Bigg Boss Telugu Fame Keerthi Bhat And Kartheek Thota Engagement Date Confirmed - Sakshi
Sakshi News home page

Keerthi Bhat Engagement: సీరియల్‌ ఫ్రెండ్స్‌ను నిశ్చితార్థానికి ఆహ్వానిస్తున్న కీర్తి, నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా? అంటూ నటి తిక్క ప్రశ్న

Jul 28 2023 1:16 PM | Updated on Jul 28 2023 1:45 PM

Keerthi Bhat, Kartheek Thota Engagement Date Confirmed - Sakshi

బేగంపేట్‌లో నిశ్చితార్థం జరగనున్నట్లు తెలిపారు. ఆ కార్డు చూశాక ప్రియాంక జైన్‌.. నిజంగానే మీకు పెళ్లి చేసుకోవాలని ఉందా? అని తిక్క ప్రశ్న వేసింది. పెళ్లి మాట

బిగ్‌బాస్‌ బ్యూటీ, నటి కీర్తి భట్‌.. హీరో విజయ కార్తీక్‌ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే! వీరిద్దరి ప్రేమకు కార్తీక్‌ కుటుంబం కూడా పచ్చజెండా ఊపింది. తమ వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేదని తెలిసినా కీర్తిని కోడలిగా తెచ్చుకునేందుకు సిద్ధమైంది. కీర్తియే తమకు చిన్నపిల్ల అని, కావాలంటే వేరే పిల్లల్ని దత్తత తీసుకుంటామని పెద్ద మనసుతో వీరి ప్రేమను అర్థం చేసుకున్నారు కార్తీక్‌ తల్లిదండ్రులు. ఇటీవలే ఓ షోలో కీర్తి, కార్తీక్‌ దండలు కూడా మార్చుకున్నారు.

తాజాగా వీరి పెళ్లి పనులు షురూ అయ్యాయి. కీర్తి-కార్తీక్‌ల నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు రావాల్సిందిగా తమ బంధుమిత్రులకు ఆహ్వానపత్రికలు పంచుతున్నారు. ఈ క్రమంలో జానకి కలగనలేదు సీరియల్‌ నటి ప్రియాంక జైన్‌, నటుడు అమర్‌ దీప్‌ దగ్గరకు వెళ్లి కార్డులు ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రియాంక తన యూట్యూబ్‌ ఛానల్‌లో తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది.

ఇందులో జానకి కలగనలేదు సీరియల్‌ సెట్‌లోకి వెళ్లిన కీర్తి, కార్తీక్‌ అక్కడున్న అందరికీ ఆహ్వానపత్రికలు పంచారు. ఆగస్టు 20న బేగంపేట్‌లో నిశ్చితార్థం జరగనున్నట్లు వెల్లడించారు. ఆ కార్డు చూశాక ప్రియాంక జైన్‌.. నిజంగానే మీకు పెళ్లి చేసుకోవాలని ఉందా? అని తిక్క ప్రశ్న వేసింది. పెళ్లి మాట ఎత్తితేనే తనకు భయమేస్తుందని చెప్పుకొచ్చింది. అయితే మీరు మంచి జీవితం కొనసాగించాలని కోరుకుంటున్నాను అని పేర్కొంది. మొత్తానికి కీర్తి ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ను ఈ వీడియోతో లీక్‌ చేసింది జానకి. త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్న జంటకు అభిమానులు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

చదవండి: కోట్ల ఆస్తి.. 30 ఏళ్లకే అనాథలా తనువు చాలించిన హీరోయిన్‌
ఆనందం హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement