breaking news
Rangareddy
-
పఠనాసక్తి పెంపే లక్ష్యం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ˘"{糿¶æ$™èlÓ ´ëuý‡-Ô>-ÌSÌZÏ ^èl§ýl$Ð]l#-™èl$¯]l² õ³§ýl, Ð]l$«§ýlÅ ™èlÆý‡VýS† ѧéÅ-Æý‡$¦ÌZÏ ç³uý‡¯é-çÜMìS¢ ò³…õ³ ÌS„ýSÅ…V> Ð]l¬…§ýl$MýS$ ÝëVýS$-™èl$-¯é²…. ´ëu>Å…-Ô>-ÌSOò³ ÐéÆý‡$ Ý뫨…-_¯]l ç³r$t, AÐ]lV>-çßæ¯]l ÝëÐ]l$-Æ>¦Å°² VýS$Ç¢…^ól…§ýl$MýS$ 12 {ç³™ólÅMýS º–…§é-ÌS¯]l$ HÆ>µr$ ^ólÔ>…. E´ë-«§éÅ-Ķæ¬ÌS ç³°¡Æý‡$, ´ëu>Å…-Ô>ÌS »Z«§ýl¯]l, ѧéÅ-Æý‡$¦Ë$ {ç³§ýl-ÇØ…^ól O¯ðlç³#×êŰ² ™ðlÌS…-V>׿ çÜ*PÌŒæ Gyýl$ÅMóS-çÙ¯ŒS Ķæ*‹³ÌZ ¯]lÐðl*§ýl$ ^ólçÜ$¢-¯é²…. Ð]l$Ç…™èl Ððl$Æý‡$-OVðS¯]l çœÍ™éË$ Ý뫨…-^ól…-§ýl$MýS$ ÔèæMìS¢-Ð]l…-^èl¯]l ÌôæMýS$…yé MýS–íÙ ^ólçÜ$¢-¯é²…' A° hÌêÏ Ñ§éÅ-«¨M>Ç Ððl…MýS-sôæ-ÔèæÓÆý‡$Ï çܵçÙt… ^ólÔ>Æý‡$. D Ðól$Æý‡MýS$ "Ýë„ìS'™ø Ð]l*sêÏyéÆý‡$. {Oò³Ðólr$MýS$ HÐ]l*{™èl… ¡íÜ´ù° Ñ«§ýl…V> {糿¶æ$™èlÓ ´ëuý‡-Ô>ÌSÌZÏ ^èl§ýl$Ð]l#-™èl$¯]l² ѧéÅ-Æý‡$¦-ÌS¯]l$ ¡Ça-¨-§ýl$ª-™èl$¯]l²r$Ï {ç³MýSsìæ…-^éÆý‡$. అందరికీ అల్పాహారం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఇప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేశాం. ఇటీవలే షూ, టైలను సరఫరా చేశాం. రెండు జతల బట్టలు రెడీ అవుతున్నాయి. త్వరలో అందజేస్తాం. మిడ్డేమీల్ పథకంలో భాగంగా ఇప్పటికే ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరికీ మధ్యహ్న భోజనం అందిస్తున్నాం. గండిపేట, సరూర్‌నగర్, శంకర్పల్లి, రాజేంద్రనగర్, హయత్‌నగర్, మొయినాబాద్ మండలాల్లోని 246 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం అల్పాహార పథకం అమల్లో ఉంది. దీనిలో భాగంగా 37,078 మంది చిన్నారులు లబ్ధి పొందుతున్నారు. వీరికి రోజుకో వైరెటీ చొప్పున ఇడ్లీ, పూరి, ఊతప్పం, బొండా సహా వారానికి మూడు రోజులు రాగిజావ, మరో మూడు రోజులు పాలు అందిస్తున్నాం. ప్రస్తుతం షాద్‌నగర్‌లో అతిపెద్ద కిచెన్‌షెడ్డు సిద్ధం అవుతోంది. త్వరలో ఆ డివిజన్ పరిధిలోని విద్యార్థులందరికీ అల్పాహారం అందించబోతున్నాం. దశలవారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నాం. 75 మంది డిప్యూటేషన్లు రద్దు చేశాం జిల్లాలో ప్రభుత్వ, రెసిడెన్షియల్ స్కూల్స్ 1,342 ఉండగా, వీటిలో 1,45,097 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఇప్పటికే 1,42,722 మంది పేర్లను ఆన్లైన్లో నమోదు చేయించాం. ప్రాథమిక, ఉన్నత పాఠశాల్లో సుమారు ఆరు వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నట్లు అంచనా. ఇతర ప్రాంతాల నుంచి అక్రమ మార్గంలో డిప్యూటేషన్‌పై వచ్చిన 75 మంది డిప్యూటేషన్లు రద్దు చేశాం. విద్యార్థుల నిష్పత్తి మేరకు ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో 250 మందిని సర్దుబాటు చేశాం. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత లేకుండా చూస్తున్నాం. ఉపాధ్యాయుల హాజరు, పని తీరుపై ప్రత్యేక నిఘా పెట్టాం. కొత్తగా మరో మూడు స్కూల్స్ అప్‌గ్రేడ్ జిల్లాలో 45 పీఎంశ్రీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ఇస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి నిధులు విడుదలయ్యాయి. శానిటరీ కిట్స్ సహా సెల్ఫ్ డిఫెన్స్, ఇన్నోవేషన్ పోగ్రామ్స్, ఎగ్జిబిషన్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కొనుగోలు, పాఠశాల సుందరీకరణ పనులు, క్రీడా సామగ్రి వంటి వాటి కోసం ఈ బడ్జెట్‌ను ఉపయోగిస్తాం. పలు పాఠశాలల్లో ఏఐ పాఠాలను పరిచయం చేయబోతున్నాం. ఇప్పటికే అవసరమైన కంప్యూటర్లను ప్రభుత్వం సరఫరా చేసింది. అంతేకాదు మంచాలలోని ఆరుట్ల పాఠశాలను అప్‌గ్రేడ్ చేసింది. కార్పొరేట్‌కు తీసిపోని విధంగా ఈ పాఠశాలను తీర్చిదిద్దడం జరిగింది. అంచనాలకు మించి అడ్మిషన్లు వచ్చాయి. కొత్తగా మంచాల, నేదునూరు, పాలమాకుల పాఠశాలలను టీఎస్ మోడల్ స్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేయడం జరుగుతోంది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరుపైనే కాదు విద్యార్థుల అభ్యసన శక్తి సామర్థ్యాలను అంచనా వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. 12 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశాం. ఒక్కో బృందంలో నలుగురు అధ్యాపకులు ఉండేలా చూశాం. ఈ బృందాలు పాఠశాలల్లో పర్యటించి బోధన, విద్యార్థుల అభ్యసన శక్తి సామర్థ్యాలను పరిశీలిస్తాయి. విద్యార్థులతో స్వయంగా ఇంటరాక్ట్ అవుతాయి. ఇప్పటి వరకు వారు నేర్చుకున్న పాఠ్యాంశాలను పరీక్షిస్తాయి. వారికి ఉన్న అవగాహన శక్తిని అంచనా వేస్తాయి. ఆయా వివరాలను ఎప్పటికప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేస్తాయి. బోధన, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, పాఠశాల నిర్వహణ పనితీరుపై నిరంతర పర్యవేక్షణ చేస్తాయి. ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే కాదు ప్రైవేటు స్కూళ్లను సైతం తనిఖీ చేస్తున్నాం. డీఈఓ నెలకు 15, ఒక్కో ఎంఈఓ నెలకు 24 స్కూల్స్ చొప్పున విజిట్ చేస్తున్నారు. విద్యార్థుల అభ్యసన శక్తి సామర్థ్యాలను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలు ప్రైవేటుకు దీటుగా సర్కారు బడులు మెరుగైన ఫలితాల సాధనకు కృషి దశలవారీగా అన్ని పాఠశాలల్లో అల్పాహారం ఉపాధ్యాయుల పని తీరుపై నిరంతర నిఘా ‘సాక్షి’తో డీఈఓ వెంకటేశ్వర్లు -
అమరుల త్యాగాలు మరవలేనివి
చేవెళ్ల: నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజుగా తెలంగాణ ప్రజలు విమోచన దినోత్సవాన్ని జరుపుకొంటారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. పట్టణకేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మంగళవారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ శ్రేణులతో కలిసి బైక్ నడిపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిన రోజు సెప్టెంబర్ 17న అని అందుకే ఈరోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. దీనికోసం సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదన్నారు. అమరుల త్యాగాలను గుర్తుచేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీశైలం, డాక్టర్ మల్గారి వైభవ్‌రెడ్డి, కంజర్ల ప్రకాశ్, చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం తనిఖీ
ఇబ్రహీంపట్నం: శేరిగూడలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, గర్భిణులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఎన్సీడీ రిజిస్టర్లు, మందుల నిల్వ, పరిశుభ్రత, బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ పరిశీలించారు. అనంతరం వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వంద శాతం టీకాలు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సత్యరత్న, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతిష్ఠించకుండానే నిమజ్జనం
● ï³Æ>j-ç³N-ÆŠ‡ÌZ ™öÍ ç³Nf ˘ అందుకోని గణేశుడు ● గ్రామస్తుల మధ్య భేదాభిప్రాయాలే కారణం కొందుర్గు: సాధారణంగా వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చవితి రోజున మండపాల్లో స్వామివారిని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజించి, నిమజ్జనం చేయడం ఆనవాయితీ. కానీ జిల్లేడ్‌చౌదరిగూడ మండలం పీర్జాపూర్‌లో ఇరువర్గాల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాల కారణంగా సోమవారం వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండానే, నేరుగా చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయస్వామి ఆలయంలో వినాయక ప్రతిష్ఠ చేయకూడదని పలువురు గ్రామస్తులు సూచించడంతో తమను ఉద్దేశపూర్వకంగానే వ్యతిరేకిస్తున్నారని భావించిన నిర్వాహకులు గణేశుడి విగ్రహాన్ని నేరుగా గ్రామ చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. -
సాయుధ పోరాటంతో విముక్తి
షాద్‌నగర్‌రూరల్: నిజాం నవాబుల పాలనలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చేపట్టిన కమ్యూనిస్టులు పదివేల గ్రామాలకు విముక్తి కల్పించారని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ సాయుధ పోరాటం 78వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజాకారుల దుర్మార్గాలను, జాగీర్దారుల ఆగడాలను ఎదిరించి ప్రజలకోసం నిలబడిన నాలుగువేల మంది కమ్యూనిస్టులు నిజాం చేతుల్లో అశువులు బాసారని చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపి నిజాంను తరిమికొట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం బీజేపీ, ఆర్ఎస్ఎస్ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో కమ్యూనిస్టులు ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈనెల 17న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు పర్వతాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి బుద్దుల జంగయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనునాయక్, నాయకులు టంగుటూరి నర్సింహారెడ్డి, షకీల్, గోవింద్‌నాయక్, పవన్‌చౌహాన్, ఆకాష్, మహ్మద్‌హుస్సేన్, ప్రసాద్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీలో ఎలికట్ట భూములపై ప్రస్తావన
షాద్‌నగర్: మండల పరిధిలోని ఎలికట్ట గ్రామ శివారులోని భూములపై మంగళవారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తావించారు. 191, 193 సర్వే నంబర్లలో ఉన్న 25 ఎకరాల భూమి 1993 నుంచి నిషేధిత జాబితాలో ఉందని, ఈ భూమిలో గత ప్రభుత్వ హయాంలో 2022లో జీహెచ్ఎంసీ లేఅవుట్ అనుమతులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిగా రికార్డులో ఉండగా గత ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా లేఅవుట్‌ను మంజూరు చేసిందని అన్నారు. నిషేధిత భూములు క్లియర్ చేసి అనుమతులు ఇవ్వకుండా లంచాలు తీసుకొని అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చిందని ప్రతిపక్షాలు అనడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. -
సేవా అభియాన్ ఏర్పాట్ల పరిశీలన
కందుకూరు: ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 17న మండల పరిధిలోని తిమ్మాపూర్‌లో చేపట్టనున్న సేవా అభియాన్ కార్యక్రమ ఏర్పాట్లను మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్మయి పర్యవేక్షించారు. ఆ రోజు కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, గంగాపురం కిషన్‌రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమానికి హాజరయ్యే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, డీపీఓ సురేష్‌మోహన్, తహసీల్దార్ గోపాల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములుయాదవ్, జిల్లా ప్రధానకార్యదర్శి ఎల్మటి దేవేందర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, భిక్షపతి, సాధ మల్లారెడ్డి, శేఖర్‌గౌడ్, అంబోజి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శంకర్పల్లి: మండల పరిధిలోని చెందిప్పలో వెలసిన మరకత శివాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి రామకృష్ణారెడ్డి మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. న్యాయమూర్తి దంపతులు శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు వారికి శేషవస్త్రం కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఆకుపచ్చ ఆకారంలోని శివలింగాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మరోవైపు సోమవారం తెలంగాణ సాంస్కృతి సారథి కార్పొరేషన్ చైర్మన్ వెన్నెల గద్దర్ శివలింగాన్ని దర్శించుకున్నారు. స్వామివారి దయ రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. యాచారం: ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులను విమానంలో తిరుపతికి తీసుకెళ్లి స్వామివారి దర్శనం కల్పించారు ఓ ఉపాధ్యాయుడు. మండలంలోని నల్లవెల్లి ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు నరేందర్‌రెడ్డి 2025– 26 పదో తరగతి పరీక్షలో 550 పైగా మార్కులు సాధించిన వారిని విమానంలో తిరుపతి తీసుకెళ్తానని విద్యార్థులకు మాటిచ్చారు. 552 మార్కులు సాధించిన మహేశ్, 551 సాధించిన పవన్‌ను శనివారం సొంత డబ్బులతో హైదరాబాద్ నుంచి విమానంలో తిరుపతికి తీసుకెళ్లారు. స్వామివారి దర్శనం కల్పించి, క్షేమంగా వారి ఇళ్లకు చేర్చారు. ఈసారి అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి ఊహించని బహుమతి అందజేస్తానని నరేందర్‌రెడ్డి తెలిపారు. తొలిసారి విమానం ఎక్కిన అనుభూతిని, తమను ప్రోత్సహించిన ఉపాధ్యాయుడిని జీవితంలో మర్చిపోలేమని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. బడంగ్పేట్: బాలాపూర్ గణనాథుడిని సోమవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి దర్శించుకుని మొదటి పూజ నిర్వహించారు. మంగళవారం సీపీ సజ్జనార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్‌యాదవ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్, మాజీ మేయర్ చిగురింత పారిజాత తదితరులు దర్శించుకున్నారు. వారికి ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి శాలువాలు కప్పి సన్మానించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
ప్రైవేటు బస్సు దగ్ధం
ఇబ్రహీంపట్నం రూరల్: నిలిచి ఉన్న బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. ఆదిభట్ల టీసీఎస్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగులను రవాణా చేసే శ్రీనివాస ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంగళవారం సమస్య వచ్చిందని డ్రైవర్ గమనించాడు. ఉదయం ఉద్యోగులను తీసుకొచ్చి వదిలేసి గ్యారేజ్ సమీపంలో పార్కు చేశాడు. చెక్ చేయడానికి చూడగా షార్క్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారువచ్చి మంటలు ఆర్పే లోపు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
బాలాపూర్ గణేశ్‌కు 51 ఫీట్ల పంచె, కండువా
పహాడీషరీఫ్: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన శ్రీభక్త మార్కండేయ పద్మశాలి పొదుపు సంఘం ఆధ్వర్యంలో ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణనాథుడికి 51 ఫీట్ల కండువా, 51 ఫీట్ల గాయత్రీ పంచెను బహూకరించారు. ఏటా ఆనవాయితీగా ప్రత్యేక పూజల అనంతరం వీటిని అందజేస్తున్నట్టు సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు వారిని సన్మానించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మస్న రవికుమార్, మాజీ కౌన్సిలర్ కెంచె లక్ష్మీనారాయణ, నవపేట ఆంజనేయులు, కర్నాటి శ్రీహరి, వెంకటేశ్, శ్రీకాంత్, భిక్షపతి, శ్రీనివాస్, మహేశ్, కిట్టు, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
విస్తరించేనా!
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిని నేషనల్ హైవే పరిధిలోకి తీసుకునేలా రాష్ట్ర సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ రహదారి 150 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సాగర్‌లోని బుద్ధవనాన్ని దర్శించుకోవడం కోసం దేశ, విదేశాల నుంచి ఈ రోడ్డు నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. మహానగర విస్తరణ, ఫ్యూచర్‌సిటీ నిర్మాణంతో నాలుగైదు ఏళ్లుగా ఈ రోడ్డు వేలాది వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా మారింది. భవిష్యత్తులో మరింత రద్దీగా మారడంతోపాటు ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు లేకపోలేదని సర్కార్ గుర్తించింది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ పరిధిలో ఉన్న ఈ రోడ్డును నాలుగు వరుసల రహదారిగా విస్తరించడానికి బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే ప్రతిపాదించి డీపీఆర్ తయారు చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కూడా భవిష్యత్తు దృష్ట్యా ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా విస్తరించడానికి నిర్ణయించింది. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాదారుల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం హెచ్ఎండీఏ, పోలీస్, రవాణా శాఖ సంయుక్తంగా ఓ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులతో సర్వే సైతం చేయించారు. సింహభాగం ప్రయాణికులు రోడ్డు విస్తరణ చేపట్టాలని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ మేం చేయలేం అయితే రోడ్డు విస్తరణ తాము చేపట్టలేమంటూ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ సర్కార్‌కు తేల్చిచెప్పినట్టు తెలిసింది. నగరం నుంచి నాగార్జునసాగర్ సమీపం అక్కంపల్లి (పుట్టంగండి) వరకు 120 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల కృష్ణాజలాల పైపులైన్లు ఉన్నాయి. పలుచోట్ల రోడ్డు పక్కనే ఎయిర్‌వాల్వ్‌లు ఉన్నాయి. విస్తరణ చేపడితే ఎయిర్‌వాల్వ్‌లు తొలగించడం, మార్చడం భారీ ఖర్చుతో కూడుకున్న పనవుతుందని విస్తరణకు రోడ్డు భవనాల శాఖ విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారికి మోక్షం కలిగేనా.. సాధ్యం కాదని తేల్చిచెప్పిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ నేషనల్ హైవే పరిధిలోకి తీసుకునేలా కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదన? ఎన్‌హెచ్ పరిధిలోకి వెళ్తే విస్తరణ చేపట్టొచ్చని సర్కార్ ఆలోచనరోడ్డుకు ఇరువైపులా భారీ పరిశ్రమలు ఏర్పాటు కావడం తథ్యం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విస్తరిస్తే బాగుంటుందనే ఆలోచనతో సర్కార్‌కు తెలియజేశాను. నాగార్జునసాగర్, కల్వకుర్తి, దేవరకొండ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి రోడ్డును విస్తరించేలా విన్నవిస్తాం. – మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం రహదారి నేషనల్ హైవే పరిధిలోకి వెళ్తేనే త్వరగా విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. రోడ్డు సమీపంలోనే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల సరిహద్దులో ఫ్యూచర్‌సిటీ నిర్మాణం అవుతుండడం, రోడ్డుపై ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 30 కిలోమీటర్ల దూరం వరకు పలు ఇంజనీరింగ్ కశాశాలు ఏర్పాటు కావడం, ఫ్యూచర్‌సిటీ నిర్మాణంలో భాగంగా ప్రపంచ స్థాయి గుర్తింపు నిచ్చే భారీ ప్రాజెక్టులు నెలకొల్పడానికి ఆసక్తి చూపుతుండడంతో రోడ్డు విస్తరణ ఆవశ్యకమని భావిస్తోంది. ఈ రోడ్డు నుంచి ఏపీలోని మాచర్ల, గుంటూరు, కణిగిరి, మార్కాపురం, వినుకొండ, చీరాల తదితర ప్రాంతాలకు ఆ ప్రాంతవాసులు రాకపోకలు సాగిస్తారు. ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులు, పలు వ్యాపార సంస్థల ప్రముఖులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో రోడ్డు విస్తరణకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల పెద్దలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. -
విడతల వారీగా పరిహారం
మొండిగౌరెల్లిలోని 19, 68, 127 సర్వే నంబర్లలోని అసైన్డ్ భూమిని పారిశ్రామిక పార్క్‌ల కోసం సేకరిస్తున్నాం. మొదట 127లోని రైతులకు పరిహారం ఇచ్చేందుకు అవార్డు ప్రకటన జారీ చేస్తాం. ఆ తర్వాత 68, మూడో విడతలో 19లోని రైతులకు పరిహారం ఇవ్వడానికి కృషి చేస్తున్నాం. విడతల వారీగా అవార్డులు జారీ చేసి, పరిహారం అందించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. కబ్జాలో ఉన్న రైతులకు పరిహారం ఇచ్చే అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. – శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం -
అవార్డు రెడీ
యాచారం: మొండిగౌరెల్లి అసైన్డ్ భూములకు పరిహారం అందజేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. విడతల వారీగా అవార్డు జారీ చేసి అర్హులైన వారికి చెక్కులు పంపిణీ చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. గ్రామంలోని సర్వే నంబరు 19, 68, 127లో మొత్తం 498 మంది రైతులకు సంబంధించిన 677 ఎకరాలకు పైగా అసైన్డ్ భూమిని పారిశ్రామిక పార్క్‌ల కోసం సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రైతుల కబ్జాపై సర్వే చేపట్టారు. అత్యధికంగా అసైన్డ్, ప్రభుత్వ భూమి కావడంతో రైతులు కూడా పెద్దగా వ్యతిరేకించలేకపోయారు. పరిహారం త్వరగా అందజేస్తే ఇతర ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు కొనుగోలు చేస్తారని భావించిన పంచాయతీ పాలకవర్గం అధికారుల సర్వేకు పూర్తిగా సహకరించింది. కానీ నోటిఫికేషన్ జారీ చేసి ఏడాది పూర్తి కావడం, సర్వే చేసి నెలలు దాటినా పరిహారం చేతికందకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఒకేసారి ఇవ్వాలని రైతుల డిమాండ్ మొదట మొండిగౌరెల్లి సర్వేనంబర్ 127లోని అసైన్డ్ రైతులకు పరిహారం చెక్కులు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజో, రేపో జాబితాతో కూడిన అవార్డును జారీ చేయనున్నారు. గ్రామంలో 19, 68, 127 సర్వేనంబర్లు ఉన్నప్పటికీ మొదటి విడతగా 127లోని అర్హులైన రైతులకు పరిహారం ఇచ్చేందుకు అవార్డు పాస్ చేయనున్నారు. ఆతర్వాత మిగిలిన నంబర్లకు అవార్డు జారీ చేయనున్నారని తెలుస్తోంది. అసైన్డ్ సర్వేనంబర్లల్లో భారీ అక్రమాలు జరిగాయని, నకిలీల పేర్ల మీద పరిహారం వచ్చే అవకాశం ఉందని రైతులు అరోపిస్తున్నారు. పూర్తిగా రీ సర్వే చేసి, ఫైనల్ లిస్ట్‌ను ప్రకటించిన తర్వాతే మూడు సర్వేనంబర్లను కలిపి ఒకేసారి అవార్డు ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సమయం ఇవ్వని కలెక్టర్ భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో మొండిగౌరెల్లి రైతులతో సమావేశమైన కలెక్టర్ నారాయణరెడ్డి ప్రస్తుతం రైతులను కలిసేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. మొదట్లో అసైన్డ్ భూమికి ఎకరాకు రూ.30 లక్షలు, ఎకరాకు 121 గజాల ప్లాటు, రైతు కుటుంబానికి అదనంగా మరో 121 గజాల ప్లాటు, కబ్జా రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వడానికి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో అంగీకరించారు. కానీ కబ్జా రైతులకు పరిహారం ఇచ్చేది లేదని, ప్రభుత్వ భూముల్లో ఇన్నాళ్లు సాగు చేసుకుని బతికారు కదా.. అనే కోణంలో అధికారులు మాట్లాడటం కబ్జా రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. కబ్జా భూములకు ఇచ్చే పరిహారంపై స్పష్టత ఇస్తేనే సరి.. లేదంటే మరో భూ పోరాటానికి సిద్ధమని రైతులు చెబుతున్నారు. అధికారులు మాత్రం కబ్జా రైతులకు పరిహారం ఇచ్చే విషయాన్ని తేల్చకుండా అవార్డు పాస్ చేసి అసైన్డ్, పట్టా రైతులకు పరిహారం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మొండిగౌరెల్లి అసైన్డ్ భూములకు త్వరలోనే పరిహారం మూడు విడతల్లో అందజేతకు అధికారుల నిర్ణయం కబ్జా భూములకు ఇచ్చే పరిహారంపై స్పష్టత కరువు నేడో, రేపో ప్రకటన జారీ -
మహేశ్వరం నుంచే మళ్లీ పోటీ
మీర్‌పేట: ˘"¿ýæÑçÙÅ™èl$¢ÌZ¯]l* Ð]l$õßæ-ÔèæÓÆý‡… ¯]l$…^ól ´ùsîæ ^ólÝë¢.. CMýSPyól VðSË$Ýë¢' A° Ð]l*i Ð]l$…{†, Ð]l$õßæ-ÔèæÓÆý‡… GÐðl$ÃÌôæÅ çܼ-™é-Æð‡yìlz çܵçÙt… ^ólÔ>Æý‡$. Ò$ÆŠ‡-õ³-rÌZ° M>Å…ç³# M>Æ>Å-ÌSĶæ$…ÌZ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… fÇ-W¯]l ´ëÈt A…™èl-Æý‡Y™èl M>Æý‡Å-MýS-Æý‡¢ÌS çÜÐ]l*-ÐólÔèæ…ÌZ BÐðl$ Ð]l*sêÏ-yéÆý‡$. JMýSÆý‡$ çܼ™èlÐ]l$à Æ>¯]l$¯]l² ÆøkÌZÏ Ð]l$õßæ-ÔèæÓ-Æý‡…ÌZ ´ùsîæ ^ólĶæ$Æý‡-°, Ð]l$ÆöMýSÆý‡$ BÐðl$ ¯é¯ŒS ÌZMýSÌŒæ A°, C…Mö-MýSÆý‡$ DÝëÇ BÐðl$¯]l$ GsêÏ VðSÌSÐ]l°Ý뢅, KyýlVösìæt ç³…í³-§éªÐ]l$° Æý‡MýS-Æý‡M>-Ë$V> Ð]l*sêÏ-yýl$-™èl$-¯é²Æý‡° ™ðlÍ-´ëÆý‡$. ™égêV> çܼ-™èlÐ]l$à E…yýl-¨MýS ^ólÐðlâýæÏ ´ù™èl§ýl° A…r$-¯é²-Æý‡-°, ÐéÆý‡$ CÌê Ð]l$äÏÐ]l$äÏ MýSÌSË$ MýS…r*¯ól E…sê-Æý‡°, ™é¯]l$ VðSË$-çÜ*¢¯ól E…sê¯]l° õ³ÆöP-¯é²Æý‡$. ÐéÇMìS çܼ™èlÐ]l$à CMýSPyýl E…§ýl…sôæ O«§ðlÆý‡Å… çÜÇ-´ù§ýl° G§ólªÐé ^ólÔ>Æý‡$. Æ>¯]l$¯]l² ÆøkÌZÏ ½B-ÆŠ‡-G‹Ü {糿¶æ$™èlÓ… HÆý‡µyýlyýl… RêĶæ$Ð]l$-°, MóSïÜ-BÆŠ‡ ¯éĶæ$-MýS™èlÓ…ÌZ °Äñæ*-fMýS-Ð]lÆý‡Y AÀÐ]l–¨® »ê«§ýlÅ™èl ¡çÜ$-MýS$…-sê¯]l° ^ðl´ëµÆý‡$. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా రెడ్డి -
సమన్వయంతో పనిచేయండి
ఆమనగల్లు: సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. మాడ్గుల మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర పంచాయితీరాజ్ ట్రిబ్యునల్ చైర్మన్ సూదిని రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత హాజరయ్యారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు తమ గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు. అన్ని గ్రామాలకు, తండాలకు బీటీరోడ్లు నిర్మిస్తామని, గ్రామాల్లోని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సక్రమంగా అమలయ్యేలా చూడాలని కోరారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి నర్సిరెడ్డి, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ వినయ్‌సాగర్, పంచాయితీరాజ్ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతులకు స్ప్రింక్లర్ల పంపిణీ మాడ్గుల ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మంజూరైన 126 స్ప్రింక్లర్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రైతులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండి సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టు కిషన్‌రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి సురేశ్, ఐడీహెచ్ అరుణ, ఉద్యానశాఖ అధికారి నవీన, హెచ్‌ఈఓలు సీతారాం, నగేశ్, స్థానిక నాయకులు సూదిని కొండల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, యాదయ్యగౌడ్, సర్పంచ్ రజిత, ఉపసర్పంచ్ శరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ దయాకర్‌రెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడకు చెందిన రత్యా కుమార్తె శిరీష(21) స్థానిక హెచ్‌పీ పెట్రోల్ పంప్లో పనిచేస్తోంది. ఈనెల 13న విధులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న శిరీష ఎవరికీ చెప్పకుండా బయ టకు వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంతవెతికినా ఆచూకీ లభించలేదు. సబావత్ అనిల్ అనే యువకుడిపై అనుమానం ఉందంటూ యువతి తల్లి దేపావత్ శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గౌతాపూర్ విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు తాండూరు రూరల్: తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన ఈడ్గి విజయంకిత ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది. నీట్ ప్రవేశ పరీక్షల్లో 443 మార్కులతో రాష్ట్రస్థాయిలో 3,730, ఆలిండియాలో 1,79,561 ర్యాంక్ సాధించింది. రెండో కౌన్సెలింగ్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు దక్కించుకుంది. విజయంకిత తండ్రి మూడేళ్ల క్రితమే మృతిచెందగా, తల్లి రాధిక తన ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. కారు ఢీకొని వ్యక్తికి గాయాలు కుల్కచర్ల: ఎదురెదురుగా వస్తున్న కారు, బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలైన ఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కొనగల్ల వెంకటయ్య నంచర్ల నుంచి స్వగ్రామం తిర్మలాపూర్ వస్తుండగా, కారులో పరిగి నుంచి మహబూబ్‌నగర్ వైళ్తున్న ముడవత్ హతిరాం బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వెంకటయ్యకు తీవ్రగాయాలయ్యాయి. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రెండు వాహనాలను పీఎస్‌కు తరలించారు. యాలాల: ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని నాగసముందర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొక్కెన ఆశప్ప(45) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాడు. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అంతంతా మాత్రంగానే ఉండటంతో మనస్థాపానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఆశప్ప భార్య బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఇంట్లో దూలానికి వైరుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నవాబుపేట: ఉన్న ఒక్క టీచర్ వస్తేనే చదువు.. లేకపోతే సెలవు. ఇదీ నాగిరెడ్డిపల్లి పాఠశాల పరిస్థితి. ఉపాధ్యాయులు సెలవు పెడితే కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై సర్పంచ్ శేఖర్, పలువురు స్థానికులు ఎంఈఓ అబ్దుల్ రహమాన్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని మండిపడ్డారు. మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు బడి తలుపులు తెరవకపోవడంతో రెండు గంటల పాటు టీచర్ కోసం ఎదురు చూశారు. ఆతర్వాత చేసేదేమీ లేక ఇళ్లకు వెళ్లిపోయారు. ఈవిషయమై ఎంఈఓను వివరణ కోరగా పాఠశాలలో ఒకే టీచర్ పనిచేస్తున్నారని, అనారోగ్య సమస్య కారణంగా సెలవు పెట్టారని తెలిపారు. తాను కూడా సెలవులో ఉండటంతో మరో టీచర్‌ను నియమించడంలో జాప్యం జరిగిందని, మరోసారి కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. -
మరణంలోనూ ముగ్గురికి పునర్జన్మ
లక్డీకాపూల్: ఒక నిరుపేద యువకుడి కుటుంబం తీసుకున్న సాహసోపేత నిర్ణయం ముగ్గురు వ్యక్తుల జీవితాల్లో కొత్త వెలుగులను నింపింది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన రంగారెడ్డి జిల్లాకు చెందిన యువకుడి మరణంలో కూడా ముగ్గురికి పునర్జన్మనిచ్చాడు. జీవన్‌దాన్ ప్రోగ్రామ్ ఇంచార్జ్ ప్రొఫెసర్ శ్రీభూషణ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలం, లోయపల్లికి చెందిన సిలువేరు అనిల్ (30) రోజువారీ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 6న అనిల్ తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మర్రిగూడ సమీపంలో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువకుడిని కుటుంబ సభ్యులు వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ అనిల్ కోలుకోలేకపోయాడు. చివరకు మంగళవారం వైద్యులు అతడిని ’బ్రెయిన్ డెడ్’ (మస్తిష్క మరణం)గా ప్రకటించారు. తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ, అనిల్ తండ్రి సిలువేరు మల్లేష్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడి అవయవాలను దానం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. అనిల్ పార్థివ దేహం నుండి కాలేయం, నేత్రాలు సేకరించారు. ఈ అవయవాల ద్వారా ముగ్గురు రోగులకు పునర్జన్మ లభించనుందని శ్రీభూషణ్ రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనిల్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి నిర్ణయం సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు తెలంగాణలో 147 బ్రెయిన్ డెడ్ అవయవ దానాలు జరగగా, అనిల్ దానంతో ఈ సంఖ్య 148వ మైలురాయికి చేరుకుందని శ్రీ భూషణ్ రాజు తెలిపారు. -
మొక్కలు నాటి బర్త్ డే వేడుక
కేశంపేట: అందరు చిన్నారుల్లా కేక్ కటింగ్‌లు, పార్టీలు కాకుండా తన పుట్టిన రోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని భావించాడు ఎనిమిదేళ్ల బాలుడు. తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన మౌనిక, సంగీత్రెడ్డిల కుమారుడు తాక్షిత్రెడ్డి తన ఎనిమిదో బర్త్ డే సందర్భంగా ఎనిమిది మొక్కలు నాటి వినూత్నంగా వేడుకలు జరుపుకొన్నాడు. చిన్న వయస్సులోనే పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఆలోచించిన బాలుడిని పలువురు అభినందించారు. షాద్‌నగర్: పీసీసీ అధ్యక్షుడుగా మహేశ్‌కుమార్‌గౌడ్ ఎన్నికై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆయనను ఘనంగా సత్కరించారు. పీసీసీ కార్యాలయానికి వెళ్లి మహేశ్‌కుమార్ గౌడ్‌కు పూలమాలలు వేసి, శాలువా కప్పి సత్కరించి మిఠాయి తినిపించారు. -
డీజే వాహనం సీజ్
పూడూరు: అధిక శబ్దంతో డీజే పెట్టి, సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు సృష్టించిన వాహనాన్ని సీజ్ చేసినట్లు చన్గోముల్ ఎస్ఐ భరత్‌రెడ్డి తెలిపారు. పూడూరు గ్రామంలో సోమవారం విధులు నిర్వర్తిస్తున్న బ్లూ కోట్స్ సిబ్బందికి పెద్ద శబ్దంతో డీజే సౌండ్ వినిపించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీజే ఏర్పాటు చేసిన వాహనంతో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేసి పీఎస్‌కు తరలించారు. హిమాయత్‌నగర్‌కు చెందిన పి.ఉదయ్ డీజే నిర్వాహకుడిగా తమ విచారణలో తేలిందన్నారు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 14 మందికి బైండోవర్ తాండూరు రూరల్: వినాయక శోభాయాత్ర సందర్భంగా డీజే పెడితే రూ.2 లక్షల జరిమానా విధిస్తామని ఎస్ఐ ప్రశాంత్‌వర్ధన్ హెచ్చరించారు. మంగళవారం పెద్దేముల్ మండల కేంద్రంలో 14 మంది డీజే ఆపరేటర్లను తహసీల్దార్ వెంకట్ ప్రసాద్ ఎదుట బైండోవర్ చేశారు. -
విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్నారు
అబ్దుల్లాపూర్‌మెట్: తమ కులానికి చెందిన గుండోజి రంగదాసు పంతులు విగ్రహ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తూ, అడ్డుకుంటున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమళ్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన కొంతమంది తమ కులాన్ని కించపరిచేలా వ్యవహరిస్తూ, విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ సీఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంబర్తి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఆర్.జయసింహ, సహాయ కార్యదర్శులు మెగిలి రఘు, కంది సత్యం, ప్రచార కార్యదర్శి దుబాయ్ నర్సింగ్, రాష్ట్ర వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు చెన్నారం మల్లేశం, అబ్దుల్లాపూర్‌మెట్ నాయి బ్రాహ్మణ సంఘ మండల అధ్యక్షుడు రంగయ్య, సభ్యులు దాసారం రవి, లంగారి శ్రీను, మల్లేశ్, అనిల్, గుండాల రాజారాం తదితరులు పాల్గొన్నారు. నాయీబ్రాహ్మణ సంఘం నేతల ఫిర్యాదు -
పేదల సేవకే ‘ఐక్యత’
కడ్తాల్: పేదలకు సేవలందించడమే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్లో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరం మంగళవారం 5వ రోజుకు చేరుకుంది. ఈ శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడి వైద్య సేవలపై ఆరాతీశారు. శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఐదు రోజులుగా 4,240 మంది శిబిరాన్ని సందర్శించగా 2,762 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు 1,670 మందికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేసినట్లు, 142మంది కంటి శుక్లాల ఆపరేషన్ అవసరమని గుర్తించామన్నారు. బుధవారం నుంచి కంటి శుక్లాల ఆపరేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు మహేందర్‌గౌడ్, కరుణాకర్‌గౌడ్, రవికుమార్, సంధ్యా, వెంకటేశ్, రాంచందర్‌నాయక్, సభ్యులు, రఘు, లింగం, శ్రీరాములు, నరేందర్‌గౌడ్, కొండల్‌యాదవ్, శేఖర్, శ్రీను, మల్లేశ్, శ్రీను, మహేశ్ ఉన్నారు. ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఈఓ రాఘవేందర్‌రెడ్డి -
శంషాబాద్‌లో బస్సు బీభత్సం.. హోటల్లోకి దూసుకెళ్లి..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ కిషన్‌గూడ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. హోటల్లోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. ఎదురుగా కంటైనర్ రావడంతో అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. విద్యుత్ పోల్‌ను ఢీ కొడుతూ ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. పార్కింగ్ చేసి ఉన్న కార్లను బైక్‌ను ఢీకొడుతూ దూసుకెళ్లింది.ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో సహా పలువురు గాయపడ్డారు. ఘటనలో ఒకరు మృతి చెందగా.. మృతుడిని కరీంనగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దుబాయ్‌కి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్తూ మధ్యలో టీ తాగడం కోసం హోటల్ దగ్గర ఆగిన అజ్మల్.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ అజ్మల్ మృతి చెందారు.ఇదీ చదవండి: వినాయక చవితి వేళ.. విజృంభించిన వరుణుడు -
గణేశ్ మండప నిర్మాణంలో అపశ్రుతి
వెల్జాలలో యువకుడి దుర్మరణం ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వెల్జాలకు చెందిన కూరాకుల రాఘవేందర్(23) శనివారం మధ్యాహ్నం జరిగిన మృతిచెందాడు. తలకొండపల్లి సీఐ జానకిరాంరెడ్డి కథనం ప్రకారం.. గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద తన అన్న ఆంజనేయులు, బాబాయి లక్ష్మయ్య, మామ మల్లేశ్‌తో కలిసి రాఘవేందర్ గణేశ్ మండపాన్ని నిర్మిస్తున్నారు. ఈక్రమంలో మండపం పైకి ఎక్కి కట్టెలను కట్‌చేస్తుండగా ప్రమాదవశాత్తు కట్టర్ మిషన్ జారి కుడి మోచేయిపై పడటంతో బ్యాలెన్స్తప్పి కిందపడిపోయాడు. కట్టర్మిషన్ ఛాతిపై పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని తల్లి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. గంజాయి చాక్లెట్లువిక్రయిస్తున్న దంపతుల అరెస్ట్ కొత్తూరు: గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ నాగార్జునరెడ్డి కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన భోలా(42), సుమనాత్రి దేవి దంపతులు. కొంత కాలంగా కొత్తూరు మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో నివాసం ఉంటున్నారు. బీహార్ నుంచి గంజాయి కలిపిన చాక్లెట్లు అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వీరిపై అనుమానం కలిగిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శనివారం కల్లుదుకాణం వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి సుమారు రూ.2 వేల విలువైన 78 గంజాయి చాక్లెట్లు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. -
వరుస చోరీలు.. చిక్కని చోరులు!
కొందుర్గు: అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా పలు చోరీ కేసులను పోలీసులు ఛేదించలేకపోతున్నారు. ఈ అంశాన్నే దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సీసీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్లు, డాగ్‌స్క్వాడ్ వంటి సదుపాయాలు ఉన్నా చోరీలకు పాల్పడిన వారిని గుర్తించకపోవడం విశేషం. కొందుర్గు మండలంలోని శ్రీరంగాపూర్లో పది నెలల వ్యవధిలో మూడు ఇళ్లల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన నివాసాలే లక్ష్యంగా రాత్రి వేళ్లల్లో తాళాలు విరగొట్టి, ఇళ్లు గుల్ల చేశారు. శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన బేగరి రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి గత ఏడాది నవంబర్ 18న రామేశ్వరం దేవుని దర్శనానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం విరగొట్టిన దుండగులు బీరువాలోని 4.5 తులాల బంగారు అభరణాలు, 20 తులాల వెండి పట్టీలు, రూ.50 వేల నగదు దోచుకెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల యాదయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి షాద్‌నగర్ వెళ్లారు. మరుసటిరోజు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం విరగొట్టి బీరువాలో ఉన్న మూడున్నర తులాల బంగారు, 40 తులాల వెండి ఆభరణాలు, రూ.25 వేల నగదును ఎత్తుకెళ్లారు. తాజాగా చాకలి యాదయ్య ఈనెల 2న కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. 4న ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం విరగొట్టి తులంన్నర కమ్మలు, బుట్టాలు, 20 తులాల వెండి పట్టీలు, 20 వేల నగదు ఎత్తుకెళ్లారు. మూడు ఇళ్లల్లో కలిసి దాదాపు 10 తులాల బంగారు అభరణాలు, ఒక కిలో వెండి, ఒక లక్ష రూపాయలు దొంగిలించారు. అయితే అన్ని ఇళ్లల్లోనూ ఒకే విధంగా దొంగలు తమ తెలివిని ప్రదర్శించినట్లు గుర్తించారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకొని, బీరువాల తాళాలు తీయడం బీరువాలో ఉన్న అభరణాలు,నగదు ఎత్తుకెళ్లడం గమనార్హం. తాజాగా వారం రోజుల క్రితం చాకలి యాదయ్య ఇంట్లో దొంగలు పడగా పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించగా బెడ్ కింద గ్లౌజ్‌లు లభించినట్లు తెలిసింది. దొంగలు తమ ఫింగర్ ప్రింట్లు గుర్తించకుండా ఉండేందుకు చేతులకు గ్లౌజులు వేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా పోలీసులు దొంగలను పట్టుకుంటారా.. లేదా అనేది వేచి చూడాల్సిందే. శ్రీరంగాపూర్లో తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా వరుస దొంగతనాలు గడిచిన పది నెలల్లో మూడు ఇళ్లలో దొంగల బీభత్సం ఒక్క కేసునూ ఛేదించని పోలీసులు -
హాస్టల్.. హడల్ !
మొయినాబాద్: ప్రైవేటు హాస్టళ్లలో విద్యార్థులు ప్రాణాలు ఫణంగా పెట్టి ఉంటున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వరుసగా జరగుతున్న ఘటనలను చూస్తుంటే విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన కలుగుతోంది. రూ.లక్షలు కట్టి పిల్లలను చేర్పిస్తున్న హాస్టళ్లు భద్రమేనా అని తల్లిదండ్రులు కలవరానికి గురవుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రైవేటు హాస్టల్ భనం కుప్పకూలిన ఘటనతో వారి ఆందోళన మరింత పెరిగింది. అనుమతులు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా.. మొయినాబాద్ ప్రాంతంలో విద్యా సంస్థలు అధికంగా ఉండటంతో విద్యార్థుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేటు హాస్టళ్లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. భవన నిర్మాణం నుంచి హాస్టల్ ఏర్పాటు వరకు ఎలాంటి అనుమతులు లేకుండా చకచకా జరిగిపోతున్నాయి. మొయినాబాద్ ప్రాంతం 111 జీవో పరిధిలో ఉండటంతో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అధికారిక అనుమతులు ఇవ్వడానికి వీల్లేదు. ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే అధికారులు అడ్డుకో వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు వాటాలు తీసుకుని అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోశారు. మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి అక్రమ నిర్మాణాలు మరింత వేగం పుంజుకున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు, ఎనిమిది అంతస్తులు కట్టేసి.. ఎలాంటి అనుమతులు లేకుండానే హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో హాస్టల్లో వందల మంది మున్సిపాలిటీలోని చిలుకూరు, హిమాయత్నగ ర్, అజీజ్‌నగర్, మొయినాబాద్‌లో సుమారు 30కి పైగా ప్రైవేటు హాస్టళ్లు ఉన్నాయి. ఒక్కో హాస్టల్లో సుమారు 200–400 మంది విద్యార్థులు ఉంటున్నారు. మరికొన్ని భవనాల నిర్మాణం జరుగుతోంది. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులను ఆసరాగా చేసుకుని భవనాల నిర్మాణం పెరుగుతోంది. ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.8–10 వేలు వసూలు చేస్తూ నిర్వాహకులు వ్యాపారం చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలకు మంగళం 111 జీవో నిబంధనలు తుంగలో తొక్కి 200–300 గజాల ప్లాటులో 7–8 బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఒక్కో భవనంలో సుమారు 70–80 గదులు నిర్మించి హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గదిలో 7–10 మంది విద్యార్థులు ఉంటున్నారు. హాస్టళ్ల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవడంలేదు. వాటి నుంచి వచ్చే మురుగునీరు, డ్రైనేజీ, చెత్తా చెదారం అంతా ఖాళీ ప్రదేశాల్లో వదలడంతో పరిసర ప్రాంతాలు దుర్గంధంగా మారుతున్నాయి. తనిఖీలు కరువు హాస్టళ్లలో విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యతగా ఉంటోదా.. అగ్నిప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. భవనానికి అనుమతి ఉందా.. మురుగునీరు, డ్రైనేజీ, చెత్తాచెదారం ఎక్కడ వేస్తున్నారు.. అనే అంశాలపై అధికారులెవరూ తనిఖీలు నిర్వహించకపోవడంతో నిర్వాహకులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. భవనాలు నిర్మించే సమయంలో ప్రజాప్రతినిధులు, టౌన్‌ప్లానింగ్, మున్సిపల్ అధికారులు భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జేబీఐటీ కళాశాల ఎదుట ఉన్న ప్రైవేటు హాస్టళ్లు అజీజ్‌నగర్ చౌరస్తా వద్ద ఇటీవల షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్న హాస్టల్ భవనం అనుమతులు లేకుండా ఏర్పాటు మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్ చౌరస్తా సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఇటీవల మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగింది.నాణ్యమైన విద్యుత్ వైర్లు వాడకపోవడంతో లోడ్ ఎక్కువై తీగలు అంటుకుని మంటలు వచ్చినట్లు గుర్తించారు. అదే సమయంలో కరెంటు సరఫరాఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నెల రోజుల క్రితం ఎన్టీఆర్ విద్యా సంస్థలోని హాస్టల్లో సుమారు 60 మందికి పైగా విద్యార్థి నులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు, ఫుడ్ పాయిజన్ దీనికి ప్రధాన కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. చాలా మందిని తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు హాస్టల్లో వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థినులకు వైద్య సేవలు అందించారు. ఉన్నతాధికారుల దృష్టికి.. మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా ప్రైవేటు హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నాయా.. డ్రైనేజీ ఎక్కడ వదులుతున్నారు.. తదితర అంశాలపై త్వరలో తనిఖీలు నిర్వహిస్తాం. – జాకీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్, మొయినాబాద్ -
మహా నేత్రోత్సవం
ఖైరతాబాద్ : ౖఖెరతాబాద్లో ఈ ఏడాది (72వ సంవత్సరం) 69 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకున్న శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతికి శనివారం సాయంత్రం నేత్రోనిలనం (కంటిపాప అమరిక) వైభవంగా నిర్వహించారు. దీంతో మహాగణపతి రూపకల్పన పూర్తయినట్లు శిల్పి రాజేంద్రన్ ప్రకటించారు. మహాగణపతి ఎత్తు, వెడల్పును బట్టి ఆగమ శాస్త్రంలో సూచించిన విధంగా కంటి ఎత్తు, వెడల్పు కచ్చితమైన స్కేలు ప్రకారం తీర్చిదిద్ది కంటిపాపను అమరుస్తామని, తద్వారా వినాయకుడు నలు వైపుల నుంచి భక్తులకు ఆశీర్వాదం ఇచ్చే విధంగా ఉంటుందని తెలిపారు. ఈ మహాగణపతిని దర్శించుకుంటే పంచ భూతాలను దర్శించుకున్నట్లే అని, అలాగే విగ్రహం తయారీకి ఉపయోగించిన రంగులు కూడా ప్రత్యేకమేనని ఆయన పేర్కొన్నారు. ఖైరతాబాద్ మహాగణపతితో పాటు నగరంలోని బాచుపల్లిలో 30 అడుగుల వినాయకుడు, ఏపీలోని మచిలీపట్నంలో 63 అడుగుల మట్టి వినాయకుడిని కూడా తానే తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇవి పూర్తిగా మట్టితో తయారుచేసిన విగ్రహాలే అని చెప్పారు. -
ఊరి పేరు తారుమారు!
కందుకూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీలో భాగంగా మండల పరిధిలోని కొత్తగూడకు పంపించిన కార్డుల్లో ఊరి పేరు మారిపోయింది. కొత్తగూడలో పాత, కొత్త కార్డులు అన్ని కలిపి 460కి పైగా ఉన్నాయి. కాగా శనివారం రెవెన్యూ అధికారులు జీపీఓల ద్వారా వీటిని పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం గ్రామంలో డప్పు చాటింపు వేయించి, వాట్సప్ గ్రూపుల ద్వారా కూడా సమాచారం అందించారు. తీరా పంపిణీ చేయడానికి చూసే సమయంలో కొత్తగూడ గ్రామం బదులు కూపర్చంద్గూడ అని ఉండటంతో అవాక్కయ్యారు. దీంతో కార్డులు పంపిణీ చేయకుండా ఆపేశారు. అప్పటికే కొందరికి అందజేసిన కార్డులను కూడా వెనక్కి తీసుకున్నారు. అసలు కూపర్చంద్గూడ అనే గ్రామం ఎక్కడ ఉందో కూడా తమకు తెలియదని స్థానికులతో పాటు కార్యక్రమానికి హాజరైన పలువురు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆగ్రామం లేకపోయినా ఆ పేరుతో రెవెన్యూ గ్రామం మాత్రం ఉంది. ఇది జైత్వారం నుంచి పులిమామిడికి వెళ్లే దారిలో ఉత్తరం వైపున ఉంటుంది. గ్రామం లేకుండా కేవలం రెవెన్యూ కొంత విస్తీర్ణంలో మాత్రమే ఉంటుంది. దీంతో చాలా మంది ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనాభా లేకుండా కేవలం ఇలా రెవెన్యూ గ్రామాలు కందుకూరు మండలంలో కూపర్చంద్గూడతో పాటు నేదునూరు గ్రామ పరిధిలోని అలిఖాన్‌పల్లి, అక్బర్జా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. స్మార్ట్ రేషన్ కార్డులలో కొత్తగూడ బదులు కూపర్చందర్గూడ ఇచ్చిన కార్డులు వాపస్ తీసుకున్న అధికారులు -
చెరువు.. నీళ్లు కరువు!
మంచాల: గత ఏడాది నీటితో కళకళలాడిన పెద్దబంధం చెరువు మంచాల: ప్రస్తుత పరిస్థితికడ్తాల్: రావిచేడ్‌లో గతేడాది అలుగుపారుతున్న నాగోని చెరువు కడ్తాల్: ప్రస్తుత పరిస్థితిజిల్లాలో సగానికిపైగా ఖాళీ ఐదేళ్లలో నమోదైన వర్షపాతం (మి.మీ.) సంవత్సరం జూన్ జూలై ఆగస్టు 2021–22 90.3 315.8 147.9 2022–23 126.0 346.1 147.9 2023–24 82.6 307.7 34.04 2024–25 97.0 145.3 145.0 2025–26 73.8 221.8 316.4 2026–27 141.2 143.6 100.4 సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురకపోవడంతో జిల్లాలోని మెజార్టీ చెరువులు, కుంటలు నీళ్లు లేక ఖాళీగా కన్పిస్తున్నాయి. గత ఏడాది నవరాత్రులకు ముందే చెరువులు, కుంటలన్నీ మత్తడి దూకాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో నీళ్లు చేరలేదు. ఈసారి 40 శాతం లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు లేక ఇప్పటికే వరి సహా ఇతర పంటలు వాడిపోతున్నాయి. జిల్లాలో 2,127 చెరువులు, కుంటలు ఉండగా వీటిలో చాలావరకు రియల్టర్ల చేతిలో బందీగా మారాయి. చెరువుల్లోకి వరదనీటిని చేర్చే వాగులు, వంకలు ధ్వంసమయ్యాయి. ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలోని చెరువులు, కుంటల్లోకి సమీప నివాసాలు, పారిశ్రామికవాడల నుంచి వెలువడిన వ్యర్థాలు, మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఆనవాళ్లు కోల్పోయిన చెరువులు, కుంటలు -
పార్టీ బలోపేతానికి పనిచేయాలి
చేవెళ్ల: పార్టీ బలోపేతానికి కొత్తగా ఎన్నికై న కమిటీల సభ్యులు నూతనోత్సహంతో పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శనివారం ఎమ్మెల్యే కాలెయాదయ్యతో కలిసి నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలు, ఐదు మండలాల్లో ఇటీవల ఎంపికై న పార్టీ నూతన అధ్యక్షులకు నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. సమన్వయంతో ముందుకుసాగాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి, కౌన్సిలర్లు శైలజారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, నాయకులు ఆగిరెడ్డి, రాములుగౌడ్, గోపాల్‌రెడ్డి, పాండు యాదవ్, పడాల ప్రభాకర్, రవీందర్, టేకుపల్లి శ్రీనివాస్, కార్తీక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ప్రాకర్రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఏచూరి ఆశయాల కోసం పోరాడుదాం
ఇబ్రహీంపట్నం: కామ్రెడ్ సీతారాం ఏచూరి ఆశయాల సాధన కోసం పోరాటం చేద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.సామేల్ పిలుపునిచ్చారు. సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా శనివారం ఇబ్రహీంపట్నం పాషనరహరి స్మారక కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సామేల్ మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమం నుంచి సీపీఎం జాతీయ కార్యదర్శిగా ఏచూరి ఎదిగారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఎండగట్టారని, వామపక్షాల ఐక్యతకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బుగ్గరాములు, జంగయ్య, జగన్, శారద, గణేశ్, ముసలయ్య, ప్రభుదాసు, నర్సింహ, విజయ్, యాదగిరి పాల్గొన్నారు. -
1.65 లక్షల కేసులు పరిష్కారం
సిటీ కోర్టులు: రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టులలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 1,65,000 పైగా కేసులు పరిష్కరించామని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ తెలిపారు. 33 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ, ప్రీ–లిటిగేషన్ తదితర రాజీకి అనుకూలమైన కేసులను పరిష్కరించామన్నారు. విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన ఓ జంటకు కౌన్సెలింగ్ నిర్వహించగా, మనస్పర్థలు వీడి కలిసి జీవించేందుకు అంగీకరించారని తెలిపారు. దీంతో ఓ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా వారిని లోక్‌అదాలత్ కలిపిందని స్పష్టంచేశారు. శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ ఈఆర్‌జీఓ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా మోటారు వాహన ప్రమాద కేసుల బాధితులకు రూ.80 లక్షల నష్టపరిహారం ఇప్పించారు. అన్ని కేసులలో కలిపి రూ.10 కోట్ల, 3 లక్షల 33 వేల నష్ట పరిహారాన్ని కక్షిదారులకు అందజేసినట్లు తెలిపారు. ● 33 బెంచీల్లో జాతీయ లోక్ అదాలత్ ● కక్షిదారులకు రూ.10,03,33,000 పరిహారం అందజేత ● జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరొకరికి గాయాలు ఆమనగల్లు: రోడ్డు ప్రమా దంలో యువకుడు మృతిచెందిన సంఘటన ఆమనగల్లు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం మర్రిగుంత తండాకు చెందిన ఇస్లావత్ అనిల్‌కుమార్ (23) శనివారం రాత్రి కల్వకుర్తి పట్టణంలోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం నుంచి బుల్లెట్ బైక్ తీసుకుని బైక్ మెకానిక్ శశికుమార్‌తో కలిసి ఆమనగల్లు వైపు వస్తున్నారు. ఆమనగల్లు పట్టణంలోని మార్కెట్‌యార్డు వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి వేగంగా వచ్చిన కారు యూటర్న్ తీసుకుంటూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడగా స్థానికులు చికిత్స నిమిత్తం వెల్దండలోని ఎన్నం హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అనిల్‌కుమార్ మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
బీఆర్ఎస్ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ
తుక్కుగూడ: బీఆర్ఎస్ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ అని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ విమర్శించారు. తుక్కుగూడ ఔటర్ సర్కిల్ వద్ద శనివారం జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ క్యారగారి శ్రీధర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అత్యంత హేయంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న దళిత బిడ్డను అవమానించిన ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సింది పోయి, ఫామ్‌హౌస్ సమీపంలో దళితులు నిరసన చేసిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దారుణమైన చర్యగా అభివర్ణించారు. దీనిని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సమర్థిస్తారా అని నిలదీశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్లార్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌తో రాజీమార్గం
ఆమనగల్లు: లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమనగల్లు జూనియర్ సివిల్‌జడ్జి అరుణకుమార్ సూచించారు. పట్టణంలోని కోర్టులో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పలు కేసులను పరిష్కరించారు. అంతకుముందు జడ్జి మాట్లాడుతూ.. ఇరువర్గాలు రాజీపడి కేసులు పరిష్క రించుకోవడానికి లోక్ అదాలత్ మంచి అవకా శం అని అన్నారు. ఇరువర్గాలు గెలిచినట్టే అని తెలిపారు. ఇరువర్గాల రాజీతో సత్వరన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ మురళీధర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్తీక్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదీలాల్, కోశాధికారి మల్లేశ్, గ్రంథాలయ కార్యదర్శి గణేశ్‌గౌడ్, క్రీడా కార్యదర్శి సంతోష్‌కుమార్, న్యాయవాదులు, సీఐలు, వివిధ బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. 203 కేసుల పరిష్కారం ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, గ్రీన్‌సిటీ ఫార్మా, మాడ్గుల పోలీస్స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో క్షక్షిదారులు రాజీపడ్డారు. స్థానిక న్యాయస్థానం వద్ద శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో సుమారు 203 కేసులు పరిష్కారమయ్యాని ఏసీపీ కేవీపీ రాజు తెలిపారు. మంత్రి సీతక్కకు సన్మానం చేవెళ్ల: పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా మహిళా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్య క్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభవన్‌లో మంత్రిని కలిసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సర్పంచుల సంఘం అధ్యక్షురాలు తిప్పని మాధవిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు చేవెళ్ల: ప్రజల్లో కాంగ్రెస్‌పార్టీకి ఆదరణ లేదనే భయంతో ఎన్నికలకు వెళ్లకుండా సొసైటీ పదవులను నామినేటెడ్ పద్ధతిలో కట్టబెడుతున్నారని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ మాల్గారి వైభవ్‌రెడ్డి విమర్శించారు. చేవెళ్లలో శనివారం ఆయన బీజేవైఎం నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు. ప్రజా స్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే దమ్ము లేద న్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, పార్టీ గుర్తుపై ఎన్నికలకు వెళ్తే తిరస్కరిస్తా రనే భయం పట్టుకుందన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చిన్నారితో అసభ్య ప్రవర్తన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు యాచారం: తొమ్మిదేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక దాడికి యత్నించిన ఓ వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. యాచారం మండల పరిధిలోని ఓ గ్రామంలో నాలుగో తరగతి చదివే ఓ చిన్నారి తోటి స్నేహితులతో కలిసి ఎదురింట్లోకి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన ఆఇంట్లోని 35 ఏళ్ల వ్యక్తి చిన్నారితో అసభ్యంగా ప్రవరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి రక్షించారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు. -
నియమాలు పాటిస్తే.. విఘ్నాలు తొలుగు
షాద్‌నగర్: గణపతి నవరాత్రి ఉత్సవాలకు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఉత్సవాల ప్రారంభానికి ఒక్క రోజు గడువు మాత్రమే ఉంది. వేల సంఖ్యలో విగ్రహాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఉత్సవాలను పురస్కరించుకుని మండపాల ఏర్పాటు, నిమజ్జన ఊరేగింపుల కోసం నిర్వాహకులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోలీసు శాఖ సాంతికేతిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక పోర్టల్ సేవలను ప్రారంభించింది. అనుమతులు తప్పని సరి గణేశ్ మండపాల ఏర్పాటుకు, నవరాత్రి ఉత్సవాల నిర్వాహణకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. ఆన్లైన్లో పూర్తి వివరాలతో ధరఖాస్తు చేసుకొని ఆ ప్రతులను సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో అందజేయాలి. ఉత్సవాలు ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తున్నారో పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మండపాలకు విద్యుత్ కనెక్షన్ కోసం అధికారుల అనుమతి తప్పక తీసుకోవాలి. నిబంధనలు ● మండపం ఏర్పాటుకు రోడ్లును బ్లాక్ చేయొద్దు. ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దు. ● మండపాల వద్ద విధిగా నిర్వాహకుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ● మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. లేదంటే డయల్ 100కు ఫోన్ చేయాలి. ● మండపాల వద్ద పూజా సామగ్రి, అగ్గి పెట్టెలు, హారతుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ● అనుమతించిన సమయంలో మాత్రమే మైకులు వాడాలి. డీజేలు, అధిక శబ్దాలు వచ్చే స్పీకర్లును పూర్తిగా నివారించి ధ్వని కాలుష్య నిబంధనలు పాటించాలి ● భక్తులను గైడ్ చేసేలా వలంటీర్లను నియమించాలి. ● రాత్రి వేళల్లో విధిగా మండపాల వద్ద ఇద్దరు వ్యక్తులు ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలు చేయొద్దు. ● మండలపాలను తగినంత దూరంలో ఏర్పాటు చేయాలి. విద్యుత్ లైన్ల కింద, వాటికి దగ్గరగా ఏర్పాటు చేయొద్దు. విద్యుత్ తీగలను తాకే ఎలాంటి లైటింగ్ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయొద్దు. ● విద్యుత్ స్తంభాలకు జెండాలను, బ్యానర్లు, ఇతర అలంకరణ సామాగ్రి కట్టొద్దు. ప్రతి మండపంలో నాణ్యమైన విద్యుత్ వైర్లు వాడాలి. ఎర్తింగ్ ఉండేలా చూసుకోవాలి. ● విద్యుత్ తీగలు తెగినా, పడిపోయినా, స్పార్కింగ్లు వచ్చినా వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. గణేశ్ మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ అనుమతులు సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన పోలీసు శాఖ డిజిటల్ ఎన్ఓసీ పత్రాన్ని నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశంనిర్వాహకులు ముందుగా పోలీసు శాఖ అధికార పోర్టల్ www.tspolice.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. కమిటీ సభ్యుల వివరాలు, నిమజ్జన ప్రదేశం, మార్గం, వంటి సమాచారాన్ని నమోదు చేయాలి. పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు. పరిశీలన పూర్తయిన వెంటనే మండపాలకు ఆన్లైన్లోనే అనుమతులు జారీ చేస్తారు. ప్రత్యేక క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ ఎన్ఓసీ పత్రాన్ని నిర్వాహకులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
టయోటా బూట్ క్యాంప్
మొయినాబాద్ రూరల్: టయోటా ఆధ్వర్యంలో మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి రెవెన్యూ పరిధిలో ఆల్ న్యూ టయోటా ఐలాక్స్ బూట్ క్యాంప్‌ను ఘనంగా నిర్వహించారు. సాహస యాత్రలు, వాహనాలపై ఆసక్తి ఉన్న వారికి కఠినమైన మార్గాల్లో ఐలాక్స్ పనితీరును స్వయంగా అనుభవించే అవకాశాన్ని వారు కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ప్రముఖ డీలర్షిప్స్ హర్ష టయోటా, మోదీ టయోటా, ఫార్చూన్ టయోటా, హెడ్ వే టయోటాలు పాల్గొన్నాయి. సెప్టెంబర్ 12వ వరకుక్యాంప్ అందుబాటులో ఉంటుందని ఆల్ న్యూ టయోటా ఐలక్స్ సీఈవో ప్రశాంత్ మౌనపత్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో వీ ఆటోమొబైల్ అనురాధ, హైదరాబాద్ నగరవాసులు పాల్గొన్నారు. -
సంపూర్ణ ఆరోగ్యంతోనే సత్ఫలితాలు
షాద్‌నగర్ రూరల్: విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే సత్ఫలితాలను సాధిస్తారని డాక్టర్ ముస్తాకిన్ అహ్మద్ అన్నారు. శుక్రవారం చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ పరిధిలోని శ్రీనివాసకాలనీ ప్రాథమిక పాఠశాలలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విద్యార్థులకు డీపీటీ, టీడీ వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చిన్నపాటి అనారోగ్యానికి గురైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలన్నారు. విద్యార్థులు డీపీటీ, టీడీ టీకాలను తీసుకోవాలని, టీకా వేసిన ప్రదేశంలో నొప్పి, వాపు, చర్మం ఎర్రబడటం, స్వల్పంగా జ్వరం వస్తుందని, ఆందోళన అక్కర్లేదని తెలిపారు. అనంతరం విద్యార్థులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రజిత, ఉపాధ్యాయులు లక్ష్మీదేవమ్మ, వనజ, ధనలక్ష్మి, మాధవాచారి, ఏఎన్ఎంలు రమాదేవి, కవిత, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులు
కలెక్టరేట్ వరకు పాదయాత్ర మహేశ్వరం: మండల పరిధిలో గుంతలమైన రోడ్లను ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో మహేశ్వరం–కలెక్టరేట్ వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యం కారణంగా గ్రామాలు, తండాల్లో రోడ్ల దుస్థితి దారుణంగా తయారైందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంన ఉంచి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. హ్యామ్ కింద మంజూరైన 12 రోడ్ల నిర్మాణాలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం మహేశ్వరం మండల కేంద్రంలో ప్రారంభమైన పాదయాత్ర మహేశ్వరం గేటు, శ్రీశైలం జాతీయ రహదారి, శ్రీనగర్, తుక్కుగూడ, రావిర్యాల మీదుగా కొంగర కలాన్ కలెక్టరేట్ కార్యాలయం చేరుకొని కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, బీజేపీ జాతీయ కిసాన్‌మోర్చా నాయకులు పాపయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్, కొప్పు బాషా, సుదర్శన్‌రెడ్డి, అనంతయ్య గౌడ్, చంద్రయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు దేశ్యా నాయక్, యాదయ్య గౌడ్, వెంకటేష్, సుదర్శన్, పాండు నాయక్, మండల బీజేపీ అధ్యక్షుడు యాదీశ్ పలువురు నాయకులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి -
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ యాదగిరి చేవెళ్ల: మున్సిపల్ పరిధిలో అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బి.యాదగిరి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు మున్సిపల్ నిబంధనలు పాటించాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో ఏ విధమైన నిర్మాణం చేపట్టినా.. తెలంగాణ బిల్డింగ్ అండ్ లేఔట్ అప్రూవ్డ్ సిస్టమ్ ద్వారా ముందస్తు అనుమతి పొందిన తరువాతే పనులు ప్రారంభించాలన్నారు. అనుమతి పత్రంలో పేర్కొన్న ప్లాన్, కొలతల ప్రకరామే నిర్మాణాలు ఉండాలన్నారు. అనుమతి పొందిన దానికి విరుద్ధంగా నిర్మిస్తే సహించేది లేదన్నారు. అట్టి నిర్మాణాలను నోటీసులు లేకుండా కూల్చివేసేందుకు సిపార్సు చేయబడుతుందని గమనించాలన్నారు. టౌన్‌ప్లానింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మున్సిపల్ చట్టం–2019 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయటంతోపాటు భారీ జరిమానాలు విధిస్తామని చెప్పారు. అక్రమ నిర్మాణాలకు నీటి కనెక్షన్లు ఉంటే తొలగిస్తామన్నారు. ప్లాట్లు, లేదా ఇళ్లు కొనుగోలు సమయంలో ఆయా నిర్మాణాలకు, మున్సిపల్ అనుమతులు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని కోరా రు. అనుమతులు లేని అక్రమ నిర్మాణాలను కోనుగోలు చేసి నష్టపోవద్దని ప్రజలకు సూచించారు. -
కీలక ఆధారాలు లభ్యం!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా నేదునూరు గ్రామంలో జరిగిన రియల్ఎస్టేట్ వ్యాపారి బాణాల రాంరెడ్డి ఆత్మహత్య ఘటన సంగారెడ్డి జిల్లాలోనూ కలకలం రేపింది. ఈ ఆత్మహత్యకు కారణం పటాన్చెరు ప్రాంతంలోని ఓ భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ భూ వివాదాలే కారణమని ప్రాథమికంగా తేలడం చర్చనీయాంశంగా మారింది. రాంరెడ్డి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు అందులో కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. రామేశ్వరం బండ ప్రాంతంలో రాంరెడ్డి సుమారు 200 ఎకరాలకు భారీ వెంచర్ వేశారు. ఈ వెంచర్ భూవివాదాలే ఆత్మహత్యకు దారితీశాయని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నట్లు సమాచారం. వాయిస్ రికార్డులో కీలక అంశాలు.. పోలీసులు స్వాధీనం చేసుకున్న రాంరెడ్డి సెల్ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డుల్లో కీలక అంశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన డెవలప్‌చేస్తున్న వెంచర్‌కు సంబంధించిన భూమి యజమానులకు ఈ వాయిస్ రికార్డులు పంపినట్లు సమాచారం. ఈ భూవివాదాన్ని పరిష్కరించుకునేలా చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని ఈ రికార్డుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధిత భూమి యజమానుల నుంచి స్పందన లేకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు భావిస్తున్నారు. ఈ వెంచర్‌కు భూములను హెచ్ఎండీఏ క్లియరెన్స్‌ల కోసం ఇప్పటికే ఆయన రెండు, మూడు పర్యాయాల్లో సుమారు రూ.28 కోట్ల వరకు వెచ్చించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. కాగా రాంరెడ్డి క్షేత్రస్థాయి నుంచి అంచెలంచెలుగా ఆర్థికంగా ఎదిగారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ వెంచర్‌తోపాటు, పటాన్చెరు ప్రాంతంలో మరికొన్ని వెంచర్లు అభివృద్ధి చేశారు. రాంరెడ్డి దగ్గరి బంధువుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఈ వెంచర్లో పెట్టుబడులు పెట్టి వివాదంలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల ప్రమేయంపైనా ప్రచారం! ఈ కేసులో రాంరెడ్డికి ఉన్న ఆర్థిక ఇతర ఇబ్బందులు ఒక అంశమైతే.. పటాన్‌చెరుకు చెందిన ప్రజాప్రతినిధుల వేధింపులు కూడా మరో కారణమనే ప్రచారం జరుగుతోంది. ఈ వెంచర్‌కు సంబంధించి స్థానిక కీలక ప్రజాప్రతినిధులు వాటాలు, పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ భూముల జోన్ మార్పిడి వ్యవహరంలోనూ ఈ ప్రజాప్రతినిధులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని అధికారులకు సిఫార్సులు చేసినట్లు సంబంధిత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వెంచర్ భూవివాదంలో పోలీసు అధికారి పాత్ర కూడా తెరపైకి వస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన ఓ పోలీసు అధికారి ఈ భూవివాదాల్లో కలగజేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. సదరు పోలీసు అధికారి సెటిల్మెంట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. కలకలం రేపిన రియల్ వ్యాపారి రాంరెడ్డి ఆత్మహత్య పటాన్చెరు సమీప వెంచర్ భూ వివాదాలే కారణం! పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లో కీలక అంశాలు -
ఆ నేతలకే ‘ఫ్యూచర్’ ఉండదు
ఇబ్రహీంపట్నం: ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదన్న నేతలకే ఫ్యూచర్ ఉండదని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రాణాలు తీసే ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలనుకుంటే.. ప్రజాప్రభుత్వం దాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ స్థానంలో హైదరాబాద్‌కు ధీటుగా జిల్లాలో ఫోర్త్ సిటీ నిర్మాణం చేపట్టిందన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్యూచర్ సిటీ ఉండదని, పెట్టుబడులు పెట్టొదని బెదిరింపు ప్రసంగాలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. శాసనసభలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
అందుబాటులోకి హైడ్రా పోర్టల్
ప్రారంభించిన కమిషనర్ రంగనాథ్ ● ‘1070’తో 24 గంటలూ హెల్ప్లైన్సాక్షి, సిటీబ్యూరో: హైడ్రా అధికారిక పోర్టల్ (https://hydraa.telangana.gov.in) శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ తన కార్యాలయంలో ప్రారంభించారు. దీంతో ఈ విభాగం అందిస్తున్న సేవల వివరాలతో పాటు కార్యకలాపాలను తెలుసుకునే అవకాశం ఏర్పడింది. చెరువుల హద్దులు, కాలువల లెక్కలు, ప్రభుత్వ భూముల వివరాలు, విపత్తు నిర్వహణ సమాచారంతో పాటు హైడ్రా కార్యకలాపాలన్నీ ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. 24 గంటలూ అందుబాటులో ఉండే అత్యవసర హెల్ప్‌లైన్ ‘1070’ వివరాలను పోర్టల్‌లో పొందుపరిచారు. చెట్లు కూలిపోవడం, అగ్ని ప్రమాదాలు, రహదారులపై నీరు నిలవడం, వరదలు, సహాయక చర్యలు, ఇతర విపత్తు సంబంధిత అత్యవసర పరిస్థితులపై పౌరులు ఈ నంబరుకు సమాచారం ఇవ్వొచ్చు. హైడ్రా పోర్టల్ ద్వారానే ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉంది. భవన యజమానులు, నిర్మాణదారులు దరఖాస్తు చేసుకోవడంతో పాటు అది ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. భారీ వర్షాలు, వరదల సమయంలో నీరు నిలిచే అవకాశం ఉన్న కీలక ప్రాంతాల వివరాలను ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. చెరువుల ఎఫ్టీఎల్, నిబంధనలు.. మూడు కమిషనరేట్లలోని వాటర్‌లాగింగ్, వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్‌లను వేర్వేరుగా చూడవచ్చు. దీంతో భారీ వర్షాల సమయంలో అధికారులు పర్యవేక్షించే ముఖ్య ప్రాంతాలను పౌరులు ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ పోర్టల్ ద్వారా లైవ్ రైన్‌ఫాల్ మ్యాప్స్, రోజువారీ వర్షపాతం వివరాలు, వాతావరణ అంచనాలు, హైదరాబాద్ డాప్లర్ రాడార్ సమాచారం అందుబాటులో ఉంటుంది. హైడ్రా వెబ్సైట్ ద్వారా హెచ్ఎండీఏ లేక్ పోర్టల్‌ను సందర్శించి చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ వివరాలను తెలుసుకోవచ్చు. చెరువులు, ఇతర జలాశయాల చుట్టూ అమల్లో ఉండే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిబంధనలూ ఇందులో ఉంటాయి. చెరువుల సమీపంలో భవన నిర్మాణం లేదా ఇతర అభివృద్ధి పనులు చేపట్టే ముందు వర్తించే నిబంధనలను తెలుసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. -
ఇక పేర్ల తొలగింపే!
● ఈ నెలాఖరులోగా నమోదు చేయకపోతే కార్డు రద్దు ● ‘సాక్షి’తో సివిల్ సప్లయ్ అధికారి వనజాత స్పష్టీకరణ సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ఈకేవైసీ కోసం రేషన్‌షాపునకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి.. చేతిలోని మొబైల్ ఫోన్లో మై రేషన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, ఓటీపీ ఆధారంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు’అని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి వనజాత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. పోర్ట్ల్లో రెడ్‌మార్క్ రెండోసారి ఆధార్ అప్డేషన్ తర్వాత ఐదేళ్లు దాటిన పిల్లలు ఈకేవైసీ చేయించలేదు. కార్డులో పేరు ఉన్నప్పటికీ.. పోర్ట్ల్లో రెడ్‌మార్క్ ఉండడంతో బియ్యం సరఫరా నిలిపివేయాల్సి వచ్చింది. వీరంతా సెప్టెంబర్ 30లోగా ఈకేవైసీ చేయించుకోవాలి. లేదంటే వారిని కూడా చనిపోయిన వారి జాబితాలో చేర్చి, కార్డు నుంచి పేరును తొలగించాల్సి వస్తుంది. స్మార్ట్‌కార్డులు సిద్ధం ప్రస్తుతం ఉన్న కాగితపు కార్డుల స్థానంలో ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్‌కార్డులను పంపిణీ చేస్తోంది. డెబిట్‌కార్డు/ఏటీఎం కార్డు పరిమాణంలో ప్లాస్టిక్ పీవీసీ రూపంలో ఉంటుంది. ఇప్పటికే 6,68,571 కార్డులను ముద్రించాం. ఆగస్టు 15న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ స్మార్ట్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం అంగన్వాడీలు, పంచాయతీ కార్యదర్శులు వీటిని పంపిణీ చేస్తున్నారు. దొడ్డు బియ్యం విక్రయానికి టెండర్ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతీ సభ్యుడికి నెలకు ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. దీంతో దొడ్డు బియ్యం సరఫరా నిలిచిపోయింది. అంతకు ముందే మిల్లర్ల నుంచి సేకరించి, రేషన్ షాపులకు సరఫరా చేసిన 1,900 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం డీలర్ల వద్ద మిగిలిపోయింది. ఈ బియ్యాన్ని విక్రయించేందుకు ఈ టెండర్ పిలిచాం. కేజీకి రూ.21.60 ధర నిర్ణయించాం. త్వరలోనే గిడ్డంగులు, రేషన్ దుకాణాల్లో మిగిలిన బియ్యాన్ని విక్రయిస్తాం. అక్రమార్కులపై ఉక్కుపాదం ‘మార్కెట్లో బియ్యానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొంత మంది అక్రమ దందాకు తెరలేపారు. లబ్ధిదారులు, డీలర్ల నుంచి తక్కువ ధరకు సేకరించి, సరిహద్దులు దాటిస్తున్నారు. వారిపై ఉక్కుపాదం మోపుతున్నాం. జులై, ఆగస్టు మాసా ల్లో 400 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నాం. వాటిని కూడా వేలం వేస్తాం’అని వనజాత స్పష్టం చేశారు. చౌకధరల దుకాణాలు 936 ఆహార భద్రత కార్డులు 6,75,072 మొత్తం లబ్ధిదారులు 23,03,793 ఈకేవైసీ పూర్తయినవి 17,72,983 పూర్తి కానివి 5,30,810 ప్రతినెలా బియ్యం పంపిణీ 14,379 మెట్రిక్ టన్నులు ముద్రించిన స్మార్ట్‌కార్డులు 6,68,571 స్మార్ట్‌కార్డుల పంపిణీ ఇబ్రహీంపట్నంలో ఆగస్టు 15న -
పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్
కడ్తాల్: పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ అని విశ్రాంత ఐఏఎస్ అధికారి జగదీశ్ శర్మ అన్నారు. సీజీఆర్ పర్యావరణ సంస్థ–తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నిర్వహించిన (లీడ్ ఎర్త్ లీడర్) రెండు రోజుల శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో తీసుకువస్తున్న వినూత్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. పాఠశాలలు పర్యావరణ చైతన్య కేంద్రాలుగా మార్చాలనే ఆలోచన అభినందనీయమన్నారు. లీడ్ ఎర్త్ లీడర్స్ అనే పేరులోనే నాయకత్వ లక్షణం ఉందన్నారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తలుచుకుంటే గ్రామ భవిష్యత్‌ను మార్చేయగలడని చెప్పారు. ఎర్త్ క్లబ్ అంటే ఉద్యమమని పాఠశాలల్లో పిల్లల చేత మొక్కలు నాటించి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. సేంద్రియ తోటలను పెంచడం, వర్షం నీటిని సంరక్షించడం, నీటి సంరక్షణ, అటవీ పరిరక్షణ, వ్యర్థాల నిర్వాహణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, కిచెన్గార్డెన్ల ఏర్పాటు, హరితహారం, జీవవైవిధ్యం, సోలార్ ఎనర్టీ వంటి అంశాలపై ఆచారణత్మతక శిక్షణ ఇచ్చారు. అనంతరం శిక్షణలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, ఫౌండర్ లక్ష్మారెడ్డి, విద్యావేత్త ఉపేందర్‌రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ మాధవరెడ్డి, వైఈఎల్పీ కోఆర్డినేటర్ వెంకట్‌రెడ్డి, విశ్రాంత డీఈఓ వెంకటేశ్వర్లు, పర్యావరణ వేత్త ఉమామహేశ్వర్‌రెడ్డి, నవ్య, నగేశ్, రజనీకాంత్, వైష్ణవి, మహాలక్ష్మి, మద్దిలేటి, శివ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రూ.1.5 కోట్ల హష్ ఆయిల్ పట్టివేత
కందుకూరు: మహేశ్వరం జోన్ పరిధిలోని కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో రూ.1.50 కోట్ల విలువైన 11 కేజీల హష్ ఆయిల్ పట్టుబడింది. ఈ మేరకు శుక్రవారం కందుకూరు ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. లంబసింగి నుంచి ఖమ్మం, మిర్యాలగూడ, దేవరకొండ, కల్వకుర్తి మీదుగా కందుకూరు వైపు నుంచి హైదరాబాద్‌కు హష్ ఆయిల్ తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు, కందుకూరు పోలీసులు సంయుక్తంగా శుక్రవారం ఉదయం శ్రీశైలం జాతీయ రహదారిలోని నవారుబాల్రెడ్డి ఫంక్షన్‌హాల్ ఎదుట వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో టీఎస్07 హెచ్‌టీ 6393 నంబర్‌తో ఉన్న మారుతి స్విఫ్ట్ కారును ఆపి తనిఖీ చేశారు. కారులో ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన మెరుపోజు రవివర్మ, జర్పలు లోకేశ్, సయ్యద్ సోహెల్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని వారి వద్ద బ్యాగులను తనిఖీ చేయగా 11 ప్యాకెట్లలో నల్లటి రంగులో ఉన్న పదార్థాన్ని గుర్తించారు. సాధారణంగా 50 కేజీల గంజాయి నుంచి ఒక లీటరు ఆయిల్ వస్తుంది. ఇలా 11 కేజీల కోసం 550 కేజీల గంజాయి వాడినట్లు తెలిసింది. హష్ ఆయిల్ సహా రెండు మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చిన రవి వర్మ చదువు మధ్యలో ఆపి మద్యం, డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలో లంబసింగికి చెందిన డ్రగ్ పెడ్లర్ బన్నీతో పరిచయం పెంచుకుని ఈ అక్రమ రవాణాకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ విలేకరుల సమావేశంలో ఏసీపీ జానకిరెడ్డి, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఓటీ ఎస్ఐ సురేశ్ తదితరులు ఉన్నారు. -
నాలాలపై నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు
ఇరిగేషన్ డీఈ జలంధర్ శంకర్పల్లి: నాలాలపై అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డీఈ జలంధర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని మోకిల, కొండకల్ గ్రామాల్లో పర్యటించి, ఫిరంగి, పెద్ద నాలాలని పరిశీలించారు. పలుచోట్ల అక్రమణకు గురైన నాలాని గుర్తించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ.. సహజసిద్ధంగా ప్రవహించే నీటిని అడ్డుకోవడం నేరమన్నారు. దీనిపై త్వరలోనే రెవెన్యూ అధికారులతో సంయుక్తంగా సర్వే చేపట్టి, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పరిశీలనలో మోకిల సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్, వార్డు సభ్యులు అజాం, ఇరిగేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సాంస్కృతికశాఖ జిల్లా కోకన్వీనర్ నరేందర్‌రెడ్డి కేశంపేట: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని బీజేపీ సాంస్కృతికశాఖ జిల్లా కోకన్వీనర్ కర్రెడ్ల నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిఽధిలోని సంతాపూర్‌లో ఎండిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాభావ ప్రభావంతో పంటలు ఎండి రైతులు ఆర్ధికంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంటలను పరిశీలించి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించి సాగుకు ఆర్థిక సాయం అందజేయాలన్నారు. ప్రధాన మంత్రి ఫసల్‌భీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి ఉంటే నష్ట పరిహారం అందించే వీలుండేదని అన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం ఫసల్‌భీమా యోజన అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. శంకర్పల్లి: పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను శుక్రవారం చేవెళ్ల డిప్యూటీ డీఎంహెచ్ఓ రాధిక తనిఖీ చేశారు. రోగుల వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఆసుపత్రుల్లోని రికార్డులు, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, పరిశుభ్రత వంటి విషయాలను పరిశీలించి మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో శంకర్పల్లి మండల వైద్యాధికారి డాక్టర్ రేవతిరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: జిల్లాలో వరి ధాన్యం సేకరణకు 129 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వరి కొనుగోలుపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్లు సేకరించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కవిత, జిల్లా మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
స్థానికంగానే పంచాయతీల లావాదేవీలు
యాచారం: గ్రామ పంచాయతీల ఆర్థిక లావాదేవీలు ఇక మీదట స్థానిక బ్యాంకుల్లోనే జరిపేలా దృష్టి సారించాలని.. తద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు జాన్‌వెస్లీ, నాగేశ్వర్రావు అన్నారు. శుక్రవారం వారు పంచాయతీల ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలపై అధ్యయనం కోసం యాచారం గ్రామ పంచాయతీని సందర్శించారు. ప్రస్తుతం పంచాయతీల్లో వసూళ్లు చేసే పన్నులను ఎస్టీఓల్లో జమ చేయడం, ఆ తర్వాత అత్యవసర పరిస్థితుల్లో డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో పంచాయతీల్లో సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో వసూలు పన్నులను స్థానిక నేషనల్ బ్యాంకుల్లో జమ చేసి, చెక్కుల రూపంలో అవసరం ఉన్నప్పుడు డ్రా చేయడం వల్ల సులభంగా సేవలు పొందవచ్చన్నారు. ప్రతీ పైసను బ్యాంకుల్లో జమ చేసి రికార్డులు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్, ఇబ్రహీంపట్నం, కందుకూరు డివిజన్ల పంచాయతీ అధికారులు సాధన, సామిరెడ్డి, యాచారం పంచాయతీ కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు జాన్‌వెస్లీ, నాగేశ్వర్రావు -
వ్యాపారి అదృశ్యం
మీర్‌పేట: ఇంట్లోంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శోభన్ తెలిపిన ప్రకారం.. మీర్‌పేటకు చెందిన పెద్దయ్య కుమారుడు చెంగల బంగారి (41) వ్యాపారి. ఈ నెల 8వ తేదీన ఆఫీసుకు వెళ్తున్నానని భార్యకు చెప్పి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం ఎక్కడ వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం కుటుంబ సభ్యులు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి షాద్‌నగర్: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేశంపేట మండలం బొదనంపల్లికి చెందిన శేఖర్, మాజీ ఉప సర్పంచ్ లింగారెడ్డి ఎమ్మెల్సీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజలకు కష్టాలు తప్ప మేలు జరిగిందేమీ లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ పంతులు, తాండ్ర విష్ణువర్ధన్‌రెడ్డి, యారం శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంజాయి చాకెట్లు స్వాధీనం కొత్తూరు: పట్టణంలో అక్రమంగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఓటీ, స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకితీసుకున్నారు. 8వ వార్డులోని హనుమాన్ ఆలయం సమీపంలో నివసిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన భోలా(45) తన ఇంట్లోనే కిరాణా దుకాణం ఏర్పాటు చేసి నిషేధిత గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సోదాలు నిర్వహించి, 70 చాక్లెట్లు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
నాణ్యమైన విద్యుత్ వైర్లు ఉపయోగించాలి
గణేశ్ మండపాలను విద్యుత్ తీగలకు తగినంత దూరంలో ఏర్పాటు చేయాలి. నాణ్యమైన విద్యుత్ వైర్లను ఉపయోగించి లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. షార్ట్ సర్క్యూట్లు, షాక్ నివారణకు ఈఎల్సీబీ, ఆర్సీసీబీ పరికరాలు ఉపయోగించాలి. – వినోద్‌కుమార్, ఏఈ, షాద్‌నగర్ టౌన్ వినాయక మండపాల ఏర్పాటుకు విధిగా అనుమతులు తీసుకోవాలి. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. డీజేలు, అధిక శబ్దాలు వచ్చే స్పీకర్లు పూర్తిగా నిషేధం. ప్రశాంత వాతావరణలో ఉత్సవాలను జరుపుకోవాలి – శిరీష, డీసీపీ, షాద్‌నగర్ -
రైతును రాజును చేసింది వైఎస్సార్
● ఉద్యానపంటల సాగుకు ప్రోత్సాహం అవసరం ● రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కేశంపేట: ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తెచ్చి ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సంగెం గ్రామంలో యెన్నం గోపాల్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధ్వర్యంలో మామిడి రైతులకు సమగ్ర సస్యరక్షణపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ రైతును రాజుగా చేశారని అన్నారు. ఉచిత విద్యుత్, రుణమాఫీతో రైతులను ఆర్థికంగా ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు రుణమాఫీ చేసి ఉచిత విద్యుత్ ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పంటలకు బోనస్ సైతం అందజేస్తుందన్నారు. ఉద్యాన పంటల అమ్మకాల కు సమీపంలోనే మార్కెటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేరళం రాష్ట్రంలో మండలానికి ఒక మార్కెట్ ఉంటుందని, అక్కడ పంట విక్రయించిన వెంటనే రైతు అకౌంట్లో నేరుగా డబ్బు జమ చేస్తున్నారని.. మన రాష్ట్రంలోనూ అలాంటి వ్యవస్థ ఉండాలని ఆకాంక్షించారు. ఉద్యానపంట ల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఉద్యాన, పట్టుపరిశ్ర మ శాఖ అధికారి సురేశ్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీకృష్ణ, ఉద్యానశాఖ అధికారి హిమబిందు, మండల విద్యుత్ అధికారి ఈశ్వర్, సర్పంచ్‌లు సురేశ్‌రెడ్డి, వేణుగోపాలచారి, బాబునాయక్, ఏఈఓలు నిఖిల్, రాజేశ్వరి, సుధ, రైతులు లింగారెడ్డి, నర్సింహ, రమేశ్‌రెడ్డి, జంగయ్య, వెంకన్న, పుండరీకం తదితరులు పాల్గొన్నారు. -
Video: హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: బాటసింగారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో ఆటోను తప్పించబోయి.. పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో రెండు కార్లు, ఆటో ధ్వంసమయ్యాయి. దిల్సుఖ్నగర్ డిపో బస్సు.. చౌటుప్పల్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. బంక్‌లోని డీజిల్ పంపు వరుకు దూసుకెళ్లడంతో పరికరాలు కూడా విరిగిపడ్డాయి. బంక్ సిబ్బంది, అక్కడ ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు.కామారెడ్డి జిల్లాలో..కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ రైల్వే గేటును ఆటో ఢీకొట్టింది. దేవగిరి ఎక్స్‌ప్రెస్ కోసం గేటు వేస్తుండగా ఘటన జరిగింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. రైల్వే గేట్ ధ్వంసం కావడంతో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.సూర్యాపేట జిల్లాలో..సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజి వద్ద లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన భోజనం కోసం ఆపిన రెండు లారీలను మరో లారీ బలంగా ఢీకొట్టింది. డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి విజయనగరం వెళ్తుండగా ఘటన జరిగింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. జాతీయ రహదారి-65 పై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. -
తుదిమెరుగుల్లో మహా గణపతి
రేపు నేత్రోనిలనంఖైరతాబాద్: శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతిగా కొలువుదీరనున్న ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులు దాదాపు పూర్తయ్యాయి. మట్టితో రూపుదిద్దుకుంటున్న మహాగణపతికి శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ఆధ్వర్యంలో తుది మెరుగులు దిద్దుతున్నారు. 14న వినాయక చవితికి రెండు రోజుల ముందే మహాగణపతి సంపూర్ణంగా తయారై భక్తులకు దర్శనమిచ్చేలా పనులు వేగిరం చేశారు. విగ్రహానికి శుక్రవారం కంటి పాప (నేత్రోనిలనం) అమర్చి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. మహా గణపతి దర్శనానికి వచ్చే భక్తులకు 12 రోజుల పాటు 9 రకాల ప్రసాదాలను అందజేస్తామని బుధవారం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కమిటీ సభ్యులు తెలిపారు. -
డబ్బులు అడిగినందుకు కత్తితో దాడి
పరిగి: డబ్బులు అడిగినందుకు ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గౌస్, నందు మిత్రులు. సెంట్రింగ్ పనులు కలిసి, విడిగా చేస్తుంటారు. ఇటీవల నందు వికారాబాద్‌లో ఓ సెంట్రింగ్ పనిని గుత్తకు తీసుకున్నాడు. పని సక్రమంగా చేయకపోవడంతో నిర్వాహకులు గౌస్‌కు అప్పగించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. పాత బకాయి, ఎన్నెపల్లిలో పని చేసిన డబ్బులు ఇవ్వాలని గౌస్ నిత్యం నందును అడగ సాగాడు. గతంలో ఇద్దరు కలిసి కొన్ని పనులు చేయగా అందులో గౌస్ లెక్క తేలాల్సి ఉందని గ్రామస్తులు తెలిపారు. గౌస్ తరచూ నందును డబ్బులు అడగడం, రోడ్లపై నిలదీస్తుండటంతో నందు కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బర్కత్‌పల్లి రోడ్డు పక్కన కూర్చున్న గౌస్‌తో నందు గొడవకు దిగి కత్తితో దాడి చేశాడు. గౌస్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని
మేస్త్రీ ఆత్మహత్య మొయినాబాద్: మద్యం తాగి వచ్చిన మేస్త్రీ భార్యను డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ఘనపురం గ్రామానికి చెందిన లేగల బుచ్చయ్య(45) భార్య, పిల్లలతో కలిసి మొయినాబాద్‌లో అద్దెకు ఉంటూ మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు మద్యం తాగే అలవాటు ఉంది. బుధవారం ఉదయం పనికోసం మొయినాబాద్‌లోని అడ్డమీదకు వెళ్లాడు. ఉదయం 10 గంటల వరకు పని దొరక్కపోవడంతో మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న బుచ్చప్ప భార్య భాగ్యమ్మను డబ్బులు ఇవ్వాలని అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని.. సాయంత్రం ఇస్తానని చెప్పడంతో ఇంట్లోని గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో భార్యకు అనుమానం వచ్చి తలుపులు తట్టింది. ఎలాంటి స్పందన రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూసే సరికి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘనటా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మొయినాబాద్ రూరల్: ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎం చేపట్టిన అసెంబ్లీ ముట్టడిలో పోలీసుల లాఠీచార్జీ ఎంతవరకు సమంజసమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనలో గాయపడిన బీజేవైఎం నాయకుడు శ్రీకాంత్‌ను బుధవారం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నాయకుడు ప్రభాకర్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. ఉద్యమ ఉధృతి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే పోరాటం అభినందనీయమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, బట్టు జ్ఞానేశ్వర్, రెడ్డిపల్లి సర్పంచ్షాపురం రాజు, బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. -
ముదిరిన పోరు
మాటల తూటాలు..అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో షాద్‌నగర్, మహేశ్వరం నియోజకవర్గ నేతల తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అసెంబ్లీ వద్ద నిరసన నేపథ్యంలో ఇక్కడి నేతలు వ్యవహరించిన తీరు, పరస్పర వ్యాఖ్యలు, విమర్శలు వేడెక్కిస్తున్నాయి. దీంతో ఈ రెండు నియోజకవర్గాలు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాయి.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పెరిగిన పొలిటికల్ హీట్ రాష్ట్ర వ్యాప్తంగా షాద్‌నగర్, మహేశ్వరం నియోజకవర్గాలపై చర్చ నేతల కామెంట్లతో కాకరేపుతున్న రాజకీయం -
ప్రకృతి వ్యవసాయమే మేలు
● వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ● కలెక్టరేట్లో కిసాన్ మేళాకు విశేష స్పందన ఇబ్రహీంపట్నం రూరల్: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి సూచించారు. బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో కొంగరకలాన్‌లోని ఐడీఓసీలో జిల్లా స్థాయి కిసాన్మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు పంటల వైవిధ్యీకరణ, ప్రత్యామ్నాయ పంటలు, సుస్థిర వ్యవసాయం, ఆధునిక వ్యవసాయ సాంకేతికలు, వివిధ వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు . ఈ సందర్భంగా ముదిరెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలు అమలు చేస్తున్న అన్ని పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేపట్టాలని సూచించారు. సుస్థిర, లాభదాయక వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తామన్నారు. అనంతరం కొహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కొహెడ మార్కెట్ నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత ఆధునికతతో రూపుదిద్దుకుంటుందని, త్వరలోనే రైతులకు అందుబాటులోకి వస్తుందన్నారు. అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. రైతులకు భూసార పరీక్షపై అవగాహన అవసరం అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పీడీ మధుమోహన్, కేవీకే హయత్‌నగర్ శాస్త్రవేత్తలు పంటల వైవీధ్యీకరణ, ప్రత్యామ్నాయ పంటలపై సాంకేతిక సూచనలు అందించారు. కిసాన్ మేళాలో ఉద్యాన, పట్టు పరిశ్రమ, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు రైతుల ఆధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేలా 15 స్టాల్స్ ఏర్పాటు చేశారు. అతిథులు స్టాల్స్‌ను పరిశీలించారు. భూసార పరీక్షలపై కొంగరకలాన్ పాఠశాల విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు. -
అభివృద్ధిలో కలిసి సాగండి
● చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ● మున్సిపాలిటీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభం చేవెళ్ల: మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. 17 వార్డు రంగారెడ్డి కాలనీలో 50 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను బుధవారం స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి, కౌన్సిలర్లుతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటి అభివృద్ధికి కావాల్సిన నిధులు విడుదల చేయిస్తానని తెలిపారు. కొత్త మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసేందుకు కలిసి పనిచేయాలని పాలకవర్గానికి సూచించారు. ఏన్నో ఏళ్లుగా ఉన్న రంగారెడ్డి కాలనీలోని సీసీ రోడ్డు సమస్య తీరడంతో కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. రోడ్డు నాణ్యతతో వేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపాల్ పాలకవర్గం సభ్యులు, అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. టీయూటీఎఫ్డీసీ నిధులు మంజూరు ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో మున్సిపాలిటీకి రూ.28.5కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులు మంజూరైనట్లు చైర్పర్సన్ దేవర సమతారెడ్డి తెలిపారు. ఈ నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, పారిశుద్ధ్య పనులు పూర్తి చేస్తామాన్నరు. తెల్లవారుజామున పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన పనులను పరిశీలించి, సూచనలు చేశారు. -
చోరీ సొత్తు రికవరీ
అనంతగి: దొంగతనం కేసుల్లో నిందితులను అరెస్టు చేయడంతోపాటు చోరీ సొత్తు రికవరీ చేస్తామని అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో అంతర్రాష్ట్ర దొంగ వికాస్ సింగ్ కేసు వివరాలను వెల్లడించారు. వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికంఠ నగర్ కాలనీలో మే ఒకటో తేదీ రాత్రి ఓ ఇంట్లో బంగారం, నగదు చోరీకి గురైంది. కేసు విచారణ చేపట్టిన జిల్లా సీసీఎస్, వికారాబాద్ టౌన్ పోలీసులు జూన్ 4న వికాస్ సింగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టు అనుమతితో నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా అనేక విషయాలు బయటికి వచ్చాయి. వికాస్ సింగ్‌పై వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 కేసులు, పరిగి పీఎస్ పరిధిలో ఒక కేసు ఉంది. ఈ కేసులకు సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్పూర్ జిల్లా కుడువర్ పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో తన తల్లి ద్వారా తనఖా పెట్టిన సుమారు 25 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. అశోక్ కుమార్ సోనీ, వికాస్ అగ్రహారి తదితరుల బంగారం దుకాణాల నుంచి దొంగ సొత్తును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కేసులో పురోగతి సాధించిన డీఎస్పీ అంజయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్, వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్‌ను ఎస్పీ అభినందించారు. అంతర్రాష్ట్ర దొంగ వికాస్ సింగ్ కేసులో పురోగతి యూపీలో 25 తులాల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా -
నాణ్యమైన విద్యను బోధించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సూచించారు. బుధవారం ఆమె మండల పరిధిలోని ఉప్పరిగూడ ప్రీప్రైమరీ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు బోధిస్తున్న తీరును తెలుసుకున్నారు. పౌష్టికాహార పంపిణీపై అంగన్వాడీ టీచర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్న ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల సంఖ్య పెంచేలా కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జాతీయ పోషణ అభియాన్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఐదవ తరగతిలో కూర్చుని పాఠాలు విన్నారు. టీచర్ సపోర్టు గ్రూపులుగా విభజించి వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని చెప్పారు. వర్ణమాల, గుణింతాలు రాని మూడు, నాలుగు, ఐదవ తరగతి విద్యార్థులను కేటగిరీలుగా విభజించి టైం టేబుల్ ఏర్పాటు చేసి పాఠాలు చెప్పాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీవేణి, ఎంఈఓ హీర్యానాయక్, ఐసీడీఎస్ సూపర్వైజర్ వినితాదేవి, హెచ్ఎం వీకే లక్ష్మీ, టీఆర్పీ రంగారెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు . అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి -
సబితారెడ్డిని కలిసిన చేవెళ్ల నేతలు
చేవెళ్ల: మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డిని చేవెళ్ల బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం నగరంలోని ఆమె నివాసానికి చేరుకుని పరామర్శించారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ సమాజం మండిపడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న మోసాలు, దౌర్జన్యాలపై గట్టిగా పోరాడాలని సూచించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆమెను కలిసిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.క్రిష్ణారెడ్డి, గోనె కరుణాకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కుర్వ మల్లేశ్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, తలారి యాదయ్య, డీఎం.చందు, వెంకటేశ్వర్‌రెడ్డి, దండు సత్యం, వెంకటేశ్, రామగౌడ్, క్రిష్ణారెడ్డి, రాజు, వెంకటేశ్వర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, కృష్ణ, రామకృష్ణారెడ్డి, మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు. ● ఉప్పల్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌పై కేసు సాక్షి, సిటీబ్యూరో: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో ఏకంగా పదకొండేళ్లు సహజీవనం చేసి మోసం చేసిన కానిస్టేబుల్ అరుణ్ కుమార్‌పై ఉప్పల్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తనకు ఇష్టం లేకుండా రెండుసార్లు గర్భస్రావం చేయించాడని, పెళ్లికి ముహూర్తాలు పెట్టి కూడా మరో యువతిని వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. గత నెల ఆఖరి వారంలో ఈ కేసు నమోదు కాగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌కు చెందిన యువతితో అరుణ్‌కుమార్‌కు 2013లో పరిచయమైంది. 2014లో అరుణ్‌కుమార్ తనను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అది నమ్మిన తాను అతడితో సన్నిహితంగా మెలిగానని తెలిపారు. ఈ ఏడాది నవంబరు 1న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. అరుణ్‌కుమార్ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో ఆగస్టు 24న ఉదయం సుమారు 7.30 గంటలకు అతడి ఇంటికి వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. అక్కడ వాచ్‌మెన్‌తో పాటు కుటుంబ సభ్యులను ఆరా తీయగా..అరుణ్‌కుమార్‌కు అప్పటికే పెళ్లయిపోయిందనే విషయం తెలిసిందని పేర్కొన్నారు. అతడు ఈ ఏడాది జూలై 1న మరో యువతిని వివాహం చేసుకున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని యువతి ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సత్తార్ అనంతగిరి: నర్సరీలు ఏర్పాటు చేసేవారు, ఇప్పటికే నిర్వహిస్తున్న వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎంఏ సత్తార్ ఆదేశించారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నర్సరీలను ఏర్పాటు చేయరాదన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని నర్సరీల యజమానులకు తెలంగాణ నర్సరీ చట్టంపై అవగాహన కల్పించారు. కూరగాయలు, పూలు, పండ్ల మొక్కల నారు పెంచుతున్న వారు ఉద్యాన శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన నారు సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు కమల, సురేంద్రనాథ్, యమున, సంతోష్ కుమార్, అక్షిత రెడ్డి, ఉద్యాన విస్తరణ అధికారులు పాల్గొన్నారు. పరిగి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పరిగి పోలీసులు పట్టుకున్నారు. అయితే గోప్యత పాటిస్తున్నారు. బుధవారం ఉదయం మండలంలోని రాఘవాపూర్ వద్ద ఓ వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఎన్ని క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు.. నిందితులు ఎవరు అనే విషయాలు వెల్లడించడం లేదు. దోమ: ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై ఆవు మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కుమ్మరికుంట తండాలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత రైతు కేతావత్ తుల్చా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. తన వద్ద ఉన్న పశువుల్లో ఓ ఆవు కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికాడు. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ సమీపంలో కరెంట్ షాక్‌కు గురై చనిపోయింది. ఆవు విలువ రూ.50 వేలు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
భగీరథ నీటిని పొదుపుగా వాడుకోవాలి
షాద్‌నగర్ రూరల్: ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని మిషన్ భగీరథ క్వాలిటీ కంట్రోల్ ఏఈఈ సునీల్ సూచించారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామంలో భగీరథ నీటి సరఫరా, క్వాలిటీ, క్వాంటిటీ, పంచాయతీ రికార్డులను పరిశీలించారు. గ్రామంలో మిషన్‌భగీరథ నీటి సరఫరా ఎలా ఉంది, ఇంటింటికి ఎన్ని రోజులకు ఒకసారి నీటి సరఫరా అవుతుంది, కుళాయిలు ఏ విధంగా పని చేస్తున్నాయనే విషయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం మిషన్ భగీరథ నీటిని అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఇంట్రా ఏఈఈ అభినవ్, పంచాయతీ కార్యదర్శి తేజస్విని, అంగన్వాడి టీచర్ రోజా తదితరులు పాల్గొన్నారు. క్వాలిటీ కంట్రోల్ ఏఈఈ సునీల్ -
అనుమతులు తీసుకోండి
మొయినాబాద్: గణేశ్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చేవెళ్ల డీసీపీ యోగేష్‌గౌతం అన్నారు. మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో బుధవారం గణేష్ ఉత్సవ కమిటీలు, గణేశ్ విగ్రహాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, విగ్రహం ఎత్తు, నిమజ్జనం చేసే తేదీ, ప్రదేశం తదితర వివరాలను పోలీస్ ప్రొటోకాల్ వెబ్సైట్లో నమోదు చేసి అనుముతు తీసుకోవాలన్నారు. ఉత్సవాల్లో శబ్ద కాలుష్యం లేకుండా నిబంధనలను పాటించాలన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గణేశ్ మండపాల్లో అగ్ని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలను పాటించాలని సూచించారు. మత సామరస్యాన్ని కాపాడుతూ ఊరేగింపులు నిర్వహించాలని తెలిపారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఊరేగింపులు, నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు పాటించి, సహకరించాలన్నారు. ఎవైనా అనుమానాస్పద కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో ఏసీపీ కిషన్, ఇన్స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి ఎస్హెచ్ఓలు, ఎస్సైలు, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవ కమిటీలకు డీసీపీ యోగేష్‌గౌతం సూచన ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని పిలుపు డీజేలు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిక ర్యాలీలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని వెల్లడి -
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం
తీవ్రంగా గాయపడిన విద్యార్థి షాబాద్: ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్షం కారణంగా ఓ విద్యార్థి కాలు విరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన విద్యార్థి జశ్వంత్ షాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆర్టీసీ బస్సులో పాఠశాలకు వెళ్లి వచ్చేవాడు. బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చేందుకు షాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో వేచియున్నాడు. షాద్‌నగర్ నుంచి రేగడి చిల్కమర్రికి వెళ్లే బస్సు బస్టాండ్‌లోకి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తుండగా బాలుడు బస్సు ఎక్కుతుండగానే ఒక్కసారిగా కదలడంతో కిందపడిపోయాడు. దీంతో అతడి కాలు మీదుగా బస్సు టైరు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఓప్రైవేట్ వాహనంలో క్షతగాత్రుడిని పాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. శంకర్పల్లి: పాఠశాలకి వెళ్లిన బాలుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన శంకర్‌పల్లిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ సురేశ్ తెలిపిన ప్రకారం.. రావులపల్లి కలాన్ గ్రామానికి చెందిన మల్లికార్జున్(16) శంకర్‌పల్లిలోని అన్నపూర్ణ మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం గ్రామంలో పాఠశాలకు వెళ్లేందుకు స్కూల్ బస్సు ఎక్కాడు. పాఠశాల దగ్గర బస్సు దిగిన విద్యార్థి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్రవాహనదారుడు మృతి అబ్దుల్లాపూర్‌మెట్: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, వెలువర్తి గ్రామానికి చెందిన మారబోయిన వినయ్(25) మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి బాటాసింగారం వైపు ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యలో ఇనాంగూడ బ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. పరిగి: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి చెరువు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన పరిగి మున్సిపల్ పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుడగజంగం హన్మంతు(42) కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి రాలేడు. ఉదయం గ్రామ సమీపంలోని చెరువు గట్టుపై చెప్పులు, దుస్తులు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి గాలించగా మృతదేహం లభించింది. మృతుడికి భార్య మేరమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. యాలాల: మండల కేంద్రంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామకంఠం పరిధిలో ఏర్పాటు చేసిన మంచినీటి బావితో పాటు రాకపోకలకు వినియోగించే దారి కబ్జాకు గురైందని యాలాల సర్పంచ్ శివయ్య, కాంగ్రెస్ నేత పేరి రాజేందర్‌రెడ్డి బుధవారం ఆరోపించారు. 1970 ప్రాంతంలో మంచినీటి బావిని తవ్వించారని, ప్రస్తుతం అది ఆక్రమణకు గురవుతోందన్నారు. బావిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. బావితో పాటు ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు గ్రామకంఠం పరిధిలో ఉన్న రహదారి సైతం పూర్తిగా ఆక్రమణకు గురై, నిత్యం ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి కబ్జా నుంచి బావి తోపాటు దారిని రక్షించాలని వారు కోరారు. అబిడ్స్: నాంపల్లిలో ఉన్న ఎగ్జిబిషన్ సొసైటీకి ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించేందుకు సొసైటీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. పాలక మండలిలో చోటు దక్కించుకునేందుకు రెండు ప్యాన్ళ్లు తమ అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. ప్రస్తుతం ఎగ్జిబిషన్ సొసైటీకి మంత్రి డి.శ్రీధర్‌బాబు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యద ర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారితో పాటు మేనేజింగ్ కమిటీలో ఈ ఏడుగురు సభ్యులను ఈ ఎన్నికల్లో ఓటింగ్ ద్వారా ఎన్నుకోనున్నారు. -
చర్చల్లో నిలిచిన మహేశ్వరం
మహేశ్వరం: తెలంగాణ శాసన సభ సమావేశాల సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్త చర్చకు తెరలేపాయి. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు నిసరనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్ల రంగు దుస్తులు ధరించి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. తనను జుట్టు, మెడపట్టి అడ్డుకున్నారని.. ఆమె తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం మాజీ హోంమంత్రిగా పనిచేసిన సబితారెడ్డిపై పురుష పోలీసులు దాడి చేశారని, ఆమె గొంతు పట్టుకున్న దృశ్యాలు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ఆరోపించారు. ఈ ఘటన మహిళా లోకానికి అవమానమని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని మండిపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆమె అనుచరులు, బీఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా ధర్నాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వం తీరుపై నిరసనలు వ్యక్తం చేశారు. గతంలోనూ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కతో వాగ్వాదం జరిగింది. నాటి సభలో సబితారెడ్డి కన్నీరు పెట్టుకున్న విషయం విదితమే. -
సెక్యూరిటీగార్డును ఢీకొట్టిన కారు
● యువకుడి దుర్మరణం ● బీటెక్ విద్యార్థి అరెస్ట్ ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో చోటు చేసుకోగా.. బుధవారం ప్రమాదానికి కారణమైన యువకుడిని అరెస్ట్ చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. రోహిత్సింగ్యాదవ్(22) మూడు రోజుల క్రితం కోహెడ రోడ్డులోని ఓ ఫంక్షన్ హల్లో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో డ్యూటీని ముగించుకుని శ్రీ గురు కాలేజీ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సీసీ టీవీ పుటేజీలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా ఎర్టిగా వాహనం అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపిస్తూ ఆయన్ను ఢీకొట్టినట్టు గుర్తించారు. సేకరించిన ఆధారాలతో ఈ ప్రమాదానికి కారకుడైన ఫిర్జాదిగూడకు చెందిన బీటెక్ విద్యార్థి వరుణ్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కేటీఆర్‌పై చర్యలకు ఫిర్యాదు
సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామ పంచాయతీలు సజావుగా సాగాలన్నా, నిర్వహణ సక్రమంగా ఉండాలన్నా ఉప సర్పంచ్ల జాయింట్ చెక్‌పవర్‌ను రద్దు చేయాలని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.శివశంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సర్పంచ్ల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ సునీల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిధులు, విధులు ఉండేవి సర్పంచ్‌లకు మాత్రమేనని వారికి మాత్రమే చెక్‌పవర్ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. పంచాయతీలకు రావాల్సిన మైనింగ్, స్టాంప్‌డ్యూటీ, సినరేజ్ ఫీజులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వెంటనే జాయింట్ చెక్‌పవర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే మరిన్ని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు గణేశ్, శ్రీనివాస్‌నాయక్, పద్మకృష్ణ, రవి, శ్రీనివాస్, రమేశ్ తేజ నాయక్, శంకర్, కోటేశ్వర్‌గౌడ్, చంద్రబాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ‘ప్రాజెక్ట్ ప్రగతి’ పేరిట 5 ప్రాంతాల్లో ఏర్పాటుసాక్షి, సిటీబ్యూరో: నగరంలో వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పనిచేస్తున్న గిగ్, డెలివరీ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం, జెప్టో సంస్థ సంయుక్తంగా ‘ప్రాజెక్ట్ ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా నగరంలో 5 ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందం కుదిరింది. 2024లో నిర్వహించిన ఒక సర్వేలో 69 శాతం మంది కార్మికులకు శుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవని, 80 శాతం మందికి విశ్రాంతి కోసం నీడ లేదా చల్లని ప్రదేశం లభించడం లేదని తేలింది. ఈ లోటును తీర్చేందుకు వారికి తగిన సదుపాయాలు కల్పిస్తూ ప్రాజెక్ట్ ప్రగతి పేరిట సదుపాయాల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల్లో విశ్రాంతి స్థలం, తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, వైఫై సౌకర్యం లభించనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ, జెప్టో సీఓఓ వికాస్ శర్మ, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, తదితరులు పాల్గొన్నారు. -
షాద్‌నగర్ చాలా హాట్ గురూ..!
● రాష్ట్ర రాజకీయాల్లో మార్మోగుతున్న నియోజకవర్గ పేరు ● కేసీఆర్‌పై హాట్ కామెంట్లు, అసెంబ్లీ వద్ద నిరసనలో దూకుడుగా ప్రవర్తించి వార్తల్లో నిలిచిన ఎమ్మెల్యే వీర్లపల్లి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి ● రసవత్తర రాజకీయ చరిత్రలో షాద్‌నగర్ షాద్‌నగర్: షాద్‌నగర్ నియోజకవర్గానికి ఆది నుంచే ప్రత్యేక చరిత్ర ఉంది. తాజా రాకీయ పరిణామాలతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మారో మారు రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు నేతల దూకుడు ఈ రాజకీయ చర్చలకు కారణమైంది. ఒకరు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాగా.. మరొకరు ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి. ఈ ఇద్దరు నాయకుల పోకడలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. వీర్లపల్లి నోట.. కేసీఆర్ మాట.. ఈ మాట చిన్నదే అయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ చావును కోరుకుంటున్నామంటూ’షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడడం వివాదాస్పదమై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ మాటలకు ఉలిక్కిపడిన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగింది. నేతలు సైతం ఎమ్మెల్యేను ఇష్టారాజ్యంగా దూషించారు. అయితే చివరికి ఈ అంశం అధిష్టానాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేయడంతో సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు పిండప్రదానం చేయడంతో ఎమ్మెల్యేకు కోపం వచ్చిదంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడ తాను ఫ్లోలో అలా మాట్లాడానని.. ఒకరి చావు కోరడం ఏమాత్రం సమర్థనీయం కాదంటూ మీడియాకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే గతంలో రాహుల్ గాంధీ ఎక్కడ సచ్చిండు అంటూ కేటీఆర్ చేసిన కామెంట్ల వీడియోలు ఎమ్మెల్యే ప్రదర్శించారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడిన మాటలు సంచలనానికి దారి తీసింది. ‘నవీన’పోకడలు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునేందుకు నియోజకవర్గ నాయకుడు ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి ముందుకెళ్తున్నారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఆందోళనలో నవీన్‌రెడ్డి పాత్ర అందరికి తెలిసిందే. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అతను చేసిన వ్యాఖ్యలు, పోలీసులపై అతను వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ సోషల్ మీడియా విమర్శలు గుప్పించింది. షాద్‌నగర్‌లో కాంగ్రెస్ నేతలు ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. స్పీకర్‌ను దూషించిన కేసులో ఎమ్మెల్సీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం అరెస్టులు, శాసన మండలిలో సస్పెండ్ చేయడం లాంటి సంఘటనలతో ఒక్కసారి నవీన్‌రెడ్డి వార్తల్లోకి ఎక్కాడు. గతంలో ఆయన ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను విమర్శించడం వివాదాస్పదం కావడం, ఇప్పుడు తన వ్యాఖ్యలతో మరోమారు వార్తల్లో నిలిచాడు. నాగర్‌కుంట నవీన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే, షాద్‌నగర్ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చోటు చేసుకున్న రాజకీయంలో ఇరువురూ నియోజకవర్గ నేతలే ఉండడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న శంకర్రావు సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేసి సంచలనంగా మారి వివాదాస్పదమయ్యాయి. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎర్రచందనం స్మగ్లర్ అంటూ కామెంట్ చేయడం, సబితారెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన సమయంలో సీనియర్‌ను పక్కకు పెట్టి ఆమెకు ఎలా ఇస్తారంటూ చేసిన వాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక రాజకీయ వేడితో షాద్‌నగర్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లో నిలుస్తుంది. -
సమాజాన్ని జాగృతం చేసిన కవి కాళోజీ
షాద్‌నగర్: సమాజాన్ని జాగృతం చేసిన కవి కాళోజీ నారాయణరావు అని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఉద్యమకారుల సంక్షేమ సంఘం భవనంలో కాళోజీ నారాయణ రావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాషకు, యాసకు కాళోజీ వన్నె తెచ్చారని కొనియాడారు. తెలంగాణ, స్వాతంత్య్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ఆదర్శంగా నిలిచారని చెప్పారు. తెలంగాణ ప్రజల హక్కులు, స్వాభిమానం, సామాజిక చైతన్యం కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకటేశ్, రవిగౌడ్, సునీల్‌రెడ్డి, విఠలయ్య, రాజు, శేఖర్, మల్లేశ్, ప్రభాకర్, సునీల్‌రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. టీజేఏసీ ఆధ్వర్యంలో.. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో అమరవీరుల స్థూపం వద్ద కాళోజీ జయంతిని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో తాలూక చైర్మన్ జనార్ధన్, నాయకులు కరుణాకర్, బాల్‌రాజ్, శ్రీనివాస్, శ్రీహరి, రామారావు, సుజీవన్, కృష్ణయ్య, వెంకటరమణ, క్రాంతికుమార్, రాము, వేణుగోపాల్, శ్రీధర్, ముబారక్, చందు, షర్ఫొద్దీన్, మనీశ్ పాల్గొన్నారు. ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి -
● కారును బైక్ ఢీకొట్టగా..
శంకర్పల్లి: అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఓ బైక్ ముందు యూ టర్న్ తీసుకునేందు కోసం ఆగిన కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ రుధ్వీర్ కుమార్ వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని చిన్న శంకర్‌పల్లికి చెందిన బార్మాల నిశాంత్ (19) ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం మంగళవారం బైక్‌పై స్నేహితుడు కంటేశ్ని తీసుకొని పటాన్చెరు వైపు వెళ్తున్నాడు. పట్టణ శివారులోని సురేందర్‌రెడ్డి హాలు వద్ద ఓ కారు శంకర్పల్లి వైపు యూటర్న్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. అతివేగం కారణంగా నిశాంత్ అదుపు తప్పి కారును బలంగా ఢీకొట్టి, పక్కనే వెళ్తున్న మరో కారు అద్దాలపై పడ్డారు. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిశాంత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కంటేశ్కి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు విఫలం
యాచారం: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ విమర్శించారు. మండల కేంద్రంలో మంగళవారం డీవైఎఫ్ఐ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ వేస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని అన్నారు. నిరుద్యోగ భృతి, స్వయం ఉపాధి కోసం ఆర్థిక రుణాలు, రాజీవ్ వికాస్ పథకం కోసం దరఖాస్తులు స్వీకరించి నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నా స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదన్నారు. దేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కల్పించే విషయంలో ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పి.జగన్, ఉపాధ్యక్షుడు ఆలంపల్లి జంగయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.శంకర్, నాయకులు రాఘవేంద్ర, శివశంకర్, మహేశ్, దినేష్, కవిత, ప్రశాంత్, శివ, హఫీజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ -
11, 12 తేదీల్లో కబడ్డీ ఎంపిక పోటీలు
తుక్కుగూడ: అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం నుంచి జాతీయ పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ కిరణ్మయి అన్నారు. జాతీయ పోషణ మాసం–2026కు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మన అంగన్వాడీ.. మన బాధ్యత’ అంశంతో అక్టోబర్ 9వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. చిన్నారులకు అందించే సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, వారి సంరక్షణ, అభ్యసనం, ఆటలు, తల్లులకు అందించే పౌష్టికాహారం తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు. చిన్నారులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌ను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకుడు బండి నర్సింహ్ సన్మానించారు. గౌతమ్‌కుమార్ ఇటీవల ట్రెసా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన్ను కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు అల్తాఫ్ హుస్సేన్, సయ్యద్ అయూబ్ తదితరులు ఉన్నారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కవ్వగూడ కార్యదర్శి వజ్రలింగం తప్పుడు ఆరోపణలతో తనపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారని ఎంపీఓ రమేష్ పేర్కొన్నారు. కవ్వగూడ సర్వే నంబర్ 412,414,415,416,429,432,438లోని భూములు పూర్తిగా 111 జీఓ పరిధిలో ఉంటాయని, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు లేవని, అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కార్యదర్శిపై గతంలో చార్జి మెమో కూడా జారీ చేశామని తెలిపారు. అది జీర్ణించుకోలేకే తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా తనపై ఆరోపణలు చేసిన సదరు కార్యదర్శిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. -
తల్లీకొడుకుల ఆత్మహత్య
తాండూరు రూరల్: కుటుంబ కలహాలతో తల్లీ కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఐనెల్లి గ్రామ శివారులోని ఇంద్రారెడ్డి కాలనీలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి కథనం ప్రకారం.. తాండూరు మండలం కోటబాసుపల్లికి చెందిన కమ్మరి శంకర్, తుల్జమ్మ(46) దంపతులు. వీరికి నరేష్(26) కొడుకు ఉన్నారు. గ్రామంలోని మైసమ్మ దేవాలయం సమీపంలో కమ్మరి వృత్తి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. నరేష్‌కు నాలుగేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం మిర్యాణ్‌కు చెందిన మౌనికతో వివాహమైంది. వీరికి పాప భవాని ఉంది. నరేష్ దంపతులు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో కూతురును తీసుకుని ఏడాది క్రితం మౌనిక పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయమై మాట్లాడేందుకు నరేష్ తండ్రి శంకర్ పది రోజుల క్రితం మౌనికను గ్రామానికి పిలిపించి, పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. అయితే మౌనికను ఎందుకు పిలిచావంటూ నరేష్, అతని తల్లి శంకర్‌తో గొడవపడ్డారు. వారం రోజుల క్రితమే.. శంకర్ కుటుంబానికి ఐనెల్లి గ్రామ శివారులోని ఇంద్రారెడ్డినగర్‌లో ఉన్న ఓ ఇల్లు కొన్నాళ్లుగా వృథాగా ఉంది. ఇంట్లో గొడవ పడి వెళ్లిపోయిన తుల్జమ్మ, నరేష్ రెండు రోజుల పాటు ఈ ఇంట్లోనే ఉన్నారు. వారం రోజుల క్రితమే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో మంగళవారం ఓ పశువుల కాపరి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కరన్‌కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తుల్జమ్మ సోదరుడు రమేష్ అక్క, అల్లుడి మృతదేహాలను గుర్తించాడు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వ హించి, బంధువులకు అప్పగించారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తుల్జమ్మ, నరేష్‌ను వెతికేందుకు శంకర్ తమ బంధువుల గ్రామానికి వెళ్లినట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలో బలవన్మరణం తాండూరు మండలం ఐనెల్లి శివారులో ఘటన కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు కేసు నమోదు చేసిన పోలీసులు -
రైతుల ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
కేశంపేట: మండల పరిధిలోని ఇప్పలపల్లి రెవెన్యూ శివారులో ఉన్న సుందర్ ఇస్పాత్ ఐరన్ కంపెనీపై రైతులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. కంపెనీ నుంచి వెలువడే కాలుష్యంతో పంటలు దెబ్బతింటున్నాయని సమీపంలోని రైతులు అరుంధతి, కార్తీక్‌రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టర్ నారాయణరెడ్డి రెవెన్యూ, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ, పీసీబీ, ఇండస్ట్రియల్, వ్యవసాయశాఖతో కలిపి కమిటీని ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖ నుంచి షాద్‌నగర్ ఆర్డీఓ సరిత, వ్యవసాయ శాఖ నుంచి జిల్లా వ్యవసాయాధికారి సుజాత, పీసీబీ నుంచి సురేష్, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ నుంచి జిల్లా అధికారి సురేష్, ఇండస్ట్రియల్ నుంచి జనరల్ మేనేజర్ కలిసి ఐరన్ కంపెనీతో పాటు సమీపంలోని రైతుల వ్యవసాయ భూములు, వేసిన పంటలను పరిశీలించారు. కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం ప్రభావంతో పంటలు, భూములు నాశనం అవుతున్నాయని రైతులు ఆరోపించారు. హైకోర్టు ఆదేశించినా కంపెనీని తరలించడం లేదని వాపోయారు. కమిటీ వెంట తహసీల్దార్ రాజేశ్వర్‌రెడ్డి, ఆర్ఐ విజయలక్ష్మి, స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నారు. కమిటీ సభ్యులు కలెక్టర్‌కు నివేదిక అందించనున్నట్టు సమాచారం. -
స్పీకర్‌ను అవమానించడం అప్రజాస్వామికం
షాద్‌నగర్: గౌరవమైన పదవిలో ఉన్న స్పీకర్‌పై అవమానకరంగా మాట్లాడడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీను నాయక్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించే విధంగా మాట్లాడిన ఎమ్మెల్సీలు తాతా మధు, నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటడం, వ్యక్తిగత ధూషణలకు పాల్పడడం బీఆర్ఎస్కు అలవాటుగా మారిందని విమర్శించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు రమేష్, బాదేపల్లి సిద్ధార్థ, జాంగారి రవి, రవికుమార్, జాంగారి జంగయ్య, పెంటనోళ్ల ఆంజనేయులు, సాయిలు, సురేందర్, జంగయ్య, శ్రీను, బాల్‌రాజ్, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బంజారాల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి
కడ్తాల్: మైదాన ప్రాంత గిరిజనులతో పాటు, బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బంజారా సేవాదళ్ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బంజారా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాంరాథోడ్ మాట్లాడుతూ.. చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మైదాన ప్రాంత గిరిజనుల సమగ్రాభివృద్ధికి బోర్డును ఏర్పాటు చేయాలని, రాబోయే డీలిమిటేషన్లో మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సిద్ధాపూర్ డంపింగ్‌యార్డు సమస్యను పరిష్కరించాలని, జీఓ నంబర్ 641ను పునః సమీక్షించాలని, ఫ్యూచర్‌సిటీలోని 20 ఎకరాల స్థలంలో సంత్ సేవాలాల్ భవ్య మందిరం నిర్మించాలని, 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించేలా, పునరావాసం కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తేవాలని కోరారు. కార్యక్రమంలో బంజారా సేవాదళ్ అధికార ప్రతినిధి సురేశ్‌నాయక్, ప్రధాన కార్యదర్శి నరేశ్ నాయక్, నాయకులు హనుమంత్ నాయక్, లక్ష్మణ్ నాయక్, పాపియా నాయక్ ఉన్నారు. -
బుద్వేల్ టు నాచారం
రేడియల్– 2 రోడ్డు నిర్మాణానికి కార్యాచరణసాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు– 2 నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు వివిధ ప్రాంతాల్లో రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రావిర్యాల నుంచి ఫ్యూచర్‌సిటీ మీదుగా ట్రిపుల్ ఆర్ సమీపంలోని ఆమనగల్లు వరకు ఒకటో రేడియల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బుద్వేల్ నుంచి ఎన్‌హెచ్–167 (ఎన్) సమీపంలోని నాచారం వరకు 81.15 కి. మీ మేర రెండో రోడ్డు నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) తాజాగా నోటిఫికేషన్ వెల్లడించింది. నిర్మాణ సంస్థల నుంచి టెక్నికల్ బిడ్లను ఆహ్వానించింది. ఈ నెల 30 వరకు దరఖాస్తులను అందజేయాలని పేర్కొంది. మొత్తం 81.15 కి.మీ.. ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వెలుపలి పారిశ్రామిక ప్రాంతాలకు ఈ రేడియల్ రోడ్డు కనెక్టివిటీ సదుపాయాన్ని ఇవ్వనుంది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ సమీపంలోని తుర్క ఎంకపల్లి వరకు.. అక్కడి నుంచి ఎన్‌హెచ్ 67 (ఎన్) వరకు ఈ రోడ్డును పొడిగించనున్నారు. మొత్తం నాలుగు వరుసల్లో నిర్మించనున్న రేడియల్ రోడ్డు– 2ను మూడు దశల్లో పూర్తి చేయనున్నట్లు హెచ్‌జీసీఎల్ అధికారులు తెలిపారు. మొదటి దశలో బుద్వేల్ నుంచి షాబాద్ వరకు 29.50 కి.మీ, రెండో దశలో షాబాద్ నుంచి గూడూర్ వరకు 27, మూడో దశలో గూడూర్ నుంచి నాచారం వరకు 24.65 చొప్పున మొత్తం 81.15 కి.మీ మేర పూర్తి చేయనున్నారు. ఔటర్ నుంచి పారిశ్రామిక ప్రాంతాలకు కనెక్టివిటీ మూడు దశల్లో నిర్మాణానికి హెచ్‌జీసీఎల్ టెండర్లు టెక్నికల్ బిడ్లకు దరఖాస్తుల ఆహ్వానం ఈ రేడియల్ –2 రోడ్డు నిర్మాణానికి రూ.5,060 కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులను అందజేసింది. ఈ ప్రాజెక్టు కోసం రంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్‌పేట్ జిల్లాల్లోని 41 గ్రామాల పరిధిలో 1,486.30 ఎకరాలను సేకరించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 21 గ్రామాల్లో 831.36 ఎకరాలు (44.70 కి.మీ.), వికారాబాద్‌లోని 18 గ్రామాల్లో 558.18 ఎకరాలు (31.50 కి.మీ.), నారాయణ్‌పేట్ జిల్లాలోని 2 గ్రామాల్లో 96.16 ఎకరాల (5.05 కి.మీ.) భూముల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 902.16 ఎకరాల భూసేకరణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కాగా.. భూసేకరణకు ప్రభుత్వం రూ.3,800 కోట్లు కేటాయించింది. -
ఎస్హెచ్ఓ మహేందర్‌రెడ్డికి అభినందనలు
ఇబ్రహీంపట్నం: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ సివిల్ ఫోర్స్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఎన్నికై న ఇబ్రహీంపట్నం ఎస్హెచ్ఓ మద్ది మహేందర్‌రెడ్డికి ఏసీపీ కేపీవీ రాజు, ఎస్ఐలు, సిబ్బంది మంగళవారం బొకే అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: ఇందిరమ్మ టవర్స్ పథకంలో దరఖాస్తుదారుల నుంచి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణతో పాటు డిపాజిట్ (ఈఎండీ)గా ఆన్లైన్ ద్వారా రూ.10 వేలు స్వీకరించారు. ఇళ్ల కేటాయింపు లాటరీ పూర్తి కావ డంతో ఎంపిక కాని దరఖాస్తుదారులకు ఈఎండీ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. దరఖాస్తుదా రులు చెల్లించిన అకౌంట్‌కే డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎలాంటి దరఖాస్తులను సమర్పించాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అయితే.. కొంతమంది దరఖాస్తుదారులు నగదు ద్వారా, ఇతరుల అకౌంట్ నుంచి చెల్లించామని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు. ఇలా చెల్లించిన వారికే జమ అయ్యేలా చూడటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్సైట్ tghb.telangana.gov.in ద్వారా ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. లేని పక్షంలో ఏ అకౌంట్ ద్వారా చెల్లింపు చేశారో, అదే అకౌంట్‌కు తిరిగి జమ అవుతుందని తెలిపారు. లాటరీ ద్వారా ఎంపికై న వారి వివరాల పరిశీలన కొనసాతోందని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పడుతుందని గౌతం వెల్లడించారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన వారికి ఇళ్ల కేటాయింపు పత్రాలను (అలాట్మెంట్)) అందజేస్తామన్నారు. -
నీరు నిల్.. కష్టాలు ఫుల్
వికారాబాద్: భూగర్భజలాలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. ఎండల తీవ్రతతో చెరువులు, కుంటలు, బోరుబావులు వట్టిపోతున్నాయి. దీంతో పంటలు ఎండుముఖం పట్టాయి. దిక్కు తోచని రైతులు ఆందోళనతో ఆకాశం వంక చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 ఆగస్టుతో పోల్చితే ఈ ఏడాది నీరు పాతాలానికి చేరింది. గతేడాది ఆగస్టు చివరన జిల్లాలో సగటున 6.57 మీటర్లు ఉండగా ఈ ఏడాది 11.73 మీటర్ల లోతుకు పడిపోయాయి. వర్షాకాలంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక వేసవి పరిస్థతి ఎలా ఉండబోతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి లభ్యతకు కారణాల అన్వేషణ జిల్లా పరిధిలోని మర్పల్లి మండలంలో సగటున 25.56 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇది వేసవి సీజన్‌కు చెందిన మార్చి, ఏప్రిల్ మాసాలతో సమానమవడం ఆందోళన కలిగించే విషయం. కోట్‌పల్లి మండలంలో అత్యల్పంగా 6.40 మీటర్ల లోతులోనే నీళ్లు ఉన్నాయి. దోమ, మర్పల్లి మండలాల్లోనూ 18–20 మీటర్ల లోతుకు అడుగంటాయి. కోట్‌పల్లి మండలంలో నీటి లభ్యతకు కారణాలను విశ్లేషించి మిగిలిన మండలాల్లో ఆ దిశగా చర్యలు చేపట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. వర్షాభావ పరిస్థితులు, ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రభావంతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన లఖ్నాపూర్, కోట్‌పల్లి, జుంటుపల్లి, శివసాగర్ లాంటి ప్రాజెక్టులు మినహా చిన్న చిన్న చెరువులు, కుంటలు ఇప్పుడే అడుగంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితులే కారణం ఈ ఏడాది వర్షాకాలం ఆరంభం నుంచి తలెత్తిన వర్షాభావ పరిస్థితుల కారణంగానే భూగర్భజలాలు అడుగంటుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉండగా ఇందులో 12 మండలాల్లో లోటు వర్షపాతం, ఒక మండలంలో అత్యధిక లోటు వర్షపాతం, ఒక మండలంలో అధిక వర్షపాతం, ఆరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యాయి. వర్షాకాలం ఆరంభం నుంచి ఇప్పటి వరకు 533 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ప్రస్తుతం 409 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అధికారులు కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్నారు. ఇంకుడు గుంతలు మచ్చుకై నా కనిపించడం లేదు. జిల్లాలో వేలల్లో ఇంకుడు గుంతలు తవ్వించామని అధికారులు చెబుతున్నా.. వాటి నిర్వహణ గాలికొదిలేశారు. చెక్ డ్యామ్‌లు, ఫాంఫండ్స్, చెరువులు, కుంటల్లో పూడిక తీయకపోవటంతో అవి నామమాత్రంగా మారాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో భూగర్భ జలాలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా అడుగంటి పోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మరో పక్క నిబంధనలకు విరుద్ధంగా, అధికారుల అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా బోరు బావులు తవ్వుతున్నారు. వాతావారణ పరిస్థితులు, నీటి లభ్యత లాంటి విషయాలపై అవగాహన లేకుండా బోర్లు వేయడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. కొందరు రైతులు ఆటోమెటిక్ స్టార్టర్లు వినియోగించి బోరుబావుల ద్వారా పొలాలకు నీరు పారిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక భూగర్భజలాల నీటి మట్టాలు పడిపోతున్నాయి. పంటలు ఎండుముఖం పట్టి రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో కరువు ముదిరే ప్రమాదం కనిపిస్తోంది.నీటి పొదుపు సామాజిక బాధ్యత భూగర్భ జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. ఇందుకు అందరూ సహకరించాలి. ఇంకుడు గుంతలు తవ్వి నిర్వహణ చేపట్టాలి. కుంటలు, చెరువులు, ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లలో పూడిక తీసి నీరు ఇంకేలా చర్యలు తీసుకోవాలి. నీటిని పొదుపుగా వాడడం సామాజిక బాధ్యతగా గుర్తించాలి. జిల్లాలో అనుమతులు లేకుండానే బోరుబావులు తవ్వుతున్నారు. దరఖాస్తు చేసుకుంటే పరీక్షలు నిర్వహించి రిపోర్టు ఇస్తాం. దీంతో బోరుబావులు తవ్వుకునే వారు నష్టపోకుండా ఉంటారు. – రవి, జిల్లా అధికారి, గ్రౌండ్ వాటర్ ముంచుకొస్తున్న జల సంక్షోభం అడుగంటుతున్న భూగర్భ జలాలు 13 మండలాల్లో లోటు వర్షపాతం ఆందోళనలో ప్రజలు -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగురు మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఆయా కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆమనగల్లు: టెంపో ట్రావెలర్‌ను మిల్క్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ నుంచి శ్రీశైలం దేవస్థానానికి సోమవారం టెంపో ట్రావెలర్‌లో 17 మంది వెళ్తున్నారు. అర్ధరాత్రి ఆమనగల్లులోని రాజీవ్‌చౌరస్తా వద్ద మాడ్గుల నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మిల్క్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంనలో టెంపో ట్రావెలర్‌లో ఉన్న నిజమాబాద్‌కు చెందిన కై లాస్, కన్నా, నాగరాజు, ధన్‌రాజ్, గోపాల్, శ్రీరామ్, భూమి తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్‌కు చెందిన సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.ప్రమాదంలో గాయపడిన వారు -
నేడు కిసాన్ మేళా
ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ పథకం కింద రైతుల కోసం బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో కిసాన్మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి సుజాత మంగళ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం, నూతన పంటల సాగు పద్ధతులు, అధిక దిగుబడుల సాధన, సుస్థిర వ్యవసాయం, యాంత్రీకరణ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ శాఖతో పాటు ఉద్యాన, పట్టు పరిశ్రమ, మత్స్య, పశుసంవర్థక శాఖలు, ఆయా కంపెనీల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, డ్రోన్ల వినియోగం, ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై సమాచారం అందిస్తామన్నారు. రైతులు– శాస్త్రవేత్తల పరస్పర చర్చా కార్యక్రమం ఉంటుందన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. సాగుపై అవగాహన అవసరం కేశంపేట: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి సుజాత అన్నారు. మండల పరిధిలోని కొత్తపేట రైతువేదికలో మంగళవారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రైతులు, డీలర్లకు పలు సూచనలు చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఆరుతడి పంటల సాగుతో పాటు పశుపోషణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సన్నవడ్లకు బోనస్ లభించాలంటే ధాన్యం కొనుగోలు చేసిన షాపులోనే రైతు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. బోనస్‌కు సంబంధించి డీలర్లు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రామశివరావు, ఏఈఓలు వినయ్, తేజ్‌కుమార్, ప్రశాంత్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
యాచారం: పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం జిల్లా కమిటీ ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపు కోసం ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వస్తున్న వారు ఆ తర్వాత వాటిని విస్మరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో భూ సమస్యలు ఏ మాత్రం పరిష్కారం కావడం లేదని తెలిపారు. ఈ విషయంలో నాటి కేసీఆర్ సర్కార్‌కు, నేటి రేవంత్‌రెడ్డి సర్కార్‌కు ఏ మాత్రం తేడా లేదన్నారు. సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని ప్రజలు ఓట్లేసి పంపిస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యక్తిగత ధూషణలకు దిగుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో పాలక ప్రభుత్వాలు పేదల నుంచి వేలాది ఎకరాలు సేకరిస్తూ వారికి జీవనోపాధి లేకుండా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బి.సామేల్, మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
హష్ ఆయిల్ విక్రేత అరెస్టు
రూ.1.42 కోట్ల సరుకు స్వాధీనం కొత్తూరు: నిషేధిత హష్ హాయిల్ విక్రయించడానికి యత్నిస్తున్న వ్యక్తిని ఎస్ఓటీ, కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ నాగార్జునరెడ్డి కథనం ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌కు చెందిన హెచ్.ధృవ్ అలియాస్ ధృవ్‌జోషి (30) ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో నివాసం ఉంటున్నాడు. ఒడిశా నుంచి హష్ ఆయిల్ తెచ్చి కొత్తూరు పరిధిలో విక్రయించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో మంగళవారం ఇన్ముల్‌నర్వ శివారులో పీఅండ్‌జీ పరిశ్రమకు వెళ్లే రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ధృవ్‌జోషి కనిపించాడు. అతని వద్ద ఉన్న బ్యాగులో సుమారు 11.319 కిలోల హష్ ఆయిల్‌ను గుర్తించారు. స్టేషన్‌కు తరలించి విచారించగా ఒడిశా రాష్ట్రానికి చెందిన రోహిత్ అనే వ్యక్తి నుంచి హష్ ఆయిల్ తీసుకొచ్చి కమీషన్ ప్రాతిపదికన విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి సుమారు రూ.1.42 కోట్ల విలువైన ఆయిల్ ప్యాకెట్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి
కొత్తూరు: వినాయక మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని షాద్‌నగర్ డీసీపీ శిరీష అన్నారు. పట్టణంలోని ఓ హోటల్లో మంగళవారం శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. పోలీసుశాఖ ప్రవేశపెట్టిన వెబ్సైట్లో అనుమతులు తీసుకోవాలన్నారు. విగ్రహాలను మండపాలకు తెచ్చే సమయంలో, నిమజ్జన సమయంలో ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇతరులు ఇబ్బందులు పడేలా రోడ్ల మధ్య మండపాలను ఏర్పాటు చేయొద్దని తెలిపారు. మండపాల వద్ద, నిమజ్జన సమయంలో డీజేలు పెట్టొద్దని సూచించారు. బలవంతపు చందాలకు పాల్పడితే కేసులు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి ఘర్షణలకు చోటు లేకుండా శాంతియుత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ నాగార్జునరెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
హామీల పేరుతో కాంగ్రెస్ మోసం
పక్కాగా సాగు లెక్క పంటల సాగు వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది.తుర్కయంజాల్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం తుర్కయంజాల్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, 13 డిక్లరేషన్లను ప్రకటించిందని, 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారని, తీరా అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచిన వాటి ఊసే ఎత్తడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా అందడం లేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను కోర్టుల్లో కేసులు వేయించి నిలిపివేయించారని అన్నారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, అరాచకాలపై అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన శంకుస్థాపనలకు ప్రస్తుత ఎమ్మెల్యే రిబ్బన్లు కట్ చేస్తూ, ప్రారంభోత్సవాల పేరుతో హడావుడి చేస్తూ కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కళ్యాణ్ నాయక్, నాయకులు బొక్క గౌతమ్ రెడ్డి, రొక్కం చంద్రశేఖర్ రెడ్డి, కొండ్రు శ్రీనివాస్, మర్రి సంపతీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి -
● రోడ్డు దాటుతూ లారీ ఢీకొని..
కేశంపేట: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని లారీ ఢీకొన్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బోధునంపల్లికి చెందిన రిటైర్డు పట్వారీ బండ వెంకట్‌రెడ్డి మంగళవారం కేశంపేట చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా డ్రైవర్ లారీని అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకట్‌రెడ్డి స్వల్పంగా గాయపడ్డాడు. ఈ విషయమై బాధితుడి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పరమేశ్ తెలిపారు. -
పక్కాగా సాగు లెక్క
దౌల్తాబాద్: పంటల సాగు వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మండల పరిధిలో ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ నియమించింది. సర్వే కోసం కేంద్రం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. ఈ మేరకు వలంటీర్లు యాప్ డౌన్లోడ్ చేసుకుని పంటల వివరాలు అందులో నమోదు చేస్తున్నారు. 25 మంది నియామకం మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున మొత్తం 25 మంది వలంటీర్లు నియమించారు. వారు తమకు కేటాయించిన గ్రామాల్లో సర్వే పనులు చేస్తున్నారు. వలంటీర్లు సదరు గ్రామానికి చెందిన వారే కావడంతో సర్వే చురుగ్గా సాగుతోంది. కచ్చితమైన డేటా రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణతో మండలంలో ఏ పంట ఎంతమేర సాగవుతుందో ఖచ్చితమైన డేటా అందుబాటులోకి వస్తుంది. దీని ఆధారంగా రైతులకు ఎరువులు ఇతర సంక్షేమ పథకాలు, పంట నష్టపరిహారం అందుతాయి. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ రైతుబంధు, ఇతర పథకాలు వర్తించే అవకాశం ఉంటుంది. అలాగే సర్వేతో నమోదు చేసిన మేరకు రైతులు పండించిన పంట ఉత్పత్తులుకు సరైన గిట్టుబాటు లభించే అవకాశం ఉంటుంది. డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ నియామకం వానాకాలం సీజన్లో భాగంగా రైతులు సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేసేందుకు డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టాం. ప్రస్తుతం వలంటీర్లు గ్రామాల్లో క్రాప్ బుకింగ్ సర్వే చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే పూర్తి చేస్తాం. – తులసి, ఏఓ, దౌల్తాబాద్ -
హామీల అమలులో విఫలం
బీఆర్ఎస్ నాయకులు కొడంగల్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో డీటీ అనితకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల గడిచినా హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎకరానికి రూ.15 వేలు రైతు బంధు ఇవ్వడం లేదన్నారు. మహిళలకు రూ.2,500 ఎక్కడని ప్రశ్నించారు. వృద్ధులకు, వితంతులకు, దివ్యాంగులకు పింఛన్ల మొత్తం పెంచలేదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద తులం బంగారం ఎప్పుడిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయడం లేదన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎరన్‌పల్లి శ్రీనివాస్, మున్నూరు బిచ్చప్ప, శ్రీనివాస్‌రెడ్డి, మాఫీ వెంకటయ్య, ఏర్పుల మోహన్, జగన్, బాల్‌రాజు, హన్మంతు, రాజశేఖర్, రఫీ తదితరులు పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు ఎస్పీ స్నేహ మెహ్ర అనంతగిరి: ప్రజల సహకారంతో గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేస్తామని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. సోమవారం నగరం నుంచి డీజీపీ సీవీ ఆనంద్ అన్ని జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లు, బందోబస్తు తదితర వాటిపై సూచనలు చేశారు. అనంతరం వికారాబాద్‌లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ స్నేహ మెహ్ర, ఏఎస్పీ రాజేష్ మీనాతో కలిసి మాట్లాడారు. ఉత్సవాలు, నిమజ్జనం వేడుక ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండపాలను క్రమం తప్పకుండా సందర్శించి భద్రతను పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. నిమజ్జన రూట్లను ముందుగానే చెక్ చేసి ట్రాఫిక్ నియంత్రణ, బారికేట్ల ఏర్పాట్లు, పార్కింగ్ తదితర వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
సమష్టి బాధ్యతలతో యువత శక్తివంతం
శంకర్పల్లి: విభిన్న రంగాలకు చెందిన విద్యార్థులు సమష్టి బాధ్యతలు చేపట్టడం ద్వారా యువత శక్తివంతంగా తయారవుతారని ఇక్ఫాయ్ గ్రూప్స్ చైర్పర్సన్ శోభారాణి యశస్వీ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అపరాజిత అండర్ గ్రాడ్యుయేట్ క్లబ్’ని ఆమె రిజిస్ట్రార్ విజయలక్ష్మితో కలిసి అధికారికంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ఇది ఒక అధికారిక విద్యార్థి క్లబ్ అని, భిన్న రంగాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఒకేచోట తమ అభిప్రాయాలు, ఆసక్తులు, అభిరుచులు తెలుసుకొని, సమష్టిగా పని చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొ.మహేంద్ర హెచ్.సోనావానే, కో–ఆర్డి నేటర్లు డా.చెంజి, ప్రొ.వి.పద్మావతి, డా.టి.నేహా తదితరులు పాల్గొన్నారు. ఇక్ఫాయ్ గ్రూప్స్ చైర్పర్సన్ శోభారాణి -
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి..
● బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం ● అక్కడికక్కడే ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు మొయినాబాద్: బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం అయ్యవారి పల్లి గ్రామానికి చెందిన కృష్ణ (50), అదే గ్రామానికి చెందిన నర్సింహ సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి మొయినాబాద్ వైపు బైక్‌పై వెళ్తున్నారు. అజీజ్‌నగర్ రెవెన్యూలో ఉన్న రాణే ఇంజన్వాల్స్ కంపెనీ వద్దకు రాగానే మలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. గాయాలైన నర్సింహను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హామీలపై నిలదీస్తారనే దౌర్జన్యాలు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజలకు రేవంత్‌రెడ్డి సర్కార్ ఇచ్చిన బూటకపు హామీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలదీస్తారనే అసెంబ్లీకి వెళ్లనీయకుండా పోలీసులతో దౌర్జన్యంగా అడ్డుకున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. పార్టీ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మంగళ్‌పల్లి గేటు వద్ద సాగర్రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో నెరవేరుస్తామని ఇచ్చిన హామీలను వెయ్యి రోజులైనా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ పార్టీ వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో అధికార పార్టీకి వెన్నులో వణుకు మొదలైందన్నారు. మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరు యావత్ తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఇప్పటికై నా అణచివేతలు మానుకొని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, కర్నాటి రమేష్‌గౌడ్, చీరాల రమేష్, బుగ్గరాములు, ఏర్పుల చంద్రయ్య, కృపేష్, బూడిద రాంరెడ్డి, నీలం శ్వేత, మాధవి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి -
‘చలో హైదరాబాద్’ జయప్రదం చేయాలి
షాద్‌నగర్‌రూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్‌ను’ విజయవంతం చేయాలని టీజీఈ జేఏసీ జిల్లా కన్వీనర్ యశ్వంత్ పిలుపునిచ్చారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సోమవారం టీజీఈ జేఏసీ జిల్లా జనరల్ సెక్రటరీ నర్సింలు ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధాయుల సమావేశం నిర్వహించారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం యశ్వంత్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు గొంతెమ్మ కోరికలను కోరడంలేదని, ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినవే అడుగుతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను ఇస్తామని, ఆరు నెలల్లో పీఆర్సీని చెల్లిస్తామని, సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి ఏపీఎస్‌ను అమలు చేస్తామని, పెండింగ్‌లో ఉన్న సరెండర్, మెడికల్ బిల్లులను వెంటనే క్లియర్ చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీఈ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు, కో చైర్మన్ గోపాల్‌నాయక్, కో కన్వీనర్ వెంకటప్ప, తహసీల్దారు నాగయ్య, ఎంపీడీఓ శ్రీకాంత్, ఎంపీఓ జయంత్‌రెడ్డి పాల్గొన్నారు. వాల్‌పోస్టర్ ఆవిష్కరిస్తున్న నాయకులుటీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ యశ్వంత్ -
వాణి వినరే..!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం వెరసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తోంది. ఇటీవల మండల, రెవెన్యూ కేంద్రాలకూ విస్తరించింది. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి 80 నుంచి 100 మంది వస్తున్నారు. వీరిలో 60 శాతం భూ బాధితులే. ఈ రెండేళ్లలో ఎన్ని ఫిర్యాదులు అందాయి.. ఎన్ని పరిష్కరించారంటే అధికారుల వద్ద సమాధానం లేదు. ఫిర్యాదులు స్వీకరించడం తప్ప వాటి పరిష్కారానికి ఆసక్తి చూపడం లేదు. చిన్నచిన్న సమస్యల పరిష్కారం కోసం ఎన్నాళ్లు తిరగాలి అంటూ పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణికి పోటెత్తుతున్న వినతులు మొక్కుబడిగా అధికారుల చర్యలు పరిష్కారం కాని సమస్యలు మళ్లీమళ్లీ తిరుగుతున్న బాధితులు -
ఆరుసార్లు విన్నవించినా అంతే ..
కందుకూరులోని 430/ఎ, 431/ఎ2/ఎ సర్వే నంబర్లలో వారసత్వంగా వచ్చిన 12 ఎకరాల భూమి ఉంది. ముగ్గురు కొడుకుల పేరున తలో నాలుగు ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్ చేయాలని 2025 మే 29న చలానా కట్టిన. రిజిస్ట్రేషన్ సమయంలో మా తమ్ముడు, అక్క వచ్చి అడ్డుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. చలానా రూపంలో చెల్లించిన రూ.6.18 లక్షలు తిరిగి చెల్లించాల్సిందిగా అభ్యర్థించా. ఇప్పటికే ఆరుసార్లు ప్రజావాణికి వచ్చి విన్నవించినా లాభం లేదు. ఎప్పుడిస్తారో కూడా చెప్పడం లేదు. – ఎస్.మల్లేష్, ఎదులాబాద్ ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు రెవెన్యూ సర్వే నంబర్ 488,489,490,495లలో నా భార్య స్వరూప పేరున ఐదెకరాల పట్టా భూమి ఉంది. 38ఈ, పీటీ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. నా భార్య పేరున సక్షేషన్ అయింది. కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించి, భూమిని కబ్జా చేశారు. రోడ్లు వేసి, వెంచర్ చేసి గుట్టుగా విక్రయించారు. రెవెన్యూ కోర్టును ఆశ్రయించి మొత్తం భూమిని నిషేధిత జాబితాలో పెట్టించాను. కబ్జాదారుల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు హియరింగ్ నిర్వహించకుండా దాటవేస్తున్నారు. ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేశాను. ఇప్పటికీ హియరింగ్ నిర్వహించ లేదు. – కె.కృష్ణారెడ్డి, కప్పాడు -
అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
షాద్‌నగర్: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి అన్నారు. సో మవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వా మ్యంలో స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. అట్టడుగు వర్గానికి చెందిన దళిత బిడ్డ అయిన స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీపై వెంటనే క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని డి మాండ్ చేశారు. స్పీకర్‌పై కనీస గౌరవం లేకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి రా జ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని కాపాడాలన్నారు. శంకర్పల్లి: అక్రమ లేవుట్లలో నిర్మించిన నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. జన్వాడ రెవెన్యూలో అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లు, నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఈనెల 6న ‘నిబంధనలు నిల్.. వెంచర్లు ఫుల్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి నార్సింగి సర్కిల్, హెచ్ఎండీఏ అధికారులు స్పందించారు. సదరు నిర్మాణాలను సోమవారం కూల్చివేశారు. అన ంతరం నా ర్సింగి అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారి ప్ర సీదా, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రమేశ్ మా ట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్లు, నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమని అన్నారు. అలాంటి వాటిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కందుకూరు: బంజారాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బంజారా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాథోడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు అశోక్ రాథోడ్ ఆధ్వర్యంలో సోమవారం మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంజారా సమాజానికి మంత్రి వర్గంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, ఫ్యూచర్‌సిటీలో 20 ఎకరాలు కేటాయించి, అందులో సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని నిర్మించాలని, సిద్ధాపూర్ డంపింగ్ యార్డు జీఓ నంబర్ 641ను రద్దు చేయాలని, సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ చేవెళ్ల డిక్లరేషన్‌పై అసెంబ్లీలో చర్చించి బంజారా సమాజానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు హనుమాన్ నాయక్, ప్రధాన కార్యదర్శులు నరేష్ నాయక్, కాట్రావత్ హనుమంత్ నాయక్, అధికార ప్రతినిధి ఇస్లావత్ సురేష్ నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాపియా నాయక్ పాల్గొన్నారు. హుడాకాంప్లెక్స్: సరూర్‌నగర్‌లోని జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రష్మితను రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు వరించింది. ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత సహా 9 మంది విద్యార్థునులకు ఎంబీబీఎస్, 11 మంది బీడీఎస్, ముగ్గురికి ఐఐటీ, 150 మంది విద్యార్థులకు టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు దక్కాయి. మొత్తంగా మంచి ఫలితాలు సాధించినందుకు గుర్తింపుగా ప్రభుత్వం ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 2018లో నాగార్జునసాగర్‌లో ఫిజికల్ సైన్స్ టీచర్‌గా ఎంపికయ్యారు. అనతి కాలంలోనే ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొందారు. 2021లో పరిగిలో పని చేశారు. తర్వాత సరూర్‌నగర్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల కొడంగల్ వేదికగా నిర్వహించిన రాష్ట్రస్థాయి టీచర్స్ డే వేడుకల్లో భాగంగా సీఎం చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. ప్రిన్సిపాల్‌కు ఉత్తమ అవార్డు రావడంపై తోటి అధ్యాపకులు సహా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. -
నర్సు శిరీష హత్య ప్రదేశంలో వివరాల సేకరణ
మహేశ్వరం: తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో నర్సు శిరీషపై జరిగిన అత్యాచారం, హత్యకు సంబంధించిన ప్రదేశాన్ని సోమవారం గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఇందిర, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యులు నిశితంగా పరిశీలించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించడంతో హత్య జరిగిన ప్రదేశంలో వివరాలు సేకరించారు. నర్సు నివాసం ఉన్న గది, చుట్టూ పరిసరాలు, సెక్యూరిటీ, సీసీ కెమెరాలు, గది డోర్లు, కిటికీలు, గ్రిల్స్‌తో పాటు హంతకుడు పనిచేసిన మెకానిక్ షెడ్‌ను పరిశీలించారు. ఆస్పత్రిలోని వైద్యులు, శిరీష స్నేహితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మిగిలిన నర్సులు ఉంటున్న గదులను పరిశీలించి, ప్రతీ అంశాన్ని రికార్డు చేశారు. రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, మహేశ్వరం తహసీల్దార్ చిన్న అప్పల నాయుడు తదితరులు ఉన్నారు. -
అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం
హుడాకాంప్లెక్స్: దేశంలో, రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడాలని ఆలిండియా వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాయబండి పాండురంగం అన్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర మొదటి మహాసభ సందర్భంగా సోమవారం కొత్తపేట చౌరస్తాలో పార్టీ నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, కార్మిక, కర్షక, రాజ్యాధికారం కోసం పనిచేయాలని కోరారు. దేశం పూర్తిగా అవినీతిమయం, లీకేజీలమయమైందని విమర్శించారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆలిండియా వర్కర్స్ పార్టీ తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగి, అవినీతి రహిత పాలన కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. నవంబర్‌లో రాష్ట్ర కమిటీ సమావేశాలు యాదాద్రిలో ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకురాలు శాంతి తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు
కడ్తాల్: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడొద్దని మహేహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలతో పాటు నేరాల నియంత్రణ, స్నేహపూర్వక పోలీసింగ్, సమయపాలన, బాధ్యతాయుతంగా విధుల నిర్వహణపై సిబ్బందితో మాట్లాడారు. పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, నిఘా వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించి, నేర నియంత్రణకు కృషి చేయాలన్నారు. పిర్యాధు దారులతో మర్యాదగా వ్యవహరించి, చట్ట ప్రకారం త్వరితగతిన సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ సైదిరెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. మహేశ్వరం ఏసీపీ జానకి రెడ్డి -
రెడీ మిక్స్ ప్లాంట్ పనులు ఆపండి
చేవెళ్ల: మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో కొత్తగా వేస్తున్న ఆర్ఎంసీ రెడీమిక్స్ ప్లాంట్ పనులను వెంటనే నిలిపివేయాలని స్థానిక ప్రజలు, కౌన్సిలర్ మధుసూదన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ యాదగిరికి, తహసీల్దార్ కృష్ణయ్యకు వినతిపత్రాలు అందజేశారు. వార్డులో ఏర్పాటు చేస్తున్న క్రషర్కు అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. దీనివల్ల ఇళ్లల్లోకి దుమ్ముధూళి రావడంతో పాటు చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాజుగుట్ట ప్రజలు, తదితరులు ఉన్నారు. మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్‌కు వినతి -
నిర్వాసితులకు న్యాయం చేస్తాం
● పునరావాస ప్రయోజనాలను కల్పిస్తాం ● ఆలూరు భూసేకరణ సభలో ఆర్డీఓ పార్థసింహారెడ్డి ● పరిహారం పెంచాలని రైతుల డిమాండ్ చేవెళ్ల: ఆలూరులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోతున్న వారికి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని ఆర్డీఓ పార్థసింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం రెవెన్యూ అధికారులు, ఆలూరు సర్పంచ్ కౌలంపేట భాగ్యశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. భూసేకరణ, పరిహారం, పునరావాసం, పునరుద్ధరణ ప్రయోజనాలను వివరించారు. నిర్వాసితులకు ప్రభుత్వం కల్పించనున్న ప్రయోజనాలను తెలియజేశారు. భూసేకరణకు సానుకులంగా స్పందించిన రైతులు, ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని, వక్ఫ్ బోర్డు అంటూ అన్యాయం చేయకుండా పూర్తి పరిహారం రైతులకే ఇవ్వాలని కోరారు. గుంటల్లో భూమి కలిగి ఉన్న వారికి కూడా పునరావాసం కింద ఇచ్చే ప్రయోజనాలను వర్తింపజేయాలన్నారు. గ్రామంలో పెద్ద భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. దీంతో పాటు పరిహారం విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని, కోకాపేట వంటి ప్రాంతాల్లోని భూములను వందల కోట్లకు అమ్ముతున్న ప్రభుత్వం రైతులకు అందించే పరిహారాన్ని అంత తక్కువగా ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు. మరికొంత మంది ఇది వక్ఫ్‌బో,ర్డు భూమి కాదని ఇనాం భూమి అని కోర్టులో కేసు వేశామని, ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న రైతులకు ఓఆర్సీలు ఇవ్వాలని న్యాయస్థానం చెప్పిందన్నారు. మోజార్జీ రైతులు భూసేకరణకు అనుకులంగా ఉండటంతోపాటు పరిహారం, ఆర్‌అండ్‌అర్ ప్రకారం కల్పించే ప్రయోజనాలపై ప్రభుత్వం పునరాలోచన చేసి రైతులకు మేలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్ కృష్ణయ్య, ఆర్ఐ ప్రవీణ్, జీపీఓలు, గ్రామ నాయకులు, రైతులు, పాల్గొన్నారు. -
జాతరకు పోటెత్తిన భక్తజనం
భక్తులతో కిక్కిరిసిన సప్తకొలనులుబషీరాబాద్: జిల్లా సరిహద్దులోని నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో కొలువుదీరిన ఏకాంబరి రామలింగేశ్వర స్వామి జాతర సోమవారం భక్తజన సంద్రంగా మారింది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి సప్తకొలనుల్లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులు యాకూబ్‌సాబ్ దర్గాను సందర్శించారు. పూలు, పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూలతో సుందరంగా అలంకరించిన స్వామివారి రథాన్ని భక్తులు ఆలయ పరిసరాల్లో ఘనంగా ఊరేగించారు. జాతరలో మిఠాయిలు, గాజులు, ఆటబొమ్మల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ప్రభుత్వ చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నీళ్లనల్లి, జలాల్పూర్, ఇస్మాయిల్‌పూర్ గ్రామాల సర్పంచులు వేణుగోపాల్‌రెడ్డి, జయవీర్లాల్, నామ్యానాయక్, నీళ్లపల్లి గ్రామ నాయకులు సుధాకర్‌రెడ్డి, రుక్మారెడ్డి, గోపాల్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవుడి వద్ద రాజకీయాలా? ఏకాంబరి రామలింగేశ్వర ఆలయం పేరున యువత ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవ చేస్తుంటే రాజకీయాలు చేస్తారా అని ట్రస్ట్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆలయం వద్ద ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడారు. ఏడేళ్ల నుంచి రూ.10 లక్షలతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆలయ చైర్మన్ రాజకీయాలు చేస్తున్నారని, ఇది సరికాదన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, సభ్యులు వెంకట్‌నాయక్, గురుప్రసాద్, పీకే శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఏకాంబరి రామలింగేశ్వరుడి దర్శనానికి భక్తుల బారులు సప్తకొలనుల్లో పుణ్యస్నానాలు యాకూబ్‌సాబ్ దర్గాలో పూజలు కనుల పండువగా రథోత్సవం -
గ్రీవెన్స్‌లో స్పందించకపోవడంతో..
హస్తినాపురంలో ఉంటున్నాం. డబుల్బెడ్రూం కోసం దరఖాస్తు చేశాం. నా పేరున స్థిరచరాస్తులు లేవు. నెల రోజుల క్రితం నాపేరు లిస్ట్–2లో ఉండగా, తాజాగా లిస్ట్–3లోకి మారింది. అదేమంటే కారు ఉన్నట్లు చూపిస్తున్నారు. నిజానికి నాపేరున కానీ, నా భర్త పేరున కానీ ఎలాంటి వాహనాలు లేవు. గ్రీవెన్స్‌లో ఇదే అంశాన్ని లేవనెత్తాను. అక్కడ ఎలాంటి స్పందన లభించకపోవడంతో కలెక్టరేట్‌కు వచ్చాను. – శాలిని, ఓంకార్‌నగర్ తక్కెళ్లపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 348లో 1.10 ఎకరాల భూమి ఉండగా, దీనిలో 24 గుంటలే పట్టాదారుపాసు పుస్తకంలో ఎక్కించారు. సర్వే నంబర్ 343లో 30 గుంటల భూమికి ఆరు గుంటలే నమోదైంది. మిగిలిన భూమిని రికార్డు చేయాల్సిందిగా అనేకసార్లు తహసీల్దార్‌కు విన్నవించినా పని కాలేదు. విధిలేని పరిస్థితుల్లో కలెక్టర్‌ను ఆశ్రయించాను. ఇప్పటికే నాలుగు విడతలు తిరిగినా పని కాలేదు. అధికారుల చుట్టూ తిరిగితిరిగి మోకాళ్లు అరిగిపోయాయి. – బింగి అయిలయ్య, నక్కర్తమేడిపల్లి -
పోటాపోటీ ఆందోళనలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ ఆందోళనలతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఉమ్మడి జిల్లా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు, అరెస్టులతో ఒక్కసారిగా హీటెక్కింది. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్లారు. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. మహిళా ఎమ్మెల్యేలను బలవంతంగా అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు, స్పీకర్‌పై అనుచిత వాఖ్యలు చేయడంపై అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్, కల్వకుర్తి, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడికి పార్టీశ్రేణులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలుచోట్ల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లా ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర ఆందోళనలు ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్లిన బీజేపీ నాయకులు ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాలు -
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌పై విమర్శలు సరికాదు
షాద్‌నగర్‌రూరల్: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై ప్రజా సంఘాల నాయకులు విమర్శించడం సరికాదని గిరిజన ఆదివాసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘునాయక్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పారిశ్రామికవేత్తలకోసం నిర్మిస్తున్నారని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రిజర్వాయర్ నిర్మాణంకోసం తట్టెడు మట్టిని తీయకుండా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని మండిపడ్డారు. డిండి నుంచి నీటిని నల్లగొండకు తరలించుకుపోతే స్థానిక ఎమ్మెల్యేకు ఏం సంబంధమని, అది జాతీయ సమస్య అని తెలియకపోవడం విచిత్రంగా ఉందన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి 10టీఎంసీల నీటి సామర్థ్యాన్ని 2.8 టీఎంసీలకు కుదించిన పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. భూ సేకరణ అనంతరం నీటిని ఎక్కడి నుంచి తరలించాలనే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు మహ్మద్ అలీఖాన్ బాబర్, ఎం.డి.ఇబ్రహీం, సయ్యద్‌ఖదీర్, గంగాధర్ తిలక్, షర్పొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణే ధ్యేయం
కడ్తాల్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (సీజీఆర్) పనిచేస్తుందని సంస్థ వ్యవస్థాపకుడు కోర్పోలు లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఆధ్వర్యంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19 వరకు నిర్వహిస్తున్న కంబైన్డ్ ఫౌండేషన్ కోర్సు (సీఎఫ్‌సీ) గ్రూప్–2 బ్యాచ్ ఏలో భాగంగా 223 మంది ట్రైనీ అధికారులు సోమవారం అన్మాస్‌పల్లి సమీపంలోని ఎర్త్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతికి దగ్గరగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలని ట్రైనీ అధికారులకు సూచించారు. పర్యావరణ శాస్త్రవేత్త నక్క సాయిభాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. ఫైళ్లు కాదు ప్రకృతిని అర్థం చేసుకోవాలన్నారు. అభివృద్ధి పేరుతో అడువులను నాశనం చేయకుండా కాపాడాలన్నారు. పర్యావరణవేత్త ఉమామహేశ్వర్‌రెడ్డి పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిద్య సంరక్షణ, సుస్థిర జీవన విధానాలు, అటవీ సంరక్షణ కార్యక్రమాలను తెలియజేశారు. సంస్థ ప్రతినిధులు రజనీకాంత్, పాలడుగు నగేశ్ బయో ఎంజైమ్, బయోచార్, విత్తన బంతుల తయారీ, ఔషధ మొక్కల వినియోగంపై ట్రైనీ అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ లక్ష్మణ్, ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. -
కాల్వల నిర్మాణంలో తీవ్ర జాప్యం
కొడంగల్: పట్టణ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరవుతున్నా అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల అలసత్వంతో పనులు ముందుకు సాగడం లేదు. కొడంగల్‌లోని మహబూబ్‌నగర్ – చించోలీ జాతీయ రహదారికి ఇరువైపులా చేపట్టిన మురుగు కాల్వల నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి గాంధీనగర్ వరకు రోడ్డుకు ఇరువైపులా పేదల ఇళ్లు కూల్చారు. ఆలయాలు, మసీదులు, దర్గాలకు సంబంధించిన కట్టడాలను తొలగించారు. నిరుపేదలు నివాసం ఉండే గాంధీనగర్‌లో సైతం కట్టడాలను కూల్చివేశారు. ఎక్కడా కూడా ఆటంకం లేకుండా పనులు చకచకా జరిగిపోయాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం అడ్డుగా ఉన్న భవనాలను ఎందుకు తొలగించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసులను పెట్టి మా ఇళ్లు, పూరి గుడిసెలను తొలగించిన అధికారులు పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాల్వల నిర్మాణానికి అడ్డుగా ఉన్న తమ భవనాలు కూల్చ వద్దని సదరు యజమాని అధికారులతో మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అధికారులు ఆ భవనాలను వదిలేసి పనులను అర్ధాంతరంగా ఆపినట్లు కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని పనులు -
ప్రైవేటు హాస్టల్ భవనంలో షార్ట్ సర్క్యూట్
మొయినాబాద్: ప్రైవేటు హాస్టల్ భవనంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్‌నగర్ చౌరస్తా వద్ద ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. విద్యుత్ వైర్లు కాలిపోయి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అదే సమయంలో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఆగిపోయాయి. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో హాస్టల్ భవనంలో సుమారు 90 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తప్పిన పెను ప్రమాదం -
కోడి పందేలు, జూదం గుట్టు రట్టు
ఇబ్రహీంపట్నం రూరల్: కోడి పందేలపై శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఆదిభట్ల పోలీసులు సంయుక్తంగా మెరుపుదాడి చేశారు. పందెం రాయుళ్లను అరెస్టు చేసి నగదుతో పాటు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. మన్నెగూడ ఆర్టీఓ కార్యాలయం వెనుక భాగంలో గుట్టు చప్పుడు కాకుండా కోడి పందేలు, జూదం నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఆదిభట్ల పోలీసులు ఉమ్మడిగా దాడి చేశారు. పాత పౌల్ట్రీ ఫామ్ వేదికగా ప్రత్యేకంగా పందెం కోళ్లను పెంచుతూ పందేలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల నుండి పందెం రాయుళ్లను ఆహ్వానించి, వారికి భోజన వసతి కల్పించి పందేలు, పేకాట నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు, స్థల యజమాని పరారీలో ఉన్నారు. వీరి నుంచి రూ.3,60,510 నగదు, 31 పందెం కోళ్లు, 146 కోడి కత్తులు, 20 స్మార్ట్ ఫోన్లు, స్కోర్ నోట్‌బుక్, మూడు కార్లు, మరో మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఆదిభట్ల పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో శంషాబాద్ జోన్ ఇన్స్పెక్టర్ డి.కృష్ణమోహన్, ఎస్ఐలు మన్సూర్ అలీ, ఎన్.నర్సింగరావు పాల్గొన్నారు. వారిని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కేఎస్ రావు అభినందించారు. 22 మంది పందెం రాయుళ్ల అరెస్టు నగదు, పందెం కోళ్లు, వాహనాలు స్వాధీనం -
సృజనాత్మకత పెంపొందించుకోవాలి
శంకర్పల్లి: విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో ఎప్పటికప్పుడు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలపతి రావు, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీలో మూడు రోజుల పాటు నిర్వహించిన 11వ మూట్ కోర్టు పోటీలు ఆదివారంతో ముగిశాయి. కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు హాజరై చివరి రౌండ్‌కి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలుగా పారుల్ యూనివర్సిటీ విద్యార్థులు, రన్నరప్‌గా ఎస్వీకేఎం స్కూల్ ఆఫ్ లా విద్యార్థులు నిలిచారు. వీరికి అతిథులు బహుమతులు అందజేశారు. అనంతరం న్యాయమూర్తులు మాట్లాడుతూ.. న్యాయ విద్యను అభ్యసించే విద్యార్థులకు ఓపిక, శోధన వంటివి ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి, వాదనలు కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ఇక్ఫాయ్ గ్రూప్ చైర్పర్సన్ శోభారాణి, ఇక్ఫాయ్ లా స్కూల్ డైరెక్టర్ ప్రొ.రవి శేఖరరాజు, డైరెక్టర్ జనరల్ ప్రొ.విజయేందర్ కుమార్, మూట్ కోర్టు సొసైటీ సభ్యురాలు డా.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్పీతోనే ముస్లింలకు న్యాయం
పహాడీషరీఫ్: తెలంగాణ రాజ్యాధికారి పార్టీ (టీఆర్పీ) అధికారంలోకి వస్తే ముస్లింల వెనుకబాటును దూరం చేస్తామని ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు. జల్పల్లి సర్కిల్ పరిధిలోని షాహిన్‌నగర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు జల్పల్లి కమాన్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూడు పర్యాయాలు ఓటు వేయించుకొని మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే సబితారెడ్డి జల్పల్లి ప్రాంత అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. జల్పల్లిలో కనీస సదుపాయాలు లేక ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ దోస్తాన్ చేసి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పి మాట తప్పాయన్నారు. జల్పల్లి పంచాయతీ నుంచి జీహెచ్ఎంసీ వరకు రూపాంతరం చెందడం మినహా ప్రజల తలరాతలు మారలేదన్నారు. రాష్ట్ర జనాభాలో ముస్లింల సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని డిమాండ్ చేశారు. మోదీ హయాంలో కార్పొరేట్ శక్తులు బ్యాంక్‌లను లూటీ చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా టీఆర్పీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీటీసీ షర్ఫూద్దీన్ హామెద్, బాలాపూర్ మండల అధ్యక్షుడిగా మజ్హర్ అలీకి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మహిళా అధ్యక్షురాలు వనజ, ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లా ఖాన్, ఎంపీజే అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ ముజీబ్ షేక్ షోయబ్ నాయకులు మహ్మద్ గౌస్, రవూఫ్, వహీద్, నయీం, అజీం, సలీం, ఫైసల్ తదితరులు పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్న -
పవర్‌గ్రిడ్ కబడ్డీ టోర్నీ విజేత ఎస్ఆర్–1
మొయినాబాద్: పవర్‌గ్రిడ్ అంతర్ ప్రాంతీయ కబడ్డీ టోర్నమెంట్లో సదరన్ రీజియన్–1 (ఎస్ఆర్–1) జట్టు విజేతగా నిలిచింది. మొయినాబాద్‌లోని ఫైర్ఫాక్స్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్స్‌లో భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన అంతర్ ప్రాంతీయ కబడ్డీ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. దేశవ్యాప్తంగా ఉన్న పవర్‌గ్రిడ్ ప్రాంతీయ కార్యాలయాల నుంచి క్రీడాకారులు పాల్గొని అత్యత్తమ క్రీడా నైపుణ్యం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొని హోరాహోరిగా తలపడ్డాయి. ఎస్ఆర్–1, ఎస్ఆర్–2 జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎస్ఆర్–1 జట్టు ఎస్దర్–2 జట్టుపై 38–34 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. విజేతగా నిలిచిన ఎస్ఆర్–1 జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఎస్ఆర్–2 జట్టు రన్నరప్‌గా నిలువగా తృతీయ స్థానంలో కార్పొరేట్ సెంటర్ (సీసీ) జట్టు, నాలుగో స్థానంలో నార్తర్న్ రీజియన్–3(ఎన్ఆర్–3) జట్లు నిలిచాయి. ఉత్తమ రైడర్‌గా అమన్ ఠాకూర్ (కార్పొరేట్ సెంటర్), ఉత్తమ క్యాచర్‌గా క్లారెక్స్ (ఎస్ఆర్2), ఉత్తమ ఆల్‌రౌండర్‌గా లవన్‌కుమార్ (ఎస్ఆర్–1) నిలిచి బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో ఎస్ఆర్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దోమన్ యాదవ్, చీఫ్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఇబ్రహీంపట్నం: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కామ్రేడ్ తోడే అడివయ్య పోరాట జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ ఆదివారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. అడివయ్య మనుమరాలు, బాలచందర్ కుమార్తె తోడే మానస అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాలన్నారు. నాటి ప్రజల హక్కుల కోసం కామ్రేడ్స్ తోడే అడివయ్య, కృష్ణమూర్తి, కె.కోటప్ప, పి.జంగయ్య, కె. జంగారెడ్డిలాంటి యోధులు పోరాడి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారన్నారు. చరిత్రను పుస్తకాల్లో చదవడంతో సరిపెట్టకుండా, నాటి యోధుల త్యాగాల స్ఫూర్తిని నేటి సామాజిక పోరాటాల్లో కొనసాగించాలన్నారు. తండ్రి చివరి కోరిక నేరవేర్చిన పిల్లలు కామ్రేడ్ తోడే అడివయ్య జీవిత చరిత్రను పుస్తకరూపంలో ప్రజలకందించాలని తపన పడి రచించిన అతని కుమారుడు తోడే బాలచందర్ అకస్మాత్తుగా మృతిచెందారు. తండ్రి బాలచందర్ చివరి కోరికను కుమార్తె తోడే మానసకుమారి, కుమారుడు డా.తోడే మదన్ పుస్తకావిష్కరణ వేడుకలను ప్రముఖుల మధ్య నిర్వహించి నెరవేర్చారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జాతీయ నాయకులు ఝాన్సీ, సంధ్య, రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షురాలు ప్రేమలత, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు జంగారెడ్డి, ఎ.మల్లేష్, హైకోర్టు న్యాయవాది భగవంత్‌రెడ్డి, రిటైర్డ్ డీసీపీ జాన్‌వెస్లీ, హుణనాయక్, కె.రాంరెడ్డి, టి.సత్యనారాయణ, మధుసూధన్‌రెడ్డి, చందునాయక్, బి.సత్తన్న, కుటుంబసభ్యులు తోడే మానస, మదన్, సీపీఐ మండల కార్యదర్శి సురేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి బోడ సామేల్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
నిరుపేదల సంక్షేమమే ధ్యేయం
షాద్‌నగర్: నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడంతో పాటు ఆధు నిక సాంకేతికతతో కూడిన స్మార్టు కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ కార్టు ద్వారా డూప్లికేషన్‌కు అవకాశం లేకుండా మరింత పారదర్శకంగా సేవలు అందుతాయన్నారు. అర్హులైన ప్ర తీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వం, వైస్ చైర్మన్ అందె మోహన్, కమిషనర్ సునీత, తహసీల్దార్ నాగయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి
కొడంగల్: విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రివల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) జాతీయ అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని, నిరుద్యోగులకు ప్రతీ నెల రూ.4వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని, ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వడ్డె భీమ్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్, వెంకటేశ్, మహ్మ ద్ ఫయాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
లైట్ తీసుకున్నారు
మొయినాబాద్: సాధారణంగా ఏ వస్తువైనా పాడైతే మరమ్మతులు చేయించి మళ్లీ ఉపయోగిస్తారు. మున్సిపల్ అధికారులు మాత్రం స్క్రాప్‌లో పడేస్తారు. మొయినాబాద్ మున్సిపాలిటీలోని పెద్దమంగళారంలో గతంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు కొంత కాలం క్రితం పాడయ్యాయి. వాటికి మరమ్మతులు చేయించి తిరిగి వాడుకునే అవకాశం ఉన్నా అధికారులు అలా చేయలేదు. వాటిని విద్యుత్ స్తంభాల నుంచి పూర్తిగా తొలగించి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న ఓ భవనంలో స్క్రాప్ కింద పడేశారు. సుమారు వందకుపైగా లైట్లను ఇలా పడేయడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
ఇబ్రహీంపట్నం: వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగివేసారిపోయారని, రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్, రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన తిరిగిరావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తప్పుచేశామన్న భావన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రజలను దృష్టి మళ్లించేందుకే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను పక్కదారి పట్టించాలన్న ముఖ్యమంత్రి ఎత్తుగడలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శిలాఫలకాలతో కాలం వెళ్లదిస్తున్నాడే తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై నిరంతరం పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు కృపేశ్, ఇందిర, పార్టీ నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి, రాజు నాయక్, బుగ్గరాములు, రమేష్‌గౌడ్, చీరాల రమేష్, కిషన్‌గౌడ్, జగదీశ్వర్, అల్వాల వెంకట్‌రెడ్డి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి -
శరవేగంగా గ్రీన్‌ఫీల్డ్
ఆమనగల్లు: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రావిర్యాల నుంచి ఆకుతోటపల్లి వరకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. మండలంలోని ఆకుతోటపల్లి గ్రామం నుంచి రోడ్డు పనులను ప్రారంభించారు. మూడు నాలుగు నెలలుగా ముమ్మరంగా జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. దీంతో కాంట్రాక్ట్ చేజిక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఆధ్వర్యంలో పనులు షురూ అయ్యాయి. ప్రస్తుతం వందమీటర్ల వెడల్పుతో నిర్మాణం చేపడుతున్నారు. రోడ్డు నిర్మాణం ప్రారంభం కావడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణాన్ని మొదటి ఫేస్‌లో రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు (19.20 కి.మీ), రెండో ఫేస్‌లో మీర్ఖాన్పేట నుంచి ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి వరకు (22.30 కి.మీ) రోడ్డు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు భూసేకరణ చేపట్టారు. ఇందుకోసం ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లిలో 59 మంది రైతులకు చెందిన 83.10 ఎకరాలు, ఆమనగల్లు మున్సిపల్ పరిధిలోని సాకిబండతండాలో 26 మంది రైతులకు చెందిన 66.23 ఎకరాల భూమిని రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించారు. కడ్తాల్‌లో 72.23 ఎకరాలు, ముద్విన్ గ్రామంలో 179.02 ఎకరాలు సేకరించడానికి ప్రతిపాదించారు. ఈ మేరకు అధికారులు రైతులతో పలు విడతలు చర్చించి నష్టపరిహారం నిర్ణయించారు. భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చిన వారికి దాదాపు 90 శాతం మందికి ప్రభు త్వం పరిహారం చెక్కులు అందించింది. నిరాకరించినవారికి జనరల్ అవార్డు కింద పరిహారం అందించనున్నట్లు సమాచారం. కడ్తాల్ మండలంలో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఆకుతోటపల్లి నుంచి రోడ్డు ప్రారంభం వందమీటర్ల వెడల్పుతో నిర్మాణం వడివడిగా సాగుతున్న పనులు నిర్మాణం పూర్తయితే తగ్గనున్న ట్రా‘ఫికర్’ భూముల ధరలు పెరిగే అవకాశం ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి నుంచి గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణ పనులను ఎల్అండ్టీ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టారు. మూడునాలుగు నెలల క్రితమే పనులు ప్రారంభించారు. ప్రస్తుతం చకచకా జరుగుతున్నాయి. మీర్ఖాన్పేట నుంచి కడ్తాల్, ఆకుతోటపల్లి మీదుగా ట్రిపుల్ ఆర్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. రోడ్డు నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఆకుతోటపల్లి సమీపంలో క్రషర్ ఏర్పాటు చేశారు. వందమీటర్ల వెడల్పుతో నిర్మాణ పనులు చేస్తున్నారు. రేడియల్ రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు, సైకిల్‌ట్రాక్, ఫుట్‌పాత్‌తో పాటు మెట్రో రైలు నిర్మాణానికి డిజైన్ చేయడంతో ఆ మేరకు పనులు చేపడుతున్నారు. నిర్మాణం పూర్తయితే హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గనుంది. కొన్నేళ్లుగా రియల్ఎస్టేట్ రంగం ఈ ప్రాంతంలో పూర్తిగా పడిపోయింది. ప్రస్తుతం రోడ్డు నిర్మాణం ప్రారంభం కావడంతో రియల్టర్ల సందడి ప్రారంభమైంది. రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. -
కడాకు నిధుల వరద
సొంత గడ్డకు ప్రాధాన్యం.. పక్క నియోజకవర్గాలకు మొండిచేయివికారాబాద్: వడ్డించే వాడు మనవాడైతే వెనుక బంతిలో కూర్చున్న పర్వాలేదన్నట్టుగా కొడంగల్ నియోజకవర్గ పరిస్థితి ఉందని జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ మినహా మిగిలిన నియోజకవర్గలపై వివక్ష చూపుతున్నారంటూ ఆయా నియోజకవర్గ పరిధి ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదలు జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ‘కడా’కే పరిమితమైన సమీక్షలు తాజాగా శుక్ర, శనివారాల్లో సీఎం జిల్లా పర్యటనలోనూ ఇదే పునరావృతమైంది. రెండు రోజుల ఆయన సుధీర్ఘ పర్యటన పూర్తిగా కడా(కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ)కే కట్టుబడ్డారు. జిల్లా అధికారుల సమీక్షా, బీఎల్ఏ, కార్యకర్తల సమావేశంలోనూ ఆయన మాటలు కడా పరిధి దాటలేదు. పలుమార్లు జిల్లాలో పర్యటించిన ఆయన మున్సిపల్ ఎన్నికల ముందు పరిగి మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగభకు హాజరవడం మినహా మిగిలిన మూడు నియోజకవర్గాలు, కలెక్టరేట్లో ఇప్పటి వరకు అడుగుపెట్టలేదు. జిల్లాకు వచ్చిన ప్రతీసారి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం సొంత నియోజకవర్గానికే అధికారులను రప్పించి భారీ షెడ్లు వేయించి అక్కడే రివ్యూ నిర్వహిస్తున్నారు. ఇందుకు రూ.కోట్లు వెచ్చిస్తున్నారు తప్ప కలెక్టరేట్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్‌ను వినియోగించుకోవడంలేదు. నియోజకవర్గ స్థాయి సమీక్షకు జిల్లా అధికారులు, జిల్లాకు చెందిన ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎందుకనేది పాలుపోవడం లేదు. అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతీసారి వికారాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వెళ్లి సీఎంను కలుస్తున్నారు. పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు సైతం ఆయన పర్యటనలో భాగస్వాములు అవుతున్నారు. పనులు పరిశీలించే సమయంలో పక్కన ఉంచుకుంటున్నారు. కడాలో కొనసాగుతున్న పనులపై అధికారులతో సమీక్షించే సమయంలోనూ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎంకు చెరో పక్క కూర్చుకుంటున్నారు. గంటల తరబడి కొనసాగుతున్న సమీక్షల్లో ఇతర నియోజకవర్గాల గురించి.. ఆ నియోజకవర్గాలకు మంజూరు చేసిన పనుల గురించి, వాటి పురోగతి గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు. కనీసం పనుల ప్రోగ్రెస్ ఎలా ఉందని సంబంధిత జిల్లా అధికారులను అడగటంలేదు. గతంలో సీఎం నిర్వహించిన జిల్లా పర్యటనలన్నింటిలో ఇదే కొనసాగగా తాజా పర్యటనలోనూ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. సీఎం సొంత నియోజకవర్గంలో పనుల పురోగతిని పర్యవేక్షించటంతో పాటు జూనియర్ కళాశాల భవన సముదాయం, సీహెచ్‌సీ భవనం, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ భవనం ప్రారంభించారు. ఈ పనులు మంజూరైన సమయంలోనే జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో మంజూరైన పనులు ఇంకా శంకుస్థాపనలకే పరిమితమవటం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సమీక్షల సమయంలో పక్కనే ఉంటున్న స్పీకర్, ఎమ్మెల్యేలు కొడంగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.400 కోట్లు యాభైశాతం పనులు పూర్తి మిగిలిన నియోజకవర్గాలకు రూ.30 కోట్లు మంజూరు శిలాఫలకాలకే పరిమితమైన పనులు విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సీఎం సమీక్షలు సొంత నియోజకవర్గానికే పరిమితం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యక్తిని సీఎం పదవి వరించి వెయ్యిరోజులైంది. అప్పుడప్పుడు అభివృద్ధి పేరిట హడావుడి చేస్తున్న మంత్రుల పర్యటనలు ఆర్అండ్బీ రోడ్లు దాటి ఇంకో శాఖకు విస్తరించడం లేదు. కొడంగల్ మినహా మిగిలిన మూడు మున్సిపాలిటీలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. చిన్న మున్సిపాలిటీ కొడంగల్‌లో రూ.400 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్లు, యూజీడీ పనులు ఇప్పటికే యాభై శాతం పూర్తయ్యాయి. మున్సిపల్ శాఖ బాధ్యతలు సైతం చూస్తున్న సీఎం సొంత జిల్లాలో మిగిలిన మూడు మున్సిపాలిటీలు నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గతేడాది నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యేలు చేసిన హడావుడి శిలాఫలకాల వద్దే ఆగిపోయాయి. జిల్లాలో పనులకు టెండర్లు పిలిచి ఏడాది కావస్తున్నా..? ఒక్క పరిగి–వికారాబాద్, పరిగి–షాద్‌నగర్ రోడ్లు మినహా మిగతా పనులు ప్రారంభానికి నోచుకోవడంలేదు. ప్రారంభమైన పనులు సైతం మధ్యలోనే నిలిచిపోయాయి. జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలు నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. రహదారులు పాడై ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మంజూరైన పనులు ప్రారంభించడంలో జాప్యం కారణంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు ప్రజా విమర్శలు తప్పడం లేదు. -
విద్యుత్ షాక్‌తో ఆర్టిజన్ మృతి
మీర్‌పేట: ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి ఆర్టిజన్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ప్రశాంతిపురి తండాకు చెందిన కర్నాటి కృష్ణకాంత్ (43) మీర్‌పేట సెక్షన్ పరిధిలో ఆర్టిజన్ (జూనియర్ లైన్మెన్)గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నందిహిల్స్ రోడ్ నం–2లోని ఓ ఇంట్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని ఆన్లైన్లో ఫిర్యాదు రావడంతో కృష్ణకాంత్‌కు ఏఈ ఫోన్ చేసి పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ క్రమంలో అతను వెంకటాద్రి హోమ్స్ అపార్ట్మెంటు ముందున్న ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా షాక్ తగిలి కింద పడగా తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహంతో ఆందోళన విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. విద్యుత్ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే తన భర్త మృతి చెందాడని భార్య శాంత ఆరోపించారు. న్యాయం చేయాలని బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహంతో అక్కడే ఆందోళనకు దిగారు. పోలీసులు సముదాయించినప్పటికీ వినకపోవడంతో అంబులెన్స్‌లో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సెక్టార్ తన భర్త పరిధిలోనిది కాదని, అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా పంపించారని ఫిర్యాదులో పేర్కొంది. ఏఈ వివరణ మరమ్మతుల కోసం వెళ్లిన కృష్ణకాంత్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయాల్సింది మరో ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేశాడని, సరైన అవగాహన లేకే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని ఏఈ బాలాగౌడ్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన -
వానరా.. ఇదేమి బాధరా..
కడ్తాల్: కోతుల బెడదతో మండలంలోని చల్లంపల్లి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. గుంపులుగా సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి సామగ్రిని చిందవందర చేయడంతో పాటు అందిన వాటిని ఎత్తుకెళ్తున్నాయి. ఇళ్లపై.. వీధుల్లో పదుల సంఖ్యలో సంచరిస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లలో ఉండలేక.. బయటకు రాలేక భయాందోళనకు గురవుతున్నారు. పలువురిపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి వానర మూకను అటవీ ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు. -
టిప్పర్‌ను ఢీకొట్టిన కారు
● దంపతుల దుర్మరణం ● ఒకరి పరిస్థితి విషమం పరిగి: ముందు వెళ్తున్న సిమెంట్ టిప్పర్‌ను కారు ఢీకొట్టిన ప్రమాదంలో దంపతులు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్ గ్రామం చింతల్‌చెరువు ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. పూడూరు మండలంలోని గంగోనిపల్లి గ్రామానికి చెందిన మున్నూరు నర్సింలు, భార్య అంజమ్మ, తమ్ముడి కుమారుడు అభిరామ్ పనినిమిత్తం నారాయణపేట జిల్లా కోస్గికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని గడిసింగాపూర్ సమీపంలోని చింతల్ చెరువు ప్రాంతానికి రాగానే కారు ముందు వెళ్తున్న ఓ సిమెంట్ ట్యాంకర్‌ను వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో మంటలు చెలరేగడంతో నర్సింలు అక్కడికి అక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులు అంజమ్మ. అభిరామ్‌ను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న అంజమ్మ మృతి చెందగా.. అభిరామ్ పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాస్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
డబ్బా ధ్వంసంతో దుమారం
బషీరాబాద్: మండల పరిధిలోని మైల్వార్‌లో రేకుల డబ్బా ధ్వసం ఘటన వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన యువకుడు కందనెల్లి నగేశ్ స్వయం ఉపాధి కోసం రూ.1.50లక్షలు వెచ్చించి బస్టాండ్ సమీపంలో జిరాక్స్, స్టేషనరీ షాపు ఏర్పాటు చేశాడు. గత నెలలో షాపు ఏర్పాటుకు సర్పంచ్‌కు రాతపూర్వకంగా దరఖాస్తు చేశానని, పంచాయతీ కార్యదర్శి మౌఖిక సూచనల మేరకే డబ్బా ఏర్పాటు చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఈ క్రమంలో సర్పంచ్ సీమా సుల్తానా అనుచరులు ప్రారంభానికి ముందే డబ్బాను ధ్వంసం చేశారని ఆరోపించాడు. ఇదిలా ఉండగా అనుమతి లేకుండా డబ్బా ఏర్పాటు చేసి తమపై దాడికి యత్నించాడని సర్పంచ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఎస్ఐ విఠల్ గ్రామానికి చేరుకుని ఇరువర్గాల వాంగ్మూలాలు నమోదు చేసి ఘటనా స్థలిని పరిశీలించారు. దర్యా ప్తు అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బొంరాస్‌పేట: సీఎం రేవంత్‌రెడ్డికి ఇప్పటికే ఓటమి భయం పట్టుకుందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ దుద్యాల, బొంరాస్‌పేట మండలాల నాయకులతో కలిసి పాత పోలీసు స్టేషన్ నుంచి భూలక్ష్మి చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేల్లో ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయని, తనకు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం చుట్టుకుందని విమర్శించారు. సీఎం వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై నిర్భందాలు ఎందుకని ప్రశ్నించారు. ఇలాగే కొనసాగితే ప్రజలు మిమ్మల్ని రానివ్వకుండా తిరగబడే రోజులొస్తాయని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి తమ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నించే అర్హత లేదన్నారు. వందకోట్లు సీఎం ఫ్యామిలీకే ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. కొడంగల్ ప్రాంతంలో తన హయాంలోనే అభివృద్ధి పనులు చేశానని అన్నారు. ప్రస్తుతం ఇళ్లు, పెన్షన్లు, ఫైరవీలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం ఇళ్లు, భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం జరిగేలా పోరాడతామన్నారు. ● రూ.1.50 లక్షల పెట్టుబడి బూడిద ● పోలీసులకు ఇరువర్గాల ఫిర్యాదు -
శిక్షారత్న అవార్డు ప్రదానం
షాద్‌నగర్: గ్రీన్ ఫీల్డ్ డీమ్డ్ యూనివర్సిటీ హార్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్‌కు శిక్షారత్న అవార్డు అందజేశారు. ఆదివారం నందిగామ మండలం కన్హాశాంతి వనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్ ఆచార్య బాలకృష్ణ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ స్థాపించి ఓటర్లను చైతన్య పరుస్తూ కార్యక్రమాలు నిర్వహించినందుకు అవార్డు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, అవార్డు స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు, చైతన్య సదస్సులు నిర్వహిస్తానని డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు తెలిపారు. బడంగ్పేట్: తెలంగాణ విమోచన జైత్రయాత్రలో భాగంగా ‘చలో చార్మినార్’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. కార్యక్రమానికి పిలుపునిచ్చిన బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములుయాదవ్ను ఆదివారం ఉదయాన్నే పోలీసులు నాదర్గుల్లోని ఆయన ఇంటికి చేరుకుని ముందస్తు అరెస్ట్ చేశారు. అడ్డుకోబోయిన కార్యకర్తలు, నాయకులను సైతం అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ.. తెలంగాణ రజాకార్ల పాలన నుంచి ఇంకా విముక్తి కాలేదని అన్నారు. రాష్ట్రంలో రజాకార్ల పాలనను తలపించే పరిస్థితులు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఎన్ని ఆంక్షలు, అడ్డంకులు సృష్టించినా రాబోయే రోజుల్లో చలో చార్మినార్ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి తోకల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు శ్రీరాములును కలిసి మాట్లాడారు. కడ్తాల్: బంజారా సేవాదళ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా మండల పరిధిలోని గుర్లకుంటతండాకు చెందిన వాక్డోవత్ హన్మానాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఆదివారం నిర్వహించిన సంఘం కార్యవర్గ సమావేశంలో బంజారా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాంరాథోడ్ నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హన్మానాయక్ మాట్లాడుతూ.. బంజారాల సమాజ ప్రగతి, సంఘం ఆశయాల సాధనకు నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. అనంతరం గిరిజన నాయకులు హన్మానాయక్ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇబ్రహీంపట్నం: సీపీఎం జిల్లా నూతన కార్యదర్శిగా బోడ సామెల్‌ను జిల్లా కమిటీ నియమించింది. తులేకలాన్ గ్రామానికి చెందిన సామెల్ ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. అకస్మాత్తుగా జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్యను తొలగించి బోడ సామెల్‌ను నియమించడంతో వామపక్షాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి యాదయ్య తప్పుకున్నాడా లేక ఆ పార్టీ సెంట్రల్ కమిటీ యాదయ్యను తప్పించిందా అనే చర్చ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో సస్పెండైన కార్మిక సంఘం ఓ మహిళ నేత ఫిర్యాదు మేరకు సెంట్రల్ కమిటీ యాదయ్యను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. -
‘చేయూత’ దరఖాస్తు గడువు పెంపు
కలెక్టర్ నారాయణరెడ్డి తుక్కుగూడ: చేయూత పెన్షన్ దరఖాస్తు గడువు ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించిన ట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు గడువులోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించా రు. ఒంటరి మహిళ పెన్షన్ కోసం తహసీల్దార్, ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్, లోకల్ ఎంకై ్వరీ రిపోర్టు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. వితంతు పెన్షన్ దరఖాస్తుదారులు భర్తకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ వివరాలు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దివ్యాంగులు సదరం పత్రాన్ని దరఖాస్తు సమయంలో జత చేయాల్సిన అవసరం లేదన్నారు. గతంలో పెన్షన్ వచ్చి, పలు కారణాల వల్ల నిలిచిపోయిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కల్లుగీత కార్మికులు తప్పకుండా ఎకై ్సజ్ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు జత చేయాలన్నారు. చేనేత కార్మికులు ఏ.డీ హ్యండ్లూమ్స్ శాఖ అధికారులు ఇచ్చిన కార్డును ఇవ్వాలన్నారు. దరఖాస్తు సమయంలో సందేహాలు ఉంటే 92475 24051 నంబర్లో సంప్రదించాలన్నారు. డిప్యూటీ సీఎంను కోరిన చేవెళ్ల ఎమ్మెల్యే షాబాద్: బడుగుల సంక్షేమం, అభివృద్ధే కాంగ్రె స్ ప్రభుత్వ లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం ఆయన సర్ధార్‌నగర్ ఏఎంసీ చైర్మన్ సురేందర్‌రెడ్డితో కలిసి సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల అభివృద్ధి పనులుకు నిధులు మంజూరు చేయాలని చెప్పారు. ఏట్ల ఎర్రవల్లి చిన్న వాగు బ్రిడ్జికి నిధులు సరిపోక పనులు మధ్యలోనే ఆగిపోయాయని దాన్ని పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్పై దురుసుగా ప్రవర్తించిన యువకుడు మొయినాబాద్: మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్ చౌరస్తా వద్ద శనివారం ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ్ ఈ పరీక్షలను పర్యవేక్షించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పది మందిని పట్టుకుని కేసు నమోదు చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ వ్యక్తి మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనికోసం వచ్చిన ఓ యువకుడు ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సతీశ్‌ను నెట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. అతని తరపున ఓ కౌన్సిలర్ వచ్చి యువకుడిని తీసుకెళ్లి పోయాడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను నెట్టివేసి దురుసుగా ప్రవర్తించిన యువకుడిపై కేసు నమోదు చేయకుండా వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ షాద్‌నగర్ రూరల్: పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ సమక్షంలో హౌసింగ్ కార్పొరేషన్ రిటైర్డ్ ఏఈ బాలయ్య పార్టీలో చేరారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల్లో బహుజనులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. సబ్బండ వర్గాలకు సమన్యాయం బీఎస్పీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్సింలు, కుమార్, మహేందర్, చెన్నయ్య, ఆంజనేయులు, రాజు పాల్గొన్నారు. -
‘లక్ష్మీదేవిపల్లి’ డీపీఆర్ విడుదల చేయాలి
షాద్‌నగర్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీదేవిపల్లిలో నిర్మించే రిజర్వాయర్‌కు సంబంధించిన డీపీఆర్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక(టీవీవీ) రాష్ట్ర కోశాధికారి టీజీ శ్రీనివాస్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి తిరుమలయ్య డిమాండ్ చేశారు. శనివారం వారు పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ.. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ఉద్యమ సమంలో ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారన్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్‌ను మార్చి జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసే విధంగా డిజైన్‌ను రూపొందించారన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చివరిదైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం, భూసేకరణకు నోటీఫికేషన్ జారీ చేయడం హర్షనీయమని అన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలన్నారు. ఈ రిజర్వాయర్‌తో ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో తెలియజెప్పాల్సిన భాద్యత ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ సమావేశంలో కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినబాక ప్రభాకర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు అర్జునప్ప, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రవీందర్ పాల్గొన్నారు. టీవీవీ రాష్ట్ర కోశాధికారి టీజీ శ్రీనివాస్ -
చిలుకూరులో కృష్ణాష్టమి వేడుకలు
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఏడాది శ్రీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని చిలుకూరులో నవమి రోజు వేడుకలు నిర్వహిస్తారు. అందులో భాగంగా శనివారం స్వామివారిని ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయం ముందు ఉట్టి కొట్టారు. ఆలయ అర్చకుడు రంగరాజన్ కృష్ణాష్టమి విశిష్టతను భక్తులకు వివరించారు. వేడుకల్లో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ స్వామి, మాజీ సర్పంచ్ సంగెరి మల్లేశ్, కౌన్సిలర్ జగపతి, నాయకులు జనార్ధన్‌రెడ్డి, యాదగిరి, నర్సింహగౌడ్, రాజేశ్, అర్చకులు పాల్గొన్నారు. -
టూరిస్ట్ సీఎంను నమ్ముకుంటే ప్రయోజనం శూన్యం
హుడాకాంప్లెక్స్: టూరిస్ట్ సీఎంను నమ్ముకుంటే ప్రయోజనం శూన్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా రెడ్డి విమర్శించారు. వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం సరూర్‌నగర్ డివిజన్ కొత్తపేట చౌరస్తా నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టు వరకు యువజన నాయకులు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బాగుపడలేదని అన్నారు. స్వయాన సీఎం విద్యా శాఖ మంత్రి అయి ఉండి కూడా పాలిటెక్నిక్ విద్యార్థులపై నిరంకుశంగా వ్యవరిస్తునారని దుయ్యబట్టారు. తక్షణమే వీరి సమస్యను ప్రభుత్వం పరిష్కారించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ నగర్లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు ఇంటూరి అంకిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. కార్యక్రమంలో గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, బీఆర్ఎస్ నాయకుడు దర్పల్లి అశోక్, యువజన నాయకులు కొండల్ రెడ్డి, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
చేవెళ్ల అభివృద్ధికి సహకారం
చేవెళ్ల: చేవెళ్ల అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన వికారాబాద్ జిల్లాకు వెళ్తూ మార్గమధ్యలో చేవెళ్ల మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతావెంకట్‌రెడ్డి ఇంటి వద్ద కాసేపు ఆగారు. ఆయనకు ఎమ్మెల్యే కాలె యాదయ్య, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చేవెళ్ల అభివృద్ధి, నిధులు, ఎన్‌హెచ్–163 రోడ్డు పనుల పురోగతిపై చర్చించారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారాని చర్యలు తీసుకుంటాన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా విద్యాభివృద్ధికి సహకారం అందిస్తానని చెప్పారు. పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు శైలజరెడ్డి, ఎం.శ్రీనివాస్, కృష్ణానాయక్, గోపాల్‌రెడ్డి, కళ్యాణి, మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, నాయకులు ఆగిరెడ్డి, వసంతం, ఎం.యాదగిరి, శ్రీను, కర్నె శివప్రసాద్, ఖదీర్‌పాషా, తదితరులు ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
శంకర్పల్లి: గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కొండకల్ శివారులో చోటు చేసుకుంది. వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన ప్రకారం.. శనివారం ఉదయం 11.30కి హైదరాబాద్–వికారాబాద్ వైపు ప్రయాణిస్తున్ను హుస్సేన్ సాగర్ రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి(25) మృతి చెందాడు. లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు వికారాబాద్ రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని వికారాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
పోటీలతో క్రీడాస్ఫూర్తి పెంపు
బడంగ్పేట్: నాదర్గుల్లోని విద్యాభారతి విజ్ఞాన కేంద్రం పాఠశాల ప్రాంగణంలో శనివారం దక్షిణ మధ్య క్షేత్ర సమితి ఖేల్ ఖూద్–26 క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీబీఎస్ఈ బోర్డు డిప్యూటీ కార్యదర్శి జంగం సునీల్‌కుమార్, ఇస్రో పూర్వ సైంటిస్ట్ పద్మశ్రీ జ్ఞానగాంధీ, వనమాలి ఆర్గానిక్ డైరెక్టర్ రాజయ్య, మాజీ ఐఏఎస్ ఉమామహేశ్వర్రావు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరస్వతి విద్యాపీఠం పాఠశాలల నుంచి వచ్చిన క్రీడాకారులు తొలుత అతిథులకు గౌరవ వందనం చేశారు. అనంతరం అతిథులు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆటల పోటీలు ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సంఘటన తెలంగాణ కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు, సరస్వతి విద్యాపీఠం తెలంగాణ కార్యదర్శి అనఘా వెంకటలక్ష్మి, క్రీడల ప్రముఖ్ సత్యనారాయణ, విభాగ్ శైక్షనిక్ ప్రముఖ్ కాసోజు భూషన్, వీబీవీకే పాఠశాల అధ్యక్షుడు రమేష్‌గుప్తా, ఉపాధ్యక్షుడు బస్సు సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి విష్ణువర్థన్‌రాజు, కృష్ణారెడ్డి, కోశాధికారి కొండ కల్యాణ్, సభ్యులు సునీత, వెంకటేశ్వర్రావు, పాఠశాల ప్రిన్సిపాల్ కరణాకర్ తదితరులున్నారు. సీబీఎస్ఈ బోర్డు డిప్యూటీ కార్యదర్శి సునీల్‌కుమార్ -
కార్యకర్తలే నా బలం
కొడంగల్/బొంరాస్‌పేట/వికారాబాద్: కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని తమ భుజాల మీద మోస్తున్న కార్యకర్తలే తనకు బలమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వారి సహకారం.. అండ దండలతోనే తనకు ఈ పదవి, హోదా దక్కిందని పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని బీఎల్ఏలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు తొలగించడానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తడి బట్టతో గొంతు కోసినట్లు ఓట్లను తొలగించి పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలన్నారు. ప్రతి పేద వాడికీ ఓటు హక్కు ఉండాలన్నారు. ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే బాధ్యత తనపై ఉందన్నారు. కొడంగల్‌లో మాత్రమే ప్రతి కార్యకర్త ఒక రేవంత్‌రెడ్డిగా భావించి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. దేశ స్థాయిలో కొడంగల్‌కు గుర్తింపు వచ్చిందంటే అది మీ వల్లే సాధ్యమైందని కార్యకర్తలకు సూచించారు. కొడంగల్‌లో 81 వేల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. పేర్లలో తప్పులు, అడ్రసులో మార్పులు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని నోటీసులు ఇచ్చారని అన్నారు. వాటిని సరి చేయించి ఓటును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నా రు. ఇది పేదల సమస్య. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు తొలగించడానికి కుట్రలు జరుగుతున్నాయని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు నిర్లక్ష్యం వహించకుండా ప్రతి పేద వాడికి ఓటు హక్కు కల్పించాలన్నారు. కొడంగల్‌లో 35వేల ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు చెప్పారు. ఓట్లను కాపాడుకుంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్నారు. లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇంటింటికి వెళ్లి సర్‌లో పేర్లు నమోదు చేయించాలన్నారు. ఓటు లేకపోతే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా పోతాయని హెచ్చరించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను వందశాతం పూర్తి చేసి కొడంగల్‌ను ముందు వరుసలో నిలబెట్టాలన్నారు. కొడంగల్‌ను అభివృద్ధి చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు. మళ్లీ కొడంగల్‌పై కక్ష కట్టి సర్‌లో ఓట్ల తొలగించడానికి కుట్ర చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారి సహకారంతోనే పదవి, హోదా -
మూడు రోజులకు మించితే..
సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. అంత మాత్రాన జ్వరం, దగ్గు, ముక్కు కారడం తదితర లక్షణాలు కనిపించగానే స్వైన్ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే మధుమేహులు, గర్భిణులు, పిల్లలు, వృద్ధులు సహా కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న బాధితులు ఫ్లూ భారిన పడే అవకాశాలు ఎక్కువ. సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూలను వైద్యులే గుర్తించాలి. అయితే స్వైన్ ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలకు ఈ అలవాటు నేర్పించాలి. మూడు రోజులు కంటే ఎక్కువ వేధిస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడుదు. – డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, మహేశ్వరం మెడికల్ కాలేజీ -
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిత
● ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ● జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల అందజేత ఇబ్రహీంపట్నం: విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే నిర్మాణ ప్రక్రియ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం శేరిగూడలోని ఇందు కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్మయి తదితరులు జిల్లా స్థాయిలో ఎంపికై న ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కొంతమంది డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని...అలాంటి వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దేశ భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మార్గదర్శకులని, ఆ బాధ్యతను అంకితభావంతో నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల విద్యాధికారులు, ఉత్తమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్వైన్‌ఫ్లూ.. డెంగీ జ్వరాలు మళ్లీ విజృంభిస్తున్నాయి. కోవిడ్ మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి ఇప్పడిప్పుడే తేరుకుంటున్న జిల్లా వాసులకు తాజాగా ఫ్లూ ఫియర్ పట్టుకుంది. పూర్తిగా మాయమై పోయిందనుకున్న ఈ స్వైన్‌ఫ్లూ వైరస్ మళ్లీ ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలో జూలైలో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, ఆగస్టులో ఏకంగా 26 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 2009లో హైదరాబాద్‌లో మొదటి సారిగా ‘హెచ్1 ఎన్1’అనే ‘ఇన్‌ఫ్లూయెంజా–ఎ’వైరస్ మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో పెద్ద సంఖ్యలో స్వైన్‌ఫ్లూ కేసులు, మరణాలు నమోదయ్యాయి. ప్రతీ రెండేళ్లకోసారి వైరస్ కొత్తగా రూపాంతరం చెందుతోంది. 2017కు ముందు ‘కాలిఫోర్నియా స్ట్రెయిన్’గా వ్యాప్తిలో ఉన్న వైరస్ రెండేళ్ల కిందట ‘మిషిగాన్ స్ట్రెయిన్’గా కొత్త అవతారమెత్తింది. 2015–2019 మధ్య కాలంలో ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఆ తర్వాత వైరస్ కొంత తగ్గుముఖం పడుతూ వచ్చింది. గత ఆరేళ్లుగా ఆనవాళ్లు పెద్దగా కనింపచలేదు. తాజాగా 2026 జూలై, ఆగస్టు మాసాల్లో మళ్లీ స్వైర విహారం చేస్తోంది. ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తూ, సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఒక్క నెలలో 132 డెంగీ కేసులు ఎల్‌నినో కారణంగా ప్రస్తుతం వర్షాలు కూడా లేవు. ఇంటి ఆవరణలోని పూల కుండీలు, వాటర్ ట్యాంకులు, ఇంటిపై ఉన్న టైర్లు, ఖాళీ కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్ డబ్బాల్లోనూ నీరు కూడా నిల్వ లేదు. కానీ డెంగీ దోమలు మాత్రం విజృంభిస్తున్నాయి. బస్తీలు, కాలనీలు, శివార్లు తేడా లేకుండా ఇటీవల ఆయా ప్రాంతాల్లో కొత్తగా అనేక బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. వీటి కింద ఉన్న నీళ్ల ట్యాంకులపై మూతలు లేక పోవడం, క్యూరింగ్ కోసం వాడిన నీరు రోజుల తరబడి నిల్వ ఉంచుతుండడం వల్ల నేడవి డెంగీ(టైగర్)దోమలకు నిలయంగా మారుతున్నాయి. ఆ పక్కనే ఉన్న సిటిజన్లపై పగటిపూట తమ పంజా విసురుతున్నాయి. ఫలితంగా జనవరి నుంచి జూలై వరకు జిల్లాలో 77 డెంగీ కేసులు మాత్రమే నమోదు కాగా, కేవలం ఒక్క ఆగస్టులోనే 132 కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. డెంగీ జ్వరాలను సకాలంలో గుర్తించకపోవడం, చికిత్సను జాప్యం చేయడంతో రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయి రోగనిరోధక శక్తి తగ్గుతోంది. మనిషి రక్తంలో 1.50 లక్షల–4.50 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. జ్వరపీడితుల్లో ఈ కౌంట్ తగ్గుతుంది. ప్రస్తుతం ఆస్పత్రులకు వస్తున్న చాలా మంది రోగుల్లో ప్లేట్లెట్ కౌంట్ 40వేల లోపే ఉంటోంది. వాస్తవానికి 25 వేల వరకున్న పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. ఒకవేళ కౌంట్ 20 వేలకు పడిపోయి నోరు, ముక్కు నుంచి బ్లీడింగ్ అయితే వెంటనే ప్లేట్లెట్స్ పునరుద్ధరించాలి. లేదంటే షాక్‌కు గురై కోమాలోకి వెళ్లి చనిపోయే ప్రమాదం ఉంది. మళ్లీ విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ, డెంగీ జిల్లాలో 26 ఫ్లూ, 209 డెంగీ కేసులు ఆగస్టులోనే 132 డెంగీ ఫీవర్స్ చాపకింది నీరులా సీజనల్ వ్యాధులు -
78 రోజులకు తీవ్ర జ్వరం
ఈడిన్ ఈజిఫ్టై(టైగర్ దోమ) కుట్టడం ద్వారా డెంగీ సోకుతుంది. ఇది పగటి పూట మాత్రమే కుడుతుంది. దోమ కుట్టిన 78 రోజులకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. కాళ్లు కదలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తాయి. రక్త కణాల(ప్లేట్స్‌లెట్స్) సంఖ్య పడిపోతుంది. కొన్నిసార్లు అవయవాలన్నీ పనిచేయడం మానేస్తాయి. లక్షణాలు గుర్తించిన వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డెంగీ నుంచి బయటపడొచ్చు. తాగునీటి ట్యాంకులపై మూతలు పెట్టడం, చెట్లపొదలను శుభ్రం చేయడం, పూల కుండీల్లో నీటినిల్వ లేకుండా చేయడం ద్వారా డెంగీ దోమలను దరి చేరకుండా చూడొచ్చు. జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రులకు వస్తున్న వారికి వైద్య పరీక్షలు సహా అన్ని రకాల మందులు అందజేస్తున్నాం. ప్రైవేటుకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందిపడటం కంటే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించి, సకాలంలో చికిత్సలు పొందడం ఉత్తమం. – డాక్టర్ డి.స్వర్ణకుమారి, డీఎంహెచ్ఓ -
వీఐపీ రూట్.. ట్రాఫికర్
పోటీలతో క్రీడాస్ఫూర్తి.. నాదర్గుల్లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం పాఠశాల ప్రాంగణంలో శనివారం ఖేల్ ఖూద్–26 పోటీలు నిర్వహించారు.మొయినాబాద్: మున్సిపాలిటీలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ప్రధాన రహదారికి ఇరుపక్కల ఉన్న షాపులు, హోటళ్ల ముందు పార్కింగ్ సరిగా లేక వాహనదారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు షాపుల ఎదుట బండి కొట్లు ఏర్పాటు చేయడంతో వాహనాలను రోడ్లుపైనే నిలుపుతున్నారు. దీంతో ప్రతి రోజు మొయినాబాద్ ప్రధాన చౌరస్తాతోపాటు హిమాయత్‌నగర్, అజీజ్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. హిమాయత్‌నగర్ చౌరస్తా నుంచి అజీజ్‌నగర్ చౌరస్తా వరకు హోటళ్లు, గ్రానైట్, టైల్స్ షాపులు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా హోటళ్ల వద్ద వాహనాలకు సరిపడా పార్కింగ్ స్థలం లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. దీన్ని పరిష్కరించాల్సిన అధికార యంత్రాంగం, పోలీసులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. రాంగ్ రూట్లో స్కూల్, కాలేజీ బస్సులు మొయినాబాద్తోపాటు చేవెళ్ల, వికారాబాద్ ప్రాంతాల్లో ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లు అధికంగా ఉన్నాయి. వీకెండ్స్‌లో చాలా మంది ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లకు, అనంతగిరికి వెళ్తుండడంతో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతోంది. సాధారణ రోజుల్లో సైతం ఉదయం, సాయంత్రం స్కూల్, కళాశాలల బస్సులతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. స్కూల్, కళాశాలల బస్సులు రాంగ్రూట్లో వెళ్తూ ట్రాఫిక్ అంతరాయానికి ఓ కారణమవుతున్నాయి. అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వ్యాపార సముదాయాలు, షాపులు, హోటళ్లకు మున్సిపల్ కార్యాలయం నుంచి నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. మున్సిపల్ అధికారులు వీటిపై దృష్టి పెట్టకుండా మామూళ్లకు ఆశపడి ఇష్టానుసారంగా వదిలేస్తున్నారనే అపవాదు ఉంది. దీంతో రహదారికి ఇరుపక్కల ఉన్న షాపులు, వ్యాపార సముదాయాల ఎదుట ఖాళీ స్థలం ఎంత ఉంది. పార్కింగ్ స్థలం ఉందా అనే విషయాలను మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో షాపుల ఎదుట స్థలాన్ని కబ్జాచేసి వాటిలో బండికొట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. వారి వద్ద రోజు లెక్క అద్దె వసూలు చేస్తూ లక్షలు దండుకుంటున్నారు. షాపుల ఎదుట అక్రమంగా రేకుల షెడ్లు ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదు. వీఐపీ రూట్.. అయినా మారని పరిస్థితి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో హైదరాబాద్–బీజాపూర్ రహదారిని వీఐపీ మూవ్మెంట్ రూట్‌గా ప్రకటించారు. సీఎం కొడంగల్ వెళ్లాలంటే ఇదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తన నియోజకవర్గం వికారాబాద్‌కు వెళ్లేందుకు ఇదే మార్గం. వారంలో రెండు మూడు సార్లు ఆయన వికారాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. అందుకే పోలీసులు వీఐపీ మూమెంట్ రూట్‌గా ప్రకటించారు. కానీ అందుకు తగినట్లు చర్యలు తీసుకోవడం లేదు. ఫొటోలు తీసి ఛలాన్లు మొయినాబాద్ ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఫోటోలు తీయడం, చలాన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నా క్లియర్ చేయకుండా రోడ్డుపక్కన నిలిపిన వాహనాల ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్నారు. షాపుల ఎదుట పార్కింగ్ స్థలం లేక రోడ్డుపక్కన వాహనాలు నిలిపితే ఫొటోలు తీసి ఫైన్లు వేస్తున్నారని స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. వీకెండ్స్‌లో విపరీతం హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ అంతరాయం పార్కింగ్ సదుపాయం లేక రోడ్లపైనే పార్కింగ్ ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు మొయినాబాద్‌లో షాపుల ఎదుట సామగ్రి పెట్టినా, బండికొట్లు పెట్టినా వాటిని తొలగించేందుకు నోటీసులు ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు తెలిపాం. అలా పెట్టినవారికి చలాన్లు వేస్తున్నాం. వాహనాల రాకపోకలు పెరగడంతోనే ట్రాఫిక్ సమస్య వస్తోంది. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. – సతీశ్, ట్రాఫిక్ సీఐ, చేవెళ్ల నాలుగు రోజుల క్రితం మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఓ కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి అజీజ్‌నగర్ చౌరస్తా వద్ద అంతరాయం కారణంగా అరగంట పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. మొయినాబాద్ నుంచి అప్పా జంక్షన్ వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం. సాధారణ రోజులో కేవలం పది నిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ శని, ఆదివారం వచ్చిందంటే సుమారు అరగంటకు పైగా సమయం పడుతుంది. ఇదీ మొయినాబాద్‌లో ట్రాఫిక్ పరిస్థితి. -
● కళాత్మక బోధన
బొంరాస్‌పేట: కళాత్మక బోధనతో విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొదిస్తున్న వడిచర్ల ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం నరేందర్‌గౌడ్ 2025లో తెలంగాణ నుంచి సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్ అనే జాతీయ స్థాయి కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఢిల్లీలోని భారత్ భవన్లో ప్రత్యేక శిక్షణపొందారు. మండల, జిల్లా స్థాయిల్లోని సమావేశాలు, ఆదర్శ బోధన తరగతులు, కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక గుర్తింపుతో ఉపాధ్యాయుల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ధన అభ్యసన సామర్థ్యాలు పెంచింది. విద్యార్థులు చురుకుగా మారారు. -
● జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు
కేశంపేట: స్థానిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న విద్యావతి ఉత్తమ జీహెచ్ఎంగా, పాపిరెడ్డిగూడ, కొత్తపేట, నిర్ధవెళ్లి హైస్కూళ్లలో పనిచేస్తున్న ఆనంద్‌బాబు, హారతి, కరుణాకర్‌గౌడ్, కేశంపేట, పాపిరెడ్డిగూడ, మంగళిగూడ, కేశంపేట, అల్వాల ప్రాథమిక పాఠశాలలకు చెందిన అప్పారావు, అరుణ, లక్ష్మీశిరీష, అపర్ణ, శ్రీధర్ పురస్కారాలకు ఎంపికయ్యారు. శనివారం మధ్యాహ్నం శ్రీ హిందు ఇంజనీరింగ్ కళాశాల మంగళ్‌పల్లి, ఇబ్రహీంపట్నం వద్ద పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. -
● కందుకూరు నుంచి 13 మంది
కందుకూరు: మండల పరిధిలోని 13 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు జిల్లా స్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో వి.అంజయ్య(కందుకూరు ఉన్నత పాఠశాల హెచ్ఎం), ఓ.శ్రీనివాస్‌శర్మ(నేదునూరు ఉన్నత హెచ్ఎం), జి.సంజీవరెడ్డి(ఆకులమైలారం ఉన్నత), ఎన్.కల్పనగౌడ్(రాచులూరు జెడ్పీహెచ్ఎస్), కె.శ్రీధర్, కె.హరిప్రసాద్(మీర్ఖాన్పేట ఉన్నత), వై.శ్రీనివాస్‌రావు(లేమూరు ఉన్నత), కె.వెంకటరమణ, ఎల్.శేఖర్(నేదునూరు మోడల్), బి.సువర్ణ(కందుకూరు ఎంపీపీఎస్), సీహెచ్ కళావతి(ఎంపీపీఎస్ పులిమామిడి), ఎస్.నజీర్‌హుస్సేన్(దాసర్లపల్లి యూపీఎస్), డి.రంగనాథ్(మాదాపూర్ యూపీఎస్) ఉన్నారు. -
● మొయినాబాద్ మండలంలో ఆరుగురు
మొయినాబాద్ రూరల్: మొయినాబాద్ మండలం నుంచి కనకమామిడి పాఠశాలలో పనిచేస్తున్న సంగీత, నదీమ్‌నగర్ కేజీబీవీలో పని చేస్తున్న ఉదయశ్రీ, శ్రీరామ్‌నగర్ పాఠశాల టీచర్ స్వర్ణలత, ఎం.సులోచన మేడిపల్లి ప్రాథమిక, జి.మంజుల తోల్కట్ట ఉన్నత, నాగిరెడ్డిగూడలో పనిచేస్తున్న టి.మహేష్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మున్సిపల్ పరిధిలో ఇద్దరుమొయినాబాద్: మొయినాబాద్ మున్సిపాలిటీలో ఇద్దరు ఉపాధ్యాయులు జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. వీరిలో హిమాయత్‌నగర్ మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, అజీజ్‌నగర్ ఉన్నత పాఠశాలకు చెందిన పి.బాలమణి ఉన్నారు. -
ఆత్మహత్య చేసుకుంటానని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
సకాలంలో స్పందించి యువకుడిని కాపాడిన పోలీసులు యాచారం: ప్రేమ విఫలమై తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. సాంకేతిక పరిజ్ఞానంతో స్పందించిన పోలీసులు అతడిని కాపాడారు. వివరాలివీ.. మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామానికి చెందిన చేపంగి కిషోర్ (23) బోనాల పండుగ సందర్భంగా గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలోని తన మేనమామ గ్రామమైన ముచ్చర్లకు వచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. ఇది గుర్తించిన ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ పోలీసులు పోస్టుపెట్టిన యువకుడు గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో ఉన్నట్లు గుర్తించి, ఆ పీఎస్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అక్కడి ఎస్ఐ సైదులు సిబ్బందితో కలిసి కిషోర్ ఉన్న స్థలం వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ప్రేమలో విఫలం కావడంతోనే మనస్తాపానికి గురై చనిపోవాలనుకున్నట్లు తెలిపాడు. కిషోర్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులను పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీసులను పలువురు అభినందించారు. -
కావాలి సారూ.. మీవంటి వారు
పూడూరు: సమాజంలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులదే. విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలిపే శక్తి వీరికి మాత్రమే సాధ్యం. ఎంతో మందిని ఉన్నతంగా తీర్చిదిద్ది అనేక అవార్డులు అందుకున్న వారిలో పూడూరు మండలం కంకల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఈశ్వర్రావు ఒకరు. ఎక్కడ పని చేసినా తనకంటూ ప్రత్యేకతను చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దాతల సహకారంతో స్కూళ్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతూ, నూతన ఒరవడితో బోధన చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. తాను మొదటిసారి ఉద్యోగంలో చేరిన వీరన్నపేట్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉండగా, దాతల చేయూతతో అద్భుతంగా తీర్చిదిద్దారు. వైటెక్ సాఫ్ట్వేర్ సంస్థ ద్వారా పాఠశాలలకు కంప్యూటర్లు, వాటర్ ప్యూరిఫయర్లు, కళావేదికల నిర్మాణం, స్పోర్ట్స్ మెటీరియల్, స్మార్ట్ టీవీలు అందించడంలో కీలకపాత్ర పోషించారు. కరోనా సమయంలో రంగారెడ్డి జిల్లా స్థాయిలో ఆన్లైన్ తరగతులు బోధించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కంకల్ పాఠాశాలలో విద్యార్థుల సంఖ్యను 119 నుంచి 157కు పెంచడంలో తోటి ఉపాధ్యాయులతో కలిసి తీవ్రంగా శ్రమించారు. మండల, జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్‌గా నిరంతర సేవలు అందిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు సమాజానికి ఎంతో అవసరం. అందుకున్న అవార్డులు.. ● మండలస్థాయి అవార్డు 2019 ● మనం మన ఊరి బడి రాష్ట్రస్థాయి అవార్డు 2021 ● డాక్టర్ ఎన్టీఆర్ జాతీయ కీర్తి పురస్కారం 2022 ● రాష్ట్రస్థాయి ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేటర్ అవార్డు 2022 ● ఆచార్యదేవోభవ జాతీయ అవార్డు 2022 ● బెస్ట్ అకడమిక్ రిసోర్స్ టీచర్ అవార్డు 2022 ● అబ్దుల్ కలాం నేషనల్ లెవెల్ టీచింగ్ ఎక్సలెన్స్ అవార్డు 2022 ● గురుస్పందన అవార్డు 2023 ● గుజరాత్ మంథన్ శిక్షక్ పురస్కారం 2023 ● వికారాబాద్ జిల్లాస్థాయి అవార్డు 2025 ● బెస్ట్ ప్రాక్టీసెస్ టీచర్‌గా ఢిల్లీకి ఎంపిక 2025 ● టీఎల్ఎం మేళాలో మండల, జిల్లా స్థాయి ప్రథమ పురస్కారాలు ● అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీంలో చోటు -
సంతోషంగా ఉంది
జిల్లా స్థాయి ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్ అవార్డుకు ఎంపికవ్వడం సంతోషంగా ఉంది. విద్యార్థుల్లోని క్రీడా సామర్థ్యాలను వెలికి తీసి, ప్రోత్సహించా. పలువురు కబడ్డీ, వాలీబాల్ రాష్ట్ర స్థాయిలో సత్తాచాటారు. – వెంకటేశ్, పీడీ, ముద్వీన్ జెడ్పీహెచ్ఎస్ జిల్లా స్థాయి అవార్డుతో బాధ్యత పెరిగింది. 25 ఏళ్ల ఉపాధ్యాయ జీవిత ప్రయాణాన్ని గుర్తించినందుకు కృతజ్ఞతలు. తోటి ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల ఉన్నతికి నా వంతు కృషిచేస్తా. – మంజుల, రావిచేడ్ జెడ్పీహెచ్ఎస్ -
కేటీఆర్‌ను కలిసిన నేతలు
నిందితులిద్దరూ తండ్రీకొడుకులు ఇబ్రహీంపట్నం రూరల్: సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయంలో హుండీ దొంగిలించిన దొంగలను ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ రమేష్ కథనం ప్రకారం.. కాలీవాల రోహిత్ (28), కాలీవాల సోమ్రాజ్ (60) తండ్రీకొడుకులు. అల్లం వెల్లుల్లి, పండ్ల వ్యాపారం చేస్తూ లాల్‌దర్వాజ సమీపంలో నివసిస్తున్నారు. గత నెల 26న సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయంలో నగదుతో పాటు హుండీని దొంగిలించారు. దర్యాప్తు చేపట్టిన ఆదిభట్ల క్రైం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారించారు. బొంగ్లూర్ సమీపంలో తిరుగుతుండగా క్రైం ఎస్ఐ నోయల్‌రాజ్ బృందం ఆధ్వర్యంలో పట్టుకున్నారు. వీరి నుంచి టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం, రూ.12,120 నగదు స్వాధీనం చేసుకున్నారు. రోహిత్‌పై గతంలో పలు దేవాలయాల్లో 17కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ నోయల్‌రాజ్, హెడ్‌కానిస్టేబుల్ రవికుమార్, సిబ్బంది కిరణ్‌రెడ్డి, ఎల్లయ్య, ఉపేందర్, శివ చంద్ర, సంతోష్, సందీప్, భరత్‌ను సీఐ అభినందించారు. అనంతగిరి: అత్వెల్లికి చెందిన రోజువారీ కూలీ మొగులయ్య(35) మద్యానికి బానిసై గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని వికారాబాద్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
గంజాయి పట్టివేత
ఒకరి అరెస్టు ఆమనగల్లు: తలకొండపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద శుక్రవారం 1.245 కిలోగ్రాముల గంజాయిని పట్టుకున్న పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తలకొండపల్లి బస్టాండ్ వద్ద గంజాయి సరఫరా జరుగుతుందని అందిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా ఓ వ్యక్తి కవర్ పట్టుకుని రావడంతో అనుమానం వచ్చి పట్టుకుని విచారించారు. అతడి నుంచి 1.245 కిలో గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి నగరంలోని మంగళ్‌హాట్‌కు చెందిన రాజన్సింగ్గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజన్సింగ్ను అరెస్టు చేశారు. గంజాయిని దూల్‌పేటకు చెందిన అంగోరిబాయి నుంచి కొనుగోలు చేశాడని ఎస్ఐ తెలిపారు. తనిఖీల్లో హెడ్‌కానిస్టేబుల్ హిమవంతరావ్, కానిస్టేబుల్ జాషువ, రమేశ్, కురుమయ్య, బానుప్రకాశ్, సంజీవరెడ్డి ఉన్నారు. -
యూఎల్సీల క్రమబద్ధీకరణ?
మిగులు స్థలాల్లో నివాసాలకు శాశ్వత పట్టాలు సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో అక్రమంగా నిర్మించుకున్న నివాసాల స్థలాలను క్రమబద్ధీకరించి శాశ్వత హక్కులు కల్పించిన సర్కారు.. తాజాగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారికి కూడా అదే విధంగా క్రమబద్ధీకరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం ముందస్తు కసరత్తు చేస్తోంది. మహానగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని యూఎల్సీ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని లక్షలాది కుటుంబాలు దశాబ్దాలుగా నివసిస్తున్నాయి. చాలా చోట్ల సీఎం డిక్లరేషన్న సరిగా పూర్తికాకపోవడం, సెక్షన్ 22ఎ జాబితాలో చేరడంతో క్రయవిక్రయాలు, నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు నిలిచిపోయాయి. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం తాజాగా సమగ్ర రెగ్యులరైజేషన్ విధానం రూపొందించాలని నిర్ణయించింది. ఇది కేవలం హక్కుల కల్పనే కాకుండా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన ఆదాయం చేకూర్చే అవకాశం కూడా లేకపోలేదు. రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పటికే వివరాలు సేకరిస్తూ విధాన రూపకల్ప నకు సిద్ధమవుతున్నారు. రెండు వేల ఎకరాలపైనే.. మహా హైదరాబాద్ పరిధిలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములు సుమారు రెండు వేల ఎకరాలకు పైగా ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో సగానికి పైగా మేడ్చల్–మల్కాజిగిరిలోనే భూమి ఉంది. రంగారెడ్డి జిల్లాలోని భూములు ఎక్కువగా పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. హైదరాబాద్ నగర పరిధిలోని భూములు తక్కువగా ఉన్నా.. విలువ ఎక్కువగా ఉండటంతో వాటికి డిమాండ్ ఎక్కువైంది. జిల్లాల వారీగా వేర్వేరు స్థాయిలో సమస్యలు ఉండటంతో విధానం రూపకల్పనలో ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. యూఎల్సీ మిగులు భూముల విస్తీర్ణం రెవెన్యూ జిల్లాల వారీగా పరిశీలిస్తే.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 50,69,215 చదరపు మీటర్లు, రంగారెడ్డి జిల్లాలో 28,46,860 చదరపు మీటర్లు, హైదరాబాద్ జిల్లా పరిధిలో 3,83,586 చదరపు మీటర్ల స్థలాల ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ కోసం వేలాది దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని వేల దరఖాస్తులకు కన్వియేన్స్డీడ్లు జారీ చేయడంతో ఖజానాకు భారీగానే జమ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 5,263 దరఖాస్తులు అందగా అందులో 4,927 పరిష్కారం కావడంతో ప్రభుత్వానికి రూ.61.61 కోట్లు రెవెన్యూ లభించింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మొత్తం 11,388 అర్జీలు రాగా, అందులో 5,809 పరిష్కారం కావడంతో 408.32 కోట్ల రాబడి వచ్చింది. సమగ్ర విధానం సెక్షన్ 22ఎ జాబితాలో చేరిన భూముల కారణంగా ఏర్పడిన సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సర్కారు కసరత్తు చేస్తోంది. గతంలో జీవో 58, 59 ద్వారా మీసేవ ద్వారా కొన్ని స్థాయిల్లో పట్టాలు ఇచ్చినా సంపూర్ణ పరిష్కారం లభించలేదు. ప్రస్తుతం అమలులోకి రాబోతున్న ప్రత్యేక విధానంలో క్షేత్రస్థాయిలో డీటెయిల్డ్ సర్వే చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో లక్షలాది ఇళ్లు పెండింగ్ దరఖాస్తులపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి అసైన్డ్ భూముల తర్వాత మరో మెగా రెగ్యులరైజేషన్ -
షార్ట్ సర్క్యూట్‌తో కిరాణ దుకాణం దగ్ధం
తుర్కయంజాల్: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కిరాణ దుకాణం దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల సర్కిల్ పరిధి కమ్మగూడలోని లక్ష్మీనగర్ కాలనీలో కిరాణ దుకాణం నిర్వాహకులు మంగళవారం మధ్యాహ్నం షాపు మూసి భోజనానికి వెళ్లారు. కొద్ది సేపటికే దుకాణం నుంచి పొగలు వస్తుండడం గమనించిన స్థానికులు విషయాన్ని నిర్వాహకులకు తెలియజేశారు. వెంటనే హయత్‌నగర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సుమారు రూ.లక్షన్నరకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడం, అందులో ఉన్న గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 3 తులాల బంగారం, 30 తులాల వెండి అపహరణ శంకర్పల్లి: తాళం వేసి ఊరికి వెళ్లిన ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన శంకర్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని అయ్పప్పరెడ్డిగూడలో సరస్వతి అనే మహిళ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. గతనెల 30న ఇంటికి తాళం వేసి వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం దుర్గం చెరువుకి తన కూతురు, అల్లుడుతో కలిసి రాఖీ కట్టేందుకు వెళ్లింది. మంగళవారం ఉదయం ఇంటి తాళం పగులగొట్టి ఉందని స్థానికులు ఆమెకి సమాచారం ఇచ్చారు. వెంటనే ఇంటికి చేరుకొని దొంగతనం జరిగినట్లు గుర్తించింది. బీరువాలో ఉన్న 3 తులాల బంగారం, 30 తులాల వెండి, కొంత నగదు దొంగలు అపహరించుకొని వెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయిపై కేసు మణికొండ: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయనపై డ్యాన్సర్ రమావత్ మాధురి రాథోడ్ ఫిర్యాదు చేయటంతో ఆగస్టు 22న కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈశ్వర్‌సాయి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వీరిద్దరూ ‘బాసింగ బలాలే’ జానపద నృత్యంలో నటించి పాపులర్ అయ్యారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పనిచేసే చోటే కుప్పకూలి మేసీ్త్ర మృతి
మొయినాబాద్: బతుకుదెరువుకోసం భార్యపిల్లతో వలస వచ్చిన ఓ మేసీ్త్ర పనిచేసే చోటే కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎనికేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన బుధ్రం సత్నామి (54) నెల రోజుల క్రితం భార్యాపిల్లలతో కలిసి మొయినాబాద్ ప్రాంతానికి వలస వచ్చాడు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లిలో ఉన్న వనమ్ విల్లాస్‌లో మేస్త్రిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో పనిచేస్తూ సత్నామి తల తిరుగుతోందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడున్నవారు చికిత్స నిమిత్తం స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. గుండెపోటుతో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పనుల్లో వేగం పెంచండి
● ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ● కొడంగల్, దౌల్తాబాద్‌లో పలు నిర్మాణాల పరిశీలన కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 4, 5 తేదీల్లో కొడంగల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మంగళవారం పట్టణంలోని ఆస్పత్రి భవనం, ఆర్అండ్బీ అతిథి గృహం, పాఠశాల భవనాలను పరిశీలించి, పనులపై ఆరా తీశారు. అనంతరం హెలిపాడ్‌ను పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్ దీపక్ తివారి, కడ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు. దేశానికే తలమానికం.. బొంరాస్‌పేట: హకీంపేటలో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ దేశంలో ఎక్కడా లేని విధంగా రూపుదిద్దుకుంటోందని సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌బాబు అన్నారు. పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉమెన్ డిగ్రీ కాలేజీ, నర్సింగ్ హాస్టల్‌ను వచ్చే మార్చి వరకు పూర్తి చేయాలన్నారు. ఫిజియోథెరపీ, పారామెడికల్, నర్సింగ్ కళాశాలల్లో అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. ఇంజనీరింగ్, వెటర్నరీ కాలేజీ పనులను పరిశీలించారు. 35 ఎకరాల్లో నిర్మించే సైనిక్ స్కూల్‌పై ఆరా తీశారు. ఎత్తిపోతల కాల్వలకు రైతులు అంగీకరించారని, రేడియల్ రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయని వివరించారు. ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, అదనపు ఎస్పీ రాజేష్మీన, ఎస్ఈ విజయభాస్కర్ రెడ్డి, కేఎల్ఎస్ఆర్ సీజీఎం కృష్ణప్రసాద్, జీఎం హర్షవర్ధన్‌రెడ్డి, ఈడబ్ల్యూఐడీసీ శ్రీనివాస్, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, తహసీల్దార్ కిషన్‌నాయక్, ఎంఈఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని ఏర్పాట్లు చేయండి దౌల్తాబాద్: మండలంలో సుమారు రూ.25 కోట్లతో నిర్మిస్తున్న మహాత్మజ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాల పనులను వేగవంతం చేసి, మార్చి నెలాఖరువరకు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గోకఫసల్వాద్ సమీపంలో కొనసాగుతున్న పూలే పాఠశాల, దౌల్తాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీటిని సందర్శిస్తారని తెలిపారు. అనంతరం దౌల్తాబాద్‌లో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న జూనియర్ కళాశాల, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కానున్న దౌల్తాబాద్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట ఈడబ్ల్యూడీసీ చీఫ్ ఇంజనీర్ షఫీమియా, డీఈ శ్రీనివాసులు, ఏఈ శ్రీనివాస్, ఎంపీడీఓ ఉసేనప్ప, నాయకులు రెడ్డిశ్రీనివాస్, భీంరెడ్డి తదితరులు ఉన్నారు. -
సీపీఎస్‌ను రద్దు చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఉద్యోగులకు శాపంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ యశ్వంత్, కన్వీనర్ డాక్టర్ రామారావు డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు దాటవేసే ధోరణి అవలంబిస్తోందని, ఇది సరికాదన్నారు. రాష్ట్ర ఉద్యోగ జేఏసీ కార్యాచరణలో భాగంగా 10న నిర్వహించే ‘చలో హైదరాబాద్’ను జిల్లా ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ శ్రీనేష్‌కుమార్ నోరీ, కో చైర్మన్ గోపాల్, ప్రవీణ్, శాంతిశ్రీ, సుధాకర్, రాజేష్, బల్వంత్‌రెడ్డి, వైస్ చైర్మన్లు నూతనకంటి వెంకట్, సైదమ్మ, రాకేష్, మాధవ్, మహేశ్, ప్రమీల, వెంకటప్ప, పాండు, జగన్నాథ్ శర్మ, అరుణ, గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సూర్యగిరి ఎల్లమ్మ కల్యాణం
తుక్కుగూడ: రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయ 43వ వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం రెండో రోజు అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అగ్నిగుండాలు దాటి తమ భక్తిని చాటుకున్నారు. మహిళలు ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అంబోజీ శ్రీకాంత్ యాదవ్ ఇంట్లో ప్రతిష్ఠించిన అమ్మవారి ఘటాన్ని మీగడ కాశీనాథ్ శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాల మధ్య ఊరేగించారు. అమ్మవారిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేఎల్లార్, తీగల కృష్ణారెడ్డి తదితరులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం, ఈఓ మోహన్‌రావు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. హాజరైన ప్రముఖులు -
పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల జైలు
సిటీ కోర్టులు: తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.4 వేల జరిమానా విధిస్తూ బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం అందజేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పాటిగూడ గ్రామానికి చెందిన బాలిక డిసెంబర్ 14న పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లి, సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి కుమార్తె కనిపించలేదు. తమ కుమార్తె అదృశ్యం వెనుక అదే గ్రామానికి చెందిన చందు అనే వ్యక్తి ఉన్నాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. 2018 డిసెంబర్ 15న చందు అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ భిక్షపతిగౌడ్ వాదనలు వినిపించారు. నేరానికి పాల్పడినట్లు రుజువుకావడంతో నిందితుడికి జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.


