breaking news
missing
-
3,000 మంది జాడ గల్లంతు
బొగాటా: దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియాలో సోమవారం సంభవించిన పెను భూకంపం ధాటికి వేలాది మంది జాడ గల్లంతైంది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి కుప్పకూలిన భవనాల్లో మరణించిన వారి సంఖ్య మంగళవారానికి 224కు పెరిగింది. పశ్చిమ కొలంబియాను చివురుటాకులా వణికించిన పెనుభూకంపం ఘటనలో 3,000 మందికిపైగా జనం జాడ తెలీకుండాపోయిందని రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అంచనావేస్తున్నాయి. భూకంప ప్రభావిత కాలీ, పెరీరా, ఛోకో, మనిజేల్స్ ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సైనికులు ముమ్మరంగా అన్వేషణ, సహాయక చర్యలు చేపడుతున్నాయని ఆయా ప్రాంతాల మేయర్లు, గవర్నర్లు మంగళవారం ప్రకటించారు. అవిశ్రాంతంగా పనిచేస్తూ శిథిలాల కింద చిక్కుకున్న వారి జాడ కోసం వెతుకుతున్నారు. -
ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
పెడన: కృష్ణా జిల్లా పెడన మండలంలోని బల్లిపర్రు గ్రామంలో ఉన్న ఓ బాలికల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం కావడం, వారిని గుర్తించిన పోలీసులు క్షేమంగా విద్యా సంస్థకు చేర్చడంతో కథ సుఖాంతమైందని అంతా అనుకున్నారు. పోలీసుల విచారణలో ఈ అదృశ్యం వెనుక ఇద్దరు యువకుల ప్రమేయం ఉందని, వారు బాలికలపై లైంగికదాడి చేసినట్లు తేలింది. దీంతో వారిపై పోక్సో, లైంగికదాడి కేసులను శనివారం నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. ఈ నెల ఆరో తేదీన పాఠశాల నుంచి అదృశ్యమైన ఇద్దరు బాలికలు మచిలీపట్నంలోని కోనేరుసెంటరుకు చేరుకున్నారు. అనంతరం బందరు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మద్దాల శ్యామ్కిరణ్కు ఫోన్ చేశారు. బాలికల విషయం తెలుసుకున్న శ్యామ్‌కిరణ్ శారదానగర్‌కు చెందిన స్నేహితుడు ఆటో డ్రైవర్ కొక్కిలిగడ్డ సిద్దును వెంటతీసుకువెళ్లాడు. కోనేరుసెంటరులో ఉన్న ఇద్దరు బాలికలను వారిద్దరూ ఆటోలో ఎక్కించుకుని బందరు మండలం రుద్రవరం గ్రామంలోని టిడ్కో గృహాల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఖాళీగా ఉన్న ఒక ప్లాట్‌లోకి బాలికలను తీసుకువెళ్లి ఇరువురు యువకులు వారిపై లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం బాలికలను రుద్రవరం తీసుకెళ్లి ఒక బాలిక ఇంటి సమీపంలో వారిని విడిచిపెట్టారు. మరుసటి రోజు ఒక బాలిక అస్వస్థతకు గురికావడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు నిలదీయగా ఆ బాలిక జరిగిన విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు బాలికను తీసుకుని పోలీసులకు వద్దకు వెళ్లారు. బాలికలపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరు ఆటో డ్రైవర్లపై పోక్సో, లైంగికదాడి కేసు నమోదు చేసినట్లు పెడన పోలీసులు తెలిపారు. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాలతో దర్యాప్తును ముమ్మరం చేసినట్లు వారు పేర్కొన్నారు.చదవండి: ఇద్దరు బాలికల అదృశ్యంతో హైటెన్షన్ -
ఇద్దరు బాలికల అదృశ్యంతో హైటెన్షన్
కృష్ణాజిల్లా: మండలంలోని బల్లిపర్రు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం కావడంతో గురువారం రాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు వెనుక ప్రహరీ దూకి పరారయ్యారు. ఆ ఇరువురు మచిలీపట్నం కోనేరు సెంటరుకు చేరుకుని ఇరువురిలో ఒక బాలిక దారిన పోయే ఒక వ్యక్తిని ఫోన్ అడిగి, తల్లికి ఫోన్ చేసింది. ఫోన్ ఇచ్చిన వ్యక్తికి ఫోన్‌పే ద్వారా డబ్బులు వేయాలని కోరింది. దీంతో అనుమానం వచ్చిన తల్లి సదరు ఫోన్‌గల వ్యక్తికి మరోసారి ఫోన్ చేసి.. పిల్లలు ఎక్కడ ఉన్నారనే ఆరా తీసి.. వారిని ఆటో ఎక్కించి పంపించాలని సూచించింది. కలెక్టర్‌కు ఫిర్యాదు.. ఆ తరువాత ఆ తల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రూతమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో స్పందించిన ప్రిన్సిపాల్ జిల్లా కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్ వెంటనే జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో పెడన పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ వారు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి వారంతా గాలింపు చేపట్టారు. బాలికలు బల్లిపర్రు నుంచి మెయిన్ రోడ్డు వెంబడి నడుస్తూ పెడనకు చేరుకున్నారు. పెడనలో ఆటో ఎక్కి మచిలీపట్నం కోనేరు సెంటరుకు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచి మరొక ఆటో ఎక్కి రుద్రవరం వైపుగా వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. శుక్రవారం వేకువజామున బల్లిపర్రులోని గురుకుల పాఠశాలకు ఆ విద్యార్థినులను క్షేమంగా చేర్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. జరిగిన సంఘటనపై పెడన పోలీస్‌స్టేషన్‌లో ప్రిన్సిపాల్ గురువారం అర్ధరాత్రి ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. -
గాలించినా ఫలితం దక్కలేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సమీపంలోని నల్ల సముద్రంలో డ్రోన్ దాడి కారణంగా సరుకు నౌక నుంచి గల్లంతైన ఇద్దరు భారతీయ నావికుల ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. రొమేనియా, ఉక్రెయిన్లకు చెందిన అన్వేషక బృందాలు తీవ్ర గాలింపు చేపట్టినా ఫలితం దక్కలేదని తెలిపింది. ఈ మేరకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనానికి ఒక నివేదికను అందజేశారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో జూలై 25న నల్ల సముద్రంలో ఎంవీ ఏజీఎన్ రాగ్నార్ అనే సరుకు నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఘటనలో భారతీయ నావికులు దీపక్ కుమార్ గుప్తా, రామచంద్ర సముద్రంలో గల్లంతయ్యారు. దీపక్ సోదరుడు సందీప్ కుమార్ వేసిన పిటిషన్‌ను విచారించింది. ఆగస్ట్ 5 నాటికి అందిన సమాచారం మేరకు నావికుల ఆచూకీ లభించలేదని, కచ్చితమైన తాజా సమాచారం అందితే తప్ప గాలింపు సాధ్యం కాదని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. సంబంధిత ఏజెన్సీలతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వివరించారు. స్పందించిన ధర్మాసనం నావికుల ఉపాధి ఒప్పందాల్లో బీమా సదుపాయం ఉంటుందని, బాధిత కుటుంబాలకు తక్షణం బీమా సాయం అందేలా చూడాలని సూచించారు. ఈ వ్యవహారంలో మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన నౌక ఫస్ట్ ఆఫీసర్ (ప్రత్యక్ష సాక్షి)ను విచారించి ప్రమాదం జరిగిన ప్రదేశం ఇతర వివరాలు తెలుసుకోవాలని పిటిషనర్ కోరగా కేంద్రం ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్‌ను ముందుగా చదవాలని సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేస్తూ, ఈలోగా తీసుకున్న చర్యలపై తాజా నివేదిక సమరి్పంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. -
హైదరాబాద్‌లో పది లక్షల మంది ఓటర్లు గల్లంతు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో దాదాపు పది లక్షల మంది ఓటర్లు గల్లంతయ్యారు. జిల్లాలోని మొత్తం ఓటర్లు 47,36,669 మందిలో 9,95,315 మంది ఓటర్లు ఏమైపోయారో అధికారులకు అంతు చిక్కలేదు. మొత్తం ఓటర్లలో ఇది 21 శాతం. వీరిలో కొందరు మరణించిన వారున్నప్పటికీ మిగతా వారు ఎక్కడ ఉన్నారో, ఏమయ్యారో వివరాలు లభించలేదు. వీరు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉండవచ్చునని, లేదా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన ..ప్రస్తుతం వెళ్లిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఈ నెల పదో తేదీ వరకు గడువుండటంతో ఇందులో స్వల్ప మార్పులకు అవకాశం ఉంది. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. వీరిలో మృతులు పోను మిగతావారిని అధికారులు ఆచూకీ తెలియని జాబితాలో చేర్చారు. వీరిలో అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 88,933 మంది ఉండగా, అత్యల్పంగా అంబర్‌పేట నియోజకవర్గంలో 38,208 మంది ఉన్నారు. డిజిటలైజేషన్ అంతంతే.. అధికారులు ఎంతగా ప్రయత్నిస్తున్నా, ఇళ్లన్నీ తిరుగుతున్నా, రాజకీయ పార్టీలను అభ్యర్థిస్తున్నా, పార్టీల ఏజెంట్లను కోరుతున్నా ఎన్యూమరేషన్ ఫారాలు భర్తీ చేసి తిరిగి ఇచ్చిన వారు 27,26,655 మంది మాత్రమే. వీరి వివరాలు డిజిటలైజ్ చేశారు. ఇది 57.56 శాతం. మిగిలిన కొద్ది రోజుల్లో ఇంకెంతమంది ఫారాలు తిరిగి ఇస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఫారాల సమర్పణ గడువును ఇప్పటికే రెండు పర్యాయాలు పొడిగించడం తెలిసిందే. దీంతో, ఇవ్వాల్సిన వారి సంఖ్య స్వల్పంగా మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇక జిల్లాలోని ఓటర్లలో 4,91,236 మంది ఆన్లైన్ ద్వారా తమ ఎన్యూమరేషన్ ఫారా లు భర్తీచేశారు. వీరు 10.37 శాతంగా ఉన్నారు. 94 భవనాల నుంచి పోలింగ్ కేంద్రాల మార్పు రాజకీయనేతల ఇళ్లు, మతపరమైన ప్రదేశాలు, ఇతరత్రా సున్నిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఉండరాదన్న ఈసీఐ సెక్రటరీ ఆదేశాల నేపథ్యంలో 94 భవనాల్లోని పోలింగ్ కేంద్రాలను మార్చేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మేరకు వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో వివరించారు. ‘నామెన్‌క్లేచర్’లు మార్చాల్సిన పోలింగ్ కేంద్రాలు 39 ఉన్నట్లు గుర్తించారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణలో భాగంగా ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్న 71 పోలింగ్ కేంద్రాలను ఇతర కేంద్రాల్లో విలీనం లేదా రద్దు చేసేందుకు ప్రతిపాదించారు. ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమబదీ్ధకరణతో జిల్లాలో ప్రస్తుతం ఉన్న 4062 పోలింగ్ కేంద్రాల్లో 67 తగ్గి, 3995 పోలింగ్ కేంద్రాలు మిగలనున్నాయి. -
‘బిగ్ బీ’ రికార్డు: 83 ఏళ్ల వయసులో 24 గంటల షిఫ్ట్!
న్యూఢిల్లీ: ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’(కేబీసీ) 18వ సీజన్ కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన అంకితభావం మరోసారి చాటుకున్నారు. షో ప్రసార తేదీ సమీపిస్తున్న తరుణంలో ఆయన ఏకంగా 24 గంటల పాటు నిర్విరామంగా పనిచేశారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. గడువులోగా పని పూర్తి చేయకపోతే తన ఉద్యోగమే పోయేదని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.83 ఏళ్ల వయసులోనూ అమితాబ్ బచ్చన్ కనబరుస్తున్న ఈ వృత్తిపరమైన నిబద్ధత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొదటి రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఆయన పని, మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు నిర్విరామంగా సాగింది. ఆ సమయానికి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంతో కీలకమని, అందుకే దానిని విజయవంతంగా పూర్తి చేశానని ఆయన తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.కేబీసీ మొదటి ప్రసార తేదీ ఇప్పటికే ఖరారైందని, ఆ గడువును కోల్పోతే తన స్థానంలో మరొకరిని తీసుకునేవారని పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఈ క్విజ్ షో ప్రారంభమైనప్పటి నుంచి మూడో సీజన్ మినహా ప్రతి సీజన్‌కు ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. వయసురీత్యా వస్తున్న ఆరోగ్య సవాళ్లను లెక్కచేయకుండా ఆయన ప్రతి పనిని అత్యంత బాధ్యతతో నిర్వర్తిస్తున్నారు.ఇది కూడా చదవండి: నిర్లక్ష్యం వీడని ‘ఎన్టీఏ’.. ఈసారి ‘కీ’లో జాప్యం! -
రామాయణ ట్రైలర్ లో హనుమాన్ ఎక్కడ..?
-
నకిలీ వారసుడు! తల్లి అనుమానమే నిజమైంది!
‘కావమ్మ మొగుడు... కావమ్మ మొగుడు అని అందరూ అంటుంటే... కామోసనుకున్నాను నాకేం తెలుసు’ అన్నాడట ఒకడు. అలా అందరూ ‘అతడు తప్పిపోయిన మీ కొడుకే, అచ్చం అలాగే ఉన్నాడ’ని చెప్పడంతో వృద్ధాప్యంలో ఉన్న ఆ తండ్రి నిజమే అని నమ్మాడు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కొడుకు తిరిగొచ్చాడని, ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. కానీ, కన్నపేగు కదా! ఆ తల్లి ఆ వ్యక్తిని తన కొడుకుగా అంగీకరించలేకపోయింది. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు కోర్టుకు చేరింది. 41 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి ఎవరో తేలింది.‘వారసుడొచ్చాడు’ సినిమాలో వెంకటేష్‌లా, ‘అతడు’లో మహేష్‌బాబులా... కొడుకుగా ఆ వ్యక్తి మరొకరి ఇంటికెళ్లాడు. ఆ సినిమాల్లో హీరోలు ఆ కుటుంబాలను నిలబెట్టేందుకు వారసులుగా వెళ్లారు. కానీ ఈ వ్యక్తి ఆస్తులు కొట్టేసి, విలాసంగా జీవించేందుకు నకిలీ వారసుడిగా ఆ ఇంట అడుగుపెట్టాడు. అయితే నిజం నిలకడమీద తెలిసింది. అతని మోసం బట్టబయలైంది. ఆ తల్లి నమ్మకమే నిజమని రుజువైంది.బీహార్‌లోని నలందా జిల్లా ముర్గావస్ గ్రామానికి చెందిన కామేశ్వర్ సింగ్ ఓ భూస్వామి. 1977లో అతని ఏకైక కుమారుడు కన్హయ్య పరీక్ష రాయడానికి వెళ్లి తిరిగి రాలేదు. ఎంతగా గాలించినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా అతడి జాడ తెలియలేదు. చివరికి కామేశ్వర్ సింగ్ ఓ మంత్రగాడిని కలిశాడు. కొడుకు ఆచూకీ కోసం ఆరా తీశాడు. ‘మీ కొడుకు బతికే ఉన్నాడు. త్వరలోనే తిరిగొస్తాడ’ని అతడు చెప్పాడు. కానీ ఏళ్లు గడుస్తున్నా కొడుకు తిరిగి రాలేదు. ఆ బెంగతో కామేశ్వర్ ఆరోగ్యం క్షీణించింది. అయితే తన కొడుకు తిరిగొస్తాడనే ఆశ చావలేదు. కన్హయ్య తప్పిపోయిన నాలుగేళ్లకు అతడి ఊరికి సమీపంలోని ఓ గ్రామానికి ఓ యువకుడు కాషాయ వస్త్రాలు ధరించి వచ్చాడు. తాను ముర్గావస్ గ్రామానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి కుమారుడిగా చెప్పాడు. దీంతో ఆ గ్రామస్థులు అతడే కన్హయ్య అని భావించారు. ఆ విషయాన్ని కామేశ్వర్సింగ్కు చెప్పారు. ‘వయోభారంతో నా చూపు మందగించింది. అతడ్ని సరిగా గుర్తించలేకపోతున్నాను. మీరందరూ నాకొడుకే అని చెబుతున్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మి అతడ్ని నా ఇంటికి తీసుకెళ్తున్నా’ అని చెప్పాడు.అంగీకరించని తల్లి..తన కుమార్తె ఇంటి దగ్గర ఉన్న కామేశ్వర్ సింగ్ భార్య రామ్సఖీదేవికి కుమారుడు తిరిగొచ్చాడనే విషయం తెలిసింది. ఆ వ్యక్తిని చూసి తమ కుమారుడు కాదని స్పష్టంగా చెప్పింది. అయితే అతడు వచ్చిన తర్వాత నుంచి తన భర్త ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో కొంతకాలం వేచి చూసింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడి తల ఎడమ వైపున గాయం గుర్తు ఉండేదని, ఈ యువకుడి తలపై అలాంటి గుర్తులేవీ కనిపించడం లేదని తెలిపింది. తమ బంధువులు, ఉపాధ్యాయుల్ని సైతం ఆ వ్యక్తి గుర్తించలేదని పేర్కొంది. తమ కుమారుడి వేషంలో వచ్చిన అతడు ఓ మోసగాడని తేల్చి చెప్పింది.నాలుగు దశాబ్దాలు అదే కుటుంబంలోతల్లి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నెల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. తానే కన్హయ్యను అంటూ తిరిగి అదే ఇంటికి వెళ్లాడు. తండ్రి అతడ్ని నమ్మి ఇంట్లోనే ఉంచుకున్నాడు. అక్కడే ఉంటూ క్రమంగా ఆ కుటుంబంలో సభ్యుడిగా మారాడు. కన్హయ్య పేరుతో గుర్తింపు కార్డులు పొందాడు. డిగ్రీ పూర్తి చేశాడు. వివాహం చేసుకున్నాడు. నాలుగు దశాబ్దాల పాటు నకిలీ గుర్తింపుతో కొనసాగాడు. ఈలోగా భూస్వామికి చెందిన కొంత భూమిని సైతం విక్రయించాడు.చివరికి మిస్టరీ వీడిందిదయానంద్ గోసాయి పేరుతో జముయి జిల్లాలోని అతడి స్వగ్రామం చిరునామాతో ఉన్న ఓ లేఖ పోలీసులకు లభించింది. పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి విచారించారు. అతడి ఫొటో చూసిన కొందరు గ్రామస్థులు అతడు దయానంద్ గోసాయిగా గుర్తించారు. దీంతో అతడు దయానంద్ పేరుతో మరణ ధ్రువపత్రాన్ని సృష్టించాడు. అందులో 1982లో మరణించినట్టు నమోదు చేశారు. అయితే డెత్ సర్టిఫికెట్ 2014లో జారీ చేశారు. 32 ఏళ్ల తర్వాత జారీ చేయడంతో కోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. దీనికి తోడు కన్హయ్య పేరుతో జారీ అయిన గుర్తింపు పత్రాల్లోనూ పుట్టిన తేదీ వేర్వేరుగా ఉండడాన్ని కోర్టు గుర్తించింది.డీఎన్ఏ పరీక్షలకూ నిరాకరణకామేశ్వర్ సింగ్ కుటుంబ వారసుడా? కాదా? అని తేల్చేందుకు ఆధారమైన డీఎన్ఏ పరీక్షకు సైతం అతడు నిరాకరించాడు. తానే కన్హయ్య అని నిరూపించుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ అతడు ఉపయోగించుకోలేదు. వీటన్నిటినీ పరిశీలించిన కోర్టు అతడు కన్హయ్య సింగ్ కాదు దయానంద్ గోసాయి అని నిర్ధారించింది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఐపీసీ సెక్షన్ 419 కింద మూడేళ్లు, ఐపీసీ సెక్షన్ 420 కింద మూడేళ్లు, ఐపీసీ సెక్షన్ 120 బి కింద ఆరు నెలలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించింది. ఈ శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. 2022లో ఈ తీర్పు వెలువడింది. అప్పటికే ఆ తల్లిదండ్రులిరువురూ మృతి చెందారు. అయితే అసలు కన్హయ్య ఏమయ్యాడనే మిస్టరీ మాత్రం వీడలేదు.- దిలీప్ మాదిరెడ్డి -
బాలయ్య ఎక్కడ?
హైదరాబాద్: నగర పరిధి కొండాపూర్‌లోని ప్రేమ్‌నగర్‌లో నాలా పైప్‌లైన్‌లో పడి గల్లంతైన వృద్ధుడు బాలయ్య (70) ఆచూకీ 72 గంటలైనా దొరకలేదు. అధునాతన సాంకేతిక యంత్రాలతో ఐదు కిలోమీటర్ల నాలా, బాక్స్ పైప్‌లైన్, చెరువులలో గాలించినా కనీసం ఆనవాలు కనిపించలేదు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బాలయ్య కుటుంబంతో కలిసి 30 ఏళ్ల కిందటే నగరానికి వచ్చాడు. ప్రేమ్‌నగర్‌లో ఉంటున్న అతడు మంగళవారం రాత్రి 9.30 సమయంలో భారీ వర్షంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. వైశాలీనగర్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద జారిపడి పైప్లైన్లోకి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అప్పటినుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), విపత్తుల నివారణ విభాగాల సిబ్బంది గాలింపు చర్యలో పాల్గొంటున్నారు. డ్రోన్లు, బోట్లు బాలయ్య జాడ కోసం డ్రోన్లు, బోట్లు తదితర యంత్ర పరికరాలతో పైప్‌లైన్ దగ్గర మొదలుపెట్టి ఈర్ల చెరువు, గంగారం చెరువు మీదుగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, పటాన్చెరులో కూడా శేరిలింగంపల్లి జోన్ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది గాలించారు. వైశాలీనగర్ నుంచి భవానీపురం వరకు డ్రోన్ కెమెరాలతో, అమీన్పూర్ నుంచి పటాన్చెరు వరకు బోట్లలో పరిశీలించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, ఉప కమిషనర్లు, ఈఈలు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. సీఎంసీ నుంచి 200, హైడ్రా 200, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నుంచి 120, అగి్నమాపక విభాగం నుంచి 20 మంది, మరోవైపు పోలీస్ సిబ్బంది గాలింపులో పాల్గొంటున్నారు. ఒకవేళ నాలాలో పడితే ఎక్కడో అక్కడ దొరికే వీలుంది. కానీ, 5 కిలోమీటర్ల మేర వందల మంది సిబ్బందితో గాలించినా ఫలితం లేకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలయ్య అసలు పైప్‌లైన్‌లో పడ్డాడా? లేక ఇంకా ఏమైనా జరిగిందా? అనే కోణంలో ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. -
బ్రాడ్‌పీక్‌పై హిమపాతం
ఇస్లామాబాద్/కఠ్మాండు: పాకిస్తాన్‌లోని బ్రాడ్ పీక్‌పై సంభవించిన హిమపాతంతో పదిమందితో కూడిన పర్వతారోహకుల బృందం గల్లంతైంది. కారకోరమ్ పర్వతశ్రేణిలోని 8,051 మీ టర్ల ఎత్తయిన బ్రాడ్‌పీక్‌ను బ్రిటిష్ స్పెషల్ ఫో ర్సెస్ మాజీ సభ్యుడు, నేపాలీ ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా(43) సారథ్యంలోని 10 మంది పర్వతారోహకుల బృందం అధిరోహించేందుకు ప్రయతి్నంచింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 9 గంటల సమయంలో బ్రాడ్ పీక్‌పై 7 వేల మీటర్ల ఎత్తులో ఉండగా సంభవించిన హిమపాతంలో చిక్కుకుని ఈ బృందంలోని వారంతా గల్లంతయ్యారు. ఇందులో ఆరుగురు నేపాలీలు కాగా, పాక్, ఒమన్, అమెరికా, చైనాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు నలుగురు మృతదేహాలను వెలికి తీశామని ఆలై్పన్ క్లబ్ ఆఫ్ పాకిస్తాన్ (ఏసీపీ) ప్రెసిడెంట్ మేజర్ జనరల్ ఇర్ఫాన్ అర్షద్ తెలిపారు. ఈ నలుగురిలో ఒకరు నేపాల్ వాసి గురుంగ్ కాగా, మరొకరు ఒమన్ దేశస్తురాలు నదీరా అహ్మద్ అని చెప్పారు. మిగతా ఇద్దరినీ గుర్తించాల్సి ఉందన్నారు. అన్వేషణలో రెండు పాక్ మిలటరీ హెలికాప్టర్లు పాల్గొంటున్నాయని, అయితే వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా ఉందని పేర్కొన్నారు. కాగా, ట్రాకింగ్ డేటా ప్రకారం పూర్ణా ఇంకా కదులుతూ ఉండవచ్చని పూర్జా వ్యాపార భాగస్వామి అయిన మింగ్మా డేవిడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రాడ్ పీక్‌పై హిమపాతం సంభవించినప్పటి నుంచి పూర్జా ట్రాకింగ్ పరికరం లొకేషన్ మారుతూనే ఉందన్నారు. చైనా సరిహద్దుకు సమీపంలో గిల్గిట్–బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉన్న బ్రాడ్ పీక్ అధిరోహకులకు అత్యంత సవాళ్లతో కూడిన పర్వతాల్లో ఒకటి. ఎవరీ నిర్మల్ పూర్జా? పూర్జా ప్రపంచంలోని ప్రసిద్ధ పర్వతారోహకుల్లో ఒకరు. 2019లో కేవలం 6 నెలల వ్యవధిలోనే 8వేల మీటర్లకు మించి ఎత్తున్న 14 శిఖరాలను అధిరోహించి వెలుగులోకి వచ్చారు. పూర్జాకంటే ముందు ఈ రికార్డును దక్షిణ కొరియాకు చెందిన కిమ్ చాంగ్–హో నెలకొల్పారు. అయితే, ఆయన ఈ ఘనతను సాధించడానికి ఏడేళ్లు పట్టింది. పూర్జా సాధించిన ఘనతను ‘14 పీక్స్: నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్’పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చేశారు. పూర్జా 9 మంది నేపాలీ పర్వతారోహకులతో కలిసి ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన కే2 పర్వతాన్ని శీతాకాలంలో అధిరోహించి రికార్డు సృష్టించారు. అంతకుముందు పూర్జా బ్రిటిష్ సైన్యంలో 16 ఏళ్లు సేవలందించారు. 2018లో మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం అందుకున్నారు. -
కలకలం.. నలుగురు పాఠశాల విద్యార్థినులు అదృశ్యం
సంగారెడ్డి : జిల్లాలోని ఇస్నాపూర్‌లో ఒకేసారి నలుగురు పాఠశాల విద్యార్థినులు అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. బీహార్ రాష్ట్రానికి చెందిన నలుగురు బాలికలు ఇస్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈనెల 23వ తేదీన యథావిధిగా పాఠశాలకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లిన విద్యార్థినులు, సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి విచారించగా, ఆ రోజు వారు అసలు స్కూల్‌కే రాలేదని అక్కడి సిబ్బంది తెలిపారు.బాధిత కుటుంబాలు బీహార్‌కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. మిస్సింగ్ అయిన విద్యార్థినులను కుష్బూ కుమారి (16), మహిమా కుమారి (12), రోజా కుమారి (12), ప్రియా కుమారి (12)లుగా గుర్తించారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
15 ఏళ్ల జాతీయస్థాయి క్రీడాకారిణి అదృశ్యం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జాతీయ స్థాయి మహిళా షూటర్ అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హౌరాలోని తమ ఇంటినుంచి గురువారం సాయంత్రం బయటకు వెళ్లిన దమయంతి సేన్ అనే 15 ఏళ్ల షూటర్.. అటు తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. ఇంటి అవసరాల కోసం సరుకులు తేవడానికి వెళ్లిన ఆమె.. చివరిసారి రైల్వే స్టేషన్లో కనిపించింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ కుమార్తె ఎందుకు తిరిగి రాలేదో అనే విషయం అర్థం కాక సతమతమవుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆమె చివరిసారి హౌరా రైల్వే స్టేషన్లో కనిపించిన దృశ్యాలు తల్లిదండ్రులతో పాటు రాష్ట్ర షూటింగ్ క్రీడా వర్గాల్లో కూడా తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. తమతో ఎటువంటి విభేదాలు కూడా దమయంతికి లేవని, ఎందుకు బయటకు వెళ్లి తిరిగి రాలేదో తెలియడం లేదంటున్నారు. పింక్ టీ షర్ట్ ధరించి ఉన్న తమ అమ్మాయి ఎక్కడైనా, ఎవరికైనా కనిపిస్తే దయచేసి సమాచారం తెలపాలని వారు విన్నవించుకున్నారు. జాతీయ ట్రయల్స్‌కు ఎంపికైన తర్వాత దమయంతి ప్రతిరోజూ ప్రాక్టీస్ కోసం తెల్లవారుజామునే లేస్తూ, ఒక కఠినమైన దినచర్యను పాటించేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. కుటుంబంలో ఇటీవల ఎలాంటి విభేదాలు లేవని వారు చెప్పారు.పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌరా స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో గురువారం ఆమె నాలుగు, ఐదు ప్లాట్‌ఫారాల మధ్య తిరుగుతున్నట్లు కనిపించిందన్నారు. సీసీ కెమెరాలో ఆమె దొరికిన తర్వాత, ఆమె కదలికలను నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఆమె వద్ద మొబైల్ ఫోన్ కూడా ఉన్నట్లు తెలిపారు. షూటింగ్ వర్గాల్లో కలకలం..పశ్చిమ బెంగాల్‌కు చెందిన రైఫిల్ షూటర్ దమయంతి సేన్ ఇటీవల ప్రతిష్టాత్మకమైన జాతీయ జట్టు ఎంపిక ట్రయల్స్‌కు ఎంపికై తన క్రీడా జీవితంలోనే అతిపెద్ద విజయాన్ని అందుకుంది. సెంట్రల్ హౌరాకు చెందిన దమయంతి.. కోల్‌కతాలోని ప్రముఖ ఒలింపియన్ జాయ్దీప్ కర్మాకర్ రైఫిల్ షూటింగ్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి జూనియర్ షూటింగ్ స్క్వాడ్ ట్రయల్స్‌కు అర్హత సాధించడం ఆమె సాధించిన అతిపెద్ద ఘనత. ఈ ఎంపిక ద్వారా ఆమె భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అత్యంత కీలకమైన అవకాశాన్ని దక్కించుకుంది ఈ తరుణంలో ఆమె మిస్సింగ్ వార్త రాష్ట్రంలోని షూటింగ్ వర్గాల్లో కలకలంగా మారింది. -
ఒమన్ తీరంలో గల్లంతైన భారతీయుడి మృతి
మస్కట్: ఒమన్ తీరంలో జరిగిన వాణిజ్య నౌకపై దాడిలో పుణెకు చెందిన భారతీయ మెరైన్ ఇంజనీర్ హేరంబ్ కర్మార్కర్ (30) మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. హార్ముజ్ జలసంధి సమీపంలో ‘జిఎఫ్ఎస్ గెలాక్సీ’ అనే నౌకపై జరిగిన దాడిలో ఆయన గల్లంతయ్యారని తొలుత వార్తలు రాగా, తాజాగా ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో నౌకలోని ఇతర సిబ్బందిని రక్షించినప్పటికీ, కర్మార్కర్ ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనపై కర్మార్కర్ మామ వివేక్ టాండన్ మాట్లాడుతూ కర్మార్కర్ మృతదేహాన్ని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ విషయమై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు సంయుక్తంగా నౌక యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నాయి.మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన న్యాయపరమైన ప్రక్రియలను వేగవంతం చేసినట్లు సమాచారం. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అక్కడ పనిచేసే భారతీయ నావికుల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఈ దాడికి గల కారణాలు, జరిగిన పరిణామాలపై దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: ట్విషా శర్మ కేసు: సీబీఐకి సహకరించని అత్త, భర్త -
హార్ముజ్‌లో నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు
ఒమన్ తీరంలో సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్ ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడులు జరిపింది. దాడి తర్వాత ఓ భారతీయడు గల్లంతయ్యాడు. దాడులు కారణంగా 'జిఎఫ్ఎస్ గెలాక్సీ నౌకలో మంటలు చెలరేగాయి. నౌకలో ఉన్న మొత్తం 11 మంది భారతీయులలో 10 మందిని ఇప్పటివరకు సురక్షితంగా రక్షించగా.. మరొకరు గల్లంతయినట్లు భారత ప్రభుత్వం ధృవీకరించింది.ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. శనివారం అర్ధరాత్రి ఇరాన్‌పై మూడో విడతగా యూఎస్ మిలిటరీ భారీ వైమానిక దాడులు చేసింది. తాజా దాడుల్లో ఇరాన్, డ్రోన్, క్షిపణి కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగింది. 140 ప్రాంతాలను ధ్వంసం చేశామని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ ఒక్కవారంలోనే అమెరికా జరిపిన 3 విడతల దాడుల్లో ఇరాన్‌కు చెందిన 300కు పైగా వ్యూహాత్మక సైనిక కేంద్రాలు తగలబడ్డాయి. -
ప్రభుత్వ హాస్టల్లో మైనర్ బాలికల అదృశ్యం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు నగరంపాలెంలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలోని ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమైన ఘటన పై నగరంపాలెం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..శుక్రవారం 9 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఉన్న బాలికలు నగరంపాలెంలోని స్కూల్‌కు వచ్చారు. ఇద్దరు కలిసి వారి స్కూల్ బ్యాగులను పాఠశాల ఆవరణలో ఉంచి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో పాఠశాల, వసతి గృహం నిర్వాహకులు నగరంపాలెం పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ సత్యనారాయణ తన సిబ్బందితో ప్రభుత్వ వసతి గృహం వద్దకు వచ్చి బాలికల వివరాలను సేకరించారు. వసతి గృహ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. బాలికలు స్కూల్ యూనిఫామ్‌లో ఉన్నారని, వారి ఆచూకీ తెలిసిన వారు 8688831336, 8688831340, 8688831612, 8688831339 నంబర్లకు సమాచారమివ్వాలని కోరారు. -
హైదరాబాద్ దంపతులు మిస్సింగ్.. స్విట్జర్లాండ్‌లో కలకలం
-
విద్యార్థిని అదృశ్యం.. .. ఫ్రీ బస్సులో చక్కర్లు
మంచిర్యాల జిల్లా: చదువు ఇష్టం లేక ఓ విద్యార్థిని కాలేజీ నుంచి అదృశ్యమైంది. ఎక్కడికి వెళ్లిందోనని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు కేసును ఛేదించేందుకు ముప్పుతిప్పలు పడ్డారు. చివరికి కరీంనగర్లో పోలీసులకు చిక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉచిత బస్సులో మూడు రోజులు చక్కర్లు కొట్టినట్లు తెలుసుకుని అవాక్కయ్యారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం నుంచి ఈ నెల 5న తెల్లవారుజామున ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కోటపల్లి నుంచి మోటార్‌సైకిల్‌పై లిఫ్ట్ అడిగి వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం ఆధార్ కార్డుతో ఆర్టీసీ బస్సులో చెన్నూర్ నుంచి మంచిర్యాల, మంచిర్యాల నుంచి ఆదిలాబాద్, అక్కడి నుంచి మళ్లీ మంచిర్యాలకు వచ్చి కరీంనగర్‌కు వెళ్లింది. అక్కడి నుంచి బుధవారం హైదరాబాద్‌కు వెళ్లే ప్రయత్నంలో ఉండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యార్థిని గుర్తించారు. మిస్టరీని ఛేదించిన ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది జగదీశ్‌రెడ్డిని ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ కృష్ణ అభినందించారు. -
ఆ ఆరుగురి మత్స్యకారుల పరిస్థితి ఎలావుందంటే.. అక్కడి నుంచి వచ్చిన చిన్నా చెప్పిన విస్తుపోయే నిజాలు
-
చూస్తుండగానే ప్రాణాలు గాల్లో.. 6 ప్రాణాలు తీసిన.. 20 గంటల ఆలస్యం
-
కార్గో విమానం అదృశ్యం : సముద్రంలో కూలిపోయిందనే ఆందోళన
షార్జా నుండి కరాచీ వెళ్తున్న కె2 ఎయిర్వేస్ (K2 Airways) కు చెందిన బోయింగ్ 737 కార్గో విమానం (KTA1732) అదృశ్యమైంది. అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా కరాచీ సమీపంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఈ విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. నావిగేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ సమాచారం ఇచ్చిన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని ఫ్లైట్రాడార్24 భావిస్తోంది. అయితే పాకిస్తాన్ అధికారులు దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (PAA) తీర ప్రాంతంలో గాలింపు , రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసింది.ఏమి జరిగింది?పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9:18 గంటలకు విమానంలోని నావిగేషన్ సిస్టమ్‌లో సమస్య ఉన్నట్లు పైలట్ నివేదించారు. ఆ తర్వాత రాత్రి 9:21 గంటల సమయంలో విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోతూ, వేగంగా దిశ మార్చుకున్నట్లు రాడార్‌లో కనిపించింది. కరాచీకి పశ్చిమంగా 155 నాటికల్ మైళ్ల దూరంలో విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.భయంకరమైన వేగంతో కిందకు పడిపోయింది.ఇదీ చదవండి: కేతన్ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్ మ్యారేజ్ఫ్లైట్రాడార్24 (Flightradar24) డేటా ప్రకారం, విమానం నుండి చివరి సిగ్నల్ వచ్చేసరికి అది సముద్ర మట్టానికి కేవలం 1,100 అడుగుల ఎత్తులో ఉంది. అంతేకాదు, అది నిమిషానికి 22,400 అడుగుల అత్యంత వేగంతో కిందకు దూసుకుయింది. అదృశ్యమైన ఈ బోయింగ్ 737-400 విమానం 1999 నాటిది. మొదట ప్రయాణీకుల విమానంగా పనిచేసి, 2012లో కార్గో విమానంగా మారింది. 2024లోనే ఇది కె2 ఎయిర్వేస్ సంస్థలో చేరింది.ఇదీ చదవండి: 42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్ -
చిన్నా రాకపై కొనసాగుతున్న సందిగ్ధత
-
విశాఖ మత్స్య కారులు గల్లంతుపై వైఎస్ జగన్ ఆందోళన
-
‘సర్’ ఎఫెక్ట్: 15 లక్షల ‘ప్రవాస’ ఓట్లు గల్లంతు!
గల్ఫ్ కార్మికుల ఓట్ల గల్లంతుపై అందిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసింది. కరీంనగర్ టు గల్ఫ్.. ఓటు హక్కుపై నీలినీడలు కమ్ముకోవడంపై న్యాయవాది రామారావు ఇమ్మనేని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. 15 లక్షల మంది ప్రవాసాంధ్రుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న విషయాన్ని ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. పోర్టల్ లోపాల వల్ల వీసా పత్రాలు తిరస్కరణకు గురవుతున్నాయని న్యాయవాది రామారావు పేర్కొన్నారు. ఫామ్ 6A ఆన్లైన్ ఇబ్బందులతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదంలో గల్ఫ్ వలస కార్మికులు ఉన్నారని.. ఆయన పేర్కొన్నారు. ఓట్లతో పాటు ఆస్తుల హక్కులపైనా ప్రవాసులలో ఆందోళన నెలకొంది. అసంపూర్ణ అఫీషియల్ మ్యాపింగే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.ప్రధానంగా ఓట్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి మరింత సమయం ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదులో విన్నవించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళీకృతం చేస్తే నిరక్ష్యరాస్యులు సైతం తమ ఓటు హక్కును కాపాడుకోగలుతారని, కాని పక్షంలో ఓట్ల గల్లంతు జరుగుతుందనే విషయాన్ని న్యాయవాది రామారావు ఇమ్మనేని మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. బయట దేశాల్లో ఉన్న ఇక్కడ ఓటర్లకు ఇంట్లో వాళ్ల ద్వారా గుర్తింపు కార్డు ఇచ్చినా మాన్యువల్‌గా ఓటు నమోదు ప్రక్రియ కొనసాగేలే చూడాలన్నారు. ఓట్ల జాబితా సవరణలో భాగంగా సాంకేతిక ఆంశాల కారణంగా ఇలా ఓటు తిరస్కరణకు గురి కావడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ అంశానికి సంబంధించిన ఫిర్యాదును రిజస్టర్ చేసిన ఎన్హెచ్ఆర్సీ.. తెలంగాణ సీఈఓ సుదర్శన్‌రెడ్డిని ప్రతివాదిగా చేర్చింది. -
షాకింగ్ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం!
వెనిజులాలో గత మే నెలలో గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్న భారతీయ నావికుడి (సీఫేరర్) 33 ఏళ్ల రాకేష్ చౌహాన్ అనుమానాస్పద మరణంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణ అమెరికా దేశం నుండి స్వదేశానికి తీసుకువచ్చిన రాకేష్ చౌహాన్ కుటుంబ సభ్యులు అతని మృతదేహంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులతో సహా పలు అంతర్గత అవయవాలు మాయమయ్యాయని ఆరోపించారు. కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు భారతదేశంల నిర్వహించిన రీ-పోస్ట్‌మార్టం (Re-autopsy) నివేదికలో వెల్లడైన విషయాలు దిగ్భ్రాంతి రేపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాకేష్ మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని 'ఫెడరేషన్ ఆఫ్ సీఫేరర్స్ యూనియన్స్ ఆఫ్ ఇండియా' (FSUI) డిమాండ్ చేసింది. ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, వెనిజులా అధికారులు ఎలాంటి పోస్ట్‌మార్టం నివేదిక లేదా వివరాలు ఇవ్వకుండానే రాకేష్ భౌతికకాయాన్ని యూపీలోని డియోరియాలోని అతని స్వగ్రామానికి పంపించారని FSUI పేర్కొంది.The family of late Indian seafarer #RakeshChauhan is demanding the full autopsy report and immediate clarification on several deeply disturbing irregularities in the handling of his case in Venezuela.Serious questions that need answers:• Why were vital organs removed from his… pic.twitter.com/9sfCm5kb9A— FSUI (@FSUIINDIA) July 1, 2026 FSUI పోస్ట్ ప్రకారం మృతదేహంలో ఒక్క అవయవం కూడా లేదు. మెదడు, గుండె, రెండు ఊపిరితిత్తులు, కాలేయం (లివర్), మూత్రపిండాలు (కిడ్నీలు), ప్లీహం (స్లీన్), క్లోమం (పాంక్రియాస్), ప్యాంక్రియాస్, కడుపు, ప్రేగులు... ఇలా అన్నీ మాయ మయ్యాయి. అలాగే థైరాయిడ్, హయాడ్ ఎముక, లారింక్స్, శ్వాసనాళం కూడా లేవు. మృతదేహంపై గతంలోనే భారీగా కుట్లు వేసి ఉన్నాయి. మెడ నుండి ప్యూబిక్ సింఫిసిస్ వరకు 22 కుట్లు, ఒక చెవి నుండి మరో చెవి వరకు 21 కుట్లు ఉన్నాయి. మరణానికి ముందు జరిగిన గాయాల గుర్తులేవీ లేవు. మృతదేహాన్ని దాదాపు నెల రోజుల పాటు డీప్ ఫ్రీజర్‌లో ఉంచారు. శరీరంలో ఎలాంటి అవయవాలు లేకపోవడం వల్ల మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించలేక పోయారు.ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. సముద్రయాన కార్మికులు బలిపశువులుగా మారుతున్నారు. వెనిజులా అధికారుల నుండి పూర్తి విచారణ, జవాబుదారీతనం, వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే జోక్యం చేసుకొని, పూర్తి శవ పరీక్ష నివేదిక, మరణానికి గల కారణాలు, కుటుంబానికి న్యాయంతో పాటు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసింది. విదేశాల్లో భారతీయ కార్మికులను చూసే విధానం, పారదర్శకత, విదేశీ అధికారుల బాధ్యతలపై ఈ ఘటన అనేక తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తుతోందని నావికుడి కుటుంబ సభ్యులు, సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: అయోధ్య విరాళాల స్కామ్ : మాజీ ట్రస్టీకి బిగుస్తున్న ఉచ్చుకాగా యూపీలోని డియోరియా, లగ్దా బజార్ టోలా నివాసి అయిన చౌహాన్, నవంబర్ 2025లో ఒక వాణిజ్య నౌకాదళ నౌక సిబ్బందిలో భాగంగా వెనిజులాకు వెళ్లారు. రాకేష్‌ను ఆ నౌకలో పంపిన సంస్థ ఎక్స్ఫినిటీ. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం నౌకపై పడిన రాకేష్ గాయపడ్డారని చికిత్స పొందుతున్నారని తొలుత సమాచారం అందించిన కంపెనీ అధికారులు,ఆ మరుసటి రోజు ఉదయం, చౌహాన్ బతికే అవకాశాలు 95 శాతం లేవని, సాయంత్రానికి ఆయన మరణాన్ని ధృవీకరించింది. కారణాలపై వారు ఆరా తీయగా, కింద పడటం వల్ల కలిగిన తీవ్ర గాయాల కారణంగానే చనిపోయారని కంపెనీ పేర్కొంది. అలాగే వారంరోజుల్లో మృతదేహాన్ని అప్పగిస్తామన్న కంపెనీ దాదాపు ఒక నెల తర్వాత, అంటే జూన్ 4న మృతదేహాన్ని అప్పగించింది.ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్ -
రాహుల్ గాంధీ ‘మిస్సింగ్’ పోస్టర్ల కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ కలకలం రేగింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ‘కనిపించడం లేదు’ (మిస్సింగ్) అంటూ ఆదివారం ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లో వెలిసిన పోస్టర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ తాజా విదేశీ పర్యటనను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్‌లో ఈ పరిణామం సరికొత్త మలుపు తిప్పింది.అర్ధరాత్రి పోస్టర్ల కలకలంఢిల్లీలోని ఫిరోజ్‌షా రోడ్డుతో పాటు పలు ప్రధాన కూడళ్లలో రాహుల్ గాంధీ ఫోటోతో కూడిన ‘మిస్సింగ్’ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. అయితే, ఈ పోస్టర్లను ఎవరు అంటించారనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. పార్లమెంట్ సమావేశాలు, కీలక ఎన్నికలు, లేదా పార్టీ అంతర్గత ప్రాముఖ్యత కలిగిన సమయాల్లో రాహుల్ గాంధీ దేశంలో ఉండరంటూ శనివారం నుంచే బీజేపీ తన విమర్శల పదును పెంచిన మరుసటి రోజే ఈ పోస్టర్లు కలకలం రేపడం గమనార్హం.‘లీడర్ ఆఫ్ పర్యటన్’ఈ అంశంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ ఎంపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రతిపక్ష నేత పదవిని @లీడర్ ఆఫ్ పర్యటన్ (టూరిజం) అండ్ పార్టీయింగ్’గా మార్చేశారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ నడుస్తున్నప్పుడు లేదా దేశానికి, సొంత పార్టీకి ఆయన అవసరం ఉన్నప్పుడల్లా విదేశాలకు వెళ్లడం రాహుల్‌కు అలవాటుగా మారిందని, ప్రజల కంటే ఆయన టూరిజానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.మోదీ వర్సెస్ రాహుల్ఇదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరుతో రాహుల్ గాంధీని పూనావాలా పోల్చారు. పీఎం మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 9,000 రోజులకు పైగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజాసేవలో ఉన్నారని, కానీ రాహుల్ మాత్రం ఎప్పుడూ వెకేషన్ మూడ్‌లోనే ఉంటారని విమర్శించారు. రాహుల్ విదేశీ పర్యటనల ఖర్చుల వెనుక ఉన్న మూలాలను ప్రశ్నించిన ఆయన, దేశ వ్యతిరేక ఎజెండాను ప్రోత్సహించే శక్తులు దీని వెనుక ఉన్నాయంటూ ఆరోపించారు. కాగా, ఈ పోస్టర్లు, బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
అయోధ్య ట్రస్ట్ చీఫ్ రాజీనామా?
న్యూఢిల్లీ: అయోధ్య భవ్య రామమందిర నిర్మాణానికి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల దుర్వినియోగం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్‌తోపాటు మరో సభ్యుడు అనిల్ మిశ్రా శుక్రవారం రాజీనామా చేసినట్లు తెలిసింది. అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ వారిద్దరూ పదవుల నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా చేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) వెల్లడించింది. రాజీనామాపై సంప్రదించడానికి ప్రయత్నించగా, వారిద్దరూ అందుబాటులోకి రాలేదు. నిందితుల్లో ఒకడైన రామ్‌శంకర్ యాదవ్ గతంలో చంపత్ రాయ్ వద్ద డ్రైవర్‌గా పనిచేశాడని అధికారులు చెప్పారు. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు, నగదును ఆలయ ఖజానాకు చేర్చకుండా మాయం చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఫిర్యాదుతో పోలీసులు 8 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. నిందితులు రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ యాదవ్, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, కరుణేష్ పాండే, సుభాష్‌చంద్ర శ్రీవాస్తవ, రామశంకర్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్‌ను ‘సిట్’అధికారులు అరెస్టు చేశారు. ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్‌కి అత్యంత సన్నిహితుడైన ఆయన డ్రైవర్ రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ యాదవ్ ఈ కేసులో ప్రధాన నిందితుడు కావడం గమనార్హం. నిందితులపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), అవినీతి నిరోధక చట్టం నిబంధనల ప్రకారం... దొంగతనం, నేరపూరిత విశ్వాస ఘాతుకం, చోరీసొత్తు దాచడం, నేరపూరిత కుట్ర, ఉమ్మడి ఉద్దేశంతో నేరాలకు పాల్పడడం వంటి అభియోగాలు నమోదు చేశారు. విరాళాలుగా వచ్చిన నగదు, విలువైన వస్తువుల లెక్కింపులో వీరు పాల్గొనేవారని తెలిపారు. వీరిలో సుభాష్ చంద్ర శ్రీవాస్తవ మిగిలిన వారికి ఇన్చార్జ్గా వ్యవహరించేవారని చెప్పారు. పోలీసు కస్టడీకి నిందితులు 8 మంది నిందితులను తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 29 దాకా పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఇప్పటిదాకా రూ.79.85 లక్షలు స్వా«దీనం చేసుకున్నట్లు ప్రాసిక్యూషన్ ఆఫీసర్ కె.సి.వర్మ చెప్పారు. అరెస్టయిన వారిలో ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు బ్యాంకు ఉద్యోగులని, ఆలయంలో స్వీకరించిన నగదు విరాళాలను లెక్కించే పని కోసం వారిని నియమించారని, వారు బ్యాంకు నుంచి జీతాలు పొందుతున్నారని తెలిపారు. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవద్దు: యోగి సనాతన విలువలకు, ప్రజల విశ్వాసానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించబోమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం హెచ్చరించారు. అయోధ్య ఆలయ గౌరవాన్ని కాపాడటమే తమ కర్తవ్యమని చెప్పారు. ఎవరు తప్పు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు పని గట్టుకుని రామభక్తులే లక్ష్యంగా, అయోధ్య ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఎనిమిది మంది నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రామాలయ విరాళాల చోరీ ఆరోపణలపై సిట్ నివేదిక అందిన వెంటనే చర్యలు ప్రారంభించామని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవడం సరికాదని అన్నారు. రామజన్మభూమి ఉద్యమానికి, రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు నేడు భక్తుల విశ్వాసాలపై నకిలీ ప్రేమ ఒలకబోస్తున్నాయని మండిపడ్డారు. రామాలయంపై దిష్టి పెట్టొద్దని, రాముడి మర్యాదను కాపాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. రూ. కోటికి రసీదు అందలేదు: రౌత్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు శివసేన(ఉద్ధవ్) తరఫున ఇచ్చిన రూ.కోటి విరాళానికి ఇప్పటివరకూ రసీదు అందలేదని పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ శుక్రవారం ఆరోపించారు. పార్టీ ఇచ్చిన వెండి ఇటుకకు కూడా రసీదు అందలేదన్నారు. విరాళాల చోరీ సొమ్ముతోనే ఎంపీలు, ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు. పెద్దలను కాపాడుతున్నారు: కేజ్రీవాల్ రామాలయ విరాళాల చోరీ వ్యవహారంలో పెద్దవాళ్లను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. విరాళాల చోరీతో మహా పాపానికి ఒడిగట్టిన వారికి భగవంతుడు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని వేడుకున్నట్లు తెలిపారు. అయోధ్య పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఒక బూటకమని మండిపడ్డారు. ఇదీ నేపథ్యం అయోధ్య రామాలయానికి అందుతున్న విరాళాలు పక్కదారి పడుతున్నాయని ఈ నెల 7న మొట్టమొదటిసారి బయటకు వచ్చింది. శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వినతి మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 13న ‘సిట్’ ఏర్పాటు చేసింది. ‘సిట్’ 23న ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. 25న ఎఫ్ఐఆర్ నమోదు కాగా, ‘సిట్’సిఫారసుల మేరకు పోలీసులు నిందితులను గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. తాము అయోధ్య రామాలయ నిర్మాణానికి 200 వెండి ఇటుకలు సమర్పించామని, అందుకు తగిన రసీదులు అందలేదని, ఈ వెండిని ఏ అవసరం కోసం వినియోగించారో తెలపాలని సింధీ సామాజిక వర్గానికి చెందిన సంస్థ ప్రశ్నించింది. -
రియా కపూర్ రూ.1.35 కోట్ల చెవి రింగులు మాయం
ముంబై: ఇటీవల అమెరికా వెళ్లిన బాలీవుడ్ దర్శకురాలు, ఫ్యాషన్ స్టయిలిస్ట్ రియా కపూర్ అద్దెకు తెచ్చుకున్న రూ.1.35 కోట్ల విలువైన వజ్రపు చెవి రింగులను పోగొట్టుకున్నారు. ఈ మేరకు ఆమె సన్నిహితురాలు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుపై సహర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. న్యూయార్క్‌లో జరిగే మెట్ గాలాలో పాల్గొనేందుకు రియా కపూర్ ముంబైలోని మెహతా జువెల్లర్స్ అండ్ గోయెంకా జువెల్లర్స్ వద్ద ఖరీదైన రెండు జతల చెవి రింగులను అద్దెకు తీసుకున్నారు. వాటిని సవ్లీన్ సింగ్‌కు ఇవ్వగా, ఆమె తన బ్యాగులో పెట్టుకున్నారు. రియా, సవ్లీన్ బృందం ఏప్రిల్ 17వ తేదీన ముంబై నుంచి దుబాయ్‌కి, అక్కడి నుంచి న్యూయార్క్‌కు 28న చేరుకున్నారు. న్యూయార్క్‌లో బస చేసిన పియెర్రె హోటల్‌కు వెళ్లాక బ్యాగు తెరిచి చూడగా రెండు వేర్వేరు బాక్సుల్లో ఉన్న చెవి రింగులు కనిపించలేదు. వీటితోపాటు సుమారు రూ.లక్షన్నర విలువైన మరో రెండు జతల చెవిరింగులు బ్యాగులో లేవు. తిరిగి ముంబై వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆభరణాలు ముంబైలో మాయమయ్యాయా లేక దుబాయ్, అమెరికాలో ఎవరైనా దొంగిలించారా అనేది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు శనివారం తెలిపారు. -
ఫిన్లాండ్లో విద్యార్థి మణిదీప్ రెడ్డి మిస్సింగ్
ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్కు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ హైదరాబాద్‌కు చెందిన మణిదీప్ అనే యువకుడు దాదాపు నెలరోజులకు పైగా కనిపించకుండా పోయాడు. అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించినా సరైన సమాధానం లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్‌కు చెందిన మణిదీప్ రెడ్డి గుజ్జా ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్కు వెళ్లాడు. లాహ్టి (Lahti) నగరంలో ఉన్న ఎల్‌యూటీ యూనివర్సిటిలో విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే మే నెల 5వ తేదీ నుంచి కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోయినట్లు తెలుస్తోంది. ఫోన్, సోషల్ మీడియా సహా ఏ మార్గంలోనూ అతనితో సంప్రదింపులు జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.మణిదీప్ అదృశ్యమైన విషయం గురించి కాలేజీ యాజమాన్యాన్ని, సిబ్బందిని పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి గల్లంతైన విషయంపై కాలేజీ నుంచి కూడా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని వారు చెబుతున్నారు.ఇప్పటికే పలు మార్గాల్లో అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్న కుటుంబ సభ్యులు, భారత విదేశాంగ శాఖతో పాటు ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకుని తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీనే హైదరాబాద్‌కు చెందిన ఓ లాయర్ మణిదీప్ మిస్సింగ్ మీద ఓ ట్వీట్ చేయడం గమనార్హం.. 🚨 MISSING IN FINLAND 🇫🇮Manideep Reddy Gujja has been missing in Finland.Family and friends are urgently seeking any information regarding his whereabouts.📍 Last Contacted: May 5, 2026🎓 University: LUT University📍 City: Lahti, FinlandContact +91 78932 87099— Nipun Tulsyan (@NipunTulsyan) June 12, 2026 -
12 రోజులు అయింది చిన్నారి ఎక్కడ..? కంచెకు బొమ్మలు కట్టి..!
-
సాయికృష్ణను లాకప్‌లోనే కొట్టి చంపారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గాదె సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసులు కొట్టి చంపేసి, శవాన్ని తగులబెట్టేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సాయికృష్ణకు పెట్టిన చిత్రహింసలు, సాయికృష్ణ మృతదేహం∙ఫొటోలను ఆయన బయటపెట్టారు. ఇందుకు సంబంధించి ఒక సంచలన వీడియోను మంగళవారం రాత్రి విడుదల చేశారు. అందులో అంబటి ఏం చెప్పారంటే.. ‘23 ఏళ్ల గాదె సాయికృష్ణ కొంత క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న యువకుడు అని, అతనిపై కొన్ని కేసులు ఉన్నాయని మే 9న మార్కాపురం నుంచి విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు కస్టడీలోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ప్రశ్నగా మిగిలింది. సాయికృష్ణ ఉన్నాడా? చనిపోయాడా? సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అనేది ప్రశ్నగా మారింది. వాస్తవానికి గాదె సాయికృష్ణ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. ఆయన మేనమామ, వారి కుటుంబం రాధా, రంగాతో పనిచేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే గాదె సాయికృష్ణ మీద కొన్ని కేసులు ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కృష్ణలంకలో అతన్ని తీవ్రంగా హింసించారు. ఆ క్రమంలో గాదె సాయికృష్ణ చనిపోయాడని మాకు సమాచారముంది. సహజంగా లాకప్ డెత్ జరిగితే మసిపూసి మారేడు కాయ చేసి, కుటుంబ సభ్యులకు అప్పజెప్పి.. రాజీ కుదుర్చుకుని వెళ్లిపోతారు. ఇక్కడ దానికి భిన్నంగా మృతదేహాన్నే మాయం చేశారు. మృతదేహాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేసేశారు. టూ వీలర్‌పై ముందు ఒక కానిస్టేబుల్.. వెనుక మరో కానిస్టేబుల్ కూర్చుని.. మధ్యలో శవాన్ని పెట్టుకుని వెళ్లారు. అక్కడ దహనం చేసి, బూడిద కూడా మాయం చేశారు. అయితే పోలీసులు.. కోర్టుకు మాత్రం మాకు తెలియదు, ఎక్కడో ఉన్నాడు.. వెతుకుతున్నాము. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెతుకుతున్నామని చెబుతున్నారు. సాయికృష్ణ తల్లికి సీఐ నాగరాజు ‘మీ అబ్బాయ్ నాకు ఎదురు తిరిగాడు. వాడిని చంపేస్తాను. దండ రెడీ చేసుకో.. అని చెప్పి, మరీ చంపేసిన ఘటన ఇది. నీపై దాడిచేసి ఉండవచ్చు. అయితే పోలీసులు తీసుకొచ్చి చంపేస్తారా? రక్షకభట నిలయంలోనే భక్షణ చేసే కార్యక్రమం పోలీసులు చేస్తున్నారంటే ఏమిటి ధైర్యం? నేరం చేస్తే వారిని శిక్షించాల్సింది కోర్టులుఇటీవల తమిళనాడు మధురై కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తండ్రీకొడుకులు.. ఇద్దరినీ తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి పోలీసులు చంపేస్తే, దానిపై న్యాయ విచారణ జరిపి తొమ్మిది మంది పోలీసులను దోషులుగా నిర్ణయించి, తొమ్మిది మందికి ఉరిశిక్ష వేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఘటనలో బాధితుల కుటుంబానికి రూ.కోటి 40 లక్షలు నష్టపరిహారం చెల్లించారు. అలాంటి కఠిన నిర్ణయం కోర్టు తీసుకుంది. ఎందుకంటే పౌరుడికి జీవించే హక్కు ఉంది. నేరం చేస్తే వారిని శిక్షించాల్సింది పోలీసులు కాదు.. న్యాయస్థానాల అధికారాన్నీ పోలీసులు చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తుంటే ఇది ధర్మమేనా? సాయికృష్ణ నేరస్తుడైనా కూడా శిక్షను కోర్టులు నిర్ణయించాలి తప్ప.. సీఐలు, ఎస్సైలు కాదు. సాయికృష్ణను చంపేశారు.. కాబట్టి తల్లిదండ్రులు, బంధువులతో బేరాలు ఆడుతున్నారు. కోటి రూపాయలు ఇస్తాం.. మీరు కేసు వెనక్కు తీసుకోండని బతిమాలుతున్నారు. రేటు కూడా పెంచుతున్నారు. పోలీసులు సఫలమవుతారో, విఫలమవుతారో చూడాలి. డీజీపీ నుంచి కమిషనర్ వరకు ఈ నేరం తెలిసే జరిగిందని బయట చర్చ జరుగుతోంది. ఎవరైతే పోలీసులు మనిషి ప్రాణాన్ని తీసేశారో ఆ పోలీసు అధికారులకు శిక్ష పడేంత వరకు సమాజం కూడా పోరాటానికి మద్దతు ఇవ్వాలి’ అని అంబటి కోరారు.సాయికృష్ణ ఉంటే చూపించండిపోలీసులు చంపేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు హోం మంత్రి సమాధానం చెప్పాలి...బాధ్యులపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ కృష్ణలంకకి చెందిన గాదె సాయికృష్ణ కనిపించకుండాపోవడానికి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు డీసీపీ కేజీవీ సరితను మంగళవారం కలిసి వినతిపత్రమిచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని రోజులుగా సాయికృష్ణ కనిపించడం లేదని, పోలీసులే తీసుకెళ్లి చంపేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్న సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడో తెలియజేయాలని, ఈ ఘటన వెనుక దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. విజయవాడ పోలీసులపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయని, సివిల్ సెటిల్మెంట్లు, స్టేషన్ సెటిల్మెంట్లతో వారు బిజీ అయిపోయారన్నారు. వాస్తవాలు తెలియాలి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గాదె సాయికృష్ణ కనబడటం లేదని ఆయన తల్లి చెప్పిన మాటల ఆధారంగా వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణను ఇంటినుంచి తీసుకెళ్లినట్టు తల్లి చెబుతోందన్నారు. పోలీసులు ఇష్టానుసారంగా కొట్టి చంపేశారని ఆమె,ఇతర కుటుంబ సభ్యులు చెబుతున్నారని వివరించారు. సాయికృష్ణ విషయంలో పోలీసులు మౌనం వీడాలని, రాష్ట్ర హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలో పోలీసుల తీరుపై ఎన్నో విమర్శలు వస్తున్నాయన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోలేరని చెప్పారు. వైఎస్సార్సీపీ తరఫున సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, తూర్పు నియోజకవర్గ పరిశీలకుడు సర్నాల తిరుపతిరావు, సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎంపీతో కట్టుకట్టి కాలిగోళ్లు పీకేసి!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో సంచలనంగా మారిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఏపీలో పోలీసుల పనితీరు, దారుణంగా క్షీణించిన శాంతి భద్రతల దుస్థితిని బట్టబయలు చేస్తోంది. సాయికృష్ణను చిత్ర హింసలకు గురిచేసి కటకటాల వెనకే కనుమరుగు చేశారా? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. పోలీసులు చంపేశారయ్యా..! శవాన్ని అయినా ఇప్పించండయ్యా..! అంటూ సాయికృష్ణ తల్లి, మేనమామ ప్రాథేయపడటం దీనికి బలం చేకూరుస్తోంది. పోలీసులు తన కుమారుడిని తీసుకొచ్చారని సాయికృష్ణ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నా.. తమ ముందు వెంటనే హాజరు పరచాలని న్యాయస్థానం ఆదేశించినా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ కేసును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. కేసు వాపసు తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అక్రమ కేసుల్లో ఇరికిస్తామని హెచ్చరిస్తున్నట్లు సాయికృష్ణ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణ ఎక్కడ ఉన్నారనేది మిస్టరీగా మారింది. అయితే సాయికృష్ణ లాకప్ డెత్‌కు గురైనట్లు అత్యధికులు భావిస్తున్నారు. చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ పాలనలో పోలీసుల అరాచకానికి సాయికృష్ణ ఉదంతం తాజా తార్కాణంగా నిలుస్తోందని పేర్కొంటున్నారు. 2025 డిసెంబరు 3 తరువాత కేసులు ఏవీ లేకున్నా పోలీసులు ఎలా అదుపులోకి తీసుకున్నారు? దీని వెనుక కుట్రదాగి ఉందనే అనుమానం వ్యక్తం అవుతోంది. సాయికృష్ణను పోలీసులు ఏ విధంగా తీసుకెళ్లారు? ఎంతగా చిత్రహింసలు పెట్టారు? అనేది అతడి మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు ‘సాక్షి’ చానల్లో బహిర్గతం చేశారు. ఆయన ఏమన్నారంటే.. కూటమి ఎక్కడికి పోయింది? సాయికృష్ణ వంద శాతం లేడు. హ్యూమన్ రైట్స్ లాయర్లు, బార్ కౌన్సిల్ ద్వారా తొమ్మిది మందిని వెంట పెట్టుకుని మార్కాపురం వెళితే.. అయ్యా అరెస్టు చేసిన మాట వాస్తవమే. ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడు. ఫలానా పేర్లు ఇవీ..! ఇలా మాట్లాడుకున్నారు. చేతులు వెనక్కి కట్టి జంతువుల కన్నా హీనంగా తీసుకువచ్చారన్నారు. నా మేనల్లుడు నాకు కావాలి. ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. 45 రోజులుగా ఈ పార్టీలన్నీ ఏమై పోయాయి? కూటమి ఎక్కడికిపోయింది?మాకు మా బిడ్డ కావాలి. ఆ నాగరాజు మీద కేసు కూడా వద్దండీ. మాకు ఆఫర్ చేసిన రూపాయి కూడా వద్దు. ఈ రూపాయి ఎవరెవరు ఆఫర్ చేశారో, వాళ్లకు తెలుసు! తగలబెట్టే అధికారం ఎవరిచ్చారు..? పిల్లవాడ్ని చంపే అధికారం ఎవరిచ్చారండి? తగలబెట్టే అధికారం ఎవరిచ్చారండి? మీరు అరెస్టు చేశారు.. కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి.. బెయిల్ పెట్టుకుని బయటకు తెచ్చుకుంటాం. అనేక సంవత్సరాలుగా అరెస్టు వారెంట్లు రీకాల్ చేసుకునే వారున్నారు. వాడేమైనా కసబ్.. బర్మా నుంచి వచ్చిన కాందిశీకుడా? ఐఎస్ఐ తీవ్రవాదా? మావాడి బాడీ ఇవ్వాలి.. లేదంటే బూడిద ఇవ్వండి మాకు సపోర్ట్ చేస్తున్న లాయర్లను కూడా భయపెడుతున్నారు. మేం చావుకైనా సిద్ధమే! మా మేనల్లుడి చావు బతుకులు గురించి తెలియాలి. మావాడి బాడీ ఇవ్వాలి. లేదంటే బూడిద ఇవ్వండి.. లేదా డేట్ చెప్పండి.. కర్మకాండలు చేసుకుంటాం. మాకు కేసులు, కులాలు, పార్టీలు కాదు కావాల్సింది. అన్నీ వదిలేసి ప్రశాంతంగా బతుకుతున్నా. మమ్మల్ని కెలికారు. ఈ విషయంలో ఎక్కడికైనా వెళతా. సుప్రీం కోర్టు, హ్యూమన్ రైట్స్‌కు వెళతా. సీబీఐ వద్దకు వెళతా. వదిలే సమస్యే లేదు. ఆ ఏడుగుర్ని సస్పెండ్ చేయకపోతే.. ఈయన కొట్టుడు మొదలుపెడితే ఆగడండి..! గోళ్లు పీకే అవసరం ఎవరికి ఉందండి? గోళ్లు పీకాల్సిన పని ఏంటండి? ఎంత మంది పిల్లల గోళ్లు పీకేశాడండి..! అదే డాక్టరు వచ్చి పట్టకారు పెట్టి గోళ్లు పీకేయటం.. మళ్లీ కట్టుకట్టడం..! ఈయన సెటిల్మెంట్లు, యవ్వారాలు విజయవాడలో నాయకులకు తెలియదా? మా ఆవేదన ఆలోచించండి. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కక్ష లేదు. తప్పు చేసిన ఆ ఏడుగురు మినహాయించి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మాకు గౌరవం. ఆ ఏడుగుర్ని సస్పెండ్ చేయకపోతే డిపార్ట్మెంట్ మీద పోరాటం చేస్తాం. కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి నేను ఎలాంటి వెనుకడుగు వేయను. అమ్మా.. లేడమ్మా..! ‘అమ్మా.. లేడమ్మా! ఆయనకు మేం చెప్పలేం.. ఆయన మామూలుగా కొట్టలేదు. అమ్మా.. మామీద పెట్టమాకమ్మా.. మీ పిల్లోడు లేడమ్మా.. చచ్చిపోయాడు... అమ్మా ఏమనుకోవద్దమ్మా.. నన్ను మాత్రం ఇరికించవద్దమ్మా..’ అని ఆ స్టాఫే మాకు మొత్తం చెప్పారు. గోళ్లు తీసిన దగ్గర నుంచి.. కొట్టి పారేసిన దగ్గర నుంచి.. చంపి బాత్రూమ్లో పడేసిన దగ్గర నుంచి.. మొత్తం సమాచారం ఉంది. బాడీ తీసుకువెళ్లిన విధానం అంతా ఉంది. సాయికృష్ణ మిస్సింగ్‌పై విచారణాధికారిగా ఏసీపీ దుర్గారావు.. సాయికృష్ణ మిస్సింగ్‌పై విచారణ నిమిత్తం ప్రత్యేక అధికారిగా పశ్చిమ ఏసీపీ ఎన్.వి దుర్గారావును నియమిస్తూ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు ఉత్తర్వులు జారీ చేశారు. మిస్సింగ్‌పై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గోళ్లు పీకింది.. చంపింది వాస్తవం..!మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవు. ఇప్పుడు కూడా సీఐ నాగరాజు అంటే మాకు గౌరవమే. మాకు మా పిల్లాడి బాడీ కావాలి. అతడిని చంపింది వాస్తవం. కొట్టింది వాస్తవం. ఆస్పత్రికి తీసుకెళ్లి ఆర్ఎంపీతో గోళ్లు పీకించింది వాస్తవం. ఇంకా నేను చెప్పకూడదు. ఈ కేసుకు సంబంధించిన రహస్యాలు ఉన్నాయి. మీడియాలో పెట్టలేను. పార్టీలకు అతీతంగా వాస్తవాన్ని మాట్లాడా. ఇదే కూటమికి సపోర్ట్ చేశా. ఇదే కూటమి ఇప్పుడు ఏం చేస్తుందా? అని ఎదురు చూస్తున్నా. నీ కొడుకుకు దండ వేసుకో.. ఫొటో రెడీ చేసుకో.. చంపేస్తున్నా..! మా బాబును తీసుకెళ్లే ముందు తల్లి వద్దనున్న ఫోన్ తీసుకున్నారు. ఫోన్ ట్యాప్ చేసి మార్కాపురంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు. మా చెల్లికి అనుమానం వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్లు వెళ్లటం లేదు. మీ అబ్బాయిని అరెస్టు చేశారని, కృష్ణలంక స్టేషన్లో లాకప్‌లో ఉన్నాడని మా ప్రాంతానికి చెందిన వ్యక్తులు చెబితే అక్కడకు వెళ్లాం. కానీ కృష్ణను చూపించలేదు. ఫోన్ ఇవ్వలేదు. 24 సంవత్సరాల కుర్రాడు. వాయిదాకు రాలేదని ఇంత చేయటం అవసరమా? మీరు కొడుతున్నారని భయపడి ఎక్కడికో పారిపోయి బతుకుతుంటే వాడి వల్ల సమస్య ఏమైనా ఉందా? వారెంట్ పెండింగ్ ఒక్కటే కదా.. కొత్త కేసులు ఏమైనా ఉన్నాయా? బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చాడు కదా.. ఎందుకయ్యా వాడిని ఇలా చేస్తున్నారని అడిగితే సీఐ దుర్భాషలాడారు. నీ కొడుకుకు దండ వేసుకో.. ఫొటో రెడీ చేసుకో.. నీ కొడుకుని చంపేస్తున్నా..! అని అన్నారు. -
పాప ఎక్కడుందో కుక్కకే తెలుసు! జాను జాడ కోసం వేట..
-
కామారెడ్డిలో ఒకే కుటుంబంలో నలుగురు మిస్సింగ్..
-
మరో వాణిజ్యనౌకపై అమెరికా దాడి
న్యూఢిల్లీ: ఒమన్‌లోని సోహర్ నగరానికి సమీప హార్మూజ్ జలసంధి సముద్రజలాల్లో వాణిజ్య నౌక ‘ఎంటీ సెటెబెల్లో’పై బుధవారం అమెరికా సైన్యం దాడికి దిగింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి ఘటనలో ముగ్గురి జాడ గల్లంతైంది. అంతే సంఖ్యలో భారతీయులున్న మరో చమురు రవాణా నౌక ‘ఎంటీ మ్యారీవెక్స్’పై అమెరికా రెండ్రోజుల క్రితం దాడి చేయడంపై భారత్ ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న వేళ ‘ఎంటీ సెటెబెల్లో’ నౌకపై దాడి జరగడం గమనార్హం. దాడి ఘటనపై భారత్ బుధవారం ఘాటుగా స్పందించింది. ఢిల్లీలో అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్డి అఫైర్స్ జేసన్ మీక్స్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఈ మేరకు భారత్ అధికారిక ప్రకటన వెలువర్చింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని మోదీ సర్కార్ తప్పుబట్టింది. పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఇకనైనా ఆపాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ జలమార్గాలల్లో స్వేచ్ఛాయుత, నిరాటంకమైన నౌకాయానాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని పేర్కొంది. సెటెబెల్లో నౌకలోని 24 మంది భారతీయ సిబ్బందిలో ఇప్పటివరకు 21 మందిని రక్షించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోందని వార్తలొచ్చాయి. -
కార్గో నౌకపై దాడి ఘటన.. ముగ్గురు భారతీయుల గల్లంతు
ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. 21 మంది భారతీయులను రక్షించగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవాళ (బుధవారం) ధృవీకరించింది. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఒమన్ అధికారులతో కలిసి గాలింపు, సహాయక చర్యలు చేపట్టినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఒమన్ గల్ఫ్‌లోని సోహార్ తీరంలో పలావు (Palau) జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఇంజన్ రూమ్‌ను మిస్సైల్ తాకింది. దీంతో నౌకలో మంటలు చెలరేగాయి. ఈ నౌక ఒమాన్‌లోని సోహార్ పోర్టుకు ఈశాన్య దిశలో సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న సమయంలో దాడికి గురైన వెంటనే ప్రమాద సంకేతం (distress call) పంపింది. ఈ దాడి కారణంగా నౌకలో అగ్ని ప్రమాదం కూడా సంభవించినట్లు సమాచారం.కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా ఇరాన్‌కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు కేవలం అమెరికా-ఇరాన్ సంబంధాలకే పరిమితం కావు. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. -
గోదావరి నదిలో స్నానం.. ముగ్గురు గల్లంతు
సాక్షి, బాసర: గోదావరి నదిలో నదిలో స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. చంద్రశేఖర్, రామచందర్, మల్లేశ్‌గా గుర్తించారు. గల్లంతైన వారంతా కాచిగూడ చెప్పల్ బజార్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. వివరాలు తెలుసుకున్న వెంటనే సహాయక సిబ్బంది చర్యలు ప్రారంభించారు. గజ ఈతగాళ్లతో గాలింపులు చేపడుతున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
11 రోజులుగా విద్యార్థి అదృశ్యం.. పోలీసులు విచారణలో
సాక్షి, హైదరాబాద్: జగిత్యాలకు చెందిన రాహుల్ అనే బీటెక్ విద్యార్థి కనిపించడం లేదంటూ వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. రాహుల్ చదువుతున్న కాలేజీలో ఎంక్వైరీ చేశారు. సదరు అబ్బాయికి ఒక అమ్మాయితో గొడవ జరిగినట్లు సమాచారం. కాగా ఆయన చివరిసారిగా కాచిగూడలోని రైల్వేస్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు ఎక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాలు స్టేషన్ సీసీటీవీ చిత్రాలలో నమోదయ్యాయి.కాగా ప్రస్తుతం సదరు విద్యార్థి ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న రాహుల్ సైదాబాద్‌లోని ఓ ప్రైవేట్ హస్టల్లో నివాసం ఉంటున్నాడు. మే 27నుంచి విద్యార్థి కనిపించడం లేదు. విద్యార్థి మిస్సింగ్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
నీటికుంటలో పడి నలుగురు చిన్నారుల మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లా చెరువుకొమ్మ పాలెంలో విషాదం చోటు చేసుకుంది. నీటికుంటలో పడి నలుగురు చిన్నారులు మృతిచెందారు. 1) కరేటి అభిరామ్ (14) , కరేటి సుశాంత్ (12), పొదిలి చెన్ను (11) ఇల్లా దినేష్ (10)గా గుర్తించారు. చిన్నారుల మృతితో తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన చిన్నారులు చెరుకు పాలెంగా గుర్తించారు. చిన్నారులు నీటికుంటలో పడ్డారనే సమాచారంతో అప్రమత్తమైన స్థానికులు నీటికుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో నలుగురు చిన్నారులు మృత దేహాల్ని వెలికి తీశారు. చిన్నారులు మృతిపై కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
టీడీపీ నేత పొట్టలో మేక ‘మే..మే’ అని అరిచింది..!
‘అధికారంలోకి వచ్చాక ఎక్కువగా తిని పొట్ట ముందుకు వచ్చింది.. ఉక్కకు తట్టుకోలేకపోతున్నాం.. కాసింతైనా వాన పడింటే బాగుండు’ అనుకుంటున్న టీడీపీ నేతలను చల్లబరుస్తూ మేఘం వర్షించింది. అంతా బాగానే ఉన్నా వానలో ఒక ముక్క అయినా నమిలితే బాగుంటుందని కొందరు టీడీపీ నాయకులు మేకను కొట్టేశారు. ఎవరికీ తెలియకుండా దాన్ని కైమా చేసి ఆరగించారు. మేక ఊరుకుంటుందా? వారి పొట్టలోకి వెళ్లినా ‘మే..మే..’ అని అరిచింది.. విషయం అందరికీ తెలిసింది. పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు వరకు వెళ్లింది. ఇసుక, నల్లమట్టి, ఎర్రమట్టిని దోచుకుంటున్న టీడీపీ నేతలు తామేం గొప్పవారు కాదని, మేకను తిన్నవారే సంపద సృష్టించే అసలైన పార్టీ నాయకులని కీర్తిస్తూ గీతాలు పాడుతున్నారు. ఇది కథ కాదు.. గోనెగండ్లలో జరిగిన వాస్తవం. ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందంటే.. గోనెగండ్లలో ఒక మేక పొలం నుంచి దారితప్పి దగ్గరలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి చేరింది. దీన్ని గమనించి ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు డైరెక్టర్, టీడీపీ నాయకుడు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు, మరో ముగ్గురు కలిసి మేక తీసుకెళ్లారు. కోసుకొని కుప్పలుగా వేసి, పంపకాలు చేసుకుని, ఎవరికీ తెలియకుండా ఆరగించారు. ఈ విషయం మేక యాజమానికి తెలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు విచారణ చేసి మేక మాంసాన్ని ఆరగించిన టీడీపీ నాయకులను విచారణకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న సీపీఐకి చెందిన ఓ సీనియర్ నాయకుడు ‘మీరిద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు రచ్చకెక్కితే బాగోదు’ అంటూ సర్దిచెప్పారు. మేకను ఖరీదు చేసి పరిహారాన్ని బాధితుడికి ఇప్పించే విధంగా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఈ విషయం తెలిసి గోనెగండ్ల మండల ప్రజలు టీడీపీ నాయకులు ఇలాగా కూడా ఉంటారా అని నవ్వుకున్నారు. కర్నూలు -
ముంబై రోడ్లపై భిక్షాటన చేస్తూ దొరికిన మెడికో
నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన 25 ఏళ్ల వైద్య విద్యార్థి 47 రోజుల పాటు అదృశ్యమై, చివరకు ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ పోలీసుల కంటపడ్డాడు. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ యువకుడు, ఇన్ని రోజుల తరువాత తన కుటుంబానికి చేరువకావడంతో స్థానికలు కంట తడి పెట్టుకున్నారు.నాందేడ్ జిల్లాకు చెందిన అభయ్ సురేష్ బెల్కోని, హోమియోపతి మెడిసిన్ (బీహెచ్ఎంఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఏప్రిల్ 4న జల్గావ్లోని తన కళాశాలకు బయలుదేరిన అభయ్, దారిలో తన బ్యాగ్, ఫోన్ ముఖ్యమైన పత్రాలను పోగొట్టుకున్నాడు. తరువాత ముంబైకి చేరుకున్న అతను, ఆకలి తట్టుకోలేక రోడ్ల మీద బిచ్చమెత్తుకోవడం ప్రారంభించాడు. అభయ్ అదృశ్యంపై అతని కుటుంబ సభ్యులు ఏప్రిల్ 6 నుండే తీవ్ర ఆందోళన చెందుతూ, మే 16న తమ్సా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ముంబై పోలీసుల చొరవతో..ముంబైలోని మలాడ్ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన యాంటీ-బెగ్గింగ్ (బిచ్చగాళ్లపై) డ్రైవ్‌లో అభయ్ పోలీసులకు దొరికాడు. అతను శారీరకంగా చాలా బలహీనంగా ఉండటమే కాకుండా, మానసిక పరిస్థితి సరిగా లేక తన గురించి స్పష్టంగా చెప్పలేకపోయాడు. అయినప్పటికీ, పోలీసులు ఎంతో ఓపికగా ప్రయత్నించి, అతని పేరు, ఊరు వివరాలను సేకరించారు. ఆ వివరాలను నాందేడ్ పోలీసులకు తెలియపరచగా, అతను గల్లంతైన విద్యార్థి అని నిర్ధారణ అయ్యింది. అభయ్ దొరికిన విషయాన్ని పోలీసులు అతని తండ్రికి తెలియజేశారు. 47 రోజుల సుదీర్ఘ వేదన తర్వాత, తన కుమారుడు క్షేమంగా తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. -
మమత ఎక్కడ..? ఇద్దరు పిల్లలతో అదృశ్యం
పటాన్చెరు టౌన్: తల్లీ ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మల్లన్న దేవస్థానం సమీపంలోని ఎండీఆర్ హోమ్స్‌లో నివాసం ఉండే నాగిరెడ్డి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అతడి భార్య మమత (28), కుమారుడు శివరాం రెడ్డి, కూతురు బృందన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కాగా వారి కోసం తెలిసిన వారు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. మరో ఘటనలో..శివ్వంపేట(నర్సాపూర్): తల్లీ, కూతురు అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గోమారం గ్రామానికి చెందిన ఎరుకలి మమత, పెంటయ్య దంపతులకు సంసార విషయంలో వారం నుంచి గొడవలు జరుగుతున్నాయి. సోమవారం పెంటయ్య ధాన్యం బస్తాలు తీసుకుని కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లగా, భార్య మమత, కూతురు అఖిల కూరగాయలు విక్రయించేందుకు మార్కెట్‌కు వెళ్తున్నామని చెప్పి రాత్రి వరకు ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన పెంటయ్య బంధువులు, స్నేహితుల ఇండ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. -
పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఖతం.. దురంధర్ పనేనా..?
-
అదృశ్యమైన ఆ అరుదైన ‘పక్షి పిల్ల’ వెనుక మిస్టరీ ఏంటి?
గుజరాత్‌లోని 1,600 హెక్టార్ల నాలియా గడ్డిభూముల (గ్రాస్‌ల్యాండ్) పరిధిలో నెల రోజుల క్రితం ఓ అరుదైన బట్ట మేక పిట్ట పిల్ల జన్మించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్లను రక్షించడానికి ప్రభుత్వం.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా కల్పించింది. 24 గంటల పాటు 50 మందికి పైగా కాపలా కాశారు. అయినప్పటికీ ఆ బట్టమేక పక్షి పిల్ల అదృశ్యం కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే గత ఐదు, ఆరు రోజులుగా ఇది కనిపించకపోవడంతో.. ఏదైనా క్రూర జంతువు దానికి అపాయం తలపెట్టి ఉంటుందేమో అని అధికారులు తీవ్రంగా ఆందోళన చెందారు. కనిపించకుండా పోయిన ’గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్ల మిస్టరీ ఏమీ కాదని.. అది ఎగరడం నేర్చుకుందంటూ అధికారులు తేల్చారు. దాదాపు నెల వయసున్న ఆ పక్షి పిల్ల ఎగరడం ప్రారంభించిందన్నారు. ఆ పక్షి జాడ కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నామని తెలిపారు. పక్షి పిల్ల కావడంతో జియోట్యాగింగ్ చేయలేదని అధికారులు పేర్కొన్నారు.గుజరాత్లో దశాబ్ద కాలంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్ల జన్మించడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో కేవలం 150 మాత్రమే మిగిలాయి, వాటిలో ఎక్కువ రాజస్థాన్‌లోనే ఉన్నాయి. గత మార్చి 26వ తేదీన కచ్ ప్రాంతంలో ఈ అరుదైన పక్షి జన్మించింది. ఈ నేపథ్యలో దీన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వ కూడా పెద్ద ఎత్తున భద్రత కల్పించింది. అలాగే, ఈ పక్షి పిల్ల కదలికలను గమనించడానికి ప్రత్యేకంగా వాచ్ టవర్లను కూడా ఏర్పాటు చేశారు.పొడవైన తెల్లటి మెడ.. దాని చుట్టూ తెలుపు-నలుపు ఈకల హారం.. బంగారు/గోధుమ వర్ణపు వీపు.. తలపై నల్లని టోపీతో ఇట్టే ఆకర్షించే రూపం బట్టమేక పక్షుల సొంతం. విమానం మాదిరిగా నేలపై పరుగులు తీసి గాల్లోకి లేచి.. స్థిమితంగా.. లయబద్ధంగా విశాలమైన రెక్కలు కదిలిస్తూ గగన విహారం చేయడం వీటి ప్రత్యేకత. అరుదైన బట్టమేక పక్షులు మన దేశంలో అంతరించిపోయే స్థితికి చేరాయి.కొన్నేళ్లుగా చాలాచోట్ల వీటి జాడ కనిపించడం లేదు. 2008లో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 300 బట్టమేక పక్షులు ఉండగా.. ప్రస్తుతం వాటిసంఖ్య దేశవ్యాప్తంగా 150కి పడిపోయినట్టు తేలింది. ఏవి దొరికినా తిని కడుపు నింపుకోవడం వీటి ప్రత్యేకత. ధాన్యం గింజలు, పంటల కోత తర్వాత మిగిలిన మోళ్లు, వేళ్లు, పొలాల్లోని మిడతలు, పురుగులు, జెర్రులు, బల్లులు, తొండలు వంటివి వీటి ఆహారం. ఎగిరే పక్షుల్లో రెండవ అతి భారీ పక్షులుగా గుర్తింపు పొందినా.. నివాసానికి అనుకూల వాతావరణం లేక అంతరించిపోతున్నాయి. -
పోలీసులారా.. ఇదేం పని?
బెంగళూరు: పోలీసులు ఏమైనా చేయగలరు. నిజమైన నేరాలపై విచారణ చేయకుండా ప్రజలను తిప్పించుకుంటారు అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న అసంతృప్తి వ్యక్తంచేశారు. ఓ కేసులో పోలీసుల తీరును తప్పబట్టారు. రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా ఎంకె దొడ్డి పోలీసుస్టేషన్ పరిధిలో 2024లో రెండు పశువులు అదృశ్యమయ్యాయి. రెండేళ్ల తరువాత పశువుల సొంతదారు పక్కింటి వ్యక్తి సహా నలుగురిపై కేసు పెట్టాడు. తమకు సంబంధమే లేదని, ఈ కేసును కొట్టేయాలని మంగళమ్మ అనే నిందితురాలు హైకోర్టులో అర్జీ దాఖలు చేసింది. రెండేళ్ల తరువాత పొరుగింటివారిపై ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని పోలీసులను జడ్జి ప్రశ్నించారు. కనీస విచారణ జరపలేదని, ఇది చట్ట ఉల్లంఘన అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పశువులను వెతకటం మానేసి, సమాజంలో జరుగుతున్న తీవ్రమైన, నిజమైన నేరాల వెంటపడాలి. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఇలాంటి కేసులు మళ్లీ తమ దృష్టికి వస్తే పోలీసులపై కఠినంగా వ్యవహరిస్తానని తెలిపారు. -
భారత్ విద్యార్థిని.. ఆమె కోసం ఆరేళ్లుగా అమెరికా ఎందుకు వెతుకుతోంది?
వాషింగ్టన్: అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) . ఇప్పుడీ ఎఫ్‌బీఐకి భారతీయ విద్యార్థిని మయూషీ భగత్ కోసం ఆరేళ్లుగా అన్వేషిస్తుంది. అయినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో ప్రజల సాయం కోరుతూ ట్వీట్ చేసింది. మయూషీ భగత్ ఆచూకీ తెలపాలని, అందుకు బహుమానంగా 10వేల డాలర్లు బహుమతి ఇస్తామని ట్వీట్ చేసింది.అంతేకాదు, ఆమె ఆచూకీ ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచుతున్న వారిని గుర్తించి కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. గుజారాత్ వడోదరాకు చెందిన ఆయూషీ ఉన్నత చదువుల కోసం ఎఫ్-1 స్టూడెంట్ వీసా ద్వారా 2016లో అమెరికాకు వెళ్లింది. న్యూ హాంప్‌షైర్ యూనివర్సిటీలో చేరింది. ఆ తర్వాత న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఆ సమయంలో నూజెర్సీలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.ఈ క్రమంలో ఏప్రిల్ 29,2019న ఆమె ఆచూకీ గల్లంతయ్యింది. ఆ తర్వాత ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన కొన్ని గంటల వ్యవధిలో మయూషీ తండ్రి వాట్సప్ నెంబర్‌కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో మే 3వరకు ఇంటికి రాదని,ఆమె సురక్షితంగా ఉన్నారనేది ఆ మెసేజ్ సారాంశం. నాటి నుంచి మయూషి భగత్ ఆచూకీ కోసం ఎఫ్‌బీఐ గాలింపు చర్యలు చేపడుతూనే ఉంది. ఇప్పటికీ మయూషీ జాడ కోసం జల్లెడ పడుతూనే ఉంది. The #FBI offers a reward of up to $10,000 for info leading to the location or recovery of Mayushi Bhagat, and the identification, arrest, and conviction of those responsible. She was last seen in the evening hours of April 29, 2019, leaving her Jersey City, NJ apartment:… pic.twitter.com/CDt1WJjLhM— FBI (@FBI) April 13, 2026 -
రూ.1,856 కోట్ల నిఘా డ్రోన్ కనిపించుట లేదు
ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. నావికాదళానికి చెందిన అత్యంత ఖరీదైన నిఘా డ్రోన్‌ను అగ్రరాజ్యం కోల్పోయినట్టు సమాచారం. గురువారం హార్మూజ్ జలసంధి సమీపంలో గగనతలంలో సీక్రెట్ మిషన్ సందర్భంగా ఉదంతం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఎంక్యూ–4సీ ట్రైటాన్గా పిలిచే ఈ డ్రోన్ ఖరీదు ఏకంగా 20 కోట్ల డాలర్లు (రూ.1,856 కోట్లు) కావడం గమనార్హం. రాడార్ల నుంచి హఠాత్తుగా అదృశ్యం కావడం సంచలనాత్మకంగా మారింది. ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఎంక్యూ–4సీ ప్రమాదవశాత్తూ డ్రోన్ కూలిపోయిందా? లేక ఇరాన్ సైన్యం కూల్చివేసిందా? అనేది నిర్ధారణ కాలేదు. ఈ నిఘా డ్రోన్‌ను 2018లో అమెరికా సైన్యంలో ప్రవేశపెట్టారు. యుద్ధంలో కోల్పోవడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా ఇప్పటికే భారీగా నష్టపోయింది. ఎఫ్–15ఇ, ఎ–10 వంటి ఆధునిక యుద్ధ విమానాలు నేలకూలాయి. ఎంక్యూ–4సీను కోల్పోవడంతో ఆ నష్టం మరింత పెరుగుతోంది. తొమ్మిది ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లను కూడా అమెరికా నష్టపోయింది. మొత్తానికి పశ్చిమాసియా యుద్ధం అమెరికాకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. డ్రోన్ నుంచి అత్యవసర సంకేతం ఎంక్యూ–4సీ డ్రోన్ ఆచూకీ కోసం అమెరికా సైన్యం గాలిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం కనిపించడం లేదు. హార్మూజ్ జలసంధిపై మూడు గంటల మిషన్ తర్వాత ఈ డ్రోన్ ఇటలీ దేశం సిగోనెల్లాలోని తన స్థావరానికి తిరిగి వస్తుండగా కనిపించకుండా పోయింది. అదృశ్యమయ్యే ముందు అత్యంత వేగంగా కిందికి దిగినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపుతోంది. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే 50 వేల అడుగుల ఎత్తు నుంచి 10 వేల అడుగుల ఎత్తుకు దిగినట్లు చెబుతోంది. అత్యంత అధునాతనమైన మానవరహిత నిఘా డ్రోన్లలో ఒకటైన ఎంక్యూ–4సీ ట్రైటాన్ తొలుత సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించి ఆకస్మికంగా ఇరాన్ వైపు మళ్లింది. రాడార్ నుంచి అదృశ్యమయ్యే ముందు 7700 అనే కోడ్‌ను పంపించింది. ఇది ఒక అత్యవసర సంకేతం. అయితే, ఆ అత్యవసర పరిస్థితి ఏమిటన్నదానిపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అసలు హార్మూజ్ గగనతలంలోకి నిఘా డ్రోన్ ఎందుకు వెళ్లిందన్నది తెలియరాలేదు. పర్షియల్ గల్ఫ్ చుట్టుపక్కల పర్యవేక్షణ కోసం అమెరికా నావికాదళం గత నెల రోజులుగా ఎంక్యూ–4సీ ట్రైటాన్ను ఉపయోగిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఒకరోజు ముందు ఈ నెల 7వ తేదీన ఈ డ్రోన్ ఇరాన్‌లోని ఖర్గ్ ఐలాండ్‌పై చక్కర్లు కొట్టిందని చెబుతున్నారు. గతవారం ఎఫ్–15ఇ ఫైటర్ జెట్‌ను ఇరాన్ కూల్చివేసిన తర్వాత సహాయక చర్యల్లో డ్రోన్ పాలుపంచుకుంది. ఇది సాధారణ డ్రోన్ కాదు. సుదీర్ఘ కాలంపాటు సముద్ర నిఘా, పర్యవేక్షణ కోసం రూపొందించారు. 24 గంటలపాటు గాల్లో ఆగకుండా ఎగరగలదు. అమెరికా సైన్యానికి తురుపుముక్క లాంటి డ్రోన్ అదృశ్యం కావడం, ఇప్పటికీ ఆచూకీ లేకపోవడం మిస్టరీగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తల్లి తిట్టిందని.. సైకిల్ యాత్ర!
కామారెడ్డి టౌన్ : తల్లి మందలించిందనే మనస్తాపంతో ఇంటి నుంచి సైకిల్‌పై పారిపోయాడు ఓ 14 ఏళ్ల బాలుడు. సైకిల్‌పైనే జాతీయ రహదారిపై 50 కిలో మీటర్లు ప్రయాణం సాగించాడు. అర్ధరాత్రి వేళ ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆ బాలుడిని పోలీసులు గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు తల్లి మందలించడంతో పంతానికి పోయి మంగళవారం మధ్యాహ్నం సైకిల్‌పై ఇంటి నుంచి బయల్దేరాడు. సుమారు 50 కిలోమీటర్ల మేర ప్రయాణించి అర్ధరాత్రి 11 గంటల సమయంలో కామారెడ్డి సమీపంలోని టేక్రియాల్ జంక్షన్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో అక్కడ ఆపరేషన్ కవచ్ తనిఖీలు నిర్వహిస్తున్న దేవునిపల్లి పోలీసులు చీకట్లో ఒంటరిగా వెళ్తున్న బాలుడిని గమనించారు. అనుమానం వచ్చి ఆపి ప్రేమతో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అప్పటికే కుమారుడి ఆచూకీ కోసం గాలిస్తూ ఆందోళనలో ఉన్నవారు బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ నేరాల నియంత్రణతోపాటు పౌరుల రక్షణే ఆపరేషన్ కవచ్ ముఖ్య ఉద్దేశమన్నారు. అర్ధరాత్రి వేళ మానవీయ కోణంలో స్పందించి బాలుడి భవిష్యత్తును కాపాడిన దేవునిపల్లి పోలీసు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. -
పుష్పగిరి పెన్నా నదిలో ముగ్గురు గల్లంతు
వల్లూరు: వైఎస్సార్‌జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి పెన్నా నదిలో ముగ్గురు యువకులు స్నానానికి దిగి గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో గల్లంతైన వారిలో కడప టౌన్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన హర్షవర్ధన్ (22), కడప విశ్వనాధ పురానికి చెందిన హరిబాబు (25), కడప ఐటి సర్కిల్ కు చెందిన కృష్ణ చైతన్య (20) లుగా గుర్తించారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. హరిబాబు, హర్షవర్ధన్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన యువకుని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
గల్లంతైన అమెరికన్ పైలట్ ఆచూకీ లభ్యం!
ఇరాన్ దాడుల్లో ఎఫ్–15ఇ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే.. ఆ విమానంలో గల్లంతైన మరో పైలెట్ ఆచూకీ లభ్యమైంది. దాదాపు 36 గంటల తర్వాత పైలట్ ఆచూకీ లభించింది. పైలెట్‌ను అమెరికా భద్రతా బలగాలు రక్షించాయి. గల్లంతైన ఎఫ్-15ఈ ఫైటర్ జెట్ రెండో పైలట్ సేఫ్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ విజయవంతమైందన్నారు.‘‘ప్రస్తుతం పైలట్ అమెరికా బలగాల అధీనంలోనే ఉన్నారు. ఇరాన్‌లోని ప్రమాదకరమైన పర్వతాల్లో పైలట్‌ను గుర్తించారు. రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే బహిర్గతం చేయలేదు. శత్రు భూభాగంలోకి వెళ్లి ఎయిర్మెన్ను రక్షించడం చాలా గొప్ప విషయం. ఏ అమెరికన్ యోధుడిని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టం. ఇరాన్ గగనతలంపై అమెరికా తిరుగులేని ఆధిపత్యం సాధించింది’’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.శుక్రవారం నాటి ఇరాన్ దాడుల్లో ఎఫ్–15ఇ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానంతో పాటు కె–10 వార్ థగ్ ఫైటర్ జెట్‌ను కూడా అమెరికా కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, ‘‘కె–10 తాలూకు శకలాలు కువైట్ భూభాగంలో పడ్డాయి. దాంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎఫ్–15ను ఇరాన్ తమ గగనతనంలోనే వేయగా.. అందులోని ఓ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. వారు నైరుతి ఇరాన్‌లోని కొగిలుయె, బోయర్–అహ్మద్ కొంత ప్రాంతంలో కిందకు దూకారు. అమెరికా ప్రత్యేక సైనిక దళాలు వెంటనే రంగంలోకి దిగి వారిలో ఒకరిని కాపాడి తీసుకెళ్లాయి. గల్లంతైన రెండో పైలట్ కోసం శనివారం కూడా ముమ్మర గాలింపు కొనసాగింది. ఆ పైలెట్ ఆచూకీ లభించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా తెలిపారు.కాగా, హార్మూజ్ జలసంధిని మరో 48 గంటల్లో బేషరతుగా తెరవాలని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ‘‘హార్మూజ్‌ను తెరిచేందుకు మీకిచ్చిన గడువు ఏప్రిల్ 6తో ముగుస్తోంది. ఆలోపే ఒప్పందానికి రండి. లేదంటే భారీ దాడులతో మీకు అక్షరాలా నరకం చవిచూపిస్తాం’’అంటూ బెదిరింపులకు దిగారు. అయితే, ఇరాన్ శక్తిసామర్థ్యాలు గొప్పవంటూ ఈ సందర్భంగా ట్రంప్ అంగీకరించడం విశేషం. ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకదానితో 32 రోజులుగా మేం సైనిక పోరాటం చేస్తున్నాం’అని ఆయన చెప్పుకొచ్చారు. -
కూనవరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కూనవరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోదావరిలో పడి ఐదుగురు ఎస్ఆర్ఎం కాలేజీ విద్యార్థులు మృతి చెందటం బాధాకరమన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటన విషాదకరమని.. ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.కుక్కునూరు మండలం వేలేరు సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారిగా గుర్తించారు. గోక తేజ-ఉయ్యూరు (ఏపీ), నవదీప్-ఉయ్యూరు (ఏపీ), పాశం సతీష్ కుమార్, మదనపల్లి (ఏపీ), చారు గుండ్ల శ్రీకర్ భద్రాచలం (తెలంగాణ), పొడిచేటి అభిరామ్ భద్రాచలం (తెలంగాణ) గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్లతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలో ఐదుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. మిస్సింగ్ అయిన వాళ్ళంతా 10ఏళ్ల లోపు పిల్లలే. సింహాద్రి(10), కోదండ విజయ్(3) నిన్నటి నుంచి మిస్సింగ్ కాగా, ఇవాళ ఉదయం ముగ్గురు ఆడ పిల్లలు సీపల్(8), మరియం(5), ఆయాత్(7) అదృశ్యమయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన చిన్నారులు తిరిగి రాలేదు. పోలీసులు విచారణ చేపట్టారు. -
ఇరాన్ క్షిపణి దాడి.. కొద్దిలో తప్పించుకున్న బుర్జ్ ఖలీఫా
దుబాయ్: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ గల్ఫ్ దేశమైన దుబాయ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి ప్రతిచర్యగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం, దుబాయ్ గర్వకారణమైన బుర్జ్ ఖలీఫా సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. దీనిని సంబంధించిన దృశ్యాలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. 828 మీటర్ల ఎత్తుతో ఉన్న ఈ మహా కట్టడం సమీపంలో ఇరాన్ డ్రోన్ సంచరించినట్లు సమాచారం అందిన కొద్దిసేపటికే ఆ ప్రాంతంలో నల్లటి పొగలు అలుముకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ దాడి నేరుగా బుర్జ్ ఖలీఫాను లక్ష్యంగా చేసుకుని జరిగిందా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఇప్పటికే భవనాన్ని ఖాళీ చేయించారు. దుబాయ్ నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ పేలుళ్ల ధాటికి భయానక వాతావరణం ఏర్పడింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన పామ్ జుమేరా ప్రాంతంలో సంభవించిన పేలుడు కారణంగా ఒక భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయని దుబాయ్ మీడియా కార్యాలయం ధృవీకరించింది. మరోవైపు, ఇరాన్‌కు చెందిన ‘షాహెద్’ డ్రోన్ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో రెండు భవనాల మధ్యలో కూలిపోయి భారీ పేలుడుకు కారణమైంది. #IsraelIranConflict | Dubai's Burj Khalifa Hit By Iran Missile? Video Shows Explosion Near World's Tallest Building@shivaroor @vishnundtv pic.twitter.com/q1FSTkNaug— NDTV (@ndtv) February 28, 2026 -
అమెరికాలో కర్నాటక విద్యార్థి అదృశ్యం
న్యూయార్క్/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోరి్నయాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా పోయారు. కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) అమెరికాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్కిలీలో కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ పీజీ చేస్తున్నాడు. మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్‌టాప్, పాస్‌పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. సాకేత్ అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆచూకీ కనుగొనే విషయమై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కర్నాటకలోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని శనివారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి సాకేత్ కనిపించకుండాపోయాడంటూ అతడి రూమ్మేట్ బనీత్ సింగ్ ఈ నెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని చోట్లా వాకబు చేసిన తను ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపినట్లు బనీత్ తెలిపాడు. ప్రభుత్వానికి సాకేత్ తండ్రి వినతి అమెరికాలో గల్లంతైన తమ కుమారుడిని కనుగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన అందజేసినట్లు తండ్రి శ్రీనివాసయ్య తెలిపారు. చివరిసారిగా తమ కుమారుడితో ఈ నెల 9వ తేదీన ఫోన్లో మాట్లాడామన్నారు. 12వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ అతడి రూమ్మేట్ తమకు తెలిపాడన్నారు. కుమారుడి కోసం అమెరికా వెళ్లే విషయమై తాము ఆలోచిస్తున్నామన్నారు. సాకేత్ విషయంలో కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్ అధికారులు అక్కడి పోలీసులతో మాట్లాడాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కర్నాటక ప్రభుత్వం శనివారం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది. -
మంత్రి ఇలాకాలో ‘104’ వాహనాలు మాయం
సాక్షి, అన్నమయ్య జిల్లా: మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాకా రాయచోటిలో ‘104’ వాహనాలు మాయమయ్యాయి. మరమ్మతులు ఉన్నాయని పక్కన పెట్టిన నాలుగు 104 వాహనాలు అదృశ్యమయ్యాయి. రాయచోటి ప్రభుత్వాసుపత్రి ఆవరణ నుంచి 104 వాహనాలు మాయం కాగా.. ఎవరి అనుమతి లేకుండానే డంపింగ్ యార్డుకు కొంతమంది సిబ్బంది తరలించినట్లు సమాచారం.104లను ధ్వంసం చేసి వాటి సామాన్లు అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డంపింగ్ యార్డులో 104లను ధ్వంసం చేస్తున్న వీడియో.. సాక్షి చేతికి చిక్కింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. సిబ్బంది సహకారం లేకుండా ప్రభుత్వాసుపత్రి నుంచి డంపింగ్ యార్డుకు 104 వాహనాలు ఎలా వెళ్లాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, 104లను దొంగలించారంటూ ఆరు నెలల తర్వాత పోలీసులకు జిల్లా వైద్యాధికారి ఫిర్యాదు చేశారు. -
కొలంబియాలో ఫ్లైట్ మిస్.. ప్రయాణికుల క్షేమంపై ఆందోళన
కొలంబియాలో ఓ ప్రైవేట్ జెట్ మిస్సింగ్ ఆ దేశంలో కలకలం రేపుతుంది. ఆ దేశంలోని కుకుటా నగరం నుంచి టేకాఫ్ అయిన ఫ్లైట్ టేకాప్ అయ్యే ప్రాంతానికి చేరుకోకముందే కంట్రోలింగ్ టవర్స్‌తో సిగ్నల్స్ తెగిపోయాయి. ఈ ఫ్లైట్‌లో 13 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది.ఆ దేశ సరిహద్దు నగరం కుకుటా నుండి 13 ప్రయాణికులతో బయిలుదేరిన విమానం ఆదేశ కాలమానం ప్రకారం మధ్యాహ్నం12 గంటల ప్రాంతంలో ఒకానా నగరంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఆ సమయానికి కొద్ది సేపు ముందే కంట్రోలింగ్ టవర్స్‌తో ఆ ఫ్లైట్స్ సిగ్నల్స్ తెగిపోయినట్లు అక్కడి ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.అయితే ఫ్లైట్ మిస్సైన ప్రాంతం వెనిజువెలాకు సరిహద్దున ఉండడంతో పాటు అది పర్వతాలతో కూడిన ప్రాంతమని అక్కడ వాతావరణం సరిగ్గా ఉండదని అక్కడి అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆ విమానంలో ఆదేశానికి చెందిన ఒక శాసనసభ్యుడు ఉన్నట్లు సమాచారం. ఇటీవలే అమెరికాలో వాతావరణ అనూకూలించకపోవడంతో ఒక ప్రైవేట్ జెట్ కూలిన సంగతి తెలిసిందే. -
రెండు కంటైనర్లు.. రూ.400 కోట్లు.. అసలేం జరిగింది?
బెంగళూరు (బనశంకరి): గోవా నుంచి మహారాష్ట్రకు సుమారు రూ.400 కోట్ల నగదు తరలిస్తున్న రెండు ట్రక్ కంటైనర్లు కర్ణాటకలో అదృశ్యమయ్యాయి. అక్టోబర్‌లో బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా చోలార్ఘాట్లో ఈ కంటైనర్లు మాయమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిశోర్ సేఠ్ ఈ నగదును తరలిస్తున్నట్లు తెలిసింది. కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల పోలీసులు కంటైనర్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సిట్ ఏర్పాటుకు ఆదేశించారు.మహారాష్ట్రలో స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంచడానికి ఈ నగదు తరలిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖానాపుర తాలూకాలో ప్రమాదకర అటవీ ప్రదేశమైన చోలార్ఘాట్ ఈ కంటైనర్లు అదృశ్యమైన కొద్దిరోజులకు మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన సందీప్పాటిల్ను నగదును యజమాని కిశోర్ సేఠ్ అనుచరులు బంధించారు. నగదు నువ్వే అపహరించావని ఆరోపించి, వెనక్కి ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తామంటూ చిత్రహింసలు పెట్టారు.వారి చెరనుంచి తప్పించుకున్న సందీప్‌పాటిల్ ఈ నెల 1వ తేదీన నాసిక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రూ.400 కోట్ల నగదు కంటైనర్లు మాయం కావడంతో తనను కిడ్నాప్ చేశారని తెలిపాడు. నాసిక్ పోలీసులు గోవా, బెళగావి పోలీసులతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. ఐదుగురిని.. విరాట్గాం«దీ, జయేశ్ కదమ్, విశాల్‌నాయుడు, సునీల్ దుమాల్, జనార్దన్ దైగుడేలను అరెస్టు చేసి విచారిస్తున్నారు. వీరిలో విరాట్‌గాంధీ రాజస్థాన్‌కు చెందిన హవాలా ఆపరేటర్. ఇద్దరు నిందితులు.. అజార్ బిల్డర్, కిశోర్ సావ్లా పరారీలో ఉన్నారు. -
మిస్ అయిన ఫోన్ దొరికితే...ఆ ఆనందం వేరే లెవల్!
స్మార్ట్‌ఫోన్ చేతిలో లేనిదే రోజుగడవని పరిస్థితి. అంత అలవాటైపోయిన మొబైల్ పోగొట్టుకుంటే మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. దాని మీద ఆశలు వదిలేసు కుంటాం. కానీ పోయిందనుకున్న ఫోన్ అనూహ్యంగా మళ్లీ మన చేతికి వస్తే భలే ఆనందంగా ఉంటుంది కదా. సరిగ్గా ఒక మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది.టీవల చెత్తలో దొరికిన 45 లక్షల బంగారం, కార్మికురాలు నిజాయితీగా తిరిగి వచ్చిన వైరల్ అయింది. ఇది కూడా అలాంటి హృదయానికి హత్తుకునే ఘటన లాంటిదే. ఇన్స్టాగ్రామ్ యూజర్ రఘు అహిర్వర్ ఈ మొత్తం ఉదంతానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. దీని ప్రకారం తాను, తన సోదరితో కలిసి గ్రామం నుండి ఇండోర్‌కు ప్రయాణిస్తున్నప్పుడు, సోదరి ఒక మొబైల్‌ను గుర్తించింది. అదృష్టవశాత్తూ అన్‌లాక్‌లోనే ఉంది. దీంతో వారు కాల్లిస్ట్లోకి వెళ్లి లాస్ట్ కాల్ చేసిన నంబరుకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అహిర్వర్ ఫోన్ పోగొట్టుకున్నమహిళను కలుసుకుని, ఆమెకు ఫోన్‌ను తిరిగి ఇచ్చాడు. దీంతో ఆమె తెగ సంతోష పడిపోయింది. పదే పదే అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అహిర్వర్కు బదులుగా, వేరే ఎవరికికైనా దొరికితే తన ఫోన్ తన చేతికి తిరిగి వచ్చేది కాదంటూ భావోద్వేగానికి లోనైంది. View this post on Instagram A post shared by Raghu Ahirwar (@raghuu_9997) ఫోన్ అన్‌లాక్‌లో ఉండటం చూస్తే పాపం.. వారికి ఫోన్ టెక్నాలజీ గురించి తెలియదని అర్థం అయిపోయిందని, వెంటనే వారికి ఫోర్ చేశామని అహిర్వర్ పేర్కొన్నారు. ‘‘దేవుడు మనకు ఈ మొబైల్ ఇవ్వడం మంచిది" అనే క్యాప్షన్‌తో ఆన్లైన్లో షేర్ చేసిన వీడియో నెటిజన్ల ప్రశంసలను దక్కించుకుంది. అతని నిజాయితీ పలువురి హృదయాలను గెలుచుకుంది."ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే, ప్రపంచం మెరుగుపడుతుంది" అని ఒకరు, విలువైన వస్తువులను తిరిగి ఇవ్వడం గ్రేట్ బ్రో అని ఒకరు, "నిజ జీవిత హీరో" అని మరికొందరు వ్యాఖ్యానించడం విశేషం. -
అదృశ్యమైన విమానం.. అందులో 11 మంది..!
-
ఇండోనేషియాలో విమానం గల్లంతు..
జకార్తా: ఇండోనేషియాలో శనివారం 11 మందితో వెళ్తున్న ఓ ప్యాసింజర్ విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. జావా ద్వీపం నుంచి సులవేసి ద్వీపానికి వెళుతున్న ఈ విమానం పర్వత భూభాగానికి చేరుకోగానే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాన్ని కోల్పోయింది.ఈ విమానంలో 8 మంది సిబ్బంది, ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానం ఆచూకీ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. విమానంలోని ప్రయాణికులు సజీవంగా ఉన్నారా లేదా చనిపోయారా అన్నది ఇంకా అధికారికంగా ధృవీకరణ జరగలేదు.ప్రమాదం తర్వాత విలేకరుల సమావేశంలో ఇండోనేషియా ప్రభుత్వ మంత్రి మాట్లాడుతూ.. తమ దేశ సముద్ర వ్యవహారాలు, మత్స్య మంత్రిత్వ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులు విమానంలో ఉన్నారని చెప్పారు. వారు ఈ ప్రాంతంలోని వనరులపై వైమానిక నిఘా నిర్వహించేందుకు వెళ్తున్నారని వెడించారు.గల్లంతైన టర్బోప్రాప్ ఏటీఆర్ 42-500 విమానం ఇండోనేషియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ కు చెందినది. రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎండా పూర్నామా సారీ ప్రకారం, మారోస్ జిల్లాలోని లియాంగ్-లియాంగ్ ప్రాంతంలో మధ్యాహ్నం 1:17 గంటలకు (05:17 GMT) విమానం చివరిసారిగా రాడార్‌లో కనిపించింది. ల్యాండింగ్ కు ముందు, అప్రోచ్ అలైన్‌మెంట్‌ను సరిచేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమానాన్ని ఆదేశించిందని చెప్పారు. కొద్దిసేపటికే రేడియో కాంటాక్ట్ తెగిపోయింది.విమానం గల్లంతయిన ప్రాంతం కొండ, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడికి చేరుకోవడం రెస్క్యూ బృందాలకు పెద్ద సవాలుగా మారింది. సెర్చ్ ఆపరేషన్ కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు, వైమానిక దళానికి చెందిన గ్రౌండ్ యూనిట్లను మోహరించారు. దక్షిణ సులవేసి హసనుద్దీన్ సైనిక కమాండర్ మేజర్ జనరల్ బంగున్ న్వోకో ఈ విషయాన్ని ధృవీకరించారు.ఇంతలో, మౌంట్ బులుస్రాంగ్ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న కొంతమంది హైకర్లు పర్వతంపై చెల్లాచెదురుగా ఉన్న శిధిలాలు, విమానం లాంటి లోగో, మంటలను చూసినట్లు చెప్పారు. ఈ సమాచారాన్ని నిర్ధారించడానికి సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని మేజర్ జనరల్ నవోకో తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో మేఘాలు ఉన్నాయని, అయితే దృశ్యమానత 8 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికారులు తెలిపారు. -
ఎమ్మెల్యే ధూళిపాళ్ల అండతో నా కుమార్తెకు చిత్రహింసలు
గుంటూరు: ‘‘నా కుమార్తె వారం రోజులుగా కనిపించడం లేదు..అసలు బతికే ఉందో..చనిపోయిందో తెలియడం లేదు...అల్లుడిని అడిగితే బెదిరిస్తున్నాడు..నా బిడ్డ ప్రాణాలతో కావాలంటూ’’ ఓ తల్లి సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసింది. కుమార్తెను చిత్రహింసలకు గురిచేస్తున్న ఆమె భర్త చెర నుంచి విడిపించాలని వేడుకుంది. నా బిడ్డ నాకు కావాలి, ప్రాణాలతో కావాలి అంటూ ఫ్లెక్సీ చేతపట్టుకుని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడింది. వివరాలు ఇలా... బాపట్ల జిల్లా కూనపద్మావతినగర్ జగన్ కాలనీకి చెందిన నంబూరు లక్ష్మి కుమార్తె వెంకటేశ్వరమ్మ, పౌలురాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన దగ్గర్నుంచి భార్యను అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు. ఐదు సవర్ల బంగారు గొలుసు తీసుకుని బ్యాంక్‌లో తనఖా పెట్టాడు. ఇటీవల మరో ఎకరం పొలం రాసివ్వాలంటూ భార్యపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. వారం రోజులుగా భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అప్పటి నుంచి ఆమె కనిపించడంలేదు. నా బిడ్డ బతికే ఉందో.. చనిపోయిందో తెలియడంలేదని లక్ష్మి వాపోయింది. కుమార్తె విషయమై అల్లుడ్ని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నాడని తెలిపింది. భర్త చిత్రహింసలు భరించలేక గతంలో కుమార్తె పలుమార్లు జిల్లా పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసింది. పౌలురాజుకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మద్దతు ఉందని, ఆయన అండదండలతోనే తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించింది. -
అలస్కాలో ‘గుంటూరు విద్యార్థి’ అదృశ్యం
అలాస్కా: అమెరికాలోని అలాస్కాకు ఒంటరిగా బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. ప్రకృతి అందాలను తిలకించడానికి వెళ్లి.. మంచు కొండల మధ్య ఆచూకీ లేకుండా పోయాడు. గుంటూరు జిల్లా అద్దంకికి చెందిన హరి కరసాని హ్యూస్టన్‌లో నివాసం ఉంటున్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో హరి డిసెంబర్ 22, 2025న ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు.అక్కడ హీలీ పట్టణంలోని ఔరోరా డెనాలి లాడ్జ్‌లో బస చేశారు జనవరి 4 నాటికి తిరిగి వస్తానని తన రూమ్‌మేట్స్‌కు కూడా సమాచారం ఇచ్చారు. అయితే, డిసెంబర్ 30న చివరిసారిగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన హరి.. ఆ మరుసటి రోజు డిసెంబర్ 31 హోటల్ నుంచి చెక్-ఔట్ కాగా.. అప్పటి నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.డిసెంబర్ 31న ఆయన హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక క్యాబ్ సర్వీస్ వాడినట్లు సమాచారం. హరికి డ్రైవింగ్ రాకపోవడంతో ఆయన క్యాబ్‌లు, స్థానిక రవాణాపైనే ఆధారపడ్డారు. హోటల్ నుంచి బయలుదేరిన హరి ఆ క్యాబ్‌లో ఎక్కడికి వెళ్లారు? ఆ డ్రైవర్ ఎవరు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 31 తర్వాత డెనాలి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు పడిపోయాయని, హరి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని అతని స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీలో ప్రభుత్వ పెద్దల మిస్సింగ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్, ఇంకొందరు మంత్రులు గత కొన్ని రోజులుగా ప్రజలకు, మీడియాకు అందుబాటులో లేరు. నాలుగు రోజులుగా వీరి పర్యటనలపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు రేకెత్తిస్తోంది.కూటమి పార్టీల అనుకూల మీడియా వర్గాలు చంద్రబాబు విదేశాలకు వెళ్లారని చెబుతున్నప్పటికీ, ఆయన ఏ దేశంలో ఉన్నారు, ఎందుకు వెళ్లారు అనే విషయంపై అధికారికంగా టీడీపీ నోరు మెదపడం లేదు. ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్‌ది కూడా. ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారన్నది స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో చర్చలు మరింత వేడెక్కుతున్నాయి. ఇటు పవన్ కల్యాణ్ తన శాఖలకు సంబంధించిన ఏదో మొక్కుబడి ప్రకటన చేశారే తప్ప.. అధికార వర్గాలతో టచ్‌లో లేరని సమాచారం. అయితే అనూహ్యంగా ఆయన కొత్త సినిమా ప్రకటన మాత్రం చేశారు.వారం రోజుల క్రితమే నారా లోకేష్ కూడా గాయబ్ అయ్యారు. ఆయన కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు. అఫ్కోర్స్.. ఇది మొదటి నుంచి ఉండేదే. అయితే ఇప్పుడు కొత్తగా.. ఇతర మంత్రులు కూడా ముఖ్య నేతల బాటలోనే అజ్ఞాతంగా వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ పెద్దలు ఉన్నపళంగా రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అనేక ససమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ముఖ్య నేతలు కనిపించకపోవడం ప్రజలకు అసహనాన్ని కలిగిస్తోంది. మరోవైపు, ప్రభుత్వ పెద్దల పర్యటనలపై జారీ చేసిన జీవోలను కూడా రహస్యంగా ఉంచడం, అధికారిక ప్రకటనలు ఇవ్వకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా.. ప్రజలకు సోషల్ మీడియాలో, పార్టీ తరఫున ప్రకటనల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి పెద్దలు. అయితే ప్రభుత్వపరంగా.. పాలనాపరంగా ఈ ఏడాదికి సంబంధించిన కీలక సమీక్షల నిర్వహణ, నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంలో ఉన్నపళంగా వాళ్లు రాష్టం నుంచి గాయబ్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.వ్యక్తిగత జీవితాలను సమయం కేటాయించడం తప్పు కాకపోయినా.. దానికంటూ ఓ లిమిట్ ఉంటుందని కొందరు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఉన్నపళంగా ఒక్కసారిగా అంతా ఒక్కసారి మాయం కావడం వెనుక అసలు కారణం ఏమిటి, వారు ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. -
పోలీస్ శాఖకే మచ్చ తెచ్చిన ఎస్సై భాను ప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: నగర పోలీస్ శాఖలో ఓ ఎస్సై నిర్వాకం తీవ్ర కలకలం రేపుతోంది. బెట్టింగ్ వ్యసనంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా తన సర్వీస్ తుపాకీతో పాటు, ఓ కేసులో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై భాను ప్రకాశ్ బరితెగింపు పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా మారింది.వివరాల్లోకి వెళ్తే, ఎస్సై భాను ప్రకాశ్ బెట్టింగ్‌లకు బానిసై భారీగా అప్పుల పాలైనట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అడ్డదారులు తొక్కాడు. ఓ రికవరీ కేసులో(ఈ ఏడాది జనవరిలో జరిగింది) భాగంగా స్వాధీనం చేసుకున్న ఐదు తులాల బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.అంతేకాకుండా, భాను ప్రకాశ్ వద్ద ఉండాల్సిన సర్వీస్ గన్ కనిపించకపోవడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. ఈ విషయంపై వారు నిలదీయగా, ఎస్సై నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో లోతుగా విచారించగా, బంగారంతో పాటే తుపాకీని కూడా ఓ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎస్సై భాను ప్రకాశ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
కడపలో విషాదం.. పెన్నా నదిలో ఇద్దరు యువకుల గల్లంతు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో విషాదం చోటు చేసుకుంది. నగర శివారులోని వాటర్ గండి పెన్నా నది ప్రవాహంలో ఇద్దరు గల్లంతయ్యారు. కడపకు చెందిన ఐదుగురు స్నేహితులు సరదాగా ఈతకొట్టేందుకు నదిలో దిగారు. ముగ్గురు యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. తోటి స్నేహితులు.. ఒకరిని కాపాడారు. మరో ఇద్దరు రోహిత్ కుమార్, నరేష్ గల్లంతయ్యారు. చిన్నచౌక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది.కోనసీమ జిల్లా: మలికిపురం మండలం చింతలమోరి బీచ్‌లో విషాదం జరిగింది. సముద్రంలో స్నానానికి దిగి బాలుడు గల్లంతయ్యాడు. నలుగురు స్నేహితులు కలిసి స్నానానికి దిగగా ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన బాలుడిది సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంగా స్థానికులు గుర్తించారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబీకులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. -
యాత్రలో మిస్సింగ్.. తీరా చూస్తే పాకిస్థానీతో వివాహం?
గురునానక్ జయంతి సందర్భంగా ఇటీవలే పాకిస్థాన్ వెళ్లి మిస్సైన యాత్రికురాలు సర్బిజిత్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సర్బిజిత్ ఇస్లాం మతం స్వీకరించిదని పాకిస్థాన్ కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందని నికానామా పేరుతో డాక్యుమెంట్స్ ప్రచురితమవుతున్నాయి. అయితే దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదుఇటీవల సిక్కుల మత గురువు గురునానక్ జయంతి సందర్భంగా ప్రకాశ్ పుర్బ్ వేడుకల్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ వెళ్లి కనిపించకుండా పోయిన యాత్రికురాలు సర్పిజిత్ విషయంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చాయి. సర్బిజిత్ పాకిస్థాన్ లాహోర్ సమీపంలోని షేక్ పూరకు చెందిన నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని, అంతేకాకుండా పెళ్లికి ముందే ఇస్లాం మతంలోకి చేరి తన పేరు నూర్ గా మార్చుకుందని నికానామా( మస్లింల వివాహా ఒప్పంద పత్రం) బయిటపడింది. అయితే ఈవిషయాన్ని ఇంకా అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. సర్పిజిత్ కౌర్ తన భర్తతో విడాకులు తీసుకున్నారు. తనకు ఇద్దరు పిల్లలున్నారు.అసలేం జరిగిందిపంజాబ్, కపుర్తా జిల్లాలోని అమానిపూర్ గ్రామానికి చెందిన సర్బిజిత్ కౌర్, గురునానక్ దేవ్ 556 జయంతి సందర్భంగా నిర్వహించే ప్రకాశ్ పుర్బ్ వేడుకల్లో పాల్గొనేందుకు నవంబర్ 4న పాకిస్థాన్ వెళ్లారు. 10 రోజుల పాటు యాత్ర జరిగిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఆమె భారత్ రాలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ప్రస్తుతం ఆమె ఇస్లాంలోకి మారి వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిని అధికారులు ధృవీకరించలేదు. -
పాక్‌లో పంజాబ్ మహిళ అదృశ్యం
న్యూఢిల్లీ: గురునానక్ దేవ్ 556వ జయంతి సందర్భంగా ‘ప్రకాశ్ పుర్బ్’ వేడుకల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు వెళ్లిన భారత్‌లోని పంజాబ్‌కు చెందిన ఒక మహిళా యాత్రికురాలు తిరిగి రాలేదు. సర్బ్జిత్ కౌర్‌గా గుర్తించిన ఈ మహిళ పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలోని అమానిపూర్ గ్రామానికి చెందినది. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పంజాబ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.సర్బ్జిత్ కౌర్ 2025, నవంబర్ 4న అట్టారి-వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్‌కు చేరుకున్నారు. ఆమె 1,900 మందికి పైగా సిక్కు సభ్యులతో కూడిన ‘జాతా’ (తీర్థయాత్ర సమూహం)లో భాగంగా వెళ్లారు. ఈ బృందం గురుద్వారా నంకనా సాహిబ్‌లో ప్రార్థనలు నిర్వహించేందుకు, ఇతర చారిత్రక సిక్కు మందిరాలను సందర్శించేందుకు 10 రోజుల యాత్రకు వెళ్లింది. అయితే గురువారం రాత్రి ఈ బృందం భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, సర్బ్జిత్ కౌర్ వారిలో లేరు. ఆమె తిరిగి రాకపోవడాన్ని గుర్తించిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. #WATCH | Kapurthala, Punjab | Station House Officer (SHO) of Talwandi Chaudhrian, Nirmal Singh says, "Sarbjit Kaur, a resident of Amanipur village in Kapurthala, was part of the jatha which went to Nankana Sahib, Pakistan. She did not return. The police are conducting an… pic.twitter.com/fPpMWzjcuK— ANI (@ANI) November 14, 2025ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. తల్వాండి చౌదరియన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)నిర్మల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ కపుర్తలాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే దీనిపై కేసు నమోదయ్యిదన్నారు. భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు కౌర్ కుటుంబ సభ్యుల నుంచి, ఆమె గ్రామం నుంచి మరింత సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె అదృశ్యం వెనుక కారణాలు, ఆమె పాకిస్తాన్లో ఉండిపోయారా? లేదా మరేదైనా జరిగిందా? అనే కోణాల్లో పోలీసు దర్యాప్తు జరుగుతోంది.గురువారం తిరిగి వచ్చిన ఈ యాత్రికుల బృందం ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్తాన్‌కు వెళ్లిన మొదటి ‘జాతా’ కావడం గమనార్హం. గతంలో పలు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ పాకిస్తాన్‌కు ప్రయాణ ఆంక్షలు విధించింది. గత జూన్‌లో మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతికి సిక్కులు పాకిస్తాన్‌ను సందర్శించకుండా నిషేధించారు. సుమారు రెండు వారాల నిరాకరణ తర్వాత, అక్టోబర్ రెండున కేంద్ర ప్రభుత్వం ఈ తీర్థయాత్రకు అనుమతి ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రయాణ ఆంక్షలను మరింత కఠినతరం చేయడంతో, ప్రస్తుతం భారత పౌరులు మాత్రమే అట్టారి సరిహద్దు ద్వారా ప్రయాణించగలుగుతున్నారు. ఈ కఠిన నిబంధనల మధ్య యాత్రికురాలు అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: Bihar Election: ఈ ఐదుగురు.. ‘ఉత్కంఠ విజయులు’ -
ఇండియా గేట్ గాయబ్!
ఢిల్లీలోని ఇండియా గేట్ అదృశ్యమైంది.. మీరు చదివింది నిజమే.. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోను చూస్తే మీరూ ఏకీభవిస్తారు. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) ఆందోళనకర స్థాయికి చేరుకుంటోంది. ఢిల్లీలో అక్టోబర్ 1వ తేదీ.. శనివారం ఇండియా గేట్ ప్రాంతంలో ఏక్యూఐ 295గా నమోదైంది. అదే సమయంలో కమ్ముకున్న దట్టమైన పొగమంచు వెనుక ఇండియా గేట్ అదృశ్యమైనట్టు అనిపించింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ఆన్లైన్లో విపరీతంగా వైరల్ అయ్యింది. కలకలం రేపిన వీడియో ఇండియా గేట్ దేశంలోనే అత్యంత గరి్వంచదగిన యుద్ధ స్మారక చిహా్నలలో ఒకటి. అయితే ఆన్లైన్లో చక్కర్లు కొట్టిన ఒక వీడియో చూశాక.. ఇండియా గేట్ మాయమైపోయిందా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. నిజానికి ఇండియా గేట్ ఎక్కడికీ పోలేదు. దట్టమైన పొగమంచులో ఆ కట్టడం చిక్కుపోవడంతో అదృశ్యమైనట్లు అనిపించింది. ఈ వీడియో క్లిప్ మసకగా కనిపించింది. పసుపు రంగు లైట్‌బీమ్‌లు మినహా, ఇండియా గేట్ క్లిప్‌లోని మిగిలిన భాగం మసకగా ఉంది. ఏఎన్ఐ వివరాల ప్రకారం, ఈ సంఘటన అక్టోబర్ 1వ తేదీ శనివారం సాయంత్రం జరిగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం, ఆ సమయంలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 295 వద్ద నమోదైంది. ఇది అత్యంత సాధారణ స్థాయి కిందకు వస్తుంది. నెటిజన్ల మండిపాటు వీడియో వైరలైన వెంటనే నెటిజన్లు స్పందించడం ప్రారంభించారు. చాలా మంది.. కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజలు, జంతువులలో తలెత్తే అనారోగ్యం, భవిష్యత్తు సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన వారు.. కాలుష్య కారకాలపై కఠినమైన చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ప్రభుత్వం సంఖ్యలను తారుమారు చేయడంలో, ఢిల్లీ స్థానాన్ని మార్చడంలో బిజీగా ఉంది. వాళ్లు ఎందుకు పట్టించుకుంటారు?’.. అని ఒక వ్యక్తి ప్రశ్నించాడు. ‘మనకు సిగ్గుచేటు.. ఇంకా ఈ రోజు కూడా బాణసంచా కాల్చుతున్నారు’.. అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. ‘రాజధానిని మార్చడం చాలా అవసరం. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను దేశవ్యాప్తంగా తరలించాలి. ఢిల్లీ ప్రవేశానికి తప్పనిసరిగా విద్యుత్ వాహనాలను వినియోగించాలన్న నిబంధన అమలు చేయాలి’.. అని మరొకరు డిమాండ్ చేశారు. ‘ఇది ఢిల్లీలో ప్రతి అక్టోబర్–నవంబర్ మాసాల్లో సర్వసాధారణ సమస్యగా మారుతోంది. వరి పొలాల వ్యర్థాలను కాల్చడం, నిర్మాణ ధూళి, వాహనాల ఉద్గారాలు, తక్కువ ఆక్సిజన్ తదితర పరిస్థితుల వల్ల ఏర్పడిన సంక్లిష్టత ఇది. దీనికి నిర్మాణాత్మక పరిష్కారాలు అవసరం’.. అని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం, ఏక్యూఐ.ఇన్ మానిటర్ ప్రకారం, ఢిల్లీ నగరం మొత్తం ఏక్యూఐ 244గా నమోదైంది. ఇది అత్యంత కాలుష్య తీవ్రతను తెలియజేస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వివాహిత అదృశ్యం
వైఎస్ఆర్ కడప జిల్లా: పట్టణంలోని కొత్తకొట్టాలు ప్రాంతానికి చెందిన కేతనగరి వెన్నెల అనే వివాహిత రెండు రోజులుగా కనిపించడం లేదని తమకు ఫిర్యాదు అందినట్లు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన తల్లి ఇంటికి రాలేదని, చుట్టుపక్కల వెతికినా కనిపించలేదని ఆమె ఆచూకీ తెలపాలని కోరుతూ వెన్నెల కుమారుడు వెంకటరమణ మంగళవారం ఫిర్యాదు చేసిట్లు సీఐ వివరించారు. అదృశ్యమైన మహిళ ఆచూకీ తెలిసిన వారు 9121100618 (మైదుకూరు సీఐ), 9121100619 (ఎస్ఐ) నంబర్లకు తెలియజేయాలని కోరారు. కాగా తాను ఆత్మహత్యకు పాల్పడుతూ ఓ మహిళ స్వయంగా తీసిన ఓ వీడియో మంగళవారం రాత్రి సోషల్ మీడియాలో కనిపించింది. దీనిపై వివాహిత తీసిన వీడియో లొకేషన్ కోసం గాలిస్తున్నామని, వీడియోలో ఉన్న వివాహిత, అదృశ్యమైన వెన్నెల అనే వివాహిత ఒకరేనా కాదా అన్నది తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.విద్యార్థి..కొండాపురం: మండల పరిధిలోని దత్తాపురం గ్రామానికి చెందిన జి. రామ్‌చరణ్ కనిపించడం లేదని తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ ఆర్,శివనాగిరెడ్డి తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు దత్తాపురం గ్రామానికి చెందిన జి.జ్యోతి, చిన్నపెద్దులయ్య దంపతుల పెద్ద కొడుకు రామ్‌చరణ్ తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఇంటర్ చదువుతున్నాడు. చదువుకోమని మందలించడంతో ఇంటిలో నుంచి సోమవారం మధ్యాహ్నం తాడిపత్రికి బస్సులో వెళ్లిపోయాడు. తిరిగి రాకపోవడంతో తల్లి జ్యోతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
తెలుగు హీరోయిన్ మిస్సింగ్.. అసలు స్టోరీ ఇదే
చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలతో మెప్పించిన వాసంతిక మిస్సింగ్ అంటూ రెండురోజులుగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. చాలామందికి అసలు విషయం ఏంటి అనేది తెలియలేదు. ఒక హాస్టల్ నుంచి వెళ్తున్న సీసీటీవి ఫుటేజ్ కూడా విడుదల చేయడంతో చాలామంది నిజమేనని అనుకున్నారు. అయితే, అసలు విషయం తను నటిస్తున్న కొత్త సినిమా గురించి. ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ వాసంతిక ఇచ్చింది. ఇప్పటికే 90's - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ చిత్రంలో దివ్య అనే పాత్రతో మెప్పించన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలD/o ప్రసాద్‌రావు కనబడుటలేదు అనే సినిమాలో వాసంతిక ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ టైటిల్‌ను చూస్తే అర్థం అయింది కదా. ఒక యువతి మిస్సింగ్ స్టోరీతో మూవీని తెరెక్కించారు. అందుకే సినిమా ప్రమోషన్ కోసం ఇలా హీరోయిన్ మిస్సింగ్ అంటూ ఒక వీడియోను వైరల్ చేశారు. ఈ చిత్రం డైరెక్ట్‌గా జీ5లో విడుదల కానుంది. అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో ఉధయబాను, రాజీవ్ కనకాల కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు.నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వాసంతిక మెప్పించింది. సలార్‌లో కూడా ఆమె నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె కీలక పాత్రలో నటించిన సినిమా ఓటీటీలో విడుదల కానుంది. Swathi is missing.Family is in panic, the world is spinning.What next?Start tuned to know what happened to Swathi, D/o Prasadrao#SriRamVenkat #SouthIndianScrenss #ZEE5 #DaughterOfPrasadRaoKanabadutaledhu #ZEE5Telugu #RaajeevKanakala #UdayaBhanu #VasanthikaMacha pic.twitter.com/ZlpUnZWTrb— ZEE5 Telugu (@ZEE5Telugu) October 15, 2025 -
Kashmir: ఇద్దరు జవాన్లు అదృశ్యం.. ఉగ్రవాదులు అపహరించారా?
కోకెర్నాగ్: దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఇద్దరు ఆర్మీ జవాన్లు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. కోకెర్నాగ్-గాడోల్ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ చేపడుతున్న సమయంలో ఇద్దరు భారత ఆర్మీ సిబ్బంది అదృశ్యమయ్యారని బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. పారా కమాండోస్ యూనిట్‌కు చెందిన ఈ సైనికులు సోమవారం (అక్టోబర్ 6) ఉగ్రవాదులను నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ బృందంలో సభ్యులని తెలిపారు.ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యానికి నిఘా సమాచారం అందిన దరిమిలా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది తమ యూనిట్‌తో సంబంధాలు కోల్పోయారని, అప్పటి నుండి వారి జాడ కనిపించడం లేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ నేపధ్యంలో అదృశ్యమైన సైనికులను వెదికేందుకు సైన్యంతో పాటు జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.దోడా- కిష్త్వార్ జిల్లాల సరిహద్దుల్లోనిపిర్ పంజాల్ పర్వత శ్రేణి వెంబడి ఉన్న ప్రాంతంలో ఈ ఇద్దరు సైనికులు అదృశ్యమయ్యారు. ఈ ప్రాంతం దట్టమైన అడవితో కూడి ఉంటుంది. కొంతకాలంగా ఈ ప్రాంతంలో కురుస్తున్న మంచు, భారీ వర్షాలు సెర్చ్ అపరేషన్‌కు సవాలుగా మారాయి. తప్పిపోయిన సిబ్బందిని ఉగ్రవాదులు అపహరించారా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రతా దళాలు అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. -
చెన్నై జూలో సింహం మిస్సింగ్ కలకలం!
చెన్నై వాండలూర్ జూలో ఓ సింహం కనిపించకుండా పోవడంతో అధికారులు హడలిపోయారు. రాత్రికి రాత్రే దాని ఆచూకీ కనిపెట్టేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. చివరాఖరికి దాని ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్టోబర్ 3వ తేదీన జరిగిన ఈ ఘటన.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్.. దక్షిణ భారత దేశంలో ఉన్న అతిపెద్ద జూ పార్కుల్లో ఒకటి. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఆ జూలో హైడ్రామా నడిచింది. ఎప్పటిలాగే సింహాలన్నీ సాయంత్రం కాగానే ఎన్‌క్లోజర్‌లోకి చేరుకోగా.. శేర్యార్ అనే సింహం మాత్రం తిరిగి రాలేదు(Lion Missing Zoo). దీంతో సిబ్బంది కంగారపడిపోయారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు.అంతా కలిసి ఐదు బృందాలుగా విడిపోయి సింహం కోసం జూ అంతా గాలించారు. రాత్రి పూట పని చేయగలిగే థర్మల్ డ్రోన్ల, ట్రాప్ కెమెరాల సహకారం తీసుకున్నారు. అయితే కొన్నిగంటల తర్వాత అది సఫారీలో ఓ చోట ప్రశాంతంగా కూర్చు ఉండిపోవడం గమనించారు. బౌండరీ వాల్, చెయిన్-లింక్ మెష్ ఫెన్సింగ్ ఉన్న సఫారీని నుంచి అది తప్పించుకునే అవకాశం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఐదేళ్ల వయసున్న శేర్యార్ను 2023లో బెంగళూరులోని బన్నెరఘట్ట జూలాజికల్(Bannerghatta national park) పార్క్ నుంచి తీసుకొచ్చారు. లయన్ సఫారీ అలవాటు చేయడానికి మిగతా వాటితో పాటే దానిని రెగ్యులర్‌గా బయటకు వదులుతున్నారట. అయితే ఈ వయసులో సింహాలకు ఇలాంట ప్రవర్తన సహజమేనని అధికారులు తెలిపారు. ఈ లయన్ మిస్సింగ్ ఘటనతోనే.. అక్టోబర్ 5న జరగాల్సిన వైల్డ్ ట్రెయిల్ రన్ కార్యక్రమాన్ని నిర్వాహకులు వాయిదా వేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: కేరళ అసెంబ్లీని కుదిపేసిన ‘శబరిమలై’ వివాదం -
విషాదంగా ముగిసిన మాదన్నపేట బాలిక మిస్సింగ్ కేసు
సాక్షి,హైదరాబాద్: మాదన్నపేట బాలిక మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన బాలిక కనిపించకుండా పోయింది.. చివరికి ఇంటిమీద నీళ్ల ట్యాంక్‌లో విగత జీవిగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.పోలీసుల వివరాల మేరకు.. ఒవైసీ కంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక నిన్న తల్లితో పాటు మాదన్నపేటలో నివసించే అమ్మమ్మ ఇంటికి వచ్చింది. నిన్న సాయంత్రం నుండి ఇంట్లో నుండి బయటకి వచ్చి కనిపించకుండా పోయింది. దీంతో అప్రమత్తంమైన బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. బాలిక మృతదేహం నీళ్ల ట్యాంక్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తూ బాలిక నీళ్ల ట్యాంకులో పడిపోయిందా.. లేదంటే ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త పండ్లు కొనేలోగా.. భార్య అదృశ్యం
హైదరాబాద్: భర్త పండ్లు కొనుక్కొని వచ్చేలోపే భార్య అదృశ్యమైన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అండగ్ల శ్రీనివాస్, సువర్ణ (20) దంపతులు. వీరు కర్ణాటకలోని కాలకుండ గ్రామం నుంచి ఈ నెల 14న కూకట్‌పల్లిలోని మేనమామ ఇంటికి బయలుదేరి వచ్చారు. కూకట్పల్లి బస్టాప్‌లో దిగిన శ్రీనివాస్..సిగ్నల్ వద్ద భార్య సువర్ణను నిలబడమని చెప్పి కొద్ది దూరంలో ఉన్న షాపులో పండ్లు కొనుగోలు చేయటానికి రోడ్డు దాటాడు. పండ్లు కొనుక్కని ఐదు నిమిషాల లోపే తిరిగి వచ్చి చూడగా.. అతని భార్య కనిపించలేదు. చుట్టు పక్కల ఎంత వెతికినా, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో వెతికినా సమాచారం దొరకలేదు. దీంతో కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫారోల అమూల్య బ్రాస్లెట్ అదృశ్యం
కైరో: ఈజిప్ట్ నాగరికతతో ఫారో చక్రవర్తులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఫారో చక్రవర్తుల కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్ల నిర్మాణం జరిగింది. అద్భుతమైన పాలనతో మంచి పేరు తెచ్చుకున్న ఫారో చక్రవర్తులకు చెందిన ఒక ముంజేతి కంకణం ఇప్పుడు కనబడకుండాపోయింది. ఈజిప్ట్ రాజధాని కైరో నగరంలోని తహ్రీర్ స్క్వేర్‌లోని ప్రఖ్యాత మూజియంలో చివరిసారిగా ఇది బహిరంగంగా కనిపించింది. మధ్యలో లాపిస్ లజూలీ మణిపూస పొదిగిన ఈ కంకణాన్ని స్వచ్ఛమైన స్వర్ణంతో తయారుచేశారు. మ్యూజియంకు చెందిన పునరుద్ధరణ లే»ొరేటరీకి తీసుకురాగా ఆ తర్వాత ఇది కనిపించకుండాపోయిందని ఈజిప్ట్ పర్యాటకం, పురాతత్వ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. దీనిని దొంగలించిన వ్యక్తులు విదేశాలకు అక్రమ రవాణా చేయొచ్చని ఈజిప్ట్ ప్రభుత్వం అనుమానిస్తోంది. అనుకున్నదే తడవుగా వెంటనే దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయలు, సరిహద్దుల వద్ద తనిఖీలను ముమ్మరంచేసింది. బ్రాస్లెట్ ఫొటోలను ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్, వాట్సాప్ సహా అన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్చేస్తోంది. వేల ఏళ్ల పాత కంకణం క్రీస్తు పూర్వం 1,076 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 723 సంవత్సరాల కాలంలో ఈజిప్ట్‌ను పరిపాలించిన రాజవంశానికి చెందిన అమేనీమోప్ రాజుకు చెందిన కంకణంగా దీనిని గుర్తించారు. తూర్పు నైలు నదీతీర ప్రాంతంలోని టానిస్‌లో ఖననంచేసిన అమేనీమోప్ ఆన్‌ఆర్‌టీ–4 ఛాంబర్లో ఈ కంకణాన్ని గతంలో కనుగొన్నారు. తొలుత వేరే చోట అమేనీమోప్ పారి్థవదేహాన్ని ఖననంచేసి కొన్నాళ్లకు సుసేన్నెస్ రాజు సమీప ఛాంబర్‌కు మార్చారు. ఈ కాలంలో అత్యంత శక్తివంతమైన రాజుల్లో ఒకడిగా సుసేన్నెస్ వెలుగొందారు. అమేనీమోప్ సమాధాని 1940లో కనుగొన్నారు. ‘‘వేల ఏళ్ల చరిత్ర గల ఇలాంటి కంకణం కనబడకుండా పోవడం వింతేమీ కాదు. వీటికి బహిరంగ మార్కెట్లో చాలా విలువ ఉంది. స్మగ్లర్లు వీటిని దొంగించి విదేశాలకు తరలిస్తారు’’అని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ వర్సిటీలో ఫోరెన్సిక్ పురాతత్వవేత్త క్రిస్టోస్ సిరోగియాన్నిస్ చెప్పారు. ‘‘త్వరలోనే ఇది ఎక్కడో, ఏ దేశంలోనో ప్రఖ్యాత వేలం సంస్థ వేలంపాటలోనే, ఆన్లైన్లోనే ప్రత్యక్షమవుతుంది. ఫారో చక్రవర్తుల వస్తువులను సొంతం చేసుకునే సంపన్నులకూ కొదువలేదు. వాళ్లు వీటిని బ్లాక్మార్కెట్లో కొని దాచుకుంటారు’’అని ఆయన అన్నారు. ‘‘చోరీకి గురై తమ దేశంలోకి వచి్చన పురాతన వస్తువులను కొన్ని అరబ్ దేశాలు తిరిగి ఈజిప్ట్‌కు అప్పగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని అయితే అధికారికంగా అప్పగించే ఉద్దేశంలేక మ్యూజియం తోటలోనే, ప్రాంగణాల్లోనూ తర్వాత పడేసి వెళ్లిన సందర్భాలు సైతం ఉన్నాయి’’అని ఆయన గుర్తుచేశారు. ‘‘కంకణంలోని బంగారం కరిగించి సొమ్ముచేసుకునే అవకాశం చాలా తక్కువ. కరిగిస్తే వచ్చే బంగారం విలువ కన్నా అలాగే కంకణం రూపంలోనే అమ్మితే లెక్కలేనంత సొమ్ము సంపాదించొచ్చు’’అని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తర ఆఫ్రికా దేశమైన ఈజిప్ట్‌కు దశాబ్దాలుగా పురాతన వస్తువుల స్మగ్లింగ్ అనేది పెద్ద తలనొప్పిగా తయారైంది. శక్తిమేరకు కాపాడుతున్నా ప్రతి ఏటా ఎక్కడో ఓ చోట ఇలా విలువైన వస్తువులు అదృశ్యమవుతూనే ఉన్నాయి. -
మరో వివాదంలో పూజా ఖేడ్కర్.. ట్రక్కు డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి..
పూణె: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఛీటింగ్ వ్యవహారంలో సస్పెండ్ అయిన ఐఏఎస్ ప్రొబెషనర్ పూజా ఖేద్కర్ మరోమారు వార్తల్లో నిలిచారు. ముంబైలోని ఐరోలిలో కిడ్నాప్ అయిన ఓ ట్రక్ డ్రైవర్ పూణేలోని చతుశృంగి ప్రాంతంలో గల పూజా ఖేడ్కర్ ఇంట్లో కనిపించడం సంచలనంగా మారింది.సామాజిక కార్యకర్త విజయ్ కుంభార్ ట్వీట్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివాదాస్పదురాలిగా మారి, సస్పెండ్ అయిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లి సాగించిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 13న ఐరోలి ప్రాంతంలోని సిగ్నల్ వద్ద ఓ ట్రక్ డ్రైవర్ కిడ్నాప్ అయ్యాడు. బాధితుడు నవీ ముంబైకి చెందిన ప్రహ్లాద్ కుమార్ (22). ఆయన తన మిక్సర్ ట్రక్కును తీసుకెళ్తూ ఒక కారును ఢీకొన్నాడు. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతనిని బలవంతంగా తమ కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. ఈ నేపధ్యంలో ప్రహ్లాద్ కుమార్ కనిపించడం లేదంటూ సంబంధీకులు రబాలే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. Pune Video: Ex-IAS Probationer Puja Khedkar's Mother Confronts Police During Rescue Of Allegedly Kidnapped Driver From Her Home pic.twitter.com/zYkEsSyi7L— Momentum News (@kshubhamjourno) September 14, 2025కేసు దర్యాప్తులో భాగంగా అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఖరత్ ఆ కారును ట్రాక్ చేసే దిశగా పూణేకు వెళ్లారు. ఆ కారు వివాదాస్పద ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ ఇంటి లొకేషన్లో కనిపించింది. దీంతో ఖరత్ బృందం కిడ్నాప్ అయిన డ్రైవర్‌ను రక్షించినట్లు విజయ్ కుంభార్ తన ట్వీట్లో వివరించారు. ఈ కేసు దర్యాప్తు లో పూజా ఖేడ్కర్ తల్లి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిందని, కనీసం తలుపు కూడా చాలాసేపటి వరకూ తెరవలేదని సమాచారం. పోలీసులు పూజా ఖేడ్కర్ తల్లి చేసిన కిడ్నాప్ వ్యవహహారంపై దర్యాప్తు చేపట్టారు. -
కూలిన ఆనకట్ట.. నలుగురు మృతి.. ముగ్గురు గల్లంతు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో ఒక ఆనకట్ట కూలి ఆకస్మిక వరద సంభవించడంతో, నలుగురు మృతిచెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఆనకట్ట కూలిన విషయాన్ని తెలుసుకున్న అధికారులు, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు. ధనేష్‌పూర్ గ్రామంలో ఉన్న లూటి జలాశయంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.1980ల ప్రారంభంలో నిర్మించిన ఈ జలాశయంలో వరద పోటెత్తడంతో సమీపంలోని ఇళ్లు, వ్యవసాయ పొలాలోకి నీరు వచ్చిచేరింది. సమాచారం అందుకున్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల సీఎం బస్తర్ డివిజన్లోని వరద ప్రభావిత బస్తర్, దంతేవాడ జిల్లాలను పరిశీలించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా దంతేవాడ, సుక్మా, బీజాపూర్, బస్తర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించి పలు ప్రాంతాలు నీటమునిగాయి.ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన వరదలకు ఎనిమిది మంది మరణించారు, 96 పశువులు మృత్యువాత పడ్డాయి. దాదాపు 495 ఇళ్లు, 16 కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. దంతేవాడలోని చుడితిక్ర వార్డులోని సహాయ శిబిరంలో తలదాచుకున్న నిర్వాసితులను ముఖ్యమంత్రి పరామర్శించారు. -
ట్రంప్ నిజంగానే క్షేమమా? వైట్‌హౌజ్ గప్‌చుప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎక్కడ?.. నిత్యం తనదైన శైలి ప్రకటనలు, నిర్ణయాలు, సోషల్ మీడియాలో పోస్టింగులతో హడావిడి చేసే ట్రంప్ ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయారు. పైగా 79 ఏళ్ల వయసున్న ఆయన అనారోగ్యంపై ఇటీవల వార్తలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అవసరమైతే తానే అధ్యక్ష బాధ్యతలు చేపడతానంటూ ప్రకటన చేశారు. ఈ వరుస పరిణామాల నడుమ.. ట్రంప్ మిస్సింగ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. గత 24 గంటలుగా సోషల్ మీడియా మామూలుగా ఊగిపోవడం లేదు. ఏకంగా ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ ఓ ట్రెండ్ సైతం నడుస్తోంది. పోను పోను ఆ ట్రెండ్ మరింత దారుణంగా మారింది. ట్రంప్ చనిపోయాడనే వార్త ధృవీకరించినవాళ్లకు డాలర్లు ఇస్తామంటూ పలువురు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. ట్రంప్ మీడియా ముందుకురాలేదు. ఏదైనా చెప్పాలనుకుంటే తన ‘ట్రూత్’ ద్వారానే వెల్లడిస్తున్నారు. అయితే.. వారాంతమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్‌హౌస్ షెడ్యూల్లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. JD Vance Says He’s Prepared to Assume Presidency if Trump...#Jdvance #vance #prepare #assume #office #president #donaldtrump #trump #health #wellbeing #transitions #rickwilson #conservative #strategist #maga #games #trending #viral #fyp #xviral #viralx pic.twitter.com/Jlt5BbvaZ6— FANmily TV (@FanmilyTV) August 30, 2025ట్రంప్ అనారోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్‌మీడియాలో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు వైట్హౌజ్గానీ, ఆయన వ్యక్తిగత సిబ్బందిగానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాకుంటే.. తన మనవరాలు కై మాడిసన్ ట్రంప్ (Kai Madison Trump) కలిసి వైట్‌హౌజ్ సౌత్ లాన్లో ఆయన గోల్ఫ్ ఆడినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. #JUSTIN Trump is alive Donald Trump, accompanied by his granddaughter Kai, boarded the motorcade on the South Lawn of the White House on August 30 #Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump #trumpdead #TrumpIsDead #TrumpisnotDead #TrumpisAlive #Kai #Virginia pic.twitter.com/fAUCijwwCR— ViralVolt🟦 (@ViralVolT1) August 30, 2025ఆ సమయంలో అక్కడికి వచ్చినవాళ్లకూ ఆయన కరచలనం చేస్తూ కనిపించినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే అది తాజా వీడియోనేనా? అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. ‘‘గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదు. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్‌లు లేవు. అసలు ఏం జరుగుతోంది?’’ అని ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్టు పెట్టడంతో ఈ వ్యవహారం మొదలైంది. #BREAKING: Trump makes an appearance at his golf club this morning, putting to rest swirling health rumors. #Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump #trumpdead #TrumpIsDead #TrumpisnotDead #TrumpisAlive pic.twitter.com/VfvOaGsVj0— Mukund Shahi (@Mukundshahi73) August 30, 2025మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. కుట్రపూరితంగానే ప్రచారం జరుగుతోందని ఆయన మద్దతుదారులు అంటున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని కారణాలుగా పలువురు చెబుతున్నారు.భారత్+రష్యా+చైనా = ట్రంప్‌నకు పీడకల అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. భవిష్యవాణిగా పేరొందిన సింప్సన్ కామిక్ సిరీస్‌ను ఉద్దేశించి.. ట్రంప్ ప్రాణాలతో లేకపోయి ఉండొచ్చు అని సెటైరిక్ మీమ్స్ వేస్తున్నారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకు వేసి.. జేడీ వాన్స్, ఎలాన్ మస్క్లలో ఎవరు తదుపరి అధ్యక్షుడు అయితే బాగుంటుందంటూ పోల్ పెట్టారు కూడా.Simpsons predicted Donald Trump died of heart attack in 2025 in a forgotten episode & that's why Americans are searching "TRUMP IS DEAD", "TRUMP DIED" Trump#DonaldTrump #Trump #TrumpHealth #TrumpHealthCrisisCoverup #Simpsons #TrumpDead #TrumpDied pic.twitter.com/7vbANhE0wu— Marwdi Londa (@Marwdi45032) August 30, 2025Congratulations 🎉 Donal Trump Donald Trump is alive again after dying#donaldtrumpisdead #DonaldTrump pic.twitter.com/rfTwXSm0OL— Xi Jinping (@xijinpiing_) August 30, 2025 Elon Musk when he checks why Donald Trump is trending💀😂#DonaldTrump pic.twitter.com/Zvotz6n599— The Sarcastic Indian (@_Sarcasticindia) August 30, 2025🚨 Breaking: Senior official says Trump is perfectly fine and will go out to play golf today, according to Axios report.Now imagine after exploding the internet by trending “Trump is Dead” he suddenly appears👇🏻#trump | #trumpdead | #DonaldTrump | #TrumpIsDead pic.twitter.com/zgBLpv4gvK— GeoWireDaily (@geowiredaily) August 30, 2025if "TRUMP IS DEAD" i will give 1000 dollars to anyone who likes this tweet.#DonaldTrump#whereistrump #donaldtrumpisdead pic.twitter.com/enKe7zWGgt— GR Jaam k (@grjaam7) August 30, 2025ఈ మధ్యకాలంలో 79 ఏళ్ల ట్రంప్ అనారోగ్యంపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ట్రంప్ చేతిపై గాయంతో కనిపించారు. గతంలో ఈ గాయాన్ని దాచడానికి ఆయన చేతికి మేకప్ వేసుకొని కనిపించారు. దీనిపై ట్రంప్ వైద్యుడు సీన్ బార్బబెల్లా స్పందించారు. ఆ గాయం నిజమేనని అంగీకరించారు. తరచుగా కరచాలనం చేయడం వల్ల, ఆస్ప్రిన్ వాడటం వల్ల ఇలా జరిగిందని వెల్లడించాడు. అయితే.. ట్రంప్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. గోల్ఫ్ ఆడిన వీడియో అధికారికమని ధృవీకరణ అయితే.. ఊహాగానాలకు తెర పడినట్లే!. -
విశాఖ ఆర్కే బీచ్‌లో విషాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విషాదం చోటుచేసుకుంది. ఆర్కే బీచ్‌లో సరదాగా స్నానానికి దిగి ఒకరు మృతి చెందగా.. ఒకరు క్షేమంగా బయపడ్డారు. మరొకరు గల్లంతయ్యారు. మునిగిపోతున్న మహిళను కాపాడడానికి వెళ్లిన ఒడిశాకు చెందిన 22 ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. అతని కోసం సహాయక బృందాలు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాయి.బీచ్ చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన దంపతులు రాగా.. సరదాగా బీచ్‌లోకి దిగగా.. కెరటాల ఉధృతికి మహిళ (50) కొట్టుకుపోయింది. భార్య మృతి చెందగా, భర్తను స్థానికులు కాపాడారు. దంపతులను కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తి మృతి చెందాడు. -
Uttarakhand: కొట్టుకుపోయిన ఆర్మీ బేస్ క్యాంప్!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ వరదల్లో 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. జేసీవో సహా 10 మంది ఆర్మీ జవాన్లు గల్లంతయినట్లు సమాచారం. ధరాలీలో ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు 12 మంది మృతి, 100 మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.కాగా, ఆర్మీ జవాన్లు 20 మంది పౌరులను కాపాడారు. హర్షిల్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో వారికి ప్రస్తుతం చికిత్స అందుతోంది. ప్రస్తుతం ధరాలీ గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఉత్తరకాశీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ధరాలీ గ్రామంపై ఒక్కసారిగా జల ప్రవాహం విరుచుకుపడటంతో హోటళ్లు, నివాస భవనాలు కొట్టుకుపోయాయి.రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది. 150 మంది సైనికులను ఘటనాస్థలానికి పంపినట్లు ఆర్మీ తన అధికారిక ‘ఎక్స్’లో పేర్కొంది. గ్రామం మొత్తం బురద నీటితో నిండిపోవడంతో సహాయక చర్యలకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.#uttarkashicloudburstNature’s Fury at its worst. Horrifying footage of the moment.A #Cloudburst led to #flashfloods and #Landslide in the High Altitude village in #Dharali, #Uttarkashi in #UttarakhandPeople seen running away but are swept away in secondsSeveral houses… pic.twitter.com/DPG9JDr3yF— Surya Reddy (@jsuryareddy) August 5, 2025 -
యమెన్ తీరంలో ఘోరం: పడవ బోల్తా.. 68 మంది మృతి.. 74 మంది గల్లంతు
సనా: దక్షిణ యెమెన్ తీరంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పడవ బోల్తా పడి 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మృతిచెందారు. 74 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి వలస ఏజెన్సీ మీడియాకు తెలిపింది. అబ్యాన్ ప్రావిన్స్ సమీపంలో 154 మంది ఆఫ్రికన్ వలసదారులతో వెళుతున్న పడవ బోల్తా పడింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.యెమెన్‌లోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) తెలిపిన వివరాల ప్రకారం 54 మంది వలసదారుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మరో పద్నాలుగు మంది మృతి చెందారు. ఈ మృతదేహాలను యెమెన్ దక్షిణ తీరంలోని అబ్యాన్ ప్రావిన్షియల్ రాజధాని జింజిబార్‌లోని ఆస్పత్రి శవాగారానికి తరలించారు. ఈ ఓడ ప్రమాదంలో 12 మంది వలసదారులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన ప్రయాణికులంతా గల్లంతయ్యారు. వీరంతా మృతిచెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. 54 migrants DEAD after boat sinks off Yemen’s coastDue to 'bad weather'2019 footage shows this has happened many times beforeWho’s behind this dangerous trade in bodies? pic.twitter.com/09IIH5zRO6— RT (@RT_com) August 3, 2025పడవ ప్రమాదంలో అధిక సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడంతో పెద్ద ఎత్తున సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు అబ్యాన్ భద్రతా డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. తీరప్రాంతంలో చెల్లాచెదురుగా పలు మృతదేహాలు పడివున్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా పడవ ప్రమాదాల్లో వలసదారులు మృతిచెందుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. గత మార్చిలో యెమెన్, జిబౌటి తీరాలలో వలసదారులను తీసుకెళ్తున్న నాలుగు పడవలు బోల్తా పడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 186 మంది గల్లంతయ్యారు. -
న్యూయార్క్ లో NRI వృద్ధుల మిస్సింగ్ విషాదాంతం
-
Madhya Pradesh: ఆ 23 వేల మంది మహిళలు ఎక్కడ?
భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన 23 వేలమందికి పైగా మహిళలు, యువతులు, బాలికలు అదృశ్యమయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం సమర్పించిన డేటా సంచలనంగా మారింది. అలాగే మహిళలపై అత్యాచారం, ఇతర నేరాలతో సంబంధం ఉన్న 1,500 మంది నిందితులు కూడా పరారీలో ఉన్నారని ఆ డేటాలో వెల్లడయ్యింది.2024, జనవరి ఒకటి నుంచి 2025 జూన్ 30 మధ్య రాష్ట్రంలో నమోదైన అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులపై జిల్లాల వారీగా వివరణాత్మక డేటాను కోరుతూ సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలా బచ్చన్ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ ఆందోళనకర గణాంకాల వివరాలను వెల్లడించింది. అసెంబ్లీలో బాలా బచ్చన్..రాష్ట్రంలో ఒక నెలలో ఎంత మంది బాధితులు కనిపించకుండా పోయారు? ఎంత మంది నిందితులను అరెస్టు చేశారు? ఇంకా ఎంత మంది పరారీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఇటువంటి కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఏదైనా చర్య తీసుకున్నారా? అని కూడా ఆయన ప్రశ్నించారు.దీనికి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఒక లిఖితపూర్వక ప్రకటనలో షాకింగ్ డేటాను షేర్ చేశారు. 2025, జూన్ 30 నాటికి ఏడాది కాలంలో రాష్రంలో మొత్తం 21,175 మంది మహిళలు, 1,954 మంది బాలికలు అదృశ్యమయ్యారు. రాష్ట్రంలో మొత్తంగా అదృశ్యమైన మహిళల సంఖ్య 23,129. అలాగే మహిళలపై అత్యాచారం చేసిన 292 మంది పురుషులు, మైనర్లపై అత్యాచారం చేసిన 283 మంది నిందితులు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా 575 మంది అత్యాచార నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన మొత్తం 443లో 167 మంది అరెస్టు నుండి తప్పించుకున్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో పరారీలో ఉన్న వారి సంఖ్య 610కి చేరుకుంది. మధ్యప్రదేశ్‌లో మహిళలు, బాలికలపై తీవ్రమైన నేరాలకు పాల్పడిన 1,500 మందికి పైగా నిందితుల ఆచూకీ తెలియడం లేదు. అదృశ్యమైన మహిళలకు సంబంధించి కొన్ని జిల్లాల్లో500కి పైగా కేసులు నమోదయ్యాయి. -
‘యమున’లో విగతజీవిగా త్రిపుర యువతి.. కుటుంబ కలహాలే..?
న్యూఢిల్లీ: ఆరు రోజుల క్రితం ఢిల్లీలో అదృశ్యమైన త్రిపురకు చెందిన యువతి స్నేహా దేబ్నాథ్(19) ఆత్మహత్య చేసుకున్నదని, ఆమె మృతదేహం యుమునా నదిలో కనిపించిందని పోలీసులు తెలిపారు. ఈమె ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకుంటోంది. స్నేహా దేబ్నాథ్ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు నిర్ధారించారని పోలీసులు పేర్కొన్నారు.స్నేహా దేబ్నాథ్ అదృశ్యమైన దరిమిలా త్రిపురలోని ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం తీవ్రంగా గాలించారు. జూలై 7న ఆమె ఉత్తర ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జికి క్యాబ్‌లో వెళ్లింది. స్నేహ తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు సూచించే నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. చదువు విషయంలో ఆమె కలకతచెందడం లేదని, ఆమె ఆందోళనకు కారణం కుటుంబ కలహాలై ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. సిగ్నేచర్ బ్రిడ్జికి 10 కి.మీ దిగువన ఉన్న గీతా కాలనీలోని ఫ్లైఓవర్ సమీపంలోని యమునా నదిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.స్నేహా దేబ్‌నాథ్‌ను ఈ స్థలంలో దింపినట్లు క్యాబ్ డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. కాగా ఈ వంతెనపై నిలబడి ఉన్న ఒక అమ్మాయిని చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), పోలీసు విభాగాల సహాయంతో ఆమె కోసం గాలింపు చర్యలు సాగాయి. వారు ఉత్తర ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వరకుగల అన్ని ప్రాంతాలను అణువణువునా జల్లెడ పట్టారు. జూలై 7 తెల్లవారుజామున స్నేహా తన సన్నిహితులకు ఈమెయిల్స్ పంపిందని పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆమె మానసికంగా బాధపడుతున్నట్లు స్నేహితులు పోలీసులకు తెలిపారు. -
Delhi: ఆ త్రిపుర యువతి ఎక్కడ?.. సీఎం సూచనలతో గాలింపు ముమ్మరం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో త్రిపురకు చెందిన యువతి స్నేహ దేబ్నాథ్(19) అదృశ్యమయ్యింది. విషయం తెలుసుకున్న త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆమె ఆచూకీ కోసం వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాలని పోలీసులకు పలు సూచనలు చేశారు.త్రిపుర ముఖ్యమంత్రి కార్యాలయం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో, ‘న్యూఢిల్లీలో త్రిపురలోని సబ్రూమ్కు చెందిన స్నేహ దేబ్నాథ్ అదృశ్యమైనట్లు తమ కార్యాలయం దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె ఆచూకీ కోసం తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు అవసరమైన సూచనలు జారీ చేశాం’ అని పేర్కొన్నారు. అనుమానాస్పద పరిస్థితుల్లో దేబ్నాథ్ అదృశ్యమైన దరిమిలా త్రిపుర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఢిల్లీ పోలీసులు.. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)నేతృత్వంలో ఆమె ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాలో చదువుకుంటున్న స్నేహ చివరిసారిగా జూలై 7న తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.ఆరోజు ఆమె తన స్నేహితురాలు పితునియాతో కలిసి సారాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నట్లు తల్లికి తెలిపారు. అదే ఆమె చివరి ఫోన్ కాల్. ఇది ఉదయం 5:56 గంటలకు వచ్చింది. ఆ తరువాత ఉదయం 8:45 గంటలకు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది.దీంతో ఆమె కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. ఆ రోజు స్నేహను క్యాబ్ డ్రైవర్ స్నేహను ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జి దగ్గర దింపినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో నిఘా ఫుటేజ్ లేకపోవడంతో స్నేహ తుది కదలికలను తెలుసుకోవడం పోలీసు అధికారులకు సాధ్యంకాలేదు. జూలై 9న ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఎన్డీఆర్ఎఫ్ సాయంతో సిగ్నేచర్ బ్రిడ్జి ప్రాంతంలో విస్తృతమైన పరిశీలన చేసింది. అయితే స్నేహకు సంబంధించిన ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు.స్నేహ తన వెంట ఎటువంటి వస్తువులు తీసుకువెళ్లలేదని, గత కొద్దిరోజులుగా డబ్బు విత్‌డ్రా చేయలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్నేహ ఆచూకీ తెలిసినవారు తమకు తెలియజేయాలని పోలీసు అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. -
‘లక్కీ’ కనిపిస్తే చెప్పండి.!
హైదరాబాద్: అప్పటి వరకు ఆ కుక్క పిల్ల ‘లక్కీ’ఇంట్లో సందడి చేసింది. యాజమాని ఉద్యోగానికి వెళ్లేందుకు తయారవుతుండగా అతడి వెంటే తిరిగింది. అతడిని గేటు వరకు సాగనంపి ఇంట్లోకి వెళ్లకుండా వీధిలో కాసేపు నిల్చుంది. వీధిలో అటు ఇటుగా తచ్చాడుతున్న ఆ కుక్క పిల్లను ఓ మహిళ తన వెంట తీసుకెళ్లింది. ఈ సంఘటన మంగళవారం కాచిగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని నింబోలిఅడ్డా మోతీమార్కెట్ చోటు చేసుకుంది. మోతీమార్కెట్లో నివసించే మహేందర్ ‘లక్కీ’అనే కుక్కను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. అతడు కార్యాలయానికి వెళ్లగా గేటు వద్దకు వచ్చిన కుక్కపిల్ల తిరిగి ఇంట్లోకి రాలేదు. ఎంత సేపటికీ అది రాకపోవడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా అది కనిపించలేదు. జమాల్ బస్తీలోని కల్లు కంపౌండ్‌లోకి కుక్కపిల్లను తీసుకెళ్లినట్లు స్థానికులు వారికి తెలిపారు. వెంటనే వారు అక్కడికి వెళ్లి సీసీ ఫుటేజీని పరిశీలించగా ఓ మహిళ తీసుకొచి్చనట్లు గుర్తించారు. కుక్కపిల్లను ఎవరైన గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని వారు కోరారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశామని వారు తెలిపారు. -
వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు
అచ్యుతాపురం రూరల్ : పూడిమడక గ్రామానికి చెందిన మత్స్యకారుడు చోడిపల్లి యర్రయ్య(26) సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం నలుగురితో కలిసి యర్రయ్య సముద్రంలో వేటకు వెళ్లాడు. చేపలు పట్టడం కోసం తాడును చేతికి కట్టుకుని గేలంతో చేపలను కొట్టాడు. ఈ క్రమంలో ఈ గేలానికి సుమారు 100 కేజీల బరువు ఉండే పెద్ద చేప చిక్కుకుంది. అయితే ఆ చేప బలంగా సముద్రంలోకి లాక్కుపోవడంతో యర్రయ్య గల్లంతైనట్టు తోటి మత్స్యకారులు తెలిపారు. తీరానికి సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో వేట సాగించామన్నారు. అధికారులు స్పందించి గల్లంతైన మత్స్యకారుడి కోసం గాలించాలని మత్స్యకార నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు కోరారు. -
మా కొడుకు జాడ చెప్పండి
భూపాలపల్లి: ‘తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న మా కొడుకు కనిపించడం లేదు. 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. మా కుమారుడి జాడ చూపించండి’అంటూ వృద్ధ దంపతులు సోమవా రం గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్‌ను వేడుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడుకు చెందిన మందల చిన్న సమ్మిరెడ్డి కుమారుడు రాజు 2013, జూన్ 20వ తేదీన హైదరాబాద్‌కు వెళ్లి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నాడు. అప్పటినుంచి అతడు ఇంటికి రాలేదు. దీంతో తండ్రి చిన్న సమ్మిరెడ్డి 2017, జూన్ 20న భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో కుమారుడి గురించి ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు బదిలీ చేయగా, విచారణ జరిపిన పోలీసులు 2021లో రాజు ఆచూకీ లభ్యం కాలేదని వెల్లడించారు. కొడుకు ఆచూకీ కోసం తాము వెతికామని, కానీ ఇప్పటి వరకు ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదని రాజు తండ్రి .. కలెక్టర్ రాహుల్ శర్మ ఎదుట వాపోయారు. గత ప్రభు త్వం తమ కుమారుడిని తెలంగాణ అమరవీరుడిగా గుర్తించిందని, అయినా ఎటువంటి న్యాయం జరగలేదని తెలిపారు. ఉండటానికి ఇల్లు, తమ కూతురికి ఉద్యోగ అవకాశం కలి్పంచాలని సమ్మిరెడ్డి కోరారు. -
పెళ్లి కోసం అమెరికా వెళ్లి.. భారతీయ యువతి మిస్సింగ్
పెళ్లి కోసం అమెరికా వెళ్లిన భారతీయ మహిళ అదృశ్యమైంది. అమెరికా పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారత్‌కు చెందిన 24 ఏళ్ల సిమ్రాన్ అనే యువతి జూన్ 20న అమెరికాకు చేరుకోగా, పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికాకు వచ్చినట్లు అధికారులకు చెప్పింది. అమెరికా వచ్చిన కొన్ని రోజులకే సిమ్రాన్ అదృశ్యమైనట్లు న్యూజెర్సీ అధికారులు వెల్లడించారు.జూన్ 25న ఆమె చివరిసారి కనిపించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు.. ఆమె ఫోన్ చూస్తూ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు కనిపించింది. ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని తెలిపారు. మరోవైపు, ఆమె అమెరికాకు వచ్చింది.. పెళ్లి కోసమా, లేక వేరే ఉద్దేశ్యమా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె చివరిసారిగా గ్రే స్వెట్‌ప్యాంట్స్, వైట్ టీ షర్ట్, బ్లాక్ ఫ్లిప్‌ఫ్లాప్స్ ధరించి, చిన్న డైమండ్ ఇయరింగ్స్ పెట్టుకుని కనిపించింది. ఆ యువతి వాడుతున్న ఫోన్ కేవలం వైఫై ద్వారా మాత్రమే పని చేయడంతో పోలీసులు ఆమెను ట్రేస్ చేయలేకపోతున్నారు.సిమ్రాన్ ఇంగ్లీష్ మాట్లాడలేదని, అమెరికాలో ఆమెకు బంధువులు కూడా ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. భారత్‌లోని ఆమె బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదన్నారు. సిమ్రాన్ రూపు రేఖలు, మిస్సింగ్‌కు ముందు ఆమె ధరించిన దుస్తులు, ఇతర వివరాలను వెల్లడించారు. ఆమె ఆచూకీ గురించి ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
శునకం చిత్రం చూపి.. కనకం చోరీ
మైసూరు : మా కుక్క పోయింది,మీరేమైనా చూశారా అని ఓ మహిళా రైతుకు కుక్క ఫొటోను చూపించిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని కనకం గొలుసును లాక్కొని పరారైన ఘటన మైసూరు తాలూకా ఇలవాల ఫిర్కా కల్లూరు నాగనహళ్లి గ్రామంలో జరిగిం ది. గ్రామ నివాసి కుళ్లేగౌడ భార్య కుమారి (47) బాధితురాలు.ఆమె పశువులకు నీరు తాగించేందుకు చిక్కెరె వద్దకు వెళ్లారు.ఆ సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెను పలకరించి కుక్క ఫొటోను చూపించి ఇది తమ కుక్కేనని, తప్పిపోయిందని, మీరే మైనా చూశారా అని అడిగారు. ఆమె కుక్క ఫోటోను చూస్తుండగా మెడలోని రూ.3.20 లక్షల విలువ చేసే 37 గ్రాముల బంగారు మం గళసూత్రాన్ని లాక్కొని పరారయ్యారు. బాధితురాలు కేకలు వేసినా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఫలితం లేకపోయింది. ఇలవాల ఠాణాలో ఫిర్యాదు చేసింది. -
భర్తను కాదని.. వేరే వ్యక్తితో పరిచయం..!
భీమునిపట్నం: భీమిలిలో నెల రోజుల క్రితం అదృశ్యమైన మహిళ మంగళవారం బీచ్‌రోడ్డులోని జీడి తోటలో శవమై కనిపించింది. కృష్ణాకాలనీకి చెందిన బంగారు కవిత (28) గత నెల 10న సరకులు తీసుకువస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె భర్త పైడిరాజు ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కవిత అదృశ్యంపై ఆమె భర్త, కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. కాగా.. బీచ్‌రోడ్డులోని మార్లిన్ కే రెస్టారెంట్ ఎదురుగా ఉన్న జీడి తోటలో ఒక చెట్టు కొమ్మకు వేలాడుతున్న మహిళ తల, వేరుపడిన శరీరం ఉండడాన్ని కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ తిరుమలరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.హత్య? ఆత్మహత్య? కవిత మృతి విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనేది తేలాల్సి ఉంది. అదృశ్యమైన ఒకటి, రెండు రోజుల్లోనే ఆమె చనిపోయి ఉండవచ్చని తెలుస్తోంది. మంగళవారం వరకు మృతదేహం ఎవరికీ తెలియకపోవడంతో తల నుంచి శరీరం నేల మీద పడిపోయి, బాగా పాడైపోయిన స్థితిలో ఉంది. దీంతో పోస్టుమార్టంను అక్కడే నిర్వహించారు.పోలీసుల దర్యాప్తులో ఆమెకు ఒక వ్యక్తితో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో ఏదైనా గొడవలు జరిగి ఇక్కడకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడిందా, లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, తాము ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు సరైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందువల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు బీచ్‌రోడ్డులో నిరసన తెలిపారు. -
Air India Plane Crash: నా భర్త కనిపించడం లేదు : ఫిల్మ్ మేకర్ భార్య
దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదాన్ని నింపిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బాధితుల సంఖ్య రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. తాజాగా తన భర్త, చిత్ర నిర్మాత కనిపించడంలేదంటూ భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతను ప్రాణాలతో ఉన్నాడా లేదా సందేహాల మధ్య కుటుంబం DNA నమూనాలను సమర్పించింది . మరోవైపు అతని మొబైల్ ఫోన్ చివరిగా భయంకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుండి కేవలం 700 మీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.నరోడా-నివాసి మహేష్ కలవాడియా, మహేష్ జిరావాలా (Mahesh Jirawala) అని కూడా పిలుస్తారు. సంగీత ఆల్బమ్‌లకు దర్శకత్వం వహిస్తాడు. లా గార్డెన్ ప్రాంతంలో ఒకరిని కలవడానికి వెళ్లి, అదృశ్యమైనాడని అతని భార్య హేతల్ ఫిర్యాదు చేసింది."నా భర్త మధ్యాహ్నం 1.14 గంటలకు నాకు ఫోన్ చేసి తన సమావేశం ముగిసిందని, ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో, నేను అతని ఫోన్‌కు కాల్ చేసాను కానీ అది స్విచ్ ఆఫ్ అయింది. అతని స్కూటర్ ఆచూకీ కూడా లభ్యం కాలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత, అతని మొబైల్ ఫోన్ చివరిగా అతను క్రాష్ సైట్ నుండి 700 మీటర్ల దూరంలో ఉన్నట్లు చూపించింది" అని ఆమె ఆందోళన చెందుతోంది. సాధారణంగా తన భర్త ఈ మార్గంలో ఎపుడూ రాడని, ఏమైందో అర్థం కావడంలేదని హేతల్ తెలిపింది.కాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్లోసర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే మేఘనినగర్‌లోని ఒక వైద్య కళాశాల ప్రాంగణంలోకి విమానం కూలిపోయింది. AI-171 విషాదకరమైన ప్రమాదం జరిగి మూడు రోజుల తరువాత, ఇప్పటివరకు 270 మంది ప్రాణాలు కోల్పోయారు, ఆసుపత్రి అధికారులు ఆదివారం DNA మ్యాచింగ్ ద్వారా 47 మంది బాధితులను గుర్తించినట్లు నిర్ధారించారు. అధికారులు 24 మృతదేహాలను బాధితుల కుటుంబాలకు అప్పగించారని వారు తెలిపారు. ఈ ప్రమాదంలో చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. భయంకరమైన విషాదంలో బాధితుల గుర్తించేందుకు ధికారులు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
మరో ‘హనీమూన్ కేసు’.. ఐస్ క్రీం ఫ్రీజర్‌లో మృతదేహం..
గౌహతి: మేఘాలయలో చోటుచేసుకున్న హనీమూన్ హత్య కేసు మరువకముందే ఇదే ఈశాన్య రాష్ట్రానికి చెందిన త్రిపురలో ఇటువంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అగర్తలోని ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడి అదృశ్యం వెనుకనున్న రహస్యాన్ని పోలీసులు ఛేదించారు.త్రిపుర రాజధాని అగర్తలకు 120 కి.మీ దూరంలో ఉన్న ధలై జిల్లాలోని గండచెర్రా మార్కెట్లో ఐస్‌క్రీమ్ ఫ్రీజర్‌లో దాచిన ట్రాలీ బ్యాగ్‌లో ఒక యువకుని మృతదేహం లభ్యమయ్యింది. మేఘాలయలో చోటుచేసుకున్న ‘హనీమూన్ హత్య’ దరిమిలా ఇటువంటి ఘటనే చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. అగర్తల స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్ట్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న సరిఫుల్ ఇస్లాం(20) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ యువకుడు, దిబాకర్ సాహా(28) అనే వైద్యుడు మరో మహిళ మధ్య నడిచిన ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఈ హత్యకు దారితీసిందని ఒక పోలీసు అధికారి తెలిపారు.ప్రాథమిక దర్యాప్తులో తొలుత ఆ మహిళకు, ఆమె బంధువు అయిన దిబాకర్ సాహా మధ్య ప్రేమ వ్యవహారం ఉందని తేలింది. సరిఫుల్ ఇస్లాం హత్య కేసులో ఆ డాక్టర్, అతని తల్లిదండ్రులతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో మరో మహళ కూడా ఉంది. జూన్ 8న సాయంత్రం డాక్టర్ దిబాకర్ సాహా.. సరిఫుల్‌ను సౌత్ ఇంద్రానగర్ కబర్‌ఖలా ప్రాంతానికి రమ్మని పిలిచాడు. అక్కడి జోయ్‌దీప్ దాస్(20) ఇంటిలో బహుమతి ఇస్తానని చెప్పాడు. అతని మాట మేరకు సరిఫుల్ అక్కడకు రాగానే దిబాకర్, అతని స్నేహితులు అనిమేష్ యాదవ్(21) నబనితా దాస్(25) అతనిపై దాడి చేశారు. అతన్ని గొంతు నరికి హత్య చేశారు. తరువాత మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేశారని పోలీసులు తెలిపారు.మర్నాటి ఉదయం దిబాకర్‌తో పాటు అతని తల్లిదండ్రులు దీపక్, దేబికా సాహాలు గండచెర్రా నుండి అగర్తలాకు మృతదేహం ఉన్న ట్రాలీ బ్యాగ్‌ను తీసుకెళ్లారు. తరువాత శవాన్ని గండచెర్రా మార్కెట్లోని వారి దుకాణంలోగల ఐస్ క్రీం ఫ్రీజర్‌లో దాచారు. ఈ కేసును పోలీసులు రోజుల వ్యవధిలో ఛేదించారు. మంగళవారం రాత్రి ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం సరిఫుల్ ఇస్లాం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారందరినీ గురువారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ముగ్గురి మధ్య నడిచిన ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని, వారి మొబైల్ మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్ ‘ప్లాన్ బీ’ -
వీడిన ‘హనీమూన్’ హత్య మిస్టరీ
షిల్లాంగ్/లక్నో/ఘాజీపూర్/ఇండోర్: పెళ్లయిన తొమ్మిది రోజులకు హనీమూన్‌కు వెళ్లి మేఘాలయలో శవమై తేలిన నవవరుడు రాజా రఘువంశీ హత్య కేసులో ఎట్టకేలకు భార్య సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పోలీసులకు లొంగిపోయింది. ప్రియుడి ప్లాన్ ప్రకారం కొందరికి సుపారీ ఇచ్చి భర్తను ఆమెనే హత్య చేయించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం అర్థరాత్రిదాటాక ఈ కేసులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వివరాలను మేఘా లయ మహిళా డీజీపీ ఇదాషీషా నోంగ్రాంగ్ సోమవారం పత్రికా సమావేశంలో చెప్పారు. ప్రియుడు కుష్వాహాతో కలిసి కుట్ర! సోనమ్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో 19 ఏళ్ల ఆకాశ్ రాజ్‌పుత్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 22 ఏళ్ల విశాల్ సింగ్ చౌహాన్, 21 ఏళ్ల రాజ్‌సింగ్ కుష్వాహా, బినా పట్టణంలో 23 ఏళ్ల ఆనంద్ కురీ్మలను పోలీసులు అరెస్ట్‌చేశారు. అయితే మీడియా కథనాల ప్రకారం మేఘాలయలో అదృశ్యమైన సోనమ్ ఆదివారం అర్థరాత్రి దాటాక ఉత్తరప్రదేశ్‌లోని వారాణాసి–ఘాజీపూర్ రహదారి పక్కన కాశీ ధాబా వద్దకు ఒంటరిగా వచ్చి తన సోదరుడు, తన భర్త సోదరునికి ఫోన్ చేసింది. వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. ఆమె చాలా నీరసంగా కనిపించడంతో తొలుత సదర్ ఆస్పత్రికి తర్వాత ‘వన్ స్టాప్ సెంటర్’కు తరలించి చివరకు అరెస్ట్‌చేశారు. అయితే తాను నిర్దోషినని, ఎవరో తనను కిడ్నాప్‌చేశారని సోనమ్ చెప్పింది. అయితే పోలీసులు మాత్రం భర్త హత్యోదంతంలో సోనమ్‌ది కీలకపాత్ర పని చెబుతున్నారు. సోనమ్ సోదరుడు నిర్వహించే ఒక కంపెనీలో పనిచేసే రాజ్‌సింగ్ కుష్వాహాకు ఆమెతో సన్నిహిత సంబంధం ఉందని, రాజ్‌సింగ్ ప్లాన్ ప్రకారమే మరికొందరికి సుపారీ ఇచ్చి సోనమే భర్తను చంపేయించిందని పోలీసులు చెప్పారు. కుష్వాహాతో సోనమ్ తరచూ మాట్లాడేదని రాజా రఘువంశీ సోదరుడు సైతం ఆరోపించారు. అరెస్టయిన వారిలో ఇద్దరు కుష్వాహాకు స్నేహితుల ని తేలింది. ఇండోర్‌లో ట్రాన్స్పోర్ట్ వ్యాపా రం చేసే రాజారఘువంశీకి సోనమ్‌తో మే11 వ తేదీన వివాహమైంది. ఇద్దరు మే 20వ తేదీన మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. 22న మావ్లఖియాత్ గ్రామంలో ఒక స్కూటర్‌ను అద్దెకు తీసుకుని సజీవ చెట్ల వంతెనను చూసేందుకు వెళ్లి 23వ తేదీన అదృశ్యమయ్యారు. 10 రోజుల తర్వాత జూన్ రెండున భర్త మృతదేహాన్ని ఈస్ట్ఖాసీ హిల్స్ జిల్లాలో ని వేసాడాంగ్ జలపాతం సమీప లోయలో పోలీసులు కుళ్లిన స్థితిలో కనుగొన్నారు. అప్ప టి నుంచి సోనమ్ ఆచూకీ కోసం మేఘాల య సిట్ పోలీసులు, రాష్ట్ర ఎన్డీఆర్ఎఫ్, స్థా నిక నిఘా బృందాలు, స్థానిక యంత్రాంగం విస్తృతస్థాయిలో గాలిస్తుండటం తెల్సిందే. రాజ్ కుష్వాహా, విశాల్ చౌహాన్, ఆకాశ్ రాజ్ పుత్లను ఇండోర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వీళ్లను ఏడు రోజులపాటు మేఘాలయ పోలీసు కస్టడీకి అప్పగిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులిచ్చారు. రిటర్న్ టికెట్లు బుక్చేయలేదు కోడలు అరెస్ట్ వార్త తెలిసి రాజా తల్లి ఉమా రఘువంశీ మీడియాతో మాట్లాడారు. ‘‘పెళ్లయ్యాక హనీమూన్‌కు వెళ్లే ఉద్దేశ్యం మా అబ్బాయికి లేదు. కానీ భార్య ప్రోద్భలంతోనే అతను ట్రిప్‌కు వెళ్లాడు. ట్రిప్‌కు వెళ్లబోతున్న విషయం కోడలు మాలో ఒక్కరికి కూడా చెప్పలేదు. మేఘాలయకు వెళ్లాలనే ప్లాన్ సోనమ్‌దేనని మా అబ్బాయి చిట్టచివర్లో చెప్పాడు. ట్రిప్ టికెట్లు ఆమెనే బుక్‌చేసింది. కానీ రిటర్న్ టికెట్లు బుక్చేయలేదు. నా కుమారుడు గాయాలపాలై చనిపోతే ఈమె కు ఒక్క గాయం కాకపోవడం అనుమా నంగా ఉంది. నా కొడుకును ఆమెనే చంపి ఉంటే సోనమ్‌ను ఖచి్చతంగా ఉరితీయాల్సిందే’’అని ఉమ డిమాండ్ చేశారు.రాజా శరీరంపై లోతైన గాయాలు రాజా మృతదేహానికి చేపట్టిన పోస్ట్‌మార్టమ్ నివేదిక తాజాగా బహిర్గతమైంది. తలపై రెండు లోతైన గాయాలున్నాయి. ఒకటి ముందువైపు, మరోటి వెనుకవైపు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. శరీరంపైనా కత్తి గాయాలున్నాయి. మధ్యప్రదేశ్‌లో పథకరచన చేసి, మేఘాలయలో అమలుచేసి, చివరకు ఉత్తరప్రదేశ్‌లో నిందితులు దొరికిపోయారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తమ రాష్ట్రంలో హత్య జరగడంతో స్థానికులే ఈ హత్యచేశారని పుకార్లు రావడంతో మేఘాలయ పర్యాటకంపై ప్రభావం పడిందని, ఇప్పుడు అంతా స్పష్టతరావడంతో మా రాష్ట్రంపై పడిన మచ్చ తొలగిపోయిందని రాష్ట్ర మంత్రి అలెగ్జాండర్ ఆనందం వ్యక్తంచేశారు. ఇది కూడా చదవండి: గ్రెటా థన్‌బర్గ్‌కు ఘోర అవమానం.. గాజా దారిలో ఇజ్రాయెల్ అడ్డగింత -
ఇండోర్ జంట మిస్సింగ్ మిస్టరీ.. ఏ రోజు ఏం జరిగింది?
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన నూతన దంపతులు రఘువంశీ, సోనమ్‌లు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లి అదృశ్యమయ్యారు. 11 రోజుల తరువాత రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడిని ఎవరో హత్యచేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన వేటకొడవలిని స్వాధీనం చేసుకున్నట్టు ఈస్ట్ ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సియోం తెలిపారు. అయితే సోనమ్ ఏమైందనేది ఇంతవరకూ తెలియరాలేదు.మేఘాలయ పోలీసులు ఈ కేసుకు సంబంధించిన పలు ఫొటోలు విడుదల చేశారు. అదృశ్యమైన సోనమ్ కోసం గాలిస్తున్నారు. ఈ జంట హనీమూన్‌లో భాగంగా సందర్శించిన ప్రదేశాలను, సమయాలను పోలీసులు తెలిపారు.మే 21, సాయంత్రం 6 గంటలకు: షిల్లాంగ్రఘువంశీ, సోనమ్‌లు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని బాలాజీ గెస్ట్ హౌస్‌కు చేరుకుని, చెక్ ఇన్ చేశారు.మే 22, ఉదయం: షిల్లాంగ్రఘువంశీ, సోనమ్‌లు కీటింగ్ రోడ్లో స్కూటీని అద్దెకు తీసుకుని, బాలాజీ గెస్ట్ హౌస్‌కు తిరిగి వచ్చారు. వారు అల్పాహారం తీసుకోకుండానే చెక్ అవుట్ చేశారు. మే 25కు తిరిగి వస్తామని, గది అవసరమైతే ఫోన్ చేస్తామని మేనేజర్‌కు చెప్పారు. షిల్లాంగ్ నుండి వారు స్కూటీపై ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సోహ్రా (చిరపుంజి)కి రెండు లగేజీలను తీసుకుని బయలుదేరారు.మే 22, సాయంత్రం: మౌలాఖియాట్, తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాఈ జంట తూర్పు ఖాసీ హిల్స్‌లోని మౌలాఖియాట్ గ్రామానికి చేరుకుంది. పర్యాటకుల కోసం కేటాయించిన పార్కింగ్ స్థలంలో స్కూటీని నిలిపారు. అదే జిల్లాలోని నోంగ్రియాట్ గ్రామంలోని షిపారా హోమ్‌స్టేకు ట్రెక్కింగ్ చేసేందుకు వారు స్థానిక గైడ్‌ను ఏర్పాటు చేసుకున్నారు.మే 23, ఉదయం: మౌలాఖియాట్, తూర్పు ఖాసీ హిల్స్ జిల్లారఘువంశీ, సోనమ్‌లు షిపారా హోమ్‌స్టే నుండి చెక్ అవుట్ చేసి, గైడ్ లేకుండానే మావ్లాఖియాట్ గ్రామానికి వెళ్లారు. అదే రోజు వారు మావ్లాఖియాట్ నుండి బయలుదేరి, ఆ తర్వాత అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలలో గాలించారు. ఆ జంట తామే ట్రెక్కింగ్‌కు వెళతామని తెలియజేసినట్లు గైడ్ పోలీసులకు చెప్పాడు. తన సేవలను తీసుకోలేదని గైడ్ పోలీసులకు తెలిపాడు.మే 24: సోహ్రారిమ్తూర్పు ఖాసీ హిల్స్‌లోని సోహ్రారిమ్ గ్రామ పెద్ద తమ గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక స్కూటీని చూసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.మే 25: సోహ్రారిమ్పోలీసులు ఆ స్కూటీ యజమానిని గుర్తించారు. అతను సోహ్రా పోలీస్ స్టేషన్‌కు వచ్చి, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రఘువంశీ, సోనమ్‌లు తన ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకున్నట్లు నిర్ధారించాడు.మే 26: సోహ్రారిమ్రఘువంశీ, సోనమ్‌లు తిరిగిన ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.జూన్ 2: వీ సావ్డాంగ్ జలపాతంపోలీసు డ్రోన్ వీ సావ్డాంగ్ జలపాతం కింద లోయలో ఒక మృతదేహాన్ని గుర్తించింది. పాక్షికంగా కుళ్ళిపోయిన ఆ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అది రాజా రఘువంశీ మృతదేహమేనని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం సోనమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది కూడా చూడండి: అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు.. కొలంబయాలో ఉద్రిక్తత -
ఈత రాకున్నా నదిలోకి వెళ్లి..
భూపాలపల్లి/కాళేశ్వరం: వారంతా విద్యార్థులు.. పైగా సమీప బంధువులు.. ఓ వివాహ వేడుకలో కలుసుకున్నారు... ఎవరికీ ఈత రాకున్నా మేడిగడ్డను చూసి సరదాగా గోదావరిలో స్నానం చేద్దామని నదిలోకి దిగారు. కానీ నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేక ఒకరిని కాపాడబోయి ఒకరు మొత్తం ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోల్కొండ మల్లయ్య కుమార్తె త్రివేణి వివాహం ఈ నెల 5న జరిగింది. వివాహం అనంతరం సమీప బంధువులైన అదే గ్రామానికి చెందిన పట్టి మధుసూదన్ (18), పట్టి శివమనోజ్ (15), తొగరి రక్షిత్ (13), కర్ణాల సాగర్ (16)తోపాటు మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల రాంచరణ్ (17), స్తంభంపల్లి (పీపీ)కి చెందిన పసుల రాహుల్ (19), పట్టి శివమణి.. మేడిగడ్డ ఎగువ భాగంలో మూడో బ్లాక్ వద్ద స్నానం చేసేందుకు శనివారం సాయంత్రం 6 గంటలకు వెళ్లారు. మోకాలి లోతు నీళ్లలో స్నానం చేసే క్రమంలో ఆడుకుంటుండగా తొలుత ఒకరు నీటమునిగారు. ఆపై ఒకరిని కాపాడబోయి ఒకరు.. ఆరుగురు నీటమునిగారు. నది ఒడ్డునున్న పట్టి శివమణి వెంటనే పట్టి మధుసూదన్‌ను కాపాడేందుకు ప్రయత్నించాడు. సాధ్యంకాకపోవడంతో చివరకు ఒడ్డుకు వచ్చేశాడు. మిగిలిన ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. వద్దని వారిస్తున్నా వినకుండా... అంబట్పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామికి కుమారులు మధుసూదన్, శివమనోజ్ ఉన్నారు. వారితోపాటు మిగిలిన ఐదుగురు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్తుండగా వెంకటస్వామి అడ్డుకున్నాడు. నదిలో నీటిమట్టం ఎక్కువగా ఉందని.. వెళ్లొద్దని వారించినా వినకుండా వారు వెళ్లా రు. దీంతో అతను కూడా వారితో అక్కడికి వెళ్లాడు. మోకాలి లోతు వరకు వెళ్లాక తిరిగి రావాలని పిలుస్తున్న క్రమంలోనే తన కుమారులు సహా ఆరుగురు ఒకరి వెనుక ఒకరు నీటము నగడంతో వెంకటస్వామి అచేతన స్థితిలో ఉండిపోయాడు. ఘటనాస్థలిలో 5,100 క్యూసెక్కుల నీరు.. కొద్ది రోజులుగా గోదావరి ఎగువన వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం పెరుగుతోంది. ప్రమాదం జరిగిన మేడిగడ్డ ఎగువ భాగం మూడో బ్లాక్‌లో ప్రస్తుతం 5,100 క్యూసెక్కుల నీరు ఉంది. పిల్లలు నీటిని అంచనా వేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఆరుగురు యువకుల గల్లంతు వార్త తెలుసుకున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. అయినా గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి హసన్‌పర్తి: వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెడ్డిపురం చెరువులో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మునిగి మృతిచెందాడు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం టేకులకుంట తండాకు చెందిన తేజావత్ గణేష్ నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. అదే హాస్టల్లోని నలుగురు స్నేహితులతో కలిసి రెడ్డిపురం సమీపంలోని చెరువులోకి ఈతకు వెళ్లాడు. గణేశ్ ఈత కొడుతూ ముందుకు వెళ్లి మునిగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గణేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి తండ్రి తేజావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. -
కంటిపాపలకు కనురెప్పలు దూరం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కంటికి రెప్పలే భద్రత. ఆ కనురెప్పలే మాయమైతే కళ్ల పరిస్థితేంటి? అలాగే కంటికి రెప్పలాంటి ఇంటిపెద్ద దేశంకాని దేశంలో ఉన్నట్టుండి కనిపించకుండా పోతే.. ఇక్కడి ఆ కుటుంబం పరిస్థితేంటి? కట్టుకున్నవాడి కోసం ఆ ఇల్లాలు పడే ఆవేదన మాటలకు అందదు.. అమ్మా.. నాన్న ఎక్కడ అని పిల్లలు అడిగినప్పుడల్లా ఆ తల్లి గుండె ముక్కలయ్యే శబ్దం ఆమెకు మాత్రమే వినిపిస్తుంది. బతుకుదెరువు కోసం అప్పులు చేసి, సముద్రాలు దాటి విదేశాలకు వెళ్తున్నవారిలో కొందరు కనిపించకుండా పోతుండటంతో వారి కుటుంబాలు తీరని శోకంలో మునిగిపోతున్నాయి. ఆర్థిక ఆసరా ఆగిపోయి జీవితాలు తలకిందులవుతున్నాయి. విదేశాల్లో ఆచూకీ లేకుండా పోయిన కొందరు కార్మికుల కుటుంబ సభ్యులను ‘సాక్షి’ కదిలించే ప్రయత్నం చేసింది. నాలుగేళ్లుగా నరకయాతన ఈమె పేరు సింగం లక్ష్మి. ఈమె భర్త సింగం రాజేశ్వర్ గౌడ్ సౌదీఅరేబియాలో నాలుగేళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి తన భర్త ఆచూకీ తెలపాలని నాయకులు, ప్రభుత్వ అధికారుల చుట్టూ లక్ష్మి అలుపెరుగక తిరుగుతూనే ఉంది. ఖానాపూర్‌కు చెందిన సింగం రాజేశ్వర్ గౌడ్ 2018లో సౌదీ వెళ్లి.. రియాద్ సిటీ ఆమ్రియాలో ఖర్జూర తోట పని చేసేవాడు. తరచూ భార్య, పిల్లలతో ఫోన్లో మాట్లాడేవాడు. 2021 సెపె్టంబర్ 12 నుంచి అతని నుంచి ఫోన్లు రావడం నిలిచిపోయింది. అప్పటి నుంచి రాజేశ్వర్ ఆచూకీ లేకుండా పోయాడు. అతడితో కలిసి రూమ్‌లో ఉండేవారిని ఆరా తీయగా నాలుగు నెలల జీతంతో ఇంటికి డబ్బులు వేస్తానని వెళ్లి, తిరిగి రాలేదని తెలిపారు. దీంతో అక్కడి భారత ఎంబసీ, గల్ఫ్ కారి్మక సంఘాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులను కలసి రాజేశ్వర్ గౌడ్ ఆచూకీ కనుక్కోవాలని లక్ష్మి వినతులు ఇస్తూనే ఉంది. కట్టుకున్న భర్త కనిపించకపోవటం, కుటుంబ భారం మొత్తం ఆమెపైనే పడటం, పైగా రూ.7 లక్షల వరకు అప్పు కూడా ఉండటంతో ప్రస్తుతం కూలిపని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కొడుకు సిద్దార్థ డిగ్రీ పూర్తిచేసి మూడు నెలలక్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. కూతురు మౌనిక డిగ్రీ పూర్తిచేసింది. చిన్న కొడుకు మల్లిఖార్జున్ పదో తరగతి చదువుతున్నాడు. ఎప్పటికైనా రాజేశ్వర్ ఆచూకీ దొరుకుతుందేమోనని ఆ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. నాన్న ఏడని అడుగుతున్నారు? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందినలాస్యకు ఇద్దరు కూతుళ్లు. ప్రస్తుతం గర్భవతి కూడా. ఈమె భర్త బట్టు నాగార్జున్ జగిత్యాలలోని సీఎమ్మార్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా గత మే 5న దుబాయ్‌కి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో లాస్య తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. తండ్రి నుంచి నెల రోజులుగా ఫోన్ రాకపోవడంతో పిల్లలు.. నాన్న ఏడి? అని అడుగుతన్న ప్రతిసారీ లాస్య గుండె తరుక్కుపోతోంది. భర్త ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో అని తలచుకుని రోజూ విలపిస్తోంది. నాగార్జున్ ఆచూకీ తెలపాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డికి మెయిల్ ద్వారా విన్నవించింది. ట్రావెల్స్ వాళ్లు పట్టించుకోవడం లేదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తన భర్తను క్షేమంగా ఇంటికి తీసుకురావాలని కోరుతోంది. సింగపూర్‌లో మతి స్థిమితం కోల్పోయి..! నిజామాబాద్ జిల్లా నందిపేట మండలానికి చెందిన గుండ్ల భూమేశ్వర్ మే 13న సింగపూర్ వెళ్లాడు. 19న అందరితో పాటే బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. అతడిని పనిలో పెట్టుకున్నవారు భూమేశ్వర్‌ను వెతికి పట్టుకొని మెట్రో ట్రైన్లో రూమ్‌కు తిరిగి తీసుకొస్తుండగా మధ్యలో ఒక స్టేషన్ వద్ద దిగిపోయాడు. తర్వాత ఎంత వెతికినా దొరకలేదు. అతడి ఫోన్ కూడా పనిచేయడం లేదు. భూమేశ్వర్ మతి స్థిమితం కోల్పోయినట్టుందని అనుమానిస్తున్నారు. ఎలాగైనా ఆయనను ఇంటికి రప్పించేలా సింగపూర్ అధికారులు, అక్కడి భారత ఎంబసీతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇటీవల ‘ప్రవాసీ ప్రజావాణి’లోనూ భూమేశ్వర్ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. 31 ఏళ్లుగా కానరాని ఆచూకీ.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన ఈమె పేరు భోగ లక్షి్మ. ఈమె భర్త సదానందం 1994లో టూరిస్ట్ వీసాపై దుబాయ్ వెళ్లాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ లభించలేదు. సదానందం దుబాయ్ వెళ్లిన సమయంలో లక్షి్మకి ఐదేళ్లలోపు బాబు, పాప ఉన్నారు. సదానందం ఆచూకీ కోసం అధికారులు, నాయకులను ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమే సంసార బాధ్యతలు భుజానికెత్తుకుని బీడీ కార్మికురాలిగా మారి పిల్లలను చదివించి పెళ్లిళ్లు చేసింది. 31 ఏళ్లుగా భర్త ఆచూకీ కోసం వెదుకుతూనే ఉంది. ఏనాటికైనా సదానందం తిరిగి వస్తాడన్న ఆశతో లక్ష్మి బతుకుతోంది. ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించవచ్చు విదేశాలలో తప్పిపోయిన వారి ఆచూకీ కనుగొనడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే ’ప్రవాసీ ప్రజావాణి’లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవాసీల కుటుంబ సభ్యులకు, భారత విదేశాంగ శాఖకు, విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలకు ’ప్రవాసీ ప్రజావాణి’ఒక వారధిలాగా ఉపయోగపడుతుంది. బాధితులు నేరుగా భారత రాయబార కార్యాలయాలకు మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చు. ’మదద్’పోర్టల్‌లో మిస్సింగ్ ఫిర్యాదు కూడా నమోదు చేయవచ్చు. – మందా భీంరెడ్డి, వైస్ చైర్మన్, స్టేట్ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ, తెలంగాణ ప్రభుత్వం -
కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మాయం
-
8 మందిలో ముగ్గురు మృతి దేహాలు
-
కోనసీమ విషాదం: ఏడు మృతదేహాలు లభ్యం
కోనసీమ జిల్లా: గోదావరిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గొదావరిలో గల్లంతైన ఎనిమిది మందిలో ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. రాజేష్, మహేష్, క్రాంతి, పాల్ మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిన్న(సోమవారం) కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిది మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామంలో శుభకార్యం కోసం వచ్చిన వారిలో 11మంది యువకులు సోమవారం మధ్యాహ్నం సరదాగా నదీస్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ ఎనిమిది మంది మునిగిపోయారు.కాకినాడకు చెందిన సబ్బిత క్రాంతి మాన్యూల్ (19), సబ్బిత పాల్ మాన్యూల్ (18), తాతపూడి నితీష్ (19), ఎలుపర్తి సాయి (18), మండపేట మండలానికి చెందిన కాలపాక రోహిత్ (18), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన ఎలిపే మహేష్ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్ (15), వడ్డి రాజేష్ (18) గల్లంతయ్యారు. వారిలో ఏడు మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి.కె.గంగవరం మండలం శేరిలంకలో పోలిశెట్టి నాగరాజు, చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమ జ్యోతి ఓణీ ఫంక్షన్ జరిగింది. ఇందుకోసం ఇక్కడకొచ్చిన 11 మంది యువకులు భోజనాల అనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గౌతమి గోదావరిని చూసేందుకు వెళ్లారు. స్నానానికి దిగారు. వీరిలో స్థానికంగా నివాసముంటున్న ఎలిపే మహేష్ లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి దిగాడు. అతనిని రక్షించేందుకు నలుగురు వెళ్లి వారు కూడా మునిగిపోయారు. మరో ముగ్గురూ వారిని కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యారు. అర్థరాత్రి వరకు వీరి ఆచూకీ లభ్యంకాలేదు. స్నానానికి దిగిన వారిలో ముగ్గురు మాత్రమే గట్టు మీదకు చేరారు. వీరిలో కాకినాడకు చెండిన డి.కరుణ్‌కుమార్ ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులకు తెలిపారు. -
గోదావరిలో యువకుల గల్లంతుపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
గోదావరిలో స్నానానికెళ్లి 8 మంది గల్లంతు
-
కెనడాలో భారతీయ విద్యార్థిని అదృశ్యం విషాదాంతం
ఒట్టావా: కెనడాలో భారతీయ విద్యార్థిని వంశిక సైనీ(Vanshika Saini) మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. స్థానికంగా ఓ బీచ్‌లో ఆమె శవమై కనిపించింది. ఆమె మృతదేహాన్ని రికవరీ చేసుకున్న స్థానిక పోలీసులు.. మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని కెనడాలోని భారత హైకమిషన్ ధ్రువీకరిస్తూ.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి ప్రకటించింది.వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ ఆప్ నేత దేవిందర్ సింగ్ కుమార్తె వంశిక. ఆమె రెండున్నరేళ్ల కిందట డిప్లోమా కోర్సు కోసం కెనడా వెళ్లింది. ఏప్రిల్ 25వ తేదీన అద్దె ఇంటిని వెతికేందుకు బయటకు వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. ఆమె నుంచి రెండు రోజులు ఫోన్ కాల్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె స్నేహితులకు కాల్ చేశారు. వాళ్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 28వ తేదీన ఆమె మృతదేహం ఒట్టావా బీచ్ వద్ద లభ్యమైంది.ఆమె మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తరలించే అంశంతో పాటు ఈ కేసులో స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది.ఇదిలా ఉంటే.. ఇటీవల కెనడాలో భారతీయ విద్యార్థుల మరణాలు పెరిగిపోయాయి. తాజాగా.. గ్యాంగ్ వార్‌లో భాగంగా జరిగిన కాల్పుల్లో.. బస్టాప్‌లో వేచి చూస్తున్న 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని హర్ సిమ్రత్ రంధావా బుల్లెట్ తగిలి అనూహ్యంగా చనిపోయింది. కొన్నాళ్ల కిందట.. రాక్లాండ్ ప్రాంతంలో ఓ భారతీయుడు కత్తి పోట్లకు గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
లండన్ లో తప్పిపోయిన నిజామాబాద్ జిల్లా విద్యార్థి
లండన్ లో తప్పిపోయిన తన కుమారుడు నల్ల అనురాగ్ రెడ్డి జాడ వెతికి తెలుసుకుని ఇండియాకు వాపస్ తెప్పించాలని విద్యార్థి తల్లి హరిత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రికి సోమవారం వినతిపత్రం పంపారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన అనురాగ్ విద్యార్థి వీసాపై జనవరిలో లండన్ కు వెళ్ళాడు. యూకే లోని కార్డిఫ్ ప్రాంతంలో ఈనెల 25న సాయంత్రం నుంచి తన కుమారుడు జాడ తెలియకుండా పోయాడని హరిత తన వినతిపత్రం లో తెలిపారు. వెంటనే స్పందించిన ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ), జిఎడి ఎన్నారై అధికారులతో మాట్లాడారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీలోని విదేశాంగ శాఖకు, లండన్ లోని ఇండియన్ హై కమీషన్ కు లేఖలు రాశారు. -
అత్తతో గొడవపడి వెళ్లిపోయిన కోడలు
వికారాబాద్: ఇంట్లో అత్త తో గొడవ పడిన కోడలు ఎటో వెళ్లిపోయిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంగెం గ్రామానికి చెందిన కూడళ్ల బాలమణికి నలుగురు సంతానం. అందులో రెండో కూతురు స్పందనను ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన బట్టు సురేష్ కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. భార్యాభర్తలు వేములనర్వ గ్రామంలో ఆర్ఎంపీ వైద్యులుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం అత్తాకోడళ్లు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన స్పందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం భర్త సురేష్ వెతకగా లభ్యం కాలేదు. దీంతో స్పందన తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజ్‌కుమార్ తెలిపారు. ట్రాన్స్జెండర్లపై కేసు నమోదు మీర్‌పేట: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ట్రాన్స్‌జెండర్స్‌పై మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో కొందరు ట్రాన్స్జెండర్లు రాత్రివేళల్లో అసభ్యకర దుస్తులు ధరించి వికృత చేష్టలు చేయడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడు తూ అసౌకర్యం కలిగిస్తున్నారన్న సమాచారం రావడంతో మీర్‌పేట పోలీసులు గురువారం రాత్రి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మందమల్లమ్మ చౌరస్తా, ఆర్సీఐ రహదారిపై 7 మంది ట్రాన్స్జెండర్లను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. -
నీరు లేదు... నిప్పు లేదు.. అడవిలో ఆ నలుగురు
తెలిసిన అడవే. కాని ఉరుములు మెరుపులతో చీకటి పడిపోయింది. దారి తప్పారు. ఊరి వైపు కాకుండా అడవిలోకి వెళ్లిపోయారు. నలుగురు స్త్రీలు... తునికాకు కోసం వెళ్లి రాత్రంతా అడవిలో ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడారు. వారి కథ గగుర్పాటు కలిగించేలా ఉంది. ధైర్యాన్ని నూరిపోసేలా కూడా. చిత్రమేమిటంటే తిరిగి వచ్చేప్పుడు పోలీసులు కూడా దారి తప్పారు. అంత మాయలమారి అడవి అది.‘రాధ ఆడ నీ పక్కకున్న కట్టెలందుకోయే..’‘ఏంటికే లింగవ్వ.. కట్టెలకు మంట పెడదమంటే మన తాన అగ్గిపుడక కూడ లేదు గదనే..’ ‘లేదే.. ఏదో సప్పుడైతుంది. గుడ్డెలుగులో, అడివిపందులో చీకట్ల తెలుస్త లేదే. కట్టె పట్టుకుని సప్పుడు చేస్తే దూరం పోతయని...’ చెట్టు మొదట్లో కాళ్లు ముడుచుకుని, చుట్టూ ఉన్న చీకట్లను భయంగా చూస్తూ చెబుతోంది లింగవ్వ. ‘ఈ చిమ్మచీకట్లల్ల ఆడోళ్లం ఏం చేస్తం. ఏదచ్చినా ఏం చేయలేం. ఇగ మనకు దేవుడే దిక్కు. తెల్లారితేనే మన బతుక్కు ఏమన్న తోవ దొరుకతదేమో..’అని రాధతో పాటు సరోజ, లక్ష్మి మాట కలిపారు. రోజూ రాత్రి ఏడింటికే నిద్రపోయే ఆ నలుగురు.... ఆ రాత్రిపూట కనీసం కనురెప్ప వాల్చలేదు. ఏ దిక్కు నుంచి ఏమొస్తుందోనన్న ఆందోళనతోనే రాత్రంతా గడిపారు. తమ జీవితంలో ఇలాంటి ఓ రాత్రి వస్తుందని వారు కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. తెల్లారిన తర్వాతే వాళ్ల జీవితాలకు వెలుగొచ్చింది.అడవిలో చిక్కుకున్నారునిర్మల్ జిల్లా మామడ మండలం కప్పన్ పల్లి గ్రామానికి చెందిన రాజుల రాధ, గట్టుమీది లక్ష్మి, కంబాల లింగవ్వ, బత్తుల సరోజ అనే నలుగురు మహిళలు ఈనెల 10న తునికాకు సేకరణ కోసం అటవిప్రాంతానికి వెళ్లి దారి తప్పారు. దాదాపు 15 గంటలపాటు దట్టమైన అడవిలోనే చిక్కుకుపోయారు. రాత్రంతా భయంకరమైన చీకటిలో అటవీ జంతువుల మధ్య గడిపారు. ఆ నలుగురూ సాదాసీదా కుటుంబాలకు చెందిన మహిళలే. ఈ సీజన్ లో తునికాకు సేకరించి పెట్టుకుంటే నాలుగు పైసలు ఎక్కువొస్తయనుకునే చిన్నపాటి ఆశలున్నవాళ్లే. అందుకే ఈ నెల 10న కప్పన్ పల్లిలో రోజంతా కూలి పనులు చేసుకుని, మధ్యాహ్నం 3.30 గంటలప్రాంతంలో నలుగురు కలిసి గ్రామ సమీపంలోని అటవీప్రాంతానికి వెళ్లారు.తునికాకు ఏరుతూ ఏడెనిమిది కిలోమీటర్ల దూరం వెళ్లిపోయారు. ఇకచాలు ఇంటికెళ్దాం అనుకునే సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు, గాలిదుమారం వారిని కంగారు పెట్టాయి. ఇళ్లకు వెళ్లాల్సిన దారి తప్పిపోయారు. తాము ఊరివైపు కాకుండా అడవిలోనే మరోవైపు వెళ్తున్నట్లు గ్రహించారు. కానీ అప్పటికే రాత్రి ఎనిమిదైంది. నలుగురిలో ఒకరైన రాధ దగ్గర సెల్‌ఫోన్ ఉన్నా అక్కడ సిగ్నల్స్ లేవు.ఇక తప్పని పరిస్థితుల్లో రాత్రంతా చిమ్మచీకట్లో దట్టమైన అడవి ఒడిలో బిక్కుబిక్కుమంటూ మంటూ ఉండిపోయారు. మరోవైపు చీకటి పడుతున్నా తమవాళ్లు ఇళ్లకు చేరకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కంగారుపడ్డారు. సమీప అటవీప్రాంతాలన్నీ గాలించారు. ఇక లాభం లేదనుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.రంగంలో పోలీసులుసమాచారం అందిన క్షణం నుంచి ఎస్పీ జానకీ షర్మిల అలర్ట్ అయ్యారు. నలుగురు మహిళలు, అదీ లోయలు, గుట్టలతో ఎలుగుబంట్లు, అడవి పందులు ఉండే దట్టమైన అడవిలో తప్పిపోవడంతో వారికేం కాకుండా వీలైనంత త్వరగా తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. కొందరు గ్రామస్తులతో కలిసి బృందాలుగా వెళ్లాలంటూ తమవాళ్లకు సూచించారు. రాత్రంతా ప్రయత్నం చేసినా దట్టమైన అడవిలో మహిళల జాడను కనుక్కోలేకపోయారు.ఆ చెట్టే దిక్కనుకుని..మరోవైపు అడవిలో ఆ చీకట్లో సెల్‌ఫోన్ టార్చిలైట్ ఆన్ చేసుకుని ఆ నలుగురు చాలా దూరమే నడిచారు. అలా ఎంతసేపు నడిచినా లాభం లేదనుకుని ఓ పెద్దచెట్టును చూసుకుని దాని దగ్గరే కూర్చున్నారు. వారందరికీ ఆ చెట్టు ఆసరా ఇచ్చింది. గాలివాన రాని, ఏ జంతువూ రాని ఏమైనా కానీ పొద్దున వరకు ఈ చెట్టు దగ్గర నుంచి కదలొద్దని నిశ్చయించుకున్నారు. ఏవైనా జంతువులు వస్తే చప్పుడు చేసి చెదరగొట్టడానికి తలో కట్టె చేతిలో పట్టుకుని కూర్చున్నారు. ఒకరికొకరు పైకి ధైర్యం చెప్పుకుంటున్నారు కానీ మనసుల్లో మాత్రం ఏదో తెలియని భయం. నాలుగు గోడల మధ్య పిల్లాపాపలతో గడిపేవాళ్లకు ఆ రాత్రి ఓ నరకంలా గడిచింది. ఎప్పుడూ వినని జంతువుల చప్పుళ్లు, కళ్లు పొడుచుకుని చూసినా కానరానంత చీకట్లో కంటి మీద కునుకు లేకుండా జాగారం చేశారు.తెల్లారితేనే..ఆ నలుగురు కొన్ని గంటల వ్యవధిలో పగలు, రాత్రిని కళ్లారా చూశారు. శుక్రవారం ఉదయం తెల్లవారగానే సమీపంలో ఉన్న గుట్టపైకి వెళ్తే ఏమైనా ఊళ్లు కనిపిస్తాయేమోనన్న ఆశతో ఆ గుట్ట ఎక్కారు. కనుచూపు మేరలో ఊళ్లు కనిపించలేదు గానీ.. తమ దగ్గర ఉన్న సెల్‌ఫోన్ లో సిగ్నల్స్ కనిపించడంతో కొండంత ధైర్యం వచ్చింది. ⇒ వెంటనే తమ వాళ్లకు ఫోన్లు చేశారు. ఆ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో నిర్మల్ ఎస్పీ జానకీషర్మిల స్వయంగా రంగంలోకి దిగారు. తమ వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ట్రాక్టర్లను తెప్పించి అడవి లోపలికి వెళ్లారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా డ్రోన్ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాల సాయంతో వారిని చేరుకున్నారు. అయితే తిరిగి వచ్చేటప్పుడు పోలీసులు కూడా తప్పిపోయారు. ఆఖరుకు డ్రోన్‌ను ఫాలో అవుతూ గమ్యాన్ని చేరారు. – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్⇒ మాకు తిండి, నీళ్లు లేవు. దారి తప్పాక అట్లనే రెండు మూడు గంటలు నడుసుకుంట అరుసుకుంటనే తిరిగినం. చివరికి నీరసంతో అరవడానికి శక్తి లేకుండా అయిపోయింది. – బత్తుల సరోజ⇒ ఇన్నేళ్లలో ఇట్లా ఎప్పుడు కాలేదు. తిరిగి వచ్చేటప్పుడు ఎట్ల దారి తప్పిపోయినమో కూడా గుర్తుకొస్తలేదు. రాత్రికి ఏమన్న జంతువులస్తయేమోనని నేను కొంచెంసేపు చెట్టెక్కి కూసున్న. ఆ రాత్రిని చూసినంక ఇగ తిరిగొస్తమనుకోలేదు. ఇప్పటికీ మనసుల నుంచి దడుకు పోతలేదు. – కంబాల లింగవ్వ -
రెస్క్యూ ఆపరేషన్ @ 50!
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం కుప్పకూలి శనివారానికి సరిగ్గా 50 రోజులైంది. దేశంలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో సుదీర్ఘంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 12 సంస్థలతోపాటు నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించినా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా.. వందల మంది సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నా గల్లంతైన వారిలో ఇంకా ఆరుగురు కార్మికుల జాడ బయటపడకపోవడం అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది.150 మీటర్ల మేర మట్టిని తొలగించి.. ఈ ప్రమాదంలో సొరంగం శిథిలాల కింద మొత్తం 8 మంది కార్మికులు కూరుకుపోగా ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీశారు. మిగితా ఆరుగురి జాడ కోసం నిత్యం మూడు షిఫ్టుల్లో మొత్తం 560 మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు అడ్డుగా ఉన్న టీబీఎం భాగాలను తొలగించడంతోపాటు సుమారు 150 మీటర్ల మేర టన్నులకొద్దీ మట్టిని తొలగించి 13.9 కి.మీ. అవతల సొరంగం నుంచి బయటకు తరలించారు. ఇంకా 100 మీటర్ల వరకు మట్టి, శిథిలాలను తొలగించేందుకు మరో 4 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. రంగంలోకి ఎన్నో సంస్థలు.. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, సింగరేణి, బార్డర్ రోడ్స్ అండ్ ఆర్గనైజేషన్, హైడ్రా, దక్షిణమధ్య రైల్వే, మేఘా, ఎల్ అండ్ టీ, రాబిన్స్, జేపీ సంస్థలతోపాటు ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మందిని సురక్షితంగా బయటకు తీసిన ర్యాట్ హోల్ మైనర్స్ ఎస్ఎల్బీసీ ప్రమాదస్థలి వద్ద సేవలు అందిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత వినియోగం.. బురద, శిథిలాల కింద కూరుకుపోయిన కార్మికుల ఆనవాళ్లను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజా్ఞనాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చింది. ఇప్పటివరకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, మానవ అవశేషాలను గుర్తించే కడావర్ డాగ్స్, నీటిలో సైతం మానవ రక్తం, అవశే షాలను గుర్తించే అక్వా–ఐ, ప్రోబోస్కోప్ టెక్నాలజీతోపాటు ఎన్జీఆర్ఐ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేస్తున్నాయి.టీబీఎం భాగాలను కట్ చేసేందుకు అల్ట్రా థర్మల్, గ్యాస్ కట్టర్లను వినియోగిస్తుండగా మ ట్టిని వేగంగా కన్వేయర్ బెల్టుపై వేసేందుకు నాలుగు ఎస్కలేటర్లు, సైన్యానికి చెందిన మినీ బాబ్‌కట్ మెషీన్లను ఉపయోగిస్తున్నారు. సొరంగం చివరి భాగంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న 40 మీటర్ల ప్రాంతంలో ఎన్వీ రోబోటిక్స్‌కు చెందిన రొబోటిక్ యంత్రాలను వినియోగించనున్నారు. -
Hyderabad : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం
హైదరాబాద్: బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల్లంతైన ఆరుగురు కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారి ఆచూకీ కనిపెట్టేందుకు బోయిన్పల్లి పోలీసులు ప్రత్యేక బృందాన్ని విజయవాడ పంపించారు. ఆరుగురిలో ఒక్కరి వద్దే సెల్‌ఫోన్ ఉండగా అది కూడా స్విచ్చాఫ్ కావడంతో వారి ఆచూకీ కనుక్కోవడం కొంత కష్టంగా మారినట్లు తెలుస్తోంది.బోయిన్‌పల్లికి చెందిన మహేశ్ తన భార్య ఉమ, ముగ్గురు పిల్లలు రిషి, చైతు, శివన్, మరదలు సంధ్యతో కలిసి ఈ నెల 1న ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయారు. రెండు రోజుల అనంతరం మహేశ్ బావమరిది బిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలు పెట్టారు. మహేశ్ కుటుంబం 1వ తేదీన బోయిన్పల్లి నుంచి నేరుగా, ఇమ్లీబన్‌కు చేరుకుని అక్కడ విజయవాడకు వెళ్లే గరుడ బస్సు ఎక్కినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. మరుసటి రోజు ఉదయం విజయవాడలో దిగినట్లు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయింది.సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బాలంరాయి పంప్‌హౌజ్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న మహేశ్, తోటి ఉద్యోగులతో ముభావంగానే ఉండేవాడని తెలుస్తోంది. మహేశ్ కుమారుడు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో తీర్థయాత్రలకు వెళ్లి ఉండచ్చొని మహేశ్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వీరి గల్లంతుకు గల ఇతరత్రా కారణాలు ఏవైనా ఉంటాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. గల్లంతయిన వారి ఆచూకీ తెలిశాకే పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
ఆరుగురు విద్యార్థులు అదృశ్యం
ఆలమూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండల కేంద్రమైన ఆలమూరు శివారు కండ్రిగ (యానాదుల) పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఒకే రోజు అదృశ్యమయ్యారు. స్కూల్‌కు వెళుతున్నామని చెప్పి నాలుగు రోజులైనా వారు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు శుక్రవారం స్థానిక పోలీసులను అశ్రయించారు. ఇప్పటి వరకూ ఇల్లు, స్కూల్‌కు తప్ప వేరే ప్రదేశం తెలియని ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ విద్యార్థులందరూ కనిపించకపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానిక ఎస్సై ఎం.అశోక్ కథనం ప్రకారం.. ఆలమూరులోని బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలో కొమరిగిరి కరుణ (8వ తరగతి), కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొమరిగిరి పృథ్వీవర్మ (6వ తరగతి), గంధం సతీష్ (8వ తరగతి), మర్రి సంతోష్ (7వ తరగతి), కొమరిగిరి పండు (6వ తరగతి), రామచంద్రపురంలోని ఎయిడెడ్ స్కూల్లో కొమరిగిరి మాధురి (7వ తరగతి) చదువుతున్నారు. ఈ ఆరుగురు విద్యార్థులూ ఈ నెల 24వ తేదీన పాఠశాలలకు యథావిధిగా వెళ్లారు. ఆ తరువాత తిరిగి రాలేదు. అప్పటి నుంచీ పరిసర ప్రాంతాల్లోను, బంధువుల ఇళ్ల వద్ద ఎంత గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులందరూ మూకుమ్మడిగా పోలీసు స్టేషన్‌కు చేరుకుని పరిస్థితి వివరించారు. విద్యార్థులందరూ కూడబలుక్కుని వెళ్లిపోయారా లేక వారిలో ఎవరైనా ప్రభావితం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ప్రచార మాధ్యమాల్లో ఆ విద్యార్థుల ఫొటోలు ప్రదర్శించడంతో పాటు వివిధ పోలీసు స్టేషన్లకు సమాచారం అందించినట్లు ఎస్ఐ అశోక్ చెప్పారు. -
మా బిడ్డ ఎప్పుడొస్తుందో..?
ఉలవపాడు: దా దాపు 15 రోజుల క్రితం తప్పిపోయిన వివాహిత ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదు. కుమార్తె ఆచూకీ లేక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పోలీసు శాఖ కేసు నమోదు చేసినా ఇంత వరకు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామంలో ఈ నెల 7వ తేదీన ఈ సంఘటన జరిగింది. వీరేపల్లి అంబేడ్కర్ నగర్‌కు చెందిన చొప్పర వెంకట రమణకు (31) వివాహమైంది. భర్త మరణించడంతో తల్లిదండ్రులు చొప్పర శ్రీను, వరలక్ష్మి వద్ద ఉంటోంది. ప్రతి రోజూ వీరేపల్లి నుంచి ప్రకాశం జిల్లా శింగరాయకొండలోని దేవి సీఫుడ్స్లోకి పనికి బస్‌లో వెళ్లి వస్తుంది. 7వ తేదీ తెల్లవారుజామున గ్రామంలో ఓ వివాహం జరుగుతున్న సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చింది. తరువాత నుంచి ఇంటికి రాలేదు. ఇంటి దగ్గర లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, తమ్ముడు వెతుకులాడారు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 8న మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు కొంత విచారణ జరిపినా ఫలితం లేకుండా పోయింది. నేటికీ ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు పెళ్లి జరుగుతున్న సమయంలో ఉన్న కొందరిని విచారించారు. ఆమె పనిచేసే ప్రాంతానికి వెళ్లి విచారించి వచ్చినా ఫలితం లేదు. పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసుపై మరింత దృష్టి సారించి తమ కుమార్తె ఆచూకీ తెలపాలని బాధితులు కోరుతున్నారు. -
సుదీక్ష మిస్సింగ్.. కిడ్నాపైందా?
న్యూఢిల్లీ: కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్లో తెలుగు విద్యార్థిని (Telugu Student) అదృశ్యం మిస్టరీగా మారింది. 20 ఏళ్ల సుదీక్ష కోణంకి (Sudiksha Konanki) కుటుంబం అమెరికాలో వర్జీనియాలోని లౌడౌన్ కౌంటీలోని చంటిల్లీలో నివసిస్తోంది. సుదీక్షకు అమెరికా శాశ్వత నివాస హోదా ఉంది. పిట్స్బర్గ్ వర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఐదుగురు తోటి విద్యార్థినులతో వారం క్రితం డొమినికన్ రిపబ్లిక్‌లోని పుంటా కానాకు వెళ్లింది. అక్కడి రియు రిపబ్లికా రిస్టార్టులో వారికి మరో ఇద్దరు అమెరికా టూరిస్టులు కలిశారు. అంతా మార్చి 5న రాత్రి స్థానిక నైట్ క్లబ్‌కు వెళ్లారు. 6వ తేదీ తెల్లవారుజామున నాలుగింటి సమయంలో అక్కడి బీచ్‌కు చేరుకున్నారు. ఉదయం 5.50 సమయంలో మిగతా వాళ్లు రిసార్టుకు వచ్చేయగా టూరిస్టుల్లో ఒకరైన జాషువా స్టీవెన్ రిబే (24), సుదీక్ష బీచ్‌లోనే ఉండిపోయారు. ఆ తరువాత ఆమె కనిపించలేదు. ఉదయం 9 గంటలప్పుడు రిబే ఒక్కడే బీచ్ నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీల్లో రికార్డయ్యింది. సాయంత్రమైనా సుదీక్ష ఆచూకీ లేకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవలు, స్కూబా డైవర్లు, ఏటీవీలను మోహరించి తీరం, పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. నాలుగు రోజులైనా ఆమె ఆచూకీ దొరకలేదు. చదవండి: మనిషిని కుక్క షూట్ చేసింది!దీనికి తోడు ఆమె అదృశ్యంపై స్నేహితుల నుంచి విరుద్ధ కథనాలు వస్తుండటంతో కుటుంబీకులు మరింత ఆందోళన చెందుతున్నారు. సుదీక్ష తల్లిదండ్రులు సుబ్బారాయుడు, శ్రీదేవి (Sridevi) కూడా పుంటా కానా వెళ్లారు. ఆదివారం వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘కుమార్తె సెల్‌ఫోన్, బ్యాగ్, ఇతర వస్తువులన్నీ స్నేహితుల వద్దే ఉన్నాయి. ఆమెనెవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చు’’ అని అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. సుదీక్ష ఆచూకీ కోసం తాజాగా ఎఫ్‌బీఐ (FBI) కూడా రంగంలోకి దిగింది. స్థానిక భారత రాయబార కార్యాలయం కూడా దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. సుదీక్ష అదృశ్యంపై ఇంటర్‌పోల్ ఎల్లో నోటీస్ జారీ చేసింది.భిన్న కథనాలు సుదీక్షను చివరిసారిగా చూసిన జాషువా ఆమె అదృశ్యంపై భిన్న కథనాలు చెబుతున్నాడు. పెద్ద అలలు రావడంతో బీచ్ నుంచి వెళ్లిపోయానని ఓసారి, సుదీక్ష మోకాలి లోతు నీటిలో ఉండగా చివరగా చూశానని మరోసారి చెప్పాడు. ఆమె తీరంలో నడుస్తుండగా తాను నిద్రపోయానని మరోసారి చెప్పుకొచ్చాడు. పోలీసులు మాత్రం అతన్ని అనుమానితుడిగా భావించడం లేదు. బీచ్ లాంజ్‌లో ఆమె దుస్తులు కనిపించాయి. బహుశా బికినీలో సముద్రంలోకి వెళ్లి మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఆమె తండ్రి మాత్రం జాషువానే అనుమానిస్తున్నారు. -
డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. -
తుంగభద్రలో నగర వైద్యురాలి గల్లంతు
సాక్షి, బళ్లారి: సరదాగా విహారయాత్రకు వచ్చిన యువ వైద్యురాలు తుంగభద్ర నదిలో మునిగిపోయింది. ఈ సంఘటన బుధవారం కర్ణాటకలోని హంపీ వద్ద చోటుచేసుకుంది. డాక్టర్ అనన్యరావు (27), స్నేహితుడు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్‌కి వచ్చారు. నది ఒడ్డున సణాపురలో ఓ రిసార్టులో మకాం వేశారు. బుధవారం మధ్యాహ్నం నదిలో ఈత కొట్టడానికి వచ్చారు. సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్యరావు దూకి ఈత కొట్టాలనుకుంది. నదికి మరోవైపు నుంచి స్నేహితులు సరదాగా వీడియో తీస్తున్నారు. అంతెత్తు నుంచి దూకిన అనన్య కొన్ని క్షణాల పాటు ఈత కొట్టి నీటి ఉధృతికి నదిలో కొట్టుకుపోసాగింది. స్నేహితులు గట్టిగా కేకలు వేసినా ఫలితం లేదు. నీటి ప్రవాహంలో కనుమరుగైపోయింది. స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బందితో వచ్చి బండరాళ్ల మధ్య గాలించారు. రాత్రి అయినప్పటికీ అనన్యరావు జాడ కానరాలేదు. ఈ సంఘటన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అనన్యరావు తండ్రి డా.మెహన్రావు అని, ఆమె వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలని తెలిసింది. కొప్పళ జిల్లా ఎస్పీ రామ్ అరసిద్ది మాట్లాడుతూ ఆమె కోసం గాలిస్తున్నామని, ప్రాణాలతో ఉందో లేదో తెలియదని అన్నారు. గంగావతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కీలక ఫైళ్ల గల్లంతు.. గుజరాత్ హైకోర్టుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్!
న్యూఢిల్లీ: పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ గల్లంతు అయిన వ్యవహారం గుజరాత్ హైకోర్టు(Gujarat High Court)ను కుదిపేస్తోంది. మరోవైపు చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్‌ను బదిలీ చేయాల్సిందేనంటూ తోటి జడ్జిలు, అడ్వొకేట్లు డిమాండ్ లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమర్శల నేపథ్యంలో ఆమెను సెలవులపై వెళ్లగా.. జస్టిస్ అనిరుధ్ వైష్ణవ్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది.గుజరాత్ హైకోర్టు పరిధి నుంచి పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ మాయం(Files Missing) కావడంపై జడ్జి సందీప్ భట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది న్యాయవ్యవస్థలోని పారదర్శకతను, నమ్మకాన్ని దెబ్బ తీసే అంశమని ఆందోళన వ్యక్తం చేశారాయన. ఈ క్రమంలో న్యాయ ప్రక్రియలకు సత్వర సంస్కరణలకు అవసరమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఫైళ్ల మాయంలో హైకోర్టు రిజిస్ట్రార్ ఏటీ ఉక్రాణి పాత్రపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. ఇది ఊహించని పరిణామానికి దారి తీసింది.జస్టిస్ సందీప్ భట్ రోస్టర్‌ను మార్చేస్తూ చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్(Chief Justice Sunitha Agarwal) ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తీవ్ర అభ్యంతరాలకు కారణం కావడం మాత్రమే కాదు పలు అనుమానాలకూ దారి తీసింది. గుజరాత్ హైకోర్టు అడ్వొకేట్ అసోషియేషన్స్ సోమవారం అత్యవసరంగా సమావేశమై చీఫ్ జస్టిస్ నిర్ణయంపై చర్చించాయి. మరోవైపు.. హైకోర్టు జడ్జిలు, లాయర్లు జస్టిస్ సందీప్ భట్‌కు సంఘీభావం ప్రకటించారు. అయితే.. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ ఇలా జడ్జిల విధులకు అడ్డుపడడం ఇదే తొలిసారేం కాదు. ఇంతకు ముందు.. నలుగురు జడ్జిల విషయంలోనూ ఆమె ఇలాగే ప్రవర్తించారు. అలాగే.. న్యాయవాదులతోనూ ఆమె వ్యవహరించే తీరుపైనా తీవ్ర విమర్శలు ఉన్నాయితాజాగా.. మొన్న శుక్రవారం(ఫిబ్రవరి 14)న అక్రమ కట్టడాలకు సంబంధించిన దాఖలైన పిల్‌పై వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆ పిల్‌ను విచారించింది. ఆ టైంలో జీహెచ్సీఏఏ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ బ్రిజేష్ త్రివేదికి చీఫ్ జస్టిస్‌కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ వాదనలు పూర్తిగా వినాలంటూ తీవ్ర స్వరంతో ఆయన చీఫ్ జస్టిస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఆమె అవేం పట్టనట్లు గాల్లో చూస్తూ ఉండిపోయారు. దీంతో ఆయన మరోసారి వ్యాఖ్యలు చేయడంతో.. ఆమె మందలించారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. ఈ పరిణామాలన్నింటిని దృష్ట్యా దీంతో ఆమెను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ జడ్జిలు, లాయర్లు డిమాండ్ లేవనెత్తారు. ఈ అంశంపై మంగళవారం మరోసారి జీహెచ్సీఏఏ జనరల్ బాడీ అత్యవసర సమావేశం నిర్వహించాలనుకుంది. కానీ ఈలోపు.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ సెలవులపై వెళ్లగా.. ఆమె స్థానంలో జస్టిస్ బీరెన్ అనిరుధ్ వైష్ణవ్‌ను తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా నియమించింది. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 2వ తేదీదాకా ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ప్రకారం ఈ నియామకం చేపట్టినట్లు న్యాయ విభాగం(నియామకాల) కేంద్ర సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ పేరిట నోటిఫికేషన్ విడుదలైంది.ఆ పెద్దావిడ పిటిషన్‌తో..జయశ్రీ జోషి(71) 2020లో రాధాన్పూర్ కోర్టులో ఓ కేసు నమోదు చేసింది. అయితే అందుకు సంబంధించిన ఫైల్ కనిపించకుండా పోయిందని హైకోర్టును ఆమె ఆశ్రయించారు. ఈ పిటిషన్ జస్టిస్ సందీప్ భట్ బెంచ్ విచారణ జరిపి.. కనిపించకుండా పోయిన ఆ ఫైల్స్ ఆచూకీ కనిపెట్టాలంటూ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో..2024 డిసెంబర్లో ఈ పిటిషన్‌కు సంబంధించి సమగ్రమైన నివేదిక అందించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అప్పుడే.. సూరత్ కోర్టుకు సంబంధించిన 15 కేసుల ఫైల్స్ కనిపించకుండా పోయాయనే విషయం వెలుగు చూసింది. కొసమెరుపు ఏంటంటే.. ఆ టైంలో సంబంధిత అధికారిగా, ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రార్ ఏటీ ఉక్రాణి ఉండడం గమనార్హం. సూరత్ కోర్టులో ఆరేళ్లపాటు పని చేసి.. బదిలీ మీద కోర్టుకు వచ్చారు. ప్రస్తుతం ఫైల్స్ మాయం అయిన వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.ఎవరీ సునీతా అగర్వాల్ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జస్టిస్ సునీతా అగర్వాల్.. గతంలో అలహాబాద్ కోర్టులో జడ్జిగా పని చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో మానవ హక్కుల గురించి చర్చ ద్వారా ఆమె వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆహారం పంచుతున్న కొందరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వాళ్లందరినీ విడుదల చేయాలని ఆమె ఆదేశించారు. అంతేకాదు.. యూపీలో పని చేసే చోట్ల లైంగిక వేధింపుల కట్టడికి ఏర్పాటు చేసిన కీలక కమిటీలోనూ ఆమె సభ్యురాలిగా పని చేశారు. -
Anti Valentine week : నేటి నుంచి భగ్న ప్రేమికులు చేసే పనిదే..
‘అందమైన ప్రేమరాణి చేయి తగిలితే సత్తురేకు కూడ స్వర్ణమేలే’ అని పాడుకుంటూ ప్రేమికులు నిన్నటివరకూ వాలంటైన్స్ వీక్‌ను ఎంతో అద్భుతంగా చేసుకున్నారు. అయితే దీనికి భిన్నంగా భగ్నప్రేమికులు వాలంటైన్స్ వీక్‌లో ఆక్రోశానికి,ఆవేదనకు గురయ్యుంటారు. అందుకే వారంతా నేటి నుంచి (ఫిబ్రవరి15)నుంచి వారం రోజుల పాటు యాంటీ-వాలెంటైన్ వీక్‌ను ఉత్సహంగా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మరి.. ఈ వారం రోజుల్లో వారు ప్రేమను ద్వేషిస్తూ ఏమేంపనులు చేస్తారంటే..యాంటీ-వాలెంటైన్ వీక్ ఫిబ్రవరి 15 నుండి మొదలవుతుంది. ఫిబ్రవరి 21 వరకు భగ్నప్రేమికులు ఒక్కోరోజును ఒక్కోథీమ్తో జరుపుకుంటారు. ఇలా చేయడం వెనుక ఒక ప్రత్యేక ఉద్దేశ్యం ఉంది. వాలెంటైన్స్ వీక్‌లో ప్రేమను పొందలేని వారు, మనసు విరిగిపోయిన వారు ఈ యాంటీ-వాలెంటైన్స్ వీక్‌ను జరుపుకుని తమలోని దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. స్లాప్ డే, కిక్ డే, పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, కన్ఫెషన్ డే, మిస్సింగ్ డే, బ్రేకప్ డే మొదలైన థీమ్‌లతో ఒక్కోరోజును ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు.స్లాప్ డే యాంటీ-వాలెంటైన్ వీక్‌లో ఫిబ్రవరి 15న స్లాప్ డే జరుపుకుంటారు. మాజీ ప్రియుడు లేదా ప్రియురాలిని మరచిపోయేందుకు స్లాప్ డే జరుపుకుంటారు. ప్రేమలో మోసపోయినవారు తమ ఒత్తిడిని, దుఃఖాన్ని మరచిపోయేందుకు స్లాప్ డే చేసుకుంటారు. చేదు జ్ఞాపకాలు, చేదు అనుభవాల నుంచి బయటపడేందుకు స్టాప్డే సహకరిస్తుందని భగ్నప్రేమికులు చెబుతుంటారు.కిక్ డే యాంటీ-వాలెంటైన్ వీక్‌లో రెండవ రోజు కిక్ డే. దీనిని ఫిబ్రవరి 16న కిక్ డే జరుపుకుంటారు. మాజీ జీవిత భాగస్వామితో వచ్చిన చేదు జ్ఞాపకాలను జీవితం నుండి తరిమికొట్టే మార్గంగా కిక్డేను జరుపుకుంటారు.పెర్ఫ్యూమ్ డే పెర్ఫ్యూమ్ డే ఫిబ్రవరి 17న వస్తుంది. ఈ రోజున భాగస్వామి మిగిల్చిన పాత జ్ఞాపకాలను మరిపోయి, కొత్తగా మలుచుకునేందుకు ఇష్టమైన పెర్ఫ్యూమ్ను అప్లై చేసుకుంటారు.ఫ్లర్ట్ డేయాంటీ-వాలెంటైన్ వీక్‌లోని నాల్గవ రోజున ఫ్లర్ట్ డే జరుపుకుంటారు. ఈ రోజున తెగిపోయిన బంధాలను పక్కనపెట్టి, కొత్త స్నేహాలను ప్రారంభిస్తారు. ఫ్లర్ట్ డేను ఎవరికీ హాని చేయని విధంగా జరుపుకోవాలని పలువురు సూచిస్తుంటారు.కన్ఫెషన్ డే దీనిని ఫిబ్రవరి 19న జరుపుకుంటారు. ఈ రోజున భగ్నప్రేమికులు గతాన్ని మరచిపోయి స్నేహితుడు, లేదా స్నేహితురాలికి క్షమాపణలు చెబుతారు. భవిష్యత్తులో అలాంటి తప్పు పునరావృతం చేయనని హామీనిస్తారు.మిస్టింగ్ డే ఇది ఫిబ్రవరి 20న వస్తుంది. ఎవరినైనా మిస్ అవుతుంటే ఆ విషయాన్ని ఆరోజున వారికి హృదయపూర్వకంగా తెలియజేస్తారు. మిస్ అవుతున్న ప్రియుడు లేదా ప్రియురాలికి ఫోన్ చేసి, మనసులోని భారాన్నంతా దించుకునే ప్రయత్నం చేస్తారు.బ్రేకప్ డేఫిబ్రవరి 21న బ్రేకప్ డే జరుపుకుంటారు. ఎవరితోనైనా సంబంధం ఇక కొనసాగించలేనని అనిపిస్తే వారికి ఆరోజున బ్రేకప్ చెబుతారు. సంతోషంగా లేని సంబంధం కొనసాగించకూడదనే ఉద్దేశంతో బ్రేకప్ డేను జరుపుకుంటారు. బ్రేకప్ డే తరువాత విడిపోయిన ప్రేమికులు సానుకూలంటా ఉంటూ, ముందుకు సాగాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh: మహారికార్డు.. ఐదు కోట్లు దాటిన పవిత్ర స్నానాలు -
అమెరికాలో మరో విమానం ఆచూకీ గల్లంతు
వాషింగ్టన్ : అమెరికాలో మరో విమానం గల్లంతయ్యింది. 10 మంది ప్రయాణికులతో సెస్నా 208బీ విమానం అలస్కా మీదిగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో రాడార్ నుంచి జాడ అదృశ్యమైనట్లు సమాచారం. విమాన అదృశ్యంపై సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4 గంటలకు సెస్నా 208బీ విమానం ఉనల్కలేట్ నుంచి నోమ్‌కు వెళుతుంది. ఆ సమయంలో రాడార్ నుంచి విమానం జాడ అదృశ్యమైంది. విమాన అదృశ్యంపై సమాచారం అదుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. విమానం జాడ కోసం శోధించాయి. అయితే నార్టోన్ సౌండ్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన సహాయ బృందాలు అక్కడి చేరుకున్నాయి. ❗️Bering Air plane VANISHES over Alaska with ten people on board — rescue crews desperately hunt for missing aircraft#AlaskaRT pic.twitter.com/YosTNTRbrV— Moh Musthafa Hussain (@musthafaaa) February 7, 2025 -
Iran: ముగ్గురు భారతీయులు అదృశ్యం
ఇరాన్లో ముగ్గురు భారత పౌరులు అదృశ్యమయ్యారు. ఈ ముగ్గురు పౌరులు వ్యాపార ప్రయోజనాల కోసం ఇరాన్‌కు వెళ్లారు. తరువాత అదృశ్యమయ్యారు. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఈ సమస్యను ఇరాన్ ప్రభుత్వం ముందు ఉంచింది. ఈ ఉదంతంలో మరింత సమాచారం కోసం ఇరాన్లో అదృశ్యమైన భారత పౌరుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం గతఏడాది డిసెంబర్ నెలలో ముగ్గురు భారతీయ పౌరులు వ్యాపార ప్రయోజనాల కోసం ఇరాన్‌కు వెళ్లారు. అయితే వారు అక్కడికి చేరుకున్నాక వారికి వారి కుటుంబాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఘటన గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. దీనిపై దర్యాప్తు కోసం భారత్.. ఇరాన్‌పై ఒత్తిడి తీసుకువచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.ఈ విషయాన్ని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంతో పాటు టెహ్రాన్‌లోని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేశామని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం దీనిపై ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయన్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఈ బావిలో అదృశ్య ‘సరస్వతి’ ప్రవాహం -
శ్రీవల్లి అదృశ్యం
నాగోలు: ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాగోలు ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లికి చెందిన గౌరు రోజు జయప్రద కుమార్తె శ్రీవల్లి (18) ఇంటర్లో ఫెయిలైన సబ్జెక్టుల కోసం కొన్ని రోజుల క్రితం నాగోలు డివిజన్ పరిధిలోని బండ్లగూడలోని లక్ష్మి బాలికల హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నది. సంక్రాంతి సెలవులకు ఈనెల 11న ఇంటికి వెళ్లి ఈనెల 17న హాస్టల్‌కు వచ్చింది. 23న కూతురు కోసం హాస్టల్ వారికి ఫోన్ చేసి శ్రీవల్లి 20న ఇంటికి పంపినట్లు సమాచారం తెలిపారు. అయితే తమ కుమార్తె ఇంటికి రాలేదని వారు బదులిచ్చారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు బండ్లగూడ హాస్టల్‌కు చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించగా తమ గ్రామానికి చెందిన వ్యక్తి ద్వారా పంపినట్లు తెలిపారు. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మళ్లీ గూగుల్ మ్యాప్ బురిడీ.. ఈ సారి ఫ్రెంచ్ పర్యాటకుల వంతు
బరేలీ: యూపీలోని బరేలీ జిల్లాలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇద్దరు విదేశీయులకు గూగుల్ మ్యాప్ చుక్కలు చూపించింది. జరిగిన పొరపాటు కారణంగా వారిద్దరూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, వారి విచారణను ఎదుర్కోవలసి వచ్చింది.వివరాల్లోకి వెళితే ఇద్దరు విదేశీ పర్యాటకులు గూగుల్ మ్యాప్ సాయంతో నేపాల్ వెళ్తుండగా దారి తప్పారు. ఢిల్లీ నుండి నేపాల్ రాజధాని ఖాట్మండుకు వెళుతున్న ఈ ఫ్రెంచ్ పర్యాటకులు దారి తప్పి, యూపీలోని చురైలి ఆనకట్ట దగ్గరకు చేరుకున్నారు. కొందరు గ్రామస్తులు వీరిని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిద్దరినీ చురైలి పోలీస్ స్టేషన్‌కు తరలించి, విచారించారు.ఈ ఘటన గురించి సర్కిల్ ఆఫీసర్ (సీఓ) బహేరి అరుణ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఫ్రెంచ్ పౌరులు బ్రియాన్ జాక్వెస్ గిల్బర్ట్, సెబాస్టియన్ ఫ్రాంకోయిస్ గాబ్రియేల్ జనవరి 7న ఫ్రాన్స్ నుంచి ఢిల్లీకి వచ్చారని తెలిపారు. వారు పిలిభిత్ నుండి తనక్‌పూర్ మీదుగా నేపాల్‌లోని ఖాట్మండు వెళ్ళవలసి ఉంది. అయితే గూగుల్ మ్యాప్ వారికి బరేలీలోని బహేరికి రూటును చూపించింది. దీంతో ఆ విదేశీయులు ఇద్దరూ దారితప్పి బరేలీలోని చురైలి ఆనకట్టకు చేరుకున్నారు.గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు విదేశీయులు నిర్మానుష్య ప్రదేశంలో సైకిల్‌పై వెళ్లడాన్ని గమనించిన గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. తరువాత గ్రామస్తులు ఆ విదేశీయులను ఆపి, వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు.అయితే వారు చెప్పేది గ్రామస్తులకు అర్థం కాలేదు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇద్దరు విదేశీయులను చురైలి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనురాగ్ ఆర్య సైతం ఆ ఇద్దరు ఫ్రెంచ్ పర్యాటకులను విచారించి,వారిని నేపాల్‌కు సురక్షితంగా పంపించారు.ఇది కూడా చదవండి: Mahakumbh: అద్భుతం.. అమోఘం.. డ్రోన్ షో -
Mahakumbh 2025: కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయంతో..
అందరినీ ఆకట్టుకునే సోషల్ మీడియా ఇప్పుడు కుంభమేళా ఫొటోలు, వీడియోలతో నిండిపోతోంది. వీటిలోని కొన్ని వీడియోలు అమితంగా అలరిస్తుండగా, మరికొన్ని ఆశ్చర్యపరిచేవిగా, తెగ నవ్వు తెప్పించేవిగా ఉంటున్నాయి. ఇదేకోవలోని ఒక వీడియో ఇప్పుడు తెగవైరల్ అవుతోంది. కుంభమేళాకు వచ్చి, కుటుంబ సభ్యులు తప్పిపోతారేమోనని భయపడేవారికి మంచి సలహా ఇస్తున్నట్లుంది ఈ వీడియో..మహా కుంభమేళాలో జనసమూహం అధికంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయం పర్యాటకుల్లో ఉంటుంది. అయితే దీనికి ఒక వ్యక్తి చక్కని పరిష్కారం కనుగొన్నాడు. దీనిని చూడగానే నవ్వు వచ్చినప్పటికీ, ఓమారు ఆలోచింపజేస్తుంది.भारत एक जुगाड़ प्रधान देश है, पूरे परिवार को रस्सी से बांध लिया ताकि महाकुंभ में खो ना जाये 🤣🤣 #MahaKumbh pic.twitter.com/WJXU4EYCwO— Raja Babu (@GaurangBhardwa1) January 15, 2025సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ముందుకు నడుస్తుండగా, అతని వెనుక అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఉండటాన్ని గమనించవచ్చు. అయితే వాళ్లెవరూ దారితప్పికోకుండా ఉండేందుకు వారందరి చుట్టూ ఒక తాడుతో కట్టినట్లు చూడవచ్చు. వారంతా ఆ తాడులోపలే ఉంటూ ముందుకు కదులుతుండటాన్ని కూడా చూడవచ్చు. ఈ వీడియోను @GaurangBhardwa1 అనే ఖాతా ద్వారా ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. ‘మహా కుంభమేళాలో తప్పిపోకుండా ఉండటానికి కుటుంబాన్నంతటినీ తాడుతో కట్టేశారు' అని ఆ వీడియో కింద క్యాప్షన్ ఉంది. ఈ వీడియోను ఇప్పటివరకూ ఒక లక్షా 42 వేలకు పైగా జనం వీక్షించారు. ఈ వీడియో చూసిన ఒక యూజర్ ‘ఆడవాళ్లు ఇక్కడకు అక్కడకు వెళ్లిపోతారు. అలా వెళ్లిపోకుండా ఉండేందుకు సరైన పని చేశారు’ అని రాశారు. మరొక యూజర్ ‘ఈ టెక్నిక్ భారతదేశం నుండి బయటకు వెళ్లకూడదు’అని రాశారు. ఇది కూడా చదవండి: Mahakumbh 2025: చూపుతిప్పుకోనివ్వని దృశ్యాలు -
HYD: ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం
ఖరతాబాద్: ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కనిపించకుండా పోయిన సంఘటన ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎఎస్ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం.... ఖైరతాబాద్ డివిజన్ మహాభారత్నగర్లో నివాసముండే తలారి ఎల్లయ్య, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం కాగా వీరి కుమార్తె తలారి రేణుకాదేవి (22) ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం ఉదయం షాపునకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన తిరిగి రాలేదు. దీంతో రేణుకాదేవి తల్లి విజయలక్ష్మి ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తితో వెళ్లి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొండపొచమ్మ సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు మృతి
సాక్షి, సిద్ధిపేట జిల్లా: సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ సరదా యువకుల ప్రాణాలు తీసింది. మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్‌లో యువకులు గల్లంతయ్యారు. ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు.మృతులను హైదరాబాద్ ముషీరాబాద్ వాసులు ధనుష్(20), లోహిత్(17), దినేశ్వర్(17), సాహిల్(19), జతిన్(17)గా గుర్తించారు. యువకులంతా 20 ఏళ్ల లోపు వారే. మృగాంక్(17), ఇబ్రహీం(20) ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన ధనుష్, లోహిత్ ఇద్దరూ సొంత అన్నదమ్ములు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతిఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు విద్యార్థుల గల్లంతుపై సీఎం ఆరా తీశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని అధికారులను ఆదేశించారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించాలన్నారు.మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి: హరీష్రావుకొండపోచమ్మ సాగర్ ఘటనపై మాజీ మంత్రి హరీష్‌రావు దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇదీ చదవండి: సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు -
కుర్రాడిగా అదృశ్యమై.. 23 ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో ప్రత్యక్షమై.. వింత ఘటన
సరిగ్గా 23 ఏళ్ల క్రితం మాయమైన కుర్రాడు ఇప్పుడు వివాహితునిగా భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ఇంటికి తిరిగివస్తే, ఆ కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంటుంది? అది ఊహకు అందదు. ఇటువంటి ఘటన గురించి విన్నవారు తెగ ఆశ్చర్యపోతారు. సరిగ్గా ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.యూపీలోని సీతాపూర్(Sitapur)లో 23 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఒక కుర్రాడిని అతని జ్ఞాపకాలు ఇంటికి తిరిగివచ్చేలా చేశాయి. ఆ కుర్రాడు వివాహితునిగా మారి భార్య, ఇద్దరు పిల్లలలో పాటు గ్రామానికి తిరిగిరావడంతో అందరూ ఆశ్యర్యపోయారు. అతనిని చూసిన తల్లి షాక్‌నకు గురయ్యింది. అతనిని చూసేందుకు గ్రామస్తులు క్యూ కడుతున్నారు. బాల్యంలో అతని తలకు తగిలిన గాయం ఆధారంగా ఆ తల్లి అతను తన కుమారుడేనని గుర్తించింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుడిని గుర్తించారు. 23 ఏళ్ల క్రితం ఆ బాలుని తల్లి తన కుమారుడు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇన్నాళ్లకు కుమారుడిని కలుసుకున్న ఆ తల్లి భావోద్వేగానికి గురయ్యింది. ఈ ఉదంతం రెయుసా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం రేవాన్ గ్రామానికి చెందిన అరవింద్ మౌర్య(Arvind Maurya) 2002లో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. అప్పుడు అరవింద్ వయసు దాదాపు 18 ఏళ్లు. ఆ సమయంలో అరవింద్.. సోంపు విక్రయించేవాడు. కొడుకు అదృశ్యం కావడంతో తల్లి చంపకళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు తెలిసిన అన్నిచోట్లా వెదికింది. పలుదేవాలయాల చుట్టూ తిరుగుతూ, తన కుమారుడు క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ పూజలు చేసింది.ఇప్పుడు ఇంటికి తిరిగివచ్చిన అరవింద్.. పోలీసులకు తాను ఇన్నాళ్లూ ఎక్కడున్నదీ, ఏం చేసినదీ తెలిపాడు. తాను ఇంటి నుంచి వెళ్లిపోయిన తరువాత పంజాబ్, హర్యానా తదితర ప్రాంతాలలో ఉంటూ, ఏవో పనులు చేసుకుంటూ కాలం గడిపానని తెలిపాడు. అదేసమయంలో తనకు వివాహం జరిగిందని, ఇద్దరు పిల్లలు కూడా పుట్టారని తెలిపాడు. ఇప్పుడు తన భార్య, పిల్లల కోరిక మేరకు పంజాబ్ నుంచి తన ఇంటికి తిరిగివచ్చానని తెలిపాడు. అరవింద్‌ను, అతని కుటుంబ సభ్యులను విచారించిన తర్వాత పోలీసులు ఈ మిస్సింగ్ కేసు(Missing case)ను ముగించారు. అరవింద్ భార్య పూనమ్ మాట్లాడుతూ తన అత్తమామలను కలుసుకున్నానని, ఇప్పుడు చాలా ఆనందంగా ఉందని అన్నారు. తనకంటూ ఒక ఉమ్మడి కుటుంబం ఉన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. కాగా అరవింద్, పూనమ్‌లు 2014లో పంజాబ్‌లో వివాహం చేసుకున్నారు. ఇది కూడా చదవండి: ఆరేళ్ల బుడతడు.. వెయ్యి కిలోమీటర్లు పరిగెడుతూ అయోధ్యకు.. -
ముగ్గురు బీటెక్ విద్యార్థుల అదృశ్యం
ఇబ్రహీంపట్నం: వారం రోజుల్లో ముగ్గురు బీటెక్ విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు సోమవారం ఆలస్యంగా వెలుగుచూశాయి. మిస్సింగ్ అయిన వారిలో ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. స్థానిక ఎస్ఐ రామకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా, మోమిన్‌పేట మండలం రాంనాథ్గుడపల్లికి చెందిన కొత్తగాడి బాల్‌రాజ్ కుమారుడు (17) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్యాసంస్థల్లో బీటెక్ (సీఎస్సీ) ప్రథమ సంవత్సరం చదువుతూ కాలేజ్ హాస్టల్లో ఉంటున్నాడు.14న హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. తండ్రి బాల్‌రాజ్ విష్ణుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మరుసటి రోజు నేరుగా కాలేజ్‌కి వచ్చి ఆరా తీయగా.. సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. ఇదిలా ఉండగా యాదాద్రి జిల్లా ఆత్మకూర్ మండలం, కాప్రాయిపల్లికి చెందిన మరో విద్యార్థిని(17) గురునానక్ కాలేజ్‌లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ ఇదే కళాశాల హాస్టల్లో ఉంటోంది. ఈ నెల 17న సాయంత్రం 6 గంటల నుంచి కనిపించకుండా పోయింది. అలాగే వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన 19 సంవత్సరాల విద్యారి్థని ఈనెల 20న అదృశ్యమైంది. ఈమె కూడా కాలేజ్ హాస్టల్లో ఉంటూ బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. కాలేజీ నిర్వాహకులు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ్ కుమార్ ను బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు
-
అశ్వాపురం మండలం మొండికుంటలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
-
తిరుపతిలో మిస్సింగ్ కలకలం
-
తిరుపతిలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్
-
కొట్టేస్తే కొట్టేశారు గానీ.. పేదలకు పంచండి
లండన్: బ్రిటన్‌లోని యార్క్ నగరంలో క్రిస్మస్ మార్కెట్లో అమ్మడానికి రుచికరమైన పలు రకాల తాజా తినుబండారాలతో వ్యాన్ సిద్ధంగా ఉంది. వ్యాన్‌ను వాణిజ్యసముదాయానికి తరలించేలోపు దానిని ఎవరో దొంగలించారు. విషయం తెల్సుకున్న దాని యజమాని, పాకశాస్త్ర ప్రవీణుడు టామీ బ్యాంక్స్ ఒకింత బాధపడ్డారు. ప్రేమానురాగాలను కలిపి వంటచేసే చెఫ్‌లకు తాము వండిన ఆహార పదార్ధాలను ఇతరులకు వడ్డించడంలోనే ఆనందం, తృప్తి ఉంటాయి. టామీకి సైతం ఆ ఆనందమే ఎక్కువ. అందుకే తాను తయారుచేసిన పదార్థాలను దొంగలు ఎక్కడ పడేస్తారోననే బాధ ఎక్కువైంది. అందుకే వాటిని నేలపాలు చేయకుండా క్షుద్భాదతో తల్లడిల్లే పేదలకు పంచాలని బహిరంగ ప్రకటన చేశారు. బ్యాంక్స్‌కు యార్క్‌షైర్ కౌంటీలో ఒక పబ్‌తోపాటు రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. స్వతహాగా వంటవాడైన బ్యాంక్స్ తన రెస్టారెంట్లలో కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలను స్వయంగా తయారుచేస్తారు. తమ వ్యాన్ దొంగతనంపై తాజాగా ఆయన ఒక వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ‘‘ చిన్న వ్యాన్‌లో ఖరీదైన తినుబండారాలున్నాయి. స్టీక్, ఏల్, బీర్లు, టర్కీ, బట్టర్‌నట్ స్క్వాష్ పై, కేక్‌లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ ఏకంగా రూ. 27,00,000 పైమాటే. వ్యాను అప్పనంగా దొరికిందన్న ఆనందంలో ఇంత ఖరీదైన ఆహారపదార్ధాలను పోతూపోతూ దారిలో పడేయకండి. పేదలకు పంచి వారి ఆకలి మంటలు తీర్చండి’’ అని వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘ఆహారం విలువ తెలిసిన నిజమైన చెఫ్’ అంటూ బ్యాంక్స్‌ను కొందరు నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు. బ్రిటన్‌లో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆహారపదార్ధాల చోరీలో ఇది తాజా ఘటనగా పేరొందింది. రెండు నెలల క్రితం లండన్‌లోని నీల్స్ యార్డ్ పాల ఉత్పత్తుల కేంద్రం వద్ద ఇలాంటి భారీ చోరీ జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఒక భారీ రిటైర్ సంస్థకు హోల్‌సేల్ పంపిణీదారుగా ప్రకటించుకుంటూ ఒక దొంగ ఈ డైరీకి వచ్చి ఏకంగా 48,488 పౌండ్ల బరువైన చీజ్‌ను దర్జాగా పట్టుకెళ్లిపోయాడు. దీని మార్కెట్ విలువ ఏకంగా రూ.3.30 కోట్లు. బ్రిటిష్, అంతర్జాతీయ పోలీసులు వేట మొదలెట్టి ఆ 63 ఏళ్ల పెద్దాయనను పట్టుకున్నాసరే చీజ్ జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు. -
Nigeria: పడవ ప్రమాదం.. 100 మంది గల్లంతు
అబుజా: ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 100 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పడవ ఎందుకు మునిగిపోయిందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.పడవలో వ్యాపారులు నేషనల్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ (ఎన్‌ఐడబ్ల్యూఏ)ప్రతినిధి మకామా సులేమాన్ మీడియాతో మాట్లాడుతూ పడవలో ప్రధానంగా మధ్య కోగి రాష్ట్రంలోని మిసా కమ్యూనిటీకి చెందిన వ్యాపారులు ఉన్నారన్నారు. వీరు పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రంలోని వీక్లీ మార్కెట్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, అయితే మృతుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదని సులేమాన్ తెలిపారు. ప్రయాణికులెవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం కారణంగానే ప్రాణనష్టం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.తరచూ ప్రమాదాలుఘటనా స్థలంలో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. బోటులో ఎక్కువగా మహిళలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. బోటులో 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశంలో పడవ బోల్తా ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. ఓవర్లోడింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కార్యాచరణ లోపాలు తదితర అంశాలు ఇటువంటి ఘటనలకు కారణంగా నిలుస్తున్నాయి. ఇది కూడా చదవండి: చైనాలో జర్నలిస్ట్‌పై గూఢచర్యం ఆరోపణలు.. ఏడేళ్ల జైలు -
సైనిక శిబిరంలో పనిచేస్తున్న కార్మికుడు అదృశ్యం
ఇంఫాల్: మణిపూర్‌లోని ఆర్మీ క్యాంప్‌లో పనిచేస్తున్న మెయిటీ కమ్యూనిటీకి చెందిన 55 ఏళ్ల వ్యక్తి అదృశ్యమయ్యాడు. లోయిటాంగ్ ఖునౌ గ్రామానికి చెందిన లైష్రామ్ కమల్‌బాబు సింగ్.. లిమాఖోంగ్ ఆర్మీ క్యాంపులో పని కోసం ఇంటి నుండి వెళ్లి, ఆ తరువాత నుంచి కనిపించకుండా పోయాడని అధికారులు తెలిపారు. అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసివుందన్నారు. పోలీసులు, సైన్యం సంయుక్తంగా లైష్రామ్ కమల్‌బాబు సింగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.లైష్రామ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అతను లిమాఖోంగ్ సైనిక శిబిరంలో కూలి పనులు చేసేవాడు. రాజధాని మణిపూర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న 57 మౌంటైన్ డివిజన్లోని సైనిక శిబిరంలోని ఈ ప్రాంతంలో కుకీ జనాభా అధికంగా ఉంటుంది. జాతి హింస ప్రారంభమైనప్పటి నుండి లిమాఖోంగ్ సమీపంలో నివసిస్తున్న మెయిటీ కమ్యూనిటీ ప్రజలు ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయారు. గత ఏడాది మే నుంచి ఇప్పటి వరకు జరిగిన హింసలో 250 మందికి పైగా జనం మృతిచెందారు.జిరిబామ్ జిల్లాలో ఇటీవల జరిగిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల హత్యకేసులో ప్రమేయం ఉన్న నేరస్తులను పట్టుకునేందుకు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సీఎం బీరెన్‌సింగ్ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయనప్పటికీ, పలువురిని గుర్తించామన్నారు. గత నవంబర్ 11న భద్రతా బలగాలు- అనుమానిత కుకీ-జో తీవ్రవాదుల మధ్య కాల్పులు జరిగిన తర్వాత జిరిబామ్ జిల్లాలోని సహాయ శిబిరం నుండి మెయిటీ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ ఎన్కౌంటర్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి.. -
ఎర్ర సముద్రంలో బోటు ప్రమాదం..16 మంది గల్లంతు
కైరో:ఎర్ర సముద్రంలో టూరిస్టు బోటు ప్రమాదశాత్తు మునిగిపోయింది. ఈజిప్టు తీరానికి దగ్గరలో జరిగిన ఈ ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. మునిగిపోయినపుడు బోటులో మొత్తం 44 మంది ఉన్నారు. వీరిలో 31 మంది టూరిస్టులు కాగా 13 మంది సిబ్బంది.ప్రమాదం నుంచి 28 మందిని కాపాడినట్లు రెడ్సీ గవర్నరేట్ వెల్లడించింది.వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపింది.సముద్రంలో బోటును ఒక్కసారిగా అల వచ్చి బలంగా ఢీకొట్టడంతో బోటు మునిగినపోయినట్లు అధికారులు వెల్లడించారు.అల బలంగా తాకినపుడు కొంత మంది ప్యాసింజర్లు వారి క్యాబిన్లలో ఉండడం వల్ల తప్పించుకోలేకపోయారని తెలిపారు. గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు జరుగుతోందని చెప్పారు. -
మనసున్న కుక్క దొంగలు
-
పిఠాపురం నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
-
పిఠాపురం: ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్ధిని అదృశ్యమైంది. 15 రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన కొడవలి గ్రామానికి చెందిన వరలక్ష్మీ(16) మిస్సింగ్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడులో విద్యార్థిని ఇంటర్ ఫస్ట్‌యర్ చదువుతోంది.తొలుత గొల్లప్రోలు పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన యువతి తల్లిదండ్రులతో పోలీసులు హేళనగా మాట్లాడారు. దీంతో గత నెల 22న ప్రత్తిపాడు పీఎస్ లో వరలక్ష్మీ అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. వరలక్ష్మీ ఆచూకీ తెలియక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. తమ కుమార్తె జాడ కోసం సాయం చేయాలని వరలక్ష్మీ తల్లిదండ్రులు పవన్‌కు లేఖ రాశారు. -
ప్రాణహిత నదిలో ముగ్గురు యువకులు గల్లంతు
సాక్షి,కొమురంభీంఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్ మండలం సోమిని సమీపంలో ప్రాణహిత నదిలో శనివారం(అక్టోబర్ 26) ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మొత్తం ఐదుగురు స్నేహితులు కలిసి నదిలో స్నానానికి వెళ్లగా ముగ్గురు గల్లంతు కాగా ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు.గల్లంతైన వారిని బెజ్జూరుకు చెందిన జహార్ హుస్సేన్(24), ఇర్షద్ (20), మోయిసిధ్(22)గా గుర్తించారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గోదావరిలో ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతు
తాళ్లరేవు: ఇంజినీరింగ్ విద్యార్థుల విహారయాత్ర విషాదాంతమైంది. యానాం సందర్శనకు వచ్చిన విద్యార్థుల్లో ఒక యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. శశి వేలివెన్ను ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఎల్లిన శివరామ్, మల్లిపూడి నిఖిల్ లక్ష్మణ్, మండా వంశీ, వెంపటి సంతోష్, కుతాని సాయిచంద్ర, కార్తిక్, మిజోన్స్ అనే యువకులు కారులో బుధవారం విహారయాత్రకు బయలుదేరారు. ఉదయమే రాజమహేంద్రవరం వచ్చి అక్కడ అన్నీ ప్రదేశాలను చూశారు. మధ్యాహ్నం కేంద్రపాలిత ప్రాంతమైన యానానికి వచ్చారు. యానాంలోని పలు ప్రదేశాలు సందర్శించిన అనంతరం తిరిగి వెళుతూ గౌతమి గోదావరి చెంతన గల గోపులంక పుష్కరఘాట్ వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఆగారు. వీరిలో కుతాని సాయిచంద్ర ఫొటోలు తీసుకుంటూ అదుపు తప్పి గోదావరిలో పడిపోయాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నించిన శివరామ్ కూడా గోదావరిలో కొట్టుకుపోసాగాడు. మిగిలిన విద్యార్థులు వెంటనే స్పందించి వారిని రక్షించడానికి ప్రయత్నించారు. శివరామ్‌ను కాపాడారు గానీ గోదావరి ప్రవాహానికి సాయిచంద్ర (21) కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న కోరంగి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. రాజమహేంద్రవరానికి చెందిన సాయిచంద్ర శశి వేలివెన్ను కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. శివరామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.గతేడాది ఇదే నెలలో..ఇదే ప్రదేశంలో గతేడాది అక్టోబరు 21న ఇలాంటి ఘటనే జరిగింది. తణుకు పట్టణంలోని సజ్జాపురానికి చెందిన ఏడుగురు యువకులు పుట్టినరోజు వేడుకల కోసం యానాం వచ్చి తిరిగి వెళుతూ గోపులంక వద్ద స్నానానికి దిగారు. వారిలో నలుగురు యువకులు గల్లంతై మృతి చెందారు. -
వ్యాపారి అదృశ్యం కలకలం.. బిడ్జ్ వద్ద ప్రమాదానికి గురైన కారు
బెంగళూరు: కర్నాటకలో ఓ వ్యాపారవేత్త అదృశ్యం కలకలం రేపుతోంది. ఆ వ్యాపారికి సంబంధించి ప్రమాదానికి గురైన బీఎండబ్ల్యూ కారును మంగళూరులోని ఓ బిడ్జ్ వద్ద ఆదివారం పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మొహియుద్దీన్ బావా సోదరుడు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఆయన కుమార్తె పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ తన ఇంటి నుంచి బయలుదేరి కారులో మంగళూరు నగరం చుట్టూ తిరిగారు. 5 గంటల సమయంలో మంగళూరులోని కులూరు వంతెన దగ్గర ఆయన కారు ఆపారు. కారులో ప్రమాదానికి సంబంధించిన కొన్ని గుర్తులు ఉన్నాయని తెలిపారు. తన తండ్రి అదృశ్యానికి సంబంధించి ముంతాజ్ అలీ కుమార్తె స్థానిక పోలీసులకు సమాచారం అందించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ వెల్లడించారు.ముంతాజ్ అలీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఆయన వంతెనపై నుంచి దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నదిలో గాలించడానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, కోస్ట్ గార్డ్లను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.చదవండి: రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత -
12 ఏళ్లయినా వీడని ఆశ.. నవరాత్రుల్లో కొడుకు దొరుకుతాడని..
వారణాసి: ఆశ అనేని మనిషిని ముందుకు నడిపిస్తుందని అంటారు. మహారాష్ట్రకు చెందిన ఒక జంట 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుని కోసం ఏళ్ల తరబడి ఆశగా అన్నిచోట్లా వెదుకుతోంది.వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన విక్రమ్ మేఘ్వానీ 12 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. ఇప్పటికీ విక్రమ్ తల్లిదండ్రులు నాడు తప్పిపోయిన కొడుకు కోసం కాశీలోని దేవాలయాలలో వెదుకులాట సాగిస్తున్నారు. నవరాత్రులలో అమ్మవారు తప్పకుండా తమ వినతి వింటుందని, అందుకే కాశీలోని అమ్మవారి ఆలయాలలో తిరుగున్నామని వారు చెబుతున్నారు.తప్పిపోయిన కొడుకు ఫోటోను పట్టుకుని తిరుగుతున్న రణోమల్ సమనోమల్ మేఘ్వానీ, ఆయన భార్య లక్ష్మీబాయి రణోమల్ మేఘ్వానీలను చూసిన వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వృద్ధ దంపతులు కాశీలోని వివిధ ఆలయాల వెలుపల తమ కుమారుని ఫొటోను, వివరాలతో కూడిన పోస్టర్‌ను అతికిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుని ఆచూకీ లభిస్తుందని విక్రమ్ తల్లి లక్ష్మీబాయి ఆశాభావం వ్యక్తం చేశారు.2012, ఆగస్టు 29న తన కుమారుడు దుకాణం నుంచి ఇంటికి వస్తూ అదృశ్యమయ్యాడని లక్ష్మీబాయి తెలిపారు. దీనిపై మహారాష్ట్ర పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఇప్పటి వరకు తమ కుమారుని ఆచూకీ లభించలేదన్నారు. ఈ వృద్ధ దంపతులు నవరాత్రులలో కాశీలో ఉంటూ, తప్పిపోయిన తమ కుమారుని కోసం వెదుకుతున్నారు.ఇది కూడా చదవండి: 16 ఏళ్లుగా మహిళ బందీ.. ఎముకల గూడు చూసి పోలీసులు షాక్ -
మారేడుమిల్లి జలపాతంలో ముగ్గురు గల్లంతు
మారేడుమిల్లి: విహారయాత్ర కోసం ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాల నుంచి 14 మంది మెడికోలు అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని జల తరంగిణి జలపాతం వద్దకు రాగా.. విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో స్నానాలు చేస్తుండగా భారీవర్షం కురిసి ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరు విద్యార్థినుల్ని 6 కిలోమీటర్ల దూరంలో స్థానికులు రక్షించగా.. ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.మరో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఏలూరులోని ఆశ్రం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న 14 మంది విద్యార్థులు వ్యాన్‌లో ఆదివారం విహారయాత్రకు మారేడుమిల్లి వచ్చారు. అక్కడి నుంచి జలతరంగిణి జలపాతంలో దిగి స్నానాలు చేస్తుండగా భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా జలపాతం పొంగింది. దీనిని గమనించిన 9 మంది విద్యార్థులు వెంటనే బయటకు వచ్చేశారు. జలపాతం మధ్యలో చిక్కుకుపోయి.. జలపాతం మధ్యలో ఉండిపోయిన సీహెచ్.హరిదీప్, కె.సౌమ్య, బి.అమృత, గాయత్రీ పుష్ప, హరిణిప్రియ కొట్టుకుపోయారు. వీరిలో గాయత్రీపుష్ప, హరిణిప్రియ 6 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం ప్రధాన రహదారి కల్వర్టు వద్ద చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతుండగా స్థానికులు ఒడ్డుకు చేర్చారు. మిగతా ముగ్గురు ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో మార్కాపురానికి చెందిన సీహెచ్ హరిదీప్, విజయనగరానికి చెందిన కె.సౌమ్య, బి.అమృత ఉన్నట్టు ఎస్ఐ రాము తెలిపారు. -
ముగ్గురు గురుకుల విద్యార్థుల అదృశ్యం
దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి0ది. గుమ్మడవెళ్లికి చెందిన అబ్దుల్ రహమాన్, హుజూర్‌నగర్‌కు చెందిన ముజీబ్, జాన్ పహాడ్‌కు చెందిన తౌఫిక్ ఈనెల 17న పాఠశాలలో అల్పాహారం తిన్న అనంతరం సమాచారం ఇవ్వకుండా గోడ దూకి వెళ్లిపోయారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఇన్చార్జ్ ప్రిన్సిప ల్ పరిసర ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. పాఠశాలలోని సీసీ కెమెరాలను పరిశీలించగా గోడదూకి వెళ్లినట్లు గుర్తించారు.వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు, గురుకుల రీజనల్ కోఆర్డినేటర్ విష్ణుమూర్తికి సమాచారం అందించారు. అధికారుల సూచనల మేరకు దేవరకొండ పోలీసుల కు ఫిర్యాదు చేసినట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ ము గ్గురు విద్యార్థులు ఈ నెల 16న పాఠశాల ప్రహరీ గోడవైపు నుంచి ఓ ప్యాకెట్ తీసుకుంటుండగా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు గమనించి అడిగారు. అందులో కల్లు ప్యాకె ట్లు ఉండటంతో విద్యార్థులను మందలించారు. అయితే సద రు విద్యార్థులు తమకెలాంటి సంబంధం లేదని తెలిపారు. అందులో ఓ విద్యార్థి తమకు ఆ ప్యాకెట్లకు ఎలాంటి సంబంధం లేదని, తాము ఏ తప్పూ చేయలేదని లేఖ రాసిపెట్టాడు. తమను ఎవరూ వెతకవద్దని లేఖలో పేర్కొని ఉంది. ఈ నెల 17న వారు అదృశ్యమయ్యారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీని వాస్ పాఠశాలకు చేరుకొని ఆరాతీశారు. విద్యార్థుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే, రెండు రోజు లు గడుస్తున్నా పిల్లల ఆచూకీ తెలియక పోవడంతో విద్యార్థు ల తల్లిదండ్రులు పాఠశాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. -
ఆ పిల్లల ఆచూకీ కోసం 500 కెమెరాల్ని జల్లెడ పట్టిన పోలీసులు
పరీక్షల్లో తక్కువ మార్కులు.. తల్లిదండ్రులు తిడతారనే భయం. ఫలితం ఇద్దరు విద్యార్థులు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. చివరికిఢిల్లీ నోయిడా సెక్టార్-56లోని ఆర్యన్ చౌరాశ్యా, నితిన్ ద్యాన్‌లు ఉత్తరాఖండ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. అయితే గత వారం స్కూల్లో జరిగిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులకు మార్క్‌లు తక్కువ వచ్చాయి.‘ఇటీవల జరిగిన పరీక్షల్లో మీ ఇద్దరికి తక్కువ మార్కులు వచ్చాయి. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద మీ తల్లిదండ్రులతో సైన్ చేయించి.. రేపు ఉదయం స్కూల్‌కు రండి. మీ పేరెంట్స్‌ని వెంట తీసుకుని రండి. వారితో మాట్లాడాలి ’ అంటూ క్లాస్ టీచర్ ఆదేశాలతో ఇద్దరు విద్యార్ధులు బయపడిపోయారు. అదే రోజు సాయంత్రం తల్లిదండ్రులు తమని తిడతారేమోనని అటు స్కూల్.. దూరంగా పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం స్కూల్ ముగిసిన వెంటనే పారిపోయారు.ఇదీ చదవండి : రంగంలోకి ఇండియన్ జేమ్స్ బాండ్స్కూల్ వెళ్లిన పిల్లలు సమయం మించిపోతున్నా.. ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు. ఏడు బృందాలుగా విడిపోయిన పోలీసులు పిల్లల కోసం గాలించారు. 500 సీసీ కెమెరాలను తనిఖీలు చేయగా.. వారి ఇంటి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో ఆచూకీ లభించింది. పిల్లల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతమైంది. -
రష్యాలో హెలికాప్టర్ గల్లంతు
మాస్కో: తూర్పు రష్యాలోని కమ్చత్కాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతయింది. హెలికాప్టర్లో ఉన్నవారిలో 19 మంది ప్రయాణికులు కాగా ముగ్గురు సిబ్బంది. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ రవాణా ఏజెన్సీ తెలిపింది. ఎంఐ-8టి శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్ శనివారం(ఆగస్టు31) కమ్చత్కాలోని వచ్కజెట్స్ అగ్నిపర్వతం వద్ద నుంచి బయలుదేరింది. కానీ గమ్యస్థానం చేరలేదని సమాచారం. హెలికాప్టర్ షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానం చేరిన తర్వాత పైలట్ల వద్ద నుంచి రావాల్సిన సమాచారం రాలేదు. హెలికాప్టర్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన హెలికాప్టర్ 1960లో తయారైన డబుల్ ఇంజిన్ హెలికాప్టర్. ఈ మోడల్ హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ వీటిని రష్యాతో పాటు ఇతర దేశాల్లో ఎక్కువగా వాడుతుండడం గమనార్హం. -
మలేషియా కౌలాలంపూర్ లో తెలుగు మహిళ గల్లంతు
-
కేదార్నాథ్ విపత్తు: 18 రోజులు దాటినా లభించని 17 మంది ఆచూకీ
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో భారీ వర్షాల కారణంగా ఘోర విపత్తు సంభవించింది. ఈ ఘటన జరిగి 18 రోజులు దాటినా ఈ విపత్తులో చిక్కుకున్న 17 మంది జాడ ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్‌కు ఇప్పటి వరకూ ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఆరు మృతదేహాలను గుర్తించారు. కాగా ఈ విపత్తులో 23 మంది గల్లంతైనట్లు సోన్‌ప్రయాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.నేటికీ ఆచూకీ తెలియని 17 మందిలో యాత్రికులతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. వీరి ఆచూకీ కోసం గౌరీకుండ్-కేదార్నాథ్ కాలినడక మార్గంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జూలై 31న రాత్రి భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో కేదార్నాథ్ నడక మార్గం రాళ్లతో మూసుకుపోయింది. ఈ సమయంలో చాలా మంది ఆ రహదారిలో చిక్కుకుపోయారు. నాటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా లించోలిలో శిథిలాలు, రాళ్ల కింద ముగ్గురు మృతదేహాలను కనుగొన్నారు. వీరిని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నివాసితులు సుమిత్ శుక్లా (21), చిరాగ్ గుప్తా (20), న్యూ మాండ్లోయ్ నివాసి నిఖిల్ సింగ్ (20)గా గుర్తించారు. ఈ మృతదేహాలకు జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. -
వాగులో కొట్టుకుపోయిన ఉపాధ్యాయులు
పార్వతీపురం మన్యం: వృత్తి రీత్యా రాష్ట్రాలు దాటి వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులు వాగులో కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు మృతిచెందగా, మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో శుక్రవారం జరిగిన ఘటనకు సంబంధించి ఎస్ఐ నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సరాయివలస ఏకలవ్య మోడల్ స్కూల్లో వార్డెన్‌గా మహేష్, సోషల్ టీచర్‌గా ఆర్తి పనిచేస్తున్నారు. వీరిది హరియాణ రాష్ట్రం. ఎప్పటివలే శుక్రవారం విధులు ముగించుకుని స్థానికంగా గురివినాయుడుపేట గ్రామంలో తమ నివాసాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ద్విచక్రవాహనంపై మహేష్, ఆర్తి ఇద్దరూ సాయంత్రం 4 గంటల సమయంలో గురివినాయుడుపేట వైపు వస్తుండగా, మార్గమధ్యంలోని రాయిమానువాగు దాటే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్తి మృతదేహం లభ్యం కాగా.. మహేష్ ఆచూకీ దొరకలేదు. మహేష్ వాగులోని చెట్టుకొమ్మ సాయంతో బయటపడి వాగు అంచును పట్టుకొన్నప్పటికీ.. ఆ అంచు జారిపోవడంతో మళ్లీ వాగులో పడి కొట్టుకుపోయాడని స్థానికులు చెబుతున్నారు. -
నా భర్త ఆచూకీ తెలపండి
హుజూరాబాద్: నెల రోజుల క్రితం నా భర్త సెంట్రింగ్ పని కోసం వెళ్లాడు.. తిరిగి రాలేదు.. పిల్లలు నాన్న ఎక్కడని ఏడుస్తున్నరు.. ఆయన ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి అంటూ ఓ మహిళ వేడుకుంటోంది. బాధితురాలి వివరాల ప్రకారం.. హుజూరా బాద్ పట్టణంలోని కుమ్మరివాడకు చెందిన మోతె రమ్య–రఘుపతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రఘుపతి గత నెల 3వ తేదీన సెంట్రింగ్ పని కోసం సైదాపూర్ మండలంలోని రాయికల్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు రాయికల్ చెరువు కట్ట వద్ద అతని ద్విచక్రవాహనం కనిపించింది. ఆ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రమ్య గత నెల 5న సైదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, అతని కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు రఘుపతి జాడ తెలియలేదు. పిల్లలు నాన్నపై బెంగతో ఏడుస్తున్నారని రమ్య కన్నీరు పెట్టుకుంటోంది. రఘుపతికి అప్పుడప్పుడు చలి తీవ్రతకు మతిస్థిమితం సరిగా ఉండదని, దారితప్పి వెళ్లి ఉంటాడని చెబుతోంది. కొన్ని రోజుల క్రితం చిగురుమామిడి మండలంలోని సుందరగిరిలో కనిపించాడని, రేకొండ గ్రామంలో కనిపించాడని స్థానికులు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. కానీ, ఆయా ప్రాంతాల్లో వెతికినా దొరకలేదని వాపోయింది. బ్లూ కలర్ షర్టు, నైట్ ప్యాంట్ ధరించాడని, 5.7 సెంటీమీటర్లు ఎత్తు, చామనఛాయ రంగులో ఉంటాడని, గుండు చేయించుకున్నాడని పేర్కొంది. మంచం పట్టిన అతని తండ్రి, వృద్ధురాలైన తల్లి ఆందోళన చెందుతున్నారని, ఎవరికై నా కనిపిస్తే సైదాపూర్ పోలీసులకు గానీ, తమకు గానీ సమాచారం ఇవ్వాలని కోరుతోంది. రఘుపతిని తమకు అప్పగిస్తే తగిన ప్రోత్సాహకం అందిస్తామని కుటుంబసభ్యులు అంటున్నారు. -
స్కూటీ లిఫ్ట్ అడిగి.. బస్సు, రైలెక్కి
మీర్‌పేట: ట్యూషన్‌కు వెళ్తున్నాని ఇంట్లో నుంచి వెళ్లిన బాలుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. జిల్లెలగూడ దాసరి నారాయణరావు కాలనీకి చెందిన మధుసూదన్‌రెడ్డి, కవిత దంపంతుల కుమారుడు మహిధర్‌రెడ్డి(13) స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతన్నారు. రోజుమాదిరిగానే ఆదివారం మధ్యాహ్నం 3.30గంటలకు తన అన్నతో కలిసి సర్వోదయనగర్‌లో ట్యూషన్‌కు బయలుదేరాడు. వీరు నిత్యం లిఫ్ట్ అడిగి వెళ్తుంటారు. ఓ బైక్ ఆపగా.. అన్నను వెళ్లమని చెప్పిన మహిధర్ తాను తర్వాత వస్తానన్నాడు. అనతరం మరో స్కూటీని లిఫ్ట్ అడిగి మీర్పేట్ బస్టాండ్ వద్ద దిగి అక్కడ నుంచి మిథాని డిపోకు చెందిన ఉమెన్స్ కాలేజీ బస్‌లో మలక్‌పేట్ రైల్వే స్టేషన్ బస్టాప్‌లో దిగాడు. రైల్వే స్టేషన్‌కు వెళ్లి టికెట్ తీసుకుని రైలు ఎక్కాడు. ముందుగా కిడ్నాప్ అనుకుని.. ట్యూషన్‌కు వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవంతో కంగారుపడిన తల్లిదండ్రులు కిడ్నాప్ అనుకుని మీర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి వెళ్లేప్పుడు రూ.2 వేలు తీసుకెళ్లిన్నట్లు గుర్తించారు. పోలీసులు సీసీ పుటేజీలు పరిశీలించగా బాలుడు తనంతట తానే లిఫ్ట్ అడిగి.. బస్ ఎక్కి, అనంతరం రైలులో వెళ్లిన్నట్లు గుర్తించారు. సొంతూరు కర్నూల్ వెళ్లి ఉంటాడని భావించి అక్కడి పోలీసులు, బంధువులను అప్రమత్తం చేశామని ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఏసీపీ కాశిరెడ్డి మీర్‌పేటకు వచ్చి సీసీ పుటేజీ పరిశీలించారని.. నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి వెతుకుతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా గోవా టికెట్ తీసుకున్న బాలుడు రైలెక్కి అక్కడకు వెళ్లినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. -
వయనాడ్ : ప్రాణాలకు తెగించి ఎంతోమందిని కాపాడిన ‘దేవుడు’ మాయం!
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వందలాదిమందిని పొట్టన పెట్టుకుంది. సర్వం కోల్పోయిన అభాగ్య జనం బిక్కుబిక్కు మంటున్నారు. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుండగానే, తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఎంతోమంది బాధితులను రక్షించిన యువకుడు మరిన్ని ప్రయత్నాల్లో ఉండగానే కనిపించకుండా పోవడం ఆందోళన రేపుతోంది. దీంతో మా సూపర్ హీరో, మా రక్షకుడు, మా దేవుడు ఏమయ్యాడు అంటూ స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.వయనాడ్‌లోని కొండచరియలు విరిగిపడటంతో స్థానిక కుర్రాడు ప్రజీష్ అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. తనజీపులో రెండుసార్లు ప్రమాదకరమైన కొండ మార్గం గుండా వెళ్లి కొంతమందిని ప్రాణాలతో కాపాడాడు. ఈ క్రమంలోనే మూడో సారి వెళ్లి కనిపించకుండా పోయాడు. మరోవైపు చూరల్మల వద్ద పాడైపోయిన అతని జీప్ కనిపించింది. దీంతో మరింత ఆందోళన రేపింది. వరద నీరు , బురద , దొర్లి పడిన భారీ బండరాళ్ల మధ్య ఎక్కడ చిక్కుకుపోయాడో అని బాధపడుతున్నారు. పలుమార్లు తమ కష్టనష్టాల్లో తోడుగా నిలిచి "సూపర్ హీరో"గా పేరుతెచ్చుకున్న తమ ప్రజీష్ క్షేమంగా తిరిగి రావాలంటూ బరువెక్కిన హృదయంతో, కన్నీటితో ఆ దేవుడ్ని వేడుకుంటున్నారు.కొండపైకి వెళ్లవద్దని ఎంత హెచ్చరించినా, అక్కడ ఎంతోమంది చిక్కుకుపోయారు, వాళ్లని రక్షించాలన్న ప్రయత్నాల్లో అవన్నీ పట్టించుకోలేదని ప్రజీష్ స్నేహితులు తెలిపారు. ముండక్కై కుగ్రామంలో కొండ చరియలు విరిగిపడటం గురించి విన్న తర్వాత, ప్రజీష్ రెండుసార్లు కొండపైకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన చాలా మందిని రక్షించాడని గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లబోతుండగా మరో ఫోన్ కాల్ రావడంతో మళ్లీ కొండపైకి వెళ్లాడు. ఈసారి మాత్రం తిరిగి రాలేదని వాపోతున్నారు.పెళ్లి, చావైనా మొదటి నుంచి చివరి వరకూ అండగా ఉండేవాడని, గ్రామంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఉండేవాడు, తలలో నాలుకలో ఉండేవాడు, అందరికీ ఇష్టమైన వ్యక్ అంటూ తి మరో గ్రామస్థుడు గుర్తు చేసుకున్నారు. "ప్రజీష్ మా భూమికి సూపర్ హీరో.. కానీ ఇప్పుడు అతడే కనిపించడం లేదు" అని ఒక గ్రామస్థుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఏ క్షణానఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో అని వణికిపో తున్నారు.ఇదీ చదవండి : వయనాడ్ విలయం : గుండెల్ని పిండేస్తున్నమహిళ ఫోన్ రికార్డింగ్ -
కేరళలో విరిగిపడ్డ కొండచరియలు. 123 మంది మృతి. వందలాది మంది జాడ గల్లంతు
-
దుబాయ్‌లో సిరిసిల్ల యువకుడి అదృశ్యం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు దుబాయ్‌లో అదృశ్యమయ్యాడు. పది రోజులుగా అతని ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన ఆకెన రవి(36) పెట్రోల్ బంక్‌లో పని చేసేవాడు. దుబాయ్‌లో మెరుగైన ఉపాధి లభిస్తుందనే ఆశతో సిరిసిల్లకు చెందిన మరో యువకుడు వేముల శ్రీనివాస్‌తో కలిసి విజిటింగ్ వీసాపై ఈనెల 17న అక్కడికి వెళ్లారు. అక్కడి పరిస్థితులు, లేబర్ క్యాంపులు చూసి, పని దొరికే అవకాశం లేక పోవడంతో ఇంటికి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రవి కాటగలిశారు. అతని కోసం శ్రీనివాస్ తీవ్రంగా గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో సిరిసిల్లలోని అతడి భార్య రూపకు సమాచారం ఇవ్వడంతో ఆమె ఆందోళనకు గురైంది. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాశారు. రవి మిస్ అయినట్లు కేసు నమోదు చేయించిన ఎంబసీ అధికారులు అతడి కోసం పోలీసుల ద్వారా గాలించారు. సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు, సామాజిక సేవకులు గుండెల్లి నర్సింహులకు విషయం తెలియడంతో ఆయన తెలంగాణకు చెందిన వలస కార్మికుల ద్వారా ఆరా తీశారు. మొత్తంగా ఆదివారం షార్జాలో రవి ఉన్నట్లు గుర్తించారు.ఐదు రోజులుగా తిండిలేక.. నడవలేని స్థితిలో ఉన్న రవిని పోలీసులు గుర్తించి ఎంబసీ అధికారులకు అప్పగించారు. అతడి పాస్‌పోర్టును దుబాయ్ నుంచి రికవరీ చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో రవికి విమాన టిక్కెట్ సమకూర్చి ఇండియాకు పంపించారు. బుధవారం ఉదయం అతడు హైదరాబాద్ రానున్నారు. మరో యువకుడు వేముల శ్రీనివాస్ సోమవారం ఉదయం సిరిసిల్లకు చేరాడు. రవిని స్వదేశానికి రప్పించడానికి చొరవ చూపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


