అందరికీ హ్యాపీ దివాళీ.. జపాన్‌లో విరోష్ జంట సంబరాలు | Tollywood Hero Vijay Devarakonda celebrates Diwali In Japan | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: అందరికీ హ్యాపీ దివాళీ.. జపాన్‌లో విరోష్ జంట సంబరాలు

Nov 9 2026 12:15 AM | Updated on Nov 9 2026 12:15 AM

Tollywood Hero Vijay Devarakonda celebrates Diwali In Japan

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. తన కుటుంబంతో కలిసి జపాన్ వెళ్లిన విజయ్- రష్మిక దంపతులు దివాళీ పండుగను జరుపుకున్నారు. మీ అందరికీ దేవరకొండ ఫ్యామిలీ తరఫున దీపావళి శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా జపాన్‌లో ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు షేర్ చేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే విజయ్- రష్మిక ఇటీవలే రణబాలి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో ఈ మూవీని రూపొందించారు. బ్రిటీశ్ పరిపాలనలో తలెత్తిన కరువు కారణంగా దాదాపు కోటిమంది చనిపోయారని డైరెక్టర్ రాహుల్ వెల్లడించారు. అందుకే ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలిపారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement