ఓటీటీకి తెలుగు థ్రిల్లర్ సినిమా.. ప్రకటన | Kiku Chiranjeevi OTT Release Date | Sakshi
Sakshi News home page

OTT Movie: రెండున్నర నెలలకు ఓటీటీలో స్ట్రీమింగ్

Nov 10 2026 2:32 PM | Updated on Nov 10 2026 2:41 PM

Kiku Chiranjeevi OTT Release Date

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే జైలర్ 2, రణబాలి, దాయిరా, హ్యాపీ జర్నీ, పుష్పక విమానం, పరివారిక్ మనురంజన్ లాంటి మూవీస్, సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడీ లిస్టులోకి మరో తెలుగు సర్వైవల్ మెడికల్ థ్రిల్లర్ చిత్రం వచ్చి చేరింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)

కికు యనమల అనే కొత్త కుర్రాడు ప్రధాన పాత్ర చేసిన తెలుగు సినిమా 'కికు చిరంజీవి'.కాశీష్ ఖాన్ హీరోయిన్. కుడివైపు గుండె ఉండటం అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఈ ఏడాది ఆగస్టు 28న థియేటర్లలో రిలీజైతే ఎందుకనో జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడు రెండున్నర నెలల తర్వాత అంటే ఈ శనివారం(నవంబర్ 14) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.

'కికు చిరంజీవి' విషయానికొస్తే.. అరకులో ఫోటోగ్రాఫర్‌గా పనిచేసే చిరంజీవి (కికు యనమల)కి ఒక అరుదైన వైద్య సమస్య. అతడి గుండె ఎడమ వైపు కాకుండా కుడి వైపు ఉంటుంది. దీన్ని డెక్స్‌ట్రోకార్డియా అంటారు. దీని వల్ల కాస్త కష్టపడినా శ్వాస ఇబ్బందులు వస్తుంటాయి. అరకు టూర్‌కు వచ్చిన మను (కాశీష్ ఖాన్) అనే అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడుతుంది. మనుని ముఖానికి మాస్క్ ధరించిన వ్యక్తి టార్గెట్ చేస్తాడు. దీంతో వీళ్లిద్దరూ ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకుంటారు. తర్వాత ఏం జరిగింది? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ-ఎమోషనల్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement