అద్భుతమైన హోమ్ టూర్..! రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి.. | 89 Years Old Retired IPS Officer From Haryana Wins Hearts With First Ever Home Tour Vlog, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

అద్భుతమైన హోమ్ టూర్..! జీవితాన్ని ఆస్వాదించటం అంటే ఇదే..!

Feb 13 2026 2:41 PM | Updated on Feb 13 2026 5:49 PM

89-year-old man from Haryana home tour of his Bengaluru

ఇటీవల కాలంలో సోషల్‌మీడియా పుణ్యమా అని సీనియర్‌ సిటిజన్లు కూడా కంటెంట్‌ క్రియేటర్లు, వ్లాగర్లుగా తమ టాలెంట్‌ని చూపిస్తున్నారు. ఒకరకంగా వారికి ఇదొక వ్యాపకం, కాలక్షేపం కూడా. అలానే ఇక్కడొ వృద్ధుడు కూడా తన హోమ్‌టూర్‌ వీడియోతో నెటిజన్ల మనసుని గెలుచుకున్నాడు. తొలిసారిగా చేసిన హోమ్‌టూర్‌తో ఆ తాతగారు..జీవితం విలువని తెలియజేశారు. 

ఆ తాతగారే కర్తార్‌ సింగ్‌. వయసు కేవలం సంఖ్యే అని తన హోమ్‌ టూర్‌ వీడియోతో చెప్పకనే చెప్పాడు. ఆ వీడియోలో హర్యానాకు చెందిన 89 ఏళ్ల రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి తన బెంగూరురు నివాసాన్ని అద్భుతంగా చూపించాడు. తన వన్‌ బీహెచ్‌కే ఫ్లాట్‌ మొత్తం అద్భుతంగా చూపించారాయన. ఆ తాత గారు నారింజ కుర్తా, సాంప్రదాయ హిమచల్‌ టోపీని ధరించి..తన ఇంటికి ఆహ్వానించిన తీరు అదుర్స్‌. 

ఇలా హోమ్‌ టూర్‌ వ్లాగ్‌ చేయడం ఇదే తొలిసారి అని చెబుతూ..తన ఇంటి గురించి పూసగుచ్చినట్లుగా వివరించారు. ఆ వీడియోలో తన పేరు కర్తార్ సింగ్ తోమర్. హర్యానా కేడర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని. తాను దాదాపు 89 ఏళ్ల వయసులో ఉన్నానని..ఇదే తన 1 BHK ఫ్లాట్‌, ఇక్కడే రోజంతా గడుపుతానని చెబుతాడు. 

తన ఇల్లు తనకు స్వర్గం లాంటిదని చెప్పడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో.  అక్కడ  ఉండే సోఫా-కమ్-బెడ్‌, డైనింగ్-కమ్-స్టడీ సెటప్ , క్లీన్‌గా ఉన్నా  వంటగది, బాత్రూంలో స్కిడ్-నిరోధక ఫ్లోరింగ్‌, తదితరాలన్నీ చూపిస్తాడు. అలాగే ఫ్యాన్‌తో పనిలేకుండా చక్కగా గాలి వచ్చే పెద్ద అద్దాల విండోని, బాల్కనీలో చక్కగా ఆస్వాదించే పచ్చదనం తదితరాలన్నీ చక్కగా వివరిస్తూ..చూపించారు వీడియోలో. 

సింపుల్‌గా చెప్పాలంటే.. ఓ సీనియర్‌ సిటీజన్‌కి అనుకూలమైన ఇల్లు ఎలా ఉండాలో చెబుతున్నట్లుగా ఉంటుంది. అంతేగాదు పదవీవిరమణ తర్వాత హాయిగా జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియజేస్తున్నట్లుగా ఉంది.  

 

(చదవండి: విడదీయలేని బంధం మాది..! హ హ్హ హసిని క్యూట్‌ లవ్‌ స్టోరీ..)
 

Advertisement
 
Advertisement
Advertisement