Politics
-
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. 14 మంది రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. -
కేశినేని నానిపై పరువు నష్టం దావా.. టీడీపీ ఎంపీ చిన్నికి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, విజయవాడ: కేశినేని నానిపై టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిరూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. చిన్ని పంపించిన లీగల్ నోటీస్‌పై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. వంద కోట్లు కాదు.. లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదంటూ కేశినేని నాని తేల్చి చెప్పారు.‘‘విజయవాడ ప్రజలు నాకు పది ఏళ్లు ఎంపీగా పనిచేసే అవకాశం కల్పించారు. నేను ప్రజలతో జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయతీతో ఉంటాను. సీఎంకు రాసిన లేఖలోని ప్రతీ మాటకు నేను కట్టుబడి ఉన్నా. నాకు పంపించింది కేవలం లీగల్ నోటీసు కాదు. విమర్శలను బెదిరించడానికి, మౌనంగా ఉంచడానికి.. నోరు మూయించడానికి చేస్తున్న ప్రయత్నం. కానీ నేను మౌనంగా ఉండను’’ అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు.ప్రభుత్వ కార్యాలయం ప్రజా పరిశీలనతో వస్తుంది. భూ లావాదేవీలు, పేర్ల దుర్వినియోగం, అక్రమాలపై ఆరోపణలు, ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానాలు ఆశిస్తాం. కానీ బెదిరింపులు కాదు. నేను ఈ నియోజకవర్గానికి గర్వంగా సేవ చేశాను. నేని దేనికోసం నిలబడ్డానో నాకు తెలుసు. నేను భయంతో కాదు.. వాస్తవాలతో స్పందిస్తాను.. రాజీ పడను. సత్యం బెదిరింపులకు భయపడదు.. నేను కూడా భయపడను’’ అంటూ కేశినేని నాని ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు I have just received a legal notice from Kesineni Sivanath (Chinni), the sitting MP from Vijayawada, demanding Rs. 100 Crores for defamation — all because I raised legitimate… pic.twitter.com/AJdH7CKkoz— Kesineni Nani (@kesineni_nani) April 25, 2025 -
‘పవన్.. మీరు సామాన్యులను, దళితులను పట్టించుకోరా?’
తాడేపల్లి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హెంమంత్రి అక్కడకు పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్నవారినే తప్పితే పేదలు, సామాన్యులు, దళితులను పట్టించుకోరా? అని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా? అని పేర్ని నాని మండిపడ్డారు. ఈరోజు’(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడారు పేర్ని నాని. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువఏపీలో కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని, గతంలో తమ ప్రభుత్వ హయాంలో అప్పులపై విషం ప్రచారం చేశారని, ఎల్లో మీడియా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నానాయాగి చేశారన్నారు. పెద్దపెద్ద మేధావులకే చంద్రబాబు ఆర్థిక పాఠాలు నేర్పురారన్నట్లుగా జాకీలతో లేపారని, ఇప్పుడు చంద్రబాబు రూ. లక్షా 3 వేల కోట్లు అప్పు నేరుగా తెచ్చారన్నారు.‘రూ.44 వేల కోట్లను కార్పొరేషన్ ల ద్వారా తెచ్చారు. ఒక లక్షా 47 వేల కోట్లకు పైనే అప్పు చేశారు. జగన్ చేసిన అప్పులతో పోర్టులు, సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్ల అభివృద్ధి ఇలా అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి. జగన్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉంది. కానీ చంద్రబాబు చేస్తున్న అప్పులు ఏం చేస్తున్నారో చెప్పటం లేదు. ఎన్నికలకు ముందు ఉత్తరకుమారుడిలా చంద్రబాబు మాటలు చెప్పారు. ఇప్పుడేమో సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలో అర్థం కావటం లేదంటున్నారు. చంద్రబాబు మాటలకు పవన్ కళ్యాణ్ చిడతలు కొడుతున్నారు. తాజాగా లక్షా 91 వేల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టేశారు.రూ.9 వేల కోట్ల అప్పుల కోసం తాకట్టు పెట్టారు. దీనిమీద ఎల్లోమీడియా ఎందుకు మాట్లాడటం లేదు?, ఆరు మాసాలకు చెందిన కిస్తీలను ముందుగానే బ్యాంకులో వేయాలనే నిబంధన పెట్టటం దుర్మార్గం.అప్పు ఇచ్చిన వారు రిజర్వ్ బ్యాంకులో ఉండే ప్రభుత్వ నిధులను నేరుగా తీసుకోవచ్చని కూడా నిబంధన పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? , ఇలాంటి వ్యవహారాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అసలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు? , ఇంతకంటే బరితెగింపు ఉంటుందా?, జగన్ కంటే ఎక్కువగా సంక్షేమం అందిస్తామనీ, అప్పు చేయకుండా సంపద సృష్టిస్తామని అప్పట్లో తెగ బిల్డప్పులు ఇచ్చారు.ఇప్పుడు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. రాష్ట్రం అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అమరావతి ఒక్కటేనా?, ఎన్నికలకు ముందు అద్దె ఆఫీసుల్లో ఉన్నవారు ఇప్పుడు ప్యాలెస్‌లు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కారుపైకి ఎక్కి ప్రయాణించారు. ఇప్పుడు జనానికి కనపడకుండా ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో తిరుగుతున్నారు. సొంత కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాలన్నా ప్రత్యేక విమానాలే. రాష్ట్ర ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తారా? , ఈ విమానాలు, హెలికాఫ్టర్లకు ఎవరి డబ్బు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రత్యేక విమానాలకు ఖర్చు పెడతారా?’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు. -
ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఎస్ఏ(NDSA) రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందించారు. రూ.లక్ష కోట్లతో నాసిరకం ప్రాజెక్ట్ నిర్మించారని.. కేవలం దోచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ ఆయన వ్యాఖ్యానించారు. బ్యారేజ్ ఎందుకూ పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తేల్చిందని.. వచ్చే కేబినెట్లో ఎన్డీఎస్ రిపోర్ట్‌పై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని.. చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. ఎన్డీఎస్ఏ నివేదిక చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలి. మీరే డిజైన్ చేశారు..మీరే కట్టారు. అబద్ధాలతో బీఆర్ఎస్ బతకాలనుకుంటుంది. నిర్మాణం చేసిన వాళ్లు.. చేయించిన వాళ్లు రైతులకు ద్రోహం చేశారు. బీఆర్ఎస్ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌పై అధ్యయనం చేస్తాం. కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకునేందుకు కట్టారు’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. -
బాలకృష్ణ ఇలాకాలో పెద్ద ప్లానే!
సాక్షి టాస్క్ ఫోర్స్: హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో హిందూపురంలో వచ్చే నెలలో అభినందన సభకు ఆయన పీఏలు ప్లాన్ చేశారు. ఇందుకోసం పట్టణంలోని ఎంజీఎం గ్రౌండ్‌ను ఎంపిక చేశారు. సుమారు 20 వేల మందితో సభను నిర్వహించాలని ప్రణాళిక చేసుకుంటున్నారు. ఇదే అదునుగా అందిని కాడికి దోచేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. భారీగా వసూళ్లకు ప్లాన్? బాలకృష్ణ అభినందన సభ కోసం అయ్యే ఖర్చుకు మించి భారీగా నగదు కూడబెట్టుకోవాలన్న ఆలోచనలో ఎమ్మెల్యే పీఏలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే పక్కా ప్లాన్ ప్రకారం అన్ని అడ్డదారుల్లోనూ డబ్బు వెనుకేసుకునేలా పథకం రచించారంటున్నారు. జన సమీకరణ బాధ్యత టీడీపీ నేతలకే అప్పజెప్పుతున్నారు.టీడీపీ నేతలకు ఆఫర్లు ఊరకనే ఖర్చు అంటే టీడీపీ నేతలు వెనుకడుగు వేస్తారేమో అన్న ఆలోచనతో పదవులు, కాంట్రాక్టులు ఆశ చూపెడుతున్నారు. భూఆక్రమణలకు కూడా అవకాశం కలి్పస్తున్నారు. ఇసుక, మట్టి దందాలకు అడ్డు లేకుండా చేస్తున్నారని సమాచారం. వేలంలో అమ్మినట్లు పదవులను అమ్మకానికి పెట్టారంటున్నారు. ఇందులో భాగంగానే మార్కెట్ యార్డు చైర్మెన్ పదవి టీడీపీ నేతకు ఇచ్చారన్న విమర్శలున్నాయి. మద్యం బెల్టు షాపులు నిర్వహించేందుకు కూడా సహకరిస్తున్నరని చెబుతున్నారు.ఆ నలుగురిపై భారం హిందూపురం పట్టణానికి చెందిన నలుగురు టీడీపీ ముఖ్య నేతలపై వసూళ్ల భారం వేశారని సమాచారం. వారు కూడా భారీ మొత్తంలో పీఏలకు నగదు అందించినట్లు తెలుస్తోంది. కొట్నూరు వద్ద మున్సిపాలిటీ స్థలంలో అక్రమంగా షెడ్ల నిర్మాణానికి పీఏలు ఒకే చెప్పడంతో అందుకోసం రూ. 20 లక్షలు సదరు టీడీపీ నేత ఎమ్మెల్యే కార్యాలయానికి చెల్లించినట్లు సమాచారం. అందుకే మున్సిపల్ అధికారులు ఎవరూ అటువైపు వెళ్లడం లేదు. పరిశ్రమల నుంచి వచ్చే నెలవారీ మొత్తం, మద్యం దుకాణాలు, కల్లు దుకాణాల నుంచి మామూళ్లు, మట్టి, ఇసుక ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నింట్లో సభ కోసం అంటూ అందినకాడికి దోచేయాలని పీఏలు ప్లాన్ చేసినట్లు తెలిసింది. మండల పరిషత్ నిధులకు ఎసరు!నియోజకవర్గంలోని మండల పరిషత్ నిధులను ఎమ్మెల్యే పీఏలు భారీగా వాడుకున్నట్లుగా తెలుస్తోంది. చేయని పనులకు లక్షల రూపాయలు ఒక్కో మండలం నుంచి డ్రా చేసినట్లు తెలిసింది. ఈ నగదు అంతా ఎమ్మెల్యే పీఏల ఖాతాలకు అక్రమంగా మళ్లించారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పంచాయతీరాజ్ పనుల్లో కూడా చేసిన పనులకే లక్షలాది రూపాయలు బిల్లులు మంజూరు చేయించుకొని సభకు మళ్లిస్తున్నట్లు సమాచారం. ఎంపీపీలు అందరూ వైఎస్సార్సీపీకి సంబంధించిన వారే అయినా అభివృద్ధి పనులంటూ వారితో నిధులకు ఆమోదం తీసుకోవడం, ఆ నిధులను మళ్లించడం వంటివి గుట్టుగా కానిచ్చేశారని చెబుతున్నారు.ఖర్చు తక్కువ.. వసూళ్లు ఎక్కువబాలకృష్ణ అభినందన సభ కోసం 20 వేల మందిని జన సమీకరణ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే దృష్టిలో అంతమంది జనాభా వస్తున్నారని చెప్తే ఖర్చులు కూడా భారీగా ఉంటాయని ఆయన దృష్టిని మరల్చే యత్నం చేస్తున్నారని తెలిసింది. ఎంజీఎం గ్రౌండ్ కెపాసిటీ 6 నుంచి 7 వేల మందికి మిందని... మరి ఎలా 20 వేల మంది సభకు ఎలా తరలిస్తారన్న విషయంలో ఆ పార్టీ సభ్యుల మధ్యే చర్చ సాగుతోంది. 20 వేల మందితో సభ అంటూ ఖర్చు భారీగా ఉంటుందని జేబులు నింపుకునేందుకు ఎత్తువేశారని అంటున్నారు.వసూళ్ల సొమ్మంతా చిలకలూరిపేటకేనా?బాలకృష్ణ ఇలాకాలో పీఏల వసూళ్లు తారాస్థాయికి చేరాయి. ముగ్గురు పీఏల్లో ఒకరు వసూళ్ల సొమ్మంతా చిలకలూరిపేటకు చేరుస్తున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా అవినీతికి శ్రీకారం చుట్టారని అంటున్నారు. సహజ వనరులు, ప్రజల సొమ్మును స్థానిక సమస్యలకు వాడకకుండా పీఏలు సొంత జేబులు నింపుకోవడానికే వాడుతున్నారన్న విమర్శలున్నాయి. -
ప్రభుత్వంపై చంద్రబాబు పట్టు పోయిందా?
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్, చంద్రబాబు ప్రభుత్వాల మధ్య తేడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ హయాంలో అడ్డగోలుగా కేసులు పెట్టడం, అరెస్ట్‌లు చేసిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఆధారాలుంటే మాత్రం పూర్తిస్థాయి విచారణ తరువాత అరెస్టులు జరిగాయి. అయినా కూడా అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం.. అక్రమ కేసులంటూ గగ్గోలు పెట్టేది. దబాయింపులకు దిగేవారు. దుష్ప్రచారానికి తెర లేపారు.టీడీపీకి న్యాయవ్యవస్థపై ఉన్న పట్టు కూడా ఇందుకు ఉపకరించిందని విమర్శకుల అంచనా. మరి ఇప్పుడు? టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంలో అంతా వారి ఇష్టారాజ్యమే. గిట్టనివారిపై మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై ఎడాపెడా తోచిన కేసులు పెట్టేస్తున్నారు. అదేమంటే.. రెడ్‌బుక్ ఎఫెక్ట్ అంటున్నారు. ఈ పైశాచికత్వం ఎంతదాకా వెళ్లిందంటే.. పోలీసు అధికారులూ బలయ్యేంత స్థాయికి!. సీనియర్ పోలీస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను ఆధారాలతోపాటు పట్టుకోవడమే ఈయన చేసిన తప్పు. ఆ కక్షతోనే టీడీపీ తప్పుడు కేసులో అరెస్టుకు దిగిందని విశ్లేషకుల అంచనా.పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ, వైఎస్సార్సీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని, వారికి సలహాలు ఇస్తున్నారని ఈనాడులో ఒక కథనం వచ్చిన కొంత కాలానికే ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. స్వతంత్రంగా వ్యవహరిస్తున్నామన్న ముసుగులో ఒక వర్గానికి కొమ్ము కాస్తుండే మీడియా, రాజకీయ పార్టీ ఏకమై పాలన చేస్తే ఎంత ప్రమాదకరమో ఇదే ఉదాహరణ. ఫలానా వారిని ఇంకా అరెస్టు ఎందుకు చేయలేదంటూ.. సీఐడీ విచారణకు హాజరైన ఒక వైఎస్సార్సీపీ నేతను రెండు గంటలే ప్రశ్నించారని.. ఎల్లో మీడియా వార్తలు ఇస్తోందంటే.. పాలకపక్షానికి వీరికి మధ్య ఉన్న లోపాయకారి అవగాహన ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది.మోసాలు చేస్తుందని స్పష్టంగా తెలిసిన ఒక నటి చేసిన ఆరోపణల ఆధారంగా సీనియర్ పోలీస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు. ఇది ప్రభుత్వానికి అప్రతిష్ట అని, ఐపీఎస్ వర్గాల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అధికార వర్గాలు భావిస్తున్నా చంద్రబాబు సర్కార్ మొండిగా ముందుకు వెళ్లింది. ఈ కేసులో ఇప్పటికే మరో ఇద్దరు పోలీసు అధికారులు ముందస్తు బెయిల్ పొందగా ఆంజనేయులు మాత్రం ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించ లేదు. తనను అరెస్టు చేస్తారని తెలిసినా ఆయన అందుకు సిద్దపడ్డారంటేనే తాను తప్పు చేయలేదన్న విశ్వాసం అన్నమాట. తాను టీడీపీకి లొంగిపోనని, జైలుకైనా వెళతానని ఆంజనేయులు మాదిరి ధైర్యంగా నిలబడ్డ అధికారి ఇటీవలి కాలంలో ఇంకొకరు లేరు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని ఏపీ ప్రభుత్వం ఆయనను జైలుకు పంపించింది. మోసకారి నటి కేసులో ఇప్పటికే ఒకరు అరెస్టు అవ్వడం, బెయిల్‌పై బయటకు రావడం కూడా జరిగింది.డీజీపీ స్థాయి అధికారిని అరెస్టు చేసిన టైమింగ్ కూడా గమనించదగినదే. ఒక వైపు అమరావతిలో 44 వేల ఎకరాలు అదనంగా తీసుకోవాలన్న కూటమి ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. విశాఖలో విలువైన భూములను పరిశ్రమల పేరుతో రూపాయికి, అర్ధ రూపాయికి కట్టబెట్టడంపై పలు విమర్శలు ఉన్నాయి. రెండు నెలల క్రితం రిజిస్టర్ అయిన ఉర్సా అనే కంపెనీకి ఏకంగా మూడు వేల కోట్ల విలువైన భూమి కేటాయించాలని తలపెట్టడం వివాదంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు యూరప్ నుంచి తిరిగి రాగానే అరెస్టులు జరగడం కూడా గమనార్హం. ప్రభుత్వం పరపతి కోల్పోతున్నప్పుడు ఇలాంటి డైవర్షన్ వ్యూహాలు అమలు చేయడంలో చంద్రబాబు దిట్ట. ఒకవైపు ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ రెడ్ బుక్ ప్రయోగం, మరోవైపు చంద్రబాబు కుట్రలతో రాష్ట్రానికి నాశనం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న ఘటన జరిగితే చాలు.. చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ఆయనను సైకో అని, మరొకటనీ, నీచమైన రీతిలో విమర్శలు చేసేవారు. ఇప్పుడు నమోదు అవుతున్న కేసులు, అరెస్టులు చూస్తే నైతిక పతనం ఎన్ని విధాలుగా ఉండవచ్చో ప్రపంచానికి చాటి చెబుతున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనలకు బాధ్యులుగా జగన్ కూడా అప్పట్లో పలువురు పోలీసు అధికారులపై కేసులు పెట్టేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆ పని చేయలేదు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసిన వ్యవహారంలో ఒక పోలీసు ఉన్నతాధికారి పాత్రపై పలు అభియోగాలు ఉన్నాయి. రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు గాను ఆయనపై కేసు పెట్టి ఉండవచ్చు కదా. కానీ, ఆ పని జగన్ ప్రభుత్వం చేయలేదు. ఇతర ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేస్తేనే చాలా పెద్ద ఘోరం జరిగినట్లు ప్రచారం చేశారు. ఆయన ఏకంగా టీడీపీ కొమ్ము కాయడమే కాకుండా, రిటైరయ్యాక కుల సభలలో పాల్గొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.సోషల్ మీడియాలో జగన్ కుటుంబంపై, పలువురు వైఎస్సార్సీపీ నేతలపై అరాచకపు పోస్టింగులు పెట్టినా టీడీపీ వారికి ఏమీ కాలేదు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ వారిపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవచ్చు. కానీ, కేవలం వైఎస్సార్సీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపైనే కేసులు ఎందుకు వస్తున్నాయంటే అదే రెడ్ బుక్ పాలన అని అంటున్నారు. చంద్రబాబుతో సహా కొందరు టీడీపీ ప్రముఖులపై గత ప్రభుత్వ టైమ్‌లో పై కేసులు పెట్టలేదా? అరెస్టులు చేయలేదా అని కొందరు ప్రశ్నించవచ్చు. చంద్రబాబుపై కేసు పెట్టడానికి ముందు పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఉదాహరణకు స్కిల్ స్కామ్ కేసులో ఈడీ మొదట కేసు పెట్టింది. ఆ తర్వాత ఏపీ సీఐడీ కేసు తీసుకుంది. టీడీపీ ఆఫీస్ బ్యాంక్ ఖాతాలో కూడా అవినీతి డబ్బు వచ్చిందని సీఐడీ ఆధార సహితంగా ఆరోపించింది. దానికి ఇంతవరకు టీడీపీ కౌంటర్ చేయలేకపోయింది.మరికొన్ని కేసులు అయితే సీబీఐ దర్యాప్తు చేయడానికి అభ్యంతరం లేదని గత ప్రభుత్వం తెలిపినా, మేనేజ్ చేశారో, లేక మరే కారణమో తెలియదు కాని కేంద్రం అందుకు సిద్దపడలేదు. ఇప్పుడు మాత్రం ఏపీ ప్రభుత్వం మనోభావాల పేరుతో, మరో పేరుతో, ఒక తరహా ఫిర్యాదును అనేక పోలీస్ స్టేషన్లలో పెట్టడం, నిందితులను వందల కిలోమీటర్లు తిప్పి వారిని అనారోగ్యం పాలు చేయడం వంటి ఘటనలు గమనిస్తే ఈ ప్రభుత్వం మానవత్వంతో వ్యవహారించడం లేదన్న భావన కలుగుతుంది. మరో వైపు కూటమి ఎమ్మెల్యేలు మద్యం, ఇసుక, భూదందాలు, పరిశ్రమల యజమానులను బెదిరించడం వంటి పలు సంఘటనలు జరుగుతున్నా పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదు.మోసకారి నటి కేసు కారణంగా ఏపీకి వచ్చే అవకాశం ఉన్న పరిశ్రమలు కూడా రాకుండా పోతున్నాయని చెబుతున్నా, ఏమాత్రం లెక్క పెట్టకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుండడం దురదృష్టకరం. చంద్రబాబు ఎంతో అనుభవజ్ఞుడు. కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని ఆయనకు తెలుసు. వచ్చే ఎన్నికలలో కూటమి ఓడిపోతే ఎదురయ్యే పరిణామాలు తెలియనంత అమాయకుడు ఏమీ కాదు. అయినా సర్కార్‌ను ఇంత అరాచకంగా నడుపుతున్నారంటే ప్రభుత్వం చంద్రబాబు కంట్రోల్లో లేదేమో అనిపిస్తుంది!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Hyderabad MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ విజయం అందుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్ హాసన్‌కు 63 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు కేవలం 25 ఓట్లు వచ్చాయి. దీంతో, ఎంఐఎం అభ్యర్థి 38 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకున్న 25 ఓట్లు మాత్రమే పొందిన బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. ఇక, ఎంఐఎంకి చెందిన 49, కాంగ్రెస్‌కి చెందిన 14 ఓట్లు కలిపి 63 ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి వచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్‌పై బీజేపీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎవరూ ఓటు వేయలేదు. దీంతో, ఓటమి ఎదురైంది. ఇక, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 112 ఓట్లకు గాను పోలైన 88 ఓట్లు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియా సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు. కాగా, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బీజేపీ మాత్రం క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకునప్పటికీ అలాంటి ఏమీ జరగకపోవడంతో ఓటమిని చవిచూసింది. మరోవైపు, ఎన్నికల ఫలితాలపై బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ను ఎలక్షన్ కమిషన్ ఎందుకు రద్దు చేయవద్దు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఓట్లు వేయవద్దని అని చెప్తారు.. మరి మీరు ఏ విధంగా ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు సహకరించింది. ఎంఐఎం చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పని చేస్తుంది. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే అనేది అర్థమవుతుంది. హైదరాబాద్, తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి.ఎన్నికల్లో సహకరించిన బీజేపీ నాయకత్వానికి, అందరికీ ధన్యవాదాలు. నాకు ఓటేసిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. వారు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న వారిని ఓటింగ్‌కు రానివ్వకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. సంఖ్య పరంగా మేము ఓడినా.. నైతికంగా నేను గెలిచాను. ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్ఎస్ తొత్తులుగా మారాయి. ఎంఐఎంకు కాంగ్రెస్ డైరెక్ట్‌గా మద్దతు ఇస్తే.. బీఆర్ఎస్ ఓటింగ్‌కు రాకుండా దోహదపడింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా.. కౌంటింగ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు జీహెచ్ఎంసీ వద్ద మోహరించాయి. -
తాకట్టులో ఖజానా: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, అమరావతి: దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన విధానాలకు తెగబడిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ నుంచి రూ.9 వేల కోట్ల అప్పులను బాండ్ల రూపంలో సేకరిస్తున్న విధానంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా బాండ్ల కొనుగోలుదారులకు మళ్లించేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఇది దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్ధ పాలన, అస్తవ్యస్త ఆర్థిక విధానాలకు ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్యకు అనుమతించిన అధికారులు భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. బుగ్గన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపై అప్పులకు స్కీంకూటమి ప్రభుత్వం కొత్తగా బడ్జెట్ వెలుపల భారీ అప్పులు చేయడం ప్రారంభించింది. సంపద సృష్టి జరగడం లేదు. ఏపీఎండీసీ ద్వారా రూ.9 వేల కోట్లకు బాండ్లు విడుదల చేయడం ద్వారా కొత్తగా అప్పులు చేయాలని స్కీం ప్రారంభించారు. ఏపీఎండీసీ ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపై అప్పులు చేయాలనేదే ఈ స్కీం. బ్యాంకుల నుంచి అప్పు పుట్టకపోవడంతో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ (ఎన్సీడీ) బాండ్స్ మీద అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీఎండీసీ ఎక్కువగా ఔట్ సోర్సింగ్ ద్వారానే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కాబట్టి ఆ సంస్థకు మూలధన వ్యయం పెద్దఎత్తున అవసరం లేదు. కానీ, రూ.9 వేల కోట్లు కావాలని బాండ్లు జారీ చేస్తున్నారు.రాష్ట్ర ఆర్థిక స్థితి బాగోలేదు..ఇండియా రేటింగ్స్ సంస్థ ప్రభుత్వ ఆదాయం గతేడాది అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. 1.3 శాతమే వృద్ధి కనిపిస్తోందని, ద్రవ్యలోటు స్థూల ఉత్పత్తిలో 4.2 శాతం ఉండాల్సి ఉంటే 4.6 శాతానికి పెరిగిందని చెప్పింది. అయినా ‘సీఈ’ రేటింగ్ ఇచ్చారు. ఎందుకంటే.. డిబెంచర్ కొనుగోలుదార్లకు డీఎస్ఆర్ఏ ఖాతాలో నిల్వ లేకపోతే నేరుగా ఆర్బీఐ నుంచి నిధులు జమయ్యేందుకు అంగీకరించడం వల్లే. ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఏపీ ఎండీసీ గత వార్షిక నివేదికలో 9 నెలలకు రెవెన్యూ రూ.910 కోట్లుగా ఉంది. 12 నెలలకు చూస్తే సుమారు రూ.1200 కోట్లు వస్తుంది. కానీ వీరు చేస్తున్న అప్పులు, డీఎస్ఆర్ఏ ఖాతాలో ముందుగా పెట్టే 6 నెలల నిల్వలతో కలిపి చూస్తే రూ.10 వేల కోట్లు. వీరి ఆదాయంతో పోలిస్తే చేస్తున్న అప్పులు ఎనిమిది రెట్లు ఎక్కువ. దీనిని ఏ బ్యాంక్ కూడా అంగీకరించదు.గతంలో ఎక్కడా లేని విధానం..ఇటువంటి నిబంధనలు, వెసులుబాట్లు చరిత్రలో ఎప్పుడూ లేవు. ఖజానాలో ఏ కారణంతో అయినా నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు బాండ్లు కొనుగోలు చేసినవారికి వెళ్లిపోతాయి. బాండ్లు కొన్నవారికి చెల్లింపుల కోసం ముందుగానే నిర్దేశించిన ఖాతాల్లో మొదటి నెలలోనే 30 శాతం.. అంటే మూడో భాగం కచ్చితంగా ఉంచాలి. ఇలా ప్రతి నెల ఉంచాలి. ఇదికాకుండా డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్(డీఎస్ఆర్ఏ) ఖాతాలో 6 నెలలకు చెల్లించాల్సిన మొత్తాలను కూడా నిల్వగా చూపుతూ రావాలి. ఈ నిధులు తగ్గిపోతే ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు నేరుగా బాండ్లు కొన్నవారికి వెళ్లిపోతాయి. ⇒ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోతే.. గనులను తాకట్టులో ఉంచుకున్న ప్రైవేటు వ్యక్తులు నేరుగా ఖజానాలోకి వెళ్లి డబ్బు తీసుకోవచ్చు. నాడు బెవరేజెస్ కార్పొరేషన్‌పై అప్పులు తెస్తే భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టుపెట్టారంటూ ఆరోపణలు చేశారు. ఇవాళ గనులను తాకట్టుపెట్టడమే కాక... ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలన్నింటినీ తాకట్టు పెట్టారు. ఏపీఎండీసీ రెవెన్యూ అంతా ఒకే ఖాతాలోకి వచ్చేలా నిబంధన పెట్టారు. ఆ ఖాతాను సంపూర్ణంగా అప్పుల కోసం తాకట్టు పెట్టారు. ఏపీఎండీసీకి వచ్చే ఒక్క రూపాయి అయినా ఇతర పనులకు వాడుకునే అవకాశం లేదు.మిసిలేనియస్ జనరల్ హెడ్‌కు ఇంత భారీ కేటాయింపులా?2025–26 రాష్ట్ర బడ్జెట్లో మిసిలేనియస్ జనరల్ హెడ్–0075 కింద ప్రభుత్వం రూ.7,916 కోట్లు చూపించింది. ఇవి ప్రత్యేకంగా ఏ డిపార్ట్మెంట్కు కేటాయించని ఖర్చులు. చిన్న చిన్న వ్యయాలకు ఈ నిధులను వాడతారు. ఈ హెడ్ కింద 2016 –17లో రూ.131 కోట్లు, 2017 –18లో రూ.307 కోట్లు, 2018 –19లో 135 కోట్లుగా ఉండేది. 2023–24లో రూ.153 కోట్లు, 2024–25లో రూ.226 కోట్లు చూపించారు. కానీ, మొదటిసారి ఏపీ చరిత్రలో ఈ హెడ్ కింద 2025–26కి గానూ రూ.7,916 కోట్లుగా చూపించారు. అంటే, పక్కా ప్లాన్ ప్రకారం ఇంత పెద్ద మొత్తాన్ని ఆ హెడ్లో చూపించి కూటమి ప్రభుత్వ రెవెన్యూ ఖర్చులకు ఇష్టం వచ్చినట్లు వాడేందుకు సిద్ధమయ్యారు. ⇒ గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, ఇలాగైతే చైనా వంటి దేశాల్లో అధికారులను ఉరి తీస్తారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న పనులకు అధికారులకు ఎలాంటి శిక్ష పడుతుందో ఆలోచించుకోవాలి. ఏపీఎండీసీని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా వారికి తాకట్టు పెడుతున్నారు. ఇదేనా సంపద సృష్టి అంటే?తాజా అప్పులూ రాష్ట్ర అప్పుల పరిమితి కిందకేఎప్పుడైతే ఆర్బీఐకి డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇస్తారో అది రాష్ట్ర అప్పుల పరిమితి కిందకు వస్తుంది. రాష్ట్ర అప్పుల పరిమితి కింద రాష్ట్రం చేసే అప్పులకు 7 శాతం కన్నా తక్కువ వడ్డీ పడుతుంది. కానీ ప్రభుత్వం తాజాగా చేయబోయే అప్పు కూడా దీని కిందే వస్తుంది, కానీ దాదాపు 10 శాతం వడ్డీ పడుతుంది. దీనికి బ్రోకరేజీ అదనం. ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు డైరెక్ట్‌గా తీసుకుని పోయేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇది రాజ్యాంగం ఉల్లంఘన. రాజ్యాంగంలోని 293(1), 293(3), 203, 204 ఆర్టికల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. అధికారులు దీనిని గుర్తించాలి.ఇదేనా సంపద సృష్టి అంటే?రాష్ట్ర అప్పులపై కూటమి పార్టీలు అబద్ధాలు చెప్పాయి. మొదట్లో రూ.14 లక్షల కోట్ల అప్పులన్నారు. తరువాత రోజుకో రకంగా అప్పులపై అంకెలను మారుస్తూ మట్కా లెక్కల స్థాయికి తెచ్చారు. వైఎస్సార్సీపీ ఐదేళ్లలో చేసిన అప్పులు రూ.3,32,500 కోట్లే. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.1.40 లక్షల కోట్లు అప్పులు చేశారు. 11 నెలలకు రూ.90 వేల కోట్ల మేరకు ఆర్బీఐ ద్వారా అప్పు చేసింది. మార్చి 2025లో రూ.8 వేల కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో మరో రూ.5 వేల కోట్ల అప్పు చేశారు. అమరావతి అప్పులు, బాండ్లు, మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయిస్ అప్పులు తదితర అన్నీ కలిపితే రూ.1,47,655 కోట్లు అప్పులు చేశారు. ఈ సొమ్ము ఎక్కడకు వెళ్ళింది? మా ప్రభుత్వ హయాంలో ఏటా పేదలకు సంక్షేమ పథకాలను అందించాం. ఈ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. మరి అప్పులు చేసిన సొమ్ములు ఎక్కడకు పోతున్నాయి. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి ఉద్యోగుల సొమ్ము రూ.76,516 కోట్లు వాడుకుంది. -
కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా: దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: తాను ఏది మాట్లాడినా సరే.. అది సంచలనమే అవుతుందని చెప్పుకునే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా.. ఆయనను చూడటానికి జనం ఆశగా ఉన్నారంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.‘‘కేసీఆర్ సభకు జనం భారీగా రావొచ్చు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో స్మితా సబర్వాల్ ట్వీట్లో తప్పేం లేదు. ఆమె వాస్తవాన్నే ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసినట్టు లేదు. ఇదే విషయంలో సీఎస్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. భూమల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం పునరాలోచన చేస్తుంది.’’ అంటూ ఆయన పేర్కొన్నారు.కాగా, ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభ కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రలో నిలిచిపోయే విధంగా జరపడానికి ఆ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ నెల 27న నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక సభకు ఉద్యమాల గడ్డ ఓరుగల్లు వేదిక కావడం గర్వంగా ఉందని కేటీఆర్ అన్నారు.రజతోత్సవ సభ కోసం ఎల్కతుర్తి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా 1,250 ఎకరాల్లో సభ, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 40 నుంచి 50 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభాస్థలికి నలుమూలలా పార్కింగ్ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చే వారికి 260 ఎకరాల్లో గోపాల్పూర్ రోడ్డువైపు, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే వావానాల కోసం ఎల్కతుర్తి సమీపంలో హుజూరాబాద్ మార్గంలో మరో 250 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశాం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల వారికి ఎల్కతుర్తికి ఆర కిలోమీటర్ దూరంలోనే 600 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు. -
తెగువ చూపారు.. వారందరికీ సెల్యూట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని.. వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ముందుగా జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపంగా వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు. అనంతరం సమావేశం ప్రారంభించారు. దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలనలో..‘ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు. దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలన జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రజావ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన.. మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త నిలదీస్తాడని చెప్పారు. ‘‘బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ప్రజలు ఓడించారు కాబట్టే.. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్లిపోయాడు. అక్కడ బీసీలు ఉన్నారు.. వారు ఆర్థికంగా ఇతరత్రా బలంగా ఉండరు కాబట్టి, వారిని తొక్కితొక్కిపెట్టవచ్చని చంద్రబాబు కుప్పంలో పాగావేశారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.జై జగన్.. అన్నారని కేసులు పెట్టారు..చంద్రగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో గెలిచాక జై జగన్, జై వైఎస్సార్సీపీ అన్నారని కేసులు పెట్టారు. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు తిరిగే ధైర్యంలేదు. తిరిగితే ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడాన్ని నరకంగా మార్చేశారు. విద్యా, వైద్య రంగాలు దారుణంగా తయారయ్యాయి. చంద్రబాబుగారు అధికారంలో వచ్చాక 4 లక్షలు పెన్షన్లు తీసేశారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ....ప్రతి బాటిల్‌పైన రూ.20ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వైఎస్సార్సీపీలో కన్నా ఇసుక రేటు రెండింతలు పెరిగింది. ఉచితం అని చెప్పి.. దోచుకుంటున్నారు. పైనుంచి కిందిదాకా ముడుపులు చెల్లిస్తేనే మైనింగ్ అయినా, పరిశ్రమ అయినా నడిచేది. అవినీతినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ టాపిక్స్ ఎంచుకుంటున్నారు. విశాఖపట్నంలో ఊరూపేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు రూ.3,000 కోట్లు ఖరీదు చేసే భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో రెషిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడుతుంది. అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు హయాంలో ఉర్సా లాంటి ఊరూ పేరు కంపెనీకి రూ.3,000 కోట్ల డబ్బులు దోచిపెడుతున్నారు. విశాఖఫట్నంలో లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు రూ.1500- 2000 వేల కోట్లు ఖరీదు చేసే భూములను.. టెండర్లు లేకుండా కట్టబెట్టారు.జగన్ చేయగలిగాడు.. బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’..లెఫ్ట్, రైట్, సెంటర్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లోనూ దోపిడీ. 2018లో ఐదేళ్ల కిందట చంద్రబాబు హయాంలో టెండర్లు పిలిచినప్పుడు పనుల విలువ రూ. రూ.36,000 కోట్లు. అప్పట్లో ఇప్పటికన్నా స్టీలు, సిమెంట్లు రేట్లు ఎక్కువ. అయినా కూడా ఆ రూ.36,000 కోట్ల విలువ ఈరోజు రూ.78,000 కోట్లకు పెంచేశారు. టెండర్లు రింగ్ ఫార్మ్ చేసి వాళ్ల కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటున్నారు. మొబలైజేషన్ అడ్వాన్వులు కొత్తగా ఇవ్వడం మొదలుపెట్టాడు. 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం, అందులో 8శాతం కమీషన్లుగా తీసుకోవడం.. ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడకు పోతున్నాయో తెలియడంలేదు. గతంలో ఎందుకు జగన్ చేయగలిగాడు.. చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.బాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే డబ్బులు‘‘జగన్ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే పోతున్నాయి. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో మొత్తుకుని చెప్పాను. చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రతిరోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికార్ల అరెస్టులు అంటూ డైవర్షన్లుఇలాంటి పాలనే రాష్ట్రంలో జరుగుతోంది....కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా పెంచారు.. వీటి గురించి అడిగితే.. ఆయన చేసిన లిక్కర్ స్కాంను మరలా ఇంకొకరు మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సెన్షేషన్ క్రియేట్ చేసి దాన్నుంచి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తుందని గ్లాడియేటర్స్‌ను పెట్టిన గేమ్స్ ఆడించేవాళ్లు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను పెట్టి.. చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటని ప్రజలు చూసేలా చేసి వారిని మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు ఆ ఆటలు గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతుంది. ఎంతో మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయకుండా, మోసం చేసిన చంద్రబాబు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు..ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు.ఆ రోజు వస్తుంది. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నాను. ఈ రోజు కార్యకర్త ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నాను’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
ఎన్డీయేకి దగ్గరయ్యేందుకు కేటీఆర్ ప్రయత్నాలు: అద్దంకి దయాకర్
సాక్షి, హైదరాబాద్: ఎన్డీయే కూటమికి దగ్గరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆసక్తికర కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. చంద్రబాబు మేము వేరువేరు కాదని కేటీఆర్ అంటున్నాడు. చంద్రబాబుకి కేటీఆర్ వల వేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ డైరెక్షన్లోనే కేటీఆర్ చంద్రబాబు గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి కేటీఆర్ వల వేస్తున్నారు. ఎన్డీయే కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలి. కనీసం కేసీఆర్ కుటుంబం నుండి కాకుండా వేరే వెలమనైనా బీఆర్ఎస్ అధ్యక్షుడిని చేయగలరా?. కేటీఆర్‌కి దమ్ముంటే పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలి.అధ్యక్ష పదవి చేపట్టిన రెండు సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అధికారంలోకి తెచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?. బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు?. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో, నాన్ వర్కింగ్ ప్రెసిడెంటో ఆయనకే తెలియాలి. 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకా? టీఆర్ఎస్ పార్టీకా?. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టి రెండేళ్లు అయింది. జనతా గ్యారేజ్ సినిమాలో ఓనర్ కొడుకు విలన్. బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అయితే పార్టీ ఓనర్ కొడుకు కేటీఆర్ విలనా?.కమలం పువ్వు కాడికి గులాబీ పువ్వును అంటగడుతున్నారు. చంద్రబాబు, మేము వేరువేరు కాదని కేటీఆర్ అంటున్నాడు. చంద్రబాబుకి మాకు సారూప్యత ఉందని కేటీఆర్ చెబుతున్నారు. హెచ్‌సీయూ విషయంలో బీఆర్ఎస్ హ్యాండిల్స్ నుండి ఫోటోలు ఎందుకు డిలీట్ చేస్తున్నారో చెప్పాలి’ అంటూ కామెంట్స్ చేశారు. -
వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు ప్రలోభాలు.. ప్రత్యేక విమానాలేంటి?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాజకీయాల్లో ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదని హితవు పలికారు. కూటమి నేతలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మెజార్టీ కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారని అన్నారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా విశాఖలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా బొత్స మాట్లాడుతూ.. కశ్మీర్లో తీవ్రవాదుల కాల్పులు కారణంగా 26 మంది చనిపోవడం బాధాకరం. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు చనిపోవడం దురదృష్టకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించారు. నేనెప్పుడూ ఇటువంటి రాజకీయాలను చూడలేదు. రాజకీయాల్లో ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. 11 నెలల మేయర్ పదవి కోసం అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ 11 నెలల కాలంలో ఏం చేస్తారో ప్రజలకు చెబుదాం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా మెజార్టీ కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారు. వారందరినీ అభినందిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బాబు ష్యూరిటీ-గ్యారంటీ ఏమైంది.. సంపద సృష్టి ఎక్కడ?: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నీతులు చెబుతున్నారా? అంటూ కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మా ప్రభుత్వం కంటే ఎక్కువగా కూటమి సర్కార్ అప్పు చేసిందని చెప్పుకొచ్చారు. గత వైఎస్సార్సీపీ హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.మాజీ మంత్రి బుగ్గన తాజాగా హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ..‘మా పరిపానలో సామాన్య మానవుడి శ్రేయస్సు గురించి ఆలోచించాం. సంపద సృష్టిస్తామని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చింది. అమ్మ ఒడి, విద్యాదీవెన, రైతు భరోసాకు నిధులేవి?. సున్నా వడ్డీ రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, మత్సకార భరోసా ఎందుకు ఇవ్వడం లేదు?. విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడం లేదు. ఏపీఎండీసీకి రూ.9 వేల కోట్లు ఎందుకు కేటాయించారు?రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కాకుండా నీతులు చెబుతున్నారా?. ఇప్పుడు సంపద సృష్టి ఏమైంది? అప్పు పరిస్థితి ఏంటి?. వైఎస్సార్సీపీ హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు. మా ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వమే ఎక్కువగా అప్పు చేసింది. ఆరోగ్యశ్రీ నిధులు చెల్లించకపోవడంతో ప్రజా ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు. బాబు ష్యూరిటీ-బాబు గ్యారంటీ అన్నారు.. ఇప్పుడు ఏమైంది?’ అని ప్రశ్నించారు. -
బాబూ.. అప్పనంగా అప్పగించేస్తారా?
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని నిశ్చేష్టులను చేస్తున్నాయి. అపర కుబేరులకు మరింత సంపద సృష్టించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందా? అన్న అనుమానం వస్తోంది. దేశంలోనే అత్యంత ధనవంతమైన కంపెనీలలో ఒకటిగా పేరొందిన టాటా కంపెనీకి చెందిన టీసీఎస్‌కు ఏపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఎకరం 99 పైసలకే అమ్మాలని నిర్ణయిస్తుందా? పైగా అది ఒక డీల్ అని చెబుతారా? వారి సొంత ఆస్తిని కూడా ఇలాగే పప్పు బెల్లాలకు పంచిపెడతారా?. ప్రజల ఉమ్మడి ఆస్తులకు జవాబుదారిగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు, వ్యవహరించడం సమర్దనీయమా?.విశాఖపట్నంలో ఐటీ కంపెనీ టీసీఎస్‌కు 21.6 ఎకరాల భూమి దాదాపు ఉచితంగా అందచేసేందుకు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. టీసీఎస్‌కు భూమి ఇలా ఇవ్వడం ఏమిటని అంతా ఆశ్చర్యపడుతూంటే రెండు నెలల క్రితం మాత్రమే నమోదైన ఉర్సా అనే కంపెనీకి ఇదే తరహాలో 60 ఎకరాలు ఇచ్చే ప్రతిపాదన నిశ్చేష్టులను చేస్తోంది. విశాఖకు లేదా, ఏపీలో మరోచోటకైనా ఏవైనా పరిశ్రమలు వస్తుంటే స్వాగతిస్తారు. అయితే, ఆ కంపెనీల వల్ల ఏపీకి ఉపయోగం ఉండాలి. అదే టైమ్‌లో ఆ కంపెనీలను ఆకర్షించడానికి కొన్ని రాయితీలు ఇవ్వడం తప్పు కాదు. ఏ ప్రభుత్వమైనా ఆ రకంగా కొన్ని విధానాలు రూపొందించుకుంటుంది.కానీ, ఏపీలో కూటమి ప్రభుత్వం భూముల విషయంలో ఒక విధానమంటూ లేకుండా ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. తమకు నచ్చిన ప్రైవేటు కంపెనీలకు ఉచితంగా భూములు ఇవ్వడం, ప్రభుత్వ సంస్థలకు మాత్రం కోట్ల రూపాయలకు అమ్మడం ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో తెలియ చేస్తుంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల కన్నా, సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్ పవర్ ఫుల్‌గా ఉంటున్నారని, ఆయన మాట కాదనలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్న అభిప్రాయం ఉంది. అది ప్రతి రోజూ రుజువు చేస్తున్నట్లుగా లోకేశ్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిని మంత్రివర్గం అంతా వంత పాడటం సర్వ సాధారణంగా మారిపోయినట్లుంది. పైకి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అంటూ ప్రచారం చేస్తూ లోకేశ్ స్వయంగా కార్పొరేట్, ప్రైవేటు రంగంలో తన పరపతి పెంచుకునే పనిలో ఉన్నారేమో అనిపిస్తుంది.తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగుళూరు, తమిళనాడుకు చెన్నై బ్రాండ్లు అయితే.. ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అని లోకేశ్ గొప్పగా చెప్పుకుంటారు. కానీ, అందులో వాస్తవం లేదని ఈ తాజా నిర్ణయం తెలియచేస్తుంది. ఎవరికైనా బ్రాండ్ ఇమేజీ ఉంటే ఏపీకి ఆయా ప్రముఖ సంస్థలు వాటంతట అవే రావాలి. లేదా కూటమి సర్కార్ కోరగానే ప్రభుత్వ విధానాల ప్రకారం పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలి. అవేవీ కాకుండా అత్యంత విలువైన ప్రజల ఆస్తులను తమకు ఉచితంగా ఇస్తేనే వస్తామని ఆ ప్రైవేటు సంస్థలు చెబితే చంద్రబాబు బ్రాండ్ ఏమైనట్లు?. విశాఖలో 99 పైసలకే ఎకరా భూమి అప్పగించడం అంటే చంద్రబాబు బ్రాండ్ విలువ ఇంతేనా అన్న సందేహం మేధావులలో వస్తోంది. టీసీఎస్‌కు ఈ రకంగా స్థలం ఇచ్చాక, మిగిలిన సంస్థలు కూడా ఇదే రకంగా భూమి ఇవ్వాలని కోరవా?. అందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా?. ఈ ముసుగులో కూటమి పెద్దలు తమ అస్మదీయ కంపెనీలకు విలువైన భూములను ఈ రకంగా అప్పగిస్తే పరిస్థితి ఏమిటి?. ఒక్కసారి అమ్మాక ఆ సంస్థలు సరిగా పని చేయకపోయినా, ఆ భూమి అమ్ముకున్నా చేయగలిగేది ఏం ఉంటుంది?.ఐటీ పరిశ్రమకు ప్రభుత్వ స్థలాలను లీజుకు ఇస్తే అదో రకం. కానీ, ఏకంగా వాటిని ఉచితంగా దానం చేస్తున్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తే అది ఏ రకంగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది?. మన సంపదతో వారు ఎంజాయ్ చేసినట్లు కాదా?. కాకపోతే తమకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా తమ చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడం సబబేనా?. గతంలో జగన్ ప్రభుత్వంలో అదానీ, తదితర సంస్థలకు లీజ్ పద్దతిలో భూములు కేటాయిస్తేనే మొత్తం అదానికి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని ఎల్లో మీడియా నానా గగ్గోలు పెట్టాయి కదా?. అప్పుడు ఆ మీడియాకు టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చాయి కదా!. ఇప్పుడు వందల కోట్ల విలువైన భూములను వేల కోట్ల లాభాలు గడించే టాటా సంస్థకు ఉచితంగా ఇస్తున్నారు. దీన్ని ఎలా సమర్ధించుకుంటారు?. నిజమే ఆ కంపెనీ వస్తే కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు. అవన్నీ ఏపీలోని వారికే వస్తాయన్న గ్యారంటీ ఉండదు. అయినా ఫర్వాలేదు. రిజిస్ట్రేషన్ విలువకో, మార్కెట్ విలువకో, దానికన్నా కాస్త తక్కువకో భూములు కేటాయిస్తే తప్పు కాదు.సాధారణంగా పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ ఆయా చోట్ల మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలు పెట్టుకునేవారికి నిర్దిష్ట రేటుకు విక్రయిస్తుంటుంది. అంతే తప్ప ఉచితంగా ఇవ్వదు. కానీ, టాటా సంస్థకు విశాఖ రిషికొండ వద్ద 21.6 ఎకరాల భూమిని కేవలం 22 రూపాయలకే అమ్ముతున్నామని, తానే ఈ కంపెనీతో డీల్ చేశానని లోకేశ్ ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. దానికి ఆ ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఆశ్చర్యపోయారు. అదెలాగా ప్రభుత్వం అలాంటి విధానం తయారు చేసిందా? లేక కంపెనీల వారీగా ఇలాగే అమ్ముతుందా? అని అడిగితే ప్రభుత్వం విధానం కాదని, టాటా సంస్థ కేటలిస్టుగా ఉంటుందని భావించి తాము ఈ నిర్ణయం చేశామని 1990 దశకంలో కూడా ఇలేగే జరిగిందని అన్నారు.టాటా కన్సల్టెన్సీకి నికర లాభమే రూ.48554 కోట్లట. అంత పెద్ద కంపెనీ ఎకరా పది కోట్లు పెట్టి కొనుగోలు చేసినా వారికి అయ్యే వ్యయం 220 కోట్లే. ఆ మాత్రం భరించలేని స్థితిలో ఆ కంపెనీ లేదా?. కానీ, ప్రభుత్వమే ఇంత విలువైన భూమిని లీజుకు కాకుండా దాదాపు ఉచితంగా ఇచ్చేస్తామని అంటే ఏ సంస్థ కాదంటుంది?. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం, ప్రజల సంపదను ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతోందని ఐఏఎస్ వర్గాలలోనే చర్చ జరుగుతోందట. పీ-4 విధానంలో ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చి పేదలను దత్తత తీసుకోవాలి. కానీ, ఇలా కుబేరులను దత్తత తీసుకుని, ప్రజల సంపదను కోటీశ్వరులకు అప్పగించడం పీ-4 విధానమా అన్న ప్రశ్నను పలువురు వేస్తున్నారు. నిజానికి విశాఖలో యూనిట్ పెట్టడానికి టీసీఎస్ గత ప్రభుత్వ టైమ్‌లోనే అంగీకరించింది. ఆ కంపెనీ అధినేత చంద్రశేఖరన్ అప్పట్లోనే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌తో భేటీ కూడా అయ్యారు. కానీ, ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు లోకేశ్ తానే దీనిని సాధించానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పు కాదు.. అదే మార్కెట్ రేటుకు ఈ భూమిని వారికి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఉంటే అప్పుడు క్రెడిట్ తీసుకున్నా ఫర్వాలేదు.అలా కాకుండా ఉత్త పుణ్యానికి వందల కోట్ల ఆస్తిని ధారాదత్తం చేసి. అదేదో గొప్ప సంగతి అన్నట్లు చెప్పుకుంటే ఏమి లాభం. పైగా ఈ ప్రక్రియ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్దంగా ఉందని మేధావులు చెబుతున్నారు. రిషికొండ వద్ద రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే చదరపు గజం విలువ ముప్పై వేల వరకు ఉంది. మార్కెట్ ధర ఇంకా అధికంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ విలువను పరిగణనలోకి తీసుకుంటే ఆ భూమి విలువ 320 కోట్లకు మించి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ చెప్పారు. 2012లో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ప్రభుత్వ భూములను మార్కెట్ విలువలో 10 శాతం కంటే తక్కువకు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వరాదు. అలాగే అమ్మదలిస్తే మార్కెట్ ధరకన్నా తక్కువకు విక్రయించ రాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే టైంలో విశాఖలో నావికా దళానికి, సీబీఐకి ఎకరా రూ.కోటి చొప్పున, పోస్టల్ శాఖకు ముప్ఫై సెంట్లకే రూ.కోటి చొప్పున వసూలు చేశారు. ఇప్పుడు టీసీఎస్‌కు 22 రూపాయలకు ఇవ్వడం ఏమిటని శర్మ ప్రశ్నించారు.టీసీఎస్ రూ.1370 కోట్లు పెట్టుబడి పెడితే 12వేల ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ అంటున్నారు. నిజంగా అంతమందికి ఉద్యోగాలు వస్తాయా అన్నది ఒక డౌటు. అది కూడా ఏపీ వారికే ఇస్తారా అన్నది మరో ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ వచ్చాక కాని, ఇతరత్రా కాని, ఐటీ రంగంలో కూడా ఉద్యోగాలు ఇవ్వడం తగ్గిందని చెబుతున్నారు. ఈ మధ్యనే గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయని చెబుతున్నారు. అసలు టీసీఎస్‌కు మాత్రమే 21 ఎకరాల స్థలం అవసరమా? పోనీ ఏ ముప్పై ఏళ్లో, ఏభై ఏళ్లకో లీజుకు వస్తే తిరిగి ప్రభుత్వానికి ఆ స్థలం వస్తుందిలే అని అనుకోవచ్చు. రూ.22 లకే ఇచ్చేస్తే దానిపై ప్రభుత్వానికి హక్కులు కూడా ఉండవు.నిజంగానే 12 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్లయితే ఆ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం అవుతుందా?. అమరావతిలో సైతం కూటమి సర్కార్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భారీ రేట్లకు, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు అందులో మూడో వంతు ధరకే భూములు ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ఉచితంగా భూములు ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారు. దీనినే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అంటారని పలువురు చమత్కరిస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రెడ్‌బుక్ పాలన.. విడదల రజిని మరిది గోపీ అరెస్ట్
సాక్షి, గుంటూరు/హైదరాబాద్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు సర్కార్.. వైఎస్సార్సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగంలో అమలులో భాగంగా మరో వైఎస్సార్సీపీ నేతను అక్రమంగా అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏపీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గోపీపై పలు కేసులు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు హైదరాబాదులోని గచ్చిబౌలిలో గోపీని అరెస్ట్ చేశారు. లక్ష్మీ బాలాజీ క్రషర్స్ ఆరోపణల కేసులో విడదల గోపీని అరెస్ట్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కాసేపట్లో గోపీని ఏపీకి తరలించనున్నారు. -
రాజీనామా చేయకపోతే బెయిల్ రద్దు!.. తమిళనాడు మంత్రికి సుప్రీం హెచ్చరిక
న్యూఢిల్లీ: తమిళనాడు మంత్రి పదవికి రాజీనామా చేయకపోతే బెయిల్ రద్దు చేస్తామని డీఎంకే నేత వి.సెంథిల్ బాలాజీని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పదవి కావాలో? స్వేచ్ఛ కావాలో? తేల్చుకోవాలని సూచించింది. ఉద్యోగాల కోసం నగదు కుంభకోణానికి సంబంధించిన కేసులో బాలాజీకి సెప్టెంబర్ 26న బెయిల్ మంజూరు చేశారు.అయితే.. బెయిల్ మంజూరైన కొద్ది రోజులకే బాలాజీని తిరిగి తమిళనాడు మంత్రిగా నియమించారు. బాలాజీ విడుదలైన తర్వాత మంత్రి అయినందున, ఈ కేసులోని సాక్షులను బెదిరిస్తున్నారని, కోర్టు ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం చేపట్టింది. బెయిల్ మంజూరు చేయడం అంటే సాక్షులను ప్రభావితం చేసే అధికారం ఇచ్చినట్లు కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.‘మీరు సాక్షులను ప్రభావితం చేస్తారని తీవ్ర భయాందోళనలు ఉన్నాయి. పదవి (మంత్రి), స్వేచ్ఛ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో మాకు చెప్పండి’అని పేర్కొంది. మనీలాండరింగ్ కేసుల్లో కోర్టు రూపొందించిన ఉదార బెయిల్ చట్టాన్ని రాజకీయ నాయకులు దురి్వనియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కొంత సమయం కావాలంటూ బాలాజీ తరపు న్యాయవాది కపిల్ సిబల్ చేసిన అభ్యర్థనను అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. -
చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభ: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని, చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఈ నెల 27న నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక సభకు ఉద్యమాల గడ్డ ఓరుగల్లు వేదిక కావడం గర్వంగా ఉందని అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. తొలుత జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మార్గంలో బోధించు, సమీకరించు, పోరాడు అనే ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణను సాధించాలనే నినాదంతో కేసీఆర్ నాయకత్వంలో బీ(టీ)ఆర్ఎస్ పురుడు పోసుకుంది. ఒక ఉద్యమ పార్టీగా ఏర్పడి తెలంగాణను సాధించడంతో పాటు అధికారాన్ని చేపట్టి అద్భుతమైన పాలన అందించింది. ప్రభుత్వంగా, ప్రతిపక్షంగా హిమాలయాల స్థాయికి తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్. రెండున్నర దశాబ్దాలుగా ప్రజల్లో ఉంటోంది. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా..’ అని కేటీఆర్ చెప్పారు. సభా స్థలికి నలుమూలలా పార్కింగ్ ఏర్పాట్లు‘రజతోత్సవ సభ కోసం ఎల్కతుర్తి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా 1,250 ఎకరాల్లో సభ, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు 40 నుంచి 50 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభాస్థలికి నలుమూలలా పార్కింగ్ ఉంటుంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చే వారికి 260 ఎకరాల్లో గోపాల్పూర్ రోడ్డువైపు, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే వావానాల కోసం ఎల్కతుర్తి సమీపంలో హుజూరాబాద్ మార్గంలో మరో 250 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశాం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల వారికి ఎల్కతుర్తికి ఆర కిలోమీటర్ దూరంలోనే 600 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. 10 లక్షల చొప్పున వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లుసభకు హాజరయ్యే వారి కోసం 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చాం. వీటిని ఇంకా పెంచుతాం. వెయ్యికి పైగా వైద్య బృందాలు, 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు మీద నమ్మకం లేదు. అందువల్ల 200 జనరేటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. 2 వేల మంది వలంటీర్లు సభకు వచ్చే వారికి సహకరిస్తారు..’ అని కేటీఆర్ తెలిపారు. సూర్యాపేట రైతులకు సలాం‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను చూడాలి. ఆయన మాట వినాలన్న ఆత్రుతతో ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ అరాచక పాలనను వరంగల్ సభలో ఎండగడదాం. కేసీఆర్ సందేశాన్ని గులాబీ సైనికులు ప్రతీ గ్రామానికీ చేర్చాలి. 27వ తేదీన తెలంగాణలోని 12,796 గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండాలు ఎగురవేసి కదం తొక్కిన ఉత్సాహంతో చలో వరంగల్ సభకు చేరుకోవాలి. మండుటెండలను లెక్కచేయకుండా రజతోత్సవ సభ కోసం ఎడ్లబండ్లలో బయలుదేరిన సూర్యాపేట రైతులకు సలాం చేస్తున్నా. మనమందరం వారిని ఆదర్శంగా తీసుకోవాలి..’ అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, డాక్టర్ బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంఐఎం గెలుపు లాంఛనమే!
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల చివరి రోజు నుంచి పలు ఊహాగానాలతోపాటు ఉత్కంఠను రేకెత్తించిన హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 4 గంటల వరకు సమయమున్నప్పటికీ, చివరి రెండు గంటల్లో ఎవరూ రాలేదు. మొత్తం 112 మంది ఓటర్లలో.. 88 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, బీజేపీ నుంచి ఎన్.గౌతమ్‌రావు పోటీ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ సభ్యులెవరూ పోలింగ్‌లో పాల్గొనలేదు. పార్టీల వారీగా పోలింగ్‌కు హాజరైన ఓటర్ల సంఖ్యను బట్టి ఎంఐఎం గెలుపు లాంఛనమేనని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. సంఖ్యాబలం లేనప్పటికీ బీజేపీ బరిలో ఉండటంతో ఏం జరగనుందోనన్న ఆసక్తి నెలకొంది. తమ పార్టీలకు గెలిచేంత ఓటర్ల సంఖ్య లేకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి. చివరి క్షణం వరకూ తమకు ఇతర పార్టీల ఓట్లు పడతాయన్న బీజేపీ, పోలింగ్ అనంతరం సైతం కాంగ్రెస్ ఓట్లు కొన్ని తమకు పడ్డట్లు పేర్కొంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఎంఐఎం తొత్తుగా మారిందని బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాటకాలు బయటపడ్డాయని, ఎంఐఎంకు వాటి మద్దతు ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు. కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద దాడికి నిరసనగా బీజేపీకి చెందిన కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి నల్ల దుస్తులతో పోలింగ్‌కు హాజరయ్యారు. మిగతా బీజేపీ ఓటర్లు చేతులకు నల్లరిబ్బన్లు చుట్టుకొని వచ్చారు. -
65 దాటితే 'నో' పదవి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పూర్తి స్థాయిలో ప్రక్షాళన కానుంది. రాష్ట్ర కార్యవర్గం నుంచి జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయిల్లోని అన్ని పార్టీ పదవుల్లో కొత్త వారిని నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం మూడు దశల్లో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయసేకరణ ద్వారా సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. పార్టీ పదవుల నియామకంలో కొన్ని షరతులను కూడా ఖరారు చేసింది. 65 ఏళ్లు దాటినవారికి బ్లాక్, మండల, గ్రామ స్థాయి అధ్యక్ష పదవులు ఇవ్వరాదని, ఆ పదవుల్లో యువకులను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పార్టీ పరిశీలకుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. ఇదీ షెడ్యూల్..: ⇒ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 35 జిల్లా యూనిట్లు ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున 70 మందిని పార్టీ పరిశీల కులుగా నియమించారు. వీరు ఈ నెల 25 నుంచి 30వ తేదీవరకు ఆయా జిల్లాల్లో జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ⇒ బ్లాక్, మండల అధ్యక్ష పదవుల కోసం పేర్లను పీసీసీ ఇచ్చిన ఫార్మాట్లో సేకరించాలి. జిల్లా అధ్యక్ష పదవుల కోసం 5, బ్లాక్ అధ్యక్షుల కోసం 3, మండల అధ్యక్షుల కోసం 5 పేర్లను ప్రతిపాదించాల్సి ఉంటుంది. ⇒ మే 3 నుంచి 10 వరకు మరోమారు సమావేశం నిర్వహించి సంవిధాన్ బచావో సభలను నిర్వహించాలి. మే 4 నుంచి 10 వరకు ఆయా జిల్లాల్లో అసెంబ్లీ/బ్లాక్ స్థాయి నేతల సమావేశం నిర్వహించాలి. బ్లాక్, మండల కమిటీల ఆఫీస్ బేరర్లు, కార్యవర్గం పేర్లను సేకరించాల్సి ఉంటుంది. ⇒ మే 13 నుంచి 20 వరకు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి గ్రామ కమిటీల కోసం పేర్లను సేకరించాలి. గ్రామ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా ఐదు పేర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ⇒ మూడు దశల సమావేశాల అనంతరం బ్లాక్, మండల, గ్రామ స్థాయి కమిటీల ప్రతిపాదనలతో కూడిన నివేదికను పీసీసీకి సమర్పించాలి. ⇒ ఈ కమిటీల్లో ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించాలని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఎవరికి ఏ పదవి ఎందుకు ఇవ్వాలనే అంశాలను కూడా నివేదికలో పేర్కొనాలని ఆమె ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో గుజరాత్ పీసీసీ విధానాన్ని మోడల్‌గా తీసుకోవాల సూచించారు. పరిశీలకుల హోదాలో పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసే బాధ్యతలు చాలా కీలకమైనవని, ఈ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కోరారు.లేటుగా వచ్చినవారు ఇంటికే.. పరిశీలకుల సమావేశానికి ఆలస్యంగా వచ్చినవారిని బాధ్యతల నుంచి తొలగించాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి కొందరు పరిశీలకులు అరగంట ఆలస్యంగా వచ్చారు. మరికొందరు రాలేదు. మొత్తం 70 మంది రావాల్సి ఉండగా, 58 మంది హాజరయ్యారు. దీంతో ఆలస్యంగా వచ్చిన వారు, సమావేశానికి రాని వారిని మీనాక్షి ఆదేశాల మేరకు పరిశీలకుల బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశంలోనే ప్రకటించారు. పరిశీలకులుగా ఆరుగురు మాత్రమే మహిళలను నియమించడంతో ఇంకా మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని మీనాక్షి సూచించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
జానారెడ్డి ఎపిసోడ్.. రాజగోపాల్‌రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్లో ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. వారం క్రితం జానారెడ్డిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి రాకుండా మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.అయితే, జానారెడ్డి ఎపిసోడ్‌పై రాజగోపాల్‌రెడ్డి.. బుధవారం స్పందించారు. ‘‘జానారెడ్డి అంటే నాకు గౌరవం. ఆయన మా పార్టీ సీనియర్ నేత. జానారెడ్డి రాసిన లెటర్‌పై ఒక సభలో మాట్లాడాను. మంత్రి పదవి పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా, మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి గట్టి హెచ్చరికలే చేశారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది...మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. -
జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్: కేటీఆర్
హన్మకొండ, సాక్షి: తెలంగాణలో కష్టం అనే మాట వినబడితే.. బాధితులకు అండగా నిలబడేది గులాబీ జెండా ఒక్కటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు అన్నారు. బుధవారం ఎల్కతుర్తితో పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ రజతోత్సవ సభా ఏర్పాట్లను పర్యవేక్షించి మీడియాతో మాట్లాడారు. ముందుగా.. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి బీఆర్ఎస్ నేతలంతా నివాళులర్పించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రజల్ని రెచ్చగొట్టడానికో, ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడానికి కాదని.. 25 వసంతాలు పూర్తి చేసుకున్నందున జరుపుకొనే వేడుక మాత్రమేనని తెలిపారాయన. ఇక్కడ 1,250 ఎకరాల్లో సభా స్థలం ఉండగా.. వెయ్యి ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయించాం. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేస్తున్నాం. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య తాగునీటి వసతి కల్పిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటుపై నమ్మకం లేనందున జెనరేటర్లు ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ చరిత్రలో ఇది భారీ బహిరంగ సభ కాబోతుంది. గతంలో ఉద్యమ పార్టీగా ప్రతిపక్షంగా, ప్రభుత్వంలో ఎక్కడ ఉన్నా తెలంగాణ కీర్తిని హిమాలయాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దేనని కేటీఆర్ అన్నారు. 14 ఏళ్ల పాటు నిర్విరామంగా పోరాటం చేసి అన్ని వర్గాలను సమీకరించి రాష్ట్ర సాధన ఉద్యమం చేసిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం బీఆర్ఎస్. గులాబీ జెండా అన్ని వర్గాలకు అండగా ఉంటుందనే పద్ధతిలో ప్రజలు గులాబీ జెండా వైపు చూస్తున్నారు. ఏ సమస్య వచ్చినా తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారు. తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్‌లా మారింది’’ అని కేటీఆర్ అన్నారు. -
ఉరి, పుల్వామా కంటే ఘోరమైన దాడి ఇది: ఒవైసీ
న్యూఢిల్లీ: ఉరి, పుల్వామాలలో జరిగిన దాడుల కంటే.. జమ్ము కశ్మీర్ పహల్గాం(Pahalgam)లో తాజాగా జరిగిన ఉగ్ర దాడి అత్యంత ఘోరమైందని, అది తనను ఎంతగానో బాధించిందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) అన్నారు. నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లే దాడి జరిగిందన్న ఆయన.. ఘటనకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.‘‘పహల్గాంలో.. మతం ఏంటని అడిగిన తర్వాతే ఉగ్రవాదులు అమాయక ప్రజలను విచక్షణారహితంగా చంపారు. ఇది గతంలో జరిగిన ఉరి, పుల్వామా ఉగ్రదాడుల కంటే ఘోరమైంది. ఈ దాడిని మేం ఖండిస్తున్నాం. ఇది కచ్చితంగా నిఘా వ్యవస్థ వైఫల్యమే. జమ్ములో ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరోధక విధానం పనిచేస్తుందో లేదో పరిశీలించుకోవాలి. ఈ ప్రభుత్వం ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పి.. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తుందని ఆశిస్తున్నాం’’ అని విలేకరులతో అన్నారాయన.దక్షిణ జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయలో ఘోరం జరిగింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. మైదానంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్న పర్యాటకులను చుట్టుముట్టి తుపాకులతో దారుణంగా కాల్చి చంపారు. ఐడీ కార్డులను పరిశీలించి.. పేరు, మతం ఆధారంగా వేరు చేసి మరీ దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడి మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్లలో ఇద్దరు తాజాగా మరణించడంతో మృతుల సంఖ్య 28కి చేరింది. అయితే.. బాడీ కేమ్ ద్వారా దాడి దృశ్యాలను పాక్‌లోని తమ హ్యాండర్లకు ఉగ్రవాదులు చేరవేసినట్లు భద్రతా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఉగ్రవాదుల ఫొటోలు, ఊహా చిత్రాలు విడుదల చేసి.. జమ్ము వ్యాప్తంగా గాలింపు కొనసాగిస్తోంది. -
‘మంత్రి నారా లోకేష్ బినామీలదే ఉర్సా కంపెనీ’
సాక్షి, తాడేపల్లి: విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్‌కు కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్, ఆయన బినామీలే సూత్రదారులని వైఎస్సార్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ తన సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను సృష్టించి, వాటికి ప్రభుత్వం ద్వారా కారుచౌకగా విలువైన భూములను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తానని చెబుతున్న చంద్రబాబు ప్రజల సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతోంది. ఊరు, పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టింది. గత వారం రోజులుగా దీనిపై రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ డొల్ల కంపెనీ హైదరాబాద్‌లోని ఒక అపార్ట్మెంట్లో రెండు నెలల కిందటే రిజిస్టర్ అయ్యింది. అటువంటి కంపెనీకి 56 ఎకరాల భూమిని కట్టబెడతారనే దానిపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ అవినీతిపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, దీనిపై రాష్ట్రంలోని ఒక్క మంత్రి కూడా ధైర్యంగా ప్రజల ముందకు వచ్చి వివరణ ఇవ్వలేదు.ఎందుకంటే ఇది డొల్ల కంపెనీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు డైరెక్టర్లు తప్ప ఒక్క ఉద్యోగి కూడా లేని ఈ కంపెనీకి ఎకరం రూ.50 కోట్ల విలవైన భూములు, అంటే దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇటువంటి సూట్‌కేస్ కంపెనీలను పెద్ద ఎత్తున రిజిస్టర్ చేయించడం, వాటికి కారుచౌకగా ఖరీదైన భూములను కట్టబెట్టించడం చేయిస్తున్నారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ స్కామ్. ప్రభుత్వమే తమ బినామీలను ముందు పెట్టి, ఆస్తులను దోచేస్తోంది.వైఎస్ జగన్ హయాంలోనే టీసీఎస్‌తో సంప్రదింపులువైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే టీసీఎస్ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. తరువాత కోవిడ్ కారణంగా టీసీఎస్ ఏపీకి రావడం ఆలస్యం అయ్యింది. 2022లో టీసీఎస్‌కు చెందిన చంద్రశేఖరన్ ఏపీకి వచ్చి ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. తరువాత ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. టీసీఎస్‌తో ప్రభుత్వ సంప్రదింపులు కొనసాగాయి. టీసీఎస్‌కు విశాఖలో 21.16 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే విక్రయిస్తూ కూటమి ప్రభుత్వం ఈనెల 21వ తేదీన జీవో జారీ చేసింది. ఈ భూముల విలువ వేలకోట్ల రూపాయలు ఉంటుంది. కనీసం వాటి మార్కెట్ విలువపై కొంతశాతం తగ్గించి విక్రయించినా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది.అలా కాకుండా 99 పైసలకు విక్రయించడం చూస్తే, దేశంలో ఎక్కడైనా ఇలా జరిగిందా అనే అనుమానం కలుగుతోంది. ప్రజాసంపదను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సమయంలో ప్రోత్సహాకరంగా విధానాలు ఉండాలే తప్ప, పూర్తిగా ఉచితంగా దారాదత్తం చేసేలా ఏ ప్రభుత్వమైనా వ్యవహరిస్తుందా? ఇలా 99 పైసలకే భూములను విక్రయించినందుకు ఏపీకి టీసీఎస్ నుంచి ఏదైనా ప్రత్యేకమైన మేలు జరుగుతుందా అని చూస్తే, ఆ సంస్ధ కల్పించే 12వేల ఉద్యోగాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. వైయస్ జగన్ సీఎంగా ఈ రాష్ట్రంలో ఏర్పాటయ్యే సంస్థలు ఖచ్చితంగా డెబ్బై శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిబంధనలు తీసుకువస్తే, ఆనాడు కూటమి పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పుడు టీసీఎస్ కల్పించే ఉద్యోగాల్లో ఓ రెండు వేల మంది ఏపీకి చెందిన వారు ఉంటే, మిగిలిన పదివేల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారు. అలాంటప్పుడు ఈ కేటాయింపులను ప్రశ్నిస్తే, పరిశ్రమలను, ఐటీ సంస్థలను అడ్డుకుంటున్నారని మాపైన దుష్ర్పచారం చేస్తున్నారు.డొల్ల కంపెనీలకు భూకేటాయింపులుటీసీఎస్ను చూపిస్తూ, ఉర్సా లాంటి డొల్ల కంపెనీలను కూడా ఇదే విధంగా గొప్ప ఐటీ సంస్థలుగా చిత్రీకరిస్తూ భూకేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం తెగబడింది. ఇరవై వేల రూపాయల అద్దె ప్లాట్‌లో నడిచే ఉర్సా సంస్థ ఏకంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందంటే, ప్రభుత్వం ఎలా నమ్మింది? పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ, ఆమోదం తెలిపిన బోర్డ్‌లు ఏ అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాయి? ఈ కంపెనీ ప్రమోటర్లు ఎవరు, వారి ఆర్థిక సామర్థ్యం ఎంత, గత అనుభవం ఏమిటీ, ఎంత మంది ఉద్యోగులు దీనిలో పనిచేస్తున్నారనే కనీస వివరాలను కూడా పరిశీలించకుండానే ప్రభుత్వం ఈ సంస్థకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది?ఎందుకంటే ఇది నారా లోకేష్‌కు చెందిన బినామీలకు చెందిన సంస్థ. ఉర్సా ప్రతినిధిలు పెందుర్తి విజయ్‌కుమార్, ఆయన కుమారుడు పెందుర్తి కౌశిక్, మరో వ్యక్తి అబ్బూరి సతీష్. వీరు అమెరికాలోని తన సొంత ఇంట్లో ఒక కంపెనీని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కంపెనీని చూపించి ఇటీవల దావోస్‌లో తెలంగాణలో అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామంటూ ఎంఓయు చేసుకున్నారు. తరువాత ఎపీలో కూడా ఇదే తరహాలో మరో అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ స్కామ్‌ను నడిపించారు. గతంలో ఐఎంజీ భారత్ పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన భూములను బిల్లీరావుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ఏరకంగా ప్రయత్నించాడో అందరికీ తెలుసు. ఇప్పుడు లోకేష్ తండ్రిని మించిన తనయుడిగా ఉర్సా సంస్థను తెరమీదికి తీసుకువచ్చారు. ఉర్సాకు చేసిన భూకేటాయింపులకు సంబంధించిన జీఓను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. టీసీఎస్‌కు జీఓ ఇచ్చారు, ఉర్సాకు మాత్రం జీఓను జారీ చేయలేదు. అంటే ఉర్సాకు సంబంధించిన జీఓను రహస్యంగా ఉంచుతున్నారా?ఉర్సా సంస్థ ఫైలు ఉరుకులు పెట్టించారుఉర్సా సంస్థ ప్రతినిధులు పెందుర్తి విజయ్‌కుమార్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ఉద్యోగి. మరో డైరెక్టర్ అబ్బూరి సతీష్ అమెరికాలో ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరిద్దరూ కలిసి ఏపీలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చెబుతున్నారు. దీనిని స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదించడం, వెంటనే కేబినెట్‌కు వెళ్ళడం, కేబినెట్ కూడా కాపులుప్పాడులో 56 ఎకరాలను 99 పైసలకే అమ్మేయాలని నిర్ణయించడం. ఇదంతా ఎంత ప్రణాళికాబద్దంగా స్కామ్‌ను నడిపించారో అర్థం అవుతోంది. గత వారం రోజులుగా దీనిపై వైఎస్సార్సీపీ మాట్లాడుతూ ఉంటే ఎల్లోమీడియాలో పెట్టుబడులను అడ్డుకుంటే రాష్ట్రానికే నష్టం అంటూ సిగ్గులేకుండా తప్పుడు రాతలు రాశాయి.డొల్ల కంపెనీలకు విలువైన భూములను దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? వైఎస్సార్సీపీ హయాంలో అనేక కంపెనీలను ప్రోత్సహించాం, మీలా ఉచితంగా భూములను దారాదత్తం చేయలేదు. పలు ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి విశాఖలో 161 స్టార్ట్ అప్ ఐటీ కంపెనీలు ఉంటే, వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా 425 కంపెనీలు ఏర్పాటయ్యాయి. తెలుగుదేశం దిగిపోయే నాటికి ఐటీ ఉద్యోగులు ఏపీలో 27643 మంది ఉంటే వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో 75,551 మందికి పెరిగారు. మేం అడ్డుకునే వారిమే అయితే వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కంపెనీలు ఎలా పెరిగాయి, ఉద్యోగులు ఎలా పెరిగారు? ఉర్సా, లులూ వంటి సంస్థలకు కారుచౌకగా భూములను కట్టబెట్టడం ద్వారా, పెద్ద ఎత్తున లబ్ధి పొందాలని చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి విధానాలను ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం. -
సుగవాసి సుబ్రమణ్యం పార్టీ వీడనున్నారా?
రాజంపేట: తెలుగుదేశం పార్టీ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గ స్థానం నుంచి పోటీ చేసిన సుగవాసి సుబ్రమణ్యం సైలెంట్ అయ్యారంటే.. అవుననే చెప్పాల్సివస్తోంది. గత కొద్దినెలలుగా అధికారపార్టీకి దూరంగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో సుగవాసికి అధిష్టానం టికెట్ ఇచ్చి పోటీ చేయించినా అధిష్టానం ఆయనను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడంలేదన్న వాదన టీడీపీలో హాట్‌టాపిక్‌గా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని ఒంటమిట్ట రాములోరి కళ్యాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తే ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా సుగవాసి కనిపించలేదు. ఆయన పార్టీ వీడనున్నారా? అన్న సందేహాలు రేకేత్తిస్తున్నాయి. రాజంపేటలో కాపు (బలిజ)సామాజికవర్గానికి సరైన ప్రాధాన్యత లేదన్న భావనలు పుట్టుకొస్తున్నాయి. రాజంపేట వైపు మళ్లీ బత్యాల చూపు? మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు రైల్వేకోడూరుకే పరిమితమయ్యారు. సుగవాసి సుబ్రమణ్యం గత కొద్దిరోజులుగా పారీ్టకి దూరంగా..నియోజకవర్గం పార్టీ కార్యక్రమానికి రాకపోవడంతో బలిజ సామాజికవర్గం మదనపడుతోంది. బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి సుబ్రమణ్యంలు రాజంపేట టీడీపీలో పట్టుకోల్పోయిన తరుణంలో ఆయన వెంట నడిచిన ఆయన సామాజికవర్గ నేతలు, అభిమానులు మాత్రం నిస్తేజంగా ఉండిపోయారు. మళ్లీ బత్యాల చూపు రాజంపేట వైపును మళ్లిస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్చార్జి ఎవరో తేల్చని అధిష్టానం రాజంపేట టీడీపీలో కుల వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. అధిష్టానం ఇన్చార్జి ఎవరో తేల్చుకోలేకుంది. ఇన్చార్జి రేసులో ఉన్న వారితో అ«ధికారులు తలపట్టుకుంటున్నారు. ఏ నేత వద్దకు పోతే, మరోనేతకు వ్యతిరేకమవుతామని, ఎవరి దగ్గరికి పోకుంటే పోలా అనే భావనలో పార్టీ క్యాడర్ కొనసాగుతోంది. సీఎం బర్త్‌డే వేడుకలను కలిసికట్టుగా కాకుండా చమర్తి జగన్మోహన్రాజు, బత్యాల చెంగల్రాయుడు, మేడా విజయశేఖర్‌రెడ్డి వేర్వేరుగా చేసుకున్నారు. మహానాడు తర్వాత ఇన్చార్జి ప్రకటిస్తారా? ముందుగానే ప్రకటిస్తారా అనేది టీటీడీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం ఎటువైపుపోటీ చేసి ఓడిపోయిన సుగవాసి సుబ్రమణ్యంను కాదని, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజుకు అధిష్టానం ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో బలిజ వర్గాలు జీరి్ణంచుకోలేకున్నాయి. రాజంపేట దేశంపారీ్టలో వర్గపోరు అంతర్గతంగా కొనసాగుతోంది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల విషయంలో చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు ఉన్నాయి. రాజంపేట ప్రాంతీయ వైద్యశాలలో ఔట్సోర్సింగ్ నియామకాల్లో కూడా ఓ నేత చేయి తడిపారనే ఆరోపణలు ఆ పార్టీ వర్గాలే బహిరంగగానే చెప్పుకుంటున్నాయి. -
కూటమి పాలనలో స్కీమ్‌లు కాదు.. స్కామ్‌లు పెరిగాయి: భరత్
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. కూటమి ప్రభుత్వంలో స్కీములు అమలు చేయడం లేదను కానీ స్కాములు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చెప్పారు కదా అని అధికారులు ఆలోచించకుండా అరెస్టులకు పాల్పడితే కచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఉర్సా కంపెనీ ద్వారా వేల కోట్ల రూపాయలు విలువైన భూములను అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇది అధికార దుర్వినియోగం కాదా?. నీతి నిజాయితీలకు మారుపేరైన ఐపీఎస్ అధికారి సీఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేయటం దారుణం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోంది. జిందాల్ లాంటి సంస్థలను అవమానపరుస్తుంది. దావోస్ వెళ్ళిన చంద్రబాబు ఒక్క రూపాయి అయినా ఎంఓయూ చేసుకోగలిగారా?.ఉర్సా భూముల స్కామ్ నుండి ప్రజలను డైవర్ట్ చేయటానికి మాజీ ఏపీఎస్ ఆఫీసర్ సిఎస్సార్ ఆంజనేయులును అరెస్టు చేశారు. చంద్రబాబు చెప్పారు కదా అని అధికారులు ఆలోచించకుండా అరెస్టులకు పాల్పడితే కచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఒక్క ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కూడా రాష్ట్రానికి తీసుకురాలేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడం ఏమిటి?.రాజమండ్రిలో అవినీతి జరగకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. నగరంలో అధికార పార్టీ నేతలు భూములను కబ్జా చేసే ప్రయత్నాలు అడ్డుకుంటాం. బెల్ట్ షాపులు, మద్యం దుకాణాల వద్ద అనధికార పర్మిట్ రూములు విషయంలో కచ్చితంగా ఆందోళన చేస్తాం. రాజమండ్రిలో మెజారిటీ రావడానికి నీ గొప్పతనం నీ కుటుంబం గొప్పతనం కాదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ జగన్. వైఎస్సార్సీపీ రాజకీయ భిక్ష పెట్టంది. బొల్లినేనిలో మృతి చెందిన యువతికి ప్రభుత్వం తరఫున ఇప్పటివరకూ ఎటువంటి సహాయం అందించలేదు. ఈవీఎం ఎమ్మెల్యేకు ఇంగ్లీషే రాదనుకున్నాను.. తెలుగు కూడా సరిగ్గా రాదని అర్థమైంది.. పుట్టినరోజుకి నివాళులర్పించడమేమిటి?. మాల వేసుకుని ఎమ్మెల్యే పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ప్రజా సంబంధాల వ్యవహారాలు సోషల్ మీడియాలో వస్తే కచ్చితంగా స్పందించాలి.ప్రైవేట్ ఆసుపత్రిల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం జరుగుతుందా?. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు చేపడుతూ.. స్కాంను గత ప్రభుత్వానికి అంటకట్టడం దారుణం. చంద్రబాబు సమయంలోనే కొత్త డిస్టరీలకు అనుమతులు వచ్చాయి. లిక్కర్ వ్యవహారంతో సంబంధంలేని మిషన్ రెడ్డిని ఎందుకు లాగుతున్నారు. ఇవి కేవలం ప్రభుత్వం అనుసరిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. ఉర్సా భూముల కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రముఖులను ప్రభుత్వం అరెస్టు చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలి’ అని హెచ్చరించారు. -
తండ్రి బాటలోనే లోకేశ్.. ఎంకరేజ్ చేస్తున్న పవన్!
ఏపీలో ప్రజాస్వామ్యం మూడు కుట్రలు, ఆరు ప్రలోభాలుగా పరిఢవిల్లుతోంది!. విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ పదవి నుంచి వైఎస్సార్సీపీకి చెందిన వెంకట కుమారిని దించివేయడానికి ఇన్ని కుట్రలు పన్నాలా?. పదవీకాలం ఏడాది కూడా లేకపోయినా, ఎందుకు ఇంత కక్కుర్తి?. బహుశా కూటమి నేతలు, కార్యకర్తల అరాచకాలు త్వరితగతిన తెలిసిపోతున్నాయనో, విశాఖలో తమ పెత్తనం సాగాలనో మరే కారణంతోనో అవిశ్వాస తీర్మానం పెట్టి కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు నిర్ణయం తీసుకుని ఉండాలి.అయితే, ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు సర్కార్ స్థానిక సంస్థల స్వతంత్రను దెబ్బతీస్తోంది. ఇందుకు అధికార యంత్రాంగాన్ని వాడుకుంటుంది. చంద్రబాబు తొలుత ముఖ్యమంత్రి అయింది ఇలాంటి కుట్రలతోనే అని అంతా అంటారు. అదే పద్దతిని ఆయన ఇప్పటికీ కొనసాగించడం దురదృష్టకరం. ఇప్పుడు ఆయన కుమారుడు లోకేశ్ కూడా అదే బాటలో ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు, లోకేశ్‌లకు విధేయుడుగా ఉంటూ ప్రశ్నించడం లేదు కనుక వారికి ఇబ్బంది ఉండడం లేదు.గతంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదు. ఎన్నికలలో కేవలం రెండు మున్సిపాలిటీల్లోనే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నప్పుడు కూడా వారిని డిస్టర్బ్ చేయలేదు. ఇందుకు ఆ రోజుల్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర రెడ్డి ఓపెన్ గానే అంగీకరించారు. కానీ, చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాగానే స్థానిక సంస్థలలో వేధింపుల పర్వం ఆరంభించారు. పలు మండల పరిషత్తులలో వివిధ కారణాలతో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూటమి పెద్దలు పెద్ద ఎత్తున కొనుగోలు లావాదేవీలను సాగించారు. అయినా కేవలం 11 చోట్ల మాత్రమే మెజార్టీ లేకపోయినా మండలాలను కైవశం చేసుకున్నారు. మిగిలిన 39 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. ఎర్రగొండపాలెం వద్ద ఒక మండల పరిషత్ ఎన్నికలో వైఎస్సార్సీపీ మహిళా ఎంపీటీసీ టీడీపీ వారి దాష్టికాన్ని తట్టుకుని ఓటు వేయడం సంచలనమైంది.ఈ మధ్యనే ఆదోని మున్సిపల్ ఛైర్పర్సన్ వైఎస్సార్సీపీ నుంచి మారిన నేపథ్యంలో అక్కడ మెజార్టీ కౌన్సిలర్లు ఒకే తాటిపై నిలబడి ఆమెను పదవి నుంచి దించేశారు. పార్టీ ఫిరాయింపునకు జవాబు ఇచ్చారు. అలా అన్ని చోట్ల సాధ్యపడదు. ఉదాహరణకు తిరుపతి ఉప మేయర్ ఎన్నికకు సంబంధించి పోలీసుల మద్దతుతో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడడం, ఒక్క టీడీపీ కార్పొరేటరే ఉన్నప్పటికీ ఆ పదవిని గెలుచుకోవడం జరిగింది. ఈ ఓటింగ్ తర్వాత కొందరు కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వద్దకు వచ్చి టీడీపీ వారి వేధింపులకు తట్టుకోలేక వైఎస్సార్సీపీకి ద్రోహం చేశామని కన్నీరు, మున్నీరయ్యారు. అవకాశం ఉన్న చోట్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లను ప్రలోభ పెట్టి టీడీపీలోకి చేర్చుకుంటున్నారు. లొంగకపోతే అధికారుల చేత ఒత్తిడి చేయిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఛైర్మన్లకు సహకరించకుండా ఐఏఎస్‌లు సైతం దారుణంగా వ్యవహరిస్తున్నారు.ఉదాహరణకు గుంటూరు కమిషనర్, ఐఏఎస్ అధికారి మేయర్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది. దాంతో మేయర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ మేయర్‌కు ఇవ్వవలసిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. ఇది స్థానిక సంస్థలను అవమానించడమే. విశాఖపట్నంలో బీసీ వర్గానికి చెందిన మహిళ మేయర్‌ను పదవి నుంచి దించడానికి కొద్ది నెలలుగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. కార్పొరేటర్లను రకరకాల ప్రలోభాలకు లోను చేయడానికి యత్నించింది. కొంతమందిని విదేశీ యాత్రలకు పంపారు. టీడీపీ కూటమి దాష్టికాలకు తట్టుకోవడానికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కొందరు కేరళ వెళ్లారట. అక్కడకు వెళ్లి కూడా టీడీపీ నేతలు కొందరిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఒక కార్పొరేటర్ వెల్లడించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకున్నా వారికి పూర్తి బలం రాలేదు. దాంతో ముప్పై మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను టీడీపీ కొనుగోలు చేసిందని చెబుతున్నారు. ఎలాగైతేనేం విశాఖ నగర పాలక సంస్థను కైవసం చేసుకున్నామని కూటమి పెద్దలు సంబర పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశామని వారు బాధపడడం లేదు. ఈ వైఖరిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ .. కూటమి ఇలా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బలం లేకపోయినా ఎలా పదవులలోకి వస్తారని ఆయన ప్రశ్నించారు.ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు పార్టీ ఫిరాయింపులపై స్పష్టమైన విధాన నిర్ణయం చేశారు. వేరే పార్టీవారు ఎవరైనా టీడీపీలోకి రావాలంటే పదవి వదలి పెట్టి రావాలని కండిషన్ పెట్టారు. ఆ సూత్రానికి చంద్రబాబు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారు. సొంత మామ ఎన్టీ రామారావును పార్టీ చీల్చి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన చంద్రబాబుకు ఇలాంటి కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు పెద్ద విషయమా అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుంటారు. 2014 టర్మ్‌లో కూడా ఇలాగే చేశారు. ఉదాహరణకు మూడు నగరపాలక సంస్థలలో వైఎస్సార్సీపీ గెలిస్తే, నెల్లూరు మేయర్‌ను టీడీపీలోకి లాగేసింది. అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ఆధ్వర్యంలో కొనుగోలు చేశారన్నది బహిరంగ రహస్యం. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగానికి గండి కొట్టారు.జగన్ దీనికి నిరసనగా అసెంబ్లీని బహిష్కరించి ప్రజలలోకి వెళ్లారు. 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా, చంద్రబాబు తన పద్దతులను మార్చుకోలేదు. ఒకప్పుడు పార్టీ ఫిరాయింపులను విమర్శిస్తూ ఎమ్మెల్యేలను పశువుల మాదిరి కొంటారా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, తాను అధికారంలోకి వచ్చినప్పుడల్లా అదే పనిచేయడం ఆయన ప్రత్యేకత. దీనిపై బీజేపీ లోక్ సభ సభ్యుడు సీఎం రమేష్ హర్షం వ్యాక్తం చేస్తూ అరాచక పాలనకు ముగింపు పలికారని అన్నారు. అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశామన్న సంగతిని మాత్రం విస్మరించారు. ఆయన పేరుకు బీజేపీ తప్ప, ఒరిజినల్‌గా చంద్రబాబు సొంత మనిషిగానే అంతా పరిగణిస్తారు.టీడీపీ నేతలు తాము విశాఖ నగరంలో అధికారంలోకి వచ్చామని సంబర పడుతుండవచ్చు. కానీ, ప్రజలలో మాత్రం ఏహ్య భావాన్ని మూట కట్టుకున్నారని చెప్పాలి. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కూటమి నేతలు, ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుండటం దురదృష్టకరం. స్థానిక సంస్థలలో అధికారం వచ్చినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అనుభవం చెబుతున్నప్పటికీ, చంద్రబాబు అండ్ కో మాత్రం యథా ప్రకారం ఈ కుట్రలను కొనసాగిస్తున్నారు. 1995లో కుట్రతోనే అధికారంలోకి వచ్చి.. అప్పటి నుంచి వాటినే అమలు చేస్తున్న చంద్రబాబు ఇంతకన్నా గొప్పగా ఉంటారని ఆశించలేమేమో!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల విశ్లేషకులు. -
HYD: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటింగ్‌కు బీఆర్ఎస్ దూరం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 78.57 శాతం పోలింగ్ నమోదైంది. 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ మినహా బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియ్ సభ్యులు పోలింగ్‌లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ నిర్వహించనున్నారుఉదయం 10 గంటల వరకు 50 శాతం ఓట్లు నమోదు అవ్వగా, 45 మంది కార్పొరేటర్లు ఓటు వినియోగించుకున్నారు. ఎక్స్ అఫీషియో హోదాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ AVN రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ కార్పొరేటర్లు ఓటు వేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ ప్రకటించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల కోసం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. డ్యూటీలో 250 మంది పోలింగ్ సిబ్బంది.. 250 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేశారు. పోటీలో ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఎంఐఎం అభ్యర్దిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో ఉన్నారు.మొత్తం ఓటర్లు 112. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. వీరిలో ఎంఐఎంకు 50, బీజేపీకి 24, బీఆర్ఎస్కు 24, కాంగ్రెస్‌కు 14. సరిపడ సంఖ్య బలం లేకున్నా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటర్లు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆదేశించింది. -
సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా..బాబు భేతాళ కుట్ర బట్టబయలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు భేతాళ కుట్ర బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్ నివేదిక సాక్షిగా రెడ్‌బుక్ కుతంత్రం బెడిసికొట్టింది. తద్వారా చంద్రబాబు తాను తీసిన గోతిలో తానే పడ్డారు! వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక ఆ విషయాన్ని బట్టబయలు చేసింది. కానీ ఆయన ఇచ్చినట్లుగా చెబుతున్న వాంగ్మూలంపై సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ వెల్లడించడం అసలు కుట్రను వెల్లడించింది. అంటే రాజ్ కసిరెడ్డి చెప్పకుండానే.. తాను అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సిట్ అంగీకరించింది. ఇక మద్యం డిస్టిలరీలకు ఆర్డర్లలో వివక్షకు పాల్పడి అవినీతి చేశారని సిట్ పేర్కొంది. కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం నాలుగు కంపెనీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని వెల్లడించింది. ఇక టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సి–టెల్ సాఫ్ట్‌వేర్‌ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం ఆర్డర్లు జారీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. మరి సి–టెల్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు ఎందుకు చేశారనే దానిపై సిట్ మౌనం వహించింది. తద్వారా టీడీపీ హయాంలోనే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని అసలు గుట్టు విప్పింది. ఇక నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు చొప్పున రాజ్ కేసిరెడ్డి వసూలు చేసి వైఎస్సార్ సీపీలోని ముఖ్యులకు ఇచ్చారని ఒకచోట... రాజ్ కేసిరెడ్డే ఆ నిధులను దేశంలో వివిధ చోట్ల పెట్టుబడి పెట్టారని మరోచోట పరస్పర విరుద్ధంగా పేర్కొనడం ద్వారా తన దర్యాప్తులో డొల్లతనాన్ని బయటపెట్టింది. తాము బెదిరించి వేధించిన వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ తదితరులతో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు పేరిట కనికట్టు చేసినట్టు అంగీకరించింది. అంతిమంగా టీడీపీ గత ఐదేళ్లలో చేసిన అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలనే గుదిగుచ్చి దర్యాప్తు నివేదికగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు బరితెగించిందన్నది స్పష్టమైంది. దర్యాప్తు పేరిట తాము సాధించింది శూన్యమని గ్రహించిన సిట్ ఏమీ చేయలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును నివేదికలో ప్రస్తావించడం ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. సిట్ నివేదిక సాక్షిగా వెల్లడైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది...డిస్టిలరీలూ బాబు దందానే బట్టబయలు చేసిన సిట్ నివేదికవైఎస్సార్సీపీ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించారని, వాటికే అత్యధిక మద్యం ఆర్డర్లు ఇచ్చారని సిట్ ఆరోపించింది. తద్వారా కొన్ని డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి కమీషన్లు తీసుకున్నారని ఆవాస్తవ అభియోగాలు మోపింది. కానీ స్వామి భక్తి చాటుకునే హడావుడిలో అసలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే వాస్తవాన్ని బయటపెట్టేయడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని సిట్ నివేదికలో తెలిపింది. అంటే చంద్రబాబు హయాంలోమద్యం కొనుగోలు ఆర్డర్లలో ఏకంగా 53.21 శాతం కేవలం నాలుగు డిస్టిలరీలకే ఇవ్వడం అంటే అక్రమాలకు పాల్పడినట్టే కదా? తద్వారా మద్యం ఆర్డర్లలో కుంభకోణానికి పాల్పడింది చంద్రబాబు ప్రభుత్వమేనని రూఢీ అయింది. సి–టెల్ సాఫ్ట్వేర్ ద్వారా కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని, దాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిందని సిట్ పేర్కొంది. లోపభూయిష్టమైన ఆ సాఫ్ట్‌వేర్‌ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకున్నట్లే కదా!రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం పేరిట కుట్ర..సిట్ కుట్రను బయటపెట్టిన రిమాండ్ నివేదిక వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగినట్టుగా దుష్ప్రచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో కుట్రకు తెగించింది. అందుకోసమే రాజ్ కేసిరెడ్డి విచారణ ప్రక్రియను అడ్డంపెట్టుకుని పన్నాగం రచించింది. ఆయన్ను సోమవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సిట్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకు విచారణ పేరుతో తతంగం నడిపించారు. అనంతరం ఆయన వాంగ్మూలంగా పేర్కొన్నారంటూ ఓ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అందులో మద్యం కుంభకోణం కుట్ర అంటూ కట్టుకథ అల్లారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును ప్రస్తావించడం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ట. సంక్షేమ పథకాలను అమలు చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేలా... మరోవైపు వైఎస్సార్సీపీకి ఫండింగ్ వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించమని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో చెప్పినట్టుగా రాజ్ కేసిరెడ్డి తెలిపారని ఆ నివేదికలో పేర్కొంది. కానీ వాస్తవం ఏమిటంటే... రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం అంటూ సమర్పించిన నివేదికపై ఆయన సంతకం చేయడానికి పూర్తిగా నిరాకరించారని సిట్ నివేదిక వెల్లడించింది. మరి అలాంటప్పుడు ఇక కుంభకోణం ఎక్కడ...? రిమాండ్ నివేదికలో పేర్కొన్న అభియోగాలన్నీ కట్టుకథలేనని సిట్ స్వయంగా అంగీకరించినట్లైంది. సంతకం చేసేందుకు రాజ్ కేసిరెడ్డి నిరాకరించిన విషయాన్ని కూడా ఎందుకు పేర్కొన్నారంటే..న్యాయస్థానంలో హాజరు పరిచేటప్పుడు ‘మీరే చెప్పారా...? సంతకం చేశారా’ అని ఆయన్ను న్యాయమూర్తి ప్రశ్నించే అవకాశం ఉంది. అప్పుడు తమ బండారం బయటపడుతుందని ముందు జాగ్రత్తగా ఆయన సంతకం చేయలేదని వెల్లడించక సిట్ అధికారులకు తప్ప లేదు. కుట్రకు అనుకూలంగా సిట్ అధికారులు ఓ రిమాండ్ నివేదికను సృష్టించి కనికట్టు చేసేందుకు యత్నించారన్నది దీంతో బట్టబయలైంది. ఆ విషయాలను రాజ్ కేసిరెడ్డే వెల్లడించి ఉంటే...ఆయన ఆ వాంగ్మూలం కాపీపై సంతకం చేసేందుకు ఎందుకు నిరాకరిస్తారు?.. అంటే రిమాండ్ నివేదిక పేరిట సిట్ కుట్రకు పాల్పడిందన్నది స్పష్టమైంది. సిట్ అధికారులే న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక దీనికి సాక్ష్యం. నాడు టీడీపీ దుష్ప్రచారమే...నేడు సిట్ రిమాండ్ నివేదికచంద్రబాబు, లోకేశ్, టీడీపీ అధికార ప్రతినిధులు టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన మాటల్నే సిట్ తన రిమాండ్ నివేదికగా న్యాయస్థానానికి సమర్పించడం విడ్డూరంగా ఉంది. అందులో పేర్కొన్నవన్నీ అసత్య ఆరోపణలేననడానికి ఇవిగో తార్కాణాలు..అబద్ధపు వాంగ్మూలాలే కుట్రకు ప్రాతిపదికసిట్ అధికారులు బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలే ప్రాతిపదికగా రిమాండ్ నివేదిక రూపొందించినట్టు వెల్లడైంది. వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితోపాటు అప్పటి ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగానికి తెగబడింది. తాము భయభ్రాంతులకు గురిచేసి బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌తో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాలనే ప్రస్తావించింది. డిస్టిలరీల ఏర్పాటు కోసం విజయసాయిరెడ్డి నివాసంలో ఎంపీ మిథున్ రెడ్డి, బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి తదితరులు సమావేశమై చర్చించినట్టు సిట్ పేర్కొంది. కారు కూతలు... కాకి లెక్కలులేని కుంభకోణం ఉన్నట్టు చూపించే కుట్రటీడీపీ కార్యాలయం చెప్పిన కాకి లెక్కలతో సిట్ అధికారులు తమ రిమాండ్ నివేదికను రూపొందించడం పోలీసు వ్యవస్థ సర్వభ్రష్టత్వాన్ని వెల్లడిస్తోంది. ఏకంగా నెలకు రూ.50కోట్ల నుంచి రూ.60 కోట్ల చొప్పున వసూలు చేసి ఇచ్చారని దుష్ప్రచారానికి తెగబడింది. మళ్లీ అదే నివేదికలో ఆ నిధులను రాజ్ కేసిరెడ్డి దేశంలోనే బంగారం, భూములు, ముడి సరుకు తదితర కొనుగోళ్ల రూపంలో పెట్టుబడి పెట్టారని చెప్పారు. నిధులు వేరే వారికి ఇచ్చారని ఓ చోట... కాదు వివిధ వివిధ స్థిర, చరాస్తులుగా పెట్టుబడి పెట్టారని పరస్పర విరుద్ధంగా పేర్కొనడం సిట్ కుట్రకు నిదర్శనం.మద్యం మాఫియా దోపిడీదారు బాబే సీఐడీ నమోదు చేసిన కేసు సంగతేమిటో...!అసలు విషయం ఏమిటంటే...రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే. మద్యం మాఫియాను ఏర్పాటు చేసి... పెంచి పోషించి వేళ్లూనుకునేలా చేసిన వ్యవస్థీకృత దందాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. అందుకోసం మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలతో మోసానికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. అందుకోసం చీకటి జీవోలు 218, 468 జారీ చేశారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5వేలకోట్లకుపైగా గండి కొట్టారు. ఎంఆర్పీ కంటే ఏకంగా 20శాతం వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20వేలకోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25వేలకోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్య్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతోసహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. ప్రస్తుతం సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వ మద్యం విధానంలో అక్రమాలు మరోసారి వెల్లడయ్యాయి. ఇప్పటికైనా సీఐడీ ఆ కేసు దర్యాప్తు చేపట్టాలని... లేదా సీబీఐకి అప్పగించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబూ...మీరు అందుకు సిద్ధమేనా అని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతోంది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. -
వ్యవస్థల విధ్వంసం: వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వం దేన్నీ వదిలి పెట్టడం లేదు. వైఎస్సార్సీపీ మీద బురదజల్లి, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోంది. రోమన్ రాజుల కాలంలో గ్లాడియేటర్లను పెట్టి.. గ్యాలరీల్లో మనుషులను చంపుకునే పోటీలు పెట్టేవారు. వినోదం కింద రోజుకో దుర్మార్గమైన ఆట ఆడిస్తూ ప్రజలను అందులో మునిగేలా చేసేవారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది. ఏదైనా ముఖ్యమైన సమస్య తలెత్తిన వెంటనే చంద్రబాబు డైవర్షన్ చేస్తున్నాడు. ఏమీ లేకపోతే ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి జగన్ మీద మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నారు. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి : రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించి.. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్రలో కూటమి ప్రభుత్వం నిత్యం మునిగి తేలుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వ్యవస్థలన్నీ దిగజారిపోయేలా చేస్తూ.. వాటి విధ్వంసానికి పాల్పడుతోందని, రాష్ట్రంలో మొదటిసారిగా ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నామని నిప్పులు చెరిగారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ కనిపించదన్నారు. చరిత్రలో తొలిసారిగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి ప్రలోభపెట్టి, భయపెట్టి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని చెప్పారు. ఈ పరిణామాలతో రాష్ట్రం ఎటువైపు వెళ్తోందో అర్థం కావడం లేదని, దుర్మార్గపు సంప్రదాయాలకు తెర లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు చేయడం దారుణమని, ఇదే కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారుల పట్ల ప్రభుత్వ తీరును కోర్టు తప్పు పట్టినా పద్ధతి మార్చుకోలేదన్నారు. మంగళవారం ఆయన తాడుపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. జగన్ ఇంకా ఏమన్నారంటే..అసలు లిక్కర్ స్కాం ఎవరిది? » లోక్‌సభ సభ్యుడు మిథున్‌రెడ్డిని టార్గెట్ చేసి, ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు. తన కాలేజీ రోజుల్లో చంద్రబాబును.. పెద్దిరెడ్డి ఎదిరించారు కాబట్టి.. ఆయన పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష పెట్టుకున్నాడు. లేని ఆరోపణలు సృష్టించి, తప్పుడు సాక్ష్యాలతో వారిని ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌పై సీఐడీ గతంలో కేసు కూడా పెట్టింది. » లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? దుకాణాలకు తోడు పర్మిట్ రూములు, బెల్టుషాపులు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూములు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?» 2014–19 మధ్య చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లు కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ఇప్పుడున్న డిస్టిలరీల్లో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అన్ని పథకాలకు మంగళం ప్రజల నోటిలోకి నాలుగు వేళ్లు ఎందుకు పోవడం లేదు? మన ప్రభుత్వ పథకాలన్నింటినీ ఎందుకు రద్దు చేశారు? సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయి? ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3,500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు? ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.3,900 కోట్లు బకాయి పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కలుపుకుంటే, మొత్తం రూ.7,800 కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చారు. దీనివల్ల ప్రజలు కష్టాల్లో, బాధల్లో మునిగి ప్రభుత్వ నిర్వాకాలపై దృష్టి పెట్టరని అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు అదే చేస్తున్నారు.భూ పందేరాలు.. పనుల్లో యథేచ్ఛగా దోపిడీలులూ గ్రూపునకు రూ.1500–2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే స్టీల్, సిమెంటు రేట్లు పెద్దగా పెరగక పోయినా.. పెరిగాయని చెబుతూ రూ.36 వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేల కోట్లకు పెంచారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానం తీసుకొచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. బటన్లు నొక్కితే దోపిడీకి వీలు కాదని..గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా చంద్రబాబు ఎందుకు బటన్లు నొక్కలేదు అని అడిగాను. బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తుంది. అందుకనే చంద్రబాబు బటన్లు నొక్కడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కానీ దేశ వ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయి. ఏ రైతుకూ గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. దాదాపు 4 లక్షల పెన్షన్లు తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. గతంలోనూ మనపై తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కానీ ప్రజలు మనల్ని నమ్మారు. ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబునాయుడిపై వ్యతిరేకతను కప్పి పుచ్చడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తోంది. కానీ ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబునాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు.వక్ఫ్ చట్టం విషయంలో టీడీపీ వ్యవహార శైలిపై చర్చ వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు సంబంధించి టీడీపీ పార్లమెంట్ ఉభయ సభల్లో మద్దతు పలికి, కింది స్థాయిలో కప్పదాటు వైఖరితో వ్యవహరిస్తోందని పలువురు పీఏసీ సభ్యులు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. టీడీపీ చేసిన ద్రోహాన్ని మైనార్టీలు ఎండగడుతున్నారని.. ఊరూరా ర్యాలీలు, ధర్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ.. వక్ఫ్ చట్టం అన్నది కేవలం ఒక మతానికో, ఒక వర్గానికో సంబంధించినది కాదని, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది కాబట్టే దీనిపై న్యాయపరంగా పోరాడేందుకు సుప్రీంకోర్టులో కేసు వేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గడం గురించి సమావేశంలో చర్చకు వచ్చింది. ధాన్యం, పెసలు, మినుములు, కందులు, శనగలు, పొగాకు, మిర్చి, అరటి, టమాటా, కోకో సహా అన్ని పంటల ధరలు తగ్గిపోయాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని, టారిఫ్‌ల బూచి చూపి రైతులను నిలువునా దోచుకున్నారని చెప్పారు. ఆక్వా రైతులకు మేలు చేయడానికి, వారికి ప్రభుత్వం అండగా ఉండేందుకు మన ప్రభుత్వం హయాంలో చట్టాలు తీసుకు వచ్చి, విద్యుత్ రాయితీలు కూడా కల్పించామని, కానీ ఈ ప్రభుత్వం ఆ చట్టాలను వాడుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులకు జరుగుతున్న నష్టంపై పార్టీ పలు దఫాలుగా స్పందించిందని, దీనిపై పార్టీ పరంగా మరింతగా పోరాటం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని.. కమిటీలుగా ఏర్పడి ముందుకెళ్లాలని వైఎస్ జగన్ చెప్పారు.చంద్రబాబు పెడుతున్న కేసులతో ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరు. 16 నెలల పాటు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కాని ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెడితే, ప్రజలు అంతగా స్పందిస్తారు. కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. ఇందుకు భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తి నింపాలి. - వైఎస్ జగన్యుద్ధ వాతావరణంలో పుట్టిన పార్టీ» పార్టీని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాలను నిర్మిస్తూ వస్తున్నాం. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులందర్నీ నియమించాం. వాళ్లు క్షేత్ర స్థాయిలో గట్టిగా యుద్ధం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ యుద్ధ వాతావరణంలోనే పుట్టింది. పార్టీ పుట్టిన తర్వాత పదేళ్లపాటు మనం యుద్ధ వాతావరణంలోనే ఉన్నాం. రాబోయే రోజుల్లో పార్లమెంటు నియోజకవర్గాలకూ పరిశీలకులను నియమిస్తాం. పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లకు వారు అన్ని రకాలుగా సహాయపడతారు. ఇది పార్టీలో సమన్వయానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ నియామకాల తర్వాత పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతుంది.» జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులు, పీఏసీ ఏర్పాటు.. ఇలా అన్ని రకాలుగా పార్టీ నిర్మాణం అవుతోంది. కింది స్థాయిలో జిల్లా కమిటీలు, నియోజకవర్గాల కమిటీలు, మండల స్థాయి కమిటీలు కూడా దాదాపు ఏర్పాటయ్యాయి. ఇక గ్రామ స్థాయికి కూడా పార్టీ వెళ్లాలి. బూత్ లెవెల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే ఆరు నెలల్లో మొత్తం నిర్మాణం పూర్తి కావాలి. మన పార్టీ బలోపేతంగా ఉంటేనే, మనకు చాలా ప్రయోజనకరం. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. » ప్రజల తరఫున మనం పోరాటాలు ఇప్పటికే మొదలుపెట్టాం. ఈ పోరాటాలు మరింత ముమ్మరం అవుతాయి. వచ్చే రెండు, మూడేళ్లలో ప్రజల తరఫున ప్రణాళికా బద్ధంగా పోరాటం చేస్తాం. చివరి ఏడాదిలో ఎన్నికలపై దృష్టి పెడతాం. పార్టీ పీఏసీ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలి. ప్రజల తరఫున గొంతు విప్పాలి. అందరూ ప్రజల తరఫున మాట్లాడాలి. దీనివల్ల అన్ని అంశాలూ ప్రజల్లోకి వెళ్తాయి.» మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నాయి. సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామ స్థాయిలో కార్యకర్తలను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్ అనే ఒక బ్రహ్మాండమైన సా«ధనాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి.» కష్టాల నుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పోరాటాలు, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పని తీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు. పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది.. ప్రజల్లోకీ వెళ్తుంది. ఈ మూడేళ్లూ ప్రజల్లోకి ఉధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి. పోరాటం చేయాలి. ఇందులో ఎలాంటి రాజీ పడొద్దు. -
దెబ్బతిన్నా తిరిగి లేస్తాం: కేటీఆర్
శూన్యం నుంచి సునామీని సృష్టించి లక్ష్యాన్ని చేరుకున్న అసాధారణ నేత కేసీఆర్. ఆయన మార్గదర్శకత్వంలో పని చేయడం పూర్వజన్మ సుకృతం. బీఆర్ఎస్ మాత్రమే రాజీ పడకుండా కొట్లాడి తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది కాబట్టి పార్టీ తిరిగి అధికారంలోకి రావాలనే భావన ప్రజల్లో బలంగా ఉంది..రాబోయే రోజుల్లో కేంద్రంలో సొంత బలంతో ఏ జాతీయ పార్టీ అధికారంలోకి రాదని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. బీఆర్ఎస్తో పాటు దెబ్బతిన్న ప్రాంతీయ పార్టీ లు తమ సొంత రాష్ట్రాల్లో పుంజుకుని మరింత బలంగా ఎదుగుతాయని అన్నారు. దెబ్బతిన్నా తిరిగి నిల్చుంటామని స్పష్టం చేశారు. తమకు ఎదురైంది తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమేనని, తిరిగి ప్రజాదరణ పొందుతామని చెప్పారు. కేంద్రంలో బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోందని, తెలంగాణలో బీజేపీతో కలిసి టీడీపీ, పవన్ కల్యాణ్ వచ్చినా బీఆర్ఎస్ అఖండ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కుల, మతాలు అనే తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడే పార్టీ లు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ యే రక్షణ కవచం. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా. బీఆర్ఎస్ ఎంత బలంగా ఉంటే తెలంగాణకు అంత లాభం.’’ఇక్కడి ప్రజలపై మాకు ఉన్న ప్రేమలో అణువంత కూడా ఢిల్లీ పార్టీలకు ఉండదు. అందుకే 25 ఏళ్లుగా తెలంగాణ ఇంటి పార్టీగా ఉన్న బీఆర్ఎస్ను మరో 50 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ప్రజలు కాపాడుకోవాలి..’అని కేటీఆర్ అన్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీగా అవతరించి బీఆర్ఎస్గా కొనసాగుతున్న పార్టీ 25 ఏళ్ల ప్రస్థానం, పదేళ్ల పాలన, రజతోత్సవాలు, వర్తమాన రాజకీయాలు, తదితర అంశాలపై ఆయన స్పందించారు.సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గాపార్టీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని ఎలా చూస్తున్నారు? కేటీఆర్: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీ లు రజతోత్సవాలు నిర్వహించుకోవడం ఆషామాషీ కాదు. అధికారం కోసం కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పుట్టిన పార్టీ బీఆర్ఎస్. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లు చాలా పార్టీ లు ఒక లక్ష్యం కోసం ప్రారంభమై గమ్యాన్ని చేరుకోక మునుపే మూత పడతాయి. ‘‘టీఆర్ఎస్ పిడికెడు మందితో ప్రారంభమై 60 లక్షల మంది సభ్యులు ఉన్న బీఆర్ఎస్గా ఎదిగింది. ఉద్యమం, అధికారం, ప్రతిపక్షం..ఇలా ప్రజలు ఏ పాత్ర ఇచ్చినా వారి గొంతుకగా నిలుస్తున్నాం. మరో 50 ఏళ్ల పాటు పార్టీ నిలిచేలా చేసే అద్భుతమైన నాయకత్వం మా పార్టీ సొంతం. 25 ఏళ్ల ప్రస్థానంలో పార్టీ పేరు మాత్రమే మారింది. మా జెండా, ఎజెండా, గుర్తు, నాయకుడు, సిద్ధాంతం మారలేదు..’’ప్రజల బాగోగులు ఎజెండాగా పని చేయడమే మా పార్టీ భావజాలంసాక్షి: ఉద్యమ సమయంలో సవాళ్ల నడుమసాగిన ప్రయాణం ఎలా అనిపించింది? కేటీఆర్: మొండితనం, పట్టుదల, నమ్మిన సిద్ధాంతంపై రాజీ పడకపోవడం, నిజాయితీ.. ఇవే కేసీఆర్ ఆస్తులు. ధన, కుల, మీడియా బలం లేకున్నా పార్టీని ప్రారంభించి తెలంగాణ అస్తిత్వాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. అపజయాలు, ఎదురుదెబ్బలు, అవమానాలతో రాటుదేలిన కేసీఆర్‌కు ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చుకునే శక్తి ఉంది. పార్టీని ప్రారంభించింది మొదలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంటూ చరిత్ర మార్చిన నాయకుడు ఆయన. కేసీఆర్ ఆమరణ దీక్ష వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ సాధించిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. పదేళ్లు అధికారంలో ఉన్నదాని కంటే ఎక్కువ సంతృప్తినిచ్చింది.కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనంపై ఎందుకు వెనక్కి తగ్గారు? పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత సోనియాఇంటికి వెళ్లి పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పారు. సోనియా సూచన మేరకు దిగ్విజయ్ సింగ్‌తో విలీనంపై జరిపిన సంప్రదింపుల్లో కాంగ్రెస్నిజాయితీగా స్పందించలేదు. తనను నమ్ముకున్న వందలాది మందినాయకులు, వేలాది మంది కార్యకర్తల రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వకపోవడంతో విలీనం ప్రతిపాదనను కేసీఆర్ విరమించుకున్నారు. తమిళనాడులో డీఎంకే తరహాలో తెలంగాణకు ఒకగొంతు ఉండాలని పౌర సమాజం నుంచి ఒత్తిడి కూడా రావడంతో స్వతంత్రంగా ఉండేందుకే కేసీఆర్ ఇష్టపడ్డారు.సాక్షి: కొత్త రాష్ట్రంలో ప్రజలు ఐదేళ్లు అధికారం ఇస్తే ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారు? కేటీఆర్: జమిలి ఎన్నికల పేరిట రెండు జాతీయ పార్టీ లు నాటకం ఆడుతున్న సమయంలో తెలంగాణను దేశం ముందు ఆవిష్కరించేందుకు 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాం. ఆరు నెలల పదవీ కాలాన్ని పక్కన పెట్టి ఎన్నికలకు వెళితే 88 సీట్లతో అసాధారణ గెలుపు నమోదు చేశాం. ఇది కేసీఆర్ సమర్థతకు ప్రజలు ఇచ్చిన సరి్టఫికెట్. రెండో టర్మ్‌లో పెద్ద నోట్ల రద్దు, కరోనాతో ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా సమర్థవంతమైన నాయకత్వం అందించాం. మూడోసారి కాంగ్రెస్ హామీలు, గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అయినా మేము తుడిచి పెట్టుకుపోలేదు. కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ మోడల్ సాధించిందేమిటి? 2014లో తెలంగాణలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను అధిగమించి విద్యుత్, సాగునీరు, తాగునీరు సహా అనేక అంశాల్లో తన దూరదృష్టితో కేసీఆర్ సమగ్ర, సమతుల్య, సమీకృత అభివృద్ధి నమూనాను ఆవిష్కరించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలను కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు అనుసరించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వినతులు మేరకే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా విస్తరించాలనే ఆలోచన వచ్చింది. భవిష్యత్తులోనూ జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ తన వంతు పాత్ర పోషిస్తుంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని సమీక్షించుకున్నారా? పదేళ్ల పాలనలో మేము చేసిన మంచి పనులను సరిగా ప్రచారం చేసుకోలేక పోయాం. విప్లవాత్మక పథకాలు అమలు చేసినా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయాం. నాతో పాటు ద్వితీయశ్రేణి నాయకులు కూడా ఓటమికి కారణం. మరోవైపు కాంగ్రెస్ ఉన్నది లేనట్లుగా చిత్రీకరించడంతో ప్రజలు మోసపోయారు. మైనారిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం తదితరాలు ప్రభావం చూపాయి. రాజకీయ పునరేకీకరణతో బహుళ నాయకత్వ సమస్యతో ఓటమి చెందామనే వాదన కూడా సరికాదు. ఇది తాత్కాలికమైన చిన్న ఎదురుదెబ్బ మాత్రమే. శాశ్వతంగా ఇదే పరిస్థితి కొనసాగదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజాదరణ రుజువు చేసుకుంటాం. ఫామ్‌హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ అనే విమర్శలను ఎలా చూస్తారు? అధికారం చేతిలో పెట్టినా రాష్ట్రాన్ని నడపలేక చేసే విమర్శలు అవి. కేసీఆర్ ఆయన నియోజకవర్గంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆయన ఎక్కడ ఉన్నా మమ్మల్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్లో ఇటీవల ఫామ్‌హౌస్ పాలన కావాలా, కాంగ్రెస్ పాలన కావాలా అని పోల్ పెడితే ప్రజలు ఫామ్‌హౌస్ వైపు మొగ్గు చూపారు. ఇక సీఎం రేవంత్ కూడా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం. పార్టీ కి వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరం ఎందుకు వచ్చింది? తెలంగాణ బిడ్డగా కేసీఆర్ స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చా. ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌పై పనిభారం తగ్గించేందుకు 2018 డిసెంబర్లో నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఆరున్నరేళ్లలో 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, 60 లక్షల సభ్యత్వం, అనేక ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచాం. అధికారం కోల్పోయినా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నా. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, కేసీఆర్‌కు అనారోగ్యం వంటి సమస్యలు ఎదురైనా కేడర్‌లో విశ్వాసం కల్పించాం. పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధించేలా పనిచేస్తా.పార్టీ రజతోత్సవంసందర్భంగా మీ సందేశం తెలంగాణ ఇంటి పార్టీ మాది.రాబోయే రోజుల్లో విద్యార్థి, యువజన, మహిళా విభాగాలను బలోపేతం చేసి సంస్థాగతంగా బలోపేతం చేస్తాం.కేసీఆర్‌ను తిరిగి సీఎం చేసేంత వరకు ఒక కార్యకర్తగా పనిచేస్తా.నాతో కలిసి వచ్చే పార్టీ శ్రేణులనుకంటికి రెప్పలా కాపాడుకుంటా. బీజేపీ నుంచి కొత్త పోటీఎదురవుతోందా?కేసీఆర్ స్థాయి రాష్ట్ర రాజకీయాల్లో ఏ ఇతర నేతకూ లేదు. మేం బ్యాగులు, చెప్పులు మోసే నాయకులం కాదు. ఎవరికీ తలవంచకుండా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ దశాబ్దాల కల నెరవేర్చిన నాయకుడు కేసీఆర్. తెలంగాణలో జరిగిన మూడు ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ దాటలేదు. మోదీకి ఆదరణ క్రమంగాతగ్గుతున్న తరుణంలో ఆ పార్టీని పోటీగా భావించడం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ అఖండ మెజారిటీ సాధిస్తుంది. మరోవైపు రేవంత్.. సొంతూరుకు చెందిన మాజీ సర్పంచ్ మొదలుకుని రాష్ట్రమాజీ ముఖ్యమంత్రిపైనా ఆరోపణలతో అక్రమ కేసులు పెడుతూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు.ప్రజల దృష్టిలో కాంగ్రెస్, బీజేపీ పలుచన అవుతున్నాయి.−కల్వల మల్లికార్జున్‌రెడ్డి -
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
తాడేపల్లి : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైఎస్సార్ సీపీ నుండి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే సస్పెండ్ చేసినట్టు సమాచారం. -
Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై
అమరావతి,సాక్షి: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకు రాజ్యసభ సీటు దాదాపూ ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.మంగళవారం సీఎం చంద్రబాబు, కేంద్రహోమంతి అమిత్‌షా భేటీలో ఖరారైనట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది.ఈ సీటును అన్నామలైకు ఇచ్చేందుకు చంద్రబాబు సుమఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిఇటీవల, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై (K Annamalai) ఆ పదవికి రాజీనామా చేశారు. త్వరలో రాష్ట్ర కొత్త అధ్యక్షుడ్ని బీజేపీ నియమిస్తుందని ఆయన తెలిపారు. అయితే ఆయన రాజీనామాకు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలేనని తెలుస్తోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తుకు సిద్ధమైంది. అయితే 2023లో అన్నాడీఎంకే నేతలను అన్నామలై తీవ్రంగా విమర్శించారు. తాజా పొత్తు నేపథ్యంలో అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాలని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి బీజేపీ అధిష్టానానికి షరతు విధించినట్లు సమాచారం. అన్నాడీఎంకే షరతు మేరు అన్నామలైను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించినట్లు సమాచారం. ఇక ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది.ఈ సీటును అన్నామలైకు ఇచ్చేలా కమలం పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
‘ఆ విషయంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?’
తాడేపల్లి : లిక్కర్ స్కామ్ ను వైఎస్సార్ సీపీ పై మీద వేసి తాము రాష్ట్రాన్ని దోచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎత్తుగడ వేశారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. అసలు లిక్కర్ స్కామ్ జరిగిందే చంద్రబాబు హయాంలోనని, 2014 19లో లిక్కర్ స్కామ్ జరిగిందని సీఐడీ చంద్రబాబు మీద కేసు పెట్టిన విషయాన్ని టీజేఆర్ ప్రస్తావించారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ ఆ లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు ఏ 3గా ఉన్నారు. దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?, టీడీపీ నేతలకు చెందిన డిస్టిలరీలకు అడ్డదిడ్డంగా కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందుకోసం ఎక్సైజ్ పాలసీనే చంద్రబాబు మార్చారు. ప్రభుత్వానికి రావాల్సిన రూ.2,984 కోట్లు తమవారి జేబుల్లోకి వేసుకున్నారు. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వానికి నష్టం, టీటీడీ నేతలకు లాభం జరిగింది. ఆ స్కామ్ గురించి మాట్లాడటం లేదు. 2019లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పట్నుంచి పోలింగ్ మధ్యలో అనేక డిస్టలరీలకు ఎందుకు అనుమతులు ఇచ్చారు?, క్యాబినెట్ కు తెలియకుండానే నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలి. బార్లకు మేలు చేస్తూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వెనుక కారణం ఏమిటి?, వీటిన్నంటిపై విచారణ చేస్తే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నాడంటూ వాసుదేవరెడ్డి మీద నాలుగు కేసులు పెట్టారు. కాగితాలపై సంతకాలు పెట్టించుకుని రిలీవ్ చేయటం వెనుక కారణం ఏంటి?, ఈ అక్రమ కేసులు పెట్టడం ద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అధికారులు గుర్తుంచుకోవాలి. ఇష్టానుసారం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి లిక్కర్ పాలసీతో ఏం సంబంధం ఉంది?, చిత్తూరులో చంద్రబాబుకు ప్రత్యర్థిగా ఉన్నందున అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా?, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిజంగా కేసిరెడ్డికి లిక్కర్ పాలసీ గురించి తెలిసి ఉంటే బేవరేజ్ కార్పోరేషన్ లో పదవి ఇచ్చేవాళ్లం కదా? , ఆయన ఐటీకి సంబంధించి సలహాదారుడు మాత్రమే. చంద్రబాబు, జగన్ హయాంలో లిక్కర్ పాలసీలపై చర్చకు మేము సిద్ధం. ప్రజలు పడుతున్న కష్టాలపై ఎల్లోమీడియా ఎందుకు చర్చలు పెట్టటం లేదు?పులివెందుల ఎమ్మెల్యే పదవిని రద్దు చేసి తిరిగి గెలిచే దమ్ముందా?, ఎన్నికలలో పోటీ చేసే సత్తా టీడీపీ కి ఉందా?, చంద్రబాబు సాధించిన ఘనత వైన్ షాపులు, పర్మిట్ రూములు పెట్టడమే. అధిక ధరలకు మదగయం అమ్ముతుంటే ఒక్క కేసు కూడా ఎక్సైజ్ శాఖ ఎందుకు నమోదు చేయలేదు? , విజయసాయిరెడ్డి ఎవరితోనో కమిట్ అయ్యారు. అందుకే మాపై ఆరోపణలు చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు టీజేఆర్. -
‘మా ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని వదిలిపెట్టం’.. పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డికి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (nhrc) ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్లలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగానే ఉన్నా, భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్టప్రకారం లేదని దుయ్యబట్టింది. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది.ఎన్హెచ్ఆర్సీ నివేదిక విడుదలతో లగచర్ల బాధితులు హైదరాబాద్ నందినగర్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా, సీఎంగా సిగ్గుపడాలి. లగచర్లలో మహిళలపై దాడి చేశారు. బాధితుల పకక్షాన ఎన్హెచ్ఆర్సీని సంప్రదించాం. పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మళ్లీ సుప్రీం కోర్టుకు వెళతాం. లగచర్లలో ఓవర్ యాక్షన్ చేసిన అధికారులను వదలం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్షిస్తాం’ అని హెచ్చరించారు. -
'చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలు'
సాక్షి, తాడేపల్లి: హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లేనిపోని హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు ఎవరూ భయపడరని ఆర్కే రోజా అన్నారు.దమ్ముంటే ఫైబర్ నెట్, స్కిల్ స్కామ్‌పై విచారణ జరిపించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకం ఎందుకు అమలు కాలేదు?. చంద్రబాబు మొదటి సంతకం చిత్తు కాగితంతో సమానం. గ్రామాల్లోకి టీడీపీ నేతలు వెళ్ళే ధైర్యం ఉందా?. డైవర్షన్ డర్టీ కేసులతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసే వాళ్లు భవిష్యత్‌లో జైలులో ఉంటారు. పోలీసు అధికారులకు హైకోర్టు అనేకసార్లు అక్షింతలు వేసింది. రాష్ట్రాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నాడని గతంలో మోదీనే చెప్పారు’’ అని ఆర్కే రోజా గుర్తు చేశారు.‘‘అమరావతిలో 36 వేల కోట్ల టెండర్లు.. 77 వేల కోట్లకు ఎందుకు పెంచారు?. అమరావతి టెండర్ల అంచనాలు పెంచి దోపిడీకి సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు ఆయన మనుషులు తప్పితే ఎవరూ అభివృద్ధి చెందకూడదా?. అమరావతి రాజధాని టెండర్లపై ప్రధాని మోదీ విచారణ జరిపించాలి. రూపాయి కూడా అవినీతి లేకుండా వైఎస్ జగన్ లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా? తెలంగాణకు ముఖ్యమంత్రా?. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని రోజా ఎద్దేవా చేశారు...చంద్రబాబు మళ్లీ తన నిజ స్వరూపం చూపిస్తున్నారు. డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతున్నారు. రైతుల వెన్నుముక విరిచేశారు. ల్యాండ్, లిక్కర్, మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు డర్టీ డైవర్షన్ పాలిటిక్స్‌కి నిదర్శనం. తప్పు చేయని పీఎస్ఆర్ని అరెస్టు చేయటం దారుణం. కొందరు పోలీసులు తీవ్రమైన తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన వారెవరినీ వదిలిపెట్టేదే లేదు. అలాంటి వారందరినీ జైలుకు పంపుతాం. స్కిల్ కేసులో అక్రమాలు చేసి చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆయన తప్పులను ఈడీ కూడా గుర్తించి కొందరిని అరెస్టు చేసింది. ఆ కేసును చంద్రబాబు ఎందుకు తొక్కి పెట్టారు?. చంద్రబాబుకు దమ్ముంటే తన కేసులపై సీబిఐ విచారణ జరిపించండి..చంద్రబాబు సంతకాలకు విలువ లేదు. నాలుగోసారి సీఎం అయినా మొదటి సంతకానికే దిక్కులేదు. హామీలు అమలు చేయలేని పాలకులు జనంలోకి వెళ్తే జనం వెంటపడి కొడతారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద విష రాజకీయాలు చేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అమరావతిలో గతంలో రూ.36వేల కోట్లతో టెండర్లు వేశారు. ఇప్పుడు అవే పనులకు రూ.76 కోట్లకు ఎలా పెంచారో ప్రధాని గుర్తించాలి. రాజధానిలో ఆయన మనుషులు, ఆయన కులంవారు తప్ప మరెవరూ ఉండకూడదా?. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండకూడదా?. దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా చంద్రబాబు ఎలా అయ్యారో జనానికి తెలుసుకుప్పంలో చంద్రబాబు ఎందుకు ఇల్లు కట్టు కోలేదు?. అమరావతిలో మాత్రమే ఇల్లు కట్టుకోవడం వెనుక కారణం ఏంటో జనానికి చెప్పాలి. వీకెండులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు?. చంద్రబాబుది విజన్ కాదు.. విస్తరాకుల కట్ట. ఆయనపై ఉన్న కేసులను విచారిస్తే ఎవరు విజనరీనో, నేరస్తుడో తేలుతుంది. ప్రధాని మోదీ.. చంద్రబాబు అక్రమాలపై విచారణ జరపాలి. అమరావతిలో శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని.. చంద్రబాబు మీద విచారణకు ఆదేశించాలి. అడ్రెస్ కూడా లేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాల భూమిని ఎలా ధారాదత్తం చేశారు?. దావోస్ వెళ్తే ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టటానికి రాలేదు. కానీ ఊరూ పేరు లేని కంపెనీలకు భూములు ఇవ్వటం వెనుక కారణాలేంటి?ఉర్సా భూముల కేటాయింపును వెంటనే ఆపేయాలి. టీటీడీ గోశాలలో 191 ఆవులు చనిపోతే అసలేమీ చనిపోలేదని చంద్రబాబు నిస్సిగ్హుగా మాట్లాడుతున్నారు. గోవుల మృతిపై ఛాలెంజ్‌లు చేసి వెనక్కు వెళ్లారు. తిరుమలలో తాగి మర్డర్లు చేసుకునే పరిస్థితులు తలెత్తాయి. శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోవటం అనర్ధం. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. తిరుమల, శ్రీకూర్మం ఘటనలపై ఎందుకు నోరు మెదపటం లేదు?. చంద్రబాబు చేస్తున్న తప్పులు బీజేపీకి కనపడటం లేదా?. జగన్ అధికారంలోకి వచ్చాక 43 వేల మద్యం బెల్టుషాపులు తొలగించాం. మద్యం షాపులను బాగా తగ్గించాంమద్యం షాపులు పెంచితే లంచాలు వస్తాయా? తగ్గిస్తే వస్తాయా?. మిథున్‌రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అసలు మద్యం పాలసీకి, మిథున్‌రెడ్డి కి ఏం సంబంధం?. చంద్రబాబు లక్ష కోట్లు రాజధానిలో పెట్టి, కమీషన్లు కొట్టేస్తున్నారు. చంద్రబాబు లిక్కర్ పాలసీ వలనే మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయి. రాజకీయాల కోసం భగవంతుడిని వాడుకుంటే కష్టాలు తప్పవని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రహించాలి. పిఠాపురంలో మహిళపై అత్యాచారం జరిగినా పవన్ పట్టించుకోలేదు. దళితులను వెలేసినా పట్టింపులేదు. చంద్రబాబుకు కష్టం, నష్టం వచ్చినప్పుడు మాత్రమే పవన్ బయటకు వస్తారు’’ అంటూ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
విజయసాయిరెడ్డి చంద్రబాబు చేతిలోకి వెళ్లారు: అంబటి
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.సూట్‌కేస్ కంపెనీ ఉర్సుకు విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టారని, రాజధాని అమరావతిలో కోట్ల రూపాయల కమిషన్లు విలువైన పనులను కావాల్సిన వారికి కట్టబెట్టి కోట్లాధి రూపాయలు కమీషన్లుగా దండుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుంచి వారి దృష్టిని మళ్ళించేందుకే ఈ తాజా అరెస్ట్‌ల డ్రామాకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గాలకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆయనేమన్నారంటే..తన అవినీతి, అసమర్థ పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తున్నారు. అరెస్ట్‌లకు ఎవరూ అతీతం కాదని చంద్రబాబు అంటున్నారు. తనకు నచ్చని వారిని ఎవరినైనా సరే అరెస్ట్ చేసేస్తాననే పద్దతిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులును హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన ఏపీలో అనేక చోట్ల పనిచేశారు. నీతీ, నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు.పదోన్నతులతో డీజీపీ స్థాయికి వచ్చారు. డీజీపీ కావాల్సిన అధికారిని ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. గతంలో ఒక కేసులో ఆనాటి ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్లుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై కూడా ఎదురు కేసులు నమోదు చేశారు. వారిద్దరూ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పీఎస్ఆర్ ఆంజనేయులు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకు వెళ్లలేదు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదు. ఈ రోజు హఠాత్తుగా ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.డైవర్షన్ పాలిటిక్స్‌లో చంద్రబాబు సిద్దహస్తుడుఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయలేకపోతున్నాను, బడ్జెట్ చూస్తుంటే భయం వేస్తోందంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తూ చంద్రబాబు అబద్దాల కోరు అని జనం చర్చించుకుంటున్నారు. ఒక్క హమీని కూడా నెరవేచ్చని దుర్మార్గమైన పాలన సాగుతోంది. దీనిపై ప్రజల దృష్టిని మళ్ళించేందుకు తాజాగా ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు. ఉర్సు అనే కంపెనీకి విశాఖలో మూడు వేల కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 99 పైసలకు ఎకరం చొప్పున ఇచ్చేశారు. ఇది దోపిడీ కార్యక్రమం కాదా?ఇది ప్రజలు చర్చించుకోకుండా పీఎస్ఆర్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కసిరెడ్డిలను అరెస్ట్ చేసి, దానిపై పెద్ద హంగామా సృష్టిస్తున్నారు. మరోవైపు రాజధాని పేరుతో విపరీతంగా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువస్తున్నారు. ఆ సొమ్ముతో కాంట్రాక్ట్‌లకు ఇస్తూ, వారి నుంచి కమిషన్లు దండుకుంటున్నారు. ఈ పనులకు రెండో తేదీన అమరావతిలో రెండోసారి శంకుస్థాపనకు ప్రధానమంత్రిని ఆహ్వానించారు. విపరీతమైన దోపిడీతో రాష్ట్రం సతమతమవుతోంది.లిక్కర్, ఇసుక, మట్టి పేరుతో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలోని టీడీపీ నాయకులు, చంద్రబాబు, నారా లోకేష్‌లు విపరీతంగా దోచుకుంటూ, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కేవలం పదకొండు నెలల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం దేశంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒక్కటే. ఏపీలో లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే, దానిలో కుంభకోణం ఎలా జరుగుతుంది. ఒక్క కొత్త డిస్టలరీకి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గత ప్రభుత్వం కన్నా తక్కువ రేట్లకే మద్యం విక్రయించాం, బెల్ట్ షాప్‌లను తొలగించాం దీనికి ఎవరైనా లంచాలు ఇస్తారా? పర్మిట్ రూంలు ఎత్తేస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టలరీలకు అర్డర్లు ఇచ్చాం. దీనిలో ఏదో స్కాం జరిగిపోయిందంటూ చంద్రబాబు హంగామా చేస్తున్నారు.రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారుకూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని తప్పుడు కేసులతో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? చంద్రబాబే శాశ్వతంగా సీఎంగా ఉంటారా? సీఎంలు మారితే ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయవచ్చా? డీజీపీలుగా పనిచేసిన వారిని కూడా అరెస్ట్‌లు చేయవచ్చా? ఏమిటీ ఈ అన్యాయం? కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గాలపై న్యాయస్థానాలు వాతలు పెడుతున్నా వారికి బుద్ది రావడం లేదు. పోసాని కృష్ణమురళిపై బీఎన్ఎస్ 111 సెక్షన్ పెట్టినందుకు సదరు విచారణాధికారిని కోర్ట్ ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తి మీద ఎక్స్ట్రార్షన్ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే, కోర్టు దానిని తీవ్రంగా ఆక్షేపించింది. అవసరమైతే డీజీపీని కోర్ట్‌కు పిలుస్తామని కూడా హెచ్చరించాయి. కలకాలం చంద్రబాబే సీఎంగా ఉండరని గుర్తుంచుకోవాలి. పరిపాలన చేయలేక, కక్షసాధింపులతో పనిచేస్తున్నారు. కూటమి పార్టీలకు ఓటు వేసిన వారు సిగ్గుపడేలా పరిపాలన చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని పాలన చేయాలనుకున్న వారు ఎవరూ మనజాలలేదు.గోరంట్ల మాధవ్ వ్యవహారంలో పదకొండు మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇది కక్షసాధింపు చర్యలు కావా? నిజంగా పోలీసులు తప్పు చేశారని నిర్ధారిస్తే దీనికి బాధ్యత వహించి హోమంత్రి రాజీనామా చేయాలి. డీజీపీ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు పోలీసులు ఆలోచించాలి. మీ తోటి అధికారులను కక్షసాధింపుల్లో భాగంగా తప్పుడు కేసులతో మీతోనే అరెస్ట్ చేయించింది. ఇదే పద్దతి కొనసాగితే రేపు ప్రభుత్వాలు మారితే మీమ్మల్ని కూడా అరెస్ట్ చేసేయవచ్చు కదా? ఈ సంప్రదాయం వల్ల ఎవరికి నష్టం జరుగుతోంది? ప్రతి ఐపీఎస్ అధికారి దీనిపై ఆలోచించుకోవాలి.అణిచివేస్తే భయపడతామా?గతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ఇందిరాగాంధి, జయలలిత, వైయస్ జగన్ వంటి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేసిన ఐపీఎస్ అధికారులపై వారి ప్రభుత్వాలు వచ్చిన తరువాత ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? చంద్రబాబును అరెస్ట్ చేశారనే కక్షతోనే ఇలా అరెస్ట్‌లు చేసుకుంటూ పోతున్నారు. రేపు చంద్రబాబు, లోకేష్‌లు మాజీలు కాకుండా పోతారా? ప్రభుత్వాలు మారి, మీరు ప్రతిపక్షంలోకి రాకుండా పోతారా? ఎవరు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని అరెస్ట్ చేస్తారా?కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మరింత బలంగా ఈ అక్రమాలపై పోరాడేందుకు ముందుకు వచ్చే పరిస్థితిని కల్పిస్తున్నారు. మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉన్నారు. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. మూడున్నరేళ్ళ పదవీకాలాన్ని విజయసాయిరెడ్డి వదులుకున్నారు. కూటమి కోసం తన పదవిని వదిలేశారు. కూటమికి లాభం చేసే నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వ్యక్తి మాటలకు, సాక్ష్యాలకు విశ్వసనీయత ఏముంటుందీ? వారి మాటలకు, వాదనలకు విలువ ఏముంటుందీ? -
చంద్రబాబు.. మరీ ఇంతగానా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసాలు విన్నా.. చదివినా రక్తపోటు, మధుమేహం గ్యారెంటీ అనిపిస్తోంది. కించపరచాలన్న ఉద్దేశం కాదు కానీ.. ఇటీవలి కాలంలో ఆయన అబద్ధాలకు, అతిశయోక్తులకు అంతు లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ విషయంలో ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు. స్వోత్కర్ష వరకూ ఓకే గానీ.. మితిమీరితే అవే ఎబ్బెట్టుగా మారతాయి.కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం మూడు మతాలను వాడుకుంటున్నట్లు ఆరోపించారు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు. కూటమి సర్కారు పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ ఏనాడైనా జగన్ మతపరమైన అంశాలు మాట్లాడారా? లేదే! కానీ జగన్ ఫోబియాతో బాధపడుతున్న చంద్రబాబు మాత్రం ప్రతిదానికీ మాజీ సీఎంపై అభాండాలు వేసేస్తున్నారు. ఈ తీరు చూసి ఆయన కేబినెట్ మంత్రులే విస్తుపోతున్నట్లు కథనాలు వచ్చాయి. జగన్‌ను ఎందుకు విమర్శించడం లేదు.. అంటూ సీఎం ప్రశ్నిస్తున్నారని ఒక మంత్రి వాపోయారట.తిరుమల గోవుల మరణాలపై భూమన కరుణాకర రెడ్డి వెలుగులోకి తీసుకు వచ్చిన విషయాలపై ఎందుకు మాట్లాడడం లేదని సీఎం అన్నారట. టీటీడీ ఛైర్మన్, ఈవో, సీఎం తలా ఒక్కోలా మాట్లాడుతూంటే వాటిల్లో దేన్ని ప్రామాణికంగా తీసుకుని తాము మాట్లాడాలని ఒక మంత్రి తన సన్నిహితులతో వాపోయినట్లు సమాచారం. గోవులేవీ చనిపోలేదని సీఎం చెబుతూంటే.. వృద్ధాప్యంతో 23 ఆవులు మరణించాయని టీటీడీ ఛైర్మన్, 43 ఆవులు చనిపోయాయని ఈవో చెబుతున్నారని దీన్నిబట్టి చూస్తే సీఎం అబద్ధమాడినట్లే కదా అని మంత్రులు కొందరు ఉన్నట్లు తెలుస్తోంది.జగన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డితో అబద్ధాలు చెప్పించారని చంద్రబాబు ఆరోపిస్తూన్నారు. భూమన ఎవరైనా చెబితే మాట్లాడే వ్యక్తేనా? తను నమ్మితే, ఆధారాలు ఉంటేనే మాట్లాడతారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అందువల్లే ఆయన ధైర్యంగా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేసిన సవాల్‌ను స్వీకరించి తన ఆరోపణలను రుజువు చేయడానికి సిద్దమయ్యారు. పల్లా అసలు తిరుపతి రాకుండా ముఖం చాటేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు గోశాల వద్దకు వెళ్లి హడావుడి చేసి భూమన రావడం లేదని వ్యాఖ్యానించారు. తీరా చూస్తే భూమనను పోలీసులు అడ్డుకోవడం, గృహ నిర్భంధం చేయడం అందరు చూశారు.టీడీపీ నిస్సిగ్గుగా డబుల్ గేమ్ ఆడిన విషయం బహిర్గతమైంది. భూమన తిరుమల గోవుల, లేగ దూడల మరణాల గురించి ఆధార సహితంగా బయటి ప్రపంచానికి తెలియ చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు అసలు గోవుల మరణాలు జరగలేదని అబద్దం చెప్పారన్నది చాలామంది భావన. దానిని టీటీడీ చైర్మన్, ఈవోలే నిర్థారించారు. దాంతో ఏమి చేయాలో పాలుపోని స్థితి చంద్రబాబుకు ఏర్పడింది. అయినా టీడీపీలో అందరూ తన వాదననే ప్రచారం చేయాలన్నది సీఎం ఉద్దేశం కావచ్చు. ఇలాంటివి విన్నా, చదివినా ఎవరికైనా రక్తపోటు రాకుండా ఉంటుందా?. హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర అని ఆయన అంటున్నారు.అసలు అలాంటి ఆలోచనలు చేయడంలో చంద్రబాబుకు ఉన్నంత సమర్ధత మరెవరికైనా ఉంటుందా అన్నది విశ్లేషకుల ప్రశ్నగా ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్‌పై ఒక పచ్చి అబద్దాన్ని ప్రచారం చేశారే. వెంకటేశ్వర స్వామి తన ఇంటి దైవం అని చెప్పుకుంటూనే, తిరుమల ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించి తీరని అపచారం చేశారే! పోనీ అది నిజమని ఇంతవరకు ఎక్కడైనా రుజువు చేశారా? ఈ విషయంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరచామన్న కించిత్ పశ్చాత్తాపం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారే?. నిజంగా దైవ భక్తి ఉన్నవారెవరైనా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా?. పవన్ కళ్యాణ్ కూడా ఆయన దారిలోనే పిచ్చి ఆరోపణలు చేసి పరువు పోగొట్టుకున్నారే! లడ్డూ వివాదాన్ని ఎలాగొలా జగన్‌కు అంటగట్టాలని విశ్వయత్నం చేశారే. కాని విఫలమయ్యారే. ఆ తర్వాత అయినా చేసిన పాపం కడుక్కోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? అంటే లేదే !జగన్ టైమ్‌లో ఏ చిన్న విషయం దొరికినా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. అంతర్వేది వద్ద ఆలయ రథం దగ్దమైతే బీజేపీ, జనసేనలతో కలిసి చంద్రబాబు రచ్చ చేశారు. అయితే జగన్ సీబీఐ విచారణకు ఓకే చేస్తే కేంద్రం ఎందుకు సిద్దపడలేదు? రికార్డు సమయంలో కొత్త రథాన్ని తయారు చేయించిన జగన్ మతాల మధ్య ద్వేషం పెంచుతారంటే ఎవరైనా నమ్ముతారా? కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలే ఆలయాలపై దాడులు చేస్తే, దానిని కప్పిపుచ్చి జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఆ రోజుల్లో కూటమి పార్టీలు ఎంత ప్రయత్నించి తెలియనిది కాదు. తన హయాంలో విజయవాడ తదితర చోట్ల నలభై గుడులను పడగొట్టిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే హిందూ మతోద్దారకుడిగా ప్రచారం చేసుకున్నారు.జగన్‌పైనే కాకుండా, ఆనాటి డీజీపీపై కూడా క్రిస్టియన్ మత ముద్ర వేసి ప్రజలలో ద్వేషం పెంచడానికి యత్నించారా? లేదా? తిరుమలలో ఏ చిన్న ఘటన జరిగినా జగన్ పై నెట్టేయడమే పనిగా పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు తిరుమలలో మద్యం అమ్ముతున్నా, బిర్యానీలు తెచ్చుకుంటున్నా, చెప్పులు వేసుకుని గుడి వరకు వెళుతున్నా, ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక చర్చిపై హిందూ మత రాతలు కనిపించాయి. వెంటనే హోం మంత్రి దానిని వైసీపీపై ఆరోపించారు. తీరా చూస్తే ఇద్దరు పాస్టర్ ల మధ్య గొడవలలో ఆ పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరి దీనికి చంద్రబాబు ఏమి బదులు ఇస్తారు? ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో ఇలా మతపరమైన వివాదాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ. చంద్రబాబు చేతిలోకి టీడీపీ వచ్చాక అధికారం కోసం ఎలాంటి ద్వేషాన్ని అయినా రెచ్చగొట్డడానికి వెనుకాడరన్న అభియోగాలు ఉన్నాయి.వక్ఫ్ బిల్లుపై జగన్ రాజకీయం చేస్తున్నారట. ఇది విన్నవారికి ఏమనిపిస్తుంది? వైసీపీ అంత స్పష్టంగా వక్ఫ్ బిల్లును వ్యతిరేకించినా, పచ్చి అసత్యాలను ప్రచారం చేయడానికి టీడీపీ ఏ మాత్రం సిగ్గుపడడం లేదని అనిపించదా? తాజాగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది కదా? అసలు వక్ఫ్ చట్టంపై చంద్రబాబు, పవన్‌ల వైఖరి ఏమిటి అన్నది ఇంతవరకు చెప్పారా? ఒకప్పుడు ప్రధాని మోదీపై తీవ్రంగా విమర్శలు చేస్తూ ముస్లింలను బతకనివ్వడని, తలాఖ్ చట్టం తెచ్చారని ఆరోపించిన చంద్రబాబు బతిమలాడుకుని మరీ బీజేపీతో ఎలా జతకట్టారు? పోనీ ఇప్పుడు వక్ప్ చట్టాన్ని ఏపీలో అమలు చేయబోమని చెప్పగలరా? లేదా సుప్రీం కోర్టు విచారణలో ఇంప్లీడ్ అవ్వగలరా? అటు బీజేపీకి మద్దతు ఇవ్వాలి. ఇటు ముస్లింలను మోసమో, మాయో చేయాలని ప్రయత్నించడం చంద్రబాబుకే చెల్లుతుంది. అందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏపీ సీఎం చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని విమర్శించారు.ఇక పాస్టర్ ప్రవీణ్ మృతిపై కూడా వైసీపీ మీద ఆయన ఆరోపణలు చేశారు. ఈ పాస్టర్ మృతిపై క్రైస్తవ సమాజానికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండా ప్రభుత్వం ఎందుకు దబాయించే యత్నం చేస్తున్నదీ ఎవరికి అర్థం కాదు. దీనిపై ఒక రిటైర్డ్ ఐఎఎస్‌తో సహా పలువురు వేస్తున్న ప్రశ్నలకు పోలీసు అధికారులు జవాబు ఇస్తున్నట్లు అనిపించదు. సీసీటీవీ దృశ్యాలపై కొందరు తమ అనుమానాలను తెలియచేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. జగన్ కాని, వైసీపీ నేతలు ఎవరూ ఈ అంశం జోలికి వెళ్లకపోయినా, తాను ఇబ్బంది పడినప్పుడల్లా జగన్ పై తోసేసి కథ నడిపించాలన్నది చంద్రబాబు వ్యూహం.జగన్ టైమ్‌లో ఒక డాక్టర్ మద్యం మత్తులో రోడ్డుపై నానా యాగీ చేస్తే అక్కడ ఉన్న పోలీసు కానిస్టేబుల్ అతని రెక్కలు కట్టి పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. అంతే! అదేదో జగనే దగ్గరుండి చేయించినట్లుగా దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ విషయంలో మాత్రం తాను చెప్పిందే రైటు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. కులపరమైన, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ఢిల్లీలో కూర్చుని టీవీలలో లైవ్ లో మాట్లాడిన ఒక నేతకు ఇదే చంద్రబాబు పెద్ద పదవి ఇచ్చారే!నిజానికి మతపరమైన అంశాలకు ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తే అంత మంచిది. కాని ఒకప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని, మత తత్వ పార్టీ అని ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుని, ఎదుటివారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే ఏమనిపిస్తుంది. హేతుబద్దంగా ఆలోచించేవారికి ఎవరికైనా చంద్రబాబు ఇలాంటి నీతులు చెబుతున్నప్పుడు వినాలంటే బీపీ రాకుండా ఉంటుందా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారని.. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ముంబై నటి జత్వానీని వేధించారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ పీఏసీ మీటింగ్‌లో స్పందించారు. ‘‘రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులును అరెస్ట్ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీస్ అధికారుల పట ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టింది. .. మొదటి సారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా. ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారస్తున్నారు. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏం మిగలదు. .. ఎంపీ మిథున్ రెడ్డిని(MP Mithun Reddy) కూడా టార్గెట్ చేశారు. ఎలాగైనా మిథున్‌రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదురించారు. కాబట్టే పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. లేని ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. బాబు హయాంలో లిక్కర్ స్కాంపైనా గతంలో సీఐడీ కేసు పెట్టింది. మనం తెచ్చిన లిక్కర్ పాలసీ(YSRCP Liquor Policy) విప్లవాత్మకమైంది. ప్రైవేట్ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించింది. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి..’’ అని పీఏసీ సభ్యులను ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘విశాఖలో రూ.3వేల కోట్ల భూమిని ఊరు పేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారు. లులూ గ్రూపునకు రూ.1500-2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీల్ రేట్లు పెరిగాయి. రూ.36వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేలకు పెంచారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబలైజేషన్ అడ్వాన్స్‌లు తీసుకు వచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా ఎందుకు బటన్లు నొక్కలేదు అని అడిగాను. బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తోంది. అందుకనే చంద్రబాబు బటన్లు నొక్కడంలేదు...రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కాని, దేశవ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే, వెంటనే చంద్రబాబు డైవర్ట్ చేస్తున్నాడు. ఏమీలేకపోతే.. జగన్ మీద ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నాడు. ప్రజల నోటిలోకి నాలుగేళ్లు ఇప్పుడు ఎందుకు పోవడంలేదు? మన ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దుచేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయి. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు?..ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదు. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు బకాయి గత ఏడాది పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ కలుపుకుంటే రూ.7వేల కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చాడు. ఏ రైతుకు గిట్టుబాటు ధరలేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. పెన్షన్లు నాలుగు లక్షలు తగ్గించాడు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. ఎక్కడ చూసినా రెడ్‌బుక్ పాలనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో PAC గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మమేకం కావాలి. జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని అందించాలి. ..పార్టీ అధికారంలోకి వస్తుంది.. మరింతగా ప్రజలకు సేవలందిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పార్టీకి చెందిన ప్రతీ కార్యక్రమాన్ని మనది అనుకుని చేసుకోవాలి. అందర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నారు. సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామస్థాయిలో కార్యకర్తను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్ అనే ఒక బ్రహ్మాండమైన సాధనాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి...కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే మనపై తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కాని ప్రజలు మనల్ని నమ్మారు, ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబుపై వ్యతిరేకతను మూసేయడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తుంది. కాని ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు. చంద్రబాబు పెడుతున్న కేసులకు ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కానీ ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్నికేసులు పెడితే, ప్రజలు అంతా స్పందిస్తారు...కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. కాని, భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తిని నింపాలి. కష్టాలనుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చేసే పోరాటాలు, ప్రజా సమస్యలపట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పనితీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు...పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజల్లోకి ఉద్ధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి.. పోరాటం చేయాలి. ఎలాంటి రాజీపడొద్దు. ప్రతి సమావేశంలోనూ అజెండాను నిర్దేశించుకుని దానిపైన డిస్కషన్ చేయాలి. పార్టీకి సూచనలు చేయాలి. పార్టీ ఐక్యంగా ఉండి, పార్టీ కార్యక్రమాలను బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఏ జిల్లాలో ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య మనది అనుకుని దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి. వెంటనే కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలి. ఎవరో ఏదో ఆదేశాలు ఇస్తారని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు అండగా ఉండడం, పార్టీని బలోపేతం చేయడం అన్నది ముఖ్యం’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
కదిరిలో బయటపడ్డ టీడీపీ కుట్ర రాజకీయాలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరిలో టీడీపీ కుట్ర రాజకీయాలు బయటపడ్డాయి. ముస్లిం మహిళను మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి నుంచి దించేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసింది. కదిరి మున్సిపల్ ఛైర్పర్సన్ నజీమున్నీసాపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. దీంతో వైఎస్సార్సీపీ కదిరి సమన్వయకర్త మక్బూల్ విప్ జారీ చేశారు. బలం లేకపోయినా కదిరి మునిసిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు టీడీపీ ప్రలోభాలకు దిగుతోంది. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, వైఎస్సార్సీపీ-30, టీడీపీ-5, ఇండిపెండెంట్ 1 కౌన్సిలర్లు ఉన్నారు. డబ్బు, బెదిరింపులతో 20 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ కొనుగోలు చేశారు.మడకశిర.. భగ్గుమన్న టీడీపీ నేతల మధ్య విభేదాలుమడకశిర నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే ఈరన్నల మధ్య వివాదం నెలకొంది. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై మాజీ ఎమ్మెల్యే ఈరన్న చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వైఖరిపై మాజీ ఎమ్మెల్యే ఈరన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తన కొడుకు డాక్టర్ సునీల్‌ను అభ్యర్థిగా ప్రకటించారని.. చివరి నిమిషంలో బీ-ఫాం ఇవ్వలేదు.. అయినప్పటికీ ఎంఎస్ రాజు గెలుపు కోసం కృషి చేశాం.. మా వర్గానికి ఎంఎస్ రాజు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆరోపించారు. -
టీడీపీ ఎంపీ చిన్ని బినామీదే ‘ఉర్సా’.. డీల్ బట్టబయలు చేసిన కేశినేని నాని
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ భూమిని పెట్టుబడుల పేరుతో దోచుకునేందుకు కేశినేని చిన్ని ప్రయత్నం చేశారంటూ ‘ఉర్సా’ వెనుక డీల్‌ను మాజీ ఎంపీ కేశినేని నాని బయటపెట్టారు. టీడీపీ ఎంపీ కేశినేని బినామీదే "ఉర్సా" అంటూ ట్వీట్ చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్‌లు భాగస్వాములు. 21 సెంచరీ ఇన్వెస్టమెంట్ ప్రాపర్టీస్ పేరుతో గతంలో కోట్లు వసూళ్లు చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్, కోట్లు వసూళ్లు చేసి జనాన్ని మోసం చేశారు’’ అంటూ కేశినేని నాని ఎక్స్ వేదికగా తలిపారు."ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనే కంపెనీకి విశాఖలో 60 ఎకరాల కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దురుద్దేశం ఉన్నట్టు పేర్కొన్న నాని.. 5,728 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్ పేరుతో ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పడలో 56.36 ఎకరాలు.. మొత్తం 60 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయని.. ఈ కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తమ బినామీ పేరుతో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని నాని ఆరోపించారు.‘‘ఉర్సా క్లస్టర్స్ కేవలం కొన్ని వారాల క్రితమే రిజిస్టర్ అయ్యింది. వీరికి ఎటువంటి అనుభవం లేదు. ప్రాజెక్ట్ చేయగల సామర్థ్యం కూడా లేదు. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, ఎంపీ చిన్ని ఇంజినీరింగ్ క్లాస్మేట్. అబ్బూరి సతీష్ ఎంపీ చిన్ని బిజినెస్ భాగస్వామి కూడా. ఇద్దరు కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రజల నుండి కోట్లు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన నేపథ్యం ఉంది. ఈ భూమి కేటాయింపు వెనుక చిన్ని తన ఎంపీ పదవి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న పరపతిని ఉపయోగించారు’’ అని నాని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఊరూపేరు లేని 'ఉర్సా'చిన్ని సాండ్ మైనింగ్, ఫ్లై ఆష్, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కలిసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయన్న కేశినేని నాని.. ఉర్సా క్లస్టర్స్‌కు ఇచ్చిన భూ కేటాయింపు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కంపెనీ యజమానులు, డబ్బు మూలాలు, రాజకీయ కనెక్షన్లపై సంపూర్ణ దర్యాప్తు చేయాలన్నారు. ప్రభుత్వ భూమిని "పెట్టుబడుల" పేరుతో దోచుకునే ఈ ప్రయత్నాన్ని ఆపాలంటూ చంద్రబాబుకు కేశినేని నాని ఫిర్యాదు చేశారు.Respected @ncbn garu,I would like to begin by sincerely appreciating your bold and visionary step in allotting land to Tata Consultancy Services (TCS) in Visakhapatnam. Such initiatives will pave the way for real investments, job creation, and the upliftment of Andhra Pradesh’s… pic.twitter.com/pJMQeSGgNi— Kesineni Nani (@kesineni_nani) April 22, 2025 -
కూటమి పాలనలో దళితులపై పెచ్చరిల్లుతున్న దాడులు
సాక్షి, అమరావతి: కూటమి పాలనలో దళితులపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లుతున్నాయని దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ఆత్మగౌరవం నిలబడాలంటే వైఎస్ జగన్‌ను మరోసారి సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు.కూటమి పాలనలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను అంటరాని వారిగా చూస్తున్నారని చెప్పారు. అణగారిన వర్గాలకు పూర్తిగా న్యాయం చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌దేనన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఐదుగురు దళితులకు క్యాబినెట్లో చోటు కలి్పంచిన ఘనత జగన్‌ది అన్నారు. మాల, మాదిగలు కలిసే ఉన్నారు రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ మాల, మాదిగలు విడిపోయారని కూటమి నేతలు పగటి కలలు కంటున్నారని, కాని కలిసే ఉన్నారని చెప్పారు. ఇకపై మాల, మాదిగలు కలిసి వైఎస్ జగన్ నేతృత్వంలో పేదల ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణంలో తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన పద్ధతులపై ప్రసంగించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. జగనన్న అణగారిన వర్గాలకు అండగా ఉంటే.. చంద్రబాబు మాత్రం అణగదొక్కుతున్నారన్నారు.మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దళితులకు దక్కిన గౌరవాన్ని జీరి్ణంచుకోలేక కూటమి పార్టీలు అసత్య ప్రచారం చేశాయని, దళితులకు అత్యున్నత గౌరవం ఇచ్చిన వైఎస్సార్సీపీని బలోపేతం చేసుకుందామన్నారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీల జీవితాలు మార్చడానికి జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలు ఎవరూ మరిచిపోరన్నారు. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై దళిత నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, తలారి వెంకట్రావు, కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, కైలే అనిల్‌కుమార్, అలజంగి జోగారావు, పార్టీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్రావు మాట్లాడారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. జనం మధ్య ఉందాం: సజ్జల సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సమాజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే విధంగా వైఎస్ జగన్ పాలన చేశారని గుర్తు చేశారు. కలలు కనడం కాదని, వాటిని ఆచరణలోకి తీసుకురావాలని ఒక్క జగన్ మాత్రమే భావించారని, అసమానతలు ఉన్న సమాజాన్ని ఐదేళ్లలో సమాన స్థాయికి తీసుకొచ్చారన్నారు. వైఎస్సార్సీపీ పేదల పక్షమని గుండెమీద చెయి వేసుకుని చెప్పగలిగిన ధైర్యాన్ని అందరికీ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకోవడం, సంస్థాగతంగా బలోపేతం అవడంపై దృష్టి పెడదామని పిలుపునిచ్చారు. -
నేడు పార్టీ పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ సమావేశం
తాడేపల్లి,సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (మంగళవారం) అధ్యక్షతన నేడు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు పార్టీ భవిష్యత్ కార్యచరణపై వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల, వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమించారని, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది.పీఏసీ సభ్యులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు), మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)..వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, విడదల రజిని, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్‌బాబు, మాజీ మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి..మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రులు షేక్ బెపారి అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్‌ఖాన్, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌లను నియమించారు. పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. -
మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత.. లోకేష్‌కు చెప్పినా లాభం లేదని..
గుంటూరు,సాక్షి: మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దెందులూరులో మట్టి మాఫియా వేధింపులు భరించలేక మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దాసరి బాబురావు అనే వ్యక్తి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డారు. మట్టి మాఫియా వేధింపులతో మనస్తాపం చెంది బ్లేడుతో చేయి కోసుకున్నారు. అప్రమత్తమైన టీడీపీ పార్టీ సిబ్బంది బాబురావును అత్యవసర చికిత్స నిమిత్తం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. తమ భూముల్ని కబ్జా ప్రయత్నం జరుగుతోందని, మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బాధితురాలి భార్య మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి బాబురావు ఆత్మహత్యయత్నంపై ఆమె భార్య దాసరి దాసరి నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ‘మాకు దెందులూరి మండలం చల్ల చింతల పూడిలో పొలం ఉంది. మా పొలంలో జేసీబీలతో మట్టి తవ్వి ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మేం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మనుషులం అని బెదిరిస్తున్నారు. ఇదే విషయం గురించి చింతమనేనితో మా బంధువులు మాట్లాడితే మట్టి మాఫియాతో సెటిల్ చేసుకోమని చెప్తున్నారు. మేం మట్టి మాఫియాని అడ్డుకోడానికి ప్రయత్నించాం. సాధ్యం కాలేదు. మట్టి మాఫియా గురించి అధికారులు అందరికీ ఫిర్యాదు చేశాం ఎవరూ పట్టించుకోవట్లేదు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. పైగా మధ్యవర్తులు కలగజేసుకుని రూ.90లక్షలు తీసుకుని, రూ.2కోట్లు తీసుకురమ్మని మని అంటున్నారు. లేదా మీ పొలం మాకు అమ్ముతున్నట్లు సంతకాలు చేయమని బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులు,ప్రాణభయంతో ఇల్లు వదిలి పారిపోయి వచ్చాం. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాం. కనీసం మా ఫిర్యాదు కూడా తీసుకోలేదు. చివరికి ఎస్పీ కార్యాలయానికి కూడా మమల్ని రానివ్వట్లేదు. పోలీసులు మమ్మల్ని మట్టి మాఫియాతో సెటిల్ చేసుకోమని సలహా ఇస్తున్నారు. మంత్రి లోకేష్‌ను కలిసి మా బాధ చెప్పుకున్నాం. మట్టి మాఫియా చివరకు లోకేష్ మాటను కూడా లెక్క చేయలేదు.ఇంకా ఎక్కడికి వెళ్లినా ఉపయోగం లేదని ఉదయం టీడీపీ కార్యాలయానికి వచ్చాం. మట్టి మాఫియా వేధింపులతో మనస్థాపం చెందిన నా భర్త చేయి కోసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు’ అని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
తారాస్థాయికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు
వైఎస్సార్,సాక్షి : అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఐదు సున్నపు రాయి టిప్పర్లను సీజ్ చేయించారు. కంపెనీలోని కాంట్రాక్ట్ కార్మికులపై జులుం ప్రదర్శించారు. కాంట్రాక్ట్ కార్మికులను బయటకు పంపించేశారు. కాంట్రాక్ట్ కార్మికులు లేకపోవడంతో కంపెనీలో పనులు నిలిచిపోయాయి.సీఎం చంద్రబాబుతో మాట్లాడి దాడులు చేయిస్తామంటూ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.అల్ట్రాటెక్ సిమెంట్‌పై తాను వ్యవహరించిన తీరు తప్పు కాదంటూ సమర్థించుకున్నారు. అక్కడి కాంట్రాక్ట్‌లన్నీ తనకే కావాలని ఉత్పత్తిని అడ్డుకున్నారు. ఇన్ని చేస్తూనే తన తప్పులేదని బుకాయించడం చూసి విస్తుపోతున్నారు స్థానికులు. మూడున్నర దశాబ్దాలుగా స్థానికులకు ఉపాధి..చిలంకూరు సిమెంట్ పరిశ్రమలో సుమారు 35 ఏళ్ల నుంచి స్థానికులు ఉపాధి పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకే అన్ని పనులు కావాలంటూ పరిశ్రమకు రవాణా అవుతున్న సున్నపురాయి, ఫ్లైయాష్‌ను బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులు శనివారం నుంచి అడ్డుకుంటున్నారు. దీంతో సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అగిపోయి మూతపడే దశకు వచ్చింది.అల్ట్రాటెక్ పరిశ్రమలో ఉత్తరం వైపు సున్నపురాయి మైనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినా మొత్తం పనులు తమకే కావాలని ఆదినారాయణరెడ్డి వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. చిలంకూరులోని ఐసీఎల్ (అల్ట్రాటెక్) సిమెంట్ పరిశ్రమకు సరఫరా అయ్యే సున్నపురాయిని ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవటంపై యజమాన్యం ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ ఆదేశించారు.చిలంకూరు సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అడ్డుకోవడంపై ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులైన ఎస్.జగదీశ్వర్‌రెడ్డితో పాటు పది మందిపై కేసు నమోదు చేసినట్లు యర్రగుంట్ల సీఐ నరేష్‌బాబు తెలిపారు. చిలంకూరు ఐసీఎల్ (అల్ట్రాటెక్) మైనింగ్ క్వారీ వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.ఇవి అరాచకాలు👉గండికోట రిజర్వాయర్ ఆధారంగా చేపట్టిన అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను తమ వర్గీయులకే అప్పగించాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరులు మందీ మార్బలంతో విధ్వంసం సృష్టించారు.👉ఆర్టీపీపీ నుంచి సిమెంట్ కంపెనీలకు ఫ్లైయాష్ రవాణా చేస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన లారీలను అడ్డుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం దీన్ని తమకే అప్పగించాలంటూ వీరంగం సృష్టించింది.👉 ఎర్రగుంట్ల మండలం చిలంకూరు పరిధిలో అల్ట్రాటెక్ (ఐసీఎల్) సిమెంటు పరిశ్రమకు ఫ్లైయాష్, సున్నపురాయి, ఇతర ముడి ఖనిజం సరఫరా, ప్యాకింగ్ ప్లాంట్ కాంట్రాక్టు పనులను 40 ఏళ్లుగా మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడు ఎంవీ రమణారెడ్డి చేస్తున్నారు. ఆ పనులన్నీ తమ వర్గీయులకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొంతకాలంగా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తోంది. -
‘కూటమి ప్రభుత్వంలో ధర్మ పరిరక్షణ కరువైంది’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ అనేది కరువైందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు చనిపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు.. ‘హిందూధర్మంపై నిత్యం దాడి జరుగుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే తిరుమల లడ్డూ గురించి విషప్రచారం చేశారు. వైకుంఠ ఏకాదశి రోజు సరైన ఏర్పాట్లు చేయకుండా ఆరుగురు భక్తుల మరణానికి కారకులయ్యారు. కాశీనాయన దివ్యక్షేత్రంలో గోశాల, అన్నదాన సత్రాలను నిలువునా కూల్చేశారు. ఇప్పుడు శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడ్డాయితాబేళ్ల సంరక్షనే కాదు, పార్కు నిర్వహణను కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. మా హయాంలో ఏ పొరపాట్లు జరగకపోయినా ఏదో జరిగినట్లు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు హైందవ ధర్మం మీద దాడి జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు?, కాశీనాయన క్షేత్రంలో అధికారులే వెళ్లి నిర్మాణాలను కూల్చేస్తే ఎందుకు మాట్లాడలేదు?, శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోతుంటే దేవాదాయ శాఖ ఏం చేస్తోంది?రెండు వందల తాబేళ్ల పరిరక్షణ కూడా ప్రభుత్వానికి పట్టదా? , మా హయాంలో ప్రతి తాబేలుకూ నెంబర్ ఇచ్చి వాటి పరిరక్షణ చూశాం. కానీ ఈ ప్రభుత్వం తాబేళ్లకు ఎలాంటి పోస్టుమార్టం చేయకుండా ఎలా దహనం చేస్తారు?, అసలు రాష్ట్రంలో హిందూ ధర్మం ఏమవుతోంది? , వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. శ్రీకూర్మం ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు మల్లాది విష్ణు -
అబిడ్స్ చౌరస్తాకు వస్తావా కేటీఆర్..? : ఈటల సవాల్
హైదరాబాద్: గత పదేళ్లలో తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది.. అదే తెలంగాణకు కేంద్రం చేసింది అనే దానిపై చర్చకు వస్తావా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. అబిడ్స్ చౌరస్తాలో చర్చ పెట్టుకుందామా కేటీఆర్? అని ఈటల ప్రశ్నించారు.‘కాంగ్రెస్ నైజం దేశ వ్యాప్తంగా బట్టబయలైంది. మరొకవైపు కార్పోరేట్లరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయొద్దని బీఆర్ఎస్ అప్రజాస్వామిక పిలుపునిచ్చింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలి. కేంద్ర నిధులతోనే హైదరాబాద్ అభివృద్ధి. మజ్లీస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుటుంబ పార్టీలు.ముఖ్యమంత్రి గత విదేశీ పర్యటనలోనే లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ కనపడటలేవు. ఉన్న ఉద్యోగాలు ఇక్కడ ఉడిపోతున్నాయి. కేసీఆర్ హయంలోనే మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతకుముందు ఒక ఎమ్మెల్యే ఇంటికి ఇంకో ఎమ్మెల్యే వెళ్ళేవారు. ఇప్పుడు అది లేదు’ అని ఈటల విమర్శించారు.. -
'ఖబడ్దార్ తీన్మార్ మల్లన్న'
హైదరాబాద్,సాక్షి: తీన్మార్ మల్లన్న ఖబడ్దార్. సీఎం రేవంత్‌రెడ్డిపై మరోసారి నోరు జారితే ఊరుకునేది లేదని తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. గత వారం నిర్వహించిన బీసీ చైతన్య సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కుర్చీని లాగేస్తామని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలపై సోమవారం తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ స్పందించారు. సీఎం రేవంత్‌ను విమర్శించే స్థాయి తీర్మార్ మల్లన్నకు లేదన్నారు. దమ్ముంటే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెట్టు సాయి కుమార్ (Mettu Saikumar) ఇంకా ఏమన్నారంటే.. 'తెలంగాణ రాజకీయ వ్యభిచారి ఎవరైనా ఉన్నారంటే అది తీన్మార్ మల్లన్నే. నేను రాజీనామా చేస్తా ఇద్దరం కలిసి పోటీ చేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల నాయకత్వం పెంపొందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారు. ఎన్నిసార్లు రేవంత్ కాళ్ళు మొక్కావో గుర్తులేదా. అధిష్టానం రాష్ట్ర రాజకీయ నాయకులను ఒప్పించి రేవంత్ నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించారు.స్పీకర్ ఫార్మార్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నీ దమ్ము ఏంటో నిరూపించుకో. ఎన్ని పార్టీలు మారావో గుర్తుందా. బీసీల ముసుగులో చిల్లర పనులు చేస్తూ బిసిలను ఇబ్బందులకు గురి చేయడానికి సిగ్గుండాలి. నీది నా కంటే దిగువ స్థాయి.. సీఎం రేవంత్ రెడ్డితో పోల్చుకునే స్థాయి నీకు లేదు. ఇప్పటికైనా నీ స్థాయికి తగ్గట్లు మాట్లాడటం నేర్చుకో. బీజేపీ నేతలకు గులాంగిరి చేసుకో. ఉదయం బీజేపీ, సాయంత్రం బీఆర్ఎస్ భజన చేసుకో’ అని ధ్వజమెత్తారు.చదవండి: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట -
Boston: ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందని, ఆ వ్యవస్థలోనే ఏదో తప్పు ఉందంటూ వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రస్తావననూ ఆయన తీసుకొచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi).. ఆదివారం బోస్టన్‌లో ప్రవాస భారతీయులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘‘ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Election Fraud) 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య 65 లక్షల మంది ఓటు వేసినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. ఒక్కో ఓటర్ ఓటు వేయడానికి 3 నిమిషాల సమయం పడుతుంది. అలాంటప్పుడు అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేయగలరు?. అక్కడ ఏదో తప్పు జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది’’ అని రాహుల్ అన్నారు.बोस्टन : चुनाव आयोग ने हमें शाम 5:30 बजे तक के मतदान के आंकड़े दिए और शाम 5:30 बजे से 7:30 बजे के बीच 65 लाख मतदाताओं ने मतदान किया. ऐसा होना शारीरिक रूप से असंभव है :राहुल गांधी #RahulGandhi #MaharashtraElection #ElectionCommission #RahulGandhiUSA #Boston pic.twitter.com/8kSVOhZ6BU— Sumit Kumar (@skphotography68) April 21, 2025‘‘ఎన్నికల సంఘం(Election Commission) రాజీ పడినట్లు ఇక్కడే అర్థమవుతోంది. ఆ వ్యవస్థలోనే ఏదో తప్పిదం ఉంది. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. మహా ఎన్నికలకు సంబంధించిన వీడియోలు చూపించాలని మేం అడిగాం. అందుకు ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగడానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే వేదికగా ఆయన అమెరికా భారత్ మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. సోమవారం బ్రౌన్ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ ఈసీపై ఈ తరహా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. అయితే.. రాహుల్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చనే ఆరోపణలను కూడా తోసిపుచ్చుతూ వస్తోంది. అయినప్పటికీ వరుసగా ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఓటర్ల జాబితాల ఆధారంగా ప్రతిపక్షాలు ఈసీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. -
బాబు మాటల్లో నిజం.. నేతిబీర చందమే!
పొంతన లేని మాటలతో జనాల్ని తికమకపెట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది తిరుగులేని రికార్డు. తాజాగా కొద్ది రోజుల క్రితం జ్యోతీరావు ఫూలే జయంతి ఉత్సవాల్లో ఇది మరోసారి నిరూపితమైంది. ఎల్లోమీడియా ‘బీసీల సంక్షేమానికి రూ.48 కోట్లు’ అంటూ బాబుగారి ప్రసంగాన్ని భాజాభజంత్రీలతో కథనంగా వండి వార్చినప్పటికీ వివరాలు చూస్తే ప్రజలు ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఎందుకంటే.. బాబు గారు తన ప్రసంగంలో సంక్షేమ వసతి గృహాలకు రూ.405 కోట్లు, గ్రూప్ పరీక్షల అభ్యర్థులకు శిక్షణ శిబిరాలు, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, అమరావతిలో 500 మంది బ్యాచ్‌తో ఉచిత శిక్షణ, ఆదరణ పథకం కింద ఏటా రూ.వెయ్యికోట్లు ఖర్చు వంటివి మాత్రమే ప్రస్తావించారు. .. ఇవేవీ కొత్తవి కాకపోవడం ఒక వింతైతే.. వీటికయ్యే ఖర్చు ఏటా రెండు వేల కోట్లకు మించకపోవడం ఇంకోటి. మరి.. రూ.48 వేల కోట్లు ఎక్కడ? ఎప్పుడు? ఎలా వ్యయం చేస్తారు? ఎల్లో కథనం చదివిన వారి ఊహకే వదిలేయాలి దీన్ని. పోనీ మొత్తం ఐదేళ్లకు ఇంత మొత్తం అనుకుంటే.. ఒక ఏడాది గడచిపోయింది కాబట్టి.. మిగిలిన నాలుగేళ్లలో ఏటా రూ.12 వేల చొప్పున ఖర్చు పెట్టాలి. దీనిపై కూడా స్పష్టత లేదు. అయినా చంద్రబాబు(Chandrababu) బీసీ సంక్షేమానికి 48 వేల కోట్లు అని ఒక అంకె చెప్పడం, అదేదో మొత్తం ఇచ్చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేసి బ్యానర్ కథనాలు రాసేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయడం ఎల్లో మీడియా మార్కు జర్నలిజమై పోయింది. 👉బాబు గారు ఇంకొన్ని మాటలూ ఆడారు. ఆర్థిక అసమానతలను రూపుమాపే బ్రహ్మాస్త్రం పీ-4 అని, దీని ద్వారా లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని చెప్పనైతే చెప్పారు కానీ.. ఎలా అన్నది మాత్రం చెప్పడం మరిచారు!. సాధారణంగా ఏ నేత అయినా వేల కోట్ల మొత్తాలను ప్రకటించినప్పుడు దేనికెంత ఖర్చు చేస్తారు? బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి? వంటి వివరాలు ఇవ్వడం జర్నలిజమ్ ప్రాథమిక లక్షణం. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి భారీ కేటాయింపులు జరిగినప్పుడు దానికి కట్టుబడి ఉన్నట్టు సమాచారం ఉండేది. అప్పటి విపక్షం టీడీపీ కూడా తప్పు పట్టే పరిస్థితి ఉండేది కాదు. పోనీలే... ఏదో ఒక రీతిన బీసీల సంక్షేమానికి రూ.48 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని సంతోషిస్తూండగానే చంద్రబాబు అన్నమాటతో నిరాశ కమ్మేసింది. 👉అప్పు చేసి సంక్షేమం అమలు చేస్తే రాష్ట్రం కష్టాలలో కూరుకుపోతుందని, సంపద సృష్టించి సంక్షేమానికి ఖర్చు చేస్తామని చంద్రబాబు ప్రకటించారని ఎల్లో మీడియా(Yellow Media)నే తెలిపింది. చంద్రబాబు అక్కడితో ఆగలేదు. కాని టీడీపీకి నష్టం అని భావించి ఎల్లో మీడియా ఆ భాగం రాయకుండా వదలి వేసింది. మిగిలిన మీడియాలో ఆ వివరాలు ఉన్నాయి. చెప్పినవన్నీ చేయాలని ఉన్నా గల్లా పెట్టే ఖాళీగా కనిపిస్తోందని, అప్పు చేద్దామన్నా ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదని అన్నారు. పరపతి లేకపోతే అప్పు ఎలా పుడుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు దాటిపోయింది. ఈ కాలంలో సంపద సృష్టించ లేకపోయానని ఆయన చెబుతున్నట్లే కదా? పైగా అప్పు పుట్టని పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబే కదా దానికి బాధ్యుడు అవుతారు. పోనీ అదే నిజమనుకున్నా, ఇప్పటికే రూ.లక్ష కోట్ల అప్పు ఎలా చేశారు? దానిని ఎందుకోసం ఖర్చు పెట్టారు అన్నది ఎప్పుడైనా చెప్పారా అంటే లేదు. ఒక్క అమరావతి(Amaravati) నిర్మాణాలకే ఏభైవేల కోట్ల అప్పు ఎలా తీసుకు వస్తున్నారు? ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ, ఎన్నికల ప్రణాళిక అంటూ తెగ వాగ్దానాలు ఇచ్చేశారు కదా? బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ ఇస్తానన్నారు కదా? ఇప్పుడు ప్రతి దానికి గల్లా పెట్టె ఖాళీగా ఉందని చెప్పడం ప్రజలను చీట్ చేయడమే కాదా? ఈ లెక్కన ఇప్పుడు బీసీల సంక్షేమానికి ప్రకటించిన రూ.48 వేల కోట్లు ఉత్తుత్తి ప్రకటనగానే తీసుకోవాలా? లేక దాని అమలుకు వేరే మార్గం ఏమైనా ఉందని చెబుతారా?. తల్లికి వందనం కింద త్వరలో డబ్బులు ఇస్తామని అంటారు. ఒక ఏడాది ఇప్పటికే ఎగవేసిన విషయాన్ని మాత్రం ప్రస్తావించరు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే రూ.ఆరు వేలు పోను మిగిలిన రూ.14 వేలు ఇస్తామని చెప్పారు. మరి ఈ ఏడాది ఎందుకు ఎగవేశారో వివరించాలి కదా? కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా రైతులకు సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చుతున్నారు. ఇవైనా ఏ మేరకు అమలు చేస్తారో తెలియదు. చంద్రబాబు మాత్రం వాటిని నివృత్తి చేయరు. తాను చెప్పదలచుకున్నది ఏదో అది ప్రజలు నమ్ముతారా? లేదా ?అనేదానితో నిమిత్తం లేకుండా ప్రచారం చేసి వెళుతుంటారు. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకు వస్తామని, వారికి 34 శాతం రిజర్వేషన్లు తెస్తామని, నామినేటెడ్ పోస్టులలో 33 శాతం బీసీలకు కేటాయిస్తామని, కల్లు గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించామని.. ఇలా ఆయా విషయాలను చెప్పారు. విశేషం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం సత్యసాయి జిల్లాలో బీసీ వర్గానికి చెందిన ఒక వైసీపీ నేత లింగమయ్యను టీడీపీ వారు హత్య చేస్తే వీరు కనీసం ఖండించలేదు. ఆ కేసులో ఇరవైమంది నిందితులు ఉన్నారని చెబుతున్నా ఇద్దరిపైనే కేసు నమోదు చేశారని బాధితులు ఆరోపిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం బీసీ రక్షణ చట్టం గురించి ఉపన్యాసం ఇస్తున్నారు.ఏపీలో సోషల్ మీడియా(AP Social Media) నేరస్తులకు అడ్డాగా మారిందని, వ్యక్తిత్వ హననం చేస్తే అది వారికి అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు అంటున్నారు. నిజానికి సోషల్ మీడియాను దుర్వినియోగం ఎక్కువగా చేసింది టీడీపీ వారే అనే సంగతి ఆయనకూ తెలుసు. వారిని ప్రోత్సహించింది తాను, తన కుమారుడు అన్న విషయం అందరికి విదితమే. ఈ మధ్య తప్పని స్థితిలో ఒక టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని విచారించి ,అతను వాగిన పిచ్చివాగుడు వెనుక ఎవరు ఉన్నారో పోలీసులు తేల్చుతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు. సీమ రాజా అని, ఇంకేవేవో పేర్లతో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై దారుణమైన నీచమైన వ్యాఖ్యలు చేసినవారంతా రాష్ట్రంలో సేఫ్‌గా తిరుగుతున్నారు. మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి అసహ్యకరమైన ఆరోపణ చేసిన ఒక టీడీపీ నేతకు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసిన చరిత్ర కూడా సార్‌దే కదా! ఏదైనా చిత్తశుద్దితో చెబితే పర్వాలేదు. కాని సుద్దులు పైకి చెప్పి, టిడిపి సోషల్ మీడియా అరాచక శక్తులకు అండగా నిలబడుతున్నారన్న అపకీర్తి మూట కట్టుకుంటే ఏమి చేస్తాం. అందువల్ల నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో చంద్రబాబు మాటల్లో వాస్తవం అంత ఉంటుందని ఆయన ప్రత్యర్ధులు వ్యాఖ్యానిస్తుంటారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నన్ను చంపేందుకు కుట్రలు.. కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు
ఛండీగఢ్: తన హత్యకు ఖలిస్థానీలు కుట్రలు చేస్తున్నారని కేంద్రమంత్రి రవనీత్ సింగ్ బిట్టూ సంచలన ఆరోపణలు చేశారు. రాడికల్ ప్రచారకుడు, ఎంపీ అమృత్‌పాల్ సింగ్ నడిపిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థతో సంబంధమున్న ఖలిస్థానీ మద్దతుదారులే తన హత్యకు ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.తాజాగా, రైల్వేశాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు మాట్లాడుతూ.. పంజాబ్‌లోని రాజకీయ నాయకులకు ఖలిస్థానీ మద్దతుదారుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. పలువురు నేతల హత్యకు వారు ప్లాన్ చేస్తున్నారు. ఖలిస్తానీల ప్లాన్ గురించి సోషల్ మీడియాలో లీకైన కొన్ని స్క్రీన్ షాట్ల ద్వారా ఈ విషయం నాకు తెలిసింది. ఎంపీ అమృత్‌పాల్ సింగ్ నడిపిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థతో సంబంధమున్న ఖలిస్థానీ మద్దతుదారులే ఇందులో ఉన్నారు. నాతో పాటుగా మరికొంతమంది రాజకీయ నాయకుల ప్రాణాలకు కూడా ఖలిస్థానీయుల నుంచి ముప్పు పొంచి ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కూడా వారిస్ పంజాబ్ దే నాయకులు కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్ నిర్బంధం మరో ఏడాది పొడిగించడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు. అందుకే ఈ గ్రూపుతో సంబంధం ఉన్న ఖలిస్తానీ శక్తులను పంజాబ్ ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.అయతే, గతంలో దిబ్రుగఢ్ జైలులో ఉన్న అమృత్‌పాల్ సింగ్ సహచరులను పంజాబ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఇది ప్రధాన కుట్రదారుడిగా అమృత్‌పాల్ పాత్రపై అనుమానాలను మరింత బలపరుస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కార్యకర్తలుగా మారువేషంలో ఉన్న నేరస్థుల పట్ల పంజాబ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. -
వదినమ్మకు చెప్పారా? అసలు ఒప్పుకుంటుందా?
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న ఓ పరిణామం.. దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. రెండు దశాబ్దాలుగా రాజకీయ విరోధులుగా ఉన్న సోదరులు ఉద్దవ్ థాక్రే, రాజ్ థాక్రేలు కలిసి పోనున్నారనేది ఆ వార్త సారాంశం. అయితే ఈ కలయిక ప్రచారాన్ని బీజేపీ ఇప్పుడు ఎద్దేవా చేస్తోంది.ముంబై: యూబీటీ సేన-ఎంఎన్ఎస్ పొత్తు అవకాశాలపై ఓ హిందీ న్యూస్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ నారాయణ్ రాణే(Nitesh Narayan Rane) ఈ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఎంఎన్ఎస్తో థాక్రే శివసేన చేతులు కలపబోతోందా?. ఈ విషయంలో తన భార్య రష్మీ థాక్రే(Rashmi Thackeray) అనుమతి తీసుకున్నారో లేదో?. ఈ విషయాన్ని ఉద్దవ్ థాక్రేను మీరే(న్యూస్ యాంకర్‌ను ఉద్దేశించి..) అడగాలి. ఇలాంటి నిర్ణయాల్లో ఆమె భాగస్వామ్యమే ఎక్కువ అనే విషయం ఆయన మరిచిపోవొద్దు’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.శివసేన నుంచి రాజ్ థాక్రే(Raj thackeray) నిష్క్రమణకు రష్మీనే కారణమన్న రాణే.. ఆ సమయంలో సోదరుల మధ్య ఎలాంటి విబేధాలు లేవనే విషయాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్ర ప్రజలు మయూతీ కూటమికి అఖండ విజయం కట్టబెట్టారని.. కాబట్టి ఎంఎన్ఎస్, యూబీటీ శివసేన పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా.. ఇక్కడి రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నితీశ్ రాణే అన్నారు.ఈ క్రమంలో ఏక్నాథ్ షిండే-రాజ్ థాక్రే విందు సమావేశంపైనా రాణేకు ప్రశ్న ఎదురైంది. షిండేకు బాల్ థాక్రే కుటుంబానికి దశాబ్దాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా రాజ్ థాక్రేను బాల్ థాక్రేకు అంశగా షిండే భావిస్తుంటారు. అంతేగానీ వాళ్ల భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నది కాదు అని రాణే అన్నారు. మహారాష్ట్ర ప్రజలు, మరాఠీ భాష ప్రయోజనాల కోసం ఉద్ధవ్ థాక్రేతో కలిసి పని చేసేందుకు సిధ్ధమని ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే ఇటీవల ప్రకటించారు. ఇందుకు ఉద్ధవ్ థాక్రే కూడా సానుకూలంగా స్పందించడంతో ఇరువురు ఏకం కానున్నారనే వార్తలు విస్తృతమయ్యాయి. అయితే దీనిపై తాజాగా యూబీటీ సేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) మాట్లాడుతూ.. రాజకీయ పొత్తుకు సంబంధించి ఎటువంటి సంప్రదింపులు జరగలేదని, కేవలం వీరి మధ్య భావోద్వేగ చర్చలు మాత్రమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: నా బద్ధ శత్రువుకి కూడా ఈరోజు రాకూడదు -
ఉద్ధవ్‌తో రాజ్ ఠాక్రే పొత్తు.. సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో విపక్ష శివసేన(ఉద్ధవ్), మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చేతులు కలుపబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ రెండు పార్టీల అధినేతలు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే వరుసకు సోదరులే. రెండు పార్టీల మధ్య త్వరలో పొత్తు కుదరబోతున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.అయితే, రెండు పార్టీలతో కూటమి ఏర్పాటు అనే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం తెలిపారు. రెండు పార్టీల నడుమ భావోద్వేగపూరిత చర్చలు నడుస్తున్నాయని వెల్లడించారు. కుటుంబ కార్యక్రమాలు, వేడుకల్లో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలుసుకోవడం, మాట్లాడుకోవడం సాధారణమేనని చెప్పారు. ఉమ్మడి శివసేన పార్టీలో పని చేసినప్పుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఎలాంటి విభేదాలు తలెత్తలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ ఠాక్రే చెప్పడం సంచలనాత్మకంగా మారింది.ఇక, ఇరువురు నేతలు చేతులు కలుపబోతున్నట్లు మహారాష్ట్రలో ఊహాగానాలు మొదలయ్యాయి. మహారాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో కలిసికట్టుగా పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ఇప్పటికే సంకేతాలిచ్చారు. తాజాగా రాజ్ ఠాక్రే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదాలు పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. మా మధ్య ఉన్నవి చిన్న విభేదాలే. మహారాష్ట్ర ప్రయోజనాల ముందు ఇవి చాలా చిన్నవి. మేం కలవడం కష్టమేమీ కాదు. అందుకు సంకల్పం ఉండాలి అని ఆయన అన్నారు. అయితే, కలయికకు ఉద్ధవ్ థాక్రే ఓ షరతు విధించారు. చిన్నచిన్న గొడవలు పక్కన పెట్టడానికి నేను సిద్ధం. కానీ, ఒకరోజు మద్దతిచ్చి, మరుసటి రోజు వ్యతిరేకించి, ఆపై రాజీ పడే ద్వంద్వ వైఖరి పనికిరాదు. మహారాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా వారితో కలిసేది లేదు అని స్పష్టం చేశారు. రాజ్ థాక్రే ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఉద్ధవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. థాక్రే సోదరుల కలయికను బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. అయితే, వారు కలిసినా రాబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో తమ కూటమిని ఓడించలేరని బీజేపీ నేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేతలు కూడా ఈ కలయికను సానుకూలంగా చూస్తున్నారు. థాక్రే సోదరులు ఏకమైతే బీఎంసీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఉమ్మడి శివసేనలో కీలకంగా వ్యవహరించిన రాజ్ ఠాక్రే 2006లో ఎంఎన్ఎస్ పేరిట సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఈసీ కాదు.. ముస్లిం కమిషనర్.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ: ఇటీవలి కాలంలో బీజేపీ ఎంపీలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో, ఎంపీల వ్యాఖ్యల దుమారం హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. ఇంతకుముందు, సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందే అంటూ నిశికాంత్ దూబే చేసిన వ్యాఖ్యల వేడి తగ్గకముందే.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తాజాగా మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో దూబే మాట్లాడుతూ..‘ఖురేషీ సీఈసీగా ఉన్నప్పుడు జార్ఖండ్‌లోని సంతాల్ పరగణాలో బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఓటర్ గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఆయన ఎన్నికల కమిషనర్ కాదు.. ముస్లిం కమిషనర్. చరిత్ర ప్రకారం క్రీ.శ 712 సంవత్సరంలో దేశంలోకి ఇస్లాం ప్రవేశించిందని, అప్పటిదాకా ఈ భూభాగం అంతా హిందువులు, గిరిజనులు, జైనులు, బౌద్ధులదే. అంతేకాదు, దేశాన్ని ఐక్యంగా ఉంచండి. చరిత్రను చదవండి. అప్పట్లో దేశాన్ని విభజించి పాకిస్థాన్‌ను సృష్టించారు. ఇకపై విభజన ఉండదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే,ర నిశికాంత్ దూబే జార్ఖండ్‌లోని గోడ్డా లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు సుప్రీంకోర్టును టార్గెట్ చేసిన దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందే అన్నారు. పార్లమెంటు శాసనాధికారాల్లోకి న్యాయస్థానాలు చొరబడుతున్నాయని, చట్టసభ్యులు చేసిన చట్టాలను కొట్టివేస్తున్నాయని విమర్శించారు. జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో అధికరణం 368 ప్రకారం చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదని, పార్లమెంటుకు మాత్రం కాదని తెలిపారు. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.Muslim Commissioner: BJP's Nishikant Dubey now targets former poll panel chiefNishikant Dubey criticises former poll panel chief over Waqf ActAccuses SY Quraishi of legitimising #BangladeshiInfiltratorsBJP distanced itself from Dubey's remarks on judiciary pic.twitter.com/Q1zhgZBL4X— The Contrarian 🇮🇳 (@Contrarian_View) April 20, 2025 -
కేసీఆర్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరం
సాక్షి, హైదరాబాద్/ అత్తాపూర్: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవటం తెలంగాణ సమాజానికి చారిత్రక అవసరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవలసిన బాధ్యత తెలంగాణ సమాజంపైనే ఉందని తెలిపారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కు తరలివచ్చి కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఆదివారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అత్తాపూర్ డివిజన్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు.వారికి కేటీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లపాటు కేసీఆర్ అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ మళ్లీ వెనక్కు తీసుకెళ్తోందని మండిపడ్డారు. ‘మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో మనకు జరిగిన నష్టం తక్కువ. మన ఓటమితో తెలంగాణ సమాజానికి ఎక్కువ నష్టం జరిగింది.స్వరాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. ఈ రికార్డును ఎవరూ చెరపలేరు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని ఎవరన్నా అనుకుంటే అది వారి అజ్ఞానం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. చంద్రబాబు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. దండయాత్రలు చేసిన రాజులు కూడా ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పరు’అని కేటీఆర్ అన్నారు. బీజేపీకి మత పిచ్చి లేపడమే తెలుసు ‘దేశంలో మత పిచ్చి లేపడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ వెనక్కి పోయినట్టే.. మోదీ నాయకత్వంలో దేశం వెనక్కి పోతుందని అన్నారు. ‘మత పిచ్చి మంచిది కాదు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. హిందువులు ప్రమాదంలో ఉన్నారట! 2014 వరకు మంచిగా ఉన్న హిందువులు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారట. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లేని పంచాయితీ ఇప్పుడు ఎందుకు కొత్తగా పెడుతున్నారు? రాజకీయం కోసం దేశాన్ని విడగొడుతున్నారు. మంచి పనులు చేసి ఓట్లు అడగాలి. హిందూ, ముస్లిం, పాకిస్తాన్, జై శ్రీరాం, మోదీ.. ఈ ఐదు పదాలు చెప్పకుండా ఓట్లు అడిగేటోళ్లు ఎవరైనా ఉన్నారా? తెలంగాణకు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ శత్రువులే’అని కేటీఆర్ విమర్శించారు. గరీబోళ్ల ఇండ్లపైకే హైడ్రా బుల్డోజర్లు హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు నడిపిస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘హైడ్రాతో ఆస్తులు కాపాడుతాం అంటున్నారు. చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, కేవీపీ రామచంద్రర్‌రావు, సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇళ్లను మాత్రం ముట్టరు. అల్కగా దొరికే గరీబోని పైకి బుల్డోజర్లు పంపుతున్నారు. రైతుబంధు, తులం బంగారం, రుణమాఫీ, స్కూటీలకు పైసల్లేవు కానీ.. మూసీకి మాత్రం లక్షన్నర కోట్లు ఇస్తారట’అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘తెలంగాణలో జనజాతర.. ఇది మన జాతర’
ఖమ్మం: వచ్చేవారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయే రజతోత్సవ సభతో తెలంగాణలో ఒక ఉత్సవ వాతావరణం నెలకొందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఖమ్మంలో మాట్లాడిన కవిత.. తెలంగాణలో జన జాతర, ఇది మన జాతర అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారని, కానీ ధాన్యం తడిసిపోతే కనీసం పట్టించుకోలేదన్నారు. ‘రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. కనీసం రైతుల కష్టాల మీద ఒక్క రివ్యూ కూడా చేయటం లేదు. రైతుల కష్టాల మీద ఈ ప్రభుత్వం కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి తర్వాత అంత స్థాయిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఈ జిల్లాతోనే ఉన్నారు. డిప్యూటీ సీఎం అంటే ఎంత బాధ్యత .. ఆలోచన ఉండాలి...? , ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలాయించుకుంటున్నారు .. తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదు. ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల జిల్లా అని పేరు ఉంది. ప్రశ్నించే కమ్యూనిస్టు కూడా ప్రశ్నించకపోవడంతో కమ్యూనిజం మీద నమ్మకం సన్నగిల్లింది.ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్యూనిస్టు పెద్దలు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం వల్లే ప్రశ్నించడం లేదా.?. తెలంగాణ ఏర్పడిన 9 /10 నెలల్లోనే ఇదే జిల్లాలో భక్త రామదాసు ప్రాజెక్టు కట్టించి 60,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ప్రభుత్వం ఏర్పడి 15/ 16 నెలలు అయింది . ఒక కొత్త పథకం లేదు. కొత్త ప్రాజెక్టు లేదు. ముఖ్యమంత్రి గారి పాలన గురించి, మాటల గురించి చెప్పనవసరంలేదు. నేను ఖమ్మం రాగానే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు తన బాధను వ్యక్తం చేశాడు. గ్రామ శాఖ పదవికి రాజీనామా చేశారని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి జపాన్ పర్యటన చేస్తున్నారు తప్ప .. వాన పడి రాష్ట్ర రైతుల అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించలేదు.రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు రూ. 20,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా . ప్రభుత్వం తక్షణం నష్ట పరిహారం చెల్లించాలి . అధికారులను అప్రమత్తం చేయాలి. రాష్ట్రంలో పరిపాలన పడకేసింది. మంత్రులు ములుగు పర్యటనకు పోతే.. ఆసుపత్రిలో దుస్థితి వల్ల చనిపోయిన పసిపాపను చూపించారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన ఏ ఒక్క పని అమలు చేయలేదు. రైతు రుణమాఫీ సంపూర్ణం చేశామని ఘోరమైన అబద్ధాలు చెబుతున్నారు. రైతు కూలీలకు ఇస్తామన్న రైతుభరోసా పథకం ఏది..?? , కేసీఆర్ ఇచ్చిన ప్రతీ మాటను నెరవేర్చారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మన్ననలు కోల్పోయింది.ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ప్రతినిధులను ప్రజలు ఎక్కడికి నిలదీయాలి. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ ను ఎంకరేజ్ చేయండి. ఏప్రిల్ 27న టిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి.. బలమైన నాయకత్వం ఉన్న ఖమ్మం జిల్లా నుంచి ప్రజానికం పెద్ద ఎత్తున తరలిరావాలని ఆహ్వానిస్తున్న’ అని కవిత విజ్ఞప్తిచేశారు. . -
‘మెగా డీఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డీఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వచ్చిన మెగా డీఎస్సీకి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్‌ను కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేమిటని నిలదీశారు.టీచర్ పోస్ట్‌ల నియామక ప్రక్రియపై నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా ఆరు లక్షల మంది అభ్యర్ధుల ఆశలతో ప్రభుత్వం ఆటలాడితే సహించేది లేదని హెచ్చరించారు. మెగా డీఎస్సీని చిత్తశుద్దితో నిర్వహించకపోతే అభ్యర్ధుల తరుఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.ఇంకా ఆయనేమన్నారంటే..డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియలో లోపాలను సవరించకపోతే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై నిరుద్యోగుల తరుఫున ప్రభుత్వాన్ని మేలుకొలుపేందుకు కొన్ని అంశాలను మీడియా ద్వారా ఈ ప్రభుత్వం ముందు పెడుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే కేబినెట్లో మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారు. పదకొండు నెలల తరువాత చంద్రబాబు పుట్టినరోజు నాడు తాజా నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే చంద్రబాబు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చేందుకేనా ఈ పదకొండు నెలలుగా మెగా డీఎస్సీని ఆలస్యం చేశారు?.గత ఏడాది జూన్ 14న కూటమి ప్రభుత్వం తొలి కేబినెట్ సమవేశంలో మెగా డీఎస్సీ కింద 16,357 పోస్ట్‌ల భర్తీపై సంతకం చేశారు. వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తాం, పరీక్ష ప్రక్రియ, నియామకాలను వెంటవెంటనే చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే తొలిఫైల్ పై సంతకం చేసిన రెండు రోజుల్లోనే టెట్ నిర్వహించిన తరువాతే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం అంతకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు కూడా అదే జూన్ నెలలో వెలువడ్డాయి. మళ్లీ టెట్ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం సాకు చెప్పడం పెద్ద మోసం కాదా?తరువాత గత ఏడాది కూటమి ప్రభుత్వం టెట్ నిర్వహించి, నవంబర్ 4వ తేదీన ఫలితాలను విడుదల చేసింది. అదే సందర్భంగా నవంబర్ 6వ తేదీన మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. అయితే నవంబర్ 5వ తేదీన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఒక వ్యక్తితో కోర్ట్‌లో పిటీషన్ వేయించారు. కోర్ట్‌లో కేసు పెండింగ్‌లో ఉన్నందున వర్గీకరణ బిల్లు ఆమోదం తరువాతే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటూ ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తూ వచ్చిన వైయస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించింది. శాసనమండలిలో ప్రతిసారీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, నిరుద్యోగుల తరుఫున గళాన్ని వినిపించడం ద్వారా ఒత్తిడి తీసుకువచ్చింది.వైఎస్సార్సీపీ ఒత్తిడితో ఎట్టకేలకు నోటిఫికేషన్మెగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ చేసిన ఒత్తిడి కారణంగానే కూటమి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చి, చంద్రబాబు పుట్టినరోజున మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న ఆరు లక్షల మంది అభ్యర్థుల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత పదకొండు నెలలుగా వాయిదాల మీద వాయిదాల వేయడం, కోర్టుల్లో పిటీషన్లు వేయడం చూస్తుంటే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్‌ను అయినా కార్యరూపంలోకి తీసుకువస్తారా అని పలువురు ప్రభుత్వ చిత్తశుద్దిని శంకిస్తున్నారు.స్కూల్స్ తెరిచే నాటికి అంటే జూన్ 1వ తేదీ నాటికి డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి, మొత్తం పోస్ట్‌లను భర్తీ చేస్తామని లోకేష్, చంద్రబాబు చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకువచ్చారు. ఈ ఆర్డినెన్స్‌లో ఎస్సీల్లో ఆర్ఓఆర్పై కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండానే ఆర్డినెన్స్‌ను అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని ప్రభావం డీఎస్సీపై పడుతోంది. ప్రభుత్వం ఇప్పుడు కేవలం సుమారు పదహారు వేల టీచర్ పోస్ట్‌లను భర్తీ చేస్తూ, ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును సాకుగా చూపడం ఎంత వరకు సమంజసమని అభ్యర్ధులు ప్రశ్నిస్తున్నారు.టీచర్ పోస్ట్‌ల నియామక ప్రక్రియలో స్పష్టత ఏదీ?ఏప్రిల్ 20న నోటిఫికేషన్, జూన్ 6 నుంచి జులై 6వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షల ప్రక్రియను నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. డీఎస్సీ పరీక్షా ఫలితాలు ఆగస్టులో ఇస్తామని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో ఫలితాలను ప్రకటిస్తే, ఉద్యోగాల భర్తీ ఎప్పుడూ? మరోవైపు మే నెలలో టీచర్ల బదిలీలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. సుమారు 16 వేల పోస్ట్‌లను బ్లాక్ చేయకుండానే బదిలీలను ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అంటే మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో ఉండే టీచర్ పోస్ట్‌లు ఖాళీగానే ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. కొత్త డీఎస్సీ ఫలితాలే ఆగస్టు మొదటి వారంలో వస్తే, ఉద్యోగాల నియామకాలు సెప్టెంబర్ దాటి పోయే అవకాశం ఉంది.అంటే అప్పటి వరకు మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో ఉపాధ్యాయుల ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులు టీచర్ లేక, విద్యాసంవత్సరం ప్రారంభమైన నాలుగు నెలల పాటు పాఠాలు చెప్పేవారు లేక నష్టపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ మొత్తం ప్రక్రియపైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? జూన్‌లోగానే నియామక ప్రక్రియను పూర్తి చేస్తే, విద్యార్ధులకు ఈ నష్టం జరగదు. కానీ ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ వరకు టీచర్ పోస్ట్‌ల భర్తీని సాగదీయడం వల్ల విద్యార్ధులే అంతిమంగా నష్టపోతున్నారు. పదకొండు నెలల కిందట 16347 పోస్ట్‌లకు కేబినెట్లో సంతకం చేశారు. నేటికీ అదే పోస్ట్‌లకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం ఎంత వరకు సమంజసం? ఈ మధ్య కాలంలో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి? వాటి పరిస్థితి ఏమిటీ?అసమర్థతతో విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారుకూటమి ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో విద్యారంగం నాశనమవుతోంది. ఆనాడు సీఎంగా వైయస్ జగన్ గారు జీఓ 117 ద్వారా ప్రభుత్వ విద్యావ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతూ మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పించాలని సంకల్పించారు. దీనిపై కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తూ అనేక అసత్య ఆరోపణలు చేసింది. జీఓ 117లో ఏమున్నాయో తెలియకుండానే ఆ జీఓను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. తరువాత ఆ జీవో మీద ఒక కొత్త మెమోను తీసుకువచ్చారు. ఈ మెమో కారణంగా అనేక ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించారు. సుమారు 19271 ప్రైమరీ స్కూళ్ళు వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్‌గా మారిపోతున్నాయి.ఒక పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్‌ను పెడతామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో దాదాపు 31 వేల ప్రైమరీ స్కూల్స్ ఉంటే, పంచాయతీకి ఒక్క స్కూలే పెడితే 19,271 స్కూల్స్ మాత్రమే మిగులుతాయి. రాష్ట్రంలో మొత్తం 3156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఈ స్కూల్స్‌నే తీసివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉన్న ఈ స్కూళ్ళలో 83 శాతం ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు అరవై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఈ స్కూళ్ళన్నీ కూడా ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్ల కింద పడిపోయే ప్రమాదం ఉంది.కేవలం 17 శాతం స్కూళ్లను మాత్రమే హైస్కూళ్ళుగా మారుస్తామని ప్రభుత్వం చెప్పింది. అలాగే 510 హైస్కూల్ ప్లస్ విద్యా సంస్థలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 1800 మందికి పీజీటీలుగా పదోన్నతులు కల్పించి, ఇంటర్మీడియేట్ వరకు ఈ స్కూళ్లలో విద్యాబోధన కల్పించాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అవసరమైతే విద్యార్థుల కోసం పోరాడతామని చెప్పడంతో వాటిల్లో ఈ ఒక్క ఏడాది మాత్రమే 290 హైస్కూల్ ప్లస్ విద్యాసంస్థలను కొనసాగిస్తామని చెప్పి, వాటిపైనా కూడా ఒక అయోమయాన్ని కల్పించారు. అలాగే 117 జీఓ రద్దు వల్ల స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన వారి 8000 మంది పరిస్థితి ప్రశ్నార్థకం అయ్యింది.ఉద్యోగాల కల్పనపైనా అబద్దాలేనా?చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగాల వెల్లువ అంటూ తప్పుడు ప్రచారంతో అబద్దాలను గొప్పగా చెప్పుకుంటున్నారు. అయిదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని పచ్చి అబద్దాలు చెప్పారు. మేం దానిని ప్రశ్నించగానే పొరపాటుగా చెప్పామంటూ మాట మార్చారు. మరోవైపు ఉన్న ఉద్యోగాలను కూడా క్రమంగా తొలగిస్తూ యువత జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పదకొండు నెలల్లోనే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వారిని ఏకంగా మూడు లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.ఇప్పుడు ఏడాది సమయం తరువాత 16 వేల టీచర్ పోస్ట్‌లను భర్తీ చేస్తామంటుంటేనే అనేక సందేహాలు కలుగుతున్నాయి. 2014-19లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2018లో ఏడు వేలకు పైగా పోస్ట్‌లకు నోటిఫికేషన్ జారీ చేశారు. తీరా ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారా అని చూస్తే కేవలం 300 పోస్ట్‌లు భర్తీ చేసి, 6900 మందిని గాలిలో పెట్టారు. తరువాత వైయస్ జగన్ గారి ప్రభుత్వం వాటిని భర్తీ చేసింది. అలాగే 1998 డీఎస్సీని కూడా సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఇరవై అయిదేళ్ళ తరువాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో వారికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది.తాజా నోటిఫికేషన్లో వైఎస్ జగన్ అయిదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని చెప్పారు. చంద్రబాబు గత అయిదేళకల పాలనలో ఎన్ని టీచర్ పోస్ట్‌లను భర్తీ చేశారని చూస్తే, 2014-19లో 10,313 పోస్ట్‌లు మాత్రమే భర్తీ చేశారు. వైఎస్ జగన్ అయిదేళ్ల కాలంలో రెండేళ్ళు కోవిడ్ సంక్షోభం ఉన్నా కూడా మూడేళ్ళలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన పాపాలను సరిచేసి అనేక వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. 1998 డీఎస్సీలో నాలుగు వేల మందికి పాతికేళ్ళ తరువాత ఉద్యోగాలు ఇచ్చారు.2018 డీఎస్సీ కింద వైఎస్ జగన్ హయాంలో 6954 మందికి టీచర్ పోస్ట్‌లు ఇచ్చారు. 2008 డీఎస్సీలో ఉతర్ణులైన వారికి 2193 మందికి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే టీచర్ పోస్ట్‌లు ఇచ్చింది. 602 పోస్ట్‌లను స్పెషల్ డీఎస్సీ ద్వారా, కేబీబీవీల్లో 1200 పోస్ట్ లను ఇలా మొత్తం 15008 టీచర్ పోస్ట్‌లను ఆయన హయాంలో భర్తీ చేయడం జరిగింది. అలాగే 2024 లో 6100 పోస్ట్‌లకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే 21000 టీచర్ పోస్ట్‌ల భర్తీకి వైయస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.కేవలం పదివేల పోస్ట్‌లను భర్తీ చేసిన చంద్రబాబ ప్రభుత్వం తమదే గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా? ఎక్కడా బర్త్‌డే గిఫ్ట్‌లుగా ప్రచారం చేసుకుంటూ ఉద్యోగాలు ఇవ్వలేదు. భారతదేశంలోనే 1.36 లక్షల ఉద్యోగాలను ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి, రెండు నెలల్లో భర్తీ చేయడం ఒక రికార్డ్. ఇన్ని చేసిన వైఎస్ జగన్‌పై కూటమి పార్టీలు విమర్శలు చేయడం హాస్యాస్పదం. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే వరకు వారికి నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పారు. ఒక్కరికైనా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఉద్యగాలు లేవు, భృతి అంతకన్నా లేదు. కనీసం ఈ మెగా డీఎస్సీన అయినా చిత్తశుద్దితో నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి చెబుతున్నాం. -
నా బద్ధ శత్రువుకు కూడా ‘ఈ రోజు’ రాకూడదు!
‘నేను పార్టీ నుంచి ఏం కోరుకున్నాను.. గౌరవం, మర్యాద కోరుకున్నాను. కానీ నాకు అవి అక్కడ దొరకలేదు. పార్టీ నుంచి ఏమీ ఆశించలేదు. చాలా అవమానించారు. మానసికంగా చాలా హింసించారు. నా బద్ధ శత్రువుకు కూడా ఇటువంటి రోజు రాకూడదు’. ఇవి ఒకనాడు రాజ్ ఠాక్రే చెప్పిన మాటలు. 20 ఏళ్ల క్రితం రాజ్ ఠాక్రే ప్రెస్ కాన్పరెన్స్ లో చెప్పిన మాటలు. శివసేన నుంచి బయటకొచ్చి ఎమ్మెన్నెస్ పార్టీ పెట్టడానికి ముందు అన్న మాటలు. 2005, డిసంబర్ 18వ తేదీన మీడియా సాక్షిగా రాజ్ ఠాక్రే అన్న మాటలివి. ఆ రోజు ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. బాలాసాహెబ్ ఠాక్రే కలలో కూడా ఊహించని పరిణామం. 2005లో శివసేన నుంచి బయటకొచ్చిన రాజ్ ఠాక్రే.. మూడు నెలల వ్యవధిలోనే ఎమ్మెన్నెస్ పార్టీ స్థాపించారు. అప్పట్నుంచి ఇప్పటివరకూ శివసేనతో ఎటువంటి సంబంధాలు కొనసాగించలేదు. ‘మీరు వేరు- మేము వేరు’ అన్నట్లుగానే సాగింది ఈ ఇరు పార్టీల వైరం. కానీ ఇప్పుడు శివసేనతో కలవడానికి ఆసక్తి చూపిస్తున్న సమయంలో ఆనాడు రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.ప్రత్యేకంగా ఉద్ధవ్ ఠాక్రే కారణంగానే ఆనాడు తాను బయటకొచ్చానని రాజ్ ఠాక్రే పరోక్షంగా చెప్పారు. పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత శివసేన వ్యవస్థాపకులు బాలాసాహెబ్ ఠాక్రేతో రాజ్ ఠాక్రే జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ఎమ్మెన్నెస్ అవతరించింది. ఇన్నాళ్లకు శివసేనతో మళ్లీ జట్టు కట్టాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. మహారాష్ట్ర ప్రజల ఆశయం కోసం ముఖ్యంగా మరాఠీల రక్షణ కోసం తాము కలిసి అడుగేయాలని తాజాగా రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. దీనికి శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ కూడా సానుకూలంగా స్పందించడంతో వారి బంధం రెండు దశాబ్దాల తర్వాత పట్టాలెక్కడానికి తొలి అడుగు పడింది. ఇదీ చదవండి:రెండు దశాబ్దాల తర్వాత ‘బంధం’ కలుస్తోంది..! -
ఆది అరాచకం.. అల్ట్రాటెక్‌కు మరోసారి బెదిరింపులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు మితిమీరిపోతున్నాయి. మరోమారు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై బెదిరింపులకు దిగారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి దాడులు చేయిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అల్ట్రాటెక్ సిమెంట్స్‌పై తాను వ్యవహరించిన తీరు తప్పు కాదంటూ సమర్థించుకున్నారు.అక్కడి కాంట్రాక్టులన్నీ తనకే కావాలంటూ ఉత్పత్తి అడ్డుకున్నారు. ముడిసరుకు, ఉత్పత్తి బయటకు వెళ్లకుండా బస్సు అడ్డుగా పెట్టీ మరీ బెదిరింపులకు దిగారు. అదినారాయణరెడ్డి దౌర్జన్యంపై జిల్లా కలెక్టర్‌కు ఫ్యాక్టరి యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పోలీసు బందోబస్తుతో తిరిగి ఉత్పత్తి పునరుద్ధరించారు. అయినా తన తప్పేమీ లేదంటూ ఆదినారాయణరెడ్డి బుకాయించారు. పైగా సీఎంతో మాట్లాడి దాడులు చేయిస్తానంటూ మరోసారి బెదిరింపులకు దిగారు.కాగా, చిలంకూరులోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో కార్యకలాపాలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవడంతో గత రెండు రోజుల క్రితం కూడా ఉత్పత్తి ఆగిపోయిన సంగతి తెలిసిందే. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న బెదిరింపులు మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.మొన్న అదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను అడ్డుకుని విధ్వంసం..! నిన్న ఆర్టీపీపీలో ఫ్లైయాష్ రవాణా లారీలను అడ్డుకుని దౌర్జన్యం..! తాజాగా అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి బెదిరింపులు..! వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి ఆది నుంచి అరాచకాలనే ప్రోత్సహిస్తూ దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. -
కొలికపూడికి మరో షాక్.. తిరువూరులో రెండుగా చీలిన టీడీపీ
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ను పూర్తిగా పక్కన పెట్టేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తన నివాసం వద్ద చంద్రబాబు బర్త్ డే వేడుకలను కొలికపూడి శ్రీనివాస్ ఏర్పాటు చేయగా, ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఛైర్మన్ శావల దేవదత్ ఫ్యాక్టరీ సెంటర్లో ఈ వేడుకల నిర్వహించారు.అయితే, ఎమ్మెల్యే కొలికపూడి నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు. శావల దేవదత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తిరువూరు నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.కాగా, ఇటీవల ఎమ్మెల్యే కొలికపూడిని చంద్రబాబు.. ఘోరంగా అవమానించిన సంగతి తెలిసిందే. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి రోజునే కొలికపూడికి అవమానం జరగడం గమనార్హం. చంద్రబాబుకు తాను నమస్కారం పెట్టి పలకరించినా అదేమీ బాబు పట్టించుకోలేదు.. కొలికపూడికి కరచాలనం కూడా చేయకుండానే వెళ్లిపోయారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో పర్యటనకు వచ్చారు.ముప్పాళ్లలో హెలికాప్టర్ దిగిన చంద్రబాబు.. అక్కడున్న టీడీపీ నేతలను పలికరిస్తూ కరచాలనం చేస్తూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి కూడా చంద్రబాబుకు నమస్కరించారు.. ఆయన్ను చూసిన బాబు ముఖంలో సీరియస్‌నెస్ కనిపించింది. దీంతో, కొలికపూడిని పట్టించుకోకుండా.. చూసీచూడనట్టుగా బాబు ముందుకు సాగారు. -
అంబేద్కర్‌కు నిజమైన వారుసుడు మోదీయే
పెద్దపల్లి జిల్లా,సాక్షి: పేద ముస్లింలను దోచుకున్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ఆయన మీడియాతో మాట్లాడారు. పేద ముస్లింలకు న్యాయం జరగాలనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టాం. అలాంటి బిల్లును వ్యతిరేకిస్తున్న ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉంది. టైటిల్ డీడ్ లేని భూములను వక్ఫ్ పేరుతో ఆక్రమించుకున్న చరిత్ర ఎంఐఎం పార్టీది. న్యాయస్థానాలపై భారతీయ జనతా పార్టీకి నమ్మకం ఉంది. నిన్న జరిగిన మీటింగుకి ఖర్మ, కర్త, క్రియ రేవంత్ రెడ్డియే..మీటింగు కోసం నిధులు సమకూర్చింది కూడా రేవంత్ రెడ్డియే. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు నాటకాలాడుతున్నాయి. మంచి ఉద్దేశంతో బిల్ తీసుకువస్తే మత కోణంలో ప్రతిపక్షాలు విద్వేశాలు రెచ్చగొడుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు నిజమైన వారుసుడు మోదీయే. వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలి. రైతుల విషయాన్ని పక్కన పెట్టి వక్ఫ్ మీటింగు కోసం కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తాపత్రయ పడుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. -
రాజేంద్రనగర్, చేవేళ్లకు త్వరలో ఉప ఎన్నికలు: కేటీఆర్
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఏమైంది? నిట్టనిలువునా మోసపోయామని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, తెలంగాణలోని రెండు నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీసీ, ఎస్సీ, యువ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా తెలంగాణ భవన్‌కు వచ్చారు. రాజేంద్రనగర్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్లో చేరిన వారికి పార్టీ కండువా కప్పి కేటీఆర్ ఆహ్వానించారు. అనంతరం, కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చేవెళ్ల, రాజేంద్ర నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. ఈ సంవత్సరమే ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఉంటాయి. మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ గెలవాలి. తెలంగాణలో ఉప ఎన్నికలు రావు అంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఆ మరుసటి రోజు లైన్ దాటితే తాట తీస్తామని సుప్రీంకోర్టు జడ్జి అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సుప్రీంకోర్టు ఊరుకుంటుందా?.కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ గుండెలు జారేలా బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ సభకు కదలాలి. వరంగల్‌లో 1250 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేస్తున్నాం. వరంగల్ సభలో కేసీఆర్ ఒక్కరే మాట్లాడతారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేసింది. బీసీ, ఎస్సీ, యువ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?’ అని ప్రశ్నించారు. -
ఆడియో టేపుల కలకలం.. తెలంగాణ బీజేపీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి హత్యకు కుట్ర
మహబూబ్‌నగర్,సాక్షి: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొండా ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు నిందితులు రెక్కీ నిర్వహించారు. ఇందులో భాగంగా కోర్టు, రియల్ఎస్టేట్ కార్యాలయాల వద్ద కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీషీటర్లు అనుమానాస్పదంగా కనిపించారు.ఓ హత్యకేసులో ప్రశాంత్‌రెడ్డి నిందితుడు కావడం, రూ.2.5 కోట్లకు సుఫారీ కుదుర్చుకున్నట్లు పలు ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ప్రశాంత్‌రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెలుగులోకి వచ్చిన ఆడియోల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
‘రెండు జీరోలు కలిస్తే వచ్చేది జీరోనే’
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార బీజేపీ మహాయుతి కూటమికి షాకిస్తూ మహారాష్ట్ర నవ్ నిర్మాణ సేన (ఎంఎస్ఎన్)అధినేత రాజ్ ఠాక్రే సంచలన నిర్ణయం తీసుకున్నారు. 20ఏళ్ల తర్వాత తన బంధువు ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. అటు రాజ్‌ఠాక్రే నిర్ణయాన్ని సైతం ఉద్దవ్ ఠాక్రే సమర్థించారు. ఇప్పుడీ ఈ ఇరువురి నిర్ణయం మహా రాజకీయాల్లో కీలక మలుపు తిరిగినట్లైంది.వేర్వేరు కార్యక్రమాల్లో విభేదాలు పక్కనపెట్టి మహారాష్ట్ర కోసం, మరాఠా ఉనికోసం ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు కలిసిపోతే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ నిర్వహించిన పాడ్ కాస్ట్లో రాజ్ ఠాక్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఉద్దవ్‌కు నాకు మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు మహారాష్ట్ర ప్రయోజనాలకు హానికరంగా మారాయి. ఈ వివాదాలు చిన్నవి మాత్రమే. వాటి కంటే మహారాష్ట్ర పెద్దది. మా మధ్య అనుకూలతలు మహారాష్ట్ర, మరాఠీ ప్రజలకు అవసరం. మేం కలిసిపోవడం కష్టం కాదు. ఇది నా ఆకాంక్ష.. స్వార్థం కాదు. అన్నింటికన్నా మహారాష్ట్ర ప్రజలు మా రాజకీయ పార్టీలను వేర్వేవేర్వేగా చూడకూడదు. ఒకే పార్టీగా అవతరించాలి’ అని వ్యాఖ్యానించారు. నేను ఏక్నాథ్ షిండేలా కాదు అయితే, 2005లో శివసేన నుంచి విడిపోయే సొంత పార్టీ మహారాష్ట్ర నవ్ నిర్మాణ సేన (ఎంఎస్ఎన్)స్థాపించడం, 2022లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే విడిపోవడంలో చాలా తేడాలున్నాయని చెప్పారు. ‘నేను శివసేన నుండి బయటకు వచ్చే సమయంలో నా వద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. కానీ నేను మాత్రం ఒంటరిగానే బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను బాలాసాహెబ్ ఠాక్రే కింద మాత్రమే పని చేశాను. ఉద్దవ్ ఠాక్రేతో పని చేయడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని అన్నారు.ఉద్దవ్ ఠాక్రే షరతుభారతీయ కర్మాగర్ సేన నిర్వహించిన ఒక సమావేశంలో రాజ్ ఠాక్రే వ్యాఖ్యలకు ఉద్దవ్ ఠాక్రే బహిరంగగా మనసులో మాటను బయటపెట్టారు. ‘నేను మా మధ్య ఉన్న విబేధాలను పక్కన పెట్టడానికి సిద్ధం. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని మరాఠీ ప్రజలను కలిసిపోవడానికి దృష్టి సారించాను. కానీ ఓ షరతు. గతంలో అన్నీ పరిశ్రమలు మహరాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలిపోయే సమయంలో కలిసి ఫైట్ చేసి ఉంటే మహారాష్ట్ర కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వాళ్లం. అది సాధ్యం కాలేదు. రాష్ట్రం కోసం ఓ నిర్ణయం తీసుకుని దానిమీద ఐక్యంగా పోరాటం చేయాలి. ఆ తరహా ఐక్యత లేకుండా ఇప్పుడు కలిసి పని చేద్దాం అని అనడం సరైంది కాదు’ అని అంటూనే అవును, మహారాష్ట్ర కోసం ఐక్యమవుదాం అని హింట్ ఇచ్చారు. ఈ ఇద్దరు ఠాక్రేలు.. మహారాష్ట్ర ప్రభుత్వం మహాయుతి కూటమి ప్రభుత్వం ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు అన్నీ పాఠశాలల్లో హిందీని తప్పని సరి చేసేలా నిర్ణయం తీసుకున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్‌ఠాక్రే, ఉద్దవ్ ఠాక్రేల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలురాజ్ఠాక్రే, ఉద్దవ్ ఠాక్రేల నిర్ణయంపై రాజకీయ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. రాజ్‌ఠాక్రే, ఉద్దవ్ ఠాక్రేల నిర్ణయంపై మహాసీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు కలిస్తే బీజేపీకి సంతోషమే. వారు కలసినా మునిసిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో ఎన్డీఏని ఓడించలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేతో కలవాలా? వద్దా?అనేది ఆయన స్వేచ్ఛ. ఆయన తన పార్టీ భవిష్యత్తును నిర్ణయించుకోవచ్చు. అందుకు బీజేపీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదన్నారు. మహాయుతిని కాదని ఉద్దవ్ ఠాక్రేతో చేతులు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్‌ఠాక్రేతో కలిసి పనిచేసేందుకు బీజేపీ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా మహాయుతి కూటమిలో భాగమైన శివసేన అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేని రంగంలోకి దించింది. గత వారం రాజ్‌ఠాక్రేతో సంప్రదింపులు జరిపింది. ఆ పొత్తులపై ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ తాజా రాజకీయ పరిణామాలపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ నిరుపమ్ ఘాటుగా స్పందించారు. ‘రెండు సున్నాలు కలిస్తే సున్నానే అవుతుంది’. ఉద్దవ్ ముందుగా కాంగ్రెస్‌తో కలిసి ముస్లిం ఓట్లపై ఆధారపడ్డారు. అది ఫలించకపోతే ఇప్పుడు రాజ్ ఠాక్రే వైపు మొగ్గుతున్నారు. ఇది మహారాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం. వీరిద్దరూ కలిసి వచ్చినా మహాయుతిని ఏం చేయలేరని స్పష్టం చేశారు. -
సుప్రీంకోర్టుపై బీజేపీ నేతల వ్యాఖ్యలు.. జేపీ నడ్డా ఏమన్నారంటే?
ఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై బీజేపీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా దృష్టి సారించింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించి.. ఇలాంటి వ్యాఖ్యలను బీజేపీ తిరస్కరిస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో జేపీ నడ్డా ట్విట్టర్ వేదికగా..‘భారత న్యాయవ్యవస్థ, భారత ప్రధాన న్యాయమూర్తిపై ఎంపీలు నిషికాంత్ దూబే, దినేష్ శర్మ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది వారి వ్యక్తిగత వ్యాఖ్యలు. వారితో బీజేపీ ఏకీభవించదు. అలాంటి వ్యాఖ్యలకు ఎప్పుడూ మద్దతు ఇవ్వదు. బీజేపీ వాటిని పూర్తిగా తిరస్కరిస్తుంది. సుప్రీంకోర్టుతో సహా అన్ని కోర్టులు మన ప్రజాస్వామ్యంలో విడదీయరాని భాగమని బీజేపీ ఎల్లప్పుడూ న్యాయవ్యవస్థను గౌరవిస్తుంది. కోర్టుల సూచనలు, ఆదేశాలను సంతోషంగా అంగీకరించింది’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. వక్ఫ్ సవరణ చట్టం, బిల్లులపై రాష్ట్రపతికి గడువు విషయంలో ఇప్పటికే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఇంతలోనే మరో బీజేపీ నేత, లోక్‌సభ సభ్యుడు నిశికాంత్ దూబే సర్వోన్నత న్యాయస్థానంపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.भाजपा सांसद निशिकांत दुबे और दिनेश शर्मा का न्यायपालिका एवं देश के चीफ जस्टिस पर दिए गए बयान से भारतीय जनता पार्टी का कोई लेना–देना नहीं है। यह इनका व्यक्तिगत बयान है, लेकिन भाजपा ऐसे बयानों से न तो कोई इत्तेफाक रखती है और न ही कभी भी ऐसे बयानों का समर्थन करती है। भाजपा इन बयान…— Jagat Prakash Nadda (@JPNadda) April 19, 2025సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందే అంటూ నిశికాంత్ దూబే వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు శాసనాధికారాల్లోకి న్యాయస్థానాలు చొరబడుతున్నాయని, చట్టసభ్యులు చేసిన చట్టాలను కొట్టివేస్తున్నాయని విమర్శించారు. జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో అధికరణం 368 ప్రకారం చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదని, పార్లమెంటుకు మాత్రం కాదని తెలిపారు. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో చంద్రబాబు జీవించాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు.Happy Birthday to @Ncbn Garu! Wishing you a peaceful and healthy long life!— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2025 -
బీఆర్ఎస్.. రాం రాం! .. మరి కాంగ్రెస్ వైఖరేమిటో?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసకందాయంగా మారనుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నిక జరగనుంది. తగిన బలం లేకపోయినప్పటికీ, బీజేపీ తమ అభ్యరి్థని బరిలో దింపడంతో పోలింగ్ అనివార్యంగా మారింది. కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికకు తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తమ అభ్యర్థులను పోటీకి దింపలేదు. కాంగ్రెస్‌కు సంబంధించి ఎంఐఎంకు స్నేహహస్తం కోసమే పోటీకి దింపలేదని కూడా ప్రచారంలో ఉంది. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కలిసిమెలిసి గెలిచిన ఆ రెండు పారీ్టలూ ఈ ఎన్నికలోనూ అదే వైఖరి పాటించనున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే నియోజకవర్గాల ఎమ్మెల్సీల ఎన్నిక సందర్భంగా ఇచి్చన హామీ మేరకు సైతం కాంగ్రెస్ రంగంలో దిగలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.బీఆర్ఎస్ దూరం.. ఎంఐఎంతో విభేదాల్లేని బీఆర్ఎస్.. ఆ పార్టీకికి మద్దతు ఇస్తుందా, లేక పోలింగ్‌కు గైర్హాజరవుతుందా అని ఆలోచిస్తున్న రాజకీయ పరిశీలకుల ఆలోచనలకు తెర దించుతూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. విప్ జారీ చేస్తామని, ఎవరైనా ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కాంగ్రెస్ దారెటు ? ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పోలింగ్‌లో పాల్గొంటుందా, లేక అది సైతం పోలింగ్‌కు దూరంగా ఉంటుందా? అనే చర్చలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. ఎందుకంటే.. కాంగ్రెస్ పోలింగ్‌లో పాల్గొన్నా, పాల్గొనకపోయినా ఎంఐఎంకు వచ్చే నష్టమంటూ ఏమీ లేదు. కాంగ్రెస్ ఓటర్లు బీజేపీకి ఓట్లేసే అవకాశం లేదు. మిగిలింది ఎంఐఎం మాత్రమే అయినందున కాంగ్రెస్ పోలింగ్‌లో పాల్గొంటే ఆ పార్టీ మెజార్టీ పెరుగుతుందే తప్ప దానికి ఓటమి అంటూ లేదని చెబుతున్నారు. మొత్తం 112 మంది ఓటర్లలో బీజేపీకి 25 ఓటర్ల బలం ఉండగా, ఎంఐఎం బలం 49గా ఉంది. అంటే దాదాపు రెట్టింపు బలం. కాబట్టి ఎంఐఎం గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అనూహ్య పరిణామం ఏమైనా జరిగేనా? ఇదే తరుణంలో అనూహ్యంగా ఏమైనా జరగనుందా ? అన్న ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. అందుకు కారణం ఈసారి ఎలాగైనా ఈ ఎన్నికలో గెలవాలనే తలంపుతోనే బీజేపీ తమ అభ్యర్థిని బరిలో దింపిందని చెబుతున్నారు. అంతే కాదు.. పోలింగ్‌కు సంబంధించి సన్నాహక సమావేశం, మాక్‌పోలింగ్ వంటివి సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పారీ్టకి చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడూ ఒకటేనన్నారు. ఎంఐఎంను గెలిపించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీలో లేవని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటర్లు ఆత్మ ప్రబోధానుసారం ఓట్లేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మరో కేంద్రమంత్రి బండి సంజయ్ సైతం ఎంఐఎంను ఓడించేందుకు పార్టీలకతీతంగా ఓట్లేయాలని పిలుపునిచ్చారు. విప్ ఉండదా? ఈ నేపథ్యంలోనే తమ పార్టీ పోలింగ్‌ను బహిష్కరిస్తుందని కేటీఆర్ చెబుతున్నారు. ఈ ఎన్నిక నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ సమాచారం మేరకు అసలు విప్ అంటూ ఉండదు. అయినా విప్ జారీ చేస్తామనడం పారీ్టవారు కట్టుతప్పకుండా ఉండటానికేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు, బీజేపీ తగిన వ్యూహరచన చేసిందని వినిపిస్తోంది. గెలుస్తామనే ధీమాలోనే ఆ పార్టీ ఉందని, అందుకే ఈ ఎన్నిక కోసమే గ్రేటర్ పరిధిలోని ఎంపీలు కిషన్‌రెడ్డితో పాటు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం ఎక్స్‌అఫీíÙయో సభ్యులుగా ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ రోజుకో మలుపుతో ‘స్థానిక’ ఎన్నిక రసకందాయంగా మారింది. పోలింగ్ వరకు ఇంకా ఏం జరగనుందోనన్న వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. -
బీఆర్ఎస్ నేతల కోసమే ధరణి
నాగర్‌కర్నూల్/గద్వాల: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగు గోడల మధ్య కూర్చొని, నలుగురి స్వార్థం కోసం రూపొందించిన చట్టమే ధరణి అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో భూ భారతిపై అవగాహన సదస్సులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లు చేయలేదని వీఆర్వో వ్యవస్థనే రద్దు చేశారని ఆరోపించారు.ఎప్పుడైనా, ఏ నియోజకవర్గంలోనైనా ధరణిపై సమావేశం పెట్టారా? అన్ని ప్రశ్నించారు. ఒకవేళ సమావేశం పెట్టి ఉంటే నాయకుల వీపులు చింతపండయ్యేవని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, వారి బంధువుల కోసమే ధరణి తెచ్చారని ఆరోపించారు. ధరణిలో రాత్రికి రాత్రే భూ యజమానుల పేర్లు మారిపోయేవని తెలిపారు. అన్ని సమస్యలకు పరిష్కారంగానే భూ భారతి చట్టం తెచ్చామని చెప్పారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణమోహన్‌రెడ్డి ఏ పార్టీ..?గద్వాల జిల్లా ధరూరు మండలంలో మంత్రి పర్యటన ఉద్రిక్తతలు, అలకల మధ్య సాగింది. అవగాహన సదస్సు పూర్తిగా అధికారిక కార్యక్రమం కావడంతో అధికారులు ప్రొటోకాల్ పాటించారు. దీంతో మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సభా వేదికపైకి రాకుండా దూరంగా ఉండిపోయారు. దీంతో వారి అనుచరులు ఆందోళనకు దిగారు. కాసేపు అక్కడే వేచి చూసిన సంపత్‌కుమార్ వేదికపైకి పిలవకపోవడంతో సభాప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.సరిత అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నాయకురాలిని ఇలా అవమానించడం ఏంటని మండిపడ్డారు. లోక్‌సభ సభ్యుడు మల్లురవితో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆయన వారిని సముదాయించారు. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా సరిత, సంపత్‌కుమార్ వర్గీయులు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినట్లు చెబుతున్న ఎమ్మెల్యే.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో సభాముఖంగా ప్రకటించాలని నినాదాలు చేయడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు సభా ప్రాంగణానికి దూరంగా తీసుకెళ్లారు. హెలిప్యాడ్‌లో మంటలు: మంత్రి పొంగులేటి పర్యటనలో చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ వద్ద ఉన్న హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండింగ్ సిగ్నల్ కోసం స్మోక్ ఫైర్ చేసిన సమయంలో కింద ఉన్న ఎండు గడ్డికి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
కట్టు కథలు.. తప్పుడు ప్రచారాలు.. కూటమి సర్కార్‌పై మిథున్‌రెడ్డి ఫైర్
సాక్షి, విజయవాడ: కూటమి సర్కార్ వచ్చాక తమపై కక్ష సాధింపులకు దిగుతున్నారని.. కట్టు కథలు అల్లి తప్పుడు ప్రచారాలకు తెగబడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ తమ ప్రతిష్టను దిగజారుస్తున్నారని.. తమ సొంత భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ మిథున్‌రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్ కోర్టు పరిధిలో ఉందని.. అందుకే మద్యం కేసు గురించి తాను పూర్తిగా మాట్లాడలేనని తెలిపారు. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో భాగంగా పెట్టిన కేసు మాత్రమే. నాపై పెట్టడానికి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి’’ అని మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు.‘‘మద్యం కేసు తప్పుడు కేసు అని చెప్పగలను. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానంలో కేసు గురించి తేలిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అంశంపై వివరంగా మాట్లాడతాను’’ అని మిథున్‌రెడ్డి చెప్పారు. -
ఆ మర్మం ఏందో?.. స్మితా సబర్వాల్‌కు సీఎం సీపీఆర్వో కౌంటర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి ఘటనలో తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్‌పై సీఎం సీపీఆర్వో కౌంటర్ ట్వీట్ చేశారు. ‘‘ఆ ఐఏఎస్ అధికారి “దృష్టికోణం”లో మార్పు ఎందుకొచ్చినట్టు?. అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలూ మారొచ్చా?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు.‘‘అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన (సీఎంవోలో ఇరిగేషన్ బాధ్యతలు నిర్వహించిన) వీరే.. అప్పుడు కనిపించని తప్పు.. ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏందో?.. అసలు ఏడుపు వన్య ప్రాణుల కోసమా? అధికారం కోల్పోయిన వారి కోసమా?’ అంటూ సీపీఆర్వో ట్వీట్ చేశారు.ఆ IAS అధికారి “దృష్టికోణం”లో మార్పు ఎందుకొచ్చినట్టు. .??అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలూ మారొచ్చా. .??అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన (CMO లో Irrigation బాధ్యతలు నిర్వహించిన) వీరే. . ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏందో. .?? అసలు… pic.twitter.com/0KnHYAVeg5— Ayodhya Reddy Boreddy (@ayodhya_boreddy) April 19, 2025కాగా, స్మితా సబర్మాల్ శనివారం గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించిన ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టుకుగానూ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇవాళ గచ్చిబౌలి పీఎస్‌లో ఆమె విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. ఆపై తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు.‘‘చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చా. పోలీసులకు పూర్తిగా సహకరించా. నేను ఎలాంటి పోస్ట్ చేయలేదు. హాయ్ హైదరాబాద్ పోస్టును రీట్వీట్ చేశా. 2 వేల మంది అదే పోస్ట్‌ను షేర్ చేశారు. వాళ్లందరితోనూ ఇలాగే వ్యవహరిస్తారా?. ఇలాగే నోటీసులు ఇచ్చి వారందరిపై ఇలాగే చర్యలు తీసుకుంటారా?. అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్ చేసినట్లు అవుతుంది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుంది. ఇది ఎంత వరకు కరెక్ట్?. జస్టిస్ అనేది అందరికీ సమానంగా ఉండాలి. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా?’’ అని ట్వీట్ చేశారు. -
బాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అరాచకాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ‘‘చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని.. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను మా పార్టీవాళ్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచింది. మరి మీకు మేయర్ పదవి ఏరకంగా వస్తుంది?..బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్‌పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్ పదవీకాలం పూర్తవుతుందని తెలిసీ, మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా, ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబూ.. మీకులేదు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారు.ఇన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు గురిచేసినా తలొగ్గక పార్టీవైపు, ప్రజలవైపు నీతి, నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైయస్సార్సీపీ కార్పొరేటర్లను, అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తున్నాను.రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం, కండబలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబుగారి కుటిల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొని నిలబడుతున్న మా పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మరోసారి హ్యాట్సాప్ చెప్తున్నా’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. .@ncbn గారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.ప్రజలు ఇచ్చిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2025 -
‘సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన నాయకుడు జగన్’
తాడేపల్లి : సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన నాయకుడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సెల్ సమావేశంలో సజ్జల పాల్గొన్నారు.ఈ సమావేశానికి మాజీ మంత్రులు జోగి రమేష్, ధర్మాన కృష్ణదాస్, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్, అన్ని జిల్లాల బీసీ నేతలు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని జగన్ నిరూపించారు. చంద్రబాబుది అవకాశవాద రాజకీయం. అధికారంలోకి రాగానే దోచుకోవడం, దాచుకోవడమే. ఈసారి మరింత బరి తెగించి వ్యవహరిస్తున్నారు. ఈ పది నెల చంద్రబాబు పాలన చూస్తేనే జనానికి అర్ధమవుతుంది. ఈ దుర్మార్గపు పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయాలి. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. గతంలో కంటే మెరుగ్గా పూర్తిస్థాయి కమిటీలు నియమించుకుందాం’ అని సజ్జల పేర్కొన్నారు.రాష్ట్రంలో నియంతృత్వ పాలనను చూస్తున్నాంఅధికార యంత్రాంగమే మాఫియా ముఠాలా వ్యవహరిస్తోంది.అందరూ కలిసి ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేస్తున్నారు, విశాఖలో నానారకాలుగా అక్రమాలు చేసి బీసీ మహిళను పదవి నుంచి తప్పించారు. కూటమి నేతల ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను గట్టిగా తిప్పికొడదాం’ అని సజ్జల సూచించారు. -
రెండు దశాబ్దాల తర్వాత ‘బంధం’ కలుస్తోంది..!
ఎన్నో ఏళ్లుగా ‘రాజకీయ కత్తులు’ దూసుకుంటూనే ఉన్నారు.. ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూనే ఉన్నారు. వీరి వైరం సుమారు రెండు దశాబ్దాల నాటిది. ఒకప్పుడు కలుసున్న బంధం.. చాలా ఏళ్ల పాటు దూరంగానే ఉంటూ వచ్చింది. అది రాజకీయ వైరం కావడంతో ప్రజల్నే నమ్ముకుని పోరాటం సాగించారు. వారిలో ఒకరు ఉద్ధవ్ ఠాక్రే అయితే.. ఇంకొకరు రాజ్ ఠాక్రే. వరుసకు సోదర బంధం వారిది. కానీ శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే జీవించి ఉన్న కాలంలోనే రాజ్ ఠాక్రే బయటకు వచ్చేశారు. శివసేనలో విభేదాల కారణంగా రాజ్ ఠాక్రే అక్కడ ఇమడలేక బయటకు వచ్చేశారు. ఎమ్మెన్నెస్ అంటూ పార్టీ స్థాపించి తన ఉనికిని మహారాష్ట్రలో చాటుకునే యత్నం చేశారు. కానీ ఆయన ఆశించిన ఫలితాలు ఏమీ చూడలేకపోయారు. చివరకు ఉద్ధవ్ ఠాక్రేతో కలిసేందుకు సిద్ధమయ్యారు రాజ్ ఠాక్రే.శివసేనతో కలుస్తా..ప్రస్తుతం మహారాష్ట్రలో సైతం హిందీ భాషా యుద్ధం నడుస్తోంది. తమకు థర్ద్ లాంగ్వేజ్ గా హిందీని తప్పనిసరి చేయాలని కేంద్రం చూస్తోంది. కేంద్ర ప్రభుత్వపు త్రి భాషా విధానంలో భాగంగా హిందీ థర్డ్ లాంగ్వేజ్ అంశాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)తో పాటు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. అందుకే తాము ఒక్కటిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు రాజ్ ఠాక్రే తెలిపారు.ఫిల్మ్ మేకర్ మహేష్ మంజ్రేకర్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న విభేదాల్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం ఒక్కటవ్వాలని ఉందని పేర్కొన్నారు. శివసేనతో కలిసి పోరాటం చేయటానికి నిశ్చయించుకున్నానని, అది కూడా వారికి ఇష్టమైతేనే అంటూ రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఇక్కడ మరాఠీల కమ్యూనిటీని రక్షించడంతో పాటు మరాఠీ భాషను కాపాడుకోవడం ముఖ్యమన్నారాయన.మరి ఉద్ధవ్ ఏమన్నారంటే..తనతో రాజ్ ఠాక్రే కలుస్తానంటే ఏమీ ఇబ్బంది లేదన్నారు. తమ మధ్య భేదాభిప్రాయల కారణంగా ఎవరికి వారు అన్నట్లు ఉంటున్నామని, రాజ్ వస్తానంటే తనకు అభ్యంతరం ఏమీ లేదన్నారు. కాకపోతే మరాఠీ కమ్యూనిటీని వ్యతిరేకించే శక్తులను వెంటబెట్టుకు రావద్దని తన కండిషన్ అంటూ ఉద్ధవ్ పేర్కొన్నారు. ‘ మన శత్రువర్గాన్ని ఇంటికి ఆహ్వానించి.. వారికి భోజన తాంబూలం ఇచ్చే సాంప్రదాయాన్ని రాజ్ ఠాక్రే వదిలేతేనే తనతో కలవచ్చన్నారు. ఇక్కడ ఇద్దరికీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో ఎమ్మెన్నెస్.. ఎన్డీఏకు దగ్గరై వారికి మద్దతిచ్చింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిపై అసహనంతో ఉన్న రాజ్ ఠాక్రే.. శివసేన(యూబీటీ) తో కలవడానికి సిద్ధం కావడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.20 ఏళ్ల కిందటే.. బయటకుదాదాపు 19 ఏళ్ల కిందట బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి బయటకువచ్చిన రాజ్ ఠాక్రే 2006 మార్చి తొమ్మిదో తేదీన ఎమ్మెన్నెస్ పార్టీని స్ధాపించారు. ఆ తరువాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి తమ పార్టీ తరఫున అభ్యర్ధులను బరిలోకి దింపారు. వీరిలో ఏకంగా 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెన్నెస్‌కు 5.71 శాతం ఓట్లు పోలయ్యాయి. కానీ తరచూ పరాయిప్రాంతం వారిని ముఖ్యంగా ఉత్తరభారతీయులను లక్ష్యంగా చేసుకుని పదేపదే విమర్శించడంతో పార్టీ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది.2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్కరే గెలవగా మొత్తంమీద 3.15 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తరువాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్ధితి పునరావృతమైంది. కేవలం 2.25 శాతం ఓట్లు పోలైనప్పటికీ కల్యాణ్ నియోజక వర్గం నుంచి రాజు పాటిల్ ఒక్కరే గెలిచారు. అక్కడ నుంచి ఎమ్మెన్నెస్ గ్రాఫ్ క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం తన పార్టీ ఉనికే ప్రమాదంలో పడిన సమయంలో ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే.. ఉద్ధవ్ ను కలవడానికి సిద్ధమైనట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. -
విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్ చేసిన రాజ్ కసిరెడ్డి
సాక్షి, అమరావతి: విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.‘‘సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా. న్యాయపరమైన రక్షణ తర్వాత విచారణకు హాజరవుతా. సాక్షిగా పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని లాయర్లు చెప్పారు. అందుకోసమే న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’’ అని రాజ్ కసిరెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే -
‘మోదీకి దాసోహమైంది మీరు కాదా?’
హైదరాబాద్: దొంగల ముఠాలా రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్నది మీరంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నదని ఆరోపించారు. ‘రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్న మీరు.. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన మీరు.. మీ అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోదీకి దాసోహమయ్యారు.మీ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బీజేపీ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసింది. సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన మీరు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది. పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశ పెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరు కాదా కేటీఆర్, పదేళ్లలో మోదీ తీసుకున్న అనాలోచన నిర్ణయాలన్నింటికీ మద్దతిచ్చిన మీరు ఇప్పుడు కాంగ్రెస్‌ను ప్రశ్నించడం హాస్యాస్పదం. కవితని లిక్కర్ స్కాం నుంచి కాపాడడానికి బీజేపీ కి ఊడిగం చేసిది నిజం కాదా?, బీజేపీకి కట్టు బానిసలా కేటీఆర్ పని చేస్తున్నారు.సంఖ్యా బలం లేని బీజేపీ మీ పార్టీ అండ చూసుకొని పోటీ చేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలో బీజేపీని గెలిపించేందుకే కేటీఆర్ తాపత్రయపడుతున్నారు’ అని విమర్శించారు మహేష్ గౌడ్. -
బీఆర్ఎస్ బండారం బట్టబయలు: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ బండారం బయటపడిందని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎంను గెలిపించేందుకే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్ఎస్ పార్టీ దూరం ఉందని ఆరోపించారు. భాగ్యనగర్‌ను మజ్లిస్‌కు అప్పగించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు.ఈ మూడు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని రాజాసింగ్ ఆరోపణలు గుప్పించారు. భాగ్యనగర్‌లో బీఆర్ఎస్ను పాతరేస్తాం. మజ్లిస్‌ను గెలిపిస్తే మీ రాజకీయ భవిష్యత్తు ఖతమైనట్లేనంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఉద్దేశించి అన్నారు. ఓటింగ్‌లో పాల్గొనకపోవడమంటే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించినట్లే.. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేయండి అంటూ రాజాసింగ్ చెప్పుకొచ్చారు.కాగా, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికను బాయ్‌కట్ చేస్తున్నామని.. ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. విప్ ధిక్కరిస్తే పార్టీ నుంచి బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. -
బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా?.. కేటీఆర్ ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే విజయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. 17 నెలల కాలంలో బీఆర్ఎస్ గ్రాఫ్ బాగా పెరిగిందన్నారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికను బాయ్‌కట్ చేస్తున్నామని.. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లను కేటీఆర్ ఆదేశించారు. విప్ ధిక్కరిస్తే పార్టీ నుంచి బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.హెచ్‌సీయూ భూ కుంభకోణం వెనుక బీజేపీ ఎంపీ ఉన్నాడంటూ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎంపీలు తెలంగాణకు ఒక్క రూపాయైనా తెచ్చారా? అంటూ ప్రశ్నించారు. హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే.. రేవంత్ ఒక్కమాట కూడా మాట్లాడటం లేదంటూ మండిపడ్డారు. కేసీఆర్ దీక్ష, పోరాటంతోనే తెలంగాణ వచ్చిందన్న.. కేటీఆర్.. బీఆర్ఎస్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందన్నారు.చేసినవి చెప్పుకోనందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్‌సీయూ, హైడ్రా, మూసీ పేరుతో అరాచకాలు సృష్టిస్తోందని విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎంపీలు కాంగ్రెస్‌ను ఒక్క మాట కూడా అనరని.. హెచ్‌సీయూ భూములపై ప్రధాని మోదీ ఎందుకు విచారణ జరిపించడం లేదంటూ కేటీఆర్ ప్రశ్నించారు. -
అధికారంలో ఉన్నప్పుడు విజయసాయే చక్రం తిప్పింది
విజయవాడ, సాక్షి: లిక్కర్ కేసు విచారణ సందర్భంగా రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వైఎస్సార్సీపీ కోటరీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ పడింది. అసలు అలాంటి కోటరీ ఒకటి ఉందో లేదో ఆయనకే తెలియాలి అంటూ వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజయసాయికి చురకలు అంటించారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదోరకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారు. ఆయన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయనే కదా ప్రధానంగా చక్రం తిప్పింది. అలాంటప్పుడు పార్టీలో కోటరీ ఉందో? లేదో?.. కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా?. ఇప్పుడేమో నెంబర్ 2 నుంచి 2 వేల స్థానానికి పడిపోయానని ఆయనే చెప్పుకుంటున్నాడు. .. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు. మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదు.. రాబోయే రోజుల్లో కూడా ఉండదు. మా పార్టీలో నెంబర్ వన్ నుంచి 100 వరకూ అన్నీ జగన్ మోహన్ రెడ్డే’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘మా హయాంలో ఎలాంటి స్కాములు జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కామ్ అంటూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. భయపెట్టి కొంతమందిని లొంగదీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అన్నింటి పైనా న్యాయపోరాటం చేస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
చంద్రబాబు చెవిలోనైనా ఆ విషయం చెబుతారా?
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వద్ద కంచ గచ్చిబౌలి వద్ద ఉన్న 400 ఎకరాల భూమికి సంబంధించి ఒకవైపు సుప్రింకోర్టు విచారణ జరుపుతుండగా, ప్రధానమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడవులపై బుల్డోజర్లు ప్రయోగిస్తోందని మోదీ ఆరోపించారు. అక్కడ జంతువులను ప్రమాదంలో పడేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ సంపదను నాశనం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అయితే.. .. ఏపీలో కూటమి ప్రభుత్వం(AP Kutami Prabhutvam) ఇప్పటికే 33 వేల ఎకరాల పచ్చటి పంటల భూములను పర్యావరణంతో సంబంధం లేకుండా నాశనం చేస్తే మద్దతు ఇచ్చిన బీజేపీ పెద్దలకు.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి నైతికంగా అర్హత ఎంత మేర ఉంటటుందన్నది ఆలోచించుకోవాలి. అది చాలదన్నట్లుగా మరో 45 వేల ఎకరాలు సమీకరిస్తామని బాబు సర్కార్ చెబుతుంటే కనీసం స్పందించని బీజేపీ.. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 👉అయినా తెలంగాణలో బీజేపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక విమర్శలు, ఆరోపణలు చేస్తే చేయవచ్చు. కాని దేశ ప్రధాని అంతటివారు ఈ వివాదంలో వేలు పెట్టడం పద్దతేనా?. అది సుప్రీం కోర్టు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందా? ఉండదా? అనే చర్చకు ఆస్కారం ఇస్తోంది. హామీలు అమలు చేయకుండా రేవంత్ సర్కార్ బుల్డోజర్లను వాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాలలో అభివృద్ది పరుగులు తీస్తోందని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్రాలను పొగుడుకుంటే పొగుడుకోవచ్చు. కాని ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలపై మోదీ అధిక విమర్శలు చేయడం ద్వారా ఆయనలోని రాజకీయ నేత కోణం అంతగా మంచి పేరు తేకపోవచ్చు. ఉత్తరప్రదేశ్ తదితర కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో నేరస్తుల పేరుతో ఇళ్లను ఇష్టారాజ్యంగా కూల్చివేస్తున్న తీరుపై చాలా అసంతృప్తి ఉంది. సుప్రీంర్టు సైతం దీనిపై పలుమార్లు వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ఆ విషయాలను మోదీ గమనంలోకి తీసుకుంటారో లేదో తెలియదు. రేవంత్ ప్రభుత్వం కంచ గచ్చి బౌలి భూముల విషయంలో అనుసరిస్తున్న వైఖరి సరైనదా? కాదా? అనేది ఇక్కడ చర్చ కాదు. దానిని సమర్ధించవచ్చు. వ్యతిరేకించవచ్చు. స్థానిక ప్రజలు తమ అభీష్టాన్ని ప్రభుత్వానికి చెప్పవచ్చు. అది వేరే సంగతి. కాని గతంలో దేశ ప్రధానులలో ఎవరూ ఇలా రాష్ట్రాలపై తరచు విమర్శలు చేసినట్లు అనిపించదు. ఎన్నికల సమయంలో పార్టీ పరంగా, విధానపరంగా విమర్శలు,ప్రతి విమర్శలు చేయడానికి వారు ప్రాధాన్యత ఇచ్చి ఉండవచ్చు. అంతే తప్ప, ఏ రాష్ట్రానికి వెళ్లినా అదే పనిలో ఉండడం గతంలో ఈ స్థాయిలో ఉండేది కాదని చెప్పవచ్చు. లేదా మహా అయితే పరోక్షంగా ఏమైనా ఒకటి,రెండు విమర్శలు చేసి ఉండొచ్చు. 👉మన్మోహన్ సింగ్(Manmohan Singh) ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలపై పనికట్టుకుని ఆరోపణలు చేసేవారుకాదు. కాకపోతే సింగ్ బ్యూరోక్రాట్ నుంచి రాజకీయనేతగా మారారు. మోదీ మొదట ఆర్ఎస్ఎస్ లో ఉండి ,తదుపరి రాజకీయ నేతగా ఎదిగారు. ఆ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలోని కంచ గచ్చిబౌలి వద్ద 400 ఎకరాల భూమిపై వివాదం ఏర్పడిన మాట నిజం. ఆ భూములలోఎలాంటి పనులు చేపట్టవద్దని పలువురు కోరిన సంగతి కూడా నిజమే. దానిపై కేంద్రప్రభుత్వపరంగా ఏవైనా ఆలోచనలు ఉంటే వాటిని సజెస్ట్ చేస్తూ రాష్ట్రానికి లేఖ రాసి ఉండవచ్చు. కాని అవేవీ చేయలేదు. 👉తెలంగాణ బీజేపీ నేతలు(Telangana BJP) ఏ విమర్శలు చేశారో వాటినే ప్రధాని మోదీ కూడా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం అవి అసలు అటవీశాఖ భూములే కాదు. ప్రభుత్వ భూములని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాతే అక్కడ కొన్ని కార్యకలాపాలు చేపట్టడం జరిగింది. ఆ భూముల ఆధారంగా పదివేల కోట్ల రుణ సమీకరణ కూడా చేశారు. ఈలోగా దీనిపై యూనివర్శిటీలో విద్యార్దులు వ్యతిరేకించి ,ఆ భూమి కూడా సెంట్రల్ యూనివర్శిటీకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దానికి బీజేపీ, బీఆర్ఎస్లు మద్దతు ఇవ్వడం, సడన్‌గా సుప్రీం కోర్టు కూడా సుమోటోగా జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడం జరిగింది. దీనికి రేవంత్ సర్కార్ బదులు ఇస్తూ కంచగచ్చిబౌలి(kanche Gachibowli) భూములు అటవీ భూములు కాదని, ప్రభుత్వం అధీనంలో ఉన్న భూములని స్పష్టం చేసింది. అక్కడ జంతువులకు ఆవాసం లేదని,వాటికి తగు రక్షణ కల్పించడానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. 👉ఇక్కడ కొట్టేసిన చెట్లు నిషేదిత జాబితాలో లేవని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే సుప్రీం కోర్టు దీనిపై కూడా అంత సంతృప్తి చెందలేదు. చెట్లు కొట్టివేయడానికి అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించింది. ఆ కేసు ఇంకా పూర్తి కాలేదు..కాని ఈలోగా ప్రధాని మోదీ అవి అడవులని, అక్కడ జంతువులు ఉన్నాయని, అడవిని, జంతువులను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తోందని రాజకీయంగా మాట్లాడడం పద్దతేనా అనే అభిప్రాయం కలుగుతుంది. తెలంగాణలో అధికారం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుండవచ్చు. దానికి తగిన విధంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుంటారు. తెలంగాణకు వచ్చినప్పుడు కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు చేస్తే అదో తరహా. కాని ఎక్కడో హర్యానాలో ఒక సభలో మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు. నిజంగానే పర్యావరణంపైన ప్రధానమంత్రికి అంత శ్రద్దాసక్తులు ఉన్నట్లయితే ఏపీలో రాజధాని పేరుతో 33వేల ఎకరాలు సమీకరించినప్పుడు బిజెపి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?. మోదీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి వెళ్లారే. అవసరమైనమేర ప్రభుత్వ భూమిని వాడుకుంటే మంచిదని అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మోడీ ఎందుకు సలహా ఇవ్వలేదు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ విడిపోయాక.. పోలవరం, అమరావతి టీడీపీ నేతలకు ఏటీఎంగా మారాయని ఆయనే ఆరోపించారు కదా?. ఆ తర్వాత 2024లో మళ్లీ పొత్తు పెట్టుకున్నాక అవన్ని తూచ్ అయిపోయినట్లనుకోవాలా?. ఇంతకుముందు తీసుకున్న 33 వేల ఎకరాలు కాకుండా,మరో 45వేల ఎకరాల భూమి సమీకరించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడం సరైనదా? కాదా? అనేదానిపై మోదీ మాట్లాడడానికి సిద్దంగా ఉంటారా?. మరోసారి రాజధాని పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మే 2 న వస్తారట.అప్పుడైనా పర్యావరణానికి విఘాతం కలిగేలా ఇన్నివేల ఎకరాల భూములు ఎందుకు?అక్కడ పంటలను ఎందుకు నాశనం చేస్తున్నారు? పక్కనే ఉన్న కృష్ణానది మరింత కలుషితంగా మారడానికి ఈ చర్య అవకాశం ఇస్తుంది కదా? అని ప్రధాని ప్రశ్నించితే.. తెలంగాణ భూములపై చేసిన వ్యాఖ్యలను సమర్దించవచ్చు. అలా కాకపోతే అవకాశవాద రాజకీయాలకే ప్రధాని ప్రాధాన్యం ఇస్తున్నారన్న సంగతి ప్రజలకు తెలిసిపోదా?. తెలంగాణలో ఒక రకంగా, ఏపీలో మరో రకంగా మాట్లాడితే మోదీకి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.., ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు మద్య తేడా ఏముంటున్నదన్న ప్రశ్న వస్తుంది. ఏది ఏమైనా ప్రతి అంశంలోను పార్టీపరంగా కాకుండా దేశ ,రాష్ట్ర ప్రయోజనాలను గమనంలోకి తీసుకుని ప్రధాని మోదీ వ్యవహరిస్తే బాగుంటుంది కదా!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘చంద్రబాబు మహిళా ద్రోహిగా మిగిలిపోతారు’
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలతో కూటమి సర్కార్ మేయర్ పీఠం కైవసం చేసుకుందని ఆరోపించారు. కూటమి పాలనలో ధర్మం వధ, సత్యం చెరలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.విశాఖ మేయర్ పీఠం కూటమి గెలుపుపై వైఎస్సార్సీపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..‘యాదవ మహిళకు వైఎస్ జగన్ మేయర్ పదవి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. కుట్రలు, కుతంత్రాలతో కూటమి సర్కార్ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. పార్టీ మారని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరించాలని చూస్తున్నారు. చావుబతుకుల మధ్య కూటమి సర్కార్ మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకుంది. వైఎస్సార్సీపీ పాలనలో గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో మేం ప్రలోభపెట్టలేదు. కూటమి పాలనలో ధర్మం వధ, సత్యం చెరలో పడిపోయింది. కూటమి నేతలు గెలిచే బలం లేకున్నా అవిశ్వాస తీర్మాన లేఖ ఇచ్చారు. ధర్మం గెలిచిదంటున్న కూటమి నేతలకు మాట్లాడే అర్హత లేదు. కూటమి చావు బతుకుల మీద మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచారు. కుట్రలు తంత్రాలకు తెర తీశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. విలువలు విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు. కూటమిని తట్టుకొని నిలబడ్డ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్..బలం లేకుండా అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు..ధర్మం న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నాయకులకు లేదు.మేయర్ మీద అవిశ్వాసం గెలిచారు. విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారు.విప్ ఉల్లంఘించిన వారి పదవులు పోవడం కాదు..యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు మేయర్ పదవి ఇచ్చారు..ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని ప్రలోభ పెట్టారు.99 పైసలకే విశాఖ భూములను ఇష్టానుసారంగా కట్టబెడుతున్నారు.ఇదే తరహాలో భూములు కట్టబెడతామని లోకేష్ చెప్తున్నారు..టీసీఎస్ విశాఖ రాక ముందే భూములు అప్పనంగా కట్టబెడుతున్నారు.విశాఖ మేయర్ పీఠం చేతిలో ఉంచుకొని విశాఖను దోచుకోవాలని చూస్తున్నారు.ధర్మశ్రీ పాయింట్స్ కామెంట్స్..మేయర్ ఎన్నికలో వైఎస్సార్సీపీ నైతికంగా గెలిచింది..కూటమి నిజంగా గెలిచే పరిస్థితి ఉంటే నెల రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు..జీవీఎంసీ డబ్బులతో ప్రత్యేక విమానాలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కోసం తీసుకువెళ్లారు..యాదవ్ కుల ద్రోహులు కూటమిలో ఉన్నారు..ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..పది నెలల పదవి కోసం ఒక మహిళను పదవి నుంచి దించుతారా?.చంద్రబాబు మహిళా ద్రోహిగా మిగిలిపోతారు..ప్రజలు 164 సీట్లు ఇచ్చిన చంద్రబాబుకు అధికార దాహం తీరలేదు..వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను భయబ్రాంతులకు గురి చేశారు.చంద్రబాబు ప్రలోభాలకు పెట్టింది పేరున్యాయం ధర్మం గెలిచిందని కూటమి నేతలు మాట్లాడడం సిగ్గుచేటు.కుట్రలు తంత్రాలకు మేయర్ ఎన్నికలో గెలిచాయి. -
సైన్యాన్ని దింపండి.. రాష్ట్రపతి పాలన పెట్టండి
కోల్‌కతా: సీనియర్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి(Mithun Chakraborty) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్లో శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బ తిన్నాయని, ప్రభుత్వం విఫలమైంది కాబట్టి రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.బెంగాల్లో రాష్ట్రపతి పాలన(President Rule) విధించాలని కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశా. ఇప్పటికీ కేంద్ర హోం శాఖను అదే కోరుతున్నా. కనీసం ఇప్పుడైనా స్పందించి సైన్యాన్ని దించండి. అప్పుడు ఇక్కడ ఎన్నికలు సజావుగా జరుగుతాయి’’ అని అన్నారాయన. తాజాగా వక్ఫ్ చట్టాన్ని(Waqf Bill) వ్యతిరేకిస్తూ ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లపై స్పందించిన ఆయన.. ఇలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. Watch: BJP leader and actor Mithun Chakraborty on the imposition of President's Rule in Bengal says, "I’ve requested many times, and I’m still requesting the Home Minister. At the very least, please deploy the military inside for two months during the elections. If they are… pic.twitter.com/x64pF7j9Mi— IANS (@ians_india) April 19, 2025ఇదిలా ఉంటే.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 8-12 తేదీల మధ్య షంషేర్‌గంజ్, సూటి, ధులియాన్, జంగిపూర్ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముగ్గురు మరణించగా.. వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉద్రిక్తతల వేళ భారీగా కేంద్ర బలగాలను మోహరించాల్సి వచ్చింది. మరోవైపు.. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించొద్దన్న సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తిని ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ పట్టించుకోలేదు. మాల్దా క్యాంప్‌లలో ఉన్న బాధిత కుటుంబాలను కలిసి ఆయన మాట్లాడారు. మరోవైపు.. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహాట్కర్ నేతృత్వంలోని బృందం సైతం రిలీఫ్ క్యాంప్‌లలో పర్యటించింది. -
కృష్ణవేణిని అరెస్ట్ చేసి.. దాచేపల్లి సీఐ వేధింపులు: అంబటి
సాక్షి, గుంటూరు: ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్ట్ చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏంటి? అని ప్రశ్నించారు.సోషల్ మీడియా కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న పాలేటి కృష్ణవేణిని ములాకత్ ద్వారా పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతి రెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు. అనంతరం, మాజీ అంబటి మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి పోలీసులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్.. సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదులో కృష్ణవేణిని అరెస్టు చేసి మరుసటి రోజు ఉదయం వరకు స్టేషన్లోనే ఉంచి కనీసం ఆహారం కూడా ఇవ్వలేదు.కృష్ణవేణి పట్ల సీఐ భాస్కర్ అసభ్యంగా మాట్లాడాడు. తాము చెప్పినట్టు వినకపోతే కృష్ణవేణి భర్తపై గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించాడని ఆమె చెబుతోంది. కృష్ణవేణిపై వ్యభిచారం కేసు పెడతానని సీఐ బెదిరించాడట. కృష్ణవేణి బంధువులు పోలీస్ స్టేషన్‌కు రాకుండా సీఐ స్టేషన్ గేట్లకు బేడీలు వేశాడు. తనను సీఐ భాస్కర్ వేధించారని కృష్ణవేణి మేజిస్ట్రేట్‌కి వాంగ్మూలం ఇచ్చింది. ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలి.సీమ రాజా, కిరాక్ ఆర్పీ.. మంత్రి నారా లోకేష్ పెంచుతున్న రోబోలు. మాపైన అసభ్యంగా పోస్టులు పెట్టినందుకు సీమ రాజా, కిరాక్ ఆర్పీపై మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసులు కట్టరు. వాళ్లని లోకేష్ పోషిస్తున్నాడు కనుక వాళ్లపై కేసులు కట్టడం లేదు. గతంలో పెద్దిరెడ్డి సుధారాణిని 50 రోజులకు పైగా జైలుకు పంపారు. పార్టీ నాయకుల పేర్లు చెప్పమని సీఐ తనను హింసించాడని కృష్ణవేణి చెప్తోంది. మహిళల జోలికి వస్తే ఒప్పుకోనని చెప్పే చంద్రబాబు ఇప్పుడేం చేస్తాడో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
‘ప్రపంచంలో ఎక్కడా లేని ధరలతో బాబు అమరావతి నిర్మాణాలు !’
సాక్షి, అనంతపురం: అమరావతి నిర్మాణంలో పెద్ద కుంభకోణం ఉందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి. ప్రపంచంలో ఎక్కడా లేని ధరలతో చంద్రబాబు అమరావతి నిర్మాణాలు చేపట్టారని అన్నారు. అమరావతి నిర్మాణం కోసం అప్పులు చేస్తున్నారు.. కానీ, సూపర్ సిక్స్ హామీలను చూస్తే భయం వేస్తోందని చంద్రబాబు అంటున్నారు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా ధనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అస్మదీయులకు దోచి పెడుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను చూస్తే భయమేస్తోందని చంద్రబాబు చెబుతున్నారు. మరోవైపు వేల కోట్లతో అమరావతిలో కట్టడాలు జరుగుతున్నాయి. రాజధాని అమరావతిలో లక్ష ఎకరాల్లో లక్ష కోట్లతో నిర్మాణం అవివేకం. గన్నవరం ఉండగా అమరావతిలో మరో విమానాశ్రయం ఎందుకు?. 10 మాసాల్లో 1.53 లక్షల కోట్లు అప్పు చేశారు.. ఆ డబ్బు ఏమైంది?. చంద్రబాబుకు అమరావతి తప్ప.. మిగిలిన జిల్లాల అభివృద్ధి అక్కర్లేదా? అని ప్రశ్నించారు.అలాగే, రాష్ట్ర విభజన పాఠాలు చంద్రబాబు నేర్చుకోలేదు. అభివృద్ధి-అధికార వికేంద్రీకరణ అవసరం లేదా?. శ్రీకృష్ణ, శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?. ప్రపంచంలో ఎక్కడా లేని ధరలతో చంద్రబాబు అమరావతి నిర్మాణాలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణం కోసం అప్పులు చేస్తున్నారు.. కేంద్రం నుంచి గ్రాంట్ ఎందుకు సాధించడం లేదు?. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయడం లేదు. టీసీఎస్ పేరుతో 29 ఎకరాల భూమిని 29 రూపాయలకే ఇవ్వడం ఏంటి? ఇది అనుమానాస్పదంగా ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
బైరెడ్డి శబరి.. చెల్లని ఎంపీ!
జిల్లాలో కూటమి ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత కొరవడింది. ఎంపీతో ఎమ్మెల్యేలకు ఏమాత్రం పొసగడం లేదు. తమ నియోజకవర్గాల్లో తమకు సమాచారం ఇవ్వకుండా పర్యటిస్తే సహించేది లేదని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. ఎంపీ, ఆమె తండ్రి పెత్తనాన్ని సహించే ప్రసక్తే లేదని చెబుతున్నారు. దీంతో ఎంపీ ఏకాకిలా మిగిలిపోయారనే విమర్శలు జోరందుకున్నాయి. సాక్షి, నంద్యాల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తమ పరిధిలో పోస్టింగులు, కాంట్రాక్టులు, కమీషన్ల విషయంలో జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. గౌరు చరిత వర్సెస్ శబరి పాణ్యం మండల పరిధిలోని మద్దూరు పీహెచ్సీలో నైట్ వాచ్‌మన్, స్వీపర్ పోస్టుల విషయమై ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య నిప్పు రాజుకున్నట్లు సమాచారం. ఎంపీ వర్గమైన నతానియేల్(వాచ్‌మన్), ఓ సుబ్బమ్మ(స్వీపర్)లను ఎమ్మెల్యే వర్గం వారు పట్టుబట్టి గతేడాది నవంబర్‌లో సస్పెండ్ చేయించారు. ఏ తప్పు చేయకున్నా తమ వారిని ఎందుకు సస్పెండ్ చేశారని, వారినే ఆయా పోస్టుల్లో కొనసాగించాలని ఎంపీ శబరి జిల్లా వైద్యాధికారులను ఆదేశించినా ఫలితం లేకుండా పోయింది. ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో మూడు నెలల పాటు వాచ్మెన్, స్వీపర్లు లేకుండా సీహెచ్‌సీ నడిసింది. ఈ విషయం ఎమ్మెల్యే గౌరు చరిత దృష్టికి వెళ్లడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి ఆమె వర్గానికి చెందిన చాకలి వెంకట సుబ్బయ్య, కె. వెంకటమ్మలను తాత్కాలికంగా నియమించారు. ఆ లేఖలు పక్కన పడేయండి! ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారికి బనగానపల్లెలోని సిమెంట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఎంపీ శబరి సిఫార్సు చేశారు. అయితే ఆయా కంపెనీలు ఎంపీ సిఫార్సులను చెత్త బుట్టలో వేసినట్లు సమాచారం. ఆమె రెఫర్ చేసిన ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వడం లేదని తెలుస్తోంది. అలాగే పరిశ్రమల్లో కాంట్రాక్టు పనులను తమ వారికి ఇవ్వాలని రెఫర్ చేస్తే వాటిని యాజమాన్యం బుట్టదాఖలు చేసినట్లు తెలుస్తోంది. అయితే వీటి వెనక మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి హస్తం ఉన్నట్లు ఎంపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. నందికొట్కూరులో మరీ దారుణం ఎంపీ సొంత నియోజకవర్గమైన నందికొట్కూరులో నూ ఆమె మాట చెల్లుబాటుకావడం లేదు. పోలీసుల పోస్టింగ్‌లు, స్టేషన్లలో పంచాయితీలు, రెవెన్యూ కార్యాలయాల్లో రెకమెండేషన్లు... ఇలా ఎక్కడికి వెళ్లినా అధికారుల నుంచి ‘నో’ అనే సమాధానమే వస్తోంది. తాజాగా భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎంపీ వర్గానికి చెందిన ఏ ఒక్కరికీ పదవి రాలేదు. నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా మాండ్ర శివానందరెడ్డి వర్గానికి చెందిన వీరం ప్రసాద్‌రెడ్డి నియమితులయ్యారు. అలాగే జిల్లాలో వైభవంగా నిర్వహించే త ర్తూరు జాతర నిర్వహణ విషయంలో ఎంపీ వర్గీయుల మాటను పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి వర్గంలోకి వెళ్లిన 11 మంది కౌన్సి లర్లు మాండ్ర వర్గంలోకి జంప్ చేయడం గమనార్హం.ఒక్క మండలానికే పరిమితం... బైరెడ్డి రాజశేఖరరెడ్డి పెత్తనంతో ఎంపీ కేవలం ఒక్క మండలానికే పరిమితమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమె స్వగ్రామం ముచ్చుమర్రి ఉన్న పగిడ్యాల మండలంలో మాత్రమే ఆమె చెప్పినట్లు నడుస్తోంది. మిగిలిన నియోజకవర్గంతో పాటు జిల్లాలోనూ ఆమె చెప్పినట్లు నడవడం లేదని ఎంపీ అనుచరులే చర్చించుకుంటున్నారు. మరోవైపు శ్రీశైలం, డోన్ నియోజకవర్గాల్లోనూ ఆమె పెద్దగా పర్యటించడం లేదు. ప్రైవేటు కార్యక్రమాలకు ఎవరైనా ఆహా్వనిస్తే ఇలా వెళ్లి అలా వచ్చేస్తున్నారు.విభేదాలు బహిర్గతంసార్వత్రిక ఎన్నికల్లోనే భూమా అఖిలప్రియ... బైరెడ్డి శబరి మధ్య మనస్పర్థలు ప్రస్ఫుటంగా కనిపించాయి. నంద్యాల ఎంపీ అభ్యరి్థగా అఖిల భర్త భార్గవరామ్ నామినేషన్ వేయడంతో ఒక్కసారిగా వీరి మధ్య భేదాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. అయితే నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు వరకు భార్గవ్ రామ్ తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోలేదు. టీడీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన తన నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో తాము కోరిన మొత్తాన్ని ఎంపీ అభ్యర్థి ఇవ్వకపోవడంతో బెదిరించడానికి ఇలా డ్రామా ఆడినట్లు అప్పుడే జిల్లాలో జోరుగా చర్చ సాగింది. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎంపీ బైరెడ్డి శబరి ఒకరినొకరు చూసుకున్నది లేదు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంపీ అడుగు పెట్టలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఎంపీ పాల్గొనడం లేదు. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీకి కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని టీడీపీ నాయకులే చెబుతున్నారు. అయితే కొన్ని నెలల కిందట శిరివెళ్లలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరై ఒక గంట మాత్రమే ఉండి వెళ్లిపోయారు.ఉనికి పాట్లుఎంపీగా బైరెడ్డి శబరి గెలిచినప్పటికీ ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నీ తానై వ్యవహరించారని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఎంపీ చురుగ్గా వ్యవహరించడం లేదని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతి విషయంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి చొరవ చూపుతున్నారని ఆరోపించారు. అన్ని శాఖల అధికారులు తాను చెప్పింది చేయాలంటూ హుకుం జారీ చేయడంతో పాటు నియోజకవర్గంలో తానే అసలైన ప్రజాప్రతినిధిగా నడుచుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పాణ్యం నియోజకవర్గంలోనూ తలదూర్చి అక్కడ కూడా వర్గ రాజకీయాలు చేయడం ప్రారంభించడంతో టీడీపీ నాయకులు అధి ష్టానానికి వరుసగా ఫిర్యాదులు చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి రాజశేఖరరెడ్డి సై లెంట్ అయ్యారు. అప్పుడప్పుడు తాను ఒకడిని ఉన్నానని ఉనికిని కాపాడుకునేందుకు రా జకీయ విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నా రని టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. -
కూటమి నేతలు కేరళకు వచ్చి బెదిరించారు: కార్పొరేటర్ శశికళ
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి.. బెదిరింపులకు దిగుతోంది. జీవీఎంపీ మేయర్ వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానంలో భాగంగా కార్పొరేటర్లతో అనుచితంగా ప్రవర్తించింది. ఈ నేపథ్యంలో రాజకీయమంటే వ్యాపారం కాదని వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శశికళ.. చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.జీవీఎంసీ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శశికళ తాజాగా మాట్లాడుతూ..‘ప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు నన్ను బెదిరించారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారు. నేను పార్టీ మారేది లేదని చెప్పాను. మొదటి నుంచి నేను వైఎస్సార్సీపీలోనే ఉన్నాను. రాజకీయమంటే వ్యాపారం కాదు.. డబ్బుల కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను. నీచమైన రాజకీయాలను చేయవద్దని చెప్పాను. వైఎస్ జగన్ వల్లే నేను కార్పొరేటర్ అయ్యాను అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అధికార దాహంతో.. గత 11 నెలల పదవి కాలంలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖ మేయర్‌పై అవిశ్వాసం వేళ (GVMC No Confidence Motion) మరోసారి భారీగా ప్రలోభాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతుండడంతో కూటమి నేతలు ప్రలోభాల ఉధృతిని పెంచారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. భారీగా డబ్బు ఇస్తామని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అలాగే.. శ్రీలంక, కేరళ నుంచి విశాఖకు తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామంటున్నారు. విమానం కాకపోతే హెలికాప్టర్స్ అయినా ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు చేస్తున్నారు. అయితే.. తాము వైఎస్సార్ అభిమానులమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైఎస్ జగన్(YS Jagan)తోనే ఉంటామని చెబుతూ కార్పొరేటర్లు ఆ ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో బెదిరింపులకు సైతం కొందరు లొంగడం లేదని సమాచారం.జీవీఎంసీ(GVMC) ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుని మేయర్ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచనతో ఉంది. ఈ క్రమంలోనే భారీగా డబ్బు ఆశ చూపించడం, బెదిరింపులలాంటి అప్రజాస్వామిక ప్రయత్నాలకు దిగింది. -
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
సాక్షి, కడప: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చలేక ఇటు చంద్రబాబు.. అటు ఎమ్మెల్యేలు చేతులెత్తేస్తున్నారు. తన సొంత మేనిఫెస్టో అంటూ ఎన్నికల్లో పోటీకి దిగిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కొత్త పంథాలో ముందుకు వెళ్తున్నారు. తన నియోజకవర్గం అభివృద్ధికి చంద్రబాబు నిధులు ఇవ్వకపోవడంతో తాను ఇచ్చిన హామీల అమలు కోసం కొత్త రకం పన్నులు విధించేందుకు సిద్దమయ్యారు. పీ-4 మోడల్లో భాగంగా కప్పం ఇవ్వాలని హుకుం జారీ చేశారు.వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తాజాగా.. కడపలో డాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు రెడీ అయ్యారు. ప్రతీ ఒక్క వైద్యుడు ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని ఎమ్యెల్యే.. వాట్సాప్ గ్రూప్‌ల్లో మెసేజ్‌లు పెడుతున్నారు. దీంతో, డాక్టర్లు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కావడంతో ఆమెను ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు. అయితే, తమ వద్ద డబ్బులు వసూలు చేయడమేంటని ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు డాక్టర్ల వంతు కాగా.. రానున్న కాలంలో మాధవి రెడ్డి ఎవరిని టార్గెట్ చేస్తారోనని వణికిపోతున్నారు. -
సిట్ కార్యాలయానికి ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి పాలనలో వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. తాజాగా మద్యం కేసులో విచారణ పేరుతో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి విషయంలో కుట్రపూరిత్తంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే నేడు సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో మిథున్ రెడ్డి.. సీపీ కార్యాలయానికి చేరుకున్నారు.మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, అధికారులను, ఉద్యోగులను వేధించి పోలీసులు తప్పుడు వాంగ్మూలాలు నమోదుచేశారు. సిట్ అధికారులు వేధిస్తున్నారని వాసుదేవరెడ్డి ఇప్పటికే మూడు సార్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ విచారణకు రావాలని మిథున్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. శనివారం ఉదయం విజయవాడలోని సీపీ కార్యాలయానికి మిథున్ రెడ్డి చేరుకున్నారు. విచారణకు మిథున్ రెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాదులు హాజరయ్యారు. -
టీడీపీలో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే కారణంగా కీలక నేతల రాజీనామా!
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, వారి ప్రవర్తన కారణంగా.. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీటీసీ సైతం రాజీనామా చేశారు.వివరాల ప్రకారం.. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే శ్రావణి కార్యకర్తల కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని పచ్చ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం వచ్చిన మంత్రి టీజీ భరత్‌కు స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో, అక్కడే ఉన్న పోలీసులు.. టీడీపీ కార్యకర్తలను ఈడ్చి పడేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఎమ్మెల్యే శ్రావణి వైఖరికి నిరసనగా వెస్ట్ నరసాపురం టీడీపీ ఎంపీటీసీ అంజినమ్మ రాజీనామా చేశారు. ఇదే సమయంలో 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు కనీస గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ నేతలు వాసాపురం బాబు, కనంపల్లి ప్రసాద్ ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టిడిపి ఎమ్మెల్యే బండారు శ్రావణి కు సొంత కార్యకర్త నుంచి నిరసన సెగ. పార్టీ కోసం చాలా కష్టపడ్డాను కానీ గుర్తింపు ఇవ్వడం లేదు.- టిడిపి కార్యకర్త pic.twitter.com/ZibwkRqIZv— రాజా రెడ్డి YSRCP (@rajareddzysrcp) April 18, 2025 -
60 ఏళ్ల వయసులో బీజేపీ దిలీప్ ఘోష్ వివాహం.. IPL మ్యాచ్‌తో ప్రేమ!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ 60 ఏళ్ల వయసులో బ్రహ్మచర్యాన్ని వీడి పెళ్లి చేసుకున్నారు. బీజేపీకి చెందిన మాహిళా నేతను ఆయన వివాహమాడారు.వివరాల ప్రకారం.. మాజీ ఎంపీ దిలీప్ ఘోష్(60) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బెంగాల్లో పార్టీకి చెందిన బీజేపీ మహిళా మెర్చా నాయకురాలు రింకూ మజుందార్ (51)తో శుక్రవారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య శుక్రవారం వివాహం జరిగింది. ఈ సందర్బంగా దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. వివాహం తన అమ్మ కోరిక అని చెప్పుకొచ్చారు. అయితే, మజుందార్‌కు ఇది రెండో వివాహం. అంతకుముందు మరో వ్యక్తితో వివాహం జరగ్గా.. విడాకులు తీసుకున్నారు.Dilip Ghosh, the ultimate wild card of Bengal politics today, united both TMC-BJP on occasion of his marriage. For all the best wishes, he thanks everyone from the bottom of his heart. pic.twitter.com/UCGOmOg8LT— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) April 18, 2025 ఇదిలా ఉండగా.. వీరిద్దరి పెళ్లికి ఐపీఎల్ మ్యాచ్ కారణం కావడం విశేషం. ఇంతకీ ఏం జరిగిందంటే.. మజుందార్‌తో దిలీప్‌కు నాలుగేళ్లుగా పరిచయం ఉంది. అయితే, ఈ నెల మొదటి వారంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ను ఇద్దరూ కలిసి చూసిన సందర్భంగా పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో, కొద్దిరోజుల వ్యవధిలోనే ఇలా వివాహం చేసుకోవడం విశేషం. ఇక, ఇద్దరి వివాహం నేపథ్యంలో బెంగాల్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేతలు ఇంటికి వచ్చి దిలీప్ ఘోష్‌ను అభినందించారు. అలాగే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం శుభాకాంక్షలు తెలిపారు. Ex BJP National VP Dilip Ghosh has officially tied the knot with BJP mahila morcha leader Rinku Mazumdar today in Newtown, Kolkata according to Vedic traditions . Congratulations to the power couple. pic.twitter.com/l2z89U26ay— Sourav || সৌরভ (@Sourav_3294) April 18, 2025 -
GVMC: అడ్డదారిలో అవిశ్వాసం నెగ్గిన కూటమి
విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో ప్రజాస్వామ్యం మళ్లీ మళ్లీ ఖూనీ అవుతోంది. బలం లేకున్నా విశాఖ మేయర్‌పై అవిశ్వాసం పెట్టి.. కుట్రలు, ప్రలోభాల పర్వాలతో అడ్డదారిలో నెగ్గింది. ఏకంగా 30 మంది కార్పొరేటర్లను కొనుగోలు చేసిన టీడీపీ.. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారిను మేయర్ పీఠం నుంచి దించేసింది. అధికార వ్యామోహంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. కేవలం పది నెలల కాలం ఉన్న ఓ మేయర్ పదవి కోసం కోట్లాది రూపాయలు గుమ్మరించడం గమనార్హం. ఈ క్రమంలో దిగజారుడు రాజకీయాలు చేసింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు చివరి నిమిషం దాకా ప్రలోభాల పర్వం కొనసాగిస్తూ వచ్చింది. కార్పొరేటర్లను ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు పంపడం, స్టార్ హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేయడం లాంటి చేష్టలకు పాల్పడింది. కేరళకు వెళ్లి మరీ వైస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరించి.. బతిమాలి.. డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. అవిశ్వాసం నెగ్గాలంటే 74 ఓట్లు అవసరం. ఒకవైపు డబ్బు ఎర, మరోవైపు బెదిరింపులు, ఇంకోవైపు కిడ్నాపులు.. ఇలా టీడీపీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అయినా సరే బొటాబొటిగా 74 మంది సభ్యులతోనే విశాఖ మేయర్‌పై అవిశ్వాసం నెగ్గింది టీడీపీ. ఇక అవిశ్వాస ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే.. భారీ భద్రత నడుమ ఓటింగ్ నిర్వహించాలని, ఓటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయించాలని వైఎస్సార్సీపీ చేసిన విజ్ఞప్తిని అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కూటమి నేతలను అడ్డుకోని పోలీసులుఅవిశ్వాసం వేళ.. కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు కాకుండా కొందరు కూటమి నేతలను పోలీసులు జీవీఎంసీ కార్యాలయంలోకి లోపలికి అనుమతించారు. బస్సులో ఉన్న కూటమి నాయకులను వారి అనుచరులను నిలువరించకుండా చూస్తూ ఉండిపోయారు. ఓటింగ్‌కు వెళ్లిన సభ్యులతో కలిసి జీవీఎంసీ దర్జాగా కొందరు కూటమి నేతలు వెళ్తున్న దృశ్యాలు మీడియాకు చేరడం గమనార్హం. నీచమైన రాజకీయాలు వద్దని చెప్పాప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు నన్ను బెదిరించారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారు. నేను పార్టీ మారేది లేదని చెప్పాను. మొదటినుంచి నేను వైఎస్సార్సీపీలో ఉన్నాను. రాజకీయమంటే వ్యాపారం కాదు. డబ్బులు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను. నీచమైన రాజకీయాలను చెయ్యొద్దని చెప్పాను. వైయస్ జగన్ వలనే నేను కార్పోరేటర్ అయ్యాను అని వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శశికళ ఈ ఉదయం ఓ వీడియో విడుదల చేశారు కూడా. ఓటింగ్‌కు ముందు వాస్తవ బలాబలాలువైఎస్సార్సీపీ 58 టీడీపీ 29జనసేన 3బీజేపీ 1సీపీఐ 1సీపీఎం 1ఇండిపెండెన్స్ 4.ఖాళీలు 1.జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లుజీవీఎంసీలో 14 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులుటీడీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు.. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ..వైఎస్సార్సీపీకి ముగ్గురు ఎక్స్ అఫీషియ సభ్యులు.ఎంపీ గొల్ల బాబురావు, ఇద్దరు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం జీవీఎంసీ సభ్యుల సంఖ్య బలం 97+14= 111అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్సార్సీపీ మొత్తం బలం 61ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48ఎన్నికకు దూరంగా ఇద్దరు సీపీఎం, సీపీఐ సభ్యులు. -
గ్రూప్–1 పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. గ్రూప్–1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు అగాధంలో పడిపోయాయని ఆమె ఆరోపించారు. పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిలో అనేక లోపాలు, అవకతవకలు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. ‘తెలంగాణ యువతకు, ముఖ్యంగా నిరుద్యోగులకు అనేక ఆశలు చూపి, అధికారంలోకి వచ్చిన మీరు వారి జీవితాలతో చెలగాటమాడుతున్న తీరు ఆక్షేపణీయం. గ్రూప్ –1 ప్రిలిమినరీ పరీక్షలకు ఒక హాల్ టికెట్ జారీ చేసిన టీజీపీఎస్సీ అధికారులు, మెయిన్స్ పరీక్షకు వేరే హాల్ టికెట్ జారీ చేశారు.కొత్తగా జారీ చేసిన హాల్ టికెట్లతో మెయిన్స్ నిర్వహించడంపై మొదటి నుంచే అనేక సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయకుండానే మెయిన్స్ పరీక్షల తంతు ముగించారు. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసినా కూడా అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయి ? కొందరు అభ్యర్థులు నిజంగానే మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారా? లేదంటే తర్వాత వారిని మధ్యలో చేర్చారా అనే సందేహం మిగతా అభ్యర్థుల్లో నెలకొన్నది. జవాబు పత్రాల మూల్యాంకనంపైనా అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించడంపైనా అభ్యర్థుల్లో అనుమానాలున్నాయి.కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలకు హాజరైన రెండు కోచింగ్ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగి ఉంటుందని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు పరీక్ష కేంద్రాల్లో 71 మంది ఉద్యోగాలకు ఎంపికైన విషయం నిజమేనని టీజీపీఎస్సీ కూడా అంగీకరించింది. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్ధమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్ –1 నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేసి, తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుతున్నాను’అని కవిత తన లేఖలో పేర్కొన్నారు. -
‘అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా మాకేం కాదు.. అది డీఎంకే పవర్’
చెన్నై: ఇటీవల అన్నా డీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత డీఎంకే పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. గత వారం అదొక ‘అవినీతి కూటమి’ అంటూ వ్యాఖ్యానించిన డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్.. వారి పొత్తుపై మరొకసారి ఘాటు వ్యాఖ్యాలు చేశారు. తమిళనాడుకొచ్చి బీజేపీ ఏదో చేద్దామని కలలు కంటుందని, అది వారి వల్ల కాదని స్టాలిన్ నేరుగా విమర్శలు చేశారు. తమిళనాడుకు అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా తమకేమీ కాదంటూ విమర్శించారు. అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకునే సందర్భంలో తమిళనాడుకు సంబంధించి ఏ ఒక్క విషయంలోనూ బీజేపీ పెద్దలు క్లారిటీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అవకతవకలు జరిగిన నీట్ ఎగ్జామ్స్ కు సంబంధించి రాష్ట్ర విద్యార్థులకు ఎటువంటి మినహాయింపును బీజేపీ ఇవ్వలేదన్నారు. అదే సమయంలో హిందీని తమిళనాడులో రుద్దమనే విషయంలో కూడా వారు ఏమీ స్పష్టత ఇవ్వలేదని, ఇక డీలిమిటేషన్ అంశంపై కూడా ఏమీ పెదవి విప్పలేదని బీజేపీని కార్నర్ చేశారు స్టాలిన్.తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి తమ ప్రభుత్వం పట్ల వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టిన విషయాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపు పెట్టులాంటి తీర్పని స్టాలిన్ వ్యాఖ్యానించారు. వ్యవస్థలను వ్యక్తులను అడ్డుపెట్టుకుని పెత్తనం చేయాలని ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. తాను ఇక్కడ ఒక విషయం మాత్రం దేశ ప్రజలకు చెప్పదలుచుకున్నానని, తమ పోరాటం కేవలం తమిళనాడుకి, తమిళ ప్రజలకు సంబంధించినది మాత్రమే కాదని, యావత్ దేశ ప్రజల తరఫున చేస్తున్న పోరాటంగా స్టాలిన్ అభివర్ణించారు. ఇది డీఎంకే బలమంటూ బీజేపీ, అన్నాడీఎంకేల పొత్తును దెప్పిపొడిచారు. అందుచేత తమిళనాడు ఎవరు వచ్చినా తమను ఏం చేయలేరని స్టాలిన్ వ్యాఖ్యానించారు. -
‘వారు బెయిల్ తెచ్చుకున్న నిందితులు’
హైదరాబాద్: డూప్లికేట్ గాంధీ కుటుంబానికి భారతీయ చట్టాలు వర్తించవా?, రాజ్యాంగానికి అతీతులని అనుకుంటున్నారా?, నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాజేసేందుకు డూప్లికేట్ గాంధీ కుటుంబం చేసిన కుట్ర’ అంటూ కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. యూపీఏ హయాంలోనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకున్న నిందితులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ. ఇందులో బీజేపీ, మోదీ పాత్ర ఏముంది?, కాంగ్రెస్ కార్యకర్తలారా....నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్లో మీ వాటా ఉంది. మీరు ధర్నా చేయాల్సింది.... టెన్ జన్ పథ్ సోనియా ఇంటి ముందు. తప్పు చేస్తే సోనియా సహా అందరూ జైలుకు వెళ్లక తప్పదు.రాహుల్ స్పూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ పేరుతో ఫోర్త్ సిటీకి చెందిన 50 వేల కోట్ల ఆస్తులను కాజేసే కుట్ర. సుబ్రమణ్యస్వామి కేసులతో బీజేపీకి ఏం సంబంధం?, బూతులు మాట్లాడితే చప్పట్లు కొడుతుంటే నివారించాల్సింది పోయి సమర్ధిస్తారా?, దావోస్ పెట్టుబడులు ఎటు పోయాయ్?...జపాన్ పర్యటన కూడా అంతే. కాంగ్రెస్, బీఆర్ఎస్ జాన్ జబ్బలు.... బీఆర్ఎస్ అవినీతి కేసులన్నీ నీరుగార్చడమే నిదర్శనం.విద్యుత్ కొనుగోళ్ల స్కాంపై నివేదిక ఇచ్చినా కేసీఆర్ కు కనీసం నోటీసు ఎందుకు ఇవ్వలేదు?, బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణలో వచ్చే ప్రమాదముంది. దీనికి ముమ్మాటికీ కారణం రేవంత్ రెడ్డి కాబోతున్నరు. రేవంత్ ఆర్ధిక సహకారంతోనే వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మజ్లిస్ ఆందోళన చేస్తోంది. దీనిని అడ్డుకోకపోతే జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి సర్కారే బాధ్యత వహించక తప్పదు’ అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. -
భూ దందా.. జమ్మలమడుగులో ‘బాబాయ్-అబ్బాయ్’ రాజ్యాంగం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో కూటమి నేతల ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోంది. తాము చెప్పిందే వేదమంటూ ప్రభుత్వ భూమిని టీడీపీ యువనేత ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు. నిన్న అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ వివాదంలో బాబాయ్ ఎంట్రి ఇవ్వగా.. అది మరువక ముందే మరొక భూదందాకు అబ్బాయ్ తెరలేపారు. బాబాయ్, అబ్బాయ్‌లు కలిసి దోచేసుకుంటున్నారు.పెద్ద ముడియం మండలం పాపాయపల్లిలో 500 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా భూమిని చదును చేయించిన టీడీపీ యువనేత.. ఆ ప్రాంతంలో ఏర్పాటైన సోలార్ కంపెనీకి ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసేందుకు కబ్జాకు తెరతీశారు. ఎకరా రూ.6 లక్షల చొప్పున సదరు కంపెనీకి ప్రభుత్వ భూమిని అమ్మేందుకు సిద్ధమయ్యారు.ఎన్వోసీలు తీసుకురావడం, చదును చేయడం అంతా మా పనేనంటున్న యువనేత.. 500 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు కంపెనీ అప్పనంగా అమ్మేస్తున్నారు. ఆ 500 ఎకరాల్లో పేదలకిచ్చిన డీకేటీ పట్టాలున్నా, వాటిపై కోర్టులో కేసు ఉన్నా టీడీపీ యువనేత పట్టించుకోవడం లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తమకు తెలియదని తహశీల్దార్ చెబుతున్నారు. తమ భూములను దౌర్జన్యంగా చదును చేస్తున్నారంటు డీకేటీ పట్టాదారులు వాపోతున్నారు. -
‘మీకు ఒక పార్టీ అండ కావాలి.. ఇప్పుడు ఎవరు ప్రేమ కావాలి?’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ప్రతీసారి ముస్లింలు, మజ్లీస్ మాత్రమే అంటూ కాలయాపన చేయడమే తప్పా రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూర్చారా అని నిలదీశారు. కిషన్ రెడ్డి.. ఒక కిస్మత్ రెడ్డి అంటూ సెటైర్లు వేశారు మహేష్ కుమార్‌గౌడ్,హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బలం లేకపోయినా పోటీకి దిగడాన్ని తప్పుబట్టారు. బలం లేనప్పుడు పోటీకి దిగి మిగతా పార్టీలపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ‘ప్రతీ ఎన్నికల్లో ఏదో ఓక పార్టీ అండతో గెలుస్తారు. కిషన్ రెడ్డి రాజకీయ జీవితంలో తెలంగాణ కు పైసా రూపాయి లాభం అయినా జరిగిందా?, ముస్లిం, మజ్లీస్ తప్ప కిషన్ రెడ్డి నుంచి మరో మాట రాదు. బలం లేకున్నా ఏ ఉద్దేశ్యంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. ఎవరి ప్రేమ కోసం బీజేపీ ఎదురు చూస్తుంది. మాకు బలం లేదు కాబట్టే పోటీ చేయలేదని మేము ప్రకటించాం. బీజేపీ, బిఆర్ఎస్ మధ్య ప్రేమ చిగురించింది’అంటూ ధ్వజమెత్తారు.ఏరోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసారా?, పూర్వ కాలంలో కిషన్ రెడ్డి, ఓవైసీ అన్నదమ్ములు అయ్యి ఉంటారు. రజాకార్ల అంటె కిషన్ రెడ్డికి ప్రేమ ఎందుకు?, ... పదే పదే రజాకార్ల ప్రస్తావన కిషన్ రెడ్డి ఎందుకు తెస్తున్నారు. రేషన్ బియ్యంలో కేంద్ర వాటా ఎంతో బండి సంజయ్ కి తెలుసా?, ఇతర రాష్ట్రాలలో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో సంజయ్ సమాధానం చెప్పాలి’ అని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్ -
‘బంగ్లాదేశ్ తిరుగుబాటుతో తెలంగాణకు సంబంధమేంటి?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అక్కసు ఎందుకని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. పదేళ్లలో బీఆర్ఎస్ చేయనటువంటి పనులను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మల్లు రవి స్పష్టం చేశారు. ‘తెలంగాణలో ప్రజల తిరుగుబాటుతోనే బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది. పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ కాస్తా బంగారు కేసీఆర్ కుటుంబంగా మారింది. ప్రతిపక్షాలు రాత్రింబవళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయి. బంగ్లాదేశ్ లో ప్రజలు తిరిగిపడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.పదేళ్లలో బిఆర్ఎస్ చేయనటువంటి పనులను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా పేదల కోసం సన్న బియ్యం పంపిణీని ప్రభుత్వం తీసుకొచ్చింది. సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక నిర్ణయం. బంగ్లాదేశ్ తిరుగుబాటుతో తెలంగాణకి ఏం సంబంధం కేటీఆర్. ధరణితో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసింది.16 లక్షలు మంది ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతుల మేలు కోసం భూభారతిని సీఎం రేవంత్, మంత్రులు బృందం తీసుకొచ్చింది. ప్రగతి భవన్ లో ప్రజలు కనపడకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. రేవంత్ హయంలో ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి ప్రజలు వెళ్లేందుకు వీలు కల్పించారు. కాంగ్రెస్ ఏడాదిన్నర లో 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం’ అని మల్లు రవి పేర్కొన్నారు. -
రాజాసింగ్‌కు మళ్లీ కోపమొచ్చింది..!
హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ కోపమొచ్చింది. ఈసారి తనకు పార్టీ నేతలు బర్త్ డే విషెస్ చెప్పలేదని రాజాసింగ్ కు అలకబూనారట. రాజాసింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పగా, బీజేపీ నుంచి ముఖ్య నేతల ఎవరూ కూడా ఆయనకు విషెస్ చెప్పలేదట. దాంతో రాజాసింగ్ మళ్లీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హరిత ప్లాజాలో జరిగిన సమావేశానికి రాజాసింగ్ డుమ్మా కొట్టారట. ఈటెల రాజేందర్‌తో సహా పలువురు ప్రముఖ నేతలు ఆ మీటింగ్ కు హాజరు కాగా, రాజాసింగ్ మాత్రం అందుకు దూరంగా ఉన్నారు. అందులోనూ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం నిర్వహించిన సమయంలో రాజాసింగ్ ఇలా దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పలేదనే కారణమా?.. లేక ఇంకేమైనా ఉందా? అనే కోణంలో చర్చ నడుస్తోంది.బండి సంజయ్ రాజీ చేశారు.. కానీకొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి అలక పాన్పు ఎక్కిన రాజాసింగ్ఎం ను ఇటీవల ఎంపీ బండి సంజయ్ స్వయంగా కలిసి ఆయనకు నచ్చజెప్పి వచ్చారు. ప్రధానంగ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతంరావు అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించిన క్రమంలో బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగారు. గౌతంరావును ఆ స్థానంలో నిలబెట్టడానికి ప్రధాన కారణం బండి సంజయ్ కాబట్టి.. రాజాసింగ్ ను బుజ్జగించి వచ్చారు. అప్పుడు గౌతంరావుతో రాజాసింగ్ ను కరాచలనం చేయించడమే కాకుండా ఇరువురు నేతలు శాలువాలతో సత్కరించుకునే కార్యక్రమం కూడా జరిగింది. ఇంతలోనే రాజాసింగ్ మళ్లీ పార్టీ శ్రేణులపై కోపంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తును ప్రచారం జరుగుతోంది ఇందుకు తన బర్త్ డేకు పార్టీలోని ప్రముఖలు విషెస్ చెప్పకపోవడంగా సమాచారం. సీఎం రేవంత్ విషెస్ చెప్పగా, తమ సొంత పార్టీలోని ముఖ్యులు ఎవరూ కూడా కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదనే కారణంతో రాజాసింగ్ కోపంగా ఉన్నారట, నేటి బీజేపీ కీలక సమావేశానికి రాజాసింగ్ దూరంగా ఉండటానికి ఇదే కారణమనే వాదన ప్రముఖంగా వినిపిస్తోంది. -
‘100 కేసులు పెట్టినా భయపడను.. ఏ తప్పు జరిగినా నిలదీస్తూనే ఉంటా’
సాక్షి, తిరుపతి: వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతాం అనుకుంటే మీ భ్రమే అంటూ కూటమి నేతలపై వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. న్యాయం మా వైపు ఉంది. నాపై 100 కేసులు పెట్టినా భయపడను. ఏ తప్పు జరిగినా నేను నిలదీస్తూనే ఉంటా. మీ పాలనలో జరిగే అరాచకాలు ప్రశ్నించకపోతే పాపం అవుతుంది. దేవుడిని అడ్డుపెట్టుకుని మీరు అధికారంలోకి వచ్చారు’’ అంటూ భూమన ధ్వజమెత్తారు.తప్పుడు కేసులు.. భూమన పోరాటాలను ఆపలేవు: ఎంపీ గురుమూర్తితిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, భూమన కరుణాకర్‌రెడ్డిపై యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. 30 వేల మహిళలు కనిపించడం లేదని.. వాలంటీర్లు వ్యవస్థ వలనే జరిగిందని పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తే మేము కేసు పెట్టలేదు. ఇవాళ వాస్తవంగా గోశాలలో జరిగిన గోవుల మృతిపై ప్రశ్నించిన భూమనపై కేసు నమోదు చేస్తారా..?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘విద్యార్థి దశ నుంచి పోరాటాలతో ఎన్నో కేసులు ఎదుర్కొని నిలబడిన వ్యక్తి భూమన కరుణాకర్‌రెడ్డి. ఇలాంటి తప్పుడు కేసులు ఆయన పోరాటాలను ఆపలేవు. గోవుల మృతిపై రాజకీయం చేసి కూటమి నేతలు వివాదం చేస్తున్నారు’’ అని గురమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పవన్.. ‘సనాతన ధర్మం అంటే కాషాయ దుస్తులు ధరించడం కాదు’
పల్నాడు జిల్లా,సాక్షి: తిరుమల లడ్డు వ్యవహారంలో కట్టుకథ అల్లి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నెట్టే ప్రయత్నించారు. ఇదే అంశంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన కూటమి ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారుతిరుమల గోశాలలో కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయంపై కాసు మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘తిరుపతిలో గోవులు చనిపోవడం బాధాకరం. గోవులు చల్లగా ఉంటేనే ఈ విశ్వం చల్లగా ఉంటుంది. గోవులు చనిపోతున్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పేంతవరకు విషయం బయటికి రాలేదు.టీటీడీ ఈవో,ఛైర్మన్ గోవులు చనిపోతున్నాయని చెప్తుంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ మాత్రం గోవులు చనిపోవటం లేదని చెబుతున్నారు. తొమ్మిది పది నెలల నుంచి నెలకు 10 నుంచి 15 గోవులు చనిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? గోవుల మరణాలపై చర్చకి సిద్ధమని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.భూమన కరుణాకర్‌రెడ్డి చర్చకు వెళ్తుంటే పోలీసులతో అడ్డుకున్నారు. చర్చ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయం కోసం వాడుకుంటుంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని హడావిడి చేశాడు. సనాతన ధర్మం అంటే కాషాయం బట్టలు వేసుకొని తిరగటం కాదు. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.గతంలో లడ్డు వ్యవహారంలో కట్టు కధ అల్లి రాజకీయం చేసి వైఎస్ జగన్ మీద వేసే ప్రయత్నించారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదు. ప్రభుత్వం రాజకీయాలు పక్కనపెట్టి గోవులు ఎందుకు చనిపోతున్నాయో కారణాలు కనుక్కోండిగిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి రైతుకు 20 వేలుఇస్తానని ప్రకటించారు. ఇప్పటికి 40 వేలు రైతులకి బకాయి ఉన్నారు. చంద్రబాబు రైతులకు ఇస్తానన్న డబ్బులు చెల్లిస్తే వారికి ఎంతో కొంత ఉపయోగపడతాయి’అని సూచించారు. -
తమిళనాడులో అమిత్ షా రూల్ చెల్లదు: స్టాలిన్
చెన్నై, సాక్షి: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా రూల్ తమిళనాడులో చెల్లదంటూ ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించారు. విభజించు పాలించు సిద్ధంతం ఇక్కడ పని చేయదు. తమిళనాడు ఏనాటికీ ఢిల్లీ నియంత్రణలోకి వెళ్లబోదు అంటూ వ్యాఖ్యానించారు. నీట్, జాతీయ విద్యా విధానం విషయంలో కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వైరం సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీతో అన్నాడీఎంకే చేతులు కలపడంతో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాలలో గోవుల మృతిపై తాను త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి(Subramanian Swamy) ప్రకటించారు. అంతేకాదు ఈ విషయంలో నిర్లక్ష్యంగా మాట్లాడిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఢిల్లీ సాక్షి ప్రతినిధితో ఆయన శుక్రవారం మాట్లాడారు. రాజ్యాంగంలో గోవులకు అత్యున్నత స్థానం కలిపించారు. గోవు అంటే జంతువు మాత్రమే కాదు.. కోట్ల మందికి ఆరాధ్య దైవం కూడా. అలాంటిది గోవుల ఆలనా పాలనా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. తిరుమలలో సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు. పైగా గోవుల మరణాల విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిర్లక్ష్యపూరితంగా మాట్లాడారు. వయసు మళ్లిన మనుషుల్లాగే.. వయసు మళ్లిన ఆవులూ చనిపోతున్నాయని బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారు. రేపు మీరు కూడా చనిపోతారు. అప్పుడు వయసు మల్లారని పట్టించుకోకుండా మీ కుటుంబ సభ్యులు వదిలేస్తారా?. అని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడిన చైర్మన్‌ను సీఎం చంద్రబాబు వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘వందల సంఖ్యలో గోవులు చనిపోవడం వెనుక కుట్ర ఉంది. టీటీడీలో వ్యాపార ధోరణితో చూడడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చనిపోయిన గోవులను రెస్టారెంట్లకు పంపుతున్నారా?. గోవుల మృతి పై దర్యాప్తు జరగాలి. టీటీడీ గోశాలలో గోవుల మృతి పై త్వరలో కోర్టులో కేసులు దాఖలు చేస్తా. ఇప్పుడున్న టీటీడీ బోర్డు పాలన అధ్వాన్నంగా ఉంది. గత టీటీడీ బోర్డు చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు.. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు’’ అని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేసుకున్నారు. -
ఖబడ్దార్ రేవంత్.. ‘సీఎం పదవి నుంచి దించేస్తాం’
మహబూబ్‌నగర్,సాక్షి: మహబూబ్ నగర్లో లేఖ కలకలం సృష్టించాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలను హెచ్చరిస్తూ రాసిన లేఖలు మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నారాయణ్‌పేట్ జిల్లా మక్తల్‌లో వెలుగులోకి వచ్చాయి. ఆ లేఖలో ‘మేం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలం. సీఎం రేవంత్‌రెడ్డికి ఇదే మా హెచ్చరిక. ఖబడ్దార్. మీ పలుకుబడి ఉపయోగించి మా ఎమ్మెల్యేకి(మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి) మంత్రి పదవి రాకుండా చేశావో అప్పుడు నీ భరతం పట్టడం ఖాయం. రాష్ట్రంలో పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. మిమ్మల్ని సీఎం పదవి నుంచి దించడం’ అని హెచ్చరిస్తూ లేఖలో రాశారు.ముదిరాజు సామాజిక వర్గం పేరుతో ఆ లేఖలు వెలుగులోకి రావడంపై పోలీసులు రంగంలోకి దిగారు. ఆ లేఖలు ఎవరు రాశారా? అని ఆరా తీస్తున్నారు.ఆ లేఖలపై సమాచారం అందుకున్న ముదిరాజు సంఘం నేతలు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ లేఖలతో తమకు సంబంధం లేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
విశాఖ: ప్రలోభాల పర్వంలో కూటమి నేతలకు ఛీత్కారాలు
విశాఖపట్నం, సాక్షి: అధికార దాహంతో.. గత 11 నెలల పదవి కాలంలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖ మేయర్‌పై అవిశ్వాసం వేళ (GVMC No Confidence Motion).. మరోసారి భారీగా ప్రలోభాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతుండడంతో కూటమి నేతలు ప్రలోభాల ఉధృతిని పెంచారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. భారీగా డబ్బు ఇస్తామని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అలాగే.. శ్రీలంక, కేరళ నుంచి విశాఖకు తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామంటున్నారు. విమానం కాకపోతే హెలికాప్టర్స్ అయినా ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు చేస్తున్నారు. అయితే.. తాము వైఎస్సార్ అభిమానులమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైఎస్ జగన్(YS Jagan)తోనే ఉంటామని చెబుతూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆ ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో బెదిరింపులకు సైతం కొందరు లొంగడం లేదని సమాచారం. దీంతో చేసేది లేక కూటమి నేతలు వెనుదిరుగుతున్నట్లు సమాచారం. జీవీఎంసీ(GVMC) ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుని మేయర్ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచనతో ఉంది. ఈ క్రమంలోనే భారీగా డబ్బు ఆశ చూపించడం, బెదిరింపులలాంటి అప్రజాస్వామిక ప్రయత్నాలకు దిగింది. -
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలతో తనకు సంబంధం లేనట్లు, అదేదో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ల బాధ్యత అన్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రశ్నించడానికే పార్టీని పెట్టానని గొప్పగా చెప్పుకున్న పవన్.. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లను రాజకీయంగా మోయడానికి, తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికే అన్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శ. దీంతో ఆయనకు ఇప్పుడిప్పుడే నిరసన సెగ తగులుతోంది. కొద్ది రోజుల క్రితం విశాఖ, గిరిజన ప్రాంతాలకు వెళ్లినప్పుడు వలంటీర్లు పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను నిలదీసే యత్నం చేశారు. ఇప్పటికే ఆయా చోట్ల వలంటీర్లు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. అయినా కూటమి ప్రభుత్వంలో కనీస స్పందన లేదు. కూటమి పెద్దలకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. దాంతో వలంటీర్లు నేతలను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి వీరే కాదు. సూపర్ సిక్స్ తదితర హామీలు ఏమయ్యాయంటూ మహిళలు, నిరుద్యోగులు తదితర వర్గాలు నిరసన ర్యాలీలు చేయడం ఆరంభమైంది.వలంటీర్లకు సంబంధించి పవన్ చేసిన ప్రకటనను గమనిస్తే ఆయన ఎలా మాట మార్చుతున్నది ఇట్టే తెలిసిపోతుంది. గత ప్రభుత్వం వలంటీర్లను అధికారికంగా నియమించలేదని చంద్రబాబు, లోకేశ్‌లు క్యాబినెట్ సమావేశంలో చెప్పారని, వారికి ఇచ్చేది జీతం కాదు.. గౌరవ వేతనం మాత్రమేనని, అందుకే ఏమీ చేయలేదని తెలియ చేశారని పవన్ అన్నట్లుగా మీడియాలో కథనం వచ్చింది. లక్షన్నర మంది జీవితాలను నట్టేట ముంచేసి, అదేదో స్వల్ప విషయమన్నట్లుగా పవన్ వ్యవహరించడం శోచనీయం. 👉ఎన్నికల ప్రణాళికలో వలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని, వారి సేవలను కొనసాగిస్తామని ప్రకటించింది వాస్తవం కాదా? పలు ఎన్నికల ప్రచార సభలలో పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వలంటీర్ల అంశం ప్రస్తావించారో గుర్తు లేదా? వలంటీర్ల కడుపు కొట్టబోమని, అందులోను లక్షమంది యువతులకు అన్యాయం చేస్తానా? అని ప్రసంగించారు. వాస్తవానికి రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండే వారు. కాని ఎన్నికల సమయంలో సుమారు ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు రాజీనామాలు సమర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉంటే వారిని కూడా బాధ్యతలలోకి తీసుకునే వారు. కాని కూటమి ప్రభుత్వం రావడంతో తమకు గౌరవ వేతనం పెరుగుతుందని రాజీనామా చేయని వలంటీర్లు ఆశపడ్డారు. తీరా చూస్తే కూటమి ప్రభుత్వం అసలుకే మోసం తెచ్చింది. 👉వలంటీర్లు(Volunteers) అంటే స్వచ్ఛందంగా సేవలందించే వారని, వారికి గత జగన్ ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చిందన్న సంగతి పవన్ కళ్యాణ్ కు తెలియదా? ఆ విషయం తెలియకుండానే, గుడ్డిగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రణాళికపై సంతకం చేశారని నమ్మాలా? అదే వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ ఈ పదవిలో ఉండడానికి అర్హుడవుతారా? పైగా క్యాబినెట్లో చంద్రబాబు, లోకేశ్‌లు ఏదో చెప్పారని వారిపై నెట్టేసి తప్పించుకునే యత్నం చేస్తారా? ప్రభుత్వంలో వారు ఏమి చేసినా సమర్థిస్తున్న పవన్ కళ్యాణ్ వలంటీర్ల విషయం తనకు ఏమీ తెలియదన్నట్లుగా నటించడం ధర్మమేనా?. వలంటీర్లకు ఇచ్చేది గౌరవ వేతనం కనుక ,వారికి ఆ బాధ్యతలు అప్పగించడం కుదరదని చంద్రబాబు, లోకేశ్ లు చెబితే పవన్ కళ్యాణ్ చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారా?మనం హామీ ఇచ్చాం కదా! ఎందుకు చేయలేం. ప్రభుత్వం అనుకుంటే ఇది ఒక పెద్ద సమస్యా?అ ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించి ఉండాలి కదా? ఉగాది పర్వదినానా పవిత్రమైన పూజలు నిర్వహించి మరీ వలంటీర్లకు హామీ ఇచ్చారు కదా? ఇప్పుడు కాదంటే పాపం కదా అని చంద్రబాబును అడగాలి కదా? అలా అడగలేదంటే ఏమిటి దాని అర్థం? వలంటీర్లు సామాన్యులు కనుక, వారిని ఏమి చేసినా ఏమీ కాదన్న భావనే కదా?. 👉జగన్ ప్రభుత్వం(Jagan Govt) విజయవంతంగా నిర్వహించిన వలంటీర్లు అంటే చంద్రబాబు, లేదా పవన్ కళ్యాణ్‌లకు ఎప్పుడూ గౌరవం లేదు. వారిని అసలు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా చూడడానికి కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు నాయుడు వీరిని మూటలు మోసే వారని, ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు వెళ్లి వేధించేవారని ఒకసారి నీచమైన రీతిలో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా వలంటీర్లను కిడ్పాపర్లతో పోల్చారు. ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు తప్పిపోయారని అంటూ వలంటీర్లపై ఆరోపణలు చేశారు. కాని ప్రజలలో వలంటీర్ల పట్ల ఉన్న సానుకూలత వల్ల అది వైఎస్సార్సీపీకి ఎక్కడ అడ్వాంటేజ్ అవుతుందోనన్న భయంతో, మాట మార్చి తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడమే కాకుండా, గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని ప్రకటించారు. అప్పటికి వారికి అధికారం వస్తుందన్న నమ్మం లేదు. కాని అనూహ్యంగా గెలిచేసరికి, ఇప్పుడు సూపర్ సిక్స్‌తో సహా అనేక అంశాలపై స్వరం మార్చుతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు సినీ నటుడు. ఆ తర్వాతే రాజకీయ నేత. సినిమాలలో వకీల్ సాబ్‌గా ఆయన నటన అభిమానులను మెప్పించింది. కానీ రాజకీయ జీవితంలో మాత్రం ఆయన వ్యవహారశైలి వకీల్‌సాబ్ పాత్రకు భిన్నంగా ఉంది. ఈ సంగతిని ప్రజలూ గుర్తిస్తున్నారు. కరడుకట్టిన, గుడ్డి అభిమానులు మినహా మిగిలిన వారిలో పవన్ కళ్యాణ్ మాట మార్చేస్తున్నారన్న భావన క్రమేపీ బలపడిపోతోంది. 👉అబద్దాలు బాగా ఆడతారన్న పేరు ఉన్న చంద్రబాబుకు తానా అంటే తందానా అని తబలా వాయిస్తున్న చందంగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఆయనతో పోటీ పడి అసత్యాలు చెబుతున్నారు. తాము మాట మార్చుతున్నామని ధైర్యంగా పవన్ కళ్యాణ్ చెప్పి ఉంటే కొంతైనా బెటర్‌గా ఉండేది. అలా కాకుండా చంద్రబాబు, లోకేశ్‌లదే తప్పు అన్నట్లు, తనకేమీ సంబంధం లేదన్నట్లు పవన్ కళ్యాణ్ డ్రామా ఆడినట్లు డైలాగులు చెబితే ప్రజలను పిచ్చివాళ్లను చేసినట్లు కాదా? వలంటీర్లను మోసం చేయడం కాదా? 30 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ గురించి ఏపీ అంతటా తిరిగి చేసిన ప్రచారం అంతా అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దం అని తేలింది కదా! కేవలం 47 మంది మాత్రమే మిస్ అయ్యారని, వారిలో ఎక్కువ మంది తిరిగి వచ్చారని అసెంబ్లీలో సమాధానం చెప్పింది కూటమి ప్రభుత్వమే కదా? పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దం ప్రచారం చేసి ఆంధ్ర సమాజాన్ని చీట్ చేసినట్లు అవుతుందా? అవ్వదా?.చంద్రబాబు, లోకేశ్‌ల పట్ల పవన్ కళ్యాణ్ ఎంత విధేయుడిగా ఉన్నా ప్రజలకు అభ్యంతరం లేదు. కాని ఎన్నికల ప్రణాళికను చంద్రబాబుతో కలిసి ఆయన కూడా విడుదల చేశారన్న సంగతి మర్చిపోకూడదు కదా! వకీల్ సాబ్ పాత్రను సినిమాలలో పోషించడం కాదు.. ప్రజా జీవితంలో ఆ మాదిరి నిలబడితేనే మంచి పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్లినప్పుడు ఆయన కాన్వాయ్ కోసం పోలీసులు ఆంక్షలు విధించడం, తత్పలితంగా సుమారు 30 మంది జెఈఈ పరీక్షలు రాయలేకపోయిన ఘటన కూడా కూటమి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుంది. పవన్ కళ్యాణ్ పదవిని ఎంజాయ్ చేసే మోజులో విద్యార్ధుల భవిష్యత్తును కూడా దెబ్బతీశారన్న విమర్శకు ఆస్కారం ఇచ్చారు. ఏది ఏమైనా వలంటీర్లను చంద్రబాబు, లోకేశ్‌లే కాదు.. పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసినట్లే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రధానిగారూ.. చిత్తశుద్ధి నిరూపించుకోండి: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: ప్రధాని నరేంద్రమోదీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక విజ్ఞప్తి చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిదన్నారు. ‘‘కంచ గచ్చిబౌలి భూముల(Kancha Gachibowli Land Issue) ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టాలి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి. దీనిపై ప్రధాని వ్యాఖ్యలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాలి. కంచ గచ్చిబౌలి అంశం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రూ.10వేల కోట్ల ఆర్థిక మోసం.దీనిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా తెలిపాం. ఆర్థిక అవకతవకల అంశాన్ని కేంద్ర సాధికార కమిటీ నిర్ధరించింది. స్వతంత్ర విచారణ చేయాలని సూచించింది. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి’’ అని కేటీఆర్(KTR) కోరారు.ఇటీవల హర్యానాలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు. అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందని విమర్శించారు. ప్రకృతి నాశనం, వన్యప్రాణులకు హాని.. ఇదే కాంగ్రెస్ పాలనని వ్యాఖ్యానించారు. అటవీ సంపదను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను సైతం కాంగ్రెస్ మర్చిపోయిందని మోదీ ఎద్దేవా చేశారు. -
Goshala Row: ఎవరిది అసత్య ప్రచారం?.. ప్రశ్నిస్తే కేసులే!
తిరుపతి, సాక్షి: శ్రీవారి గోశాలలో గోమాతల మరణాల వ్యవహారంలో ఊహించిందే జరిగింది. వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy)పై కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయించింది. గోమాతల మరణాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చర్చకు రావాలంటూ టీడీపీ నేతలే ఆయనకు సవాల్ విసిరారు. అదే టైంలో.. పోలీసుల సాయంతో భూమనను నిర్భందించి ఇబ్బంది పెట్టడంతో నిన్నంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజాగా.. గోశాలలో గోవుల మృతిపై ప్రశ్నించిన టీటీడీ మాజీ చైర్మన్(TTD Ex Chairman) భూమన కరుణాకరరెడ్డి పై కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. గోశాలపై అతస్య ప్రచారం చేస్తూ మీడియాను తప్పుదోవ పట్టించారని, భక్తుల మనోభావాలు దెబ్బ తీశారంటూ టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో భూమనపై కేసు నమోదు అయ్యింది. గురువారం రాత్రి 8 గంటలకు ఫిర్యాదు నమోదు కాగా.. పోలీసులు ఆగమేఘాల మీద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్ 353(1), 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ లు ఈ కేసులో నమోదు అయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శ్రీవారి ఎస్వీ గోశాలలో గోమాతల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే గోమాతలు చనిపోతున్నాయి. గోశాలలో 191 ఆవులు ఏడాది కాలంలో చనిపోయాయి అంటూ గోశాల అధికారులే స్పష్టం చేయడం తెలిసిందే. అయినా కూడా గోవులు మృతి చెందలేదంటున్న పాలకమండలి వాదిస్తుండడం కొసమెరుపు. -
విజయసాయి సాక్ష్యం చెల్లుబాటు అవుతుందా?
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ(New Liquor Policy) తీసుకురావడం ద్వారా.. విక్రయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. విక్రయాలు ప్రభుత్వం చేతిలోనే ఉండడం వల్ల, బెల్టు షాపులను నూరుశాతం కట్టడి చేయడం అప్పట్లో సాధ్యం అయింది. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయం నుంచి కూడా.. లిక్కర్ అమ్మకాల్లో పెద్ద స్కామ్ జరుగుతున్నట్టుగా దుష్ప్రచారం ప్రారంభించారు. .. దాదాపు 50వేల కోట్ల దాకా స్వాహా పర్వం జరిగినట్టుగా పదేపదే గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చారు. తీరా గద్దె ఎక్కిన తర్వాత.. అన్ని ఆరోపణలు చేసిన లిక్కరు విక్రయాల విషయంలో ఏదో ఒకటిచేయకపోతే పరువు పోతుందనే భయంతో.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 50వేల కోట్ల అవినీతి అనే ఆరోపణల స్థానంలో.. 3వేల కోట్ల అవినీతి జరిగిందని ఆ సిట్ గణాంకాలను తయారుచేసింది. ఇక విచారణలు ప్రారంభించారు. జగన్ మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఆయనను విచారించాలంటే నోటీసులు ఇవ్వడానికి అందుబాటులో లేరని తేల్చారు. ఐటీ సలహాదారుగా అప్పట్లో ఉన్న తనను మద్యం స్కామ్ లో ఎందుకు విచారణకు పిలుస్తారంటూ ఆయన ఇచ్చిన మెయిల్ కు జవాబు లేదు. ఈలోగా.. వైఎస్సార్సీపీ రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy)ని సాక్ష్యంగా విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో.. అసలు విజయసాయిరెడ్డి సాక్ష్యం చెప్పడానికి ఏ రకంగా అర్హుడు? ఆయన సాక్ష్యానికి చట్టబద్ధత ఉంటుందా? చెల్లుబాటు అవుతుందా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. సాధారణంగా ఒక కుంభకోణం(Scam) జరిగిందని ప్రభుత్వం భావిస్తే దానితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారినే విచారణకు పిలవాలి. ఎవరైతే నేరం చేశారని అనుకుంటున్నారో వారిని విచారించడానికి నోటీసులు ఇచ్చే తరహాలోనే.. దానితో సంబంధం ఉందనిపించిన వారిని సాక్షిగా పిలిచి ధ్రువీకరించుకోవచ్చు. మద్యం డిస్టిలరీల నుంచి భారీగా సొమ్ములు తీసుకోవడం ద్వారా అవినీతికి పాల్పడ్డారనేది ఇక్కడ ఆరోపణ. మహా అయితే డిస్టిలరీల యజమానులను పిలిచి విచారించడానికి అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని విజయసాయిరెడ్డిని ఏ కారణం చేత సాక్షిగా వివరాలు చెప్పాలని పిలుస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు.విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ(YSRCP)కి రాజీనామా చేశారు. బయటకు వెళ్లిన తర్వాత పార్టీ మీద ఇప్పుడు రకరకాల నిందలు వేస్తున్నారు. ఇటీవల లిక్కర్ స్కామ్ జరిగిందని ఆయన ధ్రువీకరిస్తూ.. ఆ స్కామ్ కు కర్త కర్మ క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఎవరో మూడో వ్యక్తి.. హఠాత్తుగా తెరమీదకు వచ్చి. ‘ఫలానా స్కామ్ లో ఫలానావాళ్లు అవినీతి చేశారు.. నేను చెబుతున్నాను’ అని చెబితే అది చెల్లుబాటు అవుతుందా? ఈ లెక్కన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వెళ్లిన నాయకులు ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరినీ అధికార కూటమి ప్రలోభపెట్టి, బెదిరించి, మభ్యపెట్టి ఏదో ఒక విధంగా.. వైఎస్సార్సీపీ నేతల మీద బనాయించిన రకరకాల కేసుల్లో సాక్షులుగా మార్చేస్తే దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి కదా అనేది పలువురు అభ్యంతరంగా ఉంది. వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చిన వారిని, ఏమాత్రం సంబంధం లేని కేసుల్లో కూడా సాక్షులుగా మార్చేసుకోవడం ఒక సాంప్రదాయంగా మారిందంటే గనుక.. అది అనేక విపరిణామాలకు దారితీస్తుంది. అధికారంలోకి వచ్చిన ప్రతిపార్టీ తమ ప్రత్యర్థుల్ని వేధించడానికి ఒక అడ్డదారిని ఎంచుకున్నట్టుగా అవుతుంది. విజయసాయిరెడ్డి సిట్ ముందు హాజరైనా సరే.. ఎవరిమీదనైనా నిందలు వేయగలరు. కానీ..ఆ సమాచారం తనకు ఎలా తెలిసిందో సహేతుకంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఆయన చెప్పే సాక్ష్యం మూలాలను కూడా నిర్ధారించుకుంటే తప్ప సిట్ పోలీసులు సమర్థంగా వ్యవహరించినట్టు కాదు.. అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.:::ఎం. రాజ్యలక్ష్మి -
దిక్కుమాలిన సర్కారును పడగొట్టం
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము పడగొట్టడం ఎందుకు.. ఐదేళ్ల తర్వాత ప్రజలే తన్ని తరిమేస్తారు. మా పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. ఈ ప్రభుత్వ పనితీరు బాగా లేదంటూ ప్రజలు ఆక్రోశిస్తున్నారు. ఈ సర్కారును ఎత్తి పడేయమని మమ్మల్ని అడుగుతున్నారు. కొందరు చందాలు వేసుకొనిసర్కారును కూలగొట్టమని అడుగుతున్నారని మాత్రమే మా ఎమ్మెల్యే చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్ అనే విషయం ప్రజలకు తెలియాలి. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలి. అలా అయితేనే మరో 20 ఏళ్ల వరకు ఎవరూ కాంగ్రెస్‌కు ఓటు వేయరు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.తెలంగాణభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘రేవంత్‌రెడ్డి చేస్తున్న లుచ్చా పనులకు ప్రజలే బుద్ధి చెబుతారు. అవసరమైతే ప్రజలే రోడ్డు మీదకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. మా పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. వాళ్ల బతుకు అధ్వానంగా ఉంది’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆత్మాభిమానం ఉంటే రాజీనామా చేయాలి‘కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆత్మాభిమానం లేని సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని విమర్శలు వచ్చినా రాజీనామా చేయకుండా దులుపుకొని బతుకుతున్నాడు. ఏడాది క్రితం రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించిన ప్రధాని మోదీ ఇప్పుడు మేల్కొని హెచ్‌సీయూ భూముల్లో కాంగ్రెస్ పర్యావరణ విధ్వంసం చేసిందని ఆరోపించారు.సెంట్రల్ ఎంపవర్ కమిటీ (సీఈసీ) నివేదిక ఇచ్చినా మోదీ ప్రభుత్వం స్పందించి ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు. బీజేపీకి తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో పర్యావరణ విధ్వంసంపై విచారణకు ఆదేశించాలి. లేదా ఆర్బీఐ, సీవీసీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలకు అయినా దర్యాప్తు బాధ్యతలు ఇవ్వాలి’అని కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం అరాచకం‘సీబీఐని గతంలో కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తే.. ప్రస్తుతం బీజేపీ ఈడీని విచ్చలవిడిగా వాడుతోంది. కంచ గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీ ఉద్దేశాల మీద తమకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. చెరువులను కూడా తాకట్టుపెట్టిన వైనం బయట పెట్టింది. అయినా రేవంత్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు మోదీ ఆరాటపడుతున్నాడు.కేంద్రం స్పందించకుంటే ఈ నెల 27 తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలను కలిసి ఆధారాలు అందజేయడంతోపాటు బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఆర్థిక దోపిడీ, పర్యావరణ విధ్వంసంపై మోదీ స్పందించకుంటే ఆయనకు వాటా ఉందని అనుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో కంటే క్షేత్ర స్థాయిలోనే రేవంత్ ప్రభుత్వంపై ఎక్కువ వ్యతిరేకత ఉంది’అని కేటీఆర్ చెప్పారు. -
‘ముస్లింలు మీటింగ్‌కు టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?’
సాక్షి, కృష్ణాజిల్లా: వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ కాసిం అబూ ఇంటిపై గత అర్ధరాత్రి టీడీపీ రౌడీలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అబూ ఇంటి అద్దాలను టీడీపీ నేతలు పగలగొట్టారు. పార్టీ నేతల ద్వారా విషయం తెలుసుకున్న ఆ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని.. అబూ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధ్వంసమైన ఫర్నిచర్‌ను ఆయన పరిశీలించారు. టీడీపీకి చెందిన కొందరు తమ ఇంటి వద్ద భయాందోళన సృష్టిస్తున్నారంటూ పేర్ని నాని వద్ద అబూ తల్లి బేగం ఆవేదన వ్యక్తం చేశారు.అబూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ పేర్ని నాని, వైఎస్సార్సీపీ శ్రేణులు భరోసా ఇచ్చారు. టీడీపీ నేత కడియాల గణేష్, మరికొందరు అర్ధరాత్రుళ్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ అబూ ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ నేత ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గుడివాడ డీఎస్పీకి పేర్ని నాని, వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోకుంటే, ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామంటూ పేర్ని నాని హెచ్చరించారు.గుడివాడలో రౌడీ రాజ్యం: పేర్ని నానివక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేంగా సమావేశం పెట్టడానికి వీల్లేదని అబూని టీడీపీ నేత కడియాల గణేష్ హెచ్చరించాడు. నా ఆదేశాలు ఖాతరు చేయకుండా మీటింగ్ పెడితే నీ అంతుచూస్తానని బెదిరించాడు. గణేష్ హెచ్చరించినా అబూ మీటింగ్‌కు హాజరయ్యారు. ముస్లింలు సమావేశం పెట్టినందుకు ఓ ఎస్ఐ వచ్చి కమ్యూనిటీ హాల్‌కు తాళం వేశారు. పోలీసు యూనిఫామ్ వేసుకుని కొందరు అధికారులు వ్యవస్థలను దిగజారుస్తున్నారు. ఇలాంటి పోలీసులను జిల్లా ఎస్పీ, డిజిపి అదుపులో పెట్టుకోవాలిపదిమంది ముస్లింలు కలిసి మీటింగ్ పెట్టుకోకూడదని ఏమైనా చట్టం ఉందా?. ముస్లింలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?. కమ్యూనిటీ హాల్‌కు తాళం వేయడంతో రోడ్డుమీదే ముస్లింలు మీటింగ్ పెట్టుకున్నారు. గత రాత్రి అబూ ఇంటిపై టీడీపీ రౌడీలు దాడి చేశారు. ఐరన్ రాడ్లతో అబూ ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. అబూను చంపేస్తామని టీడీపీ రౌడీలు బెదిరించారు. గుడివాడలో రౌడీ రాజ్యం నడుస్తోంది.. ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేదు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశాం. -
‘టీడీపీ స్వార్థ రాజకీయాలు ముస్లిం సమాజం గమనిస్తోంది’
సాక్షి, కర్నూలు: ‘వక్ఫ్ సవరణ చట్టం-2025’పై సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలను స్వాగతిస్తున్నామని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.హఫీజ్ ఖాన్ అన్నారు. గురువారం ఆయన కర్నూలు రాయల్ ఫంక్షన్ హాల్లో మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టంపై దేశసర్వోన్నత న్యాయస్థానం ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ముస్లిం, మైనార్టీలను అన్యాయం చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇప్పటికైనా ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ముస్లిం, మైనార్టీల పక్షాన నిలబడాలని హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. హఫీజ్ ఖన్ ఇంకా ఏం మాట్లాడారంటే..వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై దేశసర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరడం మనం చూశాం. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలపడం, వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. ఇది మా ముస్లిం సమాజానికి గొప్ప రిలీఫ్.రాజ్యాంగం మాకు కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్దంగా కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దశలోనూ అడ్డుకుంది. దీనిపై సుప్రీంలో తప్పకుండా మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని మేం బలంగా నమ్ముతున్నాం. ఈ కేసులో సీజేఐ లేవనెత్తిన అంశాలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. వక్ఫ్ ఆస్తుల విషయంలో సీజేఐ గారు సొలిసిటర్ జనరల్‌ను అడిగిన ప్రశ్నలే మేం ముందు నుంచి అడిగాం. ప్రభుత్వానికి సుప్రిం ఇచ్చిన నిర్ణీత గడువులో వారు సమాధానం ఇవ్వాలి. మా ముస్లింల తరుపున పోరాడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.టీడీపీ మాత్రం స్వార్ధ రాజకీయాలు చేసి తడిగుడ్డతో మా ముస్లిం, మైనార్టీల గొంతు కోసింది. వీరి స్వార్థ రాజకీయాలు ముస్లిం సమాజం గమనిస్తోంది. కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక్క ఏపీలోనే కాదు దేశంలోని ముస్లింలు అంతా కూడా చంద్రబాబు, నితీష్‌కుమార్‌ల వైపు చూశారు, మా హక్కులు అణగదొక్కుతుంటే మా వైపు నిలవకుండా వీరిద్దరూ మైనార్టీల పక్షాన నిలవకుండా బీజేపీ అజెండాను దేశమంతా అమలుచేయడానికి పూర్తిగా సహకరించారు, ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి, మీపై బాధ్యత ఉంది, మీరు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ముస్లిం, మైనార్టీల పక్షాన నిలబడాలని డిమాండ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా వైఎస్సార్సీపీ ప్రతి అడుగులో కూడా ముస్లిం సోదరుల వెంట నడుస్తుంది, వారి తరపున పోరాడుతుందని హఫీజ్ ఖాన్ చెప్పారు. -
‘మోదీకి రాహుల్ గాంధీ భయపడతారా?’
హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను ఈడీ తన చార్జిషీట్ లో నమోదు చేయడాన్ని టీపీసీసీ వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా నగరంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కేసులకు భయపడతారా?, దేశం కోసం త్యాగం చేసిన వారి రక్తం రాహుల్ గాంధీలో పారుతోంది. కేసులు పెడతా.. జైల్లో పెడతా అంటే స్వతంత్ర ఉద్యమంలో నెహ్రా తలొగ్గలేదు. బ్రిటీష్ వాళ్లకే గాంధీ కుటుంబం భయపడలేదు. మోదీకి రాహుల్ గాంధీ భయపడతారా?, అఫ్ట్రాల్ బీజేపీకి రాహుల్ గాంధీ భయపడరు. కుట్రలో బాగంగా రాహుల్ గాంధీపై కేసు. బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తుంది పార్టీ. ఈవీఎంలతో ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతోంది. గుజరాత్లో మోదీకి రాహుల్ గాంధీ సవాల్ చేయడంతో కేసులు బనాయిస్తున్నారు’ అని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై సమీక్షంతకుముందు పుప్పలగూడ పరిసరాల్లో 400 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరిశ్రమలు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
‘చెప్పేవి గొప్ప మాటలు.. చేసేది మాత్రం శూన్యం’
విశాఖ : ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ పెద్దలు చెప్పేవి గొప్ప మాటలని, చేసేది మాత్రం శూన్యమన్నారు బొత్స. ‘రాష్ట్ర ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేదు. పెట్టుబడులో రావాలంటే మేమే అని అంటారు. ప్రభుత్వ ఉద్దేశంలో పరిశ్రమలను ప్రోత్సాహించడం అంటే పొగపెట్టడమే. కడపలో యాష్ కోసం కూటమి నేతల గొడవలు ప్రజలు చూశారు. ఇదొక్కటే కాదు.. కృష్ణపట్నం పోర్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో ఇదే జరిగింది. ఎచ్చెర్ల లిక్కర్ ఫ్యాక్టరీ వద్ద కూడా కూటమి నేతలు డబ్బులు వసూలు చేశారు. జిందాల్ పరిశ్రమపై కేసులు పెట్టి వేదిస్తే ఆ కంపెనీ గుజరాత్ కు వెళ్ళిపోయింది. పరిశ్రమలను ఇబ్బంది పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పరిస్థితి ఇలా ఉంటే పరిశ్రమలు ఎలా వస్తాయి. విద్యుత్ చార్జీలు పెంచి ఆ నెపాన్ని వైఎస్సార్ సీపీ నేతలపై నెడుతున్నారు. మిర్చి రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పింది. ఒక్క టన్ను మిర్చి అయినా ప్రభుత్వం కొన్నదా?, రాష్ట్రంలో ఏ రైతుకి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తున్నారు..? , పొగాకు రైతులకు ఏమైనా మేలు చేశారా..? , ఒకవైపు పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి.. మరోవైపు కార్మికులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లించడం లేదు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, దౌర్జన్యాలు చేస్తుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని జులుం చేస్తుంది. ఈ ప్రభుత్వ అలసత్వం, నిర్వాకం వలన రాబోయే తరానికి ముప్పు వాటిల్లుతుంది. ఇంత అప్పు గతంలో ఎప్పుడూ లేదు.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత అప్పులు లేవు. ఏ శాఖలో కూడా జవాబుదారీ తనం లేదు.ఏ మంత్రి అయినా నా శాఖలో ఇంత కచ్చితత్వం ఉందని ఎవరైనా చెప్పగలరా..? , కొత్త పెన్షన్లు రాష్ట్రంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. పేద పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్ మెంట్ కూడా లేదు. విద్య, వైద్యం రాష్ట్రంలో లేవు. ఏ శాఖలో కూడా నిర్ధిష్టమైన విధానం లేదు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ఈరోజుకి కూడా అలానే ఉంధి. ప్రభుత్వం అసలు ఆలోచన కూడా చెయ్యడం లేదు. సంవత్సరం సమయం ఇచ్చారు ఈ ప్రభుత్వానికి ఇంకేం కావాలి. ధీటుగా ఎదుర్కోవాలి అని చంద్రబాబు మంత్రులకు చెప్పారు. ఏముందని.. ఏం చేశారని ధీటుగా ఎదుర్కొంటారు. పరిశ్రమలను ఇబ్బంది పెడుతున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. పెండింగ్ అర్జీ దారులకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారు’ అని బొత్స నిలదీశారు. -
‘వారిని సోషల్ బాయ్ కాట్ చేయాలి’
హైదరాబాద్: కేటీఆర్, హరీష్ రావు, కవితలను సోషల్ బాయ్ కాట్ చేయాలని అంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. 14 నెలల నుంచి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని వీరు చేయలేదని, అందుచేత ఆ ముగ్గుర్ని సోషల్ బాయ్ కాట్ చేయాలని రఘునందన్ రావు సూచించారు. ఈరోజు(గురువారం) మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రఘునందన్ రావు.. ‘ కేటీఆర్, హరీష్ రావు, కవితలు 14 నెలల నుంచి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనీ చేయలేదు. గతంలో కేంద్రం కొండా బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే తెల్లారే భూమి, యునివర్సిటీ పేరు మారింది. కేసీఆర్ గవర్నమెంట్ రాగానే ఎందుకు HCU భూములు బదలాయించలేదు.2012 నాటి జిల్లా కలెక్టర్ CCLA కు రాసిన లేఖ ఆధారంగా బదలాయించాలి. ఆనాడు వారి అవసరాలకు అనుగుణంగా దాన్ని పక్కన పెట్టిన కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నో డాక్యుమెంట్స్ సేకరించి CEC సాధికారత కమిటీకి అందజేశా. సాధికారత కమిటీ చైర్మన్ సుప్రీంకోర్టు ముందు నన్ను వాదనలు వినిపిస్తారా అని అడిగారు. మేము రిఫర్ చేస్తాం వచ్చి వాదనలు వినిపించాలి అన్నారు. అవసరమైనప్పుడు పిలిస్తే వస్తా అని చెప్పా. HCU భూములు అంటూ ఆనాడు ప్రభుత్వం తెలుగులో రాసిన పంచనామా ఉంది. HCU భూములు కానప్పుడు ఆనాటి ప్రభుత్వం ఎందుకు పంచనామా చేసింది. గోపనపల్లిలో కేటాయించిన స్థలంలో వేర్వేరు సంస్థలు వచ్చాయి. ఇష్టారీతిన అమ్మాలని ప్రభుత్వం చూసింది. HCU భూములపై ఫైట్ చేసింది బీజేపీ’ అని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. -
చంద్రబాబు అంటేనే దోచుకోవడం: ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు హయాంలో వెలుగులు అనేవే ఉండవని.. ఆయన పేరు వినగానే గుర్రాలతో తొక్కించటం, తుపాకులతో కాల్చడం వంటివి గుర్తొస్తాయంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పది నెలల్లోనే ట్రూఅప్ ఛార్జీల పేరుతో జనాన్ని పీడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన దోచుకుంటుందని ధ్వజమెత్తారు.‘‘సర్దుబాటు ఛార్జీలు, టైం ఆఫ్ ది డే పేరుతో కొత్తరకం దోపిడీ మొదలు పెట్టారు. ప్రతి యూనిట్‌కి రూ.40 పైసలు చొప్పున పెంచి దోచుకుంటున్నారు. రూ. 4 వేల కోట్లు ఈ కొత్త రూపంలో వసూలు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజల మీద భారం లేకుండా చేశారు. చంద్రబాబు వచ్చాక వీర బాదుడు బాదుతున్నారు. కరెంటు వాడుకునేది తక్కువ, బిల్లుల మోత ఎక్కువగా ఉంది. అదనపు ఛార్జీలపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’’ అని అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. -
‘జీవీఎంసీ మేయర్ పీఠంపై కూటమి కుట్రలు’
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసం తీర్మానంపై జరిగే ఓటింగ్‌లో పారదర్శకత పాటించాలని వైఎస్సార్సీపీ బృందం కలెక్టర్‌ను కోరింది. కూటమి ప్రలోభాలతో మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. జీవీఎంసీ పరిసరాల్లోకి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో తప్ప ఇతరులకు అనుమతి ఇవొద్దని కలెక్టర్‌ను వైఎస్సార్సీపీ నేతలు కోరారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసం ఇచ్చిన నేపథ్యంలో అనేక అనుమానాలు ఉన్నాయని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఓటింగ్ జరిగే సమయంలో మీడియాను అనుమతించాలని కలెక్టర్‌ను కోరాం. ఓటింగ్ రోజు సభ్యులను తప్ప మిగతా వారిని అనుమతించకూడదు. అవిశ్వాసం తీర్మానం వీగిపోడానికి కావాల్సిన బలం మాకు ఉంది’’ అని ఆయన చెప్పారు.‘‘విప్ జారీ చేసేందుకు మా పార్టీ అధ్యక్షుడు నిర్ణయించారు. రేపు మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ విప్ జారీ చేస్తారు. విప్ ప్రకారం మా సభ్యులు నడుచుకోవాలి. విప్‌కు వ్యతిరేకంగా వ్యవహారిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే ఆదినారాయణ అరాచకం.. కలెక్టర్‌ను ఆశ్రయించిన అల్ట్రాటెక్
సాక్షి, వైఎస్సార్: జమ్మలమడుగులో పారిశ్రామికవేత్తలపై కూటమి నేతల అరాచకం మరింత పెరిగింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరుల దాదాగిరి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి అరాచకంపై జిల్లా కలెక్టర్‌కు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.వివరాల ప్రకారం.. జమ్మలమడుగులో అన్ని కాంట్రాక్టులు తమకే కావాలంటూ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి కూటమి నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరుల దాదాగిరి చేస్తున్నారు. ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రతీ ఒక్క కాంట్రాక్టూ తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో, ఇప్పటికే కాంట్రాక్టు నిర్వహిస్తున్న వారిని బయటకు పంపలేమని యాజమాన్యం స్పష్టం చేసింది. ఎమ్మెల్యే ఒత్తిడితో కొన్ని కాంట్రాక్టులు ఇచ్చినా ఆదినారాయణరెడ్డి వర్గం శాంతించలేదు. ఫ్యాక్టరీ ముడిసరుకు, సిమెంట్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను అడ్డుకున్నారు.సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సరుకు బయటకు వెళ్లకుండా బస్సులు అడ్డుపెట్టి మరీ అరాచకం సృష్టిస్తున్నారు. దీంతో, ఓ ప్లాంటులో ఉత్పత్తి ఆగిపోగా, మరో ప్లాంటులోనూ ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి అరాచకంపై కంపెనీ యాజమాన్యం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసు భద్రత ఏర్పాటు చేసింది జిల్లా యంత్రాంగం.అయితే, ఫ్యాక్షన్ పోకడలతో పారిశ్రామికవేత్తలను ఆదినారాయణరెడ్డి వేధిస్తున్నారు. మూడు నెలల క్రితం అదానీ పవర్ ప్లాంటుపైకి కూడా ఇదే విధంగాదాడి చేసిన ఆదినారాయణరెడ్డి వర్గం దాడి చేసింది. ఆర్టీపీపీ ఫ్లైయాష్ తరలింపులోనూ అంతా తామే చేయాలని రగడ సృష్టించింది. అప్పట్లో జేసీ వర్గంతో తలపడ్డ ఆదినారాయణరెడ్డి వర్గం.. జేసీ వాహనాలను అడ్డగించిన విషయం తెలిసిందే. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో జిల్లాకు పరిశ్రమలు రాకుండా పోతాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కూటమిలో ట్విస్ట్.. జనసేన కారణంగా టీడీపీ కీలక నేతల రాజీనామా
సాక్షి, తూర్పు గోదావరి: ఏపీలో కూటమి పార్టీ మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, తాజాగా మంత్రి కందుల దుర్గేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ కీలక నేత కొమ్మిన వెంకటేశ్వర రావు రాజీనామా చేశారు. దీంతో, కూటమి పార్టీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. నిడదవోలులో ఎన్డీయే కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కందుల దుర్గేష్ తీరుపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పట్టణ అధ్యక్ష పదవికి కొమ్మిన వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నిడదవోలు జనసేన విధానాలతో విసుగు చెందినట్టు చెప్పుకొచ్చారు. మంత్రి కందుల దుర్గేష్ వ్యవహారంపై వేలివెన్నులో కార్యకర్తల సమావేశంలో టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక, నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకోవడంతో అంతర్యుద్ధం మొదలైనట్టు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.మరోవైపు.. తనకు గుర్తింపు దక్కడం లేదంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను జనసేనలో చేర్చుకోవడంలో ఎలాంటి సమాచారం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, అన్నా క్యాంటీన్ ప్రారంభానికి కూడా ఆహ్వానం అందలేదని అసహనం ప్రదర్శించారు. అధిష్టానం స్పందించకుంటే మరిన్ని రాజీనామాలు ఉంటాయని శేషారావు హెచ్చరించారు. -
రేవంత్.. ఆత్మాభిమానం ఉంటే రాజీనామా చేయ్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి హెచ్‌సీయూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాయని కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది పర్యావరణ ప్రేమికుల విజయం అంటూ వ్యాఖ్యలు చేశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘అధికారం తలకెక్కి, అధికార మదంతో విర్రవీగి చక్రవర్తులం అని భావిస్తే.. న్యాయ వ్యవస్థ ముందు అహంకారం తగ్గక తప్పదు. నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో సీఎం రాజీనామా చేసి పోవాలి. కానీ అక్కడ ఉంది రేవంత్ రెడ్డి. ఆయన అన్ని పట్టించుకోని వ్యక్తి. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇది విద్యార్థుల, అధ్యాపకుల, సపోర్ట్ చేసిన అందరి విజయం’ అని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ టాక్స్ అని , హెచ్‌సీయూలో ఏదో జరుగుతుందని ప్రధాని మోదీ మాట్లాడటం కాదు. సీబీఐ, సీవీసీ, సిట్టింగ్ జడ్జీతో ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సెంట్రల్ కమిటీతో విచారణ చేయాలి. రాహుల్ ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఉంటా అన్నారు. కానీ, ఇక్కడ మాత్రం పత్తా లేడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటానికి బీజేపీ ఆరాటపడుతోంది. భారత ప్రభుత్వం డైలాగులు కొడితే సరిపోదు. గుంట నక్కలు అని డైలాగ్ కొట్టిన ముఖ్యమంత్రికి సుప్రీంకోర్ట్ వాతలు పెట్టింది. కొందరు పోలీస్ అధికారులు కేసులు పెడుతున్నారు వారు కూడా ఊచాలు లెక్కబెట్టాల్సి వస్తుంది. సుప్రీంతీర్పును స్వాగతిస్తున్నాము. రేవంత్ అధికారులను బలి పశువులను చేస్తున్నారు. అంతా మంచి జరిగితే క్రెడిట్ నాది అంటారు రేవంత్. ఏదైనా జరిగితే అధికారులది తప్పు అంటున్నారు.రెండు జాతీయ పార్టీలు ఒకటే. రేవంత్ రెడ్డి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ప్రజల మాటలు వింటే చెవుల నుండి రక్తం కారుతుంది. ప్రజలే తిరగబడి బాంగ్లాదేశ్ లాగా ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే. రేవంత్ రెడ్డి ఈ ఐదేళ్లు సీఎంగా ఉండాలి ఆ తర్వాత వచ్చే 20ఏళ్ళు కాంగ్రెస్‌కు ఒక్కరు కూడా ఓటు వేయరు. రేవంతే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘రేవంత్‌ను నమ్మిన పాపం.. రైతులకు స్మశానమే దిక్కైంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్‌ను నమ్మిన పాపానికి.. రైతులకు స్మశానమే దిక్కయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి రైతులు బతికుండగానే.. ఇలా వల్లకాడుకు చేర్చిన పాపం.. కాంగ్రెస్‌ను వెంటాడటం ఖాయం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..రేవంత్ ను నమ్మిన పాపానికి..రైతులకు స్మశానమే దిక్కయిందిభూముల "అమ్మకాల్లో" బిజీగా ఉన్న సర్కారుధాన్యం "కొనుగోళ్లనే" పూర్తిగా మరిచిపోయింది15 రోజులైనా కొనుగోలు కేంద్రం తెరుచుకోకస్మశానంలో పడుకునే దుస్థితి దుర్మార్గమైనదిఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో..రైతుల మరణమృదంగం మోగుతోంది.చివరికి రైతులు బతికుండగానే.. ఇలా వల్లకాడుకు చేర్చిన పాపం.. కాంగ్రెస్ ను వెంటాడటం ఖాయంజై కిసాన్#CongressFailedTelangana అంటూ ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ ను నమ్మిన పాపానికి..రైతులకు స్మశానమే దిక్కయిందిభూముల "అమ్మకాల్లో" బిజీగా ఉన్న సర్కారుధాన్యం "కొనుగోళ్లనే" పూర్తిగా మరిచిపోయింది15 రోజులైనా కొనుగోలు కేంద్రం తెరుచుకోకస్మశానంలో పడుకునే దుస్థితి దుర్మార్గమైనదిఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో..రైతుల మరణమృదంగం… pic.twitter.com/GnDtWoZOhk— KTR (@KTRBRS) April 17, 2025 -
తిరుపతిలో గోవులన్నీ రిలయన్స్, జీ స్క్వేర్ నుంచి వచ్చాయి: భూమన
గోశాలకు భూమన అప్డేట్స్.. భూమన కామెంట్స్..మమ్మల్ని ఇంట్లోనే నిర్బంధించి కూటమి నేతలను అనుమతించారు.గోశాల సందర్శనకు రావాలని టీడీపీ నేతలే ఛాలెంజ్ విసిరారు.ఛాలెంజ్ విసిరిన వారే నన్ను గోశాలకు రాకుండా అడ్డుకున్నారు.నన్ను ఉదయం నుంచి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.మా పార్టీ నేతలను కూడా ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్ చేశారు.ఉదయం నుంచి నేను కూడా వెయిట్ చేస్తున్నా అని వారికి చెప్పాను.నాకు సవాల్ విసిరిన పల్లా శ్రీనివాస్ తోకముడిచి గోశాల రాలేదు.ఛాలెంజ్ స్వీకరించి భయపడిపోయామని చిత్రీకరించే ప్రయత్నం చేశారు.టీడీపీ ఎమ్మెల్యేలు నాకు ఫోన్ చేసి గోశాలకు రమ్మన్నారు.నేను మరోసారి గోశాలకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు.మమ్మల్ని బయటకు రానివ్వకపోగా తోసేశారు.కూటమి నేతల కుట్ర మీడియా సాక్షిగా బట్టబయలైంది.టీటీడీని ప్రక్షాళన చేస్తామన్న కూటమి సర్కార్ హామీ ఏమైంది?.170 గోవులు ఎందుకు మృత్యువాతపడ్డాయి.2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 176 ఆవులు మరణించాయని అధికారులే చెబుతున్నారు.గోవుల మృతిపై ఈవో, చైర్మన్, ఎమ్మెల్యే వ్యాఖ్యలకు పొంతన లేదు.గోశాలకు వెళ్ళేందుకు అనుమతి నిరాకరించారుగోశాలకు వెళ్ళకుండా అడ్డగించారుజిల్లా ఎస్పీ అధికారితో కూడా అబద్ధాలు మాట్లాడిస్తున్నారుగోశాలకు ఐదు మందిని అనుమతిస్తే ఎప్పుడూ అయినా మేము వెళ్లేందుకు సిద్ధం,గోశాలకు రేపు అయిన, ఎల్లుండి అయినా వచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాంగత ఏప్రిల్ నెల నుంచి ఏడాది మార్చి వరకూ 191 ఆవులు చనిపోయాయి అని గోశాల మేనేజర్ అధికారికంగా ఇచ్చారుప్రక్షాళన చేస్తామని చెప్పిన చంద్రబాబు ఈ పది నెలలు చేసిన ప్రక్షాళన ఇదేనామీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ నెల నుంచి మార్చి నెలవరకు 170 ఆవులు చనిపోయాయి అని అధికారికంగా ప్రకటించారు550 గోవులను రాజస్థాన్, పంజాబ్ నుంచి కొనుగోలు చేశారుటీవీ9 అధినేత రామేశ్వర రావు, రిలయన్స్ సంస్థ, జీ స్క్వేర్ సంస్థ ప్రతినిధులు దాతలుగా 550 ఆవులు కొనుగోలు చేసిటీటీడీ గోశాలకు గోవులు విరాళంగా ఇచ్చారుఇవన్నీ మా ప్రభుత్వ పాలనలో ఈవో జవహర్ రెడ్డి పాలనలో చేశాం, ఇది మా గొప్పతనంబైలోన మెథడ్ ద్వారా పెరుగును చిలకడం ద్వారా వెన్నను వెలికి తీసే పద్ధతి ప్రవేశ పెట్టాం, నవనీత సేవ ప్రవేశ పెట్టాంమీ పాలనలో ఆచారాలకు భిన్నంగా అరాచకాలు జరుగుతున్నాయితిరుమలలో శివ అనే డ్రైవర్ ను హత్య చేశారు70 ఏళ్ల తర్వాత తిరుమలలో హత్య జరిగింది,చెప్పులు వేసుకుని మహాద్వారం వద్ద పట్టుబడ్డారుగోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డి అక్రమాలకు పాల్పడినప్పుడు మీ పాలనలో 8 నెలలు ఎందుకు కొనసాగించారుతొక్కిసలాట ఘటన లో ఎందుకు సస్పెండ్ చేశారుగోశాలలో గోవుల మరణాలను వాస్తవాలు పక్కదారి పట్టిస్తున్నారుమీ ఎల్లో మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారుదైవం కోసం జైలుకు వెళ్తాం, ప్రాణాలు అయినా అర్పిస్తాంసీఎం చంద్రబాబు నాయుడు ఒక్క ఆవు చనిపోలేదు అని ప్రకటన చేశారుపుట్టుకతోనే వృద్ధ ఆవులు అంటున్నారు టీటీడీ చైర్మన్మా పాలనలో రెండేళ్ల వయస్సు ఉన్న 550 గోవులు సాహివాల్ దాతలు సహాయంతో తీసుకు వచ్చాము,చంద్రబాబు పాలనలో స్పందన, ఉలుకు పలుకు లేదు, గృహ నిర్భందంహిందూ సమాజం అంతా ఈ వాస్తవాలు గ్రహించాలిఈ మూడు నెలల్లో తిరుమల వేదికగా ఎన్నో అరాచకాలు జరిగాయిఅజ్ఞానం తలకు ఎక్కిన వాళ్ళు సమాధానం చెప్తున్నారు,ఎవరి అజ్ఞానం వారి సొంత ఆస్తిస్వామి వారి అనుగ్రహం ఉంది కాబట్టే నేను మూడు సార్లు టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్నా.గర్భంతో ఉన్న సాహివాల్ ఆవు రైలు ఢీకొని మృతి చెందితే దాన్ని కప్పి పుచ్చేదుంకు ప్రయత్నం చేశారుచనిపోయిన ఆవు చెవుకు ఉన్న ట్యాగ్ కోసేశారు, వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత గోశాల ఆవు అని అంగీకరించారుస్వామి ఊరేగింపులో పాల్గొనే వృషభం కూడా చనిపోయింది, తిరుమల లో పూజలు అందుకునే ఆవు కూడా చనిపోయిందిఫొటోలు మార్పింగ్ కాదు.. ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామాగోశాలకు మరోసారి రమ్మని పిలిచి తోకముడిచిన టీడీపీభూమనకు ఫోన్ చేసి గోశాలకు రావాలన్న టీడీపీ ఎమ్మెల్యేలు.భూమనకు పులివర్తి నాని, సుధీర్‌రెడ్డి, శ్రీనివాసులు ఫోన్.ఇటు ఫోన్లో రమ్మని.. అటు అడ్డుకోవడానికి పోలీసులను పంపిన ఎమ్మెల్యేలు.మీడియా ముందు డ్రామాలడి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలు.టీడీపీ నేతలకు జవాబు చెప్పడానికి మళ్లీ బయలుదేరిన భూమన.ఇంటి దగ్గరే భూమనను నిర్బంధించిన పోలీసులు.గోశాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి.వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తిని లాక్కుపోయిన పోలీసులుగోశాల గేటు వద్ద అభినయ్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.మీడియా సాక్షిగా బట్టబయలైన టీడీపీ ఎమ్మెల్యేల బండారం.అభినయ్ రెడ్డి కామెంట్స్..సవాల్ స్వీకరిస్తే అడ్డుకోవడమేంటి?.కూటమి నేతలు భూమనకు ఫోన్ చేసి రమ్మంటారు.అక్కడ పోలీసులు అడ్డుకుంటారు.. ఇదేనా పద్దతి.ఎస్కార్ట్‌తో భూమనను గోశాల వద్దకు తీసుకురావాలి. తిరుపతిలో మరోసారి ఉద్రిక్తత..ఎంపీ గుర్తుమూర్తి కామెంట్స్..గోశాలకు రాకుండా భూమనను అడ్డుకున్నారు.వేరే దారిలో నేను గోశాలకు వచ్చాను.నిజాన్ని నిరూపించడానికి మేము సిద్ధం. ఉద్రిక్తత..కూటమి నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారు.ఒకవైపు.. పోలీసులతో నిర్బంధించిన కూటమి నేతలుమరోవైపు భూమనకు ఫోన్లు చేస్తున్న కూటమి నేతలు.గోశాలకు రావాలంటూ భూమనకు కూటమి నేతల ఫోన్లు.గోశాలకు బయలుదేరిన భూమనను అడ్డుకున్న పోలీసులు.గోశాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నాయకులు భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్లాకు భూమన ఫోన్ కాల్..టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు భూమన ఫోన్‌మీరు ఎక్కడున్నారు.. మీ సవాల్‌కు ిసిద్ధమన్న భూమనగోశాలలో గోవుల మరణాలు నిగ్గు తేల్చేందుకు నేను సిద్ధం.మీరు ఎక్కుడున్నారని పల్లాను ప్రశ్నించిన భూమనఈ క్రమంలో భూమన కాల్ కట్ చేసిన పల్లా. మాజీ మంత్రి ఆర్కే రోజా కామెంట్స్..టీడీపీ నేతల సవాల్‌కు భూమన సిద్ధమయ్యారుగోశాల వద్దకు అనుమతించే ధైర్యం టీడీపీకి ఉందా?.సవాల్ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంత వరకు కరెక్ట్?.కూటమి ప్రభుత్వంలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.కొండపై డ్రైవర్‌ను కొట్టి చంపితే విజిలెన్స్ ఏం చేస్తోంది?.శ్రీవారి ఆలయంపై డ్రోన్లు తిరుగుతుంటే ఏం చేస్తున్నారు?.క్యూలైన్లో తొక్కిసలాటపై ఒక్క అరెస్ట్ జరిగిందా?.సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్ కల్యాణ్?.భూమన కామెంట్స్..టీడీపీ నేత చాలెంజ్‌పైనే నేను స్పందించాను.గోశాలకు రావాలని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ పిలిచారు.పోలీసు బలగాలతో నిర్బంధించడం దారుణం.గోవుల మృతిపై కూటమి నేతలు తలోమాట మాట్లాడుతున్నారు.గోశాల వద్ద ఘోరాలను వెలికితీస్తామని భయం పట్టుకుంది.నన్ను రమ్మన్న వాళ్లే ఇలా నిర్బంధించడం ఎంత వరకు కరెక్ట్?.టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతిస్తే ఏం ఉపయోగం?. తిరుపతి..👉గోశాలకు బయలుదేరిన భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి, వైఎస్సార్సీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు 👉పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్న భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి👉పద్మావతి పురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్న ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి👉తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు.👉భూమన అభినయ రెడ్డి కామెంట్స్..భూమన ఒక్కరైనా గోశాలకు వెళ్తారు.తిరుమల శ్రీవారి ప్రతిష్టను కాపాడాలి.కూటమి సర్కార్ సవాల్‌ను మేము స్వీకరిస్తే ఎందుకు అనుమతించడం లేదు?.👉కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా తిరుపతి నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద తిరుచానూరు పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. భూమనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హౌస్ అరెస్ట్ చేశారు.👉వివరాల ప్రకారం.. తిరుపతి నగరంలో ఉద్రిక్తత నెలకొంది. గోశాల గోవుల మృతిపై కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోంది. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని భూమనకు టీడీపీ సవాల్ చేసింది. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని వ్యాఖ్యానించింది. దీంతో, టీడీపీ ఛాలెంజ్‌ను భూమన కరుణాకర్‌రెడ్డి స్వీకరించారు. ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన తెలిపారు. ఈ క్రమంలో భూమనతో పాటు, తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.👉మరోవైపు.. భూమన హౌస్ అరెస్ట్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు మాట్లాడారు. ఈ క్రమంలో భూమన కరుణాకరరెడ్డి రెడ్డి ఒక్కరినే గోశాలకు అనుమతిస్తామని హుకుం జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గోశాలకు వెళ్ళాలని సూచించారు. 👉ఇదిలా ఉండగా.. అంతకుముందు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ను భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు అని భూమన మండిపడ్డారు.👉కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటిళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్ కెమెరాల హల్చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్ హోటల్ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు. -
ముస్లింలకు చంద్రబాబు ద్రోహం: సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా, ఏప్రిల్ 11: బీజేపీ ఇచ్చే కొద్దిపాటి అధికారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు మనసు చంపుకొన్నారని.. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు పలికారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో పాటు వక్ఫ్ బిల్లుకు మద్దతు పలికిన బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌పైనా మమత నిప్పులు చెరిగారు. వీరిద్దరూ ముస్లింలకు ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. కోల్‌కతాలో బుధవారం ముస్లిం పెద్దల సమావేశంలో మమతా మాట్లాడారు. ఎన్డీఏ కూటమికి కీలక మద్దతుదారులైన చంద్రబాబు, నీతీశ్ కారణంగానే వక్ఫ్ బిల్లు పార్లమెంటులో గట్టెక్కిందని అన్నారు. ఇప్పుడు మాత్రం వారిద్దరూ నోరు మెదపకుండా కూర్చుకున్నారని మండిపడ్డారు. బీజేపీకి పార్లమెంటులో సొంతంగా మెజారిటీ లేకున్నా ఇలాంటివన్నీ చేస్తోందన్నారు. ముస్లింలను అధికారం కోసం వాడుకున్నారని ఆరోపించారు. నమ్మి ఓట్లు వేసినవారి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. వక్ఫ్ చట్టాన్ని సవరించాలంటే రాజ్యాంగాన్ని సవరించాలని, కానీ, అదేమీ లేకుండా సాధారణ మెజారిటీతో పార్లమెంటులో ఆమోదం పొందిందని మమతా పేర్కొన్నారు.వక్ఫ్ చట్టం సవరణకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
మంత్రి జూపల్లి Vs ఎమ్మెల్యే వేముల: కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రచ్చ రచ్చ
సాక్షి, నిజామాబాద్ జిల్లా: భీంగల్ మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ విషయంలో వివాదం తలెత్తింది. తులం బంగారం ఎక్కడంటూ ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. మంత్రి జూపల్లి గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారు. మంత్రి కాన్వాయ్‌కు అడ్డు తగిలి తులం బంగారం ఎప్పుడు ఇస్తారు రాహుల్ గాంధీ' అనే క్యాప్షన్ ఉన్న ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రదర్శించారు. దీంతో మంత్రి జూపల్లి అసహనం వ్యక్తం చేశారు. -
మంత్రి గారి ‘ఇగో’ హర్టయ్యింది.. అడవికి డాక్టర్ ట్రాన్స్ఫర్?!
లక్నో: ఆయనో రాష్ట్ర మంత్రి. స్థానిక ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ సమయంలో సదరు ఆస్పత్రిలో విధులు నిర్వహించే ఓ దివ్యాంగ వైద్యాదికారి తనకి సరిగ్గా రాచమర్యాదలు చేయలేదని ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలాంటి వాళ్లని ఈ ఆస్పత్రిలో ఎందుకు బాధ్యతలు అప్పగించారో. నియోజకవర్గంలో కాకుండా అడవుల్లో పోస్టింగ్ ఇవ్వండి అంటూ హుకుం జారీ చేశారు. మంత్రి, డాక్టర్ మధ్య జరిగిన ఘటనపై దుమారం చెలరేగింది.ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చి తనకు స్వాగతం పలకలేదని ఆగ్రహించిన ఆ రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి సంజీవ్ గోండ్.. శారీరక వైకల్యం ఉన్న వైద్యాధికారి డాక్టర్ రవి సింగ్‌ను తక్షణమే తన నియోజకవర్గం నుండి బదిలీ చేయాలని ఆదేశించారు.‘ఇతనిని అడవికి పంపించండి.. ఇలాంటి వారిని ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారు?’ అంటూ వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. ప్రస్తుతం,ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన సోనభద్ర జిల్లా ఒబ్రా నియోజకవర్గంలోని దిబుల్గంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగింది. మంత్రి అక్కడ సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడానికి వచ్చారు. మంత్రి వచ్చే సమయంలో వైద్యాధికారి డాక్టర్ రవి సింగ్ ఓ రోగికి చికిత్స చేస్తున్నారు. మంత్రికి స్వాగతం పలికేందుకు వెళ్లలేకపోయారు. దీనిపై మంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయనను బదిలీ చేయాలని జిల్లా వైద్యాధికారికి ఫోన్లో ఆదేశించారు.ఆ వీడియోలో ‘ఇతనికి ప్రవర్తించటం రాదు. రోగుల పట్ల కూడా ఇదే విధంగా ఉంటారేమో. ఇతనిని అడవికి పంపించండి’ అంటూ ఫోన్ సంభాషించడం మనం గమనించవచ్చు. డాక్టర్ సింగ్ మాత్రం ‘నేను మీ వద్దకు వచ్చాను సార్. రోగికి చికిత్స చేసి వచ్చే సరికి ఆలస్యమైంది అని బదులిచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడంతో మంత్రి సంజీవ్ గోండ్ వెనక్కి తగ్గారు. తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. వైద్యుడు నన్ను ఆహ్వానించేందుకు రాలేదంటే బహుశా ఆయనకు నేను వస్తున్నాను అన్న విషయం తెలియకపోయి ఉండొచ్చు. అయితే,ఆసుపత్రిలో సదుపాయాలు బాగుండాలి. వైద్యం కోసం వచ్చే పేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదంటూ ఆదేశించారు. వారికి ఏదైనా కష్టం కలగిందంటే నేను ఉపేక్షించను అని వ్యాఖ్యానించారు. मंत्री जी की ये कैसी हेकड़ी! डॉक्टर ने नहीं किया 'स्वागत' तो भड़क गए राज्यमंत्री संजीव गोंड, CMO में फोन लगाकर की डॉक्टर की शिकायत, कहा- इनको जंगल में भेजिए #UttarPradesh | #ViralVideo | #Hospital pic.twitter.com/HJzftzlbxB— NDTV India (@ndtvindia) April 16, 2025 -
‘రేపు గోశాలలో కలుద్దాం’.. పల్లా సవాల్‌ను స్వీకరించిన భూమన
సాక్షి, తిరుపతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ను వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు ఎస్వీ గోశాల వద్దకు వస్తున్నా, అక్కడ కలుద్దాం’’ అంటూ భూమన ప్రతిసవాల్ విసిరారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. రేపు రండి.. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు’’ అని భూమన మండిపడ్డారు.కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటి ళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్ కెమెరాల హల్చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్ హోటల్ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు. -
గంటాతో కూటమికి తలనొప్పులు.. పిలిచి మరీ క్లాస్ పీకిన అధిష్టానం
రాష్ట్రంలో తెలుగుదేశం..కాంగ్రెస్.. ఎవరు అధికారంలో ఉన్నా మంత్రిగా హోదా నిలబెట్టుకునే స్థాయి నాయకుడైన గంటా శ్రీనివాస్‌కు ఇప్పుడు వట్టి ఎమ్మెల్యేగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. గతంలో మంత్రి హోదాలో కలెక్టర్లు.పెద్ద పెద్ద అధికారులతో హడావుడి చేసే గంటా ఇప్పుడు భీమిలి వరకే పరిమితం అవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే తన ఉనికిని చాటుకునేందుకు అప్పుడప్పుడూ అత్యుత్సాహం చూపిస్తున్నారు. అయితే ఈ ఓవర్ యాక్షన్‌ని ప్రభుత్వం..పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయన చర్యలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో చీవాట్లు పెడుతూ.. కాస్త హద్దుల్లో ఉండాలని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.విజయవాడలో మంగళవారం జరిగిన ఓ ముఖ్య సమావేశానికి విశాఖ నుంచి బయల్దేరిన గంటా నేరుగా విజయవాడ వెళ్లాల్సి ఉండగా సదరు విమానం ఆయన్ను ముందుగా హైదరాబాద్ తీసుకెళ్లి..అక్కణ్ణుంచి విజయవాడ డ్రాప్ చేసింది.. ఎందుకూ అంటే విశాఖ నుంచి బెజవాడకు డైరెక్ట్ విమాన సర్వీస్ లేదు.. రద్దు చేశారని తెలిసింది. దీంతో ఉదయం వెళ్లాల్సిన గంటా మధ్యాహ్నానికి విజయవాడ చేరుకున్నారు.దీంతో ఆయన ‘ఆంధ్ర టూ ఆంధ్ర వయా తెలంగాణ’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టు మీద టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని లేనిపక్షంలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మన వారే కదా ఆయనకు చెబితే సరిపోయేది కానీ ఇలా ట్విటర్‌లోకి ఎక్కి రచ్చ చేయాలా అని చీవాట్లు పెట్టింది. సీనియర్ ఎమ్మెల్యే అయినా ఇలా బాధ్యత లేకుండా ఉంటే ఎలా అని అడిగింది.ఇదిలా ఉండగా.. వతిలో 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని గంటా వియ్యంకుడు, పురపాలక మంత్రి నారాయణ ప్రకటన చేసిన తరుణంలోనే రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానమే లేదంటూ గంటా శ్రీనివాసరావు ట్విట్టర్లో సెటైర్ వేశారు. అధికార పార్టీ నాయకుడివైన నువ్వు ప్రభుత్వం పరువు తీయడం ఏమిటని అధిష్టానం ప్రశ్నించింది.వాస్తవానికి గంటా శ్రీనివాస్ గతంలో కూడా ప్రభుత్వానికి ఋషికొండ భవనాల తలుపులు తెరిచి హడావుడి చేశారు. ఫోటోలు విడుదల చేశారు. ఆ సందర్భంలో కూడా ఆయనకు పార్టీ నుంచి అక్షింతలు పడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్.. ప్రభుత్వంలో నంబర్ టూ అయిన లోకేష్..ఇంకా మంత్రులు ఉండగా కేవలం ఒక ఎమ్మెల్యే అయిన మీరు రుషికొండ భవనాలను చూడడానికి ఎందుకు వెళ్ళారు..మీకు అంత అత్యుత్సాహం ఎందుకు అని అప్పట్లోనే టిడిపి పెద్దలు ప్రశ్నించారు. ఇక ఇప్పుడు కూడా ఈ ట్వీట్ దెబ్బతో చీవాట్లు పడ్డాయి. మొత్తానికి గంటాకు ఈ టర్మ్ బాలేనట్లుంది.::సిమ్మాదిరప్పన్న -
ముందే జాగ్రత్త పడుతున్న యువనేత
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న బిహార్ శాసనసభ ఎన్నికలపై విపక్షాల ‘ఇండియా’ కూటమి ఇప్పటికే తమ వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. జనతాదళ్(యూ) నేతృత్వంలోని నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న కసితో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) తన మిత్రపక్షాలనైన కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో తొలిదశ చర్చలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్‌తో పాటు బిహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్, ఆర్జేడీ నాయకులు మనోజ్ ఝా, సంజయ్ యాదవ్ పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన చర్చల్లో పొత్తులు, సీట్ల పంపకాలు, ఎన్నికల అజెండా తదితర కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అధికారమే లక్ష్యంగా.. గత 2020లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ–జేడీయూలు ఎన్డీఏ కూటమిగా, ఆర్జేడీ–కాంగ్రెస్‌లు మహాఘట్బంధన్ కూటమిగా బరిలో దిగాయి. 243 స్థానాలున్న బిహార్‌లో ఎన్డీఏ కూటమి 125 స్థానాలను కైవలం చేసుకుంది. మహాఘట్బంధన్ కూటమి 110 స్థానాలను దక్కించుకుంది. దీంతో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నితీశ్ కుమార్ (Nitish Kumar) 2022లో బీజేపీతో విభేదించి మహాఘట్బంధన్లో చేరి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం మళ్లీ 2024లో మహాఘట్‌బంధన్‌తో బంధం తెంచుకుని తిరిగి బీజేపీ చెంతనచేరారు. కమలదళం దన్నుతో మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తాను కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో చేరి అతిపెద్ద తప్పు చేశానని, ఇకపై అలాంటి తప్పులకు తావివ్వబోనని వ్యాఖ్యానించారు. నితీశ్ అంత మోసకారి మరొకరు లేరని, ఆయన విశ్వాస ఘాతకుడంటూ కాంగ్రెస్, ఆర్జేడీలు ఆయనపై విమర్శలు గుప్పించాయి. నితీశ్ అవకాశ వాదానికి గట్టిగా బదులివ్వాలనే దృఢ సంకల్పంతో ఉన్న రెండు పార్టీలు ఆయన్ను బలంగా ఢీకొట్టాలని భావిస్తున్నాయి. చదవండి: సోనియా, రాహుల్ గాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలుప్రస్తుతం అసెంబ్లీలో 243 స్థానాలకు గానూ బీజేపీకి 78, జేడీయూకి 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆర్జేడీకి 75, కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేయగా, ఈసారి దాదాపు 90 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఆర్జేడీ గత ఎన్నికల్లో 144 స్థానాల్లో పోటీ పడగా, ఈ సారి 150కి పైగా స్థానాల్లో పోటీకి ఉవ్విళ్లూరుతోంది. మిత్రపక్షాలైన లెఫ్ట్ పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల సంసిద్ధతను మొదలుపెట్టి సీట్ల పంపకాలు, ఎన్నికల ప్రచార అంశాలపై ఆర్జేడీ తొలి దశ చర్చలకు శ్రీకారం చుట్టింది. నితీశ్‌ను బీజేపీ హైజాక్ చేసిందన్న తేజస్వి ఈ భేటీ అనంతరం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయని, ఏప్రిల్ 17న పట్నాలో కాంగ్రెస్ నాయకులతో జరిగే తదుపరి సమావేశంలో మరిన్ని వివరాలను చర్చిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను బీజేపీ హైజాక్ చేసిందని, ఎన్డీఏ పాలనలో ఎటువంటి అర్థవంతమైన అభివృద్ధి జరగలేదని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు సహా ఇతర పార్టీలతో కూడిన మహాఘటబంధన్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్ చర్చించి ఏకగ్రీవంగా సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తాయని, ఈ విషయంలో ఊహాగానాలకు తావివ్వరాదని అన్నారు. -
వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేకే మత ముద్ర: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయటంలేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. దీన్ని కప్పిపుచ్చుకోవటానికి వైఎస్ జగన్‌పై మతం ముద్ర వేస్తున్నారు’’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.‘‘పాదయాత్రకు ముందు, తర్వాత జగన్ తిరుమల వెళ్లారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి నేతలు మత ముద్ర వేస్తున్నారు. వైఎస్ జగన్‌పై నిలువెల్లా విషం చిమ్ముతున్నారు. గత టీడీపీ పాలనలో కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు చేయించారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాలను కూల్చారు. వాటిని జగన్ సీఎం అయ్యాక తిరిగి నిర్మించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక కాశీనాయన క్షేత్రంలో కొన్ని సత్రాలు, గోశాలను కూల్చారు’’ అని మల్లాది విష్ణు గుర్తు చేశారు.‘‘తిరుమలలో ఎగ్ బిర్యానీ, మద్యం దొరికింది. తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు. ఇలా వరుస సంఘటనలు జరిగాయి. హోంమంత్రి అనిత ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడారు. హోంమంత్రిలాగా తప్పుడు మాటలు మాట్లాడేవారినే క్రిమినల్స్ అంటారు, విజయకీలాద్రి మీద ఆలయాలు కట్టేందుకు చంద్రబాబు అంగీకరించలేదు. కానీ జగన్ పర్మిషన్ ఇచ్చి ఆలయాల నిర్మాణాలకు సహకరించారు. పీఠాల నిర్మాణాలకు జగన్ భూములు ఇస్తే చంద్రబాబు వాటిని లాగేసుకున్నారు. కేవలం జగన్ మాత్రమే హిందూ ధర్మాన్ని కాపాడారు. చంద్రబాబు హయాంలోనే హిందూ ధర్మంపైన దాడులు జరుగుతున్నాయి. వక్ఫ్ చట్టాన్ని ఆమోదించి చంద్రబాబు ముస్లింల మనోభావాలను దెబ్బ తీశారు’’ అని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆదోని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన వైఎస్సార్సీపీ
సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోని మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్సీపీ నెగించుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ శాంత వంటెద్దు పోకడలకు వ్యతిరేకిస్తూ, వార్డుల అభివృద్ధిలో సహకరించడం లేదంటూ చైర్మన్‌పై వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరారు.కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్ భరద్వాజ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ శాంతకు వ్యతిరేకంగా 35 కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకుని 36 మంది ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్సీపీ నెగ్గించుకుంది. కాగా, ‘‘వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తామని ఆశ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయినా రూ.10 పని కూడా చేయలేదన్నారు. వార్డుల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీలో చేరడం వల్ల చీవాట్లు తప్ప ఏమీ ఒరగలేదు.’’ అని 11, 12 వార్డుల కౌన్సిలర్ వాసీం అన్నారు. నిన్న ఆయన మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సమక్షంలో తిరిగి వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే.ఆయన నిన్న(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ ఇకపై ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానన్నారు. సాయిప్రసాద్‌రెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. వార్డులో పెద్దల మాటలను గౌరవించి, జరిగిన పొరపాటు తెలుసుకొని తిరిగి సాయన్న సమక్షంలో పార్టీలోకి వచ్చానన్నారు. 2029లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానన్నారు. కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. -
బెదిరింపులు.. మోసం.. వారికి కొత్త కాదు: కవిత
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు.. మోసం కొత్త కాదని.. తెలంగాణ ఇస్తానని చెప్పి 2004లో మోసం చేసిన కాంగ్రెస్... ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేస్తోందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ, ఉచిత బస్సు అంటూ. మహిళల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చి బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు.కళ్యాణలక్ష్మీ పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఒక బస్సు ఇచ్చి.. బంగారాన్ని తుస్సుమనిపించారు. రుణ మాఫీ, రైతు భరోసా 50 శాతం మందికి ఇంకా రానేలేదు. గ్రామగ్రామాన కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలి. బీజేపీ మోసపూరిత విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పసుపు బోర్డును తూతూమంత్రంగా ఏర్పాటు చేశారే కానీ.. చట్టబద్ధత కల్పించలేదు. దాంతో పసుపు బోర్డుకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి డబ్బులు ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. మరి పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి రైతులకు డబ్బులు ఇచ్చారా?’’ అంటూ కవిత ప్రశ్నించారు.రెండు కోట్ల ఉద్యోగాలు, బోర్డుకు చట్టబద్ధత, మనిషికి 15 లక్షలు ఏమయ్యాయని అడిగితే ఎంపీ అర్వింద్ పిచ్చి మాటలు మాట్లాడుతారు. అంతకు మించి ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడిన దాఖలాలు లేవు. రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.. అయినా కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు 8 రూపాయలు కూడా ఇవ్వలేదు. 8+8 = పెద్ద గుండు సున్నా. తెలంగాణాను కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, గులాబీ జెండానే. రజతోత్సవం గుజాబీ పండుగ మాత్రమే కాదు.. ఇది తెలంగాణ పండుగ. తెలంగాణా ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్’’ అని కవిత చెప్పుకొచ్చారు.‘‘బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎంపీ అర్వింద్ కలిసిమెలసి ఢిల్లీతో తిరుగుతున్న వార్తను టీవీల్లో చూశాను. సంజయ్ బీజేపీలో చేరారా లేదా కాంగ్రెస్‌లో చేరారా అన్న అనుమానం వచ్చింది. సంజయ్ ఒకసారి సీఎం రేవంత్ రెడ్డితో... మరొకసారి బీజేపీ వాళ్లతో కనిపిస్తారు. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో తెలియక ప్రజల్లో అయోమయం నెలకొంది. జగిత్యాలకు నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే సంజయ్ విఫలం. ఎమ్మెల్యే సంజయ్‌ని గ్రామ గ్రామానా నిలదీయాలి’’ అని కవిత పేర్కొన్నారు. -
National Herald: సోనియా, రాహుల్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ కౌంటర్
ఢిల్లీ: దేశంలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారని ఘాటు విమర్శలు చేశారు బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్.నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ అభియోగపత్రం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిరసనలకు బీజేపీ కౌంటరిచ్చింది. తాజాగా బీజేపీ సీనియర్ నాయకులు రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ..‘కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ.. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసి నేషనల్ హెరాల్డ్‌కు ఇచ్చే హక్కు లేదు. స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ప్రజల గొంతును బలోపేతం చేయడానికి ఏర్పాటుచేసిన ఈ వార్తా పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారు. ఈ కేసును కొట్టివేయించడానికి సోనియాగాంధీ, రాహుల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి.చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అక్రమాలకు పాల్పడినవారు తప్పించుకోవడానికి ఇది కాంగ్రెస్ పాలన కాదు. ఇక్కడ రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదు. దేశ రాజధానిలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ నుంచి ముంబై, లక్నో, భోపాల్, పట్నా వరకు దేశవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రజాఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా గాంధీ కుటుంబం చేతుల్లోకి బదిలీ చేయడానికి ఈ కార్పొరేట్ కుట్ర పన్నారు. ‘అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్’ (ఏజేఎల్)కు సంబంధించిన 99% షేర్లను కేవలం రూ.50 లక్షలకు బదలాయించుకొని, రూ.రెండు వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని గాంధీ కుటుంబం తప్పుడు మార్గాన కైవసం చేసుకుంది’ అంటూ ఆరోపణలు చేశారు.మరోవైపు.. రవిశంకర్ ప్రసాద్ ఆరోపణలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా మాట్లాడుతూ..%స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారు నేషనల్ హెరాల్డ్, గాంధీ కుటుంబం, కాంగ్రెస్‌ను ద్వేషించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆర్ఎస్ఎస్ ఆక్రమించింది. లాభాపేక్షలేని సంస్థపై మనీలాండరింగ్ కేసు, అక్కడ నిధుల మార్పిడి జరగలేదు. ఆస్తి హక్కులు బదిలీ చేయబడలేదు. ఇది నరేంద్ర మోదీ భయాన్ని చూపిస్తుంది. ఈ కేసు రాజకీయ ప్రేరేపితం మాత్రమే. మేము న్యాయ వ్యవస్థను విశ్వసిస్తాము. దీనిపై మేము చట్టబద్ధంగా పోరాడి న్యాయం పొందుతాము. ప్రతిపక్షాల గొంతును అణిచివేసేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకున్నారు. మోదీ ప్రభుత్వానికి ఎటువంటి ఆధారాలు లేవు. వారు ప్రతిపక్షాల ప్రతిష్టను దిగజార్చాలని మాత్రమే కోరుకుంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. -
వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు బాబు స్వస్తి పలకాలి: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీ కూటమి సర్కార్ కుట్రలపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో విశాఖ మేయర్‌పై పెట్టిన అవిశ్వాసం విగిపోతుందని చెప్పారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారు. బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు విప్ జారీచేస్తున్నాము. 19వ తేదీన జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకూడదని విప్ జారీ చేస్తాము. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు సరిపడ బలం మాకు ఉంది. వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు చంద్రబాబు స్వస్తి పలకాలి.మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ..‘మహిళల మీద గౌరవంతో వైఎస్ జగన్.. నాకు మేయర్‌గా వకాశం కల్పించారు. బీసీ జనరల్ అయిన సరే యాదవ మహిళకు మేయర్‌గా అవకాశం ఇచ్చారు. యాదవులకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. యాదవుల కోరిక మేరకు భవన నిర్మాణం కోసం 50 సెంట్లు స్థలాన్ని కేటాయించారు. కీలకమైన పదవులు యాదవులకు కట్టబెట్టారు. కుట్ర కుతంత్రాలతో యాదవ వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించేయాలని చూడడం ఎంతవరకు సమంజసం. యాదవుల కన్నీరు మంచిది కాదంటూ గతంలో ఎమ్మెల్యే వంశీ చెప్పారు. ఇప్పుడు యాదవుల కన్నీరు వంశీకి కనిపించలేదా?. సోదర సమానులైన పల్లా శ్రీనివాస్, వంశీ అవిశ్వాసాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మేయర్‌పై అవిశ్వాసం వీగిపోతుంది. అవిశ్వాసం విగిపోయేందుకు కావల్సినంత బలం మాకు ఉంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు 58 మందికి విప్ జారీచేస్తున్నాము’ అని తెలిపారు. -
చిల్లర వేషాల గణేశా.. మక్కెలిరగ తంతా మల్లేశా!
‘గణపతి.. నేను మల్లేష్‌ను.. గ్రూపులో ఎగ్జిట్ ఎందుకు కొట్టావు.. నువ్వు ఎవడవు.. తీయడానికి....పోస్టులు పెడితే తీసేస్తావా... ఏ ఫొటోలు పెట్టాను.. ఎంపీ, మంత్రి, దాసునాయుడు ఫొటోలు పెట్టాను.. అంతమాత్రాన తీసేస్తావా? పార్టీ గ్రూపులో ఎలా తీస్తావ్. నన్ను తీయడానికి నువ్వెవడివి. పార్టీ కోసం పనిచేశాను. నీలా చిల్లర పనులు చేయిలేదు. టిఫిన్ కొట్టోళ్లు, చిల్లర వ్యాపారులు కడుపు కొట్టలేదు. – నరసన్నపేటకు చెందిన టీడీపీ నాయకుడు మల్లేష్ వాయిస్ ఇది..‘నేను అడ్మిన్‌ని గ్రూపులో ఫొటోలు ఇన్నేసి ఫొటోలు పెడితే ఎలా. అందుకే తీసేశాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తంతాను.. ఎవడితో చెప్పుకొంటావో చెప్పుకో.. ఎమ్మెల్యే అవసరం లేనప్పుడు ఎమ్మెల్యే గ్రూపులో నీకు ఉంచం రా.. ఒరే మల్లేసు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నరసన్న పేట వస్తే తంతా ను. పాతే స్తాను. బోకరువు నువ్వు.. ఎమ్మెల్యే గ్రూపులో నీకు ఉంచనురా.. ఏమి పీక్కోంటావో పీక్కో..నీకు అంత సీను లేదు. నువ్వు పార్టీకి అవసరం లేదు. నువ్వు అడగడానికి ఎవడివి. నరసన్నపేట రా.. రెండు కాళ్లు పట్టుకొని క్రిందకి తొక్కెస్తా.. బచ్చా గాడవు, నాఇష్టం.. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పిచ్చి వేషాలు వేయకు.. నరసన్నపేట రా తంతాను. ఎవడు అడుగుతాడు చూస్తాను..’ – నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రైవేటు పీఏ గణపతి సంభాషణ ఇదిసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పీఏ గణపతి, స్థానిక టీడీపీ నాయకుడు మల్లేష్‌ల మధ్య వివాదం రాజుకుంది. ఒకరిపై ఒకరు నోటికొచ్చినట్టు మాట్లాడుకున్నారు. పచ్చిబూతులు తిట్టుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రెచ్చిపోయారు. వారి ‘వ్యవహారాలను’ వారే బయట పెట్టుకున్నారు. ఇందులో బగ్గు రమణమూర్తి ప్రైవేటు పీఏ గణపతి ఒక అడుగు ముందుకేసి పాతేస్తాను.. తంతాను...అంటూ దర్పాన్ని చూపించగా, టిఫిన్ కొట్టులపై బ్రోకర్ పని చేశావ్. చిన్నోళ్ల కడుపుకొట్టడం... డబ్బులిచ్చినోళ్లకే పనులు చేశావు. నువ్వు చేసేదేంటి? అంటూ టీడీపీ నాయకుడు మల్లేష్ చెలరేగిపోయారు. ఈ ఇద్దరి ఫోన్ సంభాషణ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీలో చిచ్చు రేపింది. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
స్టాలిన్.. కేంద్రం.. ఓ న్యాయ కమిషన్..
ఈ మధ్య కాలంలో, కేంద్ర విధానాలపై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన.. తాజాగా దక్షిణాది రాష్ట్రాల్లో కాకను పెంచుతోంది. కేంద్రంతో, దక్షిణాది రాష్ట్రాలు తగవు పెట్టుకోవడానికి ఇదొక్కటే కారణం కాదు. కేంద్ర ప్రభుత్వం.. ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈమధ్య తీసుకుంటోన్న కొన్ని కీలక నిర్ణయాలు.. దక్షిణాది రాష్ట్రాల్లోని ఎన్డీయేతర ప్రభుత్వాల అధినేతల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి. అసంతుష్ట సీఎంల జాబితాలో.. తమిళనాడు ప్రభుత్వాధినేత ఎంకే స్టాలిన్ ముందు వరుసలో ఉన్నారు.కేంద్ర ప్రభుత్వ విధానాలు, వైఖరికి నిరసనగా స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే పనిలో పడ్డారు. తొలుత, త్రిభాషా విధానంపై.. తమిళనాడులోని అన్ని రాజకీయ పక్షాలనూ.. తన దారిలోకి తెచ్చుకున్నారు. ముందు నుంచీ హిందీ వ్యతిరేక విధానాన్ని ఒంట పట్టించుకున్న తమిళ ప్రజలకు, తాము ఎక్కడ దూరమవుతామోనని, అక్కడి అన్ని పార్టీలూ, త్రిభాషా విధానాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఇదే ఊపులో.. స్టాలిన్, జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలను పునర్విభజించాలన్న అంశంపై, దక్షిణాదిలోని అన్ని రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మధ్యనే చెన్నైలో ఎన్డీయేతర పక్షాలతో భేటీని కూడా నిర్వహించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్ప.. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోని కీలక పార్టీలన్నీ స్టాలిన్ ఆందోళనతో ఏకీభవించాయి. కేంద్ర ప్రభుత్వ దూకుడును నిలువరించాలని తీర్మానించాయి.తొలి తమిళ సీఎంలు.. కీలక కమిషన్లు..ఎన్డీయేతర పక్షాల భేటీ తర్వాత, మలి అడుగుగా, ఇప్పుడు, స్టాలిన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను తాజాగా నిర్వచించేందుకు, ఈ బంధాలు మెరుగయ్యే అవకాశాలపై అధ్యయనం కోసం ఏకంగా ఓ న్యాయ కమిషన్నే నియమించాలని నిర్ణయించారు. తగిన సిఫారసుల కోసం, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు.. మంగళవారం (15-04-2025) నాడు తమిళనాడు అసెంబ్లీలో కీలక ప్రకటన కూడా చేశారు. తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యంగా డీఎంకే నేతృత్వంలోని సర్కారు ఇలా కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై కమిషన్లను నియమించడం ఇదే తొలిసారి కాదు. 1969 ఫిబ్రవరిలో.. తొలిసారి ముఖ్యమంత్రి అయిన ఎం.కరుణానిధి, ఎనిమిది నెలల్లోనే ఇదే అంశంపై, రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్ రాజమన్నార్ నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా.. తొలిసారిగా సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన స్టాలిన్, తండ్రి చూపిన బాటలోనే.. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై తానూ కమిషన్‌ను నియమించడం విశేషం.రాష్ట్రాలు నియమించే కమిషన్ల వల్ల ప్రయోజనముందా?కేంద్ర, రాష్ట్ర సంబంధాల పటిష్టతపై కమిషన్ల ఏర్పాటు అంశం కొత్తదేమీ కాదు. 1969లో డీఎంకే అప్పటి అధినేత కరుణానిధి వేసిన జస్టిస్ రాజమన్నార్ కమిషన్‌తో మొదలు పెడితే, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా, 1983లో, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్‌సింగ్ సర్కారియా కమిషన్, అనంతరం, 2007లో.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్మోహన్ పూంచీ వేసిన కమిషన్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై సునిశితంగా అధ్యయనం చేసి సిఫారసులను చేశాయి.జస్టిస్ రాజమన్నార్ కమిటీ, జస్టిస్ సర్కారియా కమిటీలు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యతకు.. ప్రధాని నేతృత్వంలో, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని సూచించాయి. జస్టిస్ పూంచీ కమిటీ కూడా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీ అంశంలో.. ప్రణాళిక, ఆర్థిక సంఘాల మధ్య సమన్వయానికి ఓ నిపుణుల కమిటీ ఉండాలని సూచించింది. రాష్ట్రాలు ఏర్పాటు చేసిన కమిటీలే కాదు, స్వయంగా కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీల సిఫారసులూ బుట్టదాఖలు కావడం శోచనీయం. ఇప్పుడు తాజాగా స్టాలిన్ నియమించే జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ చేసే సిఫారసులను, ఎటూ కేంద్రానికే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ సిఫారసులపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది.. ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.మరి స్టాలిన్ దూకుడు ఎందుకు?తమిళనాడు అసెంబ్లీకి ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. గడచిన ఐదేళ్ల కాలంలో, స్టాలిన్ తన పాలనతో రాష్ట్రంపై విశిష్ట ముద్రనేదీ వేయలేదన్న భావన ఉంది. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే, కచ్చితంగా, స్థానికుల సెంటిమెంట్‌ని రగిలించడమే సరైనదని స్టాలిన్ భావిస్తున్నారని స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం, నీట్ విధానాన్ని ప్రవేశ పెట్టినప్పుడు, ఇటీవలే త్రిభాషా విధానాన్ని ప్రతిపాదించినప్పుడు.. వాటిని వ్యతిరేకించడంలో స్టాలిన్ ముందు వరుసలోనే నిలిచారు. ఇప్పుడు, దక్షిణాది విశాల ప్రయోజనాల పేరిట, డీలిమిటేషన్ ప్రక్రియను ప్రధాన అస్త్రంగా మలచుకుని, స్టాలిన్, తమిళుల హృదయాల్లో.. తనను తాను, జాతీయ స్థాయి నాయకుడిగా ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. కేంద్రంపై పోరు, దాని వెనుక మర్మం ఏమైనా, స్టాలిన్ తాజా వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. - పి.విజయ్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్. -
అపరాధ భావం.. అతకని కథలతో బాబు కాలక్షేపం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో వింత ప్రకటన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా.. మిగిలిన అన్ని విషయాలపై అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో ఆయన డాక్టర్ అవుతున్నాడు.. మాస్టర్ అవతారం ఎత్తుతున్నాడు.. రోజూ ఏదో ఒక విషయం ఎత్తుకోవడం.. దానిపై మీడియాతోనో లేకపోతే ఇంకొకరితోనో.. గంటల తరబడి మాట్లాడటం! ఇదీ తంతు! ఈ ధోరణి గతంలోనూ ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అది మితి మీరిపోతోంది.హామీలు అమలు చేయలేక ప్రజల్లో పలచన అవుతున్నాన్న అపరాధ భావమో.. ఇతరాంశాల గురించి మాట్లాడుతూ ప్రజల దృష్టి తప్పించాలనో ఇలా చేస్తుండవచ్చు. అయితే, ఈ క్రమంలో ఆయన సమతుల్యత తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒక ఉదాహరణ చూద్దాం..‘పీ-4 కార్యక్రమంలో ఎంత మంది మంత్రులు పాల్గొంటున్నారు? ఎన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు’ అని ఈమధ్య ఓ విలేకరి చంద్రబాబును ప్రశ్నించారు. అంతే ఆయనకు ఉన్నట్టుండి కోపం ముంచుకొచ్చింది. ‘కుక్క కరిస్తే, పిల్లి అరిస్తే సీఎం ఏం చేస్తాడు? విలేకరిగా నీకు బాధ్యత లేదా? సచివాలయంలో కూర్చున్నావంటే సొసైటీ నీకు ఆ స్థాయిని కల్పించిందని మర్చిపోవద్దు. మంత్రులను అడుగుతున్నావు.. ప్రెస్‌లో ఎంతమంది దత్తత తీసుకున్నారు? అన్నీ నేనే చూడాలన్న ఆలోచన ధోరణి మారాలి’ అంటూ చిర్రుబుర్రులాడారు.విలేకరి అడిగిన ప్రశ్నకు ఈయన గారి సమాధానానికి అస్సలు పొంతన లేకపోవడాన్ని కాసేపు పక్కనబెడదాం. వాస్తవానికి తాను అనుకుంటున్న పీ-4 కార్యక్రమం గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఇదో మంచి అవకాశం. మంత్రులు, తన పార్టీ నేతలను ఆ విధమైన సేవాభావం వైపు మళ్లించేందుకు ఓ సందేశం ఇచ్చి ఉండవచ్చు. అలాకాకుండా ఆ ప్రశ్న వేసిన విలేకరినే మందలించడం ఆయన పరిస్థితిని తెలియజేస్తోంది! పైగా ఇలా అసందర్భంగా మాట్లాడితే సీఎం స్థాయి నేత బ్యాలెన్స్ కోల్పోయినట్లు అనుకోరా?. చివరికి ప్రెస్ వారు దత్తత తీసుకోవాలని చెబుతున్నారంటేనే ఆ పీ-4 కార్యక్రమంలో చక్కదనం ఏంటో అర్థమవుతుంది.చంద్రబాబు గతంలో కూడా ఇలాంటి గిమ్మిక్కులు చేసేవారు. కాకపోతే ఈసారి అవి శృతి మించాయనిపిస్తుంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మీడియా అంతా అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడుతుండాలి. అబద్దాలు పోగు చేసి రాయాలి. లేకుంటే ప్రభుత్వానికి భయపడుతున్నారని ఆయనే మీడియా సమావేశాలలో వ్యాఖ్యానిస్తుంటారు. తాను ముఖ్యమంత్రి అయితే మాత్రం అంతా అదరహో అని ఊదరగొట్టాలి. టీడీపీ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇదే పనిలో ఉంటాయి. అయినా ఇంకెవరైనా ప్రశ్నిస్తే ఆయనకు అసహనం వచ్చేస్తుందన్న మాట. ఇంకో విషయం చూద్దాం.ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. ఫీజుల చెల్లింపును డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. దాని గురించి మీడియాలో కథనాలు వస్తే చంద్రబాబు ఆ అంశంపై మాట్లాడకుండా పీపీపీ విధానంలో ఆస్పత్రులు అంటూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారట. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల మొత్తానికి ఆరోగ్య బీమా కల్పిస్తామని పౌరులందరికీ డిజిటల్ హెల్త్ కార్డు, అన్ని మండలాలలో జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందుల పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీల అమలుపై ప్రజెంటేషన్ ఇచ్చి.. ఆ తరువాత కొత్త కార్యక్రమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన ‘ఇంటింటికి డాక్టర్’ కార్యక్రమాన్ని కొనసాగించి ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. కానీ, జగన్‌కు పేరు వస్తుందన్న భయంతో ఆ పథకాన్ని అటకెక్కించారు. ఆరోగ్యశ్రీ కింద పేదలకు సరైన వైద్యమే అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.ఈ విమర్శలకు ప్రతిగా ఆయన చెబుతున్నది ఏమిటంటే ప్రతి నియోజకవర్గంలోను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తారట. అవి కూడా ప్రభుత్వ, ప్రైవేట్ పద్ధతిలో.. ఈ రకమైన ఆసుపత్రులకు నష్టాలొస్తే ప్రభుత్వం పదేళ్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ ఇస్తుందట. ఆరోగ్యశ్రీ రోగుల్లో యాభై శాతం మందికి ఇక్కడకు పంపిస్తారట. హాస్పిటల్ లేని నియోజకవర్గాలలో వంద నుంచి 300 పడకలతో ఈ తరహా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తారట. ఎక్కడో ఒకటి, అర తప్ప, ఇవన్నీ ఎప్పటికి వస్తాయి?. ప్రజలకు ఎప్పటికి ఉపయోగపడేను? అదేమని అడిగితే.. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటు చేస్తామంటారు. అది ఎప్పటికి రెడీ అవుతుందో తెలియదు. పది వ్యాధులకు ఒకరు చొప్పున డాక్టర్లను సలహాదారులుగా నియమిస్తారట. ఇదేమిటో తెలియదు.ఇంకోపక్క.. ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయని వాటికి ఆక్సిజన్ ఇవ్వాలని, కాని డబ్బులు లేవంటున్నారని చంద్రబాబే చెబుతారు. మరి ఆయన చెప్పేవాటన్నిటికీ డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? అమరావతిలో ఖర్చు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేదల, మధ్య తరగతి వారి ఆరోగ్యం కన్నా, భారీ భవంతులు కట్టడం ప్రయోజనకరమని ఆయన భావిస్తున్నారా? ఇలా అడిగితే ఆయన ఊరుకోరు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, వ్యాధులు అంటూ ఆయనే ప్రజెంటేషన్ ఇస్తారు. విరుగుడు మాత్రం ప్రైవేటు మంత్రం అని పరోక్షంగా చెబుతూంటారు. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వదలుకుంటారు. జగన్ తెచ్చిన వైద్య కళాశాలలను సైతం ప్రైవేటుకు అప్పగిస్తారట.చంద్రబాబు మరో సలహా ఇచ్చారు. ప్రజలు ఏమేమి తినాలో ఆయన చెబుతున్నారు. అన్ని ప్రభుత్వమే చేయలేదని, వ్యాధులు రాకుండా ఆహార అలవాట్లు మార్చుకోవాలని, జీవన శైలి మార్చుకోవాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. జంక్ ఫుడ్స్ వదలిపెట్టి, మిల్లెట్స్ వాడాలని సూచిస్తున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు 600 గ్రాముల ఉప్పు, రెండు లీటర్ల నూనె, మూడు కిలోల పంచదారే వాడాలని అన్నారు. ఏదో పెద్ద తరహాలో చెబితే అదో రకం. కాని ఆయన మద్యం తాగమని చెబుతూ ఎన్నికల ప్రచారం చేశారే! తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చామని గొప్పగా అసెంబ్లీలో చెప్పారే. మరి ఆ మద్యం బాటిళ్లపై హానికరం అని ఉంటుంది కదా! ఆ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు. ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుందన్న సంగతి అందరికి తెలుసు. దాని గురించి మాట్లాడిన సీఎంకు మద్యం తీసుకుంటే లివర్ పాడవుతుందని తెలియదా?. ఇక్కడే చంద్రబాబు చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది.యధా ప్రకారం జీఎస్డీపీ అంటూ కాకి లెక్కలు చెప్పి, జగన్ టైమ్‌లో అలా జరిగింది.. ఇలా జరిగిందని చెప్పి మభ్య పెడితే ప్రజలకు ఒరిగేదేమిటి? కొసమెరుపు ఏమిటంటే మీరు చెబుతున్నవాటిన్నటికి డబ్బు కావాలి కదా? ఎక్కడ నుంచి వస్తాయని అడిగితే, చాలా విషయాలలో డబ్బు కంటే సంకల్పం, పాజిటివ్ దృక్పథం ముఖ్యమని సెలవిచ్చారు. అంటే గాలిలో మేడలు కడుతున్నట్టు అనిపించదా?. కాకపోతే చంద్రబాబు ఉపన్యాసాలు ఈనాడు వంటి టీడీపీ మీడియా ‘ఆరోగ్య భాగ్యం’ అంటూ శీర్షికలు పెట్టి బాజా వాయించడానికి మాత్రం బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కుట్రలు
సాక్షి తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లకుండా ఆటంకాలు సృష్టిస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్ జగన్‌కు హెలికాప్టర్లు ఇవ్వనీయకుండా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలకు దిగారు.వివరాల ప్రకారం.. ఇటీవల వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో ప్రభుత్వ వైఫల్యం బహిర్గతమైన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ రాప్తాడులో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న వెంటనే.. ప్రజలందరూ హెలికాప్టర్‌ను చుట్టుముట్టారు. తమ అభిమాన నేతలను కలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్నది. దీంతో, వైఎస్ జగన్‌ను వదిలేసి హెలికాప్టర్ వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కూటమి సర్కార్ కొత్త కుట్రలకు తెరలేపింది. ఈ ఘటనపై విచారణ పేరుతో పైలట్లకు నోటీసులు జారీ చేసింది. దీంతో, వైఎస్ జగన్‌కి హెలికాఫ్టర్లను ఇవ్వనీయకుండా చేసేందుకే ప్రభుత్వ పెద్దల కుట్రలు చేస్తోందని వైఎస్సార్సీపీ ఆరోపించింది.మరోవైపు.. హెలికాప్టర్ ఘటనపై మరుసటి రోజే హోంమంత్రి అనిత డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కొనసాగింపుగా హెలికాఫ్టర్ సంస్థలకు ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. ఈ ఘటనపై ఇప్పటికే సంస్థలు డీజీసీఏకు నివేదిక అందించారు. అయితే, నివేదిక ఇచ్చినా పోలీసుల విచారణ పేరుతో పైలట్, కో-పైలట్‌ను ప్రభుత్వం వేధింపులకు గురిచేయడం గమనార్హం. నేడు విచారణకు హాజరుకానున్న పైలెట్, కో పైలెట్ వైఎస్ జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్న ఘటనలో విచారణకు హాజరుకావాలని హెలికాప్టర్ నిర్వహణ సంస్థ, పైలెట్, కో–పైలెట్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో వారు బుధవారం విచారణకు హాజరుకానున్నారు. చెన్నేకొత్తపల్లిలోని రామగిరి పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. అక్కడ ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ చిత్తే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయే విధంగా క్షేత్రస్థాయి పరిస్థితులున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘తొందరపడి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలగొట్టం.సర్కార్‌కు ఇంకా మూడున్నరేళ్లకు పైగా గడువు ఉంది. ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొడితే బీజేపీకి లాభం ఎంటి? ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అందరికీ తెలుసు’అని వ్యాఖ్యానించారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతి నిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... భూముల విక్రయం, అప్పులు చేయడం, మద్యం అమ్మడం ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని మండిపడ్డారు. కేసులు ఎదుర్కునేందుకూ సిద్ధంహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్ల కూల్చివేత, భూమి చదునుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు ఉల్లంఘనలకు పాల్పడిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్లు పెట్టి చెట్లు నరికిన పరిస్థితి గతంలో ఎక్కడా జరగలేదని, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రధాని మోదీ విమర్శిస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశంలో ఎవరో ఏఐతో చేసిన నకిలీ ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టారని మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. హెచ్‌సీయూ అంశంపై గతంలో తాను ట్విట్టర్లో పెట్టిన పోస్ట్‌కు కట్టుబడి ఉన్నానని, ఈ విషయంలో కేసులు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఈ భూముల విక్రయం వెనక బీజేపీ ఎంపీ ఉంటే, అతడి పేరు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు అసదుద్దీన్ బిగ్బాస్కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బిగ్‌బాస్ అని, ఆయనే ఈ రెండు పార్టీలను నియంత్రిస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ నెల 19న వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో భూబకాసు రులు నిరసనలు నిర్వహిస్తున్నారని ఎంఐఎం సభను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ముస్లింల ప్రార్థనా మందిరాలకు వక్ఫ్ బోర్డుకు సంబంధం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర కార్పొరేటర్లను కూడా కలిసి ఓట్లు అడుగుతామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన, టీడీపీతో కలిసి పోటీచేసే ఆలోచనే లేదని స్పష్టంచేశారు. ఒంటరిగానే పోటీచేసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని తెలిపారు. ఇకపై కాంగ్రెస్, బీఆర్ఎస్లతో బీజేపీకి దోస్తీ ఉందని ఎవరైనా అంటే చెప్పుతో కొట్టాలని ప్రజలకు సూచించారు. -
కూలుస్తామంటే చేతులు కట్టుకుని కూర్చోం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలను కొనుక్కునైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని తమపై ఒత్తిడులు వస్తున్నాయంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. కూలుస్తామంటే తాము చేతులు కట్టుకుని కూర్చోమని ప్రశ్నించారు. మంగళవారం నోవాటెల్ హోటల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఐదేళ్లే కాదని.. రానున్న మరో ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని చెప్పారు.భూభారతి అమల్లోకి తేవడంతో వారికి భయం పట్టుకుందని, వారి అక్రమాలు ఎక్కడ బయటకు వస్తాయోననే భయం బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేసిన ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్ ఆత్మ అని, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభాకర్‌రెడ్డిది ట్రాన్స్పోర్ట్ వ్యాపారం అనుకున్నానని, ఆయన ఈ మధ్య జ్యోతిషం కూడా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వమంటే బీఆర్ఎస్లోని ఆ నలుగురు నాయకులకు కళ్లమంట అని అన్నారు. అందుకే పిల్లి శాపాలు పెట్టిస్తున్నారని, ఆ శాపనార్థాలకు ప్రభుత్వం పడిపోదని అన్నారు. ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్చోటా మోటా కాంట్రాక్టర్లు కూల్చే ప్రభుత్వం తమది కాదని, అయినా వారు ప్రభుత్వాన్ని కూలిస్తే తాము ఊరుకుంటా మా అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. తమ ప్రభుత్వానికి ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉందని, ఇలాంటి చోటా బ్యాచ్‌కు తాము భయపడేది లేదన్నారు.బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యేలంటే కనీస గౌరవం లేదని, సంతలో వస్తువులుగా ఎమ్మెల్యేలను చూస్తున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయన్నారు. ప్రభుత్వ పెద్దలతో చర్చించి ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభాకర్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలంటూ టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ తదితరులు బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
‘మాటలతో ఆటలాడవద్దు.. మీ గేమ్స్ చెల్లవు’
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్నికూల్చేయబోతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాటలతో ఆటగాడవద్దు. మీ గేమ్స్ చెల్లవు’ అంటూ అని తీవ్రంగా స్పందించారు. ఈ అంశంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని, బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే వారే ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తారని మండిపడ్డారు. (ఇదీ చదవండి: ‘ఆ టెస్టులు మీరే చేయించుకుంటే మీ అసలు రంగు బయటకొస్తది’)ఇదిలా ఉంచితే,. ఈరోజు(మంగళవారం) హైదరాబాద్ నగరంలో నోవాటెల్ హెటల్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో సంక్షేమం ఒక ఎత్తు అయితే.. ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన పకడ్బందీగా పూర్తి చేశాం. ఈ రెండు అంశాలు గత కొన్ని దశాబ్దాలుగా గొప్ప గొప్ప నాయకులే చేయలేకపోయారు మన ప్రభుత్వం అందరికీ చెప్పి చేసింది. ఈ రెండు అంశాలు చేయాలని ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ మొదలవుతుంది. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదించాము. ఎస్సీ కుల వర్గీకరణ జరిగింది. దేశంలో కొద్దిమందికి ఇష్టం లేకపోయినా భూసంస్కరణలు వంటి గొప్ప నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ గతంలో చేపట్టింది. అందుకే ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ అధికారంలో కొనసాగింది. బీసీ కుల గణన, sc వర్గీకరణ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బి ఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీలను మూట కట్టి మూలన పడేసే విషయాలు.. ఇవి వారి అస్తిత్వానికే ప్రమాదం కాబట్టి బీఆర్ఎస్, బిజెపి చేతులు కలిపి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించి కంచ గచ్చిబౌలిలో ఏనుగులు, పులులు తిరుగుతున్నట్టు బిజెపి, బీఆర్ఎస్ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించి కుట్రలు చేస్తున్నాయి. బీసీ కుల సర్వే మీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఏకంకండి, మాతో కలిసి రండి అని చెప్పి బహుజన వర్గాలను చైతన్యం చేయాలి. కులగణన ద్వారా పొందాల్సిన ఫలితాలను అందుకున్నాము. సంక్షేమ పథకాలు, బీసీ కుల సర్వే, ఎస్సీ వర్గీకరణ నిశ్శబ్ద విప్లవాలు’ అంటూ ఆయన స్పష్టం చేశారు. -
‘ఆ టెస్టులు మీరే చేయించుకుంటే మీ అసలు రంగు బయటకొస్తది’
దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజలు తన వద్ద అన్నమాటలే తాను చెప్పానని అన్నారు. తాను చేసిన దాంట్లో తప్పేముంది.. కావాలంటే తనపై కేసులు పెట్టుకోవాలని సవాల్ చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజలు చందాలు వేసుకుని బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని చూస్తున్నారని మరోసారి ఉద్ఘాటించారు.అవి నా వ్యాఖ్యలు కావు.. ప్రజలు మాటలుతాను ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు తన సొంత మాటలు కావని, రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజలు తమ వద్దకు వచ్చి అంటున్న మాటలు అని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం మారాలి అని రైతులు.. రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలు కోరుకుంటున్నారన్నారు.కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఉన్నాడా?మంత్రి పొంగులేటి తనను కేసీఆర్ ఆత్మ అని అంటున్నారని, కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఎక్కడ ఉండేవాడు అని కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. నేడు పొంగులేటి మంత్రి పదవిలో ఉన్నాడు అంటే.. అది కేసీఆర్ వల్లే అనే విషయం గుర్తించుకోవాలన్నారు. నార్కోటిక్ టెస్ట్ లు చేయడం తనకు కాదు అని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు నార్కోటిక్ టెస్ట్ లు చేయాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కు కౌంటర్ ఇచ్చారు.అలా చేస్తే ఈ ప్రభుత్వం పై వాళ్ల మనసులో ఏముందో తెలుస్తోందన్నారు..ఇక కాంగ్రెస్ వాళ్లకు వాళ్ళ ప్రభుత్వం పై నమ్మకం లేకనే తమ పార్టీ నుండి ఎమ్మెల్యే లను తీసుకేళ్లరని, ఇప్పుడు కాకపోయిన ఇంకొద్ది రోజులు కైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం పక్క అని కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి వ్యాఖ్యానించారు. -
పింక్ బుక్‌లో రాసుకుంటాం.. వాళ్లను క్షమించం: కవిత
కామారెడ్డి జిల్లా: కాంగ్రెస్ తాటాకుచప్పుళ్లకు భయపడేది లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బాన్సువాడలో రజతోత్సవ సన్నాహక సమావేశంలో పింక్ బుక్ పేరిట ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దంటూ కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్‌లో రాసుకుంటాం, బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు. కేసులు పెట్టించే పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదు’’ అంటూ కవిత వ్యాఖ్యానించారు.‘‘బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదు. వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడేవాళ్లెవరూ లేరు ఇక్కడ. మాట తప్పడమే.. మడమ తిప్పడమే కాంగ్రెస్ నైజం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్టులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి పంచి ఓట్లేయించుకున్నారు...ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. గతంలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి పదేళ్ల పాటు అరిగోస పెట్టింది కాంగ్రెస్. వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలకు కారణం కాంగ్రెస్. ఏడాదిన్నర పాలనలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి. ప్రతీ ఇంటి నుంచి ఒకరు రజతోత్సవ సభకు రావాలి’’ అంటూ కవిత పిలుపునిచ్చారు. -
‘కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం’
తాడేపల్లి : ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరద్ధమన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించాయని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్లో మాట్లాడిన పేర్నినాని.. ‘ టీడీపీ, జనసేన ఓట్లు లేకపోతే వక్ఫ్ చట్టం పార్లమెంటులో పాస్ అయ్యేదా?, మరి వారిద్దరూ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తే మోదీ ఆ చట్టాన్ని తెచ్చేవాడు కాదు. చంద్రబాబు బొమ్మను దేశ వ్యాప్తంగా ముస్లింలు చెప్పుతో కొడుతున్నారు. ముస్లింల ఆందోళనల్లో సిగ్గు లేకుండా టీడీపీ పాల్గొంటోంది.లింకు డాక్యుమెంట్లు బయటపెడితే నోరుమూశారు..వక్ఫ్ స్థలాల్లో సాక్షి ఆఫీసులు ఉన్నాయంటూ మొదట ఆరోపణలు చేశారు. సాక్షి స్థలాల లింకు డాక్యుమెంట్లు బయట పెట్టడంతో నోరు మూసుకున్నారు. తర్వాత వైఎస్సార్సీపీ విప్ జారీ చేయలేదంటూ ఆరోపణలు చేశారు. విప్ కాగితాలు బయట పెట్టగానే మళ్ళీ నోరు మూసుకున్నారు. హిందూ మత సంస్థలు, ఆలయాల్లో అన్యమతస్తులను తొలగిస్తున్నాం. చివరికి షాపులు ఉన్నా ఖాలీ చేయిస్తున్నాం. దేవాదాయ శాఖలో హిందూయేతరులను అధికారులను పెట్టటం లేదు. మరి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా పెడతారు?, అలా చేయటం కరెక్టేనా?, ముస్లింలు నమాజు చేసుకునే మసీదుల ఆలన పాలనాకు ముస్లిమేతరులను పెట్టటం సబబేనా? , ముస్లింల హక్కులను కాలరాయటం కరెక్టుకాదు.మా పార్టీలాగే మీరు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగలరా?చంద్రబాబు, లోకేష్ లకు ఖలేజా ఉంటే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయగలరా?, మా పార్టీలాగే మీరు కూడా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయలగరా?, దిక్కుమాలిన, దౌర్భాగ్య రాజకీయాలు మానుకోవాలి. పన్నుల వసూళ్లలో రెండు శాతం మాత్రమే వృద్ది ఉన్నప్పుడు జీఎస్డీపీలో దేశంలోనే నెంబర్ టూ ప్లేస్‌కి ఎలా వచ్చింది?, అంటే ఇంకా లక్షల కోట్ల అప్పులు చేయటానికి రెడీ అయ్యారని అర్థం అవుతోంది. చంద్రబాబు దళిత వ్యతిరేకి. అంబేద్కర్ జయంతి రోజునే దళితులకు సంకెళ్లు వేసి రోడ్డు మీద నడిపించటం దుర్మార్గం. 2018 కు ముందు మా పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇది జరుగుతోందని మేము గతంలోనే చెప్పాం. అధికారం ఉంటే చంద్రబాబు ఎన్ని పాపాలు చేస్తారో లెక్కలేదు. రాజధానిలో ఇంకా 44 వేల ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తేలుతుంది. తన స్వార్ధం కోసం తప్ప చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయడు’ అని ధ్వజమెత్తారు. -
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ‘‘రాజధాని కోసం రైతుల నుంచి దాదాపు 34 వేల ఎకరాలు తీసుకున్నారు. అంతకు ముందే వాగులు, కొండలు, రోడ్లు అన్నీ కలిపి దాదాపు 58 వేల ఎకరాల విస్తీర్ణం ఉంది. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2700 ఎకరాలు మాత్రమే. తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. ఇప్పుడు అదనంగా మరో 44 వేల ఎకరాలు తీసుకుంటామని ప్రకటించారు. రాజధాని కోసం 31 వేల కోట్లు అప్పుచేశారు.. ఇంకా 69 వేల కోట్లు అవసరమంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.‘‘రెండు కళ్ల సిద్ధాంతంతో పరోక్షంగా ఉమ్మడి ఏపీ విభజనకు దోహదపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా హమీని ఎగ్గొట్టేసింది. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు సరైన పోరాటం చేయడం లేదు. ప్రజలకు ఉపయోగపడేవి వదిలేసి అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు అంటారేంటి చంద్రబాబు. హైపర్ లూప్ అనే రైలు అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే లేదు. ఏపీలో హైపర్ లూప్ రైలుకు డీపీఆర్ చేయమని చెప్పడం చంద్రబాబు అనాలోచిత.. తొందరపాటు చర్య. పెద్ద పెద్ద ధనవంతులకు, కార్పొరేట్లను బాగుచేయడం కోసం ఇలాంటివి చేయడం సరికాదు’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.‘‘గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో పేదలను గాలికి వదిలేశారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లకు మేలు జరిగేలా పనిచేస్తున్నారు. మీ నిర్ణయాల వల్ల ప్రజలు, రైతులు, విద్యార్ధులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. 58 వేల ఎకరాలుంటే మళ్లీ 44 వేల ఎకరాలు తీసుకోవడం దేనికి. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ 44 వేల ఎకరాలు తీసుకుంటున్నారా చంద్రబాబు. పొలం ఉన్న రైతు అమ్ముకోలేడా... రైతు తరపున మీరు అమ్ముతారా?. ప్రభుత్వం ఉన్నది.. రియల్ ఎస్టేట్ వాళ్లను బాగుచేయడానికా?. 40 అంతస్తుల బిల్డింగ్లు ప్రజలకు ఒరిగేదేంటి. ప్రజలకు కావాల్సింది ఎత్తైన భవనాలు కాదు.. మంచి పరిపాలన. ప్రజలకు మేలు చేయకుండా మెట్రో రైలు జపం చేయడమెందుకు?’’ అంటూ శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు.‘‘ఏపీలో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులు సరిపోవా.. మళ్లీ కొత్తవి పెట్టడం దేనికి?. అమరావతిలో 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఎవరడిగారు.. ఎవడికి కావాలి. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు కావాలని ఎవరడిగారు. శ్రీకాకుళంలో నాలుగైదు ఎకరాలున్న వాళ్లు కూడా బెజవాడలో తాపీ పనులు చేసుకుంటున్నారు. శ్రీకాకుళంలో కావాల్సింది ఎయిర్ పోర్టు కాదు.. పంటలకు సాగునీరు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధితో రోజుకొకరు చనిపోతుంటే నీకు కనిపించడం లేదా?. చంద్రబాబు ఆలోచనలో ఇప్పటికైనా మార్పు రావాలని నేను కోరుతున్నా. పి4 గురించి తర్వాత ముందు సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి చంద్రబాబు. కేంద్రం ఇచ్చేది కాకుండా రైతులకు 14 వేలు ఇస్తామన్నారు.. ఏమైపోయింది ఆ హామీ?. మెట్రోరైళ్ల పై ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకు లేదు చంద్రబాబూ’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.చంద్రబాబు పి4 స్కీంపై సెటైర్లు చంద్రబాబు పి4 స్కీంపై వడ్డే శోభనాద్రీశ్వరరావు సెటైర్లు వేశారు. పి4 విధానం అంటున్నారు మంచిదే. డబ్బున్నవాళ్లు పేదలకు సాయం చేయడం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. రాష్ట్రంలోనే అతిపెద్దవైన మూడు విద్యాసంస్థలు మీ నాయకులవే. మీకు చేతనైతే నారాయణ, భాష్యం విద్యాసంస్థల్లో పది శాతం పేద విద్యార్ధులకు సీట్లు ఇప్పించండి. పేదల కోసం హెరిటేజ్ నుంచి మీరేమీ ఇవ్వరా? మీ హెరిటేజ్ నుంచి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు పాలు, పెరుగు, మజ్జిగ ప్యాకెట్లైనా ఇవ్వొచ్చు కదా?పేదల కోసం హెరిటేజ్ కూడా మేలు చేస్తుందని ప్రజలకు తెలియజేయండి. మీరు చేస్తే మిమ్మల్ని చూసి మరికొంతమంది సాయం చేసేందుకు ముందుకు వస్తారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాఖ్యానించారు. -
ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం.. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు.సీఎల్పీ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ కేటగిరైజేషన్‌పై చర్చ జరిగింది. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేల డుమ్మా కొట్టారు. వివేక్, ప్రేమ్‌సాగర్‌రావు, రాజగోపాల్‌రెడ్డి గైర్హాజరయ్యారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని పిలుపునిచ్చారు.‘‘ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. సన్నబియ్యం పథకం ఒక అద్భుతం.. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం. భూ భారతిని రైతులకు చేరవేయాలి. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచింది. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలి. దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించాం. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చాం..ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనం. జఠిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం. అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలి. నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తా. హెచ్‌సీయూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారు...బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి. ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి బిక్కిరి అవుతున్నాడు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది...కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోంది. దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. సన్న బియ్యం మన పథకం.. మన పేటెంట్, మన బ్రాండ్’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
టీడీపీ కార్యకర్తలు నా భార్యని కాలితో తన్నారు: మాజీ ఎంపీ నందిగం సురేష్
తాడేపల్లి,సాక్షి: సీఎం చంద్రబాబు పర్యటనలు సినిమా షూటింగులను తలపిస్తున్నాయని మాజీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు జనాల్లో తిరిగే పరిస్థితి లేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దళితుల మేలు కోరి అనేక పథకాలను అమలు చేశారు. కానీ చంద్రబాబు రౌడీరాజ్యం కొనసాగిస్తున్నారు. పథకాలు అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాజధానిలో వరద వస్తే మునిగే ఐనవోలు ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు చూశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాజధాని వరద ప్రాంతం నుండి విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.దళితులు,అంబేద్కర్ మీద వైఎస్ జగన్‌కు ఉన్న ప్రేమ అది. చంద్రబాబుకు అధికారం రాగానే మా కుటుంబంపై దాడి చేశారు. టీడీపి కార్యకర్తలు నా భార్యని కాలితో తన్నారు. త్వరలోనే ఆ వీడియోలు బయటపెడతా. ఇదేనా చంద్రబాబూ దళితుల మీద మీకు ఉన్న ప్రేమ? దళితుల మీద కక్షసాధిస్తూ పైకి కపట ప్రేమను చూపించొద్దు. చంద్రబాబు పర్యటనలు సినిమా షూటింగులను తలపిస్తున్నాయి. దళితుల గురించి చంద్రబాబు, పవన్, లోకేష్ బహిరంగంగా విమర్శలు చేశారు. ఇలాంటి వారికి దళితులే సరైన గుణపాఠం చెప్తారు’అని స్పష్టం చేశారు. -
చంద్రబాబు దళిత సమాజాన్ని అణగదొక్కారు: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దళిత సమాజాన్ని అణగదొక్కారని.. వారి జీవితాలను చిన్నాభిన్నం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధపాతాళానికి దళితులను తొక్కేశారని.. వారికి సంబంధించిన ఏ పథకమూ అమలు కావటం లేదంటూ నిలదీశారు.‘‘అంబేద్కర్ అందరివాడే, కానీ చంద్రబాబు కొందరివాడు. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పటి వరకు ఎందుకు సందర్శించలేదు?. సామాజిక న్యాయ మహాశిల్పం దగ్గర ఉన్న వైఎస్ జగన్ పేరును ఎందుకు తొలగించారు?. దళితులకు ఏ పథకం అందించకుండా వారి ఇళ్లకు చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నారు?...బ్లాక్ క్యాట్ కమాండోల సెక్యూరిటీ లేకుండా దళితుల ఇళ్లకు వెళ్లగలరా?. దళితుల ఇళ్లలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న చంద్రబాబు వైఖరిని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. దళితులను కించపరిచేలా ఒక మంత్రి మాట్లాడితే చంద్రబాబు అతన్ని ఎందుకు డిస్మిస్ చేయలేదు?’ అంటూ టీజేఆర్ ప్రశ్నలు గుప్పించారు.‘‘రాజధానిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత లోపిస్తుందంటూ కోర్టులో కేసు వేశారు. దళితులను తొలగించి అక్కడ చంద్రబాబు ఎలా ప్యాలెస్ కట్టుకుంటున్నారు?. దళితుల మీద నిజమైన ప్రేమ ఉంటే వారిని చట్టసభలకు పంపించటానికి ఎందుకంత వివక్ష చూపుతున్నారు?. అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదు. చంద్రబాబుని దళితవాడల్లోకి రాకుండా అడ్డుకుంటాం’’ అని టీజేఆర్ హెచ్చరించారు. -
కాంగ్రెస్‌లో ట్విస్ట్ : సీనియారిటీకి గుర్తింపు లేకపోతే ఎలా.. జీవన్‌రెడ్డి గుస్సా
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియారిటీకి తగిన గుర్తింపు పార్టీలో లేనప్పుడు తప్పకుండా అసంతృప్తి ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ నియంతృత్వ, అప్రజాస్వామిక విధానాలపై పోరాడిన ఏకైక ఎమ్మెల్సీ తానే అని జీవన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీలో వీహెచ్ తప్ప ప్రస్తుతం నాకంటే అనుభవజ్ఞుడైన నాయకుడు ఎవరున్నారు?. జానారెడ్డి కూడా నాకంటే పార్టీ పరంగా నాలుగేళ్లు జూనియరే. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ నియంతృత్వ, అప్రజాస్వామిక విధానాలపై పోరాడిన ఏకైక ఎమ్మెల్సీని నేనే. శాసనసభ, శాసన మండలిలో.. కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి ఎంత పోరాటమైతే చేశారో అంతకు మించి పోరాటం నేనూ చేశాను.సీనియారిటీకి తగ్గ గుర్తింపు పార్టీలో లేనప్పుడు తప్పకుండా నాకు అసంతృప్తి ఉంటుంది. అది కావాలని కోరుకోవడంలో తప్పేముంది?. సీనియర్ నాయకుడైన ప్రేమ్ సాగర్ రావు అయినా, రాజగోపాల్ రెడ్డి అయినా మంత్రి పదవులు కావాలని కోరుకోవడంలో తప్పేముంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారి తీసినట్టు తెలుస్తోంది. -
ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి: నారాయణ స్వామి
సాక్షి, చిత్తూరు జిల్లా: జీడి నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. జీడి నెల్లూరు మండలం వరత్తూరు పంచాయతీలో వైఎస్సార్సీపీ కార్యకర్త శంకర్‌రెడ్డికి చెందిన మామిడి తోటను ధ్వంసం చేశారు. టేకు చెట్లను కూడా టీడీపీ నేతలు నరికివేశారు. మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి.. రైతు శంకర్‌రెడ్డిను పరామర్శించారు.అనంతరం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎన్నడు ఇలాంటి సంఘటనలు జరగలేదని.. టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రైతులకు రక్షణ లేకుండా పోయింది. ఇదేనా చంద్రబాబు ప్రక్షాళన, సంపద సృష్టి అంటూ మాజీ నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. మామిడి తోట, టేకు చెట్లను నరికివేసి నాలుగు రోజులైంది. ఇప్పటివరకు రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. 1970 పట్టా, పాసు పుస్తకాలు శంకర్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చింది. పచ్చని చెట్లు నరికిన కుటుంబాలు బాగు పడింది లేదు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన పట్టించుకోలేదు. సమాధానం చెప్పలేదు. పాల సముద్రం మండలంలో ఇసుక, మట్టి, గ్రానైట్ సరిహద్దులో ఉన్న తమిళనాడుకు తరలిపోతున్నా పట్టించుకోవడం లేదు. సీఎం చంద్రబాబు గంగాధర నెల్లూరు పర్యటనలో వైఎస్సార్సీపీ నాయకులకు ఎలాంటి లబ్ధి చేకూర్చవద్దని బహిరంగ సభలో చెప్పారు.’’ అంటూ నారాయణ స్వామి గుర్తు చేశారు. -
రేవంత్ సర్కార్‌ను కూలిస్తే బీజేపీకి ఏం లాభం?: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడితే బీజేపీకి వచ్చే లాభం ఏంటని ఆయన ప్రశ్నించారు. తొందరపడి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలగొట్టమని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి ఐదేళ్లు సమయం ఉంది. ప్రభుత్వాన్ని కూల గొట్టడానికి గుజరాత్ వ్యాపారులకు పని లేదా? వ్యాపారులు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు.తాజాగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఉద్దేశ్యం మాకు లేదు. దీంతో, బీజేపీకి వచ్చే లాభమేమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అది అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదే. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఎటువంటి తొందర లేదు. త్వరలో కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుంది. భూములు అమ్మకం, మద్యం అమ్మకం, అప్పులు తేవడంలో తెలంగాణను నంబర్ వన్‌గా మార్చారు.అర్థరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టీ ఇలా చెట్లు నరికిన ఘటనలు దేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడ జరగలేదు. హెచ్‌సీయూలో చెట్లు కొట్టిన AI వీడియో పోస్టుపై కేసు పెడితే పెట్టుకోండి. భావితరాలకు ల్యాండ్ కాపాడాల్సిన బాధ్యత మనపైన ఉంది. భూములు అమ్మకం ద్వారానే ప్రభుత్వం నడపాలని అనుకోవద్దు. రేవంత్ ఏ బ్రాండ్ అనేది వచ్చే ఎన్నికల్లో తేలుతుంది. నేషనలిజమే నా బ్రాండ్. ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ఎస్ఎల్బీసీపై నేషనల్ డ్యాం సెక్యూరిటీ అథారిటీకి ఎలా ఫిర్యాదు చేస్తాం?. సింగరేణి కార్మికులకు ఐటీ పన్నులు మేం అధికారంలోకి వస్తే రియింబర్స్ చేస్తాం. సింగరేణి కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తారు. వాళ్లది వైట్ కాలర్ జాబ్ కాదు.సన్నబియ్యంపై.. ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్ర ప్రజల అవసరానికి అనుగుణంగా ఇస్తాం. కొన్ని రాష్ట్రాల్లో గోధుమలు కూడా సరఫరా చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కోటా కాకుండా ప్రతీ లబ్దిదారుడికి అదనంగా ఐదు కేజీల సన్న బియ్యం ఇచ్చి చూపించాలి. దొడ్డు బియ్యం పైసలతోనే సన్న బియ్యం ఇస్తున్నారు. దీంట్లో కొత్తగా ఏముంది? అని ప్రశ్నించారు.పార్లమెంట్ ఎన్నికలలో తమిళనాడులో నష్టపోయామని.. అక్కడ పొత్తుకు వెళ్లాం. య అధ్యక్షుడిగా నా పేరు ప్రచారంపై అటువంటి ప్రస్తావనే లేదు. దక్షిణాదికి లోక్ సభ సీట్లు తగ్గుతాయనేది గాలి ప్రచారం మాత్రమే. అన్యాయంగా వక్ఫ్ పేరుతో ఆక్రమించిన భూముల కోసమే కొంతమంది ఆందోళనలు చేస్తున్నారు. ఎంఐఎం నేతలు, అక్రమంగా లబ్ది పొందిన వారే ఆందోళనల్లో ఉన్నారు. ఏ ఒక్క సామాన్య, పేద ముస్లిం కూడా ఆందోళన చేయడం లేదు. వక్ఫ్ సవరణ చట్టం మీద భూ బకాసురులు ఉద్యమం చేస్తున్నారు. ముస్లిం ప్రార్థన మందిరాలను, వక్ఫ్‌కు సంబంధం లేదు’ అని అన్నారు. -
చంద్రబాబు పీ4 విధానం ఓ బోగస్: సీపీఐ రామకృష్ణ
సాక్షి, అనంతపురం: వక్ఫ్ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వడం దుర్మార్గమంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వక్ఫ్ బిల్లులో సవరణలు చేయకుండానే ఎందుకు మద్దతు ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. వక్ఫ్ బిల్లు దేశంలో లౌకిక వాదాన్ని దెబ్బతీసేలా ఉంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ఏం పని?’’ అంటూ రామకృష్ణ ప్రశ్నించారు.‘‘హిందూ ధార్మిక సంస్థల్లో ముస్లింలకు చోటిస్తారా?. ముస్లిం, క్రైస్తవ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం కన్నేసింది. చంద్రబాబు పీ4 విధానం ఓ బోగస్. తిరుపతిలో గోవుల మరణాలపై సమగ్ర విచారణ చేయాలి’’ అని రామకృష్ణ డిమాండ్ చేశారు.‘‘భూమన కరుణాకరరెడ్డి ఆరోపణలపై పాజిటివ్‌గా స్పందించాలి. సీఎం చంద్రబాబు, ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ప్రతి విషయం వైఎస్ జగన్‌కు ఆపాదించడం మంచి పద్ధతి కాదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ వైఖరి మార్చుకోవాలి’’ అని రామకృష్ణ హితవు పలికారు. -
‘కొత్త’ వ్యాఖ్యలతో పొలిటికల్ వార్.. కాంగ్రెస్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విసుగుచెందరని.. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.అధికార దాహంతో బీఆర్ఎస్ కుట్రలు.. మంత్రి పొంగులేటికాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి కూలుస్తామంటున్నారు.. అధికారదాహంతో బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు. భూ భారతి తీసుకొచ్చామని కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆందోళన చెందుతున్నారు. భూ భారతి తీసుకొచ్చాక భూములు కొల్లగొట్టినవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్‌రెడ్డి. కేసీఆర్ సూచన మేరకే ఆయన మాట్లాడారు. కేసీఆర్ అధికారంలోకి ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నారు. భూ భారతితో పేదవాడికి న్యాయం జరుగుతోంది’’ అని పొంగులేటి చెప్పుకొచ్చారు.కేసు బుక్ చేయాలి.. ఆది శ్రీనివాస్‌కొత్త ప్రభాకర్‌రెడ్డి వాఖ్యలు సీరియస్‌గా పరిగణించాలంటూ ప్రభుత్వ విప్, వేమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాన్ని పడగొడతామని మాట్లాడుతున్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి పై కేసు బుక్ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తా. సంక్షేమం ప్రజలకు అందుతుందనే బీఆర్ఎస్ కుట్ర చేస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు.