పోస్టర్లు అతికిస్తే ఓడిపోతారట
షాద్‌నగర్: ఫరూఖ్‌నగర్‌లో పాత జాతీయ రహదారికి ఆనుకొని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి 330 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని వనపర్తి సంస్థాన రాజు సవై పెద్ద వెంకట్‌రెడ్డి తన తల్లి పెద్ద జానమ్మ కోరిక మేరకు నిర్మించారు. అయితే ఇక్కడ పెద్ద రథశాల ఉంది. దేవాలయానికి ఎదురుగా ఖాళీ స్థలం ఉండటంతో దైవసన్నిధిలో ఉంటుందనే ఉద్దేశంతో గతంలో వివిధ పార్టీల నాయకులు ఇక్కడ సమావేశాలు నిర్వహించేవారు. అయితే పాత జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ రథశాలపై రాతలు రాయాలన్నా, పోస్టర్టు అతికించాలన్నా భయపడుతారు. అలా చేస్తే ఎన్నికల్లో ఓడిపోతారనే సెంటిమెంటు ఉంది. అందుకే ఈ రథశాల గోడలపై ఎవరు రాతలు రాయరు, పోస్టర్లు కూడా అతికించరు. షాద్‌నగర్‌లో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఈ రథశాలను అందరు చర్చించుకుంటారు.


