వేదికపై మంత్రి, ఐపీఎస్‌ మధ్య గొడవ..‘దెన్ గెట్ అవుట్ ఆఫ్ హియర్’ | Anil Vij Orders Suspension After Clash With Kaithal SP Over Land Fraud | Sakshi
Sakshi News home page

వేదికపై మంత్రి, ఐపీఎస్‌ మధ్య గొడవ..‘దెన్ గెట్ అవుట్ ఆఫ్ హియర్’

Feb 13 2026 10:15 PM | Updated on Feb 14 2026 2:11 PM

Anil Vij Orders Suspension After Clash With Kaithal SP Over Land Fraud

చండీఘడ్‌:  గ్రీవెన్స్  సెల్‌ ( ప్రజా సమస్యల పరిష్కార వేదిక) వేదికపై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తాను ఆదేశిస్తున్న ఆదేశాల్ని ఓ ఐపీఎస్‌ అధికారిణి పట్టించుకోలేదని కోపంతో ఓ మంత్రి ఊగిపోయాడు. సదరు ఐపీఎస్‌ అధికారిణిపై చిర్రుబుర్రలాడారు. మంత్రికి ఐపీఎస్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా వినలేదు. సదరు పోలీసు అధికారిణి ‘దెన్‌ గెట్‌ అవుట్‌ ఆఫ్‌ హియర్‌’ అంటూ హుకుం జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారింది.  

హర్యానా రాష్ట్రంలో శుక్రవారం జరిగిన జిల్లా ఫిర్యాదు పరిష్కార సమావేశంలో ఒక అసాధారణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి అనిల్ విజ్‌,కైతల్ జిల్లా పోలీసు అధికారి (SP) ఉపాసన ఐపీఎస్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

మంత్రి అనిల్‌ విజ్‌ నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌లో టిట్రామ్ గ్రామానికి చెందిన సందీప్ మాలిక్ అనే వ్యక్తి ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సందీప్‌పై ఫిర్యాదు చేశారు. ఎస్సై సందీప్‌ కబ్జాలతో పాటు ఇతర అనైతిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా తన స్థిరాస్తులపై ఎస్సై కన్నుపడినట్లు వాపోయాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.

బాధితుడి ఫిర్యాదుపై మంత్రి అనిల్ విజ్ స్పందించారు. వేదికపై ఎడమవైపు ఉన్న కైతల్ జిల్లా ఎస్పీ ఉపాసన (ఐపీఎస్‌)కు వెంటనే ఎస్సైని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

అందుకు కైతల్ ఎస్పీ ఉపాసన.. ఆ ఎస్సై కురుక్షేత్ర జిల్లాకు చెందినవారని, తన పరిధిలో లేడని, అందువల్ల  అతన్ని సస్పెండ్‌ చేసే అధికారం తనకు లేదన్నారు. ఎస్సైని సస్పెండ్‌ చేసే అధికారం కురుక్షేత్ర ఎస్పీ మాత్రమే ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు డీజేపీకి లేఖ రాయండి. నేను అతన్ని సస్పెండ్ చేయమని చెబుతున్నాను. మీరు నా ఆదేశాలను అమలు చేయాలి’ అని మంత్రి అన్నారు. మీకు ఆ ఎస్సైని సస్పెండ్‌ చేసే అధికారం లేకపోతే ఇక్కడి నుండి వెళ్లిపోండి’ అని విజ్ అన్నారు.  మీరు చెప్పినట్లుగా డీజీపీకి లేఖ రాస్తాను. కానీ నేను అతనిని నేనే సస్పెండ్ చేయలేను’ అని ఎస్పీ ప్రతిస్పందించారు.

నేను చెప్పాను. మీరు నా ఆదేశాలను పాటించాలి. మీరు మీ సొంత ఆదేశాలు ఇవ్వకూడదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం, ఈ ఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.   
 

Advertisement
 
Advertisement
Advertisement