బెంగళూరు: ఆనేకల్ తాలూకా ఎల్రక్టానిక్ సిటీ సమీపంలోని దొడ్డతోగూర్‌లో నూడుల్స్ మరీ కారంగా ఉన్నాయనే కారణంతో మొదలైన గొడవ హింసాత్మకంగా మారింది. ముగ్గురు ఫాస్ట్ ఫుడ్ షాపు సిబ్బందిని కొట్టారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. చామరాజ నగర్ జిల్లాకు చెందిన నాగరాజ్, చంద్రు, దేవరాజ్ పూటుగా మద్యం సేవించి రోడ్డు పక్కన ఉన్న ఫాస్ట్ ఫుడ్ షాపుకు వెళ్లి, నూడుల్స్ ఆర్డర్ చేశారు.
నూడుల్స్ కారంగా ఉన్నాయనే కారణంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. నిందితులు సిబ్బందిని కిందకు తోసి, కొట్టినట్లు సమాచారం. గొడవను ఆపడానికి వచ్చిన వ్యక్తిపై కూడా దాడి చేసి తరిమినట్లు తెలిసింది. ఈ దాడి దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. బాధితులను అస్సాంకు చెందిన దీపక్ థాపా, హేమ, లక్ష్మీ లామాగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఎల్రక్టానిక్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఇదీ చదవండి: కొత్త జంటకు వింత కానుక.. పాలు, పెరుగు ప్యాకెట్లు!


