విహారయాత్ర.. విషాదసంద్రం | Three Missinig In sea | Sakshi
Sakshi News home page

విహారయాత్ర.. విషాదసంద్రం

Nov 3 2026 7:53 AM | Updated on Nov 3 2026 7:53 AM

Three Missinig In sea

బెంగళూరు: ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ వద్ద అరేబియా సముద్ర తీరంలో ఆడుకుంటూ సముద్రంలో మునిగిపోయిన టెక్కీలలో మరొకరు మరణించారు. వీకెండ్‌ కావడంతో బెంగళూరు నుంచి ఓ కంపెనీకి చెందిన టెక్కీలు విహారయాత్రకు వెళ్లారు. ఈ సమయంలో ఆదివారం ఉదయం బీచ్‌లో ఆడుకుంటూ ఉండగా ఎత్తైన అలలు రావడంతో ముగ్గురు కొట్టుకుపోయారు. జార్ఖండ్‌కు చెందిన శోభా దాస్, బెంగళూరువాసి మొహమ్మద్‌ అక్రంలు నీట మునిగి చనిపోయారు. గల్లంతైన టెక్కీ విశ్వ (24) మృతదేహం సోమవారం గాలింపులో దొరికింది. మృతదేహాలకు కార్వార ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. వీరి వయస్సు 25 ఏళ్లలోపే ఉంటుంది. కుటుంబీకుల రోదనలతో ఆస్పత్రి మార్మోగింది.  

ప్రమాద హెచ్చరికలు  
ఈ ప్రమాదం తరువాత పోలీసులు మేలుకున్నారు. ప్రమాదం జరిగిన చోట సముద్రంలోకి దిగవద్దని మైక్‌లలో హెచ్చరిక చేస్తున్నారు. భారీ అలలతో పాటు వాతా­వరణ పరిస్థితిలో మార్పుల కారణంగా అపా­యం ఉందని అనౌన్స్‌ చేస్తున్నారు. ఇది ముందే చేసి ఉంటే ముగ్గురి ప్రాణాలు దక్కేవనే విమర్శలున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement