90 ఏళ్ల బామ వేడుకోలు.. ఏడాది చిన్నారికి సోనూసూద్‌ భారీ సాయం | Actor Sonu Sood Saves Another Child During this Diwali | Sakshi
Sakshi News home page

దివాళి వేళ.. చిన్నారి జీవితంలో వెలుగులు నింపిన సోనూసూద్‌

Nov 8 2026 6:35 PM | Updated on Nov 8 2026 6:43 PM

Actor Sonu Sood Saves Another Child During this Diwali

ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఏడాది వయసున్న చిన్నారికి వైద్య సహాయం అందించి ప్రాణాలు కాపాడేందుకు ముందుకొచ్చారు. పేదరికంతో వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి అండగా నిలిచారు. చిన్నారి గుండె శస్త్రచికిత్స విజయవంతం కావడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది.

ప్రాణాలు కాపాడాలంటూ
ముంబైకి చెందిన చిన్నారి రాధిక తీవ్ర గుండె సమస్యతో బాధపడుతోంది. పాపకు చికిత్స చేయించేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత లేక కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో 90 ఏళ్ల బామ్మ తన మనవరాలి ప్రాణాలు కాపాడాలంటూ నటుడు సోనూసూద్‌ను ఆశ్రయించారు.

దీంతో వెంటనే స్పందించిన ఆయన చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు చొరవ తీసుకున్నారు. ముంబై/థాణేలోని జూపిటర్‌ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి పాపకు శస్త్రచికిత్స చేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. డాక్టర్‌ అశుతోష్‌ నేతృత్వంలోని వైద్య బృందం చిన్నారి రాధికకు క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. దీంతో చిన్నారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

‘చిన్నారి రాధికకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్స పూర్తయ్యింది. ఈ దీపావళికి నాకు దేవుడు ఇచ్చిన అత్యంత అందమైన బహుమతి ఓ చిన్నారి ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో భాగస్వామి కావడమే. బామ్మ ముఖంలో చిరునవ్వు చూడడం చాలా ఆనందాన్నిస్తోంది. జూపిటర్‌ ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ దీపావళికి నా దృష్టిలో అత్యంత ప్రకాశవంతమైన దీపం చిన్నారి రాధిక జీవితంలో వెలిగిన ఆశే’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

(ఇదీ చదవండి: కొడుకు ఫొటో రివీల్‌ చేసిన కత్రినా కైఫ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement