breaking news
Ranga Reddy District News
-
ఉజ్జయినీ.. జగజ్జననీ
బోనమెత్తిన లష్కర్లష్కర్ బోనమెత్తింది. భక్తజనం పోటెత్తింది. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవోపేతంగా సాగింది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు.. పోతురాజుల విన్యాసాలు.. కళాకారుల ఆటాపాటలు.. ప్రముఖుల రాకతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పణతో.. ఎటూ చూసినా భక్తజన సంద్రాన్ని తలపించింది. తీర్చిదిద్దిన తీరొక్క బోనాలతో మహిళలు మహంకాళి అమ్మవారికి నివేదించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. గోల్కొండలోనూ జగదాంబిక అమ్మవారికి ఆదివారం ఆరో బోనం పూజను ఘనంగా నిర్వహించారు. – రాంగోపాల్‌పేట్ -
‘మత్తు’ వదిలిస్తాం
అనంతగిరి: మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎస్పీ స్నేహమెహ్ర అన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని సమస్యాత్మక, ఏకాంత ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో శనివారం రాత్రి పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజ, యువత భవిష్యత్‌కు ముప్పుగా మారుతోన్న గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయం, రవాణా, నిల్వ, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మత్తు పదార్థాల సరఫరాదారులు, విక్రేతలు, వినియోగదారులపై నిఘా ఉంచి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రైవ్‌లో భాగంగా వికారాబాద్, తాండూరు, పరిగి సబ్డివిజన్లలో నార్కోటిక్ డిటెక్షన్ కిట్లతో అనుమానితులను తనిఖీ చేశారు. పెట్రోలింగ్, వాహన తనిఖీలు, డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, తాండూరు డీఎస్పీ యాదయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట తాండూరు టౌన్: సమాజంలోని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. శనివారం రాత్రి పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసరాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, రైల్వే క్వార్టర్స్‌తో పాటు పలు నిర్మానుష్య ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు రాత్రిళ్లుగా గుంపులుగా ఏర్పడి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారని, అలాంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చీకటి ప్రాంతాల్లో కూర్చుని సిగరెట్లు తాగుతూ, మద్యం సేవిస్తున్న పలువురు యువకుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామన్నారు. ఇలాంటి తనిఖీలు తరచుగా నిర్వహిస్తుంటామని, దీంతో నేరాలను అదుపు చేయవచ్చన్నారు. ఈ తనిఖీల్లో పట్టణ సీఐ పరమేశ్వర్, ఎస్ఐ నుమాన్ అలీ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ఎస్పీ స్నేహమెహ్ర -
దుకాణంలో రూ.6.40 లక్షలు చోరీ
అధిక ధరలకు విక్రయిస్తున్నారు వికారాబాద్‌లోని మహాలక్ష్మి ఏజెన్సీవారు డీఏపీని ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఐదు బస్తాల డీఏపీ తీసుకోగా రూ.8,400 వసూలు చేశారు. డీలర్ మా వద్ద తీసుకున్న సొమ్ము రికవరీ చేయాలి. నగదు రూపేన ఇవ్వకుండా ఫోన్‌పే ద్వారా చెల్లించడం జరిగింది. – రమేశ్‌నాయక్, రైతు ఫిర్యాదు చేస్తే చర్యలు అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లపై ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. డీఏపీ బస్తాను రూ.1,350కే విక్రయించాలి. ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే రైతులు ఆధారాలతో ఫిర్యాదు చేయాలి. – వెంకటేశం, ఏడీఏ వికారాబాద్ పెట్టుబడుల పేరుతో రూ.10 లక్షలు స్వాహా ఇన్‌స్ట్రాగాం ద్వారా ఎర వేసి, నేరుగా కలిసి టోకరా సాక్షి, సిటీబ్యూరో: అత్తాపూర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి పెట్టుబడుల పేరుతో ఇన్స్ట్రా గాం ద్వారా ఎర వేసిన ఓ ముఠా నేరుగా కలిసి రూ.10 లక్షలు స్వాహా చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడు గత ఏడాది సెప్టెంబర్‌లో తన సహోద్యోగి సయ్యద్ సర్ఫరాజ్ ద్వారా ఇన్‌స్ట్రాగాంలో వచ్చిన పెట్టుబడి ప్రకటనలు చూశారు. తమ స్కీముల్లో పెట్టుబడిపెడితే కేవలం 7–8 రోజుల్లోనే భారీ లాభాలు ఇస్తామని ఉండటంతో ఆకర్షితుడయ్యాడు. అందులో ఉన్న నెంబర్ ఆధారంగా బాధితుడు బతూల్ ఫాతిమా అలియాస్ సకీనా ఫాతిమాను సంప్రదించాడు. ఆమె సూచనల మేరకు అత్తాపూర్‌లోని ఓ హోటల్లో సమావేశానికి వెళ్లాడు. అక్కడ బతూల్ ఫాతిమా, అలీ జాన్ రజ్వీ తదితరులు తమ వద్ద రూ.10 లక్షలు పెట్టుబడిపెడితే వాటిని షేర్లలో ఇన్వెస్ట్ చేసి రెండు వారాల్లో రూ.18 లక్షలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం ఏర్పాటు చేసిన ఓ వాట్సాప్ గ్రూప్‌లోనూ ఇతడిని చేర్చారు. బాధితుడు గత ఏడాది సెప్టెంబర్ 22, 23 తేదీల్లో వివిధ బ్యాంకు ఖాతాలు, వాలెట్ లావాదేవీల ద్వారా రూ.10 లక్షలు బతూల్ ఫాతిమా ఖాతాకు బదిలీ చేశాడు. దీనికి సంబంధించి ఆమె రసీదు ఇవ్వడంతో పాటు అదే ఏడాది అక్టోబర్ 7లోపు రూ.18 లక్షలు చెల్లిస్తామని ఒప్పందం కూడా చేసుకుంది. గడువు ముగిసినా డబ్బు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేయడంతో బాధితుడు నిలదీయగా... అదే ఏడాది డిసెంబర్ 16న మరో ఒప్పందం చేసుకుంటూ... డిసెంబర్ 25లోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ష్యూరిటీగా ఖాళీ చెక్కులు కూడా బాధితుడికి అందించారు. ఆ గడువు ముగిసే సమయానికీ చెల్లించకపోవడంతో వారిని సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్లు స్విచ్ ఆఫ్ అని తెలిసింది. నిందితులు తమ ఇళ్లు కూడా ఖాళీ చేసి పరారయ్యారని గుర్తించారు. దీంతో బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇదే పంథాలో నిందితులు అనేక మందిని మోసం చేసి సుమారు రూ.90 లక్షల నుంచి రూ.95 లక్షలు వసూలు చేసినట్లు తనకు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రకృతి అందాలు.. పరవశించిన పర్యాటకులువికారాబాద్ జిల్లా ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా అనంతగిరి హిల్స్, కోట్‌పల్లి ప్రాజెక్ట్‌కు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. అడవులు, కొండల మధ్య దృశ్యాలను చూస్తూ పరవశించారు. ప్రాజెక్ట్ వద్ద బోటింగ్ చేస్తూ, సెల్ఫీలు దిగుతూ సందడిగా గడిపారు. – అనంతగిరి, ధారూరునాగోలు: గుర్తు తెలియని వ్యక్తులు హోల్‌సేల్ మార్కెట్ క్యాష్ కౌంటర్ పగలగొట్టి షాప్‌లో ఉన్న రూ.6.40 లక్షల నగదు చోరీ చేశారు. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్మన్‌ఘాట్‌కు చెందిన చిక్కొటి శివకుమార్ బైరామల్‌గూడ, అల్తాప్ నగర్లో శ్రీ భవానీ ట్రేడర్స్ పేరుతో హోల్‌సేల్ నూనె, బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్నారు. శనివారం రూ.6.40 లక్షల నగదు క్యాష్ కౌంటర్లో పెట్టి షాప్ మూసి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం షాప్ తెరిచి చూడగా క్యాష్ కౌంటర్ పగలగొట్టి ఉంది. క్యాష్ కౌంటర్‌ను తనిఖీ చేయగా నగదు చోరీకి గురైనట్లు నిర్ధారించుకున్నారు. దుండగులు షాప్‌లో ఉన్న సీసీటీవీ డీవీఆర్ పవర్ కేబుల్ తొలగించి కెమెరా యాంగిల్స్ మార్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. శివకుమార్ ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సనత్‌నగర్: సనత్‌నగర్ పారిశ్రామికవాడ ప్రాంతంలో ఎల్ఎస్డీ (లైసెర్జిక్ యాసిడ్ డైఎథైలమైడ్) మత్తు పదార్ధాలను విక్రయిస్తున్న ముఠాను సనత్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 45 ఎల్ఎస్డీ బ్లాట్స్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌లోని ఆర్ఎస్ బ్రదర్స్ గోదాం సమీపంలో ఎల్ఎస్డీ బ్లాట్స్ విక్రయిస్తు బైక్‌పై వచ్చిన అర్లికట్టె రాజేష్ అనిరుధ్ అలియాస్ డింగీ (28), కొనుగోలుదారు కే మోహిత్ (27)లను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 45 ఎల్ఎస్డీ బ్లాట్స్ (0.600 గ్రాములు) లభించాయి. విచారణలో ప్రధాన నిందితుడు ఆన్లైన్ ద్వారా విదేశీ వ్యక్తి నుంచి సింప్లెక్స్ యాప్ సహాయంతో ఎల్ఎస్డీ బ్లాట్స్ తెప్పించుకుని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. మోహిత్ కూడా గత ఏడాదిగా అతని వద్ద నుంచి ఎల్ఎస్డీ కొనుగోలు చేసి వినియోగించడంతో పాటు ఇతరులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు ఎన్డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలు తగవు
తుక్కుగూడ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి పూర్తిగా కాలరాసిందని విమర్శించారు. దేశంలో మోదీ ప్రభుత్వం రైతులు, విద్యార్థులు, యువత ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వారి తీరు కారణంగానే ఢిల్లీలో గతంలో రైతులు ఉద్యమం చేపట్టారని, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహరంపై జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారని గుర్తు చేశారు. ఈ పోరాటాలన్నీ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. కనీస వేతనాల అమలు, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. దేశంలో కార్మికుల చట్టాల అమలు కోసం పార్టీలు, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ యూసఫ్, సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, నాయకులు పానుగంటి పర్వతాలు, రామస్వామి, దత్తునాయక్, శేఖర్‌రెడ్డి, చందు యాదవ్, రాజు, లక్ష్మణ్, నర్సింహారెడ్డి, దేవేందర్‌గౌడ్, బ్రహ్మచారి, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు -
హైవే విస్తరణ పనుల పరిశీలన
మొయినాబాద్: గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జాప్యం జరిగిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మొయినాబాద్‌లో జరుగుతున్న హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. బీజాపూర్ జాతీయ రహదారి అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ రోడ్డు నిజాం కాలం నాటిదని.. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం రహదారి పనులు చేపడుతోందన్నారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులను తామే తెచ్చామంటూ సోషల్ మీడియాలో డబ్బాకొట్టుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్వెల్లి ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు కంజర్ల ప్రకాష్, మోర నర్సింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, కౌన్సిలర్ కిషన్, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, మహిపాల్, శ్రీనివాస్‌గౌడ్, వెంకటేశ్ తదితరులు ఉన్నారు. -
ధర రాక.. తిరిగి తీసుకెళ్లలేక
మొయినాబాద్‌రూరల్: టమాటాలకు ఆశించిన ధర రాకపోవడంతో రైతులు మార్కెట్లో అమ్మలేక.. తిరిగి ఇళ్లకు తీసుకెళ్లలేక గ్రామాలకు వెళ్తూ రోడ్ల పక్కన పారబోస్తున్నారు. గుడిమల్కాపూర్, శంషాబాద్ రైతుబజార్ మార్కెట్లలో ఒక్కోపెట్టె (25 కిలోలు)కు తాజాగా ఉంటే రూ.200–220 ధర పలుకుతోంది. కూలీ.. రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రోడ్డు పక్కన పారబోసి ఇంటి ముఖం పడుతున్నారు. మండల పరిధిలోని చందానగర్, రెడ్డిపల్లి సమీపంలో రోడ్డు పక్కన టమాటాలు పారబోసి కనిపిస్తున్నాయి. చేవెళ్ల: విద్యారంగ సమస్యలపై ఎంఎస్ఎఫ్ (మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్) పోరాడుతుందని సంఘం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి డాక్టర్ చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ అన్నారు. చేవెళ్లలో ఆదివారం ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా కో ఇన్చార్జి నాని భానుప్రసాద్మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ.. పేద వర్గాల విద్యార్థుల పక్షాన పోరాడతామని తెలిపారు. సెప్టెంబర్ 8న చలో హైదరాబాద్ మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మేడ్చల్‌జిల్లా కో ఇన్చార్జి శివకృష్ణ, వికారాబాద్ జిల్లా కో ఇన్చార్జి రావణ్, నాయకులు వెంకట్, జానీ, గణేశ్, ఆదిత్య, అరుణ్, తరుణ్, శ్రీకాంత్, నందు, అజయ్ తదితరులు పాల్గొన్నారు. తుర్కయంజాల్: ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని చికెన్, మటన్ దుకాణాల్లో శంషాబాద్ జోనల్ వెటర్నరీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ అధికారి రవిచంద్ర మాట్లాడుతూ.. పలు దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయని, స్లాటర్ కేంద్రాల నుంచి కాకుండా నేరుగా కట్ చేసి మాంసం విక్రయాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఇక మీదట ఇలా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. విక్రయదారులు కూడా స్టాంప్ ఉన్న మటన్‌ను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. దుకాణాల యజమానులు పరిశుభ్రత పాటించడంతో పాటు, వారం రోజుల్లోగా ట్రేడ్ లైసెన్స్‌లను పొందాలని సూచించారు. లేని పక్షంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించి, మొదటి విడతగా నోటీసులు జారీ చేశారు. గ్రీన్ చానల్ ద్వారా ఊపిరితిత్తుల రవాణా శంషాబాద్: శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి గ్రీన్ చానల్ ద్వారా ఊపిరితిత్తులను రవాణా చేశారు. ఆదివారం మధ్యాహ్న శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం జెమ్స్ ఆస్పత్రికి చేరిన ఊపిరితిత్తులను అక్కడి నుంచి విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఇండిగో 6ఈ– 783 విమానంలో.. అక్కడి నుంచి 4.12 గంటలకు బయలుదేరి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 5.11 గంటలకు చేరుకున్నాయి. సీఐఎస్ఎఫ్ అధికారులు, ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో వెంటనే తీసుకెళ్లి ఆర్గాన్స్‌ను ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తూ 30 నిమిషాల్లో సికింద్రాబాద్ కిమ్స్‌కు చేర్చారు. -
డీఏపీ.. ధరల్లో దోపిడీ
ధారూరు: డీఏపీ ఎరువులను ఎమ్మార్పీ కంటే అధికధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకోవా లని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మండల పరిధి లోని డీకే తండాకు చెందిన పుల్సింగ్, రమేశ్ నాయక్, బాలరాజ్నాయక్, మాణిక్‌రావు, కిషిక్టబాయి, బీక్యానాయక్ ఆదివారం వికారాబాద్ లోని శ్రీమహాలక్ష్మి ఏజెన్సీలో ఒక్కొక్కరు ఐదు బస్తాల చొప్పున గత నెల 31 నుంచి ఆదివారం వరకు డీఏపీ కొనుగోలు చేశారు. బస్తాకు రూ.1,350 ఉండగా వారి నుంచి రూ.1,680 వసూలు చేశారు. రైతులు డీలర్‌ను రసీదు ఇవ్వాలని కోరడంతో దుకాణ వివరాలు లేని.. మొత్తం బిల్లు వేయకుండానే రసీదు ఇచ్చారంటూ ఆరోపిస్తున్నారు. తాము ఫిర్యాదు చేస్తున్నప్పటికీ డీలర్లతో కుమ్మకై ్కన వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద అధికంగా డబ్బు తీసుకున్న డీలర్ నుంచి తిరిగి ఇప్పించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సోమవారం ఇదే విషయమై కలెక్టరేట్లో ఫిర్యాదు చేస్తామన్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు -
కఠిన చర్యలు తీసుకోవాలి
రైతులను మోసం చేసి వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు మళ్లించుకున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ మోసపూరిత ఘటనలో ఎవరెవరి పాత్ర ఉందో అందరిని విచారించి చర్యలు తీసుకోవాలి. రైతులకు జవాబుదారీగా ఉండాల్సిన ఏపీఎం, ఇతర అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఈ సంఘటన జరిగింది. ఇందుకు కారణమైన వ్యక్తులు, అఽధికారులపై చర్యలు తీసుకోవాలి. – మల్కయ్య, బుగ్గప్ప, ప్రజా సంఘాల నాయకులుమరొకరి ఖాతాలో ఎలా జమ చేస్తారు? జూన్ 21న రాస్నం కొనుగోలు కేంద్రంలో కాశమ్మ పేరిట 116 సంచులు(46 క్వింటాళ్లకు పైగా) వరి ధాన్యం విక్రయించాం. ఇందుకు సంబంధించి రూ.1.10లక్షలకు పైగా నగదు జమ కావాల్సి ఉంది. ప్రతి రోజు స్థానిక ఐకేపీ, వీఓఏలను అడిగినప్పటికీ సమాధానం ఇవ్వలేదు. ఇదే విషయమై ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఏపీఎంను సంప్రదించగా .. అంజిలప్ప ఫోన్ చేసి ధాన్యం డబ్బులు తన వద్దే ఉన్నాయని, సాయంత్రం ఇస్తానని చెబుతున్నాడు. మా ధాన్యం డబ్బులు మరొకరి ఖాతాలో ఎలా జమయ్యాయి? ధాన్యం డబ్బులు వచ్చి ఎన్ని రోజులైందనే విషయంలో మాకు తెలియాలి. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – అనంతయ్య, బాధిత రైతు, రాస్నం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చేవెళ్ల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుండాల గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాస్ (35) చేవెళ్లలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం రాత్రి పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో పామెన బస్‌స్టేజీ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న శ్రీనివాస్‌కు తీవ్ర గ్రాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వెళ్లి పరిశీలించారు. మృతుడిని గుండాలకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుని భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నాగోలు: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీపాతి దీపారెడ్డి పార్థివదేహం ఆదివారం చంపాపేట డివిజన్ శిఖరా ఎన్క్లేవ్ కాలనీలోని ఆమె స్వగృహానికి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక కాలనీవాసులు భౌతికకాయాన్ని చూసి బోరున విలపించారు. పలు పార్టీలకు చెందిన నాయకులు, సంక్షేమ సంఘ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం చంపాపేట రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఆమన్‌గల్ మున్సిపల్ చైర్మన్ పత్యానాయ పాల్గొన్నారు. -
భగవద్గీత.. మానవ జీవనానికి దిక్సూచి
అనంతగిరి: భగవద్గీత మానవ జీవితానికి దిక్సూచి అని సంగారెడ్డి జిల్లా ఫసల్వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకుడు మహేశ్వర శర్మ సిద్ధాంతి అన్నారు. వైభవలక్ష్మి ఆలయంలో గీతావాహిని ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న భగవద్గీత పారాయణ మహోత్సవం ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతా సందేశం నేటి సమాజానికి అవసరమని అన్నారు. మహిళలు కుటుంబ వ్యవస్థకు మూలస్తంభాలన్నారు. వారి జీవన విధానం, దైవారాధనలో పాటించాల్సిన నియమాలు, పూజా విధానాలు, వివిధ వ్రతాలను శాస్త్రోక్తంగా ఎలా ఆచరించాలి, సనాతన ధర్మ సంప్రదాయాలను ఎలా పరిరక్షించాలి అనే అంశాలను వివరించారు. భక్తి, సేవ, ధర్మం, సత్సంకల్పం, నిత్య పారాయణం ద్వారా కుటుంబాల్లో శాంతి, సౌభాగ్యం, ఆధ్యాత్మిక వికాసం కలుగుతాయని చెప్పారు. తొమ్మిది రోజులుగా పారాయణం పెద్ద ఎత్తున చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గీతావాహిని అధ్యక్షురాలు శ్రీదేవిసదానంద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జయశ్రీ, ఆలయ నిర్వాహకురాలు స్వరూప రమేశ్, అర్చకులు విక్రమ్, మాజీ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేశ్, డాక్టర్ దీప భక్తవత్సలం, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద రెడ్డి, డాక్టర్ సత్యనారాయణ గౌడ్, అమరేందర్ రెడ్డి, నర్సింలు, ప్రవీణ్, గీతావాహిని సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మహేశ్వర శర్మ సిద్ధాంతి -
అదుపు తప్పి.. చెట్టును ఢీకొట్టి
షాబాద్: అతి వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఓ విద్యార్థి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని పోతుగల్ వద్ద చోటుచేసు కుంది. ఎస్ఐ చెన్నారెడ్డి కథనం ప్రకారం.. చేవెళ్ల మండలం న్యాలట గ్రామానికి చెందిన పుప్పాల చరణ్ (19) స్నేహితుడు ఎడ్ల స్వాతిక్తో కలిసి ఆదివారం ద్విచక్ర వాహనంపై షాబాద్ వైపు నుంచి చేవెళ్లకు వెళ్తున్నారు. మార్గమధ్యలో పోతుగల్ సమీపంలో అతివేగంగా వెళ్లడంతో అదుపుతప్పి డివైడర్ మఽ ద్యలో ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన చరణ్ అక్కడిక్కడే మృతి చెందాడు. స్వాతిక్ను చికిత్స నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి.. కొత్తూరు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన కొత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నాగార్జునరెడ్డి కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటకు చెందిన రాములు ఆదివారం తల్లి లక్ష్మమ్మ (61), కూతురు సంధ్యతో కలిసి బైకుపై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. కొత్తూరు సమీపంలోకి రాగానే పెంజర్ల కూడలి జాతీయ రహదారి వద్ద బైకు అదుపు తప్పి కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలైన లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ప్రమాదంలో ఒకరు.. కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు నుంచి ఆదివారం హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి లారీ చక్రాల కిందపడిపోయింది. దీంతో వాహనం నడుపుతున్న గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా వెనుకాల ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై వెళ్తున్న విద్యార్థి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు -
రియల్‌దందా!
యాచారం: ఫ్యూచర్‌సిటీలో ఫాంల్యాండ్స్ దందా జోరుగా సాగుతోంది. లాభార్జనే లక్ష్యంగా రియల్ వ్యాపారులు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మండలంలోని 24 పంచాయతీలు ఫ్యూచర్‌సిటీ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ఏర్పాటయ్యే వెంచర్లకు ఎఫ్‌సీడీఏ (ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీ) అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతులకు భారీగా ఖర్చవుతుందనే ఉద్దేశంతో వ్యాపారులు అక్రమ మార్గాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ఫాంల్యాండ్స్ వ్యాపారం కొనసాగిస్తున్నారు. చౌదర్పల్లి, నందివనపర్తి, యాచారం, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, మాల్, గునుగల్, చింతపట్ల, నస్దిక్‌సింగారం, అయ్యవారిగూడెం తదితర గ్రామాల్లో ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.కోటికి పైగా కొనుగోలు చేసి గుంటల్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పైగా విక్రయిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఆగ్రహం రియల్ వ్యాపారులు కొనుగోలుదారులకు గుంటల్లో నే విక్రయాలు జరుపుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఫాంల్యాండ్స్ కోసం గుంటల్లో రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. నిత్యం 25 నుంచి 50 వరకు 121, 242, 363, 400, 500 గజాల్లో వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వీటికోసం రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఫాంల్యాండ్స్కు గుంటల్లో వ్యవసాయ భూముల విక్రయాలపై ఇటీవల జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రెవెన్యూ అధికారులపై మండిపడిన విషయం తెలిసిందే. ఏఏ గ్రామాల్లో గుంటల్లో వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్లు చేస్తున్నారో నివేదిక ఇవ్వాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. ఫాంల్యాండ్స్ పేరిట అక్రమార్కుల వ్యాపారం వ్యవసాయ పొలాలను చూపించి గుంటల్లో విక్రయాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం తహసీల్దార్ కార్యాలయంలో జోరుగా రిజిస్ట్రేషన్లు రూ.లక్షల్లో కొనుగోలు చేసి రూ.కోట్లలో ఆర్జన గుంటల్లో రిజిస్ట్రేషన్లపై ఉన్నతాధికారుల ఆరా? ఫాంలాండ్స్ పేరుతో వ్యవసాయ భూములను గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేయడం నిలిపేశాం. నిజమైన రైతులకు అత్యవసరమనుకుంటే జీపీఓల ద్వారా వివరాలు సేకరించి రిజిస్ట్రేషన్లు చేసేలా తహసీల్దార్లకు సూచించాను. ఎఫ్‌సీడీఏ, హెచ్ఎండీఏ, డీటీసీపీ నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన వెంచర్లలోనే ప్లాట్లు కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. – శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం -
సంకల్ప్‌తో మేల్కొలుపు
నవజాత శిశు మరణాల రేటు తగ్గింపే లక్ష్యం● ఆదిలాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు విజయవంతం ● నగరంలో అమలుకు అధికారుల సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో: నవజాత శిశు మరణాల రేటును సింగిల్ డిజిట్‌కు తగ్గించేందుకు ప్రభుత్వం గట్టి ‘సంకల్పం’తో ముందుకెళుతోంది. దంపతులు పిల్లల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పటి నుంచి ప్రసవమై తల్లీ, బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్లేంత వరకు ఒక నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టి పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో అదే తరహాలో నగరంలోనూ అమలుకు వైద్యారోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వెయ్యి జననాల్లో 12.27 మృతుల రేటు హైదరాబాద్ జిల్లాలో ప్రతి వెయ్యి మంది పిల్లల సజీవ జననాల్లో పుట్టిన 28 రోజుల్లోపు 12.27 మంది మృతుల రేటు నమోదవుతోంది. నగరంలోని నవ దంపతులు ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడు తున్న తరుణంలో పుట్టిన బిడ్డను రక్షించుకోవడమూ కీలకంగా మారుతోంది. నవజాత శిశు మరణాల రేటును 5 శాతం కంటే దిగువకు తీసుకురావా లని హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికా రులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి క్షేత్ర స్థాయిలో ఆశా కార్యకర్త నుంచి మొదలు పెడితే బిడ్డను ప్రసవం చేసిన నిపుణులైన వైద్యుల బృందం వరకు అందరినీ ఒక లక్ష్యం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టిన 28 రోజుల వరకు ప్రతి తల్లీబిడ్డను 360 డిగ్రీల కోణంలో పర్యవేక్షించనున్నారు. ఏటా 1.20 లక్షల జననాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో విస్తరించిన గ్రేటర్ పరిధిలో ఏటా సుమారు 1.20 లక్షల జననాలు నమోదవుతున్నాయి. ఇందులో హైదరాబాద్ జిల్లాలోనే సుమారు 75 వేలకుపైగా ఉంటున్నాయి. హైదరాబాద్‌లో గాంధీ, పేట్లబురుజు, నిమ్స్ వంటి ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కార్పొరేట్ ఆసుపత్రులు అందు బాటులో ఉన్నప్పటికీ నవజాత శిశు మరణాల రేటు ఆందోళణకు గురిచేస్తోంది. ఏం చేయనున్నారు? ఆశా కార్యకర్త గర్భిణితో నిత్యం టచ్‌లో ఉంటుంది. వారంలో కనీసం ఒక్కసారి అయినా గర్భిణి ఇంటికి వెళ్లి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు. హైరిస్క్ కేసుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. గర్భిణి డేటా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. నెలలు నిండిన గర్భిణి ముందస్తుగా ఆసుపత్రికి చేర్చడం, వీలైనంత వరకు సాధారణ ప్రసవానికి ప్రయత్నించాలని అధికారులు చెబుతున్నారు. శిశువు తక్కువ బరువుతో పుడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్ఫెక్షన్లను నుంచి రక్షించుకునేందుకు మదర్ కేర్‌లో శిక్షణ ఇస్తారు. ఫలితంగా ఇన్ఫెక్షన్లు 60 శాతం వరకు తగ్గుతాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. పుట్టిన గంటలోపు బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు తాగించాలని చెబుతున్నారు. సంవత్సరం ప్రసవాలు మృతులు 2024-25 76,709 866 2025-26 75,804 868 2026-27 16,047 197 (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) -
దారి మళ్లిందా?
ధాన్యం సొమ్ము యాలాల: వరి ధాన్యం కొనుగోలు చెల్లింపుల డబ్బులు భారీ స్థాయిలో పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైతుల ఖాతాల్లోకి జమ చేయాల్సిన నగదు ప్రైవేటు వ్యక్తి ఖాతాల్లోకి మళ్లింపు చేశారంటూ బాధిత రైతులు వాపోతున్నారు. బాధిత రైతులు తెలిపిన ప్రకారం.. వేసవిలో రాస్నం గ్రామంలో మండల మహిళా సమాఖ్య(ఐకేపీ)ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో జూన్‌లో గ్రామానికి చెందిన ఎం.కాశమ్మ(116 సంచులు), మొల్ల మన్నాన్(103 సంచులు), రైకల అజీం(78 సంచులు), ఎన్కెపల్లి మల్లప్ప(78 సంచులు), జుబేరా బేగం(38 సంచులు), ఫైమూద బేగం(32 సంచులు) విక్రయించారు. ఇందుకు సంబంధించిన నగదు నేటికి తమ ఖాతాల్లో జమకాకపోవడంతో ఆదివారం వారు ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్‌కు ఫోన్ చేశారు. దీంతో వెంటనే గ్రామానికి చెందిన అంజిలప్ప బాధిత రైతులకు ఫోన్ చేసి, ధాన్యం డబ్బులు తన ఖాతాలో పడ్డాయని.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నానని.. సాయంత్రం చెల్లిస్తానని చెప్పాడు. దీంతో నగదు తమ ఖాతాలో కాకుండా మరో వ్యక్తి అకౌంట్లో జమ కావడంపై బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రం అంజిలప్ప అన్ని తానై వ్యవహరిస్తూ పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నాడని బాధిత రైతులు ఆరోపించారు. ధాన్యం విక్రయించే సమయంలో రైతులు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, రాస్నం శాఖకు చెందిన తమ ఖాతా వివరాలను విక్రయపట్టిలో నమోదు చేసినప్పటికీ మరో వ్యక్తి ఖాతాలోకి ఎలా మల్లించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారించి రాస్నం కొనుగోలు కేంద్రం నిర్వాహణలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన సొమ్ము విక్రయదారుల ఖాతాకు బదులుగా ప్రైవేట్ వ్యక్తి అకౌంట్లో జమ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కర్షకులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాస్నం కొనుగోలు కేంద్రంలో అవకతవకలు! అన్నదాత బదులు మరొకరి ఖాతాలో నగదు జమ అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతుల ఆరోపణ చర్యలకు డిమాండ్ కాగా ఈ విషయమై యాలాల ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. ఆదివారం కూడా ఇంటి వద్ద ఉండవద్దా.. రాస్నం కొనుగోలు కేంద్రంలో ధాన్యం డబ్బుల చెల్లింపుల విషయం నాకు ఏమీ తెలియదు.. ఎవరికై నా ఫిర్యాదు చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. -
సర్‌గ్గా సద్వినియోగం చేసుకోండి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) గడువు ఈనెల 10 వరకు పొడిగించిన నేపథ్యంలో లభించిన అదనపు సమయాన్ని పూర్తిగా నాణ్యత పెంపునకు వినియోగించాలని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు కె.కిరణ్మయి, చంద్రారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బంది చేసిన కృషిని అభినందించారు. జిల్లాలో నిర్వహి స్తున్న ఓటరు అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని పెంచాయని ప్రశంసించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని, ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో పేర్లు గుర్తించలేకపోతున్నామని, బీఎల్వోలు అందుబాటులో లేరనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. బీఎల్వోలు ప్రజలకు పూర్తి సహకారం అందిస్తూ, ఎన్నికల ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం ఆయన అదనపు కలెక్టర్ కె.కిరణ్మయితో కలిసి కొంగర, బొంగులూరు, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. 63.53 శాతం మ్యాపింగ్ పూర్తి కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 63.53 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు చెప్పారు. పెండింగ్ మ్యాపింగ్, అనామలీస్, డూప్లికేట్, నో మ్యాపింగ్ కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతో ఇప్పటికే విస్తృత సమావేశాలు నిర్వహించి అపోహలు తొలగించామని, అవసరమైతే మరోసారి ఈఆర్వో స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. గడువులోగా పూర్తి చేయాలి ఇబ్రహీంపట్నం రూరల్: నిర్ణీత గడువులోగా సర్ కార్యక్రమం పూర్తి చేయాలని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఆదేశించారు. కొంగరకలాన్, బొంగ్లూర్‌లోని పలు పోలింగ్ కేంద్రాలను శనివారం ఆయన అదనపు కలెక్టర్ కిరణ్మయి, డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి జయచంద్రారెడ్డితో కలిసి పరిశీలించారు. బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, దరఖాస్తుల పరిశీలన, రికార్డుల నిర్వహణ, ఫీల్డ్ వెరిఫికేషన్ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రత్యేక ఓటరు సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీత, ఆదిభట్ల డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. బీఎల్ఓలు అందుబాటులో లేరనే ఫిర్యాదులు రావొద్దు ఇప్పటివరకు జిల్లా అధికారుల కృషి భేష్ కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌కుమార్ ఓటరు జాబితా సమగ్ర సవరణపై సమీక్ష -
అభివృద్ధిలో నిర్లక్ష్యం సహించం
ఆమనగల్లు: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ హాలులో శనివారం మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అధికారులు అలసత్వం వీడాలని, ప్రజాప్రతినిధులతో సమన్వయంతో ముందుకుసాగాలని అన్నారు. గ్రామాల్లో సమస్యలు లేకుండా చూడాలని కోరారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రెండు నెలల్లో విద్యుత్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని విద్యుత్ ఏడీఈ బాలకృష్ణకు సూచించారు. సమావేశంలో మార్కెట్‌చైర్మన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, ఎంపీడీఓ జయరాంవిజయ్, ప్రత్యేకాధికారి శోభారాణి, డీటీ వినోద్‌కుమార్, ఎంఈఓ పాండు, సీఐ వెంకటేశ్వర్లు, ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్చౌహాన్, వ్యవసాయాధికారి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి -
స్నేహమేవ జయతే
హుడాకాంప్లెక్స్: ‘అల్లాయే దిగివచ్చి.. ఏమి కావాలంటే..? మిద్దెలొద్దు.. మేడలొద్దు.. పెద్దలెక్కే గద్దెలొద్దంటా.. ఉన్ననాడు.. లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే.. ఒక్క దోస్తే చాలంటా.. స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. స్నేహమేరానాకున్నది.. స్నేహమే నాపెన్నిధి’ అంటూ సినీనటుడు కై కాల, ఎన్టీఆర్ ఏళ్ల క్రితం ఆలపించిన ఆ పాట చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఇదే స్ఫూర్తితో రంగారెడ్డి జిల్లా హస్తినాపురానికి చెందిన రాందేశ్పాండే 2008లో స్నేహితుల కలయిక కోసం ‘స్నేహమేవ జయతే’ సంక్షేమ సంఘాన్ని స్థాపించారు. కేవలం నలుగురు మిత్రులతో మొదలైన ఈ స్నేహ ప్రస్థానం.. ప్రస్తుతం మూడు వందల మందికిపైగా విస్తరించింది. ‘స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదురా’ అంటూ దోస్తీ గొప్పతనాన్ని నేటి తరానికి వివరిస్తుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆగస్టు 2న స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరంతా ఒకే వేదికపై కలుసుకుని, ఆర్థికంగా వెనుకబడిన స్నేహితులకు అండగా నిలబడటంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేస్తుంటారు. ఆ తర్వాత వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తుంటారు. వీధుల్లో ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చే కార్యక్రమం సహా స్నేహం విలువను చాటి చెబుతుంటారు. పర్యావరణ పరిరక్షణ, నీటిపొదుపు, పాలిథిన్ బ్యాగుల నిషేధం, అనాథ శరణాలయాల్లో అన్నదానం జాతి నేతల గొప్పతనంపై కరపత్రాల పంపిణీ, రాఖీ రోజున ఫ్రెండ్షిప్ బాండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతూ నవతరం స్నేహితులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నలుగురితో మొదలై.. 300 మందికి విస్తరణ నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం -
నాణ్యమైన వైద్యమే ‘అవేర్’ లక్ష్యం
యాచారం: అవేర్ మాధవన్‌జీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం నందివనపర్తిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అవేర్ గ్రూపు వ్యవస్థాపక చైర్మన్ మాధవన్‌జీ మెడికల్ క్యాంపును ప్రారంభించగా, గ్రామానికి చెందిన 200 మంది పరీక్షలు చేయించుకుని, మందులు తీసుకున్నారు. అనంతరం మాధవన్‌జీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. వైద్యులు ఆషికారెడ్డి, కార్తీక్, చందన్ రోగులకు పరీక్షలు చేశారు. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రఖ్యాత విద్యావేత్త డాక్టర్ బ్రామ్ వాన్ లూవీన్ గౌరవ్ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్ పి.వరుణ్, మేనేజర్ వెంకన్న, సర్పంచ్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
రైలు కిందపడి గుర్తుతెలియని వృద్ధురాలి మృతి
శంకర్పల్లి: రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వృద్ధురాలు(60) మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని మృతదేహం పడి ఉంది. గమనించిన లైన్మెన్ వెంటనే వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పరిశీలించి, వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలు కదులుతున్న రైలులో నుంచి పడి మృతి చెందినట్లుగా రైల్వే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మీర్‌పేట: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బడంగ్‌పేటకు చెందిన ఎర్రమల్ల భీమరాజు కుమార్తె శాలిని(17) ఇంటర్మీడియట్ చదువుతోంది. గత నెల 20వ తేదీన శాలిని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంగళ్‌పల్లి టు కర్మన్‌ఘాట్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లిలోని ఓ అద్దె భవనంలో కొనసాగుతున్న మహేశ్వరం మెడికల్ కాలేజీని కర్మన్‌ఘాట్‌లోని మరో అద్దె భవనంలోకి మార్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత అద్దె భవనంలో ఆశించిన మౌలిక సదుపాయాలు లేకపోవడం, అనుబంధ ఆస్పత్రికి 18 కిలోమీటర్ల దూరం ఉండడం, వైద్య విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడానికి తోడు శనివారంతో ఒప్పంద గడువు కూడా ముగిసింది. ఇటీవల ఇదే అంశంపై సాక్షిలో ‘కాలేజీ..ఏ క్యాజీ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వైద్య విద్యా సంచాలకుల విభాగం స్పందించింది. ఈ మేరకు డాక్టర్ రమాదేవి, డాక్టర్ అనిల్‌కుమార్, డాక్టర్ నాగేందర్‌తో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ కర్మన్‌ఘాట్‌లోని మరో ఐదు అంతస్తుల భవనాన్ని ఇందుకు అనువైన ప్రదేశంగా గుర్తించింది. అద్దె చెల్లింపులపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తికానుంది. ఆ వేంటనే ప్రస్తుత క్యాంపస్‌ను ఖాళీ చేసి, కొత్తగా ఎంపిక చేసిన భవనంలోకి మార్చనున్నారు. దీంతో కాలేజీ, అనుబంధ ఆస్పత్రి మధ్య దూరం నాలుగు కిలోమీటర్లకు తగ్గిపోనుంది. ఈ కొత్త భవనంలోనే విద్యార్థులకు వసతి కల్పించే అవకాశం ఉంది. అధిక చెల్లింపులపై నోటీసులు సాధారణంగా గృహ సముదాయ భవనానికి చెల్లించే అద్దైపె ఏటా ఐదు శాతం పెంచుకునే అవకాశం ఉంది. అదే కమర్షియల్ భవనం అద్దెను పది శాతం పెంచుకోవచ్చు. కానీ మహేశ్వరం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏకపక్షంగా ఇప్పటికే 15 శాతం పెంచి, అదనంగా చెల్లిస్తోంది. ఫైనాన్స్ కమిషన్ సహా కలెక్టర్ అనుమతి లేకుండా నిర్దేశిత అద్దెకు మించి చెల్లింపులు చేయడాన్ని ప్రభుత్వ ఫైనాన్స్ విభాగం తప్పుబట్టింది. ఇదే అంశంపై ప్రిన్సిపాల్‌కు సంజాయిషీ నోటీసులు జారీ చేసింది. ఒకవైపు అక్రమ చెల్లింపులపై విచారణ కొనసాగుతుండగా, మరోవైపు ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దైపె 20 శాతం అదనంగా చెల్లించాలని భవన యజమాని స్పష్టం చేశారు. బహిరంగ మార్కె ట్లో ఎక్కడా లేని విధంగా అద్దె చెల్లించి.. అసౌకర్యాల మధ్య ఉండటం కంటే.. ప్రస్తుత భవ నాన్ని ఖాళీ చేసి, మరో కొత్త అద్దె భవనంలోకి వెళ్లడమే ఉత్తమమని వైద్యశాఖ భావిస్తోంది. ఈ క్రమంలో భవనం పరిశీలన, ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా కమిటీ కర్మన్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు అద్దె భవనాన్ని పరిశీలించింది. అద్దె చెల్లింపులపై భవన యజ మానితో ఒప్పందం కుదరడమే ఆలస్యం తరగతులు సహా వసతి ఇక్కడే లభించనుంది. ‘సాక్షి’ కథనంతో వైద్య విద్యలో కదలిక మహేశ్వరం మెడికల్ కాలేజీ షిఫ్ట్ మరో ఐదు అంతస్తుల అద్దె భవనం పరిశీలన అద్దె చెల్లింపులపై స్పష్టత రాగానే మార్పు 18 నుంచి 4 కిలోమీటర్లకు తగ్గనున్న దూరభారం తీరనున్న వైద్య విద్యార్థులు, అధ్యాపకుల కష్టాలుకొత్తపేటలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) భవన నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. రూ.668 కోట్ల అంచనా వ్యయంతో వెయ్యి పడకల సామర్థ్యంతో 27 అంతస్తులు.. 123 మీటర్ల ఎత్తు సహా 11.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్పత్రికి అంత ఎత్తయిన భవనం అవసరం లేదని భావించింది. ఎత్తును 27 నుంచి 11 అంతస్తులకు తగ్గించింది. ప్లంబింగ్, కరెంట్ లైన్లు, డ్రైనేజీ వ్యవస్థ, డోర్లు, కిటికీలు వంటి ఇంటిరీయర్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరో ఆరు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. నిజానికి మహేశ్వరం మెడికల్ కాలేజీకి మీర్ఖాన్పేటలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వంద ఎకరాలు కేటాయించింది. భవన నిర్మాణం కోసం శంకుస్థాపన కూడా చేసింది. వైద్య విద్యకు ఇది ఏమాత్రం అనువైన ప్రాంతం కాదని ప్రస్తుత ప్రభుత్వం భావించింది. మీర్ఖాన్పేట నుంచి మంగళ్‌పల్లిలోని ఓ అద్దె భవనంలోకి మార్చింది. ప్రస్తుతం ఆ భవనంతో కుదుర్చుకున్న అద్దె గడువు ఒప్పందం కూడా ముగియడం, తాత్కాలికంగా కర్మన్‌ఘాట్‌లోని అద్దె భవనంలోకి మార్చి, ఆ తర్వాత కొత్తగా నిర్మిస్తున్న టిమ్స్లోకి మార్చాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. -
2 నిమిషాలు.. 1,150 బస్తాలు
మంచాల: యూరియా కొరత, అక్రమాలను నివారించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానంపై రైతులకు అవగాహన లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మంచాల పీఏసీఎస్, బోడకొండ ఎరువుల సరఫరా కేంద్రానికి చేరుకున్న యూరియా బస్తాలు నిమిషాల్లోనే ఆన్లైన్లో అమ్ముడవ్వడంతో మొబైల్ వినియోగం రాని చాలా మంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి పంటకు యూరియా ఎంతో అవసరం. ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడా ఇది దొరకడం లేదు. దీనికి తోడు ఈ వారం యూరియా సరఫరా కాలేదు. ఈ క్రమంలో శనివారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయానికి 450 బస్తాలు, బోడకొండ ఎరువుల సరఫరా కేంద్రానికి 700 బస్తాల యూరియా వచ్చింది. లారీలో నుంచి దించకముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవడంతో అమ్ముడయింది. కేవలం రెండు నిమిషాల్లోనే యూరియా అయిపోయింది. దీంతో అప్పటిదాకా వేచి ఉన్న రైతులు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. నాలుగైదు రోజులుగా యూరియా వస్తుందని ఆశతో గ్రామాల నుంచి ఇక్కడకు వచ్చిపోతున్నాం. ఆన్లైన్ పేరిట ఇక్కడ ఉన్న వారికి ఇవ్వకుండా ఎక్కడో ఉండి బుకింగ్ చేసుకున్నారని ఇవ్వడం దారుణమన్నారు. కొద్దిసేపు యూరియా విక్రయించకుండా షటర్ మూసి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం అవసరాలకు సరిపడా యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు. ఆన్లైన్ బుకింగ్‌తో క్షణాల్లో విక్రయాలు యూరియా దొరకక రైతుల ఆగ్రహం షటర్ మూసి ఆందోళన యూరియా కావాలంటే ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకోవాలి. వచ్చిన స్టాక్ వచ్చినట్లుగా నిమిషాల్లోనే బుకింగ్ కావడం జరుగుతోంది. కచ్చితంగా బుకింగ్ చేసుకున్న వారికి ఇవ్వాల్సిందే. నిబంధనలు అందరికి ఒక్కటే. ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకోవాలి. – వెంకటేశ్, ఏఓ, మంచాల యూరియా కోసం నాలుగైదు రోజులుగా ఎదురుచూసినా రావడం లేదు. లోడ్ రాగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికి నిమిషాల్లో యూరియా ఇస్తున్నారు. చదువురాని రైతులు చాలా ఇక్కట్లకు గురవుతున్నారు. అందరి అవసరాలకు అనుగుణంగా యూరియా ఇవ్వాలి. – ఐలయ్య, రైతు, తిప్పాయిగూడ -
డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
హయత్‌నగర్: టీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లుగా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హయత్‌నగర్–1 డిపో మేనేజర్ లావణ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెవీ వాహన లైసెన్స్ కలిగి ఉండి కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు సైజు ఫొటోను జత చేసి ఈనెల 8వ తేదీలోపు డిపోలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.షాబాద్: ఇటీవల మాతృవియోగానికి గురైన పట్నం సోదరులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం పరామర్శించారు. షాబాద్‌లోని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్‌రెడ్డి నివాసంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జి పామెన భీంభరత్, పెంటారెడ్డి, మద్దూరు మల్లేష్, సర్పంచులు అశోక్, రవికుమార్, నర్సింలు, శ్రీరాంరెడ్డి, చెన్నయ్య రుక్కమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పట్నం మహేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిని పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య, శ్రీరాంరెడ్డి, మల్లేష్, దేవేందర్‌రెడ్డి, అరీఫ్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు: కొత్తూరు పోలీస్‌స్టేషన్ నూతన సీఐగా నాగార్జునరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఇక్కడ విధులు నిర్వర్తించిన నర్సయ్య ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌కు బదిలీపై వెళ్లారు. ఇబ్రహీంపట్నం: దండుమైలారం గ్రామంలో ఆక్రమణకు గురైన గ్రామకంఠం భూ సాధనే లక్ష్యంగా చేస్తున్న రిలే దీక్షలు శనివారానికి ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో ఆక్రమణకు గురైన గ్రామ కంఠం భూమిని విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ ఈదులకంటి నరేష్‌గౌడ్ దీక్షలు చేపట్టిన వారికి సంఘీభావం ప్రకటించాడు. -
హిందూ చైతన్యమే లక్ష్యం
మీర్‌పేట: భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, సనాతన ధర్మం పట్ల చైతన్యం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని బీజేపీ మహేశ్వరం ఇన్చార్జి అందె శ్రీరాములు యాదవ్ అన్నారు. శనివారం జిల్లెలగూడ శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ ఆవరణలోని ఆంజనేయస్వామికి ఆయన ప్రత్యేక పూజలు చేసి స్థానిక నాయకులు గాజుల మధు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించి, సుమారు 100 ఆటోలకు అతికించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో జాతీయ భావన, సాంస్కృతిక విలువలు, హిందుత్వ చైతన్యం మరింత విస్తరించాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతి ఆటో ఒక సందేశం, హిందుత్వ చైతన్యమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బీజేపీ కో–ఆపరేటివ్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొలన్ శంకర్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, కీసర గోవర్ధన్‌రెడ్డి, భిక్షపతిచారి, కరుణానిధి, విజయలక్ష్మీరాజు, చెవ్వ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీరాములుయాదవ్ -
ప్రజలకు ఇబ్బందులు రానీయొద్దు
షాబాద్: ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదేనని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలో పట్నం మహేందర్‌రెడ్డి కుటుంబీకులను పరామర్శించిన అనంతరం మండలంలోని రైతులు ఆయనకు వినతులు అందజేశారు. ఎరువుల విషయంలో ఇబ్బందిగా ఉందని, ఇక్కడ రైతులు ఎక్కడికో వెళ్లి ఎరువులు తీసుకోవాల్సి వస్తుందని విన్నవించారు. యాప్ ద్వారా తీసుకోవడం మరీ అంతరాయంగా ఉందన్నారు. వెంటనే ఆ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి ఫోన్ ద్వారా మాట్లాడారు. యాప్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయని వారు తెలపగా.. సమస్యలు ఉంటే యాప్‌ను ఎందుకు రైతుల ముందుకు తీసుకు వచ్చారని, రెండు మూడు రోజుల్లో సరిచేసి ఇబ్బంది లేకుండా చేయాలన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరికీ అన్యాయం జరగకుండా ఇవ్వాలని తహసీల్దార్ అన్వర్‌ను ఆదేశించారు. స్థానిక విలేకరులకు సైతం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంత్రిని కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!
మొయినాబాద్: పాఠశాల విద్యార్థులను తరలించే ప్రైవేటు బస్సులు ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదు. వీరి చర్యలతో పిల్లలకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్లో వెళ్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మొయినాబాద్‌లోని హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై ఎన్నో యూటర్న్లు ఉన్నా.. శ్రీచైతన్య స్కూల్ బస్సులు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో రాంగ్ రూట్లోనే ప్రయాణం సాగిస్తున్నాయి. వీరి చర్యలను చూసి మిగిలిన వాహనదారులు, స్థానికులు మండిపడుతున్నారు. పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్ల బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిత్యం రాంగ్ రూట్లో వెళ్తున్న స్కూల్ బస్సులు -
ప్లాట్లను ఆక్రమించే కుట్రను అడ్డుకోండి
పహాడీషరీఫ్ పీఎస్‌ను ఆశ్రయించిన బాధితులు పహాడీషరీఫ్: జల్పల్లి గ్రామంలోని ఎన్ఆర్ఐ ఫస్ట్ సిటీ వెంచర్లో ఇరవై ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లను కొందరు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ బాధితులు శనివారం పహాడీషరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. జల్పల్లిలోని సర్వే నంబర్ 70, 85లో ఏర్పాటు చేసిన వెంచర్లో 602 ప్లాట్లను 2006– 07లో కొనుగోలు చేశామన్నారు. ఇటీవల కొందరు వ్యక్తులు తమ లేఅవుట్‌ను ఆక్రమిస్తూ దాదాపు 120 ప్లాట్ల చుట్టూ కంచె వేసి, జేసీబీలతో అడ్డుకుంటున్నారన్నారు. ఈ విషయమై ప్లాట్ల యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రదీప్, రాహుల్, సంధ్య, డీఎం రెడ్డి, ఫరూక్‌లు పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో చట్టరీత్యా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలపై వీహెచ్‌పీ నేతల మండిపాటు హుడాకాంప్లెక్స్: పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్షాలు స్వామీజీ వేషధారణలో ప్రదర్శించిన స్కిట్ హిందూ ధర్మాన్ని, విశ్వాసాలను, మనోభావాలను కించపరిచే విధంగా ఉందని విశ్వహిందూ పరిషత్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు శనివారం కొత్తపేటలో నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులు చేపట్టిన నిరసన హిందూ సమాజాన్ని అవమానించే విధంగా ఉందన్నారు. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు సుధాకర్, సుధీర్, రామకృష్ణ, బెంగరబోయిన సురేష్, నవకాంత్, ప్రవీణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలి
షాద్‌నగర్: ప్రభుత్వం ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను శుక్రవారం పట్టణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని, వారి త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పాటైందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్, గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని కోరారు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వారిని గౌరవించుకునేందుకు తెలంగాణ ఉద్యమ కారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమకారుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, నాయకులు దిలీప్‌కుమార్, బోరెళ్లి సురేష్, రహీం, జాంగారి రవి, శ్రీనివాస్‌రెడ్డి, నడికూడ యాదగిరి, ఆర్ల యాదయ్య, మేకల వెంకటేశ్, రాజు, రవికుమార్, బీరప్ప, మల్లేష్, మహేందర్, విశాల తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యూచర్‌సిటీతో ప్రపంచస్థాయి గుర్తింపు
యాచారం: ఫ్యూచర్‌సిటీ నిర్మాణంతో ఈ ప్రాంతానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి అధికారులు, సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవచ్చు కానీ కావాల్సిన నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఫార్మాసిటీలో అక్రమార్కులు, నకిలీలకు ఎట్టి పరిస్థితుల్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అర్హులైన, నిజమైన రైతులకు త్వరలో అందజేస్తామని వెల్లడించారు. కుంటలు, వరద కాల్వలు, వర్షపు నీరు పారే దారులను కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫాంల్యాండ్స్ పేరుతో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డిని సూచించారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు, మండల ప్రత్యేకాధికారి మాధవరావు, పంచాయతీ రాజ్ శాఖ డీఈఈ శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఏడీ సీతారాం, ఎంపీడీఓ రాధారాణి, తహసీల్దార్ అయ్యప్ప, వివిధ గ్రామాల సర్పంచులు దెంది రాంరెడ్డి, కొలన్ రమాదేవి, నరేందర్‌రెడ్డి, రమేష్, నీలం ఝాన్సీ, నీలం శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే మండల పర్యటనలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాజ్యలక్ష్మి ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్ వచ్చినట్లు తెలిపారు. కాసేపటికి ఆయన కుదుటపడ్డారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
సాగు కళకళ
● పొలం బాటలో అన్నదాతలు ● వరినాట్లు వేసేందుకు కరిగెట్లు ● ఆశాజనకంగా పత్తి, మొక్కజొన్న నాలుగు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి అన్నదాతలు పొలం బాట పట్టారు. ఎప్పుడెప్పుడా అని నింగి వైపు చూసిన రైతులను వరుణుడు కరుణించాడు. దీంతో వరి నాటు వేసేందుకు కరిగెట్లు చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న పంటలు కళకళలాడుతున్నాయి. – షాబాద్ నరెడ్లగూడలో పత్తి పంట మల్లారెడ్డిగూడలో కళకళలాడుతున్న మొక్కజొన్న -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
షాబాద్: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన నాగరగూడ ఎక్స్ రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నాగరగూడ ఎక్స్ రోడ్డు వద్ద షాద్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును శంషాబాద్ వైపు నుంచి వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారికి నాగరగూడ శ్రీనివాస ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన నామ మమత, శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లికి చెందిన శిరీష, మరో ఇద్దరు ఉన్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట చేవెళ్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మధుసూదన్‌గుప్తా ఉన్నారు. నలుగురికి తీవ్ర గాయాలు -
నేటినుంచి తల్లిపాల వారోత్సవాలు
జిల్లా సంక్షేమాధికారి శాంతిశ్రీఇబ్రహీంపట్నం రూరల్: తల్లిపాల వారోత్సవాలను జయప్రదం చేయాలని జిల్లా సంక్షేమాధికారి శాంతిశ్రీ శుక్రవారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా మండల, గ్రామస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యత, రోగ నిరోధక శక్తి, ఆరోగ్యకరమైన ఎదుగుదల, దీర్ఘకాలిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం ద్వారా నవజాత శిశు మరణాలు తగ్గించవచ్చన్నారు. దీనిపై సామాజిక, కుటుంబ భాగస్వామ్యంపై అవగాహన కల్పించాలని కోరారు. మొయినాబాద్: భాస్కర మెడికల్ కళాశాలపై విచారణ చేపట్టాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ)ను ఆదేశించింది. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి రెవెన్యూలో ఉన్న భాస్కర మెడికల్ కళాశాలలో ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం పెరిగిన ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యకు అనుగుణంగా విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సౌకర్యాలు, ఆస్పత్రి వసతులు లేవని.. విద్యార్థులకు ఇచ్చే స్టయిఫండ్ వివరాలను బహిర్గతం చేయడంలేదని ఇటీవల ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకుడు దేవరాల రాజేష్ యాదవ్ ఎన్ఎంసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్ఎంసీ కళాశాలలో సంబంధిత అంశాలపై సమగ్ర విచారణ జరిపి, తీసుకున్న చర్యల నివేదికను వారం రోజుల్లోగా పంపాలని డీఎంఈకి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రాజేష్ యాదవ్ మాట్లాడుతూ.. కళాశాలలోని సదుపాయాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమనగల్లు: మండలంలోని ఆకుతోటపల్లిలో ఏర్పాటయ్యే క్వారీ, స్టోన్ క్రషర్ స్థలాన్ని శుక్రవారం వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. గ్రామంలోని సర్వే నంబర్ 302,304లో క్రషర్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనిపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఇటీవల కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థలాన్ని జిల్లా మైనింగ్ అధికారి ఇందిర, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూశాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా క్రషర్ ఏర్పాటు వద్దని గ్రామస్తులు విన్నవించారు. క్రషర్ ఏర్పాటుతో దుమ్ము, ధూళితో సమీపంలో ఉన్న పొలాలు, పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతాయని వివరించారు. నివేదికను కలెక్టర్‌కు అందిస్తామని అధికారులు తెలిపారు. మొయినాబాద్‌రూరల్: కురుస్తున్న వర్షాలతో ఈసీ వాగు వరద నీటితో ప్రవహిస్తోంది. రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతమైన వికారాబాద్, పరిగి ఆయా ప్రాంతాల నుంచి మొదలైన ఈసీవాగు శుక్రవారం ఉదయం వరద నీటితో ప్రవహిస్తోంది. హిమాయత్‌సాగర్‌లోకి నీరు చేరుతోంది. కొద్ది రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు ఈసీ వాగు పారుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
గుప్త నిధుల పేరిట మోసం!
● ఇద్దరి నుంచి రూ.8 లక్షలు వసూలు చేసిన నకిలీబాబా ● జీవన్గీలో నాటకీయంగా వెలుగుచూసిన ఘటన బషీరాబాద్: గుప్తనిధి ఆశ చూపించాడు.. ఇంటి ఆవరణలో కోట్ల విలువైన నిధి దాగి ఉందంటూ నమ్మించాడు. ప్రత్యేక పూజలు, తంత్రాలు చేస్తే అది బయటపడుతుందని చెప్పాడు. ఇందుకోసం విడతలవారీగా రూ.8 లక్షలు వసూలు చేసి, మాయమయ్యాడు. నమ్మకంగా వల కర్ణాటకకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ద్వారా జీవన్గీకి చెందిన ఇద్దరు వ్యక్తులకు గతేడాది ఆగస్టులో హైదరాబాద్ ధూల్‌పేట వాసి లక్ష్మణ్‌సింగ్ హజారీ పరిచయమయ్యాడు. అతీంద్రియ శక్తులు కలిగిన బాబాగా తనకు తాను చెప్పుకొన్నాడు. ఒకరోజు జీవన్గీకి వచ్చి ఓ ఇంటిని పరిశీలించిన సదరు బాబా.. ఇంట్లో కోట్ల విలువైన బంగారు నిధి ఉందని, ప్రత్యేక పూజలు, మంత్రాలతో వెలికి తీస్తానని నమ్మించాడు. ఆ తర్వాత నిధికి నాగబంధం ఉందని, దాన్ని తొలగించేందుకు ప్రత్యేక హోమాలు, అరుదైన పూజా సామగ్రి అవసరమని చెప్పాడు. ఇందుకోసం దశలవారీగా ఇద్దరి నుంచి సుమారు రూ.8 లక్షలు వసూలు చేశాడు. మట్టి కుండతో మాయాజాలం ఓ రోజు నిధిని బయటకు తీస్తానని చెప్పిన బాబా.. ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి, ఎవరినీ రావొద్దన్నాడు. అర్ధరాత్రి సమయంలో పూజలు నిర్వహించి, తవ్వకాలు చేపట్టి ముందుగానే పాతిపెట్టినట్లు అనుమానిస్తున్న ఓ మట్టి కుండను వెలికి తీశాడు. అందులో నుంచి ఓ బంగారు రంగున్న బిల్లను చూపించి నిధి బయటపడిందని చెప్పాడు. దీంతో తవ్వకాలు చేయించినవారు ఎంతో సంతోషించారు. నాగబంధం పూర్తిగా తొలగిపోలేదని, వారం రోజుల్లో తిరిగి వచ్చి, ప్రత్యేక పూజల అనంతరం పూర్తి నిధిని అప్పగిస్తానని, అప్పటి వరకు కుండను ఎవరు తాకినా ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించి వెళ్లిపోయాడు. ఆరోజు నుంచి నకిలీ బాబా తిరిగిరాలేదు. ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. కొద్ది రోజుల తర్వాత కుండను తెరిచి చూడగా అందులో 78 బంగారు రంగు బిళ్లలను గుర్తించారు. వీటిని కర్ణాటకలోని ఓ బంగారం వ్యాపారి వద్దకు తీసుకెళ్లి పరీక్షించగా నకిలీవని తేలడంతో మోసపోయామని గుర్తించి లోలోపలే మదనపడ్డారు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. ఎలాగైనా తమను మోసగించిన బాబాను పట్టుకోవాలని పలుమార్లు ధూల్‌పేట్‌లోని అతని ఇంటికి వెళ్లినా ఆచూకీ లభించలేదు. అతడి భార్య దివ్యభాయి కూడా ఇలాంటి మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లిందని చుట్టుపక్కల వారు చెప్పడంతో బాధితులు నిరాశగా తిరిగి వచ్చినట్లు సమాచారం. విషయం బయటకొచ్చిందిలా.. గుప్తనిధులు తవ్వించిన ఇద్దరు వ్యక్తులు.. బాబాకు సమర్పించిన రూ.8 లక్షల్లో.. మరికొంత మంది వద్ద తీసుకున్న డబ్బులు కూడా ఉన్నాయి. నిధి దొరికిన తర్వాత పెద్దమొత్తంలో తిరిగిస్తామని చెప్పడంతో వారు కూడా సరేనన్నారు. ఏడాది కావస్తున్నా ఇచ్చిన డబ్బులైనా చేతికి అందకపోవడంతో సదరు వ్యక్తుల ఇళ్లకు వెళ్లి గొడవ పెట్టుకున్నారు. బాబా ఎవరో తమకు తెలియదని, మిమ్మల్ని నమ్మి ఇచ్చాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఈవిషయం ఈనోటా ఆనోటా బయటికి పొక్కింది. -
పనుల్లో వేగం పెంచండి
● బ్రహ్మోత్సవాల నాటికి ఆలయం పూర్తి కావాలి ● సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు కొడంగల్: పట్టణంలోని పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ నవీకరణ పనుల్లో వేగం పెంచాలని సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు అన్నారు. కలెక్టర్ దీపక్ తివారితో కలిసి శుక్రవారం కొడంగల్‌లో పర్యటించారు. శ్రీవారి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న కట్టడాలను గమనించారు. పనుల్లో పురోగతి సాధించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అనంతరం కడా కార్యాలయంలో ఇంజనీరింగ్, కన్సల్టెన్సీ ఏజెన్సీ, ప్లానింగ్ డిజైనర్స్, కాంట్రాక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో నిర్వహించే బ్రహ్మోత్సవాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్మాణ పనులు చేయాలన్నారు. సంప్రదాయ శైలిని కాపాడుతూ నాణ్యతా ప్రమాణాలను పాటించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాడ వీధులు, క్యూలైన్, కల్యాణ మంటపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, ప్రత్యేక అవసరాల గదులు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు నిర్మించాలన్నారు. పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో ట్రైయినీ అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, ఆర్అండ్బీ ఎస్ఈ వసంతనాయక్, డీఈ శ్రీధర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘పట్నం’ కుటుంబానికి పరామర్శ
షాబాద్: శాసన మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్‌రెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌర్ పరామర్శించారు. మహేందర్‌రెడ్డి తల్లి పట్నం రుక్కమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సాట్ చైర్మన్ శివసేనరెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే రమేశ్‌మహరాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధూసూదన్‌రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, పామెన భీంభరత్, కాలె శ్రీకాంత్, పెంటారెడ్డి, సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
బస్తీ దవాఖానాలకు 20 మంది కొత్త వైద్యులు
సాక్షి, సిటీబ్యూరో: వ్యాధుల సీజన్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా ఉన్న బస్తీ దవాఖానాలను బలోపేతం చేయాలని వైద్యాధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖాళీలను సత్వరం భర్తీ చేయాలని హైదరాబాద్ కలెక్టర్‌ను కోరగా.. ఆమె సానుకూలంగా స్పందించారు. దీంతో సోమవారం నుంచి సుమారు 20 మంది వరకు కొత్త వైద్యులు అందుబాటులోకి రానున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో నగరమంతటా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రులను వరుస తనిఖీలు చేస్తున్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ హెచ్చరిస్తున్నారు. హైరిస్క్ జాబితాలు సిద్ధం హైదరాబాద్ జిల్లాలో 169 బస్తీ దవాఖానాలు, 91 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. సాధారణ రోజులతో పోల్చితే ఓపీ సుమారు 20 శాతానికిపైగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నగరంలోని కొన్ని బస్తీ దవాఖానాల్లో నిత్యం ఓపీ వంద దాటుతోంది. ఇది సాధారణ రోజుల్లో 40 నుంచి 70 వరకు ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఆస్పత్రి పరిధిలోని గర్భిణులు, వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వంటి వారితో హైరిస్క్ జాబితాలను సిద్ధం చేశారు. 1,037 హైరిస్క్ ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించారు. 1,220 ఫ్రైడే డ్రైడే యాక్టివిటీ, 9,335 ప్రాంతాల్లో యాంటీ లార్వా (లార్వా రిజెక్షన్) కార్యక్రమాలు చేపట్టారు. ‘ఆస్పత్రుల్లో సిబ్బంది హాజరు, అందుతున్న ఆరోగ్య సేవలు, ఔషధాల లభ్యత, ల్యాబ్, వ్యాధి నిరోధక టీకాల లభ్యత, తదితర అంశాలపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే మెరుగైన వైద్యం అందుతుందన్న భరోసా కల్పించే విధంగా సిబ్బంది సేవలు ఉండాలి. ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సహాయ సిబ్బంది అంతా తప్పనిసరిగా సమయపాలన పాటించాల్సిందే’ అని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ ఇటీవల సమీక్ష సమావేశం సందర్భంగా సిబ్బందిని ఆదేశించారు. ముగిసిన ఫీవర్ సర్వే క్షేత్రస్థాయిలో సీజనల్ వ్యాధుల ప్రభావం తెలుసు కునేందుకు జ్వర సర్వే చేపట్టారు. జూలై 31తో ముగిసిన సర్వేలో మొత్తం 300 బృందాలు పాల్గొన్నాయి. 1,668 ప్రాంతాల్లో 90 వేలకుపైగా గృహాలను సందర్శించారు. 3,500 మందిని ఫీవర్ స్క్రీనింగ్ చేశారు. ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల బృందం కుటుంబంలో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, ఇతర విష జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించారు. తదుపరి చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. తగ్గిన కేసులు గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం నగరంలో వ్యాధుల ప్రభావం తగ్గింది. 2025లో 1,481 డెంగీ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 280 కేసులు మాత్రమే నమోదయ్యాయి. చికున్‌గున్యాకు సంబంధించి ఒక్క కేసూ లేకపోగా.. గత ఏడాది 70 కేసులు నమోదయ్యాయి.9,335 ప్రాంతాల్లో లార్వా రిజెక్షన్ కార్యక్రమాలు 1,037 హైరిస్క్ ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు గత ఏడాదితో పోల్చితే తగ్గిన డెంగీ కేసులు సిబ్బంది సమయపాలన పాటించాలి: డీఎంహెచ్ఓ -
కేంద్ర పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లండి
షాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్‌గౌడ్ కార్యకర్తలకు సూచించారు. మండల పరిధిలోని కుర్వగూడ, నాగరగూడ, తాళ్లపల్లి గ్రామాల్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాని అన్నారు. బీజేపీతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పార్టీ బలమైన శక్తిగా మారిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీశైలం, జిల్లా కార్యదర్శి శ్రీకృష్ణ, మండల అధ్యక్షుడు మద్దూరు మాణెయ్య, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, నాయకులు మహేందర్, రాము, హరీష్, కిరణ్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్‌గౌడ్ -
బోనమెత్తిన లాల్‌దర్వాజా
సీపీ సజ్జనర్ శిఖర పూజ, ధ్వజారోహణ చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయ 118వ బోనాల ఉత్సవాలు శుక్రవారం వేద పండితుల మంత్రోచ్చారణలు, డప్పు వాయిద్యాల నడుమ లాంఛనంగా ప్రారంభమయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ ముఖ్య అతిథిగా హాజరై శిఖర పూజ, ధ్వజారోహణ చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దేవాదాయ శాఖ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) శ్రీనివాసరావు, సౌత్ రేంజ్ అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే, చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు లాల్‌దర్వాజా బోనాల జాతర ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనర్ తెలిపారు. పది రోజుల పాటు వైభవంగా జరిగే బోనాలకు శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 100కు పైగా సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఇతర సాంకేతిక అంశాలతో పర్యవేక్షిస్తామన్నారు. సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా 175 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఈ బస్సులు సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించనున్నాయని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. -
రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నవాడ రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని కేశవ మెమోరియల్ కళాశాలలో శుక్రవారం ఫీజుల బకాయి–బీజేపీ లడాయి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బకాయిలు విడుదలకాకపోవడంతో రాష్ట్రంలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 3,200 ఇంటర్మీడియెట్ కళాశాలలు, 2,700 డిగ్రీ కళాశాలలు, 2,800 పీజీ కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయకుండా వెంటనే బకాయిలు విడుదల చేసి విద్యావ్యవస్థను కాపాడాలని కోరారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు పుప్పాల శాంతికుమార్, వినయ్, శశిధర్‌రెడ్డి, సందీప్, సంతోష్, శ్రీకాంత్, పవన్ పాల్గొన్నారు. -
చివరికి చిక్కారు
చోరీబాట పట్టారు..ఇబ్రహీంపట్నం రూరల్: తాళాలు పగులగొట్టి ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న ఘరానా దొంగను ఆదిభట్ల పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఏసీపీ ప్రదీప్‌రెడ్డి, సీఐ రమేష్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం జుజువార్ గ్రామానికి చెందిన ముకేష్ చౌదరి (35) హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటూ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. గతంలో యాప్రాల్‌లో హార్డ్‌వేర్ దుకాణం నిర్వహించిన అతను చెడు అలవాట్లకు లోనై వ్యాపారంలో నష్టాలు రావడంతో చోరీబాట పట్టాడు. అతనిపై పీడీయాక్ట్ కూడా నమోదైంది. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 19న జరిగిన చోరీ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు రూ.ఆరు లక్షల విలువైన బంగారం, 30 తులాల వెండి అభరణాలు, మొబైల్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆయా పోలీస్స్టేషన్లలో 17 కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. ఇద్దరు బైక్ దొంగల అరెస్టు పార్కింగ్ చేసిన బైక్‌లను దొంగిలిస్తున్న యువకులను ఆదిభట్ల, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నగరానికి చెందిన సయ్యద్ ఖాసీం హుస్సేన్ (18), మహమ్మద్ కరీమ్ (19) బైక్ చోరీలకు పాల్పడుతున్నారు. వీరిపై హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. నిందితులను శుక్రవారం ఆదిభట్ల, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులను ఛేదించిన ఎస్ఐ నోయల్‌రాజ్, క్రైమ్టీం ఎల్.రవికుమార్, కిరణ్‌రెడ్డి, ఎల్లయ్య, ఉపేందర్‌రెడ్డి, సందీప్, శివచంద్ర, సంతోష్‌కుమార్, సంతోష్, భరత్కుమార్గౌడ్ను ఏసీపీ అభినందించారు. ఆయా కేసుల్లో ముగ్గురు నిందితుల అరెస్టు బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం -
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి
షాద్‌నగర్: వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నందిగామ సీఐ వీరబాబు అన్నారు. శుక్రవారం నందిగామ మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. 80 వాహనాలు తనిఖీ చేసి 53 వాహనాలకు పెండింగ్‌లో ఉన్న చలాన్లను క్లియర్ చేయించారు. ఎనిమిది మంది వాహనదారులకు స్పాట్ చలాన్లు విధించారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపిస్తున్న వాహనదారుడి నుంచి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ వీరబాబు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ప్రతి వాహనదారుడు విధిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రతి వాహనదారుడి వద్ద వాహనాలకు సంబంధించిన అన్ని ప్రతాలు ఉండాలని సూచించారు. నందిగామ సీఐ వీరబాబు -
చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన కారు
కుల్కచర్ల: అదుపు తప్పిన కారు చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. చెల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుల్కచర్లకు కారులో వస్తుండగా ముందు టైరు పేలడంతో రోడ్డు కిందకు వేగంగా దూసుకెళ్లింది. వాహనంలోని ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ వ్యక్తికి క్రెడిట్ కార్డు అప్‌గ్రేడ్ పేరుతో సందేశం పంపి, ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయించడం ద్వారా రూ.6.26 లక్షలు స్వాహా చేయడంపై సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. సైదాబాద్‌కు చెందిన ఓ సేల్స్‌మెన్‌కు బుధవారం గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఆర్బీఎల్ బ్యాంక్ రుపే క్రెడిట్ కార్డు విభాగం అధికారిగా పరిచయం చేసుకున్నాడు. బాధితుడి వద్ద ఉన్న ఆర్బీఎల్ వీసా క్రెడిట్ కార్డును ఆర్బీఎల్ రుపే క్రెడిట్ కార్డుగా అప్‌గ్రేడ్ చేస్తానని చెప్పాడు. దీనికి బాధితుడు అంగీకరించడంతో వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్స్‌తో కూడిన లింకులు పంపాడు. వాటిని ఇన్స్టాల్ చేయించి బాధితుడి బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు నుంచి రూ.6.26 లక్షలు కాజేశారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మణికొండ: దారిదోపిడీ, ఇళ్లలో దొంగతనాలు, బలవంతపు వసూళ్లు, తీవ్రమైన నేరాలతో పాటు మొత్తం 41 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న షేక్ ఇర్ఫాన్ అహ్మద్ అలియాస్ షూటర్ ఇర్ఫాన్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 6వ తేదీన రాత్రి 10.30 గంటల సమయంలో నిందితునితో పాటు అతని సహచరులు చేతన్, అల్హాన్ హుస్సేన్, సోహెల్, మహమ్మద్ సమీర్లతో కలిసి పోలీస్ అకాడమీ రోటరీ సమీపంలో పాదచారులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడాలనే పథకం వేశారు. ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న ఇద్దరు బాధితులను బలవంతంగా అపహరించి బ్రాడ్వే హోటల్ వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లారు. కత్తులతో బెదిరించి రూ.1050 నగదు, ఆన్లైన్లో రూ. 10వేలు, రెండు పవర్ బ్యాంక్‌లను దోచుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు గురువారం షూటర్ ఇర్ఫాన్‌ను పోలీస్‌స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు. శుక్రవారం కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించారని పోలీసులు తెలిపారు. -
ఎలానో!
రంగారెడ్డిశనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026ఎల్‌నినో.. కూరలుసాక్షి, రంగారెడ్డిజిల్లా: ఒకప్పుడు టన్నుల కొద్ది కూరగాయలు అందించి నగరవాసుల అవసరాలు తీర్చిన ఉమ్మడి జిల్లా రైతులు నేడు సాధారణ పచ్చిమిర్చి కోసం పక్కచూపులు చూడాల్సి వస్తోంది. రియల్ ఎస్టేట్ కారణంగా ఇప్పటికే సాగువిస్తీర్ణం భారీగా పడిపోయింది. తాజాగా దీనికి ఎల్‌నినో తోడైంది. డిమాండ్ మేరకు సాగు, దిగుబడి లేకపోవడంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు రూ.1, రూ.2కే లభించిన కొత్తిమీర, పుదీన కట్టలు.. ప్రస్తుతం కనీసం రూ.10 చెల్లిస్తే కానీ చేతికి అందడం లేదు. ఒక్క ఆకుకూరలే కాదు ఏ కూరగాయ కొనాలన్నా కిలో రూ.60పైగా వెచ్చించాల్సి వస్తోంది. ఇక పూలు, పండ్ల ధరలకై తే అంతే లేదు. బహిరంగ మార్కెట్లో చామంతి, గులాబీ ఇలా దేని ధర చూసినా కేజీ రూ.400పైగా పలుకుతోంది. 800 మెట్రిక్ టన్నుల లోటు నగరంలో గుడిమల్కాపూర్, బోయిన్పల్లి, మాదన్నపేట్, ఎల్బీనగర్ హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లు ఉన్నాయి. వీటితో పాటు ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సనత్‌నగర్, సరూర్‌నగర్, ఫలక్‌నుమా, కూకట్పల్లి, మేడ్చల్ రైతుబజార్లు ఉన్నాయి. నగరవాసుల అవసరాలు తీరాలంటే రోజుకు కనీసం 3,500 మెట్రిక్ టన్నుల కూరగాయలు దిగుమతి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయా మార్కెట్లకు 2,800 మెట్రిక్ టన్నులకు మించి సరఫరా కావడం లేదు. స్థానికంగా ఆశించిన స్థాయిలో పంటసాగు విస్తీర్ణం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కర్ణాటక నుంచి మిర్చి, క్యాలీఫ్లవర్, బీన్స్ వంటి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఆగ్రా నుంచి ఆలుగడ్డ వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల నుంచి ఉల్లిని తెప్పించుకోవాల్సి వస్తోంది. సరఫరాకు, డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాసం నమోదవుతుండటంతో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు రోజుకు అరకేజీ కూరలు వాడిన వారు భారీగా పెరిగిన ధరలతో ప్రస్తుతం పావు కేజీతో సరిపెట్టుకుంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూల సాగుపై ప్రభావం ఆశించిన స్థాయిలో నమోదు కాని పంటలు సరఫరాకు, డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వైనం ఎల్‌నినో.. కేవలం వరి, పత్తి పంటలపైనే కాదు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూల సాగుపైనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. సకాలంలో వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, బోరుబావుల్లోని మోటార్లు ఆగిపోవడంతో ఉమ్మడిజిల్లాలో ఆయా పంటల సాగు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. -
నకిలీ డీఏపీ తయారీ ముఠా అరెస్ట్
వేయి బస్తాల ఎరువు, తయారీకి ఉపయోగించే రూ.2 కోట్ల విలువైన సామగ్రి స్వాధీనం హుజూర్నగర్: మార్కెట్లో డీఏపీ కొరతను ఆసరాగా చేసుకుని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ డీఏపీ తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి నకిలీ డీఏపీ దందాకు తెరలేపారు. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో గోడౌన్ ఏర్పాటు చేసి నకిలీ డీఏపీని తయారు చేసి అక్కడి నుంచి పలు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. రైతులకు నకిలీ ఎరువు బస్తాలు వస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈనెల 15న మఠంపల్లి ఏఓ బొలిశెట్టి శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు రఘునాథపాలెంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ కొండేటి పిచ్చిరెడ్డి అనే వ్యాపారి దగ్గర నకిలీ డీఏపీ బస్తాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మఠంపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఆరుగురు నిందితుల అరెస్ట్.. పరారీలో ఇద్దరు పిచ్చిరెడ్డి ఇచ్చిన సమాచారంతో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జగదీష్ అలియాస్ జక్కప్ప, ఆనంద్ రావుకు సంబంధించిన తయారీ కంపెనీలో పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ 1000 డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షించగా.. నకిలీదని తేలింది. దీంతో రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డి, వికారాబాద్ జిల్లా పెద్దేముల్ గ్రామానికి చెందిన పొలే వెంకటేశ్వర్లు, ఏపీలోని కర్నూలు పట్టణానికి చెందిన పింజారి మౌలాలి, జోగులాంబ గద్వాల జిల్లాలోని లింగనవాయి గ్రామానికి చెందిన అబ్దుల్ రెహమాన్, కర్నాటక రాష్ట్రంలోని విజయపురి జిల్లా దేవరౌప్పరి తాలూకా మానూర్ గ్రామానికి చెందిన హీర్లకొండ సంతోష్ కుమార్, మఠంపల్లి మండలం బక్కమంతుగూడేనికి చెందిన పింగళి గంగామహేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి డీసీఎం, ఓ కారు, ఐదు సెల్ఫోన్లు, వివిధ కంపెనీల లేబుల్ కలిగిన నకిలీ డీఏపీ బస్తాలు, నకిలీ ఎరువు మందులు తయారు చేయడానికి వాడిన మిషన్, నకిలీ పాస్పేట్, దాదాపు రూ.2 కోట్ల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్, జగదీశ్ అనే ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐలు ప్రవీణ్, నవీన్, ఏఎస్ఐ బలరాం రెడ్డి, సిబ్బంది శంభయ్య, నాగరాజును అభినందించారు. చెంగోల్‌లో నకిలీ డీఏపీ పట్టివేత తాండూరు రూరల్: నియోజకవర్గంలో నకిలీ డీఏపీ కలకలం రేపుతోంది. ఇప్పటికే పరిగి, యాలాల మండలాల్లో నకిలీ డీఏపీని వ్యవసాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోగా.. శుక్రవారం తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో నకిలీ డీఏపీ పట్టుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, కరన్‌కోట్ పోలీసులు 89 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. తాండూరు ఏడీఏ అరుణ, పోలీసుల కథనం ప్రకారం.. ఉదయం గ్రామంలోని పలువురి రైతుల ఇళ్లలో తనిఖీ చేశారు. 89 బస్తాలను స్వాధీనం చేసుకొని కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పెద్దేముల్ గ్రామానికి చెందిన పోల రాజు, ఆత్కూర్‌కు చెందిన శివకుమార్ వీటిని విక్రయించినట్లు తేలింది. దీంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన సూత్రధారి పెద్దేముల్ వాసి జిల్లాలో నకిలీ డీఏపీ విక్రయించడంలో పెద్దేముల్ గ్రామానికి చెందిన పోల రాజుగా పోలీసులు గుర్తించారు. పరిగి, యాలాల కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. చెంగోల్‌లో దాదాపు 200 బస్తాలు విక్రయించినట్లు తెలిసింది. ప్రస్తుతం 89 బస్తాలను స్వాధీనం చేసుకొగా మిగిలిన 111 బస్తాలను రైతులు పొలాల్లో వరి, పత్తి పంటలకు వాడినట్లు అధికారులు గుర్తించారు. రైతులు నకిలీ డీఏపీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏడీఏ అరుణ, మండల అధికారి కొమురయ్య సూచించారు. -
ఆవరణం.. అపరిశుభ్రం!
మొయినాబాద్: ‘ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. మురుగు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి.. వీధుల్లో, రోడ్లపై చెత్తాచెదా రం వేయొద్దు.. ఇళ్ల చుట్టూ అపరిశుభ్రంగా ఉన్నా.. రోడ్డు పక్కన చెత్త వేసినా జరిమానా వేస్తాం’ అంటూ సమావేశాల్లో పరిశుభ్రత గురించి చెప్పే అధికారులు.. తమ కార్యాలయాలను మాత్రం పరిశుభ్రంగా పెట్టుకోవడంలేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెత్తాచెదారం, గడ్డి, పిచ్చిమొక్కలు పెరిగినా తమకేమీ పట్టనట్లు వదిలేశారు. అన్నీ ఒకే చోట మొయినాబాద్ మండల ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అపరిశుభ్రతకు నెలవుగా మారింది. ఒకే ఆవరణలో మండల పరిషత్, తహసీల్దార్, విద్యావనరుల, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, చేవెళ్ల డీసీపీ కార్యాలయాలతో పాటు మహిళా సమాఖ్య భవనం, రైతు వేదిక, వికలాంగుల సమాఖ్య భవనాలున్నాయి. ఆఫీసుల ముందుభాగంలో కొంత వరకు శుభ్రంగా ఉన్నప్పటికీ చుట్టుపక్కల మాత్రం గడ్డి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం ఆయా ఆఫీసులకు వస్తున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరద ద్వారా కొట్టుకువచ్చిన మట్టి మండల పరిషత్ కార్యాలయం ఎదుట సీసీపై పేరుకుపోయి, బురద అంటుకుంటోంది. పిచ్చిమొక్కలకు నెలవుగా ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు మొయినాబాద్‌లో ఆఫీసుల చుట్టూ చెత్తాచెదారం దోమలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు -
పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఇన్చార్జి పీడీ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఎఫ్‌టీఈ ఉద్యోగులకు 2026 ఆగస్టు 15వ తేదీ లోపు పే స్కేల్ అమలు చేసి సంబంధిత ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ప్రతీ నెల 1వ తేదీన వేతనాలు చెల్లించే విధానాన్ని, పెండింగ్‌లోని మూడు నెలల జీతాలను విడుదల చేయాలని, ఎస్ఆర్డీఎస్ బోర్డు సమావేశంలో ఆమోదించిన నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెలవు దినాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు, రెగ్యూలర్ ఉద్యోగులకు వర్తించే నిబంధనల ప్రకారం ప్రయోజనాలు కల్పించాలన్నారు. సీఆర్డీ కార్యాలయంలో ఫైనాన్స్ వింగ్, హెచ్ఆర్ వింగ్ మధ్య సమన్వయ లోపాలను నివారించి వేతనాల విడుదలలో జాప్యాన్ని పరిష్కరించాలన్నారు. క్యాడర్ స్ట్రెంత్ ఖరారు, పదోన్నతులు, బదిలీలు కేరీర్ అడ్వాన్స్మెంట్ పాలసీ అమలు చేయాలని కోరారు. -
వాన కురిసె.. రైతు మురిసె
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షం దంచి కొడుతోంది. వికారాబాద్‌లోని కాగ్నా నది సహా రంగారెడ్డి జిల్లాలోని ఈసీ, మూసీ వాగులకు వరద పోటెత్తుతోంది. మొన్నటి వరకు చుక్క నీరు లేక వెలవెల బోయిన చెరువులు, కుంటలు కొత్తనీటి రాకతో కళకళలాడుతతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై వరద చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు బీఎన్‌రెడ్డి నుంచి ఇబ్రీహీంపట్నం వరకు, పహడీషరీఫ్ నుంచి తుక్కుగూడ వరకు, శంషాబాద్ నుంచి కొత్తూరు వరకు, బాపూఘాట్ నుంచి మొయినాబాద్ వరకు నార్సింగి నుంచి శంకర్పల్లి వరకు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కొత్తనీటి రాకతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఆలస్యంగానైనా ఆశించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుండడంతో రైతుల ముఖాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గులో అధిక వర్షపాతం నమోదవగా కడ్తాల్, మాడ్గుల, ఇబ్రహీంపట్నం, మంచాలలో 0.6 సెం.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. వికారాబాద్ జిల్లాలో బషీరాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదవగా మిగిలిన మండలాల్లో రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాగ్నా నదిలో వరద పోటెత్తగా.. చిట్టంపల్లి బ్రిడ్జి దెబ్బతింది. గ్రామీణ రోడ్లు చిత్తడిగా మారాయి. ఇప్పటికే మొలకెత్తి.. నీళ్లు లేక వాడిపోయిన పత్తి, ఇతర పంటలకు తాజా వర్షాలు మళ్లీ జీవం పోసినట్లుఅయింది. ప్రాంతం నమోదైన వర్షపాతం (సెం.మీలలో) కొందుర్గు 5.33 చౌదరిగూడ 4.21 ఫరూఖ్‌నగర్ 3.19 షాబాద్ 3.08 చేవెళ్ల 2.54 శంషాబాద్ 2.72 కేశంపేట 2.67 హయత్‌నగర్ 2.58ప్రాంతం నమోదైన వర్షపాతం (సెం.మీలలో) బషీరాబాద్ 4.98 వికారాబాద్ 3.71 పూడూరు 4.34 బొంరాస్‌పేట 4.28 ధారూరు 4.20 దౌల్తాబాద్ 4.32 యాలాల 4.31 పంటలకు ప్రాణం పోసిన వర్షం వికారాబాద్ జిల్లాలో 3.37 సెంటీమీటర్లు, రంగారెడ్డిలో 2.07 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చెరువులు, కుంటలకు జలకళ -
ఈకేవైసీ చేయించుకుంటేనే రేషన్
● నేటితో ముగియనున్న గడువు! ● ఆందోళనలో లబ్ధిదారులు చేవెళ్ల: రేషన్ లబ్ధిదారులకు ఈకేవైసీ తప్పనసరి చేయడంతో కార్డుదారులు రేషన్ దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. 31వ తేదీలోపు అప్డేట్ చేయించుకున్న వారికి మాత్రమే రేషన్ సరుకులు అందుతాయని చెబుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఈకేవైసీ చేయించుకున్న వారు కాకుండా కొత్తగా రేషన్ కార్డుల్లో యాడ్ చేసుకున్న వారు, పిల్లలు మాత్రమే ఈకేవైసీ చేయించుకోవాలని డీలర్లు చెబుతున్నారు. మండలంలో 18,666 రేషన్ కార్డులు, 42 దుకాణాలు ఉన్నాయి. ఐదేళ్లలోపు చిన్నారులకు మినహా మిగిలిన వారికి తప్పని సరిగా ఈకేవైసీ ఉండాలని చెబుతున్నారు. కొంత మంది చిన్నారుల ఆధార్‌కార్డుల అప్డేట్ చేసుకోకపోవటంతో బయో మెట్రిక్, ఐరిస్ తీసుకోవడం లేదు. కొంత మంది విద్యార్థులు హాస్టల్స్‌లో, ఇతరప్రాంతాల్లో ఉన్న వారు ఈకేవైసీ చేయించుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం గడువు పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు. చన్గోముల్ ఎస్ఐని సస్పెండ్ చేయాలి ● ప్రజాసంఘాల నేతల డిమాండ్ ● బాధితుడిపైనే కేసు నమోదు చేశారని ఆందోళన బొంరాస్‌పేట: దళితుడి భూమి ఆక్రమణకు సహకరిస్తూ బాధితుడిపైనే కేసు నమోదు చేసిన పూడూరు మండలం చన్గోముల్ ఎస్ఐ భరత్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బొంరాస్‌పేటలో గురువారం వారు మాట్లాడుతూ.. పూడూరు మండల సోమన్గుర్తి గ్రామానికి చెందిన దళిత రైతు జైదుపల్లి నర్సింలుకు చెందిన సర్వే నం.120లో 1.35 ఎకరాల్లోని 30గుంటల భూమిని ఏసీఈ టైర్స్ కంపెనీ యాజమాన్యం ఆక్రమించిందన్నారు. దీనిపై విచారణ చేయకుండా స్థానిక ఎస్సై దళిత రైతుపై కేసు పెట్టారని ఆరోపించారు. కంపెనీ యాజమాన్యం ఆక్రమించిన భూమిని వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుడి పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి నర్సింలు, ప్రజాసంఘాల నాయకులు రమేశ్, మొగులయ్య, రాములు, ఎల్లప్ప, వెంకటయ్య, నరేశ్, ప్రవీణ్, రాంచందర్ తదితరులు ఉన్నారు. -
నాలుగు కిలోమీటర్లు మట్టే..
బంట్వారం: మండల పరిధిలోని మాద్వాపూర్– కోట్‌పల్లి లింక్ రోడ్డు చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతోంది. నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న మట్టి రోడ్డుతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు జంకుతున్నారు. మాద్వాపూర్ నుంచి కోట్‌పల్లి వెళ్లేవారు సల్బత్తాపూర్ మీదుగా వెళ్తే ఎక్కువ దూరం అవుతుందని ఈమార్గాన్నే ఆశ్రయిస్తుంటారు. ప్రతీ సోమవారం కోట్‌పల్లిలో నిర్వహించే సంతకు వెళ్లి సరుకులు, కూరగాయలు తెచ్చుకుంటారు. రోడ్డు బురదమయం కావడంతో కాలినకడన కోట్‌పల్లి వెళ్తున్నామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఈమార్గంలో బీటీ వేయాలని కోరుతున్నారు. -
సీ్త్రనిధి బోర్డు ఆఫ్ డైరెక్టర్‌గా అరుంధతి
సంచార పశువైద్య సేవలు వినియోగించుకోవాలి ‘1962’ప్రోగ్రాం జిల్లా మేనేజర్ జాన్ షాహిద్ చేవెళ్ల: మూగజీవాల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధక శాఖ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జాన్ షాహిద్, జిల్లా అధికారి (ఈఎంఈ) శ్రీహరి అన్నారు. గురువారం జిల్లా అధికారులు చేవెళ్లలోని పశువైద్యశాలలోని 1962 సంచార పశువైద్యశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యసేవల పనితీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పశువులకు అనారోగ్యం ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే 1962 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే సంచార పశువైద్య బృందం రైతు గడపకే చేరుకుని ఉచిత సేవలు అందిస్తుందని చెప్పారు. రైతులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ధారూరులో భారీ వర్షం
● వాగులు, చెరువులకు జలకళ ● హర్షం వ్యక్తంచేస్తున్న అన్నదాతలు ధారూరు: మండలంలో బుధవారం 10.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా గురువారం 4.02 సెంటీమీటర్ల వర్షం కురిసిందని తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. ప్రమాదకరమైన వాగులు, కాల్వలను దాటొద్దని సూచించారు. భారీ వానలు కరుస్తున్న నేపద్యంలో అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దన్నారు. వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతన్నలకు భారీ వాన ఊరటనిచ్చింది. తుఫాను ప్రభావంతో కురిసిన కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నీటి వనరులైన కోట్‌పల్లి ప్రాజెక్టుతో పాటు అల్లీపూర్, ఎబ్బనూర్, మున్నూరుసోమారం, రుద్రారం, గట్టెపల్లి, రాంపూర్‌తండా, అంపల్లి, గురుదోట్ల, నాగారం, రాజాపూర్, కేరెళ్లి తదితర గ్రామాల్లోని చెరువుల్లో నీరు చేరి జలకళను సంతరించుకున్నాయి. -
ప్రమాదాలకు మార్గం!
తాండూరు రూరల్: పెద్దేముల్ రోడ్డు అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరి, ప్రమాదకరంగా తయారైంది. రాత్రి సమయంలో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాండూరు నుంచి సంగారెడ్డికి వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. ఈ మార్గంలో తాండూరు నుంచి అంతారం, కందనెల్లితండా, గాజీపూర్, బుద్దారం, పెద్దేముల్ మీదుగా సంగారెడ్డికి వెళ్తుంటారు. ఈరూట్లో బుద్దారం బ్రిడ్జి నుంచి పెద్దేముల్ కొత్త బస్టాండ్ వరకు రహదారి పూర్తిగా ధ్వంసమైంది. గాజీపూర్ బ్రిడ్జి బురదమయం గాజీపూర్ వాగు వద్ద కొద్ది సంవతర్సాల క్రితం కొత్త బిడ్జ్రి నిర్మించారు. దీనికి ఇరువైపులా బీటీస వేయకుండా మట్టి నింపి వదిలేశారు. దీంతో చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతమంతా బురదమయమవుతోంది. మనోహార్‌రెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి 30 నెలలు గడుస్తున్నా బ్రిడ్జి వద్ద బీటీ వేయించడంలేదని గాజీపూర్‌వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిధులు మంజూరు చేయాలి మద్వాపూర్ నుంచి కోట్‌పల్లికి వెళ్లే మట్టి రోడ్డును బీటీగా మార్చాలి. ప్రభుత్వం ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి. వర్షాకాలం ముగిసే వరకూ కనీసం కంకర రోడ్డయినా వేస్తే వాహనదారులకు కొంత సౌకర్యం కలుగుతుంది. – ప్రభు, మద్వాపూర్ అధ్వానంగా పెద్దేముల్, మాద్వాపూర్– కోట్‌పల్లి రహదారులు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు, వాహనదారులు పట్టించుకోని పాలకులు, అధికారులు త్వరలో మరమ్మతులు గుంతలమయమైన పెద్దేముల్ రోడ్డుకు త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్)కింద ప్రభుత్వం తాండూరు నుంచి కోట్‌పల్లి వరకు 25 కిలోమీటర్ల రోడ్డుకు రూ.74 కోట్ల 71 లక్షలు మంజూరు చేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పనులు ప్రారంభిస్తాం. – శ్రవణ్, డీఈ, ఆర్అండ్బీ శాఖ -
యూరియా అమ్మలేం!
యాచారం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా(పీఏసీఎస్)లు యూరియా బుకింగ్‌ను నిలిపేశాయి. రవాణా, హమాలీ చార్జీలను చెల్లింపును నిలిపేస్తున్నట్లు తాజాగా మార్క్‌ఫెడ్ నుంచి పీఏసీఎస్‌లకు ఆదేశాలు అందాయి. ఈనిర్ణయంతో పీఏసీఎస్‌లకు నష్టం వాటిల్లుతుందని, ఈ నేపథ్యంలో యూరియా అమ్మలేమని వారం రోజులుగా బుకింగ్‌లు నిలిపేశారు. జిల్లా వ్యాప్తంగా 37 పీఏసీఎస్‌లు ఉండగా అందులో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని గ్రామీణా ప్రాంతాల్లో ఉన్న పీఏసీఎస్‌లు మార్క్‌ఫెడ్ నుంచి యూరియాను దిగుమతి చేసుకుని స్వల్ప ఆదాయంతో రైతులకు అందజేసేవారు. ఇలా ప్రతీ వారం 37 పీఏసీఎస్‌లకు వందకు పైగా లారీల్లో వందలాది మెట్రిక్ టన్నుల యూరియా మూసాపేట తదితర ప్రాంతాల నుంచి గ్రామాలకు చేరుకునేది. యూరియా దిగుమతికి అవసరమైన రవాణా ఛార్జీలను మార్క్‌ఫెడ్ నుంచే చెల్లించేవారు. వారానికి రూ.17 లక్షల నష్టం యూరియా దిగుమతి రవాణా, హమాలీ చార్జీలను మీరే భరించాలని ఈ నెల 14న మార్క్‌ఫెడ్ నుంచి పీఏసీఎస్‌లకు ఉత్తర్వులు అందాయి. మార్కెఫెడ్ నుంచి ప్రతి వారం వందకు పైగా లారీలు వస్తే రవాణా ఛార్జీల కింద రూ.17,94,350 నష్టపోవాల్సి వస్తుంది. లాభాలు దేవుడెరుగు కానీ రూ.లక్షల్లో నష్టాలను భరించడం తమ వల్ల కాదని సొసైటీలు చేతులెత్తేస్తున్నాయి. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి, చేవేళ్ల నియోజకవర్గాల్లోని పలు పీఏసీఎస్‌లు యూరియా బుకింగ్‌ను పూర్తిగా బంద్ చేశాయి. ఇదిలా ఉండగా నగర ప్రాంతాల్లో వ్యవసాయం చేసే ధనవంతులైన కొంతమంది రైతులు అధిక ధరకు( బస్తాకు రూ.50 అదనంగా చెల్లించి) యూరియాను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారనే ఆరోపణలున్నాయి. వర్షాలు కురిసే సమయంలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది పంటల సాగు గణనీయంగా తగ్గింది. పలు మండలాల్లో పత్తి పంటలను ఆలస్యంగా సాగుచేశారు. యాప్‌ల ద్వారా యూరియా బుకింగ్ అవుతుండగా.. కొంతమంది రైతులకు అవగాహన లేని కారణంగా డీలర్లే రైతుల పట్టాదారు, పాసుపుస్తకాలు తీసుకుని బుక్ చేస్తున్నారు. వీటిలో కొన్నింటిని అధిక ధరలకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు యూరియా వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతుండగా ఎక్కడా స్టాక్ దొరకడం లేదు. పలు చోట్ల పీఏసీఎస్‌లు అధిక ధరలకు యూరియాను విక్రయించే ప్రయత్నాలు చేయగా వ్యవసాయ శాఖ తీవ్ర వ్యతిరేకించింది. ప్రభుత్వ ధరలకే విక్రయించాలని లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. యూరియా అమ్మకాలు ఇలా(బస్తా) ● మార్క్‌ఫెడ్ నుంచి అందే ధర: రూ.252.43 పైసలు ● పీఏసీఎస్‌లు రైతులకు విక్రయించే ధర: రూ.267 ● ఒక బస్తా యూరియా అమ్మితే పీఏసీఎస్‌లకు వచ్చే లాభం: రూ. 14.57 పైసలు ● ఒక లారీ( 450 బస్తాలు) లోడ్ యూరియా అమ్మితే వచ్చే లాభం: 6,556.50 పైసలు ● లారీ నుంచి యూరియా దించుకోవడం కోసం హమాలీ చార్జీలు: రూ.4,500 (బస్తాకు రూ.10 చొప్పున) ● లారీ లోడ్( 450 బస్తాల) యూరియా అమ్మితే పీఏసీఎస్‌లకు మిగిలే లాభం కేవలం రూ.2,056.50 పైసలు మాత్రమే. ● ప్రస్తుతం రవాణా చార్జీల రద్దుతో మార్క్‌ఫెడ్ నుంచి పీఏసీఎస్‌లకు యూరియా దిగుమతి చేసినందుకు గాను లారీ ట్రాన్స్‌ఫోర్ట్ చార్జీ: రూ.20 వేలు, అంటే ప్రతి లారీ యూరియా లోడ్పైన పీఏసీఎస్‌లకు 17,943.50 నష్టం వస్తుంది. చేతులెత్తేసిన పీఏసీఎస్‌లు రవాణా, హమాలీ ఛార్జీల చెల్లింపును నిలిపేసిన మార్క్‌ఫెడ్ యూరియా బుకింగ్‌లు ఆపేసిన సహకార సంఘాలు లబోదిబోమంటున్న రైతులు ఏం తోచడం లేదు ఈ ఏడాది యాభై ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పంటకు యూరియా అందించడం అత్యవసరం. కానీ పీఏసీఎస్‌లలో యూరియా అందుబాటులో లేదు. దీంతో ఏంచేయాలో తోచడం లేదు. – బత్తుల కొండల్‌రెడ్డి, రైతు మాడ్గుల రైతులు చెల్లిస్తే.. ఇన్నాళ్లూ యూరియా దిగుమతి చేసుకుంటే మార్క్‌ఫెడ్ నుంచి రవాణా ఛార్జీలు చెల్లించే వారు. ఈనెల 14నుంచి ఛార్జీల చెల్లింపులు నిలిపేస్తున్నట్లు ఉత్తర్వులు అందాయి. దీంతో యూరియా అమ్మకాల వల్ల నష్టపోతాయనే భయంతో సొసైటీలు బుకింగ్‌ను నిలిపేశాయి. రవాణా, హమాలీ ఛార్జీలు రైతులు చెల్లించినట్లయితే పీఏసీఎస్‌లు యూరియా అమ్మకోవచ్చు. – సి.సుధాకార్, సహకార శాఖ అధికారి, రంగారెడ్డి జిల్లా -
రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
● లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ● బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ విద్యార్థుల భవిష్యత్‌తో కాంగ్రెస్ రాజకీయాలు షాబాద్: విద్యార్థుల సమస్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్‌గౌడ్ విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మద్దూరు మాణెయ్య అధ్యక్షతన ఎస్ఐఆర్పై చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్. రత్నం, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కొలువుదీరనుందని బీజేపీ ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు దొంగ ఓట్లతో గద్దెనెక్కాయని సర్ ప్రక్రియతో ఇవన్నీ పోతాయన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్సమెంట్ ఇవ్వకుండా కాలయాపన చేయడం తగదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన సోద రులతో కలిసి ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని రైతుల భూములు లాక్కుని వారని ఇబ్బంది పెట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మమతారెడ్డి, సర్పంచ్ బందయ్య, నాయకులు మహేందర్, హరీశ్, రాము, మహేశ్, శేఖర్, విజయ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
పోగొట్టుకున్న సెల్ఫోన్ల అప్పగింత
ధారూరు: చోరీకి గురైన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని గురువారం బాధితులకు అప్పగించామని ధారూరు ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు. పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన బైండ్ల గంగాధర్, ధారూరు మండలం దోర్నాల్తండాకు చెందిన రవీందర్, నాగర్‌కర్నూల్‌కు చెందిన శ్రీశైలంకు సెల్ఫోన్లు అందజేశామని స్పష్టంచేశారు. ఎవరైనా మొబైల్ ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు విక్రయించే ఫోన్లను కొనుగోలు చేయొద్దని తెలిపారు. -
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
● టీజీఎస్పీడీసీఎల్ జిల్లా చీఫ్ ఇంజనీర్ పాండ్యనాయక్ ● రూ.2.5 కోట్లతో జిల్లాలో తొలి పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పహాడీషరీఫ్: విద్యుత్ వినియోగదారులకు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ చర్యలు తీసుకుంటుందని సంస్థ జిల్లా చీఫ్ ఇంజనీర్ పాండ్యనాయక్ అన్నారు. గురువారం జల్పల్లి సర్కిల్లోని వాదే హుదా సబ్‌స్టేషన్‌లో 16 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు జిల్లాలో తొలిసారిగా 33 కేవీ ఉప కేంద్రంలో రూ.2.5 కోట్లు వెచ్చించి ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేశామన్నారు. వాదే ముస్తఫా, గౌస్‌నగర్, అలీనగర్, నూరీనగర్, ఇస్మాయిల్ నగర్, బాబానగర్, ఎర్రకుంట, క్యూబా కాలనీలలోని దాదాపు 12 వేల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎస్ఈ శ్రీరామ్ మోహన్, కందుకూరు డీఈ గోపాల కృష్ణ, ఎంఆర్టీ డీఈ భాస్కర్, లైన్స్ డీఈ చంద్రశేఖర్, ఏడీఈలు శంకర్, స్వాతి, రామలింగారెడ్డి, ఏఈలు సుమన్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
సమష్టిగా పని చేయండి
● జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్ ● సమసల్యను ఏకరువు పెట్టిన సర్పంచ్‌లు మొయినాబాద్‌రూరల్: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకునేందుకు అధికారులు సర్పంచ్‌లతో కలిసి పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ హిమబిందు అధ్యక్షతన మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లతో మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 20 అంశాలతో కూడిన ఎజెండా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా పంచాయతీల సర్పంచ్‌లు సమస్యలు సభ దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులు సమాధానం ఇచ్చారు. అనంతరం డీపీఓ సురేశ్‌మోహన్ మాట్లాడుతూ.. జలసిరిలో గ్రామానికి కనీసం నాలుగు ఊరు కుంటలపైనే నిర్మించుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. వనమహోత్సవంలో భాగంగా ప్రతీ గ్రామంలో 6 వేల మొక్కలు నాటాలన్నారు. ఇంటి పన్నులు విధిగా వసూలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కిషన్‌రావు, ఎంఈఓ శ్రీనివాసులు గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, ఎంపీఓ విక్రాంత్‌రెడ్డి, వ్యవసాయ అఽధికారి అనురాధారెడ్డి, ఆరోగ్య వైద్య అధికారి అన్నపూర్ణ, మండల విద్యుత్ అధికారులు అమయ్, శివరామకృష్ణ, సర్పంచ్‌లు ప్రవీణ్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, శ్రీదివ్యమురళీధర్రెడ్డి, శ్రీనివాసులు, మాణిక్యం, పాషా, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. -
చెట్లు నరికిన వారిపై కేసు
రూ.30 వేల జరిమానా మొయినాబాద్: ఆరు చెట్లకు అనుమతి తీసుకుని అక్రమంగా 38 వేప చెట్లు నరికినవారిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి జరిమానా విధించారు. అజీజ్‌నగర్ రెవెన్యూ సర్వేనంబర్ 11లో నగరానికి చెందిన సయ్యద్ సర్వర్ అహ్మద్ ఖాద్రీ నదీంకు ఎకరం భూమి ఉంది. ఇందులోని ఆరు చెట్లను తొలగించడం కోసం ఇటీవల ఫారెస్ట్ అధికారుల వద్ద అనుమతి తీసుకున్నారు. కానీ, మొత్తం 38 వేపచెట్లను నరికివేశారు. విషయం తెలుసుకున్న చిలుకూరు ఫారెస్ట్ అధికారులు బుధవారం అక్కడికి చేరుకుని పరిశీలించారు. చెట్లను నరికేందుకు వినియోగించిన సామగ్రితో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, రూ.30 వేల జరిమానా విధించినట్లు సెక్షన్ ఆఫీసర్ మమత తెలిపారు. -
మూడు రోజులే సర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంలో భాగంగా ఓటర్లు నింపిన తమ ఎన్యూమరేషన్ ఫాంలను తిరిగి సమర్పించేందుకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలింది. గడువు సమీపిస్తుండడం, ఇప్పటి వరకు డిజిటలైజేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. డిజిటలైజేషన్ ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలో 62 శాతం నమోదు కాగా, వికారాబాద్ జిల్లాలో 76.60 శాతం మాత్రమే నమోదయింది. ఎనిమిది నియోజకవర్గాలు 62% జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా, వీటి పరిధిలో 36,99,743 మంది ఓటర్లు ఉన్నారు. బూత్ లెవల్ సిబ్బంది ఇప్పటికే ఇంటింటికీ తిరిగి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫాంలు అందజేసినట్లు స్పష్టం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు 23,07,899 మంది మాత్రమే తమ ఫాంలు తిరిగి బీఎల్ఓలకు ఇచ్చారు. మరో 13,91,844 మంది ఓటర్లు మిగిలి పోయారు. నిర్దేశిత గడువులోగా ఫాంలు సమర్పించని వారు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది. కొడంగల్‌లో అత్యధికం.. తాండూరులో అత్యల్పం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా, 10,17,671 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 7,81,555 మంది ఓటర్లకు సంబంధించి 76.80 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. మరో 2,36,116 ఓట్లకు సంబంధించి సందిగ్ధం నెలకొంది. కొడంగల్‌లో అత్యధికంగా 82 శాతం పూర్తి కాగా, తాండూరులో 72 శాతం, వికారాబాద్‌లో 75 శాతం, పరిగిలో 78 శాతం నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాలో ఆశించిన స్థాయి లో ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణ లోపం వల్లే తక్కువ శాతం నమోదుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఎన్యూమరేషన్ ఫాంలపై అవగాహన లేదు. బీఎల్ఓలు.. కేవలం ఫాంలు చేతికిచ్చి వదిలేశారు. అవగాహన లేక ప్రజలు వాటిని నింపి తిరిగి ఇవ్వడం లేదు. నియోజకవర్గం ఓటర్లు డిజిటలైజేషన్ శాతం ఇబ్రహీంపట్నం 344584 244020 70.82 ఎల్బీనగర్ 608203 322025 52.95 మహేశ్వరం 574637 319589 55.62 రాజేంద్రనగర్ 635283 364234 57.33 శేరిలింగంపల్లి 773372 425591 55.03 చేవెళ్ల 273883 214296 78.24 కల్వకుర్తి 245355 212805 86.77 షాద్‌నగర్ 244426 205317 84.00 మొత్తం 62.38 ఎన్యూమరేషన్ ఫాంలు సమర్పించేందుకు ఇదే చివరి అవకాశం. ఫాంలు తిరిగి ఇవ్వని వారు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ఒక వ్యక్తి రెండు చోట్ల ఫాంలు ఇవ్వొద్దు. రెండు చోట్ల ఓటు హక్కును కలిగిన వారు.. ప్రస్తుతం ఏదో ఒక చోటును మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై ఎన్నికల కమిషన్ కఠినంగా వ్యవహరించబోతోంది. – నారాయణరెడ్డి, కలెక్టర్ జిల్లాలో 62 శాతం మించని డిజిటలైజేషన్ 36,99,743 మంది ఓటర్లకు.. ఎన్యూమరేషన్ ఫాంలు తిరిగి ఇచ్చింది 23,0328 మందే ఆగస్టు 3వ తేదీన ముగియనున్న ప్రక్రియ గడువులోగా పూర్తి చేసుకోవాలని అధికారుల సూచన -
అభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకం
డీఆర్డీఓ పీడీ, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి కేశంపేట: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు కీలకపాత్ర పోషించాలని డీఆర్డీఓ పీడీ, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారి రమాదేవి అధ్యక్షతన మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లతో పాటుగా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మండల స్థాయి సమావేశంలో సర్పంచ్‌లు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను మళ్లీ నిర్వహించే మండల స్థాయి సమావేశం లోపు పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఇంటింటికి ఇంకుడుగుంతలను నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తాగునీటి సరాఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. జలసిరి పథకంలో భాగంగా రైతులు వ్యవసాయ పొలాల్లో ఫాంపాండ్లు నిర్మించుకోవాలలని చెప్పారు. అనంతరం కేశంపేట, అల్వాల గ్రామాల్లో విబిజీ రామ్‌జీ పథకంలో భాగంగా ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డి, ఎంపీఓ దయానంద్, విద్యుత్ ఏఈ ఈశ్వర్, పంచాయతీరాజ్ ఏఈ నర్సింగ్‌రావు, ఎంపీఓ అజీజ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి
ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ కొత్తూరు: చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళనకరమని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ అన్నారు. పట్టణంలోని పెంజర్ల కూడలిలో బుధవారం ఆయన వాహనదారులు, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఇటీవలి రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగానే మృతి చెందారన్నారు. కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్టులు, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలన్నారు. మైనర్లు, లెసెన్స్ లేని వారు వాహనాలు నడుపొద్దని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, షాద్‌నగర్ ట్రాఫిక్ సీఐ శంకరయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా
రాజేంద్రనగర్ ఎస్ఈ శ్రీరామ్ మోహన్ మహేశ్వరం: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా సామర్థ్యం పెంచుతున్నామని రాజేంద్రనగర్ విద్యుత్ సూపరింటెండింగ్ ఇంజనీర్(ఎస్ఈ) శ్రీరామ్ మోహన్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని తుమ్మలూరులో 33–11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో రూ.కోటి నిధులతో అదనపు 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లో వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా నిరంతరం విద్యుత్ సరఫరాను అందిస్తామన్నారు. విద్యుత్ డిమాండ్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడం, పవర్ ట్రాన్స్ఫార్మర్లపై లోడ్‌ను సమతుల్యం చేయడం, ఓవర్ లోడింగ్‌ను నివారించడం, వినియోగదారులకు నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ ట్రాన్స్ఫార్మర్లు దోహదపడుతుందన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా సబ్స్టేషన్ల సామర్థాన్ని పెంచడం, అవసరమైన ప్రాంతాల్లో అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కందుకూరు విద్యుత్ డీఈ గోపాలకృష్ణ, ఎంఆర్టీ ఏడీఈలు శంకర్, స్వాతి, శ్రీనివాస్, రామలింగారెడ్డి, మహేశ్వరం ఏఈ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల తహసీల్ కథనంపై చర్చ
యాచారం: తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారుల ఆరా తీసినట్లు తెలిసింది. బుధవారం ‘సాక్షి’దినపత్రికలో ‘సమస్యల తహసీల్!’కథనంపై జిల్లా వ్యాప్తంగా చర్చ సాగింది. తహసీల్దార్ అయ్యప్ప, ఇతర అధికారులపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధుల ఫిర్యాదులపై కలెక్టర్ నారాయణరెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో యాచారం తహసీల్దార్ అయ్యప్పను తక్షణమే సెలవులో వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. ఉన్నతాధికారులకు సంజాయిషీ ఇచ్చుకునేందుకు వెళ్లిన తహసీల్దార్ మధ్యాహ్నం తర్వాత కార్యాలయానికి విచ్చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ● 22 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1.80 లక్షల నగదు మాయం మలక్‌పేట: అగంతకులు ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. బుధవారం మలక్‌పేట అడిషనల్ ఇన్స్పెక్టర్ గిరి తెలిపిన మేరకు.. మహమ్మద్ మొహియుద్దీన్ కుటుంబంతో కలిసి ఈ నెల 25న చైన్నెకు వెళ్లారు. బుధవారం తిరిగి రాగా బీరువాలో దాచిన 22 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1.80 లక్షలు మాయమైనట్లు గమనించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మూసారంబాగ్‌లోని ఏలియన్ హోలీ బట్టల దుకాణంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు షట్టర్ తెరిచి రూ. 22,000 విలువైన బట్టలు,పక్కనే ఉన్న వాచ్ షోరూమ్‌లో రూ.1.50 లక్షల విలువైన 6 గడియాలు ఫిర్యాదు చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగం పేరుతో మోసం నగ్న వీడియో కాల్స్ చేయించి బ్లాక్మెయిల్ ఫిలింనగర్: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతితో నగ్న వీడియో కాల్స్ చేయించి,రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించిన వ్యక్తిపై ఫిలింనగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. వరంగల్ జిల్లా నెల్లికుదురుకు చెందిన మహిళకు విజయరామరాజు ఉద్యోగం కల్పిస్తానని నమ్మించాడు. ఆ తర్వాత నగ్న వీడియో కాల్స్ చేయించి రికార్డు చేశాడు. అనంతరం వాటిని బహిర్గతం చేస్తానంటూ బెదిరిస్తూ వేధిస్తుండటంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన మహేశ్వరం పరిధిలో జరగడంతో ఫిలింనగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. -
ఉపాధి కోసం వచ్చి.. చోరీలు
షాద్‌నగర్: ఉపాధి పేరుతో వచ్చి.. చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను షాద్‌నగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్‌జోషి వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సుఖ్‌దేవ్‌సింగ్, షమేర్ సింగ్, మన్‌ప్రీత్‌సింగ్ ఉపాధి కోసం కొంతకాలం క్రితం రాష్ట్రానికి వచ్చారు. హార్వెస్టర్ డ్రైవర్లు, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్‌లకు, ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీన కేశంపేట మండలం సంతాపూర్‌లో ఈ నలుగురు దుండగులు బైక్‌లపై వచ్చి ఓ వృద్ధురాలి మెడలోంచి నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు. కడ్తాల్ ఠాణా పరిధిలో మరో మహిళను బెదిరించి ఆమె మెడలోంచి మూడు తులాల పుస్తెల తాడును అపహరించుకెళ్లినట్లు తెలిపారు. జూలై 24న మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఏటీఎం వద్ద పార్కు చేసిన బైకును, జూన్‌లో వనపర్తి జిల్లా కొత్తకోటలో చోరీ చేసిన ద్విచక్రవాహనాలపై తిరుగుతూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కేశంపేటలో అరెస్టు కేశంపేట చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సుఖ్‌దేవ్‌సింగ్, షమేర్ సింగ్, మన్ప్రీత్సింగ్లను అదుపులోకి తీసుకుని విచారించగా కేశంపేట, కడ్తాల్, మహబూబ్‌నగర్, కొత్తపేట ఠాణాల పరిధిలో చేసిన చోరీలను ఒప్పుకొన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో షాద్‌నగర్ డీసీపీ శిరీషా రాఘవేంద్ర, ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ నరహరి, ఎస్ఐ రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులకు రిమాండ్ ఏడు తులాల బంగారు ఆభరణాలు, ఓ ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్‌జోషి -
రూ.158 కోట్ల నిధుల మళ్లింపు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌న్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్, టీవీ9 జంక్షన్న్ల వద్ద మొత్తం రూ.368 కోట్ల అంచనా వ్యయంతో రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మాణానికి పరిపాలనా ఆమోదం తెలిపింది. గతంలో ఈ జంక్షన్ల వద్ద రూ.210 కోట్ల పనులకు ఇచ్చిన అనుమతులు సవరించి, ట్రాఫిక్ అవసరాలకనుగుణంగా కొత్త ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ జీఓ జారీ చేశారు. హెచ్ఎండీఏ నిర్వహించిన సమగ్ర ట్రాఫిక్ అధ్యయనం మేరకు, నగరంలో గత దశాబ్ద కాలంలో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించడంతో బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందని జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో ఎన్‌న్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ నుంచి ఆల్విన్ క్రాస్ రోడ్స్ వరకు అంతరాయం లేని ట్రాఫిక్ కారిడార్ అభివృద్ధి కోసం,సాంకేతిక నిపుణులతో సమీక్ష నిర్వహించి సవరించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. మారిన ప్రణాళిక.. సవరించిన ప్రణాళిక ప్రకారం.. ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వద్ద బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 నుంచి జీవీకే మాల్ వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్‌ను రూ.147 కోట్లతో నిర్మించనున్నారు. టీవీ9 జంక్షన్ వద్ద ముగ్ధ జంక్షన్ నుంచి ఎనన్్ఎఫ్సీఎల్ జంక్షన్ వైపు మూడు లేన్ల ఫ్లైఓవర్‌ను రూ.62 కోట్లతో, ఎన్‌న్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ నుంచి శ్రీనగర్ కాలనీ వైపు రెండు లేన్ల అండర్‌పాస్‌ను రూ.159 కోట్లతో నిర్మించనున్నారు. ఈ మూడు పనుల మొత్తం వ్యయం రూ.368 కోట్లకు చేరింది. గతంలో మంజూరైన ప్లాన్‌లో ఎన్‌న్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వద్ద ఒక ఫ్లైఓవర్, టీవీ9 జంక్షన్ వద్ద ఒక అండర్‌పాస్ మాత్రమే ఉండగా, తాజా ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా ఫ్లైఓవర్‌ను చేర్చడం, అండర్‌పాస్ దిశను మార్చడం వంటి మార్పులు చేశారు. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.158 కోట్ల మేర పెరిగింది.ఈ అదనపు వ్యయాన్ని భరించేందుకు హెచ్–సిటీ ప్యాకేజీ–2లో ప్రతిపాదించిన విప్రో జంక్షన్ మల్టీలెవల్ గ్రేడ్ సెపరేటర్ పనులను ప్రస్తుతానికి నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పనులకు కేటాయించిన రూ.158 కోట్లను బంజారాహిల్స్ కారిడార్ పనులకు మళ్లిస్తూ అనుమతి ఇచ్చింది. దీంతో హెచ్–సిటీకి మంజూరైన రూ.5,942 కోట్ల మొత్తంనిధుల్లో పెంపుదల లేకుండా చేసింది. స్టీల్ ఫ్లైఓవర్లు పనులను సంప్రదాయ కాంక్రీట్ నిర్మాణాల బదులుగా స్ట్రక్చరల్ స్టీల్‌తో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. దీనివల్ల నిర్మాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కూడా పరిమితమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక బంజారాహిల్స్ కారిడార్‌గా... ఇప్పటివరకు ఈ పనులను ’జూబ్లీహిల్స్’ పేరుతో పేర్కొనగా, వాస్తవ ప్రాంతానికి అనుగుణంగా ఇకపై ’బంజారాహిల్స్’గా పేర్కొనాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర బడ్జెట్లో హెచ్–సిటీ కార్యక్రమం కింద జీహెచ్ఎంసీకి కేటాయించే నిధుల నుంచే ఈ వ్యయం భరించనున్నారు. ఎన్ఎఫ్సీఎల్, టీవీ9 జంక్షన్ల వద్ద పనులకు తరలింపు రూ.368 కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌కు ఆమోదం హెచ్–సిటీలో భారీ సవరణ స్టీల్ నిర్మాణంతో ఫ్లై ఓవర్లు.. బంజారాహిల్స్ ట్రాఫిక్ జామ్‌కు చెక్ -
మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి
షాబాద్: మత్తు పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మీరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కుర్వగూడ, లక్ష్మారావుగూడ గ్రామాల్లోని పలు దుఖాణాల్లో డాగ్స్వాడ్ బృందంతో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోకి మత్తుపదార్థాలు, గంజాయి సరఫరా అవుతుందనే అనుమానంతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎప్పటికప్పుడూ నిఘా పెట్టాలని సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో కంపెనీలు రావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఉద్యోగులు, కూలీలు ఇక్కడికి వస్తున్నారని.. వారంతా ఏం చేస్తున్నారో ప్రజలు నిఘా పెట్టి ఉంచాలన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, 100కు డయల్ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐ చెన్నారెడ్డి, సర్పంచ్‌లు సంధ్యమల్లికార్జున్గౌడ్, కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మీరెడ్డి -
కీలక అడుగు
క్రీడాభివృద్ధికి మొయినాబాద్ మున్సిపల్ ప్రాంతంలో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటుకు ముందడుగు పడింది. క్రీడాకారులకు ఆధునిక సౌకర్యాలతో పాటు క్రీడాపోటీలు నిర్వహించేలా మినీ స్టేడియం అభివృద్ధి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొయినాబాద్: పదిహేడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న మినీ స్టేడియం ఇక స్పోర్ట్స్ హబ్‌గా మారనుంది. ఈ స్టేడియాన్ని రూ.20 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అర్బన్ ఛాలెంజ్ ఫండ్(యూసీఎఫ్)తో పాటు మున్సిపల్ నిధులు, బ్యాంకు లోన్ లేదా దాతల సహకారంతో ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అన్ని క్రీడలకు ఒకే ప్రాంగణం మొయినాబాద్ మున్సిపాలిటీలో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటుకు అధికారులు సంకల్పించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల క్రీడలకు ఉపయోగపడేలా స్పోర్ట్స్ హబ్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఇందుకు మున్సిపల్ పరిధి పెద్దమంగళారం రెవెన్యూ సర్వే నంబర్ 359లో నాలుగు ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ ఇప్పటికే మినీ స్టేడియం ఉన్నా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం ఆ స్థలాన్ని స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేసే ఆలోచనతో మున్సిపల్ అధికారులు ముందుకు వెళ్తున్నారు. పదిహేడేళ్లుగా నిరుపయోగం పదిహేడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మినీ స్టేడియం ఇప్పటికీ నిరుపయోగంగానే ఉంది. 2009లో అప్పటి ప్రభుత్వం మినీ స్టేడియం ఏర్పాటుకు పెద్దమంగళారం రెవెన్యూ సర్వే నంబర్ 359లో నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించి రూ.40 లక్షల నిధులు మంజూరు చేసింది. అప్పట్లో స్టేడియం చుట్టూ ప్రహారీ నిర్మించి.. స్థలాన్ని చదును చేశారు. ఈ మినీ స్టేడియం ఏ గ్రామానికి దగ్గరగా లేక, సౌకర్యాల లేమితో క్రీడాకారులెవరూ అక్కడికి వెళ్లలేదు. దీంతో ఇంతకాలం నిరుపయోగంగానే ఉండిపోయింది. స్థల పరిశీలన పూర్తి స్పోర్ట్స్ హబ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ, బ్యాంకులోన్ లేదా స్పాన్సర్స్ భాగస్వామ్యం కానున్నారు. రూ.20 కోట్ల నిధుల్లో కేంద్ర ప్రభుత్వం యూసీఎఫ్ నుంచి రూ.5 కోట్లు, మున్సిపల్ నిధుల నుంచి రూ.5 కోట్ల కేటాయించనున్నారు. మరో రూ.10 కోట్ల నిధులను బ్యాంక్ లోన్ లేదంటే దాతల నుంచి సేకరించాలని నిర్ణయించారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, డీఈ చిరంజీవులు పెద్దమంగళారంలోని మినీ స్టేడియం స్థలాన్ని పరిశీలించారు. మొత్తం రూ.20 కోట్లతో స్పోర్ట్స్ స్టేడియంను నిర్మించేందుకు మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి స్పోర్ట్స్ అథారిటీకి పంపించారు. ప్రైవేట్‌కు దీటుగా స్టేడియం నిర్మాణం స్పోర్ట్స్ స్టేడియంలో వివిధ రకాల ఆటలకోసం ప్రత్యేకమైన గ్రౌండ్లు ఏర్పాటు చేయనున్నారు. క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్ కోర్టులు, స్విమ్మింగ్ ఫూల్తోపాటు అథ్లెటిక్స్‌కు సంబంధించిన గ్రౌండ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నగర శివారుల్లో ప్రైవేటు గ్రౌండ్లు, స్టేడియాలు అధికంగా రావడంతో వాటికి దీటుగా ప్రభుత్వమే క్రీడాకారులకు స్పోర్ట్స్ స్టేడియం అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనే ముందుకెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్పోర్ట్స్ హబ్‌గా మారనున్న మినీస్టేడియం రూ.20 కోట్లతో అభివృద్ధి చేసే యోచన ప్రతిపాదనలు సిద్ధం చేసిన మున్సిపల్ అధికారులు -
నైపుణ్య శక్తిని పెంపొందించుకోవాలి
షాద్‌నగర్‌రూరల్: విద్యార్థులు నైపుణ్య శక్తిని పెంపొందించుకొని ఉద్యోగాల్లో రాణించాలని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీత అన్నారు. బుధవారం షాద్‌నగర్‌లోని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇంక్వి ల్యాబ్ ఫౌండేషన్, ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో హ్యాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఐడియేషన్, డిజైన్ థింకింగ్ ఇన్నోవేషన్ స్కిల్స్, స్టార్టప్ కంపెనీల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ నీత మాట్లాడుతూ.. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాస్తవ జీవిత, సామాజిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు వేర్వేరు బృందాలుగా విడిపోయి వినూత్న ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సిబ్బంది ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. గిరిజన మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతా -
బీఆర్ఎస్లో ఆశావహుల పోటీ
● మున్సిపల్ అధ్యక్ష పదవికి హోరాహోరీ ● తెరపైకి సామాజిక సమీకరణలు మొయినాబాద్: బీఆర్ఎస్లో అధ్యక్ష పదవికి నాయకుల మధ్య పోటీ పెరిగింది. సామాజిక సమీకరణలను తెరపైకి తెస్తూ ఎవరికి వారే అధ్యక్ష పదవి తమకు కావాలంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ నేతలు ఎవరూ లేకపోవడంతో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్ని తానై చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో మొయినాబాద్ మున్సిపాలిటీ పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనే విషయం ఇప్పుడు ఆమెకు కత్తిమీద సాముగా మారింది. పెద్దలపై ఒత్తిడి మొయినాబాద్‌లో బీఆర్ఎస్ బలంగా ఉండటంతో పార్టీ అధ్యక్ష పదవికి డిమాండ్ పెరిగింది. గతంలో బీఆర్ఎస్ మొయినాబాద్ మండల అధ్యక్ష పదవిని మూడు పర్యాయాలుగా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తూ వచ్చింది. ఏడాదిన్నర క్రితం మొయినాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటు కావడంతో అప్పటి నుంచి మున్సిపాలిటీకి అధ్యక్షుడిని నియమించాలని పార్టీ నాయకులు అధిష్టాన పెద్దలపై ఒత్తిడి తెస్తూ వచ్చారు. కానీ కొంత కాలం క్రితం మున్సిపల్, మండలం మొత్తానికి దారెడ్డి వెంకట్‌రెడ్డి ఒక్కరినే అధ్యక్షుడిగా నియమించారు. తెరపైకి సామాజిక సమీకరణలు బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నాయకులంతా సామాజిక సమీకరణలను తెరపైకి తెస్తున్నారు. పార్టీ మండల అధ్యక్షుడిగా రెడ్డి సామాజిక వర్గం నాయకుడు పదవిలో ఉండటంతో మున్సిపాలిటీలో ఎస్సీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గం నాయకులకు అధ్యక్ష పదవిని ఇవ్వాలని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. అయితే మున్సిపల్ అధ్యక్ష పదవిని అన్ని సామాజిక వర్గాల నేతలు ఆశిస్తున్నారు. అజీజ్‌నగర్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు కొత్త మాణిక్‌రెడ్డి ముందు నుంచే మున్సిపల్ అధ్యక్ష పదవిని ఆశిస్తుండగా పెద్దమంగళారం మాజీ సర్పంచ్ కోట్ల నరోత్తంరెడ్డి సైతం అధ్యక్ష పదవికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన హిమాయత్‌నగర్ మాజీ సర్పంచ్ ముదిగొండ శ్రీహరి యాదవ్, అదే గ్రామానికి చెందిన మరో నాయకుడు ముదిగొండ రవియాదవ్, మొయినాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు సురేందర్‌గౌడ్, చిలుకూరు మాజీ ఉప సర్పంచ్ సిద్ధాంతి నర్సింహగౌడ్ మున్సిపల్ అధ్యక్ష పదవికోసం పోటీ పడుతున్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ డప్పు రాజు, చిలుకూరుకు చెందిన జయవంత్ మున్సిపల్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. మైనార్టీ సామాజిక వర్గం నుంచి మొయినాబాద్‌కు చెందిన ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ రవుఫ్ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. మున్సిపల్ అధ్యక్ష పదవికోసం ఇంత మంది పోటీ పడుతుండడంతో ఎంపిక విషయం సబితారెడ్డికి తలనొప్పిగా మారింది. దీనిపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. ఎవరిని అధ్యక్ష పదవి వరిస్తుందో వేచి చూడాలి. ప్రధాన రాజకీయ పార్టీలు మండలం, మున్సిపాలిటీకి వేర్వేరుగా అధ్యక్షులను నియమించాయి. బీజేపీ ఏడాది క్రితమే ఇద్దరు అధ్యక్షులను నియమించగా.. కాంగ్రెస్ ఇటీవలే మండలం, మున్సిపాలిటీకి వేర్వేరుగా ఇద్దరు అధ్యక్షులను నియమించింది. దీంతో బీఆర్ఎస్లోనూ మున్సిపల్ అధ్యక్షుడిని నియమించాలనే డిమాండ్ పెరిగింది. -
భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు
కడ్తాల్/షాద్‌నగర్ రూరల్: భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ షాద్‌నగర్ 16వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి స్వాతిరెడ్డి బుధవారం తీర్పునిచ్చినట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. వివరాలు.. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెంది వల్లపుడాస్ స్వరూప, శ్రీనివాస్ భార్యాభర్తలు. వీరు మండల పరిధిలోని కర్కల్‌పహాడ్ శివారులోని ఓ ఫాంహౌస్‌లో కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. మద్యానికి బానిసైన శ్రీనివాస్ స్వరూపను తరుచూ వేధించేవాడు. 2023 జూన్ 11న రాత్రి దంపతులు గొడవపడ్డారు. ఈ క్రమంలో భార్య స్వరూపను హత్య చేసి పరారయ్యాడు. 2023 జూన్ 12న సమాచారం అందుకున్న అప్పటి సీఐ ఉపేందర్, ఎస్ఐ హరిశంకర్‌గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. నేరం రుజువు కావడంతో షాద్‌నగర్ 16వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి స్వాతిరెడ్డి నిందితుడు శ్రీనివాస్‌కు జీవితఖైదుతో పాటు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. ఉన్నతాధికారుల అభినందనలు హత్య కేసు దర్యాప్తులో సమర్థవంతంగా పనిచేయడంతో పాటు, సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచిన సీఐలు ఉపేందర్, వెంకటేశ్వర్లు, సైదిరెడ్డి, ఎస్ఐ హరిశంకర్‌గౌడ్, కానిస్టేబుల్స్ సుమిత్ర, దివ్యవాణిలను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. -
సర్‌ను సమర్థవంతంగా పూర్తి చేయాలి
రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ షాబాద్: ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసి ప్రతీ ఓటరుకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్లో నమోదు చేయాలని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ మండల కేంద్రంలో బీఎల్ఏల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 3వ తేదీ వరకు సర్ ప్రక్రియ పూర్తి చేసేలా బీఎల్ఏలు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్, మండల అధ్యక్షుడు గూడుపల్లి పెంటారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీశ్, కార్యదర్శి రాంరెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, చెన్నయ్య, రషీద్, బాలకృష్ణారెడ్డి, యాదయ్య, దయాకర్‌చారి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జగన్ మాడ్గుల: క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 10న కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందూకురి జగన్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిరుపేదలు, కార్మికులకు జీవనోపాధి లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ (ఏఐఏడబ్ల్యూయూ) రాష్ట కమిటీ సభ్యురాలు సైదమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాష, పల్లెటి నర్సింహ, శేఖర్, మైసయ్య, రాకేశ్, వెంకట్‌రెడ్డి, నారాయణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టులో 25 నిమిషాలు పనిచేయని కౌంటర్లు శంషాబాద్: దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ‘గోనవ్’ సర్వర్ బుధవారం తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 గంటల వరకు డౌన్ కావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 25 నిమిషాల పాటు ఇండిగో చెక్ఇన్ కౌంటర్లు పని చేయలేదు. దీంతో జీ, హెచ్ రో చెక్ ఇన్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగింది. 4.55 గంటల తర్వాత ఎయిర్‌లైన్స్ తన సెకండరీ సర్వర్ స్కైగోకి మారి సేవలను పునరుద్ధరించింది. 5.30 గంటల తర్వాత ప్రధాన సర్వర్ కూడా మళ్లి ప్రారంభం కావడంతో ప్రయాణికులకు సంబంధించిన ప్రక్రియ సాఫీగా ముందుకు సాగిందని ఎయిర్‌పోర్టు వర్గాల పేర్కొన్నాయి. రాజేంద్రనగర్: ఆరాంఘర్ చౌరస్తా నుండి పీడీపీ చౌరస్తా వైపు వెళ్తున్న కారులో బుధవారం ఉదయం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారు నడుపుతున్న వ్యక్తి భయంతో కారు దిగి బయటికి వచ్చాడు. ఇదే సమయంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కరుణాకర్ అటుగా వెళుతూ వెంటనే స్పందించాడు. పక్కనే ఉన్న ఇంటి నుంచి పైపును తీసుకొని మంటలను అదుపులోకి తెచ్చాడు. 20 నిమిషాల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. అప్పటికే కారు దాదాపు 50 శాతం కాలిపోయింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజు కానిస్టేబుల్ కరుణాకర్‌ను అభినందించారు. -
విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాత
యాచారం: విద్యుదాఘాతంతో ఆవు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలోని కుర్మిద్ద అనుబంధ గ్రామం మంగలిగడ్డ తండాలో చోటు చేసుకుంది. నేనావత్ సోనాకు చెందిన రూ.50 వేల విలువ చేసే పాలిచ్చే ఆవు బుధవారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేసిన గదుల వద్దకు వెళ్లింది. అక్కడ స్తంభానికున్న స్టార్టర్ డబ్బాకు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు మృతికి కారణమైన ప్రైవేట్ కంపెనీ యాజమాన్యమే నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతు డిమాండ్ చేశారు. అమీర్‌పేట: సనత్‌నగర్ ఈఎస్ఐసీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారి పట్ల సెక్యూరిటీ గార్డులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని రోగులు ఆరోపించారు. ఓవ్యక్తి ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.వివరాలు.. జడ్చర్లకు చెందిన ఆకుల వెంకటేష్ చికిత్స కోసం గత శుక్రవారం 10 మందితో కలిసి ఓపీడీకి వెళుతున్నాడు. అయితే మహిళా సెక్యూరిటీ గార్డు రోగులను అడ్డుకుని దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో తోటి సెక్యూరిటీ గార్డులు వచ్చి మందలించారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మేడిపల్లి: నాణ్యత లేని పన్నీరును తరలిస్తున్న ముఠాపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించింది. నారపల్లి మోహన్ రోడ్డు నందనవనం పార్కు సమీపంలో రెండు మహీంద్రా స్కార్పియో వాహనాలలో తరలిస్తున్న నాణ్యత లేని పన్నీరును స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా పెంబర్తి పోచన్నపేట గ్రామంలో కల్తీ పన్నీరు తయారు చేసి విక్రయిస్తున్న చామకూరి రాంరెడ్డి, జూల శ్రీనివాస్‌లను అధికారులు గుర్తించారు. వారి నుంచి 980 కేజీల పన్నీరు, స్వాధీనం చేసుకొని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. -
కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు
బీఎల్ఏల సమీక్ష సమావేశంలో రసాభసా మొయినాబాద్: కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, ఎమ్మెల్యే కాలె యాదయ్య కుమారుడు కాలె శ్రీకాంత్, మున్సిపల్ చైర్పర్సన్ సోనియా భర్త, పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మరోవైపు పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి కొత్తగా చేరినవారికి పదవులు కట్టబెడుతున్నారంటూ కార్యకర్తలు మండిపడ్డారు. మొయినాబాద్ మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల సమీక్ష సమావేశం బుధవారం పార్టీ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ముందే పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. షాబాద్ దర్శన్, కాలె శ్రీకాంత్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వేదికపై ఉన్న నాయకులంతా ఇద్దరిని సమాదాయించారు. నామినేటెడ్, పార్టీ పదవులను డబ్బులకు అమ్ముకుంటున్నారని.. కష్టపడ్డవారికి పదవులు దక్కడంలేదంటూ కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితి మారకుంటే రాబోయే రోజుల్లో చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీలో ఎవరూ మిగలరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని జ్ఞానేశ్వర్ హామీ ఇవ్వడంతో కార్యకర్తలు కాస్త వెనక్కితగ్గారు. ఎస్ఐఆర్ వంద శాతం పూర్తి చేయాలి ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్)ను అన్ని గ్రామాలు, వార్డుల్లో వంద శాతం పూర్తి చేసే విధంగా చూడాలని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరోషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ అన్నారు. బీఎల్ఏల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫారంలో సమగ్ర వివరాలు నమోదు చేసి వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధంగా బీఎల్ఏలు కృషి చేయాలన్నారు. సమావేశంలో చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్, పీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
జంపన్న వాగులో ఘట్కేసర్ వ్యక్తి గల్లంతు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : ములుగు జిల్లా మేడారం జంపన్న వాగులో బుధవారం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఘట్కేసర్కు చెందిన తిమ్మయ్య, మరికొంత మంది మేడారం వెళ్లారు. మొదట జంపన్న వాగులో స్నానాలు చేసేందుకు వెళ్లారు. తిమ్మయ్య తూముల వాగు వద్ద స్నానం చేసేందుకు యత్నించగా పోలీసులు వద్దని హెచ్చరించారు. వారి సూచనలు పట్టించుకోకుండా స్నానం చేస్తుండగా వరద ఉధృతికి గల్లంతయ్యాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. విప్రోకు స్టాప్.. బంజారాకు పెంపు -
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
మీర్‌పేట: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం ఆయన ప్రశాంతి హిల్స్ ద్వారకామయి సాయిబాబా పీఠంలో పీఠాధిపతి గోపాలకృష్ణానంద స్వామిజీ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపౌర్ణమి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్తో కలిసి రహస్య తత్వార్థ బోధనలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ జానకి కొడపి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సభ్యులు సామిడి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు -
విక్రమ్–1 విజయంలో చింతపట్ల వాసి
యాచారం: మండల పరిధిలోని చింతపట్లకు చెందిన యువకుడు రాకెట్ విక్రమ్–1 (ఆగమన్) విజయంలో పాలుపంచుకున్నాడు. గ్రామానికి చెందిన గౌరోజ్ రామచారి, జయమ్మల కుమారుడు శివప్రసాద్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి పూర్తి చేశాడు. యాచారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ డీడ్‌లో ఐటీఐ( మెకానికల్), ఆ తర్వాత ఆన్లైన్ ద్వారా కేరళలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల నుంచి డిప్లొమా చదివాడు. ప్రయోగాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఆదిబట్లలోని టాటా బోయింగ్‌లో ఐదేళ్ల పాటు మెకానికల్ ఇంజనీరింగ్‌గా ఉద్యోగం చేశారు. 2022 నుంచి తుక్కుగూడలోని స్కైరూట్ ఏరోస్పేస్‌లోని క్వాలిటీ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ రాకెట్ తయారీ బృందంలోని క్వాలిటీ విభాగంలో శివప్రసాద్ పాలుపంచుకోవడంపై జిల్లా ప్రజలు అభినందనలతో ముంచెత్తారు. యువ ఇంజనీర్‌కు అభినందనల వెల్లువ -
ఈ కామర్స్ ద్వారా వ్యాపార విస్తరణ
డిమాండ్‌కు అనుగుణంగా.. విద్యుత్ సరఫరా సామర్థ్యం పెంచుతున్నామని రాజేంద్రనగర్ విద్యుత్ ఎస్ఈ శ్రీరామ్ మోహన్ పేర్కొన్నారు.ఇబ్రహీంపట్నం రూరల్: ఈ కామర్స్ ద్వారా వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పారిశ్రామికవేత్తల సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో మాట్లాడుతూ.. జిల్లాలో ఎగుమతులను పెంచడంతో పాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేలా ప్రోత్సహించేందుకు డిస్ట్రిక్ట్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్(డీఈహెచ్) కార్యక్రమం కింద మెగా ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్టీ) అధికారుల సమన్వయంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ–డీఐ కామర్స్ ఎక్స్పోర్ట్ శాఖ నాబార్డు, ఈసీజీసీ ఇండియా పోస్ట్ తదితర ఎగుమతి ప్రోత్సాహ సంస్థల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొంటారని చెప్పారు. ఎగుమతులకు సంబంధించిన ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, ఎగుమతి విధానాలు, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, ఆర్థిక సహాయం, ఈ కామర్స్ ద్వారా వ్యాపార విస్తరణ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులు, స్టార్టప్ సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, మహిళా పారిశ్రామికవేత్తలు, ఎగుమతులపై ఆసక్తి ఉన్న వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మ్యాపింగ్ డేటా ఆధారంగా నిర్ణయాలు సర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫాంల ఆన్లైన్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మ్యాపింగ్ అనంతరం అందిన డేటా ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. హేతుబద్ధీకరణలో ప్రతీ పోలింగ్ కేంద్రంలో సాధ్యమైనంత వరకు 1,200 మంది ఓటర్ల పరిమితిని పాటించడంతో పాటు, ఒకే కాలనీ లేదా ఒకే నివాస సముదాయానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నియోజకవర్గాలు, మండలాల్లో సమావేశాలు నిర్వహించి పెండింగ్ అంశాల వివరాలను వారికి అందజేశామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శారద, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి -
● మోస్తరు వర్షం.. తలపిస్తున్న తటాకం
మండల కేంద్రంలో మంగళవారం కురిసిన ఓ మోస్తరు వర్షానికి తహసీల్దార్ కార్యాలయ ముఖ ద్వారం మడుగులా మారింది. గేటు దగ్గర వర్షపు నీరు నిలిచిపోవడంతో తహసీల్దార్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్జీలు, ధ్రువపత్రాల కోసం వచ్చిన విద్యార్థులు, యువకులు, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు నీటిలోనుంచి నడుచుకుంటూ తహసీల్దార్ కార్యాలయం లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. – కడ్తాల్ -
‘పట్నం’ కుటుంబానికి పరామర్శ
షాబాద్: ఇటీవల మాతృవియోగానికి గురైన పట్నం సోదరులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. షాబాద్‌లోని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్‌రెడ్డి నివాసంలో మంగళవారం మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, సబితా రెడ్డి, సత్యవతి రాథోడ్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్‌రెడ్డి, ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డీసీసీబీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు రుక్కమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పట్నం మహేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిని పరామర్శించారు. -
నాణ్యమైన బోధన అందించాలి
హుడాకాంప్లెక్స్: ప్రత్యేకావసరాల విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన బోధన అందించి, వారి విద్యా పురోగతికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. ఎల్బీనగర్ జిల్లాపరిషత్ పాఠశాలలో మంగళవారం సరూర్‌నగర్ ఎంఈఓ బసునాయక్ ఆధ్వర్యంలో ఐఈఆర్పీలు, స్పెషల్ ఎడ్యుకేటర్లు, మండలస్థాయి ప్రాథమిక ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ) విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రాథమికంగా చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను మెరుగుపర్చేలా కృషి చేయాలని అన్నారు. విద్యార్థి కేంద్రిత బోధన, సమగ్ర విద్య, నాణ్యమైన విద్యా బోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలన్నారు. కార్యక్రమంలో సీఎంఓ వెంకటేశ్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగా మరో ఠాణా!
మొయినాబాద్: నగరానికి అతి చేరువలో.. ఓఆర్ఆర్ పక్కనే ఉన్న మొయినాబాద్ ప్రాంతంలో కొత్త పోలీస్‌స్టేషన్ రాబోతున్నట్టు సమాచారం. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌ను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విభజించి.. కొత్తగా మరో ఠాణా ఏర్పాటుకు ఉన్నతాధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా.. అజీజ్‌నగర్, కనకమామిడి కేంద్రంగా ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. సంచలనాలకు కేంద్ర బిందువు మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న ఈ స్టేషన్లో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన చాలా కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖుల వ్యవసాయ క్షేత్రాలు, ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లు ఉన్నాయి. ప్రముఖుల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో నిత్యం బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఎస్హెచ్ఓగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కొనసాగుతుండగా నలుగురు ఎస్‌ఐలతోపాటు 60 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వీరంతా ప్రధాన కేసుల విచారణ, బందోబస్తు, ఇతరత్రావాటికే అధిక సమయం కేటాయిస్తుండంతో కేసుల విచారణలో జాప్యం జరుగుతోంది. పెరిగుతున్న కేసులు పదేళ్లతో పోలిస్తే స్థానికంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిలో సంచలనం సృష్టించినవి కొన్నయితే దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, భూ తగాదాలు, డ్రగ్స్ కేసులు, సైబర్ నేరాలు, పోక్సో కేసులు చాలానే నమోదవుతున్నాయి. మరోవైపు ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లో నమోదవుతున్న కేసుల విచారణ నేరుగా కమిషనర్, డీసీపీ స్థాయి అధికారులే చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు అధికంగా ఉండటంతో ఇటీవలి కాలంలో హాస్టళ్లు విపరీతంగా ఏర్పాటయ్యాయి. వీటిలో వేలమంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. కళాశాలలు, హాస్టళ్లు ఉన్న ప్రాంతాల్లో డ్రగ్స్ కేసులు, ఇతర కేసులు నమోదవుతున్నాయి. వీటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అధికారుల మధ్య చర్చ మొయినాబాద్ ప్రాంతంలో కొత్త పోలీస్‌ష్టేషన్ ఏర్పాటుపై ప్రభుత్వం చర్చించినట్లు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్ స్థాయిలో చర్చ జరిగినట్లు సమాచారం. వారి ఆదేశాలతోనే ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి ఇటీవల మొయినాబాద్ ఠాణాను సందర్శించిన చేవెళ్ల డీసీపీ యోగేష్‌గౌతమ్, ఇన్స్పెక్టర్ మల్లికార్జునరెడ్డితో చర్చించినట్టు తెలుస్తోంది. మొయినాబాద్ పరిధిలో ఏర్పాటు ఇప్పటికే ఉన్న పోలీస్ స్టేషన్ విభజన పెరుగుతున్న కేసుల నేపథ్యంలో నిర్ణయం సన్నాహాలు మొదలుపెట్టిన ఉన్నతాధికారులు పరిశీలనలో అజీజ్‌నగర్, కనకమామిడిమొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌ను విభజించి కొత్తగా మరోటి అజీజ్‌నగర్, కనకమామిడి కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. మండలంలోని అమ్డాపూర్, కాశీంబౌలి, బాకారం, నాగిరెడ్డిగూడ గ్రామాలతోపాటు అజీజ్‌నగర్, హిమాయత్‌నగర్, ఎనికేపల్లి ప్రాంతాలను కలిపి అజీజ్‌నగర్ కేంద్రంగా, మండలంలోని మిగతా ప్రాంతాన్ని మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలుపుతూ ఒక ప్రతిపాదన చేస్తున్నట్టు తెలుస్తోంది. మున్సిపాలిటీతోపాటు అమ్డాపూర్, కాశీంబౌలి, బాకారం, నాగిరెడ్డిగూడ, చందానగర్ పంచాయతీలను మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కొనసాగిస్తూ.. మండలంలోని శ్రీరాంనగర్, వెంకటాపూర్, కేతిరెడ్డిపల్లి, కనకమామిడి, నక్కలపల్లి, ఎత్బార్పల్లి, తోలుకట్ట, అప్పారెడ్డిగూడ, మేడిపల్లి, చిన్నమంగళారం, రెడ్డిపల్లి, మోత్కుపల్లి, కుత్బుద్దీన్‌గూడ, ఎలుకగూడ పంచాయతీలు, చేవెళ్ల మండలం ముడిమ్యాల, రావులపల్లి గ్రామాలను కలిపి కనకమామిడి కేంద్రంగా కొత్త పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు మరో ప్రతిపాదన రూపొందిస్తున్నట్టు సమాచారం. -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
కడ్తాల్: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు అన్నారు. టీపీయూఎస్ ఆధ్వర్యంలో ఆగస్టు 1న చేపట్టనున్న మహాధర్నకు సంబంధించిన వాల్‌పోస్టర్లను మంగళవారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోట్ల కాశీరావు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలు, ఎరియర్స్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఆగస్టు 1న హైదరాబాద్‌లో జరిగే మహాధర్నాకు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం వివిధ మండలాల అధ్యక్షులు భాస్కర్‌గౌడ్, స్వాతి, ప్రధాన కార్యదర్శులు సంతోష్‌కుమార్, మౌనిక, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఆమనగల్లులో పోస్టర్ల ఆవిష్కరణ ఆమనగల్లు: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై టీపీయూఎస్ నిరంతరం పోరాడుతుందని సంఘం జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు అన్నారు. ఆగస్టు 1న నిర్వహించే మహాధర్నా పోస్టర్లను పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షురాలు స్వాతి, ప్రధాన కార్యదర్శి మౌనిక, నాయకులు భాస్కర్‌గౌడ్, సంతోష్‌కుమార్, ఎంఈఓ పాండు ఉన్నారు. -
ఉద్యమంలా నీటి సంరక్షణ
మొయినాబాద్‌రూరల్: ఎలినినో పరిస్థితుల నేపథ్యంలో నీటి సంరక్షణ ఉద్యమంలా చేపట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. మండలంలోని నాగిరెడ్డిగూడలో మంగళవారం సర్పంచ్ కీసరి పద్మసంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీ ఆవరణలో ఇంకుడు గుంత పనులు ప్రారంభించి మొక్క నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత తప్పనిసరని సూచించారు. రైతులు పొలాల్లో పంటకుంటలు నిర్మించుకోవాలని, గ్రామానికి ఒక ఊటకుంట, బోరుబావుల రీచార్జీ కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ సురేష్‌మోహన్, ఎంపీడీవో హిమబిందు, ఎంపీవో విక్రాంత్‌రెడ్డి, ఉపసర్పంచ్ ఎర్ర జైపాల్, మండల వ్యవసాయాధికారి అనురాధ, ఏఈవో దీనా, పంచాయతీ కార్యదర్శులు మల్లేష్‌గౌడ్, కళ్యాణ్, వార్డు సభ్యులు లతఅర్జున్, వనజవిజయ్కుమార్, యాద య్య, రాజు, విజయ్‌రాజ్, నిరోషావికాస్, మధు కర్, రోజామహేందర్, శశిధర్, నాయకులు కొత్త సంజీవరెడ్డి, రేషన్ డీలర్ సుజాత పాల్గొన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని సాధించాలి విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. మండల పరిధిలోని నాగిరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆమె సందర్శించారు. విద్యార్థులతో పాఠాలు చదివించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యా సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్మయి -
పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు వారికే ఇవ్వండి
మొయినాబాద్: మున్సిపాలిటీలోని హిమాయత్‌నగర్‌లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి కేటాయించిన స్థలాలను వారికే ఇవ్వాలని బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు కార్తీక్‌రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబుకు విన్నవించారు. హిమాయత్‌నగర్ గ్రామస్తులు కార్తీక్‌రెడ్డితో కలిసి మంగళవారం మంత్రికి వినతిపత్రం అందజేశారు. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే 290 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి హిమాయత్‌నగర్ రెవెన్యూలోని సర్వేనంబర్ 151లో స్థలాలు కేటాయించిందని.. అప్పట్లో కోర్టు కేసులతో ఇళ్లు నిర్మించుకోలేకపోయారని వివరించారు. ప్రస్తుతం ఆ స్థలాన్ని మార్కెట్‌కు కేటాయిస్తున్నారని.. అది పేదలకే ఇవ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి కలెక్టర్‌కు చెబుతానని.. పేదలకు ఇళ్ల స్థలాలు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసినవారిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు శ్రీహరియాదవ్, మంజుల, నరోత్తంరెడ్డి, సుధాకర్‌యాదవ్, నాయకులు రవియాదవ్ ఉన్నారు. -
చీటింగ్ కేసులో 13 మందికి జైలు
రూ.2 వేల చొప్పున జరిమానా సిద్దిపేట కమాన్: తప్పుడు వివరాలతో ఆటోలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి యత్నించిన 13మంది నిందితులకు సిద్దిపేట కోర్టు ఒక్కొక్కరికి పది రోజుల జైలు శిక్షతో పాటు, రూ.2వేల జరిమానా విధించింది. టూటౌన్ సీఐ మురళి వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్లు కొమ్మరాజుల అశోక్, నార్సింగి సురేశ్, కేతావత్ రవికుమార్, ఏర్రోళ్ల వస్థల్ నాథ్కుమార్, గాదె మహేశ్, మహ్మద్ రఫీ, పాశం సుమన్, అరుపుల నర్సింగ్‌రావు, గండు దయానంద్, జిల్ల శంకర్, కటికెల మల్లేశ్, అంజమ్ సురేశ్, పుట్టి రవీందర్ డీజిల్ ప్యాసింజర్ ఆటోలను నడుపుతుంటారు. కాగా వీరు తమ ఆటోలను తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకునే క్రమంలో హైదరాబాద్‌లోని ఆర్టీఓ కార్యాలయంలో డీజిల్ ప్యాసింజర్ ఆటోలు రిజిస్ట్రేషన్ కాలేదు. వీటిపై బ్యాన్ విధించడంతో సిద్దిపేట ఆర్టీఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు అవుతున్నట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట చిరునామాతో కూడిన తప్పుడు వివరాలతో ఆధారు కార్డులు సృష్టించి 2016 ఏప్రిల్‌లో అక్కడి ఆర్టీఓ కార్యాలయంలో ఆటోలను రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నం చేశారు. వారు సమర్పించిన ఆధారు కార్డులను ఆర్టీఓ సిబ్బంది పరిశీలించి తప్పు జరిగినట్లు గుర్తించారు. ఆర్టీఓ కార్యాలయం ఏఓ సదానందం పోలీసులకు ఫిర్యాదు చేయగా 13మంది ఆటో డ్రైవర్లపై చీటింగ్ కేసు నమోదైంది. కేసు విచారణ అనంతరం సిద్దిపేట కోర్టు పై నిందితులకు ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానాతో పాటు పది రోజుల జైలు శిక్ష విధించింది. వెంచర్ పరిశీలన యాచారం: కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న వెంచర్‌ను ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. వెంచర్ యజమానులు ప్రభుత్వ భూమిని అక్రమించారనే ఫిర్యాదుతో తహసీల్దార్ అయ్యప్ప, సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్ఐ మధు, రెవెన్యూ, సర్వేయర్ అధికారుల బృందంతో వెళ్లి, అనుమతి పత్రాలను పరిశీలించారు. తక్షణమే వెంచర్ పక్కన ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూములను సర్వే చేసి, హద్దులు పాతి ఫెన్సింగ్ వేయాలని సర్వే శాఖ అధికారులకు సూచించారు. వెంచర్ యజమానులు ప్రభుత్వ భూమిని అక్రమిస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నకిలీ డీఏపీ విక్రేతపై కేసు పూడూరు: నకిలీ డీఏపీ విక్రయించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన చన్గోముల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అజీముద్దీన్ మంచన్‌పల్లి గ్రామానికి చెందిన రైతులు ఉమ్మెంతల రాఘవేందర్, తంగడపల్లి వీరేశంతో పాటు మరికొందరి రైతులకు 176 బస్తాల నకిలీ డీఏపీ విక్రయించాడు. కొందరు ఇళ్లలో నిల్వ చేసుకోగా మరి కొందరు పంటకు వేశారు. ఇది నకిలీదిగా గుర్తించిన రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. పూడూరు వ్యవసాయ అధికారి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రైతుల వద్ద నిల్వ ఉంచిన డీఏపీ బస్తాలను ఠాణాకు తరలించి నాణ్యత నిర్ధారణ కోసం నమూనాలను ల్యాబ్‌కు పంపించామన్నారు. -
రైతులకు పొజిషన్ చూపించండి
కడ్తాల్: మండల పరిధిలో గతంలో పట్టాలు ఇచ్చిన భూదాన్ భూమి రైతులకు పొజిషన్ చూపించాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ సామెల్, ప్రధాన కార్యదర్శి మస్కు ప్రకాశ్ కారత్ డిమాండ్ చేశారు. సీఐటీయూ మండల కన్వీనర్ పెంటయ్య ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కడ్తాల్ రెవెన్యూ పంచాయతీ పరిధిలో 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, సర్వేనంబర్ 260/9లో 40 మంది పేద రైతులకు భూదాన్ బోర్డ్ ద్వారా సర్టిఫికెట్లు ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పటి వరకు వారికి పోజిషన్ చూపించలేదని అన్నారు. అధికారులు స్పందించకపోవడంతో రైతులతో కలిసి హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. హైకోర్టు అనుకూలంగా తీర్పు చెప్పినా అధికారులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా పేదలకు సంబంధించిన భూదాన్ భూమిలో పొజిషన్ చూపించి న్యాయం చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దుబ్బ చెన్నయ్య, జిల్లా కమిటీ సభ్యులు మేకల అశోక్, రాములు, రమేశ్, నర్సింహ, మల్లేశ్, జంగయ్య, యాదయ్య, శ్రీకాంత్, జంగమ్మ, కళమ్మ, చంద్రకళ తదితరులు ఉన్నారు. -
ఇంటిముందు పార్కు చేసిన బైకు దగ్ధం
మొయినాబాద్: ఇంటి ముందు పార్కుచేసిన బైక్ దగ్ధమైంది. ఈ సంఘటన మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమంగళారానికి చెందిన నాగుల లక్ష్మయ్య సోమవారం రాత్రి రోజు మాదిరిగానే తన బైక్‌ను ఇంటి ముందు పార్కు చేశాడు. అర్ధ రాత్రి బైక్‌కు మంటలు అంటుకుని దగ్ధమవుతుండడంతో స్థానికులు గమనించారు. లక్ష్మయ్య సైతం నిద్రలేచి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయింది. దీనిపై బాధితుడు మంగళవారం ఉదయం మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి మధ్యాహ్నం తిరిగి వెనక్కి తీసుకున్నాడు. బైక్ కీ ఆన్‌లో ఉండడంతో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. వీధికుక్కల దాడిలో ఐదుగురికి గాయాలు మర్పల్లి: వీధి కుక్కల దాడిలో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని మెగిలి గుండ్ల గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. రాత్రి 10 గంటల సమయంలో గ్రామానికి చెందిన పణ్యమ్మ దుకాణానికి వెళ్తోంది. ఈ క్రమంలో వీఽధి కుక్కలు ఒక్కసారిగా ఆమె మీద దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. అదే మార్గంలో వెళ్తున్న రమేశ్ కుక్కలను బెదిరించేందుకు యత్నించగా ఆయనపైనా దాడి చేయడంతో గాయపడ్డాడు. గ్రామానికి చెందిన బద్రి గుడి నిర్మాణ పనులు చేసుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం నగరంలోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. అదే రోజు రాత్రి మరో ఇద్దరిపై దాడి చేయడంతో వారు స్వల్పంగా గాయపడ్డారు. వీధి కుక్కల బెడద నివారించా లని పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి, సర్పంచ్‌కు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
షాద్‌నగర్: ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ అన్నారు. కొత్తూరు, నందిగామ, షాద్‌నగర్‌తో పాటు శంషాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రమాదభరితంగా ఉన్న రహదారులు, బ్లాక్ స్పాట్లను మంగళవారం షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐలు సీతారాం, వీరబాబు, నర్సయ్య, ఎన్హెచ్ఏఐ ఇంజనీయర్ భాను ప్రతాప్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. రహదారి భద్రతను మరింత మెరుగుపర్చడం కోసం చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రతి వాహనదారుడు విఽధిగా రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. శంకర్పల్లి: పట్టణాలు, గ్రామాల్లో అడుగంటిన భూగర్భ జలాలను పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ చంద్రశేఖర్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవకాశం ఉన్న ప్రాంతాల్లో విరివిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని, తద్వారా వర్షపు నీటిని ఒడిసి పట్టడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి, భాగస్వాములను చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఓ గిరి రాజు, పంచాయతీ రాజ్ ఏఈ నంద కిశోర్, ఏపీఓ నాగభూషణం, సిబ్బంది పాల్గొన్నారు. షాద్‌నగర్: చౌరస్తా విస్తరణలో భాగంగా పట్టణంలో మంగళవారం రెండోరోజు ఆక్రమణల తొలగింపు కొనసాగింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్ రహదారుల్లో ఉన్న ఆక్రమణలను మున్సిపల్, రెవెన్యూ, పోలీసు, ఆర్అండ్బీ, విద్యుత్ అధికారులు తొలగించారు. పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీల సాయంతో డబ్బాలు, షెడ్లను తీసివేశారు. తొలగింపు ప్రక్రియను ఆర్డీఓ సరిత, తహసీల్దార్ నాగయ్య, మున్సిపల్ కమిషనర్ సునీత, సీఐ సీతారాం, ఆర్అండ్బీ అధికారులు పరిశీలించారు. మొయినాబాద్: కార్మికులకు తీవ్ర అన్యాయం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కె.రామస్వామి అన్నారు. సంఘం జిల్లా 4వ మహాసభల వాల్‌పోస్టర్‌ను మంగళవారం మొయినాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన 44 రకాల చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. 29 రకాల చట్టాలను పునరుద్ధరించి.. నాలుగు లేబర్ కోడ్లను పూర్తిగా రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 2న తుక్కుగూడలో జరిగే ఏఐటీయూసీ జిల్లా మహాసభలకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సీపీఐ మండల కార్యదర్శి కె.శ్రీనివాస్, నాయకులు సురేష్, బాబు, హనుమంతు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల తహసీల్!
యాచారం: స్థానిక తహసీల్దార్ కార్యాలయం వివాదాలకు అడ్డాగా మారింది. సమస్యలపై స్పందించని ఇక్కడి అధికారులు, సిబ్బంది సెటిల్మెంట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. తమ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు ఏళ్ల తరబడి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా స్పందించే వారే కరువయ్యారు. అదే రియల్ వ్యాపారులు వస్తే కూర్చోబెట్టి, మర్యాదలు చేసి క్షణాల్లోనే పనులు చక్కబెట్టి పంపిస్తున్నారని తెలుస్తోంది. ధర్నాలు చేసినా.. తహసీల్దార్ కార్యాలయ పరిధిలోని 24 జీపీల్లో దాదాపు రెండు వేలకు పైగా వివిధ రకాల భూ సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం మీ సేవ కేంద్రాల్లో రూ.వేలాది డబ్బులు చెల్లించి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండాపోతోందని బాధితులు పేర్కొంటున్నారు. విసిగిపోయిన కొంతమంది రైతులు ధర్నాలు, నిరసనలు చేసినా స్థానిక సిబ్బంది లైట్ తీసుకుంటున్నారు. ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్‌కు రెవెన్యూ సమస్యలపై పెద్దగా అవగాహన లేదని, డిప్యూటీ తహసీల్దార్ కేవలం మోతుబరులు, రియల్ వ్యాపారుల పనులకే సమయం కేటాయిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్లపైనే మక్కువ రైతులు, సాధారణ ప్రజల సమస్యలను పట్టించుకోని సిబ్బంది రిజిస్ట్రేషన్లపైనే ఎక్కువ దృష్టిసారిస్తారని సమాచారం. ప్రతీ డాక్యుమెంట్‌పై రూ.5 వేలకు తగ్గకుండా వసూలు చేస్తారని, రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైనా ఫిర్యాదు వచ్చిందంటే పెద్ద మొత్తంలో డిమాండ్ చేసి, పని కానిచ్చేస్తారని తెలుస్తోంది. ఆఫీసులో పనిచేసే ఓ కంప్యూటర్ ఆపరేటర్ అన్నీ తానై నడిపిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం నందివనపర్తి– నస్దిక్‌సింగారం గ్రామాల మధ్య ఓ వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో రూ.లక్షల్లో వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఫ్యూచర్‌సిటీ నిర్మాణంతో కొత్తపల్లి, తక్కళ్లపల్లి, నందివనపర్తి, చింతుల్ల, నస్దిక్‌సింగారం, చౌదర్పల్లి, యాచారం, గునుగల్, గడ్డమల్లయ్యగూడ, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో ఉన్నతాధికారులు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు వందలాది ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో చిన్న తప్పులు ఉన్నాయని భయపెట్టి రూ. లక్షల్లో వసూల్ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. తహసీల్దార్‌పై వరుస ఫిర్యాదులు ● యాచారం తహసీల్దార్ అయ్యప్పపై కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబుకు, ఇతర ఉన్నతాధికారులకు వరుస ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఓ మహిళా రైతు భూ సమస్య పరిష్కారం విషయంలో తహసీల్దార్ స్పందించడం లేదని రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ● తక్కళ్లపల్లి, కొత్తపల్లి భూ సమస్యలపై రైతుల ఫిర్యాదుల మేరకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. మొండిగౌరెల్లి భూసేకరణ విషయంలో ప్రజాప్రతినిధులు, నాయకుల పట్ల తహసీల్దార్ అయ్యప్ప అమర్యాదగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రీసర్వే కోసం వస్తే తహసీల్దార్ సరిగ్గా స్పందించలేదంటూ సర్పంచ్ కోలన్ రమాదేవి రైతులతో కలిసి, కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ● తహసీల్దార్‌పై ఎమ్మెల్యే నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో మిగిలిన వారిలో భయం మొదలైంది. తమ భాగోతం ఎక్కడ వెలుగులోకి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కొందరైతే విధులకు వచ్చి వెంటనే వెళ్లిపోయారు. పదేళ్లుగా తిరుగుతున్నా.. భూ సమస్యపై పదేళ్లుగా తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. మొగుళ్లవంపు రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 98లో నాకుటుంబ సభ్యులకు చెందిన మూడెకరాలకు పైగా వ్యవసాయ భూమి పట్టా అమలుపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఇటీవల కాడెడ్లు, అరకతో ధర్నా చేశా. అయినా వీరిలో చలనం లేదు. – పాండురంగారెడ్డి, రైతు చావే శరణ్యం యాచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 386లో నా మూడెకరాల పట్టా భూమిని రికార్డుల్లో భూదాన్ పట్టాగా నమోదు చేశారు. సమస్యను పరిష్కరించమని ఐదేళ్లుగా తిరుగుతున్నా. ఆడపిల్లల వివాహాలు చేయాలి. పెళ్లి చేసిన బిడ్డకు కట్నం కింద భూమి రాసిస్తానని మాటిచ్చాం. సమస్య తీరకపోతే చావేశరణ్యం. – పాల పెద్దమ్మ, యాచారం సత్వరమే పరిష్కరిస్తాం యాచారం తహసీల్దార్ అయ్యప్పపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకు ఫిర్యాదు చేశారో తెలుసుకుంటా. భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేలా కృషిచేస్తా. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి మా పరిధిలోని రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. మొండిగౌరెల్లి భూసేకరణ విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం రెండు వేలకుపైగా దరఖాస్తుల పెండింగ్ వివాదాలకు అడ్డాగా యాచారం రెవెన్యూ కార్యాలయం తహసీల్దార్ పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు అధికార పార్టీకి నేతల ఫిర్యాదులు ప్రజలు, రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపణలు -
పర్యావరణ స్పృహ అవసరం
కడ్తాల్: ప్రతి ఒక్కరికీ పర్యావరణ స్పృహ అవసరమని విశ్రాంత కలెక్టర్ ఎం.పురుషోత్తంరెడ్డి అభిప్రాయపడ్డారు. మండల పరిధిలోని అన్మాస్‌పల్లి ఎర్త్ సెంటర్లో డిపార్ట్మెంటల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ – కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన విధ్యాధికారుల శిక్షణ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. స్వార్థ పూరిత జీవన శైలి కారణంగా ప్రకృతి సంపదలు వేగంగా నశిస్తున్నాయని, కాలుష్యం పెరుగుతోందని, ప్లాస్టిక్ వినియోగం అదుపు తప్పుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు కేవలం విద్యా సంపదలే కాకుండా ప్రకృతితో సమతుల్యంగా జీవించే జీవన విధానాన్ని నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీజీఆర్ చైర్ పర్సన్ లీలాలక్ష్మారెడ్డి, ఫౌండర్ లక్ష్మారెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్తలు సాయిభాస్కర్రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, వైఈఎల్పీ స్టేట్ కో ఆర్డినేటర్ యానాల వెంకట్‌రెడ్డి, సుస్థిర పుడమి ఎడిటర్ రమేశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
జైల్‌భరోను జయప్రదం చేయండి
● వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ● కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ నాయకులు యాచారం: క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగష్టు 10న కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న జైల్‌భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుబ్బాక రాంచంద్రయ్య పిలుపునిచ్చారు. యాచారంలో మంగళవారం నిర్వహించిన సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిరుపేదలు, కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తూ, వారికి జీవనో పాధి లేకుండా చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకిస్తూ జైల్‌భరోకు పిలుపునిచ్చామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య, యాచారం మండల అధ్యక్ష, కార్యదర్శులు పుష్ప, కావలి జగన్, సీఐటీయూ మండల కన్వీనర్ చందునాయక్, నాయకులు బాల్‌రాజ్, తావునాయక్, బాషయ్య, ఆంజనేయులు, ఇందిరమ్మ పాల్గొన్నారు. -
‘సర్’ను పారదర్శకంగా పూర్తి చేయాలి
హుడాకాంప్లెక్స్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని డిప్యూటీ కలెక్టర్ డి.రాంప్రసాద్ సూచించారు. సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష నాయకులు, బూత్‌స్థాయి ప్రతినిధుల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా ఇంటింటి పరిశీలన, అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చడం, మరణించిన లేదా శాశ్వతంగా వేరే ప్రాంతాలకు మారిన వారి వివరాలను సక్రమంగా పరిశీలించి చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సూచనలు, సలహాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్హత కలిగిన ఓటరుకు ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. కుటుంబసభ్యుల ఓట్లు ఒకే పోలింగ్ స్టేషన్లో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. సర్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్‌స్టేషన్ స్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నట్టు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణకు రాజకీయపార్టీలు, బీఎల్ఏలు, కాలనీ సంఘాల ప్రతినిధులు సమన్వయంతో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వక్కలంక శ్రీనివాస్‌రావు, బేర బాలకిషన్, సిద్ధు ముదిరాజ్, పాండురంగాచారి, ధనరాజ్‌గౌడ్, ఆరుట్ల సురేష్‌కుమార్, కబీర్దాస్ పాల్గొన్నారు. -
పేదలకు కేటాయించిన.. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి కేటాయించిన స్థలాలురికే ఇవ్వాలని మంత్రి శ్రీధర్‌బాబుకు విన్నవించారు.
● వైభవంగా శోభాయాత్రకందుకూరు: గురుపౌర్ణమిని పురస్కరించుకుని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి పాదయాత్ర, సైకిల్ యాత్రగా తరలివచ్చిన సాధకులతో బ్రహ్మశ్రీ గురూజీ అనిల్కుమార్జోషి ఆధ్వర్యంలో చేపట్టిన రథయాత్ర, పల్లకీ సేవ వైభవంగా కొనసాగింది. మంగళవారం సాయంత్రం రథం, పల్లకీలపై స్వామి నిఖిలేశ్వరానంద విగ్రహాలను ఏర్పాటు చేసిన భక్తులు కందుకూరు చౌరస్తా నుంచి పులిమామిడి పరిధిలోని శ్రీనిఖిల్ చేతనా కేంద్రం వరకు యాత్ర శోభాయమానంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు డప్పువాయిధ్యాలతో పాటు కోలాటాలు, నృత్యాలు, భక్తి గీతాలాపనల నడుమ యాత్రలో పాల్గొన్నారు. కందుకూరు చౌరస్తా నుంచి యాత్ర ప్రారంభమై కొత్తగూడ, జైత్వారం, పులిమామిడి గ్రామాల మీదుగా శ్రీనిఖిల్ చేతనా కేంద్రం వరకు సాగింది. దారి పొడవునా భక్తులు, స్తానికులు గురూజీకి ఘన స్వాగతం పలికారు. ఆశ్రమానికి చేరుకున్న అనంతరం గూరూజీ ప్రవచనాలు చేసి, భక్తులకు ప్రసాదాలతో పాటు ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా యాత్ర సాగిన గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. -
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
● పేపర్ లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి ● సీపీఐ నేతల డిమాండ్ ఇబ్రహీంపట్నం: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం కారణంగా ప్రాణాలు కోల్పోయిన 21 మంది విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. నీట్ లీక్‌తో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రజాఉద్యమాలు, విద్యార్థుల విజయంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు పి.నీలమ్మ, నాయకులు నర్సింహ్మ, అజయ్, సంతోష్, బిచ్చునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి అదృశ్యం
ఆమనగల్లు: బంధువుల ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి తప్పిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బాలపూర్ మండల పరిధిలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన మల్కేడి నితీష్ కుటుంబ సభ్యులతో కలిసి గత శుక్రవారం గట్టుప్పలపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చాడు. రాత్రి గ్రామంలో బస చేసిన నితీష్ మరుసటిరోజు ఉదయం లేచి చూసేసరికి కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో నితీసోదరుడు సాయికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తలకొండపల్లి సీఐ జానకిరాంరెడ్డి తెలిపారు. కాగా నితీష్‌కు కొద్ది రోజులుగా మతిస్థిమితం సరిగా ఉండడం లేదని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసినట్లు సీఐ చెప్పారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు ● పోలీసులను ఆశ్రయించిన గృహిణి ● ఏడుగురిపై కేసు నమోదు చేవెళ్ల: అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారంటూ ఓ గృహిణి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని కందవాడ వార్డుకు చెందిన గౌండ్ల సుష్మితకు 2022 డిసెంబర్ 8న షాబాద్ మండలం హైతాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌తో వివాహమైంది. వివాహ సమయంలో ఆమె తల్లిదండ్రులు 20 తులాల బంగారం, రూ.3లక్షల నగదు, రూ.లక్ష విలువైన సామగ్రిని కట్నంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం సజావుగా సాగిన వీరి సంసారంలో అదనపు కట్నం వేధింపులు మొదల య్యాయి. ఈ క్రమంలో భర్త శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు అత్తమామలు దశరథ్‌గౌడ్, నర్సమ్మ, ఆడపడుచులు సురేఖ, రమాదేవి, ఉమాదేవి, భావ శంకర్ అదనపు కట్నంకోసం వేధింపులకు పాల్పడుతున్నారని సుష్మిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్తింటి వారు తనను మానసికంగా, శారీరకంగా హింసించడంతోపాటు తరచూ పుట్టింటికి పంపించేవారని తెలిపింది. రెండో కుమార్తె పుట్టిన తరువాత వేధింపులు ఎక్కువయ్యాయని పేర్కొంది. ఈనెల 10న అత్తగారి ఇంట్లో ఇద్దరు కుమార్తెలతో బంధించారని, విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో భరోసా కేంద్రం సహకారంతో పుట్టింటికి తీసుకువచ్చినట్లు చెప్పింది. కుటుంబ పెద్దల సమక్షంలో, పోలీసుల కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా పలుమార్లు రాజీ ప్రయాత్నాలు చేసినప్పటీకి వారిలో మార్పురాలేదని, దీంతో తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినట్లు వివరించింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్తతోపాటు ఏడుగురిపై వరకట్నం వేధింపులు, గృహహింసకు సంబంధించిన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుష్టు బాధితులు పథకాలు వినియోగించుకోవాలి
జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి అబ్దుల్లాపూర్‌మెట్: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని శాంతినగర్ కుష్టు కాలనీని మంగళవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారి సందర్శించారు. ఈ సందర్భంగా కుష్టు బాధితుల సంఘం సభ్యులతో సమావేశమై వారి ఆరోగ్య పరిస్థితులు, జీవన పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బాధితుల గుర్తింపు, వారి అవసరాల అంచనా, సంక్షేమ ప్రయోజనాల కల్పన కోసం నిర్వహిస్తున్న సర్వే పురోగతిని సమీక్షించారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. కుష్టు పూర్తిగా నయం చేయగల వ్యాధి అని, ప్రారంభ దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే శాశ్వత వైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు. కుష్టు బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు, పునరావాస సదుపాయాలు, దివ్యాంగుల పెన్షన్, గుర్తింపు కార్డులు, ఉపాధి, ఇతర సంక్షేమ పథకాల గురించి అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. సర్వేను క్షేత్రస్థాయిలో నాణ్యతతో, పారదర్శకంగా పూర్తి చేసి, అర్హులైన ప్రతి కుష్టు బాధితుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వైద్యఆరోగ్య శాఖ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, కుష్టు వ్యాధి నియంత్రణ కార్యక్రమం సిబ్బంది, బాధితుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘సర్’ను వేగవంతంగా పూర్తిచేయాలి
చేవెళ్ల: సర్‌లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని పీసీసీ ఉపాధ్యక్షుడు, చేవెళ్ల పార్లమెంట్ సర్ ఇన్చార్జి జగదీశ్ అన్నారు. పట్టణంలోని అట్లాస్ ఫంక్షన్హాల్లో ఆదివారం నియోజకవర్గ స్థాయిలోని పార్టీ బీఎల్ఏ(బూత్ స్థాయి ఏజెంట్ల) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగదీశ్‌తో పాటు నియోజకవర్గ సర్ ఇన్చార్జి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్‌లో పార్టీ తరఫున బీఎల్ఏల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. సర్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బీఎల్ఏల పనితీరు శూన్యంగా ఉందని, ఈ కారణంగా నియోజకవర్గం సీ–కేటగిరిలో ఉందన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు కట్టుబడి పనిచేయాలన్నారు. ఇప్పటికై నా బూత్‌స్థాయిలో ఉన్న ఓటర్లును కాపాడుకునే ప్రయత్నం చేయాలన్నారు. వెంటనే బీఎల్ఏలతో మండలాల వారీగా సమావేశం నిర్వహించి, ప్రతి బీఎల్ఏ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సమతారెడ్డి, మార్కెట్ చైర్మన్ పెంటయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీకాంత్, ఐదు మండలాల అధ్యక్షులు, మూడు మున్సిపాలిటీల అధ్యక్షులు, గిరిధర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పెంటారెడ్డి, వెంకట్‌రెడ్డి, చంద్రమౌళి, వెంకట్‌రెడ్డి, నాయకులు జన్ధార్రెడ్డి, బల్వంత్‌రెడ్డి, ఆగిరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్, గోపాల్‌రెడ్డి, వీరేందర్‌రెడ్డి, ఐదు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పాల్గొన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు, సర్ చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి జగదీశ్ -
పాముల కాలం.. జర పైలం
దోమ: వానాకాలంలో విష సర్పాలు, తేళ్ల సంచారం ఎక్కువ. పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పాము, తేలు కాటుకు గురైనప్పుడు నాటు వైద్యం కాకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని చెబుతున్నారు. ఆందోళనకు గురైతే గుండెపోటు రావడానికి ఆస్కారం ఉంటుందంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు 33 మంది పాముకాటు బారిన పడి మృతి చెందారు. మరో 692 మందికి ఏఆర్వీ వ్యాక్సిన్ ఇచ్చారు. నాటు వైద్యం వద్దు వేసవిలో ముళ్ల పొదలు, రాళ్ల మధ్యలో దాగి ఉన్న పాములు, తేళ్లు వర్షాలు కురవడంతో బయటకు వస్తుంటాయి. ముఖ్యంగా పొలాలు, గడ్డి, రాళ్ల కుప్పల వద్ద ఎక్కువగా కనిపిస్తుంటాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు వాటి కాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నాటు వైద్యానికి దూరంగా ఉండాలి. పాము కాటు వేసిన వెంటనే బాధితుడిని ప్రశాంతంగా ఉంచి సమీప ఆస్పత్రికి తరలించాలి. భయపడితే గుండె వేగంగా కొట్టుకోవడంతో విషం శరీరమంతా త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గాయాన్ని బ్లేడ్‌తో కోయడం, విషాన్ని నోటితో పీల్చడం వంటి చర్యలు ప్రమాదాన్ని మరింత పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. చేతికి ఉంగరాలు, గడియారాలు, బిగుతైన దుస్తులు ఉంటే వెంటనే తొలగించాలి. ఆ తేళ్లు ప్రమాదకరం పంట పొలాల్లో ఎక్కువగా ప్రమాదకర తేళ్లు బయటకు వస్తుంటాయి. నల్ల తేలు కుట్టినప్పుడు తీవ్రమైన నొప్పి, వాపు, మంట కలుగుతుంది. ఎరుపు తేలు కాటు గుండె, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పసుపు రాతి తేళ్లు, చెక్క దిమ్మెల కింద ఎక్కువగా కనిపిస్తాయి. వీటి కాటు కూడా నిర్లక్ష్యం చేయరాదు. తేలు కుట్టిన శరీర భాగాలను సబ్బుతో శుభ్రంగా కడిగి ఐస్‌ప్యాక్ ఉంచాలి. కుట్టిన భాగాన్ని ఎక్కువగా కదపకుండా ఉంచి వెంటనే వైద్యులను సంప్రదించాలి. వర్షా కాలంలో విషసర్పాలు, తేళ్ల బెడద కాటేస్తే ప్రథమ చికిత్స తప్పనిసరి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 33 మంది మృతి -
విద్యుత్ షాక్‌తో రెండు గేదెలు మృతి
మొయినాబాద్‌రూరల్: విద్యుత్ షాక్‌తో రెండు గేదెలు మృతి చెందిన సంఘటన మండలంలోని మేడిపల్లిలో చోటు చేసుకుంది. మేడిపల్లి గ్రామానికి చెందిన చాకలి బాబయ్య, బాబు తండ్రీకొడుకులు. వారి వద్ద ఉన్న గేదెలను గడ్డి మేపేందుకు ఆదివారం మధ్యాహ్నం గ్రామంలోని శివాలయం సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు. గడ్డి మేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి రెండు గేదెలు మృత్యువాతపడ్డాయి. సర్పంచ్ శ్రీనివాస్, గ్రామస్తులు బాధితులను ఓదార్చారు. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.రెండున్నర లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
చిన్నారులకు అండగా ప్రభుత్వం
మంత్రి దామోదర్ రాజనర్సింహ మల్లాపూర్: మానసిక ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న చిన్నారుల విషయంలో తల్లిదండ్రులతో పాటు సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సాధన ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్ (సాధన ఫౌండేషన్)కు చెందిన మానసిక దివ్యాంగ చిన్నారులు, సంస్థ ప్రతినిధులు మంత్రిని కలిశారు. మానసిక ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు, ప్రత్యేక విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థలను రూపొందించే దిశగా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సాధన దివ్యాంగుల వ్యవస్థాపకురాలు పడమటి సురేఖారెడ్డి, కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి తదితరులున్నారు. పంజగుట్ట: కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అమ్మవారికి సమర్పించేందుకు వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. పీర్జాదిగూడకు చెందిన నిర్మల కార్తీక్ వివాహం ఆగస్టు 16న జరగనుంది. దీంతో ఆయన తండ్రి భాస్కర్ (50) జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో వివాహ ఆహ్వాన పత్రిక సమర్పించేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. సోమాజిగూడలోని ప్రణవ భవనం సమీపంలో వాహనం అదుపుతప్పి కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అంబులెన్స్ ద్వారా యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తలకు తీవ్ర గాయం, రక్తస్రావం కారణంగా భాస్కర్ మృతి చెందారు. కుమారుడు కార్తీక్ ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అట్రాసిటీ కేసు నమోదు కుషాయిగూడ: ఓ మహిళా జర్నలిస్టును అసభ్యపదజాలంతో దూషించిన వ్యక్తిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కుషాయిగూడ పోలీసులు తెలిపిన మేరకు.. నాచారం ఇందిరానగర్ కాలనీకి చెందిన వాణి అనే జర్నలిస్టు ఈ నెల 16న కుషాయిగూడలోని మురళీకృష్ణ మిల్క్ పార్లర్లో పన్నీరు కొనుగోలు చేసింది. తాను కొనుగోలు చేసిన పన్నీరు నాసిరకంగా ఉండడంతో పార్లర్ యజమానిని ప్రశ్నించింది. దీంతో యజమాని సీసీఎస్ అధ్యక్షుడు చర్లపల్లి కాలనీల సమాఖ్య అధ్యక్షుడు ఎంపల్లి పద్మారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడాలని వాణికి ఇచ్చాడు. ఫోన్ మాట్లాడిన పద్మారెడ్డి అసభ్యంగా మట్లాడాడని దళిత మహిళ అని తెలిసి కూడా దూషించడాని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఇన్స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఎండోక్రైన్ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించాలి లక్డీకాపూల్: ఎండోక్రైన్ సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే జీవన నాణ్యతతో పాటు ఆయుర్దాయం కూడా మెరుగుపడుతుందని తెలంగాణ ఎండోక్రైన్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ బిపిన్ సేథి తెలిపారు. నగరంలోని హోటల్ మారిగోల్డ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ ఎండోక్రైన్ సొసైటీ 7వ వార్షిక సదస్సు ఆదివారం ముగిసింది. ఎండోక్రైనాలజిస్టులు, వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పాల్గొన్న ఈ ముగింపు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ వార్షిక సదస్సుల ద్వారా ఆ లోటును భర్తీ చేయాలన్నదే తమ ప్రయత్నమన్నారు.సదస్సు నిర్వహణ కార్యదర్శి, నిమ్స్ డాక్టర్ బియాట్రిస్ ఆన్ మాట్లాడుతూ.. డయాబెటిస్, ఊబకాయం, థైరాయిడ్, జీవక్రియ (మెటబాలిక్) సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులకు నిరంతర వైద్య విద్య అత్యంత అవసరమన్నారు. -
పాముకాటుకు రైతు మృతి
దౌల్తాబాద్: పాముకాటుకు ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని ఈర్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఖాజాషా(60) ఉదయం తన సొంత పొలంలో గడ్డి కోస్తున్నారు. ఈ క్రమంలో చేతికి పాము కాటు వేసింది. వెంటనే గమనించి ఇంటికి వచ్చారు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విషం శరీరంలోకి పాకడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై మృతుడి కుమారుడు మదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ వేణుకుమార్ తెలిపారు. -
అంబేడ్కర్ నేషనల్ అవార్డు అందజేత
షాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయన చేసిన సేవలు మరువలేనివని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, మంత్రి అట్లూరి లక్ష్మణ్ అన్నారు. ఆదివారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన చెన్నయ్య వారి చేతుల మీదుగా అంబేడ్కర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్రీయ అధ్యక్షుడు గౌతమ్ మల్లేశ్, డాక్టర్ రాజు, మణీ, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. 899 మంది‘నిషా’చరులకు చెక్ సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ విభాగం అధికారులు వీకెండ్స్‌లో ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగిస్తున్నారు. గత వారాంతమైన శుక్ర, శనివారాల్లో హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ విభాగాలు తనిఖీలు చేపట్టగా... 899 మంది డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారు. సమయం, ప్రాంతం, సందర్భాలతో సంబంధం లేకుండా ఆకస్మికంగా డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సైతం అనేక ప్రాంతాల్లో చేపట్టారు. వీరిలో హైదరాబాద్ పరిధిలో చిక్కిన వాళ్లు 572 మంది కాగా... సైబరాబాద్ పరిధిలో పట్టుబడిన వాళ్లు 327 మంది ఉన్నారు. ఈ ‘నిషా’చరుల్లో 730 మంది ద్విచక్ర, 56 మంది త్రిచక్ర, 109 మంది తేలికపాటి, మిగిలిన వాళ్లు ఇతర వాహనాల చోదకులు ఉన్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో చిక్కింది 572 మంది సైబరాబాద్ పరిధిలో పట్టుబడిన వాళ్లు 327 మంది -
మోయలేని భారం
విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు ప్రైవేట్ పాఠశాలల్లో అవసరం కంటే ఎక్కువ నోట్‌బుక్స్ ఇవ్వకూడదు. ప్రాజెక్టు బుక్స్, టెక్ట్స్ బుక్స్ పాఠశాలలోనే ఉంచుకునేలా యజమాన్యాలు ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలను ఇబ్బందులకు గురి చేయకూడదు. – వెంకట్‌స్వామి, ఎంఈఓ, దౌల్తాబాద్ దౌల్తాబాద్: బడికి వెళ్లే చిన్నారులు రోజురోజుకూ స్కూల్ బ్యాగుల భారంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సొంత సిలబస్ పేరుతో అధిక సంఖ్యలో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, గైడ్లు, ప్రాజెక్ట్ ఫైళ్లు, డ్రాయింగ్, స్క్రాప్ బుక్స్ వంటి వాటిని తప్పనిసరి చేయడంతో విద్యార్థులపై అదనపు భారం పడుతోంది. టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్, బూట్లు తదితర వస్తువులు కూడా బ్యాగు బరువును మరింత పెంచుతున్నాయి. కొందరు తల్లిదండ్రులు పిల్లల బాధను చూసి స్వయంగా బ్యాగులు మోసి పాఠశాల వరకు తీసుకెళ్తున్నారు. పరిస్థితి ఆందోళనకరం మండలంలోని 33 గ్రామపంచాయతీల పరిధిలో 50 పాఠశాలలు ఉండగా, వాటిలో 6 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. గతంలో కొన్ని సబ్జెక్టుల పుస్తకాలు, ఒక రఫ్ బుక్‌తో సరిపెట్టే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేక నోట్‌బుక్‌తో పాటు గైడ్లు, ప్రాజెక్ట్ వర్క్, రికార్డులు, డైరీలు వంటి పుస్తకాలు తీసుకు రావాల్సి వస్తోంది. దీంతో 7వ తరగతి వరకు చదివే విద్యార్థులు సుమారు 6 నుంచి 12 కిలోల వరకు, 8, 9, 10వ తరగతి విద్యార్థులు 12 నుంచి 18 కిలోల వరకు బరువున్న బ్యాగులను నిత్యం మోస్తున్నారు. కొన్ని పాఠశాల బస్సులు గేట్ వరకు మాత్రమే వెళ్లడంతో, అక్కడి నుంచి బ్యాగులు మోసుకుంటూ నడవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి కారణంగా చిన్నారుల్లో వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమలుకాని మార్గదర్శకాలు విద్యార్థులపై బ్యాగుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర విద్యాశాఖ 2017లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం 1, 2 తరగతుల విద్యార్థుల బ్యాగు బరువు 1.5 కిలోలు, 3 నుంచి 5వ తరగతుల వారికి 3 కిలోలు, 6, 7 తరగతుల వారికి 4 కిలోలు, 8 నుంచి 10వ తరగతుల వారికి 5 కిలోలు మించకూడదని స్పష్టం చేసింది. అయితే ప్రైవేట్ పాఠశాలలు ఈ నిబంధనలను పట్టించుకోకుండా సొంత సిలబస్ పేరుతో అదనపు పుస్తకాలను విద్యార్థులపై మోపుతున్నాయి. విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో బ్యాగుల బరువుపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు. బడి పిల్లలపై బ్యాగు బండ విద్యార్థులపై పెరుగుతున్న పుస్తకాల మోత ప్రైవేట్ పాఠశాలలో మరింత బరువు తిప్పలు పడుతున్న చిన్నారులు -
మందులు ఉన్నాయి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటు బాధితులు వెంటనే సమీప సర్కారు దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందించాలి. నాటు వైద్యానికి దూరంగా ఉండాలి. రైతులు పొలాలకు వెళ్లేటప్పడు తగిన జాగ్రత్తలు పాటించాలి. – సుధాకర్లాల్, జిల్లా వైద్యాధికారి విష సర్పాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాముకాటుకు గురైన వెంటనే సకాలంలో చికిత్స పొందడం ద్వారా ప్రాణాపాయాన్ని నివారించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంపొందించడం ద్వారా విషసర్పాలు, తేళ్ల కాటుతో జరిగే మరణాలను గణనీయంగా తగ్గించే ఆస్కారం ఉంది. – రజిత, మండల వైద్యాధికారి, దోమ -
అదుపుతప్పి కారు బోల్తా
నలుగురికి గాయాలు తాండూరు రూరల్: అతివేగంగా వెళ్తున్న ఓ కారు బోల్తా పడింది. ఈ సంఘటన పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తాండూరు పట్టణం ఇంద్రానగర్‌కు చెందిన ఓ కుటుంబం కారులో హైదరాబాద్ నుంచి తాండూరుకు వస్తున్నారు. మార్గమధ్యలో పెద్దేముల్ మండలం కందనెల్లి శివారు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు గమనించి కారులో ఉన్న వారిని బయటకు తీశారు. తర్వాత పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షత్రగాత్రుల్లో ఓ బాలుడు కూడా ఉన్నారు. ఈ విషయమై పెద్దేముల్ ఎస్ఐ ప్రశాంత్వర్థన్ను వివరణ కోరగా.. కారు బోల్తా పడిన ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందలేదన్నారు. -
ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను వెంటనే ప్రారంభించాలి
చేవెళ్ల: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను చేవెళ్లలో వెంటనే ప్రారంభించాలని బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ పురన్దాస్కు బీజేపీ నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ పాఠశాల ఇప్పటివరకు నియోజకవర్గంలో ఎందుకు ప్రారంభించలేకపోయారో అధికార పార్టీ నాయకులు చెప్పాలన్నారు. మంజూరు చేసిన పాఠశాలను సైతం ఏర్పాటు చేసేందుకు ఇన్నాళ్లుగా కాలయాపన చేయటం విడ్డురంగా ఉందన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చేవెళ్లకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలతో కలిసి బీజేపీ పెద్దఎత్తున ందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కృష్ణగౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి అశోక్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు తదితరులు ఉన్నారు. ఎంఈఓకు బీజేపీ నాయకుల వినతి -
ఎడాపెడా కోతలు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పురిటి నొప్పుల భారం భరించాల్సి వస్తుందనే భయం.. శుభ ముహూర్తంలో బిడ్డకు జన్మనివ్వాలనే ఆకాంక్ష.. సహజప్రసవంతో పోలిస్తే సిజేరియన్ ద్వారా ఎక్కువఫీజు వస్తుందనే ఆస్పత్రుల ఆశ వెరసి.. అమ్మకు కడుపు కోత మిగుల్చుతున్నాయి. సహజ ప్రసవానికి అవకాశం ఉన్నా.. లేబర్ రూమ్‌లో ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుందని, నొప్పుల బాధను భరించలేరని చెప్పి పలువురు వైద్యులు సిజేరియన్లను ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో సహజ ప్రసవాల కంటే సిజేరియన్లే ఎక్కువ నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మెజారిటీ నమోదు సిజేరియన్లే.. జిల్లాలో 2024–25లో 51,362 ప్రసవాలు జరగ్గా వీటిలో 30 వేలకుపైగా సిజేరియన్లే. 2025–26లో 51,159 ప్రసవాలు నమోదైతే.. ఇందులో 35 వేలకుపైగా సిజేరియన్లే కావడం విశేషం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవుతున్న సిజేరియన్లతో పోలిస్తే ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్నవి కాబోయే తల్లులను తీవ్రంగా కలిచి వేస్తున్నాయి. తాము బిడ్డకు జన్మనిచ్చామనే సంతోషం కంటే వైద్యులు తమ కడుపుపై పెట్టిన కత్తిగాట్లు మిగిల్చిన గాయాలే ఎక్కువ బాధపెడుతున్నట్లు పలువురు తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆస్పత్రికి చేరుకోక ముందే అంబులెన్సుల్లో కొంత మంది ప్రసవిస్తుంటే.. మరికొంత మంది ఇప్పటికీ ఇంట్లోనే ప్రసవిస్తున్నారు. అధిక రక్తస్రావంతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చేరి చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టం తగ్గిపోతున్న సహజ ప్రసవాలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు ఇలా.. సంవత్సరం సహజ సిజేరియన్లు 2020–21 6,031 13,362 2021–22 5,361 13,941 2022–23 5,094 13,052 2023–24 4,706 11,815 2024–25 5,944 12,292 2025–26 6,571 14,306 నిబంధనలు మీరితే చర్యలు ప్రసవాలపై దంపతులు, వారి తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. శుభ ముహూర్తాలు వంటి వాటిని పక్కన పెట్టి నెలలు పూర్తిగా నిండిన తర్వాతే సహజ ప్రసవం ద్వారా పిల్లలకు జన్మనివ్వాలి. సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా పెట్టాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆస్పత్రులపై చర్యలు తప్పవు. – డాక్టర్ స్వర్ణకుమారి, జిల్లా వైద్యాధికారి -
షాద్‌నగర్ చౌరస్తా విస్తరణ షురూ
షాద్‌నగర్: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న షాద్‌నగర్ చౌరస్తా విస్తరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఆర్డీఓ సరిత, ఏసీపీ లక్ష్మీనారా యణ, మున్సిపల్ కమిషనర్ సునీత, తహసీల్దార్ నాగయ్య, సీఐ సీతారాం ఆధ్వర్యంలో సోమవారం విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పరిగిరోడ్డులో ఉన్న పోచమ్మ దేవా లయం నుంచి చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్ల పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాల ర్యాంపులు, కట్టడాలను జేసీబీ సాయంతో కూల్చివేశారు. పలువురు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను ముందే తొలగించారు. ఏళ్లుగా నిరీక్షణ సుమారు 20 ఏళ్ల నుంచి షాద్‌నగర్ చౌరస్తాను విస్తరించాలనే డిమాండ్ ఉంది. చౌరస్తాలో తరచూ ట్రా ఫిక్ సమస్యలు ఎదురు కావడంతోపాటు ప్రమా దాల బారినపడి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.రోడ్డు విస్తరించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరిగింది. పట్టణానికి చెందిన ఆర్.ఎన్.రాము అనే యువకుడు ఏడాది కాలంగా రోడ్డు విస్తరించాలని ఒంటరి పోరాటం చేస్తున్నాడు. షాద్‌నగర్ చౌరస్తా విస్తరించండి అంటూ టీషర్టుపై రాసుకొని నిత్యం ధరిస్తున్నాడు. ధర్నా, ఆందోళనలు, సంతకాల సేకరణ చేపట్టాడు. మున్సిపల్ ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్సు లో చాలామంది రోడ్డు విస్తరించాలని పేపర్‌పై రాసి వేశారు. ఈ క్రమంలో చౌరస్తా విస్తరణ చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. ఇటీవల ఆర్డీఓ సరిత మున్సిపల్ కార్యాలయంలో సమావేశమై అందరి అభిప్రాయాలు సేకరించారు. దీంతో ఎట్టకేలకు విస్తరణ పనులు మొదలయ్యాయి. -
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత తప్పనిసరి
కందుకూరు: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థి తులను ఎదుర్కోవాలంటే ప్రతి ఇంటికీ తప్పనిసరి ఇంకుడు గుంత నిర్మించుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి సూచించారు. మండల పరిధిలోని కొత్తూర్‌లో సర్పంచ్ మండల కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం జలసిరి కార్యక్రమంపై గ్రామ సభ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు తమ పొలాల్లో పంట కుంటలు నిర్మించుకోవాలని అన్నారు. గ్రామానికి ఒక ఊట కుంట, బోరు బావుల రీచార్జీ కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వాటితో వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటలు కాపాడుకోవచ్చని, భూగర్భ జలాల మట్టం పడిపోకుండా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ చర్యలు పాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సరిత, ఇన్చార్జి ఎంపీఓ శ్రీధర్, టీఏ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి జానకీరామ్, ఉప సర్పంచ్ రవికుమార్‌రెడ్డి, ఏఈఓ స్వాతి, ఐకేబీసీసీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మాతృమరణాలపై దృష్టి పెట్టాలి సాక్షి, రంగారెడ్డిజిల్లా: మాతృ మరణాలపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సూచించారు. మరణాలకు దారి తీసిన పరిస్థితులపై అధ్యయనం చేసి, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సోమవారం జిల్లాలో నమోదైన మాతృమరణాలపై సమీక్ష నిర్వహించారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి, మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రసవానికి ముందు.. తర్వాత అందే వైద్యసేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి మాట్లాడుతూ.. మాతృ మరణాల నివారణకు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. ప్రతి మాతృ మరణంపై జిల్లా స్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించి, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గర్భిణుల క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, రక్తహీనత నివారణ, సంస్థాగత ప్రసవాల ప్రోత్సాహం, అధిక ప్రమాద గర్భిణుల నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మాతృ మరణానికి సంబంధించిన కేసులను విడివిడిగా సమీక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జిల్లా ప్రోగ్రామింగ్ అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయాలి
చేవెళ్ల: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. చేవెళ్ల మీదుగా సోమవారం వెళ్తున్న ఆయన కాసేపు ఆగి స్థానిక నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చేవెళ్ల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. యువతను మోసం చేసి ఉద్యోగాలు ఇస్తామని ఓట్లు వేయించుకున్నారన్నారు. ప్రశ్నించే వారిని అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ ఎం. విజయ్‌భాస్కర్‌రెడ్డి, నాయకులు విజయ్ ఆర్యక్షత్రియ, పి.ప్రభాకర్, దూత మల్లేశ్, శ్రీనివాస్‌రెడ్డి, యాదయ్య, ఆనంద్, నరేందర్‌రెడ్డి, శంకర్, సత్యం, అనంత్‌రెడ్డి, చందు, మాణిక్యరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, కృష్ణ, రాంప్రసాద్, బాలు తదితరులు ఉన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆత్మహత్య
మర్రిగూడ(చింతపల్లి): ఆర్థిక ఇబ్బందులతో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ గరీబ్ ఖాజానవాబ్ (45) చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామ పరిధిలోని వీటీ నగర్లో గల ది రెయిన్బో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ (కరస్పాండెంట్)గా వ్యవహరిస్తున్నాడు. ఆయన గతంలో నారాయణపేట జిల్లా కోస్గిలో పాఠశాల నడిపి నష్టపోయాడు. దీంతో అప్పులు అధికం కావడం, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పాఠశాలలోని గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రిన్సిపాల్ గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతుడికి భార్య షబానా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
యంత్రంలో నలిగి కార్మికుడి మృతి
షాద్‌నగర్: ఫరూక్నగర్ మండలం ఎలికట్ట గ్రామ శివారులోని ఓ పరిశ్రమలో వలస కార్మికుడు ప్ర మాదం బారిన పడి మృతిచెందాడు. ఆదివారం రాత్రి 7గంటలకు ఈ ఘటన చోటుచేసుకోగా కంపెనీ నిర్వాహకులు విషయాన్ని బయటకు రానీయలేదు. బతుకుదెరువు కోసం వచ్చి.. ఒడిశా రాష్ట్రానికి చెందిన బిజయ భద్ర (21)కు ఏడాదిన్నర క్రితం నూనిసింగ్తో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ మూడు నెలల క్రితం బతుకుదెరువు నిమిత్తం షాద్‌నగర్‌కు వచ్చి, ఎలికట్ట శివారులోని చెట్టినాడ్ పరిశ్రమలో పని చేస్తున్నారు. ఇటీవల సొంతూరుకు వెళ్లిన భద్ర.. డెలివరీ నిమిత్తం భార్యను అక్కడే వదిలేసి ఎలికట్టకు వచ్చాడు. పది రోజుల క్రితం పాప పుట్టిందని తెలియడంతో మరో రెండు మూడు రోజుల్లో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. కేసు నమోదు.. కార్మికుడు భద్ర కంపెనీలో టైల్స్ పౌడర్ తయారు చేసే యంత్రం వద్ద పనిచేస్తాడు. ప్రమాదవశాత్తు యంత్రంలో పడిపోయిన భద్ర అందులోనే నలిగి చనిపోయాడు. మృతదేహాన్ని వెలికి తీసి మార్చురీకి తరలించారు. ఇదే పరిశ్రమలో పని చేస్తున్న మృతుడి పెద్దనాన్న కొడుకు దూమ బదరా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బిజయ భద్ర (ఫైల్)పది రోజుల బిడ్డతో నూనీ అనాథలైన తల్లీబిడ్డ.. భద్ర రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్న నూనీ తన బిడ్డను ఎప్పుడెప్పుడు అతనికి చూపిస్తానా అనే ఆత్రుతతో గడుపుతోంది. ఇంతలోనే పిడుగులాంటి వార్త ఆమె బతుకును దుర్భరం చేసింది. భద్ర ఇకలేడని, ప్రాణాలతో రాడని తెలియడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. పరిశ్రమ నిర్లక్ష్యం కారణంగానే భద్ర మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎలికట్ట శివారులోని పరిశ్రమలో ప్రమాదం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికుల డిమాండ్ -
వరి తగ్గించండి..ఆరుతడి పెంచండి
షాద్‌నగర్‌రూరల్: రైతులు వరి పంటను తగ్గించి వర్షాభావ పంటలు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని వెలిజర్ల రైతువేదికలో సోమవారం విత్తనమేళా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం అనుకున్న స్థాయిలో ఉండదనే విషయాన్ని రైతులు గ్రహించాలని తెలిపారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరిని తగ్గించుకొని ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటించి తగిన పంటలు వేసుకోవాలన్నారు. ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసి నీటి సంరక్షణ పద్ధతులు పాటించాలని పేర్కొన్నారు. ఫాం పాండ్ల ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీని అందజేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం కంది, మొక్కజొన్న అంతర పంటలుగా సాగు చేసిన రైతు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బాబునాయక్, అనురాధ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్‌అలీఖాన్ బాబర్, డైరెక్టర్లు సురేష్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, భరత్, జిల్లా వ్యవసాయాధికారి సుజాత, ఏడీఏ రమాదేవి, ఏఓ నిషాంత్‌కుమార్, ఉద్యానశాఖ అధికారి హిమబిందు తదితరులు పాల్గొన్నారు. -
రెండు చోట్ల ఓటు నేరం
● ఎక్కడైనా ఒకే చోట నమోదు చేయించుకోవాలి ● బషీరాబాద్ తహసీల్దార్ షాహేదాబేగం బషీరాబాద్: ఒకే వ్యక్తి రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు కావడం చట్టరిత్యా నేరమని, ప్రతి అర్హుడైన ఓటరు తన సాధారణ నివాసం ఉన్న ప్రాంతంలో మాత్రమే ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని బషీరాబాద్ తహసీల్దార్ షాహేదా బేగం సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అధికారులు, బీఎల్వోలు అప్రమత్తంగా పనిచేసి, డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి నమోదులను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. బషీరాబాద్ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ సంత్కుమార్తో కలిసి బీఎల్ఓలు, వివిధ రాజకీయ పార్టీల బీఎల్ఏలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఏఎస్డీలతో కలిపి ఇప్పటివరకు 95.11 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసి, వందశాతం లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. అలాగే ఏఎస్డీ(అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్) ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాంటి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పూర్తిగా ధ్రువీకరించాలని ఆదేశించారు. ఓటరు జాబితా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండేందుకు ప్రజలు కూడా సహకరించాలని, అర్హులైన ప్రతిఒక్కరూ తమ వివరాలను సరిచూసుకుని అవసరమైతే అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించాలన్నారు. అధికారులు, బీఎల్వోలు సమన్వయంతో మిగిలిన డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
‘ఆ నాయకుడి తీరు సిగ్గుచేటు’
చేవెళ్ల: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. చేవెళ్లలో సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 17వ వార్డు కౌన్సిలర్ ఎం.కృష్ణానాయక్ అర్ధరాత్రి మద్యం తాగి, పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో హల్చల్ చేయడమే కాకుండా తానే స్వయంగా వీడియో తీసుకుంటూ వైద్యులు, యాజమాన్యాన్ని దూషించాడన్నారు. అంతటితో ఆగకుండా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడని తెలిపారు. అధికార పార్టీ కౌన్సిలర్ననే అహంకారంతోనే ఆయన ఇలా ప్రవర్తించాడని మండిపడ్డారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేసి క్షేమాపణ చెబితే సరిపోదని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు పి.ప్రభాకర్, కె. ఆనంద్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, డీఎం.చందు, అనంత్‌రెడ్డి, మల్లారెడ్డి, దండు సత్తి, భాస్కర్‌రెడ్డి, దూత మల్లేశ్, శ్రీధర్‌రెడ్డి, కుర్వ మల్లేశ్, క్రిష్ణ, నరేందర్‌రెడ్డి, బాలు, శంకరయ్య, రాంప్రసాద్, మానిక్యరెడ్డి తదితరులు ఉన్నారు. -
అదుపు తప్పి లారీ బోల్తా
డ్రైవర్‌కు గాయాలు యాలాల: వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గేటు సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటుక లోడ్ ఖాళీ చేసిన ఓ లారీ తాండూరు నుంచి కొడంగల్ వైపు వెళ్తుండగా మలుపు వద్ద బోల్తా పడింది. లారీ అద్దాలను పగలగొట్టిన స్థానికులు అందులో ఇరుక్కుపోయిన డ్రైవర్ నవీన్‌ను బయటకు తీసి తాండూరులోని ఆస్పత్రికి తరలించారు. లారీ బోల్తా పడిన ప్రదేశంలో పొలాల వద్ద పనిచేస్తున్న కూలీలు భోజనం చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో వీరు కూర్చున్న ప్రదేశానికి సమీపంలోనే లారీ బోల్తా పడటంతో భయాందోళనకు గురయ్యారు. యాలాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పారిశ్రామికాభివృద్ధికి పాటుపడదాం
మహేశ్వరం: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరింత వేగం తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. మండల పరిధిలోని తుమ్మలూరు ప్లాస్టిక్ పార్కు, శ్రీనగర్ ఈ–సీటీ పారిశ్రామిక పార్కులోని పలు పరిశ్రమలను సోమవారం ఆయన సందర్శించారు. మాన్యుఫ్యాక్షరింగ్ యూనిట్లను పరిశీలించి కంపెనీ ప్రతినిధులు, టీజీఐఐసీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంపెనీలు ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శశాంక, శంషాబాద్ టీజీఐఐసీ జోనల్ మేనేజర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
ఆ చట్టం శక్తివంతమైన ఆయుధం
మీర్‌పేట: సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వం, సమాచార కమిషన్, ప్రజాసంఘాలు పరస్పర సహకారంతో పనిచేయాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడు చంటి ముదిరాజ్ అన్నారు. బాలాపూర్ చౌరస్తాలోని కార్యాలయంలో సోమవారం కమిటీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తివంతమైన ఆయుధమని తెలిపారు. ప్రజలకు సమాచారం వేగంగా, పారదర్శకంగా అందే విధంగా వ్యవస్థలో అవసరమైన మార్పులు తేవాలన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి ప్రతి గ్రామానికి సమాచార హక్కు ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, కార్యదర్శి తోట శ్రీనివాస్, సహాయ కార్యదర్శి అన్నవరం సందీప్‌రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చింతల రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి
ఇబ్రహీంపట్నం రూరల్: సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి ఉందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకుని, వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారులు శాఖల వారీగా స్పందించి అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం 136 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి శారద, వివిధ శాఖల అధికారులు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. సంచార పశు వైద్యశాలను వినియోగించుకోవాలి కందుకూరు: సంచార పశు వైద్యశాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని 1962 అంబులెన్స్ కార్యనిర్వహణ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జాన్ సాహెబ్ సూచించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పశువులకు అందించిన చికిత్సలను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలంలో వివిధ జబ్బులతో ఉన్న పశువులను ఆస్పత్రులకు తరలించలేని స్థితిలో ఉంటే ఒక్క ఫోన్ కాల్‌తో 1962 అంబులెన్స్ సిబ్బంది అక్కడికే వచ్చి వైద్యం అందిస్తారన్నారు. కార్యక్రమంలో అంబులెన్స్ జిల్లా కార్యనిర్వాహక అధికారి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సరూర్‌నగర్ సర్కిల్లో విద్యుత్ వ్యవస్థ బలోపేతం సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రజలకు నాణ్యమైన, ని రంతర విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో టీజీఎస్పీడీసీఎల్ సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని 33/11 కేవీ తుర్కయంజాల్ సబ్‌స్టేషన్ లోని పవర్ ట్రాన్స్ఫార్మర్ (పీటీఆర్)–1 సామ ర్థ్యాన్ని 8 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏకు పెంచింది. సామర్థ్య పెంపు పనులను విజయవంతంగా పూర్తి చేసి సోమవారం సాయంత్రం పవర్ ట్రాన్స్ఫార్మర్ను విజయవంతంగా ఛార్జ్ చేశారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ సామర్థ్య పెంపు చేపట్టారు. దీంతో సబ్‌స్టేషన్‌పై లోడ్ ఒత్తిడి తగ్గడంతో పాటు పీక్ డిమాండ్ సమయాల్లో విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది. ఈ సామర్థ్య పెంపుతో తుర్కయంజాల్ గ్రామం, బ్రాహ్మణపల్లి, ఖమ్మగూడం, శోభానగర్, రాగన్నగూడ ప్రాంతాల్లోని సుమారు 10,000 మంది విద్యుత్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఆయా ప్రాంతాల్లో మెరుగైన ఓల్టేజ్‌తో పాటు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అప్‌గ్రేడేషన్ దోహదపడుతుంది. సరూర్‌నగర్ ఎస్ఈ లక్ష్మీనారా యణ, ఇబ్రహీం పట్నం డీఈ నరేష్ కుమార్, లైన్స్ విభాగం డీఈ వేణుగోపాల్, ప్రొటక్షన్ విభాగం డీఈ హైమనందతో పాటు ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీకి అనువైన భవనం చూడండి సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం మెడికల్ కాలేజీ కోసం అనువైన భవనాన్ని పరిశీలించాల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాలేజీ ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలోని ఓ అసంపూర్తి అద్దె భవనంలో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే. పెద్ద మొత్తంలో అద్దె చెల్లిస్తున్నప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వైద్య విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీనిపై సోమవారం ‘సాక్షి’లో ‘కాలేజీ.. ఏ క్యాజీ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి డీఎంఈ స్పందించారు. వైద్య విద్య సంచాలకులు డాక్టర్ నాగేందర్, డాక్టర్ రమాదేవి, డాక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి, అనువైన భవనాన్ని ఎంపిక చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. -
దళారులపై చర్యలకు వినతి
ఆమనగల్లు: స్థానిక కూరగాయల మార్కెట్లో రైతులను మోసం చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ల రవీందర్ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కొన్నేళ్లుగా మార్కెట్లో మోండా పేరుతో కొంతమంది దళారులు రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేయడంతో పాటు తరుగు, కమీషన్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. వీరికి గతంలోనే మార్కెట్ కమిటీ నుంచి నోటీసులు అందజేశారని తెలిపారు. క్వారీ పనులు నిలిపివేయాలి.. ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లిలోని సర్వే నంబర్ 302, 304లో కొనసాగుతున్న క్వారీ పనులను ఆపేయాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపతంర అందజేశారు. క్రషర్‌తో విపరీతమైన దుమ్ము, శబ్ద కాలుష్యం వెలువడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతులను మోసం చేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు తరుగు, కమీషన్ పేరుతో దోచుకుంటున్నారని ఆరోపణ -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కడ్తాల్: ప్రకృతిని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్మాస్‌పల్లి ఎర్త్‌సెంటర్‌లో సోమవారం కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో విద్యాధికారులు, ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. ఉపాధ్యాయులు పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా దేశంలో, ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పర్యావరణ సామాజిక పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రపంచం ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య క్షీణత వంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో విద్యాధికారులు, ఉపాధ్యాయులు పర్యావరణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. పాలసీ నిపుణుడు నర్సింహారెడ్డి, సీజీఆర్ వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి, విద్యావేత్త ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పర్యావరణ శాస్త్రవేత్తలు సాయిభాస్కర్రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, వైఈఎల్పీ స్టేట్ కో ఆర్డినేటర్ యానాల వెంకట్‌రెడ్డి, సుస్థిర పుడమి ఎడిటర్ రమేశ్‌రావు, సీజీఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై దృష్టి పెట్టండి
షాద్‌నగర్: సైబర్ నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఫ్యూచర్‌సిటీ కమిషనర్ తరుణ్‌జోషి సూచించారు. నందిగామ పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రికార్డుల నిర్వహణను క్రమబద్ధంగా నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు అమాయకులను టార్గెట్ చేసి డబ్బులు దోచేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో పోలీసు అధికారులు విస్తృతంగా పర్యటించి ప్రజలను సైబర్ నేరాల బారిన పడకుండా చైతన్య పరచాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించి ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్నారు. ఈ–సాక్షి వంటి సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించి దర్యాప్తులో కచ్చితత్వాన్ని మెరుగుపర్చాలన్నారు. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, ప్రజా సమస్యల పై తక్షణం స్పందించాలన్నారు. అనంతరం కన్హాశాంతి వనాన్ని సందర్శించారు. కార్యక్రమంలో షాద్‌నగర్ డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు
యాచారం: శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడకుండా కఠినంగా వ్యహరించాలని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి సూచించారు. యాచారం పీఎస్‌ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల నమోదు, ఫిర్యాదుల స్వీకరణ, రోడ్డు నిబంధనలు అమలు చేసే తీరుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం నిత్యం వాహనాల తనిఖీ చేపట్టాలని, హెల్మెట్ లేకుండా బైక్‌లు నడిపే వారికి జరిమానాలు విధించాలని అన్నారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. భూసేకరణ చేపట్టే గ్రామాల్లో అధికారులను సమన్వయం చేసుకుని రైతులతో శాంతియుతంగా మాట్లాడాలని సూచించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్ఐలు మధు, ప్రియాంక పాల్గొన్నారు. అనంతరం డీసీపీ నారాయణరెడ్డి సాగర్ హైవే గునుగల్ గేట్ వద్ద ప్రజలతో మాట్లాడారు. సైబర్ నేరాలు, మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సేవలు ఎలా పొందాలి, కొత్త వ్యక్తుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్తలను వివరించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
ఫ్యూచర్ సిటీ జాయింట్ కమిషనర్ చందనాదీప్తి ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదాల నివారణకు శాసీ్త్రయ విధానంలో పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఫ్యూచర్ సిటీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(అడ్మిన్ అండ్ ట్రాఫిక్) జి.చందనా దీప్తి ఆదేశించారు. ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఆమె సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది విధి నిర్వహణ, వ్యక్తిగత క్రమశిక్షణ, యూనిఫాం నిర్వహణను పరిశీలించారు. ముగ్గురు ట్రాఫిక్ సిబ్బంది ప్రశంసిస్తూ రివార్డులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) శివమ్ ఉపాధ్యాయ, మహేశ్వరం డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ ఎ.చంద్రశేఖర్, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ ఎస్హెచ్ఓ జితేందర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: కుక్కను తప్పించబోయి రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. బ్రహ్మణపల్లి రాజీవ్‌గృహకల్పలో నివాసం ఉండే బానావత్ అమర్‌సింగ్ ఆటో నడుపుకుంటూ జీవణం సాగించేవాడు. ఈ నెల 23న ఉదయం ఇంటి నుంచి బయలుదేరాడు. బ్రహ్మణపల్లి క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో తప్పించబోయాడు. ఆటోను ఎడమవైపు తిప్పడంతో కిందపడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో వివిధ అస్పత్రుల్లో చికిత్సపొందాడు. బ్రెయిన్ డెడ్ కావడంతో అమర్‌సింగ్( 47) మృతి చెందినట్లు తెలిపారు. -
మద్యం మత్తులో వీరంగం
చేవెళ్ల: పట్టణంలోని 17వ వార్డు కౌన్సిలర్ ఎం.కృష్ణానాయక్ మద్యం మత్తులో ఆదివారం రాత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో హంగామా చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్లు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడాడు. రాత్రి తన స్నేహితుడికి ప్రమాదం జరగడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిబ్బంది వచ్చి చికిత్స ప్రారంభిస్తుండగానే తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఫ్రీ అని ప్రచారం చేసూకుంటూ.. డబ్బులు తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు. తాను అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్నని, తనకే ఇక్కడ న్యాయం జరగడం లేదని వీడియో తీసుకుని, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కావడంతో పోలీసులు అతన్ని పిలిపించి విచారించారు. తాను ఓ దావత్‌కు వెళ్లానని, తన స్నేహితుడు ఆస్పత్రిలో ఉండటంతో అక్కడికి వెళ్లి మద్యం మత్తులో వైద్యులు, సిబ్బందిపై అమర్యాదగా మాట్లాడానని అంగీకరించారు. తన వల్ల ఇబ్బంది పడిన వారికి క్షమాపణ చెబుతున్నానని, తనకు ఎవరిపైనా దురుద్దేశం లేదని చెబుతూ మరో వీడియో పోస్ట్ చేశారు. ఆసుపత్రిలో కౌన్సిలర్ హ ంగామా క్షమాపణ చెబుతూ కృష్ణానాయక్ మైకం వదిలిన తర్వాత క్షమాపణ చర్చనీయాంశమైన కౌన్సిలర్ వ్యవహారం -
తాటిచెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోండి
ఇబ్రహీంపట్నం రూరల్: తాటి చెట్లు నరికి గీత వృత్తికి దూరం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం నాయకుడు గుండ్ల దానయ్యగౌడ్, కార్యదర్శి భాస్కర్‌గౌడ్ డిమాండ్ చేశారు. పోల్కంపల్లిలో తాటి చెట్లు నరికిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ సర్పంచ్ గుండ్ల కొండల్‌గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇంటి స్థలాలు చూపించండి.. యాచారం మండలంలోని చింతుల్లలో ఇచ్చిన సర్టిఫికెట్లకు సంబంధించిన ఇళ్ల స్థలాలను చూపించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని సర్వే నంబరు 327లో ఐదెకరాల స్థలంలో ఇంటి పట్టాలు ఇచ్చారన్నారు. అప్పటి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే నర్సింహ వీటిని పంపిణీ చేసినా, ఇప్పటికీ పొజిషన్ చూపించలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మస్కు విజయ్, సామర్తి జగన్, వినోద్‌కుమార్, నర్సింహ, కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట గీత కార్మికుల ధర్నా -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఇబ్రహీంపట్నం: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిఽధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ చందర్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. దండుమైలారం గ్రామానికి చెందిన ఎడ్ల అనిల్‌కుమార్(23) ఇంట్లోనే అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు తెలిపారు. మగపిల్లలు లేనికారణంగా అనిల్‌ను చిన్నప్పుడే అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకుని, తండ్రి భిక్షపతి అతన్ని పెంచారు. పోలీస్ సెలెక్షన్స్‌కు సిద్ధమవుతుండగా ఇటీవల కాలు బెనికి సర్జరీ అయిందని చెప్పారు. హఠాత్తుగా అనిల్ మృతిచెందడం, మెడ వద్ద చర్మం కమిలిపోయినట్లు కనిపిస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చలానాలు తప్పించుకునేందుకు కారుకు ఫేక్ నెంబర్ యజమానిపై చీటింగ్ కేసు గచ్చిబౌలి: చలానాలు తప్పించుకునేందుకు ఫేక్ నెంబర్‌తో పట్టుబడ్డ వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదైంది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన మేరకు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన కారుకు ట్రాఫిక్ పోలీసులు డాక్యుమెంట్లు పరిశీలించగా చేయగా నెంబరు (టీఎస్08జైవె1202) ఫేక్ నెంబర్‌గా గుర్తించారు. ఛాసిస్ నెంబర్ ఆధారంగా ఒరిజినల్ నెంబర్ టీఎస్11ఈజడ్3815గా గుర్తించారు. పాతబస్తీకి చెందిన ఇర్ఫాన్ ఈ నెల 18న నానక్‌రాంగూడలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. కౌన్సిలింగ్ అనంతరం కోర్టు ద్వారా కారును విడుదల చేసుకునేందుకు గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్‌కు వచ్చాడు. కారు నెంబర్‌ను పరిశీలించగా చేయడంతో ఫేక్ అని తేలింది. చలానాలు తప్పించుకునేందుకు ఫేక్ నెంబర్ వాడినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. -
ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి పోస్టర్ ఆవిష్కరణ
ఇబ్రహీంపట్నం: ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి పేరుతో ముద్రించిన వాల్ పోస్టర్‌ను బీజేవైఎం నాయకులు ఆదివారం ఇబ్రహీంపట్నంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు బూర అభినయ్‌గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి వనవాడ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను బకాయి పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు ఫీజుల బకాయి – బీజేపీ లడాయి కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎన్.కార్తీక్‌గౌడ్, కంబాలపల్లి శశిధర్‌రెడ్డి, శాంతి, వినయ్, భారత్, బీరప్ప, వంగ సంజీవరెడ్డి, విశాల్, సాయితేజ, సందీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
కాలేజీ.. ఏ క్యాజీ!
పాముల కాలం.. వానాకాలంలో విష సర్పాల సంచారం ఎక్కువ. పొలాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.సాక్షి, రంగారెడ్డిజిల్లా: నాణ్యమైన వైద్య విద్య సంగతేమో కానీ.. కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేపోతున్నారు మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థులు. వైద్య విద్య ఇక్కడ మిథ్యలా మారింది. నగరానికి సమీపంలో ఉందని, మౌలిక సదుపాయాలకు కొదవ ఉండదని భావించి.. అడ్మిషన్ పొందిన మెజార్టీ విద్యార్థులు ఆ తర్వాత తాము ఇక్కడెందుకు వచ్చిపడ్డామా అని ఆందోళనకు గురవుతున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ కాలేజీని అనుబంధ ఆస్పత్రి సమీపంలోకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం కాలేజీ సందర్శనకు వచ్చిన అదనపు కలెక్టర్ కిరణ్మయికి విద్యార్థులతో పాటు అధ్యాపకులు ఇదే అంశంపై మొరపెట్టుకున్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేని ఈ భవనాన్ని చూసి ఆమె కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అద్దె భవనం.. అరకొర సదుపాయాలు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం జిల్లాకు మహేశ్వరం మెడికల్ కాలేజీని మంజూరు చేసింది. మీర్ఖాన్పేటలో ఏర్పాటు చేయాలని భావించి ఆ మేరకు అక్కడ స్థలాన్ని కేటాయించింది. 2023లో శంకుస్థాపన చేసింది. తీరా ప్రభుత్వం మారిపోవడంతో కాలేజీ.. ఎంపిక ప్రదేశం కూడా మారింది. సొంత క్యాంపస్ సహా కనీస మౌలిక సదుపాయాలు లేకపోయినా ప్రభుత్వ కాలేజీ కావడంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. 2024లో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది. 50 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న ఈ కాలేజీలో ఇప్పటికే రెండు బ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. 2026–27లో మూడో బ్యాచ్ అడుగుపెట్టబోతోంది. కాలేజీకి సొంత భవనం లేకపోవడంతో అధికారులు మంగళ్‌పల్లి సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. నెలకు రూ.16 లక్షలు చెల్లిస్తున్నారు. విశాలమైన క్యాంపస్ సహా ఐదు అంతస్తుల భవనం ఉన్నట్లు ఎంసీఐకి చూపించారు. తీరా అడ్మిషన్లు పూర్తై..తరగతులు మొదలైన తర్వాత అసలు విషయం బయటపడింది. భవన యాజమాన్యం, అప్పటి అధికారులు కుమ్మకై ్క మార్కెట్లో లేని అద్దె నిర్ణయించారు. అద్దె పెంపు విషయంలోనూ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఆర్థికశాఖ నుంచి కాలేజీకి షోకాజ్ నోటీసులు అందినట్లు తెలిసింది. ఈనెల 31తో భవనం అద్దె గడువు ముగియనుంది. అద్దెను 20 శాతం పెంచాల్సిందిగా భవన యజమాని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఐదంతస్తుల ఈ భవనంలో రెండు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తరగతి గదుల కిటికీలకు గ్లాసులు లేవు. చిన్నపాటి వర్షానికే గదుల్లోకి నీరు చేరుతోంది. చలిగాలులకు విద్యార్థులు గజగజ వణికిపోతున్నారు. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం, కాలేజీకి కరెంట్ కనెక్షన్, ఫ్యాకల్టీ గదుల్లో ఫ్యాన్లు లేవు. అయినా నెలకు రూ.ఐదు లక్షల వరకు కరెంట్ బిల్లుల చెల్లింపునకు కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం 60 శాతం మంది విద్యార్థులకు అదే క్యాంపస్‌లో వసతి కల్పించాల్సి ఉంది. కానీ ఇక్కడ వసతి లేకపోవడంతో విద్యార్థులు ఇరుకై న ప్రైవేటు హాస్టల్ గదుల్లో ఇతర విద్యార్థులతో కలిసి ఉండాల్సి వస్తోంది. అంతేకాదు కాలేజీకి అనుబంధంగా వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని ఎంపిక చేశారు. నిబంధనల మేరకు పది కిలోమీటర్లలోపే ఆస్పత్రి ఉండాలి. ఇక్కడ మాత్రం 18 కిలోమీటర్ల దూరం ఉండటంతో రాకపోకలకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుబంధ ఆస్పత్రిలో పని చేసి, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసు రూమ్‌లో ఉండాల్సి వస్తోంది. ఇటు నుంచి అటు..అటు నుంచి ఇటు రాకపోకలకే రెండు గంటల సమయం పడుతోంది. ట్రాఫిక్ రద్దీలో కాలేజీ నుంచి ఆస్పత్రికి వచ్చి వెళ్లడం విద్యార్థులకు ప్రహసనంగా మారింది. దీనిపై కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అద్దె భవనంలో మహేశ్వరం మెడికల్ కళాశాల కనీస మౌలిక సదుపాయాలు కరువు అయినప్పటికీ భవనానికి నెలకు రూ.16 లక్షల అద్దె కాలేజీ ఒకచోట.. అనుబంధ ఆస్పత్రి మరోచోట అటు, ఇటు తిరగలేక విద్యార్థుల అవస్థలు ఎంసీఐ నిబంధనలు బేఖాతర్ -
చెత్తశుద్ధితో సిరుల పంట
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంతో పాటు ఇతర పట్టణాల్లోనూ చెత్త నిర్వహణ పెను సవాల్‌గా మారుతోంది. దశాబ్దాల క్రితం నాటి డంపింగ్ యార్డులు నిండిపోతున్నాయి. కొత్త డంపింగ్ యార్డుల ఏర్పాటుకు స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. ఇది ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారంగా మారుతోంది. ఈ క్రమంలోనే చెత్త నుంచి సిరులు కురిపించే నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం పలుకుతోంది. వంటింటి వ్యర్థాల నుంచి విద్యుత్తు, బయోకంపోస్ట్ ఎరువు, బయో సీఎన్జీ తయారీ కేంద్రాల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో 20 వేల టన్నుల కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తికి మార్గం సుగమం కానుందని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా 12 ప్లాంట్లు.. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చెత్తలో అత్యధిక భాగం గ్రేటర్ పరిధిలోనే ఉంటోంది. రోజుకు సుమారు 12 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఇక్కడ ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. ఇందులో 1,587 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు, 31 టన్నులు బయోమెడి కల్ వ్యర్థాలు, సుమారు 80 శాతం తడి చెత్త ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ సీబీజీ ఉత్పత్తి ప్లాంట్ నడుస్తోంది. రోజుకు 5 టన్నుల వరకు సీబీజీ ఉత్పత్తి అవుతోంది. ఇందులో రెండు టన్నులకు పైగా భాగ్యనగర్ గ్యాస్ ఏజన్సీకి విక్రయిస్తుండగా.. అక్కడి నుంచి గృహావసరాలకు సరఫరా చేస్తు న్నారు. మిగతాది నగరంలో చెత్త సేకరించే వాహనాలకు ఇంధనంగా వినియోగిస్తున్నారు. ఇది విజయ వంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 12ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన సంస్థలు సీబీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. సీబీజీతో రూ.218 కోట్ల ఆదాయం రాష్ట్రంలో కొత్తగా మరో 12 సీబీజీ యూనిట్ల ఏర్పాటుకు వివిధ సంస్థలు దరఖాస్తు చేసుకున్నా యని పీసీబీ అధికారులు పేర్కొంటున్నారు. అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా 20 వేల టన్నుల కంప్రెస్డ్ బయో గ్యాస్ అందుబాటులోకి రానుందని అంచనా. ప్రస్తుతం సీఎన్జీ కేజీ రూ.109 ఉంది. అంటే చెత్త నుంచి గ్యాస్ ఉత్పత్తితో సుమారు రూ.218 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుంది. ఇది అందుబాటులోకి వస్తే నిత్యం వాహన రంగాన్ని వేధిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా సీబీజీని వినియోగించుకోవచ్చు. ఫలితంగా మెరుగైన మైలేజీతో పాటు, నగరంలో వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంటుందని పీసీబీ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఉన్న 48 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లతో చెత్త సమస్య తీరుతుందని, కొత్త స్థలాలను వెతకాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వ అంచనా. వ్యర్థాల నుంచి బయో సీఎన్జీ తయారీకి ముందుకొస్తున్న సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరల మోతకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు రాష్ట్రంలో 12 కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్లకు అనుమతులు ఏటా 20 వేల టన్నుల సీబీజీ ఉత్పత్తి సామర్థ్యం గ్రేటర్ పరిధిలో నిత్యం 12 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి -
కార్మికుల హక్కులను కాపాడుకుందాం
షాబాద్: తుక్కుగూడలో ఆగస్టు 2న జరిగే ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు కె.రామస్వామి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఆదివారం మహాసభలకు సంబంధించి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చి న తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల జీతభత్యాలు పెంచక పోవడంతో బతుకులు అగమ్యగోచరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు లేక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాబాద్ మండలంలో నూతన పారిశ్రామిక వాడలు వస్తున్నాయని, వాటిలో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, గ్రాట్యుటీ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, మండల కార్యదర్శి పాలమాకుల శ్రీశైలం, చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అవకాశాలు ఓపెన్
● చదువు మధ్యలో ఆపేసిన వారికి వరం ● ఓపెన్ స్కూల్లో టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు ● వచ్చేనెల 15వ తేదీ వరకు గడువు కేశంపేట: అనివార్య కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన యువతీయువకులకు ఓపెన్ స్కూల్ వరంగా మారింది. ఓపెన్‌లో విద్యలో చదువు కొనసాగించి ఉన్నత శిఖరాలకు చేరినవారిలో ఎందరో ఉన్నారు. చదువుకోవాలనే ఆశ ఉన్నా పాఠశాలలకు వెళ్లలేని వారికి చేయూతనివ్వాలనే సంకల్పంతో ప్రభుత్వం ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా విద్యను అందిస్తోంది. పనులు చేసుకుంటూనే సెలవు దినాల్లో ఓపెన్ తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, కొన్ని ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందాలన్నా పదో తరగతి ఉత్తీర్ణత అవసరం. దీంతో చాలామంది ఓపెన్ విద్య వైపు ఆసక్తి కనబురుస్తున్నారు. ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరానికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ద్వారా అపరాధ రుసుంతో ఆగస్టు 29 వరకు అడ్మిషన్లు స్వీకరించనుంది. జిల్లావ్యాప్తంగా 68 కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 68 ఓపెన్ టెన్త్, ఇంటర్ అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పహాడీషరీఫ్ జెడ్పీ ఉన్నత పాఠశాల, హఫీజ్‌పేట జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎన్టీఆర్నగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉర్దూ మీడియంలో అడ్మిషన్లు పొంది చదువుకునేందుకు సైతం అవకాశం ఉంది. వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో.. వికారాబాద్ జిల్లాలో 25 ఓపెన్ టెన్త్, ఇంటర్ అధ్యయన కేంద్రాలు, మేడ్చల్ జిల్లాలో 34 సెంటర్లు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం రూ.లక్షల్లో నిధులు వెచ్చిస్తూ తోడ్పాటు అందిస్తోంది. అడ్మిషన్లు ఇలా.. ● చదువు మధ్యలో ఆపేసినవారు, గృహిణులు, వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారు ఓపెన్ విద్యలో అడ్మిషన్లు పొందొచ్చు. ● ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సమర్పించాలి. ● అడ్మిషన్లు పొందిన వారు సెలవు దినాల్లో నిర్వహించే తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. ● మరింత సమాచారం కోసం www.telanganaopenschool.org వెబ్సైట్లో సంప్రదించాలి. పదో తరగతి ప్రవేశాలకు.. ● ఆగస్టు 31 నాటికి 14 ఏళ్ల వయస్సు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతిలో 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ● గతంలో రెగ్యులర్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన వారు ఓపెన్‌లో రెండు సజ్జెక్టుల మార్కులను బదలాయించుకోవచ్చు. ● బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలు రూ.1,150 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ పురుషులు రూ.1,250 చెల్లించాలి. ● ప్రభుత్వం ఉచితంగా పాఠ్యా పుస్తకాలు అందిస్తుంది. ● అడ్మిషన్ తీసుకున్న ఐదేళ్ల వరకు పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలకు.. ● పదో తరగతి పాసై, ఒక్క ఏడాది గ్యాప్ ఉంటేనే అర్హులు. ● ఇంటర్మీడియెట్ విద్యార్థులకు 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ● బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలకు రూ.1,500 స్కూల్ ఫీజు ఉంటుంది. జనరల్ పురుషులు రూ.1,850 చెల్లించాలి. ● ప్రభుత్వం ఉచితంగా పాఠ్యాపుస్తకాలు అందిస్తుంది. అవసరమైన పత్రాలు ● ఇటీవల తీసిన పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్‌కార్డు ● ఇంటర్మీడియెట్ చదివేవారికి ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికెట్ ● పుట్టిన తేదీ సర్టిఫికెట్ . ఆగస్టు వరకు అవకాశం పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో ఆగస్టు 15వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్ పొందొచ్చు. ప్రభుత్వం నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా పాఠశాలలో చదివే విద్యార్థుల నుంచి నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల వివరాలు, మహిళా సంఘాల నుంచి నిరక్షరాస్యుల వివరాలు సేకరిస్తున్నారు. పదో తరగతి వరకు చదవలేని వారు, చదువు మధ్యలో ఆపిన వారు, చదవడం, రాయడం వచ్చిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతిలో చేర్పించేందుకు ప్రతి మండలంలో అధికారులు అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశాం. చదువు మధ్యలో ఆపివేసిన వారు, చదువుపై ఇష్టం ఉన్నవారు కొనసాగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. – సత్యనారాయణ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల కోఆర్డినేటర్ -
మౌలిక వసతులు కల్పించాలి
చేవెళ్ల: లేబర్ అడ్డాల వద్ద ఉండే కార్మికులకోసం మౌలిక వసతులు కల్పించాలని ఏఐటీయుసీ రాష్ట్ర సమితి సభ్యుడు కె.రామస్వామి అన్నారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ రంగ కార్మికుల నాలుగో మహాసభలను మండల అధ్యక్షుడు బాబురావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో రూ.కోట్ల నిధులు ఉన్నాయని, వాటిని కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలన్నారు. కార్మికుంతా లేబర్ కార్డులు తీసుకొని సంక్షేమ ఫలాలు పొందాలన్నారు. లేబర్ అడ్డాల వద్ద మొబైల్ టాయిలెట్లు, రూ.ఐదుకు భోజనం వసతులు కల్పించాలన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత కార్మిక వర్గంపై దాడులు పెరిగాయని ఆరోపించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోందని అన్నారు. వికసిత్ భారత్ అంటే ధరల మీద ధరలు పెంచడమేనా అని ప్రశ్నించారు. కార్మికులంతా సంఘటితంగా హక్కులకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, జిల్లా నాయకులు మక్బుల్, శ్రీను, ఆంజనేయులు, నర్సింలు, యాదయ్య, లక్ష్మి, లీన, లలితమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. -
జైల్ భరోను జయప్రదం చేయండి
తుర్కయంజాల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించ తలపెట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్, ఉపాధ్యక్షుడు డి.కిషన్ పిలుపునిచ్చారు. రాగన్నగూడలోని సీఐటీయూ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. గడిచిన కొన్ని రోజులుగా కార్మిక, రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, అఖిల భారత కిసాన్ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న జైల్ భరోలో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు ఎం.సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎ. భాస్కర్ రెడ్డి, లాయర్స్ యూనియన్ జిల్లా నాయకుడు కె.అరుణ్ కుమార్, నాయకులు ఐ.భాస్కర్, కె.వెంకటకృష్ణ, శ్రీనివాసులు, అండాలు తదితరులు పాల్గొన్నారు. తుక్కుగూడ: ఆషాఢ మాసం సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రజా భవన్లో ఆదివారం బోనాల పండుగ నిర్వహించారు. ఇందులో రావిర్యాల సూర్యగిరి ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ఘటం పాల్గొంది. ఈ ఘటానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు, మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీగడ కాశీనాథ్ ప్రజా భవన్లో అమ్మవారి ఘటాన్ని ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం తదితరులు పాల్గొన్నారు. షాద్‌నగర్: భారత అంతరిక్ష రంగంలో మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ అయిన విక్రమ్ –1 విజయయాత్రలో షాద్‌నగర్‌కు చెందిన యువ శాస్త్రవేత్త నిఖిల్ మద్దూరి కీలక పాత్ర పోషించారు. ఆదివారం ఆయన షాద్‌నగర్ విచ్చేసిన సందర్భంగా జాతీయ బీసీ సేన నాయకులు ఘనంగా సత్కరించారు. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన బృందంలో యువ శాస్త్రవేత్త నిఖిల్ ఉండటం ఎంతో గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సన్మానించిన వారిలో బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్, నాయకులు ప్రకాష్, ప్యాట జయ, శ్రీకాంత్, గిరిబాబు, సింగారం శ్రీనివాస్, భువనచంద్ర తదితరులు ఉన్నారు. ఆమనగల్లు: తలకొండపల్లి మండలం దేవునిపడకల్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. పోటీలను మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి ప్రారంభించారు. టోర్నమెంట్లో 32 టీమ్‌లు పాల్గొన్నాయి. మొదటి బహుమతిని దేవునిపడకల్, రెండో బహుమతిని పడకల్, మూడో బహుమతిని పాపిరెడ్డిగూడ, నాలుగో బహుమతిని ఆకుతోటపల్లి టీమ్ గెలుచుకున్నాయి. విజేతలకు సర్పంచ్ కానుగుల అనిత మల్లేశ్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో వాలీబాల్ యూత్ ప్రెసిడెంట్ పులిజాల మహేశ్, స్థానిక నాయకులు కుమ్మరి శంకర్, శంకర్ నాయక్, రవి, తిరుపతి పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
ఆమనగల్లు: సైబర్ నేరాలను నియంత్రించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని మహేశ్వరం ఏసీపీ ఎస్.జానకిరెడ్డి అన్నారు. పట్టణంలోని పోలీసు స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులు, రికార్డులు, దర్యాప్తు పురోగతి, విజిబుల్ పోలీసింగ్, స్టేషన్ నిర్వహణను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. గ్రేవ్ కేసుల ఛేదనకు ప్రాధాన్యత ఇవ్వాలని, విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
మాల్ జీపీని సందర్శించిన డీపీఓ
యాచారం: మండల పరిధిలోని మాల్ పంచాయతీని శనివారం జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్ సందర్శించారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పంచాయతీ అధికారి సాధన, మండల పంచాయతీ అధికారి శ్రీలత, పంచాయతీ రాజ్ ఏఈఈ సూర్యవంశీ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ సుభాష్‌తో కలిసి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఆత్మనిర్భర్ నేషనల్ పంచాయతీ అవార్డు కింద వచ్చిన రూ. కోటి నిధులు ఏ అభివృద్ధి పనులకు ఖర్చు చేశారో ఆరా తీశారు. పలు అభివృద్ధి పనుల నాణ్యత, కొలతలు, రికార్డుల పరిశీలన చేశారు. నిధుల ఖర్చు, రికార్డుల్లో తేడాలు ఉండడం గమనించారు. పూర్తి స్థాయి పరిశీలన కోసం రికార్డులను సీజ్ చేసి వెంట తీసుకెళ్లారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నర్సింహ షాద్‌నగర్: బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్ గ్రామానికి చెందిన విఠ్యాల నర్సింహ ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పదవీ బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎస్సీ మోర్చా కమిటీలు ఏర్పాటు చేసి, అందరినీ సంఘటితం చేస్తానని తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించండి శంకర్పల్లి: పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ సూచించారు. మోకిల పోలీస్ స్టేషన్‌ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. స్టేషన్‌కి వచ్చే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చొరవ తీసుకోవాలని అన్నారు. మాదకద్రవ్యాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. తనిఖీల సమయంలో సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు సురేశ్, సాయికృష్ణ తదితరులు ఉన్నారు. షాబాద్: చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని జిల్లా అదనపు న్యాయమూర్తి బి. శ్రీనివాసులు పేర్కొన్నారు. మండల పరిధిలోని చందనవెల్లిలో సర్పంచ్ చేవెళ్ల నవనీత స్వామి ఆధ్వర్యంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. న్యాయస్థానాలు, వాటి ద్వారా జరిగే న్యాయం గురించి వివరించారు. క్షణికావేశాలకు వెళ్లి అనర్థాలు కొని తెచ్చుకోవద్దని, కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండాలని సూచించారు. సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కె.దశరథ రామయ్య వివిధ చట్టాల గురించి క్షుణ్ణంగా వివరించారు. పలువురు న్యాయవాదులు ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పి.మల్లేష్ యాదవ్, మాజీ సర్పంచ్ నర్సింహారావు, ఉపసర్పంచ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
పోరాటం ఆపొద్దు
ఇబ్రహీంపట్నం: దండుమైలారంలో ఓ దొర కబంధహస్తాల్లో ఉన్న గ్రామకంఠం భూమిని దక్కించుకునేంత వరకు పోరాటం ఆపొద్దని ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ మహారాజ్ పిలుపునిచ్చారు. గ్రామకంఠం భూమి సాధన కోసం సర్పంచ్ ఈదులకంటి నరేష్‌గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షను శనివారం ఆయన ప్రారంభించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదెకరాల భూమి ఎవరిదో తేలేవరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అన్నారు. పది ఎకరాలు సాధిస్తే 700 మంది పేదలకు 70 గజాల చొప్పున ఇంటి స్థలం దక్కుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూస్వామి చెరలో ఉన్న భూమిని విడిపించి, పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్.రాజ్‌కమల్, రాష్ట్ర కమిటీ సభ్యుడు తులసిగారి రవీందర్, ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి,రాకేష్, పీఏసీఎస్ చైర్మన్ ఎం.అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలుపోతున్నా పట్టించుకోరా..
● చిన్నారి సహస్ర మృతిపై విద్యార్థి సంఘాల ఆందోళన ● విద్యాశాఖ, రవాణా శాఖ అధికారుల పనితీరుపై విమర్శలు కొందుర్గు: కాసులకు కక్కుర్తి పడుతున్న పలు ప్రైవేట్ పాఠశాలల యాజమన్యాలు విద్యార్థులను తరలించేందుకు కాలం చెల్లిన బస్సులను వినియోగిస్తున్నాయి. అరకొర వేతనాలు ఇస్తూ వచ్చీరాని డ్రైవర్లకు స్టీరింగ్ అప్పగిస్తున్నాయి. ఫిట్నెస్ లేని వాహనాలను నడపడంతో పాటు కనీసం హెల్పర్లను కూడా ఏర్పాటు చేయకపోవడంతో అమాయక చిన్నారులు గాయాలపాలవడంతో పాటు పలు సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతలోనే దారుణం.. కాస్లాబాద్ గ్రామానికి చెందిన మనీష, కృష్ణయ్య దంపతుల నాలుగేళ్ల కూతురు సహస్ర శుక్రవారం పాఠశాల బస్‌కింద పడి చనిపోయిన ఘటన బాధిత తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. ఇరవై రోజుల క్రితమే చిన్నారిని జిల్లేడ్చౌదరిగూడలోని అభ్యాస్ విద్యాపీఠంలో చేర్పించారు. ఉదయం సహస్రను స్కూల్‌కు పంపించిన అనంతరం తల్లిదండ్రులు పనులకు వెళ్తారు. మరో కూతురును కృష్ణయ్య తల్లి చూసుకుంటుంది. సాయంత్రం బస్సు వద్దకు వెళ్లి సహస్రను ఇంటికి తీసుకువస్తుంది. శుక్రవారం సహస్ర కోసం వేచిచూస్తుండగా చిన్నపాప నీళ్లు కావాలని ఏడ్వడంతో అప్పటివరకూ వేచి ఉన్న నాయనమ్మ అప్పుడే ఇంటికి వెళ్లింది. ఆమె తిరిగివచ్చేలోపే దారుణం జరిగిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు కారణమైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లేడ్చౌదరిగూడలో ఆందోళన నిర్వహించారు. కాలం చెల్లిన బస్సే.. అభ్యాస్ విద్యా పీఠంలో 1నుంచి 8వ తరగతి వరకు 400 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిని వివిధ గ్రామాల నుంచి తీసుకువచ్చేందుకు మూడు బస్సు లను వినియోగిస్తున్నారు. ఇందులో ఓ బస్సును ఇటీవలే కొనుగోలు చేశారని ఎంవీఐ స్వప్న తెలిపారు. మిగిలిన రెండు బస్సుల కాలపరిమితి ముగిసి ఉండవచ్చన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు కాలం చెల్లినదేనని ధ్రువీకరించారు. -
మెడికల్ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు
ఇబ్రహీంపట్నం రూరల్: మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. మంగళ్‌పల్లిలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న మహేశ్వరం మెడికల్ కళాశాలను శనివారం ఆమె తనిఖీ చేశారు. భవనంలో వసతులు, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖారున కళాశాల అగ్రిమెంట్ ముగుస్తున్నందున ఇదే కళాశాలలో కొనసాగించాలా లేక నగరంలోని వనస్థలిపురం సమీపంలో ఇతర వేరే భవనాలు చూడాలా అని చర్చించారు. సొంత భవనం నిర్మాణం జరిగే వరకు సర్దుబాటు కాక తప్పదన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ త్రివేణి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి -
తోటికూలీలతో వెళ్తుండగా..
కడ్తాల్: తోటి కూలీలతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి గుర్తు తెలియని దుండగులు మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు. మక్తమాధారం గ్రామ సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.. సీఐ సైదిరెడ్డి, బాధితురాలి కథనం ప్రకారం.. న్యామతాపూర్ గ్రామానికి చెందిన జాల మణెమ్మ తోటి మహిళా కూలీలతో కలిసి పనికోసం మక్తమాధారం వైపు వెళ్తున్నారు. ఈ సమయంలో షాద్‌నగర్ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు మాస్క్ ధరించిన దుండగులు మణెమ్మ మెడలోంచి పుస్తెల తాడును లాక్కుని పరారయ్యారు. నంబర్ లేని బైక్‌పై వచ్చిన ముసుగు దొంగల చర్యతో మిగిలిన మహిళలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అంతా అరుస్తుండగానే మక్తమాధారం వైపు పారిపోయారు. సమాచారం అందుకున్న సీఐ సైదిరెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి, వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. -
నెర్రెలు బారి.. శిథిలంగా మారి
షాద్‌నగర్‌రూరల్: పట్టణంలోని అంబేడ్కర్కానీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యనభ్యసిస్తున్నారు. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. గోడలు పూర్తిగా నాని నెర్రెలు విడుస్తున్నాయి. వర్షపు నీరు లోపలికి వస్తుండటంతో పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో గోడలు ఎప్పుడు కూలుతాయోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలలో మూత్రశాలల నిర్వహణ సక్రమంగా లేక నిరుపయోగంగా మారాయి. పాఠశాల పక్కనే ఉన్న ప్రభుత్వ వసతిగృహం శిథిలావస్థకు చేరడంతో మూతపడింది. చెట్లు పెరిగి, చెత్తచెదారం చేరడంతో పాఠశాల ఆవరణలోకి విషపురుగులు వస్తున్నాయి. పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. -
సోషల్ మీడియాపై నియంత్రణ అవసరం
కొత్తూరు: సోషల్‌మీడియా వినియోగంపై విద్యార్థులు నియంత్రణ పాటించాలని షాద్‌నగర్ డీసీపీ శిరీష సూచించారు. పట్టణంలోని కేజీబీవీ హాస్టల్, కొత్తూరు పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తులో చదువుకున్న వారికే అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని గ్రహించి చదువుపై దృష్టి సారించాలని అన్నారు. క్రమ శిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియా అతి వినియోగంతో చెడు వ్యసనాలకు బానిసలుగా మారే అవకాశం ఉందన్నారు. మాదకద్రవ్యాల వినియోగంతో వచ్చే సమస్యలను వివరించారు. సైబర్ నేరాలు, వ్యక్తిగత భద్రత, ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం స్టేషన్లో ఫిర్యాదుల స్వీకరణ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. కేసుల ఛేదనలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐ నర్సయ్య, కేజీబీవీ ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
అ= అధ్వానం ఆ=ఆగమాగం
సమస్యల ఏలుబడి! కందుకూరు: కందుకూరు బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో చేపట్టిన తరగతి గదుల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. సరిపడా గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలో మొత్తం 110 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న భవనంలో ఆరు గదులు ఉండగా అందులో ఆఫీస్, స్టాఫ్, ల్యాబ్ కోసం ఓక్కో గదిని కేటాయించారు. మిగతా మూడు గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో మన ఊరు –మన బడి పథకం కింద రెండు గదుల నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరయ్యాయి. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పిల్లర్ల వరకే నిర్మాణం పూర్తి చేయగా, ఆ లోపు ప్రభుత్వం మారడంతో నిధులు విడుదల కాక వదిలేశాడు. దాని పక్కనే అంత కంటే ముందే బాలుర, బాలికల పాఠశాలలకు కలిపి సైన్స్ ల్యాబ్ నిర్మాణం పక్కపక్కనే చేపట్టారు. అది కూడా అసంపూర్తిగా నిలిచిపోయింది. పెచ్చులూడిన భవనం పైకప్పు -
అంతిమ నివాళి
షాబాద్: ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిల తల్లి పట్నం రుక్కమ్మ అంత్యక్రియలను ఆమె స్వగ్రామమైన గొల్లూరుగూడలో శనివారం పూర్తిచేశారు. మాజీ మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, చంద్రశేఖర్, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఏవీఎన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, వీర్లపల్లి శంకర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్, కేఎస్ రత్నం, జైపాల్‌యాదవ్, కేఎల్లార్, ప్రతాప్‌రెడ్డి, అల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు నాగేందర్‌గౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, నాయకులు కార్తీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి తదితరులు రుక్కమ్మ మృతదేహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
వరండాలోనే విద్యా బోధన
ఇబ్రహీంపట్నం: పాత బస్టాండ్ సమీపంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదు గదుల్లో ఒకటి ప్రధానోపాధ్యాయుడి కార్యాలయ గది, మరొకటి సైన్స్ ల్యాబ్‌కు ఉపయోగిస్తున్నారు. 200 మంది విద్యార్థులున్న పాఠశాలలో ఎనిమిది తరగతులకు మూడు గదులు మాత్రమే ఉన్నాయి. వరండాలో రెండు క్లాసులు, దాత సహకారంతో వేసిన రేకుల షెడ్లో మరో రెండు నిర్వహిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆట స్థలం లేక విద్యార్థులు క్రీడలకు దూరం అవుతున్నారు. శిథిలావస్థకు చేరిన మరుగుదొడ్లు, వంటగది అవసరానికి సరిపడడం లేదు. ఇళ్ల నుంచే విద్యార్థులు తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఆరు, ఏడు తరగతులకు నలుగురు టీచర్లు కావాల్సి ఉండగా ఇద్దరే పనిచేస్తున్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గదుల కొరత ఉంది. 120 మంది విద్యార్థులున్న పాఠశాలలో ఆరుబయట విద్యాబోధన, మధ్యాహ్న భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. వంట గదినే ఒక పార్టుగా చేసి తరగతి గది నిర్వహిస్తున్నారు. సౌకర్యాలు లేక అవస్థలు విద్యార్థులు కూర్చునేందుకు సరిపడా గదులు లేవు. ఆటలాడేందుకు స్థలం లేదు. అవసరాలకు తగ్గట్టు మూత్రాశాలలు, మరుగుదొడ్లు లేవు. విద్యాబోధన బాగున్నప్పటికీ సరైస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నాం. – జె.తరుణి, ఐదో తరగతి విద్యార్థిని -
కబ్జా భూమిని రీ సర్వే చేయించండి
యాచారం: సర్వేనంబర్ 127లో అసైన్డ్ రైతుల కబ్జా భూమిని రీ సర్వే చేయించాలని, కబ్జాలోని రైతులకు పరిహారం చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మొండిగౌరెల్లి రైతులు శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సర్పంచ్ కోలన్ రమాదేవి ఆధ్వర్యంలో 127 సర్వేనంబర్తోపాటు 19, 68 సర్వేనంబర్ల రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పట్టాదారు, పాసుపుస్తకాల్లో కంటే తక్కువ ఎకరాలకు పరిహారం అందజేసేలా జాబితా ప్రకటించారని పేర్కొన్నారు. రీ సర్వే చేయించాలని తహసిల్దార్‌ను కోరితే సమాధానం ఇవ్వకపోగా వెళ్లిపొండని దురుసుగా మాట్లాడారని మండిపడ్డారు. కలెక్టర్ నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. వ్యక్తిగత పని మీద వచ్చిన రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి రైతులతో మాట్లాడినా వినిపించుకోలేదు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు కల్పించుకుని వారిని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయానికి తీసుకెళ్లారు. సర్వేనంబర్ 127ను రీ సర్వే చేయిస్తానని, కబ్జా రైతులకు పరిహారం చెల్లింపై త్వరలో కలెక్టర్ నారాయణరెడ్డితో సమావేశం ఏర్పాటు చేయిస్తానని ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి వెళ్లిపోయారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా -
రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకే రోజు జిల్లాలోని మూడు చోట్ల పంజా విసిరారు. కేశంపేట మండలం సంతాపూర్, కడ్తాల్ మండలం మక్తమాధారం సమీపంలో ఇద్దరు మహిళల మెడలోంచి బంగారు పుస్తెల తాళ్లు లాక్కెళ్లారు. కందుకూరు మండలం సాయిరెడ్డిగూడెంలో బాధిత మహిళ అప్రమత్తతతో చోరీ తప్పింది. కేశంపేట: మనవరాలితో కలిసి రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లారు. ఈ ఘటన శనివారం ఉదయం సంతాపూర్‌లో కలకలం రేపింది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సోమరాజు బాలమ్మ కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. ఇటీవల పనులకు వెళ్లిన డబ్బులు తెచ్చుకునేందుకు తన మనవరాలు భవాని (15)తో కలిసి ఇంటి నుంచి గ్రామంలోకి వెళ్తుండగా.. శ్మశానవాటిక సమీపంలోకి చేరుకోగానే నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు బాలమ్మ ముందు వాహనం నిలిపారు. వెనక కూర్చున్న వ్యక్తి కొల్లాపూర్ ఎలా వెళ్లాలి..? అని అడుగుతూనే.. రెప్పపాటులో బాలమ్మ మెడలోని బంగారు పుస్తెలతాడును లాగేశాడు. ఊహించని ఈపరిణామంతో బాధితురాలితో పాటు ఆమె మనవరాలు పెద్దగా అరవడంతో దుండగులు మక్తమాధారం వైపు పారిపోయారు. నిందితులిద్దరూ నలుపురంగు మాస్కులు ధరించారని, వీరి వయస్సు సుమారు 40 సంవత్సరాల లోపు ఉంటుందని బాలమ్మ తెలిపారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ రాజ్‌కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ లక్ష్మీనారాయణ గ్రామానికి వెళ్లి, బాధితురాలితో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. సాయిరెడ్డిగూడెంలో.. యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ యత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కందుకూరు మండల పరిధిలోని సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిందం మంజుల శనివారం ఉదయం కాలినడకన ఇంటి నుంచి పొలానికి వెళ్తోంది. మార్గమధ్యలో మోటార్ సైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి మంజుల మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును అపహరించడానికి ప్రయత్నించగా, వెంటనే అప్రమత్తమైన మంజుల గట్టిగా కేకలు వేసింది. ఈ సమయంలో రోడ్డు పైనుంచి ఆటో రావడం, సమీపంలోని రైతులు రావడాన్ని గమనించిన దుండగుడు ముచ్చర్ల వైపు పారిపోయాడు. ఈ ఘటనలతో గ్రామీణ మహిళలు, పొలాల వద్దకు వెళ్తున్న కూలీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రెండు చోట్ల మహిళల మెడలోంచి పుస్తెల తాళ్ల చోరీ మరోచోట దోపిడీకి యత్నించి విఫలం రోడ్డుపై వెళ్తున్న మహిళలే లక్ష్యంగా దాడులు ఆందోళనలో గ్రామీణ ప్రజలు -
పోరాటం ఆపొద్దు గ్రామకంఠం భూమిని దక్కించుకునే దాకా పోరాటం ఆపొద్దని ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ పిలుపునిచ్చారు.
ఇబ్రహీంపట్నం రూరల్: మంగళ్‌పల్లిలోని ప్రాథమిక పాఠశాలలో 78 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు మాత్రమే రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉండగా, ఇటీవలే మరో ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్ మీద పంపించారు. అటెండర్, స్వీపర్ అసలే లేరు. నాలుగు సబ్జెక్టులకు ముగ్గురు టీచర్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. తరగతి గదులు మూడు మాత్రమే ఉన్నాయి. భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులూడి పడిపోతున్నాయి. విద్యార్థులకు ఆరుబయటే పాఠాలు బోధించాల్సిన దుస్థితి నెలకొంది. కిచెన్ షెడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరి వర్షం పడితే కురుస్తోంది. చేవెళ్ల: చేవెళ్లలోని ప్రాథమిక బాలికల పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులులేవు. ఐదు గదుల్లో ఒకటి ఆఫీస్ రూమ్ మిగిలిన నాలుగింటిలో నాలుగు తరగతుల గదులకు పోగా ప్రీప్రైమరీ, ఒకటో తరగతులకు గదులు లేక వరండాలోనే పాఠాలు చెబుతున్నారు. సరిపడా గదులు లేక ఆఫీస్ రూమ్‌నే స్టోర్‌రూమ్‌గా వాడుతున్నారు. విద్యార్థులకోసం వచ్చిన కంప్యూటర్లు ఆఫీస్ రూమ్‌లోనే పడి ఉన్నాయి. చేవెళ్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరి తరగతి గదులు పెచ్చులూడిపోతున్నాయి. ప్రమాదకరంగా మారిన భవనం ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడుతున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పాములు తిరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.కొత్తూరు: మండల కేంద్రంలోని ఎస్సీకాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 160 మంది విద్యార్థులు చదువుతుండగా మూడు గదులు మాత్రమే ఉన్నాయి. ఇద్దరు రెగ్యులర్ ఉపాధ్యాయులు, ఇద్దరు డిప్యూటేషన్‌పై ఉన్నారు. పాఠశాల పక్కనే రైలు పట్టాలు ఉండడంతో చుట్టు ప్రహరీ లేక ప్రమాదభరితంగా మారింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేవు. ఖాజీగూడతండాలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఒకే తరగతి గదిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 17 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. రెండు చోట్ల క్రీడామైదానాలు లేక ఆటలకు దూరంగా ఉంటున్నారు. -
బడి.. పెచ్చులూడి
కడ్తాల్: మండల పరిధిలోని రావిచేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనంలో 6 నుంచి 10 తరగతులు కొనసాగుతు న్నాయి. మొత్తం 121 మంది వరకు బాలబాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. 6,7 తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. పైకప్పు రేకులకు రంధ్రాలు పడి వర్షానికి ఉరుస్తోంది. ఎప్పుడు ఏం అవుతుందోనని విద్యార్థులు భయంగా గడుపుతున్నారు. ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన భవనం సైతం పెచ్చూలూడి పడుతోంది. పలు తరగతి గదులకు కిటికీలు లేకపోవడంతో వర్షం వస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాఠశాలలో గతంలో నిర్మించిన మూత్రశాలలు అసంపూర్తిగా వదిలివేయడంతో ఆరుబయటకు వెళ్తున్నారు. మధ్యాహ్న భోజనం వండేందుకు పాఠశాల ఆవరణలో నాలుగు రేకులతో తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేశారు. -
భవనం.. శిథిలం
ఆమనగల్లు: పట్టణంలోని బస్టాండ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 91 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 6 నుంచి 10 వరకు తరగతులు కొనసాగుతుండగా 9 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన భవనంలో తరగతులు నిర్వహిస్తుండడం.. సౌకర్యాలు లేకపోవడంతో రోజురోజుకూ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. వర్షాకాలంలో పైకప్పు లీకేజీ అవుతూ తరగతి గదుల్లోకి నీరు చేరుతోంది. భవనం శిథిలం కావడంతో పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. రెండేళ్లక్రితం పైకప్పు పెచ్చులూడి ఓ విద్యార్థి గాయపడ్డాడు. దాతల సహకారంతో పాఠశాల ఆవరణలో రేకుల షెడ్డు నిర్మించి కొన్ని తరగతులు నిర్వహిస్తున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉన్నా సరైన నిర్వహణ లేదు. రోజు విడిచి రోజు నల్లా రావడంతో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. వర్షం వస్తే గదుల్లోకి నీరు ప్రస్తుత పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పైకప్పు పెచ్చులూడుతున్నాయి. వర్షం వస్తే గదుల్లోకి నీరు చేరుతోంది. నూతన భవనం నిర్మించాలి. తాగునీటి సమస్యను పరిష్కరించాలి. – వైష్ణవి, పదో తరగతి విద్యార్థిని -
సభా నిర్వహణ దక్కలేదనే ఆరోపణలు
షాద్‌నగర్‌రూరల్: అమరవీరుల స్తూపం ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన సభలో నిర్వహణ దక్కలేదనే అక్కసుతో ఆరోపణలు చేయడం సరికాదని టీజేఏసీ చైర్మన్ జనార్దన్ అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన టీజేఏసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి స్మారకార్థం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో స్తూపాన్ని నిర్మించి ఆవిష్కరణ చేశారు. దీనికి జేఏసీ నాయకులు రేయింబవళ్లు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. ఆవిష్కరణ సభా నిర్వహణ ఇవ్వలేదనే అక్కసుతో టీచర్ టీజేఏసీ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి టీజేఏసీ చైర్మన్‌పై సమైక్యవాది అని ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నానరు. ఉద్యమ సమయంలో టీజేఏసీ సన్నాహాక సమావేశాన్ని ప్రస్తుత టీజేఏసీ చైర్మన్ ఇంట్లోనే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. శ్రీధర్‌రెడ్డి ఆరోపణలను టీజేఏసీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో టీజేఏసీ నాయకులు వెంకటయ్య, శివారెడ్డి, నర్సింలుగౌడ్, కృష్ణయ్య, సత్యం, లక్ష్మీదేవమ్మ, కృష్ణ, బాలయ్య, రాములు, అర్జున్‌కుమార్, తావుర్యా, బాల్‌రాజ్, తిరుమలయ్య, రాము, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.


