గురునానక్ జయంతి సందర్భంగా ఇటీవలే పాకిస్థాన్ వెళ్లి మిస్సైన యాత్రికురాలు సర్బిజిత్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సర్బిజిత్ ఇస్లాం మతం స్వీకరించిదని పాకిస్థాన్ కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందని నికానామా పేరుతో డాక్యుమెంట్స్ ప్రచురితమవుతున్నాయి. అయితే దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు
ఇటీవల సిక్కుల మత గురువు గురునానక్ జయంతి సందర్భంగా ప్రకాశ్ పుర్బ్ వేడుకల్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ వెళ్లి కనిపించకుండా పోయిన యాత్రికురాలు సర్పిజిత్ విషయంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చాయి. సర్బిజిత్ పాకిస్థాన్ లాహోర్ సమీపంలోని షేక్ పూరకు చెందిన నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని, అంతేకాకుండా పెళ్లికి ముందే ఇస్లాం మతంలోకి చేరి తన పేరు నూర్ గా మార్చుకుందని నికానామా( మస్లింల వివాహా ఒప్పంద పత్రం) బయిటపడింది. అయితే ఈవిషయాన్ని ఇంకా అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. సర్పిజిత్ కౌర్ తన భర్తతో విడాకులు తీసుకున్నారు. తనకు ఇద్దరు పిల్లలున్నారు.
అసలేం జరిగింది
పంజాబ్, కపుర్తా జిల్లాలోని అమానిపూర్ గ్రామానికి చెందిన సర్బిజిత్ కౌర్, గురునానక్ దేవ్ 556 జయంతి సందర్భంగా నిర్వహించే ప్రకాశ్ పుర్బ్ వేడుకల్లో పాల్గొనేందుకు నవంబర్ 4న పాకిస్థాన్ వెళ్లారు. 10 రోజుల పాటు యాత్ర జరిగిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఆమె భారత్ రాలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ప్రస్తుతం ఆమె ఇస్లాంలోకి మారి వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిని అధికారులు ధృవీకరించలేదు.


