Shanmukh Jaswanth
-
షణ్ముఖ్ జస్వంత్ ' లీల వినోదం' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
క్షమించాలని కన్నీళ్లు పెట్టుకున్న షణ్ముఖ్ జస్వంత్
షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేరు సోషల్ మీడియాలో ఒకప్పుడు సెన్సేషన్. పలు వెబ్ సిరీస్‌లతో మిలియన్ల కొద్ది వ్యూస్, అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్‌తో బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇచ్చిన జస్వంత్ విన్నర్ రేసు నుంచి తీవ్రమైన నెగటివిటీ తెచ్చుకున్నాడు. హోస్ నుంచి బయటకు వచ్చాక కూడా వివాదాలు.. కేసులు.. గొడవలతో పాటు అరెస్ట్‌లు వంటి ఘటనలు తన జీవితంలో జరిగాయి. అయితే, షణ్ముఖ్ జస్వంత్ కుంగిపోకుండా తన ప్రయాణం మళ్లీ మొదలుపెట్టాడు. జీవిత పోరాటంలో తాను ఎన్నో నేర్చుకున్నానని తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పలు విషయాలు పంచుకున్నాడు.సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‌లతో యూట్యూబ్‌లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్నాడు జస్వంత్. ఇప్పుడు ఓటీటీ కోసం ' లీల వినోదం' చిత్రంలో ఆయన నటించారు. డిసెంబర్ 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఘటనలను మీడియాతో పంచుకున్నాడు.స్టేజీపైనే షణ్ముఖ్ జస్వంత్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా మాట్లాడారు. నా జర్నీ అంతా మొదట వైజాగ్‌లోనే ప్రారంభమైంది. ఆ సమయంలో నా కెరీర్ ఎటు పోతుందో తెలియని అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను. అప్పుడు హైదరబాద్‌కు వచ్చి కొన్ని కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేసుకున్నాను. మంచిగానే సక్సెస్ అయ్యాను. కానీ, ఎవరో చేసిన తప్పుకు నన్ను బ్లేమ్ చేస్తూ అనేక ఆరోపణలు చేశారు. ఆ చెడ్డ పేరు నాకు మాత్రమే ఆపాదించకుండా.. ఇందులోకి నా కుటుంబాన్ని కూడా లాగారు. ఫ్యామిలీకి అండగా ఉండాలని ప్రతి కుమారుడు అనుకుంటాడు. అయితే, నా వల్లే కుటుంబానికి వారికి చెడ్డపేరు వచ్చింది. అమ్మా,నాన్నా నన్ను క్షమించండి. నా వల్లే మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అమవాస్య చూసినోడు తప్పకుండా పౌర్ణమి చూస్తాడు. నా జీవితంలో ఇప్పుడు అదే జరుగుతుంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు ' లీల వినోదం' ప్రాజెక్ట్ వచ్చింది. మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు చాలా మంది మన చుట్టూ ఉంటారు. కానీ, ఒక్కసారి కింద పడినప్పుడు మనతో ఎవరుంటారో వాళ్లే నిజమైన మిత్రులు. నా అనుభవంతో ఈ విషయాన్ని తెలుసుకున్నాను.' అని జస్వత్ పేర్కొన్నాడు.షణ్ముఖ్ జస్వంత్ జీవితంలో వివాదాలుబిగ్ బాస్‌లో టైటిల్ విన్నర్ అవుతాడని షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు అనుకున్నారు. అయితే, హౌజ్‌లో సిరి-షణ్ముఖ్‌ల తీరుపై ఎక్కువ విమర్శలు వచ్చాయి. ఆపై కొద్దిరోజులకే గంజాయి కేసులో అరెస్ట్ కావడం. వెనువెంటనే ఓ అమ్మాయిని మోసం చేసిన కేసులో షణ్ముఖ్ అన్నయ్య సంపత్ పట్టుకోవడానికి అతని ఫ్లాట్‌కి పోలీసులు వెళ్లడం. అక్కడ షణ్ముఖ్ గదిలో గంజాయి దొరికందని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో షణ్ముఖ్ కెరీర్ క్లోజ్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు పడిలేచిన కెరటంలా లీల వినోదం అనే సినిమాతో ఆయన మరోసారి తెరపైకి వస్తున్నాడు. -
కారు కొన్న 'బిగ్‌బాస్' దీప్తి సునయన.. రేటు ఎంతో తెలుసా?
బిగ్ బాస్ షోతో చాలామంది ఫేమ్ తెచ్చుకున్నారు. వాళ్లలో ఒకరు దీప్తి సునయన. స్వతహాగా యూట్యూబర్ అయిన ఈమె.. షన్నుతో ప్రేమ వ్యవహారంతో మరింత పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం కవర్ సాంగ్స్, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉన్న దీప్తి.. కొత్త కారు కొనేసింది. అందరిలా లగ్జరీ కార్లు కాకుండా కాస్త డిఫరెంట్ కారు తీసుకుంది. మరి ఈ కారు రేటు ఎంతో తెలుసా? (ఇదీ చదవండి: వాళ్ల కోసం రూ.35 లక్షలు విరాళమిచ్చిన ప్రభాస్.. ఎందుకంటే?) డబ్ స్మాష్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునయన.. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతానికైతే యూట్యూబ్‌లో వెబ్ సిరీసులు చేస్తోంది. అప్పట్లో బిగ్‌బాస్ రెండో షోలోనూ పాల్గొని మంచి ఫేమ్ సంపాదించింది. ఇక యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ఈమె ప్రేమ-బ్రేకప్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా దీప్తి సునయత తన తొలి కారుని కొనుగోలు చేసింది. టయోటా హై లక్స్ అనే కారుని కొనేసింది. ఇందులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వరకు కూర్చోవచ్చు. అలానే వెనక లగేజీ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. నార్మల్ కారు కాకుండా ఇలా డిఫరెంట్ కారు ఎందుకు తీసుకుందా అని నెటిజన్స్ అనుకుంటున్నారు. మార్కెట్లో ఈ కారు ధర రూ.30-37 లక్షల వరకు ఉంది. (ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్) -
వాడికి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు
-
సెలబ్రిటీలుగా ఫేమస్ అయితే మారిపోతారా
-
తన సమస్యలు మాతో చెప్పేవాడే కాదు: షణ్ముఖ్ పేరెంట్స్
బిగ్‌బాస్ షో ముందు వరకు షణ్ముఖ్ జశ్వంత్‌కు ఫుల్ క్రేజ్ ఉండేది. వెబ్‌సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలతో జనాలను ఆకట్టుకున్నాడు. దీప్తి సునయనతో లవ్ ట్రాక్ నడిపాడు. కానీ బిగ్‌బాస్ తర్వాత వ్యవహారం బెడిసికొట్టింది. సిరి హన్మంత్‌తో క్లోజ్‌గా ఉండటంతో షణ్నుపై నెగెటివిటీ పెరిగింది. తర్వాత దీప్తితో బ్రేకప్ కూడా జరిగింది. బిగ్‌బాస్ గేమ్‌లో బలిపశువు అయ్యాడు. అనంతరం ర్యాష్ డ్రైవింగ్‌తో వార్తల్లోకెక్కాడు. ఈసారి ఏకంగా గంజాయి తాగుతూ పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. షణ్ను కన్నా నేనే ఎక్కువగా బాధపడతా.. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావ్.. అంటూ షణ్నును నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే అతడిపై ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా పేరెంట్స్, అతడి అభిమానులు ఎప్పుడూ అండగా నిలబడేవారు. ఈ ట్రోలింగ్ వల్ల షణ్ను కంటే ఆమె అమ్మ ఎక్కువ బాధపడేది. గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నా కుమారుడిని ఎందుకంతలా విమర్శిస్తున్నారని బాధేసేది. షణ్ను కన్నా నేనే ఎక్కువగా బాధపడతాను. కానీ అతడి ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తారు. అది సంతోషంగా అనిపించేది. నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు షణ్ను దగ్గరుండి చూసుకున్నాడు. నా భర్త, పిల్లల ప్రేమ వల్లే అనారోగ్యం నుంచి బయటపడ్డాను. సక్సెస్, ఫెయిల్యూర్ రెండూ చూశాడు షణ్ను చాలా తెలివైనవాడు. తను ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తాడు. మా ఇష్టప్రకారం పిల్లలు విద్య పూర్తి చేసి వారికి నచ్చిన కెరీర్ ఎంచుకున్నారు. షణ్ను చాలా ఇబ్బందులుపడి గొప్ప స్థాయికి ఎదిగాడు. సక్సెస్, ఫెయిల్యూర్ రెండూ చూశాడు. తనకు ఎలాంటి సమస్యలు ఎదురైనా మాకు చెప్పేవాడు కాదు. మేము ఎక్కడ బాధపడతామో అని మా ముందు తను ఇబ్బందులు చెప్పుకునేవాడు కాదు. సొంతంగా ఎదగాలనుకున్నాడు. తన కాళ్లపై తను నిలబడ్డాడు. ఇంట్లో ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు' అని చెప్పుకొచ్చింది. చదవండి: ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం? రాత్రి 12 తర్వాత ఏం పని? తప్పు మనవైపు. -
షణ్ముక్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా..?
యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్ జస్వంత్ ఈ మధ్య గంజాయి కేసులో దొరికిపోయిన తర్వాత రోజూ పలు కథనాలు వస్తూనే ఉన్నాయి. వాస్తవంగా షణ్ముక్ అన్నయ్య సంపత్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసి పోలీసులతో పాటుగా వారి ఫ్లాట్‌కు వెళ్లింది. ఆ సమయంలో షన్ను గంజాయి సేవిస్తూ ఉన్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సందర్భంలో తీసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అక్కడ తన సోదరుడి ప్రియురాలిపై షన్ను ఫైర్ అయ్యాడు. నేనే డిప్రెషన్లో ఉన్నానంటూనే.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వ్యాఖ్యలు చేశాడు. దీనిని బట్టి చూస్తే అతను ఏదో మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్రెషన్లోనే షణ్ముక్ గంజాయి సేవిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాదక ద్రవ్యాలకు ఎలా అడిక్ట్ అవుతున్నారు..? మాదక ద్రవ్యాల సరఫరా మన చుట్టూ ఒక చెయిన్‌లా సాగుతుంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉండే కిళ్లీ దుకాణాలు, కాఫీ షాపుల ద్వారా కూడా వీటి సరఫరా సాగుతూనే ఉంటుంది. సెలబ్రిటీలను హైక్లాస్ పార్టీలకు పిలిచి ఉచితంగా మద్యం సరఫరా చేస్తామని చెబుతూ మొదలైన ఈ వ్యవహారం క్రమంగా వారిని డార్క్ వెబ్‌కు కనెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత డెలివెరీ బాయ్స్ ద్వారా నేరుగా వారి ఇంటికే సరఫరా చేసే వరకూ కథ చేరుతుంది. ఇదే విషయాన్ని గతంలో పోలీసు శాఖ వారు వివిధ సందర్భాల్లో చెప్పారు. ఎలాంటి వారు బానిసలుగా మారుతున్నారు..? ఆర్థిక సమస్యలు, ప్రేమ విఫలం, ఒత్తిడి, మోసాలు, విరక్తి.. ఇలా కారణం ఏదైనా కావొచ్చు.. తాత్కాలిక సమస్యల్ని ఎదుర్కోలేక చాలా మంది క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే త్యజిస్తున్నారు. స్టార్ హోదా.. డబ్బు.. అభిమానులు.. గొప్ప పేరు ఉన్న సినీ నటులు కూడా ఆత్మహత్య చేసుకుని వార్తల్లో నిలుస్తున్నారు. నాటి సిల్క్‌స్మిత నుంచి బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వరకూ ఇలా ఆత్మహత్యలకు పాల్పడిన తారలెందరో ఉన్నారు. తాజాగా పోలీసుల ముందు షణ్ముక్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. గంజాయి లాంటివి తీసుకునేటప్పుడు స్కిజోపెర్నియాలాంటి తీవ్రమైన మానసిక సమస్యలు కనిపించడంతో పాటు వారి మూడ్‌లో మార్పులు, మానసిక ఒత్తిడి, ఆందోళన కలుగుతాయి. మత్తు పదార్థాలను ఇంజెక్షన్లు ద్వారా తీసుకోవడం వల్ల హెచ్ ఐ వి లాంటి వి వచ్చే ముప్పు కూడా ఉందని వైద్యులు చెబుతున్న మాట. డిప్రెషన్లో ఉన్నానని షణ్ముఖ్ ఎందుకు అన్నారు షణ్ముక్ ఇంటికి వెళ్లిన సమయంలో అతను ఇలాంటి మాటే అన్నాడు.. తను పూర్తిగా డిప్రెషన్లో ఉన్నట్లు చెప్పాడు. కొంత సమయం పాటు తన అన్నయ్య ప్రియురాలిపై ఫైర్ అయ్యాడు. వాస్తంగా షణ్ముక్ తన కెరియర్ను చాలా కష్టపడి బిల్డ్ చేసుకున్నాడు. ఒక సాధారణ యూట్యూబర్‌గా ప్రారంభమైన తన జీవితం.. బిగ్ బాస్ వరకు తీసుకోచ్చింది. ఆయన తీసిన షార్ట్ ఫిలింస్‌కు బాగా చదువుకున్న యువకులే ఎక్కువగా అడిక్ట్ అయ్యారు.. వాటిలో కంటెంట్ కూడా మధ్యతరగతి వర్గాలకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అంతలా యూత్‌ను ఆకర్షించిన షన్ను ఇప్పుడు డిప్రెషన్‌కు చేరుకునే స్థాయికి ఎందకు చేరుకున్నాడో తెలియదు. కానీ షన్ను వ్యక్తిగత జీవితంలో ప్రేమించిన అమ్మాయి దూరం కావడం వల్లే ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్లాడని కొందరు చెబుతున్న మాట. మరికొందరేమో బిగ్ బాస్ నుంచి వచ్చాక భారీగా ఆఫర్లు వస్తాయని అనుకుంటే కెరియర్ పరంగా మునపటి కంటే మరింత డౌన్ కావడమని చెబుతున్నారు. ఈ రెండు కారణాలతోనే షన్ను తీవ్ర నిరాశకు గురి కావడం జరిగిందని చెబుతున్నారు. డ్రగ్స్‌కు బానిసై పడి లేచిన కెరటాన్ని గుర్తు చేసుకోండి అమెరికా వెటరన్ స్విమ్మర్ ఆంటోనీ ఇర్విన్ ఎంతో మందికి స్పూర్తి.. 2004లో సిడ్నీ ఒలింపిక్స్‌లో 19 ఏళ్లకే బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంకేముంది విపరీతమైన క్రేజ్ తన సొంతమైంది. లగ్జరీ జీవితానికి అలవాటు పడ్డాడు. మత్తు పదార్థాలకు బానిసగా మారి ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచేవాడు. ఇష్టరీతిన బైక్ రైడింగ్ చేస్తూ పట్టుబడటం, అధికారులు హెచ్చరించి వదిలిపెడితే.. మళ్లీ తనకు నచ్చినట్లుగా జీవితాన్ని లీడ్ చేశాడు. చివరకు వింత వ్యాధి(టోరెట్ సిండ్రోమ్)తో నిత్యం అవస్థపడేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇర్విన్.. ఆత్మహత్యాయత్నం చేసినా ప్రాణాలతో బయటపడ్డాడు. భగవంతుడు తనకు పునర్జన్మ ప్రసాదించాడని మళ్లీ స్విమ్మర్‌గా అవతారమెత్తాడు. 2016 రియో ఓలింపిక్స్లో పాల్గొని రెండు స్వర్ణాలు కైవసం చేసుకుని లేటు వయసులో స్వర్ణం కొల్లగొట్టిన అమెరికన్ స్విమ్మర్‌గా రికార్డులకెక్కాడు. డ్రగ్స్‌కు ఫుల్స్టాప్ పెట్టి ప్రస్తుతం కూడా రేసులో ఉన్నాడు. మాదక ద్రవ్యాలు తీసుకునే వారిని నేరస్థుల్లా చూడటం మానేసి, వారిని డీఅడిక్ట్ చేసేందుకు సహకారం అందించాల్సిన అవసరముంది. దీనికి తల్లి తండ్రులు, డాక్టర్లు, సమాజం, మీడియా కూడా సహకారం అందించాలని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేని వారే ఎక్కువగా ఇలాంటి వాటికి అడిక్ట్ అవుతారని పలువురు వైద్యులు తెలిపారు. -
షణ్ముక్ సోదరుడి మరిన్ని ఆగడాలు.. బాధితులు చాలామందే
యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్ జస్వంత్ అలియాస్ షన్ను.. ఈ మధ్య గంజాయి కేసులో దొరికిపోయాడు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చాడు. అయితే ఓ అమ్మాయి.. షణ్ముక్ సోదరుడు సంపత్‌పై ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఇంటికి వెళ్లారు. అక్కడ అనుకోని విధంగా గంజాయితో షణ్ముక్ పట్టుబడ్డాడు. అయితే ఈ కేసులో అనుహ్యంగా మరికొన్ని నిజాలు బయటకొస్తున్నాయి. చాలామంది అమ్మాయిలు షన్ను సోదరుడి వల్ల మోసపోయినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) యూట్యూబర్‌గా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన షణ్ముక్ జస్వంత్‌కి సంపత్ అని అన్న ఉన్నాడు. అయితే ఇతడు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన నమ్మించి మోసం చేయడంతో ఆమె నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బెయిల్ కూడా ఇచ్చారు. అయితే ఈ కేసు వల్ల సంపత్ వల్ల మోసపోయిన బాధితులు మరికొందరు బయటకు వస్తున్నారు. సంపత్.. తన ఎంబీఏ క్లాస్మేట్ అయిన ఓ యువతి దగ్గర 2016లో థిక్ షేక్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెడదామని చెప్పి రూ.20 లక్షలు తీసుకున్నాడట. నెలకు రూ.7 వేలు లాభం మాత్రమే చూపించాడట. దీంతో మొత్తం డబ్బులు ఇచ్చేయమని అమ్మాయి అడగ్గా.. సంపత్ ఈమెని బ్లాక్ చేశాడట. ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని.. పెళ్లికి ఆరు రోజులు ఉందనగా ఓ లేడీ డాక్టర్‌తో పెళ్లికి రెడీ అయ్యాడట. ముంబయిలో మరో యువతిని ఇప్పటికే సంపత్ పెళ్లి చేసుకున్నాడట. ఇలా సంపత్ బారిన పడి చాలామంది అమ్మాయిలు మోసపోయినట్లు, వీళ్లందరూ ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) -
ఫిబ్రవరి 28న పెళ్లి.. మౌనిక తట్టుకోలేకే అలా చేసింది: గీతూ రాయల్
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు సంపత్ వినయ్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్తే అతడి తమ్ముడు, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ పోలీసులకు దొరికిపోయాడు. సంపత్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని డాక్టర్ మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సంపత్‌ను అరెస్ట్ చేసేందుకు అతడి గదికి వెళ్లగా అక్కడ షణ్ముఖ్ గంజాయితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో పోలీసులు అతడిని తీసుకెళ్లారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 2021లోనే రోకా.. తాజాగా ఈ కేసుపై బిగ్‌బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'నేను, షణ్ముఖ్ బాగానే మాట్లాడుకునేవాళ్లం. కానీ అతడు బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు నేనిచ్చిన రివ్యూల వల్ల అతడి కుటుంబానికి, నాకు మధ్య పెద్ద గ్యాప్ వచ్చింది. షణ్ను అన్నయ్య సంపత్ వినయ్ ప్రేయసి మౌనిక నాకు మంచి స్నేహితురాలు. తను నా ఫీమేల్ క్రష్ కూడా! మౌనిక, సంపత్ చాలా ఏళ్లుగా రిలేషన్లో ఉన్నారు. వీరికి 2021లోనే రోకా జరిగింది. ఏడాది తిరిగేలోగా పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పింది. ఈ నెలాఖరున పెళ్లి.. ఇంతలోనే.. కానీ అంతలోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో పెళ్లికి గ్యాప్ తీసుకున్నారు. అంతా సద్దుమణిగాక గతేడాది నవంబర్‌లో పసుపు దంచడం వంటి పెళ్లి పనులు మొదలుపెట్టేశారు. లగ్నపత్రికలు పంచారు, కళ్యాణమండపం కూడా బుక్ చేశారు. ఫిబ్రవరి 28న పెళ్లి జరగాల్సి ఉంది. వారం రోజుల్లో పెళ్లి ఉందనగా సంపత్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడట! ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో లైఫ్ పంచుకోవాలనుకోవడం నాకైతే నచ్చలేదు. డిప్రెషన్లోకి వెళ్లింది అది ఏ అమ్మాయైనా తట్టుకోలేదు. అందుకనే తనలా చేసి ఉంటుంది. ఏదైనా ఉంటే ఇద్దరూ మాట్లాడుకుని విడిపోవాలి. పైగా ఆమె అతడికి ఇంటికి వెళ్తే లోపలికి రానివ్వకపోవడం కరెక్ట్ కాదు. మౌనిక చాలా సెన్సిటివ్.. తన గురించి ఆలోచిస్తేనే బాధేస్తోంది. ఆ మధ్య తను డిప్రెషన్లోకి కూడా వెళ్లింది' అని చెప్పుకొచ్చింది. చదవండి: అందరూ ప్రార్థించండి.. వేడుకుంటున్న పాయల్ -
నా దగ్గర అన్ని అధారాలున్నాయి: బాధితురాలు
-
షణ్ముఖ్ సోదరుడి వ్యవహారంలో సంచలన విషయాలు
-
షణ్ముఖ్ గంజాయి కథ
-
గంజాయితో పట్టుబడ్డ బిగ్ బాస్ ఫేం షణ్ముక్
-
గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్..
-
Shanmukh Jaswanth: గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్
బిగ్‌బాస్ ఫేం, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయితో పట్టుపడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో మోసం షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ యువతితో పదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. మూడేళ్ల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను దూరం పెట్టేశాడు. 20 రోజుల క్రితం వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. అన్న కోసం వెళ్తే.. అడ్డంగా దొరికిపోయిన తమ్ముడు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంపత్‌ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్ నివాసానికి వెళ్లారు. పోలీసులతో పాటు యువతి కూడా అక్కడికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లి చూడగా..షణ్ముఖ్ ఒక్కడే కనిపించాడు. అతని వద్ద గంజాయి లభించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. ఈ సమయంలో సదరు యువతితో షణ్ముఖ్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. -
సెకండ్ వెబ్ సిరీస్ మొత్తం అమెరికాలో ఉంటుంది
-
ఆరోజు ఏడుపే ఏడుపు: షణ్ముఖ్ జస్వంత్
-
నేను ప్రేమలో ఉన్న పెళ్లి ఎప్పుడంటే: షణ్ముఖ్ జస్వంత్
-
ఇంకా మంచి నటుడు అనిపించుకోవాలని నా కోరిక
-
ముద్దులతో రెచ్చిపోయిన షణ్ముక్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!
యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్ బిగ్‌బాస్ ఎంట్రీతో మరింత పాపులర్ అయ్యాడు. అతని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ దీప్తి సునయనతోబ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్-5 నుంచి బయటకొచ్చాక దీప్తి షణ్నూకి గుడ్‌బై చెప్పేసింది. తాము కెరీర్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పేసి విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఇద్దరూ కలిసి జంటగా ఎక్కడా కనిపించలేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఎవరికీ వారే సొంతంగా యూట్యూబ్ సాంగ్స్ చేస్తున్నారు. కానీ తాజాగా షణ్ను పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ రొమాంటిక్ సాంగ్ వీడియోను రిలీజ్ చేసిన అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇది చూసిన అతని ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 'అయ్యయ్యో' అనే పేరుతో సాంగ్ రీలీజ్ చేశాడు షణ్ముక్. ఇందులో ఫణి పూజిత అనే అమ్మాయితో ఫుల్ రొమాంటిక్‌గా నటించాడు. ఆ సాంగ్‌లో షణ్ను ముద్దులతో రెచ్చిపోయాడు. (ఇది చదవండి: ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ షణ్నూ పోస్ట్‌కి దీప్తి సునయన రిప్లై ఇస్తుందా?) ఇది చూసిన కొందరు ఫ్యాన్స్ దీప్తిని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే దీప్తి బాధపడుతుంది బ్రో అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది చాలా టూమచ్ బ్రో.. ఇదంతా దీప్తి మీద రివెంజ్ కోసమేనా అని కొందరు కామెంట్స్ చేశారు. 'అరే ఏంట్రా ఇది' అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్ చేయగా.. ఇది చూస్తే దీపు చాలా ఫీల్ అవుతుంది బ్రో అంటూ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) -
షణ్ముఖ్, సిరితో గొడవలు.. నా ఫోన్ కట్ చేస్తున్నారు.. జెస్సీ
బిగ్‌బాస్ ఐదో సీజన్లో షణ్ముఖ్- సిరి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇద్దరికీ బయట ప్రేమికులు ఉన్నా కూడా హౌస్ లోపల మాత్రం నీకు నేను, నాకు నువ్వు అన్నట్లుగా మెదిలారు. వీరి అతి ప్రేమను చూసి జనాలు ముక్కున వేలేసుకున్నారు. అటు సిరి ప్రియుడు శ్రీహాన్ కూడా ఓసారి స్టేజీపైకి వచ్చినప్పుడు నన్ను వదిలేస్తున్నవారా? అని ఎంతో దీనంగా అడిగిన డైలాగ్ ఇప్పటికీ బిగ్‌బాస్ ఆడియన్స్ మర్చిపోలేరు. అయితే షణ్ను, సిరిలతో మోడల్ జెస్సీ క్లోజ్‌గా ఉండేవాడు. మిగతా హౌస్మేట్స్ ఈ ముగ్గురిలో ఎవరినైనా ఒక్క మాట అంటే చాలు మిగతా ఇద్దరూ రెచ్చిపోయి గొడవ చేసేవారు. కానీ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక సీన్ మారింది. ఎవరి దారి వారు చూసుకున్నారు. అంతేకాదు ఎంతో స్నేహంగా మెదిలినవాళ్లే ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఈ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో జెస్సీ మాట్లాడుతూ.. 'నాకు బాగా క్లోజ్ అయినవాళ్లకు ఐ లవ్యూ చెప్తుంటాను. కానీ వాళ్లు(సిరి, షణ్ముఖ్) ఆ ప్రేమను అర్థం చేసుకోలేదు. ఒక్కసారి ఫ్రెండ్షిప్ ఏర్పడ్డాక అంత ఈజీగా తెగిపోతుందని నేను ఊహించలేదు. చెప్పుడు మాటలు విని దూరం పెట్టారు. చాలా బాధేసింది. నాకు ఫోన్ చేసి ఇలా అంటున్నారు, నిజమా? కాదా? అని అడిగి తిట్టే స్వతంత్రం వారికుంది. నేను తప్పు చేశానంటే కచ్చితంగా ఒప్పుకుంటాను. వీళ్లకి అర్థం కాని విషయం ఏంటంటే.. ఒకప్పుడు వాళ్లను ఛీ, తూ.. అన్నవాళ్ల దగ్గరకే వెళ్తున్నారు. వాళ్లు మిమ్మల్ని వాడుకుంటున్నారు. అది తెలుసుకుంటే మంచిది. నేను ఫేమస్ అవ్వడానికి వాళ్లను వాడుకుంటున్నానని టాక్ వచ్చింది. నాకంత అవసరం లేదు, అయినా షణ్ముఖ్ అంత పిచ్చోడేం కాదు. వాడికి ఫలానా వాడు ఫేక్ అనిపిస్తే వదిలేస్తాడు. బిగ్‌బాస్ షోలో నాకోసం ఏడ్చాడు. నాలుగో వారంలో నన్ను జైల్లో పెట్టినప్పుడు నేను నిన్ను నమ్ముతానురా అని నాతో కూర్చున్నాడు. నేను ఫేక్‌గా లేను కాబట్టే నాతో ఉన్నాడు. కానీ ఇప్పుడు నా ఫోన్ కట్ చేసేంత స్థితికి ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. ఒకరిని ఫ్రెండ్ అనుకున్నానంటే ఏదున్నా ముఖం మీదే చెప్పేస్తాను. వారికిప్పుడు నా ప్రవర్తన నచ్చడం లేదంటే సరే! షణ్ను నన్ను అన్‌ఫాలో కొట్టాడు. ఎందుకు అలా చేశాడో తెలియదు. బాధేసింది. కొందరైతే నేనేదో తప్పు చేసినట్లు కామెంట్లలో నన్ను తిట్టేవాళ్లు. వాడికి నా పిల్లచేష్టలు, ప్రవర్తన నచ్చలేదని దూరం పెట్టాడేమో! నావంతు ప్రయత్నం చేశాను. కలిశా, అడిగా, సంవత్సరం వెయిట్ చేశా.. కానీ వాళ్లు వద్దనుకుంటున్నారు. ఒకానొక సమయంలో నాకూ కోపమొచ్చింది. వారు నన్ను ఇష్టపడనప్పుడు ఎందుకు వెనకపడటం అనిపించింది. అందుకే నేనూ దూరంగా ఉంటున్నాను' అని చెప్పుకొచ్చాడు జెస్సీ. -
షన్నుతో దీప్తి బ్రేకప్.. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ..!
యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయనల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయిన ఈ ఇద్దరూ ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్లుగా మరింత ఫేమ్ సంపాదించారు. కానీ ఊహించని రీతిలో షన్ను బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక ఈ బ్రేకప్ చెప్పేసుకోవడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. దాదాపు 5 ఏళ్ల పాటు వీరి ప్రేమ బంధం కొనసాగింది. అయితే ఈ జంట విడిపోయి ఇప్పటికే ఏడాది దాటిపోయింది. తాజాగా ఈ బ్రేకప్ తర్వాత దీప్తి సునయన క్రేజీ కామెంట్స్ చేసింది. షన్నుతో రిలేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే దీప్తి బ్రేకప్ విషయంపై తాజాగా ఓపెన్ అయింది. తన ఫాలోవర్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానలిచ్చింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఆసక్తికర ప్రశ్న వేశారు. అభిమానులతో నిర్వహించిన చిట్ చాట్‌లో షన్నుతో బ్రేకప్‌పై స్పందించింది . బ్రేకప్ తర్వాత నీలో వచ్చిన మార్పు ఏంటని నెటిజన్ ప్రశ్నించగా.. రోజు రోజుకు రోబోలా తయారవుతున్నా అంటూ సమాధానం చెప్పింది దీప్తి. మరో నెటిజన్ ప్రశ్నిస్తూ.. ఒక వ్యక్తిని మీ జీవితంలో ఆహ్వానించాలంటే అతడిలో ఏం చూస్తారు? ఎంత సమయం తీసుకుంటారు? అని అడగ్గా.. ‘నన్ను నవ్విస్తే చాలు’ అంటూ సమాధానమిచ్చింది బిగ్ బాస్ బ్యూటీ. ఆ తర్వాత అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆన్సరిచ్చింది దీప్తి సునయన. బ్రేకప్‌కు ఏడాది పూర్తి దీప్తి సునయన-షణ్ముక్ జశ్వంత్ విడిపోయి దాదాపు ఏడాది దాటిపోయింది. ఇద్దరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ,సంగతి తెలిసిందే. 2022 ప్రారంభంలో షన్ను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాక బ్రేకప్ చెప్పేసింది దీప్తి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి గుడ్ బై చెప్పేసేంది. ఆ తర్వాత షణ్ముఖ్ కూడా తాము విడిపోయినట్లు క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఆమె మరోసారి అభిమానులు ఈ ప్రశ్న అడగడంతో ఈ జంట మళ్లీ కలుస్తారా అని కామెంట్స్ చేసున్నారు. -
షణ్ముఖ్‌తో అతి సన్నిహితం.. తప్పు చేశానంటూ స్టేజ్‌పై సిరి కన్నీళ్లు!
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో షణ్ముఖ్- సిరిల ఫ్రెండ్షిప్ హద్దు మీరిన సంగతి తెలిసిందే! ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారు. తప్పనిపించినా వీడి ఉండలేకపోతున్నామని వాపోయారు. కానీ ఎప్పుడైతే సిరి బాయ్‌ఫ్రెండ్, నటుడు శ్రీహాన్ బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చాడో అతడికి ముఖం చూపించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది సిరి. ఇక శ్రీహాన్.. నన్ను వదిలేస్తున్నావా? అని ఒక డైలాగ్ విసరడంతో సిరిని మరింత తిట్టిపోశారు నెటిజన్లు. ఇక కట్ చేస్తే షో అయిపోయాక వాళ్లిద్దరూ ఎప్పటిలాగే కలిసిపోయారు. నెగెటివిటీకి చెక్ పెడుతూ మరింత దగ్గరయ్యారు. ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా స్టార్ మా నిర్వహించిన స్పెషల్ ఎపిసోడ్లో శ్రీహాన్, సిరి జంట పాల్గొంది. వారితో పాటు మిగతా బుల్లితెర రియల్ కపుల్స్ కూడా ఈ ఈవెంట్లో సందడి చేయనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సిరి తాను తప్పు చేశానంటూ స్టేజ్‌పైనే నిర్మోహమాటంగా ఒప్పేసుకుంది. శ్రీహాన్‌కు గోల్డ్ రోజు ఇచ్చి ప్రపోజ్ చేసిన సిరి, అతడు చాలా యూనిక్ అంటూ పొగిడింది. శ్రీహాన్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు అతడిని చాలా మిస్ అయ్యానని, గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ షర్ట్‌పై ముద్దులు పెట్టేదాన్ని అని చెప్పింది. అనంతరం ఆ షర్ట్‌ను ప్రియుడు శ్రీహాన్‌కు గిఫ్ట్ ఇచ్చింది. అలా పలు గిఫ్ట్‌లతో శ్రీహాన్‌ను సర్ప్రైజ్ చేసిన సిరి అనంతరం మాట్లాడుతూ.. ‘చిన్న, చిన్న తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ స్టేజ్‌పై ఎవరు దాన్ని ఒప్పుకోరు. నేను నిజంగానే తప్పు చేశాను.. అది నాకు తెలియకుండానే జరిగింది’ అంటూ కన్నీరు పెట్టుకుంది. దీంతో సిరిని శ్రీహన్ దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. దీంతో అక్కడ ఉన్న యాంకర్ రవి, రష్మీతో పాటు మిగతా కంటెస్టెంట్స్ సైతం స్టేజ్‌పైకి వచ్చి సిరిని ఓదార్చారు. కాగా బిగ్‌బాస్ షో అనంతరం షణ్ముఖ్‌కు దీప్తి సునయన బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: కిరాక్ ఆర్పీ చేపల పులుసు బిజినెస్ వారి భిక్షే: రాకింగ్ రాకేష్ షాకింగ్ కామెంట్స్ సీక్రెట్ డేటింగ్.. ఎట్టకేలకు మూడుమూళ్ల బంధంతో ఒక్కటైన హీరోహీరోయిన్ -
ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ షణ్నూ పోస్ట్‌కి దీప్తి సునయన రిప్లై ఇస్తుందా?
సోషల్ మీడియా స్టార్స్ దీప్తి సునయన- షణ్ముఖ్ జస్వంత్‌లు బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్-5 నుంచి బయటకు వచ్చాక దీప్తి షణ్నూకి బ్రేకప్ చెప్పేసింది. తమదారులు వేరని, ఇప్పటికైనా కెరీర్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పి విడిపోతున్నట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జంటగా ఎక్కడా కనిపించలేదు. ఆమధ్య ఓ అవార్డ్ ఫంక్షన్లో దీప్తిని చూస్తూ షణ్నూ మురిసిపోయిన ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవలె ఓ ఇంటిని కొనుగోలు చేసిన దీప్తి సునయన రీసెంట్‌గానే తల్లిదండ్రులతో కలిసి గృహప్రవేశం చేసింది. అయినా షణ్నూ ఆమెతో కనిపించలేదు. దీంతో బ్రేకప్‌పై ఇద్దరూ సీరియస్‌గానే ఉన్నారని ఫ్యాన్స్ తెగ హర్ట్ అయ్యారు. అయితే తాజాగా నేడు(మంగళవారం)దీప్తి సునయన బర్త్‌డే సందర్భంగా షణ్నూ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. హ్యాపీ బర్త్‌డే డీ(దీప్తి సునయన)అంటూ షణ్నూ పోస్ట్ చేశాడు. మరి దీనికి దీప్తి రెస్పాండ్ అవుతుందా? లేదా అన్నది చూడాల్సి ఉంది. -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘సూర్య’ వెబ్ సిరీస్ నటి, వరుడు ఎవరంటే..!
షార్ట్ ఫిల్మ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ మౌనిక రెడ్డి. షణ్ముఖ్ జశ్వంత్ ‘సూర్య’ వెబ్ సిరీస్‌లో హీరోయిన్గా చేసి రాత్రిరాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది. అదే క్రేజ్‌తో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం ఆమె లేడీ కానిస్టేబుల్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా వచ్చిన ‘ఓరి దేవుడా!’ సినిమాలోనూ ఓ పాత్ర పోషించింది. ఓ వైపు వెండితెరపై నటింగా, మరో వైఫు షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది మౌనిక రెడ్డి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. తన ప్రియుడు సందీప్ అనే వ్యక్తితో ఏడడుగులు వేయబోతోంది. చదవండి: నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత! ఆ స్టార్ హీరోకి అక్కగా? ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. అంతేకాదు తనకు కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది. అంతేకాదు పెళ్లి తేదీ కూడా ప్రకటించింది. డిసెంబర్ 17,18 తేదీల్లో గోవాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగునున్నట్లు మౌనిక తెలిపింది. కాగా మొదట స్నేహితులుగా పరిచమైన వీరద్దరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. దీంతో మౌనికకు తన సహా నటీనటుల నుంచి ఫాలోవర్స్ నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. View this post on Instagram A post shared by Mounika Reddy (@monie_kaaa) View this post on Instagram A post shared by Mounika Reddy (@monie_kaaa) -
బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసిన దీప్తి సునయన- షణ్నూ
యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయనల క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయిన ఈ ఇద్దరూ ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్లుగా మరింత పాపులర్ అయ్యారు. కానీ అనూహ్యంగా షణ్నూ బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక వీరు బ్రేకప్ చెప్పేసుకోవడం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. తాజాగా షణ్నూ-దీప్తిలు ఒకే వేదికపై కనిపించడం ఆసక్తిగా మారింది. వైజాగ్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్లో వీరిద్దరూ సందడి చేశారు. పక్కనే కూర్చున్న దీప్తిని చూస్తూ షణ్నూ సిగ్గుపడిపోయిన క్లిప్పింగ్స్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా స్టేజ్‌పైన షణ్నూ దీప్తి గురించి మాట్లాడుతూ.. ''మొదట్లో నేను, దీప్తి సునయన కవర్ సాంగ్స్ చేసేటప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆమెకు వచ్చినన్ని ట్రోల్స్ ఎవరికీ రాలేదేమో. కానీ అవి చూసి దీప్తి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.నేను దీప్తీని చూసి చాలా నేర్చుకున్నాను. అలాగే అమ్మాయిలు దీప్తీని చూసి నేర్చుకోవాలి. మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ కావాలి” అంటూ షణ్నూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారా? త్వరలోనే ఆ గుడ్‌న్యూస్ షేర్ చేసుకుంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసిన దీప్తి సునయన- షణ్నూ
-
ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కొన్న షణ్ముఖ్ జస్వంత్
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డ్యాన్స్ వీడియోలు, వెబ్‌సిరీస్‌లతో గుర్తింపు పొందిన షణ్ముఖ్.. బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. తనదైన ఆట తీరుతో రన్నరఫ్‌గా నిలిచి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనేకమంది అభిమానులకు కూడా సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ ముగిశాక దీప్తి సునయనతో బ్రేకప్ తర్వాత కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా షణ్నూ ఈమధ్య తిరిగి యాక్టివ్ అయ్యాడు. రీసెంట్గా 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' సిరీస్‌తో ఫ్యాన్స్‌ని పలకిరించాడు. తాజాగా షణ్నూ తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు. దసరా పండుగ వేళ లగ్జరీ బ్రాండ్ బీఎండబ్ల్యూ కారును కొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను షణ్నూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ఇదంతా డ్రీమ్‌లా ఉంది. నా ఫ్యామిలీ తర్వాత నన్ను ఈ పొజీషన్లో చూడాలనుకున్నది మీరే.. నాట్ ఫ్రెండ్స్ ఓన్లీ మీరే. ఐలవ్యూ 3000. ఇది మన కార్. బయట ఎప్పుడు కనిపించినా చెప్పండి. లిఫ్ట్ పక్కా ఇస్తా అంటూ షణ్నూ పోస్ట్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ కారు ధర సుమారు రూ. 45 లక్షలట. ఇక షణ్నూ పోస్ట్ చూసి అభిమానులు కంగ్రాంట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) -
ఆస్పత్రి బెడ్‌పై షణ్ముఖ్ జశ్వంత్, ఫ్యాన్స్ ఆందోళన
యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్ బిగ్‌బాస్ ఎంట్రీతో మరింత పాపులర్ అయ్యాడు. తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్ ఐదో సీజన్లో చివరకు నిలిచి, రన్నరఫ్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనేకమంది అభిమానులకు కూడా సంపాదించుకున్నాడు. అయితే అదే సమయంలో ఇదే షో.. తన ప్రేయసితో విడిపోవడానికి కారణమైంది. సోషల్ మీడియాలో క్యూట్ పెయిర్‌గా పేరు సంపాదించుకున్న దీప్తి సునైనా, షణ్ముఖ్ గతేడాదిలో విడిపోయిన విషయం తెలిసిందే. లవ్ బ్రేకప్‌లో కొంతకాలం డిప్రెషన్లోకి వెళ్లిన షణ్నూ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. చదవండి: ఉత్కంఠభరితంగా ‘పొన్నియన్ సెల్వన్’ ట్రైలర్ ఇక ఇటీవల తిరిగి తన డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ యాక్టివ్ అయ్యాడు. తిరిగి కెరీర్‌పై ఫోకస్ పెట్టిన షణ్నూ రీసెంట్గా 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' సిరీస్‌తో ఫ్యాన్స్‌ని పలకిరించాడు. అంతేకాదు తరచూ సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ మళ్లీ ఫాలోవర్స్‌లో జోష్ నింపుతున్న క్రమంలో తాజాగా అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. దీంతో అతడి ఫాలోవర్స్ అంతా షణ్నూకి ఏమైందా? అని ఆందోళన వ్యక్తం చేస్తుండంతో కొద్ది సేపటికే తాను బాగానే ఉన్నానంటూ మరో పోస్ట్ పెట్టాడు. దీంతో అతడి ఫాలోవర్స్ కాస్తా ఊపరి పీల్చుకున్నారు. అయితే తన అనారోగ్యానికి గల కారణమేంటన్నది మాత్రం అతడు వెల్లడించలేదు. -
Geetu Royal: బాడీ షేమింగ్ అంటూ ఏడ్చిన గీతూ.. షణ్ను ఫ్యాన్స్ ఫైర్
బిగ్‌బాస్ రివ్యూలతో బాగా ఫేమస్ అయింది గీతూ రాయల్. బుల్లితెర షోలలోనూ మెరుస్తున్న ఈమె త్వరలో బిగ్‌బాస్ 6లో పాల్గొననుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా గీతూ రాయల్ కంటతడి పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి బాడీ షేమింగ్ చేస్తూనే ఉన్నారంటూ సుమారు గంటసేపు ఏడ్చింది. 'నన్ను ఇంట్లో వాళ్లతో సహా చాలామంది బాడీ షేమింగ్ చేశారు. అందుకని నేను చాలా వరకు బాడీని కవర్ చేసేలా డ్రెస్సులు వేసుకున్నాను. కానీ ఇటీవలే నా కజిన్స్, ఫ్రెండ్స్‌తో మాట్లాడాను.. నువ్వు ముందు నీ బాడీని ప్రేమించమని చెప్పారు. కానీ, నేనేమో పిచ్చిదానిలా ఏడుస్తున్నా. జనాలు మీ బాడీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి. మనుషుల లుక్స్‌ను బట్టి వారిని అంచనా వేయకండి. దయచేసి బాడీ షేమింగ్ చేయొద్దు' అంటూ ఏడ్చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారగా నువ్వు గతంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ షణ్నును బాడీ షేమింగ్ చేయలేదా? అతడిని తిట్టిపోయలేదా? అని ప్రశ్నిస్తున్నారు షణ్ను ఫ్యాన్స్. దీనిపై ఆమె స్పందిస్తూ.. 'బిగ్‌బాస్ గేమ్ జడ్జ్ చేయడమే నా పని. మా వాడిని అన్నప్పుడు లేదా? అని తిడుతున్నారు. ఆయన బయటకు వచ్చినప్పుడు నేను అతడి పేరు కూడా ఎత్తలేదు. ఎందుకంటే బిగ్‌బాస్ తర్వాత ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేనేదో కావాలని సింపతీ క్రియేట్ చేస్తున్నానంటున్నారు. నాకేమీ చేతకాదు అని ఒప్పుకున్నప్పుడు సింపతీ క్రియేట్ చేస్తా. ఇప్పుడు నాకు చాలా టాలెంట్ ఉంది. నాకీ సింపతీ అక్కర్లేదు. పాత రివ్యూలను, పాత విషయాలను అలాగే పట్టుకుని వేలాడేవారిని నిబ్బాస్ అంటారు. కొంచెం మారండి' అని ఘాటుగానే సమాధానమిచ్చింది. అయినప్పటికీ ఊరుకోని షణ్ను అభిమానులు మావాడిని బాడీషేమింగ్ చేసినప్పుడు ఏమనిపించలేదు, కానీ ఇప్పుడు నిన్ను బాడీ షేమింగ్ చేస్తుంటే బాధేస్తుందా? అని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇదిప్పట్లో ముగిసేలా లేదనుకున్న గీతూ రాయల్ చివరగా ఇన్‌స్టా స్టోరీలో ఓ వీడియో షేర్ చేస్తూ.. 'నేను నిజంగా ఎవరినైనా బాడీ షేమింగ్ చేసుంటే ఆ వీడియో పంపించండి. ఒకవేళ అది నిజమైతే బాహాటంగా సారీ చెప్తా' అని చెప్పుకొచ్చింది. చదవండి: అన్ని కోట్లిస్తామన్న కంపెనీ, కుదరదన్న ఐకాన్ స్టార్ బెడ్ షేర్ చేసుకోవాలనుందని అడిగిందంటే ఆమె ఆడదే కాదు: నటుడు -
బిగ్‌బాస్ కంటే ముందే బంపర్ ఆఫర్ వచ్చింది
యూట్యూబ్ వీడియోలతో బోలెడంతమంది అభిమానులను సంపాదించుకున్నాడు సాఫ్ట్వేర్ డెవలపర్ షణ్ముఖ్ జశ్వంత్. బిగ్‌బాస్ షోతో మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యాడు. బిగ్‌బాస్ తర్వాత చాలాకాలంగా నటనకు దూరంగా ఉన్న ఈ యూట్యూబర్ తాజాగా ఏజెంట్ ఆనంద్ అనే వెబ్‌సిరీస్‌తో సినీప్రియులను పలకరించనున్నాడు. ఈ వెబ్‌సిరీస్ ఆహాలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా షణ్ను సాక్షితో మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ కంటే ముందే ఈ సిరీస్ రెడీగా ఉంది. బిగ్‌బాస్ అయ్యాక చేద్దామనుకున్నాను. యూట్యూబ్‌లో చేద్దామనుకున్నాను, కానీ ఆహా నుంచి ఆఫర్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్‌లో మనసు తప్ప ఏదైనా వెతికి ఇచ్చేస్తాను అనే డైలాగ్ డైరెక్టర్ చెప్పమంటే చెప్పాను. అంతకుమించి నాకేం తెలీదు. బిగ్‌బాస్ ముందు యూట్యూబ్‌లో చేసేవాడిని, ఇప్పుడు ఓటీటీలో చేస్తున్నా.. అదే నాలో వచ్చిన మార్పు. ఇక డిప్రెషన్లో ఉన్న నేను హీరో సూర్యను కలవడంతో దాన్నుంచి బయటపడ్డా. నేను చేసిన సూర్య సిరీస్ తను చూశానని చెప్పడంతో చాలా ఆనందమేసింది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: రెమ్యునరేషన్ నేను ఎక్కువ తీసుకోవడమేంటి?: కీర్తి సురేశ్ బాద్షా ఉన్నంతకాలం బాలీవుడ్ గతి ఇంతే: డైరెక్టర్‌పై ట్రోలింగ్ -
'మనసు తప్ప ఏదైనా వెతికి పెడతా' అంటున్న షణ్ముఖ్ జశ్వంత్..
Shanmukh Jaswanth Agent Anand Santosh Teaser: యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్ బిగ్‌బాస్ ఎంట్రీతో మరింత పాపులర్ అయ్యాడు. తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్ ఐదో సీజన్లో చివరకు నిలిచి, రన్నరఫ్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనేకమంది అభిమానులకు కూడా సంపాదించుకున్నాడు. అయితే అదే సమయంలో ఇదే షో.. తన ప్రేయసితో విడిపోవడానికి కారణమైంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్, బ్రేకప్ తర్వాత తన కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు షణ్ముఖ్ జశ్వంత్. ఈ క్రమంలోనే 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' సిరీస్ చేస్తున్నట్లు ఇది వరకు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 'ఇంతకీ నువ్ ఏం చేస్తుంటావ్ ? నెలకు నీ జీతం ఎంత వస్తుంటుంది ? అసలు ఎంత ఖర్చవుతుంది ? ఎంత మిగులుతుంది ?' అంటూ షణ్ముఖ్‌ను ప్రశ్నలు అడగడంతో ప్రారంభమవుతుంది ఈ టీజర్. ఈ ప్రశ్నలకు నేను ఒక డిటెక్టివ్ ఏజెంట్‌ను సర్ అని షణ్ముఖ్ ఇచ్చే సమాధానం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో వెబ్ సిరీస్‌పై ఆసక్తి కలిగించారు. ఇందులో షణ్ముఖ్ జశ్వంత్ స్టైలిష్‌గా కనిపించాడు. 'మనసు తప్ప.. ఫిజికల్‌గా, లిక్విడ్‌గా ఏదైనా వెతికి పెడతా' అని చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సిరీస్‌కు అరుణ్ పవర్ దర్శకత్వం వహించగా, సుబ్బు స్క్రిప్ట్ అందించారు. ఈ వెబ్ సిరీస్ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కానుంది. చదవండి: నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ ధనుష్ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్ దర్శకులు.. నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ -
షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం..
-
బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం..
Bigg Boss Fame Shanmukh Jaswanth Grand Mother Passed Away: యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్ బిగ్‌బాస్ ఎంట్రీతో మరింత పాపులర్ అయ్యాడు. తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్ ఐదో సీజన్లో చివరకు నిలిచి, రన్నరఫ్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనేకమంది అభిమానులకు కూడా సంపాదించుకున్నాడు. అయితే అదే సమయంలో ఇదే షో.. తన ప్రేయసితో విడిపోవడానికి కారణమైంది. సోషల్ మీడియాలో క్యూట్ పెయిర్‌గా పేరు సంపాదించుకున్న దీప్తి సునైనా, షణ్ముఖ్ గతేడాదిలో విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో తన కెరీర్‌పై ఫోకస్ పెట్టి షణ్ముఖ్ జశ్వంత్ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అయితే అంత సవ్యంగా జరుగుతున్న షణ్ముఖ్ జీవితంలో విషాదం నెలకొంది. షణ్ముఖ్ బామ్మ మరణించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు షణ్ను తన బామ్మతో కలిసి ఉన్న వీడియోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. ఈ స్టోరీకి రిప్ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. బామ్మతో షణ్ముకు ఉన్న అటాచ్మెంట్ చూసి ఎమోషనల్ అవుతున్నారు. ఈ వీడియోలో తన పెళ్లి చూస్తావా అని షణ్ను అడగ్గా 'ఏమో చూస్తానో లేదో..' అని బామ్మ అన్నట్లుగా ఉంది. 'నువ్ ఉండాలి' అని షణ్ము అనగా, 'నీ పెళ్లి వరకు కచ్చితంగా ఉంటుంది' అని వెనకాల నుంచి మాటలు వినిపించాయి. చదవండి: నేను సింగిల్, కాదు మింగిల్.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్ సినిమా టికెట్ల కోసం క్యూలో మహేశ్ బాబు.. వీడియో వైరల్ -
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన షణ్ముఖ్
సిరి హన్మంత్, షణ్ముఖ్ జశ్వంత్.. బిగ్‌బాస్ షో వల్ల వీరి ఇమేజ్ డ్యామేజ్ అయిందనుకున్నారంతా.. సోషల్ మీడియాలో నెగెటివిటీ వల్ల సిరి కొన్నాళ్లపాటు డిప్రెషన్లోకి వెళ్లిపోగా షణ్ముఖ్‌కు దీప్తి సునయనతో బ్రేకప్ అయింది. ఈ అనూహ్య పరిణామాలతో కొంతకాలంపాటు వార్తల్లో నిలిచారిద్దరూ. కానీ తమ టాలెంట్‌తో నెగెటివ్ కామెంట్లు చేసేవారి నోరు మూయించారిద్దరూ. ఇటీవలే సిరి హన్మంత్ బీఎఫ్ఎఫ్ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు వెల్లడించగా తాజాగా షణ్ముఖ్ జశ్వంత్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈమేరకు ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. ఇన్వెస్టిగేషన్ త్వరలో ప్రారంభమవుతుందని, కేస్ వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించాడు. అటు బీఎఫ్ఎఫ్, ఏజెంట్ ఆనంద్ సంతోష్.. ఈ రెండూ కూడా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం కానున్నాయి. మొత్తానికి వారు పంచుకున్న గుడ్‌న్యూస్ విని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Agent Anand Santosh vachesthunnadu... Case vivaraalu thvaralo!💥💥💥@shannu__7 pic.twitter.com/daqJ3QqsGL — ahavideoin (@ahavideoIN) May 14, 2022 Who is she?🤔 Workaholic ✅ Responsible ✅ Crazy ✅ Anni check unte, kacchithanga maa Nitya ne😉 Introducing #SiriHanumanth as Nithya#BFF, An Aha Original, Coming Soon. #BFFOnAha #RamyaPasupuleti @DiceMediaIndia @TamadaMedia @DaburHoney_Ind @tnldoublehorse pic.twitter.com/nGenP6lYRc — ahavideoin (@ahavideoIN) May 14, 2022 చదవండి: 'సర్కారు వారి పాట'ను వీక్షించిన నమ్రతా శిరోద్కర్.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్ పాన్ ఇండియా సినిమాలు చూసుంటారు, పాన్ ఇండియా రౌడీలను చూశారా? -
బిగ్‌బాస్ హౌస్‌లో షణ్ముఖ్, ఇప్పటికైనా శివకు ఫలితం దక్కిందా?
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ బిగ్‌బాస్‌కు వచ్చాక అతడిపై విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. సిరితో క్లోజ్‌గా ఉంటూ ఆమెపై పెత్తనం చెలాయిస్తున్నాడని, ఎవరితోనూ కలివిడిగా మాట్లాడనీయకుండా హద్దులు గీస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాక గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన ఉందన్న విషయం మర్చిపోయి సిరితో ఎక్కువ సన్నిహితంగా మెదిలాడంటూ కామెంట్లూ వినిపించాయి. ఈ నెగెటివిటీతో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ కావాల్సిన షణ్ను రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ తర్వాత తన ప్రేయసి కూడా గుడ్‌బై చెప్పడంతో ఒకింత శూన్యంలోకి వెళ్లిపోయాడు. అయితే తను చేసిన తప్పులను ఒప్పుకుంటూ తనను తాను సరిదిద్దుకుంటూ నెగెటివిటీని కూడా పాజిటివ్‌గా మార్చుకున్నాడు షణ్ను. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తిట్టినవాళ్లే షణ్ను మెచ్యూరిటీని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. తాజాగా షణ్ను మరోసారి బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కంటెండర్స్ గేమ్ ఆడించేందుకు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించగా అందులో శివ గెలుపొందాడు. కానీ అఖిల్‌కు మిస్టరీ బాక్స్ రాగా అందులో ఎక్కువ పాయింట్స్ ఉన్నవాళ్లే గేమ్‌లో ముందుకు వెళ్లాలని రాసుంది. దీంతో ఇప్పటికే అనిల్, బాబా భాస్కర్, బిందు పోటీదారులుగా ఎంపికవగా ఈ జాబితాలో శివ లేదా అఖిల్‌లో ఎవరో ఒకరు చేరినట్లు తెలుస్తోంది. మరి హౌస్‌లో షణ్ను సందడి చూడాలంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూడాల్సిందే! చదవండి: ఇట్స్ టూ మచ్, అంత మేకప్ అక్కర్లేదు.. నటిపై ట్రోలింగ్ రోమాలు నిక్కబొడిచే 'కొమురం భీముడో' వీడియో సాంగ్ చూశారా? -
బ్రేకప్‌తో బిజీ అయ్యావా? షణ్ముఖ్‌పై నాగ్ సెటైర్లు
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఈ వారం సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్లు ఇస్తున్నాడు. ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్‌ను పంపి హౌస్మేట్స్ ముఖాల్లో వెలుగులు తీసుకొచ్చిన బిగ్‌బాస్ వీకెండ్లో ఏకంగా వారి క్లోజ్‌ఫ్రెండ్స్‌ను, మరికొందరి పేరెంట్స్‌ను, బంధువులను స్టేజీమీదకు తీసుకొచ్చాడు. వారిని చూసి మరోసారి సర్ప్రైజ్ అయ్యారు కంటెస్టెంట్లు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. అఖిల్ కోసం సోహైల్ స్టేజీపైకి వచ్చి స్నేహితుడిని పొగిడేస్తుండగా... నాకోసం కూడా చెప్పరా అంటూ మధ్యలో అరియానా లేచి నిలబడింది. దీంతో సోహైల్.. నేను అన్నీ విన్నాలే, కూర్చో అన్నట్లుగా పంచ్ వేశాడు. తర్వాత అరియానా కోసం ఆమె సోదరి, దేవి నాగవల్లి, యాంకర్ శివ కోసం అతడి ఫ్రెండ్స్ ధనుష్, షణ్ముఖ్ వచ్చారు. చదవండి: మహేశ్‌బాబు పెన్నీ సాంగ్ కోసం సితార ఎందుకన్నారు: తమన్ షణ్నును చూసిన నాగ్ బిగ్‌బాస్ తర్వాత ఎక్కడా కనపడలేదేంటి, బ్రేకప్‌తో బిజీగా ఉన్నావా? అని ప్రశ్నించడంతో అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు. దొరికిందే ఛాన్స్ అనుకున్న అషూ.. దీప్తి సునయన ఎలా ఉందని అడుతూ షణ్నును మరింత ఉడికించింది. అనంతరం సిరి స్టేజీపైకి రాగా మిత్రశర్మ ఎమోషనలైంది. అనిల్ కోసం వచ్చిన తండ్రి మాట్లాడుతూ.. అతడు మాట్లాడకపోవడానికి కారణం నేనే, వాడిని అలా పెంచాను అంటూ గొప్పగా చెప్పాడు. దీంతో విషయం అర్థమైన నాగ్ మాట్లాడనివ్వకుండా పెంచారా? అని సెటైర్ వేశాడు. ఇక వచ్చినవారితో టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో చెప్పమని గేమ్ ఆడించాడు. ఈ గేమ్‌తో ఎవరు ఫినాలేలో చోటు దక్కించుకుంటారు? ఎవరికి టైటిల్ గెలిచే ఆస్కారం ఉందన్న విషయాలపై ఓ క్లారిటీ రానుంది. చదవండి: అనిల్ అదృష్టం, బిగ్‌బాస్ నుంచి హమీదా ఎలిమినేట్! -
శ్రీహాన్‌పై సిరి ఆసక్తికర వ్యాఖ్యలు, చివరికి ఇలా క్లారిటీ ఇచ్చిందా?
సిరి హన్మంత్.. బుల్లితెర తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్ 5 సీజన్ తర్వాత సిరి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. విమర్శలు, ట్రోల్స్‌తో ఆమె బాగా పాపులర్ అయ్యింది. దీనికి కారణం బిగ్‌బాస్ హౌస్‌లో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ఆమె అతి సన్నిహితంగా ఉండటమే. ఇక బయటకు వచ్చిన ఆమె తనపై వస్తున్న నెగిటివిటీని చూసి షాకయ్యింది. ఈ స్థాయిలో తనకు వ్యతిరేకత రావడం చూసి డిప్రెషన్లోకి వెళ్లింది. అలాంటి సమయంలో ఆమె బాయ్‌ఫ్రెండ్, నటుడు శ్రీహాన్ ఆమెకు సపోర్ట్‌గా నిలిచాడు. చదవండి: ఎన్టీఆర్‌ను చూస్తే కన్నీళ్లు వచ్చాయి, ఎమోషనల్ అయ్యా: ఒలీవియా అయితే ప్రారంభంలో అతను కూడా సిరిని దూరం పెట్టాడని వార్తలు వినిపించాయి. అంతేకాదు వారిద్దరికి సంబంధించిన వ్యక్తిగత పోస్ట్‌లను కూడా శ్రీహాన్ డిలిట్ చేయడంతో షణ్మఖ్-దీప్తి సునైన బాటలోనే వీరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. కానీ అలాంటిదేం లేదని శ్రీహాన్ క్లారిటీ ఇచ్చాడు. అటు సిరి కూడా శ్రీహాన్ బర్త్‌డే విష్ తప్పితే అతడి గురించి స్పెషల్‌గా ఎలాంటి పోస్ట్ షేర్ చేయకపోవడంతో ఆ ఊహాగానాలకు బ్రేక్ పడలేదు. దీంతో వారి ఫాలోవర్స్‌లో ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా వాటిన్నింటికి చెక్ పెడుతూ సిరి, శ్రీహాన్‌తో దిగిన ఫొటోను పంచుకుంది. ఈ సందర్భంగా అతడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ప్రతి క్షణం(మంచి-చెడు సమయాల్లో) నా పక్కనే నిలిచే వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి. నా బలం, నా మర్గదర్శి, నా గార్డియన్, నా సర్వస్వం. అతడే ఇతను. మై వన్ అండ్ ఓన్లీ శ్రీహాన్’ అంటూ సిరి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. వీరిద్దరిని ఒక్కటిగా చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ పోస్ట్‌తో వారి మధ్య మనస్పర్థలు తొలిగిపోయాయని సిరి చెప్పకనే చెప్పిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ప్లీజ్ నా గురించి తప్పుడు ప్రచారం చేయకండి: రాశీ ఖన్నా మొత్తానికి సిరి-శ్రీహాన్ కలిశారని, ఇక షణ్ముఖ్, దీప్తిలో ఎప్పుడు కలుస్తారో అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కాగా బిగ్‌బాస్‌లో షణ్ముఖ్, సిరి తీరుపై విపరీతమైన నెగిటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్, దీప్తి విడిపోవడానికి సిరి కారణమంటూ ఆమెను నిందించారు. తనకు బయట ఒక ప్రియుడున్నప్పటికీ ఆ విషయం మర్చిపోయి షణ్నూకి హగ్గులు, ముద్దులిస్తూ అతిగా ప్రవర్తించిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) -
హీరోయిన్‌తో షణ్ముఖ్ స్టెప్పులు.. వేరే లెవల్!
బిగ్‌బాస్ షో తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్ ఐదో సీజన్లో చివరకు నిలిచి, రన్నరఫ్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో ఇదే షో.. తన ప్రేయసితో విడిపోవడానికి కారణమైంది. సోషల్ మీడియాలో క్యూట్ పెయిర్‌గా పేరు సంపాదించుకున్న దీప్తి సునైనా, షణ్ముఖ్ గతేడాదిలో విడిపోయారు. దీంతో షణ్ముఖ్ ప్రస్తుతం కెరీర్పైన దృష్టి పెట్టాడు. వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయని, త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తానంటూ షణ్ముఖ్ ప్రకటించాడు. ప్రస్తుతం డైరెక్టర్ పండుతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా షణ్ముఖ్ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో విజయ్ బీస్ట్ మూవీలోని ‘హళమితి హబిబో’ పాటకు హీరోయిన్ నువేక్షతో కలిసి స్టెప్పులేశాడు. అచ్చం విజయ్ మాదిరే స్టెప్పులేస్తూ అదరగొట్టేశాడు షన్నూ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన షన్నూ అభిమానులు.. వేరే లెవల్ అంటున్నారు. ‘మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చేసింది’ (శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో లవ్ ఫెయిల్ అయిన వ్యక్తిని ఓ పాట రూపంలో ఓదార్చుతూ.. చిరంజీవి ఈ డైలాగ్ చెప్తాడు) అంటూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) -
హీరో సూర్యను కలిసిన షణ్ముఖ్ జశ్వంత్
-
ఫేవరెట్ హీరోను కలిసిన షణ్ముఖ్, ఎమోషనల్ పోస్ట్!
ఒకరకంగా చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. బిగ్‌బాస్ షోలో ఆఫర్ వచ్చిందని సంబరపడేలోపు ఆ రియాలిటీ షో ద్వారా ఎంతో నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. సిరికి పదేపదే హగ్గులిస్తూ మితిమీరి ప్రవర్తించాడని అభిమానులు సైతం ఫైర్ అయ్యారు. ఏదేమైనా కప్పు కొట్టే బయటకు వస్తాడనుకుంటే విపరీతమైన ట్రోలింగ్ వల్ల ట్రోఫీకి అడుగు దూరంలో ఆగిపోయి రన్నరప్‌గా నిలిచాడు. ఇక షో నుంచి బయటకు వచ్చాక దీప్తి సునయన బ్రేకప్ చెప్పడంతో అతడి గుండె ముక్కలైంది. ఎప్పటికైనా మళ్లీ కలుస్తామని ఆశతో బతుకుతున్నాడు షణ్ను. ఇలా వరుస ఫెయిల్యూర్ల మధ్య కొట్టుమిట్టాడుతున్న షణ్ముఖ్ తన కల నెరవేర్చుకున్నాడు. తన ఫేవరెట్ హీరో సూర్యను కలిశాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈటీ ప్రీరిలీజ్ ఈవెంట్ లాంచ్‌లో సూర్యను కలిసే ఛాన్స్ దక్కించుకున్న షణ్ను తన హీరోను నేరుగా చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. 'మార్చి 3 చాలా సంతోషకరమైన రోజు. కొన్ని నెలలుగా ఎన్నో ఫెయిల్యూర్స్ చూసిన నేను ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన సుబ్బు, మనోజ్‌లకు ధన్యవాదాలు, ఐ లవ్ యూ సూర్య అన్న' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇందులో హీరో సూర్య షణ్నును చూసి అతడి దగ్గరకు నడుచుకుంటూ వచ్చి హగ్ ఇచ్చి మనసారా మాట్లాడాడు. నువ్వు కోరుకుంది జరగకపోవచ్చేమో కానీ నీకు కావాల్సింది తప్పకుండా జరిగి తీరుతుంది అని మరో వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు షణ్ను. -
మా బ్రేకప్‌కు చాలా కారణాలున్నాయి, సిరి వల్ల కాదు: షణ్ముక్
బిగ్‌బాస్ 5 సీజన్ తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ జీవితమే మారిపోయింది. హౌజ్ నుంచి బయటకు వచ్చిన ఆనంతరం మిగతా కంటెస్టెంట్స్ కంటే షణ్ముఖ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. దానికి కారణంగా తన ప్రియురాలు దీప్తి సునయనతో విడిపోవడమే. ఎన్నో ఆశలతో, ఉత్సహంతో మూడు నెలల అనంతరం బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు షణ్ముఖ్‌కు దీప్తి బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. ఇక అప్పటి నుంచి వీరి గరించిన రకారకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు షణ్ముక్ మై లవ్ ఈజ్ గాన్ అంటూ ఇన్‌స్టాలో బ్రేకప్ పోస్టులు, ఎమోజీలు పెడుతూ ఒంటరిగా గడిపేస్తున్నాడు. ఇక వీరి బ్రేకప్‌కు అందరూ సిరి కారణమని, ఆమెతో అతి సన్నిహితమే అతడి కొంప ముంచిందని ఫిక్స్ అయ్యారు. అయితే తమ బ్రేకప్‌కు కారణం సిరి కాదని, దానికి మరో రీజన్ ఉందంటూ ఆసక్తి కామెంట్స్ చేశాడు షణ్నూ. వాలంటైన్స్ డే సందర్భంగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా షణ్ను మాట్లాడుతూ.. ‘మా ఇద్దరి బ్రేకప్ సిరి కారణం కాదు. చెప్పాలంటే సిరి, దీప్తి ఎప్పటికి మంచి స్నేహితులే. మేం విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. నా వల్ల దీప్తి ఎంతో నెగిటివిటీని ఎదుర్కొంది. నెటిజన్లు నన్ను ట్రోల్ చేస్తున్నప్పుడు తను నాకు సపోర్ట్ చేసింది. అయితే సిరితో చనువుగా ఉండడం నెటిజన్లతో పాటు దీప్తి కుటుంబానికి కూడా నచ్చలేదు. దీంతో తన కుటుంబం నుంచి ఆమెకు ఒత్తిడి పెరిగింది. ఇకనైన తను సంతోషంగా ఉండాలనే ఉద్ధేశంతోనే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మేము మా కెరీర్ పై దృష్టి పెట్టాం… మేము మళ్లీ కలుస్తామా ? లేదా ? అనేది దేవుడి చేతుల్లో ఉంది. విధి మా జీవితాల్లో ఏది రాస్తే అదే జరుగుతుందని నమ్ముతున్నాను.. మా బ్రేకప్ గురించి సిరిని నిందించడం సరైనది కాదు..తప్పు నాదే అందుకు నన్ను నిందించాలి’ అంటూ షణ్నూ చెప్పుకొచ్చాడు. అంతేగాక ‘ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికే బిగ్‌బాస్ హౌజ్‌కు వచ్చాను. నిజం చెప్పాలంటే నా మూడీ పర్సన్‌కు బిగ్‌బాస్ కరెక్ట్ కాదు. నేను ఇతరులతో తక్కువగా మాట్లాడతాను. నా గురించి పాజిటివ్ ఆలోచిస్తారు అనుకున్నా.. కానీ షో నుంచి బయటకు వచ్చాక నాపై ఎంత నెగిటివిటీ వచ్చిందో అర్థమైంది. నేను 27 సంవత్సరాల వయసులోనే ఎన్నో ఎదురుదెబ్బలు చూశాను. వీటివలన ఇంకా జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది నేర్చుకుంటున్నాను’ అన్నాడు. ఇక ‘హౌజ్‌లో సిరికి నేను అండగా ఉన్నాను. ఇంటి సభ్యులు సిరిని ఎమైనా అంటే తనకు సపోర్ట్ ఇచ్చాను. కానీ అవన్నీ వదిలేసి సిరి వాళ్లమ్మ నన్ను తనను తప్పుగా అర్థం చేసుకోవడం బాధించింది’ అని పేర్కొన్నాడు. -
ప్రపోజ్ డే.. బ్రేకప్ ఎమోజీ షేర్ చేసిన షణ్ముఖ్
వాలంటైన్స్ డే దగ్గర పడుతోంది. సింగిల్స్ ప్రపోజ్ చేయడానికి రెడీ అవుతుంటే అదే సింగిల్స్ కొందరు మాత్రం లవ్వు లేదు, గివ్వు లేదు.. లవ్వంటే ఇంట్రస్ట్ లేదంటూ పాటలు పాడుకుంటూ కాలం గడిపేస్తున్నారు. బ్రేకప్ అయిన వాళ్ల సంగతి సరేసరి.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాటిని ఎలా మర్చిపోవాలా? అని వేదన అనుభవిస్తున్నారు. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సాడ్ సాంగ్స్ పెట్టుకుంటూ బ్రేకప్ హార్ట్ ఎమోజీని జత చేస్తూ తన బాధను చెప్పకనే చెప్తున్నాడు. ఇది చూసిన అతడి సోదరుడు సంపత్ వినయ్.. 'ఫస్టూ చదువుకోండి.. ఈ ఏజ్‌లో లవ్ ఎందుకు?' అని రిప్లై ఇచ్చాడు. దీంతో షణ్నూ నా బాధ నీకేం తెలుసు అన్నట్లుగా ఓ ఎమోజీ పెట్టాడు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ మానస్ అయితే 'హ్యాపీ ప్రపోజ్ డే' అంటూ షణ్నూని మరింత ఉడికించాడు. 'హుష్, తప్పు తప్పుగా మాట్లాడొద్దు మా సింగిల్స్ దగ్గర' అని రిప్లై ఇవ్వగా 'హలో నేను కూడా సింగిలే..' అని బదులిచ్చాడు మానస్. -
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన షణ్ముక్.. ఆమెతో కలిసి గృహప్రవేశం
Shanmukh Jaswanth New House Warming Celebrations: యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫాలోయింగ్తోనే బిగ్‌బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా షణ్ముక్ హైదరాబాద్‌లో ఓ కొత్త ఇల్లు కొనుకున్నాడు.దీనికి సంబంధించి గృహప్రవేశాన్ని సైతం పూర్తి చేశాడు. నటి, చాయ్ బిస్కెట్ ఫేం శ్రీ విద్యతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. చదవండి: నటి, ఎమ్మెల్యే రోజా హోంటూర్.. అచ్చంగా ఇంద్రభవనమే దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. దీంతో షణ్నూకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త ఇంటితో పాటు కొత్త లక్ష్యాలతో జీవితంలో ముందుకు పయనించాలంటూ షణ్నూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవలె దీప్తి సునయనతో బ్రేకప్ అనంతరం కెరీర్‌పై ఫుల్ ఫోకస్‌తో ముందుకు వెళుతున్న షణ్నూ త్వరలోనే ఓ వెబ్‌సిరీస్‌తో ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ త్వరలోనే రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by @software_devlovepers_official -
మై లవ్ ఈజ్ గాన్, అయినా పోతే పోనీ అంటున్న షణ్ముక్
Anchor Ravi Comments On Shannu Break Up Song: బిగ్‌బాస్ సీజన్-5 రేపిన చిచ్చు ఈ షో తర్వాత కూడా కొనసాగింది. అప్పటి వరకు ప్రేమికులుగా ఉన్న రెండు జంటల మధ్య బిగ్‌బాస్ అగాధం సృష్టించింది. అయితే దాన్నుంచి సిరి-శ్రీహాన్ బయటపడితే, దీప్తి సునయన- షణ్నూల మధ్య మాత్రం బ్రేకప్ వ్యవహారం కొనసాగింది. ఈ షో అయిన వెంటనే న్యూ ఇయర్‌కి ఒకరోజు ముందుగా షణ్నూతో దీప్తి తెగదెంపులు చేసుకుంది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా స్టార్‌మాలో వాలెంటైన్స్ డే స్పెషల్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో కలిసి ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనిలో షణ్నూ అదిరిపోయే పర్ఫామెన్స్తో అలరించాడు. ప్రస్తుతం తను ఉన్న సిచ్చువేషన్కి తగ్గట్లుగానే మై లవ్ ఈజ్ గాన్ అంటూ ఎమోషన్‌తో డ్యాన్సులేశాడు. అనంతరం హోస్ట్ యాంకర్ రవి మాట్లాడుతూ.. మై లవ్ ఈజ్ గాన్ అంటున్నావ్ నీకు ప్రేమ మీద నమ్మకం ఉందా? ఒక వేళ ప్రేమలో సారీ, థ్యాంక్స్, బాయ్ అని ఎవరికి చెబుతావ్ అంటూ అందరి ముందు ఇరికించేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. మరి రవి అడిగిన ఈ ప్రశ్నలకు షణ్నూ ఎలాంటి ఆన్సర్లు ఇచ్చాడన్నది తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) -
బ్రేకప్‌కు ఎండ్ కార్డ్.. మళ్లీ కలిసిపోయిన సిరి-శ్రీహాన్
Siri Hanmanth And Shrihan Patchup After Bigg Boss: బిగ్‌బాస్ సీజన్-5 ఎఫెక్ట్ రెండు జంటల మధ్య చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీప్తి సునయన షణ్ముక్‌కి బ్రేకప్ చెప్పేసింది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికింది. అటు శ్రీహాన్ కూడా సిరి ఫోటోలు డిలీట్ చేయడంతో అతను కూడా దీప్తి సునయనను ఫాలో అయినట్లు అందరూ అనుకున్నారు. దీంతో అతడు కూడా త్వరలోనే సిరికి బ్రేకప్ చెప్తాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనంతటిని పటాపంచలు చేస్తూ సిరి-శ్రీహాన్‌లు కలిసిపోయారు. రీసెంట్గా హైదరాబాద్ వచ్చిన వీరిద్దరు యాంకర్ రవి ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు. అనంతరం వాళ్ల ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. మీ ఇద్దరినీ కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ చేసింది. దీంతో సిరి-శ్రీహాన్‌ల బ్రేకప్‌కు ఎండ్ కార్డ్ పడినట్లయ్యింది. ఏది ఏమైనా ఎన్ని కలతలు వచ్చినా బిగ్‌బాస్ తర్వాత మీరిద్దరు కలవడం సంతోషంగా ఉందంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీప్తి సునయన- షణ్నూలు కూడా కలిసిపోతే బావుండు అని కోరుకుంటున్నారు. -
మళ్లీ ఒక్కటవ్వబోతున్న షణ్ముఖ్-దీప్తి సునయన!, ఇదిగో ప్రూఫ్..
బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్, యూట్యూబ్ స్టార్ లవ్‌బర్డ్స్ షణ్ముఖ్ జశ్వంత్- దీప్తి సునయన బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ బ్రేకప్ మీడియాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వీళ్లిద్దరూ విడిపోవడానికి కారణమెంటో అందరికి తెలిసిందే. అయితే యూట్యూబ్‌లో, సిరీస్‌లో వీరిద్దరి పేర్కు, కెమిస్ట్రికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు ఎంతో కాలం నుంచి వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారు. అయితే చిన్న కారణాలకే ఈ యూట్యూబ్ జంట విడిపోవడం వారి ఫాలోవర్స్‌ను బాధించింది. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. చదవండి: సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం ఈ క్రమంలో షణ్మఖ్ తండ్రి మళ్లీ వీరిద్దరూ కలుస్తారంటూ ఆ మధ్య ఇంటర్వ్యూలో భరోసా వ్యక్తం చేశాడు. కానీ దీప్తి వాలకం చూస్తుంటే మళ్లీ ఆమె షణ్నుతో కలిసేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందంటూ వారి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేయగా.. మరికొందరూ కలుస్తారు అంటూ బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే రోజున షణ్ను-దీప్తిలు కలవబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు దీనికి బిగ్‌బాస్ షో వేదిక కాబోతోందట. చదవండి: డబ్బు కావాలంటూ మెసేజ్‌లు చేస్తున్న అనుపమ!, హీరోయిన్ క్లారిటీ అదేలా అంటే బిగ్‌బాస్ నిర్వాహకులు ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా గ్రాండ్ సెలబ్రెషన్స్‌కు ప్లాన్ చేశారట. ఆ రోజు అయిదు సీజన్ల బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ను ఆహ్వానించి పెద్ద ఉత్సవం చేయబోతున్నట్లు వినికిడి. ఇదిలా ఉంటే ఇక అదే రోజు బిగ్‌బాస్ ఓటీటీ ప్రారంభం కానుందని, ఇందులో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ సందడి చేయబోతున్నారంటూ ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. దీంతో నిజంగానే బిగ్‌బాస్ షణ్ను-దీప్తి కలవబోతున్నారంటూ కోందరూ ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేదికపై షణ్ముఖ్-దీప్తిలను జంటగా చూపించబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ విషయం తెలిసి వారి ఫాలోవర్స్ తెగ సంబరపడితున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ ఉత్సవంకు సంబంధించి తొలిపార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్నారు. ఆ ఈవెంట్ ఫొటోలు, వీడియోలు ఇవే అంటూ సోషల్ మీడియా బయటకు వస్తున్నాయి. అయితే వీటిలో దీప్తి కానీ, షణ్మఖ్ కానీ ఎక్కడా కనిపించలేదు. చదవండి: యంగ్ హీరోయిన్‌తో హృతిక్ సీక్రెట్ డేటింగ్.. వీడియో వైరల్ -
ఆ వార్తల్లో నిజం లేదని తేల్చేసిన దీప్తి సునయన.. పోస్ట్ వైరల్
Deepthi Sunaina Reaction On Her Tollywood Debut Rumours, Post Inside: సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలుత డబ్స్ మ్యాష్ వీడియోలతో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయింది. ఇక రీసెంట్గా షణ్నూతో బ్రేకప్‌తో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తమ దారులు వేరంటూ 5ఏళ్ల రిలేషన్ షిప్‌కు ముగింపు పలికింది. బ్రేకప్ అనంతరం కెరీర్‌పై దృష్టి పెట్టిన దీప్తి సునయన త్వరలోనే హీరోయిన్గా పరిచయం కానుందంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన దీప్తి సునయన ఇది ఫేక్‌న్యూస్ అంటూ కొట్టి పారేసింది. ఇన్‌స్టాలో ఈ మేరకు ఫోటోను షేర్ చేస్తూ నేను హీరోయిన్‌గానా చేస్తున్నానా? ఈ విషయం నాకు తెలీదే అంటూ సెటైర్ వేసింది. దీంతో మొత్తానికి దీప్తి సునయన సిల్కర్ స్క్రీన్కు పరిచయం కానుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. -
డిప్రెషన్లోకి వెళ్లా, షణ్ముఖ్-దీప్తి నా వల్ల విడిపోలేదు: సిరి
బిగ్‌బాస్ ప్రేమజంట మధ్య చిచ్చు పెట్టింది.. షణ్ముఖ్, దీప్తి బ్రేకప్ చెప్పుకోవడానికి కారణమైంది. మరీ ముఖ్యంగా సిరి వల్లే వాళ్లిద్దరూ విడిపోయారంటూ సోషల్ మీడియాలో ఆమను దుమ్మెత్తిపోశారు నెటిజన్లు. తనకు బయట ఒక ప్రియుడున్నప్పటికీ ఆ విషయం మర్చిపోయి షణ్నూకి హగ్గులు, ముద్దులిస్తూ అతిగా ప్రవర్తించిందంటూ నానామాటలన్నారు. వారి బ్రేకప్‌కు ఆమె కూడా ఓ కారణమే అంటూ విమర్శించారు. తాజాగా షణ్నూ-దీప్తి బ్రేకప్సై తొలిసారిగా స్పందించింది సిరి. ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ షోలో నాకు షణ్ముఖ్, జెస్సీ బెస్ట్‌ఫ్రెండ్స్. షణ్నుకు, నాకు మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే. కాకపోతే కొద్దిగా ఎక్కువగా ఎమోషనల్ అయ్యాం. దీప్తి సునయన కూడా నాకు ఫ్రెండే, తనతో కలిసి వర్క్ కూడా చేశాను. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక ఈ ట్రోలింగ్ చూసి డిప్రెషన్లోకి వెళ్లాను. దాన్నుంచే బయటపడే సమయానికి దీప్తి బ్రేకప్ అని చెప్పడంతో మళ్లీ నా మీద నెగెటివిటీ పెరిగింది. నావల్ల బ్రేకప్ జరిగేంత బలహీనమైన ప్రేమ కాదు వాళ్లది. నా వల్లే అంటే ఆ బ్రేకప్ ఎప్పుడో జరిగేది. ఒక్క బిగ్‌బాస్ వల్లే, అది కూడా నా వల్లే బ్రేకప్ జరగలేదు' అని కుండ బద్ధలు కొట్టింది. -
వాళ్లిద్దరూ కలుస్తారు: గుడ్ న్యూస్ చెప్పిన షణ్ముఖ్ తండ్రి!
షణ్ముఖ్ జశ్వంత్- దీప్తి సునయన.. వీళ్లిద్దరూ కలిసిపోతే ఎంత బాగుంటుందో.. అనుకునే అభిమానులు ఎంతమందో! కానీ ఒక్కసారి బ్రేకప్ చెప్పుకున్నాక కలవడం సాధ్యమేనా? అంటే సాధ్యమే అంటున్నాడు షణ్ముఖ్ తండ్రి. వాళ్లు కలుస్తారని అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదని చెప్తున్నాడు. తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో షణ్ముఖ్ తండ్రి మాట్లాడుతూ.. 'వాళ్లిద్దరూ కలిసే ఉంటారు. బ్రేకప్ దీప్తి చెప్పింది, కానీ షణ్ముఖ్ ఎక్కడా చెప్పలేదు. వాళ్లిద్దరి వ్యక్తిగత విషయాల గురించి మనం ఎక్కువగా చర్చించకూడదు. కాకపోతే ఆ అమ్మాయికి ఏం అనిపించిందో తెలీదు కానీ సోషల్ మీడియాలో అలా పోస్ట్ పెట్టింది..' 'వాళ్లు కలవడానికి కొంత సమయం పడుతుందేమో కానీ కలిసే ఉంటారు. ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం.. అంతా శుభమే జరుగుతుంది. ఈ విషయంలో అభిమానులు అనుమానించాల్సిన అవసరమే లేదు' అని చెప్పుకొచ్చాడు. ఇద్దరం మాట్లాడుకున్నాకే ఓ నిర్ణయానికి వచ్చి విడిపోతున్నామన్న వీళ్లిద్దరూ నిజంగా కలుస్తారా? లేదా? అన్నది రానున్న రోజుల్లో చూడాల్సిందే! -
షణ్ముఖ్ కాలికి గాయం.. ‘స్వీట్ అండ్ రాడ్ మెమోరీ’ అంటూ కామెంట్
బిగ్‌బాస్ రియాల్టీ షోలో కొన్ని టాస్కులు కాస్త కఠినంగానే ఉంటాయి. కొన్నిసార్లు దెబ్బలు కూడా తగులుతాయి. అయినప్పటికీ.. కంటెస్టెంట్స్ వాటిని పట్టించుకోకుండా టాస్క్‌ని సీరియస్‌గా తీసుకొని ఆడతారు. అయితే గతంలో టాస్కుల వల్ల చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యేవి. కానీ బిగ్‌బాస్-5లో మాత్రం కొన్ని టాస్కులు చాలా కఠినంగా ఉన్నాయి. వాటి వల్ల కంటెస్టెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు. మరీ ముఖ్యంగా టికెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ఇచ్చిన ఐస్ టాస్క్ అయితే దారుణమనే చెప్పాలి. దానివల్ల సిరి, శ్రీరామచంద్రల పాదాల చర్మం ఊడిపోయి కాళ్లు ఎరుపెక్కాయి. అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు అంటున్నారా? ఆ టాస్క్‌లో సిరి, శ్రీరామ్ మాత్రమే కాదు.. షణ్ముఖ్ కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఐస్‌లో నిలబడి ఉండడం వల్ల అతని పాదాలు కమిలిపోయాయి. తాజాగా దానికి సంబంధించిన ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ.. ‘స్వీట్ అండ్ రాడ్ మెమోరీ’ఫన్నీగా కామెంట్ చేశాడు షణ్ముఖ్. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అది బిగ్‌బాస్ హౌస్‌లో తగిలిన గాయమా.. లేదా ఇప్పుడు తగిలిన గాయమా అనేది తెలియాల్సి ఉంది. దీప్తి సునైనాతో బ్రేకప్ తర్వాత షణ్ముఖ్ యాక్టింగ్ మీద దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయని, త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తానంటూ షణ్ముఖ్ ప్రకటించాడు. -
దీప్తి సునయన బర్త్‌డే: షణ్నూ స్పెషల్ విషెస్, పోస్ట్ వైరల్
Shanmukh Birthday Wishes To Deepthi Sunaina Shares Old Pic: సోషల్ మీడియా స్టార్స్ దీప్తి సునయన-షణ్ముఖ్‌ల బ్రేకప్ స్టోరీ ఇప్పటికీ నెట్టింట హాట్‌టాపిక్‌గానే ఉంది. చూడచక్కనైన ఈ జంట విడిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ బిగ్‌బాస్ షో అనంతరం దీప్తి సునయన షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పేసింది. ఇక కలిసుండలేమంటూ తమ 5ఏళ్ల బంధాన్ని తెగదెంపులు చేసుకుంది. అయితే ఇది షణ్ముఖ్‌కి ఇష్టం లేకపోయినా దీప్తి నిర్ణయాన్ని అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇక బ్రేకప్ తర్వాత వీరిద్దరి సోషల్‌మీడియా అకౌంట్లపై నెటిజన్ల ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. ఈ క్రమంలో వీరు షేర్ చేస్తున్న పోస్టులు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా బ్రేకప్ అనంతరం షణ్ముఖ్ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. నేడు(సోమవారం)దీప్తి సునయన బర్త్‌డే సందర్భంగా.. 'హ్యాపీ బర్త్‌డే డీ(D)'అంటూ దీప్తితో కలిసి దిగిన ఓ పాత ఫోటోను షణ్నూ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. దీనికి వీరిద్దరు కలిసి నటించిన మలుపు సిరీస్ సాంగ్‌ను జత చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై దీప్తి ఇంతవరకు స్పందించలేదు. -
చనిపోయేటప్పుడు కూడా దీప్తి నా పక్కనే ఉంటుంది.. వీడియో వైరల్
స్టార్ యూట్యూబ్ జంట షణ్ముఖ్ జశ్వంత్- దీప్తి సునయన కొత్త సంవత్సరానికి బ్రేకప్ న్యూస్‌తో వెల్కమ్ చెప్పిన విషయం తెలిసిందే. నూతన సంవత్సరం రోజు ఈ ప్రేమజంట తమ దారులు వేరని ప్రకటించింది. ఇప్పటిదాకా కలిసి సాగించిన ప్రయాణానికి స్వస్తి పలుకుతూ ఇకపై విడివిడిగా ఉంటామని వెల్లడించారు. వీరి బ్రేకప్ వార్తను అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ జంట విడిపోయి వారానికి పైనే అవుతున్నా ఫ్యాన్స్ మాత్రం మళ్లీ కలుస్తే బాగుండు అంటూ సోషల్ మీడియాలో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో షణ్నూ, దీప్తి జంటగా నటించిన హిట్ సాంగ్ 'మలుపు' మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో షణ్నూ, దీప్తి షూటింగ్‌ను ఎంతలా ఎంజాయ్ చేశారో, పాట కోసం ఎలా కష్టపడ్డారో చూపించారు. షణ్ను ఆస్పత్రి బెడ్‌పై పడుకుంటే కొంచెం జరగమంటూ దీప్తి వచ్చి అతడి ఎదపై పడుకుంది. దీంతో షణ్నూ 'నేను చనిపోయేటప్పుడు కూడా దీప్తి ప్లేస్ ఇవ్వమని గొడవపడుతుంది, ఎందుకు జరగవని వాదిస్తుంది' అని చెప్పడంతో దీప్తి నవ్వుతూ అతడి ఎదపై వాలిపోయింది. ఆ తర్వాత షణ్ను ప్రేమగా ఓ ముద్దివ్వగా ఆమె కన్నార్పకుండా అతడిని అలానే చూస్తుండిపోయింది. ఇలా వీరిద్దరూ కలిసి ఉన్న క్షణాలను చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. 'మీ జంట చూడముచ్చటగా ఉంది, వీడియో చూస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి', 'మీరిద్దరూ కలిసి నటించిన చివరి సాంగ్ ఇదే అవుతుందనుకోలేదు', 'ఎంతో ఆప్యాయంగా ఉండే మీరు మళ్లీ కలవాలి' అని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు. వంద రోజుల రియాలిటీ షో వల్ల భవిష్యత్తును పాడు చేసుకోకండని సూచిస్తున్నారు. కాగా శనివారం(జనవరి 8న) రిలీజ్ చేసిన మలుపు మేకింగ్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. -
నాకు తండ్రి ప్రేమ ఉంది.. దీప్తి సునయన ఎమోషనల్ వీడియో
Deepthi Sunaina Shares Emotional Video With Her Father After Breakup With Shannu : దీప్తి సునయన-షణ్ముఖ్‌ల బ్రేకప్ స్టోరి ఇప్పటికీ నెట్టింట హాట్ టాపిక్‌గానే ఉంది. చూడచక్కనైన ఈ జంట విడిపోతారని ఎవరూ ఊహించలేదు. బిగ్‌బాస్ షోలో ఎన్ని ట్రోల్స్ వచ్చినా షణ్నూకు చివరిదాకా అండగా నిలబడ్డ దీప్తి.. అతని జీవితంలో మాత్రం చివరివరకు ఉండలేకపోయింది. బిగ్‌బాస్ షో అయిన వెంటనే షణ్నూకి బ్రేకప్ చెప్పేసి సైడయిపోయింది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల రిలేషన్ షిప్‌కు గుడ్‌బై చెప్పేసింది. అయితే షణ్నూతో బ్రేకప్ తర్వాత ఆ బాధలోంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న దీప్తి సునయన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సైతం తెగ యాక్టివ్‌గా కనిపిస్తుంది. తాజాగా తన తండ్రితో కలిసి ఓ వీడియోను షేర్ చేస్తూ... 'ఆమె ఒంటరి కాదు. ఆమె వెనుక అత్యంత శక్తివంతమైన శక్తి ఉంది. అతడే తండ్రి ప్రేమ అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం అత్యంత కష్టవంతమైన పరిస్థితులు ఎదురైనా తన తండ్రి ప్రేమతో దాన్ని జయిస్తానంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది. చదవండి: సిరి ఫోటోలు డిలీట్ చేసిన ప్రియుడు.. బ్రేకప్‌కు సంకేతమా? View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) -
సిరి ఫోటోలు డిలీట్ చేసిన ప్రియుడు.. బ్రేకప్‌కు సంకేతమా?
After Shanmkh And Deepthi Breakup, Shrihan Deleting Siri Pics In Instagram: బిగ్‌బాస్ సీజన్-5 రెండు జంటల మధ్య చిచ్చు రేపింది. ఇప్పటికే దీప్తి సునయన షణ్ముక్‌కు బ్రేకప్ చెప్పేసింది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికింది. ఇప్పుడు దీప్తి సునయన బాటలోనే సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా సిరిని దూరం పెడుతూ వస్తున్న శ్రీహాన్.. త్వరలోనే ఆమెకు గుడ్‌బై చెప్పనున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా బిగ్‌బాస్ షో పూర్తైనా వీరిద్దరూ జంటగా కనిపించలేదు. అయితే తాజాగా సిరితో తెగదెంపులు చేసుకునేందుకు శ్రీహాన్ సిద్ధమయినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో సిరి ఫోటోలన్నింటిని డిలీట్ చేసి షాకిచ్చాడు. కేవలం ఇద్దరూ కలిసి చేసిన వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన అప్డేట్స్ మినహా సిరితో ఉన్న ఫోటోలన్నింటిని శ్రీహాన్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్నుంచి తొలగించాడు. బిగ్‌బాస్ షోలో అనేక సార్లు షణ్నూతో కనెక్షన్ వస్తుందంటూ సిరి చెప్పిన మాటలతో శ్రీహాన్ గుండె బద్దలయ్యిందని, ఎంగేజ్మెంట్ జరిగిందన్న విషయం కూడా మర్చిపోయి షణ్నూతో చేసిన రొమాన్స్ భరించలేక శ్రీహాన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై వారిద్దరూ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఇటీవలె సిరి బర్త్‌డేకు సైతం శ్రీహాన్ విషెస్ చెప్పడం విశేషం. -
నీ వరకు వస్తే తప్పు కాదా?..షణ్ముఖ్-దీప్తిల బ్రేకప్‌పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్
యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్-దీప్తి సునైనాల బ్రేకప్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్ షో కారణంగానే వీళ్లు విడిపోయారా? షణ్ముఖ్ సిరితో క్లోజ్‌గా మూవ్ కావడం వల్లే దీప్తి బ్రేకప్ చెప్పిందా? ఐదేళ్లుగా కలిసి ఉన్న వీళ్లు ఒకరిని ఒకరు అపార్థం చేసుకోవడం ఏంటి? అనే నెటిజన్స్ చర్చించుకుటున్నారు. తాజాగా వీరి బ్రేకప్‌పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. బిగ్‌బాస్ షోలో సిరితో షణ్ముఖ్ క్లోజ్‌గా ఉండడం వల్లే బ్రేకప్ చెబితే.. మరి అదే షోలో దీప్తి కూడా ఒక పర్సన్‌తో క్లోజ్‌గా ఉంది. నీ వరకు వచ్చేసరికి అది తప్పుకాదా? అని దీప్తిని ప్రశ్నించింది శ్రీరెడ్డి. ‘షణ్ముఖ్-దీప్తిలది చూడచక్కని జంట. అలాంటి వారు బ్రేకప్ చెప్పుకోడం అందిరితో పాటు నన్ను కూడా కలచివేసింది. మనం ఎన్ని చేసినా భారతీయులమనేది మరిచిపోవద్దు. జీన్స్ ఫ్యాంట్, టీ షర్ట్ వేసుకున్నా మన సంస్కృతి, సాంప్రదాయాలు మర్చిపోకూడదు. టెక్నాలజీ పరంగా మీరు డెవలప్ అవ్వండి. కానీ కొన్ని విషయాల్లో చాలా సెన్సిటీవ్ అయిపోతున్నారు.తట్టుకునే గుణం ఈ కాలం పిల్లలకు చాలా తక్కువగా ఉంది. మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజం. దీప్తి.. షణ్ముఖ్‌తో ఐదేళ్లు రిలేషన్షిప్లో ఉన్నావు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని నువ్వే చెప్పావు. బిగ్‌బాస్‌లో జరిగినదానికి షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పావని క్లియర్‌గా అర్ధం అవుతుంది.. మరి నువ్వు బిగ్ బాస్‌కి వెళ్లినప్పుడు ఒక పర్సన్‌తో ఎంత క్లోజ్‌గా ఉన్నావో.. మీ రిలేషన్ షిప్ ఏంటో అందరం చూశాం.. ఇది లవ్ ఏమో అని జనాలకి అనుమానం వచ్చేట్టుగా ప్రవర్తించావు. నీ వరకూ వచ్చేసరికి అది తప్పుగా అనిపించలేదా? షణ్ముఖ్‌తో పెళ్లి కాలేదు కాబట్టి.. బ్రేకప్ చెప్పింది. అదే పెళ్లై ఉంటే షణ్ముఖ్‌ని వదిలేసేదా? మనిషి అన్నాక తప్పులు చేస్తుంటారు.. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉన్నప్పుడు ఒకరి తప్పుల్ని ఒకర్ని క్షమించుకోవాలి. ఓపికతో ఉంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి’అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. అలాగే టాటూల గురించి మాట్లాడుతూ.. ‘పెళ్లికి ముందు టాటూలు వేయించుకున్న చాలా మంది విడిపోయారు. పెళ్లైన తరువాత వంద వేషాలు వేయండి.. దీప్తి సునయన కూడా టాటూలు వేయించుకుంది.. ఇప్పుడు అది రిమూవ్ చేయించుకోవాలని అనుకుంటుంది. మీపై మీకు నమ్మకం లేకపోతే టాటూలు వేయించుకోకండి’అని శ్రీరెడ్డి తనదైన స్టైల్లో చెప్పేసింది. -
హృదయం ముక్కలైపోయింది: షణ్నూ ఇన్‌స్టా పోస్ట్..
Shanmukh Posts Heart Broken Emoji After Deepthi Sunaina Live Chat: దీప్తి సునయన- షణ్ముఖ్ బ్రేకప్ విషయం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 5ఏళ్లు రిలేషన్ షిప్లో ఉన్న ఈ జంట బిగ్‌బాస్ ఎఫెక్ట్‌తో విడిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ తమ దారులు వేరంటూ షణ్ముఖ్‌తో దీప్తి సునయన తెగదెంపులు చేసుకుంది. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. తాజాగా బ్రేకప్ అనంతరం తొలిసారి అభిమానులతో ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన దీప్తి సునయన ఎంతో ఎమోషనల్ అయ్యింది. ఇన్నేళ్లలో తన లైఫ్ గురించి, కెరీర్ గురించి ఏనాడూ ఆలోచించలేదని, ఇకపై వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను అంటూ లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం అకస్మాత్తుగా లైవ్ నుంచి వెళ్లిపోయింది. అయితే దీప్తి లైవ్ చాట్ తర్వాత కాసేపటికే షణ్ముఖ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. హృదయం ముక్కలైపోయిన ఎమోజీలను జత చేశాడు. ప్రస్తుతం షణ్నూ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. మరోవైపు ఇలాంటి కష్ట సమయంలో మేం అండగా ఉంటాం అంటూ షణ్ముఖ్ ఫ్యాన్స్ అతనికి సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు. చదవండి: Shrihan: బిగ్‌బాస్ రేపిన చిచ్చు.. సిరి-శ్రీహాన్ కూడా విడిపోతారా? రౌడీ హీరో విజయ్‌తో రష్మిక డేటింగ్? లీకైన ఫోటోలు View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) -
వైరల్‌గా మారిన సిరి బాయ్‌ఫ్రెండ్ ఇన్‌స్టా పోస్ట్..
Shrihan Emotional Intsgram Post Amids Break Up Rumours With Siri: బిగ్‌బాస్ షోతో కొందరు ఓవర్ నైట్ స్టార్స్ అయితే, మరికొందరు మాత్రం ఇమేజ్ డ్యామేజ్ చేసుకొని బయటకు వస్తారు. తాజాగా బిగ్‌బాస్ సీజన్-5లో సిరి-షణ్ముఖ్‌లు కూడా ఈ విధంగానే నెగిటివిటీ మూటగట్టుకున్నారు. ఫలితంగా తమ ఐదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ దీప్తి సునయన షణ్ముఖ్‌తో విడిపోయింది. ఇక కలిసుండలేనంటూ తెగదెంపులు చేసుకుంది. ఇక అప్పటినుంచి శ్రీహాన్ కూడా త్వరలోనే సిరికి బ్రేకప్ చెప్పేస్తాడంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి ఇన్‌స్టా అకౌంట్లపై ఫోకస్ పెరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం(జనవరి3)న సిరి బర్త్‌డే సందర్భంగా శ్రీహాన్ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసుకున్నాడు. హ్యాపీ బర్త్‌డే సిరి.. ఈ సంవత్సరం పాజిటివ్ వైబ్స్‌తో నీ జీవితం సాగాలని ఆశిస్తున్నా. నీ లక్ష్యాలను త్వరలోనే సాధిస్తావ్. గాడ్ బ్లస్ యూ అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. కాగా బిగ్‌బాస్‌లో సిరిని ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా ఆమె గెలుపు కోసం చివరి వరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన శ్రీహాన్.. బిగ్‌బాస్ తర్వాత మాత్రం సిరితో కలిసి ఎక్కడా కనిపించలేదు. దీంతో దీప్తి- షణ్ముక్‌ల మాదిరిగానే వీళ్లు కూడా విడిపోతారా అనే ఊహాగానాల నేపథ్యంలో శ్రీహాన్ ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. -
షణ్నూతో బ్రేకప్.. లైవ్‌లో ఏడ్చేసిన దీప్తి సునయన
Bigg Boss 5 Telugu, Deepthi Sunania: బిగ్‌బాస్ షో అనంతరం షణ్ముఖ్ జశ్వంత్ ఎక్కడికి వెళ్లినా అతడి ప్రియురాలు దీప్తి సునయన గురించే ఆరా తీశారు అభిమానులు. ఎప్పుడు కలుస్తారు? పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఇద్దరూ కలిసి ఏవైనా సాంగ్స్ తీస్తున్నారా? అని వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి షణ్నూ త్వరలోనే దీపూను కలుస్తానని అప్పటిదాకా వెయిట్ చేయండని చెప్పాడు. కానీ న్యూ ఇయర్ రోజు ఈ జంట తమ ఐదేళ్ల రిలేషన్‌కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు పెద్ద షాకిచ్చారు. బ్రేకప్ తర్వాత దీప్తి సునయన తొలిసారిగా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చింది. 'నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్ గురించి, కెరీర్ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. ఇకపై నా గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాను' అని చెప్తూ దీప్తి తన కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేసింది. -
'బ్రేకప్‌కి కారణం నేను కాదు..ఇలా జరుగుతుందనుకోలేదు' సిరి ఎమోషనల్!..
Bigg Boss 5 Siri First Reaction After Shannu Deepthi Sunaina Break Up: సోషల్ మీడియా స్టార్స్ షణ్ముఖ్- దీప్తి సునయనల బ్రేకప్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 5ఏళ్లుగా కలిసున్న వీళ్లు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం ఏంటని వారి ఫ్యాన్స్ షాకవుతున్నారు. బిగ్‌బాస్ ఫినాలే వరకు షణ్నూకు సపోర్ట్ అందిస్తూ వచ్చిన దీప్తి సునయన బిగ్‌బాస్ షో ముగిశాక ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ కొన్ని రోజులుగా మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్లలో మార్పు తప్పదు అంటూ బ్రేకప్‌కి సంబంధించిన హింట్స్ ఇస్తూ వచ్చింది. తాజాగా న్యూఇయర్‌కి ఒకరోజు ముందుగా షణ్ముఖ్‌తో విడిపోతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. అయితే సిరి కారణంగానే షణ్నూ-దీప్తి సునయన విడిపోయారంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి సిరిని టార్గెట్ చేస్తూ నెట్టింట ట్రోలింగ్‌కు దిగారు. తాజాగా షణ్నూ- దీప్తి సునయన బ్రేకప్ అనంతరం సిరి తొలిసారిగా స్పందించింది. 'ఎవరైనా మీ దగ్గరికి వచ్చి.. మీ జీవితం చాలా కఠినంగా ఉందే అని కామెంట్స్ చేస్తే.. వాటికంటే నేను మరింత స్ట్రాంగ్ అని చిరునవ్వుతో సమాధానం చెప్పండి' అంటూప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మునిబా మజారి చెప్పిన కోట్స్‌ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీన్ని బట్టి.. పరోక్షంగా షణ్నూని స్ట్రాంగ్‌గా ఉండమని సలహా ఇస్తుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వీరి బ్రేకప్‌కి కారణం 'నేను కాదు..ఇలా జరుగుతుందనుకోలేదంటూ' సిరి తన సన్నిహితులతో చెబుతూ ఎమోషనల్ అయినట్లు సమాచారం. -
నా తప్పులు సరిదిద్దుకుంటాను: షణ్ముఖ్ కామెంట్స్ వైరల్
షణ్ముఖ్ జశ్వంత్.. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్. ఆ ఆదరణతోనే బిగ్‌బాస్ షోలో ఛాన్స్ కొట్టేసి ఐదో సీజన్లో పాల్గొన్నాడు. అభిమానుల అండతో ఫినాలేలో చోటు దక్కించుకుని రన్నరప్‌గా బయటకు వచ్చాడు. గెలుపుకు అడుగు దూరంలో ఆగిపోయిన అతడు ఇటీవలే వైజాగ్‌లో ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసి తనకు ఓట్లేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తాజాగా షణ్ను- దీప్తి సునయనకు బ్రేకప్ అయిన సందర్భంగా ఫ్యాన్స్ మీట్లో షణ్ముఖ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 'ఫ్యాన్స్ మీట్‌కు ఇంతమంది వస్తారని ఊహించలేదు. బిగ్‌బాస్ జర్నీ మీరు చూసే ఉంటారు. మీరంతా నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ సపోర్ట్ చేశారు. ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నా కాబట్టే మీరంతా దొరికారు. అమ్మానాన్నల మీద ఒట్టు.. మీరంతా గర్వపడేలా చేస్తా. ప్రతి మనిషిలో మంచి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు తప్పులు చేస్తుంటాడు. తప్పుల నుంచి నేర్చుకుంటాం, మంచి నుంచి డెవలప్ అవుతాం. నా తప్పులు నేను సరిదిద్దుకుంటాను' 'నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే హైదరాబాద్ వచ్చి సినిమాలు చేద్దామనుకున్నాను, కట్ చేస్తే యూట్యూబర్ అయ్యాను. కానీ ఐయామ్ నాట్ జస్ట్ ఎ యూట్యూబర్. ఒక యూట్యూబర్ సినిమాల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. దీపూ, నేను ఎన్ని గొడవలు పడ్డా మళ్లీ కలుస్తాం. కొంచెం వెయిట్ చేయండి' అని చెప్పుకొచ్చాడు షణ్నూ. కానీ వారం రోజుల్లోనే బ్రేకప్ చెప్పి అభిమానులను షాక్‌కు గురి చేశాడు. -
బ్రేకప్‌పై తొలిసారి స్పందించిన షణ్ముఖ్.. పోస్ట్ వైరల్
Shanmukh First Reaction On Breakup With Deepthi Sunaina: కొత్త సంవత్సరంలో అభిమానులకు షాక్ ఇస్తూ దీప్తి సునయన షణ్ముఖ్‌తో బ్రేకప్ చెప్పేసుకుంది. 5ఏళ్ల తమ బంధాన్ని తెంచేసుకుంటూ సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్ట్ పెట్టింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ దీప్తి సునయన మా దారులు వేరంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. కానీ షణ్ముక్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా తమ బ్రేకప్‌పై తొలిసారిగా షణ్ముక్ స్పందించాడు. 'ఆమెకు నిర్ణయం తీసుకునే హక్కుంది. తను ఇప్పటివరకు చాలా ఫేస్ చేసింది. ఇప్పటికైనా ఆమె సంతోషంగా, పీస్‌ఫుల్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మా దారులు వేరైనా స్నేహితులుగా కలిసుంటాం. నేను బెటర్ పర్సన్ అయ్యేందుకు ఈ 5 సంవత్సరాలు నువ్వు అందించిన సహాయానికి ధన్యవాదాలు. నువ్వు సంతోషంగా ఉండాలి. ఆల్ ది బెస్ట్ దీపూ'.. అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం షణ్నూ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ బ్రేకప్‌కి ప్రధానంగా బిగ్‌బాస్ కారణమని తెలుస్తుంది. షణ్నూ సిరితో క్లోజ్‌గా ఉండటం, ఫ్రెండిప్ అంటూనే వీరిద్దరు చేసిన అతి చాలామందికి నచ్చలేదు. స్వయంగా సిరి వాళ్ల మథర్ హౌస్‌లోకి వచ్చి హగ్గులు నచ్చలేదని, తీరు మార్చుకోలేదని చెప్పినా వీరు మాత్రం తమకు నచ్చినట్లే ఉన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నుంచి యూత్‌కి సైతం వీరి ప్రవర్తన నచ్చలేదు. సిరి-షణ్నూల తీరుతో అటు దీప్తి సునయన, శ్రీహాన్ సైతం ట్రోలింగ్‌ని ఎదుర్కున్నారు. -
మీది ఫేక్ రిలేషన్, ఐదేళ్ల ప్రేమబంధాన్ని ఒక్క షో తెంచేసిందా?
బిగ్‌బాస్ రియాలిటీ షోకు ప్రేక్షకుల ఆదరణ ఎంతగానో ఉంది. అందుకే పలు భాషలతో పాటు తెలుగులోనూ ఇది విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు తెలుగులో ఐదు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. అయితే బిగ్‌బాస్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఈ షోను విమర్శించేవాళ్లు కూడా లేకపోలేరు. షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. బిగ్‌బాస్ వల్ల అవకాశాలు, ఆదరణ దక్కిందని కొందరు, ఇమేజ్ డ్యామేజ్ అవడం తప్ప పైసా కూడా ఉపయోగం లేదని మరికొందరు ఇలా రకరకాలుగా మాట్లాడారు. నిజానికి హౌస్‌లో జరిగినదాంట్లో ఒక గంట ఎపిసోడ్ మాత్రమే ప్రసారం చేస్తారు. అసలు 24 గంటలు ఏం జరిగిందనేది కేవలం కంటెస్టెంట్లకు మాత్రమే తెలుస్తుంది. ఏ గొడవల్ని హైలైట్ చేయాలి? ఎవరిని నెగెటివ్‌గా చూపించాలి? ఎవరి రిలేషన్‌ను ఫోకస్ చేయాలి? అనేది బిగ్‌బాస్ టీమ్ చేతిలో ఉంటుంది. దీంతో ప్రేక్షకులు గంట ఎపిసోడ్ చూసి ఎవరేంటని ఓ నిర్దారణకు వస్తారు. అలా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో షణ్ముఖ్ జశ్వంత్‌ను బ్రహ్మగా భావించారు. అతడి మైండ్ గేమ్ చూసి గేమర్ అని పొగిడారు. అన్నీ బాగానే ఉన్నా సిరితో ఫ్రెండ్షిప్ మాత్రం మొదటికే మోసం తెచ్చింది. ఎందుకంటే షణ్నుకు ఆల్రెడీ గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన ఉంది. అటు సిరికి శ్రీహాన్‌తో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వీరిద్దరూ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాక ఆ విషయాలను మర్చిపోయినట్లు ప్రవర్తించారు. ఓ పక్క ఎమోషనల్ కనెక్ట్ అయిపోతున్నామని పశ్చాత్తాపపడుతూనే మరోపక్క హగ్గులిస్తూ, ఒకరి ఒడిలో ఒకరు నిద్రిస్తూ అతి చేశారు. హగ్గులు నచ్చడం లేదని సిరి తల్లి వచ్చి చెప్పినప్పటికీ ఇద్దరూ తీరు మార్చుకోలేదు. నన్ను వదిలేస్తున్నవా? అని శ్రీహాన్ అడిగినప్పుడు సైతం వాళ్ల ప్రవర్తనలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ఎప్పటిలాగే హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు. వీళ్ల వైఖరితో విసుగెత్తిపోయిన నెటిజన్లు ఫ్రెండ్షిప్ పేరుతో ఇలాంటి నీచపు పనులకు పాల్పడుతున్నారేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట మీకోసం ఒకరున్నారన్న విషయం మర్చిపోయి ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని విమర్శించారు. ఎంత ట్రోలింగ్ జరిగినా షణ్నుకు అండగా దీప్తి, సిరికి అండగా శ్రీహాన్ నిలబడ్డారు. వారి గెలుపుకు అడ్డు కావద్దనో ఏమో కానీ దీప్తి తన బాయ్‌ఫ్రెండ్ ప్రవర్తనతో మనసు కకావికలం అయిపోయినప్పటికీ బయటకు మాత్రం మౌనంగానే ఉండిపోయింది. షో ముగిసాక సరైన సమయం చూసుకుని అతడికి బ్రేకప్ చెప్పింది. ఇద్దరం బాగా ఆలోచించి విడిపోదామని నిర్ణయించుకున్నామని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ఇద్దరూ దూరమవ్వడానికి సిద్ధపడితే మరి షణ్ముఖ్ ఎందుకు బ్రేకప్ పోస్ట్ పెట్టలేదని ఆరా తీస్తున్నారు. కేవలం గంట సేపు ప్రసారమయ్యే బిగ్‌బాస్ షో చూసి విడిపోవాలనుకోవడం మూర్ఖత్వమని మండిపడుతున్నారు. ఐదేళ్ల ప్రేమను ఒక్క షో తెంచివేయగలిగిందంటే మీ బంధం ఎంత గట్టిదో అర్థమవుతుందని, అసలు మీది ఫేక్ రిలేషన్ అని విమర్శిస్తున్నారు. సిరి-శ్రీహాన్ బాగానే ఉనప్పుడు మీ జంట మాత్రం ఎందుకు విడిపోతున్నారో అర్థం కావడం లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. -
న్యూ ఇయర్లో షణ్నూకు బిగ్ షాకిచ్చిన దీప్తి సునయన
బిగ్‌బాస్ కంటెస్టెంట్లు షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయన బ్రేకప్ చెప్పుకోబోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే నిజమని తేల్చేసింది దీప్తి. తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కొత్త సంవత్సరానికి లవ్ బ్రేకప్‌తో స్వాగతం పలికింది. షణ్నుతో తన తెగదెంపుల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. 'ఎంతో ఆలోచించి, ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం.. షణ్ముఖ్, నేను పరస్పర అంగీకారంతో విడిపోయి ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. గత ఐదేళ్లలో మేము సంతోషంగా ఉన్నాం, అదే సమయంలో మాలోని రాక్షసులతో పోరాడాం. ఫైనల్‌గా మీరు కోరుకున్నట్లే ఈ నిర్ణయం తీసుకున్నాం.. ఇది చాలాకాలంగా కొనసాగుతోంది. ఈ బ్రేకప్ సోషల్ మీడియాలో కనిపించినంత ఈజీ అయితే కాదు. ఇద్దరం కలిసి ఉండటానికి ప్రయత్నించాం, కానీ జీవితానికి ఏవి అవసరమో వాటిని విస్మరించాం. మా ఇద్దరి దారులు వేరని తెలుసుకున్నాం. అందుకే ఇక్కడే ఆగిపోకుండా ముందుకు సాగాలని భావించాం. ఇది మాకెంతో క్లిష్ట సమయం. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు మా ప్రైవసీకి భంగం కలిగించరని కోరుతున్నాను' అని రాసుకొచ్చింది. కొత్త సంవత్సరంలో ఇద్దరూ కలిసిపోతారనుకుంటే ఇలా విడిపోయారేంటని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో పాల్గొన్న షణ్ముఖ్.. సిరితో ఎక్కువ కనెక్ట్ అయ్యాడు. ఫ్రెండ్ అంటూనే హగ్గులు, ముద్దుల దాకా వెళ్లాడు. హగ్గులు నచ్చడం లేదని సిరి తల్లి చెప్పినప్పటికీ వీళ్లిద్దరూ పద్ధతి మార్చుకోలేదు. ఈ వైఖరి దీప్తి సునయనకు కూడా నచ్చలేదట! అందుకే బిగ్‌బాస్ షోకు వచ్చినప్పుడు కనీసం సిరిని పలకరించనేలేదు. అయితే ఎన్ని గొడవలు పడ్డా కలిసిపోతామని చెప్తూ వచ్చిన షణ్ను ఈ బ్రేకప్‌పై ఎలా స్పందిస్తాడో చూడాలి! View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) -
మారక తప్పదంటూ దీప్తి పోస్ట్, షణ్నూతో బ్రేకప్ తప్పదా?
ప్రముఖ యూట్యూబ్ స్టార్స్, లవ్‌బర్డ్స్ షణ్ముక్ జశ్వంత్-దీప్తి సునైనాల ప్రేమ వ్యవహరం బ్రేకప్ దిశగా అడుగెలుస్తోన్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హౌజ్‌లో సిరి, షణ్ముక్‌ల అతి ఫ్రెండ్షిప్యే దీనికి కారణమని తెలిసిందే. హౌజ్‌లో సిరి-షణ్ముక్‌లు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం, తరచూ హగ్‌లు ఇచ్చుకోవడంతో ఇద్దరూ విపరీతమైన ట్రోల్స్ బారిన పడ్డారు. హౌజ్‌లో అడుగు పెట్టడానికి ముందే వీరిద్దరూ వేరేవారితో రిలేషన్లో ఉన్నప్పటికీ.. వీరి అతి ప్రవర్తన అందరిని ఇబ్బంది పెట్టింది. ఫలితంగా దీప్తి సునైనా కొద్ది రోజులుగా షణ్నును ఉద్దేశిస్తూ వరుస పోస్టులు పెడుతోంది. ఈ క్రమంలో ఆమె పోస్ట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేగాక హౌజ్ నుంచి బయటకొచ్చాక లైవ్‌లోకి వచ్చిన షణ్నూ కూడా తనను దీప్తి బ్లాక్ చేసిందని చెప్పాడు. అవి చూసి వారి ఫాలోవర్స్ ప్రస్తుతం షణ్నూపై దీప్తి కోపంగా ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో వారి సపరేషన్ను ఉద్దేశిస్తూ దీప్తి సునైనా తన ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో అది నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: Pradeep Machiraju: వైరల్ అవుతున్న యాంకర్ ప్రదీప్ ట్వీట్, మాచిరాజుపై నెటిజన్ల ప్రశంసలు ఈ పోస్ట్‌లో ఆమె ‘మారడం అసౌకర్యంగా ఉంది.. కానీ తప్పదు(Change is uncomfortable but necessary) అంటూ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ షేర్ చేసింది. ఇది చూసిన ఆమె ఫాలోవర్స్ దీప్తి పోస్ట్‌పై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. షణ్ముక్ నుంచి విడిపోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లుగా అభిప్రాయపడుతూ తన నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నారు. ‘గుడ్ డెసిజన్ దీప్తి గారు’, ‘మీరు వందశాతం సరైన నిర్ణయం తీసుకున్నారు’, ‘ఈ నిర్ణయానికే కట్టుబడి ఉండండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
దీప్తి సునయన బ్లాక్ చేసింది.. అప్పటివరకు వదలను: షణ్నూ
-
దీప్తి సునయన బ్లాక్ చేసింది.. అప్పటివరకు వదలను: షణ్నూ
Shanmukh Comments On Deepthi Sunaina And Siri In Live Chat: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్.(షణ్నూ). అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇచ్చి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అయితే సిరితో రిలేషన్, పదేపదే హగ్గులతో విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ఫలితంగా కప్పు చేజార్చుకొని రన్నరప్‌గా నిలిచాడు. హౌస్‌లోకి వచ్చే ముందే సిరికి శ్రీహాన్‌తో ఎంగేజ్మెంట్ జరగడం, షణ్నూ, దీప్తి సునయనతో రిలేషన్ షిప్లో ఉండటంతో వీరి రిలేషన్ ఆడియెన్స్‌కు అంతగా రుచించలేదు. దీంతో సోషల్ మీడియాలో సిరి-షణ్నూలు విపరీతమైన ట్రోలింగ్ బారిన పడ్డారు. ఇటీవలె బిగ్‌బాస్ ముగియడంతో హౌస్ నుంచి బయటకు వచ్చిన షణ్నూ.. తాజాగా ఇన్‌స్టాలో లైవ్ సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. దీప్తి సునయన గురించి ఎక్కువగా అడుగుండటంతో షణ్నూ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం తనని బ్లాక్ చేసిందని, దీంతో త్వరలోనే హైదరాబాద్ వెళ్లి తనని కలుస్తానని చెప్పుకొచ్చాడు. దీపు నా వల్ల చాలా నెగిటివిటిని ఫేస్ చేసింది. అయనప్పటికీ నాకోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను. ఇక తనతో బ్రేకప్ అయితే జరగదు. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపును వదలను' అంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు సిరితో తన ఫ్రెండ్షిప్ సైతం కంటిన్యూ అవుతుందని, జెస్సీ, సిరిలు తన బెస్ట్‌ఫ్రెండ్స్ అని తెలిపాడు. -
బిగ్‌బాస్ తర్వాత తొలిసారి కలుసుకున్న సిరి, షణ్నూ..ఫోటో వైరల్
Shanmukh And Siri, Jessie First Time Met After Bigg Boss, Video Viral: బిగ్‌బాస్ సీజన్-5లో సిరి-షణ్నూల రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీజన్లో ఎక్కువ ట్రోలింగ్ బారిన పడ్డ వారిలో వీరు ముందుంటారు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత ఇద్దరూ ఫ్రెండిష్ హగ్గంటూ శృతిమించి ప్రవర్తించడంతో విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో టైటిల్ రేసులో ఉన్న షణ్నూ రన్నరప్‌గా సరిపెట్టుకోక తప్పలేదు. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చిన సిరి-షణ్నూ తొలిసారిగా కలుసుకోవడం ఇప్పడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బెస్ట్‌ఫ్రెండ్ జెస్సీతో కలిసి వైజాగ్ రోడ్లపై సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా జెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. నెగిటివిటితో బయటకు వచ్చినా బిగ్‌బాస్ తర్వాత కూడా ఫ్రెండిప్ కంటిన్యూ చేయడం నెటిజన్లు మనసు గెలుచుకుంటుంది. -
Viral Video: బిగ్‌బాస్ తర్వాత తొలిసారి కలుసుకున్న సిరి, షణ్నూ..
-
షణ్నూకి ఛాలెంజ్ విసిరిన బిగ్‌బాస్ విన్నర్ సన్నీ
బిగ్‌బాస్ సీజన్-5 విజేత వీజే సన్నీ షణ్నూ, సిరిలతో పాటు సింగర్ శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు. బిగ్‌బాస్ అయిపోయింది ఇంక నామినేషన్స్ ఏంటి అనే కదా మీ డౌటు.. ఈ ఛాలెంజ్ బిగ్‌బాస్‌కి సంబంధించింది కాదు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. . పర్యావరణాన్ని రక్షించే మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సన్నీ.. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు షణ్ముక్, సిరి, శ్రీరామచంద్రలకు ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపాడు. -
బిగ్‌బాస్ రన్నరప్ షణ్నూ లగ్జరీ ఇంటిని చూశారా?
Bigg Boss 5 Telugu Runner up Shanmukh Jaswanth Vizag Home Tour: యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్ బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయ్యాడు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన షణ్నూ.. సిరితో మితిమీరిన రిలేషన్‌తో కప్పు చేజార్చుకున్నాడు. దీంతో రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటివరకు వెబ్‌సిరీస్‌లతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్న షణ్నూ..అదే రీతిలో నెగిటివిటీని సైతం మూటగట్టుకున్నాడు. అయితే ఇటీవలె విడుదలైన బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూతో అసలు షణ్నూ ఏంటో అర్థమయ్యిందని, అతని నిజాయితీ చేస్తుంటే ముచ్చటేస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇక షణ్ముక్ స్వస్థలం వైజాగ్ కాగా, కెరీర్ నిమిత్తం అతడు హైదరాబాద్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వైజాగ్‌లోని షణ్నూ ఇంటికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను షణ్న తల్లి షేర్ చేసుకున్నారు. ఓ యూట్యూబ్‌లో చానల్లో షణ్నూ 'హోం టూర్'ను రిలీజ్ చేశారు. మరి ఆ ఇల్లు ఎంత లగ్జరీగా ఉందన్నది మీరే చూసేయండి.. -
నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు: దీప్తి సునయన
అందరి బుర్రలను చదివే అపర మేధావి.. ఆచితూచి అడుగువేసే గేమ్ ప్లానర్... అనవసరంగా గొడవలు పెట్టుకోని మిస్టర్ కూల్.. ఫ్రెండ్ కోసం, ఫ్రెండ్షిప్ కోసం ఎంతకైనా తెగించే మనసున్న వ్యక్తి షణ్ముఖ్ జశ్వంత్. ఎంతో క్రేజ్‌తో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో అడుగుపెట్టిన ఇతడు ఎంతో నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వచ్చాడు. ఐదేళ్లుగా దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నానన్న అతడు బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం సిరికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నానంటూ ఆమెకు హగ్గులిస్తూ అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. ఏకంగా సిరి తల్లి వచ్చి హగ్గులివ్వడం నచ్చలేదన్నప్పటికీ వీళ్లిద్దరూ తీరు మార్చుకోలేదు. ఇది జనాలకు అస్సలు నచ్చలేదు. ఆమె తల్లి మాటకు గౌరవం ఇవ్వాల్సిందని షణ్ను మీద అసంతృప్తి వెళ్లగక్కారు. అయితే బయటకు వచ్చిన షణ్ను మాత్రం తమది ఫ్రెండ్షిప్ అని క్లారిటీ ఇస్తూ అందరి నోళ్లు మూయించాడు. కానీ సిరి వల్లే తాను ఓడిపోయి రెండో స్థానంలో ఉన్నానని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ షోలో షణ్ను ప్రవర్తనతో అతడి ప్రేయసి, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ దీప్తి సునయన హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్న పోస్టులతో అభిమానుల్లో రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో 'కనీసం నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు' అని రాసుకొచ్చింది. 'నా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారాయని తెలిసినప్పటికీ నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా', 'ఈ సంవత్సరం నాకేమీ బాగనిపించలేదు. కానీ చాలా నేర్చుకున్నాను..' అంటూ వరుస పోస్టులు పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు షణ్ను-దీప్తిల రిలేషన్ బాగానే ఉందా? అంటూ ఆరా తీస్తున్నారు. దీప్తి పోస్టులు చూస్తుంటే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకునేలా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఊహాగానాలపై షణ్ను, దీప్తిలు ఏమని స్పందిస్తారో చూడాలి! View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) -
సిరికి కనెక్ట్ అవ్వడం వల్లే ఓడిపోయాను : షణ్నూ
Shannu Shocking Comments On Relationship With Siri: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్.. అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇచ్చి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత సిరితో రిలేషన్, పదేపదే హగ్గులతో విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. హగ్గులు నచ్చడం లేదని స్వయంగా సిరి తల్లి వచ్చి చెప్పినా ఇద్దరూ తీరు మార్చుకోలేదు. పదేపదే ఫ్రెండిష్ హగ్గంటూ శృతిమించి ప్రవర్తించారు. దీంతో సోషల్‌మీడియాలో వీరిద్దరూ విపరీతంగా ట్రోల్స్ బారిన పడ్డారు. షణ్నూతో ఫ్రెండిష్ సిరికి ఓటింగ్ విషయంలో కాస్త కలిసి వచ్చినా షణ్నూకి మాత్రం బాగా దెబ్బతీసింది. సిరితో రిలేషన్ వల్లే విన్నర్ అవ్వాల్సిన షణ్నూ..రన్నరప్ అయ్యాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో అరియానా ప్రశ్నించగా ఫణ్నై సైతం అంగీకరించడం విశేషం. సిరితో కనెక్ట్ కావడం వల్లే రన్నరప్‌గా బయటకు వచ్చాను అని అనుకుంటున్నారా అని అరియానా ప్రశ్నించగా.. అదే జరిగింది అంటూ తన మనసులో మాటను బయటపెట్టేశాడు. సిరితో రిలేషన్ వల్ల టైటిల్ కోల్పోతానని తనకి ముందే తెలిసినా తన ఎమోషన్స్‌ని ఫేక్ చేయలేనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. చదవండి: షణ్నూ చాలా స్పెషల్, బయట కూడా అలాగే ఉంటాం: సిరి సిరికి చుక్కలు చూపించిన అరియానా.. ప్రతి ప్రశ్నలో కౌంటర్ అటాక్ -
అమ్మ మీద ఒట్టు.. నాకు ఆ విషయం తెలీదు : షణ్ముఖ్
బుల్తి తెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్‌గా సన్నీ గెలుపొందగా, రన్నరప్‌గా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే షో స్టార్టింగ్ నుంచి విన్నర్ రేసులో షణ్ముఖ్ ముందు ఉన్నాడు. ఈ సారి కప్పు షణ్ముఖ్‌కే అని అంతా ఊహించారు. అంతేస్థాయిలో షణ్ముఖ్ ప్రతిసారి ఎలిమినేషన్ ఉన్నా.. బయపడకుండా, తన వేలో గేమ్ ఆడుతూ వచ్చాడు. అందరి గేమ్‌ని అంచనా వేస్తూ బిగ్‌బాస్ బ్రహ్మగా పేరు పొందాడు. కానీ చివరికి టైటిల్‌కి అడుగు దూరంలో ఆగి.. రన్నరప్‌గా నిలిచాడు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే తనది రెండో స్థానం అని షణ్ముఖ్‌కి తన ప్రియురాలు చెప్పినట్లు వార్తలు వినిపించాయి. #SoulOfBB5VJSunny GUYS LEAK EECHIDHI DEEPTHI SUNAINA pic.twitter.com/KBCsfhqe1G — Ryukendo Ryuke (@RyukendoR) November 28, 2021 నవంబర్ 27న జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌కి షణ్ముఖ్ ప్రియురాలు దీప్తి సునైనా వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె రెండు వేళ్లతో మైక్‌ని పట్టుకొని తను రెండో స్థానంలో ఉన్నాడని చెప్పిందంటూ... ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాను అలా చేయలేదని దీప్తి క్లారిటీ ఇచ్చినప్పటికీ.. నెటిజన్స్‌లో మాత్రం దీప్తి ముందే చెప్పిందని అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ విషయంపై షణ్ముఖ్ క్లారిటీ ఇచ్చాడు. అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ బజ్ షోలో పాల్గొన్న షణ్ముఖ్.. ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘మా అమ్మ మీద ఒట్టు.. నాకు ఆ విషయం తెలియదు. అయినా దీప్తి అలా చెప్పి ఉండదు. ఒకవేళ నిజంగానే తను అలా చెప్పి ఉంటే సిరితో ఫ్రెండ్షిప్ ఎందుకు కంటిన్యూ చేస్తా? నా పొజిషన్ గురించి నాకు ముందే తెలుసు. 11వ వారంలోనే సన్నీ విజేత, నేను రన్నరప్ అని ఊహించా. అంతేకానీ దీప్తి మాత్రం నాకు ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వలేదు’ అని చెప్పుకొచ్చాడు. (చదవండి: : షణ్ను లేకపోయుంటే సిరి టాప్ 5లో ఉండేదే కాదు: శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు) -
సిరికి చుక్కలు చూపించిన అరియానా.. ప్రతి ప్రశ్నలో కౌంటర్ అటాక్
BB5 Siri Bigg Boss Buzz Interview With Ariyana, Check Promo Inside: బిగ్‌బాస్ టాప్-5లో చోటు దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్ సిరి. మొదటి నుంచి అబ్బాయిలకు సమానంగా గట్టి పోటీ ఇచ్చిన సిరి ఒక దశలో టాప్-3 ఉంటందనుకున్నారు. కానీ షణ్నూతో మితిమీరిన హగ్గులతో విపరీతంగా ట్రోల్స్ బారిన పడింది. పైకి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పినా జనాలకు మాత్రం వీరి మధ్య ఇంకేదో రిలేషన్ ఉందని గట్టిగా ఫిక్స్ అయ్యేలా ప్రవర్తించారు. దీంతో అప్పటివరకు వీళ్లకు సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్లు సైతం సైడయ్యారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం అరియానాతో బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా సన్నీని కావాలనే టార్గెట్ చేశావా అన్న ప్రశ్నకు లేదు అని ఆన్సర్ ఇచ్చింది. టాస్కుల్లో ఎప్పుడూ గొడవలే జరుగుతుండటంతో ఇక ఫ్రెండిష్ ఎక్కడ నుంచి వస్తుంది అని బదులిచ్చింది. దీంతో మరి షణ్నూతో కూడా గొడవలు అవుతుంటాయి కదా అంటూ అరియానా కౌంటర్ వేసింది. ఇక రవిని నామినేట్ చేసి అతను ఎలిమినేట్ అయ్యాక మాత్రం రవి కోసం గేమ్ ఆడుతున్నాం అని చెప్పడం ఏంటి అని అడగ్గా.. కొంచెం సందేహంలో పడిపోయిన సిరి రవి ఎలిమినేషన్‌ను ఊహించలేదని ఆన్సర్ ఇచ్చింది. చివరగా ఒకనొక సందర్భంలో చోటు లేదా షణ్నూ ఇద్దరిలో ఒకరినే సెలక్ట్ చేసుకోవాలి అంటే ఎవరిని ఎంచుకుంటావ్ అంటూ అరియానా ప్రశ్నించింది. దీంతో ఒకింత అయోమయంలో పడిపోయిన సిరి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు.. అరియానా అడిగిన ప్రశ్నలకు సిరికి బొమ్మ కనపడుతుందంటూ నెటిజన్లు సెటైర్లు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ మా రిలీజ్ చేసింది. -
స్టేజ్‌పై సన్నీ అన్న మాటలకు ఎమోషనల్ అయిన సిరి
Bigg Boss 5 Winner Sunny Comments On Shanmukh Friendship With Siri:ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన సన్నీ టైటిల్ ఎగరేసుకుపోయాడు. టాస్కుల్లో వందశాతం ఆడటంతో పాటు హౌస్‌లో రియల్ ఎంటర్టైనర్ అనే పేరు సంపాదించాడు. దీంతో పాటు షణ్నూ-సిరిలపై నెగిటివిటి పెరగడం సన్నీకి మరింత లాభం చేకూర్చింది. మచ్చా అంటూ తనదైన మ్యానరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నీ బిగ్‌బాస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గ్రాండ్ ఫినాలేలో మాట్లాడిన సన్నీ.. సిరి, షణ్నూల రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'షణ్నూ-సిరిల రిలేషన్ గురించి ఒక క్లారిటీ ఇస్తాను. అది ఈ స్టేజ్ మీదే మాట్లాడాలి. సిరి, అండ్ షణ్ముఖ్ అలాంటి ఫ్రెండిష్ దొరకడం అదృష్టం. నాకు, మానస్‌కు మధ్య ఎలాంటి స్నేహం ఉందో వాళ్లిద్దరి మధ్య కూడా అదే ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు. సన్నీ అన్న మాటలకు సిరి ఎమోషనల్ అయ్యింది. -
ప్రైజ్‌మనీ కన్నా ఎక్కువే సంపాదించిన షణ్ముఖ్!
Bigg Boss Telugu 5 Runner Up Shanmukh Jaswanth Earnings In Bigg Boss: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ బిగ్‌బాస్ షోలో అడుగుపెడుతున్నాడనగానే చాలామంది టైటిల్ అతడిదే అని ఫిక్సయిపోయారు. వెబ్‌సిరీస్‌లతో భారీగా అభిమానులను కూడగట్టుకున్న అతడు ఈ సీజన్ ట్రోఫీని ఈజీగా గెలిచేస్తాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. కానీ షణ్ను ఎంట్రీ ఇచ్చాక సీన్ రివర్స్ అయింది. షో ప్రారంభంలో అయితే ఎందుకొచ్చాన్రా దేవుడా అన్నట్లుగా అతడు ఏదో ఒక మూలన ఉండేవాడు. టాస్కుల్లో ఆడటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపేవాడు కాదు. అంతదాకా ఎందుకు.. తన బిడియాన్ని వదిలించుకుని మాట్లాడటానికే అతడికి చాలావారాల సమయం పట్టింది. బిగ్‌బాస్ షో సగానికి వచ్చాక అప్పుడు ఆట మొదలెట్టాడు. మాటకు మాట సమాధానమిచ్చాడు. ఎదుటివారి ఎత్తుగడలను చిత్తు చేస్తూ బ్రహ్మగా పేరు తెచ్చుకున్నాడు. సిరి, జెస్సీలే లోకంగా మోజ్ రూమ్‌లో ముచ్చట్లాడేవాడు. కాకపోతే 'అతి' అతడిని దారుణంగా దెబ్బతీసింది. ఎవరేం చేసినా, ఏం మాట్లాడినా అదంతా గేమ్ అంటూ అతిగా ఆలోచించేవాడు. జెస్సీ వెళ్లిపోవడంతో సిరిని ఎలాగైనా కాపాడుకోవాలన్న తాపత్రయంలో తనకు తెలీకుండానే సిరిపై అజమాయిషీ చేశాడు. కానీ ఇది చాలామందికి నచ్చలేదనుకోండి అది వేరే విషయం. ఎవరితోనూ పెద్దగా కలవకుండా కామ్‌గా ఉంటూనే కత్తిలాంటి ప్లాన్లు వేస్తూ వచ్చిన షణ్ముఖ్ ఈ సీజన్ రన్నరప్‌గా నిలిచాడు. గెలుపు అంచుల దాకా వచ్చి టైటిల్ మిస్ అయిన ఈ బిగ్‌బాస్ బ్రహ్మకు పారితోషికం మాత్రం గట్టిగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క వారానికి అతడికి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ముట్టజెప్పారట. యాంకర్ రవి తర్వాత ఎక్కువ పారితోషికం అందుకుంటున్న షణ్ను మొత్తంగా పదిహేనువారాలకుగానూ రూ.65 లక్షల పైనే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు నెట్టింట ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఇదెంతవరకు నిజమో తెలీదు కానీ ఇది విన్నర్ ప్రైజ్‌మనీ కన్నా కూడా ఎక్కువ కావడం విశేషం. -
షణ్నూ చాలా స్పెషల్, బయట కూడా అలాగే ఉంటాం: సిరి
Bigg Boss 5 Siri Comments About Her Marriage And Negative Trolls On Social Media: బిగ్‌బాస్ షోలో సిరి-షణ్నూల రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ బెస్ట్‌ఫ్రెండ్స్ అని స్టేట్మెంట్స్ ఇచ్చినా ఆడియెన్స్‌కు మాత్రం వీరి రిలేషన్ అంతగా రుచించలేదు. బయట వీరిద్దరికి బాగానే ఫాలోయింగ్ ఉన్నా హౌస్‌లోకి వచ్చాక మాత్రం నెగిటివిటి పెరిగింది. ఈ కారణంగానే టైటిల్ రేసులో ఉన్న షణ్ముక్ కప్పు చేజార్చుకున్నాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా హౌస్ నుంచి బయటకు వచ్చిన సిరి తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్, షణ్నూతో తనకున్న రిలేషన్ గురించి మాట్లాడింది. 'బయటకు రాగానే యూట్యూబ్‌లో వచ్చిన థంబ్‌నేల్స్, వీడియోలు,సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ చూసి షాక్ అయ్యా. షణ్నూ నాకు చాలా మంచి ఫ్రెండ్. నా లైఫ్‌లోనే తను చాలా స్పెషల్. హౌస్ లోపల ఎంత నిజాయితిగా ఉన్నామో, బయటకు వచ్చాక కూడా మేం అలాగే ఉంటాం. షణ్నూ నన్ను చాలా మోటివేట్ చేసేవాడు. అలా మేం క్లోజ్ అయ్యాం. కానీ హగ్ చేసుకోవడం బయట రిసీవ్ చేసుకోలేదు' అని అర్థమైంది. అయినా మా పర్సనల్ లైఫ్ గురించి మా ఇద్దరికీ క్లారిటీ ఉంది. మా లైఫ్ పార్టనర్స్‌కి కూడా క్లారిటీ ఉంది అని చెప్పుకొచ్చింది. ఇక ప్రియుడు శ్రీహాన్‌తో పెళ్లి గురించి మాట్లాడుతూ.. తను ఎప్పుడంటే అప్పుడే మా పెళ్లి. బయట ఒకవేళ సినిమా ఆఫర్స్ వస్తే అవి చేస్తూనే పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తా అని పేర్కొంది. -
బిగ్‌బాస్ విన్నర్ సన్నీ ఏమేం గెలుచుకున్నాడంటే?
Bigg Boss Telugu 5 Winner: VJ Sunny is the Title Winner of Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. మోస్ట్ ఎంటర్టైనర్ సన్నీ బిగ్‌బాస్ విజేతగా అవతరించాడు. తనే విన్నర్ అని చెప్పగానే సంతోషంతో నాగార్జునను ఎత్తుకున్నాడు. ఇక తాను పడ్డ వంద రోజుల కష్టమంతా ట్రోఫీ అందుకోగానే మటుమాయమైపోయింది. ఎన్నో ఏళ్లుగా సన్నీ పడుతున్న కష్టానికి నేడు ప్రతిఫలం దక్కిందని అతడి తల్లి భావోద్వేగానికి లోనైంది. ఇక యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ గెలుపుకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు. తనకున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పెద్ద మొత్తంలో ఓట్లు సాధించినప్పటికీ సన్నీని దాటలేకపోయాడు. దీంతో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు. విజేతగా అవతరించిన సన్నీకి కింగ్ నాగార్జున బిగ్‌బాస్ ట్రోఫీని బహుకరించాడు. అంతేకాక రూ.50 లక్షల చెక్‌ను అందజేశాడు. దీనితో పాటు సువర్ణ భూమి ఇన్ఫ్రాస్టక్చర్ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని విన్నర్ సన్నీ సొంతం చేసుకున్నట్లు ప్రకటించాడు. టీవీఎస్ బైక్ కూడా గెలుచుకున్నాడని ప్రకటించాడు. గెలిచామా? లేదా అన్నది కాదు, ఎలా ఆడామన్నది ముఖ్యం అని చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా గెలవచ్చాన్నాడు. తర్వాత విన్నర్ స్పీచిచ్చాడు సన్నీ. ఈ సందర్భంగా నన్ను గెలిపించిన ఆడియన్స్‌ను ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటానని మాటిచ్చాడు. మనమెంత కొట్టుకున్నా సరే హౌస్మేట్స్ అందరం కలిసే ఉందామన్నాడు సన్నీ. అమ్మ అడిగిన మొట్టమొదటి బహుమతి బిగ్‌బాస్ ట్రోఫీ అంటూ దాన్ని ఆమె చేతుల్లో పెట్టి సంతృప్తి చెందాడు. తర్వాత షణ్ను గురించి మాట్లాడుతూ.. షణ్ను, సిరికి అంతమంచి ఫ్రెండ్షిప్ దొరకడం అదృష్టమని, తనకూ మానస్కూ మధ్య అలాంటి ఫ్రెండ్షిప్పే ఉందన్నాడు. నువ్వు చాలామంది మనసులు గెలుచుకున్నావ్ షణ్నూ అంటూ అతడిపై పొగడ్తలు కురిపించాడు. మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. విన్నర్‌కు ప్లాట్ ఇచ్చిన సువర్ణ కుటీర్ డెవలపర్స్ రన్నరప్ షణ్నుకు కూడా ఎంతో కొంత ప్లాట్ ఇస్తామని ముందుకు రావడం విశేషం. ఇక ఐదో సీజన్‌కు గుడ్‌బై చెప్పిన నాగ్.. మరో రెండు నెలల తర్వాత కొత్త సీజన్ మొదలవుతుందని హింటిచ్చాడు. అది బిగ్‌బాస్ ఐదవ సీజనా? లేదా బిగ్‌బాస్ ఓటీటీనా? అన్నది మాత్రం స్పష్టతనివ్వలేదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సన్నీ విన్నర్, రన్నరప్‌తో సరిపెట్టుకున్న షణ్ముఖ్!
Bigg Boss Telugu 5 Winner And Runner up: బిగ్‌బాస్ షోలో నామినేషన్స్, ఎలిమినేషన్స్నే వదలిపెట్టని లీకువీరులు గ్రాండ్ ఫినాలేను మాత్రం వదులుతారా? ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నిన్న సిరి, మానస్ ఎలిమినేట్ అయ్యారని వెల్లడించిన లీకువీరులు తాజాగా మిగిలిన ముగ్గురిలో విజేత ఎవరో తేలిపోయిందంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అందరూ ఊహించినట్లుగా వీజే సన్నీ విజేతగా అవతరించాడని చెప్తున్నారు. ఇక రెండో ర్యాంకు కోసం శ్రీరామ్, షణ్ను మధ్య గట్టి పోటీ కనిపించినప్పటికీ షణ్ను రన్నరప్‌గా నిలవగా శ్రీరామ్ సెకండ్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడట! ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ట్రోఫీని సన్నీ ఎగరేసుకుపోయాడోచ్ అంటూ అతడి అభిమానులు అప్పుడే సంబరాలు మొదలు పెట్టారు. దాదాపు ఇదే నిజమయ్యే అవకాశాలున్నాయి. మరి సన్నీ ట్రోఫీ అందుకున్న క్షణాలను ఆస్వాదించాలంటే కాసేపు ఆగాల్సిందే! -
ఆడేసుకున్న మాజీ కంటెస్టెంట్లు, అంతా బిగ్‌బాస్ వరకే అన్న షణ్ను!
Bigg Boss Telugu 5, Episode 105: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఫైనలిస్టులతో మాజీ సీజన్ల కంటెస్టెంట్లు రచ్చరచ్చ చేశారు. మొదటగా ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్లు శివబాలాజీ, హరితేజ హౌస్‌మేట్స్‌తో ముచ్చటించారు. శ్రీరామ్‌తో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా వారు వెళ్లిపోతారని సెటైర్ వేయడంతో అతడు తల పట్టుకున్నాడు. తర్వాత ఒక పీపా పట్టుకుని ఊదితే ఆ పాటేంటో హౌస్మేట్స్ గెస్ చేయాలి. పాట సరిగ్గా గెస్ చేస్తే దానికి డ్యాన్స్ చేయాలి. ఈ క్రమంలో షణ్ను, సిరి కలిసి జంటగా స్టెప్పులేస్తుంటే మిగతా ముగ్గురు మాత్రం ఎవరికి వారే డ్యాన్స్ చేశారు. ఇది చూసిన హరితేజ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన ముగ్గురిపై జాలి చూపించింది. దీంతో రెచ్చిపోయిన శ్రీరామ్ సిరిని ఎలిమినేట్ చేసినట్లే చేసి మళ్లీ తీసుకొచ్చారంటూ జోక్ చేశాడు. ఇక హరితేజ బిగ్‌బాస్ షో గురించి, టాప్ 5 కంటెస్టెంట్ల గురించి హరికథ చెప్పి వీడ్కోలు తీసుకున్నారు. తర్వాత రెండో సీజన్ కంటెస్టెంట్లు గీతా మాధురి, రోల్ రైడా ఆటపాటలతో హౌస్‌మేట్స్‌ను అలరించారు. టాప్ 5లో చోటు దక్కించుకున్న సిరి తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఆదర్శం అంటూ తెగ పొగిడాడు. అయితే వచ్చిన కంటెస్టెంట్లు అందరూ పొగడ్తలతో పాటు షణ్ను, సిరిల ఫ్రెండ్షిప్పై సెటైర్లు వేస్తూ వారిని ఓ ఆటాడుకుండటంతో సన్నీ, మానస్, శ్రీరామ్ పడీపడీ నవ్వారు. అసలే చిన్న మాట అంటేనే తట్టుకోలేని షణ్ను ఇలా అందరూ కలిసి తన మీద పడిపోవడంతో అట్టుడికిపోయాడు. మనిద్దరం హైలైట్ అయిపోతున్నామని ముగ్గురికీ మండిపోతున్నట్లుందని సిరితో వాపోయాడు. అయితే సిరి మాత్రం ఏ షిప్ అయినా బిగ్‌బాస్ హౌస్ వరకే అని షణ్ను అన్న మాటను గుర్తు చేసుకుని బాధపడింది. దీంతో అతడు సిరిని ఓదార్చుతూ హగ్ చేసుకున్నాడు. ఇది చూసిన సన్నీ.. బయటకు వెళ్లాక షణ్ను హగ్ గురూ అయిపోతాడని కామెంట్ చేశాడు. అనంతరం నాలుగో సీజన్ కంటెస్టెంట్లు శివజ్యోతి, సావిత్రి హౌస్‌మేట్స్‌తో కబుర్లాడారు. బెలూన్లలోని హీలియం పీల్చుకుని పాట లేదా డైలాగులు చెప్పాలన్నారు. ఈ గేమ్‌లో హౌస్మేట్స్ గొంతులు మారిపోవడంతో అందరూ పడీపడీ నవ్వారు. ఐదో సీజన్ కంటెస్టెంట్లు అఖిల్ సార్థక్, అరియానా వచ్చీరాగానే శ్రీరామ్ చేసిన మొట్ట మొదటి ఆల్బమ్‌లోని సాంగ్ ప్లే చేయడంతో అతడు సర్ప్రైజ్ అయ్యాడు. ఆ వెంటనే కంటెస్టెంట్లందరినీ కొన్ని సరదా ప్రశ్నలడిగారు. అందులో భాగంగా డేటింగ్ యాప్‌లో ఎవరినైనా కలిశారా? అని అడగ్గా సన్నీ ఒకరిని కలిశాను కానీ ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పుకుంటూ పోయిందని, దీంతో తానే ఆమెను ఓదార్చాల్సి వచ్చిందన్నాడు. వేరే కంటెస్టెంట్ టవల్ వాడారా? అన్న ప్రశ్నకు షణ్ను.. శ్రీరామ్ టవల్ వాడానని చెప్పగా మధ్యలో సిరి కలగజేసుకుంటూ తన టవల్ కూడా వాడాడని ఆరోపించింది. కొన్ని ఫొటోలు చూపించి అవి హౌస్‌లో ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్న గేమ్‌లో శ్రీరామ్ గెలిచాడు. సిరి తాను తీసుకోవాలనుకుని మర్చిపోయిన ఫొటోను అఖిల్, అరియానా చూపించడంతో ఆమె చాలా సర్ప్రైజ్ అయింది. అంతేకాదు షణ్ను, సిరి ఆ ఫొటోలో ఏ పాటకైతే డ్యాన్స్ చేశారో మరోసారి అదే సాంగ్‌కు స్టెప్పులేశారు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ సరదా సరదాగా సాగింది. -
విన్నర్ గురించి హింట్ ఇచ్చిన దీప్తి సునయన? దేత్తడి హారిక ఫైర్!
Bigg boss 5 Telugu: బిగ్‌బాస్ విజేత ఎవరై ఉంటారు? సన్నీ గెలిచాడా? లేదా యూట్యూబ్ స్టార్ షణ్ను గెలిచాడా? అబ్బే.. సింగర్ శ్రీరామ్ ట్రోఫీ సాధిస్తాడేమో, సిరి, మానస్ ముందే ఎలిమినేట్ అయిపోతారేమో! ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. నిన్నటిదాకా ఓటింగ్ వేస్తూ అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించుకోవడానికి నానాతంటాలు పడ్డ బుల్లితెర ప్రేక్షకులు రిజల్ట్ ఏమని వస్తుందా? అని ఊపిరి బిగపట్టుకుని ఎదురు చూస్తున్నారు. అనఫీషియల్ ఓటింగ్‌లో సన్నీ గెలుస్తాడని ప్రచారం జరుగుతోంది కానీ ఇదే నిజమని పూర్తిగా నమ్మలేం. ఎందుకంటే కొన్ని షాకింగ్ ఎలిమినేషన్లతో బిగ్‌బాస్ మనం ఊహించనివి కూడా చేసి చూపిస్తాడని నిరూపించాడు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం సన్నీ విన్నర్ అని, షణ్ముఖ్ ట్రోఫీ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయాడని పుకార్లు మొదలయ్యాయి. ఇది షణ్ను ప్రేయసి దీప్తి సునయన కంట కూడా పడిందో ఏమో కానీ ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టింది. 'జీవితంలో ప్రతీది ఏదో ఒక కారణంతోనే జరుగుతోంది, షణ్ముఖ్ కోసం నిలబడినందుకు, మీ ప్రేమ అందించినందుకు ధన్యవాదాలు' అని రాసుకొచ్చింది. ఇక బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్ దేత్తడి హారిక అయితే ఏకంగా స్టార్ మాను తిడుతూ పోస్ట్ పెట్టింది. ఇది చెత్త నిర్ణయం స్టార్ మా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పోస్ట్‌తో వీక్షకుల్లో ఎన్నో సందేహాలు తలెత్తాయి. ఇంతకీ ఎవరు గెలిచారని హారిక అలా పోస్ట్ పెట్టిందని గుసగుసలు పెడుతున్నారు. -
Bigg Boss5 Telugu: బిగ్‌బాస్-5 విజేతగా సన్నీ?.. నెట్టింట లీకైన ఓటింగ్!
Bigg Boss Telugu 5 Grand Finale: Winner Prediction: బిగ్‌బాస్ సీజన్-5 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నాడు జరగనున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌తో ఈ సీజన్‌కు తెరపడనుంది. దీంతో టైటిల్ విన్నర్ ఎవరన్న దానిపై సర్వంత ఉత్కంఠ నెలకొంది. టాప్-5 కంటెస్టెంట్లలో టైటిల్ కోసం గట్టి పోటీ ఉన్నా ప్రధాన పోటీ మాత్రం సన్నీ- షణ్ముక్‌ల మధ్యే ఉండనున్నట్లు తెలుస్తుంది. యూట్యూబ్ స్టార్‌గా ఎంట్రీ ఇచ్చిన షణ్నూ ఓటింగ్‌లో మాత్రం సన్నీ కంటే వెనుక ఉన్నట్లు అన్ అఫీషియల్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. ఇప్పటివరకు ఓటింగ్ పర్సంటేజీలను చూస్తే సన్నీనే టాప్‌లో ఉన్నాడని తెలుస్తోంది. 34% ఓట్లతో సన్నీ విజేతగా నిలిచాడని సోషల్‌మీడియాలో టాక్ వినిపిస్తుంది. టైటిల్ రేసులో ఉన్న షణ్నూ 31%ఓట్లతో రెండో స్థానంలో, 20% ఓట్లతో శ్రీరామ్ మూడవ స్థానంలో, 8% ఓట్లతో మానస్ నాలుగో స్థానంలో నిలవగా , అత్యల్పంగా సిరికి7%ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు లీకు వీరులు చెప్పినట్లుగానే ఎపిసోడ్ సహా ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. దీంతో ఇప్పుడు మరోసారి లీకువీరులు అందించిన ఈ సమాచారం నిజమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే ఫినాలే ప్రసారం అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే. -
త్వరలో సిరి పెళ్లి, హనీమూన్‌కు ఫారిన్ ట్రిప్! కానీ
Bigg Boss Telugu 5, Episode 104: సన్నీతో జరిగిన గొడవతో సిరి బాగా హర్ట్ అయినట్లు ఉంది. రాత్రిపూట కూడా నిద్రపోకుండా ఏడుస్తూ ఉండిపోయింది. ఒక్క గేమ్ ఓడిపోతే ఓడిపోయినట్లేనా అంటూ అర్ధరాత్రి 1 గంటలకు బాత్రూమ్లో గుక్కపెట్టి ఏడ్చింది. తనను కొట్టడానికి సన్నీ మీదమీదకొచ్చాడంటూ వాపోయింది. దీంతో ఆమెను హత్తుకుని ఓదార్చిన షణ్ను ఎవడికీ కొట్టేంత సీన్ లేదని తేల్చి చెప్పాడు. నేనేదైనా అంటే ఫీల్ అవ్వు కానీ ఇంకెవడన్నా ఏడవద్దు, మూసుకుని కూర్చో అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. బిగ్‌బాస్ ప్రయాణంలో తుది మజిలీకి చేరుకున్న మీలో ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని కుదిపేసి ఉంటాయని, మీ జాతకాలేంటో తెలుసుకోండంటూ జ్యోతిష్యురాలు శాంతిని పంపాడు బిగ్‌బాస్. ఆమె మొదటగా షణ్ను గురించి చెప్తూ.. జీవితంలో మంచి మార్పు ఉండబోతుంది. మీ ప్రేమ జీవితం బాగుండబోతోంది. కొంగొత్త అవకాశాలతో కావాల్సినంత సంపాదించబోతారు అని చెప్పింది. సన్నీ దగ్గరకు వచ్చేసరికి.. కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు. బయటకు వచ్చాక కొత్త ప్రయాణం మొదలుపెడతారు. కార్డ్‌లో స్వప్న సుందరి వచ్చింది అంటూ త్వరలో అతడు ప్రేమలో పడతాడని హింట్ ఇచ్చింది. ఇక సిరి గురించి చెప్తూ.. త్వరలో పెళ్లిబాజాలు మోగనున్నాయని శుభం పలికింది. శ్రీరామచంద్రకు గెలుపు కార్డు వచ్చిందన్న ఆమె అతడు లోలోపల చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడంది. బిగ్‌బాస్ షో తర్వాత అతడికి ఎన్నో అవకాశాలు రాబోతున్నాయని పేర్కొంది. మానస్‌కు బిగ్‌బాస్ జర్నీ తర్వాత అన్నీ సాధించానన్న తృప్తి మిగులుతుందని తెలిపింది. ఇక అందరి లవ్ లైఫ్ గురించి చెప్తూ వచ్చిన జ్యోతిష్యురాలు షణ్ముఖ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆగిపోయింది. బిగ్‌బాస్ షోలోని లవ్ లైఫ్ గురించి చెప్పాలా? బయట లవ్ లైఫ్ గురించి చెప్పాలా? అనడంతో సిరి, షణ్నులకు నోట మాట రాలేదు. వెంటనే షాక్ నుంచి తేరుకున్న షణ్ను బయట మాది ఐదేళ్ల రిలేషన్షిప్, తర్వాత ఎలా ఉండబోతున్నాం అని అడిగాడు. మీలో ఉన్న చిన్నచిన్న భయాలను తీసేస్తే సంతోషంగా ఉంటారని సమాధానమిచ్చిందావిడ. బిగ్‌బాస్ తర్వాత సిరి పెళ్లి చేసుకోవడంతో పాటు ఫారిన్‌కు హనీమూన్‌కు కూడా వెళ్తుందని చెప్పుకొచ్చింది. తర్వాత సిరి, షణ్ను మరోసారి గొడవపడ్డారు. ఇద్దరి కోసం కాకుండా అందరికీ ఎందుకు వంట చేస్తావని మండిపడ్డాడు షణ్ను. నువ్వు పొద్దున చేసిన దోసెలు వాళ్లు తినలేదని, అలాంటప్పుడు మళ్లీ ఎందుకు వండతావని ఫైర్ అయ్యాడు. దీంతో రెచ్చిపోయిన సిరి.. నేను కష్టపడి వండితే ఎందుకు తినలేదని మానస్‌ను నిలదీసింది. మానస్ మాత్రం తాను తిన్నానని చెప్పాడు. సన్నీకి రైస్ తినాలనిపిస్తే పులిహోర చేసుకుని తిన్నాడని బదులిచ్చాడు. అయినప్పటికీ వినిపించుకోని సిరి, షణ్ను మా వంట మేము చేసుకుంటామని తేల్చేశారు. ఇంతలో బిగ్‌బాస్ ఇంటిసభ్యులందరినీ సూట్‌కేసులు ప్యాక్ చేసుకోమని చెప్పాడు. ఈ మాట విని అవాక్కైన హౌస్మేట్స్ అయిష్టంగానే బ్యాగులు సర్దుకున్నారు. మీలో ఒకరి ప్రయాణం ఈ క్షణమే ముగుస్తుందంటూ షాక్ ఇచ్చిన బిగ్‌బాస్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేదానిపై మీ అభిప్రాయం చెప్పాలని కంటెస్టెంట్లను ఆదేశించాడు. మానస్, సన్నీ.. షణ్ముఖ్; శ్రీరామ్.. సిరి; షణ్ముఖ్.. సన్నీ; సిరి.. మానస్ ఎలిమినేట్ అవడానికి అర్హులని సూచించారు. బిగ్‌బాస్ మాత్రం అనూహ్యంగా సిరి ఇంటి నుంచి వెళ్తుందని ప్రకటించడంతో ఆమె, షణ్ను ఏడ్చేశారు. కానీ సన్నీ మాత్రం నువ్వెళ్లెట్లేదని బల్లగుద్ది చెప్పాడు. చివరికి అతడి మాటే నిజమైందనుకోండి. సిరిని కన్ఫెషన్ రూమ్‌లో కూర్చోబెట్టి షణ్ను ఏడుస్తున్న వీడియో చూపించాడు బిగ్‌బాస్. షణ్ను కంటతడి పెట్టుకోవడాన్ని చూసి సిరి హృదయం ముక్కలైంది. వాడు అక్కడ ఏడుస్తున్నందుకు బాధపడాలో, నన్ను మళ్లీ హౌస్‌లోకి పంపిస్తున్నందుకు సంతోషపడాలో తెలీట్లేదంటూ గోడు వెల్లబోసుకుంది. గేటు నుంచి బయటకు వెళ్లగొట్టిన కాసేపటికే తిరిగి ఆమెను హౌస్‌లోకి పంపించారు. దీంతో సిరి ఆనందంతో వెళ్లి షణ్నును హత్తుకుని ముద్దులు పెట్టింది. -
ఓటింగ్‌లో ట్విస్ట్.. షణ్ను దూకుడు, సన్నీ వెనకంజ!
Bigg Boss Telugu 5, Finale Week Voting: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఎవరు టైటిల్ ఎగరేసుకుపోతారని బుల్లితెర ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. షణ్ముఖ్, మానస్, సన్నీ, సిరి, శ్రీరామ్ గ్రాండ్ ఫినాలేకు చేరుకోగా వీరిలో ఎవరు విజేతగా అవతరిస్తారు? ఎవరు రన్నరప్‌గా నిలుస్తారన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్స్ చూస్తుంటే షణ్ను, సన్నీ, శ్రీరామ్‌ల మధ్యే రసవత్తర పోటీ సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇక అనఫీషియల్ ఓటింగ్‌లో మొదటి రోజు శ్రీరామ్ భారీ ఓట్లతో మొదటి స్థానంలో దూసుకువెళ్లాడు. అదే దూకుడు అధికారిక ఓటింగ్‌లోనూ కొనసాగితే శ్రీరామ్ గెలిచే అవకాశాలున్నాయి. పైగా ప్రభాస్ పెద్దమ్మ, సోనూసూద్, ఉత్తరాది నుంచి పలువురి స్టార్స్ మద్దతు అతడికి పుష్కలంగా ఉంది. ఇక ఐస్ టాస్క్‌లో గాయపడి మంచానికే పరిమితం కావడంతో సింపతీ ఓట్లు కూడా భారీగానే పడుతున్నాయి. కానీ రెండోరోజుకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న శ్రీరామ్ మూడో స్థానంలోకి పడిపోయాడు. యూట్యూబ్ సంచలనం షణ్ముఖ్ రెండో స్థానంలోకి దూసుకురాగా సన్నీ ప్రథమ స్థానంలోకి వచ్చి చేరాడు. అప్పటినుంచి ఈరోజు వరకు అనధికారిక ఓటింగ్‌లో సన్నీ, షణ్నులే తొలి స్థానం కోసం పోటీపడ్డట్లు కనిపించింది. దీంతో వీళ్లిద్దరిలోనే విన్నర్, రన్నర్ ఉండే అవకాశాలున్నాయంటున్నారు. కానీ అనఫీషియల్ ఓటింగ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ పాల్గొనరు కాబట్టి దీన్ని పూర్తిగా విశ్వసించేందుకు ఆస్కారం లేదు. ఇకపోతే సిరి ఎలిమినేట్ అయినట్లు బిగ్‌బాస్ తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశాడు. ఇది సన్నీ ఓట్లను దెబ్బకొట్టడానికే అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సిరి నిజంగానే ఎలిమినేట్ అవుతుందనుకునే చాలామంది ఆమెకు బదులుగా షణ్నుకు ఓట్లేస్తారు. పైగా తన ఒక్కగానొక్క తోడు వెళ్లిపోతుండటంతో షణ్ను కన్నీరుమున్నీరుగా విలపించడం, వీరి ఫ్రెండ్షిప్ను హైలైట్ చేయడం కూడా అతడికి ప్లస్ పాయింట్‌గా మారనున్నట్లు కనిపిస్తోంది. నిజానికి సిరిది ఫేక్ ఎలిమినేషన్. ఆ విషయం సోషల్ మీడియా వాడని చాలామంది ప్రేక్షకులకు రాత్రి ఎపిసోడ్ అయిపోయే 11 గంటల వరకు తెలియదు. సాధారణంగా ఎవరైనా ఎలిమినేట్ అవుతున్నారంటే వారిపై ప్రేక్షకులను సానుభూతి ఏర్పడుతుంది. ఇప్పుడు సిరి వెళ్లిపోతుందంటే కూడా ఆ సానుభూతితో ఆమె ఫ్రెండ్ అయిన షణ్నుకు ఓట్లు గుద్దుతారు. కొన్ని అనఫీషియల్ పోలింగ్స్‌లో షణ్ను దూకుడు కనబరుస్తున్నట్లు నెట్టింట కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫినాలే ఓటింగ్‌లో ఒక్క ఓటు కూడా విలువైనదే. ఎలాగో సన్నీ గెలుస్తాడని ఆయన అభిమానులు సైలెంట్ అయ్యారంటే షణ్ను విన్నర్‌గా నిలవడం ఖాయం! ఎందుకంటే వీళ్లిద్దరికీ మధ్య ఓట్ల తేడా స్వల్పంగానే ఉంది. ఈ రోజుతో ఓటింగ్ లైన్లు ముగిసిపోతాయి. మరి విన్నర్ ఎవరనేది తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే! House nundi eliminate aina #Siri #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun #BiggBosTelugu pic.twitter.com/Ww0q2wpjWB — starmaa (@StarMaa) December 17, 2021 -
ఇంత ఓవరాక్టింగ్ బ్యాచ్ ఏంట్రా? నన్ను బ్యాడ్ చేస్తే ఏమొస్తది?
ఎప్పటిలాగే షణ్ముఖ్, సిరి ఇద్దరే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. సిరి నాకు పడిపోయావ్ కదా అంటూ ఆమె ఒడిలో తల పెట్టుకుని పులిహోర ముచ్చట్లు మాట్లాడాడు షణ్ను. అయితే సిరి మాత్రం నీకంత సీన్ లేదులే అంటూ గాలి తీసేసింది. తర్వాత బిగ్‌బాస్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన టాస్కుల్లో మళ్లీ జీవించే అవకాశాన్నిచ్చాడు. అందులో భాగంగా పాత టాస్కులను మరోసారి ప్రవేశపెట్టాడు. మొదటగా బెలూన్లలో గాలిని నింపుతూ వాటిని పగిలిపోయేలా చూడాలన్న టాస్క్ ఇచ్చాడు. ఇందులో షణ్ను గెలవగా దానిపై అనుమానం వ్యక్తం చేశాడు సన్నీ. లేబుల్ లేదు మచ్చా అనే రెండో టాస్కులో స్విమ్మింగ్ పూల్‌లో ఒకవైపున్న టీషర్ట్ వేసుకుని పూల్‌లో దూకి మరోవైపున్న టీ షర్ట్ వేసుకోవాలి. ఇలా ఎవరెక్కువ టీ షర్ట్స్ వేసుకుంటే వారే గెలిచినట్లు. ఈ గేమ్‌లో మానస్, షణ్ముఖ్ పోటీపడగా మానస్ గెలిచాడు. తర్వాత ఖాళీగా ఉండి ఏం చేయాలో పాలుపోక కాసేపు బంతి గేమ్ ఆడుకున్నారు సన్నీ, శ్రీరామ్, మానస్. ఈ క్రమంలో వారి బంతి హౌస్‌పై పడటంతో దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలో బిగ్‌బాస్ వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటూ హౌస్లోపలకు వెళ్లమని హెచ్చరించాడు. అంతేకాదు బిగ్‌బాస్ ఇంటిపై ఎక్కాలని ప్రయత్నించడం ఏమాత్రం సహించబడదని వార్నింగ్ ఇచ్చాడు. దీనికి ఫలితంగా మీ ముగ్గురూ కలిసి గార్డెన్ ఏరియాను శుభ్రపరచాలని శిక్ష విధించాడు. దీంతో చచ్చాన్రా దేవుడా అనుకుంటూ శ్రీరామ్, మానస్ అంతా క్లీన్ చేయగా సన్నీ శుభ్రం చేస్తున్నట్లు నటించాడు. అనంతరం ఇంటిసభ్యులందరూ 13 నిమిషాలు లెక్కించాలని మూడో టాస్క్ ఇచ్చాడు. హౌస్మేట్స్ అంతా తీక్షణంగా క్షణాలను లెక్కిస్తున్న సమయంలో బిగ్‌బాస్ వారిని డిస్టర్బ్ చేసేందుకు నానారకాలుగా ప్రయత్నించాడు. ఈ గేమ్‌లో షణ్ను, శ్రీరామ్, మానస్, సన్నీ, సిరి వరుసగా ఐదు స్థానాల్లో నిలిచారు. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన షణ్ను బిర్యానీ గెలుచుకోగా దాన్ని అందరూ ఆరగించారు. తర్వాత సిరి, షణ్ను ఒకరిగురించి మరొకరు మనసు విప్పి మాట్లాడుకున్నారు. 'నువ్వు కరెక్ట్ అని నమ్మాను, మన రిలేషన్‌కు నేనిచ్చే గౌరవం అది. కొన్నిసార్లు కంట్రోల్ అయ్యాను, ఎందుకనేది బయటకు వెళ్లాక చెప్తాను అని సస్పెన్స్‌లో పెట్టింది సిరి. షణ్ను మాత్రం మనం బాగా కనెక్ట్ అయిపోయాం.. అప్పుడప్పుడు నువ్వు జెన్యూన్ కాదేమో అనిపిస్తుంది, కాకపోతే అది కోపంలో ఉన్నప్పుడు అని పేర్కొన్నాడు. అనంతరం బిగ్‌బాస్ నాలుగో టాస్క్‌లో కొన్ని శబ్ధాలు ప్లే చేయగా అవేంటో రాయాలన్నాడు. ఈ గేమ్‌లో బెకబెకల శబ్ధాన్ని సిరి ఎలుకగా గుర్తించి తప్పులో కాలేయడంతో అందరూ పగలబడి నవ్వారు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామ్ గెలుపొందాడు. ఐదో టాస్కులో తాళ్లను ఎక్కువసేపు ఆపకుండా కదపాల్సి ఉంటుంది. ఇందులో సిరి, సన్నీ, షణ్ను ఆడగా సన్నీ గెలిచాడు. ఓడిపోయావ్ కదా, మళ్లీ ఆడదామా అంటూ సన్నీ సిరిని సరదాగా ఆటపట్టించాడు, కానీ ఆమెకు ఓడిపోయావన్న మాట అస్సలు నచ్చలేదు. నువ్వే ఓడిపోయావ్, షణ్ను ఒక్కడే కరెక్ట్‌గా ఆడాడని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. నేను జోక్‌గా అన్నానని సన్నీ అనగా ఓడిపోయావన్న మాట సరదా కాదని తేల్చి చెప్పింది. మజాక్‌గా అన్నానని సన్నీ ఎంత సర్దిచెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. తిందాం రమ్మని పిలిచినప్పటికీ రానంటూ మొండిగా ప్రవర్తించింది. పక్కనోడు గెలిస్తే సహించలేడంటూ ఆవేశంతో ఊగిపోయింది. నాతో జోకులొద్దు అని సన్నీకి వార్నింగ్ ఇచ్చింది. సిరి అరవడంతో సహనం కోల్పోయిన సన్నీ ఆమెను ఇమిటేట్ చేయగా సిరి మరింత ఉడికెత్తిపోయింది. ప్రతిసారి వచ్చి ఇమిటేట్ చేయడమేంటని మండిపడింది. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? తోపు అని ఫీలవుతున్నావా? అంటూ ఏకిపారేసింది. మాటలు పడింది నేను, మళ్లీ పిజ్జా తిందువు రా అని పిలిస్తే ఎవడొస్తాడు అని చిర్రెత్తిపోయింది. అటు సన్నీ.. మానస్‌తో మాట్లాడుతూ.. ఎప్పుడు ఏ గొడవైనా కూడా నేనే వెళ్తాను, ఇంత ఓవరాక్టింగ్ బ్యాచ్ ఏంట్రా? వెళ్లేముందు నన్ను బ్యాడ్ చేస్తే వాళ్లకు ఏమొస్తదిరా? నువ్వు పెద్ద హీరోవా? అంటే నన్ను ఇష్టపడేవాళ్లకు, నా దునియాల నేను హీరోనే' అని స్పష్టం చేశాడు సన్నీ. మరి వీళ్ల గొడవ ఇలాగే కంటిన్యూ అయిందా? లేదా ఎండ్ కార్డ్ పడిందా? అన్నది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. -
సిరి లేకపోతే షణ్ముఖ్ పిచ్చోడయ్యేవాడు: శ్రీహాన్ ఫైర్
Bigg Boss 5 Telugu, Siri Hanmanth Boyfriend Shrihan On Fire: యూట్యూబ్ స్టార్ శ్రీహాన్, సిరి హన్మంత్ ప్రేమికులన్న విషయం అందరికీ తెలిసిందే! సిరి బిగ్‌బాస్ షోకు వెళ్లడానికి ముందు వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ సిరి హౌస్‌లో ఈ విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తుందంటూ అనేక విమర్శలు వచ్చాయి. షణ్ముఖ్ వద్దంటున్నా హగ్గివ్వడం, అతడికి ముద్దులివ్వడాన్ని చాలామంది తప్పుపట్టారు. సిరి ఇలా దిగజారిపోయిందేంటని ఆమెను దుమ్మెత్తిపోశారు. తన క్యారెక్టర్‌ను కించపరుస్తూ నానామాటలు అన్నారు. కానీ శ్రీహాన్ మాత్రం నెచ్చెలికే అండగా నిలిచాడు. సిరి గురించి తనకు బాగా తెలుసని, తన మీద కొండంత నమ్మకం ఉందంటూ మాట్లాడాడు. కానీ సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో చాలామంది సిరి క్యారెక్టర్‌ను తప్పుపట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఓట్ల కోసమే షణ్ముఖ్‌కు దగ్గరైందని, బిగ్‌బాస్ షోలో మనుగడ సాగించడానికే అతడి మీదపడుతోందని విమర్శించారు. కొందరైతే ఆమె వల్ల షణ్ను నెగెటివ్ అవుతున్నాడని అసహనం వ్యక్తం చేశారు. ఈ కామెంట్లు చూసి తట్టుకోలేకపోయిన శ్రీహాన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. 'నన్ను ఎంతోమంది ఏవేవో అంటున్నా ఏ రోజూ నేను పోస్ట్ చేయలేదు. ఎందుకంటే వాటివల్ల పేరెంట్స్ బ్లేమ్ అవ్వకూడదని ఆలోచించాను. కానీ ఈ రోజు ఎవరి ద్వారానో ఒక స్క్రీన్‌షాట్ బయటకు వస్తే పాపం సిరి ఏం చేసిందని, ఒక అమ్మాయని కూడా చూడకుండా క్యారెక్టర్ బ్లేమ్ అయ్యేలా పోస్టులు పెడుతున్నారు. మీ అమ్మ గురించి నేను ఆగిపోయాను.' 'ఎవరి గేమ్ ఏంటో తెలిసి కూడా సిరి వల్ల నెగెటివ్ అయ్యాడు అంటారేంటి? నెగెటివ్ అవ్వడం కాదు, ఒకవేళ సిరి తోడుగా లేకపోతే వేరే సపోర్ట్ లేక అతడు(షణ్ను) పిచ్చోడయ్యేవాడు. ఎందుకంటే వేరే ఎవ్వరితో కలవడు కాబట్టి! ఇక్కడ సిరి వేరేవాళ్లతో మాట్లాడినా తప్పే, డ్యాన్స్ వేసినా తప్పే, నవ్వినా తప్పే, నేనే నీకు ప్రపంచం అని క్రియేట్ చేస్తే తను మాత్రం ఏం చేస్తుంది? ఇంకా ఎవరి దగ్గరకని వెళ్తుంది? ఫ్రెండ్ బాధపడకూడదని ఆలోచించి ఆగుతుంటే అడ్జస్ట్ అవుతుంటే వీళ్లు ఇచ్చే విలువ ఇదా?.. బిగ్‌బాస్ చివరి రోజుల్లో ఎందుకు ఈ నెగెటివిటీలు అని నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నా ఆగుతుంటే అనవసరంగా సిరి అనడం ఏంటి?' అని మండిపడ్డాడు. మొత్తానికి శ్రీహాన్ ఇన్నాళ్లకు అటు ట్రోలర్స్‌కు ఇటు షణ్నుకు గట్టిగానే ఇచ్చిపడేశాడంటున్నారు నెటిజన్లు. అయితే ఇన్నాళ్లూ పెదవి విప్పకుండా మౌనంగా ఎందుకున్నాడని ప్రశ్నిస్తున్నారు. అంటే సిరి టాప్ 5లో అడుగుపెట్టే సమయం కోసం ఎదురుచూసి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాడా? అని కామెంట్లు చేస్తున్నారు. అటు షణ్నుది మాత్రమే తప్పు లేదని సిరిది కూడా తప్పుందంటున్నారు మరికొందరు. అతడు ఎంత కంట్రోల్ చేస్తున్నా, ఆఖరికి ఆమె తల్లిని, బాయ్‌ఫ్రెండ్ అయిన మిమ్మల్ని కూడా అన్ని మాటలంటున్నా పట్టించుకోకుండా అతడి పక్కన వాలిపోవడం తప్పు కాదా? అని నిలదీస్తున్నారు. ఇదిలా వుంటే శ్రీహాన్ ఈ పోస్టులను కాసేపటికే డిలీట్ చేయడం గమనార్హం. Finally #Shrihan said it.. But Y only after coming to Top 5 ?? Did he wait for it and saying now??? He could have done long before..... Now everything he says seems like he waited for siri to reach top5 and saying it 🤷🏻♀️#BiggBossTelugu5 #Siri#TitleHunterVJSunny #Sunny pic.twitter.com/oA2jVCu02T — Suneetha (@suneethak7) December 15, 2021 -
'సిరి-షణ్ను కంటెంట్ ఇవ్వడానికే వచ్చారు'
Bigg Boss Telugu 5, Episode 102: బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఏం చేయాలో పాలు పోక దాగుడుమూతలు ఆడుకున్నారు. కాసేపు ఆడుకున్న తర్వాత మానస్ సన్నీ ముచ్చట్లు పెట్టుకున్నారు. మానస్ మాట్లాడుతూ.. శ్రీరామ్ ఆట తనకు నచ్చదని చెప్పాడు. అన్నీ ఆలోచించి ఆడతాడని అభిప్రాయపడ్డాడు. అనంతరం సిరికి తన జర్నీ చూసే అవకాశం లభించింది. ఈ క్రమంలో తన ఫొటోలన్నింటిని చూసుకుని తెగ మురిసిపోయింది. 'అల్లరి పిల్లగా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే సిరిగా మీరు అందరికీ పరిచయం. కానీ ఎంతో ధైర్యంగా ఉండే సిరిలో జరుగుతున్న సంఘర్షణ వల్ల మీరు కొన్నిసార్లు ఒంటరితనాన్ని ఎంచుకునేలా చేశాయి. మీ కన్నీళ్లు మౌనంగా ఆ విషయాన్ని చెప్పాయి. కానీ మీ నవ్వు చేసిన సందడిలో కన్నీళ్లు ఇంకిపోయాయి. పిట్ట కొంచెం కూత ఘనం అన్న మాట మీ విషయంలో నిజమైంది. ఈ బిగ్‌బాస్ ఇల్లు భావోద్వేగాల నిధి అయితే అందులో సిరి మీరు' అంటూ బిగ్‌బాస్ ఆమెను ఆకాశానికెత్తారు. తర్వాత ఆమె జర్నీ వీడియో చూపించడంతో సిరి ఎమోషనల్ అయింది. మరీ ముఖ్యంగా చోటు కనిపించగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత సిరి దొరికిందే ఛాన్స్ అని ఐదారు ఫొటోలు తీసుకొచ్చేసింది. షణ్నుతో కలిసి డ్యాన్స్ చేసిన ఫొటో కూడా పట్టుకొచ్చింది కానీ సర్ప్రైజ్ ఇద్దామని దాన్ని డైనింగ్ టేబుల్‌పై దాచిపెట్టింది. ఇంతలో బిగ్‌బాస్ అక్కడున్న సెట్‌నంతా తొలగించే క్రమంలో ఆ ఫొటోను కూడా మాయం చేయడంతో సిరి నిరాశపడింది. జర్నీ వీడియోలో మనిద్దరం కంటెంట్ ఇవ్వడానికే వచ్చాం అని మానస్ అన్నాడంటూ షణ్నుకు చెప్పింది సిరి. దీంతో ఆగ్రహించిన షణ్ను.. ఇందుకే వాళ్ల సాయం తీసుకోవద్దంటాను అని హితవు పలికాడు. అనంతరం బిగ్‌బాస్.. టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్లను వారి మరపురాని క్షణాలను పంచుకోవాలని సూచిస్తూనే అక్కడున్న కొన్ని ఫొటోలను బిగ్‌బాస్‌కు ఇవ్వాలని చెప్పాడు. ముందుగా మానస్ మాట్లాడుతూ.. టెడ్డీబేర్ టాస్కులో గెలిచినప్పుడు నేను, సన్నీ, యానీ మాస్టర్‌ను సంతోషంతో ఎత్తుకున్నాం.. అంటూ ఆ ఫొటోను బిగ్‌బాస్‌కిచ్చాడు. షణ్ముఖ్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ జర్నీలోనే బాధాకరమైన విషయం అమ్మ లెటర్ ముక్కలు కావడం అంటూ దానికి సంబంధించిన ఫొటోను బోర్డుపై పెట్టాడు. సిరి వంతు రాగా 'బ్రిక్స్ ఛాలెంజ్ కంటే ముందు షణ్నుకు, నాకు గొడవ అయింది. ఫేక్ ఫ్రెండ్ అని తిట్టాను కానీ అది తప్పని ఈ టాస్క్‌తో రుజువైంది. ఈ జర్నీ మొత్తంలో నాకు అండగా నిలిచింది షణ్ను ఒక్కడే' అని చెప్పుకొచ్చింది. శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ ఇంట్లో నాకు మంచి బాండ్ కుదురిన ఫస్ట్ పర్సన్ హమీదా. ఆమె వెళ్లిపోయాక చాలా బాధేసింది. చాలా మిస్ అవుతున్నాను, ఈ విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ఈమె ఉండుంటే లోన్ రేంజర్ అన్న ట్యాగ్ వచ్చేది కాదని ఫీలడు. తర్వాత సన్నీ వంతురాగా.. బేటన్ టాస్కులో నా టీమ్ వాళ్లే నన్ను వరస్ట్ పర్ఫామర్ అన్నారు. అప్పుడు జైల్లో పడి బాధపడితే మానస్ కూడా ఏడ్చాడు అని చెప్పుకొచ్చాడు. అందరినీ నవ్వించడమే తన నినాదంగా పేర్కొన్నాడు. -
ఎప్పుడూ చెప్పలేదు, హమీదాను చాలా మిస్సవుతున్నా: శ్రీరామ్ ఎమోషనల్
Bigg Boss 5 Telugu Promo: రోజులు గడిచేకొద్దీ కంటెస్టెంట్లలో టెన్షన్ పెరుగుతోంది. టైటిల్ గెలిచేదెవరని ఇటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వంద రోజుల్లో ఎన్నో టాస్కులు ఆడించిన బిగ్‌బాస్ హౌస్మేట్స్ గడిచిన జ్ఞాపకాలను తడిమి చూసుకునేందుకు కావాల్సినంత సమయాన్నిచ్చాడు. అందులో భాగంగా వారి సంతోష, చేదు సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు ఫైనలిస్టులు. 'టెడ్డీబేర్ టాస్కులో నేను, యానీ మాస్టర్, సన్నీ గెలిచాక సంతోషంతో హగ్గిచ్చుకున్నాం..' అంటూ తను చూపిస్తున్న ఫొటో వెనకాల స్టోరీ చెప్పుకొచ్చాడు మానస్. జర్నీ మొత్తంలో బాగా బాధపడిన క్షణాలేవైనా ఉన్నాయా అంటే అది అమ్మ రాసిన లెటర్ కళ్లముందే ముక్కలవడం.. అని బాధపడ్డాడు షణ్ను. బ్రిక్స్ ఛాలెంజ్‌ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, ఎందుకంటే ఈ టాస్క్‌కు ముందే షణ్నును ఫేక్ ఫ్రెండ్ అన్నాను. కానీ అది తప్పని బ్రిక్స్ ఛాలెంజ్‌లో నిరూపించాడు అని పేర్కొంది సిరి. నేనెప్పుడూ చెప్పలేదు కానీ హమీదాను చాలా మిస్సవుతున్నా, ఆమె ఉండుంటే లోన్ రేంజర్ అనే పేరు వచ్చేది కాదు, ఈ జర్నీలో ఆమెను మిస్సయ్యాను అన్నాడు శ్రీరామ్. -
సిరి ప్రియుడిపై షణ్ముఖ్ అసహనం.. 'హగ్గు తప్పయితే ఇదేంటి?'
Bigg Boss Telugu 5, Shanmukh Jaswanth: బిగ్‌బాస్ షో ముగింపుకు వస్తుండటంతో కంటెస్టెంట్లు వారి జర్నీని, జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. 100 రోజుల తర్వాత తిరిగి కుటుంబంతో గడపనున్నామన్న ఆనందం ఒకవైపు, ఎన్నో గుణపాఠాలు నేర్పిన బిగ్‌బాస్ హౌస్‌ను వీడనున్నామన్న బాధ మరోవైపు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎప్పటిలాగే సిరి, షణ్ను కబుర్లలో మునగగా మానస్, సన్నీ ముచ్చట్లలో తేలారు. ఒంటరిగా కూర్చున్న శ్రీరామ్ ఏం చేయాలో ఊసుపోక కెమెరాలతో మాట్లాడుకున్నాడు. అయితే త్వరలో ఇంటికి వెళ్తున్నానన్న సంతోషం కన్నా షణ్ముఖ్‌ను వదిలి వెళ్తున్నానన్న బాధే సిరిని ఎక్కువగా వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని షణ్ముఖ్ బెడ్‌పై చేరి అతడికి హగ్గిస్తూ మరీ చెప్పింది. కానీ దీనికన్నా ముందు వీళ్లిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సిరి ప్రియుడు శ్రీహాన్ బిగ్‌బాస్ షోకు వచ్చినప్పుడు టాప్ 5లో ఎవరెవర్ని పెట్టారన్న విషయాన్ని మరోసారి ప్రస్తావిస్తూ అసహనం వ్యక్తం చేశాడు షణ్ను. అటు సన్నీ ప్రవర్తనలో కూడా ఏదో తేడా కొడుతోందంటూ అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు షణ్ముఖ్ సిరితో మాట్లాడుతూ.. 'సన్నీ తన ఇద్దరు ఫ్రెండ్స్ కాజల్, మానస్‌ను టాప్ 5లో చూడాలనుకున్నాడు. దానికి తగ్గట్టుగా జెన్యూన్ అని పదేపదే మాట్లాడాడు. రెండుమూడువారాలుగా సన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాడనిపించింది. వెళ్లి మీ చోటు(సిరి ప్రియుడు శ్రీహాన్)కు చెప్పు. సన్నీ ఫొటో ఫస్ట్‌లో పెట్టాడుగా.. వాడు ఇలాంటివి చేస్తుంటాడు.. వెళ్లి ఎంకరేజ్ చేయమని చెప్పు. నీకోసం స్టాండ్ తీసుకుంటే మీరు అవతలివాడికి రెస్పెక్ట్ ఇస్తారు. మీవాడికి హౌస్‌లో జరిగేవన్నీ తెలీదేమో.. వెళ్లి చెప్పు. హగ్గివ్వడం తప్పయితే ఇదేంటి.. అంటే ఇదంతా ఓకేనా? ఈ ఇంట్లో నీకు తప్ప ఏ అమ్మాయికి స్ట్రయిట్ హగ్గివ్వలేదు' అని చెప్పుకొచ్చాడు. దీంతో సిరి బోరుమని ఏడ్చేయగా షణ్ను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. అయితే సిరి ఏడ్చింది తనకు కాబోయే భర్తను అన్ని మాటలన్నందుకు కాదు! త్వరలో షణ్నును వదిలి హౌస్ నుంచి వెళ్లిపోతానని! ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా మాటకు మాట ఇచ్చిపడేసే సిరి తన ప్రియుడిపై అలా కామెంట్ చేసినప్పటికీ లైట్ తీస్కోవడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు నెటిజన్లు. -
బిగ్‌బాస్: షణ్ముఖ్‌కు బంపరాఫర్.. బయటకు రాగానే..
షణ్ముఖ్ జశ్వంత్.. యూట్యూబ్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. యూట్యూబ్‌లో అతడు సృష్టించే రికార్డ్స్ మామూలుగా ఉండవు. పెద్ద హీరోల సినిమాలకు, వీడియోలకు రానన్ని వ్యూస్, లైకులు మనోడి వీడియోలకు వస్తాయి. ఆ క్రేజీ వల్లే బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఐదో సీజన్‌కి సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న టాప్ 5లో షణ్ముఖ్ ఒకడు. షో తొలినాళ్లలో సైలెంట్‌గా, టాస్కులకు దూరంగా ఉన్న షణ్ముఖ్.. రాను రాను తనదైన ఆటశైలీతో అందరిని ఆకట్టుకున్నాడు. తెలివిగా ఆలోచిస్తూ.. తన వేలో గేమ్ ఆడాడు. మిగతా కంటెస్టెంట్స్ వేసే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. ‘బిగ్‌బాస్ బ్రహ్మ’గా పేరు సంపాదించుకున్నాడు. కామ్‌గా ఉంటూనే పదునైన ప్లాన్లు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. అతను పక్కా టాప్ 2లో తప్పకుండా అతను ఉంటాడని జోస్యాలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రాకముందే.. షణ్ముఖ్ బంపరాఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఆయన హీరోగా ఓ సినిమా రాబోతుందట. యూట్యూబ్ స్టార్‌గా ఎదిగినప్పటికీ.. షణ్ముఖ్ చాలా రోజులుగా ఇండస్ట్రీలో అవకాశం కోసం చూస్తున్నాడు. మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చినా కూడా చిన్న పాత్రలు కావడంతో నో చెప్పాడు. బిగ్ బాస్ 5 తెలుగు తర్వాత ఈయన ఫాలోయింగ్ మరింత పెరిగిపోవడంతో దర్శక, నిర్మాతలు షన్నూతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారట. త్వరలోనే షణ్ముఖ్ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. మరి ఈ యూట్యూబ్ సంచలనం.. వెండితెరపై ఎలా అదరగొడతాడో చూడాలి. -
బిగ్‌బాస్: జర్నీ వీడియో అదిరింది..ఈ సారి కప్పు అతనికేనా!
Bigg Boss Telugu 5, Episode 101: బిగ్‌బాస్ ఐదో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో ఈ బిగ్ రియాల్టీ షోకి శుభం కార్డు పడనుంది. హౌస్‌లో ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఐదుగురు ఉన్నారు. వారికి మధురజ్ఞాపకాలను అందిస్తున్నాడు బిగ్‌బాస్. సోమవారం ఎపిసోడ్లో శ్రీరామ్, మానస్‌ల బిగ్‌బాస్ జర్నీ చూపించి, వారిలో జోష్ నింపాడు. మంగళవారం ఎపిసోడ్లో షణ్ముఖ్, సన్నీల జర్నీని చూపించి, అలరించాడు బిగ్‌బాస్. మొదటగా షణ్ముఖ్‌ని పిలిచాడు. అతనికి సంబంధించిన ఫోటోలను చూపించాడు. అందులో ఎక్కువగా మోజ్ రూం ఫోటోలే ఉండడంతో.. మోజ్ రూం.. మోజ్ రూం అంటూ కేకలు వేశాడు షణ్ముఖ్. తర్వాత షణ్ముఖ్ జర్నీ గురించి బిగ్‌బాస్ మాట్లాడుతూ.. ‘ఈ తరం వారికి ముఖ్యంగా సోషల్ మీడియా ఉపయోగించే వారికి షణ్ముఖ్ జస్వంత్ అనేపేరు ఎంతో సుపరిచితం. మీరు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి పోటీలా నిలిచారు. ఇది వేరే ప్రపంచం. ఇక్కడ నిజమైన మనుషులు, విభిన్న వ్యక్తిత్వాలు, కోపం, ప్రేమ ఇలా ప్రతి ఒక్కటి నిక్కచ్చిగా ఉంటాయి. నీలోని ప్రతి కోణాన్ని ఒక్కొక్కటిగా.. అందంగా ఈ ప్రయాణం బయటకు తీసుకొచ్చింది. అర్థం చేసుకునే మనుషులు ఉండడం మనుసును తేలిక పరచడం కాగ, ఆటలో ముందుకు వెళ్లేందుకు కావాల్సిన ఉత్సాహాన్ని నింపుతుంది. అలాంటి అర్థం చేసుకునే స్నేహితులు నీకు ఈ ఇంట్లో దొరికారు. మీ కోపాన్ని, అసహనాన్ని దూదిలాగా పీల్చుకుంటూనే.. నీలోని నిప్పుని నిరంతరం వెలిగిస్తూ.. ముందుకు తీసుకొచ్చారు. మీ మనసుకి దగ్గరైన వారితో అభిప్రాయభేదాలు వచ్చిన ప్రతిసారి.. మీరు మోసిన బరువుని బిగ్ బాస్ గమనించారు. ఈ ఇంట్లో మీకు దగ్గరైన బంధాలు.. మీకు ఎంత ముఖ్యమో.. మీరు వారి కోసం నిలబడ్డ తీరు తెలియజేస్తుంది. వారి కోసం ఎంత దూరం అయినా వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. అందుకే ఎన్ని గొడవలైనా.. చివరి వరకూ ఒకటిగానే ఉన్నారు. ఎప్పుడైతే మీ మనసులోని భారం తగ్గిందో అప్పటి నుంచి టాస్కుల్లో పట్టుదల చూపి, బుద్ది బలం ఉపయోగించి ఇంటి కెప్టెన్ కావడమే కాకుండా అందరితో బ్రహ్మా అనిపించుకున్నారు. మీకు ఇష్టమైన చోటు మోజ్ రూం అని బిగ్ బాస్‌కి తెలుసు. అక్కడ మీరు ఒంటరిగా గడిపిన క్షణాలు.. మీలోకి కోపం, బాధ, ప్రేమ అన్నింటిని ఆ గది చూసింది. మీ తీరులో ఆటను ఒక్కో లెవల్ తీసుకొచ్చి ఫినాలే వరకు వచ్చారు’అని బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సన్నీ జర్నీని చూపించాడు బిగ్‌బాస్. సరదా మరియు సన్నీ ఒకే అక్షరంతో మొదలౌతాయని.. మీరు అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి ఈ షో చూస్తున్న అందరికి మీరు గుర్తు చేశారు. ఈ ఇంట్లో మీరు కోరుకున్న బంధాలు.. మీమ్మల్ని కోరుకునే స్నేహితులు.. గెలిచిన ఆటలు.. జరిగిన గొడవలు.. మోసిన నిందలు.. చేసిన వినోదం.. ఇలా మీరు పోగు చేసుకున్నవి ఎన్నో జ్ఞాపకాలు. ఇలా అన్ని కలిసి మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా, అందరి మొహంపై నవ్వు తీసుకువచ్చే ఎంటర్టైనర్గా ఆవిష్కృతం చేసుకొని అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. మీ వాళ్ల కోసం మీరు నిలబడే తీరు.. వాళ్లు మిమ్మల్ని ఇష్టపడినా లేకున్నా.. మీలోని స్నేహితుడు వాళ్లని పరిచయం చేశాడు. మీలోకి కోపం మీకు ఇబ్బందులు తీసుకుని వచ్చి.. అందరి ముందు దోషిగా నిలబెట్టిన క్షణాలు.. మీ మనసుని ఎంతో బరువుగా చేసిన విషయాన్ని బిగ్ బాస్ గమనించారు. ప్రతి టాస్క్‌లో గెలవాలనే మీ తపన.. గెలిచేవరకూ పోరాడే పట్టుదల.. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా.. మీ ఓర్పు మిమ్మల్ని ఇక్కడి వరకూ తీసుకుని వచ్చింది. ఒంటరిగా వచ్చిన మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కంటే పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాగించిన ప్రయాణమే మళ్లీ గుర్తు చేస్తుంది. మీరు వెతుకున్న స్వప్న సుందరి కూడా మీకు త్వరలోనే దొరకాలని బిగ్‌బాస్ ఆశిస్తున్నాడు. అప్నా టైం ఆయేగా.. అన్న మీ మాట మిమ్మల్ని ప్రేమించే వారికి గట్టిగా వినిపించింది. సన్నీ ఇప్పుడు మీ సమయం వచ్చేసింది’ అంటూ సన్నీ జర్నీని చూపించారు బిగ్ బాస్. తన జర్నీని చూసుకుని ఎమోషనల్ అయ్యాడు సన్నీ. బిగ్ బాస్ షోకి రావాలనేది నా డ్రీమ్.. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికీ మచ్చా లవ్యూ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం ఒక ఫొటోగ్రాఫ్‌ని మీతో తీసుకుని వెళ్లండని బిగ్ బాస్ చెప్పడంతో.. తన తల్లితో ఉన్న ఫొటోతో పాటు.. మానస్‌తో ఉన్న ఫొటోని కూడా తీసుకున్నాడు.వెళ్తూ వెళ్తే.. బిగ్ బాస్ తనకి గిఫ్ట్‌గా ఇచ్చిన కేక్‌ని కూడా తీసుకుని వెళ్లాడు సన్నీ. ఆ రోజు అందరితో షేర్ చేసుకుని కేక్‌ని తినలేకపోయా.. ఇప్పుడు సర్ ప్రైజ్ చేస్తా అని ఆ కేక్‌ని తీసుకుని వెళ్లాడు సన్నీ. మొత్తంగా ఫైనల్‌కి చేరిన ఐదుగురు కంటెస్టెంట్స్‌కి సంబంధించిన జర్నీలలో ఇప్పటికైతే సన్నీదే హైలెట్ అని చెప్పాలి. ఈ వీడియోతో సన్నీకి పడే ఓట్ల సంఖ్య కచ్చితంగా పెరుగుతుంది. కప్పు కూడా అతను గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిరి జర్నీ వీడియో బుధవారం ఎపిసోడ్లో ప్రసారం కానుంది. -
Bigg Boss 5 Telugu: అధైర్య పడలేదు..షణ్ముఖ్‌పై బిగ్‌బాస్ ప్రశంసలు
Bigg Boss 5 Telugu Today Promo: బుల్లి తెర బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ ఐదో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మరో ఐదు రోజులు ఈ రీయాల్టీ షోకి శుభం కార్డు పడనుంది. ఈ ఆదివారం(డిసెంబర్ 19) గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్‌గా జరగనుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఐదుగురు ఉన్నారు. వారికి మధురజ్ఞాపకాలను అందిస్తున్నాడు బిగ్‌బాస్. నిన్నటి ఎపిసోడ్లో శ్రీరామ్, మానస్‌ల బిగ్‌బాస్ జర్నీ చూపించి, వారిలో జోష్ నింపాడు. ఇక నేడు మిగిలిన ఇంటి సభ్యులై జర్నీ చూపించినట్లు తెలుస్తోంది. వాళ్లు గేమ్ ఎలా ఆడారు? బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజుల ప్రయాణం ఎలా జరిగింది? తదితర విషయాల్ని వీడియో రూపంలో వారికి చూపించాడు. ఈ క్రమంలో షణ్ముఖ్ ఆనందంతో చిందులేశాడు. ‘ఎంత మంది మిమ్మల్ని నామినేట్ చేసినా అధైర్య పడకుండా ఆటను ఫినాలే వరకూ తీసుకొచ్చారు’అంటూ బిగ్‌బాస్ షణ్ముఖ్‌పై ప్రశంసలు కురిపించాడు. -
బిగ్‌బాస్ చూసి షణ్నూ క్యారెక్టర్ డిసైడ్ చేయకండి: దీప్తి సునయన
Deepthi Sunaina Support To Shanmukh Jaswanth In Bigg Boss 5 Telugu Last Week: బిగ్‌బాస్ హౌస్‌లో ఏమైనా జరగొచ్చు. అప్పటివరకు హీరోలుగా ఉన్నా హౌస్‌లోకి వచ్చాక నెగిటివిటి పెరగొచ్చు. ఈ సీజన్లో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నో అంచనాల మధ్య బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షణ్నూపై ఈ మధ్యకాలంలో నెగిటివిటి పెరిగింది. పైకి ఫ్రెండ్ అని చెప్పినా సిరితో హగ్గులు ఆడియెన్స్‌కు ఏమాత్రం రుచించడం లేదు. ఇప్పటికే సిరికి ఎంగేజ్మెంట్ కావడం, షణ్నూ..దీప్తి సునయనతో లవ్‌లో ఉండటంతో వీరి రిలేషన్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమవుతుంది. హగ్గులు తగ్గించుకోమని స్వయంగా సిరి తల్లి సూచించినా వీళ్లు మాత్రం తగ్గేదేలే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. వీరిద్దరి ప్రవర్తనపై వస్తున్న నెగిటివిటి బట్టి షణ్నూ టైటిల్ రేసు నుంచి ఒక అడుగు దూరంలో ఉన్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తుంది. వచ్చే వారం బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే జరగనున్న నేపథ్యంలో షణ్నూకి సపోర్ట్ చేసేందుకు దీప్తి సునయన రంగంలోకి దిగింది. 'బిగ్‌బాస్ షోను చూసి షణ్ముఖ్ క్యారెక్టర్ని అంచనా వేయకుండి. అది కేవలం ఒక గేమ్ షో అని గుర్తుపెట్టుకోండి. షణ్నూ ఎంతో మంచివాడు. అతను ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయనివ్వండి. మీ అంచనాలకు తగ్గట్లు రీచ్ అవ్వాలని అనుకోకండి. మీకు నచ్చినట్టు కాకుండా వాడికి నచ్చినట్టు ఉండనివ్వండి.. అతనేంటో అతనిలా ఉన్నాడు. ఎవరిమీదా ద్వేషం వద్దు. మీకు నచ్చిన కంటెస్టెంట్‌కి మీరు సపోర్ట్ చేయండి. నా మద్దతు ఇప్పటికీ, ఎప్పటికీ షణ్నూకే ఉంటుంది. అతను సంతోషంగా ఉండడమే నాకు కావాలి' అంటూ దీప్తి సునయన తన ఇన్‌స్టాలో పోస్టు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) -
బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలకు నేనే మూల కారణం: కాజల్
Bigg Boss Telugu 5, Episode 99, Kajal Eliminated: వచ్చేవారం (డిసెంబర్ 19న) గ్రాండ్ ఫినాలే జరగబోతుందని వెల్లడించాడు కింగ్ నాగార్జున. అంటే నెక్స్ట్ సండే ఎవరు విన్నర్ అనేది తేలనుందన్నాడు. ఇక ఈరోజు ఎవరెవరు ఫినాలేలో అడుగుపెట్టనున్నారనేది కూడా తేల్చేశాడు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే గెలుచుకుని శ్రీరామ్ ఫస్ట్ ఫైనలిస్టుగా నిలవగా సన్నీని రెండో ఫైనలిస్టుగా ప్రకటించారు. నేటి(డిసెంబర్ 12) ఎపిసోడ్లో సిరిని మూడో ఫైనలిస్టుగా, షణ్నును నాలుగో ఫైనలిస్టుగా వెల్లడించడంతో వాళ్లు సంతోషంలో మునిగి తేలారు. అనంతరం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వీడియో ద్వారా ప్రశ్నలను సంధించగా హౌస్మేట్స్ వాటికి సమాధానాలు చెప్పారు. ► జెస్సీ: షణ్నుకి, సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో నాకు తెలుసు. కానీ జనాలు ఏమనుకుంటున్నారు? అని ఎప్పుడైనా ఆలోచించావా? షణ్ను: ఫ్యామిలీస్ ఇంట్లోకి వచ్చినప్పటినుంచి నాకూ ఈ ప్రశ్న ఎదురైంది. అది తప్పే, కానీ సిరి నా బెస్ట్‌ఫ్రెండ్.. జీవితాంతం ఆమెకు సపోర్ట్‌గా ఉంటాను. ► యానీ మాస్టర్: బిగ్‌బాస్ నుంచి వచ్చాక కొన్ని ఎపిసోడ్లు చూశాను. సన్నీ, మానస్ నా వెనకాల మాట్లాడారు. నేనెప్పుడూ నీ గురించి బ్యాక్ బిచింగ్ చేయలేదు. నువ్వు నా గుడ్ ఫ్రెండ్ అన్నాను. కానీ నువ్వు మాత్రం నేను నటిస్తున్నానని ఇంకా ఏవేవో అన్నావు. నిజంగా నీ మీద జెలసీ ఉంటే నిన్ను కెప్టెన్ చేయడం కోసం నేను కష్టపడకపోయేదాన్ని! సన్నీ: నేను బ్యాక్ బిచింగ్ చేయలేదు. యానీ మాస్టర్ కొన్నిసార్లు మాట మీద నిలబడదు, అప్పుడు నేను నా అభిప్రాయాన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నానంతే.. ఆమె నాకెప్పుడూ మంచి స్నేహితురాలే.. ► నటరాజ్ మాస్టర్: ఐస్ టాస్క్‌లో పింకీ చేసిన వైద్యం వల్ల శ్రీరామ్ నడవలేకపోయాడు. టికెట్ టు ఫినాలే టాస్కులో వేరేవాళ్లు నీ తరపున గేమ్ ఆడారు. అంటే పింకీ చేసిన వైద్యం గేమ్పరంగా నీకు ప్లస్ అయిందా? మైనస్ అయిందా? శ్రీరామ్: ఇది ప్లస్సో, మైనసో పక్కనపెడితే నేను టాస్కుల్లో 100% ఇచ్చాను. నా ఆట నేను ఆడలేకపోయాను కాబట్టి మైనస్ అయింది. ► ప్రియాంక: ఇన్నిరోజులు హౌస్‌లో నన్ను భరించావా? నటించావా? మానస్: కచ్చితంగా భరించాను. నేనైతే నటించలేదు ► జెస్సీ: సిరి.. బిగ్‌బాస్ హౌస్‌లోకి గేమ్ ఆడటానికి వెళ్లావు కదా! కానీ నువ్వు గేమ్ మీద శ్రద్ధ తగ్గించి ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నాను అదీఇదీ అంటూ పిచ్చెక్కిపోతున్నావు, నీకిది అవసరమా? సిరి: గేమ్ ఆడటానికే వచ్చాను. మధ్యలో కొన్నికొన్ని ఎమోషన్స్ తీసుకుంటున్నాను. కానీ గేమ్‌లో ఎమోషనల్ కనెక్ట్ అయితే అవసరం లేదు ► ప్రియ: బయట ఎలా ఉంటావో తెలుసుకోవాలని ఉంది. సహజంగా నువ్వు ఇలాగే ఉంటావా? గేమ్ వరకేనా? కాజల్: నాకు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవాలనిపిస్తే అలానే రియాక్ట్ అవుతున్నా. నేనిలాగే ఉంటాను. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత మానస్‌ను ఐదో ఫైనలిస్టుగా ప్రకటించిన నాగ్ కాజల్ ఎలిమినేట్ అయినట్లు వెల్లడించాడు. దీంతో సన్నీ, మానస్ వెక్కివెక్కి ఏడ్చారు. ఇక శ్రీరామ్‌తో నువ్వెప్పటికీ నా బ్రదర్వే అని చెప్పుకొచ్చింది కాజల్. నన్ను బాగా మిస్సవ్వండి అంటూ బిగ్‌బాస్ హౌస్ నుంచి నిష్క్రమించింది. స్టేజీ మీదకు వచ్చిన కాజల్‌తో నాగార్జున ఓ ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు. ఐదు ఎమోషన్స్‌ను ఐదుగురు కంటెస్టెంట్లకు అంకితమివ్వాలన్నాడు. సన్నీ ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్ ఇస్తే మానస్ ఐదు రెట్ల ఫ్రెండ్షిప్ చేస్తాడంది కాజల్. సిరి ఐదు రెట్ల ఎమోషన్ ఇస్తే, శ్రీరామ్ ఐదు రెట్ల యాక్షన్ చేస్తాడని తెలిపింది. షణ్ముఖ్ ఐదు రెట్ల డ్రామా చేస్తాడని పేర్కొంది. సిరిని కంట్రోల్ చేయడం, తిట్టడం, హగ్గులివ్వడం.. ఇలా ప్రతిదాంట్లో డ్రామా ఉంటుందని అభిప్రాయపడింది. తాను టాప్ 6లో ఉండగానే ఎలిమినేట్ అవుతానని కల వచ్చిందని, చివరకు అదే నిజమైందని నాగార్జునతో చెప్పుకొచ్చింది. చివరగా ఇంట్లో జరిగిన గొడవలన్నింటికీ తనే మూల కారణమని ఒప్పుకోవడం గమనార్హం. కానీ అవేవీ తను కావాలని చేయలేదని స్పష్టం చేసింది. ఫైనల్‌గా శ్రీరామ్, సిరి, మానస్, షణ్ను, సన్నీ ఈ సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్లుగా నిలిచి ట్రోఫీ కోసం పోటీపడనున్నారు. -
సిరి పిచ్చెక్కిపోతున్నావు, నీకిది అవసరమా?: జెస్సీ ఫైర్
Bigg Boss Telugu 5, Model Jaswanth Fires On Siri, Shannu: బిగ్‌బాస్ జర్నీ ముగింపుకు చేరుకుంది. మరోవారంలో విజేత ఎవరనేది తేలిపోనుంది. అయితే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లపై ప్రేక్షకులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటినీ కాకపోయినా అందులో కొన్నింటిని నిన్నటి ఎపిసోడ్లో అడిగి హౌస్మేట్స్ నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ రోజు మాత్రం ఏకంగా బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఈ ఆరుగురికి ప్రశ్నలు సంధించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది. 'షణ్ను ఇది చాలా సీరియస్.. నీకు, సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో, జనాలు ఏం అనుకుంటున్నారో? అని ఎప్పుడైనా ఆలోచించావా?' అని సూటిగా ప్రశ్నించాడు జెస్సీ. అలాగే సిరికి సైతం గట్టిగానే క్లాస్ పీకాడు. 'నువ్వు బిగ్‌బాస్ హౌస్‌లోకి గేమ్ ఆడటానికి వెళ్లావు కదా సిరి, కానీ ఎమోషనల్ కనెక్ట్ అయిపోతున్నాను అదీ ఇదీ అంటూ పిచ్చెక్కిపోతున్నావు, అవసరమా నీకు' అని తిట్టినంత పని చేశాడు జెస్సీ. ఇక ప్రియాంక సింగ్.. ఇన్నిరోజులు హౌస్‌లో నన్ను భరించావా? లేదా నటించావా? అని మానస్‌ను నిలదీసింది. ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఊహించని హౌస్మేట్స్ మరి వీటికి ఏమని సమాధానాలిచ్చారో చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
మాట మార్చిన సిరి, 4వ స్థానానికి పడిపోయిన షణ్ముఖ్
Bigg Boss 5 Telugu, Episode 98: బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఓ ప్రమోషన్ టాస్క్ ఇచ్చాడు. ఈ టీవీఎస్ అపాచీ గేమ్‌లో కాజల్ సంచాలకురాలిగా వ్యవహరించింది. అయితే గేమ్‌లో సన్నీకి గైడెన్స్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది సిరి. పైగా సన్నీ చిన్నచిన్న పొరపాట్లు చేసినప్పటికీ కాజల్ అతడినే విజేతగా ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోయింది. సంచాలకురాలిగా కాజల్ ఫెయిలయిందని చెప్పిందే చెప్తూ ఆమెను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. ఫ్రెండ్ అని సన్నీని విన్నర్‌గా ప్రకటించిందని మండిపడింది. ఈ క్రమంలో వీళ్లిద్దరూ చాలాసేపు గొడపడ్డారు. ఇక స్టేజీపైకి వచ్చిన నాగార్జున హౌస్‌మేట్స్‌తో ఓ ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు. ఈ పద్నాలుగో వారాల్లో సంతోషపెట్టిన క్షణాలతో పాటు, బాధపడ్డ రోజులు, రిగ్రెట్‌గా ఫీలైన సంఘటనలు ప్రతి ఒక్కరికీ ఉండే ఉంటాయని, ఈ జర్నీలో ఏ వారంలో మీకు రిగ్రెట్ ఉందో చెప్పాలన్నాడు నాగ్. మొదటగా కాజల్ మాట్లాడుతూ.. '9 వారంలో జైలు నామినేషన్ జరిగింది. అప్పుడు సన్నీ, మానస్‌ను సేవ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ వాళ్లను చేయలేదు. శ్రీరామచంద్రతో మాట్లాడాక షణ్నును సేవ్ చేయాలనుకున్నా. అంటే ఎవరో గుర్తు చేస్తే నన్ను సేవ్ చేశావని అతడూ హ్యాపీగా లేడు' అని చెప్పుకొచ్చింది. షణ్ను మాట్లాడుతూ.. 'ఎమోషనల్ కనెక్ట్ పెద్ద రిగ్రెట్. 11వ వారంలో నా వల్ల సిరి తలబాదుకోవడం నచ్చలేదు. 14వ వారం టాప్ 5 గురించి మరీ ఎక్కువగా ఆలోచించాను. హౌస్మేట్స్ ఏం చేసినా, ఏం మాట్లాడినా గేమ్ గురించేనేమో అని అనుమానపడి సిరిని కొన్ని విషయాల్లో ఆపాను. అయితే ఆమెకు సాయం చేద్దామనేదే నా ఉద్దేశ్యం. కానీ ఆమె గేమే బాగుందేమో, అనవసరంగా సాయం చేస్తున్నానేమో అని కొంత రిగ్రెట్‌గా ఫీలయ్యా. ఒకవేళ ఆమె టాప్ 5లో లేకపోతే అది నా తప్పు అవుతుందేమో అనిపిస్తోంది' అని చెప్పుకొచ్చాడు. సన్నీ వంతురాగా.. '12వ వారంలో నేను అగ్రెసివ్ అయి గేమ్ ఆడాను. దీనివల్ల సిరి ఐస్బకెట్లో నుంచి కాళ్లు తీయకుండా ఆడింది. దీంతో వారమంతా సఫర్ అయింది. అది నా వల్లే అనిపించింది. మరొకటి గిల్టీబోర్డు వేసుకున్నది కూడా మర్చిపోలేను' అని తెలిపాడు. మానస్.. '4వ వారంలో కెప్టెన్సీ కోసం బరువు తగ్గాం, చాలా కష్టపడ్డాం. అప్పుడు సన్నీ,నేను ఇద్దరిలో ఎవరు కెప్టెన్సీకి పోటీపడాలా అని ఆలోచించుకున్నాక సన్నీకి అవకాశమిచ్చాను. అయితే హౌస్‌లో ఎక్కువ కత్తిపోట్లు సన్నీకే పడ్డాయి. ఏ కారణం లేకుండానే అందరూ కత్తితో పొడిచేస్తున్నారు. ఆరోజు నేనే పోటీకి వెళ్లుంటే వాడు అలాంటి స్థితి ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండేది అనిపించింది' అన్నాడు. శ్రీరామ్.. '4వ వారంలో ఎవరి వంట వాళ్లు వండుకోవాలి అన్న గొడవ జరిగింది. ఆ తర్వాత నేను చాలా డల్ అయ్యాను. ఎక్కువ తప్పు జరిగిపోయిందా? నావల్లే ఇంట్లో గొడవలు మొదలయ్యాయా? అని తెగ ఆలోచించి డిస్టర్బ్ అయ్యాను' అని పేర్కొన్నాడు. సిరి.. 11వ వారంలో షణ్నుతో గొడవపడి తల బాదుకోవడం తప్పనిపించిందని చెప్పుకొచ్చింది. అనంతరం నాగ్ మరో గేమ్ ఆడించాడు. ఈ పద్నాలుగువారాలను పరిగణనలోకి తీసుకుని ఎవరు హిట్ స్టార్? ఎవరు ఫ్లాప్ స్టార్? చెప్పాలన్నాడు. ముందుగా కాజల్.. సన్నీకి హిట్ స్టార్, షణ్నుకి ఫ్లాప్ స్టార్ అన్న ట్యాగ్‌నిచ్చింది. శ్రీరామ్.. సన్నికీ హిట్, కాజల్‌కు ఫ్లాప్ స్టార్ బిరుదునిచ్చాడు. సన్నీ.. మానస్‌కు హిట్, షణ్నుకి ఫ్లాప్ స్టార్ అన్న ట్యాగ్‌నిచ్చాడు. కానీ పద్నాలుగు వారాలను పరిగణనలోకి తీసుకోవాలని నాగ్ గుర్తు చేయగానే ఆ ఫ్లాప్ స్టార్ ట్యాగ్‌ను షణ్నుకి కాకుండా సిరికిచ్చాడు. తర్వాత సిరి.. షణ్నును హిట్, సన్నీని ఫ్లాప్ స్టార్‌గా పేర్కొంది. మానస్.. సన్నీకి హిట్, షణ్నుకు ఫ్లాప్ స్టార్ ట్యాగ్ ఇచ్చాడు. షణ్ముఖ్.. సిరికి హిట్, కాజల్‌కు ఫ్లాప్ స్టార్ బిరుదునిచ్చాడు. అనంతరం సన్నీని సెకండ్ ఫైనలిస్టుగా ప్రకటించారు. తర్వాత హౌస్‌మేట్స్‌ను మరోసారి 1 నుంచి 6 ర్యాంకుల వరకు నిల్చోమన్నాడు నాగ్. కాజల్, సిరి తప్ప మిగతా మేల్ కంటెస్టెంట్స్ అంతా మొదటి స్థానం తమదే అన్నారు. దీంతో నాగ్.. అమ్మాయిలిద్దరు మాత్రమే రెండో స్థానానితో సరిపెట్టుకుంటున్నారని పెదవి విరిచారు. షణ్నును మొదటి స్థానంలో చూడాలనుకుంటున్న సిరి తన మాటను వెనక్కు తీసుకుంటూ వెళ్లి ఫస్ట్ ర్యాంక్‌పై నిలబడింది. శ్రీరామ్, కాజల్, షణ్ముఖ్, సన్నీ, మానస్ వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల వరకు నిలబడ్డారు. -
ప్లీజ్, మా కల నెరవేర్చండి..: సన్నీ, కాజల్
Bigg Boss Telugu, Episode 97: హౌస్మేట్స్ స్టార్లుగా నటించాల్సిన టాస్కులో అందరూ తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఇరగదీశారు. సూర్యగా షణ్ను, జెనీలియాగా సిరి, పవన్ కల్యాణ్‌గా మానస్, చిరంజీవిగా శ్రీరామ్, బాలయ్యగా సన్నీ, శ్రీదేవిగా కాజల్ అదరగొట్టారు. కానీ అందరికంటే ఎక్కువగా కాజల్ తన పాత్రలో లీనమై అందరినీ ఆకట్టుకుంది. దీంతో హౌస్మేట్స్ ఆమెను బెస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు. అలా కాజల్‌కు నేరుగా ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నా కల నెరవేరడానికి మీరు ఎంతగానో సహకరించారు. నేను టాప్ 5లో నా ఫ్రెండ్స్‌తో పాటు ఉండాలనుకుంటున్నాను, దయచేసి ఓటేయండి' అని ప్రేక్షకులను అభ్యర్థించింది కాజల్. కంటెస్టెంట్లపై ప్రేమాభిమానాలు కురిపించే ప్రేక్షకుల మనసుల్లో ఎన్నో ప్రశ్నలున్నాయన్న బిగ్‌బాస్ వారి ప్రశ్నలను హౌస్మేట్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు. అందులో భాగంగా ప్రేక్షకుల ప్రశ్నలు స్క్రీన్‌పై ప్రత్యక్షం అవగానే అది ఎవర్నైతే అడిగారో వారు దానికి బదులివ్వాల్సి ఉంటుంది. ఎలాంటి ముసుగు వేసుకోకుండా సమాధానాలు చెప్పినవారు ఓట్ ఫర్ అప్పీల్‌కు అవకాశం పొందుతారు. మొదటి ప్రశ్న: మీరు షణ్ను కన్నా స్ట్రాంగ్ ప్లేయర్. కానీ మిమ్మల్ని మీరు ఎందుకలా కన్సైడర్ చేసుకోవడం లేదు? సిరి: నేను స్ట్రాంగ్ ప్లేయర్‌నే. కాకపోతే కొన్ని సంఘటనల్లో షణ్ను నాకు తోడుగా ఉన్నాడు, ఒక్కసారి నమ్మానంటే ప్రాణం ఇచ్చేస్తాను. ఒక ఫ్రెండ్‌గా నేను వాడిని ఫస్ట్ ప్లేస్‌లో చూడాలనుకున్నాను. రెండో ప్రశ్న: అనీ మాస్టర్‌తో రెస్పెక్ట్ గురించి మాట్లాడినప్పుడు తుడిచిన టిష్యూని సన్నీ మీద కొట్టడం రెస్పెక్టా? కాజల్: సన్నీ దగ్గర నాకు చనువుంది, అతడంటే నాకు చాలా గౌరవం. అది సరదా గొడవలో చేశాను. మూడో ప్రశ్న: గిల్టీ బోర్డ్ వేసుకుని తిరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ కాన్ఫిడెన్స్‌ను ఎలా తిరిగి పొందారు ? సన్నీ: గిల్టీ బోర్డ్ వేసుకోవడమనేది ఈ సీజన్లోనే నేను బాగా హర్టయిన సంఘటన. గిల్టీ అనే పదానికి దరిదాపుల్లో కూడా వెళ్లకూడదనుకున్నాను. అద్దంలో చూసుకుంటూ నాలో నేను కాన్ఫిడెన్స్ నింపుకుంటాను. నాలుగో ప్రశ్న: జెస్సీ ఇష్యూ జరిగినప్పుడు షణ్ను ఇమ్మెచ్యూర్ అని మీరు చెప్పారు. కానీ ర్యాంకింగ్ టాస్క్‌లో మీరే షణ్ను మెచ్యూర్ అని, తనను సెకండ్ ప్లేస్‌లో పెట్టారు. మీ అభిప్రాయం ఎందుకు మారింది? ఇప్పుడు మీరు షణ్ను గ్రూపులో ఉన్నారా? శ్రీరామ్: ఇప్పుడు తెలిసిన షణ్ముఖ్ వేరు.. ప్రస్తుతం షణ్ను చాలా మెచ్యూర్. ఐదో ప్రశ్న: ఆడియన్స్ దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్‌లా వాడుకుంటున్నాడని మీకు అనిపించట్లేదా? మానస్: వాడుకోవడమనేది రాంగ్. జన్యున్‌గా కనెక్ట్ అయిన వ్యక్తి సన్నీ. ఫ్రెండ్స్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు? ఫ్రెండ్స్ సేవ్ చేసినప్పుడు సన్నీ ఎక్స్ప్రెషన్స్ చూసుంటే మీకు అర్థమవుతుంది. నాకెప్పుడూ అతడు వాడుకోవాలనిపించలేదు. ఆరో ప్రశ్న: సిరి అంటే మీరు ఎందుకంత పొసెసివ్‌గా ఫీల్ అవుతారు? మీరు సిరిని ప్రతిసారి ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు. తనని తనలా ఎందుకు ఉండనివ్వరు? షణ్ను: ఇది నేనూ ఊహించాను. నేను పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నానని నాకూ తెలుసు. కొన్ని కొన్ని విషయాల్లో ఆమెను కంట్రోల్ చేస్తే బెటర్ అని, మిగతా కొన్నింటిలో ఆమె ఆమెలా ఉంటే సరిపోతుందని అనుకున్నాను. కానీ ఏది కంట్రోల్ చేస్తున్నానో, ఏది పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నానో నాకే తెలియడం లేదు. నన్ను నాకన్నా ఎక్కువ తనే అర్థం చేసుకుంటుంది. తనమీద ఎవరైనా గేమ్ ఆడాలనుకుంటే తప్పకుండా కంట్రోల్ చేస్తాను. ఎందుకంటే ఆమెను టాప్ 5లో చూడాలనుకుంటున్నాను. అందరిముందు కాజల్‌ను ఎందుకు హ్యుమిలియేట్ చేస్తారు? స్టాండ్ తీస్కొని మీకోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ తను విన్ అయింది సన్నీ: మేం ఫ్రెండ్స్. మీకలా అనిపించిందంటే ఇంకా ఎక్కువ చేస్తాను. రవిని నామినేట్ చేశారు, ఇన్ఫ్లూయెన్సర్ అనే పేరు కూడా పెట్టారు. మరి టికెట్ టు ఫినాలే టాస్క్‌లో మేం నీకోసం ఆడుతున్నాం రవి , మిస్ యూ రవి అని అనడం కరెక్ట్ అనుకుంటున్నారా? సిరి: మనిషి పక్కన ఉన్నప్పుడు అతడి వాల్యూ తెలియలేదు. నన్ను చెల్లెలిగా చూస్తూ ఏడిపిస్తాడు. రవి సడన్‌గా ఎలిమినేట్ అవడంతో షాక్‌లోకి వెళ్లిపోయా. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో రవి గుర్తొచ్చాడు, అతడి కోసం ఆడాలనిపించింది. మీరు ప్రియాంక మీ ఫ్రెండ్ అనుకున్నప్పుడు తనని బ్యాక్బిచ్ ఎందుకు చేశారు? మానస్: ప్రియాంక ప్రవర్తన నచ్చనప్పుడు దాన్ని నేను షేర్ చేసుకుంటాను. కానీ నేనెప్పుడూ ఆమె మంచి కోరేవాడినే! కానీ నా ఇంటెన్షన్ మాత్రం అది కాదు మొదట్లో షణ్ముఖ్‌తో, తర్వాత రవితో, ఇప్పుడు సన్నీ, మానస్‌తో ఫ్రెండ్‌లా ఉంటున్నారు. మీరు కేవలం ఆటలో ముందుకు వెళ్లడానికి ఇలా ఫ్రెండ్లీగా ఉంటున్నారా? కాజల్: మొదట్లో షణ్ను నచ్చాడు, కనెక్ట్ అయ్యాను. కానీ కొన్ని సంభాషణల వల్ల మా మధ్య దూరం పెరిగింది. రవితో ఫ్రెండ్లీ కనెక్ట్ రాలేదు. మానస్, సన్నీలతో కనెక్ట్ అయ్యాను. ఆట కోసం ఈ కనెక్షన్స్ పెట్టుకోలేదు ఆడియన్స్‌కు ఇవెలా నచ్చుతాయి? అవెలా నచ్చుతాయని ఆడియన్స్‌ను ఎందుకు జడ్జ్ చేస్తున్నారు? వారిపై ఫన్ ఎందుకు చేస్తున్నారు? అన్న ప్రశ్నకు షణ్ముఖ్ తానైతే ప్రేక్షకుల మీద ఫన్ చేయట్లేదని సమాధానమిచ్చాడు. మొదటి నుంచీ గ్రూప్‌లోనే ఆడుతున్నా మిమ్మిల్ని మీరు లోన్ రేంజర్లా ప్రొక్లైం చేసుకున్నారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో మీరు, రవి ఇద్దరూ ఇద్దరి ఫొటోలు కాల్చేయలానుకున్నారు. కానీ కాజల్ ఆ పని చేస్తే మాత్రం ఆగ్రహించారు? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా అందరితో కలిసుండాలనుకున్నా, కలిసి ఆడాలనుకున్నానంటూ సింపుల్‌గా తేల్చేశాడు. గేమ్ ఎథికల్‌గా ఆడకపోతే కోపమొస్తుందని తెలిపాడు. మొత్తానికి ఈ ప్రశ్నోత్తరాల టాస్కులో ఎలాంటి ముసుగు లేకుండా అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబిచ్చింది సిరి, సన్నీ అని హౌస్మేట్స్ అభిప్రాయపడ్డారు. ఓట్లు అడిగే అవకాశాన్ని సన్నీ కోసం సిరి జాడవిరుచుకుంది. దీంతో సన్నీ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ.. 'నేను అగ్రెసివ్ కాదు, టాస్కుల్లో 100 % ఇస్తున్నాను. నాకోసం కప్పు గెలుచుకురారా అని అమ్మ నన్ను ఒక కోరిక కోరింది. అది నెరవేర్చలేకపోతే బాధపడతాను. నాకీ అవకాశమిచ్చిన సిరికి సపోర్ట్ చేయండి. ప్లీజ్ వోట్ ఫర్ మీ..' అని కోరాడు. -
సిరిని కంట్రోల్లో పెడుతున్నానని అంగీకరించిన షణ్ను!
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్న సంఘటనలపైనే కాకుండా కంటెస్టెంట్లపై కూడా ప్రేక్షకులకు అనేక అనుమానాలున్నాయి. వాటిలో కొన్నింటికి నేడు సమాధానం దొరకనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది. ఇంటిసభ్యులందరూ ప్రేక్షకుల ప్రశ్నలు ఎదుర్కోవాలన్నాడు నాగ్. అందులో భాగంగా శ్రీరామ్‌కు.. ఇప్పుడు మీరు షణ్ను గ్రూప్‌లో ఉన్నారా అన్న ప్రశ్న ఎదురైంది. ఈ క్వశ్చన్ చూసి అవాక్కైన షణ్ను.. నాకో గ్రూప్ కూడా ఉందా? అంటూ నవ్వుకున్నాడు. మానస్‌కు మరో వింత ప్రశ్న ఎదురైంది. ఆడియన్స్ దగ్గర మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్‌గా వాడుకుంటున్నాడని మీకు అనిపించట్లేదా? అని ఓ ప్రేక్షకుడు సూటిగా ప్రశ్నించాడు. ఇలాంటి క్వశ్చన్ వస్తుందని ఊహించలేదని సిరి షాకైంది. ఇక షణ్ముఖ్‌కు.. 'సిరి అంటే మీరు ఎందుకంత పొసెసివ్‌గా ఫీల్ అవుతారు? మీరు సిరిని ప్రతిసారి ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు? తనని తనలా ఎందుకు ఉండనివ్వరు?' అని ఆడియన్స్‌లో ఒకరైన సునీత ప్రశ్నించింది. నిజంగానే కంట్రోల్ చేస్తున్నావా? అని శ్రీరామ్ ప్రశ్నించగా అంత లేదన్నట్లు సిరి మాట్లాడింది. కానీ షణ్ను మాత్రం నువ్వు కంట్రోల్ అవ్వనిదే ఎవరూ ఆ క్వశ్చన్ వేయరంటూ ఆమెను నియంత్రిస్తున్నానని అంగీకరించాడు. 'మొదట్లో షణ్ముఖ్‌తో, తర్వాత రవితో, ఇప్పుడు సన్నీ ఇంకా మానస్‌తో ఫ్రెండ్‌లా ఉంటున్నారు. మీరు కేవలం ఆటలో ముందుకు వెళ్లడానికి ఇలా ఫ్రెండ్లీగా ఉంటున్నారా?' అని ఓ ప్రేక్షకుడు కాజల్‌ను నిలదీశాడు. కానీ అదంత మంచి ప్రశ్నలా కనిపించకపోవడంతో కాజల్ ఏడ్చేసింది. అటు శ్రీరామ్ మాత్రం ఈ క్వశ్చన్‌ను నేను కాజల్‌ను ఇదివరకే అడిగానంటూ సిరి, షణ్నులతో చెప్పుకొచ్చాడు. మరి ఈ ప్రశ్నలకు హౌస్మేట్స్ ఎలాంటి సమాధానాలు చెప్తారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
ఆవేశంలో షణ్ను, ఒక్క హగ్గుతో ఇంప్రెస్ చేసిన సిరి
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కథ కంచికి చేరుకునే సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఫన్నీ టాస్కులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని డిసైడ్ అయ్యాడు బిగ్‌బాస్. ఇందుకోసం కంటెస్టెంట్లు స్టార్ హీరోహీరోయిన్లుగా మారారు. షణ్ముఖ్ సూర్యగా, కాజల్ శ్రీదేవిగా, సన్నీ బాలయ్యగా, శ్రీరామ్ చిరంజీవిగా, మానస్ పవన్ కల్యాణ్‌గా, సిరి జెనీలియాగా నటిస్తున్నారు. ఇప్పటికే వీళ్లు తమ పాత్రల్లో జీవిస్తూ ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తున్నారు హౌస్మేట్స్. తాజాగా ఈ ఫన్ ధమాకా రెట్టింపు అయినట్లు కనిపిస్తోంది. శ్రీదేవిగా కాజల్ భూలోకంలో తన అంగులీకం(ఉంగరం) పోయిందని తెగ వెతుకుతున్న విషయం తెలిసిందే కదా! అయితే ఆమె అంగులీకాన్ని వెతికిపెట్టమని సింగం షణ్నుని సాయం కోరింది. కానీ అతడు సాయం చేయాల్సింది పోయి గద్దించి భయపెట్టాడు. దీంతో ఈ అంగులీకం లొల్లి బాలయ్యదాకా చేరింది. షణ్నును ఇంప్రెస్ చేస్తే నీ ఉంగరం నీకు వస్తుందన్నాడు సన్నీ. దీంతో సిరి తన దగ్గరున్న మంత్రదండాన్ని ఉపయోగించింది. వెంటనే వెళ్లి షణ్ముఖ్‌ను హత్తుకోవడంతో అతడు కూల్ అయ్యాడు. -
ఎమోషనల్ కనెక్షన్, లైట్ తీస్కోమన్న శ్రీరామ్.. ఏడ్చేసిన కాజల్
Bigg Boss 5 Telugu, Episode 96: కంటెస్టెంట్లు ప్రేక్షకులను నేరుగా ఓట్లు అడిగేందుకు బిగ్‌బాస్ అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ ఇచ్చే టాస్కుల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచినవారికి ఓట్లు వేయమని అడిగేందుకు ఛాన్స్ ఇస్తారు. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్లో కొన్ని ముఖ్యమైన సంఘటనలను రీక్రియేట్ చేసే టాస్కులో షణ్ను గెలిచి ఓట్లు వేయమని అభ్యర్థించే అవకాశాన్ని గెలుపొందాడు. అలాగే నవ్వకుండా ఉండాల్సిన టాస్కులో శ్రీరామ్, మానస్ ఇద్దరూ గెలిచినట్లు నేటి(డిసెంబర్ 9) ఎపిసోడ్లో వెల్లడైంది. ఇద్దరికీ టై అవడంతో శ్రీరామ్ మానస్‌కు ఛాన్స్ ఇచ్చాడు. అలా మానస్ మైకు ముందుకు వచ్చి.. తనకు ఓట్లేయండంటూనే తన ఫ్రెండ్స్ కాజల్, సన్నీకి కూడా ఓట్లేసి గెలిపించమని కోరుకున్నాడు. హౌస్‌లో శ్రీరామ్, కాజల్‌కు మరోసారి గొడవ జరిగింది. తిట్టుకుంటున్న క్రమంలోనే కాజల్ అతడిని బ్రో అనేసింది. అది నచ్చని శ్రీరామ్.. నువ్వు నాకు సిస్టర్ కాదు, బ్రో అని పిలవకు అని ముఖం మీదే చెప్పాడు. దీంతో హర్టైన కాజల్ బోరుమని ఏడ్చేసింది. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను, అతడు అలా పిలవద్దనేసరికి తట్టుకోలేకపోయానంటూ తన బాధను సన్నీ, మానస్‌లకు చెప్పింది. అటు నుంచి కనెక్షన్ లేనప్పుడు నిన్ను లైట్ తీసుకున్నప్పుడు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దంటూ హితవు పలికాడు సన్నీ. ఇక వోట్ అప్పీల్ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ మూడో అవకాశం ఇచ్చాడు. ఇంటిసభ్యులందరూ సూపర్ స్టార్స్‌లా నటించాల్సి ఉంటుందన్నాడు. అందులో భాగంగా సన్నీ.. బాలయ్య, శ్రీరామ్.. చిరంజీవి, కాజల్.. శ్రీదేవి, మానస్.. పవన్ కల్యాణ్, షణ్ను.. సూర్య, సిరి.. జెనీలియాగా నటించారు. ప్రతి ఒక్కరూ వారివారి పాత్రల్లో జీవించేశారు. క్లాస్, మాస్ పాటలకు స్టెప్పులు కూడా ఇరగదీశారు. ఈ టాస్క్ వల్ల హౌస్మేట్స్ అంతా కలిసిపోయారు. ఇంతలో షణ్ను సిరికి మధ్య మరోసారి తగవు మొదలైంది. నువ్వు వాళ్లతో(సన్నీ గ్రూప్‌తో) అయితే హ్యాపీగా ఉంటావు, వెళ్లు, నీతో నేను సింక్ అవ్వట్లేదు అని సిరికి ముఖం మీదే చెప్పాడు షణ్ను. ఎప్పుడూ లేనిది ఈ వారమే నీకు ప్రాబ్లం అవుతుంది కదా అంటూ సిరి అసహనం వ్యక్తం చేసింది. కాసేపటికే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ షణ్ను కోపాన్ని కరిగించింది. అతడు నవ్వేయగానే మన ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టమంటూ వెళ్లి అతడిని హత్తుకుంది. అలా వీళ్ల గొడవ చప్పున చల్లారిపోయింది. కానీ రేపటి ఎపిసోడ్లో కూడా వీళ్లు మళ్లీ గొడవపడుతున్నట్లు తెలుస్తోంది. -
'సిరిది సిగ్గులేని జన్మ, ఓట్లు, నోట్ల కోసం దిగజారింది'
Bigg Boss Telugu 5, Madhavi Latha Furious On Siri-Shannu Friendship: బిగ్‌బాస్ ఈ మధ్య సిరి- షణ్నుల ఫ్రెండ్షిప్ను బాగా హైలైట్ చేస్తున్నాడు. దానికి కారణం వీళ్ల స్నేహం కొత్తపుంతలు తొక్కుతోంది. ఎప్పుడూ సిరి జపం చేసే షణ్ను ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో నుంచి చూస్తూ ఆమె మీద అజమాయిషీ చేస్తున్నాడన్న వాదన సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. సిరి ఎప్పుడేం మాట్లాడాలి? ఏం చేయాలి? అనేది కూడా అతడే డిసైడ్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే అది కేరింగ్ అని కొందరు అంటుంటే కాదు కమాండింగ్ అని మరికొందరు వాదిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఫైర్ అయిన మాధవీలత తాజాగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో షణ్ముఖ్ ప్రవర్తనను తప్పుపడుతూనే సిరిని సైతం ఏకిపారేసింది. 'సిరిది సిగ్గులేని జన్మ, ఆఫర్స్ కోసం దిగజారిన బతుకు.. అంత తిట్టినా వాడితో... అది స్నేహం, అది లవ్ అని మెసేజ్‌లు పెడుతున్నారు.. అలా చేస్తే పెళ్లాం కూడా మొగుడి పైత్యం దిగడానికి వాతలు పెడుతుంది. ఓట్ల కోసం, వచ్చే నోట్ల కోసం ఒక మనిషి ఇంతలా దిగజారాలా?! ఓపెన్‌గా తల్లిని అవమానించినా అటు తల్లిని, ఇటు పార్ట్నర్ను లెక్క చేయని పద్ధతి గల మంచి అమ్మాయి సిరి. సరేలే పైసల్ కావాలిగా.. షణ్ను ఎక్కడ ముఖం మాడ్చుకుంటాడో అని కన్నా అని ప్రేమగా పిలుస్తావు, కానీ నీ పార్ట్నర్ (శ్రీహాన్)ను కన్నా అని కాకుండా చోటు అని పిలుస్తావ్.. మహానటివి. వాడు మీ అమ్మకు గౌరవం ఇవ్వడు. కానీ నువ్వు మాత్రం వాడిలో పార్ట్నర్ని చూస్కో.. బంధాలు అనుబంధాలకి అర్థాలు మార్చి రాసిన ఘనత మీది.. బిగ్‌బాస్ అయ్యాక నిన్ను భరిస్తాడంటే మీ ఆయన దేవుడు. కాళ్లు కడిగి నెత్తిన చల్లుకో వచ్చే జన్మలో అయినా మంచి బుద్ధి ఇస్తాడు. ఇకపోతే షణ్ముఖ్.. ఇమిటేషన్ టాస్కులో అతడిని ఇమిటేషన్ చేయకూడదట! మాటిమాటికి శ్రీరామ్ డ్యాన్స్ చేయకపోయినా ఇమిటేషన్ టాస్కులో షణ్ను డ్యాన్స్ ఎందుకు ఇమిటేట్ చేశాడు? శ్రీరామ్ ఫీల్ అయ్యాడా? స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. మనిషి అంటే నీతులు పక్కనోళ్లకు చెప్పడం కాదు.. వీడు సిరిని సెక్యూరిటీ గార్డ్‌లా కాపాడుతున్నాడట.. ఇంట్లో ఉన్న శ్రీరామ్, మానస్, సన్నీ కామపిశాచులు మరి! వాళ్లు సిరి హగ్ కోసం అల్లాడిపోతున్నారు.. అందుకే కదా సిరితో అన్నయ్య అని పిలిపించాడు, ఒక ఫ్రెండ్ అనేవాడు ఇంకో ఫ్రెండ్‌ను అన్నయ్య అని ఎందుకు పిలిపిస్తాడు?' అంటూ ప్రశ్నించింది మాధవి. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో షణ్ను, సిరి ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తూ వాళ్ల పరువు వాళ్లే తీసుకుంటున్నారని అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
Bigg Boss: టీమ్‌కు సిగ్గులేదు.. ఆడపిల్లపై మానసిక అత్యాచారం..నటి షాకింగ్ కామెంట్
Madhavi Latha Shocking Comments On Bigg Boss 5 Telugu Show: వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే నటి మాధవీలత తాజాగా మరోసారి బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ మధ్య సిరి హన్మంత్ వాష్‌రూంలో తల బాదుకోవడాన్ని తప్పుపడుతూ.. బిగ్‌బాస్‌కు రూ.100 కోట్ల జరిమానా వేయిస్తానని చెప్పిన మాధవీ.. తాజాగా మరోసారి సిరి-షణ్ముఖ్‌ల రిలేషన్‌పైనే కామెంట్ చేసింది. షణ్ముఖ్ పదే పదే సిరి వ్యక్తిత్వం గురించి నీచంగా కామెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిసారి ఫ్రెండ్ షిప్ హగ్గు అంటూ సిరి తల్లి మాటలను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కంటి చూపులతో ఆమెను కంట్రోల్ చేస్తున్నాడు. ఇక నిన్నటి ఎపిసోడ్లో అయితే సిరిపై మరింత సీరియస్ అయ్యాడు షణ్ముఖ్. ఆమెతోపాటు.. ఆమె తల్లి మాటాలను కూడా తప్పు అంటూ వాదించాడు. ‘అవతలి వాళ్లను ఆయన ఈయన అంటావు, నన్నేమో అరేయ్ ఒరేయ్ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావు. మనిద్దరం ఉన్నప్పుడు వేరు, నలుగురిలో వేరు.. అవతలివాళ్ల ముందు నేను తక్కువైనా సరే నీకోసం ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేం గుర్తులేదు, హగ్ ఒక్కటే గుర్తుంది..' అంటూ సిరిపై కోపం ప్రదర్శించాడు. దీంతో సిరి ఏం మాట్లాడలేకపోయింది. అయితే వీటన్నింటిపై స్పందిస్తూ నటి మాధవీలత ఓ సుదీర్ఘ పోస్ట్‌ను తన ఫేస్బుక్లో షేర్ చేసింది. ఏమయ్యా బిగ్ బాస్.. సిగ్గులేని టీమ్ మీది.. ఆ బిగ్ బాస్ హౌస్ లో ఎంటా అరాచకం. ఒక ఆడపిల్లను బానిసను చేసి నవ్వకూడదు.. ఏడ్వకూడదు.. వంగకూడదు.. అనే మానసిక ఆత్యాచారం చేస్తుంటే.. ఎవడో పెళ్లాన్ని ఇంకోకడు డామినేట్ చేస్తుంటే.. వీకెంట్ ఊపుకుంటూ వచ్చిన మా నాగ్ మావ ఏమో అబ్బా ఎంట్రా ఇది అంటూ వగలు పోయి.. అమ్మా వద్దు అన్న హగ్గులు ఇప్పిస్తూ.. మీ ఫుటేజ్ కోసం ఆఖరికి నాగార్జున ని కూడా దిగజార్చిన మీకు టీఆర్పీ లేక ఏడుస్తున్నారు. ఒక కన్నతల్లి మాటని విలువ లేకుండా చేసిన. కూతురిని సపోర్ట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారో మా నాగ్ మావా.. ఎందండీ ఈ అరాచకం ఏందీ అంటా.. అలాంటి యాదవలకు బిగ్ బాస్ లో ప్లేస్ ఒకటి. వాడికే కప్ తగలబెట్టి మీ బిగ్ బాస్ సెట్ కూడా తగలబెట్టండి.. ఇలాంటి వాడికి కీరిటం పెడితే మీ బీబీ కొంపకి పైర్ యాక్సిడెంట్ అయి తర్వాత నిమిషాం తగలబడి పోతుంది చూడండి.. అసలు సమాజానికి ఏం చూపిస్తున్నారు ? యూత్ లో హగ్స్ అండ్ కిస్ లు తప్పేం కదా.. పక్కోడి పెళ్లాన్ని హగ్ చేసుకోవచ్చు అంటున్నారు. నాతో వాదిస్తున్నారు తప్పేంటని. స్నేహం ముసుగులో కామ కాలపాలు చూడలేకున్నాము.. మీ బీబీ టీం చివరి ఎపిసోడ్ చూసి..మీ నిర్ణయం సమాజనికి ఉపయోగకరమైన ఇంపాక్ట్ ఇవ్వకపోతే బిగ్ బాస్ షో పై డైరెక్ట్ గా సూప్రీం కోర్టులో కేసు వేస్తారు. హైకోర్టులో కూడా వేస్తాను. ఇది జోక్ కాదు.. సీరియస్.. టైంపాస్ కోసం టీవీ చూద్దామంటే అవమానాలే కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులతో కలిసి చూడాలంటే సిగ్గుగా ఉంది. చెవిపై.. మెడపై.. హార్డ్ పై ముద్దులు పెట్టుకుంటే చూడటానికి అసహ్యంగా ఉంది .. అడల్ట్ షో చూస్తున్నామా అనే ఫీలింగ్.. ఓటీటీలో పర్సనల్ గా చూసే షోలా ఉంది.. తగలబెట్టండి సర్ బీబీ 5 వరస్ట్ టీం.. వరస్ట్ షో’అని మాధవీలత ఆరోపించింది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
కంటిచూపుతో కంట్రోల్ చేస్తున్న షణ్ను, పాపం సిరి!
Bigg Boss 5 Telugu, Episode 95: బిగ్‌బాస్ జర్నీ ముగింపుకు వచ్చేకొద్దీ హౌస్‌లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ అల్లరి చేస్తూ సరదాగా ఉండే సిరి ఈ మధ్య మరీ డల్ అయిపోయింది. ఆమె అలా అవడానికి మూల కారణం షణ్నూనే అని అభిప్రాయపడ్డారు మానస్, కాజల్. షణ్ను చూపులతోనే సిరిని కంట్రోల్ చేస్తున్నాడని మానస్ అభిప్రాయపడ్డాడు. ఇది స్వయంగా తాను గమనించానని పేర్కొన్నాడు. కానీ దీనివల్ల సిరి ఇండివిడ్యువాలిటీ కోల్పోతుందని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్ జర్నీలో హైలైట్ అయిన సీన్లను తిరిగి ప్లే చేసే గేమ్‌లో.. శ్రీరామ్- జెస్సీలకు కిచెన్‌లో జరిగిన గొడవను రీక్రియేట్ చేసి చూపించాలన్నాడు బిగ్‌బాస్. అయితే షణ్ను మాత్రం ఇప్పటికే ఈ టాస్కుల్లో తనను చులకన చేస్తున్నారని అసహనానికి లోనయ్యాడు. మాటలు అంటే పడ్డాను, కానీ ఇమిటేట్ చేస్తే మాత్రం నచ్చదంటూ గొణుక్కున్నాడు. అసలు ఈ టాస్కులోనే పాల్గొననంటూ మొండిపట్టు పడ్డాడు. అతడిని కూల్ చేయడానికి వెళ్లిన సిరి మీద కూడా శివాలెత్తాడు. నువ్వు కూడా నన్ను తక్కువ చేస్తున్నావంటూ ఆమెపై ఫైర్ అయ్యాడు. తర్వాత సిరి వచ్చి సారీ చెప్పినప్పటికీ అతడు వినిపించుకోలేదు. నీవల్ల నాకేం నెగెటివ్ లేదు, నీ మంచి కోసం మాట్లాడితే నేను నెగెటివ్ అవుతున్నాను అంటూ చిర్రుబుర్రులాడాడు. మిగతా హౌస్మేట్స్ అందరూ ఎంతో నువ్వు కూడా అంతేనంటూ తేల్చి పారేశాడు. నువ్వు అవసరం లేదు, వెళ్లిపో అని వార్నింగ్ ఇచ్చాడు. 'నాదగ్గర చాలా ఫ్రీడమ్ తీసుకున్నావ్రా... అవతలి వాళ్లను ఆయన ఈయన అంటావు, నన్నేమో అరేయ్ ఒరేయ్ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావు. మనిద్దరం ఉన్నప్పుడు వేరు, నలుగురిలో వేరు.. అవతలివాళ్ల ముందు నేను తక్కువైనా సరే నీకోసం ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేం గుర్తులేదు, హగ్ ఒక్కటే గుర్తుంది..' అంటూ సిరిని నానామాటలు అన్నాడు. వీళ్లిద్దరి గొడవలో తన తల్లిని కూడా లాగడంతో తనకు తెలియకుండానే సిరి కళ్ల వెంట నీళ్లు ధారలు కట్టాయి. కానీ ఆమె బాధపడటానికి కూడా షణ్ను ఒప్పుకోలేదు. సారీ చెప్పి ఆమెను బుజ్జగించాడు. అలా కాసేపటికే ఇద్దరూ కలిసిపోయి హగ్గిచ్చుకున్నారు. సీన్ రీ క్రియేషన్ టాస్కులో హమీదా ట్యాగ్ మెడలో వేసుకున్న సన్నీని చూడగానే శ్రీరామ్‌లో ప్రాణం లేచి వచ్చినట్లైంది. మిస్ యూ హమీదా అంటూ సన్నీని హత్తుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించాడు. ఇప్పటివరకు జరిగిన రీ క్రియేషన్ టాస్కులో మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్‌గా హౌస్మేట్స్ షణ్నును ఎంచుకున్నారు. దీంతో అతడు ఆడియన్స్‌ను ఓటేయమని అడిగే అర్హత పొందాడు. 'ప్రేక్షకులే నా దేవుళ్లు. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక్కడున్న అందరికీ ఓటేయండి, నాకు కొంచెం ఎక్కువ ఓట్లేయండి' అని కోరాడు. అనంతరం ఎక్కువసేపు నవ్వకుండా ఉండాల్సిన టాస్క్‌లో మానస్ పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. -
శ్రీరామచంద్ర పాపాలు చేశాడు, షణ్నుకు ఓటేయండి: శ్రీరెడ్డి
Sri Reddy Comments On Sri Rama Chandra: వివాదాస్పద నటి శ్రీరెడ్డి బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీరామచంద్రకు సపోర్ట్ చేయొద్దంటూనే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్‌కు ఓటేయమని అభ్యర్థించింది. 'శ్రీరామచంద్రకు ఓటేయకండి.. వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గెలిస్తే సమాజానికి ఆదర్శంగా ఉంటుంది. కానీ ఇతడు గెలవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. ఇండియన్ ఐడల్ గెలిచాడు కాబట్టి బిగ్‌బాస్ టైటిల్ కూడా ఇచ్చేయాలి అంటే కరెక్ట్ కాదు. అనవసరమైన వ్యక్తులను, రియాలిటీగా ఉండకుండా నటించేవాళ్లను, ఫేక్ పర్సన్లను అస్సలు నమ్మొద్దు. షణ్ముఖ్ కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో అతడు చాలా టాలెంట్ అంటూ ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టా. అదిప్పటికీ గుర్తుంది. షణ్ముఖ్ డౌన్ టు ఎర్త్, ఫేక్‌గా ఉండడు, గేమ్ కూడా బాగా ఆడుతున్నాడని విన్నాను. ఏదో అప్పుడప్పుడు రెండు మూడు క్లిప్పింగులు చూస్తానంతే.. నిజానికి బిగ్‌బాస్ పెంట గురించి మాట్లాడటమే వేస్ట్. కానీ ఈ పెంటలో కూడా నష్టం జరగకూడదు కాబట్టి షణ్ముఖ్‌కు ఓటేయండి. శ్రీరామచంద్ర నాతో చాటింగ్ చేసినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు లీకయ్యాయి. అదంతా నిజంగానే జరిగింది. ఇలా ఉన్నాడు కాబట్టే అంత పెద్ద ఇండియన్ ఐడల్ అవార్డు కొట్టినా కూడా అక్కడే ఉండిపోయాడు. చేసిన పాపాల వల్లే పైకి ఎదగలేదు. ఇండియన్ ఐడల్‌ను అడ్డం పెట్టుకుని అమ్మాయిలతో చాటింగ్‌లు చేయడం, ఇంకా ఏవేవో చేయాలనుకునే కుసంస్కారం అతడిది. ఇలాంటి వ్యక్తులకు ఓటేయకుండా షణ్ముఖ్లాంటి మంచి వ్యక్తులకు ఓటేసి గెలిపించండి. ఇది నా అంతట నేనుగా తీసుకున్న నిర్ణయమే తప్ప ఎవరి ప్రోద్బలంతోనూ ఇలా చెప్పడం లేదు. దయచేసి ఎవరు మంచివాళ్లు? ఎవరు చెడ్డవాళ్లు? అనేది తెలుసుకుని ఓటేస్తారనుకుంటున్నాను' అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. -
మీ అమ్మ హగ్గుల గురించి మాట్లాడింది.. వెళ్లిపో, నా నెత్తి మీద ఎక్కకు
Bigg Boss 5 Telugu: షోలో బాగా హైలైట్ అయిన సంఘటనలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు బిగ్‌బాస్. ఈ ఐకానిక్ సంఘటనలలో ఒకరి రోల్ మరొకరు ప్లే చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రియాంక సింగ్, యానీ మాస్టర్‌గా మానస్; షణ్ముఖ్గా సన్నీ; లోబో, కాజల్‌గా శ్రీరామ్; సన్నీగా సిరి.. ఇలా ప్రతి ఒక్కరు సమయానుసారంగా ఆయా పాత్రల్లో దూరిపోయి తెగ నవ్వించారు. తాజాగా సన్నీ హమీదాలా మారిపోయాడు. హమీదా పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన సన్నీ శ్రీరామ్ సరసన వాలిపోయాడు. మరోపక్క షణ్ను సిరితో మళ్లీ గొడవపడ్డాడు. 'నువ్వు ఎవరితోనైనా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతే నేను ఆపాను, నిన్నెవడో అప్పడం అంటే నీకోసం వాదించాను, మీ అమ్మ వచ్చి అందరి ముందు హగ్గుల గురించి మాట్లాడింది.. నేను నెగెటివ్ అవట్లేదు కానీ నేను నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాను?! అవతలవాళ్ల ముందు నేను తక్కువైనా పర్లేదు కానీ నీ గురించి ఫైట్ చేస్తున్నాను.. అప్పుడూ నేను నెగెటివ్ అవలేదు? వెళ్లిపో, మిగతా హౌస్మేట్స్ ఎలాగో నువ్వూ అంతే, నా నెత్తి మీద ఎక్కకు.. వెళ్లిపో' అని తెగేసి చెప్పాడు షణ్ను. షణ్ను ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ అన్నీ తప్పుగా ఊహించుకుంటూ సిరికి చుక్కలు చూపిస్తున్నాడని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో ఇలా ప్రవర్తిస్తున్నాడేంటని ముక్కున వేలేసుకుంటున్నారు. -
Bigg Boss: వాళ్లు ఒప్పుకుంటేనే దీప్తితో పెళ్లి.. షణ్ముఖ్ పేరెంట్స్ కండీషన్
Shanmukh Parents Reaction on Shannu And Deepthi Marriage: బిగ్‌బాస్ -5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్-దీప్తి సునైనాల ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. తామిద్దరం ప్రేమలో ఉన్నామని బహిరంగంగానే చెప్పుకున్నారు. షణ్ముఖ్ అయితే బిగ్‌బాస్ హౌస్‌లో దీప్తిని తలచుకోని రోజంటూ ఉండదు. హౌస్‌లోకి తన తల్లి వచ్చినప్పుడు కూడా దీప్తి గురించే ఆరా తీశాడు షణ్ముఖ్. ఇక షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే.. బయట దీప్తి సునయన బయట ఫుల్ ప్రమోషన్స్ నిర్వహిస్తూ షణ్ముఖ్‌ని బిగ్ బాస్ విన్నర్‌ని చేయడానికి గట్టిగానే కష్టపడుతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షణ్ముఖ్‌కు సంబంధించిన స్పెషల్ వీడియోలను పోస్ట్ చేస్తూ భారీ ఓట్లు పడేలా చేస్తోంది. వీరిద్దరు తమ ప్రేమను బహిర్గతం చేయడంతో.. పెళ్లి ఎప్పుడు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రతి ఇంటర్వూలోనూ ఇరు కుటుంబ సభ్యులను కూడా ఇదే ప్రశ్నలు అడుగుతున్నారు. తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షణ్ముఖ్-దీప్తి పెళ్లి విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షణ్ముఖ్ తల్లిదండ్రులు. వారి ప్రేమ గురించి తమకు ముందుగా తెలియదని, టీవీలో చూసిన తరవాతే తెలిసిందన్నారు. ‘దీప్తిని ప్రేమిస్తున్నట్లు షణ్ముఖ్ మాతో చెప్పలేదు. వాళ్లు యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యారు.. మంచి ఫ్రెండ్స్ అనే అనుకున్నాం.. కానీ టీవీ షోలకు వెళ్లడం.. టాటూలు వేయించుకోవడం ఇవన్నీ చూసి.. లవ్‌లో ఉన్నారని తెలిసింది. మేం కూడా టీవీలో చూసే తెలుసుకున్నాం. ఆ తరువాత షణ్ముఖ్ విషయం చెప్పాడు.. అప్పుడు కూడా ఫ్రెండ్స్ అనే చెప్పాడు. షణ్ముఖ్‌కి ఇష్టం అయితే మాకు ఇష్టమే. కానీ దీప్తి సునయన పేరెంట్స్‌కి ఓకే అయితేనే మాకు ఓకే.. వాళ్లకి ఇష్టం లేకుండా పెళ్లి చేయం. వాళ్ల పేరెంట్స్ వీళ్లు చెప్పారో లేదో కూడా మాకు తెలియదు. . మా అబ్బాయి ఇష్టాన్ని మేం కాదనం.. వాడి పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. షణ్ముఖ్ అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు.. ముందు వాడి పెళ్లి కావాలి. షణ్ముఖ్ పెళ్లికి ఇంకో మూడునాలుగేళ్లు పడుతుంది’అని షణ్ముఖ్ తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. -
Bigg Boss-5: సన్నీ అరాచకం.. హగ్‌లతో ‘అప్పడం’.. షణ్ముఖ్ పరువు తీశాడుగా!
Bigg Boss 5 Telugu, Episode 94: ఇంటి సభ్యులకు సూపర్ లగ్జరీ ఐటమ్స్ ఇచ్చేందుకు చిన్నపాటి టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. లగ్జరీ ఐటమ్ పొందాలంటే ముందుగా గుజాబ్ జామ్ టాస్క్ గెలవాలని కండీషన్ పెట్టారు. చేతులు ఉపయోగించకుండా ఎవరైతే ఎక్కువగా గులాబ్ జామ్‌లు తింటారో వారే టాస్క్ విజేతలుగా నిలిచి, లగ్జరీ ఐటమ్ పొందుతారు. ఈ టాస్క్‌లో సిరి గెలిచి ఫ్రైడ్ చికెన్ ఐటమ్ పొందింది. ‘అప్పడం’ చేసేసిన సన్నీ ప్రేక్షకులకు నచ్చిన ఐకానిక్ సంఘటనల్ని ఒకరి రోల్ మరొకరు ప్లే చేయాల్సి ఉంటుందని చెప్పారు బిగ్‌బాస్. ఎవరైతే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తారో వాళ్లకి గార్డెన్ ఏరియాలో స్పెషల్‌గా ఏర్పాటు చేసిన ఓటింగ్ బూత్ నుంచి ఆడియన్స్‌కి ఓటింగ్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీనిలో భాగంగా సన్నీ-సిరిల మధ్య జరిగిన ‘అప్పడం’వివాదాన్ని ఇమిటేట్ చేసి చూపించాలని ఇంటి సభ్యులను ఆదేశించాడు. ఈ టాస్క్‌లో సన్నీలా సిరి, సిరిలా షణ్ముఖ్, షణ్ముఖ్‌లా సన్నీ, కాజల్‌లా శ్రీరామ్.. యానీ మాస్టర్లా మానస్, రవిలా కాజల్ వారి వారి పాత్రల్లో అద్భుత నటనను ప్రదర్శించారు. ముఖ్యంగా షణ్ముఖ్ పాత్ర చేసిన సన్నీ అయితే... తనదైన యాక్టింగ్‌తో తెగ నవ్వించేశాడు. సద్దుదొరికితే చాలు... సిరి పాత్రలో ఉన్న షణ్ముఖ్‌ని గట్టిగా చేసుకుంటూ.. ఆంటీ ఇది ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ రోజూ షణ్ముఖ్-సిరిలు ఎలాగైతే చేస్తారో అలా చేసి నవ్వులు పూయించాడు. సన్నీ వేసే పంచులకు షణ్ముఖ్ బిత్తరపోయాడు. తనను మాములుగా ఇమిటేట్ చేస్తేనే భరించలేని షన్నూ.. సన్నీ ఫెర్ఫామెన్స్‌ని తట్టుకోలేక పాత్ర నుంచి బయటకు వచ్చి.. ఇదే వేరే విధంగా వెళ్తుంది.. నువ్ బాగా ఓవర్ చేస్తున్నావ్ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో సన్నీ కొంచెం తగ్గాడు. మొత్తానికి ఈ అప్పడం టాస్క్‌లో అయితే సన్నీ కొంచెం అతిగా రెచ్చిపోయి... షణ్ముఖ్, సిరిల పరువు తీశాడనే చెప్పాలి. అయితే ఇది సన్నీ కేవలం నవ్వించడానికే చేశాడు తప్ప కావాలని చేసినట్లయితే కనిపించదు. టాస్క్ అయిపోయిన తరువాత.. సన్నీ దగ్గరకు వచ్చిన షణ్ముఖ్.. నువ్ చాలా వెకిలి చేష్టలు చేశావ్.. ఇమిటేట్ చేస్తే నాకు అస్సలు నచ్చదు.. ఇమిటేషన్ వేరు.. వెకిలివేరు.. నువ్ చేసినట్టుగా ఎదుటివాళ్లు నీ గురించి చేస్తే బాధ తెలుస్తుంది.. నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు అని చెప్పడంతో సన్నీ వివరణ ఇచ్చేకున్నాడు. నేను కామెడీగానే చేశాను.. క్యారెక్టర్లో ఉన్నాను.. కాజల్‌ని కూడా తిట్టాను కదా.. నెక్స్ట్ టైం అలా చేయను అంటూ వచ్చి షణ్ముఖ్‌ని హగ్ చేసుకున్నాడు సన్నీ. పక్కనే ఉన్న సిరి.. సర్లే అయిపోయిందిగా వదిలేయండి అని చెప్పడంతో షణ్ముఖ్ కూల్ అయిపోయాడు. కాజల్‌పై మానస్ ఫైర్ ఇక ఈ రెండో టాస్క్‌గా మానస్-ప్రియాంకల ప్రయాణాన్ని ఇమిటేట్ చేసి చూపించాలని చెప్పాడు బిగ్‌బాస్. దీంతో సన్నీ ప్రియాంకలా మారగ, కాజల్ మానస్‌లా మారిపోయింది. శ్రీరామ్‌లా సిరి, జెస్సీలా షణ్ముఖ్, సిరిలా శ్రీరామ్ మారిపోయారు. అయితే ఈ టాస్క్ కోసం సన్నీ రెడీ అవుతున్న క్రమంలో కాజల్, మానస్‌ల మధ్య గొడవ జరిగింది. పింకీకి 100 సార్లు ఐలవ్యూ చెబుతానని కాజల్ కామెడీగా అన్నప్పటికీ.. మానస్ సీరియస్‌గా తీసుకున్నాడు. గబ్బు చేస్తే బాగుండదని మానస్ ముందే హెచ్చరించగా.. ఎట్ల అనిపిస్తే అట్ల చేస్తామని సన్నీ తేలిగ్గా తీసిపాడేశాడు. ఎంటర్టైనింగ్ చేస్తున్నామని కాజల్ చెప్పబోగా.. ‘ఎంటర్టైనింగ్గా చేస్తే చేయ్.. కానీ 100సార్లు ఐ లవ్యూ అని ఎవడు చెప్పాడు?’అని కాజల్‌పై మానస్ సీరియస్ అయ్యాడు. దీంతో బాగా హర్ట్ అయిన కాజల్.. మానస్ క్యారెక్టర్ చేయనని చెప్పింది. సన్నీ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. కాజల్ వినలేదు. దీంతో సన్నీ మానస్‌ని పింకీ క్యారెక్టర్ చేయమని కోరగా.. దానికి మానస్ ఓకే చెప్పేశాడు. పింకీగా మానస్.. మళ్లీ సన్నీ అదరగొట్టేశాడుగా పింకీగా మానస్ , మానస్‌గా సన్నీ.. ఇద్దరు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా మానస్ అయితే.. అచ్చం ప్రియాంకలా ప్రవర్తిస్తూ ఆమెపై తనకు ఉన్న ప్రేమనంతా తీర్చుకున్నాడు. మానస్ పాత్రలో ఉన్న సన్నీతో మసాజ్ కూడా చేయించుకున్నాడు. మరోవైపు షణ్ముఖ్ జెస్సీలా మారి.. సిరిని ఓ రేంజ్లో ఆటపట్టించాడు. జెస్సీలా మాట్లాడుతూ.. సిరి ఓ ముద్దు అడిగాడు. దీంతో సిరిగా మారిన శ్రీరామ్ చేతులు అడ్డుపెట్టి షన్నూకు లిప్‌లాక్ ఇచ్చాడు. ఇక చివరగా.. మానస్ నుంచి పింకీ ఎలాంటి ప్రేమను ఆశించిందో అది చేసి చూపించాడు సన్నీ. పింకీ పాత్రలో ఉన్న మానస్ దగ్గరు వెళ్లి.. నా ప్రేమ, మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలానే కొనసాగుతుంది పింకీ అని భరోసా ఇచ్చాడు. ఇది చూసి కాజల్ కనీళ్లు పెట్టుకుంది. తమ తమ క్యారెక్టర్ల నుంచి బయటకు వచ్చి ముగ్గురు గట్టిగా హగ్ చేసుకున్నారు. మొత్తనానికి మంగళవారం ఎపిసోడ్లో సన్నీ తన ఆట తీరుతో అందరిని మెప్పించాడనే చెప్పాలి. -
ఫస్ట్ ప్లేస్‌లో నేను కాదు షణ్ను ఉండాలి: సిరి
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. వీరిలో శ్రీరామ్ టికెట్ టు ఫినాలే ట్రోఫీ అందుకుని ఇప్పటికే ఫినాలేలో అడుగుపెట్టాడు. కాబట్టి అతడు ఈ వారం నామినేషన్లో లేనట్లే! మిగతా ఐదుగురు ఇంటిసభ్యులైన సన్నీ, షణ్ముఖ్, కాజల్, సిరి, మానస్ టాప్ 5లో చోటు దక్కించుకునేందుకు పోరాడుతున్నారు. పద్నాలుగో వారం వీరంతా నామినేషన్లో ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. హౌస్మేట్స్ అందరూ ఏకాభిప్రాయంతో మొదటి నుంచి ఆరు స్థానాల వరకు ర్యాంకులిచ్చుకోవాలని ఆదేశించాడు బిగ్‌బాస్. మొదట్లో ఫస్ట్ ప్లేస్ తనకే కావాలన్న సిరి తర్వాత మాత్రం షణ్నును మొదటి స్థానంలో చూడాలనుకుంటున్నానంది. అదేంటి? నిన్ను నువ్వు ఫస్ట్ ర్యాంక్‌లో చూసుకోవా? అని శ్రీరామ్ ప్రశ్నించగా లేదని అడ్డంగా తలూపింది. సిరి కంటే కొంచెం తక్కువగా ఆడతావంటూ షణ్ను ఆరో ర్యాంక్ దగ్గర నిలబడటమే కరెక్ట్ అంది కాజల్. గేమ్ ఇలా ఆడటం తప్పంటే ఆరో స్థానంలో నిల్చుంటానంటూ టాప్ 6 బోర్డు దగ్గర నిలబడ్డాడు షణ్ను. మరి బిగ్‌బాస్ చెప్పినట్లు అందరూ ఒక ఏకాభిప్రాయానికి వస్తారా? లేదా? అన్నది చూడాలి! -
సన్నీ నెంబర్ 1, షణ్ముఖ్ ర్యాంక్ ఎంతంటే?
Bigg Boss 5 Telugu Promo: అసలు ఆట ఇప్పుడే మొదలవుతుందంటూ బిగ్‌బాస్ ఓ ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చాడు. ఒకటి నుంచి ఆరు వరకు ఎవరెవరు ఏయే ర్యాంకుల్లో ఉండాలో నిర్ణయించుకుని వాటి వెనకాల నిల్చుండాలని ఆదేశించాడు. దీంతో షణ్ముఖ్, సన్నీ, కాజల్, సిరి ఫస్ట్ ర్యాంకు నాకు కావాలంటే నాకు కావాలని పోటీపడ్డారు. మరీ ముఖ్యంగా కాజల్ మాత్రం మొదటి స్థానంలో నిల్చుండాలని తహతహలాడింది. అయితే సన్నీ అందుకు ఒప్పుకోలేదు. అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదంటూ డైలాగులు వల్లించాడు. అయితే మొత్తానికి సన్నీ ఫస్ట్ ప్లేస్‌లో నిల్చున్నట్లు సమాచారం. రెండో స్థానంలో షణ్ముఖ్, మూడో స్థానంలో కాజల్, నాలుగో ప్లేస్‌లో శ్రీరామ్, ఐదో స్థానంలో మానస్, ఆరో ర్యాంక్ వద్ద సిరి నిలబడ్డారట! అంటే హౌస్మేట్స్ అభిప్రాయం మేరకు సిరి వచ్చే వారం వెళ్లిపోతే మిగతా ఐదుగురు ఫినాలేలో అడుగుపెడతారన్నమాట! ఇంటిసభ్యులు సన్నీని విన్నర్‌గా, షణ్ముఖ్‌ను రన్నర్‌గా తేల్చారు. కానీ వీళ్లమధ్య గట్టి పోటీ నడుస్తుండటంతో ఈ ఇద్దరిలో ఎవరు విజేత అని ఇప్పుడే చెప్పడం కష్టంగా మారింది. -
నీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎప్పటికీ కావాలి మానస్!
Bigg Boss Telugu 5, Priyanka Singh Eliminated From BB5 Show: టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చీరావడంతోనే హౌస్‌మేట్స్‌తో ఓ వెరైటీ గేమ్ ఆడించాడు. బాగా ఫేమస్ అయిన పాత్రలు స్క్రీన్‌పై చూపించి అది ఎవరికి సెట్టవుతుందో చెప్పాలన్నాడు. దీంతో సన్నీ.. మహానటి పాత్ర ప్రియాంకకు పర్ఫెక్ట్గా సూటవుతుందన్నాడు. ఇంకొకరిని కంట్రోల్లో పెట్టే డా.వశీకరణ్ మరెవరో కాదు షణ్నునే అని చెప్పుకొచ్చింది సిరి. అందరినీ డామినేట్ చేసే పెదరాయుడు కూడా షణ్నునే అని ఫీలయ్యారు. నాకు దక్కకపోతే ఇంకెవ్వరికీ దక్కకూడదు అనుకునే నీలాంబరి మాత్రమే కాక వెన్నుపోటు పొడిచే కట్టప్ప, ఫిదాలోని భానుమతి.. ఇవన్నీ పాత్రలూ సిరికే నప్పుతాయని చెప్పుకొచ్చారు. సన్నీకి అర్జున్‌రెడ్డి, చిట్టిబాబు, ఎవరి మాటా వినని సీతయ్య ట్యాగ్‌లిచ్చారు. శ్రీరామ్ రేలంగి మావయ్య మాత్రమే కాదని దురదృష్టవంతుడైన మర్యాద రామన్న అని తెలిపారు. శ్రీరామ్‌కు ఎవరు క్లోజ్ అయినా బయటకు వెళ్లిపోతారు అని నాగ్ అనడంతో అందరూ నిజమేనంటూ నవ్వేశారు. తర్వాత మానస్, కాజల్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. అనంతరం నాగ్ ఇంటిసభ్యులతో లూడో గేమ్ ఆడించాడు. ఈ క్రమంలో మానస్ పిల్లోతో రొమాన్స్ చేయాలని నాగ్ ఆదేశించాడు. కానీ ఆచరణలో మానస్ విఫలమయ్యాడు. దిండుతో ఎలా రొమాన్స్ చేయడమని అతడు ఎదురు ప్రశ్నించగా పోనీ ప్రియాంకతో రొమాన్స్ చేస్తావా? అని సూటిగా అడిగేశాడు నాగ్. దీంతో షాకైన మానస్ వద్దు, దిండే నయమని ఫీలైనప్పటికీ అందరూ పట్టుబట్టి మరీ పింకీతో రొమాన్స్ చేయించారు. టాప్ 7లో ఎవరుంటారని ఊహించలేదని షణ్నుని అడగ్గా అతడు కాజల్ పేరు చెప్పాడు. ఈ కాజల్ హౌస్‌లో సింపతీ కోసం ప్రయత్నిస్తుందన్నాడు మానస్. హౌస్‌లో కామన్‌సెన్స్‌లేని వ్యక్తులు ఇద్దరున్నారని వారెవరో కాదు.. సిరి, పింకీ అని చెప్పుకొచ్చాడు షణ్ను. లూడో గేమ్‌లో సన్నీ, కాజల్ గెలిచారు. తర్వాత ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించగానే ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. నాతో కొంత ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిందని మానస్‌తో చెప్పుకుంటూ బాధపడింది. స్టేజీపైకి వచ్చాక తన జర్నీ చూసుకుని ఏకధాటిగా ఏడ్చింది పింకీ. ఆమెతో చివరిసారిగా గేమ్ ఆడించాడు నాగ్. ఇప్పుడున్న టాప్ 6 కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు ఎలాంటి అభిప్రాయం ఉండేది? ఇప్పుడు వారిపై ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పాలన్నాడు. మొదటగా సిరి గురించి చెప్తూ.. ఇదేంటి నాకంటే అందంగా ఉందని అసూయపడ్డాను. కానీ అదెప్పుడూ నా చెల్లెలిగా అనిపిస్తుంది. తను ఈ హౌస్‌కు చాలా అవసరమని నొక్కి చెప్పింది. శ్రీరామ్‌తో ఫస్ట్ నుంచి ఇప్పటివరకు తన కనెక్షన్ ఒకేలా ఉందని తెలిపింది. శ్రీరామచంద్రను శ్రీకృష్ణుడు చేద్దామనుకున్నా కానీ అతడు రాముడిలాగే ఉండిపోయాడంది. షణ్ను పక్కింటబ్బాయిలా అనిపిస్తాడని, అతడిని తమ్ముడు అని పిలుద్దామనుకున్నాను. కానీ ముదిరిపోయిన బెండకాయ అని తెలిసి ఊరుకున్నానని చెప్పింది. హౌస్‌లో మొదటి రోజు సన్నీ అన్నయ్య నన్ను చూడగానే స్వప్నలోక సుందరి దొరికిందన్నాడు. కానీ నేను అన్నయ్య అని గాలి తీసేశానని నవ్వేసింది. కాజల్ చాలా అల్లరి చేస్తుందని చెప్పింది. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు మానస్‌ను చూసి హాయ్ చెప్తే అతడు స్పందించలేదు.. ఇతడికి ఎంత పొగరు? అసలు మాట్లాడొద్దనుకున్నాను. కానీ రానురానూ మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండ్ కుదిరింది. నీ నుంచి చాలా నేర్చుకున్నాను. నీతో ఫ్రెండ్షిప్ ఎప్పటికీ కావాలి. నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? అని పదేపదే అడుగుతుంటావు కదా, నేను నీ విజయాన్ని కోరుకుంటున్నాను అని చెప్తూ ఏడ్చేసింది పింకీ. ఆమె వెళ్లిపోతున్న బాధను బయటకు కనిపించనీయకుండా జాగ్రత్తపడ్డ మానస్.. 'ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో..' అంటూ పాటందుకుని తన భావాలను అభివ్యక్తీకరించాడు. ఐ లవ్యూ నా ప్రాణం పోయినా.. ఐ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా అంటూ పాట రూపంలో ఆమె మీదున్న ప్రేమను ప్రకటించాడు. అంతేకాక ఈ పాటను పింకీకి అంకితమిస్తున్నాననడంతో ఆమె ఆనందభాష్పాలు రాల్చింది. అలాగే సింగర్ శ్రీరామ్... ప్రియా ప్రియా.. చంపొద్దే అంటూ పింకీ కోసం సాంగ్ పాడాడు. అనంతరం ప్రియాంక భారమైన హృదయంతో అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది. -
పింకీ కోసం ఆ ఇద్దరి త్యాగం, అయినా ఫలితం శూన్యం!
Bigg Boss Telugu 5, Episode 91: బిగ్‌బాస్ హౌస్‌లో ర్యాంప్ వాక్ జరగ్గా దీనికి శ్రీరామ్, సిరి జడ్జిలుగా వ్యవహరించారు. వీరు కాజల్, షణ్నును విజేతలుగా ప్రకటించారు. తర్వాత నాగార్జున ఇంటిసభ్యులను పలకరిస్తూనే హౌస్‌లో ఎవరిమీదైనా ఫిర్యాదులుంటే చెప్పాలని ఆదేశించాడు. సన్నీ సిరి మీద కంప్లైంట్ ఇవ్వగా సిరి, మానస్ షణ్ను మీద పింకీ.. సన్నీ మీద ఫిర్యాదు చేశారు. కాజల్.. సన్నీ తన మనసు ముక్కలు చేశాడని ఆరోపించింది. రెండు రోజులుగా తాను చాలా బాధపడుతున్నానని తెలపడంతో సన్నీ అందరి ముందే ఆమెకు సారీ చెప్పాడు. నాగార్జున.. తనకు కూడా హౌస్‌మేట్స్‌పై ఫిర్యాదులు ఉన్నాయంటూ ముందుగా ప్రియాంకను నిల్చోబెట్టాడు. సొంత వైద్యం వద్దని బిగ్‌బాస్ మరీమరీ చెప్పినప్పటికీ కాళ్లకు బామ్ రాసి వేడినీళ్లు పోసి శ్రీరామ్‌ను నడవలేని దుస్థితికి తీసుకొచ్చావని నిందించాడు. నువ్వు డాక్టర్వి కాదని కాబట్టి ఇలా సొంత వైద్యం చేయొద్దని హెచ్చరించగా పింకీ కంట నీరు పెట్టుకుంది. శ్రీరామ్ మీద కూడా ఫిర్యాదు ఉందన్నాడు నాగ్. నీ తరపున షణ్ను గేమ్ ఆడుతున్నప్పుడు అతడి మీద నమ్మకముంచాలని శ్రీరామ్‌కు సూచించాడు. అలాగే మానస్ మీద కూడా ఓ ఫిర్యాదు ఉందన్న నాగ్.. ఒక గేమ్‌లో నీకు నువ్వు 29 నిమిషాలు సరిగ్గా కౌంట్ చేసుకున్నప్పుడు సన్నీకి మాత్రం తప్పుగా ఎలా లెక్కించావని ప్రశ్నించాడు. అయితే మానస్ మాత్రం తాను అది కావాలని చేయలేదని బదులిచ్చాడు. టికెట్ టు ఫినాలే టాస్క్‌లోని ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో సన్నీ, సిరి ఇద్దరూ తొండి ఆట ఆడారని నాగ్ వీడియోలతో సహా నిరూపించడంతో అందరూ పగలబడి నవ్వేశారు. ఫోకస్ టాస్క్‌లో గట్టిగట్టిగా అరుస్తూ అందరినీ డిస్టర్బ్ చేయడం తప్పని కాజల్‌కు చురకలంటించాడు. తర్వాత శ్రీరామ్‌కు సన్నీ, షణ్ను చేతుల మీదుగా ఫస్ట్ ఫైనలిస్టు ట్రోఫీని అందజేశారు. అనంతరం హౌస్‌మేట్స్‌తో ఎమోజీ గేమ్ ఆడించాడు నాగ్. ఈ గేమ్‌లో పంచ్, షటప్, కోపం ఎమోజీలతో ఉండే మూడు దిండ్లను ఒక్కొక్కరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో శ్రీరామ్.. సన్నీకి పంచ్ ఇవ్వగా కాజల్‌కు నోరు మూయమనే ఎమోజీ ఇచ్చాడు. ప్రియాంక వల్ల నడవలేకపోతున్నానని ఆమె మీద చిరు కోపాన్ని ప్రదర్శించాడు. సన్నీ.. కాజల్‌ను నోరు మూయమన్నాడు. సిరి మీద కోపంగా ఉందన్నాడు. షణ్నుకు పంచ్ ఇస్తూ అతడు నవ్వితే బాగుంటుందన్నాడు. షణ్ను.. కాజల్ మీద కోపంగా ఉందన్నాడు. సిరి తల మీద ఒక్క పంచ్ ఇస్తే ఆమె బ్రెయిన్ సరిగా పని చేస్తుందన్నాడు. ఉచిత సలహాలు ఇవ్వకుండా నోరు మూసుకోమని ప్రియాంకకు సూచించాడు. తర్వాత ప్రియాంక వంతు రాగా ఆమె సిరికి పంచ్ ఇచ్చింది. సన్నీ మీద కోపంగా ఉందని పేర్కొంది. కోపంలో నన్ను ఏదైనా అనేస్తాడంటూ మానస్‌ను కాస్త నోరు మూసుకోమని చెప్పింది. మానస్.. సిరి మీద కోపంగా ఉందంటూ సన్నీకి పంచ్ ఇచ్చాడు. కోపంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కొంచెం తగ్గించుకుంటే మంచిదని పింకీకి సలహా ఇచ్చాడు. కాజల్.. శ్రీరామ్‌కు పంచ్ ఇవ్వగా షణ్ను మీద కోపంగా ఉందని తెలిపింది. నేను చెప్తున్నప్పుడు మాట్లాడకుండా నోరు మూసుకుని వినాలని సన్నీకి సెలవిచ్చింది. సిరి.. ఇంకోసారి నిన్నే టార్గెట్ చేశానంటే కొడతానని, ఆ మాట మాట్లాడద్దంటూ సన్నీని నోరు మూసుకోమని వార్నింగ్ ఇచ్చింది. షణ్నుకు పంచ్ ఇచ్చింది. ప్రియాంక సింగ్ మీద కోపంగా ఉందని పేర్కొంది. అనంతరం నాగార్జున గతంలో ఫ్యామిలీ మెంబర్స్ కోసం హౌస్మేట్స్ త్యాగాలు చేసిన సామానంతా తిరిగిచ్చేయడంతో వాళ్లు తెగ సంతోషించారు. కానీ సిరి, ప్రియాంక త్యాగం చేసిన వస్తువులు మాత్రం తిరిగి రాలేదు. వీళ్లిద్దరి వస్తువులు కూడా తిరిగి రావాలంటే మిగతా హౌస్మేట్స్ త్యాగం చేయాలని మెలిక పెట్టాడు నాగ్. హౌస్‌లో ఎవరు ఉండటానికి అర్హత ఉందనుకుంటున్నారో వారికే త్యాగం చేయాలన్నాడు. అందులో భాగంగా తులాభారంలో సిరి, ప్రియాంకలలో ఎవరి వైపు ఎక్కువ బరువు తూగితే వారు త్యాగం చేసిన వస్తువు తిరిగొస్తుందన్నాడు. దీంతో సన్నీ, మానస్ పింకీకి సపోర్ట్ చేయగా మిగతావాళ్లు సిరికి సపోర్ట్ చేశారు. తులాభారంలో సిరి వైపు ఎక్కువ బరువు తూగడంతో శ్రీహాన్ ఆమెకిచ్చిన గిఫ్ట్ తిరిగి వచ్చింది. ఈరోజు శ్రీరామ్ మినహా మానస్, సిరి, కాజల్, ప్రియాంకలలో ఎవరినీ సేవ్ చేయలేదు నాగ్. -
ఆ కంటెస్టెంట్ జోలికొస్తే బాగోదు: లోబో వార్నింగ్
Bigg Boss Telugu 5, Lobo Supports Shannu: లోబో.. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఎంటర్టైనర్ ఆఫ్ హౌస్ బిరుదు అందుకున్నాడీ హైదరాబాదీ. అయితే ఎంటర్టైన్మెంట్ ఒకటే సరిపోదని గేమ్ ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు ప్రేక్షకులు. అయితే బిగ్‌బాస్ మాత్రం లోబోకు ఒక ఛాన్సిద్దామని సీక్రెట్ రూమ్‌కు పంపించారు. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా గేమ్‌లో పెద్దగా ఛేంజ్ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. ఎనిమిదవ వారం అతడిని ఎలిమినేట్ చేశారు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు రవి కోసం గేమ్ ఆడాడని, అతడికి కుడిభుజంలా వ్యవహరించాడని లోబో గురించి అంతా అనుకున్నారు. బయటకు వచ్చాక కూడా తన స్నేహితుడు రవికి ఓట్లేయండంటూ అతడికి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. కానీ అనూహ్యంగా రవి కూడా షోలో నుంచి నిష్క్రమించడంతో ఇప్పుడు లోబో మరో కంటెస్టెంట్‌కు మద్దతు ప్రకటించాడు. యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్‌కు ఓటేయమని అభ్యర్థిస్తున్నాడు. అతడు ఈ వారం ఓటింగ్‌లో లేకపోయినా ఓట్లేయండంటూ వీడియో రిలీజ్ చేశాడు. View this post on Instagram A post shared by Lobo (@lobo__619) హౌస్‌లో ఉన్న అందరూ తనకు ఫ్రెండ్సే అని, కానీ షణ్ను అంటే కాస్త ఎక్కువ లవ్ అని చెప్పుకొచ్చాడు. ఎవరు ఎంత బాగా ఆడుతున్నారు? ఎవరు బాగా ఆడట్లేదు? అనేది పక్కనపెడితే షణ్ను తన ఫ్రెండ్ అని, అతడి జోలికొస్తే బాగోదని హెచ్చరించాడు. షణ్నును తోపుగా అభివర్ణించిన లోబో అతడికి సపోర్ట్ చేసి సూపర్ స్టార్‌ను చేద్దామని పిలుపునిచ్చాడు. -
బిగ్‌బాస్: టాప్ 5 కంటెస్టెంట్లు వీళ్లే!
Bigg Boss 5 Telugu, Top 5 Finalists: టికెట్ టు ఫినాలే టాస్క్ ఏమోకానీ సిరి, శ్రీరామ్ ఇప్పటికీ తమంతట తాము నడవలేక నానా అవస్థ పడుతున్నారు. ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప సరిగ్గా నిలబడలేకపోతున్నారు. రెండుమూడురోజులుగా కాళ్లకు కట్లు కట్టుకుని కుర్చీల్లోనే కూర్చుండిపోయారు. అలా అని టికెట్ టు ఫినాలేను గాలికి వదిలేయలేదు. కూర్చుని ఆడే గేమ్స్ స్వయంగా వాళ్లే ఆడారు కానీ ఫిజికల్ టాస్కుల్లో మాత్రం ఇతరుల సాయం తీసుకున్నారు. అలా సిరి రెండుసార్లు షణ్ను హెల్ప్ తీసుకోగా శ్రీరామ్.. షణ్ను, సన్నీ ఇద్దరి సాయం తీసుకున్నాడు. వాళ్లిద్దరి సాయంతో చివరి రౌండ్‌కు చేరుకున్న శ్రీరామ్ ఫైనల్లో మాత్రం అతడే ఆడి టికెట్ టు ఫినాలే గెలిచాడు. అలా ఈ సీజన్లో టాప్ 5లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే శ్రీరామ్‌తో పాటు ఎవరెవరు ఫినాలేలో అడుగు పెడతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్ టాప్ 3లో ఉంటారని నెటిజన్లు బలంగా అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ శ్రీరామ్‌ను వెనక్కి నెట్టి మానస్ టాప్ 3లో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. లేదంటే అతడు నాలుగో స్థానానికి పరిమితమయ్యేట్లు కనిపిస్తోంది. చివరి స్థానంలో లేడీ కంటెస్టెంట్ నిలిచేందుకు ఆస్కారం ఉంది. అయితే ఆ స్థానాన్ని సిరి, కాజల్‌లో ఎవరు దక్కించుకుంటారనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఊహించని ఎలిమినేషన్లతో ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేస్తున్నాడు బిగ్‌బాస్. ఈ రెండు వారాలు ఎలిమినేషన్‌ను తప్పించుకునే కంటెస్టెంట్ ఫినాలేకు వెళ్తుంది. ఒకవేళ సిరి ఎలిమినేట్ అయితే మాత్రం ఫినాలేలో అడుగుపెట్టాలన్న కాజల్ కోరిక నెరవేరుతుంది. మరోపక్క ఈ వారం పింకీ వెళ్లిపోతుందని అనఫీషియల్ ఓటింగ్స్ చెప్తున్నాయి. ఒకవేళ అది నిజం కాకపోతే కాజల్ బయటకు వచ్చేస్తుందంటున్నారు. ఈ వారం జరగనున్న ఎలిమినేషన్‌తో టాప్ 5లో ఎవరుంటారనేదానిపై ఓ స్పష్టత రానుంది. -
సిరి కోసం ఆడుతున్న షణ్ను, ఆమెను గెలిపిస్తాడా?
Bigg Boss Telugu 5 Promo, Ticket To Finale: బిగ్‌బాస్ షో 13వ వారం ముగింపుకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఒకరు నేరుగా ఫినాలేకు చేరుకునేందుకు బిగ్‌బాస్ 'టికెట్ టు పినాలే' ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సన్నీ, మానస్, శ్రీరామ్, సిరి ఈ గేమ్‌లో కొనసాగుతుండగా కాజల్, ప్రియాంక, షణ్ముఖ్ రేసు నుంచి తప్పుకున్నారు. ఏ ఛాలెంజ్ ఎంచుకుంటారు? అన్న ప్రశ్నకు సిరి.. మెమొరీ తప్ప ఏదైనా సరే అని బదులిచ్చింది. మెమొరీ ఎందుకు వద్దంటున్నావని మానస్ ప్రశ్నించగా.. అది నీకుంది, కానీ మాకు లేదు అని ఆన్సరివ్వడంతో అక్కడున్నవారంతా ఘొల్లున నవ్వారు. కాజల్‌తో తిరిగి సైకోలా మారావంటూ మానస్‌తో జోక్ చేశాడు సన్నీ. చివరగా ఫోకస్ అనే ఛాలెంజ్ ఎంపిక చేసుకోగా ఇందులో శబ్ధాల సౌండు వినిపిస్తే దాన్ని వరుసగా బోర్డు మీద రాయాలి. అయితే అందరూ సరిగ్గా రాస్తే సిరి మాత్రం హెలికాప్టర్ సౌండ్‌ను ట్రాక్టర్ అని రాయడం విశేషం. తర్వాత అక్యురసీ ఛాలెంజ్‌లో అన్ని బల్బ్స్ వెలిగేలా స్విచ్ ఆన్ చేయాలి. ఈ గేమ్‌లో షణ్ను సిరి తరపున గేమ్ ఆడినట్లు కనిపిస్తోంది. ఐస్ క్యూబ్స్ టాస్క్ ఎఫెక్ట్ వల్ల ఇప్పటికీ సిరి నడవలేకపోతోంది. దీంతో నిన్నటి గేమ్‌లో సిరి తరపున ఆడి ఆమెను గెలిపించిన షణ్ను తన గేమ్‌లో మాత్రం ఓడిపోయాడు. మరి నేడు కూడా ఆమె కోసం ఆడుతున్న షణ్ను సిరిని గెలిపిస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
షణ్నూకి జలక్ ఇచ్చిన దీప్తి సునయన.. వేరే కంటెస్టెంట్‌కి సపోర్ట్
Not Shannu Deepthi Sunanina Asks Fans To Vote Bigg Boss 5 Contestant: యూట్యూబర్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనాల ప్రేమ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని బహిరంగానే ప్రకటించారు. ఒకరిపేరు ఒకరు టాటూగా కూడా వేయించుకున్నారు. ప్రస్తుతం షణ్ముఖ్ బిగ్‌బాస్ -5 హౌస్‌లో ఉండగా, దీప్తి సునయన బయట ఫుల్ ప్రమోషన్స్ చేస్తూ అతడ్ని గెలిపించేందుకు తెగ కష్టపడుతుంది. లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్‌లోనూ షణ్నూకి సపోర్ట్ చేయడానికి దీప్తి బిగ్‌బాస్‌కి వచ్చిన సంగతి తెలిసిందే. షణ్నూకి ఓట్లు వేసి గెలిపించాలంటూ సోషల్ మీడియాలో తన ఫాలోవర్లను రిక్వెస్ట్ చేస్తుంది. అయితే తాజాగా షణ్నూకి కాకుండా మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కి దీప్తి తన మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా అతడకి తాను వేసిన ఓట్స్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం దీప్తి షేర్చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఎవరా అనే కదా మీ డౌటు. దీప్తి సపోర్ట్ చేస్తున్న కంటెస్టెంట్ తమిళ బిగ్‌బాస్‌కి చెందిన వ్యక్తి. ప్రస్తుతం తమిళంలో కూడా బిగ్‌బాస్ సీజన్-5 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుణ్ అనే కంటెస్టెంట్‌కి దీప్తి తన మద్ధతు ప్రకటించింది. అతడికి ఓట్లు వేయాలంటూ తన ఫాలోవర్లను సైతం కోరింది. -
'చూసుకుంటున్నాడు, హగ్గివ్వకపోతే ఎలా?' తల్లిని తలుచుకున్న సిరి
Bigg Boss Telugu 5, Episode 89: టికెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా.. 29 నిమిషాలు లెక్కపెట్టాల్సిన ఛాలెంజ్‌లో మానస్ మొదటి స్థానంలో నిలిచాడు. షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, ప్రియాంక, కాజల్, సన్నీ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మానస్ సాయం చేసినా సన్నీ ఓడిపోవడంతో హౌస్మేట్స్ అతడిపై కౌంటర్లు వేశారు. మరోపక్క సిరి హగ్గివ్వంటూ షణ్నును అడిగింది. దీంతో అతడు కాస్త తటపటాయిస్తూనే ఫ్రెండ్షిప్హగ్ అని కెమెరాల వంక చూడగా.. నన్ను బాగా చూసుకుంటున్నాడు, మరి హగ్గివ్వకపోతే ఎలా అంటూ అతడిని హత్తుకుంది సిరి. వారి ఫ్రెండ్షిప్ గురించో మరేంటో కానీ.. మా అమ్మకు ఇప్పుడు అర్థమవుతుందని తనలో తానే అనుకుంది సిరి. అయితే వీళ్ల హగ్గులు చూసిన పింకీ.. తనకు కూడా ఓ హగ్గివ్వమని కోరింది కానీ అతడు మాత్రం పట్టించుకోలేదు. అనంతరం షణ్ను, కాజల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. నిజంగా నేను తప్పైతే నీకంటే ముందే వెళ్లిపోతా! అని కాజల్‌తో శపథం చేశాడు షణ్ను. నువ్వెప్పుడూ నేను తప్పు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తావని ఫైర్ అయింది కాజల్. ఈ క్రమంలో షణ్ను నీ బొంద, కామన్సెన్స్ అంటూ కొన్ని అనవసర మాటలు జారాడు. తర్వాతరం హౌస్మేట్స్ స్కిల్ ఛాలెంజ్ స్వీకరించారు. ఇందులో భాగంగా ఏటవాలుగా ఉన్న స్టాండ్‌లో నీళ్లు పోసి అందులోని జార్స్‌లో ఉన్న బాల్స్ కింద పడేలా చేయాలి. ఎవరైతే అన్ని బాల్స్ ముందుగా కిందపడేలా చేస్తారో వారు మొదటి స్థానంలో నిలుస్తారు. ఐస్ టాస్క్ వల్ల ఇప్పటికీ నిలబడి నడవలేకపోతున్న శ్రీరామ్, సిరిల స్థానంలో సన్నీ, షణ్ను ఆడారు. ఇక ఈ గేమ్‌లో మానస్, శ్రీరామ్, సిరి, ప్రియాంక, కాజల్, సన్నీ, షణ్ముఖ్ వరుసగా ఏడు స్థానాల్లో నిలిచారు. మొత్తంగా టికెట్ టు ఫినాలే టాస్క్‌లో మూడు ఛాలెంజ్‌లు పూర్తయ్యే సరికి తక్కువ పాయింట్లు ఉన్న కాజల్, ప్రియాంక రేసు నుంచి తప్పుకున్నట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు. సన్నీ, షణ్ముఖ్లిద్దరికీ సమాన పాయింట్లు రావడంతో వీరికి మళ్లీ గేమ్ పెట్టగా ఇందులో సన్నీ గెలిచి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాడు. షణ్ను రేసు నుంచి వైదొలిగాడు. రేపటి ఎపిసోడ్లో మానస్, సన్నీ, షణ్ను, సిరిలకు చివరి పోటీ పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఈ గేమ్‌లో ఎవరు గెలిచి ఫినాలేలో మొదటగా అడుగు పెడతారో రేపటి ఎపిసోడ్లో చూడాలి! -
'షణ్నుది చిత్తుకాగితాలు ఏరుకునే ముఖం' బుద్ధి లేదంటూ అఖిల్ ఫైర్
Bigg Boss Telugu 5: Akhil Sarthak Support to Against Trolls for Shanmukh: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ 13 వారంలోకి అడుగు పెట్టింది. యాంకర్ రవి ఎలిమినేషన్‌తో టాప్ 5లో ఎవరుంటారో ఊహించడం కష్టంగా మారింది. ఎందుకంటే అది బిగ్‌బాస్ హౌస్.. అక్కడేమైనా జరగొచ్చు. ఇదిలా ఉంటే కంటెస్టెంట్ల పోట్లాటల కన్నా వాళ్ల అభిమానుల కొట్లాటలే ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో కొందరు తమకు నచ్చని కంటెస్టెంట్లను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. తాజాగా ఓ యూట్యూబర్ షణ్ముఖ్‌పై దారుణ వ్యాఖ్యలు చేశాడు. 'షణ్నును ఎక్కడో చూసినట్లుంది... పొద్దున్నే పాల ప్యాకెట్లు ఎత్తుకుపోయేది, కాగితాలు ఏరుకునేది మీరే కదా గుర్తుపట్టాను, మీ ముఖం అయితే 5 పైసలు ఉంటది. కాగితాలు ఏరుకునేటోడు ఓ రాయి పట్టుకుని కుక్కల వెనకాల తిరుగుతుంటడు చూడు.. వాడు సేమ్ నీలాగే ఉంటడు షణ్ను..' అంటూ విపరీత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై గత సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ ఘాటుగా స్పందించాడు. 'ఇంతకు ముందు మీ మీద గౌరవం ఉండేది, ఇప్పుడది పోయింది. మీరు చేస్తోంది చాలా పెద్ద తప్పు! ఒకరు మీకు నచ్చలేదంటే వాళ్లను మీరు బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం లేదు. మరీ అంతలా ద్వేషించకండి! ఇది ఒక గేమ్ షో మాత్రమే.. చూసి ఎంజాయ్ చేయండంతే! మరీ ఇంత నెగెటివిటీ వద్దు. నోటికొచ్చినట్లు మాట్లాడటం చాలా ఈజీ. నువ్వు ఆ గేమ్ షోలో ఉండి ఉంటే నిన్ను ఎవరైనా ఇలా ట్రోల్ చేస్తే నీకు తెలుస్తుంది ఆ బాధేంటో! వయసు పెరగడం కాదు, బుద్ధి కూడా పెరగాలి' అని చురకలంటించాడు. 'మీకు నచ్చిన కంటెస్టెంట్‌ను గెలిపించడం కోసం అవతలి వారిని కించపరచడం చాలా తప్పు. రోడ్ల మీద చిత్తుకాగితాలు ఏరుకునేవాళ్లలా ఉంది నీ ఫేసు.. అంటే వాళ్లు మనుషులు కాదా ఏంటి? మరీ ఇంతలా విమర్శించడం దేనికి బ్రదర్? నీ ఈగో సంతృప్తి చెందడానికా! రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు సచ్చిపోతమో తెలీదు, ఎందుకు బ్రో ఇంతగా నెగెటివిటీ.. ముఖం చూసి నువ్వు సపోర్ట్ చేస్తావేమో కానీ అందరూ అలా కాదు. వేధించడం మానేసి పాజిటివిటీని వ్యాప్తి చేయండి. గేమ్ షోను గేమ్ షోలా మాత్రమే చూడండి' అని చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై షణ్ను ప్రేయసి దీప్తి సునయన సైతం రియాక్ట్ అయింది. షణ్ను కోసం స్టాండ్ తీసుకున్నందుకు అఖిల్‌కు థ్యాంక్స్ తెలిపింది. -
షణ్నూని ఇష్టపడుతున్నట్లు సిరి నాతో చెప్పింది: యాంకర్ రవి
Bigg Boss Buzzz: Anchor Ravi Shocking Comments on Shannu and Siri Relationship: బిగ్‌బాస్ సీజన్-5లో యాంకర్ రవి ఎలిమినేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. టాప్ -5లో ఖశ్చితంగా ఉంటాడనుకున్న రవి అనూహ్య రీతిలో 12వ వారమే హౌస్ నుంచి బయటకు వచ్చాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి కూడా రవి ఎలిమినేట్ కావడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్నారు. రవికి మద్దతిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రవి.. తాను ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదని, ఇప్పటికీ ఇది షాకింగ్‌గానే ఉందని తెలిపాడు. బిగ్‌బాస్ హౌస్‌లో చాలామంది తనను ‘గుంటనక్క’ అని ఏడిపించినా తానేమీ బాధపడలేదని, దాని గురించి పట్టించుకోలేదని తెలిపాడు. ఇక నటరాజ్ మాస్టర్ అయితే హౌస్‌లోకి ఏదో ఇంటెన్షన్‌తోనే లోపలికి వచ్చాడని అభిప్రాయపడ్డారు. తనకు తెలిసి ఎవరినీ ఇన్ఫ్లూయెన్స్ చేయలేదు అని, ఒకవేళ తన మాటలకు వాళ్లు ఇన్ఫ్లూయెన్స్ అయ్యారేమో అంటూ కామెంట్ చేశాడు. ఇక షణ్నూ-సిరిల రిలేషన్ గురించి మాట్లాడుతూ... 'షణ్ముఖ్ దీప్తిని ఎంత లవ్ చేస్తాడో.. సిరి చోటూని ఎంత లవ్ చేస్తుందో ఈ ఇద్దరికీ తెలుసు.. కానీ హౌస్‌లో సిరి షణ్నూని ఇష్టపడుతుంది. ఈ విషయాన్ని స్వయంగా సిరినే చెప్పింది. అన్నా...ఐ లైక్ హిమ్ అని సిరి నాతో ఓపెన్అప్ అయ్యింది' అంటూ వివరించాడు. చదవండి: యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవేనా? -
రూ.50 లక్షలు గెలిస్తే అమ్మనవుతా: ట్రాన్స్‌జెండర్ ప్రియాంక
Bigg Boss Telugu 5, Ravi Eliminated From BB Show: ఇప్పటివరకు బిగ్‌బాస్ షో విజేతలకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈ సీజన్లో మాత్రం దీనికి అదనంగా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన భూమిని కూడా కానుకగా అందిస్తున్నారు. ఈ విషయాన్ని మన్మథుడు నాగార్జున అధికారికంగా ప్రకటించాడు. బిగ్‌బాస్ విన్నర్ రూ.50 లక్షలతో పాటు, షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించాడు. ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఆ డబ్బుతో ఎవరేం చేస్తారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు నాగ్. మొదటగా ప్రియాంక మాట్లాడుతూ.. 'నేను రూ.50 లక్షలు గెలుచుకుంటే తల్లిదండ్రుల కోసం ఇల్లు కొనిస్తా. అలాగే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరికగా ఉండేది. కానీ దత్తత తీసుకోవాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలన్నారు. కాబట్టి ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటా' అని చెప్పుకొచ్చింది. శ్రీరామ్ మాట్లాడుతూ.. 'తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవ్వడానికే షోకు వచ్చాను. పెద్ద ఇల్లు కట్టి పేరెంట్స్‌తో కలిసి ఉండాలన్నది నా కోరిక' అని చెప్పాడు. 'కొంత వియా చదువు కోసం పొదుపు చేస్తా. నిర్మాణసంస్థ నెలకొల్పాన్న కోరికను నెరవేర్చుకుంటా' అని చెప్పాడు రవి. కాజల్ తనకున్న 30 లక్షల రూపాయల అప్పు తీర్చుకుంటానంది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలనుకుంటున్నానని చెప్పింది. సువర్ణ కుటీర్‌లో ఇల్లు కట్టుకుంటానంది. సన్నీ వచ్చిందంతా అమ్మకిచ్చేస్తానని, కొంత డబ్బు తీసుకుని సెలూన్ పెడతానన్నాడు. మానస్ తనకు వచ్చిన డబ్బుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి కొత్తవాళ్లను ఎంకరేజ్ చేస్తానని చెప్పాడు. షణ్ముఖ్.. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్న అమ్మకు 25 లక్షలు ఇస్తానన్నాడు. తనకెన్నో సార్లు డబ్బు సాయం చేసి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన దీప్తి సునయనకు మరో 25 లక్షలిస్తానన్నాడు. సిరి శ్రీహాన్ పేరెంట్స్‌కు ఉన్న 10 లక్షల అప్పు తీర్చేసి కొంత అమ్మకిస్తానని, అలాగే అంధులకు సాయం చేస్తానని పేర్కొంది. తర్వాత షణ్ముఖ్, ప్రియాంక సేఫ్ అవగా రవి, కాజల్ మాత్రమే నామినేషన్స్‌లో మిగిలారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను నువ్వు వాడుకుంటావా? లేదా వీళ్లలో ఒకరిని సేవ్ చేస్తావా? అని నాగ్ సన్నీని అడిగాడు. ఆ పాస్ తనకు రావడం కోసం ఎంతగానో ఫైట్ చేసిన కాజల్‌కు వాడాడు. కానీ ఓటింగ్‌లో రవి చివరి స్థానంలో ఉండటంతో అతడు ఎలిమినేట్ అయ్యాడని నాగ్ ప్రకటించాడు. దీంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడి ఉపయోగం లేకపోయింది. రవి కోసం వాడి ఉంటే కనీసం అతడైనా సేవ్ అయ్యేవాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న రవి ఎలిమినేట్ అవడంతో ఏడుపాపుకోలేకపోయిన సన్నీ తన దగ్గరున్న గిఫ్ట్ వోచర్‌ను అతడికి బహుమతిగా ఇచ్చాడు. సన్నీ మాత్రమే కాదు, ఇంటిసభ్యులెవరూ రవి ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకపోయారు. అందరూ కన్నీటితో భారంగా ఆయనకు వీడ్కోలు పలికారు. స్టేజీ మీదకు వచ్చిన రవి చాలా తొందరగా బయటకు వచ్చేశానని బాధపడ్డాడు. అనంతరం ఈ బిగ్‌బాస్ జర్నీలో ఎవరు పాస్, ఎవరు ఫెయిల్? అనే గేమ్ ఆడాడు. షణ్ను పాస్ అయ్యాడని చెప్పడంతో అతడు లేచి ఏదైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు. లేట్‌గా కనెక్ట్ అయిన చందూలో అన్నీ పాజిటివ్సే ఉన్నాయన్నాడు రవి. నువ్వు లోపలి నుంచి ఆడు, నేను బయట నుంచి ఆడతానని చెప్తూ అతడిని పాస్ చేశాడు. ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడు, తోపు అంటూ సన్నీని పాస్ చేశాడు. ప్రియాంక, సిరి, కాజల్‌కు ఫెయిల్ ట్యాగ్ ఇచ్చాడు. టాప్ 5లోకి రావాలని సిరిని ఎంకరేజ్ చేశాడు. మానస్‌ను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యానంటూనే అతడికి ఫెయిల్ ట్యాగ్ ఇచ్చాడు. షణ్ను ఎంతకూ కన్నీళ్లను ఆపుకోలేకపోవడంతో రవి.. నేనెళ్తేనే నువ్వు గెలుస్తావంటూ ఆఖరి మాటగా చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. -
బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్ ప్రైజ్‌మనీలో 'బిగ్' సర్ప్రైజ్
Bigg Boss 5 Telugu: BB5 Title Winner Prize Money Details: బిగ్‌బాస్ సీజన్-5 మరో మూడు వారాల్లో ముగియనుంది. ప్రస్తుతం టైటిల్ పోరులో మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే సన్నీ-షణ్నూకే అవకాశాలు ఎక్కువ. టైటిల్ రేస్ కూడా వీరిద్దరి మధ్యే జరుగుతుందన్నది పలువురి అభిప్రాయం. ఇక ట్రోఫీని ముద్దాడే విజేత ఎవరనే దాన్ని పక్కన పెడితే, బిగ్‌బాస్ విన్నర్‌కి ఇచ్చే ప్రైజ్‌మనీకి సంబంధించి ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. గత సీజన్లతో పోలిస్తే బిగ్‌బాస్ సీజన్-5 విజేతకు డబుల్ బొనాంజ దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. బిగ్‌బాస్ విన్నర్‌కి గాను ఈసారి 50లక్షల రూపాయల ప్రైజ్‌మనీతో పాటు 25 లక్షల విలువైన ఫ్లాట్ కూడా దక్కుతుందని సమాచారం. ఇప్పటివరకు బిగ్‌బాస్ తెలుగు సీజన్లలో 50 లక్షల ప్రైజ్‌మనీ అన్నది అత్యధికం. కానీ ఈసారి తొలిసారిగా ఆ రికార్డును బ్రేక్‌చేస్తూ 50 లక్షల ప్రైజ్‌మనీకి అదనంగా పాతిక లక్షల విలువైన ఫ్లాట్ కూడా అందించనున్నట్లు సమాచారం. మరికొందరేమో ప్రైజ్‌మనీలో సగాన్ని తగ్గించి ఫ్లాట్ ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్‌గా ఎవరు నిలవనున్నారన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
బిగ్‌బాస్: జీవితంలో అలాంటి పని చేయను.. వైరల్ వీడియోపై దీప్తి కామెంట్
బిగ్‌బాస్ హౌస్‌లో శనివారం దీప్తి సునైనా సందడి చేసిన విషయం తెలిసిందే. ప్రియుడి షణ్ముఖ్ కోసం బిగ్‌బాస్ షోకి వచ్చిన దీప్తి.. తనదైన మాటలతో షన్నూతో పాటు అందరికి బూస్ట్ ఇచ్చింది. అలాగే ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్ అయిపోవద్దని ప్రియుడికి సలహా ఇచ్చింది. అంతటితో ఆగకుండా మూడు వారాల వరకు ఇక్కడే ఉండూ అంటూ ముద్దుల వర్షం కురిపించింది. (చదవండి: బిగ్‌బాస్: షణ్ముఖ్‌కి దీప్తి సూపర్ హింట్..తన పొజిషన్ ఏంటో చెప్పిందా?) అయితే ఇదే సమయంలో షణ్ముఖ్‌కు దీప్తి ఓ హింట్ ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె స్టేజ్ మీదకు వచ్చిరావడంతోనే రెండు వేళ్లతో మైక్‌ని పట్టుకుంది. అంటే షణ్ముఖ్ రెండో స్థానంలో ఉన్నాడని పరోక్షంగా చెప్పిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. షణ్ముక్ కూడా దీప్తి వేళ్ల వైపు చూసి చూడనట్లుగా చూశాడని, ఆమె పక్కా ప్లాన్ ప్రకారమే హింట్ ఇచ్చిందని దానికి సంబంధించిన వీడియోని వైరల్ చేస్తున్నారు. #SoulOfBB5VJSunny GUYS LEAK EECHIDHI DEEPTHI SUNAINA pic.twitter.com/KBCsfhqe1G — Ryukendo Ryuke (@RyukendoR) November 28, 2021 తాజాగా ఈ వైరల్ వీడియోపై దీప్తి సునైనా స్పందించింది. నా జీవితంలో అలాంటి చిల్లర పనులు చేయనంటూ తన ఇన్‌స్టా స్టోరీతో ఓ పోస్ట్‌ని పెట్టింది. ‘మీ బొందరా మీ బొంద.. నా జీవితంలో ఇలాంటి చీప్ ట్రిక్స్‌ని ప్రయోగించను. షణ్ముఖ్ విషయంలోనే కాదు.. నా లైఫ్‌లో దేనికోసం అలాంటి పనులు చేయను. నా దృష్టిలో షణ్ముఖే బిగ్‌బాస్ విన్నర్’అని దీప్తి చెప్పుకొచ్చింది. -
ఒకరిని హీరో చేయడం కోసం మరొకరిని జీరో చేయకండి : సన్నీ తల్లి
Bigg Boss 5 Telugu, Sunny Mother Kalavathi Request To All BB5 Fans: బిగ్‌బాస్ ఫినాలే ఎపిసోడ్‌కు ఇంకా మూడు వారాలే మిగిలుంది. దీంతో బిగ్‌బాస్ సీజన్-5 విజేతగా ఎవరు నిలవనున్నారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం టాప్-1 పోటీలో సన్నీ, షణ్నూల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సిరి చేసే అతివల్ల షణ్నూకి నెగిటిటివి పెరిగిందని, ఇది సన్నీకి ప్లస్ అవుతుందని పలువురు భావిస్తున్నారు. మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న సన్నీ టైటిల్ విన్నర్‌కి అర్హుడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు వీకెండ్ ఎపిసోడ్లో సైతం మిగతా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ సైతం సన్నీ టాప్-5లో కశ్చితంగా ఉంటాడని చెప్పడం మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో షణ్నూ- సన్నీ ఫ్యాన్స్ మధ్య కాస్త సోషల్ వార్ నడుస్తుంది. విన్నర్‌గా తేలేది అతడే అంటూ ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేస్తూ నెగిటివిని పెంచేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సన్నీ తల్లి కళావతి స్పందించింది. 'ఎవరికి నచ్చితే వాళ్లకు ఓట్లు గెలిపించండి తప్పితే విమర్శించకండి అని విన్నవించుకున్నారు. అక్కడ అందరూ ఫ్రెండ్స్‌లా ఉన్నారు. నెగిటివ్ కామెంట్స్ చేయకండి. ఒకరిని హీరో చేయడం కోసం మరొకరిని జోరో చేయకండి' అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. A request to all of you from kalavathi amma 😍#biggbosstelugu5 pic.twitter.com/Jw2bwrdJax — Sunny Vj (@vjsunnyofficial) November 28, 2021 -
బిగ్‌బాస్: షణ్ముఖ్‌కి దీప్తి సూపర్ హింట్..తన పొజిషన్ ఏంటో చెప్పిందా?
బిగ్‌బాస్ హౌస్‌లో శనివారం ఎపిసోడ్ కొంచెం ఎమోషనల్‌గా, కొంచెం జాయ్‌ఫుల్‌గా సాగింది. కంటెస్టెంట్స్‌కు మరోసారి కుటుంబ సభ్యులను చూపించి, సంతోషపరిచాడు హోస్ట్ నాగార్జున. అయితే దీని కోసం శాక్రిఫైజ్ టాస్క్ ఇచ్చాడు. హౌస్ మేట్స్ ఇష్టమైన వస్తువులని త్యాగం చేస్తే వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ తో, లేదా ఫ్రెండ్స్ తో కలుసుకోవచ్చని చెప్పాడు. దీంతో అందరూ తమ వస్తువులని త్యాగం చేసి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడారు. ఇక షణ్ముఖ్ కూడా తన ప్రియురాలు దీప్తి సునైనా ఇచ్చిన టీషర్ట్‌ని త్యాగం చేయడంతో అతని అన్నయ్య స్టేజ్ మీదకు వచ్చాడు. ఆ తర్వాత దీప్తి కూడా రావడంతో షణ్ముఖ్ ఆనందంతో ఉబ్బితబ్బిపోయాడు. ఇక షణ్ణుతో మనసు విప్పి మాట్లాడిన దీప్తి.. ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్ అయిపోవద్దని సూచించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. దీప్తి తెలివిగా షణ్ముఖ్‌కి ఓ హింట్ ఇచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆమె వచ్చిరావడంతోనే రెండు వేళ్లతో మైక్‌ని పట్టుకుంది. అంటే తను రెండో స్థానంలో ఉన్నాడని పరోక్షంగా చెప్పిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగే‘సచ్చినోడా’అని ప్రేమగా అంటూనే వేళ్లతో సైగలు చేసింది. ఇక షణ్ముక్ కూడా వేళ్ల వైపు చూసి చూడనట్లుగా చూశాడు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు, గ్రాండ్ ఫినాలే లో కలుద్దాం అంటూ మరో హింట్ కూడా ఇచ్చింది. మూడు వారాల వరకు ఇక్కడే ఉండూ.. బయటకు రావడం అనేది నాకు నచ్చదని చెప్పింది. దీనికి షణ్ముఖ్ ముసి ముసి నవ్వులు నవ్వుతూ.. నువ్వు ఉన్నావ్ కదా దీపూ.. నేను ఇప్పుడప్పుడే రానులే అన్నాడు. మొత్తానికి దీప్తి చాలా తెలివిగా షణ్ముఖ్‌కి హింట్ ఇచ్చిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ మూడు వారాల్లో తన ఆట తీరును మార్చుకొని విన్నర్ అవుతాడా లేదా అనేది చూడాలి. #SoulOfBB5VJSunny GUYS LEAK EECHIDHI DEEPTHI SUNAINA pic.twitter.com/KBCsfhqe1G — Ryukendo Ryuke (@RyukendoR) November 28, 2021 -
అంతా కలిసి సన్నీని విన్నర్‌గా తేల్చారు! టాప్ 5లో ఎవరున్నారంటే?
Bigg Boss Telugu 5, Episode 84: కింగ్ నాగార్జున హౌస్మేట్స్ కోసం సర్ప్రైజ్ పట్టుకొచ్చాడు. కంటెస్టెంట్ల కోసం మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ స్టేజీపైకి వస్తారని చెప్పాడు. కానీ వాళ్లు మిమ్మల్ని కలవాలంటే మీకు బాగా నచ్చిన వస్తువులను త్యాగం చేయాలని మెలిక పెట్టాడు. అయినవాళ్లను చూడటం కన్నా విలువైనది ఏముంటుందనుకున్న హౌస్మేట్స్ అందుకు ఓకే అనేశారు. మొదటగా యాంకర్ రవి పాప బొమ్మను త్యాగం చేయడంతో అతడి తల్లి ఉమాదేవి స్టేజీపైకి వచ్చింది. ఫ్యామిలీ అంతా నిన్ను చూసి గర్వపడుతుందని నువ్వు బిగ్‌బాస్ హౌస్‌కు రాజువని మెచ్చుకుంది. రవి కోసం బిగ్‌బాస్ తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ కూడా షోకి విచ్చేశాడు. హౌస్‌లో ఎవరికి సపోర్ట్ చేయొద్దని, నీకు చెప్పాలనిపించిన పాయింట్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరాడు. అనంతరం ఉమావేవి.. రవి, సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, మానస్లు వరుసగా టాప్ 5లో ఉంటారని చెప్పుకొచ్చింది. తర్వాత పింకీ మేకప్ కిట్ త్యాగం చేయగా ఆమెకోసం హాస్యనటులు సాయి, అప్పారావు వచ్చారు. వీరు ప్రియాంకను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, శ్రీరామ్, రవి, మానస్‌లను టాప్ 5లో ఉంచారు. ఈ సందర్భంగా పింకీ మాట్లాడుతూ.. 'నన్ను కన్నడ నుంచి తెలుగుకి తీసుకువచ్చి కామెడీ షో చేయించారు.. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరే కారణం' అంటూ అప్పారావుకు కృతజ్ఞతలు తెలిపింది. సన్నీ తనకు ఫ్రెండ్స్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్‌ను త్యాగం చేయగా ఇద్దరు ఫ్రెండ్స్ నిఖిల్, వెంకట్ స్టేజీపై సందడి చేశారు. కప్పు ముఖ్యం బిగిలూ అంటూనే బోర్డు మీద సన్నీని విన్నర్ స్థానంలో ఉంచారు. షణ్ముఖ్, మానస్, శ్రీరామచంద్ర, కాజల్‌ను తర్వాతి నాలుగు స్థానాల్లో ఉంచారు. మానస్.. తల్లి పంపిన బ్రేస్‌లెట్‌ను త్యాగం చేయగా అతడి కంటే ఎక్కువగా పింకీ బాధపడిపోయింది. తర్వాత మానస్ తండ్రి వెంకట్రావు, ఫ్రెండ్ అమర్దీప్ వచ్చాడు. ఏమీ లేనివాడిని తీసుకొచ్చి అన్నీ ఉన్నవాడిలా చేశాడు, నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే మానస్ వల్లేనంటూ అతడిని పొగిడేశాడు. అనంతరం మానస్‌ను ఫస్ట్ ప్లేస్‌లో సన్నీ, కాజల్, శ్రీరామ్, షణ్ముఖ్‌ను మిగిలిన నాలుగు స్థానాల్లో పెట్టారు. కాజల్ ఎంతగానో ఇష్టపడే బొమ్మను త్యాగాల పెట్టెలో పడేసింది. ఆమెను కలవడానికి సోదరితో పాటు, సింగర్ లిప్సిక కూడా వచ్చారు. వీళ్లు కాజల్‌ను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, షణ్ను, శ్రీరామచంద్ర, మానస్‌ను తర్వాతి స్థానాల్లో పెట్టారు. అనంతరం శ్రీరామ్.. హమీదా ఇచ్చిన కానుకను త్యాగం చేయగా అతడి కోసం తల్లి, స్నేహితురాలు వచ్చారు. వీళ్లు శ్రీరామ్, రవి, ప్రియాంక సింగ్, సన్నీ, షణ్ముఖ్‌లు వరుసగా టాప్ 5లో ఉంటారని జోస్యం చెప్పారు. సిరి కోసం వచ్చిన శ్రీహాన్.. సన్నీ, షణ్ముఖ్, రవి, శ్రీరామ్, సిరిలు వరుసగా టాప్ 5లో ఉంటారన్నాడు. చివరగా షణ్ముఖ్.. తన ప్రేయసి దీప్తి సునయన ఇచ్చిన టీషర్ట్‌ను భారంగా త్యాగం చేశాడు. అతడి కోసం మొదట అన్నయ్య సంపత్ రాగా తర్వాత దీప్తి సునయన స్పెషల్ ఎంట్రీ ఇవ్వడంతో షణ్ను ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్ అయిపోవద్దని దీప్తి సూచించింది. నాకు నువ్వేంటో తెలుసంటూ అతడికి ముద్దులు పంపించింది. షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీ, రవి, మానస్లు వరుసగా టాప్ 5లో ఉంటారని వీళ్లు అభిప్రాయపడ్డారు. ఫినాలేలో కలుద్దామంటూ వీడ్కోలు తీసుకుంది. ఈరోజు వచ్చిన మెజారిటీ ఫ్యామిలీ మెంబర్స్ సన్నీని టాప్ 5లోని మొదటి రెండు స్థానాల్లో పెడుతూ అతడే విన్నర్ అని చెప్పకనే చెప్పారు. -
బిగ్‌బాస్‌లోకి దీప్తి సునయన.. సంతోషంలో షణ్నూ
Bigg Boss 5 Telugu: Deepthi Sunaina Entry In Saturday Episode: బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ మరింత స్పెషల్‌గా ముస్తాబైంది. ఇప్పటికే ఫ్యామిలీ టైం అంటూ కుటుంబసభ్యులను హౌస్‌లోకి పంపించిన బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌కు మరికొంత మంది ఫ్యామిలీ మెంబర్స్‌ను ఆహ్వానించారు. ఇక ఈ ఎపిసోడ్లో దీప్తి సునయన ఎంట్రీ హైలెట్‌గా నిలిచింది. తొలుత షణ్నూ కోసం అతని అన్నయ్య మాత్రమే వచ్చారని నాగార్జున చెప్పగా షణ్ముక్ కాస్త నిరాశ చెందాడు. అయితే ఆలోపే దీప్తి సునయన ఎంట్రీ ఇచ్చి అతని మూడ్‌ను మార్చేసింది. దీప్తిని చూడగానే 1000 వాలా బల్బులా షణ్నూ ముఖం వెలిగిపోయింది. 'సచ్చినోడా..నిన్ను చాలా మిస్సయ్యాను' అంటూ దీప్తి చెప్పగా..షణ్నూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా రిలీజ్ చేసింది. కాగా దీప్తి సునయన ఎంట్రీతో షణ్నూ ఆట ఇకనైనా కాస్తా మారుతుందేమో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సిరి-షణ్నూల రిలేషన్ గురించి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన సలహాలను దృష్టిలో పెట్టుకొని కాస్త డిస్టెన్స్ మెయింటేన్ చేస్తారేమో చూడాలి. #DeepthiSunaina is here for #Shanmukh..Ika katha ela undo chudali#BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/7JCfLDYRhm — starmaa (@StarMaa) November 27, 2021 -
తండ్రి లేని అమ్మాయివని దగ్గరవలేదు, ఇకనైనా జాగ్రత్తగా..
Bigg Boss Telugu 5, Episode 83: బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినందుకు సన్నీ తల్లి కళావతి తెగ సంబరపడిపోయింది. బిగ్‌బాస్ నీకు చెల్లెలిని ఇచ్చిందంటూ కాజల్ వంక చూడటంతో ఆమె సంతోషంతో గెంతులు వేసింది. ఇంటికి వచ్చిన అమ్మకు గోరుముద్దలు తినిపించాడు సన్నీ. ఈ సందర్భంగా ఆమె ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉన్న బాక్స్‌ను కొడుక్కు అందించడంతో అతడు ఫుల్ ఖుషీ అయ్యాడు. తర్వాత తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేయగా నీకు నా గెలుపును బహుమతిగా ఇస్తానని కళావతికి మాటిచ్చాడు. సన్నీ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటం వల్లే పింకీ అతడికి క్లోజ్ అవుతుందేమోనని అనుమానపడ్డాడు మానస్. 'పింకీ తనను వదిలి వెళ్లిపోయిన బాయ్‌ఫ్రెండ్ ప్లేస్‌లో నన్ను రీప్లేస్ చేద్దామని చూస్తోంది. అయితే అది కుదరదని, నేను అలాంటివాడిని కాదని చెప్పాను. మనం ఫ్రెండ్స్ మాత్రమే అని స్పష్టం చేశాను' అని కాజల్‌తో చెప్పుకొచ్చాడు. అంతేకాక ఆమె చాలా అబద్ధాలు ఆడుతుందని, అది తనకు నచ్చదన్నాడు. ఇక హగ్గులు ఇచ్చుకోవడం నచ్చలేదని సిరి తల్లి చెప్పిన మాటలకు బాగా హర్టయ్యాడు షణ్ను. ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉందామని, ఇంట్లో వాళ్లను బాధపెట్టడం వద్దని హితవు పలికాడు. తండ్రి లేని కూతురని నీకు దగ్గరై అడ్వాంటేజ్ తీసుకోలేదని ఈ మాట మీ అమ్మకు చెప్పని సిరికి సూచించాడు. అనంతరం ప్రియాంక సింగ్ వాళ్ల సోదరి మధు ఎంట్రీ ఇచ్చింది. ఆమె వచ్చీరావడంతోనే నాన్న ఎందుకు రాలేదని నిలదీసింది పింకీ. నాన్నకు కళ్ల ప్రాబ్లమ్ ఉంది కాబట్టి రాలేదని బదులిచ్చింది మధు. నాన్న తల దించుకునే పని చేయనన్నావు, ఆ మాట నిలెబట్టుకోమని ఆయన మరీమరీ చెప్పాడు, గేమ్ మీద మాత్రమే ఫోకస్ చేయ్.. అని హెచ్చరించింది. అయితే మధు తాను సన్నీకి ఫ్యాన్ అని చెప్పింది. తర్వాత రవి భార్య నిత్య హౌస్‌లో అడుగుపెట్టింది. ఆమెను చూసిన రవి కొంత సంతోషిస్తూనే మరికొంత బాధకు లోనయ్యాడు. కూతురు వియా రాలేదేంటని నిరుత్సాహపడ్డాడు. ఇంతలో వియా హౌస్‌లోకి సర్ప్రైజ్ ఎంట్రీ ఇవ్వడంతో అతడి ఆనందం కట్టలు తెంచుకుంది. సుమారు 80 రోజుల తర్వాత కూతురు స్పర్శ తగిలినందుకు ఎమోషనల్ అయ్యాడు. నిన్ను చూసి అమ్మ రోజూ ఏడుస్తుందని రవికి ఫిర్యాదు చేసింది వియా. తర్వాత బిగ్‌బాస్ అంకుల్ ఎక్కడ? అంటూ అతడికోసం ఇల్లంతా వెతికి హంగామా చేసింది. రవి.. తన భార్యకు షణ్నును పరిచయం చేస్తూ ఇతడు లైఫ్‌లాంగ్ తమ్ముడని చెప్పాడు. అతడితో నిత్య మాట్లాడుతూ.. రవి ఇన్ఫ్లూయెన్స్ చేస్తాడంటారు, కానీ ఆయనకంత సీన్ లేదని తెలిపింది. చాన్నాళ్ల తర్వాత కూతురు కనిపించడంతో ఆమెతో సరదాగా ఆడుకున్నాడు రవి. వీళ్ల కోసం బిగ్‌బాస్ గుమ్మాడి గుమ్మాడి సాంగ్ప్లే చేయడంతో తండ్రీకూతుళ్లు డ్యాన్స్ చేశారు. తర్వాత బిగ్‌బాస్ హౌస్‌ను వదిలి వెళ్లాల్సిన టైం రావడంతో వియా గుక్కపెట్టి ఏడ్చింది. అనంతరం షణ్ను తల్లి ఇంట్లో అడుగు పెట్టడంతో ఆమెను పట్టుకుని ఏడ్చేశాడు. తన ప్రేయసి దీప్తి సునయన ఎలాగుంది అని అడిగి తెలుసుకున్నాడు. సిరి వాళ్ల మమ్మీ కొన్ని నచ్చట్లేదని బాధపడ్డారు అంటూ హగ్గుల గురించి మాట్లాడినదాన్ని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే అవేమీ పట్టించుకోని షణ్ను మదర్.. దేని గురించి ఆలోచించకు, ఫ్రెండ్షిప్ కదా అంటూ కొడుక్కు సపోర్ట్ చేసింది. ఎక్కువ ఎమోషనల్ అయి గేమ్ పాడు చేసుకోకని హెచ్చరించింది. అందరితో కలిసి ఉండమని షణ్నుకు నొక్కి చెప్పింది. గేమ్గేమ్లా చూడండి, ఎక్కువ ఎమోషనల్ అవద్దని షణ్ను, సిరిలకు సూచించి వీడ్కోలు తీసుకుంది. మొత్తానికి భారంగా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ మీటింగ్ ముగిసింది. -
గేమ్‌ను గేమ్‌లా చూడండి: సిరికి షణ్ముఖ్ తల్లి హెచ్చరిక
Bigg Boss Telugu 5 Promo, Priyanka and Shanmukh Families In House: ఫ్యామిలీ మెంబర్స్ రాకతో కంటెస్టెంట్ల ముఖాలు తారాజువ్వల్లా వెలిగిపోయాయి. అయినవాళ్లను తనివితీరా చూసుకుని సంతోషంలో తేలిపోయారు. గొడవలు, చికాకులు పక్కనపెట్టి కుటుంబసభ్యులతో ఆనంద క్షణాలను ఆస్వాదించారు. ఇప్పటివరకు కాజల్, శ్రీరామ్, మానస్, సిరి, సన్నీ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి వచ్చి సందడి చేశారు. నేడు రవి, ప్రియాంక, షణ్ముఖ్ కుటుంబీకులు హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజ్ చేశాడు బిగ్‌బాస్. ప్రియాంక కోసం ఆమె సోదరి రాగా, షణ్ను కోసం ఆమె తల్లి హౌస్‌లో అడుగు పెట్టింది. తల్లిని చూడగానే ఎమోషనల్ అయి ఏడ్చేసిన షణ్ను తన కెప్టెన్ బ్యాండ్‌ను తల్లి చేతికి కట్టి ఆనందపడ్డాడు. దీపూను కలిసావా? ఎలా ఉందంటూ ప్రేయసి యోగక్షేమాలు ఆరా తీశాడు. దీంతో షణ్ను తల్లి.. వందసార్లు అడగకు, దీపూ బాగానే ఉందని చెప్పింది. ఇంతలో అక్కడికి సిరి రాగా.. గేమ్‌ను గేమ్‌లా చూడండి, ఎక్కువ ఎమోషనల్ అయిపోవద్దు అని హెచ్చరించింది. మరోపక్క రవి కూతురు వియా.. బిగ్‌బాస్ అంకుల్‌ను చూడాలని పట్టుపట్టింది. బాత్రూంలో కూడా వెతికేసింది. బిగ్‌బాస్ అంకుల్, ఒక్కసారి చూస్తా, ప్లీజ్.. అంటూ క్యూట్‌గా కెమెరాలను అభ్యర్థించింది. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు వియా పాప ఎంత ముద్దుగా మాట్లాడిందో అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
హగ్గుల వివాదం.. షణ్నును వెనకేసుకొచ్చిన సన్నీ
Bigg Boss Telugu 5, Sunny Supports Shannu: షణ్నుకు దగ్గరవుతున్నావు, కానీ అతడిని హగ్ చేసుకోవడమే నచ్చలేదు అని సిరి తల్లి బిగ్‌బాస్ హౌస్‌లో సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో హౌస్మేట్స్ అందరూ షాకవగా షణ్ను అయితే తలెత్తుకోలేకపోయాడు. ఆమె అలా అంటుంటే సిరి దాన్ని ఆపకుండా సైలెంట్‌గా ఉండటాన్ని తట్టుకోలేకపోయాడు. ఇంత చేసి ఇలాంటి మాటలు పడాల్సి వచ్చిందేనని కుంగిపోయి ఏడ్చేశాడు. అయితే ఇలాంటి సమయంలో సన్నీ అతడికి అండగా నిలిచాడు. వాళ్లది ఫ్రెండ్షిప్ అని నొక్కి చెప్పాడు. '82 రోజులుగా వాళ్లను చూస్తూనే ఉన్నాం. వాళ్లిద్దరిదీ చాలా మంచి ఫ్రెండ్షిప్. బెస్ట్‌ఫ్రెండ్స్‌గా కనెక్ట్ అయ్యారు. నేను, మానస్ ఎంత బెస్ట్ఫ్రెండ్సో వాళ్లిద్దరూ అంత బెస్ట్‌ఫ్రెండ్స్' అంటూ ఆమెకు అర్థమయ్యేలా చెప్పుకొచ్చాడు. సన్నీ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. షణ్ను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కూడా థ్యాంక్స్ మచ్చా అంటూ కృతజ్ఞతలు తెలిపారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ రోహిణి అయితే వీడు బంగారం అంటూ సన్నీని మెచ్చుకుంది. చదవండి: హగ్గుల గురించి తీయకు.. తల్లిగా చెప్పడం నా బాధ్యత.. ఏడ్చేసిన షణ్ను View this post on Instagram A post shared by Rohini (@actressrohini) -
షణ్నూతో హగ్గులు: సిరి తల్లి రియాక్షన్‌పై ఆమె బాయ్‌ఫ్రెండ్ ఏమన్నాడంటే..
Siri Boy Friend Comments On Siri Shannu Relationship: బిగ్‌బాస్ షోలో సిరి- షణ్నూల రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో బాగానే ఉన్నా, ఈ మధ్య చీటికిమాటికి హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడంతో షణ్న-సిరిలపై సోషల్ మీడియాలోనూ కాస్త నెగిటివిటి పెరుగుతుంది. వీరిద్దరూ సింగిల్‌గా ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో కానీ.. బిగ్‌బాస్‌కు రాకముందే సిరి శ్రీహాన్‌తో నిశ్చితార్థం జరగడం, కొన్నాళ నుంచి దీప్తి సునయనతో షణ్నూ ప్రేమలో ఉండటంతో వీరిద్దరి రిలేషన్‌ను నెటిజన్లు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా సిరి వల్లే షణ్నూ గేమ్ దెబ్బతింటుంది అని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ప్యామిలీ ఎపిసోడ్‌లోనూ షణ్నూని హగ్ చేసుకోవడం నచ్చడం లేదని సిరి తల్లి ఆమెకు అందరిముందే వార్నింగ్ ఇచ్చింది. ఎవరి గేమ్ వాళ్లు ఆడితే మంచిదంటూ ఇద్దరికీ హితబోద చేసింది. అయితే హౌస్‌లో అందరిముందే సిరి వాళ్ల మథర్ అలా అనడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సదరు తల్లిగా కూతురికి తప్పొప్పులు గురించి చెప్పిందంటూ కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుంటే, షోలో అందరి ముందు అలా అనడం కరెక్ట్ కాదంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై సిరి బాయ్‌ఫ్రెండ్, కాబోయే భర్త శ్రీహాన్ స్పందించాడు. 'సిరి మథర్కి ఎలా చెప్పాలో తెలియక అలా అనేసింది. పాపం వాళ్లు ఉంటున్న వాతావరణం అలాంటిది. ఒక తల్లిగా కూతుర్ని బయట తప్పుగా అంటుంటే తీసుకోలేక అలా అనేశారు. ఆంటీ ఇలా అంటారని నేను కూడా ఊహించలేదు. దయచేసి ఆమెపై కోప్పడవద్దు. ఆమె తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇక సిరి, షణ్నూల రిలేషన్‌ను నేను గౌరవిస్తాను' అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం శ్రీహాన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
హగ్గులు వద్దన్నందుకు తల్లిపై సిరి ఫైర్, ఏడ్చేసిన షణ్ను!
Bigg Boss Telugu 5, Episode 82: కుటుంబ సభ్యుల ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లో ఆనందం తాండవం చేసింది. హౌస్మేట్స్ అందరూ వచ్చిన అతిథులను చూసి తెగ సంతోషపడ్డారు. నెక్స్ట్ ఎవరు వస్తారా? అని ఎవరికివారు ఆశగా గేట్ల వంక చూశారు. నిన్న కాజల్ ఫ్యామిలీ హౌస్‌లో సందడి చేయగా నేడు శ్రీరామ్, మానస్, సిరి ఇంటిసభ్యులు వచ్చారు. మరి వాళ్లేం అన్నారు? హౌస్‌లో ఎంత రచ్చ చేశారన్నది నేటి (నవంబర్ 25) ఎపిసోడ్లో చూసేద్దాం.. శ్రీరామ్ కోసం ఆమె సోదరి అశ్విని హౌస్‌లోకి వచ్చింది. అందరితో పలకరింపులు అయిపోయాక శ్రీరామ్‌కు గేమ్‌లో సలహాలు సూచనలు ఇచ్చింది. నీ పాయింట్ నువ్వు చెప్పు, కానీ ఎదుటివాళ్లు చెప్పేది కూడా వినమని సూచించింది. నిన్ను గెలిచి రమ్మని బామ్మ మరీమరీ చెప్పిందని అది నిజం చేసి రావాలంటూ అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది. తర్వాత మానస్ తల్లి పద్మిని హౌస్‌లో అడుగు పెట్టింది. వచ్చీరావడంతోనే హౌస్ అంతా చుట్టేస్తూ తెగ సందడి చేసింది. మానస్‌తో పర్సనల్‌గా మాట్లాడుతూ.. నీ దృష్టంతా టాప్ 5లో చేరడంపైనే ఉండాలని నొక్కి చెప్పింది. నిన్ను విన్నర్‌గా చూడాలనుకుంటున్నానని మనసులోని మాటను బయటపెట్టింది. పక్కవాళ్లు డిస్టర్బ్ చేస్తున్నా డిస్టర్బ్ కాకుండా ఆడితే తప్పకుండా ఫినాలేకు చేరుకుంటావని ధైర్యం నూరిపోసింది. ఇక తనను హౌస్మేట్స్ ఆంటీ అని పిలవగా అక్క అని పిలవండని సూచించడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. అందరికంటే పింకీ అందంగా కనిపిస్తుందని ఆమెను మెచ్చుకుంది. శ్రీరామ్.. తనకు, మానస్‌కు మీలాంటి ఒక అమ్మాయిని చూడమని రిక్వెస్ట్ చేయగా శ్రీదేవి.. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేస్తానంది. అంతలోనే హమీదా వెయిట్ చేస్తోందిలే అంటూ పంచ్ విసిరింది. ఆమె ఎనర్జీకి మంత్రముగ్ధుడైన శ్రీరామ్ నీవన్నీవే, నీవే.. అంటూ అందమైన పాట పాడాడు. తర్వాత ఆమె అందరికీ వీడ్కోలు పలుకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. బీబీ ఎక్స్‌ప్రెస్ టాస్క్‌లో భాగంగా షణ్ను పాజ్‌లో ఉన్నప్పుడు హౌస్మేట్స్ అతడికి గర్భవతి వేషం వేయగా, సిరికి మీసాలు దించి ఆటపట్టించారు. అనంతరం సిరి తల్లి శ్రీదేవి హౌస్‌లోకి రాగా షణ్ముఖ్‌ను నువ్వు హగ్ చేసుకోవడం నచ్చలేదని ముక్కుసూటిగా చెప్పింది. తండ్రి లేని పిల్ల కదా! షణ్ముఖ్ తండ్రిగా, అన్నగా అన్ని రకాలుగా సాయం చేస్తూ దగ్గరవుతుండటం నచ్చలేదంది. దగ్గరవడం మంచిదే కానీ హగ్గులు నచ్చట్లేదని చెప్పగా సిరి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఆమెను పక్కకు తీసుకెళ్లింది. హగ్ చేసుకోవడం నచ్చలేదని ఎందుకలా అన్నావు? అలా అనకూడదు కదా! ఫీలవుతారు అని ఆగ్రహించింది. తల్లిగా అనిపించింది చెప్పవలసిన బాధ్యత తనకుందని జవాబిచ్చింది శ్రీదేవి. అందరిముందు కాకుండా నాకు పర్సనల్‌గా చెప్పాల్సిందని సిరి నొచ్చుకుంది. నువ్వెలాగో టాప్ 5లో ఉంటావంటున్నారు, కానీ నువ్వు మాత్రం కప్పు పట్టుకునే రావాలి అని సిరికి మరీమరీ చెప్పింది ఆమె తల్లి. తర్వాత తన కష్టాలు చెప్పుకుంటూ బాధపడింది. 'సిరికి ఊహ తెలిసినప్పుడే వాళ్ల డాడీ చనిపోయారు. చిన్న పాన్‌షాప్ పెట్టి ఆమెను చదివించాను. ఎన్నో మాటలు పడ్డాను. కష్టపడి చదివించినందుకు నా పిల్లలు నాకు మంచి పేరు తెచ్చారు. నన్ను సిరి తల్లిగా గుర్తిస్తున్నారు. ఆమెకు తల్లినయినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను' అని చెప్పుకొచ్చింది. ఆమె వెళ్లిపోయాక సిరి వచ్చి హగ్ చేసుకుని ఏడవగా షణ్ను ఆమెను మనసారా హత్తుకుని ఓదార్చలేకపోయాడు. నా గేమ్ కూడా వదిలేసి ఇంత సపోర్ట్ చేస్తే ఆమె తల్లితో ఇలా మాట పడాల్సి వచ్చిందని ఫీలయ్యాడు. అలా హగ్గులు నచ్చలేదని ఆమె తల్లి చెప్పినప్పుడు సిరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఒంటరిగా కూర్చుని ఏడ్చేశాడు. ఈ హౌస్‌లో ఉండేందుకు తనకు అర్హత లేదని, ఇంకా ఎందుకున్నానో అర్థం కావట్లేదని తనలో తానే కుమిలిపోయాడు. మరోవైపు తనను ఎందుకు దూరం పెడుతున్నావని ప్రియాంక మానస్‌ను నిలదీసింది. నువ్వు నా దగ్గరనుంచి ఎక్కువగా ఆశిస్తున్నావని, నేను ఫ్రెండ్‌గా వచ్చి మాట్లాడితే నీకు ఇంతేనా అనిపిస్తుందంటూ ఆమెను ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. మానస్ చెప్పేది అర్థం అయిందో లేదో తెలియదు కానీ వెంటనే పింకీ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. అనంతరం సన్నీ తల్లి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చింది. తన బర్త్‌డేను హౌస్‌మేట్స్‌తో సెలబ్రేట్ చేసుకోనుంది. ఆ సెలబ్రేషన్స్ రేపటి ఎపిసోడ్లో ప్రసారం కానున్నాయి. -
నేను ఉంటే సిరి చెంప పగులకొట్టేవాడిని : జెస్సీ
Jessie Shocking Comments On Siri And Shanmukh Relationship: బిగ్‌బాస్ షోలో ఏమైనా జరగొచ్చు. అప్పటివరకు బెస్ట్‌ఫ్రెండ్స్‌లా ఉన్నవాళ్లు కూడా హౌస్‌లో బద్ద శత్రువులుగా మారొచ్చు.. ఏ పరిచయం లేని వాళ్లు సైతం హస్‌లో బెస్ట్‌ఫ్రెండ్స్‌లా మరొచ్చు. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్-5లో షణ్ముఖ్, సిరిలు కూడా పైకి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నా..వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఈ విషయాన్ని లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో సిరి స్వయంగా ఒప్పుకుంది. తప్పు అని తెలిసినా కనెక్షన్ పెరుగుతుందంటూ మనసులో మాటను బయటపెట్టింది. వీరిద్దరూ సింగిల్‌గా ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో కానీ.. బిగ్‌బాస్‌కు రాకముందే సిరి శ్రీహాన్‌తో నిశ్చితార్థం జరగడం, కొన్నాళ నుంచి దీప్తి సునయనతో షణ్నూ ప్రేమలో ఉండటంతో వీరిద్దరి రిలేషన్‌ను నెటిజన్లు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. పబ్లిక్‌గా హద్దులు మీరి హగ్గులు, కిస్సులు ఇచ్చుకోచడం ఫ్యామిలీ ఆడియోన్స్‌ను సైతం రుచించడం లేదు. ఇక వీరిద్దరి రిలేషన్‌పై బిగ్‌బాస్ కంటెస్టెంట్ జెస్సీ మాట్లాడుతూ.. బయటి ప్రపంచంతో సంబంధం లేకపోవడంతో అక్కడ ఉన్నవాళ్లతోనే క్లోజ్‌గా ఉంటారని, కానీ బయటకు వచ్చాక అది కంటిన్యూ కాదని అభిప్రాయపడ్డాడు. ఇక షణ్నూ కోసం సిరి తలను గోడకేసి గుద్దుకోవడం తనకు ఏమాత్రం నచ్చలేదని, ఆ సమయంలో తాను గనుక అక్కడ ఉండి ఉంటే..సిరి చెంప పగులకొట్టేవాడినంటూ కామెంట్స్ చేశాడు. -
సిరి ప్రవర్తనపై షణ్ముఖ్ తల్లి ఆగ్రహం!
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ షో చూస్తున్నవాళ్లకు షణ్ముఖ్, సిరి ఫ్రెండ్షిప్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ. షణ్ను, సిరిలలో ఏ ఒక్కరు టాస్క్ గెలిచినా ఇద్దరూ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సీజన్లో తొలి కెప్టెన్‌గా సిరి నిలిస్తే చివరి కెప్టెన్‌గా షణ్ను నిలిచాడని తెగ సంబరపడిపోయింది సిరి. ఇదిలా వుంటే వీళ్ల ఫ్రెండ్షిప్ కొన్నిసార్లు హద్దులు మీరుతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎప్పటినుంచో కామెంట్లు చేస్తున్నారు. అంతెందుకు, సిరి, షణ్ను కూడా ఏదో తప్పు చేస్తున్నట్లుగా భయపడిపోయారు. ఇద్దరికీ ఆల్రెడీ లవర్స్ ఉన్నప్పటికీ హౌస్‌లో ఒకరికొకరం ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతున్నామని, ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని సంఘర్షణకు లోనయ్యారు. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన సిరి తల్లి కూడా వీళ్ల ఫ్రెండ్షిప్పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదివరకే శ్రీహాన్‌తో నిశ్చితార్థం జరిగిన సిరి.. షణ్నును హత్తుకోవడం నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పేసింది. తప్పు చేస్తున్నావంటూ కూతురును హెచ్చరించింది. ఆమె మాటలతో హౌస్ అంతా షాకైంది. షణ్ముఖ్ తల్లి కూడా వీళ్ల ప్రవర్తనపై ఆగ్రహంతో ఉందట! మాటిమాటికీ హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడాన్ని తప్పుపట్టిందట! షణ్నుతో ఇలా ఉండటం కరెక్ట్ కాదు అని సిరికి ముఖం మీదే చెప్పినట్లు సమాచారం. మరి పేరెంట్స్ హెచ్చరికలతోనైనా సిరి- షణ్నులో ఏదైనా మార్పు వస్తుందేమో చూడాలి! -
Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌తో రిలేషన్‌పై సిరి తల్లి షాకింగ్ కామెంట్స్
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రతి వారం లగ్జరీ బడ్జెట్ కోసం కంటెస్టెంట్లకు బిగ్ బాస్ టాస్కులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. టాస్క్ ఎంత బాగా ఆడితే.. అదే స్థాయిలో లగ్జరీ బడ్జెట్ వస్తుంది. ఇక ఈ వారం లగ్జరీ బడ్జెట్ కోసం ‘బీబీ ఎక్స్‌ప్రెస్’అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. . ఇందులో భాగంగా చుక్ చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లు అందరూ కలిసి రైలు భోగీలుగా మారాల్సి ఉంటుంది. ఆ తర్వాత బిగ్ బాస్ కమాండ్స్ ఆధారంగా పని చేయాల్సి ఉంటుంది. గత సీజన్లో మాదిరిఫ్రీజ్, ఫాస్ట్ ఫార్వర్డ్ అనే టాస్క్‌లో ఇది చాలా వినోదాత్మకంగా సాగుతుంది. ఇక మధ్య మధ్యలో కుటుంబ సభ్యులను ప్రవేశపెడుతున్నాడు బిగ్‌బాస్. నిన్న కాజల్ భర్త, కూతురు హౌస్‌లోకి వచ్చి సందడి చేశాడు. చాలా రోజుల తర్వాత కుటుంభ సభ్యులను కలవడంతో కాజల్ ఎమోషనల్ అయింది. ఇక నేటి ఎపిసోడ్లో మానస్ తల్లితో పాటు.. సిరి తల్లి కూడా ఇంట్లో వచ్చినట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలిసింది. మమ్మి ఇంట్లోకి రావడంతో ఆనందంతో ఎగిరి గంతులేశాడు మానస్. ఆమె కూడా మానస్‌ని ముద్దాడుతూ.. ఎమోషనల్ అయింది. తర్వాత.. ఇంటి సభ్యులతో చాలా సరదాగా గడిపింది. ‘అరేయ్ ఏంట్రా షన్నూ’ అంటూ షణ్ముఖ్‌ని ఆటపట్టించింది. ఇక కాజల్ చాయ్ ఇవ్వనా అని అడగ్గా.. నీకు వంట చేయడం రాదుగా అంటూ పంచ్ వేసింది. శ్రీరామ్ ఆంటీ అని పిలవగా.. ‘ఎందుకు ఆంటీ అంటున్నావ్.. నేను నీ గర్ల్‌ఫ్రెండ్’అని అనడంతో ఇంటి సభ్యులంతా ఘొల్లున నవ్వారు. ఆమె తర్వాత సిరి తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో సిరి ఫ్రీజ్‌లో ఉంది. సిరిని ఫ్రీజ్ నుంచి రిలీజ్ చేయగానే... వెళ్లి తల్లిని గట్టిగా హగ్ చేసుకొని ముద్దుల వర్షం కురిపించింది. కూతురిని బాగా ఆడుతున్నావ్ అని ప్రొత్సహిస్తూనే.. షణ్ముఖ్‌ని హగ్ చేసుకోవడం నచ్చడంలేదని షాకింగ్ కామెంట్ చేసింది సిరి తల్లి. షణ్ముఖ్ సిరిగా బాగా హెల్ప్ చేస్తున్నాడని, అది తనకు నచ్చడం లేదని చెప్పింది. మరి సిరి తల్లి చేసిన కామెంట్స్‌ని షణ్ముఖ్ ఎలా రిసీవ్ చేసుకున్నాడో చూడాలి. -
చెంపలు వాయించుకున్న పింకీ.. సంతోషంగా ఉందన్న కాజల్ కూతురు
Bigg Boss Telugu 5, Episode 81: కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ 'నియంత మాటే శాసనం' గేమ్‌లో రవి, షణ్ముఖ్, ప్రియాంక మిగిలారు. బజర్ మోగగానే మొదటగా సింహాసనమెక్కాడు షణ్ను. దీంతో మిగిలిన ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే అవకావం అందిపుచ్చుకున్నాడు. దీంతో ప్రియాంక.. ట్రాన్స్ కమ్యూనిటీకి తను ఆదర్శంగా ఉండాలనుకుంటున్నానని, ఒక్కసారైనా కెప్టెన్ అవ్వాలని ఉందంటూ తనను గేమ్‌లో నుంచి తొలగించవద్దని కోరింది. అయితే షణ్ను.. తాను రవికి ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేకపోయానని ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అతడిని సేవ్ చేస్తున్నానని నిర్ణయాన్ని ప్రకటించాడు షణ్ను. తన కమ్యూనిటీ కోసం అయినా పింకీని సేవ్ చేయొచ్చుగా అని కాజల్ పింకీకి సపోర్ట్ చేయడంతో షణ్ను అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. కమ్యూనిటీ గురించి తీయడం తప్పంటూ హెచ్చరించాడు. నేనేమైనా ఎదవలా కనిపిస్తున్నానా? ఆ పదం ఎందుకు వాడుతున్నారు? అని మండిపడ్డాడు. ఈ గొడవతో తన బుర్ర హీటెక్కిపోయిన ప్రియాంక తన చెంపలు వాయించుకుని వాష్‌రూమ్ హాల్లోకి వెళ్లి ఏడ్చేసింది. పింకీ బర్త్‌డే కాబట్టి ఆమెను సేవ్ చేయాల్సిందని సన్నీ అభిప్రాయపడ్డాడు. ఈ గొడవతో షణ్ను సిరిని పట్టుకుని ఏడ్చేశాడు. ఫైనల్‌గా షణ్ముఖ్, రవి కెప్టెన్సీ కంటెండర్లు అవగా శ్రీరామ్ తప్ప మిగతా అందరూ షణ్నుకు ఓటేయడంతో అతడు ఈ సీజన్లో ఆఖరి కెప్టెన్‌గా నిలిచాడు. సిరి అందంగా కనిపించాలంటూ షణ్ను ఆమెకు ముక్కుపుడకిచ్చాడు. తనకు అది పెట్టుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ షణ్ను కోసం దాన్ని ధరించించిది సిరి. అనంతరం బీబీ ఎక్స్‌ప్రెస్ అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో చుక్ చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లంతా రైలు బోగీలా మారడంతో పాటు రైలులా కదలాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో అందరూ వినోదాన్ని పంచారు. అందరూ పాజ్‌లో(ఆగిపోయి) ఉన్నప్పుడు కాజల్ భర్త, కూతురు హౌస్‌లోకి వచ్చారు. తల్లిని చూడగానే కాజల్ కూతురు గుక్కపెట్టి ఏడ్చింది. కాజల్‌ను రిలీజ్ అని చెప్పగానే ఆమె తన ఫ్యామిలీని పట్టుకుని ఎమోషనల్ అయింది. భర్తపై ముద్దుల వర్షం కురిపించింది. నువ్వు ఇక్కడివరకు వస్తావనుకోలేదని కూతురు అనడంతో కాజల్ నవ్వేసింది. కనీసం టాప్ 5కి చేరుకున్నా సంతోషమే అని చెప్పింది. మమ్మీనెవరైనా నామినేట్ చేస్తే కోపమొస్తదా? అని శ్రీరామ్ అడగ్గా కాజల్ కూతురు అవునని తలూపింది. రవి, శ్రీరామ్‌ను రెండుసార్లు, యానీ మాస్టర్నైతే లెక్కలేనన్నిసార్లు తిట్టుకున్నానంది. యానీ మాస్టర్ ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉన్నానంటూనే జస్ట్ జోక్ చేశానని కవర్ చేసింది. ఈ సీన్‌తో షణ్నుకు తన ఫ్యూచర్ గురించి టెన్షన్ పట్టుకుంది. తనకోసం ఎవరు వస్తారో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. అయ్యా, నమస్కారం, ఎవరిని పంపిస్తున్నారో చెప్తే నేను ముందుగానే ప్రిపేర్ అవుతానంటూ కెమెరాకు విన్నవించాడు. -
మళ్లీ లీక్ చేసిన బిగ్‌బాస్, అతడే చిట్టచివరి కెప్టెన్!
Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్ హౌస్‌లో చివరి కెప్టెన్ కోసం పోటీ జరుగుతోంది. ఎలాగైనా ఈ సీజన్లో ఆఖరి కెప్టెన్‌గా నిలిచి తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకోవాలని కంటెస్టెంట్లు తహతహలాడారు. కానీ చివరాఖరికి షణ్ముఖ్ కెప్టెన్‌గా నిలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలే నిజమంటూ తాజాగా ప్రోమో వదిలాడు బిగ్‌బాస్. ఇందులో షణ్ను చేతికి బ్యాండ్ ఉండటంతో అతడే కెప్టెన్ అయ్యాడని చెప్పకనే చెప్పాడు. ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేకపోయానని పింకీ బోరుమని ఏడ్చేయగా ఆమె కోసం సన్నీ, మానస్ ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. ఇదిలా ఉంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ బీబీ ఎక్స్‌ప్రెస్ అనే టాస్క్ ఇచ్చాడు. చుక్‌చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా హౌస్మేట్స్ బోగీల్లా మారుతారు. మొదటిసారి వీరంతా సరదాగా గేమ్ ఆడినట్లు కనిపిస్తోంది. ఈ గేమ్‌ను ఆస్వాదించాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
షణ్నుతో ఈ ఫీలింగ్ తప్పని తెలిసినా చేయాలనిపిస్తోంది: సిరి
Bigg Boss Telugu 5, Episode 77: 'నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా' టాస్క్‌లో సన్నీని గెలిపించడం కోసం కాజల్ కెప్టెన్ మానస్‌తో కయ్యానికి దిగింది. అతడు ఎడ్డెం అంటే తెడ్డెం అంటూ తిరకాసులు పెట్టింది. సన్నీ గెలవాలంటే సిరి, యానీ ఇద్దరి ఫొటో కాల్చేయాల్సిందేనని మొండిపట్టు పట్టింది. హౌస్ అంతా కళ్లలో నిప్పులు పోసుకుంటున్నా తను మాత్రం సన్నీ కోసం ఒంటరిగా ఫైట్ చేసింది. మానస్ ఎంత ఒప్పించినా ఆమె వెనక్కి తగ్గలేదు. వీరిద్దరూ ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో యానీ, సిరి ఇద్దరి ఫొటోలు కాలిపోయాయి. ఎన్ని రౌండ్లయినా ఒక్కసారైనా ఫొటో కాలని సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కడంతో అతడు సంతోషంతో స్టెప్పులేశాడు. పాస్ గెలుచుకున్న సన్నీ.. బోరుమని ఏడ్చిన యానీ అయితే సిరి, యానీ మాత్రం.. డ్రామాలాడుతున్నారంటూ కాజల్‌ను ఏకిపారేశారు. యానీ అయితే వెక్కెక్కి ఏడుస్తూ వాళ్లతో మాట్లాడేది లేదని శపథం చేసింది. తొండి గేమ్‌లు, నాటకాలంటూ ఆవేశంలో నానా మాటలు అనేసింది. వీరిని కూల్ చేయాల్సింది పోయిన రవి అందుకు భిన్నంగా అగ్నికి ఆజ్యం పోసేలా మాట్లాడాడు. ఇప్పుడు ఆడోళ్లను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడింది సన్నీ కాదా? అంటూ హౌస్‌మేట్స్‌ను మరింత రెచ్చగొట్టాడు. యానీ రోదన చూడలేకపోయిన శ్రీరామ్ ఒక అడుగు ముందుకేసి.. ఆమెను అంతలా ఏడిపిస్తూ, తన ఉసురు పోసుకోవడం అవసరమా? అని ప్రశ్నించాడు. దీంతో బిత్తరపోయిన కాజల్ ఉసురు పోసుకోవడం వంటి పెద్దపెద్ద మాటలు అనాల్సిన అవసరం లేదని, ఇది గేమ్ అని కుండ బద్ధలు కొట్టింది. ఆ నలుగురికి గోల్డ్ ఇచ్చిన రవి తర్వాత నాగార్జున... ఈ వారం బెస్ట్ పర్ఫామర్కు బంగారం, వరస్ట్ పర్ఫామర్కు బొగ్గు ఇవ్వాలని ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మాజీ కెప్టెన్ రవి.. ప్రియాంక సింగ్, మానస్, యానీ, శ్రీరామ్‌లకు బంగారం ఇచ్చాడు. సన్నీ, కాజల్, సిరి, షణ్నుతో పాటు తనకు తాను బొగ్గిచ్చుకున్నాడు. ఈ సందర్భంగా నాగ్.. స్విమ్మింగ్ టాస్క్‌లో సన్నీ మీద పగ తీర్చుకున్నావ్ కదూ! అని రవి మీద అనుమానం వ్యక్తం చేయగా అతడు అలాంటిదేం లేదని బుకాయించాడు. అలాగే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో శ్రీరామ్ దగ్గరున్న నెగెటివ్ పవర్‌ను తీసుకుని బంగారం కోల్పోయి బకరా అయ్యావని కామెంట్ చేశాడు. తప్పా? రైటా? తెలియట్లేదు, లైఫ్‌లో ఎప్పుడూ ఇలా అవలేదు బాత్రూం లోపల, బయట తల కొట్టుకుంటూ నిన్ను నువ్వు ఎందుకు గాయపర్చుకున్నావని నాగ్ సిరిని ప్రశ్నించాడు. ఆమను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిపించుకుని మాట్లాడాడు. కోట్లమంది నిన్ను చూసి ఈ అమ్మాయిలా ఉండాలనుకోవాలి కానీ ఈవిడలా మాత్రం ఉండకూడదు అని భావించకూడదని సుద్దులు చెప్పాడు. తన సమస్యేంటో చెప్పమన్నాడు. దీంతో ఓపెన్ అయిన సిరి.. 'నేను ఎమోషనల్ పర్సన్. నేను ఎదుటివాళ్లను హర్ట్ చేసే వ్యక్తిని కాను. ఎవరేం అన్నా నన్ను నేనే బాధపెట్టుకుంటాను. రోజులు గడిచేకొద్దీ షణ్నుతో నా కనెక్షన్ ఇంకా ఎమోషనల్ అయిపోతుంది. ఇది తప్పా? రైటా? తెలియట్లేదు. లైఫ్‌లో ఎప్పుడూ ఇలా అవలేదు. కానీ నేను నటించడం లేదు. నాకు ఈ ఫీలింగ్ తప్పని తెలిసినా సరే చేయాలనిపిస్తే చేసేస్తున్నా' అని చెప్తూ బాధపడింది సిరి. ఇంకోసారి ఇలా గాయపర్చుకుంటే బిగ్‌బాస్ హౌస్ నుంచి పంపించేస్తానని నాగ్ వార్నింగ్ ఇవ్వగా మరోసారి రిపీట్ చేయనని మాటిచ్చింది సిరి. గేమ్ కన్నా నా మీదే ఆసక్తి చూపిస్తోంది: మానస్ కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చిన షణ్ను.. మెంటల్లీ వీక్ అయిపోయాను. సిరి అలా తనను తాను గాయపర్చుకోవడానికి కారణం నేనే, అంటే తప్పు నాదే అని అంగీకరించాడు. ప్రేయసి దీప్తి సునయనను మిస్ అవుతున్నావా? అన్న ప్రశ్నకు అవునని తలూపాడు. అంతలా దీప్తిని మిస్ అవుతుంటే, ఇక్కడ ఉండలేకపోతే ఈ క్షణమే వెళ్లిపోమని గేట్లు తెరిచాడు నాగ్. పదేపదే ఇలా ట్రిప్ అవ్వకూడదని సూచించాడు. తర్వాత మానస్ కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చాడు. ప్రియాంక హౌస్‌లో ఎవరినీ నమ్మదని, ఎవరితోనూ ఎక్కువ క్లోజ్‌గా ఉండదన్నాడు. నన్ను మాత్రమే ఎక్కువగా నమ్ముతూ కొన్నిసార్లు గేమ్ కన్నా నామీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తుందని, అది తనకు ఇబ్బందిగా మారిందన్నాడు. యానీ, నీ ప్రవర్తన హద్దులు మీరుతోంది: నాగ్ మానస్ మాటలు విన్నాక నాగ్.. ప్రియాంక అతడి కోసం ఏడ్చేసిన వీడియో చూపించాడు. ఆమె ఫీలింగ్స్ ఎక్కడివరకు వెళ్తున్నాయో చూసుకోమన్నాడు. తను నొచ్చుకుంటుందని ఏమీ చెప్పకపోతే పరిస్థితులు చేదాటిపోతాయని హెచ్చరించాడు. కాజల్‌తో ప్రవర్తించిన తీరు బాగోలేదని యానీకి చురకలు అంటించాడు నాగ్. వెక్కిరించడం కొంతవరకే బాగుంటుందని, కానీ అది హద్దులు మీరుతోందని హెచ్చరించాడు. అయితే యానీ మాత్రం తనది చైల్డిష్ బిహేవియర్ అని, ఏదున్నా ముఖం మీదే చెప్తానంటూ ఏవేవో చెప్తూ చివరాఖరకు వెక్కిరించడం మానుకుంటానని హామీ ఇచ్చింది. అనంతరం శ్రీరామచంద్ర, సన్నీ సేఫ్ అయినట్లు ప్రకటించాడు నాగ్. -
హౌస్‌లో అవసరమా?.. దీప్తిని మిస్ అవుతే వెళ్లిపో
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్లకు బయట ప్రపంచంతో ఎటువంటి కనెక్షన్ ఉండదు. కొట్టుకున్నా, తిట్టుకున్నా, కలిసిపోయినా, కబుర్లు చెప్పుకున్నా అన్నీ వాళ్ల మధ్యే! ఇల్లు గుర్తురాకుండా ఎవరికి వారు బిగ్‌బాస్ హౌస్‌లో తమకు నచ్చిన వ్యక్తులతో బాండ్ ఏర్పరుచుకుంటారు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లోనూ ఇదే జరిగింది. ఒక్కొక్కరూ ఒక్కో వ్యక్తికి కనెక్ట్ అయ్యారు. అలా సిరి- షణ్ముఖ్ క్లోజ్ ఫ్రెండ్స్‌గా మారారు. కానీ కొన్నిసార్లు వారి చేష్టలు చూసిన నెటిజన్లు ఇది ఫ్రెండ్షిప్ కాదని, మరేదో అయ్యుంటుందని కామెంట్లు చేశారు. మొన్న షణ్ను.. తనను వెళ్లిపో.. అన్నందుకే సిరి ఏకంగా బాత్రూంలో దూరి తల బాదుకుని తనను తాను గాయపర్చుకుంది. ఈ చర్య అటు హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను సైతం షాక్‌కు గురి చేసింది. దీంతో వీళ్ల వ్యవహారమేంటో తేల్చుదామని డిసైడ్ అయ్యాడు నాగ్. నిన్ను నువ్వు ఎందుకు గాయపర్చుకున్నావు? అని సిరిని నిలదీశాడు. ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా? అని ప్రశ్నించాడు. ఏం జరుగుతుందో చెప్పమని అడిగాడు. దీనికి సిరి.. ఏం జరుగుతుందో తనకే క్లారిటీ లేదని చెప్తూ ఏడ్చేసింది. కోట్లమంది నిన్నుచూసి ఇలా ఉండాలని నేర్చుకోవాలి, అంతేకానీ అయ్యో ఇలా మాత్రం ఉండకూడదు అనుకోవద్దని చెప్తూ ఆమె పరువు తీశాడు. దీంతో ఓపెన్ అయిన సిరి.. షణ్నుతో ఎందుకు కనెక్షన్ వస్తుందో అర్థం కావట్లేదని వాపోయింది. ఇదే ప్రశ్న షణ్నుని అడగ్గా అతడు మానసికంగా వీక్ అయ్యానన్నాడు. తన ప్రేయసి దీప్తి సునయనను మిస్ అవుతున్నానని చెప్పాడు. అంతలా మిస్ అవుతే ఈ క్షణమే వెళ్లిపో అంటూ బిగ్‌బాస్ ఇంటి గేట్లు తెరిచాడు నాగ్. మరి షణ్ను.. సిరితో తన బంధాన్ని ఏమని నిర్వచిస్తాడు? వారి మనసులో జరుగుతున్న మానసిక సంఘర్షణకు నేటితోనైనా తెరపడుతుందా? అన్నది చూడాలి! -
సిరి-షణ్ను లిప్‌లాక్? నిజమేనా?
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ ఇంట్లో కెప్టెన్ కోసం వేట కొనసాగుతోంది. పదకొండో వారం కెప్టెన్ అయ్యేందుకు అందరూ హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇదిలా ఉంటే సిరి-షణ్ను, మానస్-పింకీలు మాత్రం అలకలు, బుజ్జగింపులతో బిజీగా ఉన్నారు. నిన్నటి(నవంబర్ 18) ఎపిసోడ్లో పింకీని దగ్గరకు రావద్దంటూ కోపగించుకున్నాడు మానస్. దీంతో పింకీ హర్ట్ అవగా తట్టుకోలేకపోయిన మానస్ ఆమెకు సారీ చెప్పి గొడవకు ఫుల్స్టాప్ పెట్టాడు. అటు షణ్ను- సిరి దేనికో గొడవపడి మాట్లాడుకోలేదు. ఇద్దరూ తమతమ లవర్స్‌ను గుర్తు చేసుకుని కాసేపు బాధపడ్డారు. షణ్ను.. తన తల్లి రాసిన లెటర్‌ను చదువుకుని కాస్త స్వాంతన పొందాడు. తర్వాత తన ప్రేయసి దీప్తి సునయన కానుకగా ఇచ్చిన రింగును తదేకంగా చూసుకుని ఏదో ఆలోచనల్లో మునిగిపోయాడు. అటు సిరి కూడా తనకు కాబోయే భర్త శ్రీహాన్ వేలికి తొడిగిన ఉంగరాన్ని తడుముకుని తనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. #BiggBossTelugu5 Did anyone observed #Siri LIPKISS to #Shannu That time blurr came. I thought internet issue and clicking on 10s back button to what happened But I after doing couple of times I realized it was blurred. Did anyone though like me and done... 😂 😂 — Sekhar Sharm🅰️🅰️ (@iamsekharsharma) November 18, 2021 ఇలా ఎంతసేపు మాట్లాడుకోకుండా ఉంటాం? అని భావించిన షణ్ను ఎప్పటిలాగే సిరికి సారీ చెప్పి ఆమెను అలకమంచం నుంచి దింపడానికి ప్రయత్నించాడు. ఇందుకోసం హగ్ కూడా ఇచ్చాడు. ఇప్పటికైనా మాట్లాడరా.. అన్నట్లుగా సైగ చేశాడు. దీంతో సిరి వెంటనే లేచి షణ్నును హత్తుకుంది. ఈ క్రమంలో ఆమె ముఖం షణ్ను ఫేస్‌కు దగ్గరగా వెళ్లడం, సరిగ్గా ఆ సమయంలో ఏం జరిగిందో అర్థం కాకుండా బ్లర్ అవడం జనాల్లో కొత్త సందేహాలకు తావిచ్చింది. Rey #shannu @entraidhii #appadamstarshannu #Siri akka entamma idhi.. No offence nibhas @Sreeram_singer ni minchi potunaru kadha ra.. Diniki coaching manode aiuntadu le 🤭🤣🤣 #BB5SensationVJSunny 🏹❤️ pic.twitter.com/JkpTd7xoxS — Raj Meesar (@Rajmeesar7) November 19, 2021 సిరి.. షణ్నుకు లిప్‌లాక్ ఇచ్చిందని కొందరు నెటిజన్లు వాదిస్తున్నారు. లిప్‌లాక్ ఇవ్వకపోతే హాట్‌స్టార్‌లో ఆ సీన్ ఎందుకు బ్లర్ అయిందని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరూ ఒకరి లైఫ్‌తో మరొకరు ఆడుకుంటున్నారంటున్నారు. షణ్నుకు లవర్ ఉన్నా, సిరికి ఆల్రెడీ నిశ్చితార్థం జరిగిపోయినా ఇలా హద్దులు దాటి ప్రవర్తించడం సముచితంగా లేదని విమర్శిస్తున్నారు. షణ్ను- సిరి అభిమానులు మాత్రం ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడటం మానేయండని, మీరంతా అనుకుంటున్నట్లు అక్కడేం జరగలేదని అంటున్నారు. మరి వీకెండ్లో నాగార్జున ఈ బ్లర్ సీన్ గురించి అడుగుతాడా? లేదా ? అన్నది చూడాలి! Idendayya idi... Idi nenu sudale.... Tattoolu chuskuntiri,ringulu tippukuntiri... Weekend lo oh my friend song peditiri Endi makee sendalam🤮🤮🤮 Nibbesh and nibbeswari.. #Siri and #Shannu What's this apashyamapam kirirkiri #BiggBossTelugu5 pic.twitter.com/rNVWA0hG5l — Vamc Krishna (@vamccrishnaa) November 18, 2021 #BiggBossTelugu5 Arey Entra Idi #shannu already Deepthi undi #siri already engaged Aina vellani chuste #vjsunny em cheppado prove aitundi Siri Gurunchi pic.twitter.com/36dBrRHDao — biggbosstelugu (@bigggbosstelugu) November 19, 2021 Edentra mati matiki hug istadi vellipotadi kiss istadi vellipotadi... Vatikosame alugutunda enti 😂😂 Bayataki pothe diniki vidakule 🤭😂#BiggBossTelugu5 #Siri — RRReddy...Tarak'$ Girl (@Reethu1318) November 18, 2021 -
ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కించుకున్న సన్నీ! కానీ వాడేది ఎవరికి?
Bigg Boss 5 Telugu Promo, Eviction Free Pass Task: బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ప్రవేశపెట్టాడు. ఇది గెల్చుకున్న కంటెస్టెంట్ ఈజీగా ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే వేరే ఎవరినైనా సేవ్ చేయవచ్చు. ఈ పాస్‌ను పొందడం కోసం బిగ్‌బాస్ నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో భాగంగా ఫైర్ అలారమ్ మోగినప్పుడు ఏ ఇద్దరు ట్రక్కులోకి వెళతారో వారు బర్నింగ్ హౌస్‌లో నుంచి ఒకరిని సేవ్ చేస్తూ మరొకరి ఫొటోను కాల్చేసే అధికారం పొందుతారు. అలా చివరి వరకు ఎవరి ఫొటో అయితే కాలకుండా ఉంటుందో ఆ కంటెస్టెంట్‌కు పాస్ దక్కుతుంది. అయితే తనకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కన్నా జనాల ఓటింగే ముఖ్యం అని బిగ్‌బాస్‌కు షాకిచ్చాడు షణ్ముఖ్. ప్రేక్షకుల వల్లే ఇక్కడిదాకా వచ్చానని, గెలుపైనా, ఓటమైనా వాళ్ల చేతుల్లో నుంచి తీసుకోవాలని ఉందని చెప్పింది సిరి. అంటే షణ్ను- సిరి తమకు ఈ పాస్ అక్కర్లేదని నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పేశారు. మొత్తానికి ఈ గేమ్‌లో సన్నీ గెలిచినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో లీకైంది. అదే నిజమైతే సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ఈ వారమే వాడతాడా? ఒకవేళ వాడితే తనకోసం వాడతాడా? ఇతరులను సేవ్ చేయడానికి ఉపయోగిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది! -
'బిగ్‌బాస్ హౌస్ లవర్స్ అడ్డాగా మారింది.. వీడియోలు ఉన్నాయి'
Actress Madhavi Latha Shocking Comments on Bigg Boss Telugu 5 Show: బుల్లితెరపై బిగ్‌బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టెలివిజన్ తెరపై టాప్ టీఆర్పీ రేటింగులతో దూసుకుపోతుంది ఈ షో. ఇక మిగతా భాషల్లో మాదిరిగానే తెలుగు బిగ్‌బాస్ షోలో సైతం లవ్ ట్రాక్‌లు కామనే. రీసెంట్గా షణ్నూ-సిరిల వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ బయట వేరేవాళ్లతో రిలేషన్ షిప్లో ఉన్నప్పటికీ హౌస్‌లో మాత్రం బాగా కనెక్ట్ అయిపోయారు. జెస్సీ వెళ్లిపోయాక వీరిద్దరి బంధం మరింత బలపడింది. ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిపోతున్నాం అంటూనే దూరంగా ఉండలేకపోతున్నారు. తాజాగా బిగ్‌బాస్ షోలో జరుగుతున్న పరిణామాలపై నటి మాధవీలత సోషల్ మీడియాలో వరుస కామెంట్లు చేస్తుంది. బిగ్‌బాస్ హౌస్ లవర్స్ అడ్డాగా మారిందని ఫైర్ అయ్యింది. 'బిగ్ బాస్‌లో రగులుతోంది మొగలిపొద సీన్స్ జరిగాయి..ఆ వీడియోలు, ఫోటోలు నా దగ్గరకు వచ్చాయి. కానీ వాటిని పబ్లిష్ చేయడం కల్చర్ కాదు' అంటూ మరో సంచలనానికి తెరదీసింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో మాధవీలత చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. టెలికాస్ట్ కాని కంటెంట్ ఉందంటే..హౌస్‌లో ఇంకెన్ని దారుణాలు జరుగుతున్నాయో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
లవర్స్‌ను తలుచుకుంటూనే హగ్గుల్లో మునిగిపోయిన సిరి-షణ్ను
Bigg Boss 5 Telugu, Episode 75: కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో రవికి సూపర్ పవర్ తీసుకునే ఛాన్స్ రాగా అతడు మాత్రం ఈ అవకాశాన్ని సన్నీకిస్తానన్నాడు. 25 బంగారు ముత్యాలు చెల్లించి ఈ పవర్‌ను పొందాలని సన్నీకి చెప్పాడు. అయితే సన్నీ మాత్రం తనకు ఏ పవర్ వద్దని మొండికేశాడు. రంగంలోకి దిగిన ఇంటిసభ్యులు అతడిని ఎలాగోలా ఒప్పించారు. ఇంతకీ పవరేంటంటే.. మైన్‌లోకి వెళ్లే హౌస్‌మేట్స్‌లో నుంచి ఒకరిని తొలగించి వారి స్థానంలో వెళ్లి ఆడాలి. ఎదుటివాళ్లను గ్రూప్ గేమ్ అని మందలించే రవి, శ్రీరామ్, యానీ కుమ్మక్కై గేమ్ ఆడారు. శ్రీరామ్ తన దగ్గరున్న ముత్యాలను యానీకి ఇద్దామని నిర్ణయించుకున్నాడు. అయితే దాన్నో దొంగతనంలా సీన్ క్రియేట్ చేశారు. అప్పటిదాకా దొంగతనం చేస్తే తప్పన్న రవి.. ఎందుకాలస్యం, వెంటనే వెళ్లి దొబ్బేయండి అని సూచించడం గమనార్హం. దీంతో యానీ... అందరిముందూ ఏదో దొంగతనం చేసినట్లుగా కవరింగ్ ఇస్త శ్రీరామ్ ముత్యాలు తీసేసుకుంది. సన్నీ ఏదో ఫ్రస్టేషన్లో ఉన్నాడని అర్థమైన కాజల్ అతడి వెంటే నడిచింది. నా తోకలాగా వెనకే వస్తున్నావేంటి? అని చిరాకుపడ్డాడు సన్నీ. దీంతో మిగతా హౌస్మేట్స్ ఆమెకిలా జరగాల్సిందే అన్నట్లుగా ఓ లుక్కిచ్చారు. అందరి ముందు తనను అవమానించాడని కాజల్ ఏడ్చేయగా సన్నీ సారీ చెప్పి ఆమెను ఓదార్చాడు. తనకిచ్చిన పవర్‌ను కూడా ఆమెకు ఇవ్వడానికి ప్రయత్నించాడు కానీ అది కుదరదని తేల్చాడు సంచాలకుడైన రవి. దీంతో అతడు తన పవర్నుపయోగించి శ్రీరామ్ స్థానంలో మైన్‌లోకి వెళ్లి అయిష్టంగా గేమ్ ఆడాడు. మొత్తంగా గేమ్ ముగిసేసరికి మానస్, ప్రియాంక, సిరి, యానీ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. కాజల్ బాధపడితేనే నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి, అలాంటిది ఆమె డిస్కనెక్టెడ్ అని ముఖం మీదే చెప్తే ఎలా ఉంటుందన్నాడు మానస్. అందుకే కాజల్‌తో మాట్లాడట్లేదని సన్నీతో చెప్పాడు. అటు ప్రియాంకతోనూ మాటలు బంద్ చేశాడు. మరోపక్క షణ్ముఖ్.. పదేపదే దీప్తి సునయనను గుర్తు చేసుకున్నాడు. అటు సిరి కూడా శ్రీహాన్‌ను గుర్తు చేసుకుంది. తర్వాత సిరి ఐ హేట్ యూ అంటూ లిప్‌స్టిక్‌తో పేపర్ మీద రాసిచ్చింది. ఫీలైన షణ్ను సారీ చెప్పి హగ్గిచ్చాడు. దీంతో సిరి కూడా అతడికి హగ్గిస్తూనే ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. మరోపక్క పింకీ.. తనను ఫ్రెండ్‌గా కాకపోయినా కనీసం మనిషిలా ట్రీట్ చేస్తే చాలంటూ మానస్‌ను వేడుకుంది. ఇదిలా వుటే ఈ వారం ప్రెస్టేజ్ 25 వేల గిఫ్ట్ వోచర్ యానీ సొంతమవగా ఆమె ఆనందంతో స్టెప్పులేసింది. తర్వాత ఇంటిసభ్యులతో కొన్ని క్షణాలు ఇంటికి అంకితం అనే సరదా టాస్క్ ఆడించాడు బిగ్‌బాస్. ఇందులో జంటలుగా విడిపోయిన హౌస్మేట్స్ ఓసారి బిగ్‌బాస్ హౌస్‌ను భూతద్దంలో చూసొచ్చి గేమ్ ఆడారు. ఫైనల్‌గా మాత్రం ఎక్కువ పాయింట్లతో యానీ మాస్టర్- శ్రీరామ్ జోడీ చెరో రూ.5000ల గిఫ్ట్ వోచర్ గెలుపొందింది. -
ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం, అందుకే షణ్ను అలా..: రవితో చెప్పేసిన సిరి
Bigg Boss Telugu, Episode 74: కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో మానస్ తనకు దక్కిన గొడ్డలిని సన్నీకిచ్చిన విషయం తెలిసిందే!దీంతో సన్నీని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడికో స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఒకరి నుంచి సగం బంగారు ముత్యాలను తీసుకుని ఇంకొకరికి ఇవ్వాలని చెప్పాడు. దీంతో సన్నీ.. సిరి దగ్గర నుంచి గోల్డ్‌ను షణ్ముఖ్‌కు ఇచ్చాడు. మొదటి రౌండ్లో ఎక్కువ బంగారం సంపాదించిన ప్రియాంక, మానస్‌లకు బెలూన్ టాస్క్ ఇవ్వగా అందులో పింకీ గెలిచింది. ఇద్దరం ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యామని, అందుకే షణ్ను ట్రిప్ అవుతున్నాడని పేర్కొంది సిరి. మీరిద్దరూ ఒకరినొకరు బాగా సీరియస్‌గా తీసుకుంటున్నారని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు రవి. 'కానీ నీ విషయంలో అతడు ఎందుకంత ట్రిప్ అవుతున్నాడు? నీ విషయంలోనే ఎందుకు ట్రిప్ అవుతున్నాడో ఆలోచించు, నీకు అర్థమవుతుందనుకుంటా, మీరే ఆలోచించుకోండి' అని హితవు పలికాడు. తర్వాత శ్రీరామచంద్రకు ఓ పవర్ వచ్చింది. అయితే అది అతడికి అనుకూలంగా రాలేదు. 30 బంగారు ముత్యాలను ఇవ్వాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. తన దగ్గర ఒక్క ముత్యం కూడా లేకపోవడంతో పథకం రచించిన శ్రీరామ్ తనకో పవర్ వచ్చిందంటూ రవి ముత్యాలను సొంతం చేసుకున్నాడు. చివర్లో మాత్రం ఈ స్పెషల్ పవర్ నాకు రాలేదంటూ బాంబు పేల్చడం గమనార్హం. రెండో రౌండ్లో సన్నీ, సిరి బంగారం వెతుకులాటలో టాప్‌లో ఉన్నారు. వీళ్లిద్దరిలో ఒకరు కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశాన్ని కల్పించాడు బిగ్‌బాస్. అయితే సిరి తరపున వేరొకరు ఛాలెంజ్‌లో పాల్గొనాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో సిరి తనకోసం మానస్ పోటీపడతాడని చెప్పింది. అలా సన్నీని ఓడించేందుకు రంగంలోకి దిగాడు మానస్. తాను గెలిచి సిరిని కెప్టెన్సీ కంటెండర్‌ను చేశాడు. అయితే ఈ గేమ్ నియమనిబంధనలు తనకు ముందే సరిగా చెప్పలేదంటూ సంచాలకుడైన రవి మీద ఫైర్ అయ్యాడు సన్నీ. అలాగే తన స్నేహితులు మానస్, కాజల్ మీద కూడా చిందులు తొక్కాడు. ఉప్పొంగుకొస్తున్న తన కోపాన్ని తగ్గించుకునేందుకు సన్నీ స్విమ్మింగ్ పూల్‌లో దూకాడు. ఇది హౌస్‌లో నుంచి యానీ మాస్టర్ చూడగా సన్నీ మూగబాషలో సంభాషించాడు. ఈ ఒత్తిడి నా వల్ల కాదన్నట్లు ఫేస్ పెడుతూ సూసైడ్ చేసుకుంటున్నట్లుగా చేతితో గన్ పేల్చుకుని నీళ్లలో పడిపోయాడు. -
సిరి, నేను ఇద్దరం రిలేషన్లో! డిస్టర్బ్ అవుతున్నా: షణ్ముఖ్
Bigg Boss 5 Telugu, Episode 73: నామినేషన్స్ నుంచి అంత ఈజీగా బయటకు రాలేకపోయారు హౌస్మేట్స్. కాజల్ అయితే.. సిరికి నేనంటే ఇష్టం లేదు, అఫెక్షన్ లేదంటూ బోరుమని ఏడ్చేసింది. ఇది చూసిన యానీ అదంతా డ్రామా, స్ట్రాటజీ అని పెదవి విరిచింది. పైగా తన కోసమే ఏడుస్తుందేమోనని ఫీలైన యానీ.. ఆమె దొంగ ఏడుపులు నమ్మనని, తాను మాత్రం ఆమె దగ్గరకు వెళ్లేదే లేదని భీష్మించుకు కూర్చుంది. తర్వాత ప్రియాంక వంతు రాగా.. తను మానస్ గేమ్ ఆడుతున్నానని సిరి ఎలా అంటుందని చిర్రుబుర్రులాడింది. ఈ క్రమంలో మనసులోని మాటను బయటపెట్టింది. ట్రాన్స్‌జెండర్‌గా నేను అతడిని ప్రేమిస్తున్నాను, కానీ అదిక్కడ సెట్ కాదు. నా గేమ్ నేను ఆడట్లేదని సిరి ఎలా అంటుంది? అని ఆవేశపడింది. ఇక ఈ వారం బయటకు వెళ్లిపోతానని ఫిక్సైన కాజల్.. తన ఫ్రెండ్స్‌తో జ్ఞాపకాలను కూడబెట్టుకోవాలనుకుంది. మరోపక్క బాగా దిష్టి తగలడం వల్లే దిష్టితాడు తెగిపోయిందని అభిప్రాయపడింది సిరి. ఈసారి అది తెగిపోకుండా గట్టిగా ముడివేసి దానికి తన రక్తపు బొట్టును పెట్టి మరీ షణ్ముఖ్ చేతికి కట్టింది. అయితే కావాలని గుచ్చుకున్నావా? లేదంటే అనుకోకుండా తగిలిందా? అని షణ్ను అడగ్గా అనుకోకుండానే కట్ అయి రక్తం వచ్చిందనని చెప్పింది సిరి. ఎప్పటిలాగే సిరి- షణ్ను మరోసారి గొడవపడ్డారు. నీ ముఖం చూస్తేనే చిరాకుగా ఉందని, ఇక్కడి నుంచి వెళ్లిపో అనడంతో షణ్ను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ గొడవతో ఏడ్చేసిన సిరి.. సన్నీ నామినేషన్స్‌ను ఇమిటేట్ చేస్తుంటే నవ్వేసింది. దీంతో షణ్ను.. దీన్నే డబుల్ ఫేస్ అంటారని, నా దగ్గర ఇలా ఉండకు, నన్ను మర్చిపో అని వార్నింగ్ ఇచ్చాడు. నువ్వున్నా నాకు ఫరాఖ్ పడలేదన్నాడు. మాటలు అయితే అన్నాడు కానీ పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. బాత్రూమ్లోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చేశాడు. దీంతో సిరి అతడిని ఓదార్చేందుకు ప్రయత్నించింది. నువ్వే మాటలు అంటావు, మళ్లీ నువ్వే బాధపడాతవేంటని అడిగింది. దీంతో షణ్ను.. నేను ఏడ్వడం వల్ల నువ్వేం తక్కువైపోవు, నా క్యారెక్టరే తప్పు, వెళ్లిపో అని గట్టిగా గద్దించాడు. నాకు దీపు చాలా గుర్తొస్తుంది, ఒంటరిగా అనిపిస్తోంది. తనుంటే బాగుండేది అంటూ ప్రేయసి దీప్తి సునయనను గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నాడు షణ్ను. అస్సలు ఉండాలని లేదని, నీ ఫ్రెండ్షిప్, నువ్వు ఏదీ వద్దని అన్నాడు. నాకు నువ్వు అక్కర్లేదు, వెళ్లిపో అనడంతో సిరి ఏడ్చుకుంటూ బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుని తల గోడకేసి కొట్టుకుంది. దీంతో హడలిపోయిన షణ్ను.. తల బాదుకోకు, డోర్ తీయంటూ వేడుకున్నాడు. కంగారుపడిపోయిన కంటెస్టెంట్లు బాత్రూందగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. రవి డోర్ బాదడంతో ఏడుస్తూనే గడియ తీసింది. వెంటనే షణ్ను ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు 'మీ ఇల్లు బంగారం కాను' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బజర్ మోగినప్పుడు ముందుగా మైనర్ హ్యాట్లను పట్టుకున్నవారికి గోల్డ్ మైన్‌లో నుంచి వీలైనంత ఎక్కువ బంగారం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కంటెస్టెంట్లు బంగారం వెతుకులాటలో పడిపోయారు. మధ్యలో మెరుపుల శబ్ధం వచ్చినప్పుడు మానస్ పవర్ రూమ్ యాక్సెస్ పొందగా అతడి ఎదుటు ఉన్న గొడ్డలిని సన్నీకిచ్చాడు. దీని పవర్ ఏంటనేది బిగ్‌బాస్ సరైన సమయం వచ్చినప్పుడు చెప్తాడని తెలిపాడు. ఇక సిరి ఒకరితో రిలేషన్, నేనొకరితో రిలేషన్లో ఉన్నాం.. కానీ హౌస్‌లో మేమిద్దరం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం.. అదే నాకు సమస్యగా మారింది. మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతున్నానని మనసులోని బాధను శ్రీరామ్‌తో పంచుకున్నాడు షణ్ముఖ్. -
నాకు నువ్వు అక్కర్లేదు, నేను ఒంటరివాడిని: ఏడ్చేసిన షణ్ను
Bigg Boss Telugu 5, Shanmukh Jaswanth Feels Alone: గొడవపడటం, తిరిగి కలిసిపోవడం కామన్.. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో కూడా కంటెస్టెంట్లు టాప్ లేచిపోయేలా అరుచుకుంటారు, ఆ తర్వాత తిరిగి కలిసిపోతారు. కానీ ఆ గొడవలను మాత్రం చాలామటుకు మనుసులోనే పెట్టుకుని నామినేషన్స్ సమయంలో దాన్ని బయటకు తీస్తుంటారు. ఇది బిగ్‌బాస్ హౌస్‌లో సర్వసాధారణమైపోయింది. తాజాగా సిరి, షణ్ముఖ్ వాదులాడుకుంటున్నట్లు ప్రోమో వదిలారు. ఏ విషయానికో బాగా హర్టయిన షణ్ను ఒంటరిగా కూర్చుని ఏడ్చేశాడు. అతడిని అలా చూడలేకపోయిన సిరి షణ్నును ఓదార్చాలనుకుంది. కానీ అతడు మాత్రం 'నేను ఏడ్వటం వల్ల నువ్వేం తక్కువైపోవు, నేనే తక్కువవుతాను, నువ్వు పైకి వెళ్తావు. నా దగ్గరకు రాకు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో' అని చెప్పాడు. ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తోందని, నువ్వు నాకొద్దంటూ ముఖం మీదే చెప్పాడు. దీంతో సిరి ఏడ్చుకుంటూ బాత్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. షణ్ను బతిమాలినా సిరి గడియ తీయలేదు. కంగారుపడ్డ హౌస్మేట్స్ పరుగెత్తుకుంటూ వెళ్లి సిరిని డోర్ తీయమని బతిమాలడంతో చివరలో డోర్ తెరుచుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ సిరి, షణ్నుకు మధ్య ఏం జరిగింది? ఈ గొడవకు ఎవరు కారణం? షణ్ను ఎందుకు ఒంటరిగా ఫీలవుతున్నాడు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
నిన్ను వాడుకుంటున్నారు, జాగ్రత్త: జెస్సీ హెచ్చరిక
Bigg Boss 5 Telugu, 10th Week Jessie Eliminated: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో! అదృష్టం బాగుండి నామినేషన్లో లేకపోయినా అనారోగ్యం వెంటాడటంతో జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి తప్పుకోక తప్పలేదు. సీక్రెట్ రూమ్‌లో పెడితే తనను తిరిగి హౌస్‌లోకి పంపిస్తారేమోనని వేయి కళ్లతో ఎదురు చూసిన జెస్సీ ఆశలు అడియాశలే అయ్యాయి. బిగ్‌బాస్ హౌస్‌లో నీ జర్నీ పూర్తైందని పంపించివేశారు. అయితే వెళ్లిపోయేముందు జెస్సీ కంటెస్టెంట్లకు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చాడు. ల్యాండ్‌ఫోన్ ద్వారా ఒక్కొక్కరితో పర్సనల్‌గా మాట్లాడే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. ముందుగా జెస్సీ.. సన్నీతో మాట్లాడుతూ.. 'జాగ్రత్తగా ఉండు, టెంపర్ లూజ్ అవకు. ఒక్కడిగా గేమ్ ఆడితే ఇండివిడ్యువల్ హీరో అవుతావు, లేదంటే కమెడియన్ అవుతావు' అని ఒకరకంగా వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత మానస్‌తో మాట్లాడుతూ.. 'నువ్వు సైలెంట్ కిల్లర్. రవికే బాబువి నువ్వు, ఒప్పుకోవు కానీ ఇదే నిజం. నీ ఐడియాస్ బాగున్నాయ్ కానీ అందరినీ నెగెటివ్‌గా చూడకు' అని సూచించాడు. కాజల్‌తో.. 'నీ గేమ్ ఏమైంది? నువ్వు పక్కవాళ్లను హైలైట్ చేయడానికి రాలేదు. నీ ఫ్రెండ్స్ నీకు వాల్యూ ఇస్తున్నారనుకుంటున్నావు, కానీ ఇవ్వట్లేదు. నిన్ను వాడుకుంటున్నారు అది తెలుసుకో' అని హెచ్చరించాడు. యానీ మాస్టర్ గేమ్ బాగుందన్న జెస్సీ ప్రియాంక సింగ్‌ను త్యాగాలు ఆపేయమని హితవు పలికాడు. నీ గేమ్ ఇదేనా? అని నిలదీశాడు. 'తర్వాత సీజన్లో వచ్చేవాళ్లు నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి, అంతేకానీ అబ్బో, అది 10 వారాలు ఎలా ఉంది? అని చులకనచేయొద్దు' అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. దేనిలో ఇన్వాల్వ్ అవని శ్రీరామ్ టాప్ 5లో ఉంటాడని అభిప్రాయపడ్డాడు. రవితో ఫోన్లో ముచ్చటిస్తూ.. ఇన్ఫ్లూయెన్స్ చేసినా కానీ నీ గేమ్ బాగుంటుంది. ఫైనల్లో కలుస్తానని చెప్పాడు. తర్వాత సిరితో మాట్లాడుతూనే తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఒక పక్క తంతానంటూనే మరోపక్క నీ ఫైటింగ్ బాగుందని మెచ్చుకున్నాడు. కానీ నీ గేమ్ నువ్వు ఆడమని హెచ్చరించాడు. తర్వాత కిస్సులు లేవా? అని అడడగడంతో గాల్లోనే ముద్దులు పంపింది సిరి. చివర్లో వచ్చేవారమే బయటకు వచ్చేయకు, ఫైనల్‌దాకా అక్కడే ఉండమని చెప్పాడు. షణ్ముఖ్‌తో మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు జెస్సీ. 'హౌస్‌లో ఉన్న చివరి రోజుల్లో నీతో ఉండలేకపోయానన్నదే నా బాధ. నేను ఎప్పటికీ నీ సీక్రెట్ ఫ్రెండ్‌నే' అన్నాడు. ఇక షణ్ను మాట్లాడుతూ.. 'నువ్వు ఫస్ట్ వీక్‌లోనే వెళ్లిపోతావనుకున్నారు, కానీ పదో వారంలో ఒకరికి లైఫ్ ఇచ్చి వెళ్లిపోతున్నావ్.. అదిరా నా జెస్సీ' అని పొగిడేయడంతో అందరూ చప్పట్లు కొట్టారు. ఈ ఫోన్ సంభాషణల్లో జెస్సీ.. సిరి, షణ్ను, శ్రీరామ్, రవి టాప్ 5లో ఉంటారని చెప్పకనే చెప్పాడు. తర్వాత జెస్సీ భారమైన హృదయంతో అందరి దగ్గరా వీడ్కోలు తీసుకున్నాడు. -
బ్యాడ్ బిహేవియర్, సన్నీని దోషిగా తేల్చిన నాగ్
Bigg Boss Telugu 5, Episode 70: సన్నీ నోటికొచ్చినట్లు వాగాడంటూ సిరి.. షణ్నును పట్టుకుని ఏడ్చేసింది. ఓ పక్క అతడి మీదున్న కోపాన్ని బయటకు కక్కుతూనే మరోపక్క షణ్నుకు హగ్గులిస్తూ ఐ లవ్యూ చెప్పింది. కాజల్ పేరు తీస్తేనే బుసలు కొడుతున్న యానీ బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నంతవరకు ఆమెతో మాట్లాడనని, ముఖం కూడా చూడనని భీష్మించుకు కూర్చుంది. అటు మానస్ కూడా పింకీ ప్రవర్తనలో ఏదో తేడా కొడుతోందని ఆమెను కట్ చేయాలని చూస్తున్నాడు. కంటెస్టెంట్లు పలుచబడే కొద్దీ కంటెస్టెంట్ల మధ్య వైరాలు పెరుగుతున్నాయి. తర్వాత ఓ టాస్క్‌లో ప్రియాంక గెలిచి రామ్‌చరణ్ ఆటోగ్రాఫ్ అందుకుని మురిసిపోయింది. సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీ తన శరీరం లావైతున్నట్లుగా, ఎవరో బాడీని పట్టుకున్నట్లుగా ఉందని, చూపు షేక్ అవుతుందని చెప్పుకొచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు జెస్సీకి మరింత మెరుగైన చికిత్స అవసరమని అభిప్రాయపడ్డారు. భీమ్లా నాయక్ పాటతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇంటిసభ్యులతో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు. మొదటగా యానీ.. కాజల్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. నాగ్ ముందే నాగిణి డ్యాన్స్ చేస్తూ ఆమెను వెక్కిరించింది. అయినప్పటికీ మెజారిటీ కంటెస్టెంట్లు యానీకే సపోర్ట్ చేశారు. తర్వాత రవి.. వెరీ బ్యాడ్ బిహేవియర్, లూజ్ టంగ్ అంటూ సన్నీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. తంతా, అప్పడం చేసి అమ్మేస్తా అన్నాడని రవి చెప్పడంతో తాను అనలేదని బుకాయించాడు సన్నీ. దీంతో నాగ్ వీడియో ప్లే చేశాడు. సన్నీ మొదట తంతానన్నాడని, కానీ ఎవరిని అనడంతో టవర్‌ను తంతానని కవర్ చేశాడని నాగ్ చెప్పడంతో అతడి పరువు పోయినట్లైంది. అయితే సన్నీ మాత్రం తాను బ్రిక్స్నే తంతానన్నానని మరీమరీ చెప్పాడు. అమ్ముతానని సిరిని అన్నావంటూ మరో వీడియో చూపించాడు నాగ్. సన్నీ తరపున వాదించిన కాజల్ అతడు సిరిని అమ్ముతానని అనలేదని బల్లగుద్ది చెప్పింది. తర్వాత సన్నీ.. సిరిని బోనులో నిలబెట్టి ఎఫైఆర్ ఫైల్ చేశాడు. కానీ మానస్, కాజల్ తప్ప అందరూ సిరిని నిర్దోషి అని పేర్కొన్నారు. మానస్.. యానీ మాస్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ అది వీగిపోయింది. శ్రీరామచంద్ర.. ప్రియాంకను బోనులో పెట్టాడు. ఎన్ని పాటలు పాడినా 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేదని ఆరోపించాడు. శ్రీరామ్ ముందుగానే ఫ్లాట్ అయిపోయి పాట పాడితే నాది తప్పా? అని రాగాలు తీసింది. హౌస్మేట్స్ సగం మంది తనను గిల్టీ, మిగతావాళ్లు గిల్టీ కాదని చెప్పారు. మానస్ గట్టిగా అరవడం నచ్చలేదని అతడిని ప్రియాంక బోనులో పెట్టింది. అయితే హౌస్మేట్స్ మానస్‌ను నిర్దోషిగా తేల్చారు. తర్వాత కాజల్.. యానీ తనను వెక్కిరిస్తుందంటూ బోనులో నిలబెట్టింది. అయితే ఆమె వెక్కిరించలేదని, అది తన బాడీ లాంగ్వేజ్ అని సిరి వాదించింది. మెజారిటీ కంటెస్టెంట్లు సిరి వాదనతో ఏకీభవించడం విశేషం. తర్వాత షణ్ను.. నేను ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడతాననడం, నన్ను యూట్యూబ్ వరకే అని చెప్పడం నచ్చలేదంటూ సన్నీని బోనులో నిలబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్లే చేసి చూపించగా రవి, శ్రీరామ్, సిరి, యానీ.. అతడు షణ్నును యూట్యూబ్ వరకే అన్నాడని చెప్పగా మిగిలిన ముగ్గురు షణ్నును అనలేదని, కామెంట్లు యూట్యూబ్ వరకే అని చెప్పాడని వివరించే ప్రయత్నం చేశారు. కానీ మెజారిటీ కంటెస్టెంట్లు షణ్నును సమర్థించారు. అందరూ మధ్యలో రావడం వల్లే గొడవలు వస్తున్నాయని కాజల్ ఉన్నమాట చెప్పింది. సిరి సన్నీ గొడవ పడుతుంటే షణ్ను మధ్యలోకి రావడం వల్లే గొడవ పెద్దదైందని తెలిపింది. అయితే నాగ్ మాత్రం కాజల్.. యానీకి గిలిగింతలు పెట్టడం వల్లే అసలు గొడవ మొదలైందన్నాడు నాగ్. మొత్తంగా సన్నీ మెడలో గిల్టీ బోర్డు వేలాడదీశారు. తర్వాత సన్నీ సేవ్ అయినట్లు వెల్లడించాడు నాగ్. -
షణ్ను-సిరి ప్యాకేజీ, సిరి ఎలిమినేట్ అయితే షణ్నూ కూడా..!
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ హౌస్ కోపావేశాలతో అట్టుడుకిపోతోంది. కెప్టెన్సీ టాస్క్‌లో సిరి.. సన్నీ గేమ్‌ను ఆడటానికి ప్రయత్నించడం, దీంతో అతడు నోరు జారడం, ఇది సహించలేకపోయిన షణ్ను మధ్యలోకి దూరడంతో ఈ గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. సిరి, సన్నీ గొడవ పడుతుంటే మధ్యలో షణ్ను ఎందుకు జోక్యం చేసుకున్నాడని కొందరు విమర్శిస్తుంటే, సిరి కోసం స్నేహితుడిగా షణ్ను స్టాండ్ తీసుకోవడంలో తప్పు లేదంటున్నారు మరికొందరు. అయితే ఇద్దరు వాదులాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి కలగజేసుకోవడం తప్పని షణ్ను మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 'ఇంకోసారి సన్నీ వచ్చి తనకు కాజల్‌తో, మానస్‌తో, పింకీతో ఉన్న ఇష్యూల గురించి నాతో మాట్లాడితే.. వాళ్లు ఎలిమినేట్ అయినప్పుడు నువ్వు కూడా ఎలిమినేట్ అవ్వమని చెప్తాను. నెక్స్ట్సారి ఇలా మాట్లాడితే మాత్రం.. వాళ్లు ఎలిమినేట్ అయినప్పుడు వీళ్లను కూడా పంపించేయండి సర్.. వీళ్లిద్దరూ ప్యాకేజీ, కలిసి వచ్చారు అని నాగ్ సర్‌కు చెప్తాను. ఎంత ఇరిటేషన్ వస్తుందంటే.... హౌస్‌లో 19 మంది ఉన్నప్పుడు వేరు, 15 మంది ఉన్నప్పుడు వేరు, 10 మంది ఉన్నప్పుడు కూడా ఇంకా నీది నువ్వు మాట్లాడకుండా పక్కనవాళ్లది ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాదు. నేనసలు ఎప్పుడైనా నీ(సిరి) గొడవలో ఇన్వాల్ అవుతానా? ' అని సిరితో సంభాషించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Big Boss Telugu Season 5 (@bigbosstelugu5.adda) షణ్ను అడిగిన ప్రశ్నకు సిరి స్పందిస్తూ.. నువ్వు నా గొడవలో జోక్యం చేసుకోవని చెప్పింది. అలాగే షణ్నుకు ఇతర హౌస్‌మేట్స్‌తో గొడవైనప్పుడు తాను కూడా కలగజేసుకోలేదని బదులిచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆయన రూల్స్ పెడతారు కానీ ఫాలో అవరని షణ్నూని విమర్శిస్తున్నారు. 'అంటే సరి-సన్నీ గొడవలో షణ్ను మధ్యలోకి వచ్చాడు కాబట్టి షణ్ను, సిరి ప్యాకేజీ అన్నమాట! సిరి ఎలిమినేట్ అయినప్పుడు షణ్నుని కూడా ఎలిమినేట్ చేయాలి' అని చెప్తున్నారు. వీళ్లిద్దరూ ప్యాకేజీ అని సరయూ మొదట్లోనే చెప్పింది, కానీ మనమే పట్టించుకోలేదని కామెంట్లు చేస్తున్నారు. -
సన్నీకి శివజ్యోతి చురకలు, నువ్వు నీతులు చెప్పకంటున్న నెటిజన్లు
Bigg Boss 5 Telugu, Trolling On Shiva Jyothi: కెప్టెన్సీ టాస్క్‌లో మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానలా మారిన విషయం తెలిసిందే! సిరి, షణ్ను- సన్నీ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతున్నావ్ అన్న సన్నీ వ్యాఖ్యలను షణ్ను ప్రేయసి దీప్తి సునయన తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే! సపోర్ట్‌గా నిల్చుంటే ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని గేమ్ ఆడినట్లా? అని మండిపడింది. మరి నీకు కాజల్ సపోర్ట్ చేసినప్పుడు ఏమైంది? అని ప్రశ్నించింది. యూట్యూబ్ వరకే గుర్తుపెట్టుకో? అని సన్నీ హెచ్చరించడాన్ని సైతం తప్పుపట్టింది. ఎంతో కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చాడని సంతోషించకుండా ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటం తప్పని హితవు పలికింది. తాజాగా మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి కూడా షణ్నూకు మద్దతుగా నిలబడింది. దీప్తి సునయన ఇన్స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేస్తూ.. 'ఆడవాళ్లని అడ్డం పెట్టుకుని ఆడటం అంటే? ఒకసారి మీరు కెప్టెన్ అవడానికి యానీ మాస్టర్ సపోర్ట్ చేశారు. ఇది లేడీ కార్డ్ వాడటం కాదా? గుర్తు తెచ్చుకోండి. హౌస్ బయట కాదు, హౌస్ లోపల హెల్తీ గేమ్ ఆడండి, మీరు మీ ఫ్రెండ్స్‌తో గేమ్ ఆడొచ్చు, మీ ఫ్రెండ్ మిమ్మల్ని సేవ్ చేయకపోతే అలగొచ్చు, ఏంటో మరి..' అని సన్నీకి చురకలు అంటించింది. అయితే సన్నీ ఫ్యాన్స్ శివజ్యోతి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'షణ్ను సిరి క్యారెక్టర్ గురించి మాట్లాడటంలో తప్పు లేదు, సిరి సన్నీ క్యారెక్టర్‌ను బ్యాడ్ చేయడంలో తప్పు లేదు, దీనికి షణ్ను సపోర్ట్ చేయడంలో అస్సలు తప్పు లేదు కదూ. మీరు కేవలం కొన్ని పాయింట్లే పట్టుకుని వేలాడకండి, అన్నింటి గురించి మాట్లాడండి. ఇలా పక్షపాతం చూపిస్తారనుకోలేదు, ఏంటో మరి' అని సెటైర్లు వేస్తున్నారు. షోని షోలాగే చూడండి, క్యారెక్టర్ జడ్జ్ చేయొద్దు అని నీతులు చెప్తూ వీడియోలు పెట్టారు, మరిప్పుడు మీరు చేస్తుందేంటి? అని నిలదీస్తున్నారు. 'నువ్వు బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్నప్పుడు గేమే ఆడలేదు, ఊరికే ఏడ్వడం తప్ప! అలాంటిది మీరు గేమ్ గురించి మాట్లాడుతున్నారు' అని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే ఇంకోసారి సన్నీని ఏమైనా అంటే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇస్తున్నారు. -
షణ్నూపై యాంకర్ ప్రశాంతి షాకింగ్ కామెంట్స్
Bigg Boss Telugu 5: Anchor Prashanthi Shocking Comments On Shanmukh: బుల్లితెరపై యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతి ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తుంది. ఓ ప్రముఖ ఛానల్లో గృహలక్ష్మీ అనే సీరియల్లో లాస్యగా నెగిటివ్ రోల్‌తో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ప్రశాంతి తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా ఆమె ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ప్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.చదవండి: సన్నీని ఏకిపారేసిన దీప్తి సునయన.. స్ట్రాంగ్ కౌంటర్ ఈ క్రమంలో బిగ్‌బాస్ రియాలిటీ షో గురించి ప్రశ్నించగా.. సీజన్-5లో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ తనకు తెలుసని వారందరికి తన సపోర్ట్ ఉంటుందని తెలిపింది. 'హౌస్‌లో పెర్ఫార్మెన్స్ బాగున్న వాళ్లకు ఓట్లు వేసి గెలిపించండి.. అంతేకానీ.. గేట్ ఆడకుండా కూర్చునే వాళ్లకి బయట ఫాలోయింగ్ చూసి ఓట్లు వేయక్యండి' అంటూ పరోక్షంగా యూట్యూబర్ షణ్ముక్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేసింది. కాగా షార్ట్ వీడియోలు, వెబ్‌సిరీస్‌లతో యూట్యూబ్ స్టార్‌గా పాపులర్ అయిన షణ్నూ గేమ్ ఆడటంతో మిగతా వాళ్లతో పోలిస్తే అంత యాక్టివ్‌గా లేడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: డిసెంబర్లోనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన కత్రినా! తనకంటే చిన్నవాడితో డేటింగ్.. ఓపెన్ అప్ అయిన రష్మిక