రజనీకాంత్ కథానాయకుడిగా అశ్వత్ మారిముత్తు రూపొందిస్తున్న కొత్త సినిమా ‘ధర్మన్’. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో రామ్ పోతినేని ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం వీడియోను పంచుకుంది.
‘రా.. యాటిట్యూడ్.. పవర్.. ఓవర్‌లోడెడ్.. అందరికీ స్వాగతం’ అని చిత్ర బృంద పేర్కొంది. ఈ సినిమాలో రజనీ డాక్టర్‌గా కనిపించనున్నారు. తన కూతురిగా రాశి నటిస్తున్నారు. అల్లుడి పాత్రలో రామ్ కనిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: దీపావళి రోజున.. స్టార్ హీరోల కొత్త అప్‌డేట్స్


