యాక్సిడెంట్‌తో అనాథగా.. రెండుసార్లు బ్రేకప్‌.. కీర్తి నేపథ్యం | Who is Keerthi Bhat, Break up with Vijay Karthik, Participated in Telugu Bigg Boss 6 | Sakshi
Sakshi News home page

అందర్నీ కోల్పోయిన అనాథ.. జీవితంలో పిల్లలు పుట్టరని తెలిసి..

Jan 30 2026 9:02 PM | Updated on Jan 30 2026 9:11 PM

Who is Keerthi Bhat, Break up with Vijay Karthik, Participated in Telugu Bigg Boss 6

హాయిగా ఆడుతూ పాడుతూ జీవితాన్ని ఎంజాయ్‌ చేయాల్సిన సమయంలో కష్టాలు, కన్నీళ్లతో సావాసం చేసింది. నటిగా జర్నీ మొదలుపెట్టినప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించే చేయి లేకున్నా స్వయంకృషితో ఎదిగింది. కాళ్లలోని ఐరన్‌ రాడ్స్‌ తన ముందడుగును ఆపలేకపోయాయి. నా అనేవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా కెమెరా ముందు మాత్రం బలవంతంగా నవ్వు పులుముకునేది. తనే కీర్తి భట్‌. ప్రియుడితో పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న కారణంగా వార్తల్లో ఉన్న కీర్తి గురించే ప్రత్యేక కథనం.

యాక్సిడెంట్‌తో జీవితం తలకిందులు
కీర్తి భట్‌ కన్నడ అమ్మాయి. 2017లో జరిగిన ఓ యాక్సిడెంట్‌లో కుటుంబాన్ని కోల్పోయింది. తల్లిదండ్రులు, అన్నవదిన అందరూ దూరమయ్యారు. తీవ్ర గాయాలపాలైన కీర్తి కొన ప్రాణంతో బయటపడింది. కొంతకాలం కోమాలో ఉండి కోలుకుంది. అయితే యాక్సిడెంట్‌ వల్ల తను తల్లయే అదృష్టాన్ని కోల్పోయింది. ఎవరూ లేని అనాథగా బతుకు వెల్లదీస్తూనే తన కెరీర్‌ను తనే నిర్మించుకుంది. 

ఫస్ట్‌ లవ్‌
అలాంటి సమయంలో ఓ వ్యక్తి తనను ప్రేమ పేరుతో వెంబడించాడు. అతడి ప్రేమ నిజమేననుకుంది, కరిగిపోయింది. ఇకపై తాను అనాథ కాదనుకుని పొంగిపోయింది. అతడి కుటుంబాన్ని తన కుటుంబంగా భావించింది. కానీ అదంతా కపట ప్రేమ అని కొంతకాలానికే అర్థమైపోయింది. తన డబ్బును వాడుకుంటున్నారని ఆల్యంగా తెలుసుకుంది. తాను నటించే సీరియల్‌ హీరోతో షోకి వెళ్లినా ప్రియుడు, అతడి తల్లి అనుమానించేవారు. ఆఖరికి కీర్తి దత్తత తీసుకున్న పాప కూడా కన్నకూతురేనేమో అని డీఎన్‌ఏ టెస్టుకూ సిద్ధపడ్డారు.

బిగ్‌బాస్‌ షో
ఇక భరించలేకపోయింది. అతడి ప్రేమకు దండం పెట్టేసి ఆ రిలేషన్‌ నుంచి బయటకు వచ్చింది. ఇంతలో తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ నుంచి ఆఫర్‌ వచ్చింది. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు దత్తత తీసుకున్న పాప కూడా చనిపోయేసరికి ఆమె గుండె ముక్కలయింది. ఆ బాధను దిగమింగుకుని బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది. ఆరో సీజన్‌లో ఫస్ట్‌ లేడీ కెప్టెన్‌గా నిలిచింది. ఫినాలేలో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. 

ఎంగేజ్‌మెంట్‌
బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక హీరో, దర్శకుడు విజయ్‌ కార్తీక్‌ రూపంలో తనకు తోడు దొరికింది. తను ఎప్పటికీ తల్లి కాలేదని తెలిసినా.. కీర్తియే తనకు చిన్నపాప అంటూ అతడి కుటుంబం అంతా ప్రేమగా చూసుకుంది. ఈ సంతోషం జీవితాంతం ఇలాగే ఉండాలనుకుంది. 2023లో కీర్తి- విజయ్‌ నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో బ్రేకప్‌ చెప్పుకున్నారు. పరస్పర అంగీకారంతో విడిపోయామని కీర్తి అంటుంటే.. నా దగ్గర డబ్బుల్లేవని మరొకర్ని చూసుకుంటుందని విజయ్‌ కార్తీక్‌ ఆరోపించాడు.

బ్రేకప్‌
అతడి ఆరోపణలకు తోడు సోషల్‌ మీడియాలో తనపై వదంతులు సృష్టిస్తుండటంతో కీర్తి మనస్తాపానికి గురైంది. తనకేదైనా జరిగితే అసత్య ప్రచారం చేస్తున్నవారే బాధ్యులు అని మండిపడింది. ఏదేమైనా ఈ బాధలో నుంచి కీర్తి బయటకు వచ్చి మళ్లీ మామూలు జీవితం గడపాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా కీర్తి.. మనసిచ్చి చూడు, మధురానగరిలో, కార్తీక దీపం వంటి సీరియల్స్‌లో యాక్ట్‌ చేసింది.

 

 

 

చదవండి: అదే నన్ను కుంగదీస్తోంది.. నాకేదైనా జరిగితే..: కీర్తి భట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement