20 అడుగుల ముత్యాల హనుమాన్‌ : దీపావళి వేళ అద్భుతం | 20 foot Lord Hanuman idol made with 2-5 lakh pearls draws crowds in Raipur | Sakshi
Sakshi News home page

20 అడుగుల ముత్యాల హనుమాన్‌ : దీపావళి వేళ అద్భుతం

Nov 3 2026 3:17 PM | Updated on Nov 3 2026 3:22 PM

20 foot Lord Hanuman idol made with 2-5 lakh pearls draws crowds in Raipur

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నగరం ఈ దీపావళి పండుగ వేళ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక, కళాఖండానికి వేదికైంది. దాదాపు 2.5 లక్షల ముత్యాలను ఉపయోగించి, ఎంతో కళాత్మకంగా రూపుదిద్దిన  హనుమాన్‌ విగ్రహం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

రాయ్‌పూర్‌లో ఈ దీపావళి పండుగ సందర్భంగా 20 అడుగుల ఆంజనేయ స్వామి  విగ్రహాన్ని చూసి భక్తులు మురిసిపోతున్నారు. స్థానిక అవినాష్ మాగ్నెటో మాల్ (Avinash Magneto Mall)లో సుమారు 2.5 లక్షల ముత్యాలతో 20 అడుగుల ఎత్తైన హనుమంతుడి ముత్యాల విగ్రహాన్ని (Pearl Hanuman Statue) ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.  నిపుణులైన కళాకారులు దాదాపు 300 గంటల పాటు శ్రమించి ఈ అద్భుత రూపాన్ని ఆవిష్కరించడం విశేషం.

ఈ సందర్భంగా మాల్ సీఈఓ రాజ్ కుజూర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దీపావళికి రాయ్‌పూర్ ప్రజలకు ఏదో ఒక కొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈసారి ఈ వినూత్న అలంకరణ చేశామని తెలిపారు. 4D ఎఫెక్ట్‌తో అద్భుతంగా  రూపొందించారు.  సాంప్రదాయక విగ్రహాల మాదిరిగా కాకుండా, నిలువుగా వేలాడే వందలాది దారాలకు తెల్లటి ముత్యాలు, పూసలతో తీర్చిదిద్దారు.  ఫలితంగా హనుమంతుడు గాల్లో తేలుతున్నట్లు (Floating Effect) అనిపిస్తుంది. సందర్శకులు చూసే కోణాన్ని బట్టి (Angle) ఈ విగ్రహ రూపం త్రీ-డైమెన్షనల్ (3D) లేదా 4D భ్రమను కలిగిస్తూ కనిపిస్తుంది.

 

 

రామ్ దర్బార్ 
కాగా  ప్రతీ ఏడాది విభిన్నమైన పండుగ థీమ్‌లతో సందర్శకులకు ఆకట్టుకుంటూ  ఉంటుంది. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ముత్యాలతో అలంకరించిన హనుమంతుని విగ్రహంతో పాటు, పక్కనే మరో 1.5 లక్షల ముత్యాలతో రూపొందించిన శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులతో కూడిన భవ్యమైన 'రామ్ దర్బార్'  మరో విశేషంగా నిలుస్తోంది.  రామ్ దర్బార్ పండుగ శోభను మరింత పెంచుతోందన భక్తులు వేనోళ్ల కొనియాడుతున్నారు. కళాత్మకత, భక్తిభావం ఉట్టిపడేలా రూపొందించిన ఈ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ముత్యాల హనుమంతుడి విగ్రహం పట్ల ప్రజలు  ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement