ఏసీపీ మనస్వి వసిష్ఠ్‌పై సస్పెన్షన్ వేటు | Delhi Police ACP Manasvi Vashistha suspended after protest outside headquarters | Sakshi
Sakshi News home page

ఏసీపీ మనస్వి వసిష్ఠ్‌పై సస్పెన్షన్ వేటు

Nov 3 2026 1:22 PM | Updated on Nov 3 2026 3:20 PM

Delhi Police ACP Manasvi Vashistha suspended after protest outside headquarters

సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వెలుపల జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) మనస్వి వసిష్ఠ్‌ను కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ (MHA) సస్పెండ్ చేసింది. బలగాల క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఈ చర్య తీసుకుంది. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసు విభాగంలో ఇలా బహిరంగ నిరసన చేపట్టడం , క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడటం తీవ్రమైన విషయంగా పరిగణిస్తూ, హోమ్ మంత్రిత్వ శాఖ  ఏసీపీపై సస్పెన్షన్ వేటు వేసింది.


ఇటీవల పోలీసు సిబ్బంది చేపట్టిన నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించిన  ఏసీపీ మనస్వి వశిష్టకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు  ఆయనపై వేటు వేశారు.  షాహ్దరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పోలీసులు, న్యాయవాదుల మధ్య తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో అక్టోబర్ 28న ఏసీపీ మనస్వితో పాటు, షాదరా SHO ఇన్‌స్పెక్టర్ అరుణ్ కుమార్‌లను  వేరే పోస్టింగ్‌లకు బదిలీ చేశారు. ఈ బదిలీలను నిరసిస్తూ దాదాపు 150 మంది ఢిల్లీ పోలీస్ సిబ్బంది (మహిళా అధికారులు, సీనియర్ సిబ్బందితో సహా) పోలీస్ ప్రధాన కార్యాలయం వెలుపల ధర్నా నిర్వహించారు. ఏసీపీ మనస్వి, ఆరుణ్‌ కుమార్‌ బదిలీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ  ప్లకార్డులు, పోస్టర్లతో భారీ ఎత్తున నిరసనకు దిగారు.  ఈ నిరసనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: బేషరతుగా క్షమాపణలు చెప్పిన నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement