సచిన్ : ఏ బిలియన్ డ్రీమ్స్'. 2017లో థియేటర్లలో రిలీజైన ఇది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీలో సచిన్ క్రీడా జర్నీతో పాటు 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించిన క్షణాలు, క్రికెట్ గాడ్ స్పీచ్, రేర్ వీడియోస్, మ్యాచ్ ఫుటేజ్‌తో పాటు భారతీయ క్రికెట్ చరిత్రలోని కీలక ఘట్టాలను ఇందులో చూపించారు.ఇదివరకే హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీల్లో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు తెలుగు, తమిళ వెర్షన్లని ఆహా ఓటీటీలోకి తీసుకురానున్నారు. గురువారం(మే 28) నుంచి తెలుగులో, శుక్రవారం(మే 29) నుంచి తమిళంలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్) -
కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ
కొన్ని సినిమాలు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజైపోతుంటాయి. సాధారణంగా ఇలాంటి వాటిపై చిన్నచూపు ఉంటుంది. ఎందుకంటే కంటెంట్ బాగోలేకపోవడం వల్లే ఇలా ఇచ్చేశారా అని సందేహం కలుగుతుంది. కొన్నిసార్లు మాత్రం దీనికి భిన్నంగా జరుగుతుంది. ఇప్పుడు అలానే వచ్చిన ఓ కోర్ట్ రూమ్ డ్రామా ఆకట్టుకుంటోంది. దాని పేరు 'సిస్టమ్'. జ్యోతిక, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)కథేంటి?ఢిల్లీకి చెందిన సీనియర్ లాయర్ రవి రాజవంశీ(అశుతోష్ గోవారికర్) కూతురు నేహ(సోనాక్షి సిన్హా). తండ్రిలానే లాయర్ వృత్తిని ఎంచుకున్నప్పటికీ మరో సీనియర్ దగ్గర పనిచేస్తుంటుంది. కానీ ఒక్క కేసు కూడా గెలవలేకపోతూ ఉంటుంది. 10 కేసులు గెలిస్తేనే తన లా ఫార్మ్‌లో చేర్చుకుంటానని నేహాకి తండ్రి షరతు పెడతాడు. అనుకోని విధంగా నేహాకు.. కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సారిక(జ్యోతిక) పరిచయమవుతుంది. సారిక చేసిన చిన్న చిన్న సాయాల వల్ల నేహా వరసగా కేసుల్లో విజయం సాధిస్తుంది. ఒకానొక టైంలో తండ్రీ కూతురు ఒకే కేసులో పరస్పరం తలపడాల్సి వస్తుంది. అప్పుడు ఏమైంది? ఇంతకీ ఆ కేసు ఏంటి? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?పైపైన చూస్తే ఇదో రెగ్యులర్ కోర్ట్ రూమ్ డ్రామానే. అందరికీ నచ్చకపోవచ్చు కూడా. ఎందుకంటే అద్భుతమైన ట్విస్టులు ఇందులో ఏం లేవు. కానీ తరచి చూస్తే మన న్యాయవ్యవస్థ ఎలాంటి పరిస్థితుల్లో మగ్గుతుందో కనిపిస్తుంది. ధనం, అధికారం ఉన్నోడిదే న్యాయం అని అర్థమవుతుంది. గుండెల్లో ధైర్యం తప్పితే ఏమి లేని సామాన్యుడికి న్యాయం అందని ద్రాక్షలా ఎలా తయారైందనే విషయాన్ని పచ్చిగా చూపించారు.చట్టంలో న్యాయం చేయడానికి సెక్షన్లు ఉన్నట్లే తప్పించుకోవడానికి అంతకు మించిన లొసుగులు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటిని ఉపయోగించుకుని కొందరు నేరస్తులు తప్పించుకుంటున్నారు. డబ్బుకు ఆశపడే కొందరు లాయర్లు ఇలాంటి వాళ్లకు సాయం చేస్తున్నారు. తమకు న్యాయం జరగదనే ఆలోచనతో బాధితులు ఎలా మారుతున్నారు? నిజం ఎప్పటికైనా నిరూపితం అవుతుందనే నమ్మకాన్ని వాళ్లలో కలిగించేదెవరు? అనే అంశాల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.డబ్బు కోసమే వాదించే ఓ సీనియర్ లాయర్. తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని లాయర్‌గా స్థిరపడాలనే ఆయన కూతురు. కోర్టులో రోజూ పదుల సంఖ్యలో వాదప్రతివాదనలు వింటూ అద్భుతమైన జ్ఞానాన్ని పెంచుకునే ఓ స్టెనోగ్రాఫర్. ఈ మూడు పాత్రల చుట్టూ కోర్టు రూమ్‌లోనే కథంతా సాగుతుంది. ప్రారంభంలో స్టోరీ సెట్ అవ్వడానికి కాస్త టైమ్ పడుతుంది గానీ ఎప్పుడైతే నేహా,సారిక పాత్రలు కలుస్తాయో, తండ్రిని ఎదిరించి నేహా ఇల్లు వదిలి బయటకొచ్చేస్తుందో అప్పటినుంచి స్టోరీలో కదలిక వస్తుంది. విక్రమ్ బజాల్ కేసుకి సంబంధించిన ఆధారాలని సేకరించడం కోసం సాగే అన్వేషణ ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పటికీ చివరి అరగంట చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.నేహా పాత్రతో విలాసవంతమైన జీవితం ఎలా ఉంటుందో చూపించిన డైరెక్టర్.. సారిక పాత్రతో మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందో చక్కగా చూపించారు. కథ, కథనం పర్లేదనిపించినప్పటికీ జనాలకు మాత్రం కొన్ని ప్రశ్నలు అలానే మిగిలిపోతాయి. 'వ్యవస్థ' మనిషిని నడిపిస్తోందా? లేదంటే కొందరు 'పెద్దోళ్లు' వ్యవస్థని నడిపిస్తున్నారా అనే విషయాల్ని సామాన్యుడిగా అర్థమయ్యేలా చూపించారు.ఈ మూవీలో హీరో, విలన్ అంటూ ఎవరూ ఉండరు. దానికంటే పరిస్థితులు మనుషులని ఎలా మార్చేస్తాయి అనే విషయాన్ని చూపించడంలో దర్శకురాలు అశ్విన్ అయ్యర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. 'మన భుజాల మీద నుంచి భారం దింపేసుకున్నాం అనుకుంటాం కానీ భుజాలు మాత్రమే మారతాయి భారం కాదు', 'న్యాయస్థానానికి నేరం ఎవరు చేశారు అనేది అనవసరం ఎవరిపై ఆధారాలు ఉన్నాయి అనేదే ముఖ్యం' లాంటి డైలాగ్స్ ఈ సినిమాపై గౌరవాన్ని పెంచుతాయి. పూర్తయిన తర్వాత మన బుర్రలోనే తిరుగుతాయి.ఇందులోనే నేహా, సారిక పాత్రలతో ఫెమినిజంకు అసలైన అర్థం కూడా చూపించారు. భర్తకు కాలు చచ్చుబడి ఇంటికే పరిమితమైనప్పటికీ ఇంటిని చూసుకునే సారిక పాత్ర కావొచ్చు, తండ్రినే ఎదిరించి కేసు గెలిచే నేహా పాత్ర కావొచ్చు భలే అనిపిస్తాయి. ఆయా పాత్రల్లో జ్యోతిక, సోనాక్షి చాలా సహజంగా నటించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కడ ఎంత ఉండాలో అంతే వినిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేశారు. కుటుంబంతో కలిసి చూడొచ్చు. -చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్
ప్రతివారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా అలానే జెట్ లీ, కర, లీడర్, ఫేసెస్ అనే స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు కజిన్స్ అండ్ కల్యాణమ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్ లాంటి వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇప్పుడు ఇవలా ఉండగానే ఓ తెలుగు మూవీ చాన్నాళ్ల తర్వాత సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ముమైత్ ఖాన్ ఇప్పుడేం చేస్తోంది? పాక్‌తో ఈమెకు సంబంధమేంటి?)ధర్మ మహేశ్, ఐశ్వర్య శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'డ్రింకర్ సాయి'. 2024 డిసెంబరు చివరి వారంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఘోరమైన డిజాస్టర్ అయింది. టీజర్, ట్రైలర్ లాంటివి పర్లేదనిపించినప్పటికీ.. అసలు సంగతి తేలిపోయింది. ఇప్పుడీ చిత్రం దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు జీ5 ఓటీటీలోకి వచ్చేసింది.'డ్రింకర్ సాయి' విషయానికొస్తే.. తల్లిదండ్రులు కట్టించిన ఆస్పత్రి నుంచి వచ్చే డబ్బులతో సాయి(ధర్మ).. జల్సా చేస్తూ ముఖ్యంగా రోజంతా తాగుతూ ఓ ముగ్గురు ఫ్రెండ్స్‌ని వెనకేసుకుని ఎంజాయ్ చేస్తుంటాడు. తనకు యాక్సిడెంట్ చేసిన భాగి(ఐశ్వర్య శర్మ)ని ఇష్టపడి ఆమెని ప్రేమించడం మొదలుపెడతాడు. భాగికి సాయి అంటే ఏ మాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ ఎక్కడ వయలెంట్ అయిపోతాడో అనే భయంతో ప్రేమని భరిస్తూ ఉంటుంది. ఈ బలవంతపు ప్రేమగాథ ఎక్కడివరకు సాగింది? చివరకు భాగి.. సాయిని మార్చుకోగలిగిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
తెలుగు ఆడియెన్స్ కోసం మరో ఓటీటీ
18 ఏళ్లుగా ట్రావెల్ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విహారి.. ఇప్పుడు పూర్తిస్థాయి గ్లోబల్ ట్రావెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా మారుతోంది. తెలుగు మీడియాలో ట్రావెల్ షోలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విహారి.. ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, రుచులు, ప్రత్యేకతలను ప్రేక్షకులకు చేరవేసింది.(ఇదీ చదవండి: కన్నడలోకి బ్రహ్మానందం బయోగ్రఫీ)ఇప్పటికే టెలివిజన్ ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రయాణ కథనాలు అందించిన విహారి.. ఇప్పుడు ఓటీటీ రూపంలో మరింత విస్తృతంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు భాషలో ట్రావెల్‌కు మాత్రమే అంకితమైన తొలి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా విహారి ఓటీటీలో జూన్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విహారి ఓటీటీ టీమ్ ప్రత్యేక ప్రివ్యూ విడుదల చేసింది. ఇందులో 'బిగ్ బాస్' ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా 'విహారి ఓటీటీ' గ్లోబల్ విజన్ ఆవిష్కరించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)


