ఉత్తమ పరిశోధన అవార్డు | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ పరిశోధన అవార్డు

Feb 10 2026 9:48 AM | Updated on Feb 10 2026 9:48 AM

ఉత్తమ

ఉత్తమ పరిశోధన అవార్డు

అబ్దుల్లాపూర్‌మెట్‌ : కవాడిపల్లి శివారులోని దేశ్‌ ముఖిలో గల సెయింట్‌ మేరీస్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో హెచ్‌ఓడీగా విధులు నిర్వర్తిస్తున్న నామ హరికుమార్‌కు భౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గాను ఉత్తమ పరిశోధనా అవార్డు –2025 అందజేశారు. ఈ మేరకు సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సెంట్రల్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ ఎస్వీఎస్‌ నాగేశ్వర్‌ రావు, ఓయూ భౌతికశాస్త్రం అధిపతి ఎం.ప్రసాద్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ మేరకు సెయింట్‌ మేరీస్‌ కళాశాల చైర్మన్‌, సెక్రటరీ, డైరెక్టర్‌, ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు హరికుమార్‌కు అభినందనలు తెలిపారు.

పరీక్షలంటే భయం వీడాలి

కడ్తాల్‌: త్వరలో జరుగనున్న పదో తరగతి పరీక్షల్లో వసతిగృహ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఎస్‌ఐ వర ప్రసాద్‌ విద్యార్థులకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమశాఖ బాలుర వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలంటే భయం వీడాలని, క్రమశిక్షణతో చదవాలని, టైంటేబుల్‌ పాటించాలని, మానసిక ధైర్యంతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ చంద్రశేఖర్‌, వసతిగృహ సంక్షేమాధికారి రాములు, సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.

విద్యార్థిని అదృశ్యం

పహాడీషరీఫ్‌: పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్‌ పీ ఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపిన ప్రకారం.. జల్‌పల్లి శ్రీరామ కాలనీకి చెందిన సంజయ్‌ కుమార్తె సీమల్‌ (16) పద్మశాలిపు రం జెడ్పీపీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతోంది. ఈ నెల 8న ట్యూషన్‌ వెళ్లేందుకు కాలనీలోని ఓవెన్‌ బేకరీ వద్ద ఆమె సోదరుడు సోహమ్‌ బైక్‌పై దించాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ట్యూషన్‌ వద్ద వాకబు చేయగా అక్కడికి రాలేదని తెలిసింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేక పోయింది. ఆమె తల్లి సునీత కుకూడ్కర్‌ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆచూకీ తెలిసి న వారు ఠాణా లో గానీ, 87126 62367 నంబర్‌లోగానీ సమాచారం ఇవ్వాలన్నారు.

ఉత్తమ పరిశోధన అవార్డు 1
1/1

ఉత్తమ పరిశోధన అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement