బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswan) మరో గుడ్‌న్యూస్ చెప్పాడు. ఇటీవలే ప్రేమ- పెళ్లి అంటూ ఓ శుభవార్త చెప్పిన అతడు తాజాగా కొత్తింట్లో అడుగుపెట్టాడు. కాబోయే భార్య వైష్ణవితో కలిసి గృహప్రవేశం (New House Ceremony) చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
షణ్ముఖ్ - వైష్ణవి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. తర్వాత ఏప్రిల్‌లో పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటోలు పంచుకున్నారు. అందులో పెళ్లి మండపం, తాళి కట్టే ఫోటోలు మాత్రం లేవు. దీంతో ఇది ఫోటోషూటా? పెళ్లా? అన్నది సస్పెన్స్‌గా మారింది.


