రాజస్థాన్‌లోని సింధారి జిల్లాలోని కర్దాలి గ్రామంలో... యాభై ఏళ్ల నాటి పూరి గుడిసె పునాది బలహీన పడడంతో కూలిపోయే ప్రమాదంలో పడింది. ఈ గుడిసె పూర్ణారామ్ అనే వ్యక్తి తాతది. పూర్ణరామ్‌కు అది పాత గుడిసె కాదు.
ఒక అమూల్యమైన జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్ని కాపాడుకోవాలనుకున్నాడు పూర్ణారామ్. హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో గుడిసెను వేరే చోటికి తరలించాడు. చెదల వల్ల గుడిసె పునాది దెబ్బతిందని, అందుకే దాన్ని తరలించాల్సి వచ్చిందని పూర్ణారామ్ వివరించాడు. గుడిసె పై కప్పు మరమ్మతు చేస్తే అది 30 నుండి 40 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుందని అతను భావిస్తున్నాడు.
‘లక్ష రూపాయల విలువ కూడా లేని ఈ పాత గుడిసె కోసం ఇంత శ్రమ ఎందుకు?’ అనే ప్రశ్నకు పూర్ణారామ్ ఇచ్చిన జవాబు...‘నా దృష్టిలో అది కోట్లాది రూపాయల కంటే విలువైన గుడిసె. ఈ గుడిసె చుట్టూ ఎన్నో విలువైన జ్ఞాపకాలు ఉన్నాయి’.
(చదవండి: వివాహిత మహిళలు గూగుల్‌లో ఏం సర్చ్ చేస్తున్నారో తెలుసా..!)


