నాగార్జునకి ఉన్న దమ్ము ఇండస్ట్రీలో ఎవరికీ లేదు: రామ్‌ చరణ్‌ | Ram Charan Praises Nagarjuna For Encouraging New Talent At Itlu Arjuna Movie Musical Event, Deets Inside | Sakshi
Sakshi News home page

Ram charan About Nagarjuna: ‘నాగార్జున సపోర్ట్‌ చేస్తే తప్పు జరగదు’

Nov 10 2026 3:45 PM | Updated on Nov 10 2026 3:56 PM

Ram charan About Nagarjuna Itlu Arjuna Movie Event

అక్కినేని నాగార్జున సమర్పణలో వెంకీ కుడుముల నిర్మిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్‌  ఉప్పల దర్శకత్వం వహించారు.  'శిరిడి సాయి' నిర్మాత మహేష్ రెడ్డి తనయుడు అనీష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అనశ్వర రాజన్ హీరోయిన్‌. ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలో రిలీజ్ కానుంది.

 సోమవారం మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. దీనికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భగా రామ్‌ చరణ్‌ చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. 

‘నాగార్జున గారికి థ్యాంక్స్‌ చెప్పాలి’
‘అనీష్ హీరోగా లాంచ్‌ కావడం ఆనందంగా ఉంది. అనీష్‌కు సపోర్ట్ చేసిన వాళ్ల పేరెంట్స్‌కి థాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా నాగార్జున గారికి థ్యాంక్స్‌ చెప్పాలి. నాగార్జున గారి లాంటి సపోర్ట్ ఉంటే తప్పు జరగడానికి అవకాశం లేదు. ఆయనలా కొత్త టాలెంట్‌ను పరిచయం చేసే దమ్ము ఇండస్ట్రీలో ఎవరికీ లేవు’ అని అన్నారు. దీంతో పాటు ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్న వెంకీకి, డైరెక్టర్ మహేష్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

(ఇదీ చదవండి: ఈ సినిమాకి అందుకే నా వాయిస్‌ ఇచ్చా: నాగార్జున)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement