రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఏకంగా రూ.1790 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 రికార్డ్‌ను సైతం అధిగమించింది.
ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జూన్ 5న స్ట్రీమింగ్‌కు వచ్చేసిన దురంధర్-2 వ్యూస్ పరంగా అదరగొడుతోంది. స్ట్రీమింగ్‌కు వచ్చిన మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల మందికిపైగా వీక్షించారు. కేవలం వీకెండ్‌లోనే 5 కోట్ల మందిపైగా వీక్షించినట్లు ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ మూవీ ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేశ్ బేడీ, గౌరవ్ గేరా, డానిష్ పాండోర్ కీలక పాత్రలు పోషించారు.


