రావణుడి పాత్ర.. యశ్‌ కాస్ట్యూమ్స్‌ బరువు ఎంతంటే? | Yash Costumes Weight In Ramayana movie | Sakshi
Sakshi News home page

రావణుడి పాత్ర.. యశ్‌ కాస్ట్యూమ్స్‌ బరువు ఎంతంటే?

Nov 10 2026 8:04 PM | Updated on Nov 10 2026 8:12 PM

Yash Costumes Weight In Ramayana movie

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ’. మంచి స్పందన అందుకుని బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబెడుతోంది. అయితే ఇప్పుడు అందరి కన్ను రావణుడి పాత్రలో యశ్‌ కాస్ట్యూమ్స్‌పై పడింది. అవి ఎంత బరువు ఉంటుందని చర్చ మొదలైంది. ఇదే విషయమై తాజాగా డిజైనర్‌ సానియా సర్ధారియా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ పాత్ర కోసం యశ్‌ ధరించిన దుస్తులు, ఆభరణాల బరువు కోసం ఆమె వెల్లడించారు.

‘ఈ సినిమాలో యశ్‌ ధరించిన దుస్తులు, ఆభరణాల బరువు 16 నుంచి 20 కిలోల వరకు ఉంటుంది. లంకకు సంబంధించిన రావణుడి లుక్‌, వివాహ వేడుకల కోసం రూపొందించిన కొన్ని ప్రత్యేక దుస్తుల బరువు మాత్రం 30-33 కిలోల వరకు ఉండేవి. ఆయన ధరించిన కిరీటం ఒక్కటే 1.8 కిలోల బరువు ఉంటుంది’ అని ఆమె తెలిపారు.

(ఇదీ చదవండి: ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా ఉండడం వేస్ట్‌: తరుణ్‌ భాస్కర్‌)

సినిమా విషయానికి వస్తే..
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటించిన మూవీ 'రామాయణ. ఈనెల 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. ఇప్పటికే ‘రామాయణం’కి ఇండియా వ్యాప్తంగా రూ. 346.35 కోట్ల నెట్ వసూళ్లు రాగా.. రూ. 413.90 గ్రాస్ కలెక్ట్ చేసింది. విదేశాల్లో ఐదో రోజు రామాయణ వసూళ్లతో అదరగొట్టింది. ఓవర్‌సీస్‌లో ఐదో రోజు రూ. 25 కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా రూ. 664 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ కలెక్షన్స్‌తో 2026లో ‍అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ మూవీ కంటే ముందు దురంధర్-2(రూ.1852 కోట్లు), జైలర్-2(రూ.821 కోట్లు) ఉన్నాయి. కాగా.. ఈ చిత్రంలో యశ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, లారా దత్తా కీలక పాత్రల్లో నటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement