‘దమ్ముంటే ఒంటరిగా రా’.. కంగనాపై రాఖీ తిరుగుబాటు | Rakhi Sawant Slams Kangana Ranaut Over Controversial Comments On Gen Z, Defends Young Protesters, More Details Inside | Sakshi
Sakshi News home page

‘దమ్ముంటే ఒంటరిగా రా’.. కంగనాపై రాఖీ తిరుగుబాటు

Jul 29 2026 1:57 PM | Updated on Jul 29 2026 2:36 PM

Rakhi Sawant Slams Kangana Ranaut Over Gen Z Protesters Remarks

జంతర్‌మంతర్ వద్ద జరిగిన జెన్ జెడ్ విద్యార్థుల నిరసనలపై ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నటి రాఖీ సావంత్ తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులకు, దేశ యువతకు మద్దతుగా నిలిచిన ఆమె, కంగనా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల కంగనా రనౌత్ జెన్ జెడ్  వారిని ‘జనరేషన్ గట్టర్’ అని అభివర్ణించడంతో పాటు, నిరసనల్లో పాల్గొన్న యువతులపై వివాదాస్పద కామెంట్లు చేశారు.

దీనిపై రాఖీ సావంత్ తీవ్రంగా స్పందిస్తూ, దేశంలోని యువతులు, విద్యార్థినుల గురించి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసిన రాఖీ సావంత్, కంగనా రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంపీగా ఎలా ఎదిగారని ప్రశ్నించారు. ‘మీకు ధైర్యం ఉంటే సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా బయటకు తిరగండి. అప్పుడే దేశంలోని యువత శక్తి ఏంటో మీకు తెలుస్తుంది’ అని సవాలు విసిరారు.

పార్లమెంట్‌లో కూర్చుని ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బాలీవుడ్‌లో కంగనా గత వివాదాలను గుర్తుచేస్తూ, ఆమె భాషపై తీవ్ర ఆక్షేపణ తెలిపారు. మరోవైపు, కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో జెన్ జెడ్ నిరసనల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిరసనల్లోని రీల్స్ చూసి తాను దిగ్భ్రాంతి చెందానని, కొద్దిరోజులు డిజిటల్ డిటాక్స్‌లోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. సాంప్రదాయ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరిపై ఆమె మండిపడ్డారు. ఈ పరిణామాలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement