వివాహిత మహిళలు గూగుల్‌లో ఏం సర్చ్‌ చేస్తున్నారో తెలుసా..! | women after marriage What they search on Google | Sakshi
Sakshi News home page

వివాహిత మహిళలు గూగుల్‌లో ఏం సర్చ్‌ చేస్తున్నారో తెలుసా..!

Apr 3 2026 1:36 PM | Updated on Apr 3 2026 2:33 PM

women after marriage What they search on Google

పెళ్లికి ముందు వరకు అమ్మాయిల లైఫ్‌ చదువులు, కాలేజ్‌ లైఫ్‌ తదనంతర ఉద్యోగం వంటివాటితో హాయిగా తుళ్లుతూ సాగిపోతుంది జీవితం. పెద్దగా ట్రబుల్స్‌ ఏమి ఉండవు. తల్లిదండ్రుల వద్ద గారాభంగా, ముద్దుగా ఏ చీకు చింత లేకుండా గడిపేస్తారు. పెళ్లి అనే రెండే అక్షరాల బంధంలోకి ఎప్పుడైతే అడుగుపెడతారో అప్పుడే బాధ్యతలు, బరువు ఒకేసారి మీద పడినట్లుగా ఉంటుంది జీవితం. 

ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి అనే వాటిపై అటెన్షన్‌ ఎక్కువై ఒకటే ఆత్రం, ఆందోళన వెంటాడుతూ ఉంటాయి. దాంతో పెళ్లి తర్వాత అమ్మాయిలంతా గూగుల్‌ని అవే ఎక్కువ అడుగుతున్నారట. వాళ్లంతా చిటికెలో దొరికే పరిష్కారాల కోసం గూగుల్‌ని అడుగుతున్న విచిత్రమైన ప్రశ్నలేంటంటే..

1. చాలా మంది మహిళలు వివాహం తర్వాత తమ భర్తలను సంతోషంగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. పర్యవసానంగా, వారు తమ భర్త ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోవడం ఎలా?, ఏం చేయకూడదు, ఎలా తీసుకోకూడదు వంటి వాటిని సర్చ్‌ చేస్తున్నారట. ముఖ్యంగా తమ భర్త సంతోషం కోసం రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారట.

2. వివాహిత మహిళలల్లో సర్వసాధారణంగా కనిపించే ఒక ప్రశ్న, తమ భర్త మనసును గెలుచుకోవడం ఎలా అనేది. భర్త సంతోషంగా ఉంటేనే కదా మనల్ని సంతోషంగా ఉంచుతాడనే నమ్మకంతో దానికోసం చిట్కాల కోసం వెతుకుతారట. .

3. తమ భర్తలను విధేయులుగా ఎలా మార్చుకోవాలి అనేదాని గురించి కూడా ఎక్కవగా సర్చ్‌ చేస్తున్నారట. కొంతమంది మహిళలు తమ భర్తలు తమ మాట వినడాన్ని ఇష్టపడతారు. అందుకే దీనిపై గూగుల్‌ని ఎక్కువగా సలహాలు కోరుతున్నారట.

4 కొత్తగా పెళ్లైన వారిలో పిల్లలను కనడానికి సరైన సమయం గురించిన ప్రశ్నలు కూడా వస్తుండటం విశేషం. ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకత్వం లేకపోవడంతో, చాలా మంది మహిళలు జాగ్రత్తగా, ప్రణాళికతో మాతృత్వాన్ని స్వీకరించాలనే ఉద్దేశ్యంతో గూగుల్‌ని ఆశ్రయిస్తున్నారట.

5. కొత్త కుటుంబంలో ఎలా సర్దుకుపోవాలనే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. దాంతో చాలామంది కొత్త వధువులు కొత్త ఇంట్లో తమ సంబంధాలను ఎలా నిర్వహించుకోవాలిని కుటుంబసభ్యులతో సముచితంగా ఎలా మెలగాలి వంటి సలహాలు కూడా అడుగుతున్నారట.

6. వివాహంతో వచ్చే బాధ్యతలు అధిక భారాన్ని మోపవచ్చు. మహిళలు తరచుగా ఈ కొత్త విధులను నిర్వహించడానికి వ్యూహాల కోసం వెతుకుతున్నారట. ఎందుకంటే అప్పటి వరకు తల్లిదండ్రుల వద్ద హాయిగా సాగిన జీవితాల్లోకి ఒక్కసారిగా వచ్చిపడిన బాధ్యత భారం ఎలా నిర్వహించాలనే ఆందోళన ఎక్కువగా ఉంటుందట మహిళల్లో. 

7. ​కొందరైతే ఫ్యామిలీ లైప్‌, వృత్తి జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలనే దానిపై ఆందోళన చెందుతున్నారట. వృత్తిపరమైన ఆశయాలకు కుటుంబ జీవితం ఆటంకంగా మారకూడదనే ఆందోళన నేపథ్యంలో దీనిపై ఎక్కువగా గూగుల్‌లో సర్చ్‌ చేస్తున్నారట. చెప్పాలంటే మహిళలు సమర్థవంతమైన సమయ నిర్వహణతో రెండింటిని ఎలా బ్యాలెన్స్‌ చెయ్యొచ్చు అని సలహాలు అడుగుతుండటం విశేషం. 

(చదవండి: జస్ట్‌ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!)
 

Advertisement
 
Advertisement
Advertisement