Bigg Boss Telugu 5: సన్నీ విన్నర్‌! టాప్‌ 5లో అమ్మాయిలకు నో ఛాన్స్‌!

Bigg Boss 5 Telugu: Contestants Family Declares Top 5 Contestants - Sakshi

Bigg Boss Telugu 5, Episode 84: కింగ్‌ నాగార్జున హౌస్‌మేట్స్‌ కోసం సర్‌ప్రైజ్‌ పట్టుకొచ్చాడు. కంటెస్టెంట్ల కోసం మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ స్టేజీపైకి వస్తారని చెప్పాడు. కానీ వాళ్లు మిమ్మల్ని కలవాలంటే మీకు బాగా నచ్చిన వస్తువులను త్యాగం చేయాలని మెలిక పెట్టాడు. అయినవాళ్లను చూడటం కన్నా విలువైనది ఏముంటుందనుకున్న హౌస్‌మేట్స్‌ అందుకు ఓకే అనేశారు.

మొదటగా యాంకర్‌ రవి పాప బొమ్మను త్యాగం చేయడంతో అతడి తల్లి ఉమాదేవి స్టేజీపైకి వచ్చింది. ఫ్యామిలీ అంతా నిన్ను చూసి గర్వపడుతుందని నువ్వు బిగ్‌బాస్‌ హౌస్‌కు రాజువని మెచ్చుకుంది. రవి కోసం బిగ్‌బాస్‌ తొలి సీజన్‌ విన్నర్‌ శివబాలాజీ కూడా షోకి విచ్చేశాడు. హౌస్‌లో ఎవరికి సపోర్ట్‌ చేయొద్దని, నీకు చెప్పాలనిపించిన పాయింట్‌ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరాడు. అనంతరం ఉమావేవి.. రవి, సన్నీ, శ్రీరామ్‌, షణ్ముఖ్‌, మానస్‌లు వరుసగా టాప్‌ 5లో ఉంటారని చెప్పుకొచ్చింది.

తర్వాత పింకీ మేకప్‌ కిట్‌ త్యాగం చేయగా ఆమెకోసం హాస్యనటులు సాయి, అప్పారావు వచ్చారు. వీరు ప్రియాంకను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, శ్రీరామ్‌, రవి, మానస్‌లను టాప్‌ 5లో ఉంచారు. ఈ సందర్భంగా పింకీ మాట్లాడుతూ.. 'నన్ను కన్నడ నుంచి తెలుగుకి తీసుకువచ్చి కామెడీ షో చేయించారు.. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరే కారణం' అంటూ అప్పారావుకు కృతజ్ఞతలు తెలిపింది. సన్నీ తనకు ఫ్రెండ్స్‌ ఇచ్చిన స్పెషల్‌ గిఫ్ట్‌ను త్యాగం చేయగా ఇద్దరు ఫ్రెండ్స్‌ నిఖిల్‌, వెంకట్‌ స్టేజీపై సందడి చేశారు. కప్పు ముఖ్యం బిగిలూ అంటూనే బోర్డు మీద సన్నీని విన్నర్‌ స్థానంలో ఉంచారు. షణ్ముఖ్‌, మానస్‌, శ్రీరామచంద్ర, కాజల్‌ను తర్వాతి నాలుగు స్థానాల్లో ఉంచారు.

మానస్‌.. తల్లి పంపిన బ్రేస్‌లెట్‌ను త్యాగం చేయగా అతడి కంటే ఎక్కువగా పింకీ బాధపడిపోయింది. తర్వాత మానస్‌ తండ్రి వెంకట్‌రావు, ఫ్రెండ్‌ అమర్‌దీప్‌ వచ్చాడు. ఏమీ లేనివాడిని తీసుకొచ్చి అన్నీ ఉన్నవాడిలా చేశాడు, నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే మానస్‌ వల్లేనంటూ అతడిని పొగిడేశాడు. అనంతరం మానస్‌ను ఫస్ట్‌ ప్లేస్‌లో సన్నీ, కాజల్‌, శ్రీరామ్‌, షణ్ముఖ్‌ను మిగిలిన నాలుగు స్థానాల్లో పెట్టారు.

కాజల్‌ ఎంతగానో ఇష్టపడే బొమ్మను త్యాగాల పెట్టెలో పడేసింది. ఆమెను కలవడానికి సోదరితో పాటు, సింగర్‌ లిప్సిక కూడా వచ్చారు. వీళ్లు కాజల్‌ను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, షణ్ను, శ్రీరామచంద్ర, మానస్‌ను తర్వాతి స్థానాల్లో పెట్టారు. అనంతరం శ్రీరామ్‌.. హమీదా ఇచ్చిన కానుకను త్యాగం చేయగా అతడి కోసం తల్లి, స్నేహితురాలు వచ్చారు. వీళ్లు శ్రీరామ్‌, రవి, ప్రియాంక సింగ్‌, సన్నీ, షణ్ముఖ్‌లు వరుసగా టాప్‌ 5లో ఉంటారని జోస్యం చెప్పారు. సిరి కోసం వచ్చిన శ్రీహాన్‌.. సన్నీ, షణ్ముఖ్‌, రవి, శ్రీరామ్‌, సిరిలు వరుసగా టాప్‌ 5లో ఉంటారన్నాడు.

చివరగా షణ్ముఖ్‌.. తన ప్రేయసి దీప్తి సునయన ఇచ్చిన టీషర్ట్‌ను భారంగా త్యాగం చేశాడు. అతడి కోసం మొదట అన్నయ్య సంపత్‌ రాగా తర్వాత దీప్తి సునయన స్పెషల్‌ ఎంట్రీ ఇవ్వడంతో షణ్ను ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్‌ అయిపోవద్దని దీప్తి సూచించింది. నాకు నువ్వేంటో తెలుసంటూ అతడికి ముద్దులు పంపించింది. షణ్ముఖ్‌, శ్రీరామ్‌, సన్నీ, రవి, మానస్‌లు వరుసగా టాప్‌ 5లో ఉంటారని వీళ్లు అభిప్రాయపడ్డారు. ఫినాలేలో కలుద్దామంటూ వీడ్కోలు తీసుకుంది. ఈరోజు వచ్చిన మెజారిటీ ఫ్యామిలీ మెంబర్స్‌ సన్నీని టాప్‌ 5లోని మొదటి రెండు స్థానాల్లో పెడుతూ అతడే విన్నర్‌ అని చెప్పకనే చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top