దీపావళి: మీ ప్లే లిస్ట్‌లో తప్పక ఉండాల్సిన పాటలు | Diwali Top Songs Hindi And Telugu | Sakshi
Sakshi News home page

Diwali Top Songs: దీపావళి స్పెషల్‌.. ఈ సాంగ్స్‌ విన్నారా..?

Nov 7 2026 6:27 PM | Updated on Nov 7 2026 6:57 PM

Diwali Top Songs Hindi And Telugu

రేపే దీపావళి. ఇప్పటికే పండగ వాతావరణం మొదలైంది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ఈ వేడుకలో మునిగితేలుతున్నారు. అయితే ఈ పండగ పూట ఏ పాటలు వేయాలని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.ఎందుకంటే అక్కడ వినిపించే పాటలు పండగ సందడిని మరింత పెంచుతాయి. మరి అటు ఉత్సాహాన్ని.. ఇటు భక్తి భావాన్ని నింపే టాప్‌ 10 పాటలు ఏమున్నాయో ఒక లుక్కేద్దాం రండి.

1.దీపావళి మనాయీ సుహానీ
దీపావళి పాటల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే చిత్రం ‘షిర్డీ కే సాయిబాబా’(1977). ఈ సినిమాలోని ‘దీపావళి మనాయీ సుహానీ’ పాటకి ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఆశా భోంస్లే ఆలపించిన ఈ పాట దీపావళి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దాదాపు 49 ఏళ్ల క్రితం వచ్చినప్పటికీ.. పండగ సమయంలో వినిపిస్తూనే ఉంటుంది.

2. బోలే చూడియాన్ 
కుటుంబ సభ్యులంతా కలిసి పండగ చేసుకునే సమయంలో వినిపించే పాటల్లో ‘కభీ ఖుషీ కభీ గమ్’(2001) చిత్రంలోని ‘బోలే చూడియాన్’ కూడా ఒకటి. కరిష్మా కపూర్, హృతిక్ రోషన్ సహా పలువురు నటీనటులపై ఈ పాటను చిత్రీకరించారు. అమిత్ కుమార్, సోను నిగమ్, అల్కా యాగ్నిక్, ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి తమ స్వరాలతో పాటకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు.

3.ఆయీ హై దివాలీ సునో జీ ఘర్‌వాలీ
దీపావళి పండగను గుర్తుచేసే పాటల్లో ‘ఆయీ హై దివాలీ సునో జీ ఘర్‌వాలీ’ కూడా ఒకటి. ఇది ‘ఆమ్దానీ అఠన్నీ ఖర్చా రూపయ్యా’(2001) చిత్రంలోనిది. ఉత్సాహభరితమైన సంగీతంతో సాగిపోయే ఈ పాట పండగ సమయంలో వినడానికి చక్కగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. హిమేష్ రేషమియా సంగీతం అందించారు.
4. హ్యాపీ దివాలీ
దీపావళి సందర్భంగా వినిపించే పాటల్లో ‘హోమ్ డెలివరీ’(2005). చిత్రంలోని ‘హ్యాపీ దివాలీ’ ప్రత్యేకంగా నిలుస్తుంది. పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ పాటను దీపావళి వేడుకల్లో చాలామంది వింటారు. దీపాలతో అలంకరించిన ఇళ్లలో ఈ పాటని ఎక్కువగా వింటుంటారు.

5. దీవాన్గీ దీవాన్గీ 
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన ‘ఓం శాంతి ఓం’(2007) చిత్రంలోని ‘దీవాన్గీ దీవాన్గీ’ పాటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పాటలో పలువురు సినీ ప్రముఖులు కనిపించడం మరో విశేషం. జావేద్ అఖ్తర్ రాసిన ఈ పాటను షాన్, ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, రాహుల్ సక్సేనా ఆలపించారు. పండగ వేడుకల్లో ఉత్సాహాన్ని పెంచే పాటగా ఇదీ ఉంది.

6. గల్ మిఠీ మిఠీ బోల్
‘ఆయేషా’(2010) సినిమాలోని ‘గల్ మిఠీ మిఠీ బోల్’ పాట విడుదలైన సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తోచి రైనా స్వరంతో వినిపించే ఈ పాటకు జావేద్ అఖ్తర్ సాహిత్యం అందించారు. దీపావళి వేడుకల్లో ఇతర పాటలతో పాటు దీనిని కూడా ఆస్వాదించవచ్చు.

7. నగాడా సంగ్ ఢోల్
పండగల్లో సందడి చేసే పాటల్లో ‘గోలియోన్ కి రాసలీలా రామ్-లీలా’ చిత్రంలోని ‘నగాడా సంగ్ ఢోల్’ ఒకటి. దీపికా పదుకొణెపై చిత్రీకరించిన ఈ పాట గర్బా వేడుకలకు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. ఉస్మాన్ మీర్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. సిద్ధార్థ్-గరిమా సాహిత్యం అందించారు. 
8. జల్తే దియే
దీపావళి సందర్భంగా వినడానికి చక్కగా ఉండే పాటల్లో ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’(2015) చిత్రంలోని ‘జల్తే దియే’ కూడా ఒకటి. సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్‌పై ఈ పాటను చిత్రీకరించారు. దీపాల వెలుగులు, పండగ సందడి మధ్య ఈ పాట వినడం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.

9.ఆదిపురుష్ లోని..
‘ఆదిపురుష్’ చిత్రంలోని ‘రామ్ సియా రామ్ సియా రామ్ జై జై రామ్’ పాట కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్, కృతి సనన్‌పై చిత్రీకరించిన ఈ పాట విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మనోజ్ ముంతషీర్ సాహిత్యం అందించారు. శ్రీరాముడి నామస్మరణతో సాగిపోయే ఈ పాట ప్రతి పండగకి వింటుంటారు.

10. రామ్ ఆయేంగే
దీపావళి సందర్భంగా శ్రీరాముడి భక్తి పాటలు వినాలనుకునే వారికి ‘రామ్ ఆయేంగే’ మంచి ఎంపిక. 2024లో ప్రాచుర్యం పొందిన ఈ భజనను స్వస్తి మెహుల్ రచించి ఆలపించారు. అయోధ్యకు శ్రీరాముడు తిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసే ఈ పాట భక్తుల్లో ప్రత్యేకమైన భావాన్ని కలిగిస్తుంది. దీపావళి వేళ ఇంట్లో దీపాలు వెలిగిస్తూ ఈ భజనను వినడం ద్వారా పండగ వాతావరణాన్ని మరింత భక్తిమయంగా మార్చుకోవచ్చు.

తెలుగులోనూ..
 శ్రీరామదాసు సినిమాలోని పాటలు, జై శ్రీరామ్ – హనుమాన్, అదిగో అల్లదిగో శ్రీహరి వాసము – అన్నమయ్య వంటి పాటలు కూడా మంచి వైబ్‌ని అందిస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement