అంతర్జాతీయ క్రికెట్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ క్రికెట్‌ పోటీలకు ఎంపిక

Apr 3 2026 9:55 AM | Updated on Apr 3 2026 9:55 AM

కేశంపేట: మండల ప రిధిలోని కొండారెడ్డిపల్లికి చెందిన కర్నెకోట అరుణ్‌తేజ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరఫున అండర్‌–19 విభాగంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీలకు ఎంపికయ్యాడు. నేపాల్‌లో మే 27 నుంచి జూన్‌ 3 వరకు జరిగే పోటీల్లో అల్‌రౌండర్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం బెంగళూర్‌లో స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతున్నాడు. ఒంగోలుకు చెందిన రంజీ ప్లేయర్‌ హఫీజ్‌ సహకారంతో క్రికెట్‌లో శిక్షణ పొందుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ పోటీలకు ఎంపికై న అరుణ్‌తేజ్‌ను పలువురు అభినందించారు.

అశ్వ వాహనంపై ఊరేగిన బాలాజీ

మొయినాబాద్‌: బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం చిలుకూరు బాలాజీ అశ్వ వాహనంపై ఊరేగారు. స్వామివారిని అశ్వ వాహనంపై ఆసీనులను చేసి చిలుకూరు గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి మహాభిషేకం, ఆస్థాన సేవ, దోప్‌సేవ, పుష్పాంజలి సేవలు అందించారు. ఉత్సవాల్లో కన్వీనర్‌ గోపాలకృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్‌, తిరుమల కిరణాచారి, పరావస్తు రామాచారి, నరసింహన్‌ కన్నయ్య, కిట్టు, మురళి, సురేష్‌, నాగరాజు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గరుగు రాజు, కౌన్సిలర్లు శ్రీలత రాంచందర్‌, జగపతి, అనసూయ, శిరీష తదితరులు పాల్గొన్నారు.

అవినీతి అధికారులపై సస్పెన్షన్‌ వేటు

బండగ్‌పేట సర్కిల్‌లో ఒకేసారి పదిమందిపై చర్యలు

బడంగ్‌పేట్‌: ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌, ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. బడంగ్‌పేట సర్కిల్‌ అధికారుల వ్యవహారానికి సంబంధించిన నివేదికను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌కు అందించారు. ఈ మేరకు ఆయన సదరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. సస్పెండ్‌ అయినవారిలో సర్కిల్‌–16 డీసీ పి.సరస్వతి, ఏఎంసీ జి.శ్రీధర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జి.రఘు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు ఎ.యాదయ్య, వెంకన్న, జ్యోతిరెడ్డి, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పి.వినీల్‌ కుమార్‌గౌడ్‌, ఏఎంసీ డి.నాగేశ్వర్‌ రావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వై.యాదగిరి, ప్రీ ఆడిట్‌ ఆఫీసర్‌ ఎన్‌.వెంకట్‌ ఉన్నారు. పనులు చేయకుండానే చేసినట్లు చూపి, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు చర్యలు తీసుకున్నారు. డీసీ సరస్వతి స్థానంలో అత్తాపూర్‌ సర్కిల్‌–20లో డీసీగా పనిచేస్తున్న సమ్మయ్యను నియమిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇళ్ల మధ్యే కల్తీ నెయ్యి

కుత్బుల్లాపూర్‌: జనవాసాల మధ్య నడుపుతున్న కల్తీ నెయ్యి తయారీ పరిశ్రమలను తరలించాలని కోరుతూ సుభాష్‌నగర్‌ ఫేజ్‌–1 వాసులు గురువారం కొంపల్లి సర్కిల్‌ ఉప కమిషనర్‌ కృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. సుభాష్‌నగర్‌లోని ఓ ఇంట్లో అనధికారికంగా కొందరు వ్యక్తులు కల్తీ నెయ్యి తయారీ యూనిట్‌ను నడుపుతున్నారని, నాణ్యత లేని పదార్థాలు, వ్యర్ధాలను వినియోగిస్తున్నారన్నారు. తీవ్ర దుర్వాసనలతో ఇబ్బందులు పడుతున్నామని, సదరు పరిశ్రమలో తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాలని వినతిలో కోరారు. కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement