breaking news
Vijay Karthik
-
నేను కాదు, ఆమే నన్ను వదిలేసింది: విజయ్ కార్తిక్ ఎమోషనల్ వీడియో
బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్, హీరో విజయ్ కార్తిక్ విడిపోయిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. రెండేళ్ల క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకుంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అంతా భావిస్తే.. విడిపోయిన విషయాన్ని చెప్పి షాకిచ్చింది కీర్తి. ‘విజయ్‌ని నేను భర్తగా చూడలేకపోతున్నా. మా బంధాన్ని స్నేహం వరకు పరిమితం చేయాలని భావిస్తున్నా’ అంటూ బ్రేకప్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. దీంతో పలువురు నెటిజన్లు విజయ్ కార్తీక్‌ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. ఎంతో కష్టాలను అనుభవించి.. ఈ స్థాయికి వచ్చిన కీర్తిని వదిలేయడం కరెక్ట్ కాదంటూ విజయ్‌ని ట్రోల్ చేశారు. దీంతో తాజాగా ఈ విషయంపై విజయ్ స్పందిస్తూ.. షాకింగ్ విషయాలను వెల్లడించారు. తాను కీర్తిని వదిలేయలేదని.. ఆమే తనను వదిలేసిందని చెప్పాడు. ఆర్థికంగా స్థిరపడలేదనే కారణంతోనే ఆమె బ్రేకప్ చెప్పిందన్నాడు. ఈ మేరకు బ్రేకప్ ఇష్యూపై స్పందిస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ‘హాయ్ అండీ..ఈ వీడియో చేయాలని అస్సలు అనుకోలేదు. కానీ నిన్న ఈవినింగ్ కీర్తి గారు పోస్ట్ పెట్టిన తరువాత చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. ఫోన్ కూడా చేస్తున్నారు. దయచేసి మీరు కీర్తి గారిని వదిలేయకుండీ.. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోండి అని చాలామంది కంటిన్యూగా మెసేజ్‌లు పెడుతున్నారు. ఇద్దరి అంగీకారంతోనే విడిపోతున్నాం.. ఫ్రెండ్స్ ఉంటాం అని కీర్తి మెసేజ్ చేయడంతో..అంతా నాకు కాల్స్ చేస్తున్నారు. విడిపోవడం అనేది నా నిర్ణయం కాదు. నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను.నాతో పాటు నా ఫ్యామిలీ కూడా అదే కోరుకున్నారు. అలాంటప్పుడు నేనెందుకు ఆమెతో విడిపోవాలని కోరుకుంటాను(చదవండి: హీరోతో ఎంగేజ్మెంట్.. రిలేషన్‌షిప్‌కు బుల్లితెర నటి ఎండ్ కార్డ్..!)అది నా నిర్ణయం కాదు.. ఆమె సొంతంగా తీసుకున్న నిర్ణయం. నేను ఫైనాన్షియల్‌గా స్టేబుల్ కాలేదనే స్ట్రాంగ్ రీజన్ ఆమెకి అనిపించింది. అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. తను డిసెంబర్లోనే నాకు ఈ మాట చెప్పి ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అది ఆమె జీవితం కాబట్టి.. ఆమె నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు. ఆమెకి ఆ హక్కు ఉంది. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నేను చాలా వరకూ ఆమెను కన్విన్స్ చేశాను. కేవలం డబ్బులు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుని వెళ్లిపోవడం కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఆమె చాలా క్లియర్‌గా చెప్పింది. నేను కాంప్రమైజ్ అయ్యి బతకడం ఇష్టం లేదని చెప్పింది. తనకి ఆల్రెడీ బెటర్ ఆప్షన్ దొరికారు అని నాకు క్లియర్‌గా చెప్పింది. అందుకే నన్ను వదిలేసింది. అతనితోనే కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తానని ఆమె నాకు ఆల్రెడీ డిసెంబర్లోనే చెప్పారు. ఆమె నాకు ఆ మాట చెప్పినప్పుడు చాలా కన్విన్స్ చేయడానికి చూశాను. వదిలేయొద్దు మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాను. కానీ ఆమె నిర్ణయం తీసుకునే నాకు చెప్పింది. కాబట్టి నేనేం చేయలేకపోయాను. ఆమె చాలా స్ట్రాంగ్ నిర్ఱయం తీసుకుని వచ్చి నాతో డిస్కస్ చేశారు.ఆమె విడిపోవాలని అంత బలంగా చెప్పినప్పుడు బలవంతంగా ఆమెతో ఉండాలని అనుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ఫోర్స్‌ఫుల్‌గా ప్రేమను పొందలేం. నాతో పాటు నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కన్వెన్స్ చేయడానికి చూశాం. ఆమె వినే పరిస్థితిలో లేదు.. మా ప్రయత్నాలు ఫలించలేదు. జరిగింది జరిగిపోయింది.. కాబట్టి.. ఆమె, వాళ్లిద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది ఆమె ఫొటోలు డిలీట్ చేసింది కదా.. మీరెందుకు డిలీట్ చేయడం లేదు అని అడుగుతున్నారుకానీ ఒక పోస్ట్ పెట్టడం అనేది చాలా ఈజీ. కానీ ఆ పోస్ట్ పెట్టడం వెనుక చాలా ఎమోషన్ ఉంటుంది. నాకు ఆ పెయిన్ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు ఆ పోస్ట్‌లు, పొటోలు డిలీట్ చేస్తాను. నాకు సపోర్ట్‌గా ఉన్న వాళ్లందరికీ థాంక్స్. నేను కూడా ఇంత షార్ట్ టైమ్‌లో మా రిలేషన్ ఎండ్ అవుతుందని ఊహించలేదు. దేవుడు ఇలా రాసిపెట్టి ఉన్నప్పుడు ఏం చేయలేం.దయచేసి అందరు మమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. పీఆర్ టీమ్‌కు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే.. డబ్బులు ఇస్తున్నారు కదా అని పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకండి. కామెంట్ పెట్టే ముందుకు దయచేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీకు కూడా ఒక లైఫ్ ఉంటుంది. మీ జీవితంలోనూ అలా జరిగితే.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుతంది. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేయకండి. అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయలేదు. నాకు సపోర్ట్ చేసినవాళ్లందరికి ధ్యాంక్స్’ అని కార్తిక్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by THOTA KAARTHEEKK (@its_vijay_karthikeyan) -
పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. 'అబ్బాయి పేరెంట్స్ అయినా చెప్పాలిగా'
కష్టాలు నాకు చుట్టాలని కొందరు అంటూ ఉంటారు. కానీ కీర్తి భట్‌కు కష్టాలు చుట్టాలుగా కాదు ఏకంగా కుటుంబ సభ్యులమే అంటూ తన ఇంట్లో, జీవితంలో తిష్ట వేశాయి. ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉంటున్న సమయంలో విధి కీర్తి జీవితంతో ఆడుకుంది. యాక్సిడెంట్లో కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది. అమ్మానాన్న, అన్నయ్య.. ముగ్గురూ దూరమవడంతో ఎవరూ లేని అనాథగా మారింది.సినిమాల నుంచి సీరియల్స్దురదృష్టవంతురాలినని కుంగిపోయింది. కానీ ఇలా బాధపడుతూ కూర్చుంటే కరెక్ట్ కాదని తనకు తాను సర్ది చెప్పుకుంది. బాధను దిగమింగుకుంటూ జీవితాన్ని ఒంటరిగా ఎదుర్కోవాలనుకుంది. నచ్చిన ఫీల్డ్‌లో తన సత్తా చూపించాలనుకుంది. అలా కీర్తి భట్ (Keerthi Bhat) నటనవైపు అడుగులు వేసింది. కన్నడలో టీవీ సీరియల్స్ చేసింది. రెండు కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తర్వాత మనసిచ్చి చూడు సీరియల్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కార్తీకదీపం ధారావాహికలోనూ మెరిసింది.ఎప్పటికీ తల్లి కాలేవన్న వైద్యులుఈ సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. అయితే బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)కు వెళ్లేముందు కూడా మరోసారి కష్టాలు తనను పట్టికుదిపేశాయి. యాక్సిడెంట్ వల్ల కీర్తి ఎప్పటికీ తల్లి కాలేదని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆమె ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆ సంతోషం కూడా ఎంతోకాలం ఉండలేదు. బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన సమయంలోనే పాప మరణించింది.(చదవండి: 'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్!)2023లో ఎంగేజ్మెంట్ఇలా ఎన్నో కష్టాలు దాటి ఇక్కడిదాకా వచ్చింది కీర్తి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానంటూ 2023లో కీర్తి గుడ్‌న్యూస్ చెప్పింది. హీరో, దర్శకుడు విజయ్ కార్తీక్‌ను వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది. అదే ఏడాది విజయ్‌తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ మరుసటి ఏడాది నుంచి కాబోయే భర్తతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. నిశ్చితార్థం అయిపోయి రెండేళ్లవుతున్నా ఇంకా పెళ్లి డేట్ చెప్పట్లేదు. తాజాగా కీర్తి.. కాబోయే భర్తతో కలిసి తొలిసారి పూజలో పాల్గొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. భార్యాభర్తల్లా పూజ చేస్తున్నారేంటి?ఇది చూసిన ఓ నెటిజన్.. మిస్ కన్నడ కీర్తి గారు.. పెళ్లికి ముందు ఇలా కలిసి పూజ చేయడం తెలుగు సాంప్రదాయం కాదు. కార్తీక్.. కనీసం మీకు మీ తల్లిదండ్రులైనా చెప్పలేదా? అయినా ఈ జనరేషన్లో పేరెంట్స్ మాట ఎవరూ వినరు. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలోనివాళ్లు అసలే వినరు అని పెదవి విరిచాడు. దీనికి కీర్తి స్పందిస్తూ.. పెళ్లికి ముందే మేము ఇలా పూజ చేస్తే ఏమవుతుందో కాస్త చెప్పగలరా? ఒకరిని నిందించేముందు సరైన కారణాలు చెప్పండి అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.ఎవరీ కార్తీక్?కీర్తికి కాబోయే భర్త కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లిలో పుట్టి పెరిగిన విజయ కార్తీక్ మొదట సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశాడు. తర్వాత సినిమా మీదున్న ప్రేమతో ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలో చేరాడు. కన్నడ భాషలో నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్, చెడ్డీ గ్యాంగ్ సినిమాలు చేశాడు.చదవండి: 'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్! -
Keerthi Bhat: పెళ్లికి ముందే భర్తతో కలిసుంటున్న బిగ్‌బాస్ 'కీర్తి'.. తన ఇల్లు చూశారా? (ఫోటోలు)
-
హీరోతో కీర్తి నిశ్చితార్థం, ఫోటోలు వైరల్
బుల్లితెర నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ కీర్తి భట్ త్వరలో కొత్త జీవితం ఆరంభించనుంది. దర్శకుడు, హీరో విజయ్ కార్తీక్ తోటను పెళ్లాడనుంది. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆదివారం జరిగిన వీరి ఎంగేజ్మెంట్ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలతో పాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సైతం హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో కీర్తి, విజయ్ ఇద్దరూ ఆకుపచ్చని దుస్తుల్లో మెరిసిపోయారు. కాబోయే భార్య కాలికి పట్టీ తొడిగిన విజయ్ అనంతరం ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. అటు కీర్తి కూడా అతడి వేలికి ఉంగరం తొడిగి తనను ముద్దాడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా వీరిద్దరూ ఇటీవలే ఓ షోలోనూ పాల్గొని స్టేజీపై పూలదండలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా తనకు పిల్లలు పుట్టరని తెలిసినా ప్రేమించి, పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడంటూ భావోద్వేగానికి లోనైంది కీర్తి. విజయ్ మాత్రమే కాదు, ఆయన కుటుంబం కూడా ఈ విషయం తెలిసి తనను కోడలిగా అంగీకరించినందుకు సంతోషం వ్యక్తం చేసింది. మొత్తానికి త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న ఈ జంటకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నారు అభిమానులు. బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొన్న కీర్తి ఈ సీజన్లో టాప్ 3 కంటెస్టెంట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె సీరియల్స్ చేస్తోంది. విజయ్ కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లిలో పుట్టి పెరిగిన ఇతడు మొదట సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశాడు. అయితే సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీలో చేరాడు. కన్నడ భాషలో నాలుగు చిత్రాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్, చెడ్డీ గ్యాంగ్ సినిమాలు చేశాడు. చదవండి: ‘భోళా శంకర్’కు రూ.50 కోట్ల నష్టం.. అప్పుడే ఓటీటీలోకి..! -
నిశ్చితార్థం ఫిక్స్.. కాబోయే భర్తతో కలిసి కార్డులు పంచుతున్న కీర్తి
బిగ్‌బాస్ బ్యూటీ, నటి కీర్తి భట్.. హీరో విజయ కార్తీక్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే! వీరిద్దరి ప్రేమకు కార్తీక్ కుటుంబం కూడా పచ్చజెండా ఊపింది. తమ వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేదని తెలిసినా కీర్తిని కోడలిగా తెచ్చుకునేందుకు సిద్ధమైంది. కీర్తియే తమకు చిన్నపిల్ల అని, కావాలంటే వేరే పిల్లల్ని దత్తత తీసుకుంటామని పెద్ద మనసుతో వీరి ప్రేమను అర్థం చేసుకున్నారు కార్తీక్ తల్లిదండ్రులు. ఇటీవలే ఓ షోలో కీర్తి, కార్తీక్ దండలు కూడా మార్చుకున్నారు. తాజాగా వీరి పెళ్లి పనులు షురూ అయ్యాయి. కీర్తి-కార్తీక్‌ల నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఎంగేజ్మెంట్ వేడుకకు రావాల్సిందిగా తమ బంధుమిత్రులకు ఆహ్వానపత్రికలు పంచుతున్నారు. ఈ క్రమంలో జానకి కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జైన్, నటుడు అమర్ దీప్ దగ్గరకు వెళ్లి కార్డులు ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రియాంక తన యూట్యూబ్ ఛానల్లో తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో జానకి కలగనలేదు సీరియల్ సెట్లోకి వెళ్లిన కీర్తి, కార్తీక్ అక్కడున్న అందరికీ ఆహ్వానపత్రికలు పంచారు. ఆగస్టు 20న బేగంపేట్‌లో నిశ్చితార్థం జరగనున్నట్లు వెల్లడించారు. ఆ కార్డు చూశాక ప్రియాంక జైన్.. నిజంగానే మీకు పెళ్లి చేసుకోవాలని ఉందా? అని తిక్క ప్రశ్న వేసింది. పెళ్లి మాట ఎత్తితేనే తనకు భయమేస్తుందని చెప్పుకొచ్చింది. అయితే మీరు మంచి జీవితం కొనసాగించాలని కోరుకుంటున్నాను అని పేర్కొంది. మొత్తానికి కీర్తి ఎంగేజ్మెంట్ డేట్‌ను ఈ వీడియోతో లీక్ చేసింది జానకి. త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్న జంటకు అభిమానులు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: కోట్ల ఆస్తి.. 30 ఏళ్లకే అనాథలా తనువు చాలించిన హీరోయిన్ ఆనందం హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? -
హీరో విజయ్ కార్తీక్‌ను పెళ్లాడబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి భట్ (ఫోటోలు)
-
విజయం కోసం జపం!.
నిర్మాతగా ఎమ్మెస్ రాజుది ఓ చరిత్ర. సుమంత్ ఆర్ట్స్‌పై శత్రువు, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు తీశారాయన. అయితే దర్శకునిగా మాత్రం ఎమ్మెస్ రాజు విజయాన్ని అందుకోలేకపోయారు!. ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఆయన ‘జపం’ చేస్తున్నారు. ‘జపం’ అంటే ఇంకేదో అనుకునేరు. ఆయన దర్శకునిగా సెలైంట్‌గా ఓ సినిమా మొదలైంది. ఆ సినిమా టైటిల్ ‘జపం’. విజయ్ కార్తీక్ అనే కొత్తబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ‘ఇష్క్’ చిత్రానికి పనిచేసిన సామల రమేష్ దీనికి స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంతో చిత్రీకరణ జరుగుతోంది. మే నెలలో ఈ సినిమాను విడుదల చేసే ఉద్దేశంలో ఉన్నారు ఎమ్మెస్ రాజు.


