బెంగళూరు : బెంగళూరులోని కుండలహళ్లిలో సోమవారం సాయంత్రం పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 23 ఏళ్ల ఐటీ ఉద్యోగం దుర్మరణం పాలయ్యాడు. ఏడు అంతస్తులు, 43 గదులున్న భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో జరిగిన ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
చనిపోయిన వ్యక్తిని బళ్లారికి చెందిన అరవింద్‌గా గుర్తించారు. ఇతను ఐటీ సేవల సంస్థ క్యాప్‌జెమినీలో సీనియర్ విశ్లేషకుడిగా పనిచేస్తున్నాడు సెవెన్ హిల్స్ సాయి కో-లివింగ్ పేయింగ్ గెస్ట్ హాస్ట్‌లో ఉంటున్న అరవింద్. టెర్రస్‌పై ఉండగా గ్రౌండ్ ఫ్లోర్‌లో పొగను గమనించాడు. ఏం జరిగిందో చూద్దాం అని కిందికి వచ్చిన సమయంలో గ్యాస్ పేలుడు సంబంధించిందని దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వైట్‌ఫీల్డ్) కె పరశురామ్ వెల్లడించారు. పోలీసుల ప్రకారం కమర్షియల్-గ్రేడ్ గ్యాస్ సిలిండర్ పేలుడుకు సంబంధించి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించలేదు.
సమాచారం అందించిన సంఘటనా స్థలానికి చేరుకున్నస్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది మంటలను అదుపు చేశాయి. గాయపడిన వారిలో ఒకరు హాస్టల్ పని చేస్తున్నవారు, ఇద్దరు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు. కర్నూలుకు చెందిన 28 ఏళ్ల వెంకటేష్, ఉత్తరాఖండ్‌కు చెందిన 23 ఏళ్ల విశాల్ వర్మ, ఉత్తరాఖండ్‌కు చెందిన 25 ఏళ్ల సివి గోయెల్ ప్రస్తుతం బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పీజీ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యం


