ఓటీటీలోకి 'రణబాలి'.. ప్రకటన వచ్చేసింది | Vijay Deverakonda And Rashmika Ranabaali Movie OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Ranabaali OTT: అనుకున్నట్లే ఆ తేదీకే ఓటీటీలో స్ట్రీమింగ్

Nov 9 2026 11:45 AM | Updated on Nov 9 2026 12:01 PM

Ranabaali OTT Release Date Latest Update

పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన సినిమా 'రణబాలి'. గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. వారం క్రితమే స్ట్రీమింగ్ తేదీ లీక్ అవగా ఇప్పడు అదే నిజమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

(ఇదీ చదవండి: అమితాబ్.. ఈసారి భయపడలేదు)

విజయ్, రష్మిక జంటగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించిన సినిమా 'రణబాలి'. 1870ల్లో రాయలసీమలో జరిగిన కథతో దీన్ని తెరకెక్కించారు. టాక్ బాగానే వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా పర్లేదనిపించుకుంది. ఇప్పుడు ఈ శుక్రవారం(నవంబర్ 13) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.

'రణబాలి' విషయానికొస్తే.. 1870 కాలం అది. మ‌ద్రాస్ ప్రెసిడెన్సీలో తీవ్ర‌మైన క‌రవు. తిన‌డానికి మెతుకు దొర‌క‌దు. మ‌రోవైపు ఆంగ్లేయుల అరాచ‌కాలు. ప‌న్ను క‌ట్టాలని పండించిన ధాన్యాన్ని పోర్టుల నుంచి త‌ర‌లిస్తుంటారు. ఆ ప్రాంతానికి కమిషనర్‌గా ఉన్న సర్ థియోడర్ హెక్టర్ (ఆర్నాల్డ్ ఓస్లూ) ఐదు ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యాన్ని త‌ర‌లించి మ‌రో పెద్ద ప‌ద‌విని సొంతం చేసుకోవాల‌నుకుంటాడు. ఆ క్ర‌మంలోనే ల‌క్ష‌ల మంది ఆక‌లితో చ‌నిపోతున్నా అస‌లేమాత్రం లెక్క‌చేయ‌డు.

ఇదంతా శింగ‌న‌మ‌లని కాపు కాస్తున్న పాలెగాడు బొబ్బిలి ర‌ణ‌బాలి (విజ‌య్ దేవ‌ర‌కొండ‌)కి తెలుస్తుంది. అప్పుడు అతడు ఏం చేశాడు? క‌రవు రాక్ష‌సుడిగా పేరు ప‌డిన హెక్ట‌ర్‌ని ఎదిరించే క్ర‌మంలో ర‌ణబాలికి ఎదురైన ప‌రిణామాలేంటి?ఈ పోరాటంలో జ‌య‌మ్మ (ర‌ష్మిక) పాత్ర ఏంటి?శింగ‌న‌మ‌ల‌లో వంద‌ల యేళ్ల కింద‌ట జీవ‌స‌మాధి అయిన భద్ర‌మ‌ల్ల‌న్న తాత‌కు, ర‌ణ‌బాలికీ సంబంధం ఏమిటనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement